You are on page 1of 6

బతుకమ్మా

పేరు * బి.అనూష
క్రమ సంఖ్య * 101
తరగతి * బై. పి. సి. 2nd సంవత్సరం
సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయం
* పద్యం :-
జయమును శుభములనొసగెడి
ప్రియశకునము తెలుపు పాలపిట్టై, శృతిలో
లయతో పాడెద కృతినే
జయమంగళగీతిన వరుసన్ బతుకమ్మా !
* తాత్పర్యం:-
ఓ బతుకమ్మా ! విజయాలు, శుభాలు కలుగుతాయని మంచిశకునం తెలియజేసే పాలపిట్టనై, చక్కని శృతిలో, లయతోనే
జయమంగళ గీతంగా ఈ శతకాన్ని పాడుతాను. నన్ను ఆశీర్వదించి అనుగ్రహించు.

బతుకమ్మ మీద కవిత


పేరు * టి. కావ్య
తరగతి * బై. పి. సి. 2nd సంవత్సరం
సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయం
L.I.G 232 Balaji Nagar
Kukatpalli.

(1) మము గాచే తల్లి ఓ బతుకమ్మ


దీవించు తల్లి గౌరీ బతుకమ్మ
మా కోర్కె వినవేమే తల్లీ బతుకమ్మ
తెలంగాణా అయ్యప్ప గౌరీ బతుకమ్మ
మా పిలాజెల్లా లు తల్లీ బతుకమ్మ
మా నెల తల్లంటూ గౌరీ బతుకమ్మ
ఒక్కొక్క పూవోలె తల్లీ బతుకమ్మ
రాలిపోయే నాదే, గౌరీ బతుకమ్మ
వాళ్ళ ఆశాల్నే ఇలా పేల్చామే బతుకమ్మ
అమర స్థూపమై పోయావే బతుకమ్మ
మము గాచే తల్లి ఓ బతుకమ్మ
దీవించు తల్లి గౌరీ బతుకమ్మ
(2) తీరొక్క పూల జాతర పండుగ
మా బతుకమ్మ పండుగ
యాడాదికోసారి మా పండుగ
పట్టు , పరికిణీలతో మా పండుగ
ఆడబిడ్డలంతా జేరి మా పండుగ
చేసేరు కన్నుల నిండుగ.

విజయదశమి
పేరు * ఎస్. సాయి ప్రసన్న
తరగతి * బి.ఎస్. సి. [ బి.జడ్.సి ], III 'సి '
సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయం
వచ్చిందమ్మా వచ్చింది, విజయదశమి వచ్చింది.
రంగురంగుల పూలను తెచ్చింది.
ఆటలు పాటలతో సందడి చేసింది.
వాగు వంకలను పూలవనంగా మార్చింది.
అందరి హృదయాల్లో ఎనలేని సంతోషాన్ని నింపింది.

బతుకమ్మ కవిత
పేరు * వి.మౌనిక
తరగతి * బై. పి. సి. 2nd సంవత్సరం
Roll no:- 115
సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయం
Jiyaguda, Hyderabad.

శ్రీ రాముని తల్లి ఉయ్యాలో


ప్రేమతో శాంతమా ఉయ్యాలో
పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో
సతి ధర్మములు కొన్ని ఉయ్యాలో
చెప్పెను ఈ రీతి ఉయ్యాలో
చెవులకూ ఇంపుగా ఉయ్యాలో
నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో
నా ముద్దు పెట్టివి ఉయ్యాలో
అత్తవారింటికి ఉయ్యాలో
ఆనందముగా బొమ్ము ఉయ్యాలో
అత్తమామల భక్తి ఉయ్యాలో
చిత్తంబులో నిలుపు ఉయ్యాలో
వారిపైనా ప్రేమ ఉయ్యాలో
వాసుదేవుని పూజ ఉయ్యాలో

బతుకమ్మ
పేరు * కె.భవాని
తరగతి * సి.యి.సి , II B
సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయం
Mangalhaat, Doodhkhana
H.No. 13-1-455, Dilwargunj
పందిట్లో ఉన్నాయి ఉయ్యాలో
పగడాలు మాయింట్లో ఉయ్యాలో
వాకిట్లో ఉన్నాయి ఉయ్యాలో
వజ్రాలు మాయింట్లో ఉయ్యాలో
అనుచు పాపయ్య ఉయ్యాలో
గంపలో వడ్లన్ని ఉయ్యాలో
అదికట్టి చీర ఉయ్యాలో
అది తొడిగిన రవిక ఉయ్యాలో
ఏ తల్లి కన్నదో ఉయ్యాలో
పగడాల రాసులు ఉయ్యాలో
పత్తిగింజల్లు ఉయ్యాలో
వజ్రాల రాసులు ఉయ్యాలో
పరిగింజలు బోలు ఉయ్యాలో
ఇంటికి వచ్చె ఉయ్యాలో
బంగారు పడ్లా యె ఉయ్యాలో
పట్టు చీరామె ఉయ్యాలో
నిన్ను పాపయ్య ఉయ్యాలో

పూల జాతర
పేరు * ఎస్. పుష్పలత
తరగతి * బై.పి.సి. మొదటి సంవత్సరం
సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయం
Uday Nagar
Banjara Hills, R 10
ఎక్కడైనా దేవతలను పూలతో పూజిస్తా రు. కానీ తెలంగాణకే ఉన్న గొప్ప సంస్కృతి ఏమిటంటే,
" ప్రకృతినే దేవతగా మలచి" పూజిస్తా రు.
ప్రకృతికి, పూలకి ఇంత ప్రాధాన్యం ఇచ్చే సంస్కృతి నా 'తెలంగాణ' లో తప్ప మరి ఎక్కడ లేదని గర్వంగా చెప్పుకుంటా.
జై తెలంగాణ !

బంగారు బతుకమ్మ
పేరు * టి .దివ్యస్వప్న
తరగతి * M.E.C., (II year)
Roll No: 211
సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయం
6-3-609 / 41 / 1
Anand Nagar Colony, Khairatabad,
Hyderabad - 500004
తీరొక్క పూలు జాతర పండుగా ..... ఉయ్యాలో
మా బతుకమ్మ సంబరాలు ఉయ్యాలో
యాడాదికోసారి ఉయ్యాలో
పట్టు పరికిణీలతో ఉయ్యాలో
ఆడబిడ్డలంతా జేరి ఉయ్యాలో
గౌరమ్మ తల్లి ఉయ్యాలో
బంగారు బతుకమ్మ తల్లి ఉయ్యాలో
నీ పూజలే చేసేము ఉయ్యాలో
సల్లంగ చూడు ఉయ్యాలో
గంగమ్మ తల్లి ఉయ్యాలో
తీరొక్క పూలతో ఉయ్యాలో
తొమ్మిది రోజులు కొలుతు ఉయ్యాలో
మా తెలంగాణ తల్లి ఉయ్యాలో
సంబరాల జేయ ఉయ్యాలో
కలలు పండించు ఉయ్యాలో
నీ పాటలే పాడుదుము ఉయ్యాలో బతుకమ్మ తల్లి ఉయ్యాలో

బతుకమ్మ
పేరు * జె. శృతి
తరగతి * C.E.C., 1st Year
సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయం
ఆడపిల్లా నని ఉయ్యలో
కలిగెనే పెద్దన్న ఉయ్యలో
ఏడంత్రాలనే ఉయ్యలో
తీరైన బతుకమ్మ ఉయ్యలో
వారిద్దరున్నరా ఉయ్యలో
సంవత్సరానికి ఉయ్యలో
తంగేడి పూలను ఉయ్యలో
ఏడంత్రాలనే ఉయ్యలో
పోయిరా గౌరమ్మ ఉయ్యలో
మళ్ళ ఏడాదికి ఉయ్యలో
మరువకు ఓయన్న ఉయ్యలో
కన్నతల్లివోలె ఉయ్యలో
తీరైన బతుకమ్మ ఉయ్యలో
పూవులెన్నో పెట్టి ఉయ్యలో
వీరిద్దరున్నారా ఉయ్యలో
ఒక్కసారె తల్లి ఉయ్యలో
రాశిగా తెప్పించె ఉయ్యలో
బతుకమ్మనే పేర్చే ఉయ్యలో
పోయిరావమ్మ ఉయ్యలో
మళ్ళీ రావమ్మ ఉయ్యలో
__________________________________________________________________________________
__
R.Akhila
B.Sc., (M.P.Cs) II year
Vill:- savargam
Mdl:- Neradigonda
Dist:- Adilabad
తొమ్మిది రోజుల పండగ మా బతుకమ్మ
తోలి వసంతం ప్రవేశించిన వేళ
తొలినవ్వు ఆడబిడ్డ ఇంట వచ్చిన వేళ
బతుకమ్మ అంటూ బంధాలను కలుపుకుంటూ
బాంధవ్యాలను పెంచుతూ
నా ఇంట లక్ష్మీదేవిని ఉంచమని పూజిస్తూ గౌరమ్మను కొలుస్తు న్నారు.
ప్రతి ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వుకు
కారణం బతుకమ్మ .
ప్రతి ఇంటిలో ఆనందాలకు కారణం
బతుకమ్మ.
బతుకమ్మ అంటూ బతుకును కోరుకోవడమే
ఆలస్యం నెట్టింట్లో నవ్వుల మాగాణిలా మారిపోతుంది ఆ తల్లి.
రావమ్మా ! మా తల్లి బతుకమ్మ
మమ్ములను కరుణించమ్మా తల్లి.
రావమ్మా మా తల్లి బతుకమ్మ
మమ్ములను కష్టా లనుండి దూరం చేయు తల్లి.
రావమ్మా ! మా తల్లి బతుకమ్మ
మా తలరాతలో ఆనందాన్ని రాయి తల్లి .
రావమ్మా ! మా తల్లి బతుకమ్మ
ఆడబిడ్డలను క్షేమంగా ఉంచు తల్లి
రావమ్మా ! మా తల్లి బతుకమ్మ
నికృష్ఠు ల నుండి నీచుల నుండి సమాజాన్ని కాపాడమ్మా తల్లి .
రావమ్మా ! మా తల్లి బతుకమ్మ
రాష్ట్రా న్ని సస్యశ్యామలంగా ఉంచు తల్లి.

You might also like