You are on page 1of 1

దో మలను ఇలా తరిమివేయవచ్చు

వర్షా కాలంలో బయటకు వెళితే జలుబు చేస్తు ంది. ఇంట్లో ఉంటే దో మలు కుడతాయి. ఈ కాలంలో దో మలు మరీ
ఎక్కువ అయిపో యి రెచ్చిపో తుంటాయి. వీటి నుండి రక్షించబడటానికి ఎన్నో మార్గా లు వెతుకుతూ ఉంటాము.
దో మలకైతే రీపెల్లెంట్‌లను, బొ ద్దింకల వంటి పురుగులకైతే హిట్‌ లాంటి స్ప్రేలను, ఎలుకలకైతే మందును
వాడుతాం. ఈ ఖర్చేమి లేకుండా ఒక లిక్విడ్ తో వీటన్నిటిని తరిమివేయచ్చు. ఆ లిక్విడ్ ని మనమే ఇంట్లో చాలా
ఈజీ గా చేసుకోవచ్చు. అదెలా అంటే…
పుదీనా… ఇది మన వంటకాలలో కొంచెం వేసినా కూడా మంచి వాసన వస్తు ంది. ఆవాసనకి మనకి
ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తు ంది. మరి ఇదే పుదీనాకి మన ఇంట్లో ఉన్న క్రిమికీటకాలన్ని పారిపో తాయి.
పుదీనాలో ఎన్నో ఔషద గుణాలున్నాయి. నిమ్మ లేక నారింజ తొక్కలను, కొన్ని పుదీనా ఆకులను కలిపి ఒక
గిన్నెలో వేస,ి అందులో కొన్ని నీళ్ళు పో సి మరగనివ్వాలి. బాగా మరిగిన తరవాత స్ట వ్ ఆపేసి ఆ నీటిని రాత్రంతా
అలాగే ఉండనివ్వాలి. ఉదయం ఆ మిశ్రమాన్ని వడగట్టి, ఆ నీటిలో రబ్బింగ్‌ ఆల్కహాల్‌ (దీన్ని సర్జికల్‌ స్పిరిట్‌ అని
కూడా పిలుస్తా రు, మార్కెట్‌లో ఇది మనకు లభిస్తు ంది)ను సమాన భాగంతో కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే
బాటిల్‌లో వేసుకుని ఇంటిలో క్రిమికీటకాలు తిరిగే చోట స్ప్రే చేస్తే దో మలు, పురుగులు, ఎలుకలు
మాయమైపో తాయి.

You might also like