You are on page 1of 2

నాకు నచ్చిన పుస్త కం : గోరా

రవీంద్రనాథ్ ఠాగూర్ ...!! భారతీయులకి పరిచయం అవసరం లేని పేరు . అవును, నిజానికి మనలో చాలా మందికి

ఆయన పేరు మాత్రమే సుపరిచితం కానీ, కాలానికి అతీతమైన ఆయన దార్శనికత కాదు . ఆయన నోబెల్ బహుమతి

గ్రహత
ీ లలో ఒకరని మాత్రమే తెలుసు కానీ, ఆయన రచనల లోని తాత్విక సౌరభాన్ని గూర్చి తెలియదు . #గోరా

పరిచయం కాకముందు వరకు నేను కూడా ఆ 'చాలా... మంది' లో ఒకడినే. ఆతరువాతే కుంచిత భావాలనే సంకెళ్లని

తెంచుకొని, అస్సలైన నైతిక స్వేచ్ఛ వైపు పయనం మొదలుపెట్టా ను.

ఇక కధ లోకి వెళ్తే ...

మన కథానాయకుడైన గోరా సాంప్రదాయ బ్రా హ్మణ కుటుంబం నుండి వచ్చి , హిందూ ధర్మానికి , ఆచార వ్యవహారాలకు

నిష్ట గా కట్టు బడి ఉండే వ్యక్తి . సంఘ సంస్కరణలకు తీవ్ర వ్యతిరేకి .చివరకు తన తల్లిదండ్రు లు , ప్రా ణ స్నేహితుడు ,

తాను ప్రేమించే అమ్మాయి మొదలైనవారు కూడా , " స్త్రీ సమానత్వం , విగ్రహారాధన నిర్మూలన, కుల వివక్ష లేని

సమాజం " వంటి అభ్యుదయ సిద్ధా ంతాలు కలిగిన #బ్రహ్మసమాజం వైపు ఆకర్షితులయ్యారని తెలిసి వారితో కూడా

విభేదించి బయటకి వస్తా డు .

ఈ క్రమంలో దేశాటనకు బయలుదేరి , అట్ట డుగు వర్గా ల వారు పడే బాధలు, సమాజం లోని అసమానతల వల్ల కలిగే

కష్టా లు , దేశ స్వాతంత్య్రం కోసం మతాలకి అతీతంగా మనవాళ్ళు చేస్తు న్న పో రాటం కళ్లా రా చూసి చలించిపో తాడు.

అప్పటివరకు తనకి తెలిసిన ప్రపంచానికి ... ఇప్పుడు చూస్తు న్న లోకానికి సంబంధం లేకపో యేసరికి ఏది నిజం ? ఏది

అబద్ధ ం ? …. ఏది మంచి ? ఏది చెడు? అనే మానసిక సంఘర్షణకి లోనౌతాడు. చివరికి పెంచిన తల్లి ద్వారా తను

కులం, మతం, గోత్రం ఇత్యాదులు లేని ఒక అనాధననే నిజం తెలుసుకున్నాక , చాందస వాదిగా ప్రయాణం

మొదలుపెట్టిన వాడు చివరికి మానవుడిగా మిగులుతాడు

నిజానికి ఇది వంగ దేశంలో 20 వ శతాబ్ద పు రాజకీయ , ఆర్థిక, , సాంస్కృతిక , సామాజిక స్థితిని వివరిస్తూ

రచించినప్పటికీ , నేటికీ మనం ఎదుర్కుంటున్న కుల రాజకీయాలు , మతఘర్షణలు వంటి సమస్యలకి ….

జాతీయవాదం, స్త్రీవాదం , ప్రపంచీకరణ , లౌకికవాదం వంటి అంశాలకు అద్ద ం పడుతుంది . ఆద్యంతం ఆచారానికి....

మూఢత్వానికి , మతానికి ... మూర్ఖత్వానికి మధ్య ఉండే సన్నటి గీతని బూతద్ద ంలో చూపిస్తు ంది . పట్ట ణాల్లో కనిపించే
చదువరులకు ... పల్లెల్లో చిక్కుకున్న అమాయకులకు గల ఆలోచనా పరమైన వ్యత్యాసాలని తెలియజేస్తు ంది.

అగ్రకులస్థు ల అధికారాలని ... అంటరాని వారి ఇతి బాధలని వివరిస్తు ంది భారత జాతి మనుగడని ప్రశ్నిస్తు ంది .

ఈ రచన ద్వారా రవీంద్రు డు ఎక్కడా తన సిద్ధా ంతాలని మనపై రుద్దే ప్రయత్నం చెయ్యడు . తన భావాలని మనలోకి

చొప్పించాలని చూడడు . తన సూత్రా లని ప్రబో ధించడు . ఈ చర్చలంతా మన పరిపక్వతకు, తర్కానికే వదిలేస్తా డు .

పాఠకుడిని ఆలోచింపజేసే అతికొద్ది పుస్త కాలలో ఇదొ కటి

You might also like