You are on page 1of 3

-ఆచార్య మసన చెన్నప్ప గారి భగవద్గీత ప్రవచనం నుండి 

- తేది: 22-12-20
భగవద్గీత- నాలుగవ అధ్యాయము- జ్ఞా న కర్మ సన్యాస యోగము.
ఈ రోజున 33 వ శ్లో కం తో మొదలు పెట్టా లి. ఎన్ని యజ్ఞ ములు ఉన్నా,ఆ యజ్ఞ ములలో ద్రవ్య యజ్ఞ ము, తపో
యజ్ఞ ము, తరువాత జ్ఞా న యజ్ఞ ము, యోగ యజ్ఞ ము. ఇత్యాది ఎన్ని యజ్ఞా లు ఉన్న, ఎన్ని యజ్ఞా లు
వున్నా, అన్నిటికన్నా జ్ఞా నయోగమే గొప్పది అని అన్నాడు. అంటే జ్ఞా న పూర్వకముగా చేసే యజ్ఞ ము
అన్నమాట. ఏమిటీ ఈ జ్ఞా నము ? జ్ఞా నము అంటే తెలియటం. దేన్ని తెలుసుకోవాలి? ఏది తెలుసుకుంటే
అంత తెలుస్తు ందో ,దాన్ని తెలుసుకోవాలి.చాలా మందిని నేను అడుగుతూ ఉంటాను ఏమి చేస్తు న్నారు అని?
ఏదో ఒకటి చేయాలి కదండీ, చేస్తు న్నాను అని బదులు చెబుతారు.ఏదో ఒకటి కాదండీ తెలుసుకోవటం!ఏది
ఒక్కటో, దాన్ని తెలుసుకోవాలి.ఆ ఒక్కటి సత్యము.అన్నింటా అంతర్గ తంగా, అంతర్ భూతంగా, అంతరాత్మ గా
భాసిస్తు న్నటువంటిది సత్యము.దాన్ని తెలుసుకోవాలి.ఇక్కడ జ్ఞా న యజ్ఞ ము అంటే ఏమిటి ఇది?ఎవర్ని
జ్ఞా నము వాని దా? ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అంటే,జ్ఞా నము అంటే సత్యము.”సత్యం జ్ఞా నం
అనంతం బ్రహ్మ” అని అన్నాడు. జ్ఞా నము వేరు సత్యము వేరు కాదు.బ్రహ్మము వేరు సత్యం వేరు
కాదు.సత్యమే ధర్మము.సత్యమే జ్ఞా నము.దాన్ని సత్య జ్ఞా నము అని అంటారు. భగవంతుడు సత్యము,
భగవంతుడు అయినప్పుడు ,ఆయన సత్యమే అయినప్పుడు ,ఆయనకు సంబంధించిన జ్ఞా నం మనకు
ఉండాల్నా వద్ద ?నీవు ఆసత్యాన్ని ఆశ్రయించి, సత్యాన్ని ఆశ్రయించినట్లు ఎట్లా అవుతుంది? జామ పండు
కావాలని మామిడి చెట్టు ని ఆశ్రయిస్తే, నీ జపము ఎలా అవుతుంది. ఏది కావాలని అనుకుంటావో దానిని
నీవు సంపాదించుకోవాలి.అందుకే ఉపనిషత్తు చెబు తున్నది. ఏది దేనికంటే గొప్పదో , దానిని బుద్ధిమంతుడు
ఆశ్రయిస్తా డు. అప్పుడు దేని కంటే ఏది తక్కువో, అది నిన్ను వదిలి పెడుతుంది. దేనికంటే ఏది గొప్పదో , దానిని
నీవు ఆశ్రయిస్తే, దేని కంటే ఏది తక్కువో, అది నిన్ను వదిలి పెడుతుంది. అనాత్మ రూపమైన నటువంటి ఈ
ప్రపంచం,పరమాత్మ కంటే తక్కువ. ఈ జడ ప్రపంచం,చైతన్యం కంటే, జ్ఞా నము కంటే, జ్ఞా నమే స్వరూపముగా
కలిగిన పరమాత్మకంటే, జ్ఞా నము లేనటువంటి, ఈప్రపంచము కంటే తక్కువ అని ఎప్పుడైతే అనుకుంటావో,
అప్పుడే, ఈ జడ ప్రపంచము మిమ్ములను వదిలి పెడుతుంది.మెడిసిన్ గొప్పది అనుకుంటే ఇంజనీరింగ్
మిమ్ములను వదిలి పెడుతుంది.ఇంజనీరింగ్ గొప్పది అనుకుంటే మెడిసిన్ నిన్ను వదిలి పెడుతుంది.హో టల్
గొప్పది అనుకుంటే, వంటిల్లు నిన్ను వదిలి పెడుతుంది.తప్పదు అది. బయటి ప్రపంచమే గొప్పది అని అంటే,నీ
కుటుంబము నిన్ను వదిలి పెడుతుంది. కాబట్టి నీవు ప్రపంచమే గొప్పది అని అంటే, పరమాత్ము నిన్ను వదిలి
పెట్టడు. కానీ ఆయన్ని తెలుసుకోలేని పరిస్థితి లో నీవు ఉంటావు. జ్ఞా న యజ్ఞ ము అంటే ఆ పరమాత్మ ఎవరో
అని తెలుసుకోవటం అన్నమాట. ఓంకార వాచ్యు డు. పరమాత్మ అంటే ఓంకార వాచ్యు డు. ఓంకారమంటే
అకార, ఉకార, మకార ములు. అకారం అంటే సృష్టి,రచన. ఉకారము అంటే సృష్టి పో షణ. తరువాత మకారము
అంటే లయము. ఈ మూడు సృష్టి స్థితి లయలు ఎవరు చేస్తా రో, అతడు ఓంకార వాచ్యు డు. అతని ని సవిత
అని అంటారు. సవిత అంటే పరమాత్మ. సృష్టికర్త అని అర్థ ము, సవిత అంటే. మరి పరమాత్మకు సంబంధించిన
జ్ఞా నం లేకపో తే, యజ్ఞ ం ఎట్లా పూర్తిగా అవుతుంది అని నేను మిమ్ములను ప్రశ్నిస్తు న్నాను? సత్యాన్ని మీరు
వ్రతము గా పెట్టు కోకపో తే, అది సత్యనారాయణ వ్రతం ఎట్లా అవుతుంది అని మిమ్ములను ప్రశ్నిస్తు న్నాను?
ఏమి చేస్తు న్నారో, దానికి సంబంధించిన జ్ఞా నము కావాలి. అసలు యజ్ఞ ము అన్న పదానికి అర్థ ం ఏమిటి?
యత్ జ్ఞ హ -ఏది తెలియ పడుతుందో , అది యజ్ఞ ము. అసలు ప్రపంచములో మనము తెలుసుకోవలసిన ది
ఏమిటి? బ్రహ్మ పదార్థ ము. ఏది బ్రహ్మ మో దాన్ని తెలుసు కోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? అది ఆనందము
ఇస్తు ందట.మన ప్రా కులాట అంతా అందుకే కదా! శాంతి కోసమే కదా!సుఖముగా ఉన్నవాడు శాంతిగా
ఉన్నాడా?ఎవడైతే శాంతిని అనుభవిస్తా డో ,శాంతి తో వుంటాడో , అతనుకు సుఖముతో ఉన్నట్లు లెక్క. దుఖం
గా ఉన్న వానికి సుఖము లేదు. సుఖముగా ఉన్నవానికి శాంతి లేదు. అందుకని శాంతి కావాలి. ఆ శాంతిని
ఎవరు ఇస్తా రు? పరమాత్మ ఇస్తా డు. అందుకే ఓం శాంతి శాంతి శాంతి అన్నారు . మూడు సార్లు ఎందుకు
అన్నారంటే, మూడు దుఃఖాలను నుంచి బయట పడచేసే శక్తి శాలి పరమాత్మ కాబట్టి, ఓం శాంతి శాంతి శాంతి
అన్నారు.ఇది వేదము ప్రతిపాదిస్తు న్ది . వేదములో ప్రతి మంత్రా నికి ముందు ఓంకారాన్ని ఉచ్చరించిన,
తరువాత ఆ మంత్రా న్ని చెప్పుకుంటాము. ఎందుకు చెప్పుకుంటాము? ఇదిగో భగవంతుణ్ణి మరువకు సుమా
అని చెప్పటం. నిజానికి మనము భగవంతుని విడిచిపెట్టి వచ్చామా? మరచిపో యి వచ్చామా? చాలామంది
తల్లిదండ్రు లను విడిచి దూరంగా ,నివాసము ఏర్పాటు చేసుకొని, నివసిస్తూ ఉంటారు. నాకనిపిస్తు ంది, వాళ్ళను
మరచి, వాళ్ళు విడిచిపెట్టి వచ్చిన వారు అని అనుకుంటాము. వాళ్ళు ఏమి విడవలేదు. నిజానికి ఆ
తల్లిదండ్రు లు వీళ్ళని విడిస్తే కదా,  తల్లిదండ్రు లను పూర్తిగా విడిచినట్లు . ఎవరూ ఎవరిని విడువరు .కానీ
మరచిపో తారు. తల్లిదండ్రు లను మరవట మే విడిచి పో యి ఉన్నారు అనటానికి ఒక విధమైన కారణము.
అందుకే విస్మరించిన ఆత్మతత్వాన్ని మనము తెలుసుకోవాలి. ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికి వెళ్లా లి.
నువ్వు ఎంత దూరం ప్రయాణించినా,ఎన్నికష్టా లు అనుభవించినా,ఎన్ని సుఖాలు అనుభవించినా, చివరకు ఏ
గూటి నుంచి బయలుదేరిన దో ఈ పక్షి,ఆ గూటి లోకి వెళ్ళాలి. తప్పదు అది. అందుకే తప్పిపో యిన
జంతువును పద చిహ్నములతో పట్టు నట్లు గా, విస్మరించిన ఆత్మతత్వము ను బుద్ధితో ఎరుంగ వలయును
అని ఉపనిషత్తు చెబుతున్నది. పాదముల యొక్క ముద్రలను బట్టి, తప్పిపో యిన ఆ జంతువును
ఏవిధముగా పట్టు కొంటామో, అట్లా గే భగవంతుణ్ని, మనము విస్మరించిన ఆత్మతత్వమును తెలుసుకోవాలి.
పరమాత్మ తత్వాన్ని ఈ ప్రపంచము ఆధారము గానే, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి.సూర్యుని
ఆధారంగా, చంద్రు ని ఆధారంగా, నక్షత్రా ల ఆధారంగా, ఈ ప్రకృతి ఆధారంగా, ఈ ప్రపంచము ఆధారంగా,
అంతకంటే మించి వేదముల ఆధారముగా, తెలుసుకోవటానికి అవసరము ఉన్నది. ఈ శరీర నిర్మాణ
ఆధారంగానూ పరమాత్మను తెలుసుకోవచ్చు. ఈ అణువులను కలిపి భగవంతుడు ప్రపంచాన్ని
తయారుచేశాడు. ప్రపంచాన్ని చూస్తే ఎవరూ అర్థ ము కావాలి, పరమాత్ముడే భగవంతుడే. అందుకే “సన్
ప్రత్యక్షం ---వరి శ్యామ్” అంటాడు. నీవు నాకు  ప్రత్యక్ష బ్రహ్మము అంటాడు. కాబట్టి ఈ అనంతమైన సృష్టి
నిర్మాత భగవంతుడు ఒక్కడే. ఇద్ద రూ ముగ్గు రూ లేరు. అందుకే వేదములో” “అనే జ  దేకం ---మన సో
“అంటాడు. అనేజెత్ అంటే కదలడు. దేవుడు కదలడు. మనము సేవ చేస్తా ము. మోసుకుని పో తాము.ఇక్కడ
నుంచి అక్కడకు పెడతాము. అక్కడ నుంచి ఎక్కడ పెట్టా లి? ఏ ముఖము పెట్టా లి? ఎన్నన్నో చేస్తు ంటాము.
కానీ భగవంతుడు అచలుడు. వాడు కదలడు. అనే అనేజెత్  వేదము చెబుతా వున్నది. నమ్మాలి నా వద్దా ?
అది ప్రమాణము కదా! అనేజెత్ ఏకం అన్నాడు వాడు.ఏకం ఒక్కడే.వాడు ఒక్కడే. మనసు జెవీయో అన్నాడు.
నీ మనసును ఎక్కడదాకా పో తుందో , దాని కంటే వేగము కలిగిన వాడు వాడు. వేగము కలిగిన వాడు అంటే
పరిగెత్తు తాడా? ఎక్కడకు మనస్సు వెళ్లి ఆగిపో తుందో , అదిగో చూడండి, ఆ మనస్సు కంటే ముందు కూడా
ఆయనే ఉంటాడు. అంటే నీ మనసుకు అందడు అని. భగవంతుడు మనసు చేత కూడా దొ రకడు. ఈ
మనసుతో ప్రపంచాన్ని జయిస్తు న్నామో, ఈ మనసు భగవంతుని జయించ జాలదు. ఎందుకు అంటే మనస్సు
జడము కాబట్టి. భగవంతుడు జడము కాదు కాబట్టి. “అనే జ  దేకం---మనసు జెవీయో” ఇది
ఈశావాస్యోపనిషత్తు లో ఉన్నటువంటి మంత్రభాగము. యజ్ఞ ము అంటే యత్ జ్ఞ హ - ఏది తెలుసుకోవాలో
అది తెలుసుకుంటేనే యజ్ఞ ము. ఇక్కడ జ్ఞా న యజ్ఞ ము అని అన్నాడు. జ్ఞా న యజ్ఞ ము అన్నాడు యజ్ఞ ములో
కూడా జ్ఞా నము ఉన్నది తెలుసుకోవటం ఉన్నది ఎవరి జ్ఞా నము ఈశ్వర జ్ఞా నము. పరమాత్ముని యొక్క
స్వరూపము .పరమాత్ముడు అంటే ఎవరో తెలిసి, మనము చేసేటటువంటి యజ్ఞ ము ఏదైతే ఉన్నదో ,అది
యోగ రూపాయజ్ఞ ము నిజంగా చెప్పాలంటే. అటువంటి యోగ రూప యజ్ఞ ము మనము నిర్వహించాలి.అట్లా
చేస్తేనే అక్కడ “యోగాగ్ని ----రూపాన్ “జ్ఞా నయోగము చేత మన కర్మలను  దగ్ధ ముచేసుకోవాలని
ఇంతకముందు కృష్ణు డు చక్కగా చెప్పినాడు. నేను మళ్లీ మళ్లీ వెనకకు ముందుకు ఎందుకు తీసుకుని
వెళ్తు న్నాను అంటే, నిన్నటి విషయాలు ఈరోజు మరువకూడదు అని. రేపటి విషయాలు గుర్తు పెట్టు కోవాలి. ఈ
రోజు చెప్పిన విషయాలు గుర్తు పెట్టు కోవాలి. నిన్నటి విషయాలు మర్చిపో కూడదు. అందుకే మీకు మరొక్కసారి
గుర్తు చేస్తు న్నాను.

You might also like