You are on page 1of 2

ఆముదం చెట్లలో తెలుపు, ఎరుపు, పెద్దా ముదం అనే మూడు జాతులన్నాయి.

చిన్న ఆకులు గల ఆముదం చెట్టు నే

చిట్టా ముదపు చెట్టు అంటారు. ఇది పెద్దా ముదము చెట్టు కన్న శ్రేష్ఠమైనది. పొ డవైన అయిదు కొనలు కలిగి అరచేయిలాగా

ఆకు ఉంటుంది. ఆరోగ్యాన్ని అందివ్వటంలో మాదెప్పుడూ పై చేయి అన్నట్లు గా ఈ చెట్ట ఆకులు ఎల్ల ప్పుడూ పైకి

ఎత్తు కునే ఉంటాయి. క్రిందికి వాలవు.

గుణాలు...

ఇది కారం, చేదు రుచులతో వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. సమస్త వాతరోగాలనూ పో గొట్ట డంలో అగ్రస్థా నం దీనితే.

కడుపులోను, పొ త్తి కడుపులోను వచ్చే నొప్పులను, రక్త వికారాలను నివారింప చేస్తు ంది.

మొలలు హృద్రో గము, విషజ్వరము,కుష్ఠు , దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర బంధము మొదలైన

సమస్యలను కూడా సులువుగా పో గొడుతుంది. శరీరంలో పేరుకుపో యిన దుష్ట విష పదార్థా లను కరిగించి బయటకు

తోసివస
ే ్తు ంది. నరాలకు సత్తు వ కలిగిస్తు ంది. కడుపు నొప్పిని తగ్గించటంలో ఇంత నాణ్యమైనది మరొకటి లేదని కూడా

చెప్పవచ్చు.

ఆముదం వల్ల ఉపయోగాలు :

చెవిపో టుకు...

ఆముదపు ఆకులను నిప్పులపైన వెచ్చచేసి దంచి రసం తీసి, దానితో సమానంగా అల్ల ం రసం, నువ్వుల నూనె, అతి

మధు రం, ఉప్పు కలిపి తైలం మిగిలేవరకు చిన్న మంట మీద మరగబెట్టి వడపో సి, ఆ నూనె చెవిలో పది చుక్కలు వేస్తే

వెంటనే చెవిపో టు తగ్గిపో తుంది.

శరీరంపై నల్ల మచ్చలకు...

ఆముదపు గింజలు 225 తీసుకొని పై పెచ్చులు తీసివస


ే ి, లోపలి పప్పులో 12 గ్రా ముల శొంఠి పొ డి కలిపి మెత్తగా నూరి,

కుంకుడు గింజలంత మాత్రలు చేసి నిలువ ఉంచుకొని, పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా మంచి నీళ్ళతో

వేసుకొంటూ ఉంటే రెండు లేక మూడు నెలల్లో నల్ల మచ్చలన్నీ సమసిపో తాయి.

బో దకాళ్ళకు...

ఆముదం వేళ్ళు, ఉమ్మెత్త వేళ్ళు, వావిలి చెట్టు వేళ్ళు, తెల్ల గలిజేరు వేళ్ళు, మునగ చెట్టు వేళ్ళు, ఆవాలు వీటిని

సమానంగా తీసుకొని మంచి నీటితో దంచి రసాలు తీసి, ఆ రసం ఎంత ఉంటే అంత ఆముదం కలిపి, నూనె మాత్రమే

మిగిలే వరకు మరగబెట్టి, వడపో సి, ఆ నూనెలో సగభాగం తేనె మైనం కలిపి ఆయింట్‌మెంట్‌లాగా తయారు చేసుకొని
నిలువ ఉంచి, బో దకాల మీద లేపనం చేస్తూ ఉంటే కాలు యధాస్థితికి వచ్చే అవకాశం ఉంది.

దగ్గు కు...

ఆముదంలో తాలింపు వేసిన చామదుంపల కూర తింటూ ఉంటే దగ్గు లు తగ్గిపో తాయి.

మూత్రపిండ వ్యాధులకు...

మంచి ప్రశస్త మైన ఆముదాన్ని రోజూ రాత్రి పడుకోబో యే ముందు పది గ్రా ముల మోతాదుగా నియమబద్ధ ంగా శారీరక

శక్తిని బట్టి సేవిస్తూ ఉంటే మూత్రపిండాలు బాగుంటాయి. మూత్ర బంధం విడిపో తుంది. మూత్ర కోశంలోని రాళ్ళు

కరిగిపో తాయి.

అరికాళ్ళ మంటలకు...

ఆముదము, కొబ్బరి నూనె సమానంగా కలిపి అరికాళ్ళకు బాగా మర్దనా చేస్తూ ంటే, అతిత్వరగా అరికాళం్ళ మంటలు

అణగిపో తాయి.

కీళ్ళ నొప్పులకు...

ఆముదము చెట్టు చిగురాకులు, ఉమ్మెత్త చిగురాకులు, జిలేే్లడు చిగురాకులు, పొ గాకు చిగురాకులు వీటిని భాగాలుగా

తీసుకొని మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఆరబెట్టి నిలువ ఉంచుకొని, పూటకొక మాత్ర మంచినీళ్ళతో

సేవిస్తూ ఉంటే కీళ్ళ నొప్పులు హరించి పో తాయి.

సుఖనిద్రకు...

ఎర్రా ముదం చెట్టు వేరు 10 గ్రా ములు మోతాదుగా తీసుకొని నలగ్గొ ట్టి పావు లీటర్‌నీటిలో వేసి సగం నీళ్ళు మిగిలేలా

మరగబెట్టి, వడపో సి త్రా గితే సఖంగా నిద్ర పడుతుంది.

అతి నిద్రకు...

ఆముదపు చెట్టు పూవులను పాలతో నూరి కణతలకు పట్టు వేసి, తల పైన కూడా వేసి కట్టు కడితే అతి మగతగా ఉండి

ఎక్కువగా నిద్ర వచ్చే సమస్య నివారణ అవుతుంది.

రేచీకటికి...

మంచి వంటాముదాన్ని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తలకు పెడుతూ ఉంటే, రెండు మూడు నెలలలో రేచీకటి తగ్గి

పో తుంది.

You might also like