You are on page 1of 1

దేవుడు నరులను యదార్దవంతులుగా పుట్టించేను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు. ప్రసంగి - 7:29.

ఔను నిజమే పుట్టినప్పుడు మనిషి యదార్దవంతుడే గాని వయసు పెరుగుతున్న కొద్ది ఆ మనిషిలోని యదార్దత

(నిర్మలత్వం,నిష్కపటత్వం) అంతా నెమ్మదిగా మాయమై ఆ స్దా నంలో స్వార్దం,సంకుచిత మనస్త త్వం,జాలిలేని మనస్త త్వం వచ్చి చేరాయి.

అందుచేత మనిషి తోటివాని అనగా కనీసం తన కుటుంబ సభ్యులకు గాని, తల్లిదండ్రు లను గాని, తోబుట్టు వులను గాని

ప్రేమించలేకపో వుచున్నాడు. బైబిల్లో యేసుప్రభువు వారు చెప్పిన మాట నిన్ను వలె నీ పొ రుగు వానిని ప్రేమించుము మత్త యి- 19:19

అని ఇది ఎంతో కష్టం కదా. ఒక వ్యక్తిని ద్వేషించడం చాలా సులభం కానీ ప్రేమించడం చాలా కష్టం, ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలం సహించును,

దయచూపించును అని I కోరింధి – 13 వ ఆద్యాయము 4 వ వచనం చెప్తుంది. దీర్ఘకాలం అంటే చాలా కాలము (మనము చనిపో యే వరకు

కూడా కావచ్చు). ఇది సాద్యమా, మనిషి త్వరగా కోపపడగలడు, ద్వేషించగలాడు కానీ ప్రేమించడం చాలా కష్టం,అందుకు ఒకరిని ఒకరు

చంపుకుంటున్నారు కూడా అది పాపమని, దాని నిమిత్త ము తనను శిక్షించే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనిషి తీవ్రముగా

తీసుకోడు కానీ ఇది నిశ్చయం. తప్పు చేసిన వారు చట్టపరంగా పో లీసుల చేత ఎలా అయితే శిక్షింపబడతారో అలాగే మనిషి కూడా

నైతికంగా పతనమైనప్పుడు శిక్షకు పాత్రు డు. ఒకవేళ నేరస్తు డు కోర్టు లో చేసిన నేరం ఒప్పుకొని ఇంకెప్పుడూ చేయనని క్షమాబిక్ష

ప్రసాదించమని వేడుకొంటే న్యాయమూర్తి ఆ నేరస్తు డ్ని క్షమించి విడుదలకు ఆదేశించవచ్చు. అలాగే మనిషి చేసిన పాపాలకు ఎన్నో

బలులు అర్పించటం ద్వారా క్షమాపణ పొందవచ్చని, మరణం తరువాత మోక్షం చేరుకోవచ్చని తలంచాడు.ఒకవేళ అలా చేయనిపక్షంలో

అతడు నరకపాత్రు దౌతాడు.కానీ ఆ విదంగా మోక్షం చేరుకోవటం ఆసాద్యం. ఎందుకంటే మనిషి బలియర్పించే ఆ జంతువులు గాని, పక్షులు

గాని పరిశుద్దమైనవి కాదు. అందుచేత నిర్దో ష మైన, పరిశుద్దడైన ఒక పుణ్యాత్ముడు రక్తం చిందించటం ద్వారా మనిషి పాపాలు ప్రక్షాళన

చేయబడతాయి. అంతే కాదు అతనికి/ఆమెకు మోక్షం ప్రా ప్తి స్తుంది. దీనికోసమే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడై యుండి నరావతారిగా ఈ

లోకములోకి దిగివచ్చి సకల లోకంలో ఉన్న మానవాళి పాపం కొరకు సిలువలో తన ప్రా ణాన్ని అర్పించారు. ఆయన పరిశుద్ద రక్తంలో

పాపక్షమాపణ ఉంది. ఈ విషయాన్ని ఎవరైతే హృదయములో విశ్వసించి, తమ నోటితో ఒప్పుకొని బాప్టిస్మము తీసుకుంటారో వారు మోక్షం

చేరతారు. మార్కు సువార్త - 16:16.

You might also like