You are on page 1of 12

5 వ వారం – వత్తి డిని అధిగమించటం

నమస్తే

మన ఏకం సర్కిల్ కుటుంబ సభ్యులను చూడటం, ఒకరితో ఒకరు పరస్పరం కలవటం ఎంతో ఆనందంగా ఉంది.ఒక

కుటుంబంగా మాత్రమే మనం, మన బలాలని,, బాంధవ్యాన్ని,ఒకరికొకరు అనే భావనని, మనం

నేర్చుకున్నఙ్ఞా నాన్నీ పంచుకోగలుగుతాము. మన సమూహిక ఆశయాల సిద్ధి కూడా , మనం ఒక కుటుంబంగా

మెదిలినప్పుడే సాధ్యపడుతుంది.

మొదటిసారిగా ఈ సమావేశం లో పాలుపంచుకుంటున్న వారికి మన ఏకం సర్కిల్ కుటుంబం లోకి సాదర

సుస్వాగతం.

నేను....... ఒక ఏకం మిత్రా ని. నా ఆధ్యాత్మిక గురువులు ముక్తి సంప్రదాయానికి చెందిన వారు.

మొదటి తరంవారైన శ్రీ అమ్మాభగవానులు అవతార మూర్తు లుగా కొలువ బడుతున్నారు. వారి సుభాశీస్సులు,

దైవీక చైతన్యం ప్రకటమయ్యే ఒక మహా ద్వారాన్ని తెరిచి, బాధాతప్త మైన మన శరీరము, మనస్సులకి,

ఉపశమనాన్ని, భగవంతునితొ ఒక దివ్య అనుబంధాన్ని , నిత్య జీవితం లొ సుసంపన్నతని కలుగ జేస్తా యి.

ఈ తరం వారైన శ్రీ క్రిష్ణా జీ, శ్రీ ప్రీతాజీ లు రెండు విధాలుగా ఈ మహసంకల్పాన్ని కొనసాగిస్తు న్నారు.మొదటిదైన

వారి అమోఘ అధ్యాత్మికశక్తి, లిమిట్లెస్స్ ఫీల్డ్ ధ్యానం లోనూ, , వారి అపార దివ్య ఙ్ఞా నం , వారి ఙ్ఞా న బో ధలోను

ప్రకటితమౌతూ,సాధకుల చైతన్య పొ రలలోకి చొచ్చుకుపో యి , అన్నిరకాల మనో వేదనలనుంచి విముక్తిని

కలిగిస్తా యి.

ఒక్కసారి వారి దివ్య ఙ్ఞా నాన్నిఅందుకుంటే అది మీచైతన్యం లొ ఒక ప్రగాఢస్పందనగా మిగిలి, మీరు మీజీవితం లొ

ఉత్త మకార్యాలు చేసేలాగా మార్గ దర్శనం చేస్తూ , మీ జీవితాన్ని గొప్ప గమ్యాలకు చేరుస్తు ంది.

లెఫ్ ధ్యానం , మీ చైతన్యాన్ని విశ్వప్రఙ్ఞతో జతకలిపి మీకు మీ అంతర్యామి లేదా మీ ఇష్ట దైవంతో అనుబంధాన్ని

కలిగిస్తు ంది. పరిణామంగా మీరు జీవితం లో ఎన్నో యాద్రు ఛ్ఛిక ఘటనలు, మహిమలు అనుభవిస్తా రు.

శ్రీ క్రిష్ణా జీ, శ్రీ ప్రీతాజీ లు ఏకం ఉద్యమ సహ సంస్థా పకులు. మానవ చైతన్యం లో ఏకత్వ స్థితిని స్థిరంగా నిలిపే

ప్రయత్నమే, ఏకం ఉద్యమం. దీని మూలాలు,భారతీయ అంతీంద్రియ, యోగ సాంప్రదాయం లో ఉన్నాయి.

ఈ ఉద్యమానికి మూల కేఁ ద్రం గా విరాజమానమౌతున్నకట్ట డమే – ఏకం దివ్య క్షేత్రం.


అది కేవలం ఒకకట్ట డం కాదు. అది మానవ హ్రిదయాల లొ మెదిలే భావో ద్రేకాలకు ప్రతిస్పందించే ఒక సజీవ

మూర్తి. మనవ చైతన్యం లో ఒక ప్రగాఢ మార్పు తేవాలనే ఆశయంతో నిర్మితమయినదీ భవనం. ఇక్కడ మీ ఇష్ట

దైవంతో మీకు ముఖాముఖీ జరుగుతుంది. మీరు ముక్తిస్థితులను అనుభవిస్తా రు.

ఏకం క్షేత్రం వ్యాపించి, విస్త రించి, మిమ్మల్ని చేరే రూపమే ఈ ఏకం సత్సంగం . 8 వారాల పాటు జరిగే ఈ

సత్సంగాలుమీకు బహు విధాలైన బహుమతులను అందిస్తా యి.

ఈ వారం వత్తి డి నుండీ విడుదల అనే బహుమతిని మీరు అందుకోబో తున్నారు.

ముందుగా మన దేహన్ని, మనస్సుని కొంత రిలక్సు చేయటం ఎంతో అవసరం.

ఇప్పుడు ధ్యానం లోకి వెడతాము.

(Evening chants in the Samadhi hall/Bija)

మీ వెన్నెముకను నిటారుగా ఉంచి స్థిరంగా కూర్చోండి.

ముఖాన్ని రెలాక్సు చేయండి.

భుజాలను రిలాక్సు చేయండి.

నెమ్మదిగా ఊపిరి తీసుకుని వదులుతూ మీ పెదవులను, కన్నులను మూసివుంచండి

లోపలికి ఊపిరిని తీసుకుంటన్నప్పుడు మీ ఛాతి ముందుకు రావటాన్ని గమనించండి.

ఊపిరి వదిలేటప్పుడు, మీ ఛాతి వెనక్కి రావటాన్ని గమనించండి.

౩ ఊపిరుల పాటు శ్వాసపై మీ గమనిక వుంచండి.

మీ మనస్సు చలిస్తే సున్నిత్మగా మరల శ్వాసపై గమనికకు తీసుకొనిరండి.

(2-3 నిమిషాలు)... నెమ్మదిగా కనులు తెరవండి.

మీ మనస్సుని ప్రశాంతం గా , ఏకాగ్రతలో ఉంచడానికి ఈ ధ్యానం ఎంతో అవసరము.

వయస్సు , హొదాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్త ంగా ప్రజలందరిని పీడస


ి ్తు న్న అంటు వ్యాధి ఈ వత్తి డి.

అన్నివ్యాధులకంటే ఎక్కువగా సంభవిస్తు న్న మహమ్మారి ఈ వత్తి డి.


ఈ వత్తి డే ఎన్నొ శారీరక
ి , మానసిక రుగ్మతలకు దారితీస్తొ ంది. నిజానికి శారీరిక, మనసిక వత్తి డులను వేరు వేరుగా

చూడలేము. వీటి సంపూర్ణ నివారణే మనకుఅవసరం.

ఇప్పుదుఏకం సహ సంస్థా పకుల నుండి ఈ వత్తి డి స్వభావము, దానిని నివారించే సులభసాధనల గురించి

విందాము.

(play video)

(మిత్రా మార్గ దర్శనం కొసం)

నమస్తే,

మీకు తెలుసా 15 నుంచి 44 వయస్సుగల వారి లో అధిక శాతం మంది చనిపొ వడనికి ఆత్మహాని లేదాస్వీయ

హింస కారణమని? అంతే కాదు గణాంక వివరాల ప్రకారం ఈ స్వీయ హింస వల్ల మరణించే వారిలొ మహిళల కంటే

మూడు రెట్లు ఎక్కువగా మరణించేది పురుషులని.

ఎందువల్ల ? మీ కుటుంబం లో మీరు ఒక అపరిచిత వ్యక్తి లాగా జీవించటమే దీనికి కారణం. మన హ్రు దయాలలో

ఒకరికొసం ఒకరం అనే భావన కరువైపో యింది. స్నేహాలు పైపై మాటలుగానే మారిపో యాయి. చికాకు పరిచే

గాఢమైన వంటరితనం మనని చంపేస్తో న్ది . మనలో చాలా మంది రోజంతా సంగీతం వింటూనో, వీడియొలు

చూస్తూ నో, విడియో గేములు ఆదుతూనో, కాలం గడిపేస్తూ మనుషులనుంచి,ఇతర జీవులనుంచీ విడిపడి

ఒంటరిగా కాలం వెళ్ళదీస్తు న్నాం. మనకు ఎవరితోను ఎటువంటి అనుబంధమూ,కనెక్షనూ లేదు. ప్రకృతితో నే

కాదు, మనతో మనం పూర్తిగా తెగిపో యిన బంధాలతో జీవితం వెళ్ళబుచ్చుతూవున్నాం. మన బంధాలలో ఏదో

తెలియని వెలితిని అనుభూతిచెందుతున్నాం.

నేనంటాను, ప్రస్తు తం మన మనసుల్లో ఉన్న ఈ దుస్థితి నుంచి, దూరం చేసే ఒక పెను మార్పు అవసరం.

అంతేకాదు మనం ప్రపంచంతో తిరిగి ఎలా అనుసంధానం అవ్వాలో నేర్చు కోవాలి.

మీరు అరోగ్య సమస్యలతోగాని, ఆర్ధిక సమస్యలతోగాని, సతమౌతున్న సమయం లో ఈఅనుబంధమే ఆ

నెప్పినుంచీ మీకు ఉపశమనాన్నిచ్చే పైపూత అవుతుంది. మీ సమస్యలను అధిగమించటానికి, కొన్ని

సమయాలలో ఈ అనుబంధమే ఒక బలమైన శక్తిగా పరిణమిస్తు ంది. ఈ అనుబంధమే, తిరిగి మీకు భగవంతునితో

అనుబంధానికీ, జీవితం లొకి దైవానుగ్రహాన్ని పొ ందడానికి మార్గ మౌతుంది.

అనుబంధమంటే కేవలం ఒకరినొకరు పలకరించుకొవటం కాదు. ఇలాటి పలకరింపుల్లో నే


జీవితాన్ని ఇంతవరకూ గడిపేశాము. మన పలకరింపులు మన హృదయాలని డొ ల్లగానే మిగిల్చాయి.

హృదయాలలో ఆ నిండుతనమే లేదు.

అనుబంధమంటే ఒక వేడుకలో అందరూ కలవటం, గొల్ఫ్ ఆడటం, కలిసి సిగిరెట్టు తాగటం, చివరికి పూర్తిగా

అలిసిపో వటం కాదు. దాని అర్ధం ఖచ్చితం గా అది కానే కాదు.

అది కలసి సినిమాకి వెళ్ళటం, కలిసి సెలవులు గడపటం, పరస్పర సంభాషణ, కలసి వీడియో గేములు ఆడటం,

నెట్ లో కలిసి పనిచేయటం వంటి వాటికంటే ఎంతో ఎక్కువైనది.

అయితే అనుబంధం, లెదా అనుసంధానం అంటే ఏమిటి?

అనుబంధం అంటే అవతలివారి మనోభావాలకు స్పందించడం.

అవతలివారి ఆనందాన్ని హర్షించి పంచుకోవటం,వారితొ కలిసి వారి ఆనందాన్ని వేడుక చేసుకోవటం, వారి ఆనందం

నుంచి మన ఆనందం ఎప్పటికీ వేరు కాదని వ్యవహరిచడం.

అవతలి వారి దుఖానికి, అంతరంగ సంఘర్షణకి స్పందించడం. వారి అంతరంగ వ్యధనుంచి వారు బయటపడటానికి

పూర్తి ఎరుకతో సహాయపడటం.

అనుబంధం అంటే, వర్త మానంలో వుండటం. వర్త మానం లో వుండటం అంటే, అవతలవారి మానసిక పరిస్థితికి

తగిన రీతిలొ స్పందించటం. మన అలోచనల్లో మనం ఉంటూ , వూకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం కాదు.

అలాగని అవతలివారిని ఒక అంచనావేసి వదిలేయటం కాదు. మన జీవితానికి వారి ఉనికి ఎంత నిండుతనాన్ని

ఇస్తు ందో , అవసరమో అనుభూతి చెందటం.

అనుబంధమంటే ఒక ఆడ లక్షణం అనిపిస్తో న్దా ? ఇది ఆడ,మగతనాలకి సంబంధించినది కాదు. ఇది మానవత్వ

లక్షణం.

ఈ విష యాన్ని పూర్తిగా జీర్ణిన్చుకోవటానికి ఒక నిమిషం పాటు అవలోకనం చేద్దా ం.

“నాలుగు పరమ రహస్యాలు” అనె పుస్త కం నుంచీ, ఈ విషయాన్ని మరింత లోతుగా అవగాహన చేసుకోవటానికి

సంగ్రహించిన ఒక సందర్భాన్ని చూద్దా ము.

మీరు ఈ ఘటన వినేటప్పుడు వత్తి డి నుండి విముక్తి పొ ందిన జీవితం ఎలా కొత్త సంభవాలకీ, అవకాశాలకీ

దారిచేస్తు ందో గమనించండి.


(132,133)

ఆధ్యాత్మికంగా మంచి పని చేపట్ట టము అంటే, మొదట కొంత నిదానించి, శిరీన్ మైండ్ లేదా “ప్రశాంత మనస్సు”

అనే ధ్యానం తో మనలోని దుఃఖస్థితిని అధిగమించటంతో, సాధన ప్రా రంభం అవుతుంది.ఎందుకంటే మీ అంతర్యం

లోని దుఃఖ స్థితి అంతరించినప్పుడే ,స్పష్ట ంగా చూడగలగటము, అంతర్వీక్షణ సాధ్యమౌతుంది.

మన యూత్ చారిటీ ఫవుండేషన్ వారు అందించిన ఒక కోర్సులో పాల్గొ న్న ఒక యువకుడి అనుభవం ఇది.

అతని వయస్సు ఇరవై సంవత్సరాలకి అటూఇటూగా వుంటుంది. జీవితం లొ అన్ని అభిరుచులు కోల్పొయి,

జీవితం లో తారసపడే ప్రతి విషయం పట్ల ద్వేషం పెంచుకున్నాడు. అతను ద్వేషించే విషయాల పట్టికలొ ఈ మధ్య

అతను చేసే ఉద్యోగం కూడా చేరిపో యింది.అతను ఒక కాల్ సెంటరు ద్వారా పచ్చళ్ళు అమ్మే సంస్థ లొ పనిచేసే

వాడు. అక్కడ తను పెట్టు కునే హెడ్ సెట్ దగ్గ రనుంచి, తన కాల్ కి ఖాతాదారుల స్పందన వరకు అన్నివిషయాలు

అతనికి ఏవగింపు కలిగించే విషయాలే. చాలీ చాలని జీతం మరొక ద్వేషం. చూస్తూ చూస్తూ ఉన్న

వుద్యోగాన్నివదలుకోలేడు. అది కూడా లేకపొ తే ప్రతి నెలా కుటుంబ ఖర్చులకింద తన వంతు వాటా

సమకూర్చలేడు. ఖాళీగా వుండి, పెద్దవాడైపో తున్న తండ్రి తిట్ల ను, ఉపన్యాసాలను విని తట్టు కోలేడు.

నగరం లో ఒక అనామకుడిగా, ఎవ్వరికీ పట్ట నివాడుగా గడిపే జీవితం పట్ల అతనికి రోత. అల్లా గని ఏ ఉద్యొగం

లేకుండా తండ్రికి ముఖం చూపించలేడు. తండ్రి వూళ్ళో ,మంచి నీటి కుండలు తయారు చేస్తా డు. వూరికి

కావలసినఅంత వరకే కుండల తయారీ వుంటుంది. వచ్చే అమ్మకాలు , సంపాదన, నెలవారి కుటుంబ ఖర్చులకి

బొ టాబొ టీగా సరి పో తాయి. వూళ్ళొ కుండల అవసరము గాని, తన తయారీ సామర్ధ్యము గాని పెరగవు.అతని

తల్లిఇంటి పట్టు నఉన్నప్పుడు, వండి వారుస్తూ ,మిగిలినసమయంలో , సంపన్నుల పొ లంలొ కూలినాలిచేసేది.

అతనికి బీదరికం తాండవిస్తు న్న తన ఇల్ల ంటే ఏవగింపు.తానేమి సాధించలేనని తన బ్రతుకే నిరర్ధకమని

అనుకునేవాడు.

ఒకసారి తన ఉద్యోగంలోభాగంగా,ఫొ న్ పై కష్ట మర్ల ను కలిసే సమయంలొ మన ఏకం ఫౌండేషన్ సేవకులతో

సంభాషించడం తటస్థ పడింది. వారి సంభాషణ సుదీర్ఘంగా సాగింది. అతనిని దగ్గ రలొ ఉన్న ఒక పాఠసాలలోజరిగే

ఏకం ఆధ్యాత్మిక తరగతులకి ఆహ్వానించడం జరిగింది.జరిగింది.ఆ సాధనా కార్యక్రమం లో అతను తన

స్వీయద్వేషంతో జీవితాన్ని తానే నాశనంచెసుకుంటున్నాను అనే విషయం గ్రహించాడు. అదే సాధన మరింత

లోతుగా సాగి అతను తన తల్లిటంద్రు ల పట్ల ఉన్న ద్వేషం నుంచి బయటపడ్డా డు.
అపైన వచ్చిన సుదీర్ఘపు వారాంతపు సెలవలలొ తన గ్రా మానికి వెళ్ళినప్పుడు, తన తల్లితో వంటగదిలోచేరి,ఆమె

వండుతుంటే, మౌనంగా అమె పక్కన కూర్చునే వాడు. ఆసమయం లో మొదటి సారిగా అతనికి తన తల్లితో ఒక

తియ్యని అనుబంధాన్ని అనుభూతి చెందాడు. ఆరాత్రి తన తల్లి వంటచేస్తు ంటే తను సహాయం చేశాడు.ఇంతి

వద్ద వుంటూ చిన్నచిన్న ఇంటి పనులు చేస్తూ ఉంటే, ఇంత కాలంగా తాను పొ ందని ,ఆనందం అనుభూతి అయ్యేది.

ఆ పైన రెండురోజులు వరుసగా తనతల్లికివంటలో సాయంచేస్తూ , వండిన వంట రుచులు చవిచూస్తూ

గదిపాడు.వంటకాల ఘుమఘుమలు, రుచి అతనిలో ఒక కొత్త రుచిగ్రంధుల్ని మేలుకొలిపాయి అనుకునేవాడు.

అతని హృదయం లొ ఒక కొత్త తపన మొదలయ్యింది. భవిష్యత్తు పట్ల ధైర్యంతో కూడిన ఒక స్పష్ట త, వచ్చింది.

కాల్ కెంత్రె ఉద్యోగానికి రజీనామా చేసి ఇంటి ముఖం పట్టా డు. దేశీవంటకాల తయారీలో తన తల్లి,ఇతర గ్రా మం

లోని మహిళల వద్ద పూర్తి తర్ఫీదు పొ ందాడు. ప్రతివంతకంలోనూ వాడే ముఖ్య పదార్ధా లు,వాటిపాళ్ళు,

ఏమొతాదులొ ఏపదార్ధం వాడితే రుచి అధికమౌతుంది అనే రహస్యాలు తలకెక్కించుకున్నాడు. ఇప్పుడు అతను

మన కాంపస్సుల్లో ,ఒక దానికి మంచిపేరున్న వంట మాష్ట ర్.

సాధకుల అభిరుచులు, అవసరాలకు తగినట్టు రుచి కరమైన వంటకాలని అందిచడానికిభిన్నభిన్న మార్గా లను

ఎంచుకుంటాడు.తినేవారికి తమ స్వంత ఇంటి వంట గుర్తు వస్తు ంది. అతను ఇప్పుడు నిరంతరం ఒక మనొహర

స్థితిలో ఉండే ఒక వంట మాష్ట ర్. అతని స్థితి తను అందించే ప్రతి రుచికర వంటకం లోనూ ప్రతిబింబిస్తు ంది.

తినేవారికి అద్భుత రసస్వాదన.

వత్తి డి పై మీ అనుభవాలను పంచుకోండి. ఒకరిద్దరికి అనుభవాలను పంచుకునే అవకాశం ఇవ్వండి.

ఇప్పుడు శ్రీ ప్రీతాజీతో కలసి చేసే ధ్యానం లోకి వెళ్తా ము. ఇది మీ మనసులో వత్తి డిని పూర్తిగా కరిగించి వేసి అక్కడ

కమ్మే మంచు పొ గలను అంతం చేసే శక్తివంతమైన ధ్యాన సాధన.

( బ్రీతింగ్ రూమ్ నుంచి serene mind meditiation పెట్టా లి)

ప్రశాంత మనసు లేదా serene మైండ్ సాధనకు స్వాగతం.

ఈ మూడు నిమిషాల పాటు సాగే చిన్న సాధన నమ్మ శక్యం కాని అద్భుత ఫలితాలను ఇస్తు ంది. ఏ వయసు

వారైనా ఈ సాధన చేయవచ్చు.


ఇది ప్రతి నిత్యం చేయదగిన సాధన. ఎప్పుడెప్పుడు మీరు వత్తి డిలో ఉన్నా అప్పుడు అవసరాన్ని బట్టి ఈ సాధన

చేయవచ్చు.

మానసిక సంఘర్షణలో ఉన్న సమయంలో ఈ సాధన చేస్తే మీలో గజిబిజిని దూరం చేసి ఆలోచనలో స్పష్ట తను

ఇస్తు ంది

నిత్యం ఈ సాధన చేస్తే మీరు మానసిక ఉద్రేకంలో పదే పదే చేసే దురలవాట్ల సంకెళ్ల నుంచి విమోచన పొ ందుతారు.

మీలో ఒక ప్రగాఢ ప్రశాంతత, జీవిత సవాళ్ల పట్ల ఆంతర్యంలో లోతైన అవగాహన ఏర్పడతాయి.

స్థిరంగా కదలకుండా కూర్చోండి

బొ డ్డు నుంచి ఏకాగ్రతతోనూ, పూర్తి ఎరుకతోనూ మూడు ఊపిరులు తీసుకోండి.

మౌనంగా మీలో మెదిలే భావోద్రేకలను స్పష్ట ంగానూ, ఖచితంగానూ గమనించండి

అది ఏ వైపుకు వెళుతోందో గమనించండి.

అది గతంలోకి వెళుతోందా, లేదా ఒక అగాధమైన భవిష్యత్తు ను సృష్టిస్తో ందా? లేక మీరు వర్త మానంలో ఉన్నారా?

మీ కనుబొ మ్మల మధ్య ఒక చిన్న వెలుగు రేఖను ఊహించండి. అది నెమ్మదిగా మీ తల మధ్య భాగంలోకి

ప్రయాణిస్తు న్నట్లు ఊహించండి.


ఆ వెలుగు మీ తల మధ్య భాగంలో వెలుగుతూ తేలియాడుతున్నట్లు ఊహించండి.

నెమ్మదిగా మీ కనులు తెరువవచ్చు.

ఈ సాధనలో కీలక విషయం ఏమిటంటే సాధనకి కేవలం మూడు నిమిషాల మాత్రమే పడుతుంది . ఈ సాధన

ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు.

మీ పిల్లలతో కానీ, జీవిత భాగస్వామితో కానీ వాదిస్తు న్న సమయంలో మీ మనస్థితిని సవరించుకోడానికి ఎంతో

ఉపయోగపడుతుంది.

ఒక పెద్ద సమావేశంలో మీరు మాట్లా డే ముందు మీ ఆలోచనలు, గజిబిజిగా, ఆస్పష్ట ంగా ఉన్నప్పుడు ఈ సాధన

చేసి మనసుని ఉత్తేజ పరచవచ్చు.

మీరు నిత్యం చేసే యోగ సాధన, వ్యాయామం పట్ల విముఖతను అధిగమించడానికి ఈ సాధన ఎంతో

తోడ్పడుతుంది.

గుర్తు ంచుకోండి, జీవితంలో పూర్తి ఏకాగ్రతని, శక్తిని పొ ందటానికి ఈ మూడు నిమిషాల సాధన సరిపో తుంది. మీరు

గతం గురించి గాని, భవిష్యత్తు పట్ల కానీ అతిగా బాధ పడినప్పుడు మీరు ప్రశాంతంగా, నిర్మలమైన మనసుతో

ఉంటారని మీరు గ్రహిస్తా రు. ఇప్పుడు మీరు వర్త మానంలో జరిగే ప్రతి విషయాన్ని హుందాగా, సులువుగా

స్వీకరించగలుగుతారు.
దీక్ష

ఇప్పుడు ఏకం సత్సంగంలో సంభవం అనే భాగానికి వెళ్తా ము. దీక్షను స్వీకరిస్తా ము.

దీక్ష ఒక సాధనగానీ, ధ్యానం కానీ కాదు. ఒక పద్ధ తి కానీ, పరికరం కానీ, అది కాదు.

అది మానవ మనస్సు, ప్రయత్నాలకి సంబంధించనిది.

దీక్ష ఒక దైవీక సంభవం. అది దైవానుగ్రహం, ఆశీర్వచనం, మీలోకి ప్రవహించే ఒక పవిత్ర క్షణం. అది ఒక దైవీక

సమయం, దైవీక చర్య, దైవీక సంభవం.

జాతి, మతము, నాగరికతల వంటి అన్ని రకాల విభజనను అధిగమించే ఒక సత్యమైన ఆధ్యాత్మిక సంభవం. దానికి

ఎల్ల లు లేవు. అది భూతవైద్యం కాదు, ఏ కొద్ది మందికో మాత్రమే చెందినది కాదు. మానవాళి అంతా

అనుభవించడానికి ఉధ్భవిస్తు ంది.

ఈ పవిత్ర లక్ష్యంతోటి దీక్ష అనే సంభవం మొదటిసారి శ్రీ కృష్ణా జీ ద్వారా ప్రవహించింది. మరి శ్రీ భగవాన్

సంకల్పించినట్లు ముక్తు లతో నిండిన ప్రపంచ సృష్టిలో ప్రతి మానవుడు పాలుపంచుకుని, భాగస్వాములు అవడానికి

ఒక మాధ్యమంగా పరిణమించింది.

మీరు దీక్షను అందుకోడానికి సిద్ధమా?

ఏకం మంత్ర ఉచ్చరణతో ప్రా రంభిస్తా ము


ఈ మంత్ర ఉచ్చారణ ద్వారా మనం ఏకం నుండి వచ్చే శక్తి తరంగాలతో అనుసంధానమై శక్తిని అందుకుంటాము.

ఏకం నుంచి వచ్చే అనంత విశ్వశక్తి తరంగాలు మీలోని ఆధ్యాత్మిక శక్తు లను ఉద్దీపన చేసి, మిమ్మల్ని పారలౌకిక,

అతీంద్రియ స్థితులకు కొనిపో తాయి.

ఏకం మంత్రం: హంసస్సోహం ఏకం

ఈ మంత్ర భావాన్ని అర్ధం చేసుకోడానికి ఏకం కేవలం ఒక కట్ట డమో, నిర్మాణమో కాదు అని గ్రహించండి.

అది ఒక చైతన్య స్థితికి ప్రతీక. మానవుడు ఈ శరీరంతో అనుభవించగల అత్యున్నత చైతన్య స్థితి లేదా స్థా యి.

ఏకం అంటే - ఒకటి - తననుండి వేరు లేనిది - ద్వంద్వాలు లేనిది - అన్ని రకాల విభజన అంతమైన ఒక స్థితి.

నాది, నాది కానిది అనేవి అక్కడ లేవు. ఉన్నదంతా ఒక్క జీవితం, ఒక చైతన్యం, ఒక్కటే ఒక్కటి.

మానవుడిని సశరీరంగా అత్యున్నత చైతన్య స్థా యికి చేర్చాలనే దివ్య సంకల్పంతోనే శ్రీ కృష్ణా జీ ఈ భవన నిర్మాణం

చేపట్టా రు.

ఈ ద్వంద్వాలు లేని స్థితినే ఏకం మంత్రం విశదపరుస్తు ంది.

హంస అంటే నేను విశ్వ ప్రజ్ఞతో ఉన్నాను, విశ్వ ప్రజ్ఞ నుండి నేను వేరు కాను. సో హం అంటే విశ్వ ప్రజ్ఞ నాతో ఉంది.

విశ్వ ప్రజ్ఞ నా నుంచి వేరు కాదు. ఏకం అంటే ఒకటే. అదే విశ్వ ప్రజ్ఞ.

మంత్రా న్ని జపించే సమయంలో ఈ భావనతో ఉందాం.


గమనిక: ఏకం చిత్రం చూపించి - ఏకంతో అనుసంధానం కానివ్వండి. ఏకం మంత్ర ఉచ్ఛారణ మన చైతన్య

ద్వారాలను దైవానికై తెరుస్తు ంది.

ఏకం మంత్రం ఉచ్ఛారణ 21 సార్లు జరపాలి. ఏకం మిత్రా గా మీరు అందరితో కలిసి 11 సార్లు జపిస్తా రు. తరువాత

మీరు దీక్షానివ్వడం ప్రా రంభిస్తా రు.

అది స్పర్శ దీక్ష అయితే దానిని గురించి అందరికీ తెలియచేయండి. అది స్మరణ దీక్ష అయితే ఆ సమయం గురించి

వారికి తెలియజేయండి.

స్పర్శ దీక్ష:

ఇప్పుడు మీరు స్పర్శ దీక్ష అందుకుంటారు. మీ తలపై చేతులు ఉంచి దీక్ష అందించబడుతుంది. ఈ సాధనలో

మనం వేసే ప్రతి అడుగుతోనూ దైవంతో మన అనుబంధం మరింత దృఢమవుతుంది. కనులు మూసుకుని మీ

ఇష్ట దైవంతో అనుబంధంలో ఉండి, మీలో వత్తి డి తాలూకు విష ఛాయలను దూరం చేయమని, శాంతి, నిశ్చలతతో

కూడిన మనోహర స్థితిని ప్రసాదించమని సంకల్పం తీసుకోండి.

Sparsha deeksha ( Heart of the Universe or Empty Sky)

మీ శరీరాన్ని అనుభూతి చెందండి. శరీరంలోని ప్రతి కణంలోనూ దైవశక్తి నిండి మీ నుండి వత్తి డిని దూరం చేస్తు ంది.

( Opening or angel passion, angel prayer)

దైవానికి, ఏకానికి కృతజ్ఞ తలు తెలుపుతూ ఈ పాటకు నృత్యంతో పాలుపంచుకోండి (pine hert or forever

rapture)
ఇప్పుడు ఈ దీక్షా శక్తిని మీ ఆత్మీయులకు అందించే సమయం. మీతో మానసికంగా బలమైన అనుబంధంగల వారే

మీ ఆత్మీయులు. శ్రీ కృష్ణా జీ, శ్రీ ప్రీతాజీ అంటారు, ఆత్మీయులపై మన ప్రభావం, మనపై ఆత్మీయుల ప్రభావం చాలా

బలంగా ఉంటుంది అని. మనం ఒకరితో ఒకరం పరస్పరం అనుసంధానమై ఉంటాము. మీకు ఇష్ట మైన తొమ్మిది

మంది ఆత్మీయులను అనుభూతి చెందండి. వారి శ్రేయస్సుకి సంకల్పం తీసుకోండి. వారు వారి చైతన్యంలోని దైన్య

స్థితులనుంచి విముక్తు ల కావాలని, వారి చైతన్యంలో ఆనందం, శాంతి నెలకొనాలని, వారి జీవితం మనోహరం

కావాలని భగవంతుని కోరండి. ( 3 ని"లు)

మన ఆత్మీయులకు భగవంతుని ఆశీర్వచనం అందిన ఈ శుభ సందర్భంలో మనందరం కలిసి సంతోషంగా ఈ

క్షణాలను అనుభవిద్దా ము.

అంతా కలిసి ఏకం ప్రా ర్థన చేయించండి.

You might also like