You are on page 1of 1

స్మశాన వాటిక వలన రైల్వేకాలనీ వాసుల దురవస్థ

మహారాజారాజశ్రీ గౌరవనీయులైన తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారి దివ్య సమూహమునకు నమస్కరించి రాయు విన్నపము
ఏమనగా.

రైల్వే కాలనీ వాస్తవ్యులము. ఇప్పుడు కరోనా ఉదృతంగా ఉన్నందువలన నగర పరిశుభ్రత పాటించవలసిన బాధ్యత మనందరి
మీదా ఉన్నది. మా కాలనీలో గాలి కాలుష్యం చాలా ఎక్కువ అయిపోయింది. మా కాలనీ పక్కనే హరిశ్చంద్ర స్మశాన వాటిక
ఉన్నదని మీకు తెలుసు. ఇప్పుడు కరోనాతో మరణించినవారి పార్థివ శరీరాలు ఈ స్మశానంలో రోజుకు 30 నుంచి 50 కాల్చడం
జరుగుతున్నది. మొదటి అంతస్థు పైన ఉన్న వారందరికీ సగం కాలిన వేడి పొగలు, మసీ, సెగలు, దుర్వాసన, అందరి ఇళ్లల్లోకి
వచ్చుచున్నవి. "రాత్రి పగలు రోజంతా ఇళ్లకు దగ్గరగా కాల్చడం గమనించాల్సిన విషయం". హాస్పిటల్ డిస్పోజల్ కూడా ఇక్కడే
తగలబెడుతున్నారు. చిన్న పిల్లలు ఆ దుర్వాసనకు సరిగ్గా తినలేకపోతున్నారు, వాంతలు అవుతున్నాయి, నిద్ర కూడా పోలేక
పోతున్నారు. తినే భోజనంలో గాలితో వచ్చిన ఆ మసి పడుతున్నందువల్ల చాలా ఇబ్బంది కరంగా ఉన్నది.

ఈ మధ్య కొత్తగా శవాలు కాల్చుటకు దహన శాలను సదుపాయము చేసినారు కానీ అందులో కొన్ని లోపములు వలన
అక్కడి నుంచి కూడా దుర్వాసన లు కాలనీలోకి వ్యాపించు చున్నవి. 1. పొగ గొట్టా టు పైకి లేనందువల్ల ఆ దుర్వాసన అంతా
కూడా ఇళ్లపైకి వచ్చుచున్నది. 2. అక్కడ మీరు కాంపౌండ్ వాల్ ఎత్తు గా లేనందువలన కాల్పులన్నీ ఇళ్లల్లోకి కనపడుతూనే ఉన్నవి.
చిన్నపిల్లలు ఆడవారు మరి భయబ్రాంతులకు గురి అవుతున్నారు. వాటికి ఇప్పుడు ఎగ్జా స్ట్ ఫ్యాన్ తో కూడిన పొగ గొట్టం, ఓ 30
నుంచి 40 అడుగుల ఎత్తు న పెడితే ఆ దుర్వాసన అంత పైకి వెళ్లి పోతుంది. ఈ దుర్వాసనలు ఎక్కువ అయినందువల్ల కాలనీలో
వారందరికీ కరోనా ప్రబలం అవుతుందేమో అని భయభ్రాంతులకు లోనవుతున్నారు. మీరు ప్రత్యక్షముగా చూచినచో మా బాధలు
మీరు అర్థం చేసుకొని ని వెంటనే ఇక్కడ ఆ కరోనా బాధిత శరీరాలను కాల్చడం తక్షణమే ఆపవలసిందిగా కాలనీవాసులుగా మీకు
విన్నవించుకుంటున్నాము.

ఇట్లు ,
తమ విధేయులు,
కాలనీవాసులు

You might also like