You are on page 1of 1

డిసెంబర్ 3 వ తేదీ కంటే ముందుగా తదుపరి చర్చల తేదీని అడ్వాన్స్ చేసేందుకు కేంద్ర హో ం మంత్రి అమిత్‌షా

చేసిన ప్రతిపాదపై సుమారు 30 రైతు సంఘాలు ఆదివారం సమావేశమై చర్చించాయి. 31 రైతు సంస్థ లతో పాటు
క్రా ంతికారి కిసాన్ యూనియన్ పంజాబ్ చీఫ్ దర్శన్ పాల్ సింగ్‌కు ఈనెల 28 న హో ం శాఖ కార్యదర్శి అజయ్
భల్లా ఒక లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరగా చర్చలను అమిత్‌షా కోరుకుంటున్నట్టు ఆ లేఖలో ఆయన
స్పష్ట ం చేశారు. అయితే, వ్యవసాయ శాఖ అనేది హో ం మంత్రి పరిధల
ి ోకి రాదనీ, అదువల్ల చర్చలకు హో ం శాఖ
సారథ్యం వహించడం కుదరదని ఏఐకేఎస్‌సీసీ పేర్కొంది. హో ం మంత్రి ప్రతిపాదనను తాము తోసిపుచ్చినట్టు
దర్శన్ పాల్ తెగేసి చెప్పారు. రైతులు, వ్యవసాయానికి సంబంధించి హో ం శాఖ చేయగలిగేది ఏమీ లేదని ఆయన
అన్నారు.

హో ం శాఖ కార్యదర్శి ఆహ్వానానికి ప్రతిగా, రైతు ప్రతినిధులు తదుపరి విడత చర్చలకు కొత్త షరతులు
విధించారు. 'దేశంలో ఏ నిర్ణ యమైనా ప్రధాని తీసుకుంటారు. చివరి విడత చర్చల్లో కేంద్ర మంత్రు లు
పాల్గొ ంటారు. అయితే నిర్ణ యాలు తీసుకున్న అధికారం వారికి ఉందని మేము కచ్చితంగా చెప్పలేం. ఆ దృష్ట్యా
మేము కేబినెట్ కమిటీ కానీ, మంత్రు ల గ్రూ ప్‌కు కానీ అధికారమివ్వాలని కోరుతున్నాం. తదుపరి చర్చలకు
ఇది తప్పనిసరి' అని ఏఐకేఎస్‌సస
ీ ీ జాతీయ కార్యదర్శి అవిక్ సహ తెలిపారు.

కొత్త రైతు చట్టా లకు సంబంధించి ఆందో ళనకు దిగిన రైతుల సమస్యలపై నవంబర్ 13 న కేంద్ర వ్యవసాయ శాఖ
మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే, ఆహారం, వినియోగ వ్యవహరాల మంత్రి పీయూష్ గోయెల్ రోజంతా రైతులతో
చర్చలు జరిపారు. అసంతృప్తిగానే చర్చలు ముగిసాయి. భవిష్యత్తు లో కూడా చర్చలు కొనసాగించాలని
ఇరువర్గా లు అంగీకారానికి వచ్చాయి.

You might also like