You are on page 1of 2

బ్రా యిలర్ కోళ్ళ పెంపకం

I. కోళ్ళ షెడ్ నిర్మాణం:

1. ప్రతి కోడికి ఒక చదరపు అడుగు విస్తీర్ణం అవసరమౌతుంది. మనం ఓ పది వేల కోళ్ళను పెంచాలనుకుంటే

పది వేల చదరపు అడుగుల స్థ లంలో షెడ్ నిర్మించాల్సియుంటుంది.

2. షెడ్ వెడల్పు 28 అడుగులకన్న ఎక్కువ ఉండరాదు. ఎందుకంటే కోళ్ళ విసర్జితం ద్వారా ఉత్పన్నమయ్యే

విషవాయువులు బయటకు వెళ్ళడానికి గాలి ధారాళంగా ప్రసరించాలి. పొ డవు ఎంతయినా ఉండవచ్చు.

3. షెడ్ లోకి ఎండ రాకుండా పొ డవు తూర్పు పడమరలుగా, వెడల్పు ఉత్త ర దక్షిణ దిశలుగా ఉండాలి.

4. షెడ్లు పక్క పక్కన ఉన్నపుడు (side by side) ఒక షెడ్ నుండి మరో షెడ్ మద్యన కనీసం 70 అడుగుల ఖాళీ

స్థ లం ఉండేట్లు చూడాలి.

5. షెడ్ పైకప్పు మద్యలో 11 లేదా 12 అడుగులు, వాలు వద్ద 8 నుండి 9 అడుగుల ఎత్తు ఉండాలి.

6. షెడ్ పైకప్పు అస్బెస్టా స్ రేకులతొ నిర్మిస్తే బాగుంటుంది. జి.ఐ. షీట్స్ లేదా ఇతర స్టీల్ రేకులతొ నిర్మిస్తే

వేసవిలో షెడ్ లొ ఎక్కువ ఉష్నోగ్రత ఉంటుంది.

7. షెడ్ కి స్థ ంభాలుగా సిమెంట్, కర్ర లేదా ఇనుపవి వాడవచ్చు. వీలయినంత వరకు తక్కువ ఖర్చుతో నాలుగు

కాలాల పాటు ఉండేలాగా నిర్మించుకోవాలి.

8. సూర్యోదయ, సూర్యాస్త మయ సమయాల్లొ ఎండ షెడ్లో కి రాకుండా తూర్పు పడమర దిశలలో పైకప్పు వరకు

గోడను నిర్మించుకోవాలి.

9. ఉత్త ర, దక్షిణ దిశలలో గోడను షెడ్ లోపలి నేల నుండి సుమారు ఒకటి లేదా ఒకటిన్నర అడుగు ఎత్తు లో

నిర్మించుకొని, ఒక అంగుళం ఖాళీ కలిగిన చెయిన్ లింక్ మెష్ ను గోడ నుండి పైకప్పునకు ఆనుకొనేవిదంగా షెడ్

ఉత్త ర, దక్షిణ దిశలు పూర్తిగా మూసి వేయాలి.

10. ఉత్త ర, దక్షిన దిశలలో అవసరాన్ని బట్టి మెష్ కలిగిన ద్వారాలను బిగించుకోవాలి.
11. ద్వారాలు (3) అడుగుల వెడల్పు తో బయటకు తెరుచు కొనే విదంగా ఉండాలి. ఇందులో ఒక ద్వారం (4)

లెదా (4.25) అడుగుల వెడల్పుతో నిర్మించుకొంటే నీటి టాంకుల లాంటివి, ఎక్కువ వెడల్పు కలిగినవి లోపలకు

తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది.

12. షెడ్ లోపల నేల మొరం (ఒక రకమైన మట్టి) తో గాని, సిమెంటు గచ్చుతో గాని చదును చేసుకోవాలి.

13. కోళ్ళకు కావలసిన నీటి నిలువ కోసం అవసరమయ్యే టాంకులను నిలపడానికి అవసరమైన అనువైన స్థ లం

షెడ్ లోనే ఏర్పాటు చేసుకోవాలి. నీళ్ళ టాంకులు లోపలనే నిర్మించుకోవడం వల్ల ఎండకాలంలో గాని, చలికాలంలో

గాని ఉష్ణో గ్రతల హెచ్చు తగ్గు లు నీటిపై తక్కువగా పడతాయి.

14. షెడ్ నిర్మాణం భూమి నుండి రెండు లేదా మూడు అడుగుల ఎత్తు లో ఉండాలి.

15. షెడ్ లోపలకు పాములు, ముంగిసలు, చుంచెలుకలు రాకుండా యుండడానికి లోపలి వైపు చెయిన్ లింక్

మెష్ ని ఆనుకొని సైడ్ వాల్స్ నుండి ఒకటిన్నర ఎత్తు వరకు కబూతర్ జాలిని బిగించుకోవాలి.

16. షెడ్ పైకప్పు వాలు బయటకు కనీసం 3 అడుగులు పెరిగి యుండాలి. ఇందువల్ల ఎండ, వర్షపు జల్లు లు

లోనికి రాకుండా ఉంటాయి.

17. ప్రవేశ ద్వారాల వద్ద బయటి వైపు పాదాలు తడిచేటట్లు సుమారు మూడంగుళాల లోతు కలిగిన సిమెంటు

నిర్మాణాలు చేపట్టా లి (foot baths).

వి. కమలాకర్ రెడ్డి

You might also like