You are on page 1of 1

*మానవజన్మ, పుంస్త్వ లక్షణాలు, విప్రత్వం.....

మానవజన్మ, పుంస్త్వ లక్షణాలు, విప్రత్వం గలవాడు సాధనలో ముందుకు పోవాలంటే ఏమిటి మార్గం...

మానవజన్మ, పుంస్త్వ లక్షణాలు, విప్రత్వం... ఇవి లభించటం నిజంగా వరమే. అయితే ఈ లక్షణాలతో ముందుకు
పోయినప్పుడే గదా ప్రయోజనం.

నా దగ్గర సరైన మందు ఉందిగదా అని కూర్చుంటే రోగం తగ్గిపోతుందా.. ఆ మందు సేవిస్తేనే గదా ప్రయోజనం..

అలాగే పై లక్షణాలు గలవాడు ముందుకు పోవాలంటే ఏమిటి మార్గం.. వేదాలు చూపిన ధర్మమైన మార్గంలో ముందుకు
నడవాలనే నిష్ఠ ఉండాలంటున్నారు. మన బుద్ధిని ఏకాగ్రం చేసుకొనుటకు వేదాలు కొన్ని మార్గాలు మనకు చూపాయి. అవే
నిస్వార్థ కర్మాచరణ, మానసిక పూజ, జపం, తపం (ధ్యానం), శ్రవణ, మనన, నిధిధ్యాసన మొదలైన సాధనలు.

ఇవి సక్రమంగా ఆచరించినప్పుడు మన అంతరంగం పరిశుద్ధమౌతుంది. మనస్సు శాంతించి ధ్యానానుకూలమవుతుంది.


భగవంతుని పట్ల ఏకాగ్రత కుదురుతుంది. కనుక సత్త్వగుణప్రధానులై వేదాంత శాస్త్రా లను శ్రవణం చేస్తూ అవి చూపే మార్గాన
ప్రయాణం చేయాలి. అట్టి మనోబుద్ధు లు కలిగి ఉండటమే గొప్ప అదృష్టం.

వేద విరుద్ధ మార్గాల వైపుకు ఆకర్షించబడితే ఈ లభించిన జన్మ వృధాయే. వేదాలను.. వేదాంతాన్ని.. భగవద్గీతను..
ఎగతాళి చేసే వారితో చేరకూడదు.

You might also like