You are on page 1of 4

మా

యాబజార్ (1957) , EPIC FANTASY DRAMA , 03 :01 Min దర్శకత్వం

: కె.వి.రెడ్డి

నిర్మాణం : నాగిరెడ్డి & చక్రపాణి

రచన : పింగళి నాగేంద్రరావు

తారాగణం : నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ,

ఎస్.వి.రంగారావు , గుమ్మడి వెంకటేశ్వరరావు,

సంగీతం : ఘంటసాల వెంకటేశ్వరరావు , సాలూరు రాజేశ్వరరావు

గీతరచన : పింగళి నాగేంద్రరావు


పెట్టు బడి : ₹ 33 లక్షలు

వసూళ్లు : ₹ 80 లక్షలు
CASTING

కృష్ణు డు గా నందమూరి తారక రామారావు

అభిమన్యుడు గా అక్కినేని నాగేశ్వరరావు

శశిరేఖ (బలరాముని కుమార్తె) గా సావిత్రి

ఘటోత్కచుడు గా ఎస్.వి.రంగారావు

లక్ష్మణ కుమారుడు గా రేలంగి

బలరాముడు గా గుమ్మడి వెంకటేశ్వరరావు

దుర్యోధనుడు గా ముక్కామల

శకుని గా సి.ఎస్.ఆర్. ఆంజనేయులు

రేవతీ దేవి (బలరాముని భార్య) గా ఛాయా దేవి

సుభద్ర గా ఋష్యేంద్రమణి

రుక్మిణి గా సంధ్య

సాత్యకి గా నాగభూషణం

కర్ణు డు గా మిక్కిలినేని

దుశ్శాసనుడు గా ఆర్.నాగేశ్వరరావు

చినమయ గా రమణారెడ్డి

తానాశర్మ గా అల్లు రామలింగయ్య

హిడింబి గా సూర్యకాంతం

PLOT :
బలరామ (గుమ్మడి వెంకటేశ్వరరావు) కృష్ణు ల (ఎన్.టి.రామారావు) చెల్లెలు, పాండవుల్లో

ఒకడైన అర్జు నుడి భార్య సుభద్ర (ఋష్యేంద్రమణి) తన కొడుకు అభిమన్యుడితో పాటుగా పుట్టిల్లు అయిన ద్వారక వస్తు ంది.

బావా మరదళ్ళైన అభిమన్యుడు, శశిరేఖ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఆప్యాయంగా మసులుకొంటూంటారు. బల


పరాక్రమాల్లో పాండవుల వారసునిగా నిరూపించుకుంటూన్న అభిమన్యుడిపై ముచ్చటపడిన సందర్భంలో కృష్ణు డి

ప్రో ద్బలంతో సుభద్ర అన్నగారు బలరాముడిని వరం కోరుకుని తన కుమారుడు అభిమన్యునికి, శశిరేఖను ఇచ్చి పెళ్ళి చేసే

విషయంలో మాట తీసుకుంటుంది. ఆపైన సుభద్ర, అభిమన్యుడు ఇంద్రప్రస్థా నికి తరలి వెళ్ళిపో తారు.

ఇంద్రపస
్ర ్థ ంలో వైభవోపేతంగా జరిగిన రాజసూయ యాగంలో అగ్రతాంబూలం అందుకుని వెనుదిరిగి వచ్చిన కృష్ణు డు, తోడు

వెళ్ళిన సాత్యకి ధర్మరాజు పంపిన సత్యపీఠాన్ని బలరాముడికి, అభిమన్యుడు పంపిన ప్రియదర్శినిని శశిరేఖ (సావిత్రి)కి

ఇస్తా డు. అప్పటికి పెరిగి పెద్దదైన శశిరేఖకు ఎవరి ప్రియవస్తు వు వారికి కనిపించే ప్రియదర్శిని పేటికలో తన

ప్రియుడైన అభిమన్యుడు (అక్కినేని నాగేశ్వరరావు) కనిపిస్తా డు.

రాజసూయ యాగంలో పాండవుల వైభవాన్ని, తనకు జరిగిన పరాభవాన్ని తలుచుకుని అసూయచెందే

దుర్యోధనుడి(ముక్కామల)కి శకుని (సి.యస్.ఆర్. ఆంజనేయులు) తన పాచికల విద్య ప్రదర్శించి, జూదంలో పాండవులను

ఓడిద్దా మని సలహా ఇస్తా డు. మాయా జూదంలో పాండవులు రాజ్యాన్ని, సంపదనీ, తమనీ, చివరికి ద్రౌ పదిని కూడా ఒడ్డి

ఓడిపో యి ద్రౌ పదికి తీవ్ర అవమానం జరుగుతుంది. ఆపైన రాజ్యం కోల్పోయి 12 ఏళ్ళ వనవాసానికి వెళ్తా రు. రాజ్యసంపదలు

కోల్పోయి సుభద్ర అభిమన్యుడితో సహా తన పుట్టిల్లు - ద్వారక తిరిగి వస్తు ంది.

దానికి ముందే కృష్ణు డి ద్వారా ఈ వివరాలు తెలిసిన బలరాముడు హస్తినాపురం వెళ్ళి కౌరవులను మందలించి, పాండవుల

రాజ్యాన్ని వారికి ఇప్పిస్తా నని ఆగ్రహావేశాలతో బయలుదేరుతాడు. బలరాముని మనస్త త్వం తెలిసిన శకుని - దుర్యోధనుడు,

దుశ్శాసనుడు (ఆర్.నాగేశ్వరరావు), కర్ణు ల(మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి)తో సహా ఆయనను అతిగా ముఖస్తు తి చేసి,

పాండవులు బలరాముని అవమానిస్తూ మాట్లా డారని కల్పించి తమ విజయం ధర్మ ద్యూతంలో జరిగిన విజయమేనని

నమ్మిస్తా రు. అంతేకాక రానున్న రాజకీయ స్థితిగతుల్లో యాదవులను, కృష్ణు ణ్ణి తమవైపు తిప్పుకుందుకు పన్నాగం వేస్తా డు.

దాని ప్రకారం దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణ కుమారుడు (రేలంగి) తనకు శశిరేఖను ఇచ్చి వివాహం చేయమని వరం

కోరుకుంటాడు, అప్పటికే పొ ంగిపో యివున్న బలరాముడు అంగీకరిస్తా డు.

పాండవుల రాజ్య సంపదలు పరుల పాలయ్యాయని, శశిరేఖ ఏ వైభవం లేకుండా ఉండాల్సి వస్తు ందని భయపడుతున్న రేవతి

(ఛాయాదేవి) ఈ వార్త తో సంతోషిస్తు ంది. తన కూతురు శశిరేఖ, బావ అభిమన్యుడితో తిరగకుండా కట్ట డి చేయడం

ప్రా రంభిస్తు ంది, వీరి కన్నుగప్పి శశిరేఖ అభిమన్యుడు విహరిస్తూ నే ఉంటారు. చివరకు అందరి నడుమ శశిరేఖను దుర్యోధన

చక్రవర్తి కుమారుడు లక్ష్మణ కుమారునికి ఇచ్చి వివాహం చేసేందుకు వాగ్దా నం చేసినట్టు బలరాముడు, రేవతి అంగీకరిస్తా రు.

దీన్ని శశిరేఖ, సుభద్ర, అభిమన్యుడు ప్రతిఘటిస్తా రు. కానీ కృష్ణు డు మాత్రం అప్పటికి తాను అన్నగారి పక్షమే అయినట్టు

కనిపిస్తా డు. వాగ్వాదం జరిగి సుభద్ర, అభిమన్యులు దారుకుని రథంపై ద్వారక విడిచి వెళ్ళిపో తారు. అయితే కృష్ణు డు

రహస్యంగా దారుకునికి వీరిద్దరినీ అడవిలోని ఘటోత్కచుని ఆశ్రమానికి తీసుకుపొ మ్మని ఉపదేశిస్తా డు.

ఘటోత్కచుడు (ఎస్.వి. రంగారావు) రాక్షస వంశీకురాలైన హిడింబి (సూర్యకాంతం), పాండవుల్లో రెండవ వాడైన భీమసేనుల


కుమారుడు. అతను అడవిలో ఆశ్రమం నిర్మించుకుని, తన అనుయాయులకు నాయకత్వం వహిస్తూ , పాండవులకు

అవమానాలు చేసిన కౌరవులపై ద్వేషం పెంచుకుని జీవిస్తూ ంటాడు. అతని ఆశ్రమం సమీపంలోకి అభిమన్యుడు, సుభద్ర ఉన్న

రథం రాగానే ఎవరో నరులు అనుకుని వెంటనే తన రాక్షస వీరుల్ని పంపి చిత్తు చేయబో తాడు. తర్వాత స్వయంగా తానే వీరిని

ఎదుర్కొన్నా, ఆమె తన బాబాయి అర్జు నుడి భార్య సుభద్రా దేవి అన్న సంగతి తెలుసుకుని సగౌరవంగా తీసుకువెళ్తా డు.

వారిద్దరికీ అతిథి సత్కారాలు జరిపించాకా, సుభద్రకు జరిగిన అవమానాన్ని తెలుసుకుని శశిరేఖను తీసుకువచ్చేందుకు

ద్వారకకు బయలుదేరుతాడు.

అర్థ రాత్రి ద్వారకకు చేరుకుని అక్కడ శశిరేఖ ఎవరో తెలియక కళవళపడి, చివరకు మాయావేషంలోని కృష్ణు డిని

కలుసుకుంటాడు. కృష్ణు డు నిజరూపంలో కనిపించి అతనికి ఉపాయం ఉపదేశిస్తా డు. కృష్ణు డు చెప్పినదాని ప్రకారం

నిద్రిస్తు న్న శశిరేఖను తన ఆశ్రమానికి తీసుకువెళ్తా డు, తానే మాయా శశిరేఖ(సావిత్రి)గా రూపం ధరించి వచ్చి ద్వారకలో

ఆమె శయ్యపై నిద్రిస్తా డు. అలానే తన అనుచరుడైన చిన్నమయ్య, లంబు, జంబులను తీసుకువచ్చి కౌరవులకు ఓ మాయా

నగరాన్ని విడిదిగా సృష్టించమని సూచిస్తా డు. తమ తరఫున కురువృద్ధు లకు అనారోగ్యంగా ఉందని వంకలు చెప్పి దుర్యోధన,

దుశ్శాసన, కర్ణ , శకునులతో పాటుగా వందమంది తమ్ములతో, భార్య భానుమతితో లక్ష్మణ కుమారుని వివాహానికి

తరలివస్తా రు. ముందుగా పెళ్ళికూతురుని చూడాలని పిలిపించిన లక్ష్మణ కుమారుని ఆటపట్టించి, శకునినీ, భానుమతీ దేవినీ

అల్ల రిపెడుతుంది మాయా శశిరేఖ.

పెళ్ళికొడుకు తరఫున వచ్చిన శర్మ, శాస్త్రి, సారధి వంటివారిని కనికట్టు చేసి, మాయ చేసి బాధలు పెడతారు చిన్నమయ్య,

లంబు, జంబు. మాయా శశిరేఖ రూపం విడిచిపెట్టి ఘటోత్కచుడు పెళ్ళి భోజనం అంతా ఒక్కడే తినేస్తా డు, తిన్న భోజనం

లేదనుకునేలోపు మళ్ళా సృష్టిస్తా డు చిన్నమయ్య. కౌరవులు, హస్తినాపురి జనాలు మాయాబజారులో రకరకాల వస్తు వులు

తీసుకుంటారు.

ద్వారకలో మాయా శశిరేఖ, లక్ష్మణ కుమారుడితో పెళ్ళి వేడుకల్లో కాలు తొక్కేప్పుడు, చేయి పట్టు కునేప్పుడు మోటుగా చేసి

బాధలు పెడుతుంది. అంతేకాక పీటల మీద జీలకర్రా బెల్లం పెట్టా ల్సిన సమయానికి, తాళి కట్టే వేళకు కోతిలా,

కొండముచ్చులా, దెయ్యంలా కనిపించి జడిపిస్తు ంది. కౌరవులకు, యాదవులకు వాగ్వాదం ప్రా రంభమై, చివరకు సత్యపీఠాన్ని

తెప్పించి దానిపై నించోబెట్టగానే దాని ప్రభావంతో శకుని తాము చేసిన అకృత్యాలు, ఈ పెళ్ళి విషయంలో చేసిన పన్నాగాలు

బయటపెడతాడు. అంతటితో ఆ వివాహం రసాభాసగా ముగియడంతో, ఘటోత్కచుడు నిజరూపం ధరించి కౌరవులు ధరించిన

మాయాబజార్ వస్తు వులన్నీ పాములైపో గా, తన మాయతో దుష్ట చతుష్ట యాన్ని కట్ట కట్టి హస్తినాపురికి పంపిస్తా డు.

మరోపక్క ఘటోత్కచుని ఆశ్రమంలో శశిరేఖకు, అభిమన్యుడికి సలక్షణంగా వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి

బలరాముడు, రేవతీదేవి, కృష్ణు డు, రుక్మిణీ, ఘటోత్కచుడు తదితరులు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదిస్తా రు.

You might also like