You are on page 1of 1

భాగ్యాపు లక్ష్మీ రావమ్మా మాయమ్మ నువు సౌ

భాగ్యాపు లక్ష్మీ రావమ్మా

మవ్వపు అడుగు పై అడుగును మోపుతు


మువ్వల కాలి నాదము చూపుతు
పువ్వుటెడదల పూజ వేళకు
కవ్వము చిలికిన వెన్న లాగున         //భాగ్యాపు//
 
కనక వృష్టినీ పిలుస్తు రావె
మనసుకు మానవ సిద్ధిని చూపవె
దినకరకోటి తేజము కురిసే
జనక రాజకుమారీ వేగమె          //భాగ్యాపు//
 
 ముత్తెము లంత భక్తు ల మనసులొ
నిత్తెము పండుగె నిత్యమంగళమె
సత్తెము చూపే సాధు సజ్జ నుల
చిత్త ము లోపలి పుత్త డి బొ మ్మా     //భాగ్యాపు//
 
అంకెల తేలని భాగ్యము నిచ్చీ
కంకణపు చెయ్యి  తిప్పుతు రావే
కుంకుమాంకిత! పంకజలోచన!
వేంకటరమణుని బింకపు రాణీ      //భాగ్యాపు//
 
చక్కెరనేతుల కాలువ పారించి
శుక్కర వారపు పూజల వేళకు
అక్కరకువచ్చు అళగిరి రంగని
చొక్కపు పురందర విఠలుని రాణీ    //భాగ్యాపు//

You might also like