You are on page 1of 3

ఎన్నటికి ముడిపడని ప్రయత్నాలు,

ముగింపులేని ముడివడని పరిష్కారాలు   

మురుగునపడ్డ పన్నీరులా మసకబారుతున్న

ఆదర్శవాదుల జాతీయ ఆశయాలు

అధికారం వెనుక మేటవేసిన అంతులేని అసహజత్వం .

గణతంత్ర విపణివీధిలొ ధనస్వామ్యం పరమై న జనస్వామ్యం

సామాన్యుడి అవసరం పెట్టు బడిగా మారి

పేదవాని భూములు వాణిజ్య సేజ్జు లుగా మారి

జనజీవన సేవలు అంగడి వస్తు వులై నప్పుడు

మద్య తరగతి మనిషి మనుగడ మ్రు గ్యమై నప్పుడు

నిస్సహాయ స్థి తిలో నాలుగు దారుల కూడలిలో

గళమెత్తలెక    అస్తి పంజరంలా నిలబడ్డ సగటు మనిషిని చూసి

రక్త ం మరిగిన ఓ కాయం !

ఎదురుతిరిగిన ఓ ఆవేశం !
నిప్పులుకక్కిన ఓ నేత్రం!

భువనభోన్తరాలు దద్దరిల్లే లా విప్లవశంఖం పూరించింది ఓ ఖంటం   

ఓర్వలేని ధనస్వామ్యగద్దలు కోరలు చాచాయి

ఖాకి కాకులను ఉసిగొల్పాయి .

ఎలుగెత్తి ఆ గళం భిగించిన ఆ పిడికిలి అడవిపాలయ్యింది

మొక్కమానుల నడుమ, నిప్పుపువ్వై పూసింది

ఖణఖణమండె నిప్పు ఖణికయ్యిన్ది .

భగభగమండె అగ్గి కొలిమయ్యింది

దావానలమయ్యింది .కార్చిచ్చు అయ్యింది

రగిలే విప్లవాగ్నయ్యింది

ధనస్వామ్య ప్రజాస్వామ్యంపై తిరగబడ్డ అగ్నేయాస్త్రమయ్యింది .

ఉలిక్కిపడి, ఖంగుతిన్న,ఓర్వలేని ధనస్వామ్యం

అడవిని ముట్టడించి రగిలే కార్చిచ్చును చుట్టు ముట్టి మట్టు బెట్టి ంది

పోరాడిన ఆ కాయం అలసిపోయింది


ఎలుగెత్తి న ఆ గళం    మూగబోయింది

అడవితల్లి సాక్షి గా వినమరుగయ్యింది

శాశ్వతంగా    కనుమరుగయ్యింది                  అమరగీతం

You might also like