You are on page 1of 1

గతించిన జగతి జనన మరణాల సంపుటాల సంకెలలు

యుగయుగాలుగా చరిత్రను కాలం మోసుకోస్తు న్నది ఆనవాయితీగా


కాలం మాత్రం చరిత్రకు ఉనికిగా అవగాహనకు
అందని కథనాలను ఉంచుతున్నది సాక్ష్యంగా
కానరాని చరిత్ర కడలంత ఉంటే
ఇసుక రేణువంత చరిత్ర సాక్ష్యమా !
దివ్యదృష్టి కాలంలో నేలేను జన్మజన్మల డైరీ చదవడానికి
జరుగుతున్న చరిత్రే జరిగిందని నమ్మే పరిస్థితి లేని
ఈ ఆధునిక అసహజ సమాజంలో
నమ్మమంటావా!
నిజం కానరాని ఆ పాత రాతి యుగం నాటి నిజాల్ని
కాలం కనిపెట్టిన మరమనుషులం మనం
కొనసాగిస్తు న్నాం అనాదిగా ఈ నగ్న అసత్యాలను సంప్రదాయంగా
మనిషి మనస్సులో చాలక చరిత్ర,
పుస్తకాల పేజీల్లో మేటలు వేసింది
కాలానికి సమాంతరంగా పయనిస్తూ అసలైన
నిజాన్ని ప్రోగుచేసి క్రొత్త చరిత్ర సృష్టి ంచాలనివుంది
కాని కాలనికి వ్యతిరేకంగా పనిచేయలేని
ఈ మరమనిషి కాలం చెల్లిఫోతున్నాడు

చరిత్ర

You might also like