You are on page 1of 4

Indira Gandhi : ఇందిరా ప్రియదర్శిని గాంధీ 

(నవంబర్ 19, 1917 – అక్టో బర్


31, 1984) భారతదేశపు మొట్ట మొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3
పర్యాయాలు, 1980 లో 4 వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్
నెహ్రూ  ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం
లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్
శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.[1]. ఇందిర తొలి పేరు ప్రియదర్శిని ఇందిర. తండ్రి జవహర్ లాల్
నెహ్రూ రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తి. తాత మోతీలాల్ నెహ్రూ  కూడా అలహాబాదులో పేరుపొ ందిన బారిష్టరే కాకుండా
జాతీయోద్యమ నాయకులలో ప్రముఖుడు. పూణే విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలో ఆమె ఉత్తీ ర్ణు రాలయింది.
రవీంద్రనాథ్ ఠాగూర్ స్థా పించిన శాంతినికేతన్లో చేరింది. అక్కడ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపింది. తరచుగా జైలుకు
వెళ్ళడం మూలాన కమలా నెహ్రూ ఆరోగ్యం చెడిపో యింది. ఆమెను చికిత్స కోసం స్విడ్జ ర్లా ండ్ తీసుకు వెళ్ళారు. తల్లికి తోడుగా
ఆమె అక్కడే ఒక స్కూలులో చేరింది. ఎంత చికిత్స చేయించినా కమలా నెహ్రూ ఆరోగ్యం కుటుదపడలేదు. పైగా అంతకంతకూ
క్షీణించింది. ఇందిరకు పదిహేడు సంవత్సరాల వయస్సు వచ్చేటప్పడికి ఆమె ఎంతో అభిమానించే తల్లి మరణం ఆమెను
ఒంటరిని చేసింది. తల్లి మరణం వలన ఏర్పడిన ఒంటరితనం నుండి ఆమె త్వరగా కోలుకోవాలంటే ఆమె ఐరోపాలోనే చదవాలని
నెహ్రూ నిర్ణయించాడు. అక్కడ ఆమె చదువు ఆమెకు మనోధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని సరైన రీతిలో నిర్మించుకుని నాయకత్వ
లక్షణాలను పెంపొ ందించుకోవడానికి సహాయపడుతుందని నెహ్రూ గారి ఆశయం తండ్రి ఆశయానికి అనుగుణంగా
నడుచుకోవాలని ఇందిర కూడా నిర్ణయించుకుంది. పశ్చిమ విద్యను అభ్యసిస్తూ ఆమె తనలోని సంకోచాన్ని, ఒంటరితనాన్ని
వదిలించుకుంది. లండన్లో ఎక్కువ రోజులు గడిపింది. ఇంగ్ల ండు లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని సో మర్ విల్ కళాశాలలో
చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థా పించబడిన ఇండియాలీగ్ లో, 1930 లో, చేరింది.[2] ఆ
తర్వాత లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలోనే, జర్నలిస్ట్ ఫిరోజ్ గాంధీతో స్నేహం ఏర్పడింది.
ఫిరోజ్ తో స్నేహం ఆమె ఒంటరి తనాన్ని పో గొట్టింది.ఫిరోజ్ తో పరిచయము క్రమంగా పరిణయానికి దారి తీసింది. ఫిరోజ్ గాంధీ
నెహ్రూ కుటుంబానికి తెలిసినవాడు మాత్రమేకాదు స్నేహితుడు కూడా. ఇందిరకు అతని వ్యక్తిత్వం బాగా నచ్చింది. అతడినే
వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఫిరోజ్ పూర్వీకులు పర్షియా నుండి భారతదేశానికి వలస వచ్చి స్థిరపడ్డా రు. వారు
పార్సీలు. నెహ్రూ కాశ్మీరీ బ్రా హ్మణ కుటుంబానికి చెందింవవారు. అందువల్ల ముందు నెహ్రూ వీరి వివాహానికి అంగీకరించలేదు.
నెహ్రూ ఇందిర నిశ్చయాన్ని విని గాంధీ సలహాని తీసుకోవాల్సిందిగా ఇందిరను కోరాడు. గాంధీ వీరి ప్రేమను అర్థం చేసుకుని
వారి వివాహానికి అంగీకరించాల్సిందిగా నెహ్రూ ను కోరాడు. మహాత్మా గాంధీ ఒప్పించడంతో 1942 లో ఇందిర, ఫిరోజ్ ల
వివాహం జరిగింది. నెహ్రూ మరణం తరువాత లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధాని పదవిని అధిష్టించాడు. శాస్త్రిగారు ఇందిరా గాంధీని
ప్రధానిగా ఉండమని కోరాడు. అయితే నెహ్రూ కు ఆఖరి దశలో ఏర్పడిన వ్యతిరేకత తనను రాజకీయంగా ఎదగనివ్వదని
తెలిసిన ఇందిరా గాంధీ శాస్త్రిగారి ప్రతిపాదనను వెంటనే తిరస్కరించింది. శాస్త్రిగారు ఆమె ఏ మంత్రిత్వ శాఖనైనా నిర్వహించాలని
మరీ మరీ కోరగా, కొంత అయిష్ట ంగానైనా అందుకు అంగీకరించింది. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహదూర్
శాస్త్రి మంత్రివర్గ ంలో కేబినెట్ హో దా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
Annie besant :అనీ వుడ్ బిసెంట్ ఐరిష్ జాతి మహిళ. లండను లోని క్ల ఫామ్ లో, 1847 అక్టో బరు 1 న
జన్మించింది. 1933 సెప్టెంబరు 20 న తమిళనాడు లోని అడయారులో మరణించింది. ఈమె దివ్యజ్ఞా న తత్వజ్ఞి, మహిళల
హక్కుల ఉద్యమకారిణి, రచయిత, వక్త . ఈమె ఐర్లా ండ్, భారతదేశాల స్వాతంత్ర్యం, స్వయంపాలన కొరకు పో రాడింది. స్వయం
పాలన ఉద్యమం స్థా పించింది.

తల్లి ధార్మిక స్వభావి. తండ్రి డా. విలియం ఫేజ్ గొప్ప విద్వాంసుడు. 1867 డిసెంబరులో తన 19 వ ఏట, తల్లి కోరికమేరకు
ఫాదర్ ఫ్రా ంక్ బిసెంట్ ని అనిబిసెంట్ పెళ్ళి చేసుకుంది. అంతవరకూ అనీగా పిలవబడిన ఆమె వివాహముతో అనీ బిసెంట్ గా
మారింది. ఈమె 1874 లో ఇంగ్లా డులోని నేషనల్ సెక్యులర్ సొ సైటీ  అనే సంస్థ లో చేరింది. లా అండ్ రిపబ్లి క్ లీగ్ ని స్థా పించి
పో లీసు అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవచేసింది. ఆమెకు భర్త తో మతపరమైన విభేదాలు కలిగడంతో విడిపో యారు.
తరువాత ఆమె జాతీయ సామ్యవాద సంఘానికి ప్రముఖ ఉపన్యాసకురాలుగా వ్యవహరించింది. ఆమెకు చార్లెస్ బ్రా డ్‌లాఫ్‍తో
సన్నిహిత మైత్రి కుదిరింది1880 లో అనీ బిసెంట్ "హెలెనా బ్లా వట్‍స్కీ"ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం
నుండి దివ్యజ్ఞా నం వైపు మళ్ళింది. ఆమె దివ్యజ్ఞా నం సమాజంలో సభ్యత్వం స్వీకరించి, ఉపన్యాసకురాలిగా విజయం
సాధించింది. దివ్యజ్ఞా న సమాజం బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. 1898 లో కేంద్రీయ హిందూ కళాశాల
స్థా పనకు సహకరించింది. 1902 లో అమె " కో-ఫ్రీమసో ంరీ లీ డ్రా యిట్ హ్య్జమన్ "ను ఇంగ్లా ండులో స్థా పించింది. తరువాత కొద్ది
సంత్సరాలలో ఈ తరహా నిర్మాణాలు బ్రిటన్ సామ్రా జ్యమంతటా స్థా పించింది. 1907 లో ఆమె దివ్యజ్ఞా నసమాజం
అధ్యక్షురాలైంది. నీ బిసెంట్ తన ఆలోచనలు సరిఅయినవని విశ్వసించి, వాటి కొరకు పో రాటం సాగించింది. ఆలోచనా
స్వాతంత్ర్యం, స్త్రీహక్కులు, సామ్యవాదం, సంతాన నిరోధం, ఫాబియన్ సో షలిజం కొరకు, శ్రా మికుల హక్కుల కొరకూ పో రాటం
కొనసాగించింది.

వివాహరద్దు ను ఫ్రా ంక్ తేలికగా తీసుకోలేక పో యాడు. ఆ కాలంలో వివాహరద్దు అన్నది మధ్యతరగతి జీవితాలను అంతగా
చేరుకోలేదు. ఆనీ తన మిగిలిన జీవితంలో బిసెంట్‍గానే మిగిలి పో యింది. ప్రా రంభంలో ఆమె తన ఇద్ద రు పిల్లలతో
సత్సంబంధాలను కలిగి ఉంది. మాబెల్ ఆమెతోనే ఉంది. ఆమెకు భర్త నుండి స్వల్పంగా భరణం అందుతూ వచ్చింది. ఫ్రా ంక్
నుండి స్వేచ్ఛపొ ందిన తరువాత ఆమెలో నుండి శక్తివంతమైన ఆలోచనలు వెలువడ్డా యి. ఆమె తాను అధిక కాలం నమ్మిన
మతవిశ్వాసాన్ని కూడా ప్రశ్నించడం మొదలు పెట్టింది. చర్చి ప్రజలజీవితాలను నియంత్రించడాన్ని విమర్శిస్తూ వ్రా యడం
మొదలు పెట్టింది. ప్రత్యేకించి, ఇంగ్ల ండు చర్చిల మతప్రచారాన్ని తీవ్రంగా విమర్శించసాగింది.
Sarojini naidu:సరోజినీ నాయుడు (ఫిబవ్ర రి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్
ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి [1]. సరోజినీ దేవి 1925 డిసెంబరులో
కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి
మహిళా గవర్నరు కూడా . ఈమె క్రీ.శ. 1879 వ సంవత్సరం పిబవ
్ర రి నెల 13 వ తేదీన హైదరాబాద్లో  జన్మించారు.తండ్రి డా.
అఘోరనాథ్ చటోపాద్యాయా, తల్లి శ్రీమతి వరద సుందరి[2]. అఘోరనాథ్ చటోపాథ్యాయగారు హైదరాబాదు కాలేజికి, (అనగా
నేటి నిజాం కాలేజీ) మొట్ట మొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ
ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు వ్రా యడం జరిగింది.తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎనిమిది
భాషలలో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ , గ్రీకు, జర్మనీ, హిబ్రూ , ఫ్రెంచ్, ఆంగ్ల ం మొదలైన భాషలు ఆయనకు
అనర్గ ళంగా వచ్చు. వీరు ఎడింబరో విశ్వవిద్యాలయంలో డాక్టరు పట్టా ను పొ ందటం జరిగింది. శ్రీమతి సరోజినీ నాయుడు సద్
వంశంలో జన్మించటం వలనా, తల్లి దండ్రు లు విద్యాధికులవటం వలన, ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్షా, పట్టు దలా,
విద్యపై తిరుగులేని సదభిప్రా యాలు ఏర్పడటం జరిగింది. ఏది చూసినా ఎవరి మాటలు విన్నా పట్టించు కోకుండా తమ
ఆలోచనల్లో తాముంటారు చాలా మంది. కొందరు ఆ విధంగా కాక బాల్యం నుంచి ప్రతి విషయం లోనూ కుతూహలం కనబరచి
ఏది, ఏమిటో తెలుసుకొనే వరకూ విశ్రమించరు కొందరు. రెండవ కోవకు చెందిన మేధావి శ్రీమతి సరోజినీ నాయుడు.
చిన్నతనం నుంచీ ఆమెకు ఇంగ్లీషు భాషమీద చాలా మక్కువ ఉండేది. ఇంగ్లీషు మాట్లా డాలని ఆమె ఎంతగానో
ప్రయత్నిస్తూ ండేది. ఆ పట్టు దలా, ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. సెయింట్ జార్జ్ గ్రా మర్
స్కూల్ లో చదువుకుంది. పదకొండో సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గ ళంగా ఇంగ్లీషు మాట్లా డి అందరినీ ఆశ్చర్య చకితుల్ని
చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు ఆరంభించింది కూడా! ఆమె పన్నెండవ
ఏట మదరాసు విశ్వవిద్యాలయం మెట్రిక్యులేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలూ, విద్య యందు ఆమెకు
గల భక్తి భావం మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది విద్యార్థు లు నిత్యం పాఠశాలలకు వెళుతూ, విద్య యందు దృష్టి
నుంచక, గురువులు చెప్పే పాఠాలు, కాలక్షేపానికి భావిస్తూ , గురువులను సాటి విద్యార్థు లనూ ఆవహేళన చేస్తూ కాలం విలువ
తెలియక ప్రవర్తించి, జీవితంలో అడుగు పెట్టి సాధక, బాధకాలు ఎదురయ్యాక వృధా చేసిన కాలం గురించి బాధపడుతుంటారు.
అటువంటి వారందరికీ శ్రీమతి సరోజినీ నాయుడు నిజంగా ఆదర్శమూర్తి.భారత దేశ మొదటి మహిళా గవర్నరుగా సరోజిని
నాయుడు చరితక
్ర ెక్కారు.
వీరు మహిళాభివృద్దికి ఎంతో కృషిచేసి 1906 లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు
ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటు పడ్డా రు. స్వాతంత్ర్య సాధనలో తనూ పాలుపంచుకోవాలని
ఆలోచించిన శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోనారంభించింది. 1915 వ
సంవత్సరం బొ ంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభ లకూ, 1916 లో జరిగిన లక్నో కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొ నటం
జరిగింది[4]. ఆనాటి కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శంగా ఉండేవి. సరోజినీనాయుడు భారతదేశములో గల ముఖ్యమైన, నగర,
పట్ట ణాలు తిరుగుతూ స్వాతంత్ర్యోద్యమ ఉపన్యాసాలిచ్చిఎందరో మహానుభావుల అచంచల దేశభక్తి, ఎడతెగని ఉద్యమ
ప్రచారాల మూలంగా, 1947, ఆగస్టు 15 వ తేదీన మనం స్వాతంత్ర్యం సాధించగలిగాము. శ్రీమతి సరోజినీనాయుడు దేశానికి
చేసిన సేవలు దృష్టిలో ఉంచుకుని ఆమెకు ఉత్త ర ప్రదేశ్కు గవర్నర్ పదవి యిచ్చి సత్కరించడం జరిగినది[8][9]. వృద్దా ప్యంలో,
అనారోగ్యంతో ఉండి కూడా ఆమె ఉత్త రప్రదేశ్ కు చేసిన సేవ, కార్యదక్షత ఎన్నటికీ మరపురానివి.

Kamla Nehru :కమలా నెహ్రూ  భారత మొట్ట మొదటి ప్రధాని జవహర్లా ల్ నెహ్రూ  భార్య. పాత డిల్లీ లోని కాశ్మీరీ

బ్రా హ్మణ కుటుంబంలో 1 ఆగస్టు 1899 సంవత్సరములో రాజ్ పతి , జవహర్లా ల్ కౌల్ దంపతులకు జన్మించారు. ఈమె తోడ
ఇద్ద రు తమ్ముళ్లు చాంద్ భహదూర్ కౌల్ , కైలాష్ నాథ్ కౌల్, ఒక చెల్లెలు స్వరూప్ కఠ్జు . ఈమెకు 1916 వ సంవత్సరం ఫిబవ
్ర రి
8 న జవహర్ లాల్ నెహ్రూ  తో వివాహం జరిగింది. కమలా నెహ్రూ మామగారు మోతీలాల్ నెహ్రూ . అత్త గారు శ్రీమతి స్వరూప
రాణి. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తండ్రితో కలసి నెహ్రూ కూడా
కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొ ంటుండేవారు. దేశ స్వాతంత్ర్యం పో రాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్తినంతా
ధారపో సింది. చివరకు తన ఇంటిని సైతం కొంత భాగం హాస్పిటల్ గా మార్చి స్వాతంత్ర్య పో రాటంలో గాయపడిన వారికి వైద్య
చికిత్సలు అందించేవారు. 1917, నవంబరు 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ , కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా
అలహాబాద్ లో జన్మించిన ఇందిర అల్లా రు ముద్దు గా పెరిగారు. ఇందిర బాల్యం అలహాబాదు లోనే గడిచింది. 1924 లో
కమలానెహ్రూ ఒకబాబును కన్నారు. పూర్తిగా పరిణతి చెందిన ముందే జన్మించడం వలన 2 రోజులలో బాబు చనిపో యాడు.
1934 లో జైలు నుండి విడుదలైన నెహ్రూ తిరిగి అరెస్టు కాబడి కలకత్తా , డెహ్రా డూన్‌లలో జైలు జీవితాన్ని గడిపారు. ఈ
సమయంలో నెహ్రూ ఆరోగ్యం పాడైంది. భర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కమలా నెహ్రూ దిగులుతో అనారోగ్యానికి గురైంది.
చికిత్స కోసం స్విట్జ ర్లా ండ్‌కు వెళ్లి 1936 లో టి. బి. జబ్బు మూలాన మరణించారు. కమలా నెహ్రూ చనిపో యిన తరువాత
ఆమె పేరుతో కాలేజీలు, పార్కులు, ఆసుపత్రు లు, విశ్వవిద్యాలయాలు వెలశాయి.

కమలా నెహ్రూ తండ్రి జవహర్ లాల్ కాలే ప్రసిద్ధి వ్యాపారి. జవహర్ లాల్ నెహ్రూ కు సరైనజోడి కమలా నెహ్రూ అని భావించి
మోతీలాల్ 1910 ఫిబవ
్ర రి 8 న వారి వివాహం జరిపించాడు. వివాహం తరువాత కమలా కాలే కమలా నేహ్రు గా మారింది. ఈ
నెహ్రూ దంపతులకు ఇందిరా 1917 నవంబరు 19 న పుట్టింది. ఈమెకు ప్రియదర్శిని అని పేరు పెట్టా రు.1936 లో నెహ్రూ ను
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. 1936 ఫిబవ
్ర రి 28 న 38 వ ఏట స్విడ్జ ర్లా ండ్ లో మరణించెను.

You might also like