You are on page 1of 4

BG 10-12-20

-ఆచార్య మసన చెన్నప్ప గారి భగవద్గీత ప్రవచనం నుండి  - తేది: 10-12-20

“గురు బ్రహ్మ” శ్లో కములో, గురువు ఎవ్వరు? 


ఈ రోజు గీతాజయంతి. నేను మీరు అందరూ గీత అధ్యయనము లోనే ఉన్నాము. గీతా చదవకుండా ఉండకూడదు. గీత
దాటకుండా ఉండకూడదు. గీతను దాటకుండా ఉండాలి. గీతను చదువుతూ ఉండాలి. దానికే ఒక మాట; గీతలో ఉండాలి
అని అంటారు. గీత లో ఉండాలి అంటే భగవద్గీతలో శ్రీకృష్ణు డు ఏమి చెప్పాడో , దానిని దాటకుండా ఉండాలి. కృష్ణు డు
చెప్పిన దానిని మనము అనుసరించాలి. కృష్ణు డు అర్జు నునకు కర్మ యోగాన్ని సంపూర్ణముగా తెలియ చేసే
ప్రయత్నము ఈ మూడవ అధ్యాయము లో కనిపిస్తు న్నది. మానవ స్వభావము, అంతే కాదు, ప్రా ణికోటి యొక్క
స్వభావం- పని చేయటం అన్నది జీవుని యొక్క స్వభావము అన్నమాట. ఎందుకంటే న్యాయ దర్శనము లో మనకు
చక్కగా “ఇక్షా ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ జ్ఞా నాని ఆత్మనో లింగం” అని చాలా చక్కగా జీవుని యొక్క నిర్వచనము,
ఒక విధముగా ఈ ఉండి ఈ యొక్క స్వభావాన్ని మనకు తెలియజేశారు. నిజానికి జీవునికి సహజమైన జ్ఞా నము
ఉంటుంది. ఆ సహజమైన జ్ఞా నము లేకపో యినట్ల యితే, నిజంగా జీవుడు ఈ శరీరములో ప్రవేశించి, పనులు
చేయగలడు. ఆ విధముగా ఒక జీవునికి సహజమైన జ్ఞా నము ఉంటుంది. దాన్ని సామాన్య జ్ఞా నము అని అంటాం.
ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ప్రవేశిస్తా డో అతనికి విశేషమైన జ్ఞా నము వస్తు ంది. ఈ విశేష మైనటువంటి జ్ఞా నము చేతనే

హెచ్చుతగ్గు లు ఏర్పడతాయి. కానీ సహజముగా జీవుడు జ్ఞా నవంతుడు. విపశ్చిత్ అంటాడు-కఠోపనిషత్ కారుడు.

విపశ్చిత్ అంటే జ్ఞా నవంతుడు అని.కఠోపనిషత్తు లో జీవుని మేధావి అని అంటాడు. అంటే అతడు జ్ఞా నము కలిగిన
వాడు అని. పూర్తిగా జ్ఞా నము లేనటువంటి వాడు కాదు జీవుడు. మరి ఒకటే, సిద్ధా ంతపరంగా ఈ విషయాన్ని ఎవరూ
చర్చించలేదు, దయానందుడు ఆధ్యాత్మిక రంగములో కి వచ్చేదాకా. మరి భగవంతుడు నుంచి జీవుడు వచ్చాడు
అంటారు కదా! భగవంతుడు పూర్ణ జ్ఞా ని కదా,అంతే జ్ఞా నము జీవునకు ఉండాలి కదా!ఒక బండెడు బెల్లా నికి ఉన్న
సహజమైన గుణము ఏమిటి? తీపి. అలాగే ఒక గచ్చకాయ అంత బెల్లపు గడ్డ కు కూడా అదే తీపి ఉంటుంది.  బెల్లం గడ్డ
లో తేడా ఉన్నది. పరిణామము లో తేడా ఉన్నది, పరిమాణములో కూడా తేడా ఉన్నది. కానీ రుచి మాత్రం ఒకటే కదా!
మరి భగవంతుడే జీవుడు అయినప్పుడు, ఈ జీవుని కి భగవంతునలో ఉన్న జ్ఞా నము ఎందుకు లేదు? భగవంతుడే
జీవుడు అయినప్పుడు, భగవంతుని కి వున్నా శక్తి, జీవునికి ఎందుకు లేదు? భగవంతుడు స్వతంత్రు డు
అయినప్పుడు, ఈ జీవుడు ఎందుకు ప్రకృతి బంధనాలలో చిక్కుకున్న పో తున్నాడు? ఆస్వతంత్రు డై పో తున్నాడు.
ఒక్కొక్క దేశంలో ఉన్న వారు స్వాతంత్రం కొరకు పో రాడుతున్నారు. అంటే ఏమిటి ఆస్వతంత్రు లు. మనము రెండు
వందల సంవత్సరములు ఆస్వతంత్రత ను అనుభవించాము. సమస్త భారతీయులు మానవులు. ఎందుకని?
జీవన్ముక్తు లు అనేది జీవునికి తప్ప దేవునికి లేవు. మన వాళ్ళు ఏమి చేశారో, ఎక్కడ నుంచి తీసుకు వచ్చారో, ఏమో
కానీ, భగవంతుని మాయ ఆవేశించటము వలన వలన జీవుడు అయ్యాడని. సరేనండీ ఒప్పుకుంటాము ఇబ్బంది
లేదు. ఆయనే వీడు అయ్యాడు. ఆయనకున్నంత జ్ఞా నము వీనికి ఉండాలి కదా! ఆయనకు ఉన్నంత శక్తి జీవునకు
ఉండాలి కదా! ఎల్ల య్య అనేవాడు రాముని వేషము వేసినాడు. బాగున్నది. తరువాత కృష్ణు ని వేషము వేసినాడు.
ఎల్ల య్య బలము రాముని లో, కృష్ణు ని లో కనపడాలి కదా! కానీ రాముని బలం వేరు అయిపో యింది. కృష్ణు ని బలము
వేరు అయిపో యినది. అందుకే “ఏకో వశీ సర్వ భూతాంతరాత్మా ఏకం రూపం బాహుదాయ కరోతి” అన్నాడు. ఏకం
రూపం బాహుదాయ కరోతి అనే మాటకు మన వాళ్ళు ఏమి అర్థం చేసుకున్నారు అంటే, ఒకే రూపం ఉన్నటువంటి
భగవంతుడు అనేక రూపాలు ధరించి నాడు అని అర్థము చేసుకున్నరు. ఇది వేద సిద్ధా ంతము కాదు. ఒకే రూపంలో
ఉన్న ప్రకృతిని అనేక రూపాలుగా భగవంతుడు మార్చి నాడు. అతడికి అది హస్త గతం అయి ఉంటుంది. కాబట్టి వేదము
దగ్గ రకు రావాలి. అజ్ఞా నం లో ఉన్నటువంటి వాళ్ళందరూ, జ్ఞా నము కలిగినవారు కావాలంటే, వేదము దగ్గ రకు
రావాల్సిందే తప్పదు అది. అందుకే దాని పేరే వేదము. అంటే తెలుసు తెలుసుకో తగినది అని అర్థము. నీవు ఎన్ని
పుస్త కాలు చదివినా తెలియని జ్ఞా నం, నీకు ఏ పుస్త కము వల్ల నీకు వస్తు ందో , దానికే వేదము అని పేరు. మామూలు
విషయం కాదు అది. ఇక్కడ కృష్ణు డు చెబుతూ ఉన్నాడు. ఎవరెవరికి చెబుతున్నాడు? ఇక్కడ కృష్ణు డే అర్జు నుడు
అయితే, కృష్ణు డు అర్జు నునకు చెప్పవలసిన అవసరము లేదు. కృష్ణు డు అర్జు నునకు తన తెలివిని అంతా అవేశింప
చేయవచ్చు. ఆయన ఇవ్వటం ఏమిటి? ఈయన తీసుకోవటం ఏమిటి? ఏ ఎందుకని? మనకు ఆకలి ఎందుకు
అవుతున్నది. భగవంతునికి ఆకలి కాదు. అతను నిద్రపో డు. అతడు కలలు కనడు. నిజంగా చెప్పాలంటే ఎందుకు
మనము ఇలా అవుతున్నాము? ఏదో భగవంతున్నిమోసము చేసి, మాయ కమ్మి, జీవుని గా పుట్టిందన్న
వాదాన్ని, దయానందుడు పరిహాసం చేస్తా డు. జీవుడు జీవుడే. అయితే ఏమిటి ఏమయింది? ప్రణయము దాకా వీడు
బద్ధు డై ఉండాలా? అవసరము లేదు. ఎందుకు ఈ పుస్త కాలను చదువుతున్నాము? ఎందుకు యోగ మార్గ ములొ
నడుస్తు న్నాము? దానికి ఒక్కటే సమాధానము. ప్రళయము ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వస్తు ందో ఏమో, అప్పుడు
కానీ మనం ఈ స్థూ ల శరీరము నుంచి ఏమైపో తామో మనము- మనము కూడా అణువుల గా ఉండిపో తాము
అప్పుడు. అప్పటిదాకా ఈ బాధలు పడవలసిందే, ఈ స్థూ ల శరీరము తో. అందుకే మనము ప్రళయము దాక బాధలు
పడకుండా, స్థూ ల సూక్ష్మ శరీరాలతో బాధలు పడకుండా ఉండటానికి, ఈ మోక్షము అనేది ఒకటి, పురుషార్థము గా
చెప్పబడినది. అది ఎందుకు పురుషార్థములు- మానవ పురుషుని కేమో ఈ అర్థములు? చీమకు, దో మకు, ఎలుకకు,
ఏనుగుకు కాదు. అవి కూడా మోక్షము పొ ందినట్టు చెబుతారు. అవి మోక్షము చెందితే, మనము ఆ జన్మలెత్తి మోక్షము
పొ ందవచ్చు, హాయిగా. ఈ మానవ జన్మ ఎందుకు దండగ? అప్పులు చేయాలి. ఇల్లు కట్టు కోవాలి. సున్నాలు వేయాలి.
రంగులు వేయాలి. ఎన్నెన్ని కష్టా లు. పిల్లల్ని చదివించాలి. వాడు ఫెయిలు అయితే ఏడవాలి. పాస్ అయితే
సంతోషపడాలి. వాడి ఉద్యోగము కోసము చూడాలి. పిల్ల కోసము చూడాలి. పిల్లగాడి కోసము చూడాలి. ఎన్ని
కష్టా లు..ఎన్ని కష్టా లు రా నాయనా! ఇవి అంతా బంధనము ఇది. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ బంధనములలో
చిక్కుకోడు. ఆయన నిత్య ముక్తు డు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు. అది ఒక్కటే చాలు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త
స్వభావుడు- ఈ వాక్యము ఒక్కటి గుర్తు పెట్టు కుంటే చాలు. ఆ భగవంతుని యొక్క స్వరూపము ఏమిటో? కాబట్టి
మనము నిరంతరము పరమాత్మ యొక్క జ్ఞా నము లో ఉండాలి. దానికే బ్రహ్మచర్యము అని పేరు. బ్రహ్మచర్యము అంటే
పెళ్లి చేసుకోకుండా ఉండటం కాదు. బ్రహ్మ అంటే జ్ఞా నము. ఈరోజు ఎవరో అడిగారు, ఘాటుగా నే, నేను చెప్పినాను.
తాను “గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః” అని మా
గురువుగారిని తలుచుకొంటాను నేను, నాకు చదువు చెప్పినాయనను. అని వాళ్ళు చెప్పి, ఇది కరెక్ట్ ఏనా అని నన్ను
అడిగినారు. కరెక్ట్ కాదు అని నేను అన్నాను. ఇక్కడ గురువు ఎవరు అంటే బ్రహ్మ. ఒక్క గురువు గురించి
చెబుతున్నాడు ఇక్కడ. పన్నెండు మంది గురువుల గురించి చెప్పటం లేదు. ముగ్గు రు గురువుల గురించి అసలు
చెప్పటం లేదు. గురువు అంటే బ్రహ్మ. గురువు ఎవరు? ఆ ఒక్క గురువు ఎవరు అంటే బ్రహ్మ. ఇంకా గురువు ఎవరు
విష్ణు వు. ఇంకా గురువు ఎవ్వరూ మహేశ్వరుడు. నీవు ముగ్గు రు అనుకుని,ముగ్గు రు గురువులే అని అనుకుంటే ఎట్లా ?
కాదు సరే! నీకు చదువు చెప్పిన గురువు; బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు అవుతాడా? అదీ కాదు. అందుకే ఇక్కడ గురు
బ్రహ్మ, ఏ గురువు అయితే సృష్టి రచన చేస్తా డో అతడు. ఏ గురువైతే అంటే మళ్ళా రెండవ గురువు కాదు. ఇక్కడ ఏ
గురువు అయితే సృష్టి రచన చేస్తా డో అంటే, బ్రహ్మ మాచ్యు డై నటువంటి వాడు.  సృష్టి రచన చేయటం వలన
భగవంతునికి, ఇక్కడ భగవంతుని గురించి చెబుతున్నాడు, బ్రహ్మ అనే పేరు అన్నమాట. బ్రహ్మ మాచ్యు డై తాడు సృష్టి
రచన చేయుట వలన. తరువాత స్థితి చేయుటవలన విష్ణు వు అవుతాడు. తరువాత ప్రళయము చేయటం వలన,
లయము చేయుటవలన అతడు శివుడు అవుతాడు. అంటే ఇక్కడ పరబ్రహ్మ అనే గురువు గురించి స్తు తి ఉన్నది.
ఇక్కడ “గురువు నామ్ గురు హు” అన్నమాట. గురువులకు గురువు ఎవరు అంటే పరమేశ్వరుడు రఘు
దర్శనకారుడు చెప్పినాడు. కాలము ఎవరిని బంధించదో , అతడు గురువు అన్నాడు. ఎవడైతే ఋషులకు వేద జ్ఞా నము
అందించినా డో అతడు గురువు అన్నాడు. ఆ ప్రమాణాన్ని చూపెట్టి నేను చెప్పినది ఏమిటి అంటే, ఐతే గురుబ్రహ్మ
గురువంటే ఎవరు తస్మై శ్రీ గురవే నమః అన్నాడు అటువంటి గురువుకు నా నమస్కారము అన్నాడు. ఇటువంటి
గురువు అతడు అంటే గురు బ్రహ్మ. అతడు సృష్టికర్త అయిన వాడు. అంతేకాదు స్థితికారకుడు. అంతేకాదు
లయకారకుడు. అంటే సృష్టి స్థితి లయలు చేసే వాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్
పరబ్రహ్మ” అన్నాడు అక్కడ చూడండి సాక్షాత్ పరబ్రహ్మ అన్నాడు అతడు సాక్షాత్ పరబ్రహ్మ అన్నమాట ఈ 3 పనులు
చేసేవాడు పరబ్రహ్మ అన్నమాట ఆయనకు ఈ మూడు పేర్లు కూడా ఉన్నాయి బ్రహ్మ అనొచ్చు విష్ణు అనొచ్చు శివుడూ
అనవచ్చు కాబట్టి ఈ మూడు పనులు చేసే పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాడో , అతడే నా గురువు. అతనికేనా నమస్కారము 
వేదాన్ని లోకానికి అందించిన పరబ్రహ్మ గురువు అన్నమాట. కాబట్టి ఆయన్ని మనము చాలా చక్కగా ఆ గురువును ఆ
మంత్రము చేత, మేము దీన్ని మా గురువుగారికి మేము అంకితము చేశాము అన్నారు. గురువుగారికి అంకితము
చేయటానికి కాదు. ఇందులో ఉన్నది నిజానికి ఇది పరబ్రహ్మా అనే గురువు. మన గురువు ఎవరంటే తస్మైశ్రీ గురవే
నమః పరమ గురువు అయినటువంటి,పరబ్రహ్మ అనేటటువంటి భగవంతుడే, మన గురువు అని చెబుతున్నది. అందుకే
“పూర్వేషన్ అపి గురుహు కాలేవాన్ నవ చ్ఛేదాద్“ అంటాడు. ఇక్కడ ఈశ్వరుని గురించి చెబుతున్నాడు. వేద
ప్రకాశకులైన లైన పూర్వ గురువులకు గురువు ఎవరు, అంటే భగవంతుడు అని చెబుతున్నాడు. ఋషులకు గురువు
ఎవరు అంటే భగవంతుడు. మనకు గురువులు ఎవరు అంటే ఋషులు అన్నమాట. లేకపో తే ఋషులు తరువాత
తర్వాత వచ్చిన వారు మనకు గురువులు అన్నమాట. ఒక గురుపరంపర ఉన్నది. తొలి గురువు ఎవరంటే భగవంతుడే
పరమేశ్వరుడే కాబట్టి అతడు “కాలేవాన్ నవ చ్ఛేదాద్“ అంటాడు. అంటే ఆద్యంతములు లేని వాడు. కాలము చేత
బంధింపబడని వాడు. మన గురువులు అందరూ ఒక కాలంలో ఉంటారు ఒక కాలంలో పో తారు ఒక యుగం లో
ఉంటారు మరొక యుగములో ఉండరు వాళ్ళు. వాళ్లు కాలానికి బద్ధు లై ఉంటారు ఆ కాలంలో వచ్చిపో యే అటువంటి
గురువులు వీళ్ళు. కానీ పరమాత్మ అనే గురువు ఎల్ల కాలము ఉంటాడు. సృష్టి స్థితి లయ కారకుడైన టువంటి
భగవంతుడే మనకు గురువు. అటువంటి పరమ గురువునకు నా నమస్కారములు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో
మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నాడు. అటువంటి గురువు పరమాత్మ అని చెప్పటం అన్నమాట. కొన్ని
విషయాలను మనము ఇప్పటికైనా మార్చుకోవలసిన అవసరం ఉన్నది. లెక్క సరిగ్గా లేకపో తే మనము నాలుగుసార్లు
చూసుకుంటాము. భగవంతుని గురించి తెలియక పో తే, తెలుసుకోవడంలో తప్పులేదు. చిన్న మనవి అన్నమాట. 

You might also like