You are on page 1of 20

ఆధ్యాయం-3

రెవెన్యూ విభాగము - పన్నులు

పురపాలక సంఘాలకు ఆస్తి పన్ను(భవనము & ఖాళీ స్తలము పన్ను) ప్రధాన ఆదాయ వనరు

ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘ చట్టం, 1965 లోని సెక్షన్ 85 : పన్ను విధింపు

పురపాలక సంఘం పరిధిలో గల ఇండ్లకు మరియు స్థలములకు సాలుసరి అద్దె

విలువ పై ఎంత రేటు తో ఆస్తి పన్ను విధించ వలెనో కౌన్సిలు వారు తీర్మానం చేయుదురు.

 నివాస గృహములకు సంవత్సర అద్దె విలువలో 25 శాతము మరియు

 నివాసేతర గృహములకు సంవత్సర అద్దె విలువలో 33 శాతం

మించకుండా ఏడాది పన్నువిధించబడును. ఆస్తిపన్నును విద్యా పన్ను, లైబ్రరీ సెస్ తో

కలిపి విధించబడును.

ఆస్తి పన్ను లో ఈ క్రింది వివరించిన భాగాలు ఉందును.

 సాధారణ ప్రయోజనముల నిమిత్తమై విధించ బడు పన్ను

 నీరు మరియు డ్రైనేజీ పన్ను

 స్కావెంజింగ్ పన్ను

 లైటింగ్ పన్ను

ఆస్తి పన్నులను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సమగ్రంగా పునరీక్షించబడును. ప్రభుత్వ

ఆదేశాలతో అట్టి ఐదు సంవత్సరముల మధ్య కాలంలో పునరీక్షించుటకు ఆదేశించవచ్చును.

కమిషనరు పునరీక్షించణ కాలము మధ్యలో ఏదేని ఆస్తి చేర్చుట లేక తొలగించుట ద్వారా

ఆస్తి పన్నును మార్పు చేయవచ్చును. అట్టి ఆస్తిపన్ను ఏదేని అర్ధ సంవత్సరంలో చేయనో ఆ అర్ధ

సంవత్సరం మొదటి తేదీ నుండి అమలులోకి వచ్చును.

ఆస్తి పన్ను విధింపు విధానము:-

Page | 1
ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘ చట్టం, 1965 లోని సెక్షన్ 87 మరియు ఆస్తి పన్ను
నిర్ధా రణ రూల్స్, 1990 ప్రకారము విధించబడును

1. పురపాలక సంఘములను / నగర పాలక సంస్థలను జోన్లు గా విభజించబడి ఉండును.

2. ఆస్తిపన్ను విధించుటకు గాను ఇంటి నిర్మాణ స్వభావం, వినియోగ స్వభావం,

వయోపరిమితి ప్రాతిపదికగా తీసుకొనబడును.

అందులోని రకాలు:-

వ.నెo ఇంటి నిర్మాణ స్వభావం వినియోగ స్వభావము


.
1 ఆర్ సి సి పోష్ (విలువైన) భవనం నివాసము
2 ఆర్ సి సి సాధారణ భవనం షాపులు /షాపింగ్ కాంప్లెక్స్
3 మద్రాస్ టెర్రస్ ఆఫీసులు, బ్యాంకులు
4 మంగళూరు పెంకు, ఆస్బెస్టా స్, ఆస్పత్రు లు, నర్సింగ్ హోంలు
జిఐ షీటు
5 దేశవాళీ పెంకు విద్యా సంస్థలు
6 పూరి పాకలు హోటళ్లు , లాడ్జీలు, రెస్టా రెంట్లు
7 గోదౌన్లు , ఇతర వ్యాపార సంస్థలు
8 పరిశ్రమలు
9 సినిమా థియేటర్లు
10 ఇతరములు (కమ్యూనిటీ హాల్స్,
కళ్యాణ మండపాలు, తదితరములు)

పై వివరములను బట్టి పట్టణంలో ఆస్తు లు 60 కేటగిరీలుగా కలిగి ఉండును. ఆస్తి

ఉన్న ప్రాంతం యొక్క జోన్ బట్టి నెలసరి అద్దె ప్రాతిపదికన ఆస్తిపన్ను విధింపబడును.

ఆస్తి పన్ను మదింపు లో ఇచ్చు రిబేటు ( వయోపరిమితి ఆధారంగా):-

Page | 2
1. 0 నుండి 25 సంవత్సరాల లోపు భవనములకు : 10% భవన వార్షిక అద్దె

విలువలో

2. 25 సంవత్సరముల నుండి 40 సంవత్సరముల లోపు : 20% భవన వార్షిక అద్దె

విలువలో

3. 40 సంవత్సరాల పైబడి : 30% భవన వార్షిక అద్దె

విలువలో

4. యజమాని సొంత నివాసమునకు : 40% వయోపరిమితితో

సంబంధం

లేకుండా

5. సముద్ర తీర ప్రాంతాలలో నోటిఫై చేయబడిన పట్టణములకు : 5% అదనంగా

(ఆక్ట్ 15 ఆఫ్ 2013): భవన అనుమతిని అతిక్రమించి నిర్మించిన లేదా

అనుమతి లేని భవనములపై ఆస్తిపన్నుతోపాటు అపరాధ రుసుము వసూలు చేయబడును.

1 భవన అనుమతి యెక్క విస్తీర్ణమును అతిక్రమించి ఆస్తి పన్ను పై 25%


.
అదనముగా 0 నుండి 10 శాతం విస్తీర్ణం నిర్మించినచో అపరాద రుసుము
2 భవన అనుమతి యెక్క విస్తీర్ణమును అతిక్రమించి ఆస్తి పన్ను పై 50%
అదనముగా 10 శాతం విస్తీర్ణం పైబడి నిర్మించినచో అపరాద రుసుము
3 అనధికార అంతస్తు లకు లేక అనధికార భవనములకు 100% అపరాద రుసుము

నివాస భవనముల ఆస్థి పన్ను లెక్కించు విధానము:-

ఎ) యజమాని నివాస గృహాలు

వ.నం వివరము విలువలు


1 భవన ప్లింత్ ఏరియా 100 చ.మీ (పొడపు * వెడల్పు)
2 చ.మీ కు నోటిఫై చేయబడిన నెలసరి రూ 10/-
అద్దె విలువ

Page | 3
నెలసరి అద్దె విలువ ( 1*2) రూ 1000/-
3
4 సాలుసరి అద్దె విలువ (3*12 నెలలు) రూ 12000/-
5 స్థలమునకు కేటాయించిన సాలుసరి అద్దె రూ 4000/-
(సాలుసరి అద్దె విలువ లో 1/3
వంతు) :
6 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె రూ 8000/-
(సాలుసరి అద్దె విలువ లో 2/3
వంతు) :
7 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె =(8000 *40) /100
=3200/-
విలువలో తరుగుదల (40 శాతం)
8 ఇంటి నికర సాలుసరి అద్దె విలువ రూ 8000 -3200
=4800/-
9 భవననికర సాలుసరి అద్దె విలువ రూ 4000 + 4800 =
( 5+ 8) 8800/-
10 నికర సాలుసరి అద్దె పై ఆస్తి పన్ను రేటు 25 శాతం
(సం.నకు)
11 సంవత్సరమునకు ఆస్తి పన్ను (8800*25)/100 =
2200/-

బి) నివాస గృహాలు : 0 నుండి 25 సంవత్సరాల లోపు భవనములకు.

వ.నం వివరము విలువలు


1 భవన ప్లింత్ ఏరియా 100 చ.మీ (పొడపు * వెడల్పు)
2 చ.మీ కు నోటిఫై చేయబడిన నెలసరి రూ 10/-
అద్దె విలువ
నెలసరి అద్దె విలువ ( 1*2) రూ 1000/-
3
4 సాలుసరి అద్దె విలువ (3*12 నెలలు) రూ 12000/-
5 స్థలమునకు కేటాయించిన సాలుసరి అద్దె రూ 4000/-

Page | 4
(సాలుసరి అద్దె విలువ లో 1/3
వంతు) :
6 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె రూ 8000/-
(సాలుసరి అద్దె విలువ లో 2/3
వంతు) :
7 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె =(8000 *10) /100 =
8800/-
విలువలో తరుగుదల (10 శాతం)
8 ఇంటి నికర సాలుసరి అద్దె విలువ రూ 8000 -800 =7200/-
9 భవననికర సాలుసరి అద్దె విలువ 4000 + 7200 =
11200/-
( 5+8)
10 నికర సాలుసరి అద్దె పై ఆస్తి పన్ను రేటు 25 శాతం
(సం.నకు)
11 సంవత్సరమునకు ఆస్తి పన్ను (11200*25)/100 =
2800/-

సి) నివాస గృహాలు : 25 సంవత్సరముల నుండి 40 సంవత్సరముల లోపు .

వ.నం వివరము విలువలు


1 భవన ప్లింత్ ఏరియా 100 చ.మీ (పొడపు * వెడల్పు)
2 చ.మీ కు నోటిఫై చేయబడిన నెలసరి రూ 10/-
అద్దె విలువ
నెలసరి అద్దె విలువ ( 1*2) రూ 1000/-
3
4 సాలుసరి అద్దె విలువ (3*12) రూ 12000/-
5 స్థలమునకు కేటాయించిన సాలుసరి అద్దె రూ 4000/-
(సాలుసరి అద్దె విలువ లో 1/3
వంతు) :
6 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె రూ 8000/-
(సాలుసరి అద్దె విలువ లో 2/3

Page | 5
వంతు) :
7 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె =(8000 *20) /100
=1600/-
విలువలో తరుగుదల (20 శాతం)
8 ఇంటి నికర సాలుసరి అద్దె విలువ రూ 8000 -1600
=6400/-
9 భవననికర సాలుసరి అద్దె విలువ రూ 4000 + 6400 =
( 5+8) 10400/-
10 నికర సాలుసరి అద్దె పై ఆస్తి పన్ను రేటు 25 శాతం
(సం.నకు)
11 సంవత్సరమునకు ఆస్తి పన్ను (10400*25)/100 =
2600/-

సి) నివాస గృహాలు : 40 సంవత్సరములు పైబడి వయోపరిమితి గలవి:-

వ.నం వివరము విలువలు


1 భవన ప్లింత్ ఏరియా 100 చ.మీ (పొడపు * వెడల్పు)
2 చ.మీ కు నోటిఫై చేయబడిన నెలసరి రూ 10/-
అద్దె విలువ
నెలసరి అద్దె విలువ ( 1*2) రూ 1000/-
3
4 సాలుసరి అద్దె విలువ (3*12 నెలలు) రూ 12000/-
5 స్థలమునకు కేటాయించిన సాలుసరి అద్దె రూ 4000/-
(సాలుసరి అద్దె విలువ లో 1/3
వంతు) :
6 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె రూ 8000/-
(సాలుసరి అద్దె విలువ లో 2/3
వంతు) :
7 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె =(8000 *30) /100
=2400-
విలువలో తరుగుదల (30 శాతం)

Page | 6
8 ఇంటి నికర సాలుసరి అద్దె విలువ రూ 8000 -2400
=5600/-
9 భవననికర సాలుసరి అద్దె విలువ రూ 4000 + 5600 =
( 5+8) 9600/-
10 నికర సాలుసరి అద్దె పై ఆస్తి పన్ను రేటు 25 శాతం
(సం.నకు)
11 సంవత్సరమునకు ఆస్తి పన్ను (9600*25)/100 =
2400/-

ఇ) నివాసేతర గృహాలు: 0 నుండి 25 సంవత్సరాల లోపు భవనములకు.

వ.నం వివరము విలువలు


1 భవన ప్లింత్ ఏరియా 100 చ.మీ (పొడపు * వెడల్పు)
2 చ.మీ కు నోటిఫై చేయబడిన నెలసరి రూ 10/-
అద్దె విలువ
నెలసరి అద్దె విలువ ( 1*2) రూ 1000/-
3
4 సాలుసరి అద్దె విలువ (3*12 నెలలు) రూ 12000/-
5 స్థలమునకు కేటాయించిన సాలుసరి అద్దె రూ 4000/-
(సాలుసరి అద్దె విలువ లో 1/3
వంతు) :
6 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె రూ 8000/-
(సాలుసరి అద్దె విలువ లో 2/3
వంతు) :
7 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె =(8000 *10) /100
=800/-
విలువలో తరుగుదల (10 శాతం)
8 ఇంటి నికర సాలుసరి అద్దె విలువ రూ 8000 -800 =7200/-
9 భవననికర సాలుసరి అద్దె విలువ 4000 + 7200 =
11200/-
( 5+ 8)

Page | 7
10 నికర సాలుసరి అద్దె పై ఆస్తి పన్ను రేటు 33 శాతం
(సం.నకు)
11 సంవత్సరమునకు ఆస్తి పన్ను (11200*33)/100 =
3696/-

ఎఫ్) నివాసేతర గృహాలు : 25 సంవత్సరముల నుండి 40 సంవత్సరముల లోపు.

వ.నం వివరము విలువలు


1 భవన ప్లింత్ ఏరియా 100 చ.మీ (పొడపు * వెడల్పు)
2 చ.మీ కు నోటిఫై చేయబడిన నెలసరి రూ 10/-
అద్దె విలువ
నెలసరి అద్దె విలువ ( 1*2) రూ 1000/-
3
4 సాలుసరి అద్దె విలువ (3*12 నెలలు) రూ 12000/-
5 స్థలమునకు కేటాయించిన సాలుసరి అద్దె రూ 4000/-
(సాలుసరి అద్దె విలువ లో 1/3
వంతు) :
6 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె రూ 8000/-
(సాలుసరి అద్దె విలువ లో 2/3
వంతు) :
7 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె =(8000 *20) /100
=1600/-
విలువలో తరుగుదల (20 శాతం)
8 ఇంటి నికర సాలుసరి అద్దె విలువ రూ 8000 -1600
=6400/-
9 భవననికర సాలుసరి అద్దె విలువ రూ 4000 + 6400 =
( 5+ 8) 10400/-
10 నికర సాలుసరి అద్దె పై ఆస్తి పన్ను రేటు 33 శాతం
(సం.నకు)
11 సంవత్సరమునకు ఆస్తి పన్ను (10400*33)/100 =
3498/-

Page | 8
జి ) నివాసేతర గృహాలు : 40 సంవత్సరములు పైబడి వయోపరిమితి గలవి.

వ.నం వివరము విలువలు


1 భవన ప్లింత్ ఏరియా 100 చ.మీ (పొడపు * వెడల్పు)
2 చ.మీ కు నోటిఫై చేయబడిన నెలసరి రూ 10/-
అద్దె విలువ
నెలసరి అద్దె విలువ ( 1*2) రూ 1000/-
3
4 సాలుసరి అద్దె విలువ (3*12 నెలలు) రూ 12000/-
5 స్థలమునకు కేటాయించిన సాలుసరి అద్దె రూ 4000/-
(సాలుసరి అద్దె విలువ లో 1/3
వంతు) :
6 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె రూ 8000/-
(సాలుసరి అద్దె విలువ లో 2/3
వంతు) :
7 ఇంటికి కేటాయించిన సాలుసరి అద్దె = (8000 *30) /100 =
2400/-
విలువలో తరుగుదల (30 శాతం)
8 ఇంటి నికర సాలుసరి అద్దె విలువ రూ 8000 -2400 =
5600/-
9 భవననికర సాలుసరి అద్దె విలువ రూ 4000 + 5600 =
( 5+8) 9600/-
10 నికర సాలుసరి అద్దె పై ఆస్తి పన్ను రేటు 33 శాతం
(సం.నకు)
11 సంవత్సరమునకు ఆస్తి పన్ను (9600*33)/100 =
3168/-

Page | 9
హెచ్) నివాస మరియు నివాసేతర గృహాలు : 0 నుండి 25 సంవత్సరాల లోపు

భవనములకు.

వ. వివరము నివాస విలువలు నివాసేతర విలువలు


నం
1 భవన ప్లింత్ ఏరియా 100 చ.మీ 100 చ.మీ (పొడపు *
(పొడపు * వెడల్పు) వెడల్పు)
2 చ.మీ కు నోటిఫై రూ 10/- రూ 20/-
చేయబడిన నెలసరి
అద్దె విలువ
నెలసరి అద్దె విలువ రూ 1000/- రూ 2000/-
3
( 1*2)
4 సాలుసరి అద్దె విలువ రూ 12000/- రూ 24000/-
(3*12 నెలలు)
5 స్థలమునకు రూ 4000/- రూ 8000/-
కేటాయించిన సాలుసరి
అద్దె
(సాలుసరి అద్దె విలువ
లో 1/3 వంతు) :
6 ఇంటికి కేటాయించిన రూ 8000/- రూ 16000/-
సాలుసరి అద్దె
(సాలుసరి అద్దె విలువ
లో 2/3 వంతు) :
7 ఇంటికి కేటాయించిన = (8000 =(16000 *10) /
*10) /100 = 100 = 1600/-
సాలుసరి అద్దె విలువలో 800/-

Page | 10
తరుగుదల (10 శాతం (యజమాని) (యజమాని
) /అద్దేధారుడు)
8 ఇంటి నికర సాలుసరి రూ 8000 -800 రూ 16000 -1600
అద్దె విలువ = 7200/- = 14400/-
9 భవన నికర సాలుసరి రూ 4000 + రూ 8000 +
అద్దె విలువ ( 5+8) 7200 = 14400 =
11200/- 22400/-
10 నికర సాలుసరి అద్దె పై 25 శాతం 33 శాతం
ఆస్తి పన్ను రేటు
(సం.నకు)
11 సంవత్సరమునకు ఆస్తి (11200*25)/1 (22400*33)/100
00 = 2800/- = 7392/-
పన్ను

ఐ) నివాస గృహాలు మరియు నివాసేతర భవనములు : 25 సంవత్సరముల నుండి 40

సంవత్సరముల లోపు.

వ. వివరము నివాస విలువలు నివాసేతర విలువలు


నం
1 భవన ప్లింత్ ఏరియా 100 చ.మీ 100 చ.మీ
(పొడపు * వెడల్పు) (పొడపు * వెడల్పు)
2 చ.మీ కు నోటిఫై రూ 10/- రూ 20/-
చేయబడిన నెలసరి
అద్దె విలువ
నెలసరి అద్దె విలువ రూ 1000/- రూ 2000/-
3
( 1*2)
4 సాలుసరి అద్దె విలువ రూ 12000/- రూ 24000/-
(3*12 నెలలు)

Page | 11
5 స్థలమునకు రూ 4000/- రూ 8000/-
కేటాయించిన సాలుసరి
అద్దె
(సాలుసరి అద్దె విలువ
లో 1/3 వంతు) :
6 ఇంటికి కేటాయించిన రూ 8000/- రూ 16000/-
సాలుసరి అద్దె
(సాలుసరి అద్దె విలువ
లో 2/3 వంతు) :
7 ఇంటికి కేటాయించిన = (8000 =(16000 *20)
*20) /100 = /100 =
సాలుసరి అద్దె విలువలో 1600/- 3200/-
తరుగుదల (20 శాతం)
8 ఇంటి నికర సాలుసరి రూ 8000 రూ 16000
అద్దె విలువ -1600 = -3200 =
6400/- 12800/-
9 భవన నికర సాలుసరి రూ 4000 + రూ 8000 +
అద్దె విలువ ( 5+8) 6400 = 12800 =
10400/- 20800/-
10 నికర సాలుసరి అద్దె పై 25 శాతం 33 శాతం
ఆస్తి పన్ను రేటు
(సం.నకు)
11 సంవత్సరమునకు ఆస్తి (10400*25)/1 (20800*33)/1
00 = 2600/- 00 = 6864/-
పన్ను

జె) నివాస గృహాలు మరియు నివాసేతర భవనములు : 40 సంవత్సరములు పైబడి

వయోపరిమితి గలవి

వ. వివరము నివాస విలువలు నివాసేతర విలువలు


నం

Page | 12
1 భవన ప్లింత్ ఏరియా 100 చ.మీ 100 చ.మీ
(పొడపు * వెడల్పు) (పొడపు * వెడల్పు)
2 చ.మీ కు నోటిఫై రూ 10/- రూ 20/-
చేయబడిన నెలసరి
అద్దె విలువ
నెలసరి అద్దె విలువ రూ 1000/- రూ 2000/-
3
( 1*2)
4 సాలుసరి అద్దె విలువ రూ 12000/- రూ 24000/-
(3*12 నెలలు)
5 స్థలమునకు రూ 4000/- రూ 8000/-
కేటాయించిన సాలుసరి
అద్దె
(సాలుసరి అద్దె విలువ
లో 1/3 వంతు) :
6 ఇంటికి కేటాయించిన రూ 8000/- రూ 16000/-
సాలుసరి అద్దె
(సాలుసరి అద్దె విలువ
లో 2/3 వంతు) :
7 ఇంటికి కేటాయించిన = (8000 =(16000 *30)
*30) /100 = /100 =
సాలుసరి అద్దె విలువలో 2400/- 4800/-
తరుగుదల (30 శాతం)
8 ఇంటి నికర సాలుసరి రూ 8000 రూ 16000
అద్దె విలువ -2400 = -4800 =
5600/- 11200/-
9 భవన నికర సాలుసరి రూ 4000 + రూ 8000 +
అద్దె విలువ ( 5+8) 5600 = 11200 =
9600/- 19200/-
10 నికర సాలుసరి అద్దె పై 25 శాతం 33 శాతం
ఆస్తి పన్ను రేటు

Page | 13
(సం.నకు)
11 సంవత్సరమునకు ఆస్తి (9600*25)/10 (19200*33)/1
0 = 2400/- 00 = 6336/-
పన్ను

ఆస్తి పన్ను విధింపు, రివిజన్ పిటిషన్లు మరియు అప్పీళ్ళు:-

 ఏదేని ఆస్తికి మొదటిసారి పన్ను విధించిన లేక ఆస్తికి మార్పులు / చేర్పులు చేయబడిన

ఎడల పన్ను విధింపుకు ప్రత్యేక నోటీసును ఆస్తి యజమానికి గాని / ఆక్రమణదారుని గాని

అందజేయవలెను.

 అట్టి ప్రత్యేక నోటీసు అందజేయబడిన 60 దినములలో ప్రభుత్వము లేదా రైల్వే

అడ్మినిస్ట్రేషన్ లేదా కంపెనీ విషయంలోనూ, ఇతర సందర్భాలలోనూ 30 దినములలోగా

అసెస్మెంట్ పునరీక్షించుటకు, రివిజన్ పిటిషన్ను కమిషనర్ గారికి దాఖలు

చేసుకొనవచ్చును.

 ఎవరేని వ్యక్తి నిర్ధా రించబడిన ఆస్తి పన్ను తగ్గుచున్నదను కారణముపై, ప్రతి అర్థ

సంవత్సరము ముగియుటకు ముందు ౩౦ దినములు తక్కువ కాకుండా పన్ను

పునరీక్షించమని సాధారణ రివిజన్ పిటిషన్ను/ రివిజన్ పిటిషన్ కమిషనర్ గారికి దాఖలు

చేయవచ్చును. కమిషనర్ గారు రివిజన్ పిటిషన్ నందు నిర్ధా రించిన ఆస్థి పన్ను,

సాదారణ రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన తరువాత అర్థ సంవత్సరం నుండి అమలులోకి

వచ్చును.

ప్రతి సందర్భంలో రివిజన్ పిటిషన్ నందు నిర్ధా రించిన ఆస్తిపన్నుకు కమిషనర్

నోటీసు ఇవ్వవలెను. అట్టి నోటీసు అందిన 15 దినములలోగా బకాయి పన్నులు

చెల్లించవలెను.

Page | 14
6. పై విధముగా రివిజన్ పిటీషన్ను పరిష్కరించుటలో జారీ చేయబడిన నోటీసుపై సంతృప్తి

చెందని ఎడల 15 దినములలోగా బకాయిలు చెల్లించి, మరల ఆప్పేలేటు కమీషనర్ గారికి

పన్ను పునరీక్షిo చుటకు పిటిషన్ ను కమీషనరు గారికీ దాఖలు చేయవచ్చును.

ఆస్థి పన్ను వసూలు:-

1 సంవత్సర పన్నును రెండు అర్ధ సంవత్సరముల కింద వసూలు చేయబడును. ఏప్రిల్

నుండి సెప్టెంబర్ వరకు మొదటి అర్ధ సంవత్సరం, అక్టోబర్ నుండి మార్చి వరకు

రెండవ ఆర్ద సంవత్సరము గా లెక్కించబడును.

2 ప్రస్తు తం (ఇ.ఆర్.పి) విధానం లో సమీకృత డిమాండ్ బిల్లు ద్వారా ఇంటిపన్ను, నీటి

చార్జీలు, ఖాళీ స్థలములకు సంవత్సరం

మొత్తంకు బకాయిలతో తయారు అగుచున్నందున. సదరు డిమాండ్ నోటీసులను,

ప్రతి సంవత్సరం మే నెలలోగా భవన యజమానికి గాని, అక్రమణ దారునికి గాని తగు తిరుగు

రసీడుతో అందజేయవలెను.

3 అట్టి డిమాండ్ నోటిసు జారిచేయబడిన 15 దినములలోగా పన్ను చెల్లిన్చనిచో నూటికీ

నెలకి రూ.2/-చొప్పున సామాన్య వడ్డీ రేటుతో అపరాధ రుసుము చార్జి చేయబడును.

4 పై నిబందన ప్రకారము మొదటి అర్థ సంవత్సరానికి జూన్ నెల వరకు, రెండవ అర్థ

సంవత్సరమునకు డిసెంబర్ నెల వరకు ఆ అర్థ సంవత్సరమునకు సంబందించి అపరాధ

రుసుము వసూలు చేయబడదు .

5 ప్రతి ఆర్ధిక సంవత్సరము ప్రారంభమైన ౩౦ రోజులలోగా అనగా ఏప్రియల్, 1 నుండి

ఏప్రియల్, 30 లోపు సంవత్సరమ o పన్ను ఒకేసారి ఏక మొత్తంలో చెల్లించినచో 5%

రాయితీ పన్ను చెల్లింపు దారునికి వర్తింప చేయబడును.

6 ఏదేని ఆస్తికి నిర్ణీత గడువులోగపన్ను చెల్లించని పక్షంలో అట్టి బకాయి పన్ను వసూలుకు

షెడ్యుల్ ll లోని రూల్ నెం. 30 (1) కింద బకాయి చెల్లించనందులకుగాను ఎందులకు

Page | 15
వారెంటు జారిచేయుట ద్వారా ఆస్తిని జప్తు చేయరాదో తెలియజేయకోరుతూ నోటిసు జారీ

చేయవలెను.

7 భవన యజమాని సంతృప్తి కరమైన సమాధానం ఇవ్వని యెడల, పన్ను రాబట్టు టకు

వారెంటు ద్వారా ఆస్థిని జప్తు చేసి దానిని విక్రయించి పన్ను రాబట్టు కోన వచ్చును.

అందులకు అగు ఖర్చు భవన యజమాని నుండి వసూలు చేయవలెను, బకాయి పడ్డ ౩

సంవత్సరాల లోపు మాత్రేమే.

8 ఇంకనూ ఏదేని ఆస్తికి బకాయి పన్నులు వసూలు కాని యెడల బకాయి పడ్డ 6

సంవత్సరాల లోపు కోర్ట్ నందు భవన యజమాని ప్రోసీక్యూట్ చేయ వచ్చును.

9 6 సంవత్సరాలు పై బడిన ఆస్థి పన్ను బకాయిలపై కోర్టు లో సివిల్ దావా వేసి పన్ను

వసూలుకు చర్యలు తీసుకొనవలెను.

109 సంవత్సరములు పై బడిన బకాయిలు కాలదోషము పట్టు ను. అట్టి బకాయిలకు

సంబధిత సిబ్బంది బాధ్యులగుదురు. కాని భవన యజమాని చేల్లిన్చినచో నిరోధించ రాదు.

11ఏదేని భవనమునకు ఒక సంవత్సరము పైబడి ఆస్థి పన్ను చెల్లించనట్లయితే ఆ భవనములో

ఉన్న అక్రమణదారునికి బకాయి పన్నులు చెల్లించవలసిన రూలు 35 క్రింద ఆక్యుపయ్యర్

నోటీసు జారీ చేసి పన్ను వసూలు చేయబడును.

ఆస్తి పన్నుచెల్లింపు నుండి మినహాయింపు (సెక్షన్ 88):-

ఈ కింద వివరించబడిన భవనములు మరియు భవనాలకు ఆస్తి పన్ను చెల్లింపు


నుండి మినహాయింపు కలదు.
 ప్రజలు ఆరాధనలు, ప్రార్థనల కొరకు ఉపయోగించబడు స్థలములు/ భవనములు.

 అద్దెలు వసూలు చేయని సత్రాలు, ధార్మిక ప్రయోజనాల కొరకు వినియోగించు భవనములు

 గుర్తింపు పొందిన హాస్టళ్ళు, విద్యా సంస్థలు, భవనములు మరియు అనాధలకు మరియు

జంతువులకు ధర్మ ప్రయోజనార్థం ఆశ్రయము కల్పించు స్థలములు, సార్వజనీకానికి

ప్రవేశము గల గ్రంధాలయములు మరియు ఆట స్థలములు.

Page | 16
 నివాసమునకు గాని, కార్యాలయమునకు గానీ ఉపయోగించని ప్రాచీన కట్టడాలు.

 ధర్మ ఆసుపత్రు లు మరియు వైద్యశాలలు

 రైల్వే శాఖ వారు నిర్వహించుచున్న ఆసుపత్రు లు మరియు వైద్యశాలలు.

 స్మశానాలు మరియు ఖనన స్థలాలు

 మునిసిపల్ కౌన్సిలు కు సంబంధించిన భవనాలు/స్థలాలు

 ప్రభుత్వం నిర్వహిస్తు న్న నీటి పారుదల ప్రాజెక్టు లు

ఇతర మినహాయింపులు :-

1 యజమాని నివాసమునకు వాడుతున్న గృహముల సంవత్సర అద్దె విలువ ఈ క్రింద వివరించిన

దానికన్నా తక్కువగా ఉన్నచో

 నగర పాలక సంస్థలు : రూ 900/-

 ఇతర పురపాలక సంఘాలు : రూ 300/-

 సొంత నివాసమునకు ఉపయోగించుచున్న సైనికోద్యోగి మరియు మాజీ సైనికోద్యోగి లేదా

మరణించిన మాజీ సైనికోద్యోగి భార్య ఇంటికి..

 మిల్ట్రీ లో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసిన మాజీ సైనికోద్యోగులకు వీటి చార్జీల చెల్లింపు

నుండి 20 శాతము మినహాయింపు.

 నాన్ గజిటెడ్ ఉద్యోగులు/ డ్రైవర్ల సంఘాల భవనములకు, షాపులకు

 బలహీనవర్గాల గృహ నిర్మాణ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఇళ్లకు అర్థ

సంవత్సరమునకు ఒక రూపాయి చొప్పున ఆస్తిపన్ను విధించబడును.

 కేంద్ర ప్రభుత్వ భనములకు పురపాలక సంఘముచే పొందుతున్న సేవల ప్రకారము సాధారణ

పన్నులలో 33 శాతం, 50 శాతం మరియు 75 శాతం మాత్రమే సేవా పన్ను వసూలు

చేయబడును.

ఖాలీ స్థలం పన్ను విధింపు:-

Page | 17
ఖాళీ స్థలమునకు రిజిస్ట్రా ర్ వారి రేట్ల ప్రకారము ప్రస్తు త మార్కెట్టు మూల ధన

విలువపై సంవత్సరమునకు 0.20 శాతం పురపాలక సంఘాలలోను, 0.50 శాతము

నగరపాలక సంస్థలలోను పన్ను విధించబడును.

భవనమున ప్రాంగణం లో ఉన్న ఖాళీ స్థలమునకు భవన విస్తీర్ణంపై 2/3 వంతు

లేదా వెయ్యి చదరపు మీటర్లకు ఏది తక్కువ అయితే దానిపై మినహాయింపు కలదు.

అంతకుమించి విస్తీర్ణము గల ఖాళీ జాగాకు పన్ను తప్పనిసరి.

ఆస్తి పన్నులకు సంబంధించి ఈ క్రింది అంశములన్నియు ఆన్ లైన్ (ఇ.ఆర్.పి) విధానములో

నిర్వహించబడును.

1. ఆస్తి పన్నులు విధించుట

2. ఇంటి యాజమాన్యపు హక్కుల పేరు మార్పు

3. రివిజన్ పిటిషన్లు పరిష్కరించుట

4. వేకెన్సీ రేమిషన్లు ఆమోదించుట

5. సైనిక ఉద్యోగులు / మాజీ సైనిక ఉద్యోగుల ఆస్థి పన్నులను మినహయించుట

6. ఇంటి పన్ను / ఖాళీ స్థలం పన్ను / నీటి చార్జీలు వసూలు చేయుట

7. ఫిర్యాదులు పరిష్కరించుట

8. రోజు వారి వసూళ్ళు తనిఖి చేయుట

9. DCB రిపోర్ట్ తీసుకొనుట

10.పన్ను బకాయి దారుల వివరములు తెలుసుకొనుట

11.షాప్ రూముల అద్దెలు వసూళ్ళు

12.షాప్ రూలులను లీజుకు ఇచ్చుట / పునరుద్దరించుట

Page | 18
ఇ.ఆర్.పి విధానములో దరఖాస్తు ను ముందుగా పురసేవ ద్వారా కాని, కార్యాలయము లో

పురసేవ కేంద్రము (సి.ఎస్.సి యూజరు) ద్వారా కాని దాఖలు చేయవలెను ,

తదుపరి వివిధ స్థా యిలలో ఈ క్రింద వివరించిన సిబ్బంది ద్వారా కమీషనరు గారి

ఆమోదమునకు పంపబడును.

1. సి యస్ సి యూజర్
2. సంభదిత గుమస్తా
3. బిల్ కల్లెక్టరు
4. రెవిన్యూ ఇన్స్పెక్టరు
5. రెవిన్యూ ఆఫీసురు
6. డిప్యూటి కమీషనర్/
జోనల్ కమీషనర్/
అడిషనల్ కమీషనరు /
కమీషనరు

 వివిధ రకములైన పన్నులు వసూలు చేయుట :-

ఈ క్రింది పద్ధతుల ద్వారా పట్టణ స్థా నిక సంస్థలకు బకాయి ఉన్న ఇంటి పన్ను, ఖాళీ స్థలం

పన్ను, నీటి చార్జీలు, మ్యుటేషన్ ఫీజు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు మొదలైనవి చెల్లించవచ్చును.

 cdma.ap.gov.in లేదా సంబంధిత మున్సిపల్ వెబ్ సైట్ ద్వారా (Online

ద్వారా)

 మున్సిపల్ కార్యాలయంలో ఉన్న “సిటిజన్ సర్వీస్ సెంటర్” ద్వారా

 ఏపీ Online ద్వారా

 పుర సేవా యాప్ ద్వారా

Page | 19
Page | 20

You might also like