You are on page 1of 1

From To

Mandal Educational Officer, District Educational Officer,


MAndal Praja Parishad, East Godavari,
Kadiam. Rajhmundry.

Sir

Sub: Education–Elementary Education – Mandal Praja PArishad, Kadiam – MPPS-2


మురమండ నందు పనిచేయుచున్న శ్రీమతి నక్కా ఆనందకుమారి పై చేసిన
పిర్యాదును వెనుకకు తీసుకొనుట గురించి...

Ref: 1 ది.18.12.2021 నా యొక్క సంతకము ఫోర్జరి అయినదని తమకు చేసిన ఫిర్యాదు .


2 ది. 17.6.2023 న శ్రీమతి నక్కా ఆనందకుమారి MPPS-2, మురమండ వారు
సమర్పించిన వివరణ విన్నపములు.

పై సూచిక 1 లో శ్రీమతి నక్కా ఆనందకుమారి SGT MPPS-2, మురమండ వారు శ్రీ చేకూరి శ్రీరామమూర్తి గారు 20 కోట్లు
లోను పొందుటకు గాను అండర్ టేకింగ్ బాండ్ పై తాను గ్యారంటీ సంతకము చేయటమే కాక నాయక్క సంతకమును కూడా ఫోర్జరీ చేసి
యున్నారని ది. 18.12.2021 న ఫిర్యదు చేసియున్నాను.

పై సూచిక 2 లో నాయక్క సంతకమును ఫోర్జరీ విషయమై శ్రీమతి నక్కా ఆనందకుమారి SGT MPPS-2, మురమండ వారిని
పలుమార్లు వివరణ కోరగా ఆ ఫోర్జరీ సంతకము తాను చేయలేదని తెలుపుతూ కింది విధంగా తనయొక్క వివరణ తెలియజేసియున్నారు.

తాను 20 కోట్ల విలువైన అండర్ టేకింగ్ బాండ్ పై మండల విద్యా శాఖాధికారి వారిని సంతకం చేయమని అడగటం వాస్తవమేనని,
అయితే అండర్ టేకింగ్ బాండ్ పై సంతకం చేయుటకు మండల విద్యా శాఖాధికారి వారు అంగీకరించలేదని తెలిపారు. అయితే 2 రోజుల
తరువాత తనకు పరిచయం లేని ఇద్దరు వ్యక్తు లు వచ్చి మమ్ములను MEO గారు పంపించారని తెలిపి అండర్ టేకింగ్ బాండ్ పై సంతకము
చేస్తా నన్నారని చెప్పి నా వద్దనుండి ఫైల్ తీసుకొని వెళ్లి మరొక రోజు తరువాత సంతకము చేసారని చెప్పి ఆ ఫైల్ మాకు ఇచ్చారని తెలిపారు. ఆ
వ్యక్తు లు మాస్కు ధరించినందున తాను గుర్తించలేకపోయానని తెలిపారు. అయితే మండల విద్యా శాఖాధికారి వారి సంతకము ఫోర్జరీ అయిన
విషయం తనకు మెమో వచ్చినంతవరకు తెలియలేదని పేర్కొన్నారు.

అయితే ఆ ఫోర్జరీ సంతకము తాను చేయలేదని తెలిపారు ఏది ఏమైనప్పటికి పరిచయం లేని వ్యక్తు లకు ఫైల్ ఇవ్వటం పొరపాటు
అయినదని దాని మూలంగానే ఈ ఫోర్జరీ సంతకము జరిగినదని పేర్కొన్నారు. తన అజాగ్రత్త వలన జరిగిన పొరపాటుకు మన్నించమని
వేడుకొన్నారు. మరియు తన కుటుంబం మొత్తం తనపై ఆధారపడి ఉన్నదని అందువలన క్షమించమని కోరియున్నారు. మరియు ఇంకెప్పుడు
ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతానని తెలిపారు.






పైన తెలిపిన వివరణలో శ్రీమతి నక్కా ఆనందకుమారి SGT MPPS-2, మురమండ వారికి అండర్ టేకింగ్ బాండ్ పై సంతకం
కోసం వచ్చినపుడే 20 కోట్ల విలువైన బాండ్ పై నాకు సంతకం పెట్టె అధికారం లేదని ప్రస్ఫుటంగా తెలియజేశాను, మరియు కొంత మంది
వ్యక్తు లచేత సిఫారసు చేయఁచినపుడు కూడా సంతకం చేయటం వీలుపడదనే తెలియజేశాను. శ్రీమతి నక్కా ఆనందకుమారి గారు తెలిపిన
విషయములలో మాస్కు ధరించిన వ్యక్తు లు వచ్చి ఫైల్ తీసుకొనివెళ్ళారనటంలో కొంత నమ్మశక్యంగా లేదు దీనిపై స్థిరమైన ఎంక్వయిరీ వేసినట్లైన
నిజానిజాలు తెలుస్తా యి.

అయినప్పటికీ దీనిని మొదటి తప్పుగా పరిగణించి ఇకపై ఇలాంటి పోరాటు చేసినట్లయితే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించి సదరు
నక్కా ఆనందకుమారి గారి పై ఇద్దరు పిల్లలు ఆధారపడి ఉన్నందున, వారి కుటుంబ బాధ్యత మొత్తం ఈమె పై ఉండుటచేతన ఆమె కుటుంబ
దీనగాథను దృష్టిలో ఉంచుకొని క్షమించు చున్నాను.

ధన్యవాదములతో
తమ విధేయుడు

You might also like