You are on page 1of 1

సాప్తా హిక పారాయణ ప్రా ధాన్యత

గ్రహం అనగా గ్రహించేది. శాటిలైట్ సిగ్నల్ రిసీవ్ చేసుకోటానికి మన ఇంట్లో రిసీవర్ పెట్టు కుంటాము. రిసీవర్(గ్రహము)

సరిగా సిగ్నల్ని రిసీవ్(గ్రహస


ి ్తేనే) చేసుకుంటేనే కదా మనకు ఇంట్లో (శరీరంలో) ఉపయోగము. అదే విధంగా నక్షత్రా ల శక్తిని

భూమిపైనున్న మానవజాతి ఏడు విధాలుగా గ్రహిస్తు ంది. గ్రహించే స్థితులను అనుసరించి వాటికి రవి, చంద్ర, కుజ,

బుధ, గురు, శుక్ర, శని అను పేర్లను ఇచ్చారు. సుర్యుడు ఉదయించే సమయంలో సాధారణ వ్యక్తి(శరీరం)లో ఏ గ్రహస్థితి

ఉంటుందో ఆ రోజంతా ఆ గ్రహస్థితి ప్రభావం ఉంటుంది. ఇదే గ్రహస్థితి తిరిగి మరల ఏడు రోజులకు ఏర్పడుతుంది. మనిషి

ప్రతి ఏడు రోజులకు ఒక సారి ప్రతిఒక్క గ్రహస్థ తిలో ఉంటాడు. ఆ స్థితులను అనుసరించే రోజులకు, ఆది, సో మ, మంగళ,

బుధ, గురు, శుక్ర, శని అనే పేర్లు పదే పదే(వారం) వచ్చుట వలన ఆదివారం, సో మవారం, మంగళవారం, బుధవారం,

గురువారం, శుక్రవారం, శనివారం అయ్యాయి. మానవజీవితం ఎన్నిరోజులున్నప్పటికీ ఈ ఏడు స్థితులలోనే నడుస్తు ంది.

గురువు సర్వదేవతా స్వరూపం. అన్ని గ్రహస్థితులలో గురుచరిత్ర పారాయణ చేసి సర్వదేవతాశక్తిని సరిగా గ్రహించుట

వలన వారి వారి జీవితములో కలుగు అవరోధాలు, సమస్యలు సహజంగానే తొలగిపో తాయి. అందువలన సాప్తా హిక

పారాయణ వలన అందరికీ(ఏ స్థితిలోని వారికైనా) మేలుకలుగుతుంది.

You might also like