You are on page 1of 6

యజ్ఞ ం యజ్ఞ ం యజ్ఞ యజ్ఞా

ప్రథమమున మణికర్ణికయందు స్నానమొనర్చి వినాయకుని దర్శించి, పాంచాలేశ్వరునకు నమస్కరించి

తరువాత విశ్వేశ్వరుని దర్శింపవలెను. తిరిగి గంగకు వెడలి మణికర్ణికేశ్వరుని పూజించి కమలేశ్వరుని దర్శించి

అనంతరము వాసుకేశ్వరుడు, పర్వతేశ్వరుడు, గంగాకేశవుడు, లలితాదేవి జరాసంధేశ్వరుడు, సో మనాథుడు,

శూలకంఠేశ్వరుడు, వరాహేశ్వరుడు, బ్రహ్మేశ్వరి, అగస్త్యేశ్వరుడు, హరిహరేశ్వరుడు, వైద్యనాథుడు, ధ్రు వేశ్వరుడు,

గోకర్ణేశ్వరుడు, హాటకేశ్వరుడు, వీరలను దర్శించి పూజించుము, అనంతరము చిత్రగుప్తేశ్వరుడు, పశుపతేశ్వరుడు,

చంద్రేశ్వరుడు, అగ్నీశ్వరుడు, నాగేశ్వరుడు, హరిశ్చంద్రేశ్వరుడు, వీరలను పూజింపుము. చింతామణి వినాయకుని,

సో మనాథ వినాయకుని దర్శించి పూజించుము. చతువక్త్రేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, చండీశ్వరుడు వీరలను

పూజింపుము. భవానీ శంకరుని పూజించి డుండిరాజుకు నమస్కరించి రాజరాజేశ్వర, లాంగూలేశ్వర, నకులేశ్వరులను

పూజించుము. గంగేశ్వరుని పూజించి జ్ఞా నవాపియందు స్నానమొనర్చి జ్ఞా నేశ్వరుని పూజించి, నందికశ
ే ్వరునకు

నమస్కరించి, మార్కడేశ్వరుని, తారకేశ్వరుని, మహాకాళేశ్వరుని, దండపాణిని, మోక్షేశ్వరుని, వీరభద్రేశ్వరుని పూజించి,

అవిముక్తేశ్వరుని సమీపించి భక్తితో పూజించుము.

పంచవినాయకుల పూజించి, భైరవుని పూజించి, మహాద్వారమునకు వచ్చి విశ్వనాథుని పూజించుము. ఈ

విధమున అంతర్గ ృహయాత్రనొనర్చి ముక్తిమండపము ప్రవేశించి, శివా, నేను నీ ప్రీతి కొరకు అంతర్గ ృహయాత్ర సలిపితి.

న్యూనాతిరిక్తముల క్షమించి ప్రసన్నుడవుకమ్మని ప్రా ర్థించుము. అచ్చట కొంచెము విశ్రమించి అచ్చట నుండి లేచి

విశ్వనాథుని నమస్కరించి దక్షిణ మానసయాత్ర సలుపుము. అది ఎట్ల న మణికర్ణికకు వెళ్ళి ఉత్త రవాహినియైన

గంగయందు స్నానమొనర్చి పంచవినాయకులను నమస్కరించి, డుంఢిరాజును పూజించి, భవానీ శంకరులకు

నమస్కరించి, ధర్మకూపమున స్నానముచేసి అచ్చట తీర్థశ్రా ద్ధ ము చేసి ధర్మేశ్వరుని పూజించుము. గంగా కేశవులను

పూజించి లలితాదేవిని పూజించుము.

జరాసంధేశ్వరునకు నమస్కరించి సో మనాథుని దర్శించి వరాహేశ్వరుని పూజించి దశాశ్వమేధ తీర్థమున

స్నానమొనర్చుము. సీతలేశ్వరుని దర్శించి బందీదవి


ే ని పూజించి తిలభాండేశ్వరుని పూజించుము. రేవాకుండమునను,

మానససరోవరమునను స్నానము చేయుము. అచ్చట శ్రా ద్ధ మొనర్చి మానసేశ్వరుని పూజించుము. నీ మనోరథము

నెరవేరును. కేదారకుండమున స్నానమొనర్చి కేదారేశ్వరుని పూజించుము. గౌరీకుండమును స్నానమొనర్చుము.

వృద్ధ కేదారేశ్వరుని, హనుమంతేశ్వరుని పూజించుము. రామేశ్వరుని దర్శించి కృమికుండమున స్నానముచేసి శ్రా ద్ధ
మొనర్చుము. సిద్ధేశ్వరుని పూజించి స్వప్నకుండమున స్నానమొనర్చి స్వప్నేశ్వరుని పూజించి తరువాత

సంగమేశ్వరుని పూజించి లోలార్క కూపమున స్నానమొనర్చుము. తరువాత గతిప్రదశ


ే ేశ్వరుని దర్శించుము.

అర్కవినాయకుని, పరాశరేశ్వరుని పూజించుము. కురుక్షేత్ర కుండమున స్నానముచేసి సువర్ణదానము

మొదలగు దానము లొనర్చుము. అమృతకుండమున స్నానముచేసి దుర్గా వినాయకుని పూజించి, దుర్గా దేవిని

పూజించి అనంతరము (64) అరవదినాలుగు యోగిని గణముల దర్శించి నమస్కరింపుము. తరువాత

కుక్కుటద్విజునకు నమస్కరింపుము. కాశీలో దక్షిణభాగమున కుక్కుటద్విజుని దర్శించి, పూజించువారికి

దుస్వప్నములు సుస్వప్నములు కాగలవు. తరువాత గౌరీదేవిని దర్శించి అచ్చట (7) గవ్వల నుంచుము. తరువాత

రేణుకను దర్శించుము. శంకోద్ధా రకుండమున స్నానముచేసి కామాక్షిని పూజించుము. అయోధ్యాకుండమున

స్నానముచేసి అచ్చటనున్న లక్ష్మిని పూజించుము. లక్ష్మీకుండమున స్నానముచేసి లక్ష్మీనారాయణుల పూజింపుము.

సూర్యకుండమున స్నానముచేసి అచ్చట శ్రా ద్ధ మాచరించి సూర్యుని పూజించి వైద్యనాథకుండమున స్నానమొనర్చి

కాలేశ్వరుని పూజించి, హంసతీర్థమున స్నానమొనర్చి అచ్చట పితరులకు శ్రా ద్ధ మొనర్చి, కృత్తి వాసేశ్వరుని చూచి

అచ్చట నుండి వెడలి శంఖవాసియందు స్నానమొనర్చి ఆచమనముచేసి రత్నేశ్వరుని, సత్యేశ్వరుని వరుసగ

పూజించవలెను.

వృద్ధ కూపములో స్నానమొనర్చి కాలేశ్వరుని పూజించి తరువాత అపమృత్యు ఈశ్వరుని పూజించుము.

మందాకినిలో స్నానముచేసి, మధ్యమేశ్వరుని, జంబుకేశ్వరుని, వక్రతుండ గణపతిని పూజించి దండఖాతకూపమున

స్నానముచేసి శ్రా ద్ధ మొనర్చుము. తరువాత భూతభైరవుని, ఈశానేశ్వరుని చూచి జైగీషవ్యగుహను దర్శించి

నమస్కరించి ఘంటాకుండమున స్నానముచేసి వ్యాసేశ్వరుని కందుకేశ్వరుని, భక్తితో పూజించుము. జ్యేష్ఠ వాపియందు

స్నానముచేసి జ్యేష్ఠేశ్వరుని పూజించి సప్త సాగర తీర్థమునకు వెళ్ళి స్నానముచేసి వాల్మీకేశ్వరుని పూజించి

భీమాతటముననున్న భీమేశ్వరుని పూజింపుము. మాతృపిండకుండమందు పితృశ్రా ద్ధ మొనర్చి పిశాచమోచక

తీర్థమున స్నానమాడి కపర్ధేశ్వరుని పూజించి, కర్కోటక వాటియందు స్నానముచేసి, కర్కోటేశ్వరుని భక్తితో పూజించి

ఈశ్వరగంగకు వెళ్ళి అచ్చట స్నానదానము లాచరించవలెను. అగ్నీశ్వరుని పూజించి చక్రకుండమున స్నానముచేసి

శ్రద్ధతో శ్రా ద్ధ మాచరించుము. ఉత్త రార్కుని పూజించి మత్స్యోదరియందు స్నానముచేసి ఓంకారేశ్వరుని, కపిలేశ్వరుని

పూజించుము. ఋణమోచన తీర్థమునను, పాప విమోచన తీర్థమునను స్నానమాచరించుము. అట్లే కపాలమోచన

తీర్థమున గూడ స్నానమొనర్చి కులస్త ంభమునకు వెళ్ళి నమస్కరించి, వైతరణీ తీర్థమున స్నానము శ్రా ద్ధ ము,

గోదానమును గూడ నొనర్చుము. అచ్చట, నుండి కపిలధారకు వెళ్ళి స్నానము చేసి వత్సతో కూడిన గోదానము

బ్రా హ్మణునకు చేయుము.


వృషభధ్వజుని పూజించి జ్వాలానరసింహునకు నమస్కరించి వరుణా సంగమమునకు వెళ్ళి స్నానము

శ్రా ద్ధ ముచేసి కేశవాదిత్యుని, ఆదికశ


ే వుని గూడ పుజించుము. ప్రహ్లా దతీర్థము కలదు. అచ్చటగూడ స్నానదానాదుల

నాచరించవలెను. కపిలధారయను తీర్థమందును స్నానము చేయుము. త్రిలోచనేశ్వరుని అసంఖ్యాలేశ్వరుని పూజించి

మహాదేవుని సమీపించి భక్తితో పూజించి ద్రు పదేశ్వరుని గూడ పూజించుము. గంగా యమునా సరస్వతియను మూడు

లింగములు కలవు. వాటిని పూజించుము. కామ్యతీర్థము దర్శించి కామేశ్వరుని పూజించి తిరిగి పంచగంగకు వెళ్ళి

స్నానము చేయుము. తిరిగి మణికర్ణిక యందు స్నానముచేసి జలశాయిని పూజించి హనుమంతునకు నమస్కరించి

మోదాది పంచవినాయకుల పూజింపుము. అన్నపూర్ణను పూజించి దుంఢిరాజును దర్శించి జ్నానవాపియందు

స్నానముచేసి జ్ఞా నేశ్వరుని పూజింపుము. దండపాణిని మోక్ష లక్ష్మీవిలాసుని పంచపాండవుల, ద్రౌ పదీ ద్రు పదుల

దర్శించి, ఆనందభైరవుని, అవిముక్తేశ్వరుని దర్శించి, పూజించి విశ్వనాథుని సమ్ముఖమునకు వెళ్ళి స్వామీ, నీ

ప్రీతికొరకు ఉత్త ర మానసయాత్ర సలిపితిని, ప్రసన్నుడవు కమ్మని ప్రా ర్థించవలెను. సాష్టా ంగముగ విశ్వనాథునకు

నమస్కరించి అనంతరము పంచకోశయాత్ర సలుపవలెను. ఇట్టి గురుచరితన


్ర ు శ్రద్ధతో వినువారు చతుర్విధ

పురుషార్థముల నొందగలరు అని సిద్ధముని నామధారకునకు చెప్పెను.

బాలకా, వినుము. సంకల్ప మొనర్చి స్వర్గ ద్వార భువనమున కేగి అచ్చట గంగాకేశవుల పూజించి హరిశ్చంద్ర

మంటపమునకేగుము. హవిష్యాన్నమును భుజించి మరునాడు ప్రా తకాలమున గంగాస్నానమొనర్చుము.

ధుండిరాజుకు పూజచేయుము. గంగకు నమస్కరించి విశ్వనాథుని దర్శించి భవానీశంకరుల పూజింపుము. ముక్తి

మండపము ప్రవేశించి నమస్కరించి తిరిగి ధుండిరాజు వద్ద కు పొ మ్ము. తిరిగి మహాద్వారమునకేగి విశ్వేశ్వరుని

పూజింపుము. మోదాది పంచ వినాయకులకు నమస్కరించి దండపాణిని దర్శించి నమస్కరించుము. ఆనందభైరవుని

పూజించి మణికర్ణికకు తిరిగి వెళ్ళి ఈశ్వరుని సిద్ధి వినాయకుని పూజింపుము. గంగాకేశవుల పూజించి సిద్ధి

వినాయకునికి నమస్కరించి రాజసిద్ధేశ్వరుని ధ్యానించి దుర్ల భేశ్వరుని పూజింపుము. సో మనాథుని, శూలకంఠేశ్వరుని,

వారాహేశ్వరుని దర్శించి దశాశ్వమేధ ఘట్ట మునకు పొ మ్ము.

బందీదేవిని పూజించి సర్వేశ్వరునికి నమస్కరించి కేదారేశ్వరుని, హనుమంతేశ్వరుని గూడ

పూజయొనర్చుము. సంగమేశ్వరుని, లోలార్కుని, అర్కవినాయకుని పూజించి దుర్గా కుండమున స్నానమొనర్చుము.

దుర్గా దేవిని పూజించి దుర్గా గణేశ్వరుని దర్శించి విష్వక్సేనేశ్వరుని దర్శించి కర్దమతీర్థమున స్నానముచేసి కర్దమేశ్వరుని

పూజంపుము. కర్దమకూపమున కేగి అచ్చట సో మనాథుని పూజించి తరువాత విరూపాక్ష లింగమునకు పూజ

యొనర్చుము. నీలకంఠుని పూజించి కర్దమశ


ే ్వరుని పూజించుము. నాగనాథుని పూజించి చాముండాదేవిని
మోక్షేశ్వరుని, వరుణేశ్వరుని భక్తితో పూజింపుము. వీరభద్రు ని పూజించి వికటాక్షాదేవిని పూజింపుము. ఉన్మత్త భైరవుని,

విమలార్జనుని, కాలకూడదేవిని పూజింపుము. మహాదేవుని, నందికేశ్వరుని, భైరవుని, గణప్రియుని, విరూపాక్షుని,

యజ్ఞేశ్వరుని విమలేశ్వరుని, భీమాచండీ వినాయకుని, రవిని, రక్తా క్షగంధర్వుని పూజింపుము.

జ్ఞా నేశ్వరుని అమృతేశ్వరుని, భీమాచండిని నరసముద్రము నుండి తరించుటకు పూజించుము.

ఏకపాదవినాయకుని , భైరవుని, సంగమేశ్వరుని పూజింపుము. భూతనాథుని సో మనాథుని కౌలనాథుని పూజించి

కపర్దశ్వరుడను శివలింగమును పూజించుము.

నాగేశ్వరుడు, కామేశ్వరుడు, గణేశ్వరుడు, విశ్వేశ్వరుడు, చతుర్ముఖ వినాయకుడు, దేహళీవినాయకుడు,

ఉద్ద ండ గణపతి వీరల పూజించుము. ఉత్కలేశ్వరుని పూజించుము. ఉత్కలేశ్వరుని, ఏకాదశ రుద్రు లను, పూజించి

తపో భూమియను చోటికి పొ మ్ము. అచ్చట రామేశ్వరుని, సో మనాధుని, భరతేశ్వరుని, లక్ష్మణేశ్వరుని, శత్రు ఘ్నేశ్వరుని,

భూమీదేవిని, నహుషేశ్వరుని, రామేశ్వరుని పూజించుము. అసంఖ్యాత తీర్థమునకు నమస్కరించి, అసంఖ్యాత

లింగమునకు పూజచేయుము. సిద్ధేశ్వరుడను గొప్ప లింగమునకు పూజచేసి పరశుపాణి వినాయకుని పూజించి

పృథ్వీశ్వరునకు నమస్కరించి, సరయూకూపమున స్నానమొనర్చి కపిలోద్ధా రమను తీర్థమునను

స్నానమాచరింపుము. ఋషభధ్వజుని పూజించి జ్వాలానృసింహస్వామి పాదములకు నమస్కరించి, వరుణాసంగమ

స్నానము చేసి పితరులకు శ్రా ద్ధ ము పెట్టు ము. సంగమేశ్వరుని పూజించి వినాయకుని కేశవుని ప్రహ్లా దేశ్వరుని

పూజించి, కపిలతీర్థమున స్నానముచేసి త్రిలోచనేశ్వరుని పూజింపుము.

అనంతరము బిందుమాధవుని పూజింపుము. మంగళగౌరిని పూజించి, వశిష్ఠ వామదేవుల పూజించి

పర్వతేశ్వరుని పూజించుము. అనంతరము సిద్ధి వినాయకుని పూజించి సప్త వర్ణేశ్వరుని, సర్వగణేశ్వరుని పూజించి,

మణికర్ణిక కేగి అచ్చట స్నాన మొనర్చి విశ్వేశుని స్మరించి, మహాదేవుని పూజించి ముక్తి మంటపమున కేగి

విష్ణు మూర్తిని, దండపాణిని, ధుంఢిరాజును పూజింపుము. ఆనందభైరవుని పూజించి ఆదేత్యేశ్వరునకు నమస్కరించి,

మోదాది పంచవినాయకుల పూజించుము. తరువాత విశ్వేశ్వరుని పూజించి మోక్షలక్ష్మీ విలాసమునకు నమస్కరించి,

విశ్వేశ, విశ్వాత్మ కాశీనాథ, నీ యనుగ్రహము వలన పంచక్రో శయాత్ర చేసితిని. కాశీక్షేత్ర ప్రదక్షిణముచే అనేక జన్మార్జిత

పాపములు నశించినవని చెప్పి శివుని ధ్యానించవలెను.

అనంతరము ముక్తిమంటపమునకు, స్వర్గ మంటమునకు, ఐశ్వర్యమంటమునకు, జ్ఞా నమంటపమునకు,

మోక్షలక్ష్మీ విలాసస్థా నమునకు, ముక్తిమంటపమునకు ఆనందమంటపమునకు, వైరాగ్యమంటపమునకు, వెళ్ళి ఈ


ఎనిమిది స్థా నములకు నమస్కార మొనర్చుము. ఇట్టి కాశీయాత్రా విధానము నీకు చెప్పితిని. మరియొక విధముగ

గూడ కాశీయాత్ర చేయు విధము చెప్పెదను ఓ బాలుడా, వినుమని అవధూత చెప్పుచున్నాడు.

ముందుగ సచేలస్నానము చేసి తరువాత చక్రపుష్కరిణిలో స్నానమొనర్చి, దేవపితృతర్పణము గావించి,

బ్రా హ్మణుల పూజింపుము. అచ్చట నుండి బయలుదేరి ద్రు పదాతిత్యేశ్వరుని పూజించి, దంపత్యేశ్వరునకు నమస్కరించి,

ఆ సమీపముననున్న విష్ణు మూర్తిని పూజించి, దండపాణిని, మహేశ్వరుని పూజింపుము. ధుంఢిరాజును పూజించి

జ్ఞా నవాపియందు స్నానమొనర్చి నందికశ


ే ్వరుని పూజించి తారకేశ్వరుని పూజింపుము. మహాకాళేశ్వరుని దర్శించి

దండపాణివినాయకుని పూజించి విశ్వేశ్వరుని దర్శింపుము. ప్రతిపత్తు నాడు మత్స్యోదర తీర్థమున స్నానముచేసి

ఓంకారేశ్వరుని పూజించుము. త్రిలోచన మహాదేవులను రెండులింగముల విదియ, తదియల వరుసగ నర్చింపుము.

చవితినాడు కాంచీవాస లింగము నర్చించుము. పంచమినాడు రత్నేశ్వరుని, షష్ఠినాడు చంద్రేశ్వరుని పూజించుము.

సప్త మినాడు కేదారేశ్వరుని పూజించుము. అష్ట మినాడు విశ్వేశ్వరుని ఆరాధించి, దశమినాడు కామేశ్వరుని,

ఏకాదశినాడు తిరిగి విశ్వేశ్వరుని, ద్వాదశినాడు మణికర్ణికశ


ే ్వరుని, త్రయోదశియందు అవిముక్తేశ్వరుని, చతుర్దశినాడు

విశ్వేశ్వరుని పూజించవలయును. కాశీయందు నివసించువారు ఈ విధమున యాత్ర చేయనిచో వారి యాత్రకు

విఘ్నము వాటిల్లు ను. ఇక కృష్ణ పక్షమున నెటుల కాశీయాత్ర సలుపవలయునో చెప్పెద వినుము.

వరుణానదియందు స్నానమొనర్చి శైలేశ్వరుని దర్శించి సంగమస్నాన మొనర్చి సంగమేశ్వరుని

పూజించవలయును. స్వర్గ తీర్థమున, స్నానమొనర్చి స్వర్గేశ్వరుని పూజించవలయును. మధ్యమేశ్వరుని

మందాకినియందు స్నానమొనర్చి పూజించ వలయును. మణికర్ణికా స్నానమొనర్చి ఈశానేశ్వరుని పూజించుము.

హిరణ్యగర్భమను రెండు లింగములు గలవు. వాటిని పూజించుము. ధర్మకూపమున స్నానము చేసి గోపద్మేశ్వరుని

పూజించుము. కపిలధారాతీర్థమున స్నానమొనర్చి ఋషభధ్వజలింగమునకు పూజగావింపవలయును. ఉపశాంతి

కూపమున స్నానమొనర్చి ఉపశాంతేశ్వరుని ఆరాధించుము. పంచచూడా ప్రవాహమనుచోట స్నానముచేసి

జ్యేష్టేశ్వరుని నర్చించుము. చతుస్సముద్రకూపమున స్నానముచేసి సముద్రేశ్వరుని సేవించుము. తరువాత దినమున

శుక్లేశ్వరుని పూజించుము. దంఢఖాత తీర్థమున స్నానముచేసి వ్యాఘ్రేశ్వరుని పూజించుము.

శౌనకేశ్వర తీర్థమున స్నానమొనర్చి శౌనకేశ్వరు నారాధించుము. జంబుతీర్థమున స్నానమొనర్చి

జంబుకేశ్వరు నారాధించుము. శుక్ల పక్షమునను కృష్ణ పక్షమునను విశేషించి మోక్షేశ్వరుని, పర్వతేశ్వరుని,

పశుపతేశ్వరుని, గంగేశ్వరుని, నర్మదేశ్వరుని గూడ పూజించవలయును. అనంతరము భక్తేశ్వరుని, గభస్తేశ్వరుని,

మధ్యమేశ్వరుని, తారకేశ్వరుని పూజింపుము. అగ్నిధ్రు వేశ్వరుడు, ఊర్వశీశ్వరుడు, నకులేశ్వరుడు, ఆషాఢేశ్వరుడు,


భారభూతేశ్వరుడు, లాంగులేశ్వరుడు, త్రిపురాంతకేశ్వరుడు, మనః ప్రకామేశ్వరుడు, ప్రీతేశ్వరుడు, మందాలికేశ్వరుడు,

తిలపర్ణేశ్వరుడు గలరు. వీరలగూడ పూజించుము. ఇక శక్తి యాత్ర చెప్పెద వినుము.

శుక్ల పక్ష తదియనాడు గోప్రేక్ష తీర్థములో స్నానమొనర్చి ఫాలనేతయ


్ర ను శక్తిని పూజించి, జ్యేష్ఠ వాపిలో

స్నానమొనర్చి జ్యేష్ఠా దేవిని అర్చించుము. అట్లే జ్ఞా నవాపి యందు స్నానముచేసి శృంగార సౌభాగ్యగౌరిని

ఆరాధించుము. విశాలగంగయందు స్నానమాడి విశాలగంగా దేవిని పూజించుము. లలితాతీర్థమున స్నానముచేసి

లలితాదేవిని ఆరాధించుము. భవానీతీర్థమున స్నానమాడి భవాని అమ్మవారిని పూజించుము. బిందు తీర్థమున

స్నానముచేసి మంగళగౌరిని అర్చించుము. ఇట్లు తదియయందు పూజలు చేసి చతుర్థియందు చేయవలసిన

యాత్రవిధానము చెప్పెద వినుము.

గౌరిపుత్రు డైన గణేశునకు మోదకములర్పించుము. ఇట్లు చేసినచో తీర్థయాత్ర చేయువారికి ఎట్టి విఘ్నములు

రాజాలవు. మంగళ ఆదివారములయందు భైరవుని, సప్త మి ఆదివారము సూర్యుని ఆరాధించుము. అష్ట మి, నవమి

తిథుల యందు చండీ అమ్మవారిని పూజించుము. ప్రతి నిత్యము అంతర్గ ృహయాత్రను తప్పక చేయవలయును.

ఈ కాశీయాత్రా విధానము స్కాందపురాణములో కాశీ ఖండములో కలదు. అదియే నేను నీకు చెప్పితిని. ఓ బ్రహ్మచారీ,

నీవిటుల యాత్రచేసి నీ పేరుతో సో మేశ్వరుడను పేరుగల లింగమును స్థా పింపుము. నీవిటుల నాచరించితివేని నీ

మనోరథము నెరవేరును. నీ చిత్త ములో గురుభక్తి దృఢముగ గలదు. శంకరుడు తప్పక ప్రసన్నుడు కాగలడు. తప్పక

గురుస్మరణ నిత్యము నిరంతరము చేయుచుండుమని చెప్పి ఆ అవధూత అక్కడనే అదృశ్యుడయ్యెను.

You might also like