You are on page 1of 2

శ్రీ వివేకానంద వైద్యశాల, కొక్కిరేణి, సేవా భారతి- తెలంగాణ.

పేదల పాలిట పెన్నిధి సేవా భారతి

పేద, అట్ట డుగు వర్గా ల ప్రజలు స్వావలంబన అయ్యి ఇతరులకు సహాయపడే దశకు చేరుకునేందుకు సేవా

భారతి చేస్తు న్న కృషి అమోఘమని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు

అన్నారు.సూర్యాపేట జిల్లా లోని మునగాల మండలం కొక్కిరేణి గ్రా మంలో డాక్టర్ పుల్ల య్య స్మారక భవనం లో

సేవాభారతి వారిచే నిర్మించబడిన శ్రీ వివేకానంద వైద్యశాల జూన్ 24 శుక్రవారం రోజున శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు

ప్రా రంభిస్తూ మాట్లా డారు.కరోన సమయంలో మరియు ఇతర సమయాల్లో నూ సేవా భారతి చేసన
ి సేవలను

కొనియాడారు. 1974 లోనే ఆసుపత్రికి డాక్టర్ శ్రీ పో టు పుల్ల య్య గారు అందించిన సేవలు మరువ తగినవి కావు

అని అన్నారు. పేదలకు సేవ చేసిన మహానుభావులను గుర్తు ంచుకొని భావితరాలకు తెలియజేయాలని

సూచించారు. సేవా భారతి ఇలాంటి మారుమూల గ్రా మాలలో సేవా కార్యక్రమాలను చేయటం

అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే కొక్కిరేణి రోడ్డు సమస్యను పరిష్కరిస్తా నని

హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆస్పత్రికి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తా మని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రా ంత సేవా ప్రముఖ్ శ్రీ వాసు ఉసులుమర్తి గారు

మాట్లా డుతూ 1974 లో అప్పట్లో ప్రచారకగా పనిచేసిన శ్రీ ఈసీ రామ్మూర్తి గారు ప్రో ద్బలంతో డాక్టర్ పో టు

పుల్ల య్య గారి కృషితో శ్రీ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఈ ఆస్పత్రి ప్రా రంభించబడింది.

ఈ ఆసుపత్రి 1994 వరకు ప్రజలకు సేవలు అందించడం అయినది. కొక్కిరేణి చుట్టు ప్రక్కల 25,30 గ్రా మాలకు

సరైన వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న కారణంగా సేవా భారతి 65 లక్షల రూపాయలతో సువ్యవస్థ ం చేసి

పునఃప్రా రంభించారు. ఈ వివేకానంద వైద్యశాలలో అనుభవం కలిగిన ఇద్ద రు డాక్టర్లు అందులో ఒకరు మహిళ

డాక్టరు వీరు 24/7 సేవలందిస్తా రని తెలియజేశారు. ఇందులో జనరల్ ఫిజీషియన్, గైనకాలజీ, జనరల్ సర్జ రీస్

మరియు ప్రసూతి సదుపాయాలతో పాటు పైధలజీ ల్యాబ్ మరియు ఫార్మసీ ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.

రాబో యే రోజుల్లో ఈ కేంద్రం ఆధారంగా చుట్టు పక్కల గ్రా మ ప్రజలకు వైద్యంతో పాటు పేద విద్యార్థు లకు

విలువలతో కూడుకున్న విద్య మరియు యువకులకు మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రా లను

ప్రా రంభించనునట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ పో టు పుల్ల య్య గారి కుమారుడు పో టు రాజేంద్ర గారు

డాక్టర్ పో టు పుల్ల య్య గారి జీవిత విశేషాలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సుధీర్ గారు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సూర్యాపేట నగర మాననీయ సంఘ చాలకులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత

వహిస్తూ రాబో యే రోజులలో ఈ ఆస్పత్రిలో అవసరమైన స్పెషలైజేషన్ చికిత్స కూడా అందుబాటులోకి తెస్తా మని

తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి ఎమ్ హెచ్ ఓ శ్రీ కోటా చలం గారు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీ హర్ష వర్ధ న

గారు, గ్రా మ సర్పంచ్ శ్రీమతి కామెర్ల బుచ్చమ్మ గారు ఆర్ఎస్ఎస్ సూర్యాపేట జిల్లా మాననీయ సంఘ

చాలకులు శ్రీ అప్పయ్య గారు, ఈ ఆసుపత్రి సంస్థా గత సభ్యులు కొండ రామకృష్ణా రెడ్డి గారు, సేవాభారతి

తెలంగాణ ప్రా ంత సభ్యులు శ్రీ పో టు శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొ న్నారు. ప్రా రంభం కంటే ముందు వాస్తు

పూజ మరియు గణపతి హో మం నిర్వహించబడినది దాంతోపాటు వచ్చిన పెద్దలచే మొక్కలు నాటించడం

జరిగినది.

You might also like