You are on page 1of 29

0 ఓ 0 🙏🙏🙏0 ఓ 0 (25.12.

19)

బృహద్వాశిష్టంబనుశివరామదీక్షితీయం గ్రంధమునుండి (సంక్షిప్తంగా) శ్రీ శివరామ దీక్షితులవారి వాక్యములు

(గురువాక్యము ద్వాదశి, షోడశి, పంచదశి తెలిసినవారికి ఈగ్రంథము ఆణిముత్యములు. తెలియని నరులకు రాళ్ళబండలు,
చిల్లపెంకులు, నల్లబొగ్గులు, అట్టముక్కలు)

పూర్వభాగము

శరీర రహిత ప్రకరణము (1-1)

గు:- మూలంలేని ఈ గుర్తెరిగేశరీరం యేమీలేదు కోటిమాట్లకు ఇదే ఙ్ఞాపకం. యింతకంటే యెక్కువలేదు. గనుక ఇది
మరువవద్దు . కల శరీరం మేలుకొంటే యేమీలేదు, అని నిశ్ఛయం వున్నట్టు వుండవలె, ఈలాగైతే భ్రాంతిరహితం.
మూలంలేని ఈగుర్తెరిగేశరీరం తోటి యేమి వున్నదని ఆశపడ్డ భ్రాంతిరహితం కాదు.

ఉత్తత్రాడువలె పుట్టని చావనిది, సకల దేశాలయందు, సమస్తమైన వస్తు వులయందు, చలించకయుండగా పాము తోచినట్టు
మూలంలేని ఈగుర్తెరిగేశరీరం తోచిందిగాని కలతోచినశరీరం వుండి, మేలు కొంటే యేమీలేదు, అని నిశ్చయం అయినట్టు
గురువాక్యం, మూలంలేని ఈ గుర్తెరిగేశరీరం యేమీలేదు.అని చెప్పగానే ఆలాగే నిశ్చయం కావలె.

కాక పోయిన మరియొక మార్గంలేదు.

ఏమార్గంనమ్మినా రాజమార్గంకాదు.

దొంగ త్రోవలకు లెక్కలేదు.

ఇటువంటి గురువాక్యం మూడుకాలాల యందులేదు. ఇది నమ్మక మరి వొకటి నమ్మినా ఆశ మాత్రమేకాని పోదు. విస్తా రం
అవుచుంది. సూక్ష్మబుద్ది గలవారికేగాని మిగిలినవారికి శఖ్యంగాదు.

ఇది భ్రాంతి లేని విచారం.

గురుసేవ యున్నకొద్దీ రుచి, గురుభక్తి విస్తా రంగా యున్నకొద్దీ తనకు ధృఢం. గురువాక్యం విడువ కూడదు.

ఇది జ్ఞాన కర్మాలవంటి కలతవాక్యం

(నాల్గు మహావాక్యాల్లాంటిది) కాదు. ఇంతకంటే అధికంలేదు.

కృష్ణస్వామియొక్క జాగ్రత ఇటువంటిది.

స్వామి కంటే యెక్కువ అయింది రుక్ముణిీ అనే అమ్మవారు. ఆమెదేజాగ్రత.

కృష్ణస్వామి సాందీపుని దగ్గరకు పోయివచ్చిన తర్వాత యేమివిచారిస్తిరి అనిఅడిగితే, చెప్పకుండగనే సమాధానపడ్డది.


కృష్ణస్వామి నేను మరచిపొయ్యేనని,ఆమెతో మూలంలేని ఈ గుర్తెరిగేశరీరం యేమీలేదు అని గురురహస్యం చెప్పినాడు.

శరీరం మేలుకొంటే యేమయినా వున్నదే,ఆలాగే మూలంలేని ఈ గుర్తెరిగేశరీరం యేమీలేదు అని అన్నది.

*ఆమెదేజాగ్రత.

శిష్యు: అట్లయితే! కలలో వచ్చిన శరీరం మేల్కొంటిే యేమీలేదు. యిదీ ఆలాగేనా?


గురు: మూలంలేని ఈగుర్తెరిగేశరీరం గురువాక్యం చేత మేలుకొంటే యేమీలేదు.

శిష్యు: సరిపాయ, కలలో వచ్చిన శరీరం యీ కనుపించే శరీరం యొక్కటేనా? యీషత్తు యేమియినా యెక్కువ తక్కువా?

గురు: శరీరానకు మూలంలేదు. కనుక రెండూ సమానమేకాని అది లేతశరీరం,

ఇది ముదురు శరీరం.

శిష్యు: అలాగుకాదు గురో! ఈ శరీరం

కంటే అదే పెద్దది, యిదే అనాథ.

గురు: యేలాగు?

శిష్యు: ఏలాగుఅంటే! శిద్ధమైనయేనుగ చౌడోలిరాజు, అనేక కోట్లగుర్రాలు అనేక కోట్లమనుష్యులు మూలంలేకనే వచ్చిరి.
వచ్చి,నూరేండ్లు వుండి,సకలమైన ధర్మాలు అధర్మాలుచేసిరి. అనేకమైన భూదానాలు గోదానాలు చేసిరి.

🙏🌹🍎🌷🙏

(మిగతా విచారణ రేపు)

Smk Raju, Tpt

0 ఓ 0 🙏 🙏 🙏0 ఓ 0 (26.12.19)

బృహద్వాశిష్టంబను శివరామదీక్షితీయం

గ్రంధమునుండి (సంక్షిప్తంగా) శ్రీ శివరామదీక్షితుల వారి వాక్యములు

(గురువాక్యము ద్వాదశి, షోడశి, పంచదశి తెలిసినవారికి ఈగ్రంథము ఆణిముత్యములు. తెలియని నరులకు రాళ్ళబండలు,
చిల్లపెంకులు, నల్లబొగ్గులు, అట్టముక్కలు)

పూర్వభాగము

శరీర రహిత ప్రకరణం (1-2)

(కొనసాగింపు)
గురు: అందులో! మతాచార్యులు:

(1)శంకరాచార్యులు: సన్యాసి, అద్వైతమే దొడ్డది అని కొందరితో వాదించిరి.

(2)రామానుజులు: పెద్దవైష్ణవుడు, విశిష్టా ద్వైతమని, యుక్తిచేసి అదే గొప్పదనే.

(3)మధ్వాచార్యులు: యేమీలేని దేహాన్ని చూచి నేను చేస్తా ను అని, జీవుడు వేరె, ఈశ్వరుడు వేరె, ద్వైతమె లెస్స అని చేసె.

(4)భాస్కరా చార్యులు: జ్ఞానము నిబద్దె, ఖర్మము నిబద్దె, అనె.

(మతాచార్యుల బాష్యాలు, గురువుల చెంత పరిశీలించగలరు)

శి: జ్ఞానము అంటే?

గు: సకల భ్రమలకు మూలం, మూలంలేని ఈ గుర్తెరిగేశరీరమే కాని మరివొకటిలేదు. గురువాక్యం మరచి, శాస్త్రా లవైపు చూస్తె
భ్రాంతిపోదు.

శి: అయ్యా! కలశరీరం మేలుకొంటే యేమీలేదని అందరికి ధృఢం కదా! మీరు నాకు,ఆ (కల)దేహానికి మూలంలేదని చెప్పితిరి.
మూలంలేని ఈగుర్తెరిగేశరీరం చేసినది నమ్మవద్దంటిరి, మూ...ఈ. గు...శ...యే...అని చెప్పగానే యేదివున్నదో అదేవున్నది.

ఇక భ్రాంతియెవ్వరికి? మళ్ళీమళ్ళీ అంటారు. మీరుసరే, నాకు మహాభయం.

గు: అట్లైతె! కలలోకి వచ్చింది కొంతసేపు వుండి మేలుకొంటే సగంపోయి సగం వుంటుందా? నీకు యేమిభయం?

శి: యేమీలేదు. కాని అయ్యా! మూ...ఈ. గు...శ...యే...అనే ధృడం చెప్పినప్పుడే యున్నదిగాని, సర్వకాలంలేదుకదా?

గు: కలలో యెవరైనా యేడిస్తే తనకు లేకున్నా, దుఃఖంవస్తుంది.

శి:- ఏలాగోచెప్పండి?

గు:- డబ్బు,ఆభరణాలు, తీసుకొనువెళ్ళు వాని తోటి ఏమీలేక వున్నవాడు వెళ్తే భయం లేనివాడికి కూడా భయం కలుగునట్లు ,
సహవాసదోషం వల్లకద్దు .

శి:- అట్లయితే, మీకు సహవాసం కద్దా లేదా? సుఖం,దుఃఖం,వున్నదా లేదా?

గు:- కలలో కొందరికికద్దు . నేను ఏమి నాకు సార్వకాలం ఒక్కతీరె.

శి:- మీరు, సార్వకాలం ఒక్కతీరుగా

ఏలాగువున్నారొ ఆలాగు నాకు చెప్పండి.


నేను వుంటా! నేను చదువుకోలేదు. నాకేమీతెలియదు. మీరు చెప్పకుంటే ఎవరుచెపుతారు.

గు:- మా గురువుగారు నాకు ఎటువంటి నీచమార్గం చెప్పలేదు. రాజమార్గం సూచనచేసినారు వారికిసాటి ఎవ్వరూలేరు
ఈమార్గం పరమగుహ్యం.

ఈ బోధకు అధికారులెవరో అనధికారులెవరో చెబుతాను విను.

అనాధికారులు

(ఈ క్రిందివారికి చెప్పవద్దన్నారు)

1.మూ...ఈ.గు...శ...అయివున్న పతితులకు,

2.శాస్త్రా లు నిబద్ధే అని నమ్మియున్నవారికి,

3.ఎదురుబడి వాదించే వారికి,

4.గురుసేవ చెయ్యని వారికి,

5.నేను ఏది అంటే అదే అనే మూర్ఖులకు,

6.స్త్రీ భ్రాంతి యున్నవారికి,

7.జ్ఞాన భ్రాంతి యున్నవారికి,

8.భక్తి భ్రాంతి యున్నవారికి,

9.వైరాగ్యం దొడ్డదనే మూర్ఖులకు,

10.మొద్దు బుద్ధి గలవారికి,

11.అది నేను కావలెనని భ్రాంతి వున్నవారికి,

12.అది నేను అయితినని అనుభవం కావలెనని భ్రాంతి వున్నవారికి,

13.నేను అని వాదించే వారికి,

14.శ్రవణ భ్రాంతి వున్నవారికి,

15.ధ్యాన భ్రాంతి వున్నవారికి,

16.మనన భ్రాంతి వున్నవారికి,

17.ద్వైత భ్రాంతి వున్నవారికి,

18.అద్వైత భ్రాంతి వున్నవారికి,

19.విశిష్టా ద్వైత భ్రాంతి వున్నవారికి,

20.మతాంతర భ్రాంతి వున్నవారికి, చెప్పవద్దన్నారు.

అధికారులు

1.సూచన చెయ్యగానే కనుక్కొనేవారికి చెప్పమన్నారు.


2.స్త్రీలేకాని, పురుషులేకాని, భ్రాంతిరహితం కావలెనని మిక్కిలి ఇచ్ఛ వున్నవారికి చెప్పమన్నారు.

సాంప్రదాయక లక్షణం: -

ఏ భ్రాంతిలేకుండా ఎవ్వరు (దైవాన్ని) సూచనచేయగలరో అని అత్యంత ఆశక్తిగ వున్నవారిని సంవత్సరకాలం చూచి సూక్ష్మప్రజ్ఞ
యుండెనా సూచనచేసేది. కొందరు విద్యాబలం చేత ఈమార్గం, దుర్లభం అని అవహేళనము చేయుటకు వచ్చియుండెనా,
అటువంటివారికి చెప్పకూడదు.

అ సాంప్రదాయక లక్షణం: -

తనకుతాను గ్రహించితిని,గొప్పవాడినని చెప్పుకునేవాడు మునిగిపోతాడు. యెప్పటికీ పుట్టనిచావని అచలంజాడ దొరకక, నిద్రలో


కుక్కలు పందులు మునిగి మల్లా తేలినట్టు తేలుఛాడు గాని గురుస్వామికటాక్షం వంటిది కాదు. వాడు దెంగల్లోదొంగ.
సాంప్రదాయకుడు గాడు. మా సాంప్రదాయం అలాంటిది కాదు.

ఇది భ్రాంతిలేని సాంప్రదాయం.

🙏🌹🍎🌷🙏

(మిగతా విచారణ రేపు)

Smk raju, tpt, (26.12.19)

0 ఓ 0 🙏🙏🙏0 ఓ 0 (27.12.19)

బృహద్వాశిష్టంబనుశివరామదీక్షితీయం

గ్రంధమునుండి (సంక్షిప్తంగా)

శ్రీ శివరామదీక్షితులవారి వాక్యములు

(గురువాక్యము ద్వాదశి, షోడశి, పంచదశి తెలిసినవారికి ఈగ్రంథము ఆణిముత్యములు. తెలియని నరులకు రాళ్ళబండలు,
చిల్లపెంకులు, నల్లబొగ్గులు, అట్టముక్కలు)

పూర్వభాగము

శరీరరహిత ప్రకరణము (1-3)

(కొనసాగింపు)

గు:- మా సాంప్రదాయం భ్రాంతిలేని సాంప్రదాయం.


శి: - ఏలాగు చెప్పండి?

గు: - కలలో తనకుతానె గుర్తెరిగేశరీరం వచ్చి, కొంతకాలం వుండి, వెంటనే మేలుకొంటే యేమీలేదు.

శి: - ఆలాగే, మూలంలేని ఈ గుర్తెరిగేశరీరం తనకుతానే మూలంలేని ఆడదాన్ని చూచి పెండ్లియాడి బిడ్డలుకని పెళ్ళి పేరంటాలు
అనేకానేకాలు చేసుకొంటూ సంసార భ్రాంతిలో యున్నాను. నాకు శీఘ్రంగా భ్రాంతిలేకుండ అనాయాసమైన రాజమార్గం
సూచనచేయండి. వెంటనే కనుగొంటాను.

గు: - ఇది ఎంత? రెప్పపాటు కంటే అనాయాసము.

శి: - నాకు మహాసముద్రం వలే వున్నాది.

గు: - ఉండని! నీకు మహాతీవ్రమా ఏమీ?

శి: - అయ్యా! ఈ గు..శరీరం క్షణబంగురం. అందుచేత తీవ్రం. పుట్టని చావనిది, మొదలు కొనాలేనిది, చలించకవున్నది, ఎక్కడ
ఉన్నది?

గు: - నీకుముందు, నీ చుట్టు ప్రక్కల, మీద, క్రింద, అదేవున్నది. చూచుకో! నీవు అందులోనే వున్నావు.

శి: - చుట్టు ప్రక్కల, మీద క్రింద చూచి, ఆహా ఏమి ఆశ్చర్యం! సరేకాని, నేను ఏలాగు కాను?

గు: - నీవు, యిందాక చూచింది వుందో! లేదో!అని నీకు అనుమానమా?

శి: - అయ్యో స్వామీ! నేను యింతసేపు ఏమో అనుకొన్నా, ఇప్పుడైతే అది తప్ప విడిచి రెండోది ఏమీలేదు, నాకు ధృఢమే. ఇది
అనాయాసమే! రాజమార్గమే!

సరేకాని ఈ దేహం ఏలాగు వచ్చె?

గు: - మునుపే చెప్పితిమే! మరచితివా ఏమి?

శి: - మీ కాళ్ళకు మ్రొక్కుతా! ఇంకొకసారి చెప్పండి ప్రభో!

గు: - అట్లయితే విను! కలలో దేహాలు ఎక్కడ నుంచి వచ్చినవోచెప్పు?

శి: - ఏమీలేదు! అవి, వాటికవ్వే వచ్చినవి, వాటికవ్వే వున్నవి, సమస్తమయిన

వ్యవహారాలు చేసినవి. మేలుకొంటే ఏమీలేదు.

గు: - ఇది నిజమేనా?


శి: - అది అందరికీ ధృఢమే!

గు: - ఆలాగే మూ...ఈ గు...శ...యేమీలేదు. ఇది నిజమేనా?

శి: - ఇది యదార్ధం. శరీరం లేనిదే యున్నది. రాకడలేదు, పోకడలేదు, ఎప్పటి అచలం వున్నదివున్నట్టే వుండె. చూతామంటే
ఏమీలేదు. ఈలాగున ఎవ్వరుచెప్పిరీ?

ఇది మహాగొప్ప గురుసాంప్రదాయం. మిగిలినవి దొంగ త్రోవలు.

ఛీ! ఛీ! వాటిని నమ్మరాదు.

పుట్టని చావని అచలం వంటిదిగాదు.

గు: - శరీరజన్యం గుర్తెరిగేజ్ఞానం.

ఆ జ్ఞానంవలన ఖర్మాలు పుడుతాయి.

ఈ శరీరం ఎటువంటిది అంటే! సర్వ శూన్యం యెటువంటిదో! అటువంటిది. శరీరం లేకుంటే, యేలాగువున్నాదో ఆలాగే
పరిపూర్ణంవున్నది. ఇంతేకాని బట్టబయలు కు యెరుకాలేదు, ఖర్మాలులేవు. అందరూ మూ...ఈ. గు...శరీరమనే ఆవరణంచేత
వున్నారు.

ఈ ఆవరణం అనాయాసంగా కలలోవచ్చిన యేనుగుమేలుకొంటే యేమీలేదు, అని ధృఢం ఆయనా! తనకుతానే పరిపూర్ణం
స్వతసిద్ధమై చలించకయున్నది.

ఇంతేకాని ఈ శరీరం చాత సాధించుతామంటే సాధ్యంకాదు.

శి:- ఏమీలేనిది ఎట్లు ?

గు:- విత్తనము లేని చెట్టు వున్నదని ఎప్పుడు నమ్మితే అప్పుడే యేమీలేదు. మూలంలేని ఈ గుర్తెరిగే శరీరాన్ని తప్పించుకొనే
యుక్తి యెవ్వరికీ గూఢముగానే యున్నది.

శరీరం పుట్టకమునుపు శరీరం యేమీలేదు.

చచ్చిన తర్వాత ఈ శరీరం యేమీలేదు. వున్నది కాసంతసేపు మంది కూతలువిని అనేక భ్రమలు చాత అనేక మంది యున్నట్టు
తానువుండి కొనకు తానూ యేమీలేదు.

ఇలాగే అనేకమందివుండి మళ్ళాయేమీలేదు. చచ్చిన తరువాత మళ్ళీ పుడుతారు అనేటందుకు యేమీలేదు గనుక ఇది మళ్ళా
పుడుతుంది అని ఏలాగు అన?.

కలలో మర్యాదాలేనట్టు అనేకాలు తనకుతానే యేమీలేదు. ఇటువంటి దాన్ని వున్నదని భ్రాంతిపడే మాత్రమే గాని వున్నదివున్నట్లు
పడదు. ప్రశూతి అయితే చిన్నపిల్లకు చంటి మీద ఆశవున్నట్టు తల్లికి ఆశ వుండె.

మహావుపద్రవంవస్తే యెవ్వరిఆశ ముందర పడదు. తల్లికితల్లే, పిల్లకుపిల్లె. ఎవరు చన్ను యిస్తే వారిమీదనే పిల్లకు ఆశ
చగులుచుంది.

పుట్టనిచావని పరిపూర్ణంకు ఏమీభ్రాంతిలేదు.


భ్రమలకు మూలం, మూలంలేని ఈ గుర్తెరిగే శరీరం గనుక ఇది లేకుండా విచారించవలెను.

🙏🌹🍎🌷🙏

(మిగతా విచారణ రేపు)

Smk raju, tpt, (27.12.19)

0 ఓ 0 🙏🙏🙏0 ఓ 0 (28.12.19)

బృహద్వాశిష్టంబనుశివరామదీక్షితీయం

గ్రంధమునుండి (సంక్షిప్తంగా)

శ్రీ శివరామదీక్షితులవారి వాక్యములు

(గురువాక్యము ద్వాదశి, షోడశి, పంచదశి తెలిసినవారికి ఈగ్రంథము ఆణిముత్యములు. తెలియని నరులకు రాళ్ళబండలు,
చిల్లపెంకులు, నల్లబొగ్గులు, అట్టముక్కలు)

పూర్వభాగము

శరీరరహిత ప్రకరణము (1-4)

(కొనసాగింపు)

(కలలో గురు - శిష్య విచారణ)

శి: - పుట్టని చావనిది పుట్టిచచ్చే దాని లోపటవున్నదా? బయటనున్నదా?

గు: - ఇదేం ప్రశ్న? నీవు చెప్పు?

శి: - నాకు ఏమితెలియదు. నాకునేనే కాని, దానిజాడ యెరుగ.

గు: - నీవు పుట్టనివస్తు వు కావుగదా!

శి: - కాను! నేను రాద్ధాంతంగా వచ్చేది, వున్నంతసేపు వుండేది, కలశరీరం మేలుకొంటే ఏమీలేకపోయినట్లు ఏమీలేకపోయేది.
గరుమూలంగా పుట్టనిచావని దాని దర్శనం కాగానే మూ...ఈ.గు...శ...ఏమీలేదు. ఇంతే!

గు: - శభాష్! ఎప్పుడైనా పుట్టని చావనిది ఎటువంటిదో ? ఎక్కడవున్నదో ? సూచన అయ్యిందా? లేదా?
శి: - కాలేదు ప్రభో! నాకు దాన్ని సూచన చేయండి? నీకాళ్ళకు మ్రొక్కుతా,

అది మాత్రం సూచనైతే చాలుసామీ!

గు: - ఇప్పుడు, నీవు ఎక్కడినుండి వచ్చినావు? మళ్ళీ ఎక్కడికి పోతావు?

శి: - నాకు మూలం ఏమీలేదు.

వున్నంతసేపే నాప్రభావం.

మళ్ల ఏమీలేదు.

ఉన్నప్పుడు దాన్ని కనుక్కోవాలని ఇచ్చకల్గింది.

వెనుకటి పుస్తకాల్లోని మచ్చట్లు తేకండి.

అవన్నీ, నాలాంటి శరీరమే చేసిపెట్టింది.

అవి ఆలాగునే వుండనీ.

గు: - అట్లయితే! సూచన చేస్తా , చూడు.

ఈ బట్టబయలు, పుట్టనిచావనిదీ, మొదలు కొనాలేనిదీ, స...దే...యందు, స...కా...యందు, చలించక యున్నది. ఇటువంటి


దానియందు నీవు కూర్చొని నున్నావు.

అది నీవుకావు -

నీవు అదికాదు.

నీకూ దానికీ కొంచెమైనా సంభంధంలేదు.

ఇక, నీవర్తమానం చెబుతా విను:

ఇప్పుడు నీకు ఒక కలవచ్చంది, ఆ కలలో ఏనుగు వచ్చంది మేలుకొంటే ఏమయ్యింది? ఆలాగే, మూలంలేకనే తోచిన ఈ గుర్తెరిగే
శరీరం యేమీలేదు. కాసేపు వున్నట్లు వున్నా, చివరకు యేమీలేదు.

నీవు రాకమునుపే ఈబట్టబయలు వున్నది. నీవు వచ్చినతర్వాత, నీలోపలికి ఈ బట్టబయలు చొర్రాలేదు. ఆలాగే, నీవుపోయిన
తర్వాత ఈబట్టబయలు నీలోనుంచి బయటికి వెళ్ళాలేదు. ఉన్నది వున్నచోటనే వున్నది. గుర్తెరిగేదే లేంది. ఇప్పుడు చెప్పు?
పుట్టనిచావనిది, పుట్టి చచ్చే, దానిలోపట వున్నదా? బయటనున్నదా?

శి: - సూచన చాయగానే అనాయాసమయింది. మబ్బు వీడింది ప్రభో! ఇక ఏమిభయం? అంతాఅచలమే.

🙏🌹🍎🌷🙏

(మిగతా విచారణ రేపు)

Smk Raju, tpt, (28.12.19)


0 ఓ 0 🙏🙏🙏0 ఓ 0 (30.12.19)

బృహద్వాశిష్టంబనుశివరామదీక్షితీయం

గ్రంధం నుండి(సంక్షిప్తంగా)

శ్రీ శివరామదీక్షితులవారి వాక్యములు

(గురువాక్యము ద్వాదశి, షోడశి, పంచదశి తెలిసినవారికి ఈగ్రంథము ఆణిముత్యములు. తెలియని నరులకు రాళ్ళబండలు,
చిల్లపెంకులు, నల్లబొగ్గులు, అట్టముక్కలు)

పూర్వభాగము

గురు శిష్య ప్రభావ ప్రకరణం (2-1)

గు:- అందరూ ప్రబంధః కల్పనా కథ అని అందురు. అది అబద్ధమా, నిజమేకదా!

గురువు లేనియెడల గురి తెలియదు.

మేము అనుభవంవల్లనే తెలుసుకున్నాము. ఆలోచన వంకరకారాదు. మొదలు వంకరైతే తుదవేళ్ళా వంకరే. కనుక వంకరలేని
మార్గం తెలియవలెను.

గురువు ఎటువంటివాడు అనగా ఓడ నడుపుట యందు సారధిగానగుచున్నాడు.

దీర్ఘకాలం గురుసేవ చేతకాని భ్రాంతిరహితం కాదు. ఈబోధ చేయు విషయంలో శిష్యుడు తొందరపడినా, గురువులు సహనం
కలిగి వుండవలెను.

(1) తొందర పడుటకు ఇది అహమును నమ్మిన మార్గంకాదు.

(2) కండ్లు ముక్కు చెవులు మూసుకొని చూడమనే మార్గంకాదు.

(3) నాదము వినుమని చెప్పే మార్గంకాదు.

(4) నేనే నీవు నీవే నేను అని పలికే మార్గం కాదు.

(5) తన నీడను చూచుకొని ఆకాశమందు చూసే మార్గంకాదు.

ఈ మార్గము తెలియడము దుస్తరం.

తెలిసిన తర్వాత సులభం.

తాను నిత్యము అనే ఆశ ఉండదు.

ఈ ఉపదేశమునకు:

మంత్రము లేదు,
తంత్రమూ లేదు,

యోగములు కావు,

ధారణములు కావు,

క్షేత్రములు కావు,

వ్రతములు కావు,

తపములు కావు,

యజ్ఞములు కావు, మహా సులభం.

ఈ సులభం,12 సంవత్సరములు శోధించ వలెను.

గురువాక్యం ఆవరణము(శరీరం) వుండేవరకు మరువక యుండవలెను.

ఈ పరిపూర్ణబోధ కావలసినవారు మొదట

1. ఆ గురువు ఎచ్చట వున్నారో తెలుసుకో వలెను.

2. తర్వాత ఆ గురువుయొక్క శిష్యులనుచేరి పరిచయం చేసుకొని గురుదర్శనం చేయించమని అడుగవలెను.

3. తర్వాత ఆ శిష్యులు వందనాది క్రియలు ఎలాగున చేయుదురోచూచి వారివలె తాను చేయవలెను.

4. ఆ గురువును ఆయన భార్యను తన తల్లిదండ్రు లుగా భావించవలెను.

5. వారిచెంత నయ వినయ భయ భక్తు లతో నడుచుకొనవలెను.

6. అహంకారం వదలవలెను.

7. అభిమానము విడువలెను.

8. గురునింద వినరాదు.

9. గురుద్రోహం చేయరాదు.

10. కులత్యాగం,ఆచార్యత్యాగం చేయరాదు.

11. కులదూషణ చేయరాదు.

12. కులగురువుల నిందించరాదు.

13. పరస్త్రీలను తల్లిగా భావించవలెను.

14. పరద్రవ్యము ఆశించరాదు.

15. తను మన ధనములు, గురునకు సమర్పించవలెను.

16. తాననే భావము కూడదు.

17. తాశూన్యం కావలెను.

18. వాచ్యార్థమందు కాని,లక్ష్యార్ధమందు గాని అహంభావం కూడదు.


19. లక్ష్యార్ధమందు అహంభావము కలిగితే ద్వైతమే సిద్ధించును.

ద్వైతము లేదనియనిరి.

అద్వైతము ఒకటి కలదన్నారు.

ఏకం అనేకం భవతి అన్నట్లు ఒకటి ఎప్పుడు కలదో రెండోది అప్పుడే గలదు.

గనుక అంతా శూన్యమై యున్నది.

శూన్యము అనగా తానే శూన్యము.

తాను ఎప్పుడు లేకున్నాడో, అన్ని అప్పుడే లేవు.

తాను మాత్రము వుండేవాడు, తక్కినవి లేక పోయేవి కావు.

తాను వుంటే అన్నీ కలవు.

తాను లేకుంటే ఏదీ లేదు.

కొందరు శూన్యవాదమని అందరు.

తాను కలిగినప్పుడు శూన్యము ఏలాగున ఆయెను? తనకు ఒక్కరూ కనపడక పోయిరా, అపుడు తాను లేకపోవుట శూన్యము.

తన్ను నమ్మితే నాశనమే, గాని నాశనము లేనిది తాను గాబోడు.

🙏🌹🍎🌷🙏

(మిగతా విచారణ రేపు)

Smk Raju, Tpt. (30.12.19)

0 ఓ 0 🙏🙏🙏0 ఓ 0 (31.12.19)

బృహద్వాశిష్టంబనుశివరామదీక్షితీయం

గ్రంధమునుండి (సంక్షిప్తంగా)

శ్రీ శివరామదీక్షితులవారి వాక్యములు

(గురువాక్యము ద్వాదశి, షోడశి, పంచదశి తెలిసినవారికి ఈగ్రంథము ఆణిముత్యములు. తెలియని నరులకు రాళ్ళబండలు,
చిల్లపెంకులు, నల్లబొగ్గులు, అట్టముక్కలు)
పూర్వభాగము

గురుశిష్య ప్రభావ ప్రకరణము (2-2)

(కొనసాగింపు)

గు: - తనకుతానే గాని, తనకు యేదీలేదని కొందరందురు. అది నిజముకాదు. తానేలేడు. ఇక ఆగామి సంచిత ప్రారబ్ద కర్మలు
ఎట్లు గలుగును? ప్రారబ్ధమెక్కడినుండి వచ్చెను? మోక్షము ఎటునుండి వచ్చెను?

ఈ భ్రమలన్నియు అహంకార, శరీరధర్మములే గాని మరియొకటి కాదు.

ఈ అహంకారమే నరకము.

ఈ అహంకారమును యెవరూ వదలజాలరు.

అహంకారము దేనివలన కలిగెనో దానిని విడువవలెను.

అహంకారమునకు మూలం గురువు వలన తెలియవలెను.

అహంకారము వలననేగదా! శత్రు వులు, మిత్రు లు, గలుగుచున్నారు.

అహంకారమును వదలకనేగదా రావణాసురుడు నశించిపోయెను. అహంకారము లేనివారికి జనన మరణములు లేవనేది


సిద్ధాంతము.

అహంకారంలేని వారిని దెలిసుకొనుట దుర్లభము.

గురూపదేశం వలనగాని తెలియజాలరు.

అహంకారముగల గురువును శరణు పొందియున్ననూ విడువవలెను.

తిరిగి చూడరాదు.

(1) గురువునకు అహంకారం లేదు.

(2) గురువునకు సేవచేయని వానికి సూచన గలుగనేరదు.

(3) గురువు చెప్పిన యుక్తిని మరువకూడదు.

(4) గురువు కన్ననూ దైవము హెచ్చని పలుకకూడదు.

(5) గురువుయొక్క ఋణము ఎవరు తీర్చుకో గలరు? దుస్తరము.

(6) గురువు జననమరణములను పోగొట్టు ను.

(7) గురువు అనుగ్రహం పొందినవాని పాదరేణువు నెవ్వరూబోలరు.

(8) గురువును నిందించినవానికి నరకమే శాశ్వతము.

(9) గురువు అనుగ్రహంపొంది, దూషించువాని కంటే గాడిద మేలు.


(10) గురువు యేర్పడినపిమ్మట పందియైన వాడు పందే యవును.

(11) గురువు గలిగినపిమ్మట కుక్కయైనవాడు కుక్క కడుపునే పుట్టు ను.

(12) గురువులకు గుణంకలదా? కుక్కకున్న గుణం గురువుకు లేదనే అన్నాడు.

(13) గురువును కుక్కని అనరాదు.

(14) గురువు కుక్క అయితే కుక్క బ్రతుకే అవును.

(15) గురూపదేశం గలవారికే ఈ వాక్య గ్రంథమును ఇవ్వవలెను.

ఇతరులకు ఇవ్వరాదు.

గురుపుత్రు లు ప్రార్థించితే తాత్పర్యము తెలియుటకు బోధించవలెను.

ఈగ్రంథ వాక్యములు అహంకారంలేని వారలకు మాణిక్యములు, ఇతరులకు నల్లబొగ్గులు, చిల్లపెంకులు.

ఎవరైనా గురూపదేశమైన పిమ్మట

ఈవాక్యములు వినుచూ మనస్సునకు అందక సంశయచిత్తు లై యున్నవారిని లెస్సగా వినుము అని బోధ చేయవలెను,గాని
అసూయ పడరాదు.

అసూయపడువారే అహంకారులు.

వారికి అహమువదలనే లేదు.

(గురుశిష్య - ఫ్రభావ ప్రకరణం సమాప్తం)

🙏🌹🍎🌷🙏

Smk Raju, Tpt. (31.12.19)

0 ఓ 0 🙏🙏🙏0 ఓ 0 (01.01.2020)

బృహద్వాశిష్టంబనుశివరామదీక్షితీయం

గ్రంధమునుండి(సంక్షిప్తంగా)

శ్రీ శివరామదీక్షితులవారి వాక్యములు

(గురువాక్యము ద్వాదశి, షోడశి, పంచదశి తెలిసినవారికి ఈగ్రంథము ఆణిముత్యములు. తెలియని నరులకు రాళ్ళబండలు,
చిల్లపెంకులు, నల్లబొగ్గులు, అట్టముక్కలు)

పూర్వభాగము

అహంకార నిరసన ప్రకరణం (3-1)

గురువాక్యం: - ఈ శరీరానికిమూలం నేను గుర్తెరుగుదును అనే అహంకారమనే ఎరుకే మూలం. ఈ ఎరుకే జ్ఞానం.
ఈ ఎరుక అనే అజ్ఞానమే అందరూ.

గనుక అహంకారం(నేను)వుంటే అన్నీఉన్నవి

లేకుంటే జగత్తు ఉన్నదో లేదో,ఎవరికి ఎరుక?

అన్ని దేహాలయందు ఒక్కతీరుగానే వున్నది. అందుకే నేను నీవు అనేది సమానమే.

నేను నేను అనే ఎరుకే జ్ఞానం.

జ్ఞానం దొడ్డది, అని శాస్త్రం ఉండనే ఉన్నది.

అందరూ జ్ఞానులే గనుక అందరూ ఒక్కటే.

(1) అహంకారం వలననే అన్ని కులాలు జాతులు మతాలు కలిగినవి.

(2) ఈ అహంకారమే వేద శాస్త్రా లను కల్పించినది.

(3) అబద్ధం అనేది అహంకారమే, నిబద్ది అనేది అహంకారమే.

(4) అహంకారం చేసిన శాస్త్రా లు అహంకారానికే ప్రమాణం.

(5) అహంకారం వుంటే అన్ని యున్నవి.

(6) అహంకారం లేకుంటే అన్ని దానితోనే పోయెను.

(7) అహంకారమే గురువు.

(8) అహంకారమే శిష్యుడు.

(9) అహంకారానికే అన్ని మతాలు.

(10) అహంకారం శరీరం ఒక్కటే.

(11) శరీరంవేరే అన్నది అహంకారమే.

(12) తానువేరే అయితే జంధ్యాలు తానే వేసుకోవలె శరీరానికి యేలవెయ్యవలె?

(13) తానే లింగంకట్టు కోవలె శరీరానకు యేల కట్టవలె?

(14) తానే జపంచేయవలె శరీరం యేల చేస్తుంది?

(15) తానే బొట్టు పెట్టు కోవలె గాని శరీరానకు యేలపెట్టవలె?

అందుకే తాను వేరే శరీరం వేరే అని వాదించేది తత్వవాదం. అదే మాయావాదం.

అందుకే అహంకారం లేనివారు ఈశరీరమందు లేక వున్నారు.

వారే 26 వది అయిన అత్యంత విలక్షణులు.

వారికి దేనితోటి పనిలేదు.


ఆచార్యకటాక్షం లేకపోతే ఈగుర్తెరిగే చిద్రూపమనే అహంకారమే అయివున్నది. అహంకారం లేక పోవాలని అనుకుంటూ
ఉంటుంది.

25 వది అయిన ఎరుక అనే అహంకారమే ఆత్మ. ఇది లేకపోతే సరి.

ఉన్నది (బయలు) శరీరమందు లేక వున్నది.

అన్నది లేక పోయె.

గనుక కావటం లేదు.

25 వది అయిన అహంకారాన్ని సార్వకాలం లేకుండా చేసిన వారే గురువులు.

అహంకారంతో సర్వం లేకపోయె.

ఈ అహంకారం లేకుంటే పరమశాంతి తానే అవును.

ఇది గురు మూలంగా కావలెను.

అహంకారం లేని గురు సాంప్రదాయం కావలెను.

వైథీకం అంటే, వేదాలు సత్యము అని,

నమ్మేమార్గం గనుక అహంకారంతోకూడ కూడుకొని యున్నది. వేదోక్తమార్గం

అహంకారంలేని శైవానకు వైష్ణవానకు

వైథీకం, అహంకారంతోటే పోయెను.

అహంకారం లేకుంటే వేదాలను, వేదోక్తమార్గాలను ఎవ్వరు యెరుగు?

అహంకారంలేని బసవన్నగారికి,నమ్మాళ్వార్ గారికి,స్వామిజియ్యర్ కు,శంకరాచార్యులకు యెందుకు వారికి అహంకారంలేదు


గనుక,

1. రామానుజాచార్యులు బ్రాహ్మణుడు ఐతే, రెడ్డికులం నమ్మాళ్వార్ గారికి దాసుడు ఎందుకాయెను?

2. బ్రాహ్మణుడు శూద్రు నకు శిష్యుడు యెందుకు ఆయెను?

3. వైష్ణవులు బ్రాహ్మణులుకారు, బ్రాహ్మణుడు చెన్నయ్య భక్తు డాయె, గనుక బసవన్నగారు

బ్రాహ్మణుడుకాడు.

4. మనుబ్రహ్మ కమ్మరవాడు గనుక బ్రహ్మ సంబంధులు బ్రాహ్మణులు కారు. సర్వం మనుబ్రహ్మ నిర్మాణమే.

5. మనుబ్రహ్మ కూలివాడు కమ్మరవాడు.

6. వాని తమ్ముడు మయబ్రహ్మ వడ్డివాడు.

7. వాని తమ్ముడు త్వష్టబ్రహ్మ కంచరివాడు.

8. వాని తమ్ముడు శిల్పిబ్రహ్మ కాశీపనివాడు.


వీరే దేవతలకు తండ్రు లు.

వీరే మతోద్ధా రకులు.

9. మతంగమహాముని అరుంధతికి గురువు.

10. శ్యామలాశక్తి తండ్రి వశిష్ఠు డు, వ్యాసుల కంటే దొడ్డవాడు.

పుట్టు బ్రాహ్మలు వేరే, వొడుగుబ్రాహ్మలు వేరే,

మనుబ్రహ్మే సర్వం.

ఈ బ్రహ్మ అనే అహంకారం లేక సర్వకాలం ఒక్కతీరుగా వున్నవారే భ్రాంతి లేనివారు.

ఈ శరీరమందు అహంకారంలేక వున్నవారే భ్రాంతిలేక యున్నవారు.

గురుస్వామి సాంధీపులువంటి వారయితే సర్వకాలం యెరుక లేకుండా చేస్తా రు.

వారే గురువులు.

అనేది వినేది చూచేది మాట్లా డేది భోంచేసేది రుచినెరిగేది అహంకారమే.

అహంకారం ఎరుక ఒక్కటే.

ఎరుకే చిద్రూపం.

ఎరుకే శ్రీ మన్నారయణరూపం.

(మిగతా విచారణ తరువాత)

🙏🌹🍎🌷🙏

Smk Raju, Tpt, (1.1.2020)

0 ఓ 0 🙏🙏🙏0 ఓ 0 (2.1.2020)

బృహద్వాశిష్టంబనుశివరామదీక్షితీయం

గ్రంధమునుండి(సంక్షిప్తంగా)

శ్రీ శివరామదీక్షితులవారి వాక్యములు

(గురువాక్యము ద్వాదశి, షోడశి, పంచదశి తెలిసినవారికి ఈగ్రంథము ఆణిముత్యములు. తెలియని నరులకు రాళ్ళబండలు,
చిల్లపెంకులు, నల్లబొగ్గులు, అట్టముక్కలు)

పూర్వభాగము

అహంకారనిరసన ప్రకరణం (3-2)


(కొనసాగింపు)

(కలలో గురు-శిష్య విచారణ)

శి:- మళ్లీ, కలలో మూలంలేని ఈ గుర్తెరిగేశరీరం మునుపటిదే మరివొకటి వచ్చె? దీనికి మునుపటి దానివలె
మూలంయేమీలేదు.

గు:- ఏది అయితేనేమి? మనకు యేమిభయం?

ఇక కోట్లు కొద్ది వచ్చినా మూలంయేమీలేదు.

శరీరం లేనిది, మొదలూ కొనాలేనిది,

రాకడా పోకడాలేనిది, సకల...దే...యందూ, సమ...వస్తు ...యందూ, చలించక యున్నది.

మూలంలేని ఈ గుర్తెరిగే శరీరం వున్నా ఏమీలేదు, చచ్చినా ఏమీలేదు.

సార్వకాలం ఒక్కతీరె, శరీరంలేక వున్నది.

శి:- సరే! శభాష్ గురువంటే, ఇలాగు వుండవద్దా ? హే గురుస్వామీ! మీరు,

నాకు, మూలంలేని ఈ గుర్తెరిగేశరీరం లేకుండా శరీరంలేకనే స..దే..యందు, సమ...వస్తు ..యందు, చలించక వుండేటట్టు ,
మొదలు కొనాలేక సార్వకాలం వొక్కతీరుగా వుండేటట్టు సూచన చేయండి.

చేస్తే ఈ శరీరాన్ని విడిచి పెడుతా.

గు:- మునుపు కావలెనని కోరితే వచ్చిందె?

శి:- అయ్యా! నేను యెన్నడూ కోరలేదు, నడుమంత్రాన తనకుతానే వచ్చింది.

గు:- విచారిస్తే ఈ గుర్తెరిగే శరీరానకు మూలం యేమీలేదు. ఈ వచ్చిన నేనుకు వున్నకాస్సేపు ఏదోవొకచింత. స్వస్థత లేదు.
శాశ్వతంకాదు.

ఉన్నంతసేపూ వుంది, దరిజేరుదామంటే నాకు వచ్చేటప్పుడు మూలంయేమీలేదు.

నేను బ్రతికివున్నంత సేపూ చచ్చినట్టు పడి వుండవలె. లేని సమయంవస్తే, నేను యేమీలేదు. రెండోది యేమీలేదు.

శి:- అట్లైతే కేవలం అంధకారమా?

గు:- అంధకారమని నీకే యెరుక. నీవు వున్నావు కనుక.

శి:- సరే! నేను యేమీలేదు. ముందర ఏమీలేదు అని చింత.

గు:- నీవే లేవు. నీకేమి చింతా?


శి:- నాకు శాంతి అయ్యేటట్టు , స్వస్థత కుదిరేటట్టు , ఏదైనా దండి ఆసరా దొరికితే గాని భ్రాంతిపోదు.

గు:- అట్లయితే నీకు భ్రాంతివున్నదా? నీవుయేమి? నీకు ఏమికావాలె?

శి:- నేను ఈ మూలంలేని గుర్తెరిగే శరీరమును. ఇటువంటివి అనేక కోట్లు వచ్చినా, వున్నా, ఏమీలేకపోయినా, చలించక వుండేది
కావాలె.

సూచన చెయ్యండి స్వామీ?

గు:- సరే! మంచిమాట. మూలంలేని ఈ గుర్తెరిగేశరీరం యేమీలేదు అని నీకు ధృఢమేకదా?

శి:- కోటి మాటలకు యేమీలేదు. నాకు ధృఢమే. సూచనచేస్తే చాలుస్వామీ?

గు:- సరే! సూచన చేస్తా కనుక్కో? ముందరే వున్నది.

ఇదిగో! ఈ బట్టబయలు, పు...ది చా...ది, మొ...కొ..లేనిది, రా...పో...లేనిది, సకల..దే..యందూ, సమ...వస్తు ...యందూ,


సార్వకా....యందు, చలించక వొక్కతీరుగానే వున్నది.

ఏమీలేని ఈగుర్తెరిగే శరీరమైయున్న నీకు దానికి ఈషత్తు సంబంధంలేదు.

నీజోలి దానికి పట్టదు. దాని జోలి మనకు అవస్యం.

అది జాడ పడుకుంటే మనస్సుకు శాంతి లేదు. గనుక సరేనా?

శి:- ఇక నేను యేమి అడుగ. నా వర్తమానం నాకు తెలుసు. నేను అందులోనే వున్నా.

గు:- దానికి బదులులేదు. మునుపు నాతో చెప్పినట్లు మళ్ళాచెప్పు?

శి:- మూ...ఈ గు...శ...యేమీలేదు.

గు:- పుట్టని చావనిది వున్నదా?

శి:- ఉన్నది. మీధర్మాన దాన్ని కనుక్కొంటి. ఇంకేమిబాధ?

గు:- ఉన్నదానికి శరీరమే లేదు.

ఏమీలేని ఈ గుర్తెరిగేశరీరం యేమీలేదు.

ఇక బాధ ఎవ్వరికి? బాధ లేకపోవడం ఎవ్వరికి?

శభాష్ సరేకాని! ఒక్కదృష్టాంతం చెప్పుమా?

శి:- నిద్రలో వెయ్యి ఏనుగులు వుండి మేల్కొంటే ఏమాయె?


గు:- ఏమీలేదు.

శి:- అలాగే: పు..ది చా..ది, మొ...కొ..లేనిది,

రా..పో..లేనిది, స..దే..యందూ, సమ...వస్తు ...యందూ, సార్వకా...యందు,

చలించక వొక్కతీరుగానే వున్నది.

గు:- సూచన కాగానే యేమీలేదని, ఈ గుర్తెరిగే శరీరం లేకపోయింది.

శి:- శరీరం లేనిదే ఉన్నది.

గు:- శభాష్! మరీ దొడ్డవాడవు.

ఈలాగు వుండవద్దా ?

సరే! సరే! మంచిది.

(మిగతా విచారణ తరువాత)

🙏🌹🍎🌷🙏

Smk Raju, Tpt, (2.1.2020)

0 ఓ 0 🙏🙏🙏0 ఓ 0 (3.1.2020)

బృహద్వాశిష్టంబనుశివరామదీక్షితీయం

గ్రంధమునుండి(సంక్షిప్తంగా)

శ్రీ శివరామదీక్షితులవారి వాక్యములు

(గురువాక్యం ద్వాదశి,షోడశి,పంచదశి తెలిసినవారికి ఈగ్రంథం ఆణిముత్యములు. తెలియని నరులకు రాళ్ళబండలు,


చిల్లపెంకులు, నల్లబొగ్గులు, అట్టముక్కలు)

పూర్వభాగము

అహంకారనిరసన ప్రకరణము (3-3)

(కొనసాగింపు)

(కలలో గురు-శిష్య(రాజు)విచారణ)

రా:- స్వామీ! నానిర్ణయం నాకుతెలుసు.

నాకు తెలియంది యేమయినా వుండెనా శీఘ్రంగా సూచన చెయ్యండి?


గు:- పు...ది చా..ది, మొ...కొ..లేనిది,

రా...పో...లేనిది, స...దే...యందూ,

సమ...వస్తు ...యందూ, సార్వకా...యందు,

చలించక వొక్కతీరుగా వుండేది, వున్నది.

రా: - స్వామీ! ప్రభో! నాకు అటువంటి దానిజాడ ఎవరైనా సూచనజేస్తా రా! అని మహా అపేక్షచేత వున్నాను. అది ఎక్కడ వున్నాదో
శీఘ్రంగా సూచన చెయ్యండయ్యా!

గు:- చేస్తా గాని నీవర్తమానం కొంచెంచెప్పు?

రా:- నాకు మూలం యేమీలేదు. కొనకు స్థా నం యేమీలేదు. నాకునేనే వచ్చి కాసేపువుండి కొనకు శూన్యమైపోతా!

గు:- శూన్యం అంటే!

రా:- యేమీలేదు.

గు:- ఇక నీకు ఏమికావలె?.

రా:- ఈప్రకారంగా పాములు, కొంగలు, గ్రద్దలు, గువ్వపిట్టలు, చిలుకలు, నెమళ్లు , బాతులు, హంసలు, డేగలు, నాలాగా ఏమీలేనిదే
వచ్చి కాసేపువుండి కొనకు శూన్యమాయె.

మీధర్మాన నేను వాటిలా గాకుండా పుట్టని చావనిది వున్నదని వింటిని. విన్నందుకు నాకు సూచన అయితే ఈ దేహభ్రాంతిపోయి,
కొనకు యేమీలేని వాడనౌతా!

గు:- అని, నీకే తెలుసుగదా! మరి ఇప్పుడు నీకేమి కావాలె?

రా:- స్వామీ! ఇటువంటి రాజును అయివుండి ఈలాగు, నేను అన్నిజంతువులతో సమానం కావలెనా? నాకు సావకాశం లేదు.
సూచన చెయ్యండి స్వామీ!

గు: - అట్లయితే నీవు శరీరంలేని దానిలోనే వున్నావు.

రా: - ఏమీ! నేనా! నేనా! సరే! సరే!

దానికి మొదలూలేదు కొనాలేదు సూచన ఆయ. అదేగద స్వామీ!

గు:- ఇంక అదే పుట్టనిది చావనిది.

రా:- సరే! మరియొకటి వున్నదని నేను ఎందుకు అంటాను?

గు:- అదే రాకడా పోకడా లేనిది. ఇంకా దానికి మొదలు కొనాలేదు.


రా:- ఇక మీరు దయచెయ్యండి.

నేను మొద్దు ను అనుకొని మళ్ళా సూచన చేసినారు. మీవంటి వారిని యెవ్వరినీ చూడలేదు.

గు:- సరే! శభాష్ నీవేమి?

రా:- నేను నడమంత్రపువాడ్ని.

మొదలుయేమీలేదు కొనకుయేమీలేదు.

ఎంతగొప్పవాడిని అయితేనేమి కొనకు యేమీలేదు.

గు:- సర్వకాలం ఒక్కతీరుగావున్నది. శరీరంలేనిది లెస్సావిను: సకలదేశాలయందూ, సమస్తమయిన వస్తు వులయందూ, చలించక
ఘట్టిగావున్నది, సరేనా! ఇందుకు అనుమానం ఏమైనా వున్నదా?.

రా:- కోటిమాట్లకు అదే వున్నది.

లేదు లేదు అనిఅన్నా వున్నదేఅది.

గు:- మూలంలేని ఈ గుర్తెరిగేశరీరమే యేమీలేనిది.

రా:- స్వతస్సిద్ధమైన అచలం తనకుతానే వున్నది. ప్రయత్నంచేత సాధ్యంకాదు. ప్రయత్నం జేసేదె యేమీలేదు.

గు:- రాజా! ఈ శరీరం ఎలాగులేదో ఒక్క దృష్టాంతం చెప్పుమా?

రా:- స్వామీ! ఈ కలలో కోటిఏనుగులు వుండె. ఇటు చూడంగానే మాయమాయె. యేమిలేకపాయ.

గు:- యేమీలేదని అందరికీ దృఢమే.

రా:- అయితే, నాకు వారికి ఒకటి యెక్కువ తక్కువ.

గు:- ఏమిటది?

రా:- అయ్యా! నేను మీరు సూచన జేసిన దాన్ని (బయలును) వుండజూచి, మళ్లీ ఈ వున్నశరీరం యేమీలేదని మునుపటి
దృఢంవలెనే దృఢంకద్దు .

గు:- మునుపే వున్నదానికి (నీవు రాక మునుపే వున్న బయలుకు) సంశయంలేదు,దృఢంలేదు. సర్వకాలం ఒక్కతీరే.

(మిగతా విచారణ తరువాత)


🙏🌹🍎🌷🙏

Smk Raju, Tpt. (3.1.20)

0 ఓ 0 🙏🙏🙏0 ఓ 0 (4.1.2020)

బృహద్వాశిష్టంబనుశివరామదీక్షితీయం

గ్రంధమునుండి (సంక్షిప్తంగా)

శ్రీ శివరామదీక్షితులవారి వాక్యములు

(గురువాక్యం ద్వాదశి,షోడశి,పంచదశి తెలిసినవారికి ఈగ్రంథం ఆణిముత్యములు. తెలియని నరులకు రాళ్ళబండలు,


చిల్లపెంకులు, నల్లబొగ్గులు, అట్టముక్కలు)

పూర్వభాగము

అహంకారనిరసన ప్రకరణము (3-4)

(కొనసాగింపు)

గు:- అహంకారం దేహంవలన కలిగినది, సందేహంలేదు. అహంకారం వలననే ఆశాపాశములు సంభవించినవి.

అహంకారం అటు ఇటు తిరగదు. తిరుగుచున్నది అంటే దేహమే తిరుగవలె. దేహంతిరుగక అహంకారం తిరుగుచున్నదా!
అహంకారమునకు కాళ్లు గలవా? అహంకారము సూక్ష్మమైయున్నది. అహంకారమునకు రూపంలేదు,పేరులేదని గ్రంథములలో
వ్రాయుచున్నారు.

అహంకారమే శరీరం.

దానికే అన్ని పేర్లు .

అహంకారము లోపల వెలుపలనిండి సంపూర్ణమై వున్నదని అన్నారు. అహంకారము శరీరముల యందే కనపడుచున్నది గాని
శరీరములేని ఆకాశమందు, వాయువందు, అగ్నియందు,జలమందుభూమియందు, కనపడుటలేదు.

భూతములందు అహంకారములేక

మరి వాటివల్ల కలిగిన శరీరమునకుమాత్రం ఎలాకలిగెను?

ఆ కారణము ఎలాగంటే:

దేహమునకు బాధ గలిగితే యావత్ దేహమునకు బాధ కనబడుటలేదు. ఏలాగనగా దేహములోని భాగములైన గోళ్లకున్నూ
రోమములకున్నూ ఎంతకొట్టినా బాధలేనట్లు ఆలాగుననే దేహములందు అహంకారం కనపడుచున్నది కానీ
మహాభూతములందు కనబడుటలేదు.

ఈ దేహమును నిత్యమని ఎవ్వరూ అనుకొనరు. ఈ అహంకారము పోవుటకే ప్రాణాయామము,యోగములు, మొదలైనవి ఎన్ని


చేసినను వదిలినట్టు కనపడలేదు.
ఈ అహంకారము వదిలినవారే మహాత్ములు.

అహంకారం యోగాదులవల్ల వదలనేరదు. అందరూ దీనినే నమ్మియున్నారు.

వీరు నమ్మినా నమ్మకున్నా అదిఉండదు. అందుకేగదా అమనస్కమని అందురు.

మనసు లేకపోతే అహంకారం లేదుగదా? అందుకు అమనస్కము కావాలెనట. ఇందులకు వాయునిరోధం చేయవలెనట.

అదియునూ బలాత్కారముగా ప్రయాస పడవలెనట.

ఇందులకు ఉదయముననే ఎవ్వరూ చూడనివేళ ఎవరితోనూ మాట్లా డకుండా తనను ఒక్కరు పలకరించకుండా ఒక చోట
ఆసనం వేసుకొని నవరంధ్రములు బిగించి యోగాభ్యాసం చేయవలెనని కొందరు గురూపదేశమును చేయుదురు.

అట్లు చేయుచున్నవేళ వూపిరి ఆడక చనిపోయెనా గురువుకు వచ్చేతిప్పలు

చెప్పశక్యంగాదు. ఇది వెర్రితనముచేత చెయ్యడమేకానీ వాయువు లయమైన వారుగలరా? వాయువు లయమైతే తరువాత లేచి
తిరుగగలరా?

ప్రేతశరీరం తిరిగితేనే ఈ శరీరం తిరుగునుగాని లేకపోతే ఎట్లు తిరుగును? కనుక వాయువు నిరోధంకానేకాదు. కాదంటే
కొట్టవత్తు రు. లేకపోతే తిట్టవత్తు రుగాని, నిజము ఎవ్వరూ విచారించరు.

విచారించితే మనసు లేనివారుగలరా? మనసు లేనివారు ఎవరూలేరు.

మనసు లేనివారు గలరని లెస్సగా వాదించెదరు.

గురువుకైనను మనసు లేకపోలేదు. గురువునకు మనసు లేకపోతే శిష్యుల కేలాగున ఉపదేశం చేయును?

మనసు లేనివాడు చచ్చినవానితో సమానము.

ఇందుకే కదా! లేనిదాన్ని లేదనిఅనక ఉన్నదని బ్రమపెట్టు ట మర్యాదగాదు. గనుక

ఈ అమనస్కమునకు దృష్టములేదు. వాడుక మాత్రము కలదు.

అమనస్కము ఉపకృతి కాదు. అమనస్కము గలదని అంగీకరించిన యెడల అందులకు ఏమీ దృష్టాంతంలేదు.

దృష్టాంతం లేకపోతే అనుభవమున్నూలేదు. అనుభవమని చెప్పినా ఆ మనుష్యునకు ఆకలిదప్పులు వున్నవికదా? ఆకలిదప్పులు


లేకపోతే అప్పుడు అనుభవజ్ఞుడు అని అనుకోవచ్చు.

కానీ అందరివలనే వున్నాడు. అనుభవమన్ననూ ఏమీలేదు.

(మిగతా విచారణ తరువాత)

🙏🌹🍎🌷🙏

Smk Raju, Tpt. (4.1.20 )


0 ఓ 0 🙏🙏🙏0 ఓ 0 (5.1.2020)

బృహద్వాశిష్టంబనుశివరామదీక్షితీయం

గ్రంధమునుండి (సంక్షిప్తంగా)

శ్రీ శివరామదీక్షితులవారి వాక్యములు

(గురువాక్యం ద్వాదశి,షోడశి,పంచదశి తెలిసినవారికి ఈగ్రంథం ఆణిముత్యములు. తెలియని నరులకు రాళ్ళబండలు,


చిల్లపెంకులు, నల్లబొగ్గులు, అట్టముక్కలు)

పూర్వభాగము

అహంకారనిరసన ప్రకరణము (3-5)

(కొనసాగింపు)

గు: - అహంకారము గలవారికే అనుభవం గాని అహంకార రహితులకు అనుభవంగాని, అనుభవం లేకపోవడంగాని లేదు.
అనుభవమని చెప్పేవారు వర్ణ శంకరులు. అహంకారంలేని వారలుకారు. అహంకారం అందరికీ కలదు.

అహంకారము బ్రాహ్మణునికి, రాజుకి,

బట్టు కు, మాలవానికి, మాదిగవానికి, తురకవానికి, దూదేకులవానికి, రంగప్పకు,ఎల్లికి,మల్లికి, గలదు.

ఈ అహంకారమే నరకం.

దీనికి నియమంలేదు, గురిలేదు,

కులంలేదు, గోత్రంలేదు.

ఇది శరీరంవలన కలిగినది.

శరీరం లేకపోతే అహంకారం లేదు. శరీరమునకు మూలం అహంకారం. అహంకారానికి శరీరానికి బేధములేదు.

అహంకారమే జీవుడు.

జీవునికి అహంకారం ఆధారము.

అహమునకు జీవుడు ఆధారము.

అహమే దేహము. దేహమే అహము. అహమునకే కాళ్లు , చేతులు, ముక్కు, చెవులు. అహమునకు పైవి లేవని కొందరు అంటూనే
వుందురు. అదిఎట్లు ?

నా కాళ్లు , నా చేతులు, నా ముక్కు, నానోరు, అని చెప్పుచూ నాకు లేదనడం ఎటువంటిది? తానే ఆలోచించవలెను. తనకు
తోచకుంటే యోగ్యులైన ఇతరుల నడుగవలెను. లేకుంటే అది చెడిపోవును.
గురువు అయోగ్యుడయితే అజ్ఞాన సంబంధమైన కర్మ జన్మల సంబంధమైన కార్యములు శ్రేష్టమని బోధించి అందులో ప్రవేశింప
చేయును. ఇవి అనుభవమునకు కారణమగును. అజ్ఞానమే కారణశరీరము.

అది రహితము కాకనే అనేక నరకములలో ప్రవేశించుటకగును.

శిష్యుడు: - హే గురుస్వామీ! నా ఈ సంశయములను తెలుపుటకు మీరే సమర్థు లు.

శరీరము పోగానే పంచభూతములలో

గలసి జన్మ లేకపోవునని చెప్పుచున్నారుగదా!

తిరిగి జన్మ కలదనడం ఎటువంటిది?

దేహము పోయిన పిమ్మట అహము ఎక్కడ నుండును?

ఎక్కడకు పోవును?

ఎక్కడ కలియును?

ఈ దేహమునకు మూలముయేమి?

దైవమెక్కడున్నాడు? యేరూపువాడు? యేచందము వాడు?

ఏలాగున పొందగలుగును?

గు: - ఓయీ! గురువును చక్కగా విచారించవలెను. గురువు అహంకార రహితుడు కావలెను. అహంకారము లేని గురువు
అందరివలెనే యుండును.

ఆయన సన్యాసిగా ఉండడు.

ఇల్లు , భార్యాబిడ్డలు వున్నా ఆయనకు అహంకారం లేదు.

అది ఏలాగు తెలియునంటే:

1. ఆయనకు కోపము వుండదు.

2. కొట్టినను పలుకడు.

3. తిడితే మరలా తిట్టడు.

4. ఆక్షేపించితే ఆక్షేపించడు.

అయితే గురువులు ఇంకొక తీరుగానూ యుందురు. వారు,

1. ఒకటి కొడితే పది కొట్టు ను.

2. ఒకటి తిట్టితే పదితిట్టు ను.


3. అందరికన్న ఎక్కువగా తిరుగును.

4. ఆశపడును. వారికిన్నీ అహములేదు.

వీరిగుణములు తెలుసుకొనుట కష్టము. మొదటివారు యుక్తి లేనివారు, దుర్మార్గుల వలన బాధలు పొందుదురు.

రెండవవారు యుక్తిగలవారు.

ధుర్మార్గులవలన బాధపడనివారు.

యద్భావం తద్భవతి అని ప్రమాణవాక్యం కలదు. సన్మార్గులకు సన్మారగులవలనే వుండవలెను. దుర్మార్గులకు దుర్మార్గులవలనే
వుండవలెను. సన్మార్గులైననూ దుర్మార్గులైననూ గురువును జేరినవారికే జన్మసాఫల్యముగాని, వేరు మార్గంలేదు.

గురువు కన్ననూ వేరే దైవములేడు.

గురువు ఏ వృత్తి గలవాడైననూ ఆయన విచారణ అపరిమితమై యుండును.

ఆ విచారణను ముముక్షువులు తెలుసుకొందురు.

ఆ ముముక్షువులకు ఎల్లప్పుడూ అదే ఆలోచన అదే దృష్టి, గనుక వారికి తెలియును. ఏలాగంటే:

దొంగలజాడ దొంగలకు,

పాములుజాడ పాములకు, తెలిసినట్టు గా, ఎవరిజాడ వారలకే తెలియును.

ఇందుకు సందేహము లేదు.

(మిగతా విచారణ తరువాత)

🙏🌹🍎🌷🙏

Smk Raju, Tpt. (5.1.20)

0 ఓ 0 🙏🙏🙏0 ఓ 0 (6.1.2020)

బృహద్వాశిష్టంబనుశివరామదీక్షితీయం

గ్రంధమునుండి (సంక్షిప్తంగా)

శ్రీ శివరామదీక్షితులవారి వాక్యములు

(గురువాక్యం ద్వాదశి,షోడశి,పంచదశి తెలిసినవారికి ఈగ్రంథం ఆణిముత్యములు. తెలియని నరులకు రాళ్ళబండలు,


చిల్లపెంకులు, నల్లబొగ్గులు, అట్టముక్కలు)

పూర్వభాగము
అహంకార నిరసన ప్రకరణము (3-6)

(కొనసాగింపు)

గు:- శిష్యుడు గురునకు పండ్రెండు సంవత్సరములు శుశ్రూష చేయవలెను. గురువునకు ప్రదక్షణచేసి సాష్టాంగ నమస్కారము
చేయవలెను.

గురువు భార్యకున్నూ అదేవిధంగా నమస్కారము చేయవలెను.

గురువు ఎంగిలి తినవలెను.

గురువును దైవముగా నెంచవలెను. గురువాజ్ఞకు బద్ధు డై యుండవలెను.

ఆలాగు నడుచుకుంటూ గురూపదేశము త్వరగా కాకపోయేనని తామసపడరాదు. అందువలన సార్ధకములేదు.

గురువునకు అనుగ్రహం కలుగునంతవరకు వేచియుండుట మంచిది. వారికి నరకంలేదు.

శిష్య పాపం గురూరపి అని చెప్పబడి యున్నది. కావున, బద్ధు డైయున్న

శిష్యుని కొరతతీర్చక గురువు చనిపోయెనా

ఆ గురువుకు జన్మము గలదు.

కాని శిష్యునికి జన్మములేదు.

శిష్యునికి జన్మ లేకపోవుట ఏలాగంటే?

అతనికి పరితాపం ఎక్కువ. అది తెలియక పోవుటచేత అట్టి వస్తు వందే యెల్లప్పుడు చింతకలిగి అన్యచింతన
లేకుండాయుండును.

ఆధార భూతుడైన గురువు చనిపోయిన, మరీ విశేషముగా చింత కలిగియుండును.

ఆ చింతకు మితము లేదు. అట్టి అనన్య చింతయే పరమార్థమును పొందించును. గురూపదేశమైతే గాని జననమరణ
రహితముగాదని అనుకోవలసిన పనిలేదు. ఈ సందేహమునకు అవకాశము లేదు.

దేవతాసేవ ఎటువంటిదో గురుసేవ అటువంటిదే గాని అన్యముకాదు. గురువునకు సేవజేసిన వారికి ఎంత మాత్రం జన్మము
లేదు.

గురువు దైవముకన్ననూ మించినవాడు. దైవము మనతో సంభాషించడు.

గురువు మనకు మార్గము దెలుపును. గురువు తెలిపిన మార్గముననే శిష్యుడు నడవనవలెను, నడచిన కడతేరును.

నడవకున్న అపాత్రు డగును.

గురూపదేశమై యున్నవారు తనకు

జన్మసాఫల్యం కాలేదని యెంచకూడదు. నగురోరధికం అని శాస్త్రములయందు కలదు. కావున వానికి జన్మరహితమే
కాగలదు.
ఉన్నయూరిలో గురువును కొలిచేవాడు అందరికన్ననూ అతిశయుడు.

అయితే అట్లు కొలిచే క్రమములో స్వధర్మమునకు హానిలేకుండా అనగా తల్లిదండ్రు లకు భార్యాబిడ్డలకు విరోధి

గాకుండా జరుపుకొన వలెను.

కర్మ విడువకూడదు. ఎప్పుడైతే, కర్మవిడుచునో అప్పుడు కులత్యాగమే యగును.

దానివలన మోక్షము కలుగనేరదు. గనుక కర్మమును చేసికొని సంసారము దిద్దు కొని గురువుని కనుక్కొని సత్కాలక్షేపములతో
ప్రవర్తించవలెను.

ఆగురువు చెప్పినమాటలు వినవలెను. తన శక్తికొలది ఉపకరించుచుండవలెను. గురువుభార్య గయ్యాళిదైనను మాతృ


భావముగలిగి చక్కగా పూజించవలెను.

తనఇంట శుభకార్యములు జరుగునప్పుడు

ఆ గురుప్రార్థనచేసి నూతనవస్త్రములు యిచ్చి వారిని సంతోష పెట్టవలెను.

తనభార్యను కూడా గురుపూజాది కార్యక్రమములలో ఆమెకు ఇష్టంలేకున్నా నచ్చజెప్పి పాల్గొనేటట్లు చేయవలెను.

వినకపోయెనా తనకర్మకు వదిలివేయవలెను.

అందులకు ఆమెకే నరకముగాని ఇతనికి నరకములేదు.

(మిగతా విచారణ తరువాత)

🙏🌹🍎🌷🙏

Smk Raju, Tpt. (6.1.20)

You might also like