You are on page 1of 3

EPISODE -3 [ THE EPILOGUE ]

గుడ్ బై అని చెప్పేసి ఏడ్చుకుంటూ స్లీపింగ్ పిల్స్ కొనుక్కుని అక్కడ నుండి తన రూమ్ కి వెళ్తు ంది.రూమ్ లో కి

వెళ్లబో తుంటే ఎదురు ఫ్లా ట్ లో ఉండే అతను వచ్చి " ప్రదీపక


ి ,కొన్ని రోజుల నుండి నీతో పాటు ఉంటున్న అతను ఈ

లెటర్ ఇచ్చి నేను కాల్ చేసన


ి ప్పుడు నీకు ఇవ్వమన్నాడు,సర్ ప్రైజ్ ఏమో అనుకుని నేను పెద్దగా ఏం ప్రశ్నలు

అడగలేదు అతన్ని" అని ఆ లెటర్ ఇస్తా డు.అయిష్ట ం గానే ఆ లెటర్ తీసుకుని ,రూమ్ లోకి వెళ్లి చదవడం ఇష్ట ం లేక

లెటర్, స్లీపింగ్ పిల్స్ టేబుల్ మీద పెట్టి అలానే సో ఫా లో పడుకుంటుంది. కానీ ఫ్యాన్ గాలికి టేబుల్ మీద ఉన్న లెటర్

ఎగిరిపో తుంది. పొ ద్దు నే లేచి భారంగా ఏం చేయాలో తోచక టీవీ ఆన్ చేస్తే అందులో యాంకర్ ఒక లెటర్ పట్టు కుని "

అమ్మ అంజలి ,నాన్న రవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ " అని చదువుతూ ఉంటె ముందు రోజు రాత్రి

ఎదురింటి అతను ఇచ్చిన లెటర్ గుర్తు కువస్తు ంది.టేబుల్ మీద చూస్తే స్లీపింగ్ పిల్స్ తప్ప అక్కడ ఏం కనపడవు.చుట్టూ

పక్కన అంత వెతికితే లెటర్ బెడ్ కింద పడి ఉంటుంది.అది తీసుకుని సో ఫా లో కూర్చొని ఆ లెటర్ ఓపెన్ చేస్తు ంది.

TO ,

ప్రదీపిక

నాకు తెలుసు ఇలాంటి సిట్యుయేషన్ వస్తు ంది అని,నువ్వు నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఒక్క సారి నేను చెప్పేది
వినుంటే ఇపుడు ఇలా లెటర్ చదవాల్సిన అవసరం ఉండేది కాదేమో.నేను చేసిన అంత పెద్ద తప్పుకు సారీ చాలా
చిన్న పదం,అందుకే చెప్పాలనుకోవట్లేదు.నిజమే ,నాకు క్యాన్సర్ లేదు కానీ నిన్ను వదిలి వెళ్ళానన్న గిల్టీ మాత్రం
చాలా ఉంది.చాలారోజుల నుండి ఆ గిల్టీనీ మోస్తు న్న.నువ్వున్నా ఈ సిట్యుయేషన్ కి నేను కూడా ఒక కారణం,అందుకే
నీకు హెల్ప్ చేసి ఆ బరువు కొంచెం ఐన తగ్గించుకుందాం అనుకున్నాను.నీకు హెల్ప్ చేద్దా ం అని నీ లైఫ్ లోకి వచ్చాను
కానీ,మళ్ళి నిన్ను మోసం చేద్దా ం అన్న ఉద్దేశం తో కాదు.ఒక పెద్ద గీత పక్కన ఇంకొంచెం పెద్ద గీత పెడితే ముందు పెద్ద
గీత కాస్త చిన్న గీత అయిపో తుంది,అలాగే నువ్వు అనుకుంటున్నా నీ డిప్రెషన్ ముందు నాకు క్యాన్సర్ అని చెప్తే నీ
ప్రా బ్ల మ్ ని చిన్నగా చూస్తా వ్ అన్న ఉద్దేశం తోనే అబద్ద ం చెప్పాను.నువ్వు నన్ను ఒక చీట్ లాగ చూసినా నేను ఫీల్
అవలేదు కానీ, నువ్వు ముందున్న కంటే ఘోరమైన సిట్యుయేషన్ లో పడేసావు నన్ను అన్నావు చూడు ,నేను
చేసింది అంతా అలా మాయం అయినట్టు అనిపించింది.అయినా అసలు నీ ప్రా బ్ల ం ఏంటి చెప్పు ,అమ్మానాన్న కలిసి
లేరు అని ఇలా అయ్యావా ?,అసలు అమ్మానాన్న లేనోళ్ళు ఎంత మంది ఉంటారు తెలుసా?,ఆఫీస్ లో బాస్ టార్చర్
చేస్తు న్నాడా?,అదే ఆఫీస్ ల ముందు ఎంత మంది రెస్యూమ్ పట్టు కుని జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు తెల్సా?. "
నీకు ఉన్నదాన్ని గౌరవించే ఆలోచన లేనప్పుడు ,లేని దాన్ని గురుంచి బాధపడే హక్కు కూడా నీకు లేదు".గతాన్ని
బాధతో,భవిష్యత్ నీ భయం తో నింపేసి ,ఈ క్షణాన్ని ఎందుకు ఇలా ఒంటరిగా వదిలేస్తు న్నావ్.?.పక్కన ప్రయాణికుడు
నచ్చలేదు అని ట్రెయిన్ దిగి వెళ్ళిపో తామా?,వెలుతురు లేదు అని కళ్ళు మూసుకోవడం ఎంత మూర్ఖత్వమో ,కష్టా లు
ఉన్నాయి అని లైఫ్ ని వద్దు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. I AM SORRY ,మా అమ్మ తరపున కూడా నేనే
చెప్తు న్నా .చివరిగా ఒక మాట " I am still in love with you for what you are now,will you be my love Again ?
". నా మనవి ఆలకిస్తా వని అనుకుంటున్నా.

from

అరవింద్

చివరి లైన్ చదవడం పూర్తి అవకముందే ,తను ఎంత తొందరపడిందో అర్ధం చేసుకొని ,టేబుల్ మీద ఉన్న స్లీపింగ్ పిల్స్

డస్ట్ బిన్ లో పడేసి రూమ్ డో ర్ కూడా క్లో జ్ చేయకుండా అలానే అరవింద్ దగ్గ రికి వెళ్తు ంది.

****************

" నీ డిక్షనరీ లో ఫరెవర్ అంటే ఒక్క రోజు అని అర్థమా ..?? ఐన GOOD BYE చెప్పావు కదా మళ్ళి ఎందుకు

వచ్చావ్..??" ,పేపర్ చదువుతూ ఉన్న అరవింద్ ప్రదీపిక ని అడిగాడు.

" I Just want to Hug you and tell Thanks a lot to you " అంటూ హాగ్ చేసుకుంటుంది.

అంటే నాకోసం రాలేదా ...?

" దీని కోసమే వచ్చా "

ఇంకా నేను లెటర్ లో అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు నువ్వు..??

" చెప్పను " అని అంటూ అలానే హాగ్ చేసుకుని ఉంటుంది.

****************

చివరికి ,ప్రదీపక
ి లీవ్ తీస్కొని కొన్ని రోజులు ఖాళీగా ఉందాం అని డిసడ్
ై అవుతుంది,వాళ్ళ అమ్మానాన్న కలిసి

లేకపో యినా తను మాత్రం అప్పుడపుడు వెళ్లి వాళ్ళిద్ద రిని కలిసి వస్తు ంది.
PS : "జీవితం చాలా చిన్నది , మనకున్న ఇంకా అంత కంటే చిన్న ప్రా బ్లెమ్స్ తో దాన్ని కంప్లికేట్ చేయకుండా ,మనకు

నచ్చినట్టు బ్రతికేయాలి".

********* THE END ***********

You might also like