You are on page 1of 4

ఓం || హిర'ణ్యవర్ణా ం హరి'ణీం సువర్ణ 'రజతస్ర'జాం | చంద్రా ం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ||

ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను నాశనము చేస,ే బంగారు మరియు వెండి ఆభరణాలతో
అలంకరించబడిన, చంద్రు ని వలె చల్ల గా ఆహ్లా దకరంగా, సువర్ణ మయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు
ఆవాహన చేయుము.

తాం మ ఆవ'హ జాత'వేదో లక్ష్మీమన'పగామినీ''మ్ |


యస్యాం హిర'ణ్యం విందేయం గామశ్వం పురు'షానహమ్ ||

ఎవరి కరుణ, కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రా లు, బంధువులు సంప్రా ప్త మైనవో ఆ మహాలక్ష్మిని నా
వద్ద కు ఆవాహనము చేయుము. ఆమె నా వద్ద నుండి వీడిపో కుండా చూడుము.

అశ్వపూర్వాం ర'థమధ్యాం హస్తినా''ద-ప్రబో ధి'నీమ్ |


శ్రియం' దేవీముప'హ్వయే శ్రీర్మా దేవీర్జు 'షతామ్ ||

గుర్రా లతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తు న్న ఆ శ్రీదేవిని
ఆహ్వానిస్తు న్నాను.తల్లీ నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము.

కాం సో ''స్మితాం హిర'ణ్యప్రా కారా'మార్ద్రా ం జ్వలం'తీం తృప్తా ం తర్పయం'తీమ్ |


పద్మే స్థితాం పద్మవ'ర్ణా ం తామిహో ప'హ్వయే శ్రియమ్ ||

చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది,
పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రా ర్థిస్తు న్నాను

చంద్రా ం ప్ర'భాసాం యశసా జ్వలం'తీం శ్రియం' లోకే దేవజు'ష్టా ముదారామ్ |


తాం పద్మినీ'మీం శర'ణమహం ప్రప'ద్యేఽలక్ష్మీర్మే' నశ్యతాం త్వాం వృ'ణే ||

చంద్రు ని పో లినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది,


కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రా నికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను
శరణు వేడుతున్నాను.ఓ దేవీ! నిన్ను ప్రా ర్థిస్తు న్నాను, నా దారిద్య్ర ం పో యేలా కరుణించు

ఆదిత్యవ'ర్ణే తపసో ఽధి'జాతో వనస్పతిస్త వ' వృక్షోఽథ బిల్వః |


తస్య ఫలా'ని తపసాను'దంతు మాయాంత'రాయాశ్చ' బాహ్యా అ'లక్ష్మీః ||

సూర్యుని తేజస్సు కలిగిన ఓ తల్లి! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు ) నీ తపో మహిమచే
ఉద్భవించినది. నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞా నము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన
బయటి ఆటంకాన్ని తొలగిస్తా యి గాక!

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణి'నా సహ |


ప్రా దుర్భూతోఽస్మి' రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృ'ద్ధిం దదాదు' మే ||

కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండిన ఈ దేశంలో నేను జన్మించాను.
సకల సంపదలను నాకు ప్రసాదించు!

క్షుత్పి'పాసామ'లాం జ్యేష్ఠా మ'లక్షీం నా'శయామ్యహమ్ |


అభూ'తిమస'మృద్ధిం చ సర్వాం నిర్ణు 'ద మే గృహాత్ ||
ఆకలి దప్పికలతో కృశించినది,శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టా దేవిని (అలక్ష్మి)నేను నాశనం చేస్తా ను.
నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు.

గంధద్వారాం దు'రాధర్షా ం నిత్యపు'ష్టా ం కరీషిణ'ీ 'మ్ |


ఈశ్వరీగ్^మ్' సర్వ'భూతానాం తామిహో ప'హ్వయే శ్రియమ్ ||

సుగంధానికి నిలయమైనది, జయింప అలవికానిది, ఎల్ల ప్పుడూ పుష్టినిచ్చేది, సకల సంపదలు కలిగిన, సమస్త
జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తు న్నాను.

మన'సః కామమాకూతిం వాచః సత్యమ'శీమహి |


పశూనాం రూపమన్య'స్య మయి శ్రీః శ్ర'యతాం యశః' ||

ఓ శ్రీదేవి! మనస్సులో జనించే ఉత్త మమైన కోరికలూ, సంతోషము, వాక్కులో సత్యము, గోసంపద చే, ఆహార
సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలి. నాకు కీర్తి కలుగచేయుము

కర్దమ'ే న ప్ర'జాభూతా మయి సంభ'వ కర్దమ |


శ్రియం' వాసయ' మే కులే మాతరం' పద్మమాలి'నీమ్ ||

కర్దమ మహర్షి! నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలి. తామరపువ్వుల మాల ధరించిన,
సిరిసంపదలకు అధిదేవత, తల్లి అయిన ఆమెను నా కులములో ఎల్ల ప్పుడూ నివసింప చేయాలి.

ఆపః' సృజంతు' స్నిగ్దా ని చిక్లీత వ'స మే గృహే |


ని చ' దేవీం మాతరం శ్రియం' వాసయ' మే కులే ||

మహాలక్ష్మి పుత్రు డవైన ఓ చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థా లను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి.
దేవీ, నీ మాత అయిన ఆ మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు.

ఆర్ద్రా ం పుష్కరి'ణీం పుష్టిం సువర్ణా మ్ హే'మమాలినీమ్ |


సూర్యాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ||

ఓ అగ్నిదేవ! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పో షించేది, కుంకుమ రంగు
కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రు నివలె ఆహ్లా దకరమైనది, బంగారుమయమైనది అయిన
మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.

ఆర్ద్రా ం యః కరి'ణీం యష్టిం పింగలామ్ ప'ద్మమాలినీమ్ |


చంద్రా ం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ||

అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిద,ి దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది,
సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము

తాం మ ఆవ'హ జాత'వేదో లక్షీమన'పగామినీ''మ్ |


యస్యాం హిర'ణ్యం ప్రభూ'తం గావో' దాస్యోఽశ్వా''న్, విందేయం పురు'షానహమ్ ||

అగ్నిదేవా! ఎవరి వలన నేను అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రా లు ప్రా ప్తించుకుంటానో , అట్టి
మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లి పో కుండా కృప చూపుము. ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రా ర్తిస్తు న్నారో, వారు
ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హో మము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రా లను సదా
జపిస్తూ ఉండాలి

ఓం మహాదేవ్యై చ' విద్మహే' విష్ణు పత్నీ చ' ధీమహి | తన్నో' లక్ష్మీః ప్రచ ోదయా''త్ ||

మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్నది, తామర కొలనులో ఉద్భవించినది, మహావిష్ణు వుకు


ప్రియమైనది అయిన నీకు నమస్కరిస్తు న్నాను.

శ్రీ-ర్వర్చ'స్వ-మాయు'ష్య-మారో''గ్యమావీ'ధాత్ పవ'మానం మహీయతే''


| ధాన్యం ధనం పశుం బహుపు'త్రలాభం శతసం''వత్సరం దీరమ ్ఘ ాయుః' ||

సుప్రసిద్ధు లు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గు రు ఈ సూక్త ంలోని ఋషులు,
మహాలక్ష్మియే దేవత. పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన
తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొ ందుతానో దాన్ని ప్రసాదించు. గుర్రా లను, గోవులను, సంపదలను ఇచ్చే,
ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించు

ఓం శాంతిః శాంతిః శాంతిః' ||

అందరు శాంతి సుఖాలతో ఉండాలి శాంతి , శాంతి, శాంతి ...

✨✨అష్ట లక్ష్మీ స్తో త్రం✨✨


ఆదిలక్ష్మి

సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే


మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే ।
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గు ణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మాం ॥ 1 ॥

ధాన్యలక్ష్మి

అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే


క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే ।
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మాం ॥ 2 ॥

ధైర్యలక్ష్మి

జయవరవర్షిణి వైష్ణవి భార్గ వి, మంత్ర స్వరూపిణి మంత్రమయే


్ర ుతే ।
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞా న వికాసిని శాస్త న
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మాం ॥ 3 ॥

గజలక్ష్మి

జయ జయ దుర్గ తి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త మ


్ర యే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే ।
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మాం ॥ 4 ॥

సంతానలక్ష్మి

అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞా నమయే


గుణగణవారధి లోకహితైషిణి, సప్త స్వర భూషిత గాననుతే ।
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మాం ॥ 5 ॥

విజయలక్ష్మి

జయ కమలాసిని సద్గ తి దాయిని, జ్ఞా నవికాసిని గానమయే


అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే ।
కనకధరాస్తు తి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మాం ॥ 6 ॥

విద్యాలక్ష్మి

ప్రణత సురేశ్వరి భారతి భార్గ వి, శోకవినాశిని రత్నమయే


మణిమయ భూషిత కర్ణ విభూషణ, శాంతి సమావృత హాస్యముఖే ।
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్త యుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మాం ॥ 7 ॥

ధనలక్ష్మి

ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణ మయే


ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే ।
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మాం ॥ 8 ॥

ఫలశృతి
శ్లో ॥ అష్ట లక్ష్మీ నమస్తు భ్యం వరదే కామరూపిణి ।
విష్ణు వక్షః స్థ లా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ॥

శ్లో ॥ శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః ।


జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళం ॥

You might also like