Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

దేవుని సేవించుట అనునది గొప్ప సంగతి
దేవుని సేవించుట అనునది గొప్ప సంగతి
దేవుని సేవించుట అనునది గొప్ప సంగతి
Ebook176 pages2 hours

దేవుని సేవించుట అనునది గొప్ప సంగతి

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Dag Heward-Mills ఉత్తమ అమ్మకమైన “నమ్మకత్వము మరియు అపనమ్మకత్వము” అనే దానితో కలిపి అనేక పుస్తకముల రచయిత. The Lighthouse Chapel International అని పిలువబడి రెండు వేలకు పైగా సంఘములు కలిగిన ఒక సంస్థ స్థాపకుడు.

LanguageTelugu
Release dateMay 24, 2018
ISBN9781641348416
దేవుని సేవించుట అనునది గొప్ప సంగతి
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to దేవుని సేవించుట అనునది గొప్ప సంగతి

Related ebooks

Reviews for దేవుని సేవించుట అనునది గొప్ప సంగతి

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    దేవుని సేవించుట అనునది గొప్ప సంగతి - Dag Heward-Mills

    ఎవరు దేవుని సేవకుడు?

    దేవుని సేవకునిగా ఉండుటకు నీవు కేవలము ఒక కాపరిగానో లేక సువార్తికునిగానో ఉండవలసిన అవసరము లేదు. యాజకులు, ప్రవక్తలు, సువార్తీకులు మరియు కాపరులు వీరంతా ప్రభువు దాసులు అని మనకు తెలుసు. అత్యున్నతమైన దేవుని సేవకులుగా పిలువబడుటకు ఇట్టివారు భాగ్యవంతులు అని మనకు తెలుసు. తమను సృష్టించినవాని సేవించుటకు ఎంతటి ఆశీర్వాదమును వారు పొందుకున్నారు. అయినప్పటికీ, యేసుక్రీస్తు సువార్త పనిచేయని ఇతర ప్రజలు కూడా దేవునికి సేవకులు కాగలరు.

    నిజానికి, కాపరులు కాక దేవునికి సేవకులుగా ఉండిన వారిని గూర్చిన అనేక కథనములో పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. దేవుడు వారిని తన సేవకులుగా పిలిచాడు కాబట్టి వారు అత్తివారే. వీరిలో కొందరు రాజులు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, లక్షాధికారులు, రైతులు మరియు యూదులు కానివారు కూడా ఉన్నారు.

    యాజకులు మరియు సువార్తీకులు కాక ఇతర ప్రజలు కూడా దేవుని సేవకులుగా పిలువబడ్డారు అనే సత్యము ప్రతి ఒక్కరికి చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. దీని అర్థము నీవు కూడా దేవుని సేవకుడవు కావచ్చు! ఒక బ్యాంకు ఉద్యోగి, ఒక వకీలు, ఒక వైద్యుడు, ఒక రాజకీయనాయకుడు, ఒక ఔషధ వ్యాపారి మరియు సుంకపు పన్ను వసూలు చేసేవారు కూడా దేవుని సేవకులు కావచ్చు.

    దేవుని సేవకునిగా ఉండాలంటే నీవు సంపూర్ణ సేవలోనే ఉండవలసిన అవసరత లేదు. ఏదైనా లౌకిక రంగములో పనిచేస్తూ కూడా దేవునికి సేవకునిగా ఉండవచ్చు. దేవుడు తన సేవకులుగా గుర్తించిన వారినందరినీ గూర్చి ఒకసారి గమనించడం చాలా ప్రాముఖ్యం.

    సేవకుడు అంటే వేరొకని ఆలోచనలను నెరవేర్చేవాడే. వేరొకని ఆశక్తులను సేవించేవాడు సేవకుడు. ఇప్పటి నుండి, నీవు కూడా దేవునికి సామర్ధ్యంగల సేవకుడవు అని అనుకోవాలి. ఒక విద్యార్ధి దేవుని సేవకుడు కాగలడు! ఒక వ్యాపారి దేవుని సేవకుడు కాగలడు! ఒక ఉపాధ్యాయుడు దేవుని సేవకుడు కాగలాడు! నీ వృత్తి ఏదైనప్పటికీ, నీవు సర్వశక్తుడైన దేవుని చిత్తమును జరిగించవచ్చు. నీవు చేసే ఉద్యోగములన్నిటిలోకెల్లా గొప్ప ఉద్యోగము దేవునికి సేవకునిగా ఉండడం.

    యాజకులు, లేవీయులు మరియు ప్రవక్తలు దేవుని సేవకులుగా పిలువబడడం అనేది పెద్ద ఆశ్చర్యమైతే కాదు. ఆహ్రాబాము, ఇస్సాకు మరియు యాకోబు అనువారలు దైవజనులు కారు అయినప్పటికీ దేవుడు వారిని తన సేవకులుగా పరిగణించాడు. అబ్రాహామును ఒక దైవజనుడుగా మీరు భావించాలని అనుకుంటున్నారని నాకు తెలుసు. కానీ అబ్రాహాము దైవజనుడు కాడు. అతడు కేవలము దేవుని సేవకుడు మాత్రమే. మోషే కూడా ఒక దైవజనుడు అని మీరు భావిస్తారు అని నాకు తెలుసు. అయినప్పటికీ, మోషే ఇశ్రాయేలు దేశమునకు ఒక శిరస్సు. రాజైన దావీదును దేవుడు తన సేవకునిగా పరిగణించాడు. నిజానికి, మోషే మరియు దావీదులు ఇశ్రాయేలు రాష్ట్రమునకు అధిపతులు మరియు డేవిడ్ బెన్ గురియన్, షీమోన్ పెరెస్, యిట్జ్ హాక్ రాబిన్, యెహుద్ బరాక్, అరియెల్ షారోన్ మరియు బెంజమిన్ నెతన్యాహు లాంటివారికి వీరు పూర్వీకులు. ఒక రాష్ట్రమునకు అధిపతియైనవాడు దైవజనుడు కాడు. కాని ఒక రాష్ట్రమునకు అధిపతియైనవాడు దేవునికి సేవకుడు కాగలడు. మోషే మరియు దావీదులు ఇరువురు దేవునికి గొప్ప సేవకులు. నీవు ఎటువంటి హోదాలో ఉన్నప్పటికీ, నీవు దేవునికి సేవకునిగా ఉండునట్లు చూచుకో.

    యోబు అనువాడు తూర్పు దేశమునకు చెందిన గొప్ప వ్యాపారవేత్త. యోబు తూర్పుకు చెందినవాడు గనుక, అతడు బహుశ చీనీయుడుగాని, కొరియా లేదా జపాన్ దేశీయుడై గాని ఉండవచ్చు. యోబు ఎంతగానో సంపన్నమైనవాడు కాని దేవుని సేవకుడుగా పిలువబడ్డాడు. తన సేవకుడైన యోబును బట్టి దేవుడు సాతాను దగ్గర గొప్పలు కూడా చెప్పాడు. పరలోక దృక్పధంలో, యోబు దేవుని సేవకుడు. నేడు, ధనవంతులైన వ్యాపారులు చాలా అరుదుగా దేవుని సేవిస్తున్నారు. నీవు వ్యాపారివైతే, నీవు యోబు వలె ఉండి దేవుని సేవించవచ్చు. నీవు దేవుని సేవకుడవు అగునట్లు ఈ పుస్తకము వ్రాయబడుతుంది. నీవు తన సేవకుడవు కావాలని దేవుడు భావిస్తున్నాడు. నీవు దేవుని సేవకుడవు కావాలని నీకు సలహా ఇస్తున్నాను. దేవుని సేవకునిగా ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పుస్తకము దీనిని గురించే చెప్తుంది! దేవుని సేవకుడవు అవడానికి నిశ్చయించుకో. దేవుని సేవకులలో ఒకనివిగా పిలువబడాలని నీవు నిర్ణయించుకో. నిన్ను దేవుని సేవకునిగా పరలోకము పరిగణించి గౌరవించనీయి. పరిశుద్ధ గ్రంథములో దేవుని సేవకులుగా పిలువబడిన వారి ఘనమైన జాబితాను ఒకసారి చూద్దాము.

    యాజకులు మరియు లేవీయులు దేవుని సేవకులు.

    దేవుని మందిర సేవయంతటికిని యాజకులును లేవీయులును వంతుల ప్రకారము ఏర్పాటైరి; నీ యాజ్ఞకు బద్ధులైయుండి యీ పనియంతటిని నెరవేర్చుటకై ఆ యా పనులయందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధి పతులును జనులందరును నీకు సహాయులగుదురు.

    1 దినవృత్తాంతములు 28:21

    ప్రవక్తలు దేవుని సేవకులు.

    కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసినదానిని బట్టియు, యెహోవా సేవకులందరిని హతము చేసిన దానిని బట్టియు, యెజెబెలునకు ప్రతికారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతివారిని హతముచేయుము.

    2 రాజులు 9:7

    అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తననుబట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.

    జెకర్యా 1:6

    అత్యంత గొప్ప వ్యాపారవేత్తలైన అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు అందరు దేవుని సేవకులే.

    నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో ఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.

    నిర్గమకాండము 32:13

    బహుళ లక్షాధికారియైన యాకోబు దేవుని సేవకుడు.

    నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల

    Enjoying the preview?
    Page 1 of 1