You are on page 1of 3

Dear Students

ఈ covid - 19 pandemic వలన లాక్ డౌన్ ప్రా రంభం నుండి ప్రపంచ దేశాలలో
ప్రజారోగ్యంతో పాటుగా మరొక అంశం parellel గా ప్రా ధాన్యతా అంశంగా చర్చించబడుతూ ఉంది. అది
ఆర్ధి క సంక్షో భం ( Recession ).

ఈ ఆర్ధి క సంక్షో భం అనేది స్థూ ల ఆర్థి క శాస్త్రానికి సంబంధించినది.

నేషనల్ బ్యూరో అఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ( NBER ) - "వరుసగా రెండు త్రైమాసికాలలో వాస్తవ
స్థూ ల దేశీయోత్పత్తి తగ్గి నప్పుడు " దేశంలో ఆర్ధి క సంక్షో భం ఉన్నట్లు నిర్ణయిస్తా రు

వాస్తవిక దేశీయోత్పత్తి తగ్గడం , వాస్తవిక ఆదాయం తగ్గడం , పారిశ్రా మిక ఉత్పత్తి తగ్గడం , నిరుద్యోగం
పెరగడం మొదలై న అంశాలు మనకు దేశంలో సంక్షో భాన్ని తెలుపుతాయి.

ఐతే కొన్ని అసాధారణ పరిస్థి తులలో నెలసరి గణాంకాలను బట్టి సంక్షో భాన్ని నిర్ణయించవచ్చు.
ప్రస్తు తం మనం ఈ అసాధారణ పరిస్థి తిని ఎదుర్కోవాలనే భయంతోనే ఉన్నాము.

మనకు తెలుసు. ఆర్ధి క కార్యకలాపాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.ఉదాహరణకు


ప్రస్తు త సందర్భాన్ని తీసుకుంటే

దేశంలో (చాలా దేశాలలో ) లాక్ డౌన్ కారణంగా వస్తు సేవల కొనుగోలు తగ్గి ంది. మరొక వై పు ఉత్పత్తి
ప్రక్రి య చాలావరకు ఆగిపోయింది.
కొనుగోలు

ఆదాయాలు డిమాండ్

ఉద్యోగిత ధరలు

ఉత్పత్తి లాభాలు

పెట్టు బడులు

ఈవిధంగా అన్ని ఆర్థి క కార్యకలాపాలు దెబ్బ తింటాయి. ఈ పరిస్థి తి ఒక ప్రా ంతంతోనో ,


ఒకరంగంతోనో , ఒకదేశంతోనో ఆగదు. ప్రపంచీకరణ ప్రభావం వలన అన్ని దేశాలకు విస్తరిస్తు ంది.
ప్రస్తు త పరిస్థి తి మరింత దారుణం. ప్రతీ దేశంలోనూ ప్రత్యక్షంగా ఉత్పత్తి మందగించడం ఒకవై పు
భయపెడుతుంటే, పరస్పరం ఆధారపడి ఉన్న ఆర్ధి క వ్యవస్థల వలన సంక్షో భం యొక్క విస్తరణ
ప్రభావం మరొక వై పు భయపెడుతుంది.

ఆర్ధి క ఒడిదుడుకులు సాధారణమే అనీ, నిరంతరం వాటిని ఎదుర్కొనే విధంగా ప్రభుత్వాలు


ఆర్ధి క విధాన రూపకల్పన చేసుకుంటూ ఉండాలని మనం వ్యాపార చక్రా లు అనే
పాఠంలోచదువుకుంటాం. ఈ ఒడిదుడుకులను సరి చేయడానికే దేశంలో ద్రవ్య మరియు కోశ
విధానాలు పని చేస్తా యి.

 బ్యాంకు రేటు , నగదు నిల్వల నిష్పత్తి , స్టా ట్యూటరీ లిక్విడిటీ రేషియో, రేపో రేటు , రీ రేపో
రేటు , ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, మార్జి నల్ స్టా ండింగ్ ఫెసిలిటీ, మార్కెట్ స్టె బిలై జేషన్
స్కీం మొదలై న వాటిని ద్రవ్య సాధనాలు గానూ ;
 ప్రభుత్వ వ్యయంలో మార్పులు , పన్ను రేట్లలో మార్పులు మొదలై న వాటిని కోశ
సాధనాలుగానూ ఉపయోగించి ఆర్థి క స్థి రత్వము కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది
ఐతే వీటి నుండి ఫలితం పొందడానికి కొంత సమయం పడుతుంది.

ప్రస్తు త పరిస్థి తిలో తక్కువ సమయంలో ఆర్ధి క కార్యకలాపాన్ని పెంచే సాధనాలు అవసరమని భావించి
హెలికాప్టర్ మనీ ని ఫ్రే మ్ లోకి తీసుకు వస్తు న్నారు.

కేంద్ర బ్యాంకు కొత్త ద్రవ్యాన్ని ముద్రి ంచి ప్రజలకు ప్రత్యక్షంగా పంపిణీ చేసేది హెలికాప్టర్ మనీ. అంటే
ఎటువంటి ఆర్ధి క కార్య కలాపములో పాల్గొ నకుండా ప్రజలకు డబ్బును పంపిణీ చేయడం. ఇలా వచ్చిన
డబ్బును ప్రజలు వివిధ వస్తు , సేవలపై ఖర్చు పెడతారు కనుక డిమాండ్ పెరిగి ఉత్పత్తి కి ఊతం
వస్తు ందని అంచనా. ఉత్పత్తి పెరిగితే ఉద్యోగిత పెరగడం , ఆదాయాలు పెరగడం , వినియోగం
పెరగడం , పొదుపు పెరగడం .... అలా ఆర్ధి క వ్యవస్థ పుంజుకుంటుంది.

హెలికాప్టర్ మనీ తో పాటు తెర పై కి వచ్చిన మరొక భావన క్వాంటిటేటివ్ ఈసింగ్. దీనిని మనము పై న
చెప్పుకున్న ద్రవ్య సాధనాలకు పర్యాయ పదము గా చెప్పుకోవచ్చు.

ప్రస్తు తం దేశంలో సంక్షో భ పరిస్థి తిని, దాని ప్రభావాన్ని అంచనా వేసి తగిన పరిష్కారాలను
నిర్ణయించడానికి ఇంకొంత సమయం పడుతుంది. let us see.

గమనిక

తెలుసుకునే సమయము, సందర్భము వచ్చాయి కనుక వీటిని గురించి పూర్తి గా తెలుసుకోవడానికి,


అర్ధం చేసుకోవడానికి , విశ్లే షించడానికి ప్రయత్నం చేయండి.

Good Luck.

You might also like