You are on page 1of 2

ప్రా చీన దేవాలయములు వాటి విశిష్టత:

మన సనాతన ధర్మంలో దేవాలయముల పాత్ర అత్యంత ప్రముఖమై నది. పూర్వకాలంలో


దేవాలయములు కేవలం భగవంతుని పూజా స్థలములు గానే కాక అనేక సామాజిక కార్యకలాపాలకు
కూడా నెలవులుగా ఉండేవి. ఆ రోజులలో దేవాలయాలు ఏవిధంగా అనేక రకాలుగా ఉపయోగపడేవి
తెలుసుకోవాలి.

వేద విద్యాలయాలు : ఆ రోజులలో ప్రతి దేవాలయంలో అనేక విధ్యార్ధు లు నిత్యం వేదాధ్యయనం చేస్తూ
ఉండేవారు. వారికి దేవాలయమును మించి మరొక ప్రదేశం అవసరం లేకుండా వుండేది.

విద్యావేత్తల సమావేశములు : ఆ రోజులలో శాస్త్రీయ చర్చలకు, అవధానులకు, పండితుల మధ్య


వాదోప వాదములకు దేవాలయములు వేదికలుగా మారుతుండేవి.

కళలు : లలిత కళలకు దేవాలయములు పట్టు కొమ్మలు. నాట్యములు, గానములు, వాద్యములకు


సంబంధించిన ప్రతిఒక్కరు దేవాలయములలోనే తమ ప్రదర్శనలను ప్రదర్శించేవారు.

శిలాశాసనములు : పూర్వ కాలంలో రాజులు తాము చేసిన గొప్ప పనులను, ఆయా


దేవాలయములకు చేసిన సేవలను తరువాతి తరముల వారికి అందించే ప్రయత్నంలో భాగంగా
దేవాలయములలో శిలాశాసనములు లేదా రాగిపత్రములు వేయించేవారు. కనుక దేవాలయములు
మన చరిత్రకు సాక్షీ భూతాలు.

స్థూ పములు, శిల్పములు, చిత్రలేఖనం : పై న చెప్పిన శిలా శాసనముల వలెనే ఈ స్థూ పములు,
శిల్పములు, చిత్రలేఖనం కూడా చరిత్రకు సాక్ష్యములు. అయితే వీని ప్రా ముఖ్యత ఆయా రాజుల
కాలంలో కళల స్వరూపమును మనకు తెలియజేస్తా యి.

గోదాములు : అప్పట్లో దేవాలయాల ఆవరణ చాలా పెద్దగా ఉండుట వల్ల రై తులు ఆ ఆవరణను
కొంతమేర ధాన్యమును నిల్వచేసుకునే గోదాము లుగా కూడా వాడుకునే వారు.

సంకలనం : శ్రీ తేకూరు దామోదర రావు, నెల్లూ రు . 9666893843 1


చికిత్సా కేంద్రా లు : ఆ రోజులలో మనకు ఇప్పుడు ఉన్నట్లు గా వై ద్యశాలలు ఉండేవి కావు. ఆచార్యుల
వారి ఇంటిలో లేదంటే దేవాలయంలోనే అన్ని వై ద్య సేవలు అందేవి.

గ్రా మ సమావేశములు : ఆయా గ్రా మములకు సంబంధించిన ముఖ్య విషయముల చర్చలు దేవాలయ
ఆవరణలే వేదికగా జరిగేవి.

ఎన్నికల కేంద్రములు : ఆయా గ్రా మములలో జరిగే ఏ విధ మై న ఎన్నికలయినా దేవాలయ


ప్రా ంగణములలోనే జరిగేవి.

అర్ధి క కార్యకలాపములు : ఊరికి సంబందించి చేసే ప్రతి కార్యక్ర మానికి సంబంధించిన ఆర్ధి క పరమై న
చర్చలకు, భవిష్య ప్రణాళిక లకు దేవాలయములు కేంద్రా లయ్యేవి.

🌹 ఇటువంటి ముఖ్యమై న పనులు అన్నీ దేవాలయములలోనే జరుగుటకు, అలా జరగాలని


నిర్ణయించుటకు ముఖ్యమై న కారణం పై న చెప్పిన పనులన్నీ ధర్మబద్ధంగా జరగాలని ఉద్దే శము.

సంకలనం : శ్రీ తేకూరు దామోదర రావు, నెల్లూ రు . 9666893843 2

You might also like