You are on page 1of 2

కర్మ, కర్మఫలము, నిష్కామ కర్మ

-ఆచార్య మసన చెన్నప్ప గారి భగవద్గీత ప్రవచనం నుండి  - తేది: 6-12-20


జ్ఞా నయోగము కానీ, కర్మయోగము కానీ, వీటికి సంబంధించిన విషయాలు భగవద్గీత అంతటా ప్రచురితమై ఉన్నాయి.
మనిషి మంచి సుచరితుడు కావాలంటే మంచి ప్రచురితుడు కావాలి. మంచి చరిత్ర కలిగిన వాడు కావాలి. మంచి
నడవడిక కలిగినటువంటి వాడు కావాలి. అట్లా ఒక చారితక
్ర పురుషుడు, ఒక పరమ శ్రేష్ఠు డు, తాను అంతకముందు
ఉన్నటువంటి ఋషుల యొక్క బాటలో నడిచిన వాడు, ఇతరులకు ఆదర్శంగా ఉన్నవాడు. ఎవరైతే మన పూర్వీకుల
యొక్క, పెద్దల యొక్క, ఋషుల యొక్క, బ్రహ్మ వేత్తల యొక్క, బ్రహ్మ జ్ఞా నుల యొక్క మార్గ ంలో నడుస్తా రో,
అటువంటి వారు మనకు ఆదర్శం. భగవద్గీత అదే మనకు చెబుతున్నది. ఈరోజు చదవబో యే శ్లో కాలలో ఒకటి,
పరమాద్భుతమైన శ్లో కము. “యద్ యదాచరతి శ్రేష్ఠ(హ్) తత్ తదే వేతరో జనః“. అందరికీ కంఠో పాఠ ముగా
ఉన్నటువంటిది. ఆ శ్లో కము అందరూ చదువుతారు కానీ, మన కంటే ముందు ఎవరు ఏ మార్గ ంలో నడిచి నారో, ఏ శ్రేష్ఠ

మార్గ ంలో నడిచి నారో, ఎవరు శ్రేష్ఠు లు గా పేరు పొ ందినారో , అలాంటి వారి మార్గ ములో మనము నడవటానికి కి
సాహసించము. ఇతరులు శ్రేష్టు లు గా ఉండాల్సిన అవసరము కూడా లేదు అని అంటాము. సత్కర్మా చరణ శ్రేష్ఠు న్ని
తయారు చేస్తు ంది. అంతే కాదు మానవుడు శ్రేష్ఠు డు గా ఉండటానికి అది దో హదపడుతుంది. తనను ఎవరైతే

అనుసరిస్తా రో వారు కూడా శ్రేష్ఠు లు కావటానికి అవకాశం ఉన్నది. మానవుడు శ్రేష్ఠ పురుషుడు కావాలి. భగవంతుడు
పరమపురుషుడు. మనము పరమపురుషులము ఏనాటికీ కాలేము. భగవంతుని సమీపములోకి వెళ్ళవచ్చు. అతనితో
కలసి ఆనందాన్ని పొ ందవచ్చు. భగవంతునిలో జీవుడులీనమయ్యాడని చాలా మంది చెబుతుంటారు. అది అజ్ఞా నముతో
కూడుకొన్న వాదమే తప్ప, కలిసి పో వటం అనేది అస్తిత్వం లేని వాదము. వ్యాస మహర్షి ఒక మంచి మాట చెప్పినాడు
“తన్నిష్ఠ స్య మోక్షో ప దేశాత్” అని. వ్యాసుడు వేదాంత దర్శనకారుడు. ఈ భగవద్గీతను వ్రా సిన టువంటి వ్యాసుడే,
వేదాంత దర్శనము వ్రా సినాడు. ఆరు దర్శనాలలో అది చివరి దర్శనము. వేదాంత దర్శనము నకే బ్రహ్మ సూత్రా లనీ
పేరు. శంకరులవారి ప్రస్థా నత్రయంలో అది ఒకటి. నిష్ఠ ఎవడికైతే ఉంటుందో , వానికే మోక్షము. అన్నం తినాలి
అనుకున్నాడట ఒకడు. అనుకొని అన్నము గా మారాడుట. వాడే తిన్నాడట. వాడే అన్నము గా మారటం ఏమిటి?
భగవంతుని కోసం కాదు కదా ఈ సృష్టి. జీవుల కోసము. వేదము ప్రతిపాదించిన వి మూడు తత్వాలు. మూడు తత్వాల
యందు, మన దృష్టి లేకపో యినట్ల యితే, మనకు ఏమీ అర్థం కాదు. జడము చేతనము రెండు ఒక్కటే అయిపో తాయి,
కాని జడము వేరు. చేతనము వేరు. కుర్చీ వేరూ. కుర్చీలో కూర్చున్నవాడు వేరు. శరీరము వేరు. ఆత్మ వేరు. ఇది
తెలియకపో తే, ఏమి తెలియదు. అంతా నేను అంటే కుదరదు. ఏమో! ఆ కృష్ణు డు “అంతట నేను అంటే అనవచ్చు”.
అంతటా తానై ఉన్నాడా? భగవంతుడే కాడు అంతా. అంతటా తాను. ఎందుకంటే ఈ అంతటి ప్రపంచంలో, జడము కూడా
ఉంది కనుక. భగవంతుని యందు క్రియ లేదు. అందుకే ఆయన జన్మ లెత్తడు. జన్మ లెత్తటానికి కర్మ చాలా
ముఖ్యమైనటువంటిది. జన్మ లేకుండా చేసుకొంటానికి-నిష్కామ కర్మ మంచి మార్గ ము. జీవుడు కర్మలు చేయుట
వలన, జన్మ లెత్తు తున్నాడు. జన్మ లెత్త కుండా ఉండాలంటే, కర్మఫలాలు లేకుండా చేసుకోవాలి. అంటే కర్మఫలాలు
కోరకుండా ఉండాలి. కాని కర్మలు చేయాలి.
ఎప్పుడైతే కర్మఫలాలు లేకుండా చేసుకుంటాడో , మానవుడు జన్మ లెత్తడు. జన్మలతో దేవుని కేమి పని? ఆయన జన్మ
లెత్తు తుంటే, మనకు జన్మలు ఎవరు ఇవ్వాలి? పరమాత్మ డైరక
ె ్టర్. ఆయన కంటే మించి నటువంటి డైరెక్టర్ ఎవరూ లేరు.
ఆయనే మళ్లీ మళ్లీ కర్మలు చేసి, కర్మల నుంచివిముక్తు డు కావటం సబబు గా లేదు. ఆయన్ని, జీవుడు గా పుట్టి నా
డనడం సబబుగా లేదు. ఇది ఎట్లా ఉన్నదంటే కుమ్మరి మట్టి గా మారి, మట్టి కుండ గా మారి, తనే పగలగొట్టు కుని, మళ్లీ
తాను కుండ గా మారినట్లు ంది. ఇది పనికిరాని వాదము. భగవంతుడు సర్వవ్యాపకుడు. అంతటా ఉన్న వానిలో క్రియ
ఉండదు. కుండ ను కదిలించ వచ్చుగాని, కొండను ఎవరు కదిలించగలరు?
అనకూడదు కాని, మనం వ్రతం చేసినప్పుడు, ఆ రోజు మాంసం తినాలి అనుకునేవాడు, దేవుణ్ణి కదిలించి, తినొచ్చుఅని
చెబుతాడు. భగవంతుని కదిలించగల మా? ఈ శరీరములో జీవుడే కదలడు. శరీరములో ఒక్కచోట ఉన్నజీవుడు,
ఇంద్రియాలతో అన్ని పనులు చేస్తు న్నాడు. ఢిల్లీ లో ప్రధాని ఉండి, దేశాన్ని పరిపాలిస్తు న్నాడు. ఒక్క జీవుడు,
శరీరములో ఉండి,ఈ శరీర వ్యాపారాలు అన్నిటికీ కారణం మైనప్పుడు, భగవంతుడు అంతటా వుండి, స్థిరముగా ఉండి,
నిశ్చలముగా ఉండి, సృష్టి స్థితి లయలు చేయలేడా? కాబట్టి పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని, మనము జాగ్రత్తగా
తెలుసుకోవాలి. అందుకే సృష్టి స్థితి లయ కారకుడు, భగవంతుడని నిర్వచనం. జీవున్నివిపశ్చిత్ అంటాడు-కఠోపనిషత్
కారుడు. విపశ్చిత్ అంటే జ్ఞా నవంతుడు అని. ఎంత జ్ఞా నము సంపాదించి నా, మనం భూమి మీదే ఉండాలి. ఎంత ఎత్తు
కు ఎగరగలము మనము? ఆకాశము దాకా ఎగర లేము కదా! భగవంతుడు అంతటా నిండి ఉన్న వాడు.
సర్వవ్యాపకుడు. అతడు కర్మలు చేయడు. కర్మలు చేసే జీవులకు ఫలాలిస్తా డు. నిష్కామ కర్మలు చేసేవారికి మోక్షం
ఇస్తా డు. ఇదే గీతా రహస్యం. 

You might also like