You are on page 1of 2

రద్దైన మరో మహామేళా

యుద్ధ ంలో రక్త బీజుని నుంచి కారిన ప్రతి రక్త పు బొ ట్టు నుంచి మరో రక్త బీజుడు ఉదయించేవాడని, దాని వల్ల రక్త బీజుని

సంహరించడం దాదాపు అసాధ్యమని మన పురాణగాథలు వివరిస్తు న్నాయి. నేటక


ి ాలంలో ఆ రక్త బీజుని పాత్రను

పో షస్తు న్నది మన పొ రుగున ఉన్న ఎర్రన్నల పెద్దదిక్కైన దేశం. జీవాయుధాలుగా వైరసులను ప్రపంచంపైకి సంధిస్తూ నే

ఉన్నది. ఈ వైరసుల ధాటికి ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ లు కుప్పకూలాయి. సామాజిక స్థితిగతులు

మారిపో యాయి. కోట్లా దిమంది నెలల తరబడి ఇళ్ల కే పరిమితమై పో యారు.

కరోనా ప్రసరణం మనుషులు గుంపులుగా ఉంటే బాగా తీవ్రంగా ఉంటుంది. కనుకనే మనదేశంలో కేంద్ర, రాష్ట ్ర ప్రభుత్వాలు

అనేక ఉత్సవాలను నిషేధించాయి. వివాహంలో 50 మంది, అంత్యక్రియల్లో 20 మందికి మించకూడదని నిబంధనలు

విధించాయి. దేవాలయాల దర్శనాలను సైతం కట్ట డి చేశాయి.

కరోనా కాలంలోనే కుంభమేళా సందర్భం వచ్చింది. కోట్లా దిమంది భక్తు లు స్వచ్ఛందంగా పాల్గొ నే కుంభమేళాను కరోనా

మహామారిని పెంచిపో షించే మహాసందర్భంగా ఎర్రన్నలు, వారి పాటపాడే మేధో వర్గ ం, మైకు గొట్టా ల ముందు, కెమర
ే ా

కళ్ల ముందు ఉదారవాదం పేరిట హైందవద్వేషాన్ని కక్కే ప్రచార ప్రసార సాధనాల ముద్దు బిడ్డ లు బాగా విషప్రచారం చేశారు.

కరోనా బాధితులకు వైద్యసహకారం కావలసినంత అందకపో వడానికి ప్రధానమంత్రికి మిగిలిన వర్ణా లు, జాతులు, మతాల

పట్ల ఉన్న చిన్న చూపు అని గుడిసెలెక్కి మరీ రోదించారు. కుంభమేళాలో పాల్గొ నే భక్తు లే స్వచ్ఛందంగా నాలుగు దినాల

ఆ మహో త్సవాన్ని నిలిపేవేసుకున్నారు. ప్రభుత్వం కూడా చార్ ధామ్ యాత్రను ప్రజా సంక్షేమం కోసం నిలిపివేసింది.

కుంభమేళా లాంటిదే మరో జనమహో త్సవం కరోనా కారణంగా నిలిపివేతకు గురైంది. ఈశాన్యరాష్ట మ
్ర ైన అసో ం రాష్ట ం్ర లో

సాక్షాత్తు పరమేశ్వరి కామాఖ్యాగా వెలిసి ఉన్నది. అష్టా దశ శక్తిపఠ


ీ ాలలో అత్యంత శక్తివంతమైనదిగా భక్తు ల నమ్మకాలకు,

విశ్వాసాలకు కాణాచిగా నిలిచింది కామాఖ్యాదేవి ఆలయం. అసో ంలోని బ్రహ్మపుత్ర నదీతీరంలో గౌహతికి దగ్గ రలో ఉన్నదీ

క్షేత్రం. మృగశిర నక్షత్రం మూడో పాదం నుంచి ఆరుద్ర తొలి పాదం వరకు అమ్మవారి ఋతుస్రా వం జరిగే ప్రత్యేక రోజులు.

అస్సామీయుల పంచాంగం ప్రకారం అహార్‌నెలలోని ఏడో రోజున కామాఖ్యాదేవికి విశేష మేళ ప్రా రంభం అవుతుంది. దీన్ని

అంబుబాచి అని వ్యవహరిస్తా రు. ఈ మేళా ఈశాన్యరాష్ట్రా లకు కుంభమేళా లాంటిది. ఈ సంవత్సరం ఈ ఉత్సవాన్ని జూన్

22-26 తేదీలలో నిర్వహించవలసి ఉంది.

ఈశాన్య భారతంలో జరిగే ఈ అంబుబాచి సందర్భంగా కామాఖ్యా ఆలయానికి భక్తు లు పో టెత్తు తారు. ఏటా ఐదులక్షల

మంది భక్తు లు అంబుబాచి సందర్భంగా అమ్మవారి దర్శించుకుంటారు. సిద్ధు లు తాంత్రిక పూజలు గావిస్తా రు. సాధువులు

భక్తిపూర్వక విన్యాసాలు చేస్తా రు. అమ్మవారి వస్త్రా లను కోనేందుకు భక్తు లు పో టీపడతారు. ఈ మేళా ఐదురోజుల పాటు

జరుగుతుంది.
దేశం నలుమూలలనుంచి వేలాదిమంది అఘోరాలు, సిద్ధు లు, తాంత్రికులు, పండితులు, సాధకులు అంబుబాచి మేళకు

తరలివస్తా రు. ఇంతటి విశిష్ట మైన అంబుబాచి మేళాను ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టు కుని అసో ం ప్రభుత్వం ఈ సంవత్సరం

నిలిపివేస్తూ ఉత్త ర్వులు జారీ చేసింది. అంతే కాదు ఆలయానికి జూన్ 30 వరకు కామాఖ్యా ఆలయ సందర్శనను కుడా

నిలిపివేసింది. భక్తు లు కూడా తమతమ ఇళ్ల లోని అమ్మవారిని ఆరాధిస్తూ , ప్రభుత్వానికి సహకరించడానికి

నిశ్చయించుకున్నారు. అంబుబాచి మహామేళా సందర్భంగా అమ్మవారిని దర్శించుకోలేక పో తున్నామన్న బాధ

మనస్సులో ఉన్నా, దేశం పట్ల తమకున్న బాధ్యతను హిందూసో దరులు సహర్షంగా నిర్వహిస్తు న్న తీరుకు ఇది అద్ద ం

పడుతుంది. సహజంగానే ఈ అంశం ఎర్రకళ్ల దాలతో వార్త ల్ని వండివార్చే ప్రసారమాధ్యమాల కళ్ల కెక్కలేదు.

ఇక విశ్వవ్యాప్త సమాచారం విషయానికి వస్తే, ఎన్నికల తరువాత పశ్చిమబంగ రాష్ట ం్ర లో జరుగుతున్న హిందువులపైన

దాడులు ప్రపంచంలోని హిందువులను కలవరపరిచాయి. మనదేశంలో ఇలాంటివాటిని పట్టించుకోరు. కాని మిగిలిన

దేశాల్లో మన మాదిరి హిందూవ్యతిరేకతే మూలంగా ఉన్న కుహనా లౌకికవాదంతో పెద్దగా పనిలేదు కాబట్టి అక్కడ

మమతక్క పాలనలో హిందువులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఐదు

ఖండాల్లో ఉన్న 30 దేశాలలో నివసిస్తు న్న ప్రవాస భారతీయులు ఈ నిరసన ప్రదర్శనలు చేస్తు న్నారు.

ఇక మన పొ రుగు తెలుగు రాష్ట ం్ర విషయానికి వస్తే, అక్కడ ప్రభుత్వాధినేత శ్వేత, శాంతిమతాల మతాధికారులకు ప్రభుత్వ

నిధుల నుంచి జీతాలు ఇస్తు న్నాడు. చిత్రం ఏమిటంటే హిందూ ఆలయాల పురోహిత, పురోహితేతర సిబ్బందికి జీతాలు

దేవాలయాల నిధుల నుంచి ఇస్తు న్నారు. ఆలయాల ఆదాయం నుంచే దేవాదాయ శాఖ ఖర్చులు కూడా చెల్లి ంచడం

జరుగుతోంది. శ్వేత, శాంతిమతాల ప్రా ర్థనాలయాల నుంచి ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేకపో యినా వారి జీతాలు

ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లి స్తు న్నారు. ప్రభుత్వం ఇలా ఉదారంగా జీతాలు ఇస్తు ండేసరికి మతం మార్చుకుని

ఇమాములుగా, పాస్ట ర్లు గా మారిన వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపో యింది. కొందరైతే తమ హిందూమత

వెనుకబడిన వర్గా ల గుర్తింపును వదులుకోకుండానే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారు. అంటే వీళ్లు

ఉభయచరజీవియైన కప్పల్లా అటు వెనుకబడిన వర్గా లకు వచ్చే సౌకర్యాలు, ఇటు శ్వేతమతాధికారిగా ప్రభుత్వ జీతాలు

తీసుకుంటున్నారన్న మాట. వడ్డించేవాడు మనవాడైతే పంక్తి చివరన ఉన్నా పాయసం లభించినట్లు వీళ్లు ఉభయత్రా

లాభం పొ ందుతున్నారు. ఈ వాస్త వాన్ని కొందరు కేంద్రపభ


్ర ుత్వ దృష్టికి తీసుకువెళ్లా రు. కేంద్రం ఈ ధో రణికి స్వస్తి పలకమని

సదరు రాష్ట ్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. చూద్దా ం ఏం జరుగుతుందో . అస్తు .

You might also like