You are on page 1of 1

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-12-04T19:37:58+05:30 IST

తెలంగాణ సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరుని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈనెల 7 వ తేదీన ఉదయం 10 గంటలకు
పూర్తిస్థా యిలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్‌ 5, 6 తేదీలు మంచిరోజులు కాదని ప్రమాణ స్వీకారాన్ని 7 వ తేదీకి
వాయిదా వేశారు.7 వ తేదీన ఉదయం రేవంత్‌రెడ్డితో పాటు పూర్తి స్థా యిలో మంత్రి వర్గం కొలువు తీరనున్నది.

BIG Breaking: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి


హై దరాబాద్: తెలంగాణ సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) పేరుని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈనెల
7 వ తేదీన ఉదయం 10 గంటలకు పూర్తిస్థా యిలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్‌ 5, 6 తేదీలు మంచిరోజులు
కాదని ప్రమాణ స్వీకారాన్ని 7 వ తేదీకి వాయిదా వేశారు.7 వ తేదీన ఉదయం రేవంత్‌రెడ్డితో పాటు పూర్తి స్థా యిలో మంత్రి వర్గం కొలువు
తీరనున్నది.

Video Player is loading.


cdsfdssdfdsf
Advertisement

Close Player

వారు ఢిల్లీ వచ్చిన తర్వాతే సీఎంపై నిర్ణయం: మాణిక్యం ఠాగూర్

ఢిల్లీ: పార్లమెంట్ స్ట్రా టజీ కమిటీలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే చర్చ జరిపినట్లు కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్యం
ఠాగూర్ ( Manikyam Tagore ) తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఏఐసీసీ పరిశీలకులకు అథారైజేషన్ ఇచ్చారని అన్నారు.
పరిశీలకులు ఢిల్లీకి వస్తు న్నారు. వారు అధిష్ఠా న పెద్దలతో భేటీ అవుతారని చెప్పారు. పరిశీలకులు ఏఐసీసీ అధ్యక్షుడి మల్లికార్జు న ఖర్గేకి
నివేదిక ఇస్తా రన్నారు. ఎవరు సీఎం అనేది అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని మాణిక్యం ఠాగూర్ తెలిపారు.

ఏఐసీసీ అగ్ర నేతలు నిర్ణయం తీసుకుంటారు: జైరాం రమేష్

తెలంగాణ సీఎల్పీ నేత ఎంపికపై రేపు (మంగళవారం) ఏఐసీసీ అగ్ర నేతలు నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్
( Jairam Ramesh ) అన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ స్టా టజీ కమిటీ సమావేశంలో సీఎల్పీ అంశంపై చర్చ జరగలేదని జైరాం
రమేష్ చెప్పారు.

You might also like