అకర్త... అభోక్త

You might also like

You are on page 1of 1

విద్వత్త్వం (పాండిత్యం) :

ఇలా వేదాలు చూపిన ధర్మ మార్గంలో పయనించే సాధకుడు శాస్త్రా న్ని బాగా అధ్యయనం చేయాలి. లేదా శ్రవణం చేసి మననం
చేయాలి. శాస్త్రంలో సూచించిన పదాల యొక్క నిగూఢమైన అర్థా లను సునిశిత బుద్ధితో గ్రహించగల పాండిత్యం ఉండాలి. గొప్ప
కవిత్వం వ్రాయనక్కర లేదు. గొప్ప ఉపన్యాసాలు ఇవ్వనక్కర లేదు. పదాల యొక్క వాచ్యార్థా న్ని గాక లక్ష్యార్థా న్ని బుద్ధితో
గ్రహించాలి.

అప్పుడే సాధనలో ముందడు వేస్తా డు. ఇట్టి సునిశిత బుద్ధి లేకపోతే సాధనలో నియమాలు పాటించలేడు. అన్నీ అనుమానాలు
అపోహలు కలుగుతాయి. కనుక శాస్త్రా లను స్వయంగా విశ్లేషణ చేయగల సామర్థ్యం కావాలి. అప్పుడే సర్వసంశయాలు నివృత్తి
అవుతాయి. ముందుకు వెళ్ళగలుగుతాడు...

*అకర్త... అభోక్త.....*

పురుషుడు అకర్త - అభోక్త అంటున్నారు గదా.. అవును...

మరి సుఖ దుఃఖాలు అనుభవించే భోక్త పురుషుడెట్లా అవుతాడు...

ఇక్కడ చెప్పిన పురుషుడు సోపాధిక పురుషుడు. అంటే ఉపాధులతో తాదాత్మ్యం చెందిన పురుషుడే కాని ఉపాధులు లేని శుద్ధ
చైతన్యం కాదు. ఉపాధులతో కూడియున్నప్పుడు ప్రకృతితో కూడియున్నప్పుడు ఆ ప్రకృతి యొక్క సుఖదుఃఖాలను అతడే
అనుభవిస్తు న్నట్లు కనిపిస్తుంది.

ఇనుముకు కాల్చే శక్తి లేదు. కాని అగ్నితో కూడిన ఇనుము దేన్నైనా కాలుస్తుంది. ఇనుము కాల్చింది అంటామే గాని నిజంగా
కాల్చింది ఇనుముతో కూడిన అగ్నియే. అలాగే పురుషుడు సుఖ దుఃఖాలనుభవించే భోక్త కాదు. కాని ప్రకృతితో
కూడియున్నప్పుడు ఆ ప్రకృతి గుణాలను పురుషునిపై ఆరోపించి సుఖదుఃఖాలు అనుభవిస్తు న్నాడు అంటాం.

ప్రపంచానికి దూరంగా ఉన్నప్పుడు హాయి, ఆనందం. ప్రపంచాన్ని తగిలించుకోవటంతో ఈ ప్రపంచపు వికారాలు,


సుఖదుఃఖాలు, రాగద్వేషాలు అన్నీ అనుభవించవలసి వచ్చింది. ప్రపంచానికి దూరంగా ఉంటే సన్యాసి. ప్రపంచాన్ని
తగిలించుకుంటే సంసారి.

అలాగే పురుషుడు దేనితోను సంగభావం లేకుండా తాను తానుగా ఉంటే ఆనందస్వరూపుడు. ఉపాధులతో (ప్రకృతితో)
తాదాత్మ్యం చెందితే జీవుడై ఈ ప్రకృతికి చెందిన గుణాలను తనవిగా భావించి సుఖదుఃఖాలనను అభవిస్తు న్నాడు...

You might also like