You are on page 1of 2

వాషింగ్టన్: జార్జియాలో విజయం జో బైడెన్‌నే వరించింది.

రాష్ట్రా ంలో
పో లైన ఓట్ల ను తిరిగి లెక్కించగా డొ నాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ విజయం
సాధించినట్లు తేలిందని ఆ రాష్ట ్ర ఉన్నత ఎన్నికల అధికారులు స్పష్ట ం
చేశారు. వివరాల్లో కి వెళితే.. అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3 న
జరిగిన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలపై
ఉత్కంఠ కొనసాగింది. ముఖ్యంగా జార్జియా రాష్ట ం్ర లో జో బైడెన్, డొ నాల్డ్
ట్రంప్ మధ్య గెలుపు దో బూచులాడింది. ఈ రాష్ట ం్ర లో మొదట  ట్రంప్
ఆధిక్యంలోగా కొనసాగారు. తర్వాత జో బైడెన్ అనూహ్యంగా పుంజుకుని
ట్రంప్‌ను వెనక్కినెట్టా రు. సుమారు 14 వేల ఓట్ల తో ట్రంప్‌పై బైడెన్
విజయం సాధించారు.

కాగా.. ఇద్ద రు అభ్యర్థు లు పొ ందిన ఓట్ల శాతంలో తేడా 1% కంటే


తక్కువగా ఉండటంతో ఓట్ల ను మ్యాన్యువల్‌గా తిరిగి లెక్కించాలని
రిపబ్లి క్‌పార్టీ నేతలు జార్జియా ఎన్నికల అధికారులను కోరారు. ఈ
క్రమంలో రాష్ట ం్ర లో పో లైన ఓట్ల ను అధికారులు తిరిగి లెక్కించి, వాటి
ఫలితాలను గురువారం ప్రకటించారు. ఎన్నికల్లో పో లైన ఓట్ల ను తిరిగి
లెక్కించగా 12,284 ఓట్ల తేడాతో ట్రంప్‌పై జో బైడెన్ విజయం
సాధించినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. దీంతో జార్జియాలోని
16 ఎలక్టో రల్ ఓట్లు బైడెన్ ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో ఆయన
గెలుపొ ందిన ఎలక్టో రల్ ఓట్ల సంఖ్య 306 కు చేరింది. 

You might also like