You are on page 1of 9

భోగి పిడక

-      వాసు ముళ్ళపూడి

"వచ్చారా! ప్రయాణం బాగా జరిగిందా." అరుగెక్కుతున్న  మమ్మల్ని ఆప్యాయంగా అడిగింది


మా  అమ్మమ్మ.

"ఆ పెట్టెలు అవీ లోపల పెట్టు " అని మా పాలేరు వెంకటరత్నాన్ని ఆజ్ఞా పించి అందరినీ  చెయ్యిపట్టు కుని
లోపలకి తీసుకెళ్ళాడు తాతయ్య  " బో లెడు ప్రయాణం చేసొ చ్చారు. మొహం కడుక్కుని కాఫీలు
తాగుదిరిగాని. " అంటూ

కుశల ప్రశ్నలయ్యాకా   అందరికీ కాఫీలు పట్టు కొచ్చి,  "నువ్వు వంకలు పెడతావని నీకు మాత్రం మీ
అమ్మమ్మే  పెట్టా రు." అని  నన్ను  చూసి నవ్వుతూ అంది మా అత్త య్య .

నాకు   ఊహ తెలిసినప్పటినించీ  ఏ ఏడాదీ సంక్రా ంతికి ఊరెళ్ళకుండా లేను. పుట్టినూరు కావడం వల్ల  ఏడాది
తిరిగేసరికి మనసు పీకేస్తు ంది ఎప్పుడు వెళదామా అని. కోనసీమ లో అయినాపురమని అదొ క   చిన్న
పల్లెటూరు. పచ్చని పంట పొ లాలు, వాటి గట్టు వార కొబ్బరి చెట్లు , సైడ్  కాలువలు, ఒక చెరువు, చెరువు
ఒడ్డు న  పెద్ద మర్రి చెట్టు , దాని కింద రచ్చబండ. చెరువుకి ఒక వైపు గ్రా మ దేవత నీలాలమ్మ గుడి, ఇంకో
వైపు విష్ణా లయం, శివాలయం  - ఊరు చూడ ముచ్చటగా ఉంటుంది.
మేము వెళ్ళే ప్పటికే   మా దొ డ్డమ్మ, మావయ్యలు,పిన్నిలు  కుటుంబ సమేతంగా వచ్చేసారు.

కాఫీ నోట్లో పో సుకుని, మా బావలతో కలిసి ఊరుమీద పడ్డా ను నేను . ఇంటి బయటకి రాగానే మా పక్కింటి
రాజు గారు దర్శనమిచ్చారు .

"ఏం బాబు ఎలా ఉన్నారు. మీకేంటి మీరు బాగా చదువుతారు.  ఫష్టు గా  మార్కులు తెచ్చుకుంటారు. మా
అబ్బాయి చూడు .. ఏమీ లాభం లేదు..  మేమేదో ఇలా గడిపేస్తు న్నాం. పో నిలే పో నిలే మీరు బావున్నారు."
అని ప్రశ్న సమాధానం ఆయనే చెప్పేసుకున్నారు.

ఆయన్ని ఊరిలో అందరూ ఏడ్పుల రాజు గారు అంటారు. ఆయన ప్రతీ మాట ఏడుస్తు న్నట్టు ఉంటుందని -
స్వరంలోనూ,భావంలోనూ.  ఆయన బహు పీనాసి. ఇరవై ఎకరాలా దాకా భూముంది- పది ఊడ్పు, పది
కొబ్బరి తోటలు. తాతల నాటి ఇల్లు . అయినా ఇప్పటికీ ఆయన పూర్తిగా  బట్ట లు వేసుకోవడం ఎప్పుడూ
చూడలేదు. ఎప్పుడూ అర్థ దిగంబరం అది కూడా రెండే పంచెలు. మార్చి మార్చి (ఏప్రిల్ నించి మార్చి ఒకటి
మార్చి నించి ఏప్రిల్ ఇంకొకటి) కట్టేవారు. వారనికొకటే రోజు కూరలతో తినేవారు. మిగతా వారమంతా
చారో, ఊరగాయతోనో గడిపేసవ
ే ారు.  ఒక్కడే పిల్లా డు.  వాడికి పెద్దగా చదువు ఎక్కేది కాదు. రాజు గారిని
వాడు ముప్పు తిప్పలు పెట్టేవాడు.

 
మేము వెళ్ళిన నాలుగు రోజులకి భోగి.  సంక్రా ంతి హడావుడి ఊరులో బాగా కనపడుతోంది.  పండగకి
అందరూ కొత్త బట్ట లు కొనుక్కోవడం, ఇళ్ళని ముత్యంలా కడుక్కోవడం, ముంగిళ్ళలో ముగ్గు లు, ఇళ్ల లో
చుట్టా లు పెళ్లి వాతావరణం తలపిస్తో ంది. మహా సందడి గా ఉంది. ఊళ్ళో అందరూ అప్పుడే భోగి దండలు
కూడా తయారు చేసేసుకున్నారు. ఇక మేము కూడా త్వరపడాలి అని నిర్ణ యించుకున్నాం. ఆవు పేడ వెతికి
పట్టు కుని, పిడకల తయారీ కి నడుం కట్టా ం. పేడ ని ముట్టు కోవడం, దాని వాసన   కొంచం చికాకుగా
అనిపించినా, భోగి మంట సరదా ముందు అవి పెద్ద లెక్కలోకి రాలేదు. మా తాతయ్య వాళ్ల ఇంటి చుట్టూ  కోట
గోడలాటి ఒక గోడ ఉండేది. దాని మీద రకరకాల ఆకారాలతో పిడకలు వెయ్యడం మొదలెట్టా ం.  దండ
కట్ట డానికి కావాల్సిన గారిలాగా కన్నం ఉండే పిడకలతో పాటు, అరటి పండు, బస్సు , యాపిల్ పండు, ఇలా
మా ఊహా శక్తికి  పదును పెట్టి రకరకాల పిడకలతో గోడను నింపాము.  ఇక రోజూ మూడు పూటలా
పిడకల  పర్యవేక్షణ చేసేవాళ్ళం. ఎండ బాగా రావాలని పూజలు చేసేవాళ్ళం. అవి  ఎందుకు త్వరగా ఎండట్లేదో
కోర్ కమిటి తో సమావేశాలు జరిపేవాళ్ళం. రాత్రిళ్ళు వర్షం పడి పిడకలు కరిగప
ి ో యినట్టు పీడకలలు కూడా
వచ్చేవి. ఇలా అవి మా ఇంటెన్సివ్ కేర్ లో మూడొంతులు ఎండాయి భోగి ముందు రోజుకి . ఆ తరువాత వాటిని
మంట మీద వేడి చేసి ఇంచు మించు ఎండాకా దండ కట్టి దాచిపెట్టు కున్నాం మర్నాటి మంటకి.

మర్నాడే భోగి. ఊళ్ళల్లో భోగి ఎంత బాగా చేస్తా రంటే, ముందు రోజు రాతిరి ఊళ్ళో ఉన్న ఎడ్ల బళ్ళు, పాకల్లో
వాసాలు (పక్కింటి, పొ రుగింటి వాళ్ళవని వేరే చెప్పక్కర్లేదు) ఇవన్నీ ఎత్తు కుపో యి పో గేసి భోగేస్తా రు.
అందుకని ఆ రాత్రంతా పెరట్లో పాకకి, ఎడ్ల బళ్ళకి బో లెడు కాపలా కావాలి.  అలా ఆ రాత్రి మా తాతయ్య నైట్
షిఫ్ట్ చెయ్యాల్సొచ్చింది. మేము కూడా మహా  సరదాపడి మా తాతయ్యతో పాటు పెరటి అరుగు మీద
గూర్ఖా గిరి లో ఉత్సాహంగా  పాల్గొ న్నాం. సాధారణంగా కథలు చెప్పడం లో  బామ్మలు, అమ్మమ్మలు ప్రసిద్ది.
కానీ మా తాతయ్య  అదంతా స్త్రీవాదులు చేసన
ి కుట్ర అని నిరూపించేంత బాగా కథలు చెప్పేవారు. ( "తాత
కథలు" అని మా తాతయ్య చెప్పిన కథలతో ఒక సంకలనం విడుదల చెయ్యాలి అనుకునేవాడిని ఇదివరలో ).
కాకపో తే ఒకటే షరత్తు , చెప్తూ ఉన్నంత సేపు  ఆయన కాళ్ళు పట్టా లి.  ఆయన చెప్పే కథలకి, చెప్పే తీరుకి
వీరభిమానులమయిన మేము అవి వినడానికి ఏం  చేయడానికయినా  సిద్ధపడే వాళ్ళం .  ఇక కాశీమజిలీ
కథలైతే ఒక్క కథే  మా వేసవి శెలవులు మొత్త ం ఆక్రమించేది. సాయంత్రం వీధి అరుగు మీద కూర్చుని, మా
చేతులరిగప
ి ో యేలా  కథలు చెప్పించుకునేవాళ్ళం. భోగి ముందు రోజు రాత్రి కూడా అలాగే కథలు వింటూ
మెలకువ  ఉండచ్చులే అనుకున్నాం. కానీ ఆయన మాకు ఒక కొత్త విద్య నేర్పించారు. అదే మన జాతీయ
క్రీడ - హాకీ అనుకునేరు (సినిమా పరిజ్ఞా నం బొ త్తి గా లేనివాళ్ళు) , కాదండీ బాబూ - చతుర్ముఖ పారాయణం.
దీన్నే కొంత మంది ముద్దు గా పేక అని కూడా పిలుచుకుంటారు. ఆ రోజు మాకు సీక్వెన్స్ (రమ్మీ), క్లియరెన్స్
లాటి జీవితానికి పనికొచ్చే ఆటలన్నీ నేర్పారు. దాంట్లో మాకు నేర్పు వచ్చేసింది  కానీ సమయం గడవట్లేదు.
సూరీడు ఇంకా డీప్ స్లీప్ లో ఉన్నాడు  చంద్రు డి షిఫ్ట్ కదా అని. ఇంకా ఆయన
నిదురలేవాలి, బయల్దే రాలి, రావాలి. మాకు విముక్తి కలగాలి.

"శ్రీ సూర్య నారాయణ మేలుకో" అని మృదువుగా మొదలెట్టి "రా దిగి రా, దివి నుండి భువికి దిగిరా" స్థా యి
వరకూ మా నిరీక్షణ సాగింది సూరీడు కోసం. ఆయన రాలేదు కానీ మాకు నిద్ద ర కుమ్ముకుంటూ వచ్చేసింది.
లేచి చూసే సరికి బారెడు పొ ద్దెక్కింది. పక్కన చూస్తే పక్కలో మత్తు గా పడుకున్న మా బావలు . తాతయ్య
ఎప్పుడో వెళ్ళిపో యి స్నానం చేసి  పూజ కూడా చేసేసుకున్నారు. మా బావలని నాలుగు తన్ని లేపి, పరుగు
పరుగున భోగి మంట వెయ్యడానికి బయల్దే రాం. పిడకల దండలు, ఒక లీటరు కిరోసిను, అగ్గిపెట్టె
తీసుకుని మా   పెరట్లో కి పరుగులు తీసాము .

అన్నీ సిద్ధం చేసుకుని మంటెయ్య బో తుంటే మా తాతయ్య అక్కడ వద్దు , అసలే తాటాకు పాక
నిప్పంటుకుంటుంది అని వారించాడు. సరే కదా అని ఇంకో వైపు కెళ్ళాం. అక్కడేమో గడ్డిమేట్లు . పాకకి
పావుమైలు దూరం లో మంట వెయ్యనివ్వని మా తాతయ్య గడ్డిమేటు దగ్గ ర వెయ్యడానికి ఒప్పుకుంటాడా.
ససేమిరా అన్నాడు. మేము భోగి మంట లో కిరసనాయిలు జల్లు దామనుకుంటే మా తాత మా ఉత్సాహం
మీద నీళ్ళు చల్లా రు. లాభం లేదని మా పొ రుగింటి రాజు గారింటి కెళ్ళాం. దీనికి మాత్రం మా తాతయ్య
అడ్డు చెప్పలేదు. కానీ ఏమీ లేకుండానే ఏడ్చే రాజుగారు ఈ మంటంటే ఏమంటారో ఊహించాం.అనుకున్నట్టే
రాజు గారు తనదయిన బాణిలో "బాబూ! నాది అసలే చిన్న పాక, ఒకటే ఆవు, చిన్న గడ్డిమేటు, ఒకర్తే
భార్య, ఒకడే పిల్లా డు"  అని ఏడుపు మొదలెట్టా డు. ఆయన మొహం చూసి కాకపో యినా, వారానికోసారి గడ్డి
తిని, డైటింగ్ చేస్తు న్నట్టు న్న దూడల మొహం చూసి అక్కడ నించీ వచ్చేసాం.

 
ఇక ఇలా కాదని రోడ్డు మీద కెళ్ళాం మంట వెయ్యడానికి.  అక్కడ అప్పటికే మంటలు చల్లా రి, జన సంచారం
మొదలైపాయింది. మా నాలుగు రోజులు శ్రమ వృధా కానివ్వం. మా రకరకాల పిడకలకు నిప్పంటించే దాక
నిద్రపో మని నిర్ణ యించుకుని మా తాతయ్య తో పెద్ద యుద్ధ ం చేస్తే, ఇంట్లో ఒక గాడిపొ య్యి  చూపించి -
అందులో వెయ్యండి, భోగి మంట ఐపో యాక నీళ్ళు కూడా కాచుకోవచ్చు ఎంచక్కా అని సద్ది చెప్పాడు. చేసేది
లేక అయిష్ట ంగా అందులోనే వేశాం మా భోగిపిడకల దండలు. అవి ఏకంగా గంట  మండాయి.

పో నీ ఇది ఇలా అయ్యింది మిగతా రోజన్నా సరదాగా గడుపుదాం అని అనుకున్నాం. ఇంతలోనే తలంటు
పో యించుకోవాలని మా గొంతులో వెల్లక్కాయ వేసారు అమ్మ వాళ్ళు . దానికి ముందు నలుగు. ఏంటో
అపురూపంగా పెంచుకున్న మా వంటిని అయిష్ట ంగా మా పాలేరు వెంకటరత్నం చేతిలో పెట్టా ం.
అతను  గేదెల్ని  పీచెట్టి తోమినట్టు మమ్మల్ని తెగ తోమేసాడు (పెద్దగా తేడా తెలియలేదేమో పాపం). అతని
చేతి నలుగులో మేము నలుగురం నలిగిపో యాం. మేము గోల పెడుతుంటే మా అమ్మ వాళ్ళు  "శుభ్రంగా
నలుగు పెట్టించుకోండి , మట్ట ంతా పో యి వళ్ళు నిగనిగలాడే రంగొస్తు ంది" అంటూ మా వెంకతరత్నానికి
ఊపుని, మాకు సలుపుని పెంచారు. మట్టిపో యి రంగు కాదు, తోలు పో యి రక్త ం వచ్చేడట్టు ఉంది అని
నసుగుకున్నాం.   మాకైతే గత ఏడాది చేసిన అల్ల రంతటికీ ఒకే సారి పగ తీర్చుకుంటున్న ఫీలింగ్ వచ్చింది.
ఆ పగకి ఫినిషింగ్ టచ్ ఆ తరువాత కుంకుడు రసంతో తలంటు. పరిగెడుతున్న మమ్మల్ని  బలి ఇచ్చే
పశువుల్లా   కాళ్ళు చేతులు తలొకరూ  పట్టు కుని బలవంతంగా కుంకుడు పులుసుతో తలంటే శారు.  పైగా
తల వెనక్కిపెట్టండి లేకపో తె పులుసు కళ్ళల్లో పడుతుందని ముందు జాగ్రత్త లొకటి. కళ్ళల్లో కి పడకుండా
పులుసు పొ య్యడం, తెలుగు టీవీ యాంకర్లు తెలుగు మాట్లా డడం, తెలుగు టీవీ న్యూస్ చానళ్ల లో లో
తప్పులు లేకుండా చదవడం  సాధ్యమేనా? ఆ తంతు పూర్తి కాగానే, ఉప్పురాళ్ళతో సిద్ధంగా ఉన్నాడు మా
మావయ్య, ఆర్య 2 లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో ఉన్న అల్లు అర్జు న్ లాగ.

ఎరుపెక్కిన కళ్ళతో, ఉప్పెక్కిన నోటితో , బరువెక్కిన హృదయంతో కొత్త బట్ట లేసుకుని మత్తు గా నిదరపో యాం
మేమందరం. ఆ కొత్త బట్ట లు మాకు అతికినట్టు సరిపో యాయి (స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్
లాగ  అన్నమాట).    అన్నట్టు ఆ బట్ట లు కుట్టింది మా ఊరిలో ఏకైక (లేడీస్ ) టైలర్ కాంతారావు. ఇంట్లో
ఉన్న  ఆడ లేడస్
ీ అక్కడే కుట్టించేవారు, వాటితో పాటు పనిలో పని మావి కూడా అక్కడే కుట్టించేసేవారు డెడ్
సీప్ అని.  

ఏ మాట కా మాట చెప్పాలి. నలుగు పెట్టి, వేన్నీళ్ళతో తలంటుకుంటే మత్తు మందిచ్చినట్టు నిద్రపడుతుంది.


ఆ గాఢ నిద్రలో  పులిహో ర, బొ బ్బట్లు తింటునట్టు   ఒకటే మెరుపు కలలు. ఉలిక్కిపడి లేచాను. పులిహో ర
ఘాటు, నేతి బొ బ్బట్టు  కలగలిపిన  ఒక కమ్మటి సువాసన నను పిలిచింది రా రమ్మంటూ. పట్టా ను  ఒక
పట్టు . వంటలో మా అమ్మమ్మ కి సాటి లేదంటూ. కవిత్వం పొ ంగింది కదూ నాలో దాన్ని తలుచుకుంటూ.

ఆ రోజు మా ఇల్లు చుట్టా లతో, మా పెరటి సావిడి పేకాటరాయుళ్ళతో నిండిపో యింది. సాధారణంగా పేకాట
సరదాగా ఆడేవాళ్ళు ఉంటారు, డబ్బులకి ఆడే వాళ్ళుంటారు, క్ల బ్బుల్లో ఆడే వాళ్ళూ ఉంటారు. కానీ మా
ఊరిలో పేకాటే  వృత్తి గా  ఆడే వాళ్ళు ఉన్నారు . వాళ్ళు కేవలం పేకే ఆడతారు. అదే వారి జీవిత
లక్ష్యం, ఆశయం, కర్త వ్యం. ఈ బ్యాచ్ మా ఊరిలో ఏ  శుభకార్యానికెళ్ళినా, చుట్టా లు దండిగా
ఉన్న  ఏ ఇంటికెళ్ళినా  కనపడేది. ఇలా పండగలు, పెళ్ళిళ్ళు  ఏవీ  లేనప్పుడు వీళ్ళ   పరిస్థితి ఏంటని నాకు
బో లెడు జాలి వేసేది. ప్రభుత్వం పేకాటని స్వయం ఉపాది పధకంగా ఎప్పుడు గుర్తిస్తు ందో , పావలా
వడ్డీ రుణాలు ఎప్పుడిస్తు ందో   అని నేను బెంగ పెట్టు కునే వాడిని.

మొత్తా నికి నేను నిద్ర లేచి, కాస్త  ఎంగిలి పడి, మా గ్యాంగ్ తో కలిసి, గుడికి బయల్దే రా. అరుగు
దిగుతూండగానే ఎక్కడినించో ఒక ఘాటయిన సువాసన ముక్కులదిరిపో యేలా వచ్చింది.  ఈయనెవడ్రా
బాబూ   అత్త రులో బట్ట లుతుక్కున్నట్టు   ఉన్నాడు, ముక్కులదిరిపో యే ఈ ఘాటేంటి  అనుకునేంత లోపు
మా తాతయ్య స్నేహితుడు సూర్యనారాయణ గారు ప్రత్యక్షమయ్యారు. ముసలోడే కానీ మహానుభావుడు
అనుకుని అరుగు దిగుతున్నాం.

 
ఆయన నన్ను చూసి " ఏరా అబ్బీ , ఎలా ఉన్నావ్రా . మీ నాన్న నా కళ్ళ  ముందు పుట్టి పెరిగిన వాడు.
నేనంటే వల్ల మానిన గౌరవం. ఎరుగుదువా" అని అడిగాడు. ఆయన వ్యవహారం, పిలుపు కూడా నాకు
నచ్చలేదు. నాకు వళ్ళు మండి "అయితే మీరు ఈ శతాబ్ద ం లో పుట్ట లేదా తాతయ్యా" అని అన్నాను.
అందరూ పుసుక్కున నవ్వేసరికి ఆయనకి చిర్రెత్తి నన్ను "ఔన్రా అబ్బీ నీ బట్ట లేంటి బాగా బిగ్గా ఉన్నాయి, మీ
తమ్ముడివా " అనడిగి తిక్క కుదిరిందా అన్నట్టు  నవ్వి లోపలికి వెళ్ళిపో యారు. నాకు మా కాంతారావు టైలర్
గాడిని కాలికింద పురుగులా నలిపేయాలనిపించింది. మా అమ్మ మీద కూడా పీకల దాకా  కోపం వచ్చింది.

ఆ కోపంలో  అరుగు మెట్లు గబా గబా దిగుతున్నా. ఆఖరి మెట్టు దిగగానే స్కేట్ బో ర్డు మీద కాలేసినట్టు
రోడ్డు మీద జారడం మొదలెట్టా ను . ఆ జారడం జారడం మా పక్కింటి కర్ణ ం గారింటి దగ్గ ర ఆగాను...కాదు
పడ్డా ను.. ఇంచు మించు నడ్డి విరిగేడట్టు  పడ్డా ను .  ఒకపక్క నే తొక్కిన గొబ్బిళ్ళు, ఇంకోపక్క మా వీధిలో
వాళ్ళ వెకిలి నవ్వులు. గుండె భోగి మంట మండింది. అప్పుడు తెలిసింది నాకు, కాలు జారిన మగాడంటే ఈ
సంఘానికి ఎంత కామెడీనో. సిగ్గు తో మొహం చొక్కాలో దాచుకుని, కాలికున్న గొబ్బిల్ల ను తుడుచుకుని
ఇంటికి పరిగెత్తా ను.అవమానంతో, ఇంటికెళ్ళగానే కాంతారావు కుట్టిన ప్యాంటు ని
గాడిపో య్యలో  పడేసి, బెడ్రూ ం కి  గడేసి ఆ సాయంత్రం వరకూ అక్కడే పడుకున్నాను. 

సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో మా బుల్లి తమ్ముళ్ళకి, చెల్లెళ్ల కి కలిపి సామూహిక భోగి పళ్ళు పొ య్యడానికి
అంతా సిద్ధం అయ్యింది. పేరంటాళ్ళు ఒక్కొక్కళ్ళూ వంటినిండా బంగారాలు దిగేసుకుని దర్జా గా వస్తు న్నారు.
బొ మ్మనా బ్రదర్స్లో పట్టు చీరలు, చందనా బ్రదర్స్లో లో బంగారు ఆభరణాలు అన్నీ అక్కడే ఉన్నాయా
అనిపించింది నాకు. ఆడవాళ్ళకి బంగారమంటే ఎందుకింత పిచ ్చో అని ఆలోచిస్తు న్నాను. ఒక పిల్లగాలి
తెమ్మెర నాజూకుగా నా మొహాన్ని తడిమింది. ఇది ఏ 'పిల్ల' గాలో అని  అనుమానం వచ్చి చటుక్కున
గుమ్మం వైపు తిరిగాను. మెరుపు తీగకు పరికిణీ కట్టినట్టు ఒక ఆకారం కనిపించింది. మా ఇంటి గుమ్మం
మెట్లెక్కుతూ నా వైపే వస్తు న్నట్టు ఉంది. చూడడానికి ఇంకో రెండు కళ్ళు ఉంటే బావుండు అనిపించింది ఆ
రూపాన్ని చూడగానే. ఆ నుదుటి నునుపుకి పాపిడి బిళ్ళ కుదురుగా కూర్చోలేకపో తోంది. మెరిసిపో తున్న
నల్ల జెర్రి పిల్లల్లా పరిగెడుతున్న కనుబొ మలను ఎర్రటి గుండ్రటి బొ ట్టు  రెడ్ లైట్ లాగ ఆపుతోంది . సరస్సులో
ఆడుకుంటున్న మీనాల్లా అటు ఇటు తిరుగుతున్నాయి కళ్ళు, అందరినీ పరీక్షిస్తూ . గాలికి బొ ట్టు నుండీ రాలిన
కుంకుమ రేణువులు ఆ సంపంగి పువ్వు లాటి ముక్కుమీద జారుబండ ఆడుకుంటున్నాయి. ఆమె క్షణం
మాట్లా డినా ఎడబాటు భరించలేనట్టు   గాఢ ఆలింగనం చేసుకున్నాయి ఆమె ఎర్రటి పెదాలు. మెడలో
ముత్యాల హారం గర్వంతో మెరిసిపో తోంది ఆ స్థా నం లభించినందుకు. పరికిణీ తనకు ఇంత అందం తెచ్చిన
ఆమెకు కృతజ్ఞ తగా ఆమెకు వీలుగా నడుచుకుంటోంది. లక్ష్మీ దేవి చిన్నప్పుడు ఎలా ఉంటుందో ఏ
పటంలోనూ చూడలేదు నేను. కానీ ఇలాగే ఉంటుందని నమ్మకం కుదిరింది. ఆ రూపాన్ని అలా చూస్తూ
ఉండిపో వాలనిపించింది. ప్రపంచమంతా స్థ ంభించిపో యినట్టు ఉంది. ఏమీ కనపడట్లేదు ఆమె తప్ప. ఆ గొంతు
వినాలని చెవులు ఉవ్విళ్లూ రుతున్నాయి. నా కోసమే అన్నట్టు ఎవరో పేరడిగినట్టు న్నారు. "నీలిమ అండీ"
అంది. ఆ పలుకు సుస్వర సంగీతం. అంతే...  డన్ల ప్ దిండు లాటి నా గుండె తొలి ప్రేమనే శాటిన్ గలీబు
తొడుక్కున్నట్ట నిపించింది. ఒక తెలియని మైకం లో తూలిపో తున్నాను నేను, చిలిపి ఊహల్లో
తేలిపో తున్నాను నేను. ఇంతలో ఓ రాగాయుక్త మయిన త్యాగరాజు కృతి వినపడ్డ ట్టు అనిపించి ఈ లోకంలోకి
వచ్చాను. అదీ ఆమె మాట్లా డుతోంది. "ఇక్కడే జెడ్ పీ స్కూల్ లో చదువుతున్నానండీ " అంది. ఆమె యాస
తెలుగు భాషకు కొత్త సొ గసులు తెచ్చినట్టు అనిపించింది. ఆ గోదావరి యాస లో ఇంత మాధుర్యముందని
అప్పుడే తెలిసింది నాకు.

నీలు (ఇలా పిలుస్తు ంటే ఏదో హాయి ) వాళ్ళ అమ్మ మా అమ్మని చూసింది. అంతే మా అమ్మని గట్టిగా
కావలించుకుని "ఎన్నాళ్ల యిందే నిన్ను చూసి " అని తెగ ఆనందపడిపో యింది. నా చూపును గ్రహించి మా
అమ్మ ఆవిడకి పరిచయం చేసింది. "మా వాడు. తొమ్మిది చదువుతున్నాడు. క్లా సు ఫస్ట్" అని. కాలర్ ఎగరేసే
లోపు ఆవిడ "మా అమ్మాయి నీలిమ. మొన్నే పది పూర్తి చేసింది. జిల్లా ఫస్ట్ వచ్చింది. కలెక్టర్ గారు
సన్మానం చేశారు కూడా" అన్నారు. పిడుగు పడ్డ ట్ట యింది నాకు. "పది" తప్ప ఇంకేది పట్టించుకోలేదు నా
మెదడు. ఎక్కక ఎక్కక మొదటి సారి ఎక్కినవాడి విమానం ఎగరగానే హైజాక్ ఐనట్టు తోచింది నా పరిస్థితి.
మా అమ్మ నీలు ని దగ్గ రకి తీసుకుని "చిలకలా ఉంది పిల్ల. ఒక రెండేళ్ళు ఆలస్యంగా పుట్టు ండ
కూడదటే, కోడల్ని చేసుకుందును" అని నవ్వేసింది. అమ్మ సరదాగా అన్నా నిజంగా నా మనసులోని మాట
చెప్పింది.

నేను వెళ్లి గదిలో లో కూర్చున్నాను . రేడియో లో దాసరి రాఘవేంద్ర  రావుగారి  పాటేదో వస్తో ంది.

 
"పేడ ఎండితే పిడక అవుతాది. ప్రేమ పండితే పెళ్ళవుతాది.

అది ఎండనీడు ఆ పై వాడు. ఇది పండనీరు ఈ పెద్దోళ్ళు " 

ఆ పాట ఎందుకో నా కోసమే వచ్చినట్టు అనిపించింది. గుండె హీటర్ లా మండింది. ఆ వేడి కళ్ళకి పాకగానే
కలల మంచుముక్కలు కరిగి, కన్నీళ్ళయి పొ ంగి పొ ర్లా యి.బాధ భరించలేక ఇక నుయ్యో గొయ్యో
చూసుకుందామని అనుకున్నాను. నుయ్యయితే పెరట్లో నో ఉందని వెళ్లబో తుంటే మాడు మీద ఎవరో ఒక
బలమైన డిప్పకాయి వేసినట్టు అనిపించింది.

ఉలిక్కిపడి లేచాను. కళ్ళు నలుపుకుంటూ నీలు ఏది , నీలు ఎక్కడ అని అంటున్నాను. "నీలూ ఏమిట్రా . ఆ
సినిమాలెక్కువ చూడద్దు రా అంటే వినవాయే. మధ్యాహ్నమనగా అలిగి పడుకున్నావ్. నీ అలక తీర్చడానికి
నాన్న అమలాపురం వెళ్లి కొత్త బట్ట లు తీసుకొచ్చారు. ఇదిగో జీన్స్ ప్యాంటు, టీ షర్టు . వేసుకో."

అంతే ఆనందంతో గంతులేశాను. అమ్మా నాన్న కొత్త బట్ట లకి నా అలక తీరింది అని ఊపిరి పీల్చుకున్నారు
అసల సంగతి తెలియక. ఎప్పుడో అప్పుడు నా నీలు దొ రికే వీలు ఉందని సంబర పడిపో యి మిగిలిన
పండుగని ఆనందంగా జరుపుకున్నా. ఈ సారి మాత్రం పెద్దదయినా సరే నా నీలుని వదలకూడదని
నిర్ణ యించుకున్నాను.

                                              ********************

You might also like