You are on page 1of 475

శ్రీమద్భగీవద్గీత విశ్లేషణ

(ప్రధమ ఖండము)

ప్రధమ షట్కం - కర్మ విభాగము

సంకలనము

వేలూరి అన్నప్ప శాస్త్రి


విశ్లేషకులు

ప్రొఫెసర్ శ్రీ కుప్పా విశ్వనాథ శర్మగారు

గురుదేవులకు వందనములతో
పరిచయము

శ్రీమద్భగవద్గీత ప్రవచన కార్యక్రమము శ్రీ వేంకటేశ్వర భక్తి


చానల్లో గురువర్యులు డా. శ్రీ కుప్పా విశ్వనాథ శర్మగారు ద్వారా
10-09-2020 న ప్రారంభమైనప్పుడు, శ్రీమద్భగవద్గీత,
ఉపనిషత్తు లు, వేదాంతము అంశముల మీద ఎన్నో పుస్తకములు,
ఎన్నో ప్రవచనము విన్న నేను, మొదట్లో ఇది కూడా అలానే ఉంటుంది
అనే భ్రమతో విన్నాను. అలా ఒక నెల పైన గడిచిపోయింది. ద్వితీయ
అధ్యాయము – సాంఖ్య యోగము దగ్గరకు వచ్చిన ప్రవచనము
నేను వింటున్న కొద్దీ గురువర్యులు డా. శ్రీ కుప్పా విశ్వనాథ
శర్మగారి అద్భుతమైన, విశాలమైన సంపూర్ణమైన తత్త్వ జ్ఞానము,
శ్రీమద్భగవద్గీత యొక్క అంతరార్ధము, ఉపనిషత్తు ల వేదాంతము,
పతంజలి యోగ సూత్రములు, బాదరాయణ బ్రహ్మ సూత్రములు,
పురాణములు, ఇతిహాసములు, అసాధారణమైన దృష్టాంతములు,
సుభాషితములు వాటిని శ్రీమద్భగవద్గీత శ్లోకములలో ఉన్న
అంతరార్ధముతో సునాయాసముగా అన్వయించి, ప్రవచనములో
మమేకమై చెప్పుతుంటే, నేను కూడా అంతే మమేకమై విన్నాను.
మనము యధాశక్తి ఎంత తోడుకొని ఆస్వాదించినా తరగని
అనంతమైన మన సనాతన ధర్మ శాస్త్రములు అన్నీ మధించి ఆ
జ్ఞానామృత మహా సాగరము యొక్క సారమును ఈ
శ్రీమద్భగవద్గీత ప్రవచనముల ద్వారా డా. శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ
గారు మనకు అందించారు. గురువర్యులు డా. శ్రీ కుప్పా విశ్వనాథ
శర్మగారి సంపూర్ణ వేదాంత జ్ఞానము, సాటిలేని అమృత ప్రవచన
ప్రతిభను నేను చెప్పాలంటే సూర్య భగవానుడిని చూపించాలని గుడ్డి
దీపముతో లేదా టార్చితో చూపిస్తు న్నట్లు ఉంటుంది.

ఇటువంటి అద్భుతమైన అమృత ప్రవచనము ఇంతవరకూ


నేను ఎక్కడా విని, చదివినది లేదు. ఈ ప్రవచనము శ్రీ వేంకటేశ్వర
భక్తి చానల్లో ప్రసారము చేయటము, అది నేను వినగలగటము, నా
జన్మ ధన్యము అయినది అని భావిస్తా ను. ఇటువంటి ప్రవచనము
మరల ఎక్కడా (YouTube లో) దొరకదేమో అనే ఆందోళనతో, ఇది
తరువాత ఎవరికైనా ఉపయోగ పడవచ్చు అనే అభిప్రాయముతో,
నేను దీనిని పుస్తక రూపములో వ్రాయాలి అనే ధృఢమైన నిర్ణయము
తీసుకొని, ప్రతిరోజూ సాయంత్రము టి.వి లో ప్రవచనము వినటము,
మర్నాడు YouTube లో వింటూ వ్రాయటము ప్రారంభించాను.
ఎంత శ్రమ అయినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ప్రక్కకు పెట్టి,
గురువుగారి అనంతమైన జ్ఞానమును, గురువుగారు ఎంత శ్రద్ధగా
చెప్పారో, దానిలో పదవ శాతము అయినా శ్రద్ధ పెట్టి, నా పరిమితమైన
జ్ఞానముతో నేను కొద్దిగానైనా అర్ధము చేసుకున్నాను అనే
విశ్వాసముతో గురుదేవులు చెప్పిన అంశములు అన్నీ ఏవీ
వదలకుండా ఈ పుస్తకమును మూడు ఖండములుగా (ప్రధమ
ఖండము – ప్రధమ షట్కము - కర్మ విభాగము, ద్వితీయ ఖండము
– ద్వితీయ షట్కము – భక్తి విభాగము, తృతీయ ఖండము –
తృతీయ షట్కము – జ్ఞాన విభాగము) వ్రాశాను.

భవిష్యత్తు లో ఈ పుస్తకము ఎవరికైనా ఉపయోగ


పడవచ్చును అనే అభిప్రాయముతో తిరుమల తిరుపతి
దేవాలయము అధికారులు ఈ పుస్తకమును ముద్రించి, దీనిని చదివే
ఆసక్తి ఉన్న వాళ్ళకు అందేలా చేస్తా రని ప్రార్థిస్తా ను.

ఓం నమో వేంకటేశాయ

Veluri Annappa Sastry


Flat No. 102, G.K. Crescendo,
Plot Nos. 558 & 559, Defence Colony,
Sainikpuri (P.O), Secunderabad – 500094
e-mail ID – velurisastry@gmail.com
Mobile No. 9440657704
సూచిక

పేజి సంఖ్య

ఉపోద్ఘాతము 1

ప్రధమ షట్కం - కర్మ విభాగము

1.. అర్జు న విషాద యోగము (47 శ్లోకములు) 5

2. సాంఖ్య యోగము (72 శ్లోకములు) 43

3. కర్మ యోగము (43 శ్లోకములు) 121

4. జ్ఞాన కర్మ సన్యాస యోగము

(42 శ్లోకములు) 183

5. కర్మ సన్యాస యోగము (29 శ్లోకములు) 279

6. ఆత్మ సంయమ యోగము (47 శ్లోకములు) 346

ముఖ్యమైన శ్లోకములు 471

గమనిక: బృహదారణ్యకోపనిషత్ లోని మొదటి రెండు (1, 2)


అధ్యాయములు కర్మాంగములు కాబట్టి (బ్రహ్మ విద్య కాదు కాబట్టి)
ఆ మొదటి రెండు అధ్యాయములు ప్రచురించబడలేదు. అందుచేత
కొన్ని పుస్తకములు 3 వ అధ్యాయమును 1 వ అధ్యాయముగా, కొన్ని
పుస్తకములలో 3 వ అధ్యాయముగా ముద్రిస్తు న్నారు. అందుచేత ఈ
పుస్తకములో 1 లేదా 3, 2 లేదా 4, 3 లేదా 5 గా సూచించబడినది.
ఉపోద్ఘాతము

పరమాత్మ ఈ ప్రపంచమును సృష్టి చేసినప్పుడు, ఈ


ప్రపంచములో ప్రధానమైన మానవులు ఉత్తమ జీవిత విధానము
అందించుటకు వేదములు, ఉపనిషత్తు లు బోధించాడు. వేదముల,
ఉపనిషత్తు ల సారమును అనేకమంది మహర్షులకు బోధించి, వాళ్ళ
ద్వారా వ్యాఖ్యానములు కూడా చేయించారు. వేదములు,
ఉపనిషత్తు లు వివస్వాన్ అనే తేజోమయ పురుషుడికి (సూర్య
భగవానుడికి) ఉపదేశము చేశాడు. ఆ వివస్వాన్ అనేక మహర్షులకు,
మహారాజులకు ఈ జ్ఞాన ధారను అందిస్తూ వచ్చాడు. కాల
ప్రవాహములో ఆ జ్ఞాన ధార కొంత క్షీణించిందని భావించి, తనే
శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి, అర్జు నుడి వ్యాజముగా చేసుకొని,
శ్రీమద్భగవద్గీత మనందరికీ కూడా ఉపదేశము చేశాడు. పరమాత్మ
సంకల్పము ఇంకా బాగా ప్రచారము కావాలనే ప్రయత్నములో
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామీ
ప్రేరణతో, SVBC, TTD డా. శ్రీ కుప్పా విశ్వనాథ శర్మగారి
ప్రవచనముల ద్వారా 10-09-2020 నుండి 14-01-2022 వరకు
491 Episodes ప్రచారము చేయబడినది.

వేదములలో, పురాణములలో దేవతలు (ధర్మమునకు ప్రతీక),


రాక్షసులు (అధర్మమునకు ప్రతీక) మధ్య యుద్ధము గురించి అనేక

1
పర్యాయములు ప్రస్తా వన ఉన్నది. వాటిలో ఒక్కొక్కప్పుడు దేవతలు
(ధర్మము) జయిస్తుంది. ఒక్కొక్కప్పుడు రాక్షసులు (అధర్మము)
జయిస్తుంది. ఆ సందర్భములలో ధర్మ సంస్థా పన కొరకు
భగవంతుడు దేవతలకు సహాయపడుతూ ఉంటాడు. అలాగే మన
జీవితములో మన మనస్సులో కూడా చిన్న లేక పెద్ద విషయములలో
ధర్మము, అధర్మము మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆ
సందర్భములలో మనము ధర్మ నిర్ణయము చేసుకొని, కర్మలు చేస్తే
పుణ్య ఫలితములు, అధర్మ నిర్ణయము చేసుకొని కర్మలు చేస్తే పాప
ఫలితములు పొందుతూ ఉంటాము. ఆ కర్మ ఫలితములు
అనుభవించుటకు ఆ, ఆ విధమైన జన్మలు ఎత్తు తూ ఆ పుణ్య, పాప
ఫలితములు అనుభవిస్తా ము. ఆ విధముగానే మనము పుణ్య కర్మలు
చేయుటకు, పాప కర్మలు చేయకుండా ఉండుటకు మరియు
చివరకు మోక్షము కలిగి, భగవంతుడిలో ఐక్యము పొందుటకు,
భగవంతుడు (శ్రీకృష్ణుడు) మనకు శ్రీమద్భగవద్గీత రూపములో
ఉపదేశము చేసినాడు.

శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీత ద్వారా మానవులకు


మహోన్నతమైన ఉపదేశము చేశాడు. మానవుడు దానవుడిగా
దిగజారిపోకుండా, ఆధ్యాత్మికముగా ఉన్న స్థా యి నుండి ఉన్నత
స్థా యికి ఎదుగుదలకు సాధన చేసుకునే మార్గములు,
ఉపాయములు చెప్పి, ఆ సాధన ద్వారా పరమాత్మ అనుగ్రహము

2
పొందవచ్చును. శ్రీమద్భగవద్గీతలో నిత్య జీవితములో ఎదురయ్యే
సమస్యలను పరిష్కరించే ఉపాయములు, సద్గుణములను
అలవరచుకునే ఉపాయములు మరియు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి
తోడ్పడే సాధనములను వివరముగా ఉపదేశము చేశాడు.

శ్రీమద్భగవద్గీత ఉపదేశము కూడా పాండవులు


(ధర్మమునకు ప్రతీక) మరియు కౌరవులు (అధర్మమునకు ప్రతీక)
మధ్య యుద్ధము ప్రారంభ సమయములో అర్జు నుడుకు
(శ్రీకృష్ణుడిని - ధర్మమును ఆశ్రయించిన వాడు) ఉపదేశము
చేసినాడు. భగవద్గీతలో ఏ శ్లోకము తీసుకున్నా, మన జీవితములో
అంతిమ లక్ష్యము (మోక్షము) పొందే అవకాశము ఉంది. ప్రతి
శ్లోకము, ముందు శ్లోకమునకో, లేక వెనక శ్లోకమునకో సంబంధము
ఉంటుంది.

శ్రీమద్భగవద్గీత యొక్క మహాత్మ్యమును పద్మ పురాణములో


చెప్పబడినది. మార్గ శీర్ష సుద్ధ ఏకాదశి రోజున శ్రీమద్భగవద్గీత
ఆవిర్భవించిన రోజు (జయంతి). అదే రోజున మహాభారత యుద్ధము
ప్రారంభమైనది. శ్రీమద్భగవద్గీత పారాయణమునకు ఫలితములు
పద్మ పురాణములో వివరించబడినది.

శ్రీమద్భగవద్గీత మీద విశ్లేషణ చాలా మంది ఆ, ఆ


శ్లోకములకు అర్ధము చెప్పుతూ చేశారు మరియు చాలా పుస్తకములు

3
ముద్రించబడి ఉన్నవి. కాని ఈ విశ్లేషణలో బ్రహ్మ విద్య (ఆత్మ
జ్ఞానమును) ప్రత్యేకించి వివరిస్తూ, వాటికి సంబంధించిన
వేదములలోని, ఉపనిషత్తు లలోని, బ్రహ్మ సూత్రములలోని, యోగ
సూత్రములలోని పురాణములలోని, మహాభారతములోని, నీతి
సూక్తు ల వివరములు సమయస్పూర్తిగా చెప్పి, వాటి అర్ధము
కూడా వివరిస్తూ, భగవానుడు శ్రీకృష్ణుడు శ్రీమద్భగవద్గీతలో
చెప్పదలచునుకున్న బ్రహ్మ విద్యకు పూర్తి ప్రాధాన్యత ఇస్తూ, వాటికి
సంబంధించిన ఉదాహరణలతో వివరించబడినది. ఇది ఈ విశ్లేషణ
యొక్క ప్రత్యేకత. ఈ విశ్లేషణ శాస్త్రీయ విధానములో
వ్రాయబడినది.

కురు క్షేత్రము

కురు క్షేత్రము – కౌరవులకు పూర్వజుడు కురు మహారాజు


కురు క్షేత్రములో అనేక యజ్ఞములు, యాగములు, దానములు
చాలా కాలము చేసినారు. అప్పుడు ఇంద్రు డు ప్రత్యక్షమై, ఇవన్నీ
ఎందుకు చేస్తు న్నావు అని అడగగా, దానికి కురు మహా రాజు ఈ
క్షేత్రములో ఎవరైనా ఏ కర్మ చేసినా, వారికి పుణ్య గతులు
కలుగుటకు, నా పుణ్యములను ఈ క్షేత్రములో నిక్షిప్తము
చేస్తు న్నాను, అని చెప్పాడు. అందుచేత కురు క్షేత్రము – ధర్మ
క్షేత్రముగా పేరు వచ్చినది.

4
శ్రీ గురు ప్రార్థన

గురుర్బ్ర హ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః । గురుస్సాక్షాత్


పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ।।

శ్రీనివాస ప్రార్ధనా

అనంతశిరసే నిత్యమనంతాక్షయ తే నమః l


అనంతచరనాయాధ శ్రీశైలనిలయాయ చ ll

అధ సంకల్పః

శ్రీమద్ - ఆదివరాహ క్షేత్రే – విరాజమానస్య – అఖిలాండకోటి –


బ్రహ్మాండనాయకస్య – శ్రీ పద్మావతీ జానేః - భగవతః – శ్రీ
వెంకటేశ్వర స్వామినః – దివ్య సన్నిధౌ- భగవతః – శ్రీకృష్ణ
పరమాత్మనః – అనుగ్రహేణ – అస్మాకం -సర్వేషాం – శారీరస్య –
మానసస్య చ – బలస్య సిద్ధ్ర్యర్ధం – సమస్తా నాం –
అసాధ్యవ్యాధీనాం – నివారణార్ధం – సర్వయజ్ఞ - ఫలప్రాప్త్యర్ధం –
సర్వాసాం – సంపదాం - ప్రాప్త్యర్ధం – విధ్యార్దినాం – బుద్ధి శక్తి –
వృద్ధి ద్వారా – పరిక్షాసు – ఉత్తీర్ణతా – సిద్ధ్యర్ధం – అధికారిణాం -
స్వస్వవిధి – నిర్వహణ – కౌశలసిద్ధ్యర్ధం – సమస్త – పాపక్షయార్ధం
– శ్రీ పరమేశ్వర – ప్రీత్యర్ధం – యధాశక్తి – శ్రీమద్భవద్గీతాయాః –
శ్లోక పారాయణం – కరిష్యామహే

5
శ్రీ గీత ప్రార్థనా

సర్వోపనిషదో – గావో – దోగ్ధా – గోపాలనందనః l

పార్దో వత్సః - సుధీర్భోక్తా – దుగ్ధం – గీతామృతం – మహత్ ll

శ్రీ కృష్ణ ప్రార్థనా

శ్లియాశ్లిష్టో విష్ణుః స్థిర చర గురుః వేద విషయః l ధియాంసాక్షీ


శుద్దో హరిః అసురహన్తా బ్జనయనః ll

శ్రీ వేదవ్యాస ప్రార్ధనా

వాగ్విస్తరా యస్య బృహత్తరంగాః వేలా తటం వస్తు ని తత్త్వ బోధః l


రత్నాని తర్క ప్రసర ప్రకారాః పునాత్వయం వ్యాస పయోనిధిర్నః ll

అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యానాం యోగశాస్త్రే


శ్రీకృష్ణార్జు న సంవాదే అర్జు న విషాదయోగోనామ ప్రధమోధ్యాయః ll

“అధ” – ఈ శబ్దమునకు శాస్త్రములలో (హిత శాసన


వాక్యములు) చాలా ప్రాధాన్యత ఉన్నది. సృష్టి ప్రారంభ
సమయములో, బ్రహ్మ కంఠము నుండి రెండు శబ్దములు
వెలువడినవి. అవి 1. “ఓం” కారము. 2. “అధ”. “ఓం” కారము
సర్వోత్తమమైన ప్రణవ రూపమైన అక్షరము. “అధ” శబ్దము “ఓం”
కారము వంటి మంగళ శబ్దమునకు సమానమైన శబ్దము. “ఓం”
కారము ఉచ్చరించుటకు అనేక కఠోరమైన నియమ,
6
నిబంధనములు ఉన్నాయి. దాని స్థా నములో అంత నియమములు
లేని “అధ” శబ్దమును ఉచ్చరిస్తే ఆ కార్యము ‘ఓం” కారము
ఉచ్చరించిన అంత మంగళకరముగా పూర్తి అవుతుంది. “అధ”
శబ్దమునకు “ఓం” కారము తరువాత అంతటి పవిత్రమైన స్థా నము
ఉన్నది.

ధృతరాష్ట్ర ఉవాచ ।

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।


మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ॥ 1 ॥

ధృతరాష్ట్రు డు మాట్లా డుతున్నాడు! ధర్మములను


పెంపొందించే కురు క్షేత్రములో యుద్ధము కోసము చేరారు కదా.

నా వాళ్ళు (కౌరవులు) నా తమ్ముడు పిల్లలు (పాండవులు)


వాళ్ళు అక్కడ అప్పుడు ఏమి చేశారు?

సంజయ ఉవాచ ।
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ॥2॥

సంజయుడు ధృతరాష్ట్రు డితో ఇలా చెప్పుతున్నాడు - కురు


క్షేత్రములో ఇరు సేనలు అంతా నిలుచుండగా, పాండవులు కూడా
ఉన్నారు.

7
అప్పుడు మీ కుమారుడు, మహారాజు దుర్యోధనుడు,
గురువైన ద్రోణాచార్యులు దగ్గరకు వెళ్లి ఆయనతో
మాట్లా డుతున్నారు.

పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూం ।


వ్యూఢాం ద్రు పదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥ 3 ॥

ఓ ఆచార్యా (శాస్త్రములన్నీ అధ్యయనము చేసి అన్ని


వివరములు అర్ధము చేసుకొని, వాటిని ఆచరణ చేసి, తన
విద్యార్ధు లకు అవన్నీ బోధించి, వారిని సన్మార్గములో పెట్టేవాడు)!
చూడు, పాండు పుత్రు లకు విద్యాభ్యాసము చెప్పిన ఆచార్యా!
పాండవులు పెద్ద సైన్యము తీసుకొని వచ్చారు.

ఆ సైన్యము ఎదురు గుండా, వ్యూహాత్మకముగా నిలబడి


ఉన్నారు. ఆ వ్యూహమునకు నాయకుడు, నిన్ను చంపుటకు పుట్టిన
ద్రు పదుడి కుమారుడు, నీ శిష్యుడైన, చాల తెలివైన
దృష్టద్యుమ్నుడు.

అత్ర శూరా మహేష్వాసా భీమార్జు నసమా యుధి ।


యుయుధానో విరాటశ్చ ద్రు పదశ్చ మహారథః ॥ 4 ॥

పాండవుల సైన్యములో అత్యంత పరాక్రమవంతులు చాలా


మంది ఉన్నారు. భీముడు, అర్జు నులతో సమానమైన పరాక్రమము
ఉన్నవాళ్లు .
8
దుర్యోధనుడు అసూయతో యుయుధానుడు (కృష్ణుడికి
తమ్ముడి వరస – సాత్యకి), విరాటుడు, ద్రు పదుడు మహారథులు
ఉన్నారు అని అన్నారు.

ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ ।


పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ॥5॥

దృష్ట కేతువు (కృష్ణ ద్వేషి శిశుపాలుడు కొడుకు, తన


సోదరిని నకులుడు ఇచ్చి వివాహము చేసెను), శ్చేకితానుడు
(అర్జు నుడి మిత్రు డు), వీరుడు కాశీ రాజు,

పాండవులకు మేనమామ వరుస అయిన పురుజిత్


మరియు కుంతి భోజుడు, శిబి దేశపు రాజు నరులలో శ్రేష్టు డైన
శైబ్యుడు.

యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।


సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ॥6॥

పరాక్రమము కలిగిన యుధమన్యుడు (దృష్టద్యుమ్నుడికి


తమ్ముడి వరస), వీర్యవంతుడు ఉత్తమౌజాశ్చ,

సుభద్ర కుమారుడు మహావీరుడు అభిమన్యుడు, ద్రౌపది


కుమారులు (ఉప పాండవులు) అందరూ మహారథులే.

9
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ॥ 7 ॥

మన వైపు ఉన్న విశిష్టమైన వీరుల గురించి నేను చెప్పుతాను,


నీవు విను బ్రాహ్మణులలో ఉత్తముడా! నీకు తెలియదు అని కాదు.
వాళ్ళు ఉన్నారని నీకు గుర్తు కు చేస్తా ను.

నా సైన్యమునకు వారు నాయకులు. నా తరపున వారు


యుద్ధము చేయుటకు వచ్చారు. (గురువును కించపరచుట)

భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।


అశ్వత్థా మా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ॥ 8 ॥

తమరు (గురువు, గొప్ప యాగీశ్వరులు), భీష్ముడు, కర్ణుడు


(దురదృష్టవంతుడు, ధర్మ ద్రోహి), కృపాచార్యులు (ద్రోణాచార్యలు
బావమరిది),

యుద్దమును జయించే అశ్వత్థా మ, వికర్ణుడు కౌరవులలో


18 వ వాడు – ధర్మనిష్టు డు), తాత వరస అయిన సౌమదత్తు డు
మరియు ఆయన కుమారుడు (భూరీస్రవతుడు), జయద్రథుడు
(సింధు దేశ రాజు, కౌరవుల చెల్లెలు – దుస్సల యొక్క భర్త)

అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః ।


నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ॥9॥

10
పైన చెప్పిన వారే కాకుండా, చాల మంది వీరులు, శూరులు
(దుశ్శాసనుడు, ఏకలవ్యుడు, శల్యుడు – పాండవులకు మేనమామ)
వీళ్ళందరూ నా కోసము వాళ్ళ జీవితములను వదులుకుందుకు
సిద్ధముగా ఉన్నారు.

వీళ్ళు అనేక అస్త్రములు, శాస్త్రములు ప్రయోగించటములో


నైపుణ్యము ఉన్నవాళ్లు మరియు యుద్ధములో సమర్దు లైనవారు
కూడా.

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం ।


పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ॥ 10 ॥

మన సైన్యము చాలా ఎక్కువగా, పెద్దదిగా ఉన్నది. మన


సైన్యమును భీష్మాచార్యులు వారు రక్షిస్తు న్నారు. (1. భీష్ముడుకు
యుద్దములో పరాజయము ఉండదు. 2. ముసలాయన
నాయకుడు. ఆయన నాయకత్వముతో మన సైన్యము సరిగ్గా
యుద్దము చేయలేదు)

పాండవుల సైన్యము స్వల్పమైనది. ఆ సైన్యమునకు


నాయకుడు భీముడు (1. వ్యూహము, ఆలోచన లేక ఆవేశము
ఉన్నవాడు. ఆ సైన్యము సరిగ్గా యుద్ధము చేయలేదు. 2. భీముడి
నాయకత్వముతో వారి సైన్యము మనలను ఓడించగలదు). ద్వంద్వ
అర్ధములతో గురువు ముందు మాట్లా డుతున్నాడు.

11
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః ।
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ॥11॥

భీష్మాచార్యులు (అసమర్థు డు) మన సేనాపతి. ఎవరెవరికి ఏ,


ఏ స్థా నములు చెప్పామో, ఆ స్థా నములలో ఉండి మీరందరూ
(ద్రోణాచార్యులు కూడా)

భీష్మాచార్యులను రక్షించవలసినది. మీరందరూ ఇదే పని


చేయాలి. ఇద్దరినీ అవమానిస్తు న్నాడు. (దుర్యోధనుడికి ఎదుటి
వారిలో దోషములే చూసే స్వభావము)

కుమారుల భట్టు వారు మీమాంస శాస్త్రమునకు


వ్యాఖ్యానము వ్రాస్తూ ముందు ఈ శ్లోకము వ్రాశారు:

“నజా త్రాతీయ కర్తవ్యమ్ దోష బుద్ధిం పరం మనః

దోషో అవిద్య మానోపి తత్ చిత్తా నాం ప్రకాశతే”

నేను వ్రాసే ఈ గ్రంధములో కేవలము ఎదుటి వారిలో


మాత్రమే దోషములను చూసే స్వభావము ఉంటే, దానిని వెంటనే
విడిచిపెట్టండి. ఒకవేళ మీకు ఈ స్వభావము ఉంటే, ఎదుటి వారిలో
దోషము లేకపోయినా, దోషము ఉన్నట్లు అనిపిస్తుంది.

తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః ।


సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ॥ 12 ॥

12
దుర్యోధనుడికి సంతోషము కలిగించేలా, కురువృద్ధు డు,
మహా ప్రతాపవంతుడు అయిన భీష్మ పితామహుడు (అధర్మ
పక్షములో ఉన్న ధార్మికుడు),

గట్టిగా పెద్దగా సింహనాదము చేసి, తరువాత శంఖమును


పూరించారు.

తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః ।


సహసైవాభ్యహన్యంత స శబ్దస్తు ములోఽభవత్ ॥ 13 ॥

తరువాత వెంటనే ఆకాశమంతా వ్యాపించేలా అనేక


శంఖములు, భేరులు (దుందుభి), పణవములు (డబుడక్క),
గోముఖములు

మరియు యుద్దములో మ్రోగించే ప్రత్యేక వాయిద్యములు


అందరూ మోగిస్తుంటే, అందరికీ వినిపించినది.

తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ ।


మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదఘ్మతుః ॥ 14 ॥

ఇలా అందరూ శబ్దము చేస్తూ ఉండగా, పాండవ పక్షము


నుండి తెల్లటి గుర్రములు (స్వచ్చమైన ఇంద్రియములు) లాగుతున్న
అందమైన గొప్ప రథములో (చాలా సాధనాలు చేసుకున్న శరీరము)
ఉన్న

13
మాధవః = మా = మహాలక్ష్మి + ధవః = పతిః = శ్రీ కృష్ణ
పరమాత్మ, అర్జు నుడు (యోగముతో పరమాత్మను తనలో
స్థా పించుకున్న శరీరము), దివ్యమైన తమ దివ్యమైన శంఖములను
(ఓంకారము) పూరించారు.

ముండకోపనిషత్ – 3-1-1, 2 - “ఓం ద్వా సుపర్ణా సయుజా


సమానం వృక్షం పరిషస్వజాతే, తయోరన్యః పిప్పలం స్వాద్వత్త్య
నశ్నన్నన్యో అభిచాకశీతి” మరియు శ్వేతాశ్వతరోపనిషత్ – 4-6, 7 –
“ద్వాసుపర్ణా సయుజా సఖయా సమానం వృక్షం పరిషస్వజాతే,
తయో రన్యః పిప్ప లగ్ం స్వా ద్వత్త్యనశ్న న్నన్యో అభిచాకశీతి”,
సమానే వృక్షే పురుషో నిమగ్నోనీశయా శోచతి ముహ్యమానః I
జుష్టం యదా పశ్యత్యన్య మీశమస్య మహిమాన మితి వీతశోకః” -
ఒక చెట్టు మీద రెండు పక్షులు – జీవుడు, పరమాత్మ – ఉన్నాయి.
అందులో ఒక పక్షి (జీవాత్మ) ఫలమును తింటూ (కర్మ ఫలములు)
అనుభవిస్తు న్నది. రెండవ పక్షి (పరమాత్మ) ఏమీ తినకుండా, మొదటి
పక్షిని సాక్షిగా చూచుచున్నది).

కఠోపనిషత్ – 1-3-3, 4, 5, 6, 7 – “ఆత్మనగ్ం రధినం


విద్ది, శరీరగ్ం రధ మేవ తు, బుద్ధిం తు సారధిం విద్ది, మనః ప్ర గ్రహ
మేవ చ” ...... ఈ శరీరము అనే రధముతో, అధిపతి అయిన
జీవుడు తన లక్ష్యము వైపు ప్రయాణము సాగించుటకు. రధమైన
శరీరమును ఇంద్రియములు అనే గుర్రములు, తన్మాత్రలు (సూక్ష్మ
14
ఇంద్రియములు) అనే దారులలో పోకుండా, మన బుద్ధితో –
లక్ష్యము అనే నిశ్చయముతో - మనస్సు – సంకల్పము - అనే
కళ్ళెముతో లక్ష్యము వైపు తీసుకు వెళ్ళితే లక్ష్యము తప్పకుండా
చేరుతాము)

పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః।


పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ॥ 15 ॥

హృషీకేశో = మనస్సులో ఉన్న పరమాత్మ= శ్రీకృష్ణుడు


పాంచజన్యమనే (పాంచజన్యం = పంచ జనులు = ఐదు
జ్ఞానేంద్రియములు – శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. ఇవి చేసే
కర్మలను గమనించుటకు సూర్య, చంద్ర నక్షత్రములు హృషీకం =
మనస్సు - ఇంద్రియములను నియంత్రించేది. మనస్సులో కర్మల
గురించి ఆలోచనలు గమనించుటకు పరమాత్మే మనస్సులో సాక్షిగా
ఉన్నాడు (18-61 “ఈశ్వరః సర్వ భూతానాం హృద్దేశేర్జు న తిష్టితి” -
మన మనస్సును భక్తి, జ్ఞానములతో పరిశుద్ధము చేసుకుంటే –
పరమాత్మ ప్రకాశిస్తా డు). దేవతా శంఖమును, ధనంజయః = సాధనం
+ జయ = సాధనముతో సద్గుణములను గెలుచుకున్నవాడు =
అర్జు నుడు, అగ్నిదేవుడు ప్రసాదించిన, దేవదత్తం అనే శంఖమును
పూరించాడు. (అర్జు నుడు అనేక దేవతలను సాధన చేసుకొని, అనేక
దేవతలా అనుగ్రహము పొందినవాడు. దేవతా అనుగ్రహము ద్వారా,
తన మనస్సును శుద్ధ పరచుకునే ప్రయత్నములో చాలా ఉన్నత స్థితికి
15
చేరినవాడు. అర్జు నుడి పేరులలో ఒకటి గుడాకేశః (గుడాక + ఈశః
= నిద్రను + జయించినవాడు). నిద్ర సమయమును వృధా
చేయకుండా సాధన చేసినవాడు.

వృకోదరః = తోడేలు వంటి కడుపు కలవాడు = తిండిపోతు


- భీమసేనుడు ఏ పనైనా, అన్ని పనులు చేయగలిగేవాడు,
పరాక్రముడు అయిన భీమసేనుడు పౌండ్రం అనే మహా శంఖమును
పూరించారు. పుండ్రం = నుదుటి నామాలు. మనలో ఉండే
నాడులకు (కొన్ని నిలువుగా, కొన్ని అడ్డముగా) సంకేతము. అన్ని
నాడులలోనూ ప్రాణ వాయువు (సమాన వాయువు) సంచారించాలి.
ఆ నాడులలో సంచరించే ప్రాణ వాయువు మీద నియంత్రణను
సాధించిన యాగీశ్వరులు, వాయు దేవుడు యొక్క అంశతో పుట్టిన
భీమసేనుడు – పౌండ్రం

మనలో హృషీకము (ప్రాణము + మనస్సు) మనలో ఉన్నంత


కాలము మనము జీవిస్తా ము (జీవుడు మనలో ఉంటాడు). ప్రాణము
మన శరీరములో ప్రవేశించిన తరువాత, ఐదు ప్రాణములుగా మారి
మన శరీరములో ఐదు చోట్ల – ప్రాణము – హృదయములో,
అపానము - గుదములో, సమానము – నాభిలో, ఉదానము –
కంఠములో, వ్యానము - శరీరమంతా. వీటిని నియంత్రించేది ముఖ్య
ప్రాణము (హృషీకము యొక్క రెండవ పార్శ్వము (ఒక ప్రక్క
మనస్సు (జ్ఞాన శక్తి, రెండవ ప్రక్క ప్రాణము – క్రియా శక్తి).
16
ప్రాణాయామము యొక్క ప్రధాన ప్రయోజనము – మనస్సు
ఏకాగ్రత కలుగును.

అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।


నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ॥16॥

మహారాజు, కుంతీపుత్రు డు అయిన యుధిష్టరుడు =


యుద్ధములో స్థిరముగా ఉన్నవాడు – నాకు ఈ యుద్ధమునకు
సంబంధము లేదు. ఈ యుద్ధము పరమాత్మ యొక్క సంకల్పము,
నేను ఒక పాత్ర మాత్రమే (ధర్మరాజు) అనంతవిజయం (నిశ్చలమైన
మనస్సుతో తనను తాను గెలుచుట – తన మనస్సును తాను
తెలుసుకొని, అందులో ఉన్న పరమాత్మను ప్రత్యక్షముగా
చూడగలుగుట) అనే శంఖమును పూరించాడు.

తరువాత నకులుడు సుఘోష (మంచి శబ్దము కలిగినది –


హృదయమును శుద్ధము చేసుకుంటున్నవాడు) అనే శంఖమును,
సహదేవుడు మణిపుష్పకౌ (మణి – కఠోరముగా + పుష్ప –
మృదువుగా ఉండేవాడు) అనే శంఖమును పూరించారు.
మహాత్ముల మనస్సులు – అధర్మ విషయములలో వజ్రము కంటె
కఠోరముగా, మరలా ధర్మ విషయములలో పుష్పము కంటె
సుకుమారముగానూ ఉండును.

17
శంఖా నాదము, ఆ శంఖములకు పేర్లలో వ్యాస భగవానుడి
రహస్యము – శంఖ నాదము యోగాభ్యాసమునకు ప్రాధమిక
సూచన. శంఖమునకు, హృదయమునకు సంబంధము. అదే
మనస్సు, అందులోనే పరమాత్మ ఉన్నాడు.

ఛాందోగ్యోపనిషత్ – 8-3-3 - “సవా ఏష ఆత్మ హృది


తస్యైతదేవ నిరుక్తం హృద్యయ మితి తస్మాద్థృయ” – మనము
అనుకునే హృదయములో పరమాత్మ దాగి ఉన్నాడు. దానికి హృది
అంటారు. హృదయం = హృత్ + అయం (పరమాత్మ). హృత్
పలికేటప్పుడు గాలి హృదయమునకు చేరుతుంది, హృదయములో
గాలి సుడులు తిరిగి, ఒక్కసారి ఆగిపోతుంది. హృదయము,
శంఖము నాదమును చేసే సాధనములు. మంచి పదములతో
(గాలితో) హృదయమును కదిలిస్తే, హృదయములో ఉండే మంచి
సంస్కారములు పైకి లేచి, మనలను సన్మార్గములో నడిపిస్తా యి.
అలాగే చెడు. మంచి శబ్దములను ఉచ్చరించి, మన హృదయములో
ఉండే నాడులను, నాడులలో సంచరించే ప్రాణ వాయువును, మనలో
ఉండే సత్ సంస్కారములను ప్రేరేపించే ప్రయత్నమునకు సూచకము
– శంఖ నాదము – ప్రాణాయామమునకు, యోగాభ్యాసమునకు,
ప్రణవోపాసనకు సంకేతము. గీత పారాయణము (అక్షర విన్యాసము)
కూడా ఆ కోవలోనే వస్తుంది.

18
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ॥ 17 ॥

కాశ్యశ్చ (కాశీ రాజు), ద్రు పద మహారాజుకు ఆడపిల్లగా పుట్టి,


మొగ పిల్లవాడుగా మారిన మహారథుడు శిఖండి (అడ్డు పడేవాడు)
శంఖ నాదము చేశారు.

దృష్టద్యుమ్నుడు, విరాటు రాజు, పరాజయము లేని సాత్యకి


(కృష్ణుడికి తమ్ముడి వరస) శంఖ నాదము చేశారు.

పురుష సూక్తం

“వేదాహమేతం పురుషం మహాంతమ్ | ఆదిత్యవర్ణం తమసః పరస్తా త్


||

తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః


పంథా విద్యతేఽయనాయ ‖”

ఆ పరమాత్మను తెలుసుకుంటే (ఆత్మ తత్త్వ జ్ఞానము


మాత్రమే) అమృతుడు అవుతాడు.

ద్రు పదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే ।


సౌభద్రశ్చ మహాబాహుః శంఖాందధ్ముః పృథక్పృథక్ ॥ 18 ॥

19
ద్రు పదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు (ఉప
పాండవులు),

గొప్ప బాహువులు కల సుభద్ర కుమారుడు (అభిమన్యుడు


– 2-38 శ్లోకమును – నిష్కామ కర్మ - ఆచరించిన వాడు) మరియు
అన్ని వైపులా నుండి, అందరు రాజులు వేర్వేరుగా శంఖ నాదములు
చేశారు.

స ఘోషో ధార్తరాష్ట్రా ణాం హృదయాని వ్యదారయత్ ।


నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ॥ 19 ॥

పాండవులు చేసిన శంఖ నాదములు ధృతరాష్ట్రు డి పుత్రు ల


(అంత యోగాభ్యాసము లేనివాళ్లు ) ప్రాణాలు పోయి, గుండెలు
బ్రద్దలయిపోయాయా అన్నంత భయము వేసినది.

వాళ్ళందరూ బెదిరిపోయారు. భూలోకము, ఆకాశము ఆ


తీవ్రమైన శబ్దములతో నిండిపోయింది.

అథ వ్యవస్థితాందృష్ట్వా ధార్తరాష్ట్రా న్కపిధ్వజః।


ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ॥ 20 ॥

హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే।

20
అథ = మంగళము. ధృతరాష్ట్రు డి పుత్రు లందరూ నుంచుని
ఉన్నారు. వాళ్ళందరినీ, కపిధ్వజ = అర్జు నుడు (అర్జు నుడి రధముపై
ఉన్న జండాలో అర్జు నుడి బల పరాక్రములను అభివృద్ధి చేస్తూ, రక్షణ
కల్పిస్తూ ఆంజనేయస్వామి ప్రత్యక్షముగా ఉంటారు. అందుకు
అర్జు నుడికి కపిద్వజ అని పేరు వచ్చినది). ఇంక బాణములు వేసే
సమయములో, ధనుస్సును పైకి లేపి పట్టు కొని (సవ్యసాచి =
అర్జు నుడు రెండు చేతులతోనూ ధనుస్సును పట్టు కొని, రెండు
చేతులతోనూ బాణములు వేయగలడు), శ్రీ కృష్ణ పరమాత్మతో ఇలా
అన్నారు:

అర్జు న ఉవాచ ।
సేనయోరుభయోర్మధ్యే రథం స్థా పయ మేఽచ్యుత ॥ 21 ॥

అర్జు నుడు ఇలా అంటున్నాడు I నా రధమును ఉభయ


సేనల మధ్యలో ఉంచు అచ్యుత = స్థిరమైనవాడు = శ్రీకృష్ణ.
(పద్దెనిమిది (18) సంఖ్యకు “జయం” అని పేరు ఉన్నది.
ధర్మమునకు, తత్త్వ జ్ఞానమునకు జయము కలుగుతుంది. 18
అక్షోణీల = మొత్తము సైనికులు = 39,30,660 (logistic and
administrative staff separate).

యావదేతాన్నిరీక్షేఽహం యోద్ధు కామానవస్థితాన్ ।


కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్రణసముద్యమే ॥ 22 ॥

21
ఎక్కడ నా రథము ఉంటే, నేను రెండు వాపులా పరిశీలించి
చూసి, వీరందరూ యుద్ధము చేయుటకు వచ్చి, చక్కగా నిలబడి
ఉన్నారు.

నేను ఎవరితో యుద్ధము చేయాలి, నాతో ఎవరు యుద్ధము


చేస్తా రు అనే విషయము చక్కగా అవగతం చేసుకోగలుగుతాను.

యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః ।


ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ॥ 23 ॥

యుద్ధము చేయబోయే వారిని ఒక్కసారి పూర్తిగా చూస్తా ను.


వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి చూసుకోవాలి కదా!

ధృతరాష్ట్రు డి పుత్రు డైన, దుర్బుద్ధి కల దుర్యోధనుడికి,


ప్రీతి/విజయం కలిగించుటకు ఎవరు, ఎవరు వచ్చారు? వారిని నేను
ఒక్కసారి చూడాలి.  (“కర్తా కారయితా చైవ ప్రేరకః చ అనుమోదకః,
సుకృతే దుష్కృతే చైవ చత్వారః సమభాగినః” = మంచిపని లేక
చెడుపని – చేసేవాడు (దుర్యోధనుడు), చేయించేవాడు,
ప్రేరేపించేవాడు, ఆ పనిని ఆమోదించేవాడు (ధృతరాష్ట్రు డు) అందరికీ
సమమైన భాగము ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి). అర్జు నుడు
పెద్దనాన్నను (ధృతరాష్ట్రు డు), అన్నగారిని (దుర్యోధనుడు)
గౌరవించక పోవుట తప్పుచేశాడు.

22
సంజయ ఉవాచ ।
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ।
సేనయోరుభయోర్మధ్యే స్థా పయిత్వా రథోత్తమం ॥ 24 ॥

సంజయుడు ధృతరాష్ట్రు డితో ఇలా చెప్పుతున్నాడు. గుడాకేశే


= నిద్రను గెలిచినవాడు (అర్జు నుడు) నా రధమును ఉభయ సేనల
మధ్యలో ఉంచు అన్నారు కదా. అది విన్న హృషీకేశో = మనస్సులలో
నిండి ఉండి ఇంద్రియములను నియంత్రించేవాడు (శ్రీకృష్ణుడు),

ఆ రెండు సేనల మధ్య రధమును తీసుకువెళ్లి ఉంచాడు.

భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ।


ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ॥25॥

ప్రముఖులు భీష్ముడు, ద్రోణుడు మరియు కౌరవుల రాజుల


అందరూ ఎదురు గుండా కనిపించేటట్లు గా మంచి స్థా నమును
చూచి అక్కడ రధమును నిలబెట్టా డు.

శ్రీకృష్ణుడు అన్నారు. పార్జా ! (యాదవుల మహారాజు సురసేన


కుమార్తె పృధ. కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతి అని
పేరు వచ్చినది. కుంతీదేవి అసలు పేరు పృధ. కుంతి కుమారుడు
కాబట్టి పార్ధ అనవచ్చు. కాని పార్ధ = విశాలమైన. (నీ భావన
విశాలము చేసి చూడు - అనే సూచన ఉంది). వీళ్ళందరినీ
23
చూసుకో. యుద్ధము కోసము వచ్చిన కౌరవ సేన అంతా నీ ముందు
ఉన్నది. ఎవరెవరు నీకు ఏమవుతారో (మన కుటుంబ వ్యవస్థ) కూడా
చూసుకో. (అలా చెప్పుతూ యుద్దము చేయబోయే ఆ కౌరవ సేనల
ఆయువు అంతా శ్రీకృష్ణుడు హరించాడు – (ఇది భీష్ముడు అప్పుడే
గ్రహించాడు) – ఇది తరువాత అర్జు నుడికి, శ్రీకృష్ణుడు చెప్పుతాడు
– 11-33 శ్లోకము చూడుము).

తత్రాపశ్యత్ స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్।


ఆచార్యాన్ మాతులాన్ భాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ॥ 26 ॥

విస్తా రమైన భావన కల అర్జు నుడు చూశాడు. అతనికి తండ్రి


వరసైన వాళ్ళు, తాత వరసైన వాళ్ళు (భీష్ముడు, సోమ దత్తు ),

గురువులు (ద్రోణాచార్యులు, కృపాచార్యులు), తనకు


బోధలు చేసిన పెద్దవాళ్లు , ఆత్మజలు, మేనమామలు, అన్నలు,
తమ్ముళ్లు , పుత్రు లు, మనవులు, స్నేహితులు మంచి మార్గములో
నడిపించిన భీష్మాచార్యులు కనిపించారు.

శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ।


తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బన్దూ నవస్థితాన్ ॥ 27 ॥

కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్

24
మామగారు, ఉపకారము చేసిన వాళ్ళు, కౌరవ సేనలలోనూ,
పాండవ సేనలలోనూ కనిపించారు.

వాళ్ళందరినీ చూసి తన వాళ్ళుగా విశాల దృక్పథముతో


అందరూ నా వాళ్ళు, నా కుటుంబము అనిపించినది. (కుటుంబ,
గ్రామ, దేశ వ్యవస్థ – మితిమీరిన నేను, నాది అనే స్వార్ధమును
తగ్గించుకోవాలి) మనము అనే భావన ఉండాలి, బంధువులపై ప్రేమ,
ఆప్యాయత, సహకారము పెంచుకోవాలి.

అందరి మీద పరమ దయ కలిగి, ఆ దయ విషాదముగా


మారి

ఛాందోగ్యోపనిషత్” – 8-15-1 – “ఆచార్య కులాద్వేద


మదీత్య యధావిధానం గురోః కర్మాతి శేషేణాభిసమావృత్య
కుటుమ్బే ...” విద్యాభ్యాసము చేసి, గురువు ఆజ్ఞతో గృహస్థ
ఆశ్రమమును స్వీకరించి, కుటుంబములో సాధన చేసుకుంటూ
ఉండు కుటుంబము ఆధ్యాత్మిక వికాసమునకు ప్రేరణ చేసి,
తోడ్పడుతుంది, అడ్డము కాదు.

అర్జు న ఉవాచ ।
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం ॥ 28 ॥

25
అర్జు నుడు ఇలా అంటున్నాడు I కృష్ణ = “కర్షణాత్ ఇతి
కృష్ణః” - కర్షణాత్ = మనలోని పాపములను, బాధలను ఆకర్షించి,
బయటకు పీకి, నాశనము చేసేవాడు. వీళ్ళందరూ నా వాళ్ళు కృష్ణా!
వీళ్ళు యుద్ధము చేయుటకు వచ్చారు. వీళ్ళను చూస్తే, నాకు ఏదో
అవుతోంది

సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।


వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ॥ 29 ॥

(తన వారిని, తన బంధువులను, తనకు ఇష్టమైన వారితో


యుద్ధము చేయవలసి వచ్చినదని అనే బాధ, విషాదముతో) నా
శరీరములో అవయవములు అన్నీ వేలాడి పోతున్నాయి. నా నోరంతా
బాధతో ఎండుకు పోతోంది.

నా శరీరములో ఒక విధమైన వణుకు పుడుతోంది.


విషాదముతో నా శరీరములోని రోమములు
నిక్కబొడుచుకుంటున్నాయి.

గాండీవం స్రంసతే హస్తా త్త్వక్చైవ పరిదహ్యతే ।


న చ శక్నోమ్యవస్థా తుం భ్రమతీవ చ మే మనః ॥ 30 ॥

నా చేతులలో నుంచి నా గాండీవం పడిపోతోంది, తట్టు కోలేని


బాధతో, నా శరీరము పైన ఉన్న చర్మము మంటెక్కిపోతోంది.
26
నేను నుంచుందుకు కూడా నాకు శక్తి లేదని అనిపిస్తోంది.
నా మనస్సు, కళ్ళు తిరిగిపోతునట్లు ఉన్నది.

నిమిత్తా ని చ పశ్యామి విపరీతాని కేశవ ।


న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ॥ 31 ॥

కేశవ = కః = బ్రహ్మదేవుడు + ఈశః = శివుడు =


బ్రహ్మదేవుడు ఈ జగత్తు ని సృష్టించి, శివుడు ఈ జగత్తు ని
ఉపసంహరించే వరకూ ఉన్న మధ్య కాలములో ఈ జగత్తు ని
పరిపాలించేవాడు. కేశి అనే రాక్షసుడిని సంహరించిన వాడు. ఈ
జగత్తు ని పాలించే వాడా (సంహరించే వాడివి కాదు కదా) I

నా ఎడమ కన్ను, నా ఎడమ భుజము అదురుతున్నాయి,


ప్రాకృతమైన ఉత్పాతములను గమనిస్తు న్నాను. విరుద్ధమైన (చెడు)
శకునములను చూస్తు న్నాను.

నా వాళ్లతో యుద్ధము చేసి, నా వాళ్ళనే, నేను సంహరిస్తే,


నాకు కలిగే శ్రేయస్సు ఏమిటి? ఆ శ్రేయస్సు నా కంటికి ఏమీ
కనిపించుటలేదు.

యుద్ధములో యుద్ధము చేస్తూ మరణించినవారు వీర


స్వర్గమునకు వెళ్ళుతారని శాస్త్రము చెప్పుచున్నది. కాని యుద్ధములో
చంపిన వాళ్లు ఎక్కడి వెళ్ళుతారో తెలియదు కదా.
27
కఠోపనిషత్ 1-2-2 – “శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్టౌ
సంపరీత్య వివిన క్తి ధీరః” - వివేకి శ్రేయస్సును (మనకు హితమైనది,
మంచిదైనది), అవివేకి ప్రేయస్సును (మనకు నచ్చినది, ఇష్టమైనది)
కోరుకుంటారు.

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ।


కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ॥32॥

కృష్ణా! మన వాళ్లతో యుద్దము చేసి, మన వాళ్లను


సంహరించి కలిగే విజయము, రాజ్యము, సుఖము నాకు వద్దు .
నేను విజయమును కోరటం లేదు.

నేను రాజ్యమును కూడా కోరటం లేదు. నేను సుఖములను


కూడా కోరటం లేదు. ఓ గోవిందా! మనకు రాజ్యము ఎందుకు?
మనకు భోగములు ఎందుకు? జీవితమూ మనకెందుకు?

గోవింద = గోవు = ఆవు, భూమి, వేద వాక్యములు, జీవులు.


వరాహ అవతారములో భూమిని రక్షించి, పొందినవాడు. వేద
వాక్కులతో పరమాత్మను తెలుసు కొంటున్నాము. జీవులు
పరమాత్మను పొందుతున్నారు. మనము పరమాత్మను పొందుట
ఎలా అని బోధించే పదము – గోవింద.

28
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ।
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ॥ 33 ॥

ఎవరి కోసము మనము ఈ యుద్ధము చేయాలో, రాజ్యము,


సుఖము, భోగములు ఎవరి కోసము కావాలో, వారందరూ ఈ
యుద్ధములో ఉన్నారు.

ఈ యుద్ధము కోసము ధనము ఖర్చుపెట్టి, ప్రాణములను


వదులుకుందుకు సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి యుద్ధము
మనకు అవసరమా?

ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః ।


మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ॥ 34 ॥

గురువులు (ద్రోణాచార్య, కృపాచార్య), తండ్రి వరస అయ్యే


వాళ్ళు, కొడుకు వరస అయ్యే వాళ్ళు (అభిమన్యుడు, లక్ష్మణ
కుమారుడు), తాత (భీష్ముడు, సోమదత్తు డు),

మేనమామలు (శల్యుడు, శకుని), మామగారు


(ద్రు పదుడు), మనుమలు వరస (లక్ష్మణ కుమారుడు),
బావమరిదులు (దృష్టద్యుమ్నుడు), సం బంధువులు (బంధువులు,
ఉపకారులు) ఉన్నారు. వీరు ధనము ఖర్చుచేసి, ప్రాణములు

29
పోగొట్టు కొనుటకు సిద్ధముగా యుద్ధములో రెండు వైపులా ఉన్నారు.
ఇటువంటి యుద్ధము మనకు అవసరమా?

ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన ।


అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ॥ 35 ॥

నేను యుద్ధము చేసి, వీరిలో ఒక్కరినీ నేను చంపుటకు


ఇష్టపడుటలేదు. వాళ్ళు నన్ను చంపుతున్నా సరే, నేను వాళ్లను
చంపను, మధుసూదనా (సృష్టి ఆదిలో మధువు అనే రాక్షసుడిని
సంహరించిన వాడు. కాని నీ వాళ్లను చంపలేదు కదా)!

వాళ్లతో యుద్ధము చేసి, వాళ్లను చంపితే, ముల్లోకములు


నీకు ఇస్తా అన్నా సరే, నేను నా వాళ్లను చంపను. మూడు
లోకములు వస్తా యన్నా సరే, మనవాళ్లని, మనము
సంహరించుకోకూడదు. మన రాజ్యము కోసము ఒక తగాదా, దాని
కోసము మన వాళ్లతో మనము యుద్ధము, ఆ యుద్ధములో
ఒకరినొకరు (మనవాళ్లని మనము) చంపుకొనుట, ఇదంతా
మనకెందుకు? (ఉమ్మడి కుటుంబము, సామాజిక, ధర్మ, వ్యవస్థలతో
– మానవులు పరిపూర్ణులు పూర్తిగా రాదు – నేను, నావాళ్ళు, నాది
– ప్రాపంచకమైన దృక్పథము. కుటుంబ వ్యవస్థ – ఆధ్యాత్మిక
పురోగతి సాధనకు తోడ్పడుతుంది).

30
నిహత్య ధార్తరాష్ట్రా న్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన ।
పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః ॥36॥

ధృతరాష్ట్రు డి కుమారులను (కౌరవులను) చంపినట్లయితే,


మనకు ఏ రకమైన ప్రీతి, సంతోషము కలుగుతుంది? జనార్ధనా
(జనులను వారి పాపములకు అనుగుణముగా శిక్ష ఇచ్చేవాడా) ఈ
రోజు నేను వీళ్ళను చంపి, పాపము చేస్తే, నీవే నన్ను శిక్షిస్తా వు - నీవే
చెప్పు) !

వీళ్ళు మంచి వాళ్ళు మాత్రము కాదు. వీళ్ళు ఆతతాయులు


అయినా సరే, వీళ్ళను చంపితే మనకు పాపమే చుట్టు కుంది కాని
పుణ్యము రాదు.

ఆతతాయులు = దుష్ట స్వభావము కలవారు. నీతి శాస్త్రము


1. ఇళ్లకు నిప్పుపెట్టేవాడు, 2. విషము పెట్టి చంపేవాడు, 3. నిన్ను
చంపుటకు ఆయుధమును పైకెత్తి వచ్చినవాడు, 4. నీ ధనమును
దోచుకునే వాడు, 5. మన భూమిని దొంగిలించే వాడు, 6. నీ
భార్యను అపహరించేవాడు, అవమానించేవాడు, వారి మాన
ప్రాణములు భంగము కలిగించే వాడు – వీటిలో ఏ ఒక్కటి చేసిన
వాడిని చంపినా ఏ దోషమూ లేదు. కాని ధర్మ శాస్త్రములో ఏ జీవిని
హింసించరాదు. న్యాయ శాస్త్రము కంటె, ధర్మ శాస్త్రమే ఉత్తమమైనది.

31
తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రా న్స్వబాంధవాన్ ।
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ॥ 37 ॥

అందుచేత వీరిని చంపుటకు మనము అర్హులము కాము.


వీరు ధృతరాష్ట్ర పుత్రు లు, మా సోదర వర్గమునకు చెందినవారు.

వీళ్ళు మనవాళ్లు , మనవాళ్లని మనమే చంపినట్లయితే,


మనము ఎలా సుఖముగా ఉంటాము? మాధవా (మహాలక్ష్మి
యొక్క భర్త)!

యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః ।


కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం ॥ 38 ॥

వాస్తవానికి ధృతరాష్ట్రు ని పుత్రు లు మనము


ఆలోచించుకుంటున్న విషయములను ఆలోచించు కోవటం లేదు.
ఎందుచేతనంటే వారి మనస్సులో లోభము (ఎదుటివారి సంపదలను
బలవంతముగా అయినా తీసుకోవాలనే తీవ్రమైన ఆశ) కమ్మి
ఉన్నందున చిన్నప్పుడు నేర్చుకున్నవి, వాళ్లకు గుర్తు కు రావటము
లేదు.

అంతేకాదు వాళ్ళు అనేక కులము (వంశము) క్షయము అనే


దోషమును, మిత్ర (హితుడు, మనకు ఉపకారము చేసే సద్బుద్ధి

32
ఉన్నవాడు) ద్రోహము చేస్తే వచ్చే పాపమును గురించి కూడా
ఆలోచించు కోవటంలేదే.

కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం ।


కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ॥39॥

వంశములను నాశనము చేస్తే వచ్చే మహాపాపము (ఈ


యుద్ధము) వాళ్ళు తెలుసుకోలేకపోతే, మనము కూడా
తెలుసుకోకుండా ఉండాలా? ఈ పాపము నుండి మనము ఇక్కడి
నుండి విరమించుకోవలసినదే, వెళ్ళిపోవలసినదే.

కుల క్షయము వలన వచ్చే దోషములను (పాపము) మనము


బాగా స్పష్టముగా చూడగలము, అందుచేత ఈ యుద్ధము మనకు
వద్దు ఓ జనార్ధనా!

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ।


ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభిభవత్యుత ॥ 40 ॥

వంశములకు వంశములు నాశనము అయిపోతే, ఆ, ఆ


కులములకు సనాతనముగా పరంపరగా వచ్చే ప్రత్యేకమైన
ఆచారములు, ధార్మిక ప్రవృత్తు లు, అలవాట్లు అన్నీ నశించిపోతాయి.

33
అప్పుడు ధర్మము క్రమముగా క్షీణించి పోతుంది. అప్పుడు
దాని స్థా నములో అధర్మము ఆక్రమించుకుంటుంది. అప్పుడు
మిగిలిన కాస్త ధర్మమును కూడా ఆవరిస్తుంది. అందుచేత ఈ
యుద్ధము మనకు వద్దు .

ధర్మము మూడు విధములుగా ఉంటుంది – 1. కాయక


(శరీరముతో చేసే) ధర్మము, 2. వాచిక (మాటలతో చేసే) ధర్మము, 3.
మానసిక (మనస్సుతో చేసే) ధర్మము.

అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః।


స్త్రీషు దుష్టా సు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః॥ 41 ॥

ఈ యుద్ధములో బలవంతులు, రక్షకులు మరణిస్తా రు.


తరువాత (ధర్మ, శారీరక) బలహీనులు మిగులుతారు. ధర్మములేని,
అధర్మముగా ఆక్రమించుకున్న సమాజములో, స్త్రీల మీద ఎక్కువ
ప్రభావము ఉంటుంది. స్త్రీలు వారి, వారి భర్తలు, కొడుకులు
మరణించినందుకు, వారు చాల దుఃఖములో ఉంటారు.

అప్పుడు స్త్రీలకు రక్షణ కరువై పోతుంది. అలాంటి


పరిస్థితులలో వంశములకు, వంశములు మారు పడిపోయి, వర్ణ
సంకరము కలిగి, వృత్తు ల సంప్రదాయము లోపించి, కనుమరుగై
విచిత్రమైన సమాజము ఏర్పడే ప్రమాదము ఉన్నది.

34
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ ।
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ॥ 42 ॥

వంశాలకు, వంశములు మారు పడిపోయి సంకరము


కలిగితే, కులములను నాశనమునకు కారణమైన యుద్ధమును
ప్రారంభించిన వారికి, ఆ కులములో పుట్టిన వారికి నరకానికే దారి
తీస్తుంది.

ఎందుకంటే ఆ కులముల పితృ దేవతలకు సరైన శ్రాద్ధ


పిండములు అందక, దుఃఖములో పడి వారు ఆశీర్వాదములు
ఇవ్వరు. అంతేకాదు పిండోదక క్రియలు లోపించినందుకు, ఆ పితృ
దేవతలు కూడా నరకమునకు పోతారు.

దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ।


ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ॥ 43 ॥

యుద్ధము తరువాత సమాజములో ధర్మము చెప్పేవాళ్ళు


లేక, ధర్మము తప్పినట్లయితే, వంశములు ఎటూ కాకుండా,
సంకీర్ణము (అన్నీ కలిసిపోతాయి) వర్ణ సంకరము అవుతుంది.

వర్ణ సంకరము అయితే శాశ్వతముగా ఉండవలసిన జాతి


ధర్మములు, కుల ధర్మములు, విధులు నాశనము అయిపోతాయి.

35
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన।
నరకేఽనియతం వాసో భవతీత్యనుశుశ్రు మ ॥44॥

మానవులు వారి, వారి వంశములలో పరంపరగా వచ్చే


ధర్మములను వదిలేసుకుంటారో, నరకములోనే వారి నివాసము. ఇది
వేదము, శాస్త్రము, మహర్షులు చెప్పినది. జనార్ధనా (జనులను వారి
పాపములకు అనుగుణముగా శిక్ష ఇచ్చేవాడా).

జగద్గురువులు ఆది శంకరాచార్యులు – భగవద్గీతను


కొంచమైనా అధ్యయనము చేసినవారిని, గంగా జలము ఒక్క బొట్టు
అయినా త్రాగినవారిని, శ్రీనివాసుని పూజించినవారిని,
యమధర్మరాజు నరకమునకు రానీయకుండా, తిన్నగా స్వర్గమునకే
పంపుతాడు. వారికి మంచి జన్మలు కలుగుతాయి.

అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం ।


యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ॥ 45 ॥

నేను రాజ్యము వారికి ఇచ్చేసి, రాజ్యము మీద కోరిక


వదులుకున్నాను. అయ్యో, అయ్యో మనము రాజ్యము మీద,
సుఖము మీద లోభముతో (పరుల వస్తు వు మీద కోరిక) ఈ
యుద్ధము చేసి చాలా పెద్ద పాపము చేయబోతున్నాము.

36
మన బంధువులను, మన ఆచార్యులను, మన మిత్రు లను
అంతా మనవారిని చంపుటకు మనము ఈ యుద్ధము చేయుటకు
సిద్ధముగా ఉన్నాము.

యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః ।


ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ॥ 46॥

కౌరవులు బాణములు వేసినా సరే, నేను ప్రతీకారము


చేయను, నేను బాణములు వేయను. నేను నా శాస్త్రములను క్రింద
పారేస్తా ను.

ధృతరాష్ట్రు డి పుత్రు లు, నన్ను చంపనీ. (నేను యుద్ధము


నుండి పారిపోను. అది వీరులకు చాలా అపకీర్తి.) నాకు అదే క్షేమ
తరము, శ్రేయస్కరము. యోగము = మనకు దొరకని వస్తు వు
దొరుకుట. క్షేమము = ఉన్నది ఉండటము.

సంజయ ఉవాచ ।
ఏవముక్త్వార్జు నః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ ।
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ॥ 47 ॥

సంజయుడు ధృతరాష్ట్రు డితో ఇలా చెప్పుతున్నాడు. ఇన్ని


చెప్పిన అర్జు నుడు. యుద్ధము ప్రారంభము అవవలసిన
సమయములో, అర్జు నుడు శోకముతో (అర్జు నుడి శోకమునకు
37
మూల కారణము మోహము – మనవాళ్లు అనే భావన) మనస్సు
అంతా కలత వేసినట్లయి రథము మధ్యలో కూలబడిపోయాడు.
చేతిలో ఉన్న గాండీవమును, బాణమును క్రింద పారవేశాడు.

ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే


శ్రీకృష్ణార్జు నసంవాదే అర్జు నవిషాదయోగో నామ
ప్రథమోఽధ్యాయః॥1॥

అధ్యాయాంత గద్యము (అధ్యాయము చివరలో వచ్చే


వాక్యము)

ఇతి శ్రీమద్భగవద్గీతాసు - ఇది భగవంతుడి గానములు


(ఉపదేశము) – పరమాత్ముడు ఉపదేశము చేసిన 700 శ్లోకముల
గ్రంధము.

ఉపనిషత్సు - వ్యాస భగవానుడు ఒక్కటిగా ఉన్న వేదమును


నాలుగు వేదములుగా విభజించారు. ప్రతి వేద శాఖలు (వేద
వ్యాసుడు చెప్పినవి - ఋగ్వేదము – 21 + యజుర్వేదము – 101
+ సామవేదము – 1000 + అధర్వణవేదము – 9 = 1131). ఈ
రోజులలో మనకు మిగిలిన 12 సుమారు శాఖలు ఉంటే గొప్ప)
చివరలో మానవుల ఉన్నత జీవిత ప్రమాణాల కోసము, ఉత్తమమైన
జీవిత విధానాల కోసము, ఆధ్యాత్మిక పురోగతి కోసము ఉపనిషత్తు లు

38
(ఉప + ని + షత్ – దగ్గరగా పరమాత్మ స్వరూపమును తెలిపే
జ్ఞానము - రహస్య విజ్ఞానము) తప్పకుండా ఉంటాయి. అంటే
1131 ఉపనిషత్తు లు ఉండాలి. కానీ మన పూర్వీకులు 108
ఉపనిషత్తు లు రక్షించి ఉంచారు. కాని 10 ముఖ్య ఉపనిషత్తు లు
(ఈశ, కేనో, కఠో, ప్రశ్న, ముండకో, మాండూక్యో, త్తైత్తరీయో,
ఐతరేయో, ఛాందోగ్యో, బృహదారణ్యకో). 1131 ఉపనిషత్తు లను ఈ
భగవద్గీతా గ్రంధములో చూసుకోవచ్చు. అలా కూర్చి ఉపదేశము
చేయుట పరమాత్మ మాత్రమే చేయగలడు. ఎన్నో యోగ శాస్త్ర
రహస్యములు, సిద్ధాంతములు (కర్మ, జ్ఞాన, సంఖ్య, యోగ,
ఆసనములు, ఆహార నియమములు, ఆచారములు, రహస్యమైన
విషయములు చెప్పబడినవి).

బ్రహ్మవిద్యాయాం - (ముండకోపనిషత్ 1-1-4, 5 – “తస్మై స


హోవాచ ద్వే విద్యే వేదితవ్యే ఇతి హ స్మ యద్బ్రహ్మవిదో వదంతి
పరాచైవాపరా చ” .... - విద్యలు రెండు రకములు. 1 అపరా విద్య –
పరమాత్మ తప్ప మిగతావన్నీ తెలిపే విద్య 2. పరా విద్య –
పరమాత్మను తెలిపే విద్య – బ్రహ్మవిద్య) అంటే పరమాత్మ మరియు
జీవుడు యొక్క స్వస్వరూప జ్ఞానము. ఈ జ్ఞానము ఉంటేనే
మోహము పోతుంది. మోహము పోతేనే శోకము పోతుంది.
ఉత్తమమైన జీవిత విధానము ఉంటేనే ప్రధానమైన బ్రహ్మవిద్య

39
సిద్ధిస్తుంది. దాంతో సహా ప్రాపంచకమైన, లౌకిక ప్రయోజనములు
కూడా లభిస్తా యి.

యోగశాస్త్రే – భగవద్గీతకు ప్రత్యేకముగా పరిమితమైన


(సాంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము)
యోగములను ఉపదేశము చేసే గ్రంధము.

శ్రీకృష్ణార్జు నసంవాదే – శ్రీకృష్ణుడు మరియు అర్జు నుడు


(గురు శిష్యులుగా – 2-7 శిష్యస్తేఽహం) పరస్పరము మంచి
విషయముల కోసము బాగా సంభాషించుట, చర్చించుట.
మనమందరమూ శిష్యులమైతే – శ్రీకృష్ణుడు జగత్ గురువు
అవుతాడు. అందుకే “కృష్ణ వందే జగత్ గురుం” అని జపిస్తా ము.

అర్జు న విషాదయోగః – అర్జు నుడి యొక్క విషాదమైన


యోగము (ఇది మనకు కూడా అన్వయిస్తుంది. మనకు
యోగమును ప్రసాదించే గ్రంధము).

మంగళా శ్లోకములు

యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః l తత్ర శ్రీర్విజయో


భూతిర్ధ్రు వా నీతిమతిర్మమ ll

అధ క్షమా ప్రార్ధనా

40
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ l తత్సర్వం క్షమ్యతాం
దేవ నారాయణ నమోస్తు తే ll

అధ భగవత్ సమర్పణమ్

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ l


కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ll

అధ లోకక్షేమ ప్రార్ధనా

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః l


సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ll

అధ మంగళమ్

శ్రియః కంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినామ్ l


శ్రీవేంకట నివాశాయ శ్రీనివాసాయ మంగళమ్ ll

కృష్ణ నామ సంకీర్తన

కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l


కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l

41
అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యానాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జు న సంవాదే అర్జు న సాంఖ్యయోగోనామ ద్వితీయోధ్యాయః
ll

సాంఖ్య యోగము – సంఖ్య = ఆత్మ జ్ఞానము,


ఉపనిషత్తు లు. సాంఖ్య = “సమీతీనా ఖ్యా ఇతి సాంఖ్య”= తత్త్వ
జ్ఞానము. తత్త్వ జ్ఞానము కోసము చేసే సన్యాసమును (రాగ
ద్వేషములను, ద్వంద్వ భావముల విడిచిపెట్టు ట) సాంఖ్యము
అంటారు.

ఉపనిషత్తు ల ద్వారా తెలియబడే సంపూర్ణ పరమాత్మ తత్త్వ


జ్ఞానమునకు సాంఖ్య అంటారు. శ్రీకృష్ణ ఈ అధ్యాయములో
ఉపనిషత్తు లలో చెప్పబడిన పరమాత్మ తత్త్వ జ్ఞానమును, తనదైన
శైలిలో చిన్న, చిన్న పదములతో స్పష్టముగా వివరించాడు. యోగము
= అధ్యాయము, “యోగః కర్మసు కౌశలం” = కర్తృత్వ భావన
లేకుండా, ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా, సమతా భావముతో,
ఈశ్వరార్పణ బుద్ధితో చేసే సత్కర్మ. దీనిలో పరమాత్మను పొందే
ఉపాయములను బోధించే అధ్యాయము. ఔషధములను సరైన
పాళ్ళల్లో కలిపి తయారు చేసే మందులాగ, రక, రకాల
సాధనములను కలిపి పరమాత్మ తత్త్వ జ్ఞానమును బోధించే
అధ్యాయము.

42
సంజయ ఉవాచ ।
తం తథా కృపయావిష్టం అశ్రు పూర్ణాకులేక్షణం ।
విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ॥ 1 ॥
సంజయుడు ధృతరాష్ట్రు డితో ఇలా చెప్పుతున్నాడు.
అర్జు నుడు నా వాళ్లను సంహరించుట సరైన పద్ధతి కాదు (నా వాళ్ళ
మీద ప్రీతి) అనే దయతో, ఆవేశము (సరైన ఆలోచన ఉండదు)
వచ్చిన వాడిలా ఉన్నాడు. అర్జు నుడి కళ్ళు నీళ్ళతో నిండి ఉన్నాయి
(సరిగ్గా కనిపించదు). దృష్టి స్థిరముగా ఉండక కదిలిపోతోంది (దూర
దృష్టి ఉండదు).

వళ్ళు పట్టని విషాదముతో (నేను, నాది, నా వాళ్లు అనే


అహంకారము) ఉన్న అర్జు నుడితో మధుసూదనుడు ఇట్లా
పలికాడు. (1. మధువు అనే రాక్షసుడిని సంహరించినవాడు. మనలో
ఉండే రాక్షస ప్రవృత్తిని తీసివేస్తా డు. 2. మధురమైన అహంకారమును
సంహరిస్తా డు. 3. మధురమైన పరమాత్మ జ్ఞానమును ఉపదేశము
చేస్తా డు)

శ్రీభగవానువాచ ।
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితం ।
అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జు న ॥ 2 ॥

43
భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు l అర్జు నా
(పరిశుద్ధమైన తెల్లని స్వభావము కలవాడు) అకాలములో, ఈ విషమ
పరిషత్తు లలో, ఎందుకు ఈ కశ్మలం (కల్మషము, మాలిన్యము,
దోషము, కర్తవ్య విముఖత, మాయ) నిన్ను ఆవరించినది?

సత్పురుషులు (వేదములను ప్రమాణముగా తీసుకొని,


అందులో చెప్పిన విధముగా జీవించువారు), ఆర్యులు (శ్రేష్ఠు లు),
పెద్దవాళ్లు , మంచివాళ్లు ఈ పద్ధతిని ప్రీతిగా చూడరు, వాళ్ళు నడిచి
దారిలో నడవాలి. ఈ పద్దతి స్వర్గము మొదలైన మంచి లోకములకు
(ఫలితములకు) దారి కాదు. నీలాంటి సత్పురుషులకు, యోధులకు
కీర్తి కరము కాదు.

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్ త్వయ్యుపపద్యతే ।


క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ॥ 3 ॥

ఓ పార్జా (పృధా – కుంతీదేవి తనయుడు, విశాల


భావములు కలవాడు)! నీకు చేతకాని వాడవు కావద్దు .
చేతకానితనము నీకు సరైనది, యుక్తమైనది కాదు.

నీలూ ఉన్నది నీచమైన హృదయ దౌర్బల్యము, బలహీనత


కాని నీ వాళ్ళ మీద ప్రేమ, దయ మాత్రము కాదు. నీ హృదయ
దౌర్బల్యమును, చేతకానితనమును విడిచిపెట్టి, లే. యుద్ధము
44
చేయుటకు సిద్ధపడు. నీవు శత్రు వులను చూస్తేనే కాలిపోయే
పరాక్రమము ఉన్నవాడివి. నీలాంటి వాడికి ఇలాంటి చేతకానితనము
తగదు.

అర్జు న ఉవాచ ।
కథం భీష్మమహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన ।
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన॥4 ॥
అర్జు నుడు ఇలా అంటున్నాడు I ఓ మధుసూదనా l నాకు
పూజార్హులైన నా పితామహుడైన భీష్ముడిని, నా గురువైన
ద్రోణాచార్యలను నేను యుద్ధములో ఎలా సంహరించాలి?

వాళ్ళు బాణములు వేసినా, నేను వాళ్లను పూజించాలే తప్ప,


నేను వాళ్ళ మీద ఎదురు బాణము వేయకూడదు.

ముండకోపనిషత్ – 2 2 – 4 – “ప్రణవో ధనుః శరో హ్యాత్మా


బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే” – ప్రణవమే (ఓం కారము) ధనుస్సు,
ఆత్మయే (మనస్సు) బాణము, పరమాత్మ ఆ మనస్సుకు లక్ష్యముగా
చెప్పబడుచున్నది. కేవలము లక్ష్యము మీద దృష్టి ఉండే ఏకాగ్రత
యోగోపదేశము.
గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే

45
హత్వార్థకామాంస్తు గురునిహై వ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధా న్ ॥
5॥

ఎదురు గుండా ఉన్నది మహానుభావులైన (చాల గొప్పదైన


ప్రభావము కలిగినవారు) నా గురువులు. వారిని సంహరించుట నాకు
శ్రేయస్కరము కాదు. ఈ లోకములో నా గురువులను చంపటము
కంటె, నేను బిచ్చమెత్తు కొని తినటము చాలా శ్రేయస్కరము,
మంచిది.

వాళ్ళు అర్ధ, కామములతో కౌరవుల వైపు ఉన్నా సరే, వాళ్ళు


నాకు గురువులు కాబట్టి, వారిని నేను సంహరిస్తే, నేను నరకమే
అనుభవించాలి తప్ప, నాకు ఉత్తమ పుణ్య లోకములు ఉండవు. ఈ
లోకములోని భోగములు నాకు నెత్తు టికూడుతో సమానము. (మా
గురువుల, బంధువుల రక్తముతో తడిచిన భోగములు).

శ్రీమద్భాగవతము – 10-47-18 – వైరాగ్యము కలిగిన


ముముక్షువులు, ఏ భోగములు ఆశించకుండా కేవలము శరీరము
నిలబడుటకు, భిక్షను ఆచరిస్తా రు. భిక్షాటన అహంకారమును
అణచివేస్తుంది.
న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో
జయేయుః।

46
యానేవ హత్వా న జిజీవిషామః స్తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ॥
6॥

నాకున్న రెండు సందేహములలో నేను ఏమి చెయ్యాలో


అర్ధము కావట్లేదు. నా స్వధర్మము, కర్తవ్యము (యుద్ధము) వదిలి
పెట్టి (అహింస), అడవులలోకి వెళ్ళుట, బిచ్చమెత్తు కొని బ్రతకాలా?
లేదా నా స్వధర్మము ఆచరించుటకు, నేను యుద్ధము చేసి నా
గురువులను, స్వజనులను (బంధువులను), మిత్రు లను
సంహరించాలా (హింస)? ఏది గొప్పదో నాకు అర్ధమవుటలేదు. లేక
రెండూ గొప్పవేనా, లేక రెండూ సమానమేనా? అదీ
అర్ధమవుటలేదు. ఒకవేళ మనము గెలవచ్చు, లేదా వాళ్ళు కూడా
గెలవచ్చు. గెలుపు ఎవరికైనా కావచ్చు.

ఈ యుద్ధములో గెలవాలంటే, ఎదురు గుండా ఉండే ఆ


ధృతరాష్ట్ర సైన్యములో అందరూ మనవాళ్లే ఉన్నారు. వాళ్లు చివరిదాకా
పోరాడుతారు (పారిపోరు). అందుకు వారిని సంహరిస్తేనే మనకు
గెలుపు. మనవాళ్లని సంహరించి, మనము బ్రతకాలి అనుకొనుట
ఎంతవరకు న్యాయము? మనవాళ్లని సంహరించి, ఎవ్వరూ లేకుండా
బ్రతకాలనుకొనుట ఏ మాత్రమూ న్యాయము కాదు.

47
మను ధర్మ శాస్త్రము: “ధర్మ నిర్ణయ నిమిత్త మిష్యతే వేదవిత్
పరిష యేవదే మానవే” – ధర్మ నిర్ణయము చేయాలంటే, వేద,
శాస్త్రములు తెలుసున్న విద్వాంసుల దగ్గరకు వెళ్ళాలి.

కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసంమూఢచేతాః।


యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఽహం శాధి మాం
త్వాం ప్రపన్నం ॥ 7 ॥

నాకు కర్తవ్యము, అకర్తవ్యము మీద, నేను ఏమి చెయ్యాలో,


ఏది చేయకూడదో అనే దానిమీద సందేహము ఉన్నది. కాని ఎవరిని
ఆశ్రయించాలో అనే సందేహము నాకు లేదు. నాకు నిన్ను
ఆశ్రయించాలని నిర్ణయము, నీ మీద విశ్వాసము పరిపూర్ణముగా
ఉన్నది. నీవు చెప్పిన ప్రతి విషయమును నేను అంగీకరిస్తు న్నాను.

నాకు ఏది శ్రేయస్కరమో నీవే నిశ్చయము చేసి నీవే చెప్పు.


నేను నీకు శిష్యుడిని. నిన్ను నేను శరణు వేడి ఉన్నాను, నీవు
దయచేసి (శాధి మాం) నాకు ఉపదేశము/శాసనము చేయి.

కార్పణ్యము = దీనత్వము (ఏదైనా కోల్పోవుట, ఉన్నా


తెలియకపోవటం - తనను తాను కోల్పోవుట). కార్పణ్య దోషము
వలన నా సహజ సిద్ధమైన స్వభావము (ప్రతాపము, ధైర్యము, విద్య)
దెబ్బతిని ఉన్నాయి. యుద్ధము చేయాలా? లేక వద్దా ? అనే ధర్మ
48
విషయములో స్పష్టత లేదు. నా బుద్ధి సంపూర్ణముగా మోహము
లోనికి (చీకటిలో) కూరుకు పోయింది.

ఆత్మ గుణములు: 1. సర్వ భూత దయ, 2. శాంతి -


ద్వంద్వములను (సుఖము/దుఃఖము, చలి/వేడి, తట్టు కోగల శక్తి), 3.
సుచి, 4. అనసూయ, 5. అనాయాసము (శ్రమ లేకుండా), 6.
మాంగల్యము, 7. అకార్పణ్యము (దీనత్వము లేకపోవుట), 8.
అస్పృహ (కోరిక లేకపోవుట).

సృష్టి నిలబడుటకు: ధర్మము – 1. ప్రవృత్తి ధర్మము –


జీవితమును సాధారణముగా సాగుటకు – ప్రజాపతులు – మరీచి,
కశ్యపుడు, అత్రి, దక్షుడు మొదలైనవారు. 2. నివృత్తి ధర్మము –
జీవిత లక్ష్యమును సాధించుటకు – బ్రహ్మ మానస పుత్రు లు
(సనకాది పంచకము - సనకః, సనందనః, సనాతనః, సనత్ సుజాతః,
సనత్ కుమారః).

న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణాం।
అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం ॥
8॥

49
నాకు శోకము ఉన్నదని నేను, నీతో విన్నవించుకున్నాను. నా
శోకమును పోగొట్టు కొను ఉపాయమును నేను ఆలోచించ
లేకపోతున్నాను, నిర్ణయించ లేకపోతున్నాను. ఈ శోకము నా
ఇంద్రియములన్నింటినీ ఎండిపోయి, బాధకు గురిచేస్తు న్నది. దీనిని
భరించలేక పోతున్నాను.

నేను యుద్ధము చేసి గెలిచినా, ఈ భూమిలో శత్రు వులే


మిగలని రాజ్యము పొందినా, సమృద్ధిగా ఉన్న రాజ్యమును
పొందినా, లేదా ఒకవేళ యుద్దములో మరణించి, దేవతలకు
అధిపతిని చేసినా, నాకు ఈ శోకము పోతుందని నమ్మకము లేదు.

కఠోపనిషత్ – 1-1-26 – “శ్వోభావా మర్త్యస్య యదనైకై త


త్సర్వేంద్రియాణాం జరయన్తి తేజః” – మానవులకు సర్వ భోగములు
శాశ్వతము కాదు. ఈ భోగములు ఇంద్రియ శక్తిని నాశనము
చేస్తా యి.

సంజయ ఉవాచ ।
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప ।
న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ హ ॥ 9 ॥
సంజయుడు ధృతరాష్ట్రు డితో ఇలా చెప్పుతున్నాడు. తన
మనస్సులో ఉన్న భావములని ఉన్నట్లు చెప్పిన, హృషీకేశం

50
(మనస్సులో దాగి ఉన్న పరమాత్మునితో), గుడాకేశః (నిద్రాది –
తమో గుణము దోషములను కొంత జయించినవాడు, సత్త్వ
గుణములను కొంచెము పెంచుకున్నవాడు) పరంతప (తనలోని
శత్రు వులను కొంత నాశనము చేసుకున్నవాడు) అయిన అర్జు నుడు,

ఇక మీద నేను యుద్ధము చేయను అని గోవిందుడితో


(జీవులను ఉత్తమ మార్గము లోనికి తీసుకువెళ్ళేవాడు) చెప్పి, ఊరకే
కూర్చొన్నాడు (నాకేమీ వద్దు అనే భావన).

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ।


సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః ॥ 10 ॥
హృషీకేశుడు (అర్జు నుడి మనస్సులో ఉన్న భావములను
పసిగట్టిన భగవానుడు) చిరునవ్వు కంటె తక్కువ నవ్వు నవ్వి (నీ
సందిగ్ధ అవస్థను నేను తీరుస్తా ను అన్నట్లు గా), అర్జు నుడిని చూసి,

రెండు సేనల మధ్య, విషాదముతో కూరుకు పోయిన


అర్జు నుడితో ఇలా అన్నారు.

శ్రీభగవానువాచ ।
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ॥ 11 ॥

51
భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు l (భగ =
సమగ్రస్య చ – సమస్తమైన 1. ఐశ్వర్యస్య – సామర్ధ్యము, 2.
ధర్మస్య, 3. యశసః - కీర్తి, 4. శ్రీయః – సంపద, మోక్షము, 5.
వైరాగ్యస్య, 6. జ్ఞానః).

నీవు (పెద్దలు భీష్మ, ద్రోణుడు విషయములో)


ఆలోచించుటకు, శోకించుటకు వీలులేని వాటిని ఆలోచించి
శోకమునకు గురి అవుతున్నావు. నీ మాటలు పండితులు (ఆత్మ
తత్త్వ జ్ఞానులు) మాట్లా డినట్లు మాట్లా డుతున్నావు. కాని నీ
ఆలోచనలు, ఆత్మ జ్ఞానమునకు దరిదాపులలో కూడా లేవు.

వాళ్ళ ప్రాణాలు పోతాయి అనిగాని, లేక వాళ్ళ ప్రాణాలు పోవు


అనిగాని పండితులు ఎవ్వరూ ఆలోచించరు. పండితులైతే కనుక ఈ
విషయములో ఎవ్వరూ శోకమును పొందరు. నీ మాటలకి,
ఆలోచనలకి ఏ మాత్రము పొత్తు లేదు. (ఈ శ్లోకము సంక్షిప్త
భగవద్గీత).

సరస్వతీరహస్యోపనిషత్ – 6 “జగత్కరు మకర్తుంవా


చాన్యధా కర్తు మీశతే యస్స ఈశ్వర ఇత్యుక్త స్సర్వజ్ఞత్వాదిభిర్గుణైః”
– ఈశ్వరుడు జగత్తు ను చేయుటగాని, చేయకపోవుటగాని, మరొక
రీతిగా చేయుటగాని సమర్ధు డు అయినవాడు.

52
కూర్మ పురాణము – “ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం
ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాం చ స వాచ్యో భ్హగవాన్ ఇతి” –
ఎవరికైతే సృష్టి (ఉత్పత్తి), ప్రళయము, జీవులు ఎక్కడి నుండి
వస్తు న్నారో మరియు ఎక్కడికి వెళ్ళుతున్నారో, జ్ఞానము మరియు
అజ్ఞానము గురించి తెలుసో వానిని భగవాన్ అంటారు.

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః ।


న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం ॥ 12 ॥
ఆత్మ స్వరూపము నిత్యమైనది (ఇంతకు ముందు ఉన్నది –
భూత కాలము, ఇప్పుడు ఉంది – వర్తమాన కాలము, ఇకముందు
ఉంటుంది – భవిష్య కాలము) అనే విషయమును నీకు
అర్థమయ్యేలా నేను చెప్పుతాను.

నేను లేదు అనేది లేదు (కృష్ణుడుగా పుట్టక ముందు నేను


ఉన్నాను). తప్పకుండా ఉన్నాను. నీవు కూడా అదే (అర్జు నుడిగా
పుట్టక ముందు నీవు ఉన్నావు). అలాగే జనులందరూ వాళ్ళు
పుట్టటానికి ముందు కూడా ఉన్నారు. ఇది నాకు, నీకు, అందరికీ
సమానమైన విషయము.

మనమందరమూ ఇక మీద (ఈ శరీరములను విడిచిపెట్టిన


తరువాత) కూడా ఉండము అనే మాట లేదు. ఈ శరీరములను

53
విడిచిపెట్టిన తరువాత కూడా తప్పకుండా ఉంటాము. ఈ
శరీరమును ధరించక ముందు, ధరించినప్పుడు, విడిచిపెట్టిన
తరువాత కూడా ఉంటాము. మనము నిత్యము (పుట్టు క,
మరణము లేకపోవుట).

దేహినోఽస్మి న్యథా దేహే కౌమారం యౌవనం జరా ।


తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ॥13॥

ఒక శరీరమునకు కొన్నాళ్ళు కౌమారము (చిన్నతనము),


తరువాత ఆ శరీరమునకు యవ్వనము వచ్చినది, తరువాత అదే
శరీరమునకు ముసలితనము వచ్చినది. ఇలా ఆ ఒకే శరీరమునకు
మార్పులు వచ్చినా దేహము మాత్రము ఒక్కటే. ఇలా శరీరము
యొక్క అవస్థలు మారినా అందులో ఉన్న ఆత్మకు ఏ మార్పులూ
లేకుండా అలానే ఉన్నది.

అ విధముగానే ఒకే ఆత్మ ఒక దేహము మరణించిన


తరువాత, ఇంకొక కొత్తగా పుట్టిన దేహమును ధరించ వచ్చును
(పునర్జన్మ). ఆత్మకు పుట్టు క లేదు, మరణము లేదు. బుద్ధిమంతుడు
ఈ విషయములో మోహమును పొందడు, అజ్ఞానముతో ఉండడు.
ఈ విషయమును సరిగ్గా ఆలోచిస్తే అందరికీ బోధపడుతుంది.

54
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః।
ఆగమాపాయినోఽనిత్యాః తాంస్తితిక్షస్వ భారత ॥ 14 ॥

కుంతీ పుత్రా (నీ తల్లి వైపు వారు జ్ఞానులు)! చలి/వేడి,


సుఖము/దుఃఖము, ప్రియము/అప్రియము ఎందుకు
కలుగుతున్నాయి? మనకు ఉన్న మాత్రా (ఇంద్రియములు)
ఉన్నాయి, స్పర్శాస్తు - ప్రపంచములో విషయములు (వస్తు వులు,
శరీరము) ఉన్నాయి. ఈ ఇంద్రియములు ఆ విషయములతో కలిసి,
వాటి వివరములు, మన మనస్సుకు పంపుతాయి. మనస్సుకు ఆ
విషయములతో సంబంధము ఏర్పడి, ఆ విషయములను (చలి/వేడి,
సుఖము/దుఃఖము లేక ప్రియము/అప్రియము) అనుభవిస్తుంది.

మనస్సుకు, విషయములకు సంబంధము వస్తూ, పోతూ


(అనిత్యము) ఉంటాయి. కాని ఆత్మ నిత్యమైనది. అనిత్యమైన
ఇంద్రియ విషయ సంబంధములు, నిత్యమైన ఆత్మకు సంబంధము
ఉండదు. కాని ఆ విషయములను – నాది, నేను (శరీరమే నేను)
అని అనుకోవటముతో సంబంధము ఏర్పడుచున్నది. ఆ
సంబంధముతో చలి/వేడి, సుఖము/దుఃఖము లేక
ప్రియము/అప్రియము అనే అనుభవములు కలుగుతున్నాయి.
చలి/వేడి, సుఖము/దుఃఖము లేక ప్రియము/అప్రియము అనే
అనుభవములను సమ దృష్టితో సహించుట (తితీక్ష –

55
ద్వంద్వములను నిర్లక్ష్యము చేసుకొనుట) నేర్చుకో. ఇవి దేహ
ధర్మములు, అనిత్యమైన శరీరము నేను (ఆత్మ) కాదు అనే భావన
ఉంటే, అప్పుడు చలి/వేడి, సుఖము/దుఃఖము లేక
ప్రియము/అప్రియము అనేవి నిన్ను బాధ పెట్టదు. నాకు (ఆత్మ)
అనిత్యమైన వస్తు వులతో (శరీరము) సంబంధము లేదు అని
అనుకుంటే, ఆ వస్తు వులవలన వచ్చే ఏ శోకమూ నిన్ను చేరదు.
భారతా (నీ తండ్రి వైపు వారు చాలా గొప్ప వారు).

యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ।


సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ॥ 15 ॥

పురుషర్షభ = పురుషులలో శ్రేష్టమైన వాడా! ఏ పురుషుడికి


(శరీరములో ఉండేవాడు, శరీరము నాది అనుకునే – జీవాత్మ)
చలి/వేడి, సుఖము/దుఃఖము లేక ప్రియము/అప్రియము పీడించవో,
అటువంటి వారికి సుఖ, దుఃఖములు సమముగా మారిపోతాయి.

దుఃఖము, సుఖము (ద్వంద్వములను) సహనము కల,


సమానముగా భావించే ధీరుడికి (శరీరము వేరు, నేను (జీవాత్మ),
వేరు అని బుద్ధిని ప్రేరేపించేవాడికి. సుఖ, దుఃఖ సమ స్థితి కలుగును)
అమృతత్త్వము (మోక్షము) పొందే యోగ్యత కలుగుతుంది.

56
దుఃఖము = ఇష్ట పడని భావన. ప్రతికూలమైన దుఃఖము
మూడు విధములుగా ఉంటుంది. 1. ఆది ఆధ్యాతికము దుఃఖము
– మన శరీరములోని అవయవములు, ధాతువులు పనిచేయవలసిన
తీరులో పనిచెయ్యనప్పుడు, లేక మన మనస్సులో మనకు తెలియని
బాధ, పీడా, దుఃఖము. 2. ఆది భౌతికము దుఃఖము – మన
చుట్టూ ఉండే పంచ భూతముల వలన మనకు కలిగే దుఃఖము. 3.
ఆది దైవికము దుఃఖము – మనకు స్పష్టముగా తెలియని
కారణముతో (మన వశములో లేని, దైవము కలిగించినవి
అనుకుందాము) కలిగే దుఃఖము.

సుఖము = మనకు ఇష్టమైనది, మనకు భ్రాంతి పడి


ఆనందము అనుకునేది, మనకు కావాలి అనిపించేది. ఇష్టము
మొదట్లో సుఖము కలిగించినా, సుఖము ఎక్కువైతే దుఃఖమునకు
దారి తీస్తుంది. (పాయసము మొదట్లో బాగుండి ఆనందము
కలిగించినా, ఆ పాయసమునే చాలా ఎక్కువ తాగితే మన ఇష్టము
క్రమముగా తగ్గిపోయి, వెగటుగా అనిపించి, దుఃఖము కలిగిస్తుంది).
చిన్న సుఖము కోసము, చాలా కష్టపడాలి. అంత కష్టపడి
సంపాదించుకున్న సుఖము చాలా త్వరలో ఖర్చు అయిపోతుంది.
మనకు దుఃఖమే అనుభవము. అసలైన సుఖము, ఆనందము
మనకు అసలు తెలియదు, అనుభవమునకు లేదు. మనము
అనుకునే సుఖము, ఆనందము ఒక భ్రాంతి మాత్రమే.
57
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ।
ఉభయోరపి దృష్టోఽంత స్త్వనయోస్తత్త్వ దర్శిభిః ॥ 16 ॥

అసత్ = అనిత్యమైనది. మూడు కాలములలో ఉండనిది.


కొన్ని కాలములలో లేనట్లు , కొన్ని కాలములలో ఉన్నట్లు కనిపిస్తోంది,
కొన్ని కాలములలో మాయమైపోతోంది. దీనికి ఒక దేశ, కాల, భిన్న
పరిమితులు ఉంటాయి. సత్ = ఆత్మ స్వరూపము నిత్యమైనది,
మూడు కాలములలో ఉండేది. ఒక దేశ, కాల, భిన్న పరిమితులు
లేవు (శ్లోకము 2-12). ఈ భావము బలముగా వస్తే వానికి తత్త్వ
దర్శనము కలుగుతున్నట్లు .
ఈ రెండింటి యొక్క అంతమును (నిశ్చయమును) తత్త్వ
జ్ఞానము కల వాళ్లు చూస్తా రు.

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతం ।


వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తు మర్హతి॥17॥

ఆత్మ (సత్) స్వరూపము వినాశనము లేదని, ఇది ప్రపంచము


అంతా (సర్వత్రా) వ్యాపించి ఉన్నది అని తెలుసుకోవాలి.

ఆత్మ స్వరూపమును దేనినీ ఆశ్రయించుకొని లేదు,


అందుచేత ఎవ్వరూ, ఏదీ ఆత్మ స్వరూపమును నాశనము

58
చేయలేదు. ఆత్మ స్వరూపము అవ్యయము (క్షయము లేనిది),
వినాశనము లేని, శాశ్వతమైనది.

కేనోపనిషత్ – 1-2 - “శ్రోతస్య శ్రోత్రం మనసో మనోయద్


వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణాః l చక్షుష శ్చక్షురతిముచ్యధీరాః
ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి” – ఆత్మ చెవికి చేసి, మనస్సుకు
మనస్సు, వాక్కుకు వాక్కు, మరియు ప్రాణమునకు ప్రాణము.
కన్నుకు కన్ను. వీటియందు ఆత్మ భావము వదలి, ఇంద్రియ
వ్యవహార జీవితము వదులుకుని బ్రహ్మ జ్ఞానులు అమృత పదవి
పొందుతున్నారు - ఏ వస్తు వుకైనా పని చేసే శక్తి, పరమాత్మ యొక్క
ఆత్మ తత్త్వము నుండే వస్తు న్నది.

అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః ।


అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ॥ 18 ॥

అనాత్మ (అసత్) అయిన దేహము మొదలైన వస్తు వులకు,


అంతము, వినాశము ఉన్నది. ఒక కాలములో ప్రారంభము అయి,
ఇంకొక కాలములో నాశనము అవుతాయి. నిత్యమైన ఆత్మ (శరీరి =
దేహము కలిగినవాడు), నాశనము అయ్యే ఈ దేహమును, “నాది”
అని అనుకుంటూ ఉంటుంది. నిత్యమైన ఆత్మ, అనిత్యమైన శరీరము
కలిసి ఉంటున్నాయి. అందుచేత ఆత్మకు, శరీరమునకు బేధము

59
తెలియట లేదు. వీటి మధ్య ఉన్న బేధము తత్త్వ జ్ఞానులు కూడా
చెప్పుతున్నారు.

నాశనము లేనిది, నిత్యమైనది (ఆత్మ), నశించేది,


అనిత్యమైనది (దేహము, వస్తు వులు) అనే భావన పెంచుకుంటే అది
బలపడుతుంది. ఇంకొక విధముగా చూసేది – ఆత్మ. చూడబడేది –
వస్తు వులు (నేను – ఆత్మ - చూసేది, నేను చూడబడే వస్తు వు కాదు.
నా దేహమును (వస్తు వు) నేను చూస్తు న్నాను). ఈ యుద్ధము
చేస్తే, మరణించేది దేహమే కాని ఆత్మ కాదు. అందువలన నీవు
యుద్ధము చేయి. భారత! (నీ భరత వంశములో ఎంతమంది గొప్ప
వీరులు ఉన్నారు).

కఠోపనిషత్ 2-2-7 - “యోనిమన్యే ప్రపద్యన్తే, శరీరత్యాయ


దేహినః l స్థా ణుమన్యే అనుసంయన్టి యధాకర్మ యధా శ్రు తం” –
మరణము తరువాత జీవాత్మలు తమ, తమ జ్ఞానమును
అనుసరించి, కర్మను అనుసరించి కొన్ని జీవాత్మలు గర్భములలో
ప్రవేశించుచున్నవి. కొన్ని జీవాత్మలు వృక్షాదులలో జన్మించుచున్నవి.

య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ।


ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ॥ 19 ॥

60
యుద్ధములో ఎవడైతే వీడు చంపేవాడు, సంహరించేవాడు,
కొట్టేవాడు అంటున్నాడో, ఈ ఆత్మ స్వరూపము నన్ను
సంహరిస్తు న్నది, చంపుతున్నది, కొట్టు చున్నది అని
అనుకుంటున్నారో

వీడికీ, వాడికీ (వారిద్దరికీ) ఈ ఆత్మ స్వరూపము ఎవ్వరినీ


సంహరించదు, చంపదు, కొట్టదు అని తెలియదు. అలాగే ఆత్మ
స్వరూపము సంహరించబడదు, చంపదు, కొట్టదు. (ఆత్మకు కర్త
మరియు కర్మ రెండూ అంటవు – ఏ క్రియకైనా కదులుటకు చోటు,
అవకాశము అవసరము. ఆత్మ స్వరూపము సర్వ వ్యాపకము కనుక
దానికి కర్మ (క్రియ) చేయుటకు చోటు, అవకాశము లేదు.

Example – when water filled completely in a


bottle, water does not move when shaken, because there
is no space left in the bottle.

కఠోపనిషత్ 1-2-19 – “హన్తా చేన్మన్యతే హన్తు గం హతశ్చే


న్మన్యతే హతం l ఉభౌ తౌ న విజానీతో నాయగం హంతి న హన్యతే”
- ఈ ఆత్మ ఎవ్వరినీ చంపుట లేదు, చంపబడుటలేదు.

న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న


భూయః।

61
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే
॥ 20 ॥

ఆత్మ స్వరూపమునకు ఎప్పటికీ పుట్టు క లేదు, వినాశనము


కూడా లేదు. ఈ ఆత్మ ఒకప్పుడు పుట్టి, తరువాత ఉండదు అనేది
కూడా లేదు.

ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, మార్పు


లేనిది. తన దేహమును హత్య చేయబడినప్పుడు, ఆత్మ చంపబడుట
లేదు.

ఏ వస్తు వుకైనా షడ్ బావ వికారములు ఉంటాయి. షడ్ భావ


వికారములు (6) – 1. జాయతే (పుట్టు ట), 2. అస్థి (ఎప్పుడూ
ఉండుట), 3. వర్ధతే (వృద్ధి చెందుట), 4. విపరిణమతే
(పరిణామము, మార్పు చెందుతుంది), 5. అపక్షీయతే (క్షీణిస్తుంది),
6. నశ్యతి (నశిస్తుంది).

కఠోపనిషత్ 1-2-18 – “న జాయతే మ్రియతేవా విపశ్చిత్


నాయంకుతశ్చి న్న బభూవ కశ్చిత్ l అజో నిత్యః శాశ్వతోయం
పురాణో న హన్యతే హన్యమానే శరీరే” – ఈ ఆత్మ ఎప్పటికీ
జన్మించదు, ఎప్పటికీ మరణించదు, దేనినుండీ ఈ ఆత్మ
ఉద్భవించలేదు. ఆత్మ నుండి ఏదీ ఉద్భవించదు. ఆత్మ జన్మ లేనిది,
62
నిత్యమైనది, శాశ్వతమైనది. తన దేహమును హత్య
చేయబడినప్పుడు, ఆత్మ చంపబడుట లేదు.

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయం ।


కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కం ॥ 21॥

పార్థా (విశాలముగా ఆలోచించే అర్జు నా)l ఎవరైతే ఆత్మ


స్వరూపమును, వినాశనము లేనిదిగా తెలుసుకుంటారో, నిత్యమని
తెలుసుకుంటారో, పుట్టు క లేనిది అని తెలుసుకుంటారో,
అవ్యయము (క్షయము కానిది) అని తెలుసుకుంటారో

అటువంటి పురుషుడు (జ్ఞాని), ఎవరిని సంహరించగలడు?


ఏ రకమైన క్రియలు చేయగలదు? ఏ రకమైన క్రియలను
ప్రేరేపించగలడు? ఎవ్వరూ అలా ఆలోచించరు, మాట్లా డ లేరు
(ఆత్మకు – నాకు - క్రియలతో సంబంధము లేదు అని మనస్సులో
ధృఢముగా స్థిరపడాలి).

 వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి


నరోఽపరాణి।
తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని
దేహీ ॥ 22 ॥

63
సామాన్యముగా జనులు కట్టు కున్న బట్టలు చిరిగిపోతే, దాని
విడిచి కొత్త బట్టలు కట్టు కుంటారు (కొత్త బట్టలు కట్టు కున్నవాడు,
పాత బట్టలు కట్టు కున్న వాడు కంటె వేరుకాదు కదా),

అలాగే బాగా పాతబడిన అనిత్యమైన శరీరమును విడిచిపెట్టి


(మరణము), కొత్త శరీరమును ధరించుటకు ఉపక్రమిస్తా డు
(పునర్జన్మ) – దేహములు మారినా, మారని వాడు నిత్యమైన ఆత్మ).

కఠోపనిషత్ - 2-2-7 – “యోనిమన్యే ప్రపద్యన్తే,


శరీరత్యాయ దేహినః I స్థా ణుమన్యేనుసంయన్తి యధాకర్మ యధా
శ్రు తం” మనము చేసుకున్న కర్మల ఫలితముల ప్రకారమే తగిన
దేహమును పొందుతాము (18 వ శ్లోకము చూడుము).

“గురుం హుమ్ కృత్య, తుమ్ కృత్య, విప్రం నిదిత్య వాదతః


స్మశానే జాయతే వృక్షః ......” – గురువులను హుమ్ (ఎదిరిస్తే),
వాళ్లను అనరాని మాటలు అన్నట్లయితే, చదువుకున్న వ్యక్తు లతో,
అనవసరముగా వాదించి ఓడించినట్లయితే, ఆ పాపములకు
ఫలితము నికృష్టమైన – స్మశానములో చెట్టు గా (నీడ కోసము కూడా
ఎవ్వరూ కూర్చోరు) పుడతాడు.

ఛాందోగ్యోపనిషత్ – 6-11-1 - “అస్య సోమ్య మహతో


వృక్షస్య యో మూలేభ్యాహన్యా జ్జీవన్ స్రవేద్యోమధ్యేభాహన్యా జ్జీవన్
64
స్రవేద్యోగ్రేభ్యా హన్యా జ్జీవన్ స్రవేత్స ఏష జీవే ......” ఒక వృక్షము
యొక్క కొమ్మను కత్తితో నరికిన, ఆ చెట్టు ఒక రసమును స్రవించి,
మరొక కొమ్మ చిగురించి, జీవించుచున్నది. అలాగే ఏ భాగములో
కొట్టినా ఆ రసము కారి, ఆ వృక్షము జీవించుచున్నది. (మన
శరీరము కూడా అంతే). ఆ చెట్టు లో ఎంత వరకూ జీవము
ఉంటుందో, అప్పటివరకూ, ఆ చెట్టు యొక్క వేళ్ళు భూమిలోకి వెళ్లి,
అక్కడ ఉన్న నీళ్ళు తాగుతూ, అక్కడ ఉన్న లవణములు
తీసుకుంటూ సంతోషముగా జీవిస్తుంది. అదే చెట్టు కు ఉన్న ఒక
ఎండు కొమ్మకు గాటు పెడితే, అక్కడ నుండి రసము కారదు,
మరొక కొమ్మ చిగిరించదు. అలాగే మొత్తము చెట్టు ను (శరీరము)
జీవము విడిచిపెడితే, ఆ చెట్టు మొత్తము ఎండిపోతుంది
(మరణించింది).

నైనం ఛిందంతి శస్త్రా ణి నైనం దహతి పావకః ।


న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ॥ 23 ॥

ఆత్మ స్వరూపమునకు పృథివీ స్వభావము లేదు కాబట్టి,


శస్త్రములు (కత్తు లు, ఆయుధములు) ఏమీ కొట్ట చేయలేవు,

అగ్ని దహించ లేదు, నీరు ఇంకిపోయినట్లు చేయలేవు,


వాయువు కూడా ఎండగట్ట లేదు. (ఆత్మకు శరీరము,

65
అవయవములు ఉండవు. వస్తు వు కాదు. ఈ నాలుగు భూతములు
– పరస్పరము విరోధము ఉన్నా – ఆత్మ స్వరూపమును మీద తమ
స్వభావమును చూపించ లేవు).

అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయం అక్లేద్యోఽశోష్య ఏవ చ ।
నిత్యః సర్వగతః స్థా ణుః అచలోఽయం సనాతనః ॥ 24 ॥

ఆత్మకు పృథివీ స్వభావము లేదు కాబట్టి నరకబడదు,


ఆత్మకు అగ్ని స్వభావము లేదు కాబట్టి జ్వలించదు, ఆత్మకు జల
స్వభావము లేదు కాబట్టి ఇంకిపోదు, ఆత్మకు వాయు స్వభావము
లేదు కాబట్టి ఎండిపోదు. ఆత్మ స్వరూపమునకు ఏ విధమైన ఆత్మ
స్వరూపమునకు అవయవములు లేవు కాబట్టి ఈ నాలుగు
భూతములు ఏమీ చేయలేవు.

ఆత్మ స్వభావము నిత్యము, ఆత్మ అంతటా వ్యాపించి


ఉంటుంది, ఆత్మ స్థిరమైనది, ఆత్మకు ఏ విధమైన చలనము లేదు,
ఆత్మ స్వరూపము శాశ్వతమైనది. ఆత్మ వేరు, శరీరము వేరు.

 అవ్యక్తోఽయమచింత్యోఽయం అవికార్యోఽయముచ్యతే

తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ॥25॥

66
ఆత్మ స్వరూపము అవ్యక్తము (ఏ జ్ఞానేంద్రియములతోనూ
తెలుసుకోలేము). ఆత్మ స్వరూపమును ఊహించలేము,
ఆలోచించలేము. ఆత్మ స్వరూపము ఏ రకమైన వికారములను
(మార్పులు) పొందదు. ఈ విషయమును సమస్త వేదములు,
శాస్త్రములు, అనుభవజ్ఞులు చెప్పుతున్నాయి.
అందువలన, ఆత్మ స్వరూపమును ఈ విధముగా
తెలుసుకుంటే ఏ విధమైన మోహము, శోకము రాదు. ఈ
విషయమును తెలుసుకొని, నీ మోహము వలన కలిగిన శోకమును
విడిచిపెట్టి, యుద్ధము చేయను అనే సంకల్పమును విడిచిపెట్టు . నీ
కర్తవ్యమును నీవు నిర్వహించు. నీ అజ్ఞానముతో కలిగిన
మోహమును తొలగించుకునే మార్గము ఇదే.

ఛాందోగ్యోపనిషత్ – 8-7-1 – “య ఆత్మాపహతపాప్మా


విజరో విమృత్యుర్విశోకో విజిఘత్సోపిపాస స్సత్య కామ స్సత్యఙ్కల్ప
స్సోన్వేష్ట వ్యస్స విజిజ్ఞాసితవ్య స్స సర్వాంశ్చ కామా న్య స్తమాత్మాన
మనువిద్య విజానాతీతి హ ప్రజాపతి రువాచ” ఆత్మా పాప
రహితమైనది, ముసలితనము, మరణము, దుఃఖము, ఆకలి, దప్పిక
లేనిది, సత్య కామము, సత్య సంకల్పము అయినది. అట్టి ఆత్మ
స్వరూపమును శ్రద్దగా (వేదాంత వాక్యములతో) వెతికి
తెలుసుకొనవలెను. ఆత్మ స్వరూపము సర్వ కారణము – ఈ
ప్రపంచము మొత్తమునకు మూల కారణము.
67
(నిత్యమైన ఆత్మ స్వరూపమునకు ఏ వికారములు రావు, ఏ
రకమైన కర్మ, సంహారము, మరణము, అమంగళములు అంటవు.
ఇది జ్ఞానము కలిగిన వారికే వర్తిస్తుంది. ప్రపంచము, వస్తు వులు,
శరీరము అనిత్యములు. వీటిలోనే కర్మ, సంహారము, మరణము,
అమంగళములు ఉంటాయి).

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం ।


తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ॥ 26 ॥

గొప్ప బాహువులు ఉన్న అర్జు నాl ఒక వేళ ఎవరైనా - ఆత్మ


స్వరూపము (జీవుడు) నిత్యము పుట్టు తూ, మరణిస్తూ ఉండేవాడు
– అని ఉపదేశము చేసి ఉంటే, అలా నీ ఆలోచనలు ఉంటే కూడా
(ఈ శరీరమే ఆత్మ, శరీరము కంటె వేరే ఏదీ లేదు – అని
ఒప్పుకుందాం)

అయినప్పటికీ ఈ శరీరము, ఆత్మ గురించి నీకు శోకము


పనికిరాదు. ఎందుకంటే, ఎప్పుడూ పుట్టు తూ, మరణించేవాటి
కోసము నీకు మోహము, శోకము పనికిరాదు.

మహాభారతము భీష్మ పర్వము 5.22 -“అచిన్త్యేన ఖలు యే


బావ న తమ్స్ తర్కేన యోజయత్” - విశ్వములో ఎక్కువ భాగము

68
మన ఇంద్రియ జ్ఞానానికి మించినది. మన ఇంద్రియ జ్ఞానమునకు
మించిన దానిని, మన ఊహాగానములతో వాదించ కూడదు. ఆ
జ్ఞానము మన ఋషులు వారి తపస్సు యొక్క శక్తితో, దివ్య దృష్టితో
దర్శించి, వాటిని మన వేద సాహిత్యంలో నమోదు చేశారు. అవే
మనకు ఆధారము.

జాతస్య హి ధ్రు వో మృత్యుం ధృవం జన్మ మృతస్య చ ।


తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ॥27॥

పుట్టినవాడు మరణించక తప్పదు (లోక దృష్టి), మరణించిన


ప్రతి జీవి తిరిగి జన్మించక తప్పదు (తత్త్వ జ్ఞానులకు తప్ప – శాస్త్ర
దృష్టి).

కాబట్టి అపరిహార్యము (పరిహరించుకోలేని, తప్పించలేని)


అయిన ఈ విషయంపై మోహము, శోకము తగదు. మన
కర్తవ్యమును విస్మరించకూడదు, ధర్మ మార్గమును
విడిచిపెట్టకూడదు.

అవ్యక్తా దీని భూతాని వ్యక్తమధ్యాని భారత ।


అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ॥ 28 ॥

69
భారత వంశములో పుట్టిన వాడా l (భరత వంశములో
జన్మించిన వాడా) ఈ శరీరములు (జన్మ) ఎక్కడి నుండి, ఎలా
వచ్చాయో ఎవ్వరికీ తెలియదు. మధ్యలో కొంత సేపు బాగా
కనిపిస్తు న్నవి.

శరీరములు మరణించిన తరువాత, ఎక్కడికి పోతున్నాయో


తెలియదు. మన బుద్ధి సామర్ధ్యమునకు అందదు. ఇటువంటి
శరీరముల కోసము శోకము, బాధ ఎందుకు?

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః।


ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రు త్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ॥
29 ॥

ఈ ప్రపంచమంతా ఒకే పరమాత్మ నుండి ఉద్భవించినది,


అంటే ఆశ్చర్యపడుతారు (మన బుద్ధి సామర్ధ్యమునకు అందనిది).
కాని ఒక్కసారి అర్ధమయిందా, అది చాలా ఆశ్చర్యముగా ఉంటుంది.
అలా చెప్పేవాళ్ళు (పరమాత్మ జ్ఞానము కలిగిన వాళ్ళు) కూడా చాలా
తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు దొరకటము ఆశ్చర్యము.

ఇలాంటి విషయములు వినే వాళ్ళు కూడా చాలా తక్కువ


మంది ఉంటారు. వినే వాళ్ళు దొరికారంటే ఆశ్చర్య పడాలి. ఎంత

70
చెప్పినా, ఎంత విన్నా ఈ విషయము అర్ధము అగుటలేదు. కేవలము
వినికిడి ద్వారా ఈ ఆత్మ స్వరూపమును తెలుసుకోలేరు.

ఉదాహరణ:

చీమలు ఉప్పు గడ్డను నోటిలో వేసుకొని పంచదార తింటే,


పంచదార తీపి తెలియనట్లు – ఉప్పు నోటిలో (మనలో
సంస్కారములు, దోషములు, కోరికలు) ఉన్నంత వరకూ, పంచదార
తీపి (ఆత్మ తత్త్వము) తెలియదు.

దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత।


తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ॥ 30 ॥
భారత (భరత వంశములో పుట్టినవాడు) l అందరి
దేహములో కొలువై ఉన్న ఆత్మ స్వరూపము (జీవుడు), ఏ
సందర్భములోనూ మరణించదు. ఆ దేహమునకు మరణము
ఉంటుంది కాని, ఆ దేహములో ఉన్న జీవుడును సంహరించే శక్తి
ఎవ్వరికీ లేదు.

అందుచేత శరీరములు, పంచ మహా భూతములు గురించి


నీవు ఆలోచిస్తూ, శోకము పొందవలసిన అవసరము లేదు.

71
ఛాందోగ్యోపనిషత్ – 6-11-3 – “జీవాపేతం వావ కిల ఇదం
మ్రియతే న జీవో మ్రియతే ....” జీవుడు ఈ శరీరము నుండి
వెళ్ళిపోతే, శరీరమునకు మరణము. జీవుడికి మరణము లేదు.

 స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ।


ధర్మ్యాద్ధి యుద్ధా చ్ఛ్రేయోఽన్యత్క్షత్రియస్య న విద్యతే ॥ 31

ఎవరైనా ఆత్మ తత్త్వము పొందాలంటే, మొట్టమొదట


స్వధర్మ ఆచరణ చేయాలి. శ్రేయో మార్గము లోనికి ప్రవేశము
కలగాలంటే, స్వధర్మ ఆచరణ తప్పకుండా చేయాలి. నీవు నీ
స్వధర్మమును జాగ్రత్తగా చూసుకో. నీవు అటు, ఇటు
సందేహములతో చెదరకుండా, నీ స్వధర్మమును నీవు ఆచరించు.

నీకు ఎదురు గుండా ఉన్నది, నీ స్వధర్మమైన యుద్దము.


నీవు క్షత్రియుడు కాబట్టి, నీ కర్తవ్యము ధర్మము కొరకు యుద్దము
చేయవలెను. నీకు ఈ యుద్ధము పూర్తిగా ధర్మ మార్గములోనే
ఉన్నది. ఈ యుద్ధము కంటె వేరుగా నీకు వేరే ధర్మము లేదు. నీకు
నీ స్వధర్మమైన ఈ యుద్ధమే నీకు శ్రేయస్కరము.

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం ।


సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం ॥ 32 ॥

72
ఓ పార్థా l నీవు ప్రయత్నము చేయకుండానే, నీకు స్వర్గ
ద్వారములు తెరుచుకున్నాయి. నీవు స్వర్గ ద్వారము దగ్గరకు వెళ్లి
ఉన్నావు.

సుఖముగా ఈ యుద్దమును నీవు ప్రారంభించుకోవచ్చు.


సు క్షత్రియులకే, యుద్దము యొక్క అవకాశము లభిస్తుంది.
(యుద్ధములో నీవు జయిస్తే, నీకు ఈ లోకములో విజయలక్ష్మి
లభిస్తుంది. ఒకవేళ నీవు యుద్ధములో మరణిస్తే, నీకు వీర స్వర్గము
లభించే అవకాశము కూడా ఉన్నది. సాధారణ ప్రజలకు స్వధర్మ
ఆచరణ చేస్తూ మరణిస్తే వారికి ఉత్తమమైన జన్మ లభిస్తుంది).

అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి ।


తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ॥ 33 ॥

ఒకవేళ నీవు ధర్మమైన ఈ యుద్దము, మరియు నీ


స్వధర్మమైన ఈ యుద్దమును చేయకపోతే,

దాని నుండి, నీ స్వధర్మమును, నీ కీర్తి పోగొట్టు కొని, నీవు


పొందవలసిన మంచి ఫలితములు పొందక, కేవలము పాపమును
పొందుతావు.

73
అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయాం ।
సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే ॥ 34 ॥

నీకు అపకీర్తి కలిగి, అందరూ దాని గురించి చర్చిస్తూ, చాలా


దీర్ఘకాలము చరిత్రలో నిలిచిపోతుంది.

ఇంతవరకూ (సుమారు 90 సంవత్సరములు) నీవు


సంపాదించుకున్న గొప్ప కీర్తి (యుద్ధములలో, సాధనలో, తపస్సులో
శివుని మెప్పించిన వాడివి, నీ యోగ ప్రభావముతో స్వర్గ లోకములోకి
వెళ్లినవాడివి) నీవు యుద్దము నుండి పారిపోయాడనే అపకీర్తి,
మరణము కంటె ఎన్నోరెట్లు పెద్ది. ఆ అపకీర్తిని దృష్టిలో పెట్టు కొని, నీ
వ్యర్ధ ప్రయత్నము మానుకొని, నీవు యుద్ధము చేసి, నీ
స్వధర్మమును ఆచరించు.

భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ।


యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం ॥ 35 ॥
మనము ఇప్పుడు రెండు సేనల మధ్యలో ఉన్నావు. నీవు
యుద్ధము చేయనంటే, నీవు యుద్ధము వదలి పారిపోవాలి. లేదా
ఇక్కడే ఉండిపోవాలి. నీకు యుద్ధము వదలి పారిపోవటం ఇష్టము
లేదు. అందుచేత, నీవు యుద్ధము చేయకుండా ఇక్కడే ఉందాము.
అప్పుడు కౌరవ సేనలలో వాళ్ళు (భీష్ముడు, ద్రోణాచార్యులు,

74
మహారథులు, మహావీరులు), ఇంతమంది సేనలను చూసి,
అర్జు నుడికి భయము వేసింది. ఆ భయముతో యుద్ధము
చేయకుండా ఆగిపోయాడు – అని అనుకుంటారు.

ఇంతవరకూ వారి దృష్టిలో నీ మీద చాలా గౌరవము


ఉన్నప్పటికీ, నీవు ఇప్పుడు యుద్ధము చేయకపోతే వాళ్ళ దృష్టిలో
నీవు చాలా తేలిక అయిపోతావు. నీ కర్తవ్యము నీవు చేయకపోతే
వాళ్ళ దృష్టిలో చాలా చులకన అయిపోతావు.

అవాచ్యవాదాంశ్చ బహూన్వదిష్యంతి తవాహితాః ।


నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం ॥ 36 ॥

ఎదురు పక్షములో ఉన్న మిగతా వాళ్ళు (దుర్యోధనుడు,


దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు మొదలైనవారు), నిన్ను ఓడించాలనే
కుతూహలముతో, నిన్ను నాశనము చేయాలనే కోరికతో ఉన్నారు.
వాళ్ళు నిన్ను అనరాని చాలా మాటలు అంటారు.

నీ సామర్ధ్యమును నిందిస్తా రు, నిన్ను చూసి నవ్వుకుంటారు.


అప్పుడు ఇంతకంటే పరమ దుఃఖము మరొకటి నీకు ఉండదు.

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం ।


తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధా య కృతనిశ్చయః ॥ 37 ॥

75
నేను నిన్ను నీ స్వధర్మము (యుద్ధము) చేయమంటున్నాను.
అందులో నీవు మరణిస్తే, నీకు వీర స్వర్గము లభిస్తుంది. నీవు
జయిస్తే, నీవు ధర్మమును స్థా పించావని పేరు కలిగి, రాజ్య భోగములు
అనుభవిస్తా వు.

అందుచేత కుంతీ పుత్రా l నీవు యుద్ధమే చేయాలి అని


ధృఢముగా నిశ్చయించుకొని లే.

 సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ ।


తతో యుద్ధా య యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ॥ 38 ॥

నీ ప్రయత్నములు, చేసే పనులు వలన కలిగే సుఖము లేక


దుఃఖము, లాభము లేక నష్టము, జయము లేక అపజయము
సమముగా భావించు. సుఖము కలగనీ లేకపోతే దుఃఖము కలగనీ,
లాభము కలగనీ లేకపోతే నష్టము కలగనీ, జయము కలగనీ లేకపోతే
అపజయము కలగనీ (కోరికలు వదలి) నేను నా కర్తవ్యమును
నిర్వహిస్తా ను అనే సంకల్పము కలిగి ఉండు. నీకు రావలసిన
ఫలితము తప్పకుండా వస్తుంది. (సుఖము, లాభము, గెలుపు మీద
అనవసరమైన ఆశలు పెంచుకొని, వాటి కోసము ప్రక్క దారులు
తొక్కుతూ, చేయరాని దోషములు చేసి, ఘోరమైన పాపములను
మూటగట్టు కొంటున్నారు).
76
ఆ భావముతో నీవు, నీ కర్తవ్యమయిన, స్వధర్మమైన
యుద్ధము ప్రారంభించు. అప్పుడు నీకు ఏ రకమైన పాపము
అంటదు

ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు ।


బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ॥ 39 ॥

ఇంతవరకూ ఆత్మ స్వరూపమును గురించి ఏ, ఏ


శ్లోకములలో చెప్పానో, ఆ శ్లోకములన్నీ సాంఖ్యము (సంఖ్య,
ఉపనిషత్తు లలో తెలియచేసే ఆత్మ తత్త్వము) అని అర్ధము చేసుకో.
ఆత్మ తత్త్వము అర్ధము చేసుకోవాలంటే, మనస్సు శుద్ధముగా
ఉండాలి. మనస్సును శుద్ధము చేసుకునేందుకు, ఏ కోరికలు
లేకుండా సుఖము లేక దుఃఖములలో, లాభము లేక నష్టములలో,
జయము లేక అపజయములలోనూ సమత్వ బుద్ధితో చేసే స్వధర్మ
ఆచరణ, సత్కర్మలకు యోగము అంటారు. నీవు యోగ మార్గము
చక్కగా ఉన్నట్లయితే

యోగ బుద్ధిని చక్కగా పెంచుకొని, మనస్సులో ఉండే


మాలిన్యములు తొలగిపోయి, విశాలమైన ఆలోచనలు కలిగి, కోరికలు
లేకుండా, సమత్వ బుద్ధితో సత్కర్మలు చేస్తే, నీకు కర్మలతో ఉండే

77
పాపములన్నీ, బంధములన్నీ తొలగిపోతాయి. అప్పుడు ఆత్మ
తత్త్వము పూర్తిగా అర్థమవుతుంది.

నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే ।


స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ॥ 40 ॥

ఆత్మ జ్ఞానము కోసము సమతా భావముతో సత్కర్మ, స్వధర్మ


ఆచరణ ప్రారంభము, ప్రయత్నము, ఎప్పటికీ వ్యర్ధము కాదు. సగము
చేసినా, పూర్తి చేయలేకపోయినా, నియమములు పూర్తిగా
పాటించకపోయినా దోషముండదు.

కొంచము, కొంచముగా చేసుకుంటూ కలుపుకుంటూ


ఉండాలి. నీవు చేసినది కొంచము అయినా అది ఎక్కడికీ పోదు. ఈ
స్వధర్మ ఆచరణ కొద్దిగా ఆచరణ చేసినా, చాలా పెద్ద భయము
నుండి మనలను రక్షిస్తుంది (“ధర్మో రక్షిత రక్షతః” – మనము
ధర్మమును పాటిస్తే, ధర్మము మనలను రక్షిస్తుంది).

మనము జీవితములో వచ్చే చిన్న, చిన్న కష్టములకు


భయపడుతాము. ఇవి అసలు కష్టములే కావు. మనము అసలు
భయపడవలసిన పెద్ద కష్టమునకు భయపడము. అది సంసారము
(జనన, మరణముల చక్రము). ఇది మనకు అలవాటు

78
అయిపోయినది. దీనిలోనే ఉండాలని అనుకుంటాము. దీనినుండి
బయట పడాలని ప్రయత్నమే చేయము.

స్వధర్మములు: సమతా భావముతో వర్ణ, ఆశ్రమ, వృత్తి


ధర్మములు, సత్యము (నిజము పలుకుట, అబద్ధము చెప్పకుండా
ఉండుట), సకల భూతముల యందు దయ, శౌచము (మనస్సు
శుభ్రము), దానము, యజ్ఞము, తపస్సు ఆచరించుట.

వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన ।


బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినాం ॥ 41 ॥

ఓ కురు నందనా (కురు వంశములో జన్మించిన వాడా) l ఈ


శ్రేయో మార్గములో (మోక్ష సాధనలో) నిశ్చయాత్మకమైన,
నిర్ణయాత్మకమైన బుద్ధి, జ్ఞానము ఒక్కటే ఉంటుంది. అది
ప్రమాణముగా (వేదముల ద్వారా) తెలుసుకో.

ఒకవేళ సందేహములు, భ్రమలు, ఆలోచనలు ఎక్కువగా


ఉంటే, చాలా నిశ్చయములు, నిర్ణయములు అనేక శాఖలు
(కొమ్మలు) కలిగి అనంతముగా ఉంటాయి. వాళ్ళు ఏ దారిలో
వెళ్ళాలో వాళ్ళకే తెలియదు. వాళ్ళు సరైన నిర్ణయము తీసుకోలేరు.
వాళ్ళు ఒక స్థిరమైన నిశ్చయము, నిర్ణయము లేని స్వభావము
కలవారు.
79
“ప్రత్యక్షేణ అనుమిత్యావా యత్తు పాయో న బుధ్యతే యేన
విదంతి వేదేన, తస్మాత్ వేదస్య వేదతః” మనము చూసి కాని,
ఊహించి కాని, ఏ విషయములను తెలుసుకోలేమో అది - ధర్మము
(కర్మ కాండ). పరమాత్మ తత్త్వము/ఆత్మ స్వరూపము – (జ్ఞాన
కాండ – ఉపనిషత్తు లు, వేదాంతము), ఆ విషయములను చక్కగా
బోధించే ప్రమాణ భాగము – వేద భాగము. (2-25 శ్లోకము
చూడుము).

యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః ।


వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ॥ 42 ॥

పార్థా l వేదములు రెండు భాగములు చేసి (ధర్మము, కర్మ


భాగము ఎక్కువగా ఉంది (99%), పరమాత్మ తత్త్వము, ఆత్మ
స్వరూపము చాలా తక్కువగా ఉంది (1%)). ధర్మ, కర్మ భాగము –
పంచదార తొడుగులా చాలా బాగా, చాలా అందముగా,
అనుకూలముగా చెప్పే వాళ్ళు ప్రపంచములో చాలా మంది ఉన్నారు.
పువ్వు విచ్చుకుంటే ఎంత అందముగా ఉంటుందో, వాళ్ళ మాటలు
కూడా అంత అందముగా ఉంటాయి. వేదములోని కర్మలు, ఆ
కర్మలు ఆచరణతో నీకు వచ్చే చిన్న, చిన్న కోరికల ప్రయోజనముల,
ఫలితములు గురించి చెప్పుతారు (ఇది మానవులను ఆకర్షించి,

80
వాళ్లచేత సత్కర్మలు చేయించి, వాళ్లకు పరమాత్మ తత్త్వము, ఆత్మ
జ్ఞానము పూర్తిగా అర్ధము చేసుకునే స్థితికి పరిశుద్దము చేయుటకు
– కర్మ కాండ).

వేదములో ఉన్నదే మేము చెప్పుతున్నాము అంటారు. నేను


చెప్పుతున్న పరమాత్మ తత్త్వము, ఆత్మ స్వరూపము (చేదుగా ఉండే
మందు, మానవులకు అత్యవసరమైనది) వేదములో లేదు అంటారు.
ఇలా తప్పుగా చెప్పితే, వాళ్లకు తెలిసింది సరిగ్గా లేదు. అలా
మాట్లా డితే అది పాండిత్యము కాదు. వాళ్ళు చెప్పినది నీవు వినవద్దు .
(వేదమును సరిగ్గా అర్ధము చేసుకొని, సరిగ్గా ఉపదేశము చేసే వాళ్ళ
దగ్గరే ఉపదేశము పొందాలి).

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదాం ।


క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి॥43॥

మనలను ఆకర్షించుటకు, కొంతమంది కొన్ని మాటలు


చెప్పుతారు. ఆ మాటలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కేవలము కోరికలు తీర్చుకునే స్వభావము కల వాళ్ళు


కొంతమంది ఉంటారు. కేవలము సుఖములనే పొందటమే
లక్ష్యముగా ఉంటారు. జన్మను, ఆ జన్మలో చేసుకునే కర్మలను, ఆ
కర్మలకు కలిగే ఫలితములను గురించి మాత్రమే చర్చిస్తా రు. అలా
81
జన్మ–కర్మ– ఫలము మరలా జన్మ–కర్మ–ఫలము చక్రములో
బంధించబడతాము. వీటిని మనము పట్టించుకోకూడదు.

రకరకాల కర్మల గురించి చెప్పుతారు. అవి వినటానికి బాగా


అనిపించినా, వాటి అర్ధము చాలా పరిమితముగానే ఉంటుంది. కాని
సత్కర్మ ఆచరణ (3-16 శ్లోకము చూడుము) శ్రేయో మార్గము
(మోక్షము) వైపు తీసుకువెళ్ళేది అయితే, మనకు మంచి ఫలితములు
ఇస్తుంది.

భోగైశ్వర్యప్రసక్తా నాం తయాపహృతచేతసాం ।


వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ॥ 44 ॥
కేవలము భోగములు మరియు ఐశ్వర్యముల పైన అత్యంత
ఆసక్తి ఉన్నట్లయితే, మన మనస్సు ఆ భోగములు, ఐశ్వర్యములు
పొందుటకు సాధనముల మీద, ఉపాయముల మీద
లగ్నమైపోతుందో,

అప్పుడు మన మనస్సులలో పరమాత్మ చెప్పిన మనకు


శ్రేయో మార్గమే (మోక్ష) అత్యున్నతమైన మార్గము అనే నిర్ణయము,
విశ్వాసము పూర్తిగా పోతుంది. ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి
రావాలంటే మన మనస్సు దానికి అనుకూలముగా మారాలి.
అందుకు ప్రాపంచకమైన విషయముల నుండి మనస్సును కొద్ది,

82
కొద్దిగా శ్రేయో మార్గము వైపు మరలించినట్లయితే శ్రేయో మార్గమే
సముచితమైన మార్గము అనే స్థిరమైన విశ్వాసము, నిర్ణయము
మరియు నిశ్చయము కలుగుతుంది. కోరికలతో నిండిపోయిన
బుద్ధిలోకి నిశ్చయాత్మకమైన బుద్ధి రాదు.

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జు న ।


నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ॥ 45 ॥
ప్రకృతి యొక్క మూడు గుణములు 1. సత్త్వ గుణము -
సన్మార్గము, జ్ఞానము ప్రేరేపించును, 2. రజో గుణము – కర్మ
ఆచరణకు ప్రేరేపించును, ౩. తమో గుణము – అజ్ఞానము,
బద్ధకము, వ్యామోహము ప్రేరేపించును. ఈ మూడు గుణములు
ఎప్పుడూ పరస్పరము కలహించుకుంటూ ఉంటాయి. ఈ మూడు
గుణముల కలయికే ఈ ప్రపంచము, సంసారము, జీవితము.

ప్రకృతి యొక్క మూడు గుణములు కలిగిన సంసారమును


(కర్మ మార్గము) చక్కగా బోధిస్తా యి. వేదములలో ఈ భాగము
ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఆకర్షణీయముగా అనిపిస్తా యి.
వాటిమీద ఎక్కువ ఆశలు పెంచుకోకుండా, ఆ సత్త్వ, రజో, తమో
గుణములకు దూరముగా ఉండు. ఓ అర్జు నా l

83
అదే విధముగా ద్వంద్వములు (సుఖ/దుఃఖములు కాని,
లాభ/నష్టములు కాని, జయ/అపజయములు కాని, చలి/వేడి కాని)
దేనినీ లెక్క చేయక, సమతా బుద్ధితో సహిస్తూ ఉండు. అప్పుడు ఈ
గుణముల ప్రభావము తగ్గుతుంది. నిరంతరమూ ధైర్యముగా,
సాత్వికమైన జ్ఞాన మార్గములో ప్రయాణించు. ఎత్తి పరిస్థితుల్లోనూ
యోగము (లేని దానిని పొందుటకు ప్రక్రియ, కొత్తది పొందుట)
కోసము ఆశ పడవద్దు . నిరంతరము ఏదో వస్తు వును కోరుకొని, అది
లభించిన తరువాత దానిని రక్షించుకునే ప్రయత్నమునకు (క్షేమము)
దూరముగా ఉండు. నిరంతరమూ అప్రమత్తతతో, జాగ్రత్తతో
పరమాత్మ ధ్యానమును చేస్తూ ఉండు. (అంతా పరమాత్మ మీద
భారము వేయి. నీ యోగ, క్షేమములు పరమాత్మే చూసుకుంటాడు).

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లు తోదకే ।


తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ॥ 46 ॥

ఎంతటి ప్రయోజనము నుయ్యిలో, చెరువులో, కాలువలో


లభిస్తుందో, అంతటి ప్రయోజనము నిండుగా ప్రవహిస్తు న్న నదిలో
కూడా అంతటి ప్రయోజనము, అంతకంటే ఎక్కువ కూడా
లభిస్తుంది.

84
అలాగే వేదములలో అన్ని చిన్న. చిన్న కోరికలు తీర్చే చిన్న,
చిన్న ఉపాయములు ఉన్నాయి. ఆ, ఆ కోరికలు కోసము సత్కర్మ
ఆచరణ (3-16 శ్లోకము చూడుము) చేస్తే, ఆ ప్రయోజనము
మాత్రమే సిద్ధిస్తుంది. మరొక సత్కర్మ ఆచరణ చేస్తే, మరొక
ప్రయోజనము మాత్రమే సిద్ధిస్తుంది. అన్ని ప్రయోజనములు కంటె
గొప్పదైన ప్రయోజనము ఎల్లప్పుడూ, అనంతముగా సిద్ధించాలంటే,
బ్రహ్మ జ్ఞానమును సంపాదించుకోవాలి. వేరే దృష్టి లేకుండా, ఆ బ్రహ్మ
జ్ఞానము మీద దృష్టి ఉంచి, దానిని నిలబెట్టు కోవాలి. అప్పుడు ఈ
ప్రయోజనములు అన్నీ సిద్ధిస్తా యి.

ఛాందోగ్యోపనిషత్ - 4-1-4 – “యధాకృతాయ


విజితాయాధరేయాః సంయన్త్వేవ మేన సర్వం తదభినమైతి
యత్కంచ ప్రజాస్సాదు కుర్వంతి య స్తద్వేద యత్సవేద స
మయయైత దుక్త ఇతి” – జూదములో “కృత” అనే ఆట
గెలిచినవాడు, మిగతా వాళ్ళందరూ గెలిచిన అన్ని ఆటలు గెలిచినట్లే
అగును. అలాగే మీరు ఆత్మజ్ఞానము సాధించుకున్నట్లయితే, ఇక
సాధించుకోవలసినది ఏదీ ఉండదు. ఇక వేరే ఏ ప్రయత్నమూ
చేయవలసిన అవసరము కూడా ఉండదు.

బృహదారణ్యకోపనిషత్ – 4 లేదా 6-3-32 – “ఏతస్యైవా


నన్ద స్యాన్యాని భూతాని మాత్రా ముపజీవంతి” మానవులు

85
అనుభవిస్తు న్న సుఖములు, ఆనందము, ఆత్మ జ్ఞానము వలన కలిగే
బ్రహ్మానందము యొక్క, తుంపరలు మాత్రమే.

 కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।


మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోఽస్త్వకర్మణి ॥ 47 ॥

నీ అధికారము, బాధ్యత, కర్తవ్యము సత్కర్మలు, స్వధర్మ


కర్మలు (మనిషిగా పుట్టినందుకు నీవు ఈ కర్మలు చేయవలెను అని
వేదములు, పురాణములు, ధర్మ శాస్త్రములు చెప్పేవి) ఆచరణ
మాత్రమే. ఎప్పటికీ నీవు చేసిన సత్కర్మల ఫలితములపై నీకు
అధికారము లేదు.

నీవు సత్కర్మ చేసి, ఆ కర్మ ఫలము పొందాలని అనుకున్నా


వంటే, ఆ ఫలితము యొక్క పరిణామముల (కోరికలు ఇంకా, ఇంకా
పెరిగిపోతాయి) బాధ్యత వహించవలసి వస్తుంది. అందుచేత ఆ
సత్కర్మ ఫలితమునకు నీవు కారణము కావద్దు (ఈ కర్మకు నేనే
కర్తను అనే భావన ఉండకూడదు). ఫలితము లేకపోతే నేను సత్కర్మ
చేయటము ఎందుకు? నేను చేయను అని అనుకుందుకు వీల్లేదు
(నీవు నిరంతరమూ సత్కర్మ నిష్కామకర్మగా (ఏమీ ఆశించకుండా)
చేసుకుంటే చాలా పెద్ద ప్రయోజనము వస్తుంది).

86
నీకు కర్మ చేయుటకు మాత్రమే అధికారము ఉన్నది. ఆ కర్మ
ఫలితము మీద నీకు ఏ విధమైన అధికారమూ లేదు. ఆ కర్మకు నీవు
కారణమని నీవు ఎప్పుడూ అనుకోవద్దు . నీవు చేసే కర్మలతో నీవు ఏ
విధమైన సంగము, సంబంధము పెట్టు కోవద్దు . (నీవు చేసే కర్మలు
పరమాత్మ ఆరాధనగా, పరమాత్మ ప్రీతి కొరకు అనే భావనతో
చేయము).

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ ।


సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥ 48 ॥

ఓ అర్జు నా l ఈ సత్కర్మల కర్తను నేనే (నేను చేశాను అనే


భావన) అనే ఆసక్తిని కాని, ఆ సత్కర్మకు ఫలితము నాకే రావాలి అనే
ఫలాసక్తి విడిచిపెట్టి (సత్కర్మ ఫలముపై ఏ విధమైన సంబంధము
పెట్టు కోవద్దు ), సత్కర్మ ఆచరణ యోగములో (పరమాత్మ
ఆరాధనగా, పరమాత్మ ప్రీతి కొరకు అనే భావనతో) ఉండి తప్పకుండా
చేయి.

సత్కర్మ యొక్క ఫలము కలుగుతుందా, కలగదేమో అనే


సందేహము (ద్వంద్వములు) రెండింటి యందు సమానముగా
ఉండు. ద్వంద్వముల సమత్వ స్వభావమే యోగము అంటారు.
అలాంటి సత్కర్మ చేస్తే – నీకు శ్రేయో మార్గములో (మోక్ష సాధనలో)

87
ప్రవేశించుటకు అర్హత కలుగుతుంది. అది నిన్ను ముందుకు
తీసుకెళ్లు తుంది.
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ ।
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ॥49॥
ఓ ధనంజయా (అర్జు నా) l తత్త్వ జ్ఞానము యొక్క
సర్వోత్తమమైన ఫలితము (మోక్షము) కంటె, సత్కర్మ ఆచరణ వలన
కలిగే ఫలితము చాల దూరముగా (తక్కువగా) ఉంటుంది. బుద్ధి
యోగము (సమతా భావన, తత్త్వ జ్ఞానము) వలన మాత్రమే
మోక్షము పొందగలరు.

ముందు కర్తృత్వ భావన, ఫలాపేక్ష లేకుండా సమతా


భావముతో సత్కర్మలు చేసుకుంటూ, తత్త్వ జ్ఞానమే నాకు
శరణము, గతి అని నమ్మి, తత్త్వ జ్ఞానమునే శరణు వేడు. అలా
కాదు నాకు, నేను చేసే సత్కర్మల ఫలితములు, రావలసిన
ఫలితముల కంటె ఎక్కువ (లాభములు, లంచములు) కోరుకునే
వాళ్ళు చాలా పెద్ద దీనులు (దరిద్రు లు). ఎట్టి పరిస్థితుల్లోనూ నేను
చేసే సత్కర్మల ఫలితములు నాకు రావాలి అనే కోరికను నీవు
ఉంచుకో వద్దు .

 బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే ।


తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం ॥ 50 ॥

88
శ్రేయో (మోక్ష) మార్గములో ప్రయత్నము చేసే ప్రతి
సాధకుడు, సమత్వ బుద్ధితో (ద్వంద్వ ములపై సమతా భావనతో)
సత్కర్మలు చేసేవాడు క్రమముగా తన మనస్సును శుద్ధము
చేసుకొని, తత్త్వ జ్ఞానమును సంపాదించుకొని తన పుణ్య,
పాపములు (కర్మ బంధములు) అన్నింటినీ పోగొట్టు కోగలుగుతాడు.

అందువలన అటువంటి బుద్ధి యోగము (సమతా


భావముతో సత్కర్మ ఆచరణ) కోసము నీవు ప్రయత్నము చేయి. ప్రతి
జీవి ఎల్లప్పుడూ కర్మ చేయకుండా ఉండదు. ఆ కర్మను, సత్కర్మగా
మార్చి దానికి యోగము (సామర్థ్యము) జత పరుస్తే ఆ కర్మకు
కౌశలము (నేర్పరితనము) కలుగుతుంది.

అత్రి మహర్షి, అనసూయ అమ్మ -రామాయణము:

బ్రహ్మ మానస పుత్రు డు అత్రి మహర్షి తపస్సు చేస్తుండగా,


బ్రహ్మదేవుడు వచ్చి, నీవు కర్దమ మహర్షి యొక్క పుత్రిక అనసూయ
దేవితో వివాహము చేసుకో అని అన్నారు. అప్పుడు అత్రి మహర్షి
ఎందుకు అని ప్రశ్నించారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయుటలో నాకు
సహాయము చేయుటకు నీ ద్వారా పుత్రు డు కలగాలి అని చెప్పగా,
అత్రి మహర్షి ఒప్పుకొని, అనసూయతో వివాహము చేసుకున్నారు.
తనకు పుత్రు డు కలగాలంటే ఏమి చేయాలి అని ఆలోచించి, తండ్రి
89
ఆజ్ఞతో పుత్రు డు కావాలి అనే సంకల్పముతో, పరమాత్ముడి
కోసము తనకు తెలుసున్న తపస్సును ప్రారంభించారు. తపస్సు
మొదలు పెట్టిన వెంటనే, తనకు పుత్రు డు కలగాలి అనే కోరికను
వదలిపెట్టేశారు. ఘోరమైన తపస్సు చేయగా, పరమాత్మ ప్రత్యక్షమై
అత్రి మహర్షి కోరకుండానే “నేను నీకు పుత్రు డిగా జన్మిస్తా ను” అని
పరమాత్మ తనని తాను సమర్పించుకున్నాడు (దత్తు డు). అప్పుడు
పరమాత్మ చిన్న పిల్లవాడిగా దత్తా త్రయగా వచ్చాడు. అదే “కోరిక లేని
సమతా భావముతో సత్కర్మ ఆచరణ” (3-16 శ్లోకము చూడుము).

వేద వాక్యము “యమైవైష వృణుతే తేన లభ్యః, తష్యైష ఆత్మ


వివృణుతే తనూమ్ స్వాం” – ఏ విధమైన కోరికలు, ఆత్రు త
లేకుండా, సమతా బుద్ధితో సాధన చూసుకోగలిగితే, పరమాత్మ
తనంతట తాను వలచి మన దగ్గరకు వచ్చి తన స్వరూపమును
మనకు ప్రదర్శిస్తా డు.

గమనిక: కోరికలతో కర్మ చేస్తే ఆ చేసిన కర్మకు తగినంత


ఫలము పరమాత్మ ఇస్తా డు (ఎక్కువ శ్రమ, తక్కువ ఫలితము). కర్మ
బంధన ఏర్పడి, సంసార చక్రములో పడతాము (తాళము చెవిని
తాళము కప్పకు కుడి ప్రక్కకు త్రిప్పితే తాళము పడుతుంది). కాని
సమతా భావముతో, కోరికలు వదులుకొని, నిష్కామ కర్మ
ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే, మనము చేసిన కర్మ కంటె ఎన్నో రెట్లు

90
ఫలము (అనంతమైన మోక్షము) పరమాత్మ ఇస్తా డు (తక్కువ శ్రమ,
ఎక్కువ ఫలితము). కర్మ బంధన పోయి, సంసార చక్రము నుండి
విముక్తి కలిగి, మోక్షము పొందుతాము (తాళము చెవిని తాళము
కప్పకు ఎడమ ప్రక్కకు త్రిప్పితే తాళము విడిపోతుంది).

Indian Administrative Service logo లో “యోగః


కర్మసు కౌశలం” అనేది ఉంటుంది.

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః।


జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయం ॥ 51 ॥

జ్ఞాన వంతులు, తెలివైన వాళ్ళు సాధారణ కర్మ ఫలములను


వదులుకొని, కర్మ యోగ బుద్ధితో సమతా భావనతో కలిసిన వారై,
తత్త్వ జ్ఞానము వరకూ ఉండే అన్ని ప్రయోజనములను పొంది, పుణ్య
పాపములు పోగొట్టు కొని, మనీషిణః (తెలివైన వాడు, తత్త్వ జ్ఞానము
పొందినవాడు) పొంది

ఏ రకమైన జన్మతోనూ, ఏ రకమైన బంధముతోనూ


(మనము చేసిన పుణ్య, పాపముల) సంచిత కర్మలకు మనకు
రావలసిన ఫలములు) సంబంధము తొలగిపోయి, ఏ విధమైన
బాధలు, కష్టములు లేని పరమాత్మ యొక్క సన్నిధిని
పొందుతున్నారు.
91
ముండకోపనిషత్ – 3-1-3 – “తదా విద్వాన్ పున్యపాపే
విదూర నిరంజనః పరమం సామ్య ముపైతి” – బ్రహ్మ జ్ఞాని పుణ్య
పాప బంధము (జన్మ బంధనములు) నుండి విముక్తు డై,
నిరంజనుడై (పరమానందుడై) సర్వోత్తమమైన సమాన స్థితిని
పొందుచున్నాడు.

కఠోపనిషత్ – 1-3-9 – “సోద్వనః పారమాప్నోతి తద్విష్ణోః


పరమ పదమ్” – అట్టివారు జీవిత మార్గము యొక్క పరమ
గమ్యమగు విష్ణు పదమును చేరుచున్నాడు.

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి ।


తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రు తస్య చ ॥ 52 ॥

ఎప్పుడైతే నీ మనస్సులోని మాలిన్యము పూర్తిగా పోయి, నీ


మనస్సులో ఆత్మ జ్యోతి వెలిగి నీ మనస్సులోని అంధకారము
పోయి, బుద్ధి అజ్ఞానమును దాటి, శుద్ధ జ్ఞానమును పొందుతుందో,

అప్పుడు నీవు నీ ఫలితమును పొందుతావు. అంతవరకూ


నీవు పరమాత్మ తత్త్వము గురించి, సమతా భావనతో సత్కర్మ
ఆచరణ, సాధన ఎలా చేయాలి అనే విషయములు వింటూ
ఉంటావు. కాని నీవు శుద్ధ జ్ఞానము పొంది, నీ ఫలితము పొందిన

92
తరువాత, నీకు నిర్వేదం (ఏ కోరికలకు లొంగని వైరాగ్యము)
సిద్ధించినప్పుడు, నీవు వినవలసిన అంశములు ఏమీ ఉండవు. విన్న
అంశములకు పెద్దగా ఇప్పుడు విలువ ఉండదు. (నీకు వైరాగ్యము
సిద్ధించకపోతే నీవు ఆ విషయములను వింటూ ఉండవలసినదే).

శ్రు తివిప్రతిపన్నా తే యదా స్థా స్యతి నిశ్చలా ।


సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి l53l

నీవు నీ లక్ష్యము, బాధ్యతలు, ఇష్టముల కర్తవ్యముల మీద


రకరకాల వేద, శాస్త్ర వాక్యములు వినటము చేత, నీకు ఏది చేయాలి,
ఎలా చేయాలి అనేవి అర్ధమగుట లేదు. నీ ఆలోచనలు
గందరగోళముగా అయి, నీ బుద్ధి ఏ నిర్ణయము తీసుకోలేక
పోతోంది. నీవు సరైన ఆలోచనలను చేసుకోవాలి. నీ బుద్ధిని ఇటు,
అటు పోనీయకుండా, పరమాత్మ తత్త్వము (నీ లక్ష్యము) నీకు
ప్రధానము అని నిశ్చలముగా ఉండు.

మానవుల లక్ష్యము పరమాత్మ తత్త్వము తెలుసుకోవటమే


అనే నిశ్చయమును స్థిరముగా ఉంచుకో. నీ లక్ష్యమును (పరమాత్మ
తత్త్వము తెలుసుకోవటము) ప్రధానముగా ఉంచుకొని, నీ
బాధ్యతలను, నీ ఇష్టములను నీ లక్ష్యము వైపు నడిపించుకుంటూ
ఉండు. అప్పుడు నీ మనస్సు/బుద్ధి స్థిరముగా నీ లక్ష్యము మీద

93
ఉంటుంది. నీ మనస్సు నిశ్చలముగానూ, నిశ్చయముగానూ ఉంటే,
నీ బుద్ధి యోగమును పొందుతుంది. పరిశుద్ధమైన, నిశ్చలమైన
మనస్సులో, అచలమైన బుద్ధిలో, సమాధిలో పరమాత్మ భాసిస్తుంటే
నీకు బుద్ధి యోగము పరిపూర్ణముగా సిద్ధించినట్లు .

ఛాందోగ్యోపనిషత్ – “ఏకస్మిన్ విదృతే తృప్తే సర్వం జగత్


తృప్త్యతి” – పరమాత్మ తృప్తి చెందితే, సర్వ జీవులు జగత్లు తృప్తి
చెందుతుతాయి.

అర్జు న ఉవాచ ।
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ ।
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం ॥54॥

అర్జు నుడు ఇలా అంటున్నాడు I ఓ కేశవా (కేశి అనే


రాక్షసుడిని సంహరించిన వాడా, అంధకారమును నిర్మూలించిన జ్ఞాన
స్వరూపుడైన ఓ పరమాత్మా) l స్థిత ప్రజ్ఞుడు (ఇంద్రియములను,
సంకల్పములను ఉపసంహరించుకొని, అంతర్ముఖుడై, యోగ
సమాధిలో పరమాత్మ తత్త్వము స్పష్టముగా భావన చేస్తూ ఉండే
తత్త్వ జ్ఞాని) - ఇది యోగముతో కూడిన మహా జ్ఞానులకు మాత్రమే
సాధ్యము. స్థిత ప్రజ్ఞుడు లక్షణములు ప్రమాణ గ్రంధములు ఏ

94
విధముగా బోధిస్తు న్నాయి? ఏ విధముగా ఉండాలి? ఇటువంటి
వారిని ఎలా గుర్తించాలి?

స్థిత ప్రజ్ఞుడు సమాధి నుండి ఏ విధముగా బైటకు వస్తా డు?


తరువాత ఏ విధముగా మాట్లా డుతాడు? ఏ రకముగా ఉంటాడు?
ఏ విధముగా వ్యవహరిస్తా డు? అతని నడత ఎలా ఉంటుంది?

 శ్రీభగవానువాచ ।
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ।
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ॥ 55 ॥

భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు l ఎప్పుడైతే ఆ


సాధకుడి మనస్సులో గూడుకట్టు కున్న కోరికలన్నీ సమూలముగా,
పూర్తిగా పోగొట్టు కుంటాడో,

తనలో (ఆత్మలో) తాను (తన హృదయములో దాగి ఉన్న ఆ


హృషీకేశుడిని అనుభవిస్తూ) శాశ్వతమైన ఆనందమును
అనుభవిస్తూ, రమిస్తూ ఉంటాడో, అటువంటి వాడిని స్థిత ప్రజ్ఞుడు
(బుద్ధి స్థిరముగా, నిశ్చలముగా ఉన్నవాడు) అంటారు.

ఆనందము అంటే ఏమిటి?

95
మనమందరమూ (ప్రతి జీవి) దేనిని నిరంతరమూ
కోరుకుంటున్నామో అదే ఆనందము. ఆనందము అంటే -
అనుకూలమైన భావన, నిష్కారణమైనది, అనుకూల భావన దేనితో
సమాప్తము అవుతుందో అది ఆనందము – జీవుడు లేక ఆత్మ
శాశ్వత ఆనందము స్వరూపము. ప్రపంచములో ఉన్న వస్తు వులన్నీ
ఆనందము కోసము. ఆనందము మాత్రము వస్తు వు కాదు. మనకు
ప్రేమ మనమీదే ఉంది. కారణము లేని ప్రేమ ఇతర ప్రాణులు,
వస్తు వులు మీద లేదు. మనకు అనుకూలమైన ప్రాణి లేక వస్తు వు
అయితే వాటి మీద ప్రేమ. క్రమక్రమముగా కోరికలు తగ్గించుకుంటే,
ఏ కోరికా లేని స్థితి ఏర్పడినప్పుడు హృదయములో ఉన్న శాశ్వతమైన
బ్రహ్మానందము అనుభవములోనికి వస్తుంది. మనము మన
ఇంద్రియముల ద్వారా ప్రపంచములోని జీవులు మరియు
వస్తు వులను అనుభవించి ఆనందిస్తు న్నాము. మన ఇంద్రియములు
పరాన్ముఖులై (బయట ప్రపంచము వైపు) ఉన్నాయి. మన మనస్సులో
గూడుకట్టు కున్న కోరికలన్నీ సమూలముగా, పూర్తిగా పోగొట్టు కొని,
మన ఇంద్రియములను అంతర్ముఖము (లోపల హృదయము
లోనికి) త్రిప్పుకొని హృదయములో ఉన్న పరమాత్మను
(హృషీకేశుడిని) దర్శించ కలిగితే ఆ బ్రహ్మానందము
అనుభవములోనికి వస్తుంది.

96
తైత్తీరీయోపనిషత్ – ఆనందవల్లి - 2-8-1 నుండి 4 వరకు –
“స ఏకో మానుష ఆనన్డః I శ్రోత్రయస్య చకామహతస్య II తేయే
శతం మానుషా ఆనన్దాః...........తే యే శతం ప్రజాపతే రానన్దాః I స
ఏకో బ్రాహ్మణ ఆనందః” – మానవుల ఆనందము కంటె నూరు
రెట్లు మనుష్య గంధర్వ ఆనందము. మనుష్య గంధర్వ ఆనందము
కంటె నూరు రెట్లు దేవ గంధర్వ ఆనందము. దేవ గంధర్వ
ఆనందము కంటె నూరు రెట్లు పితృ దేవతల ఆనందము. పితృ
దేవతల ఆనందము కంటె నూరు రెట్లు అజానజ దేవతల
ఆనందము. అజానజ దేవతల ఆనందము కంటె నూరు రెట్లు కర్మ
దేవతల (పుణ్య కర్మలు చేసి వాటి ఫలితముగా దేవతలు అయిన
వాళ్ళు) ఆనందము. కర్మ దేవతల ఆనందము కంటె నూరు రెట్లు
దేవతల ఆనందము. దేవతల ఆనందము కంటె నూరు రెట్లు
ఇంద్రు డి ఆనందము. ఇంద్రు డి ఆనందము కంటె నూరు రెట్లు
బృహస్పతి ఆనందము. బృహస్పతి ఆనందము కంటె నూరు రెట్లు
ప్రజాపతి ఆనందము. ప్రజాపతి ఆనందము కంటె నూరు రెట్లు
బ్రహ్మానందము. ఆ బ్రహ్మము మానవుల హృదయములో ఉన్నది.

బృహదారణ్యకోపనిషత్ – 1-4-8 లేదా 3-4-8 - “తదేత


త్స్రేయః పుత్రాత్స్రేయో విత్తా త్స్రేయో న్యస్మాత్సర్వస్మాద న్తరతరం
యదయమాత్మా స ......” – ఈ ఆత్మ మిక్కిలి ప్రియమైనది. పుత్రు ని

97
కంటె, ధనము కంటె ఆత్మే ప్రియమైనది. శ్రేష్టమైన పదార్ధముల కంటె
ప్రియమైనది.

తైత్తీరీయోపనిషత్ – ఆనందవల్లి - 2-7-1 – “రసో వై సహః


l రసగమ్ హేవాయం లబ్ద్యానందీ భవతి l కో హ్యేవాన్యాత్కః
ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్” సృష్టికి పూర్వము
పరబ్రహ్మము అవ్యాకృత పరబ్రహ్మముగా ఉండెను. అట్టి అవ్యాకృత
పరబ్రహ్మము నుండి నామ రూప విశేషము గల ఈ జగత్లు పుట్టెను.
ఆ పరబ్రహ్మము తృప్తి హేతువగు రస స్వరూపముగా నున్నది.

తైత్తీరీయోపనిషత్ - ఆనందవల్లి – 2-4-1 మరియు 2-9-1


– “యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా l ఆనన్డం బ్రాహ్మణో
విద్వాన్ I మేత జీవస్య యత్ జ్ఞాత్వా అమృత మశ్నుతే” – జీవుడు
లేదా ఆత్మ ఆనంద స్వరూపము అని తెలుసుకున్న వాడు
అమృతత్త్వము పొందుచున్నాడు.

బృహదారణ్యకోపనిషత్ – 5 లేక 7-1-1 – “ఓం ఖం బ్రహ్మ l


ఖం పురాణం వాయురం ఖమితిహ సమాహ కౌరవ్యాయణీ పుత్రో
వేదోయం బ్రాహ్మణా విదుర్వేదై నేనా యద్వేదితవ్యమ్” ఓం కారము
పరమాత్మాకాశము (చిదాకాశము), వాయువు ఉండే ఆకాశము.
సాధకుడు ఈ ఓం కారము చేత బ్రహ్మమును

98
తెలుసుకొనుచున్నాడు. బ్రాహ్మణులు ఓం కారమును వేదమని
తెలుసుకొనిరి.

ఛాందోగ్యోపనిషత్ – 4-10-4 – “అధ హాగ్నయ స్సమూదిరే


తప్తో బ్రహ్మచారీ కుశలం నః పర్యచారీత్ హన్తా స్మై ప్ర బ్రహ మేతి
తస్మైహొచుః ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మేతి” – యజ్ఞాగ్నులు
తీవ్రమైన తపస్సు చేస్తు న్న బ్రహ్మచారితో – ప్రాణము బ్రహ్మము. “కం”
అనగా బ్రహ్మము. “ఖం” అనగా బ్రహ్మము.

 దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః।


వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ॥ 56 ॥

స్థిత ప్రజ్ఞుడుకు ఏ విధమైన దుఃఖము కలిగినా, ఏ మాత్రమూ


ఉద్వేగమునకు లోనవడు, ద్వేష, బాధ పడడు (పుండు దురద
పెట్టు తోందని గోకితే, ఆ పుండు పెద్దదయినట్లు , దుఃఖము
పోగొట్టు కోవాలని సుఖముల వెంట పడితే, ఈ దుఃఖము పెరగటమే
తప్ప, పోదు). ప్రాపంచకమైన సుఖములు రావాలి అనే కోరిక లేశ
మాత్రముగా కూడా కలిగి ఉండడు (తనలో తాను రమిస్తూ,
శాశ్వతమైన బ్రహ్మానందమును అనుభవిస్తు న్నాడు) .

99
ఏ విషయము, వస్తు వు మీద అధికమైన ప్రేమ, ఆశ,
అనురాగము ఉండరాదు. ఏ వస్తు వు మీద కోరిక ఉండదు (అనిత్య,
అల్ప సుఖముల మీద కోరిక ఉండరాదు).

ఏదో వస్తు వు దొరకదు అనే భయము, కోపము ఉండరాదు.


ఏ విషయములోనూ స్థిత ప్రజ్ఞుడు మనస్సు, బుద్ధి చంచలము
అవదు. అందుచేత అతని బుద్ధి స్థిరముగా ఉంటుంది. స్థిత ప్రజ్ఞుడు
వేదములు, శాస్త్రములు, గురువులు ఉపదేశము చెప్పిన
విషయములను శ్రద్ధగా విని, నిరంతరమూ మననము
చేసుకుంటూ, ఆ విషయములను ఆచరణలో పెట్టు కొని, తన
మనస్సును, బుద్ధిని స్థిరముగా పరమాత్మ తత్త్వము పైన ఉంచుకొని,
తనలో తాను రమిస్తూ, బ్రహ్మానంద స్థితిని పొందుతారు.

యః సర్వత్రానభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం।


నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥ 57 ॥

ప్రాపంచకమైన ఏ వస్తు వుయందు (ఒక్క ఆత్మ, పరమాత్మ


తత్త్వ జ్ఞానము విషయములో తప్ప), జీవులయందు స్నేహము,
అనుకూలము అనే భావన ఉండకూడదు. ఆ స్నేహమును,
భావమును తగ్గించుకున్న వాడే స్థిత ప్రజ్ఞుడు.

100
శుభము కలిగినప్పుడు తనని తాను అభినందించుకొనుట
(సుఖముల మీద ఆశ తగ్గించుకొని), అశుభము, కష్టము
కలిగినప్పుడు ఇతరులను, పరిస్థితులను, దైవమును ద్వేషించి,
దూషించనివాడి (కష్టములను ఓర్చుకునే స్వభావము పెంచుకుంటే)
బుద్ధి పరమాత్మ తత్త్వము మీద స్థిరముగా ఉంటుంది. అతడే స్థిత
ప్రజ్ఞుడు.

యదా సంహరతే చాయం కూర్మోఽంగానీవ సర్వశః ।


ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥ 58 ॥

ఏదైనా ప్రమాదము వస్తుంటే, భయముతో తాబేలు ఎలా తన


కాళ్లను (4) + తలను (1) మొత్తము ఐదు (5) గట్టిగా ఉండే డిప్ప
లోనికి ఎలా తీసుకుపొతుందో ఆ విధముగా

సహజముగా బైటకు ప్రపంచము, విషయముల వైపు


ప్రసరిస్తూ ఉండే మన పంచ జ్ఞానేంద్రియములు - 1. శ్రోత్రము, 2.
చర్మము, 3. చక్షుస్సు, 4. జిహ్వ, 5. నాసిక. మరియు పంచ
కర్మేంద్రియములు - 1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4.
పాయువు, 5. ఉపస్థ తన లోపలకి తీసుకువెళ్లి (బయటకు ప్రసరిస్తే
అవి ప్రాపంచకమైన విషయములపై రాగ, ద్వేషములు పెంచుకుంటానే

101
అనే భయముతో) వాటి, వాటి స్థా నములలో వాటిని నిగ్రహించి ఉంచ
గలిగే వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠతముగా (బుద్ధి స్థిరముగా) ఉంటుంది.

విశ్లేషణ: కన్ను తన దృష్టి శక్తిని బయట ప్రపంచము లోనికి


ప్రసరింపచేసి, ఒక విషయముతో కలిసి, ఒక ఆలోచన అనే జ్ఞానము
కలిగి, దానిని మనస్సుకు అందిస్తుంది. మనస్సు ఈ చిత్రము
(ఆలోచన) బాగుందా, లేదా అనే విచారణ చేసి, సంకల్పమును
(సమ్యక్ + కల్పన) చేస్తుంది. ఆ విషయము బాగుంది లేక బాగాలేదు
అనే నిర్ణయము బుద్ధి చేస్తుంది. (అంతఃకరణము (4) – 1. మనస్సు
– సంకల్పములను చేయునది, 2. బుద్ధి – నిర్ణయ శక్తి, 3.
అహంకారము – శరీరమే ఆత్మ అనే భావన, 4. చిత్తము – స్మరణ
లేక జ్ఞాపక శక్తి, జ్ఞాపక శక్తి). ఒక్కసారి బాగుంది అనే నిర్ణయము
అయిందో – అది కావాలనే కోరిక, ఆ కోరిక తీరుతుందా లేక తీరదా
అనే భయము, కోరిక తీరకపోతే కోపము వస్తుంది. కోపము వస్తే
మనము ఏదైనా చేస్తా ము. అది సర్వ నాశనమునకు దారి తీస్తుంది.

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః ।


రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ॥ 59 ॥

ప్రాపంచకమైన విషయములు ఇంద్రియముల ద్వారా మన


దేహము లోపలకి రానివ్వకుండా బలవంతముగా పస్తు ఉంచితే,

102
మన లోపల బలంగా దాగి ఉన్న కోరిక (రసము, తీవ్రమైన
అభిలాష, రాగము, మోహము, వ్యామోహము, తృష్ణ స్పృహ) అలాగే
మిగిలిపోతోంది. ఆ రసము మనలో అలానే ఉంటే, అది తరువాత
మరింత ఉద్వేగముతో రెచ్చిపోతుంది. అప్పుడు సర్వ నాశనమునకు
దారి తీస్తుంది. ఆ రసము పోయేందుకు, ఇంద్రియ నిగ్రహము
ద్వారా, ఆ పరమాత్మను చూడగలిగితే, ఆ కోరిక (రసము) పూర్తిగా
పోతుంది. కోరికలు పోయిన తరువాత ఉండే ఇంద్రియ నిగ్రహము
స్థిరముగా ఉండి సర్వోత్కృష్టమైన ఫలము ఉంటుందని దృష్టిలో
పెట్టు కో (3 వ అధ్యాయము, 37 నుండి 43 వ శ్లోకము వరకూ, 4 వ
అధ్యాయము 21 వ శ్లోకము చూడుము).

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ।


ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ॥ 60 ॥

ఓ కుంతీ పుత్రా l నీవు మనస్సులో గట్టి సంకల్పము చేసి,


ఇంద్రియ నిగ్రహము కొరకు ప్రయత్నము చేసుకుంటూ కొంత
నిగ్రహము సాధించి ఉండవచ్చు. లౌకిక ప్రాపంచకమైన సుఖముల
కంటె పెద్ద ప్రయోజనము కలుగుతుందని తెలిసి ఉండవచ్చు.

కాని ఈ ఇంద్రియములను నమ్మటానికి వీలులేదు.


ఇంద్రియములు మన మనస్సును, సంకల్పములను మధించి, చిలికి,

103
హరించి బలవంతముగా మళ్ళీ బయటకు వచ్చి ప్రాపంచకమైన
విషయముల వైపు ప్రసరించే ప్రమాదము ఉన్నది. ఇంద్రియములు
మనస్సును బయటకు లాక్కుని పోతాయి. ఒక్కొక్కప్పుడు మనస్సు
ఇంద్రియములను బయటకు లాక్కుని పోతుంది.

 తాను సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః।


వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥ 61 ॥

ఇంద్రియ సంయమనము (నిగ్రహము) చేసుకుంటూ,


పరమాత్మ (నన్నే) అందరికంటే గొప్పగా భావించి నన్ను నమ్మి, నాతో
ధ్యానమగ్నుడువై ఉంటూ, నన్నే ఆశ్రయించు.

అప్పుడు వారికి ఇంద్రియములు వశమయి తీరతాయి.


అప్పుడు వారు స్థిత ప్రజ్ఞలు అయి తీరుతారు.

 ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।


సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధోఽభిజాయతే ॥ 62

ఏదో ఒక వస్తు వును లేక వ్యక్తిని మళ్ళీ, మళ్ళీ చూస్తూ, దాని


గుణ గణములను ఆలోచిస్తూ (ధ్యానిస్తూ) ఉంటే, ఆ వస్తు వు,

104
వ్యక్తితో మనకు సంగము ఏర్పడి, ఆసక్తి పెరిగి, సంబంధము
ఏర్పడుతుంది.

తరువాత ఆ వస్తు వు లేక వ్యక్తి మీద మనకు తీవ్రమైన కోరిక


ఏర్పడుతుంది. ఆ కోరిక తీరకపోతే, మనకు వళ్ళు తెలియని
తీవ్రమైన కోపావేశము వస్తుంది.

 క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మృతివిభ్రమః ।


స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్ర ణశ్యతి ॥ 63 ॥

వళ్ళు తెలియని తీవ్రమైన కోపావేశము వస్తే, యుక్తా యుక్త


వివేకము (మంచి, చెడ్డలను ఆలోచించి నిర్ణయించే శక్తి) పోయి,
సమ్మోహము కలిగి మనము ఏమి చేస్తు న్నామో మనకే తెలియదు.
సమ్మోహము కలిగితే, మనము విన్నవి, చదివి అర్ధము చేసుకున్న
మంచి విషయములు, మన మంచి ఆలోచనలు, జ్ఞాపకాలు మనకు
గుర్తు కు (స్మృతి) వచ్చే అవకాశము కూడా ఉండదు.

స్మృతి నాశనము అయితే, ఆ వ్యక్తి బుద్ధి నాశనమైనట్లే


(ఎవరేమి చెప్పినా వినే, అర్ధము చేసుకునే యోగ్యత కోల్పోతాడు).
బుద్ధి నాశనమైతే ఆ వ్యక్తి సర్వ నాశనమైనట్లే.

రామాయణము – సుందర కాండ – 55 – 75 వ సర్గము -


7 వ శ్లోకము – “య స్సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి l

105
యధోరగస్త్వచం జీర్ణం స వై పురుష ఉచ్యతే” – నా కోపము
(అహంకారము పూరిత కోపము) – వెయ్యికోట్ల వంతు క్షణములో
కోపము (మనస్సు సమతుల్యము కోల్పోవుట) పైకి లేస్తుంది. ఆ
క్షణములో మనము ఆ కోపమును ఓర్పుతో, ఓపికతో (పాము తన
పాడయిపోయిన చర్మము యొక్క పొరను జాగ్రత్తగా ఎలా
వదులుకుంటుందో అలా) ఆపుకోగలిగినవాడే, అదుపు
చేసుకున్నవాడే మనిషి.

 రాగద్వేషవిముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ।
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ॥64॥

అనవసరమైన విషయములు (వస్తు వులు, వ్యక్తు లు) గురించి


ఆలోచించకుండా, మనస్సును అదుపుతో పెట్టు కోవాలు. మన
మనస్సు మన మాట వినేలా అభ్యాసము చేయాలి. మంచి
విషయములను జాగ్రత్తగా గ్రహిస్తూ

ఏ వస్తు వు, వ్యక్తి మీద రాగము, ప్రీతి, ఆసక్తి, అనుకూలముగా


ఉంటే - కోరిక, ప్రతికూలముగా ఉంటే - ద్వేషము సంపర్కము లేని
స్వభావమును అలవాటు చేసుకుంటే (రాగ, ద్వేషములు లేని
మనస్సు, బుద్ధి, కోరలు తీసేసి, విషము, ప్రమాదము లేని పాము
వంటివి), ఇంద్రియములు మన అధీనములో ఉంటాయి.

106
(పుణ్య కర్మలతో మనస్సుని, బుద్ధిని పవిత్రము చేసుకుంటే)
ఇంద్రియములను తన స్వాధీనములో ఉంచుకొని – మనస్సు
అదుపులో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అప్పుడు మనస్సులో
ప్రసన్నత ఏర్పడి, బుద్ధి స్థిరముగా ఉంటుంది. అప్పుడు నీలూ
యోగ్యత పెరుగుతుంది.

“మనసా ఏవ పశ్యతి, మనసా సృణోతి” – మనస్సు ఒక్కటే


చూడగలుగుతుంది (కన్ను కాదు). మనస్సు వింటుంది (చెవి కాదు).

కఠోపనిషత్ – 1-3-6, 7 – “యస్తు విజ్ఞానవా న్భవతి


యుక్తేన మనసా సదా l తస్యేన్ధ్రయాణి వస్యాని సదాశ్వా ఇవ శారదే ll
యస్త్వ విజ్ఞానవా న్భవ త్యమనస్కః సదా శిచిః l న స
తత్సదమాప్నోతి, సంసార చాధిగచ్చతి” – విజ్ఞానము (బుద్ధి), యుక్త
మనస్సు కలవాడి (సమర్ధు డి) ఇంద్రియములు, సారధికి మంచి
గుర్రముల వలె, వశములో ఉండును. విజ్ఞానము లేనివాడు, సదా
అపవిత్రమైన మనస్సు కలవాడు, ఇంద్రియములు అదుపులో ఉండక
(సారధి సరైనవాడు కాకపొతే గుర్రములు మాట వినవు) గమ్యమును
(పరమాత్మను) చేరలేక జనన, మరణ సంసార చక్రములో
పరిభ్రమిస్తూ, తిరుగుతూ ఉంటాడు.

Emotions, mental disturbances (మనస్సు


చాంచల్యము) – There are countless variations, mutations,
mensal, nuances – Psychologists.
107
 ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ।
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే॥ 65 ॥

బుద్ధి కనుక ప్రసన్నముగా ఉంటే, అన్ని దుఃఖములు పోయి,


కష్టములు అన్నీ తొలగిపోతాయి.

మనస్సులో ఏ రకమైన అలజడి, అల్లకల్లోలములు లేకుండా


ప్రశాంతముగా ఉంటేనే, పరమాత్మ మీద మీ బుద్ధి చెదిరిపోకుండా
స్థిరముగా ఉంటుంది. శాశ్వతమైన ఆనందము సిద్ధించాలంటే,
పరమాత్మ మీద మీకు స్థిరమైన బుద్ధి ఏర్పడాలి.

 నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా ।


న చాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం ॥ 66 ॥

పరమాత్మ చెప్పిన యోగము – సమతా భావముగా


సత్కర్మలు చేయుట, రాగ, ద్వేషములు లేకుండా ఇంద్రియములతో
విషయములను, వ్యక్తు లను సంగ్రహించుకొని. బుద్ధిని స్థిరముగా
ఉంచుకోవాలి. ఈ యోగము లేకపోయినట్లయితే, వాడికి బుద్ధి
లేనట్లే. అప్పుడు మన మనస్సులో పరమాత్మ మీద భావన
(పరమాత్మ మీద మన మనస్సు నిమగ్నమయి చెదిరిపోకుండా
స్థిరముగా ఉండుట) స్థిరముగా కుదరదు.

108
ఈ భావన స్థిరము చేసుకోలేకపోతే, కష్టములు నిన్ను
వేధించటము మానవు. అప్పుడు నీ మనస్సుకు శాంతి కూడా
ఉండదు. మనస్సుకు శాంతి లేకపోతే, సుఖము ఉండదు. మనస్సు
ప్రశాంతత లేకపోతే, ఎంత ఆనందము కలిగినా దానిని
అనుభవించలేరు (నోట్లో ఉప్పు రాయి ఉంటే, పంచదార తిన్నా తీపి
తెలియదు. మన కంటె ఎదుటి వాడికి ధనము ఎక్కువ ఉంది అనే
బాధ (అశాంతి) ఉంటే, మన ధనమును మనము
అనుభవించలేము).

ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే ।


తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ॥ 67 ॥

ఇంద్రియములు బయట విషయముల వైపు ప్రసరిస్తూ,


సంచరిస్తూ వాటి, వాటి, విషయములను గ్రహిస్తూ ఉంటాయి.
ఇంద్రియములు ఎటువైపు సంచరిస్తే, మనస్సు కూడా వాటితో
అటువైపు సంచరిస్తే (ఇంద్రియ, మనస్సు నిగ్రహము లేకపోతే)

అప్పుడు సాధకుడి బుద్ధి సామర్ధ్యమును కదల్చి వేసి,


హరించి సాధకుడి పరమాత్మను చేరాలనే మార్గమును మార్చి
వేస్తుంది. ఎలాగైతే సముద్రములో నున్న నావ తన నిర్దిష్టమైన,
గమ్యమునకు చేరే మార్గమును, బలమైన గాలి ఎలా మార్చి
వేస్తుందో, ఆ విధముగా ఇంద్రియముల సంచారమును అనుసరించి,

109
మనస్సు కూడా అనుసరిస్తే, సాధకుడి బుద్ధి స్థిరత్వము, సామర్థ్యము
కోల్పోయి, సాధకుడు తన లక్ష్యమును (పరమాత్మను)
చేరుకోలేకపోతాడు. ఆ పరిస్థితిని రానీయకుండా, ఇంద్రియములను,
మనస్సుని ప్రాపంచకమైన విషయముల వైపు పోకుండా
నిగ్రహించుకోవాలి.

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః।


ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥ 68 ॥

గొప్ప బాహువులు కల అర్జు నా l మనస్సు కూడా


ఇంద్రియములతో ప్రసరించే దోషము అందరిలో సాధారణముగా
ఉంటుంది కాబట్టి, ఏ సాధకుడి తన ఇంద్రియములు అన్ని
ప్రాపంచకమైన విషయములను నిగ్రహించుకుంటాడో

ఇంద్రియములను, మనస్సును వాటి, వాటి విషయముల


నుండి మరల్చి, వెనక్కు తీసుకొని, లక్ష్యము మీద స్థిరముగా
ఉంచుకుంటే, ఆ సాధకుడి ప్రజ్ఞ (బుద్ధి శక్తి) స్థిరముగా ఉండి (స్థిత
ప్రజ్ఞుడు), తన లక్ష్యము (పరమాత్మ జ్ఞానము) వైపు స్థిరముగా
ప్రయాణించగలుగుతాడు.

 యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।


యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥ 69 ॥

110
అజ్ఞానము అన్న చీకటిలో ఉన్న సాధారణ ప్రజలకు
పరమాత్మ తత్త్వము అర్ధము కాక, నిశా (రాత్రిలా) అంధకారములో
ఏమీ కనిపించని, అర్ధము కాని పరిస్థితి. కాని ఇంద్రియములను,
మనస్సును సంయమము చేసుకున్న (నిగ్రహించుకొన్న) పరమాత్మ
తత్త్వము మీద దృష్టి ఉన్న స్థిత ప్రజ్ఞుడు రాత్రిని, పట్ట పగలుగా
భావిస్తా డు. రాత్రి చీకటిగా ఉన్నా (జ్ఞానము అనే వెలుగులో ఉన్న) స్థిత
ప్రజ్ఞుడికి పరమాత్మ తత్త్వము, స్వరూపము స్పష్టముగా
అర్థమవుతుంది, కనిపిస్తుంది.

అలాగే సాధారణ ప్రజలు పగలు మేల్కొని ఉన్నాము


అనుకొని, ఆ, యా ఇంద్రియములతో ఆ, యా విషయములను
అంతా చక్కగా చూసి, అర్ధము చేసుకొని, వారి వ్యవహారములను
చక్కగా చేసుకుంటూ ఉంటారు (కాని వాళ్ళు నిజముగా వెలుగులో
లేరు. అజ్ఞానము అనే అంధకారములో ఉన్నారు). కాని పరమాత్మ
తత్త్వము మీద దృష్టి ఉన్న స్థిత ప్రజ్ఞుడు పగలుని, రాత్రిలా భావిస్తా డు
(పగలు అయినా ప్రాపంచకమైన విషయములు మీద ఏ విధమైన
ఆసక్తి లేదు కాబట్టి ఏమీ కనిపించవు).

ఆ సాధకుడు ఇంద్రియ సంయమము సాధించుకొని,


గురువు చెప్పిన పరమాత్మ తత్త్వమును, సాధకుడు శ్రవణము చేసి,
తెలుసుకున్న పరమాత్మ తత్త్వమును మననము చేసుకుంటూ,
పరమాత్మ స్వరూపమును చక్కగా చూడగలుగుతున్నాడు.
111
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్।
తద్వత్కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ
॥ 70 ॥

జ్ఞానము అనే వెలుగులో పరమాత్మను తెలుసుకుంటే ఏమి


అవుతుంది.

సాధారణ ప్రజలు స్వభావము కోరికలు కోరుకుని, ఆ కోరిక


తీరితే కొంత శాంతిని పొందాము అని భావిస్తా రు. కోరిక తీరితే
పొంగిపోయి విర్రవీగుతారు. తీరకపోతే కుంగిపోయి దిగులు
పడతారు. అది తాత్కాలికమైన అల్పమైన శాంతి. అది నిజమైన,
స్థిరమైన శాంతి కాదు. సముద్రములోనికి నదుల నీళ్ళు వెళ్ళితే
పొంగిపోక, వెళ్లక పోతే ఎండిపోక, ఎల్లప్పుడూ ఎలా సమానముగా
ఉంటుందో, అలా శాంతి అంటే కోరిక తీరితే పొంగిపోక, తీరక పోతే
క్రుంగిపోక ఎల్లప్పుడూ సమానమైన స్థితిలో ఉండుట. కోరికలు
కోరుకుంటూ, వాటిని తీర్చుకుంటూ ఉండువాడు స్థిరమైన శాంతిని
పొందలేడు. కోరికలు లేకుండా, ఇంద్రియములను సంయమనము
చేసుకొని, మనస్సును నిగ్రహము చేసుకొని, పరమాత్మని స్పష్టముగా
ధ్యానము చేసుకునే సిద్ధు డు, ఇటువంటి కోరికలకు అతీతముగా
స్థిరమైన, అనంతమైన దివ్యమైన శాంతిని పొందగలడు.

112
ఎవరైతే జ్ఞానము అనే వెలుగులో, పరమాత్మను తమ
హృదయాంతరాళములలో దర్శించుకుంటూ ఉంటారో, పరమాత్మ
యొక్క ఆనంద స్వరూపమును ఎవరైతే అనుభవించగలుగుతారో,
వాళ్ళు ఎల్లవేళలా, అన్ని పరిస్థితుల్లోనూ స్థిరముగా ఉండగలరు.

విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।


నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి॥71॥

ఏ పురుషుడు కోరికలు అన్నీ విడిచి పెట్టు కొని, ఏ విధమైన


కోరికలు తీర్చుకుందుకు ప్రయత్నము చేయకుండా, ఏ కోరికా
(తృష్ణ) లేకుండా, తన జీవన యాత్రను ముందుకు
సాగించుకుంటూ ఉంటాడో

మమకారము “నాది”, “నాకు” అనే భావన, ఏమీ లేనివాడు


(ప్రాపంచకమైన భోగములపై, సుఖములపై, వస్తు వులపై కోరిక
లేనివాడు), ఏ విధమైన అహంకారమునకు (ఈ శరీరము నేను -
ఆత్మ అనే భావన, “అహం”, “నేను”) లోనుకానివాడు శాశ్వతమైన
ఆనందమును పొందుతారు.

అహంకారమునకు (అహం, నేను) ఉదాహరణ: ఒక శిష్యుడు


పంచదారను పాకము పట్టి, కాకరకాయ రూపములో తయారుచేసి,
దాని పైన ఆకుపచ్చ రంగు పూసి తన గురువుగారికి సమర్పించాడు.
ఆ గురువుగారికి ఏ వస్తు వుకైనా ప్రాణము పోసి, అది ఎలా

113
ఉంటుందో చూసే ఒక అలవాటు ఉండేది. అలా ఆయన ఆ
పంచదార కాకరకాయకు ప్రాణము పోసి, ఏదో పని మీద ప్రక్కకు
వెళ్ళారు. ఆ పంచదార కాకరకాయ నడుచుకుంటూ బయటకు
వెళ్ళితే, అక్కడ కాకరపాదుకు చాలా కాకరకాయలు
వ్రేల్లా డుతున్నాయి. ఆ గురువుగారు వాటికి కూడా ప్రాణము
పోసినందున అవి ఈ పంచదార కాకరకాయతో – మనము చేదుగా
ఉంటాము అని చెప్పాయి. తరువాత ఈ పంచదార కాకరకాయ,
తిరిగి వచ్చి తన ప్లేటులో కూర్చొంది. అప్పుడు గురువుగారు ఆ
కాకరకాయను తీసుకొని నోట్లో పెట్టు కోబోతే, ఆ కాకరకాయ, నన్ను
తిన వద్దు . నేను చేదుగా ఉంటాను అని అంది. గురువుగారు నీవు
కాకరకాయ కాదు, నీవు అసలు పంచదార (ఆత్మ). నీ స్వభావము
తీపి. నీవు అజ్ఞానముతో ఈ కాకరకాయ రూపమును (శరీరము),
దాని స్వభావమును (నేను తెల్లగా, పొట్టిగా, లావుగా ఉంటాను) నీ
మీద ఆరోపించుకుంటున్నావు. అని చెప్పి దానిని జ్ఞానము అనే
నీటితో కడగగానే, దాని పైన ఉన్న ఆకుపచ్చ రంగు పోయి, ఆ
కాకరకాయకు జ్ఞానము కలిగి తన అసలు స్వభావమైన తెల్ల దనము,
తన తీపి దానికి తెలిసినది.

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి ।


స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ॥ 72 ॥

114
ఓ పార్థా (విశాలమైన భావనలు కలిగిన వాడా) l నేను
ఇంతవరకూ చెప్పిన స్థిత ప్రజ్ఞుడి లక్షణములను (ఏ రకమైన
ప్రాపంచకమైన కోరికలు లేకపోవుట, ఇంద్రియముల సంయమనము,
మనస్సును నిగ్రహించుకొని, పరమాత్మ మీద దృష్టి పెట్టు కొని,
పరమాత్మ జ్ఞానమును స్థిరముగా పొందుట) సాధించుకున్న ఉత్తమ
సాధకుడి స్థితి – బ్రాహ్మీ స్థితి – పరబ్రహ్మను అనుభవములోనికి
(బ్రహ్మ జ్ఞానము) తెచ్చుకున్న స్థితి స్థిరముగా ఉన్నవాడికి మోహము
(అజ్ఞానము – “నేను” - శరీరము, “నాది” - ప్రపంచము) ఉండదు.

మానవుడు చివరి దశలోనైనా (వార్ధక్యములోనైనా) ఈ


బ్రాహ్మీ స్థితికి చేరగలిగితే, పూర్తిగా పర బ్రహ్మ జ్ఞానము పొంది,
పరిపూర్ణమైన శాశ్వతమైన శాంతిని (శాశ్వతమైన బ్రహ్మానందము)
పొందుతారు. పరమాత్మ తత్త్వ జ్ఞానము మాత్రమే తెలుసుకోవాలి
అనే కోరిక ఉన్నవాడికి మాత్రమే ఈ బ్రాహ్మీ స్థితి కలుగుతుంది. ఇది
కూడా (ఇతరమైన వాటితో కలిపి) కావాలి అంటే దొరకదు.

ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం


యోగశాస్త్రే శ్రీకృష్ణార్జు న సంవాదే సాంఖ్యయోగో నామ
ద్వితీయోఽధ్యాయః ॥ 2 ॥

మంగళా శ్లోకములు

115
యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః l

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రు వా నీతిమతిర్మమ ll

అధ క్షమా ప్రార్ధనా

యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ l తత్సర్వం క్షమ్యతాం


దేవ నారాయణ నమోస్తు తే ll

అధ భగవత్ సమర్పణమ్

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ l


కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ll

అధ లోకక్షేమ ప్రార్ధనా

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః l


సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ll

అధ మంగళమ్

శ్రియః కంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినామ్ l


శ్రీవేంకట నివాశాయ శ్రీనివాసాయ మంగళమ్ ll

కృష్ణ నామ సంకీర్తన

కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l

116
కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l

117
అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యానాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జు న సంవాదే అర్జు న కర్మయోగోనామ తృతీయోఽధ్యాయః
ll

అర్జు న ఉవాచ ।
జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన ।
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ॥ 1 ॥
అర్జు నుడు ఇలా అడిగాడు. నీవు చెప్పినట్లు జ్ఞాన మార్గము,
కర్మ మార్గము కంటె చాలా ఉత్తమమైనది అయినట్లయితే, ఓ
జనార్ధనా (జన్మకు కారణమైన అజ్ఞానమును పోగొట్టేవాడా).

ఘోరమైన కర్మ మార్గములో నన్ను ఉండమని ఎందుకు


చెప్పుతున్నావు? కేశవా (మానవుల బుద్ధి క్లేశములను పోగొట్టటమే నీ
కర్తవ్యముగా ఉంచుకున్నా వాడా) l క్లేశములు (5) (1. అవిద్య –
అజ్ఞానము, 2. అస్మిత (అహంభావము), 3. రాగము – ప్రీతి, 4.
ద్వేషము – శత్రు త్వము, పగ, 5. అభిమానము – గర్వము.

వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే ।


తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయాం ॥ 2 ॥

నీ మాటలు స్పష్టముగా ఉన్నట్లే అనిపిస్తోంది. కాని నా


యోగ్యతకు, బుద్ధికి నీ రెండు మాటలూ కలిసిపోయినట్లు గా,

118
కలగాపులగముగా ఉన్నవి. నీ వాక్యములు నా బుద్ధి కొంచెము
మొహమునకు గురి అయినట్లు గా ఉన్నది. నాకు భ్రమను
కలిగిస్తు న్నట్లు గా ఉన్నది.

అందువలన జ్ఞాన మార్గము లేదా కర్మ మార్గము, ఈ


రెండింటితో ఏ మార్గము మంచిది? ఏ మార్గము వలన నేను
శ్రేయస్సును (మోక్షము) పొందుతాను? నీవు తేల్చి చెప్పు.

శ్రీభగవానువాచ ।
లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ।
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ॥ 3 ॥

భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు l ఇంతకు


మందు నేను ఈ లోకములో రెండు రకములైన ఒకే ఫలితమును
ఇచ్చే ఒకే మార్గము ఉన్నది. అది ఒకటి సాంఖ్యము (తత్త్వ
జ్ఞానము), రెండోది కర్మ యోగము అనే రెండు రకములు. ఈ
విషయము నేను మొదటి (సృష్టి ప్రారంభము) నుండి
చెప్పుకుంటూ వస్తు న్నాను. అనఘ = నీ మనస్సులో ఏ విధమైన పాప
బుద్ధి, అవినయము లేదు. నీకు ఉన్నది సందేహము మాత్రమే.

ఎవరైతే తత్త్వ మార్గములో వెళ్ళుటకు అర్హత కలిగి ఉన్నారో,


ఎవరికైతే జ్ఞాన మార్గము సాఫల్యము సిద్దిస్తుందో అటువంటి వారికి
119
జ్ఞాన యోగము అని నేను ఉపదేశము చేసాను (సనకాది పంచకము
(2-7 శ్లోకము చూడుము) వీళ్ళను సాంఖ్యులు అని పేరు
(సాంఖ్యులు = పరమాత్మ తత్త్వము జ్ఞానులు). (5-4 శ్లోకము కూడా
చూడుము).

సాంఖ్య = “సమీతీనా ఖ్యా ఇతి సాంఖ్య”


= తత్త్వ జ్ఞానము. తత్త్వ జ్ఞానము కోసము చేసే సన్యాసమును
(రాగ ద్వేషములను, ద్వంద్వ భావముల విడిచిపెట్టు ట) సాంఖ్యము
అంటారు.

అలా కాకుండా సత్కర్మ ఆచరణతో (3-16 శ్లోకము


చూడుము), తమ జీవితములను సఫలము చేసుకోవాలని
అనుకునేవారికి, లేదా సత్కర్మ ఆచరణ ద్వారా తమ మనస్సుని,
బుద్ధిని శుద్ధి చేసుకొని, జాగ్రత్తగా జ్ఞాన మార్గము లోనికి ప్రవేశము
చేసుకునే యోగ్యతను పొందగలిగే వారికి కర్మ యోగమును
ఉపదేశము చేశాను (మరీచి, కశ్యప మహర్షులు మొదలగు
ప్రజాపతులు). వారికి కర్మ యోగ్యము (తగినది). సాధారణ
మానవులకు అందరికీ సత్కర్మ ఆచరణే వారి కర్తవ్యము. “యోగో
యోగస్య దేశకః” = ఒక యోగము సిద్ధిస్తే, ఆ యోగమే ఉపదేశము
చేసి పై స్థా యి యోగమునకు తీసుకు వెళ్ళుతుంది.

120
న కర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే ।
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ॥ 4 ॥

నాకు ఉత్తమమైన ఫలము కావాలి. అందు కోసము జ్ఞాన


మార్గమును అవలంబిస్తా ను. నేను ఏ కర్మలనూ చేయను అనే
సంకల్పముతో, పనులు చేయకపోతే, సత్కర్మ ఆచరణ చేయకపోతే
నైష్కర్మ్యం (కర్మ బంధములు అంటని స్థితి) లభించదు. (సమతా
భావముతో సత్కర్మ ఆచరణ చేసి, మన అంతఃకరణమును శుద్ధి
చేసుకొని, తత్త్వ జ్ఞానము పొందిన తరువాత నైష్కర్మ్యం స్థితి
లభించును). అంతఃకరణము (4) – 1. మనస్సు –
సంకల్పములను చేయునది, 2. బుద్ధి – నిర్ణయ శక్తి, 3.
అహంకారము – శరీరమే ఆత్మ అనే భావన, 4. చిత్తము – స్మరణ
లేక జ్ఞాపక శక్తి.

అన్ని కర్మలు వదిలేసుకుంటే, వైరాగ్యము, జ్ఞానము ఏదో సిద్ధి


లభిస్తుంది, అని అనుకుంటే, అది భ్రమ మాత్రమే. అవి ఏవీ
లభించవు.

న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ ।


కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ॥5॥

121
ప్రతీ జీవి ప్రతి క్షణము కూడా కర్మ చేయకుండా ఉండలేదు.
ప్రతీ జీవీ ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి.

ప్రతి జీవి, ప్రతి క్షణము, తన ప్రమేయము లేకుండా కూడా,


ఏదో ఒక పని (కర్మ) చేస్తూనే ఉంటుంది. జీవులు ప్రకృతి వశములో,
ఆధీనములో ఉన్నారు కాబట్టి, మన మనస్సులో ఉండే
త్రిగుణాత్మకమైన (సత్త్వ గుణము, రజో గుణము, తమో గుణము
సముదాయము) మూల ప్రకృతి, మనస్సుకు కర్మ చేయమని ప్రేరణ
ఇస్తుంది. జీవుడు పని చేయకుండా ఉండుట అసంభవము.
(పరమాత్మ కృపతో ఎప్పుడైతే జీవుడు ప్రకృతి ఆధీనము నుండి
విముక్తు డవుతాడో, అప్పుడు ఆత్మకు నైష్కర్మ్య స్థితి (కర్మ చేయని
స్థితి) వస్తుంది).

సత్త్వ గుణము: స్వచ్చమైన, ప్రకాశవంతమైన గుణము. ఇది


ఒక వస్తు వుని తెలుసుకునేట్లు చేస్తుంది. దీని స్వభావము తేలికగా
ఉంటుంది.

రజో గుణము: ఇది జీవుడికి కోరికలు పుట్టించి కర్మ


చేయమని బలవంతముగా తోస్తూ, ప్రేరేపిస్తుంది. దీని స్వభావము
బరువుగా ఉంటుంది.

122
తమో గుణము: ఆవరించి (మూసేసి), బద్ధకము కలిగించి,
నిద్ర పుచ్చుతుంది.

ఈ మూడు గుణములు ఒకదానిని ఒకటి అధిగమిస్తూ


చంచలముగా నిరంతరమూ మారిపోతూ ఉంటాయి. జ్ఞాన సిద్ధి
కలిగి, గుణాతీతము అయ్యేంతవరకూ ఈ క్రియ ఆగదు.

ఉదాహరణ: సత్త్వ గుణము షాపులో అన్ని వస్తు వులను


చూసేటట్లు చేస్తుంది. తమో గుణము షాపులో ఒకే వస్తు వును
చూపిస్తూ, మిగతా వస్తు వులను కప్పి వేస్తుంది. రజో గుణము
షాపులో ఆ ఒక్క వస్తు వును నాకు బాగుంది, నాకు కావాలి అనే
కోరిక కలిగిస్తుంది.

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ।


ఇంద్రియార్థా న్విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ॥ 6 ॥

కర్మేంద్రియములను (1. నోరు, 2. చేతులు, 3. కాళ్లు , 4.


జననేంద్రియము, 5. గుదము) కట్టు దిట్టము చేసుకొని,

నిగ్రహించుకొని సత్కర్మలు చేయకుండా కూర్చొన్నా, ఎవరైతే


మనస్సులో ఆలోచిస్తూ ఉంటారో

123
జ్ఞానేంద్రియములతో (1. కళ్ళు, 2, చెవులు, 3. నోరు -
నాలుక, 4. ముక్కు, 5. చర్మము) ద్వారా ప్రాపంచకమైన

విషయములను తన లోపలకి తీసుకొని మనస్సుకు అందిస్తుంటే,


మనస్సులో దానిని తీసుకొని, ఆలోచిస్తూ, వ్యామోహమునకు గురి
అయ్యేవాడు, తనను తానే మోసము చేసుకుంటూ, కపటత్వము
ప్రదర్శిస్తు న్నాడు. (తత్త్వ జ్ఞానము కలగా కుండా నేను
సన్యసిస్తు న్నాను, సత్కర్మ చేయను అంటే అది అబద్ధము. తనని
తాను మరియు ప్రపంచమును మోసము చేస్తు న్నాడు)

 యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జు న।


కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ॥7॥

ఓ అర్జు నా l మనస్సుతో కర్మేంద్రియములను


నియంత్రించుకొని, జ్ఞానేంద్రియముల ద్వారా అవసరమైన
విషయములను మాత్రమే లోపలకి తీసుకొని, అనవసరపు
విషయముల వైపు, జ్ఞానేంద్రియములను పోనీయకుండా, మనస్సుని
కూడా నియంత్రించుకొని,

కర్మేంద్రియములతో తనకు నిర్దేశించిన, చేయవలసిన సత్కర్మ


ఆచరణ, కర్మ యోగము రూపములో (రాగ, ద్వేషములు లేకుండా,
సమతా బుద్ధితో) ఏ విధమైన ఆసక్తి, సంగమము, సంబంధము

124
(కర్తను నేను, ఫలితము నాకు రావాలి) లేకుండా చేస్తా డో,
అటువంటి వాడు విశేషమైన ఫలితములను పొందుతారు (సత్కర్మ
చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది).

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః ।


శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ॥ 8 ॥

నీకు నిర్దేశించిన, నియతమైన (మనిషిగా పుట్టినందుకు


వేదములు, శాస్త్రము చెప్పినవి), స్వధర్మమైన, చేయవలసిన సత్కర్మ,
సందేహము లేకుండా తప్పకుండా చేయవలసినదే. సత్కర్మ
చేయకపోతే వచ్చే ఫలితము (పాపము) కంటె, సత్కర్మ ఆచరణ
వలన వచ్చే ఫలితమే గొప్పది.

తత్త్వ జ్ఞాని, శరీరము నేను అనే భావాల లేనివాడు. కాబట్టి


తాను శరీరమును పోషించుకోవాలి అని అనుకోడు. కాబట్టి అతను
కర్మ చేయనక్కరలేదు. కాని నీవు, ఈ శరీరము నాది, దీనిని
పోషించుకోవాలి అని నీ శరీర యాత్రను నీవు నిరంతరమూ
నడిపిస్తూ, దాని కోసము నీవు కర్మలు (భోజనము చేస్తూ, నీరు
త్రాగుతూ, సౌకర్యములు కోసము) చేస్తూ ఉండగా, నీ సత్కర్మ
ఆచరణ చేయను అని అనుకోవటము న్యాయము కాదు.

125
 యజ్ఞార్థా త్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః ।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ॥9॥

యజ్ఞ = విష్ణువు, నారాయణుడు, పరమాత్మ. ఆ పరమాత్మ


కోసము చేసే కర్మలు తప్పించి (ఈశ్వరార్పణ బుద్ధితో, పరమాత్మ
నాకు నిర్దేశించిన సత్కర్మలు కాక), మిగిలిన కర్మలు నాకు ఏదో
ఫలితము రావాలి, అనే కోరికతో, నేను కర్తను (నేను చేస్తు న్నాను అనే
అహంకారముతో) చేసే ఆ కర్మలు బంధనములను తీసుకువస్తా యి.
ఎందుకంటే, వాళ్ళు ఈశ్వరార్పణ బుద్ధితో చేయుటలేదు. నాకు
ఫలితము రావాలి అనే కోరికతో, నేను కర్తను అనే అహంకార
భావముతో చేస్తు న్నారు. కాబట్టి కర్మ బంధనము కలుగుచున్నది.
దానికి పునర్జన్మ ఎత్తవలసినదే.

కుంతీ పుత్రా l అందువలన, ఏ విధమైన సంగము, ఆసక్తి,


సంబంధములు లేకుండా, ఫలితము నాకు రావాలి అనే కోరిక
లేకుండా, నేను చేస్తు న్నాను అనే అహంకార భావన లేకుండా,
పరమాత్మ నన్ను ఈ సత్కర్మ చేయమని నిర్దేశించాడు, పరమాత్మ
ప్రీతి కోసము, ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మలు చేస్తే ఆ సత్కర్మలు
నీకు బంధనములు కావు. వారికి అంతఃకరణ శుద్ధి అవుతుంది.
వారికి పునర్జన్మ ఉండదు.

126
ఉదాహరణ: కౌశికి మహర్షి – కౌశికుడు (బ్రాహ్మణుడు)
వృద్ధు లైన తన తల్లిని, తండ్రిని విడిచి, అడవులలో తపస్సు చేస్తూ
ఉండగా, చెట్టు మీద కొంగ రెట్టవేస్తే, దానిని కోపముతో చూస్తే, అది
మాడి చనిపోయింది (ఆ తపస్సు చాలా కొంచము సిద్ధి కలిగించింది
– చిన్న ఫలితము కలిగిందని సంతోషించాడు). తరువాత భిక్షకు
వెళ్ళితే, ఒక గృహిణి (పతివ్రత), తన భర్తకు సేవ చేసిన తరువాత భిక్ష
వేస్తే, ఆవిడ మీద కోపముతో చూస్తే, నేను కొంగను కాదు నీ కోపమైన
చూపులకు మాడిపోవుటకు అని అంటుంది. ఆ విషయము
ఆవిడకు ఎలా తెలిసిందని అడగగా, ఆవిడ, ప్రక్క ఊళ్ళో ధర్మ
వ్యాధుడు దగ్గరకు వెళ్లి అడగమంది. ఆ కౌశికుడు, ఆ ధర్మ
వ్యాధుడు (బోయవాడు, మాంసము అమ్మే ఒక శూద్రు డు) దగ్గరకు
వెళ్లి అడగగా, అతను చాలా సేపు తరువాత కర్తవ్యము, స్వధర్మము,
పితృదేవతల సేవ, సత్కర్మ గురించి వివరముగా బోధిస్తా డు. అప్పుడు
కౌశికుడు కర్తవ్యము, స్వధర్మము, సత్కర్మ చక్కగా ఆచరించి, రాగ,
ద్వేషములు పోగొట్టు కొని, గొప్ప సిద్ధి కలిగి కౌశికి మహర్షి అయి, ఒక
గోత్రమునకు అధిపతి కూడా అయ్యారు (అత్యుత్తమమైన ఫలితము
లభించింది). ఇది అన్ని వర్గముల వారికీ, అన్ని వృత్తు ల వారికీ
వర్తిస్తుంది.

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।


అనేన ప్రసవిష్యధ్వమ్ ఏష వోఽస్త్విష్టకామధుక్ ॥ 10 ॥
127
ఈ సృష్టి ప్రారంభ సమయములో, ప్రజాపతి (చతుర్ముఖ
బ్రహ్మ దేవుడు) ప్రపంచ సృష్టిని ప్రారంభించి, మానవుల శరీరముల
ఎలా సృష్టి చేయాలనే ఆలోచన కలిగి, భూలోకములో
యజ్ఞములను, వాటితోపాటు మానవులను శరీరములను ఏక
కాలములో సృష్టి చేసి, (నా ఆదేశము ప్రకారమే), ఈ విధముగా
ఉపదేశము చేశారు:

ఓ మానవులారా l “మీకు ఉపకారము చేసే ఉద్దేశముతో,


సాధనములుగా ఈ యజ్ఞములను, మీ కోసమే ప్రత్యేకించి నేను సృష్టి
చేశాను. మీకు తప్ప మరొక జీవికి ఈ యజ్ఞ క్రియ అనేది ఇవ్వలేదు.
ఈ యజ్ఞములను చేసి, అభివృద్ధిని సాధించండి. కామధేనువుని
పితికిన కొద్దీ పాలను ఎలా ఇస్తుందో, అలా ఈ యజ్ఞములను మీరు
చేసిన కొద్దీ, మీ కోరికలు అన్నింటినీ తీరుస్తుంది. ఈ యజ్ఞములు,
మీరు కలిసి ఉండండి. మీరు ఈ యజ్ఞములను ఎప్పటికీ
విడిచిపెట్టవద్దు . యజ్ఞములు మానవుల కర్తవ్యము, యజ్ఞములను
మీరు చేసి తీరాలి. మీ అభివృద్ధి ఈ యజ్ఞములను వాడుకోండి”.

పురుష సూక్తమ్ - ఋగ్వేదము - 10.8.90.1-16 – శాంతి


మంత్రము - యజ్ఞము గురించి చెప్పుతుంది.

128
ఓం తచ్చం॒ యోరావృ॑ణీమహే । గా॒తుం య॒జ్ఞాయ॑ ।
గా॒తుం య॒జ్ఞప॑తయే । దైవీ᳚ స్వ॒స్తిర॑స్తు నః । స్వ॒స్తిర్మాను॑షేభ్యః ।
ఊ॒ర్ధ్వం జి॑గాతు భేష॒జం । శం నో॑ అస్తు ద్వి॒దే
ప ।
శం చతు॑ష్పదే । ఓం శాన్తి ః॒ శాన్తి ః॒ శాన్తి ః॑ ॥ - మనకు ఎవరు
మంగళకరమును అనుగ్రహిస్తా రో ఆయనను ప్రార్ధిద్దా ము.
యజ్ఞములు సవ్యముగా జరగాలని ప్రార్ధిద్దా ము. యజ్ఞములను
చేసేవారిని ప్రార్ధిద్దా ము. మనకు దేవతలు శుభము చేయుగాక.
మానవులందరికీ శుభము కలుగుగాక. చెట్లు , చేమలు ఉర్ధ్వముగా
పెరుగుగాక. మనతో నివసిస్తు న్న రెండు కాళ్ళు జీవులకు, నాలుగు
కాళ్ళు జీవులకు మంగళము జరుగుగాక. శాంతిః – ఆది
ఆధ్యాత్మికము దుఃఖము – శరీరములోపల రోగము లేక దెబ్బ వలన
కలిగే దుఃఖము నుండి శాంతించుగాక. శాంతిః – ఆది భౌతికము
దుఃఖము – ఇతరులు వలన మనకు కలిగే దుఃఖము నుండి
శాంతించుగాక. శాంతిః – ఆది దైవికము దుఃఖము – దైవ
విపత్తు లు భూ కంపము, అగ్ని ప్రమాదములు, భారీ వర్షములు,
వరదలు వలన కలిగే దుఃఖము నుండి శాంతించుగాక.

శ్వేతాశ్వతరోపనిషత్ – 3-15 - “స॒హస్ర॑శీర్-షా॒ పురు॑షః।


స॒హ॒స్రా ॒క్షః స॒హస్ర॑పాత్ । స భూమిం॑ వి॒శ్వతో॑ వృ॒త్వా ।
అత్య॑తిష్ఠద్దశాఙ్గు ॒లమ్” – ఆ పరమాత్మ సహస్ర (అనంతమైన)
శిరస్సులు కలవాడు (అన్నీ తెలుసున్నవాడు), పూర్ణ పురుషుడు,
129
సహస్ర నేత్రములు కలవాడు (అంతటా చూడగలడు), సహస్ర
పాదములు కలవాడు (ఎక్కడికైనా వెళ్ళగలడు). ఆ పరమాత్మ
ప్రపంచమంత బయట లోపల అంతటా వ్యాపించి, అపారమైన
భాగమును అధిష్టించి ఉన్నవాడు. మనకు కనబడుతున్న ఈ
ప్రపంచము అన్నముతో జన్మించి, ఇంతకుముందు
గతించిపోయినది, ఇప్పుడు ఉన్నది, ముందు రాబోతున్నది – ఈ
ప్రపంచము అంతా పరమ పురుషుని పరమాత్మ స్వరూపమే. వేరు
కానేకాదు.

దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః ।


పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ॥ 11 ॥

మీకు ఇచ్చిన ఈ యజ్ఞములు అనే సత్కర్మలు చేసి,


భూలోకము నుండి యజ్ఞ భాగములను దేవతలకు సమర్పించి,
మీరు దేవతలను ప్రీతి, సంతృప్తిపరచండి. అప్పుడు సంతృప్తిపడిన ఆ
దేవతలు, మిమ్ము అనుగ్రహించి మీకు అభివృద్ధిని కలిగిస్తా రు.
(యజ్ఞములు మీకు వర్షము, వాయువు, ఎండ, చంద్రు డి వెన్నెల
ద్వారా ఆహారములో, ఔషధములలో రసము కలిగించే శక్తి, సస్యము
(వృక్ష ఫలములు), పంటలు, ఆహారము, ఔషధములు
కలిగిస్తా యి),

130
మానవులు, దేవతలు పరస్పరము (ఒకరికొకరు)
ఉపకారములు చేసుకోండి. యజ్ఞము (సత్కర్మ ఆచరణ) ద్వారా
మీరు అత్యుత్తమమైన సత్ఫలితములను, మరియు జ్ఞాన ప్రాప్తిని
కూడా పొందుతారు (యజ్ఞములు మానవుల తోబుట్టు వులు).

కఠోపనిషత్ – 2-3-3 – “భయాదస్యాగ్ని స్తపతి, భయా


త్తపతి, సూర్యః l భయాదిన్ద్రశ్చ, వాయుశ్చ, మృత్యుర్దా వతి
పంచమః”.

తైత్తీరీయోపనిషత్ – ఆనందవల్లి - 2-8-1 – “భీషాస్మాద్వాతః


పవతే l భీషోదేతి సూర్యః l భీషాస్మాదగ్ని శ్చేన్ద్రశ్చ l మృత్యుర్ధా వతి
పశ్చమ ఇతి” - పరమేశ్వరుని యొక్క భయముచేత అగ్ని
పదార్ధములను దహించుచున్నాడు, సూర్యుడు తపించుచున్నాడు,
ఇంద్రు డు దేవ లోకమును పరిపాలించుచున్నాడు, వాయువు
వీచుచున్నాడు, పంచముడుగా మృత్యువు శరీరధారులను వారి,
వారి కాల నియతము అనంతరము యమ లోకమునకు
పొందించుచున్నాడు (పరమాత్మ అంటే మానవుల కంటె దేవతలకే
భయము ఎక్కువ. పరమాత్మ నియమములను ఎప్పుడూ
ఉల్లంఘించరు. మానవులకు ఉపకారము చేసినవారికి,
ప్రత్యుపకారము చేసే గుణము లేదేమో కాని, దేవతలు తప్పక
ప్రత్యుపకారము చేస్తా రు).

131
ఇష్టా న్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః ।
తైర్దత్తా నప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ॥ 12 ॥
మానవులు, యజ్ఞ కర్మలతో దేవతలకు భాగము ఇచ్చి వారిని
తృప్తిపరిస్తే, మీ సత్కర్మ ఆచరణతో దేవతలను సంతృప్తిపరిస్తే,
దేవతలు అవసరమైన సమయములలో, మానవులకు (దేవతలు
ప్రకృతిని అనుభవించుటకు అనుకూలముగా చేసి, మరియు
మానవుల శరీరమునకు, ఇంద్రియములకు శక్తి, బలము చేకూర్చి)
భోగములు ఇచ్చి, కోరికలను తీరుస్తా రు.

దేవతలు, మానవులను అనుగ్రహించి, వారు ఇచ్చిన వర్షము


ద్వారా మానవులకు ప్రసాదించిన పంటలను, సరైన మార్గములో
వినియోగించి, యజ్ఞముల ద్వారా తిరిగి దేవతలకు భాగము
సమర్పించ కుండా (పరస్పర సహకారమును చేయకపోతే),
మానవులు ఆ భోగములను అంతా వాళ్ళే అనుభవిస్తే (పంటలను
అంతా వాళ్ళే తినేస్తే), మానవులు దొంగతనము చేసిన వాళ్ళు
అవుతారు.

యజ్ఞశిష్టా శినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః ।


భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ॥ 13 ॥

132
ఎవరైతే యజ్ఞములను చేసి, పుణ్య కర్మలతో దేవతలను
సంతృప్తి పరిచి, ఆ యజ్ఞములు చేసిన తరువాత మిగిలిన యజ్ఞ
శేషమును (దేవతలా ద్వారా లభించిన భోగములని భావించి)
దేవతల ప్రసాదముగా అనుభవిస్తా రో (అన్నములను భుజిస్తా రో,
ఇంద్రియములతో విషయములను గ్రహిస్తా రో), యజ్ఞ శేషమును
అమృతము అంటారు కాబట్టి, యజ్ఞ శేషమును అనుభవించే వారు,
అమృతమును త్రాగుతున్న దేవతల వంటి వారు. వాళ్లను
సత్పురుషులు (దేవతలు) అంటారు. ఏ పాపములు వాళ్ళ దగ్గరకు
చేరవు.

దీనికి భిన్నముగా, ఎవరైతే కేవలము వాళ్లు మాత్రమే


తినుటకు వండుకుంటారో (ఆహారమును పండించి, వంట చేయు
క్రియలలో ఎన్నో జీవులు హింసకు గురి అవుతాయి. దీనికి కొంత
పశ్చాత్తా పముగా దేవతకు సమర్పించాలి), ఎవరైతే వాళ్ళ
ఇంద్రియముల తృప్తి కోసము మాత్రమే పని చేస్తా రో, ఎవరైతే ప్రతి
పనిని వాళ్ళ స్వార్ధము కోసము చేస్తా రో, వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు
పాపములనే తింటున్నారు (వీళ్ళకు యజ్ఞ శేషము అనే అమృతము
దొరకదు). వాళ్ళు మళ్ళీ, మళ్ళీ పాపము అనే పంచనలోనే
(ఆశ్రయములోనే) చేరుతున్నారు.

133
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ॥ 14 ॥
ప్రాణుల యొక్క శరీరములు అన్నము వలన పుట్టి, అన్నము
వలన పెరుగుతాయి. మేఘముల నుండి పడే వర్షము వలన
ధాన్యము, అన్నము కలుగుతుంది.

యజ్ఞము = అర్పించు, సమర్పణ, ఆహుతి, అపూర్వము


(సత్కర్మ చేసిన తరువాత ఆ కర్మ పరిపాకము అయి, ఫలితము
కలుగుటకు కావలసిన సమయము), పుణ్యము (సత్కర్మ).

యజ్ఞముల (పుణ్యము - సత్కర్మ) వలన మేఘము, వర్షము


కలుగుతుంది. మానవుల సత్కర్మ క్రియలతో యజ్ఞములు
సాధ్యపడతాయి. సంసార చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఈ
చక్రము తిరుగుటకు మూలము యజ్ఞ క్రియ. కాబట్టి ఈ యజ్ఞ
క్రియను మానకుండా చేయవలసినదే.

మానవులు యజ్ఞము (పుణ్యము, సత్కర్మ) చేస్తే, దేవతలు


సంతృప్తి పడి, సకాల వర్షములు (పుణ్యమునకు ఫలము)
కురిపించినప్పుడు, ఆ సకాల వర్షముల ద్వారా పంటలను
పండించినప్పుడు, ఆ పంటల ద్వారా వచ్చే అన్నమును తిని, కొత్త,

134
కొత్త శరీరములు పుట్టి, ఆ అన్నముతోనే పెరుగుతాయి. ఇది
నిరంతరమూ ఆగకుండా జరిగే ప్రక్రియ.

తైత్తీరీయోపనిషత్ – ఆనందవల్లి – 2-2, 3 –


“ఆకాశాద్వాయుః l వాయోరగ్నిః l అగ్నేరాపః l అద్భ్యః పృథివీ l
పృధివ్యా ఓషధయః l ఓషధీభ్యోన్నమ్ l అన్నాత్పురుషః”, “స వా ఏష
పురుషోన్నరసమయః, తస్యదమేవ శిరః “ ఆయం దక్షిణః ......” –
సత్య జ్ఞాన అనంత రూపముమగు పరబ్రహ్మము నందు శబ్దమే
గుణముగా కలిగి సమస్త భూతములకు అవకాశము ఇచ్చుచున్న
ఆకాశము పుట్టినది. ఆ ఆకాశము నుండి శబ్ద + స్పర్శ అను రెండు
గుణములు కల వాయువు పుట్టినది. ఆ వాయువు నుండి శబ్ద +
స్పర్శ + రూపము అను మూడు గుణములు కల అగ్ని పుట్టినది. ఆ
అగ్ని నుండి శబ్ద + స్పర్శ + రూప + రస అను నాలుగు గుణములు
కల జలము పుట్టినది. ఆ జలము నుండి శబ్ద + స్పర్శ + రూప +
రస + గంధము అను ఐదు గుణములు కల పృథ్వి పుట్టినది. ఈ
పృథివి నుండి సమస్త సస్యములు, ఔషధములు పుట్టినవి. ఆ
ఔషధముల వలన పాంచభౌతికమైన అన్నము పుట్టినది. ఆ
పాంచభౌతికమైన అన్నము నుండి రేతస్సు తయారయి, ఆ రేతస్సు
నుండి శిరస్సు, హస్తములు, మొదలైన పాంచభౌతికమైన
అవయవములతో కూడిన పురుషుడు (పురుషుడు లేక స్త్రీ) పుట్టెను.

135
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం।
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ॥ 15 ॥

ఏది సత్కర్మ, ఏది దుష్కర్మ, ఏది నీకు విహితమైన,


విధింపబడిన కర్మ, ఏది నీకు నిషిద్ధమైన కర్మ అని చెప్పేది బ్రహ్మ
(వేదము). వేదములు, ఏమాత్రమూ వినాశనము లేని పర బ్రహ్మ
నుండి ఉద్భవించినవి.

వేదములు అన్ని విషయములనూ బోధిస్తోంది. (మానవుడు


కర్తవ్యములను - పుట్టిన దగ్గర నుండి, చివరి క్షణము వరకూ ఏమేమి
చేయాలి, ఏమేమి చేయకూడదు అనే అన్ని విషయములను,
పరమాత్మ తత్త్వమును) ప్రధాన సార భూతమైన సత్కర్మ నిత్యమూ
యజ్ఞము (సత్కర్మ ఆచరణ) చేయమని బోధిస్తోంది.

సృష్టి జరిగిన తరువాత ఈ ప్రపంచము ధర్మ పరముగా


పాలించే కర్తవ్యము పరమాత్మది. అందుచేత ఈ ప్రపంచము
ధర్మముగా నడిపించుటకు, సృష్టి ప్రారంభములోనే పర బ్రహ్మ
యొక్క నిశ్వాస రూపములైన వేదములను ఆ పరబ్రహ్మే,
బ్రహ్మదేవుడికి మరియు అనేక మంది ఋషులకు, ప్రజాపతులకూ
ఉపదేశము చేశాడు. ఈ వేదములలో సంసార చక్రము సవ్యముగా
సాగుటకు యజ్ఞ క్రియను ప్రధానముగా ఉంచాడు.

136
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః ।
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి ॥ 16 ॥

నేను చెప్పిన సంసార చక్రము విధానమును, వైదిక


మార్గమును (వేదము – యజ్ఞములు – వర్షము – పంటలు -
అన్నము – శరీరము – మరలా శరీరము ద్వారా యజ్ఞములు ----)
ఎవరు అనుసరించ కుండా ఉంటారో

వైదిక మార్గములో లేని వారి ఆయుస్సు (జీవితము) పాప


పూరితమైనది. వాళ్లకు ఏది దొరికితే దానిని తింటూ (అన్నము
దొరికితే తింటున్నాడు, కాని ఆ అన్నమును మరలా తినేందుకు,
మరలా పుట్టించే విధానమును పాటించుట లేదు), వాళ్ళ
ఇంద్రియములను వాళ్ళు సంతృప్తి పరచుకుంటున్నారు (ఇది
మానవుల లక్ష్యము కాదు). ఇటువంటి వారు ఈ ప్రపంచములో
వ్యర్ధముగా జీవిస్తు న్నారు. వారి వల్ల ఈ ప్రపంచమునకు ఏ విధమైన
ప్రయోజనము లేదు.

ఈశావాస్యోపనిషత్ – 1 – “ఓం ఈశావాస్య మిదగ్ం సర్వం


య్యత్కించ జగత్యాం జగత్ ........” ఈ జగత్లు అంతా నామ,
రూప, క్రియా రహితమగు ఈశ్వర స్వరూపముగా తిలకించుము
(ఉత్తమమైన, మోక్షము కలుగుటకు జ్ఞాన మార్గము).

137
ఈశావాస్యోపనిషత్ – 2 – “కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషే
చ్ఛతగ్ం సమాః l ఏవం త్వయి నా న్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే” –
శాస్త్ర సమ్మతమైన సత్కర్మలు మాత్రమే చేస్తూ మానవుడు వంద
సంవత్సరములు జీవించాలని కోరుకొనవలెను. జీవితము పైన
మమకారము ఉన్నంత వరకూ దుష్కర్మ మాలిన్యములను
పోగొట్టు కొనుటకు ఇది తప్ప వేరే మార్గము లేదు (జాన
మార్గమునకు అర్హత లేనివారు అందరూ, ముందు వారికి విధించిన
సత్కర్మ ఆచరణ (3-16 శ్లోకము చూడుము) చేస్తూ, అంతఃకరణ
శుద్ధి పొంది, జ్ఞాన మార్గములో ప్రవేశము కొరకు అర్హత
సంపాదించుకునే వరకూ కర్మ మార్గము పాటించ వలసినదే –
సత్కర్మ ఆచరణ చేసుకుంటేనే వారి జీవితమూ సార్ధకము
అవుతుంది. లేకపోతే, వారి జీవితము పాప పూరితమవుతుంది.
మానవులు అభివృద్ధిచెందుటకు వేదములలో, శాస్త్రములలో ఈ
రెండు మార్గములే చెప్పబడినవి. మూడవ మార్గము, దారి లేనే
లేదు).

సత్కర్మ ఆచరణ: మానవుడిగా పుట్టినందుకు, మనకు


వేదములు, శాస్త్రములు చెప్పిన నిర్దిష్టమైన, నిర్దేశించబడిన సత్కర్మ
ఆచరణ (1. నిత్య కర్మలు – ప్రతి మానవుడు తప్పక చేయవలసినవి
– సత్యము పలుకుట, అహింస మొదలైనవి. 2. నైమిత్తిక కర్మలు –
పర్వదినములలో, పండగలలో ప్రతి మానవుడు తప్పక చేయవలసినవి
138
– పితృ శ్రాద్ధములు, గ్రహణ సమయములో స్నానము చేయుట
మొదలైనవి. 3. కామ్య కర్మలు - కోరికలతో చేసే కర్మలు – పూజలు,
వ్రతములు మొదలైనవి) చేసుకుంటే కలిగే పుణ్యము ద్వారా కలిగే
ఫలితము, ప్రయోజనము – భోగము, సుఖము.

ప్రత్యవాయము = మానవుడిగా పుట్టినందుకు, మనకు


వేదములు, శాస్త్రములు చెప్పిన నిర్దిష్టమైన, నిర్దేశించబడిన నిత్య
కర్మలు చేయకపోతే కలిగే దోషము, పాతకము – పూజ్యులను సరిగ్గా
ఆదరించకపోతే, గౌరవించకపోతే మనకు రావలసిన మంచి
ఫలితము ఆగిపోతుంది.

ఉదాహరణ:

1. శ్రీ రాముడి వంశములోని పూర్వీకుడు - దిలీపుడు


మహారాజు స్వర్గ లోకము వెళ్లి, ఇంద్రు డితో మాట్లా డి, తిరిగి
వస్తుండగా, పరధ్యానములో ఉండి, మధ్యలో ఉన్న కల్ప వృక్షమును
పట్టించుకోకుండా, నమస్కారము పెట్టకుండా వచ్చేస్తుంటే, కల్ప
వృక్షమునకు కోపము వచ్చి, వీడు ఏ కార్యము మీద వెళ్ళుతున్నాడో,
ఆ కార్యము వీడికి సిద్ధించకూడదు అని అన్నది. అందుకు,

139
ఆయనకు చాలా కాలము వరకూ సంతానము కలగలేదు. తనకు
కలిగిన ప్రత్యవాయమును తొలగించుకొనుటకు పశ్చాత్తా పము
చేసుకున్న తరువాతే సంతానము కలిగినది.

2. గజేంద్ర మోక్షములోని గజేంద్రు డు – పూర్వ జన్మలో


ఇంద్ర జుమ్నుడు అనే ఒక మహా రాజు. ఆ రాజుగారు వార్ధక్యము
వచ్చినదని, రాజ్యము వదిలేసి, అడవిలో తపస్సు చేసుకుంటుంటే,
అటువైపు అగస్య మహర్షి వచ్చారు. బయట అగస్య మహర్షి
వచ్చాడని తెలిసి కూడా, ఆయనతో తనకేమీ పనిలేదని, ఆయనను
ఏమీ పట్టించుకోలేదు. అగస్య మహర్షికి కోపము వచ్చి, నేను వచ్చినా
ఏనుగులా కూర్చొని ఉన్నందుకు, నీవు ఏనుగుగా పడిపో అని
శపించారు. అందుకు ఆయన తరువాత జన్మలో ఏనుగుగా
జన్మించాడు.

పాపము: మానవుడిగా పుట్టినందుకు, మనకు వేదములు,


శాస్త్రములు చెప్పిన నిషేధమైన కర్మలు చేసుకుంటే కలిగే పాపము
ద్వారా కలిగే ఫలితము – కష్టము, దుఃఖము.

 యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ।


ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే ॥ 17 ॥

140
కేవలమూ ఇంద్రియములను సంతృప్తి పరచుకుంటూ
జీవితమూ గడిపే, జీవితములో దిగజారిన మానవుడు, అతని కంటె
కొంచము పై స్థా యిలో, సత్కర్మలు చేసుకుంటూ జీవితమూ గడిపే
సాధారణ మానవుడు. వీళ్ళ కంటె భిన్నముగా మరొక
మహానుభావుడు – ఆత్మరతిః – తనలో తాను రమించువాడు (తన
ఆత్మలో ఉన్న పరమాత్మతో క్రీడించువాడు.

ఆత్మ స్వరూపము (పరమాత్మ స్వరూపము) యందు


మాత్రమే ప్రీతి కలిగినవాడు, (ప్రీతి = ప్రేమ, అనుకూలమైన భావన)
(సాధారణ మానవులకు తన ఆత్మ యందు సహజముగా ప్రీతి ఉన్నా,
మిగిలిన జీవులు, వస్తు వులు, ప్రాపంచకమైన భోగములు, సుఖములు
పైన కూడా ప్రీతి ఉంది),

తన ఆత్మ తత్త్వము నందే సంతృప్తి కలవాడు, (తృప్తి =


ఏదైనా దుఃఖము, కష్టము కలిగి, అది పోయిన తరువాత కలిగే
సుఖము – ఆకలి వేసినప్పుడు, మొదటి ముద్ద తిన్నప్పుడు కలిగే
సుఖము) పరమాత్మ స్వరూపము యందే సంతోషము కల సిద్ధు డికి
(సంతోషము = మనకు లేనిది లేదా మనము పోగొట్టు కున్నది
మనకు దొరికితే కలిగే భావన) వేరే ఇతర ప్రాపంచకమైన
విషయములతో సంతోషము కలగనివాడు) ఏ కర్మ ఆచరణ అనేది

141
అక్కరలేదు, చేయవలసిన అవసరము లేదు. అటువంటి వారికి కర్మ
మార్గముతో సంబంధము లేదు.

బృహదారణ్యకోపనిషత్ – 1 లేదా 3-4-8 – “తదేత త్ప్రేయః


పుత్రాత్ప్రేయో విత్తా త్ప్రేయో న్యస్మాత్సర్వస్మాద న్తరతరం
యదయమాత్మా స యోన్యమాత్మనః ప్రియం బ్రు వాణం .....” – ఈ
ఆత్మ మిక్కిలి ప్రియమైనది. పుత్రు ని కంటె, ధనము కంటె, ఆత్మే
ప్రియమైనది. ఇంకనూ ఏయే పదార్ధములు శ్రేష్టమైనవో, వాటన్నిటి
కంటె ఆత్మ ప్రియమైనది. ఆత్మ మన స్వరూపమే అయి ఉన్నది.

 నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన ।


న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ॥ 18 ॥

కేవలము ఆత్మ తత్త్వము యందే సంతోషము కల సిద్ధు డికి,


జ్ఞాన మార్గములో (జ్ఞాన నిష్ఠలో) ఉన్నవాడికి, సత్కర్మ ఆచరణ
చేసుకొని, ఏదో మంచి ఫలితము, ప్రయోజనము పొందవలసిన
అవసరము లేదు. అతను ఏ సత్కర్మ ఆచరణ చేయక పోయినా,
అతనికి ఏ విధమైన అనర్థము, దుష్ఫలితము కలగదు.

ఆ సిద్ధు డికి, ప్రపంచములోని ఏ జీవుల, వస్తు వు మీద, ఏ


విధమైన కోరిక, ఆశ లేదు. అందుచేత అతనికి ఏ విధమైన సత్కర్మ
ఆచరణ చేయవలసిన అవసరము లేదు.
142
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః ॥ 19 ॥

నీకు అలాంటి ఆత్మ రతి కాని, ఆత్మ తృప్తి కాని ఆత్మ


సంతుష్టి కాని లేనందున, నీవు సత్కర్మ మార్గములోనే ఉండి తీరాలి.

ఆ సత్కర్మ ఆచరణ చేసేటప్పుడు, ఏ రకమైన ఆసక్తి,


సంబంధము లేకుండా, ఆ సత్కర్మకు ఏదో ఫలితము దక్కాలి అనే
ఫలాపేక్ష లేకుండా, ఆ సత్కర్మకు నేనే కర్తను అనే అహంకారము,
అహంభావము కాని లేకుండా, ఎల్లప్పుడూ నీవు నిర్వహించవలసిన
సత్కర్మలను చేస్తూ ఉండు.

ఏ జీవి అయినా సరే, ఆసక్తి లేని సత్కర్మ ఆచరణ చేస్తూ


ఉంటే, అత్యుత్తమమైన ఫలితమును (జ్ఞాన మార్గము లోనికి
ప్రవేశమునకు అర్హత కలుగుతుంది) పొందుతారు.

ఉదాహరణ: పనస పండును కోసేటప్పుడు. కత్తికి, చేతులకు


నూనె రాసుకొని (ఆసక్తి లేకుండా, అసంగమముతో, ఫలాపేక్ష
లేకుండా చేసే కర్మలు) కోస్తే ఆ పనస పండు యొక్క పాల జిగురు
అంటుకోకుండా ఉంటుంది. నూనె రాసుకోపోతే (ఆసక్తితో,

143
సంగమముతో, ఫలాపేక్షతో, నేనే కర్తను అనే అహంభావముతో చేసే
కర్మలు) ఆ పాల జిగురు అంటుకుంటుంది.

 కర్మణై వ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః ।


లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తు మర్హసి ॥20॥

సీతాదేవి తండ్రి, విదేహ రాజ్యమును పాలిస్తు న్న జనక


మహారాజుగారు, అశ్వపతి మహారాజుగారు (అలా చాలామంది)
సత్కర్మ ఆచరణలోనే ఉండి, వాళ్ళు సిద్ధిని పొందారు. (క్రమముగా
చిత్త శుద్ధి పొంది, జ్ఞాన మార్గము లోనికి ప్రవేశము పొంది, ఆ జ్ఞాన
మార్గములో సాధన చేసుకొని సిద్ధిని పొందారు)

సత్కర్మ ఆచరణ చేస్తే, తత్త్వ జ్ఞానము వరకూ ఉండే అన్ని


ఫలితములు లభిస్తా యని అనే విషయమును, లోకములో చాటించి
చెప్పుటకు, వాళ్ళు జ్ఞాన మార్గములో ఉన్నా సరే, వాళ్ళు సత్కర్మ
ఆచరణ చేస్తూ, అందరికీ అలా కనిపిస్తూ, వాళ్ళలాగ సత్కర్మ ఆచరణ
చేయమని చెప్పుతున్నారు. దీనిని నీవు దృష్టిలో ఉంచుకొని, నీవు
కూడా అలా సత్కర్మ ఆచరణ చేయి. లోకములో కొంతమంది నిన్ను
చూసి, వాళ్ళు కూడా నిన్ను అనుసరించి సత్కర్మ ఆచరణ చేస్తా రు.

విదేహ రాజ్యమును పాలిస్తు న్న జనక మహారాజుగారు, గొప్ప,


గొప్ప బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించి బహు దక్షిణ
144
యజ్ఞము చేసి, వెయ్యి ఆవుల ఒక్కొక్క కొమ్ము మీద పది బంగారు
నాణెములు తొడిగి,

బృహదారణ్యకోపనిషత్ – 3 లేదా 5-1-2- “తాన్ హోవాచ


బ్రహ్మణా భగవన్తో l యో వో బ్రహ్మిష్ఠః స ఏతా గా ఉదజతామితి I హ
బ్రాహ్మణా న దద్రు మరథ హ యాజ్ఞవల్క్యః స్వమేవ బ్రహ్మచారిణ
మువాచైతాః....” – ఓ బ్రాహ్మణోత్తములారా l మీలో ఎవరైతే
బ్రహ్మనిష్టు లో ఉన్నారో, వాళ్ళు ఈ గోవులను తీసుకుపోవచ్చు. అని
అన్నారు. అందరూ ఆశ్చర్యముగా చూస్తూ ఉన్నారు. అప్పుడు
యాజ్ఞవల్క్య మహర్షి, తన శిష్యుడు సామశ్రవుడితో, ఈ గోవులను
తమ ఆశ్రమమునకు తీసుకుపొమ్ము అని ఆజ్ఞ చేశారు. అప్పుడు
కొంతమంది బ్రాహ్మణులు ప్రతిఘటించగా, యాజ్ఞవల్క్య మహర్షి
“నమో వయం బ్రహ్మిష్ఠా య కుర్మో గో కామా ఏవ వయగ్ం స్మ ఇతి
తగ్ం హ తత ఏవ ప్రష్టం దద్రే హోతాశ్వలః” – అప్పుడు యాజ్ఞవల్క్య
మహర్షి నేను బ్రహ్మవేత్తలకు నమస్కరిస్తు న్నాను. (నేను బ్రహ్మ వేత్తను
అని చెప్పను – ఆత్మ చైతన్య (జ్ఞాన) స్వరూపము. కాబట్టి ఆత్మకు
జ్ఞానము బయట నుండి పొందవలసిన అవసరము లేదు. ఆత్మను
మాయ (అజ్ఞానము) ఆవరించి ఉన్నందున, ఆ జ్ఞానము కప్పబడి
ఉన్నది. అజ్ఞానము తొలగిపోతే, జ్ఞానము తనంతట తానే
ప్రకాశిస్తుంది). ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే వాటికి నేను సమాధానము
చెప్పుతాను. లేదా నేను ప్రశ్నిస్తా ను. మీలో ఎవరైనా సమాధానము
145
చెప్పండి) నా ఆశ్రమములో, యజ్ఞములకు, శిష్యులకు గోవు పాలు
చాలా అవసరము. మేము గోవుల పైన కోరికతో తీసుకొని
వెళ్లు తున్నాము. అని అన్నారు. అప్పుడు ఋత్విక్కులు అందరూ,
యాజ్ఞవల్క్య మహర్షి బ్రహ్మ జ్ఞానమును పరీక్షించుటకు (ఆశ్వలుడు,
ఆర్తబాగుడు, ఉషస్తు డు, కహోళుడు, ఉద్దా లకుడు, శాకల్యుడు)
చాలా ప్రశ్నలు అడుగుతారు. యాజ్ఞవల్క్య మహర్షి అన్నింటికీ
చక్కగా సమాధానములు చెప్పారు. వాళ్ళందరూ ఓటమిని
అంగీకరించారు. తరువాత పచక్నుని పుత్రి గార్గి, యాజ్ఞవల్క్య
మహర్షిని చాలా ప్రశ్నలు వేసి, వాటి అన్నింటికీ చక్కగా యాజ్ఞవల్క్య
మహర్షి సమాధానము చెప్పారు. కాబట్టి యాజ్ఞవల్క్య మహర్షితో
వాదన విరమించుట మంచిది, అని అన్నది (బృహదారణ్యకోపనిషత్
– 3 లేదా 5-8-12).

తరువాత జనక మహారాజు కూడా కొన్ని ప్రశ్నలు వేశారు.


వాటి అన్నింటికీ చక్కగా యాజ్ఞవల్క్య మహర్షి సమాధానము
చెప్పారు. అప్పుడు జనక మహారాజు, యాజ్ఞవల్క్య మహర్షి
పాదములకు నమస్కరించి, నాకు బ్రహ్మ విద్యను బోధించుము అని
ప్రార్థించెను. (బృహదారణ్యకోపనిషత్ – 4 లేదా 6-2-1).
యాజ్ఞవల్క్య మహర్షి , జనక మహారాజుకు తత్త్వ జ్ఞానమును
బోధించాడు. జనక మహారాజు తత్త్వ జ్ఞానము పొందిన తరువాత
కూడా సత్కర్మ ఆచరణ చేస్తూ ఉండేవారు. అలాగే అశ్వపతి
146
మహారాజు, జానసృతి మహారాజు, ప్రదర్డు న మహారాజు
మొదలైనవారు కూడా తత్త్వ జ్ఞానమును పొందారు.

బృహదారణ్యకోపనిషత్ – 4 లేదా 6-5-1 యాజ్ఞవల్క్య


మహర్షికి కాత్యాయని, మైత్రేయి ఇద్దరు భార్యలు. వాళ్లను పిలిచి,
నాకు చాలా మందు మహారాజులు చాలా సంపదలను ఇచ్చారు.
నేను ఆ సంపదలను మీ ఇద్దరికీ సమానముగా పంచి, నేను
సన్యాసము తీసుకొని, అడవులకు వెళ్ళిపోతాను అని చెప్పారు.
కాత్యాయని మీకు ఎలా తోస్తే అలా చేయమని ఒప్పుకుంది. రెండవ
భార్య మైత్రేయి బృహదారణ్యకోపనిషత్ – 6-5-4 – “యేనాహం
నామృతా శ్యాం కి మహం తేన కుర్యాం యదేవ భగవాన్వేత్ద త దేవ
మే బ్రూ హీతి” – నేను దేనిచేత ముక్తు రాలను కానో ఆ సంపదలు
నాకెందుకు? దేనిచేత బ్రహ్మమును తెలుసుకోగలరో దానిని నాకు
బోధించుము అని అడిగెను. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి
మైత్రేయికి ఆత్మ స్వరూపమును చక్కగా బోధించి
(బృహదారణ్యకోపనిషత్ – 4 లేదా 6-5-5 నుండి 6-5-15 వరకూ),
తరువాత సన్యాసము తీసుకొని అడవులకు వెళ్ళిపోయాడు.

అశ్వపతి మహారాజు, తత్త్వ జ్ఞానము కలిగి ఉన్నవాడు,


నిరంతరమూ సత్కర్మ ఆచరణ, యజ్ఞములు (లోక సంగ్రహము
కోసము) చేస్తూ ఉండేవాడు. యజ్ఞములో భాగస్వాములు అయిన

147
విద్వాంసులకు ఆశ్వపతి మహారాజు దక్షిణలు ఇస్తే, వాళ్ళు దక్షిణలను
నిరాకరించారు. ఆశ్వపతి మహారాజు దక్షిణలను ఎందుకు
నిరాకరిస్తు న్నారు అని అడగగా, వాళ్ళు మాకు దక్షిణలు వద్దు . మాకు
తత్త్వ జ్ఞానము దక్షిణగా ఇవ్వండి అని అడిగారు. అందుకు ఆశ్వపతి
మహారాజు సంతోషించి, వాళ్లకు తత్త్వ జ్ఞానము ఉపదేశము చేశారు.

యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః ।


స యత్ప్ర మాణం కురుతే లోకస్తదనువర్తతే॥21॥

ఈ లోకములో పెద్ద మనుష్యులు, శ్రేష్ఠు లు, కీర్తి కలిగినవారు


ఉన్నారు. ఆ శ్రేష్ఠు లు ఏ రకముగా ఉంటే, సాధారణ మానవులు అదే
విధముగా నడచుకోవాలి అని అనుకుంటారు.

ఆ శ్రేష్టు డు మంచి ప్రమాణములను (వేదములను, ధర్మ


శాస్త్రములను, పురాణములను, ఇతిహాసములను) అనుసరించి,
వాటిలో ఉన్నట్లు నడచుకుంటే, అతనిని అనుసరించే సాధారణ
ప్రజలు కూడా, ఆ ప్రమాణములనే అనుసరించి, అదే విధముగా
ప్రవర్తిస్తూ, వ్యవహరిస్తూ ఉంటారు.

న మే పార్థా స్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన ।


నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ॥ 22 ॥

148
నాకు, ఈ లోకములో కాని, పై లోకములో కాని, ఆ పై
లోకములో కాని (మూడు లోకములలో), నేను ఏదో చేసి
సాధించుకోవలసినది ఏదీ లేదు.

నేను పొందదగినది, నేను పొంద లేనిది, నేను


పొందవలసినది కొత్తగా ఏదీ లేదు. అలా ఉన్నా సరే (నేను
పరమాత్ముడిని అయినా సరే, ఇతరులకు ఆదర్శముగా
నడుస్తు న్నాను), నేను కర్మ మార్గములో ఉంటూనే ఉన్నాను.

ఈశ్వరుడి లక్షణములు - “కర్తుం అకర్తుం సమర్ధ కర్తే పరెన్


న కర్తే పరన్ య ఖుసి టై కర్తే పరెన్ సైహచ్చే ఈశ్వరః” – ఎవడైతే
అన్నీ చేస్తా డో, ఎవడైతే ఏమీ చేయడో, ఎవడైతే సమర్ధవంతుడో,
ఎవడైతే ఏ రకముగానైనా చేయకలడో, ఏమీ చేయడో – ఎవడైతే
అన్ని హక్కులు తనలోనే ఉంచుకున్నాడో అతడే ఈశ్వరుడు.

ఈశావాస్యోపనిషత్ – 4 – “అనేజదేకం మనసో జనీయో


నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ .....”. పరమాత్మ ఒక్కటే చలన
రహితమైనది. అయినా మనస్సు కంటె మహా వేగము కలది.
ఇంద్రియములకు చిక్కదు. నిత్యమైనది, స్థిరమైనది, అయినా
అన్నింటినీ దాటి పోతున్నది.

149
“యచ్ఛాప్నోతి య దాదత్తే యచ్ఛాతి విషయా నిహ య
చ్ఛాస్య సంతతో భావ స్తస్మా దాత్మేతి కీర్త్యతే” – ఈ ప్రపంచము
అంతా వ్యాపించి ఉన్న స్వరూపమే ఆత్మ తత్త్వము (8 వ
అధ్యాయము, 22 వ శ్లోకము చూడుము)

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః ।


మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ॥ 23 ॥

నేను సన్మార్గములో ఉంటూ, ఏ మాత్రమూ బద్ధకము,


ఆలస్యము లేకుండా సత్కర్మ ఆచరణ చేస్తూ, ఇతరులకు
ఆదర్శముగా ఉండకుండా, ఇతరులను సన్మార్గములో ఉండండి
అని కేవలము ఉపదేశము మాత్రమే చేసి ఉంటే,

నేను ఎలా చేస్తే, అలా మనుష్యులు అందరూ నన్ను


అనుసరిస్తా రు. అప్పుడు చాలా ప్రమాదమునకు దారి తీస్తుంది, పార్థా
l

ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం।


సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ॥ 24 ॥
నేను కనక సత్కర్మ ఆచరణ చేయకుండా, ఆదర్శ
మార్గములో నడవకుంటే, నేను జగత్లు రక్షణ చేయకుంటే,
లోకములు అన్నీ బద్దలైపోతాయి.

150
ధర్మ సంకరమునకు (కలగలుపుకు) నేనే కారణము
అవ్వవలసి వస్తుంది. నేను సృష్టించుకున్న నా ప్రజలను (జీవులు నా
అంశములే), నేనే దెబ్బతీసినట్లు అవుతుంది. నేను సృష్టించుకున్న,
నా ప్రపంచమును, నేనే నాశనము చేసుకున్నట్లు అవుతుంది.

జీవులకు, వస్తు వులకు మధ్య ధర్మమే వారధిగా ఉండాలి ఆ


వారధిని (సేతువును) సరిగ్గా చూసుకునే బాధ్యత నాదే. కాబట్టి ఆ
ధర్మమును నేను ఆచరించి, ప్రజలకు ఆదర్శముగా ఉంటూ, ప్రజలను
ప్రోత్సహిస్తూ ఉంటాను.

సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత।


కుర్యాద్విద్వాం స్తథాసక్త చికీర్షుర్లోకసంగ్రహం ॥ 25 ॥

కర్మ ఫలముల కోసము ఆసక్తితో చేసే ఏమీ తెలియని


సామాన్య సాధకులు, ఏ సత్కర్మ ఆచరణ చేస్తే అభివృద్ధి చెందుతారో,
ఆ సత్కర్మ ఆచరణను బాగా తెలుసున్న, తత్త్వ జ్ఞానము కలిగిన
విద్వాంసులు శ్రద్ధగా, కర్తృత్వ భావన లేకుండా, ఫలాపేక్ష లేకుండా
(వారు కూరుకుపోకుండా) ఆచరించి చూపించాలి.

151
ఇలా చేస్తే సర్వోత్తమమైన ఫలితము లభిస్తుందని, సాధారణ
మానవులను ప్రోత్సహిస్తూ, వారికి సరైన దారి చూపించుటకు,
అందరినీ ఉద్దరించుటకు ఇలా చేస్తూ ఉండాలి.

న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం ।


జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తస్సమాచరన్ ॥ 26 ॥

ఏమీ తెలియని సాధారణ సాధకులు సత్కర్మ ఆచరణ


చేయాలనే ప్రయత్నములో ఉన్నవాళ్లు , ఈ సత్కర్మకు కర్తను నేను,
ఈ సత్కర్మ యొక్క ఫలితము నాకే రావాలి అనే బుద్ధితో చేస్తూ
ఉంటారు. జ్ఞానులు, విద్వాంసులు – సత్కర్మలతో ఫలితము ఏమీ
ఉండదు. జ్ఞానము వల్లనే సర్వోత్తమమైన ఫలితము ఉంటుంది అని
అనవసరమైన సందర్భములలో చెప్పుతూ, ఆ సత్కర్మ ఆచరణ చేసే
వారి బుద్ధిని చెడగొట్టకూడదు.

జ్ఞానులు, విద్వాంసులు ఆ సత్కర్మ ఆచరణలు అన్నీ


ఏమాత్రము ఆటంకము లేకుండా, సమతా భావముతో ఆచరిస్తూ,
సాధారణ సాధకులకు ఆ సత్కర్మ ఆచరణ మీద ప్రీతి, ఉత్సాహము
కలిగేటట్లు చేయాలి. వారిని ప్రీతి పూర్వకముతో ప్రేరేపించాలి.
(పరమాత్మ ఉద్దేశము సాధారణ సాధకులు సత్కర్మలు చేస్తూ,
అంతఃకరణ శుద్ధి కలిగి, క్రమేణా జ్ఞాన మార్గములోకి ప్రవేశిస్తా రు)

152
 ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।
అహంకారవిమూఢాత్మా కర్తా హమితి మన్యతే ॥ 27 ॥

త్రిగుణాత్మకమైన (సత్త్వ, రజో, తమో గుణములతో కలిసి


ఉన్న) మూల ప్రకృతితో, ఈ ప్రపంచము, మన శరీరములు,
ఇంద్రియములు, అవయవములు అన్నీ సృష్టి చేయబడ్డా యి.

ఈ శరీరముతో చేసే అన్ని కర్మలు కూడా ఆ మూల ప్రకృతి


ద్వారా మనకు సంక్రమించిన గుణముల కార్య పరంపరకు
చెందుతాయి, ప్రకృతి యొక్క వికారములు. కాని ఆత్మకు
(వ్యాపకమైన, ఆనంద స్వరూపమునకు) ఈ మూడు గుణములకు
ఏ మాత్రమూ సంబంధము ఉండదు. “నేను (ఆత్మ) పని (కర్మ –
ప్రకృతి) చేస్తు న్నాను” అనే మాటకు ఏ మాత్రము సంబంధము
లేదు.

ఆత్మను మరియు శరీరమును విడివిడిగా చూడకుండా,


నేను (ఆత్మ) అనే భావనను ఈ శరీరముతో ముడిపెట్టి, ఈ శరీరమే
నేను (అహంకారము) అనే తెలివి తక్కువ భ్రమలో పడి, ఆత్మకు,
శరీరము అనే పరిధిని ఏర్పరచుకొని – “నేను (ఆత్మ) ఈ పనికి
చేస్తు న్నాను (కర్తను, బాధ్యుడిని)” అని అనుకుంటూ, మోహములో
కూరుకు పోయి, ఆత్మ స్వరూపముకు, శరీర గుణములు

153
ఆరోపిస్తూ, ఆ కర్మల ఫలితములు కూడా ఆత్మకు కట్టబెట్టి, ఆత్మకు
సంసార చక్రములో బంధనము మనమే కలిగిస్తు న్నాము.

 తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః ।


గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే॥28॥

గొప్ప బాహువులు కల అర్జు నా l తత్త్వజ్ఞాని ఆత్మ (నేను)


స్వరూపము యొక్క మూలము - పరమాత్మ, ప్రకృతి యొక్క
తత్త్వములను బాగా అర్ధము చేసుకొని, ప్రకృతిలో ఏ, ఏ గుణములు
ఉన్నాయి?, ఆ గుణముల అంతరము, బేదములు ఏమిటి?, ఆ
గుణముల ద్వారా వచ్చే వస్తు వులు, కర్మలు ఏమిటి? ఏ క్రియ
జరిగినా, ఆ, ఆ గుణముల పరిణామము మాత్రమే.

అంతటా వ్యాపించి ఉన్న ఆకాశములో ఏ విధమైన కదలిక


ఎలా ఉండదో, అలా సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మ స్వరూపములో ఏ
క్రియ జరిగే అవకాశము లేదు. ఈ విభాగములను స్పష్టముగా
తెలుసుకున్న తత్త్వ జ్ఞాని (ఈ శరీరము నేను కాదు అనే నిర్ణయము
చేసుకొని, ఆత్మకు, శరీరముతో ఏ విధమైన సంబంధము
పెట్టు కోడు).

ఒక వస్తు వును, కన్ను/మనస్సు అనే ఇంద్రియములతో


చూచుట – వస్తు వు ప్రకృతి యొక్క ఒక గుణము యొక్క
154
వికారము/పరిణామము, కన్ను, మనస్సు అనే ఇంద్రియములు
ప్రకృతి యొక్క మరొక గుణము యొక్క వికారము/పరిణామము.
ఇది వస్తు వుకు, కన్ను/మనస్సు అనే ఇంద్రియములకు మధ్య ఉన్న
సంబంధమే. కాని, ఆత్మ అయిన నేను, నాకు ఏ విధమైన
సంబంధము లేదు. తత్త్వజ్ఞాని ఇలా ఆలోచించి, ఆ విషయమును
తన లోపలకి తీసుకోకుండా - ఆ వస్తు వును నేను చూస్తు న్నాను అని
అనుకోకుండా, ప్రకృతి యొక్క గుణములతో, ఏ విధమైన
సంబంధము పెట్టు కోవట లేదు.

ప్రకృతేర్గుణసంమూఢాః సజ్జంతే గుణకర్మసు ।


తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ ॥ 29 ॥

సాధారణ ప్రజలు, ప్రకృతి యొక్క మూడు గుణములను,


తమకు తాము కలుపుకొని (సర్వ వ్యాపకమైన ఆత్మ (నేను)
స్వరూపమును, పరిమితమైన గుణములతో - శరీరముతో
కలుపుకొని), ఆ గుణములతో పరిణామమైన శరీరమే నేను అని
అనుకుంటున్నారు. అప్పుడు ఆ త్రిగుణాత్మకమైన శరీరము ఏ కర్మ
చేసినా, ఆ కర్మకు నేనే కర్తను అని అనుకుంటూ, నేను చేసిన కర్మకు
ఫలితము నేనే అనుభవించాలి అని ఆ కర్మతో, ఆ కర్మ ఫలముతో
సంబంధము పెట్టు కుంటారు.

155
వాళ్ళు తెలిసీ, తెలియని వాళ్ళు. అందుచేత వాళ్ళు తెలివి
తక్కువ వాళ్ళు. అలాంటి తెలివి తక్కువ వాళ్లను, అన్నీ తెలుసున్న
తత్త్వజ్ఞాని, తత్త్వ జ్ఞానము గురించి చెప్పుతూ వాళ్లను గందరగోళ
పరచకూడదు. (నీవు శాస్త్రముల ద్వారా నిర్ణీతమైన సత్కర్మ ఆచరణ
చేస్తూ, నీ అవసరమైన కోరికలను తీర్చుకుంటూ, అధర్మ ఆచరణ
చేయకుండా, కోరికలు తగ్గించుకుంటూ ఉన్నత స్థితికి వెళ్ళే మార్గము
ఇంకొకటి ఉన్నదని తెలుసుకో అని మాత్రమే చెప్పాలి).

మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మ చేతసా ।


నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ॥ 30 ॥

ఉన్నత స్థా యికి వెళ్ళాలనే అభిలాష కల సాధారణ సాధకులు,


వాళ్ళు చేసే ప్రతి కర్మ నేను చేస్తు న్నాను అనే భావనని (కర్తృత్వ
భావన), నేను చేసిన కర్మకు ఫలితము నాకే దక్కాలి అనే కోరిక
పూర్తిగా విడిచి పెట్టి, చేసే కర్మలు అన్నీ పరమాత్మ ప్రీతి కొరకు చేస్తూ,
ఆ కర్మ ఫలములను పరమాత్మకు అర్పిస్తూ, పరమాత్మ ఆజ్ఞను
అనుసరించి, నేను ఈ కర్మను పరమాత్మ కోసము పరమాత్మ యొక్క
సేవకుడిలా చేస్తు న్నాను అనే భావనతో

ఏ రకమైన కోరిక లేకుండా, మమతా (నేను, నాది, నా అనే)


భావనకు దూరముగా ఉంటూ, ఏ రకమైన శోకము, సంతాపము

156
(ఆవేశము, విచారము) లేకుండా, నీ కర్తవ్యమైన యుద్దమును నీవు
చేయము. నీవు నీ యుద్దమును మానవద్దు .

మనలో ఉండే రాజస, తామస గుణముల యొక్క చెడ్డ


గుణములతో, చెడ్డ భావనలతో, అరిషడ్వర్గములతో (6) – 1.
కామము, 2. క్రోధము, 3. లోభము, 4. మోహము, 5. మదము, 6.
మాత్సర్యములతో మరియు అధర్మముతో, ధర్మము యుద్ధము
చేయవలసినదే.

యే మే మతమిదం నిత్యమ్ అనుతిష్ఠంతి మానవాః।


శ్రద్ధా వన్తో నసూయన్తో ముచ్యంతే తేఽపి కర్మభిః ॥ 31 ॥

ఏ మానవుడు కర్మల కర్తృత్వ భావన, కర్మ ఫలములు


విడిచిపెట్టి, కర్మ ఫలములు పరమాత్మకు సమర్పించి, సమతా
భావముతో సత్కర్మ ఆచరణ చేయాలి అనే సిద్ధాంతమును చక్కగా
నిరంతరమూ అనుసరిస్తా డో,

పరమాత్మ మీద శ్రద్ధతో ఉంటూ (విశ్వాసము, నమ్మకము),


అసూయ (ఒకరి సద్గుణముల పైన దోషములు ఆరోపించుట)
లేకుండా ఉంటే, వాళ్ళు అన్ని కర్మ బంధనముల నుండి విముక్తు లు
అవుతారు. వీరు క్రమముగా జ్ఞాన మార్గములో ప్రవేశించి, తత్త్వ
జ్ఞానము పొంది, పరమాత్మను పొందుతారు.
157
శ్రద్ధ, విశ్వాసము, నమ్మకము, ఆస్తిక్య బుద్ధి, పరమాత్మ
ఉన్నాడనే నమ్మకము.

కఠోపనిషత్ – 1-2-6 – “అయం లోకో నాస్తి పర ఇత మానీ


పునః పునర్వశమాపద్యతే మే” – అజ్ఞానికి, కోరికలు, ధనము
మోహము కలవారికి, నేను ఉన్న ఈ భూలోకమే వాస్తవము.
ఇంతకంటే పర లోకము అనేది లేనే లేదు. ఇలా తలంచేవాడు,
మరలా, మరలా నా వశము అవుతున్నారు, అని మృత్యు దేవత
(యముడు) పలుకుచున్నాడు.

యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం ।


సర్వజ్ఞాన విమూఢాంస్తా న్ విద్ధి నష్టా నచేతసః॥32॥

ఎవరైతే నా మీద అసూయతో (నా మీద దోషారోపణతో)


నేను చెప్పిన ఉత్తమ సిద్ధాంతములు అనుసరించకుండా ఉంటారో,
సత్కర్మలు ఆచరించరో,

అటు బ్రహ్మ జ్ఞానము లేకుండా, ఇటు కర్మ జ్ఞానము


లేకుండా, రక రకముల వ్యామోహములతో (అజ్ఞానముతో),
వివేకము (దేహము, ఆత్మ వేరు అనే భావన) కోల్పోయి, ఏమీ

158
చేయలేని స్థితిలో, తమ జీవితమును వ్యర్ధము చేసుకొని, వాళ్ళు
చాల నష్టపోతున్నారు.

ఉదాహరణ:

మహాభారతము అశ్వమేధ పర్వములోని కధ - ఒక గొప్ప


తపస్వి ఉదంకుడు, మహాభారత యుద్దము తరువాత, ఇంత జన
నష్టము జరిగినది బాధతో, పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఆ
యుద్దమును ఆపలేదని, దానికి శ్రీకృష్ణుడే బాధ్యుడని కోపముతో,
అడవికి వెళ్లి తపస్సు చేసుకుంటుంటే, శ్రీకృష్ణుడు హస్తినాపురము
నుండి ద్వారకకు వెళ్ళుతూ, దారితప్పి వచ్చానని నెపము చెప్పగా,
ఉదంకుడు కోపముతో ఇంతమంది జన క్షయమునకు నీవే
కారణము, నిన్ను నేను శాపిస్తా ను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ
యుద్దమును ఆపుటకు నేను ఎంతో ప్రయత్నించాను. కాని కౌరవులు
నా మాట వినలేదు, నేను విశ్వరూపమును ప్రదర్శించినా (నా
పరమాత్మ తత్త్వమును) వాళ్ళకు అర్ధము కాలేదు, నన్ను
నమ్మలేదు. దానికి వాళ్ళ, వాళ్ళ జన్మలతో వచ్చిన కుసంస్కారములే
కారణము అని వివరించాడు. అప్పుడు ఉదంకుడు అర్ధము
చేసుకొని, శాంతించి, అర్జు నుడికి ప్రదర్శించిన విశ్వరూపమును నేను
కూడా చూడాలని ఉంది, చూపించమని శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు.
శ్రీకృష్ణ పరమాత్మ ఉదంకుడికి తన విశ్వరూపము చూపించాడు.

159
శ్రీ కృష్ణుడు, ఉదంకుడితో ఏదైనా కష్టముగా ఉందా అని
అడిగితే, ఉదంకుడు ఇది ఎడారి ప్రదేశము, ఇక్కడ త్రాగటానికి
మంచి నీళ్ళు దొరకట లేదు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీకు
నీళ్ళు కావాలనుకున్నప్పుడు, నన్ను తలచుకో. నేను నా అన్నగారితో
చెప్పి నీళ్ళు (ఆకాశ గంగను) పంపుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు.
తరువాత కొన్నాళ్ళకు ఉదంకుడికి నీళ్ళు అవసరమై, శ్రీకృష్ణుడిని
తలచుకున్నాడు. అప్పుడు దేవేంద్రు డు, ఉదంకుడిని పరీక్షించుటకు,
ఒక నల్లటి శూద్రు డి రూపములో, వొళ్ళంతా చెమటతో, కుక్క తోలు
సంచిలా కనిపించే బంగారు పాత్రలో ఆకాశ గంగా జలము
తీసుకొచ్చి, ఉదంకుడికి ఇస్తే, ఉదంకుడు దానిని అసహ్యించుకొని
నిరాకరించాడు. తరువాత శ్రీకృష్ణుడు వచ్చి, నేను దేవేంద్రు డితో
పంపిన ఆకాశగంగ ఎలా ఉంది అని అడిగితే, ఉదంకుడు
తెల్లబోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నా మీద నీకు కూడా
నమ్మకము లేకపోతే, నేను చెప్పినా వినకపోతే, నేను ఇచ్చినా
తీసుకోకపోతే అది నా తప్పు కాదు. నేను చెప్పినది అర్ధము
చేసుకోక, వినకుండా, చెప్పినది ఆచరించకపోతే, అది నా తప్పు
కాదు. నేను ఒక్కడినీ ఏమీ చెప్పినా, ఏమి చేసినా ఏమీ
ప్రయోజనము ఉండదు. నేను చెప్పిన దానిని ప్రజలు విని, అర్ధము
చేసుకొని, ఆచరిస్తేనే ఏమైనా అవుతుంది. లేకపోతే ప్రజలే
నష్టపడతారు, దానికి ప్రజలే బాధ్యులు.
160
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ జ్ఞానవానపి ।
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ॥ 33 ॥

ప్రతి జీవి ఎంతో కొంత జ్ఞానము, వివేకము, శాస్త్రములు


తెలిసినా ప్రకృతి ద్వారా తనకు కలిగిన స్వభావమునకు మరియు
పూర్వ జన్మల నుండి వచ్చిన సంస్కారములకు అనుగుణముగానే
నడచుకుంటూ ఉంటాడు.

వారి, వారి సంస్కారములకు అనుగుణముగానే


నడచుకుంటారు తప్ప, వేరే దేనినీ లెక్క చేయరు (మొండి వాడు
రాజు కంటె బలవంతుడు). ఎవరైనా బలవంతము పెట్టితే ఏమి
ప్రయోజనము?

ఛాందోగ్యోపనిషత్ – “తం విద్యా కర్మాణి సమన్ వారధేతే


పూర్వ ప్రజ్ఞాస” ఒక వ్యక్తి యొక్క జన్మ ప్రారంభము కావాలంటే –
విద్య + కర్మ + పూర్వ ప్రజ్ఞ – పూర్వ జన్మలో చేసుకున్న ఉపాసన, +
పుణ్య/పాపములు + సంస్కారములు ఉండాలి.

ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ ।


తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ ॥ 34 ॥

161
జన్మాంతర (పూర్వ జన్మ) సంస్కారములను అనుసరించి ప్రతీ
ఇంద్రియమునకు దానికి సంబంధించిన పదార్ధము మీద రాగము
కాని, ద్వేషము కాని నియతముగా (ఎప్పుడూ) ఏర్పడతాయి. ఆ
రాగ ద్వేషముల వశములో, తమ, తమ ప్రవృత్తు లు కలిగి
ఉంటున్నారు.

రాగ, ద్వేషములు దోపిడీ దొంగల వంటి శత్రు వుల లాగ


మానవుల సత్కర్మ ఆచరణ సామర్ధ్యమును హరిస్తు న్నాయి. ఎట్టి
పరిస్థితులలోనూ రాగ, ద్వేషములకు బానిసలు కాకుండా, వాటిని
అనుసరించి ప్రవర్తించ కుండా, రాగ ద్వేషములను మన వశములో
ఉంచుకోవాలి.

 శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।


స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥ 35 ॥

ధర్మ శాస్త్రములు వర్ణాశ్రమములలో ఎవరికి ఏ, ఏ ధర్మములు


విధించాయో అవి వారి స్వధర్మములు. స్వధర్మ ఆచరణలో ఏదో
కొంచెము లోపములు జరిగినా సరే, అందరూ స్వధర్మమునే
ఆచరించాలి. స్వధర్మ ఆచరణ చక్కటి ఫలితములు ఇస్తా యి. నీది
కాని పర ధర్మమును నీవు బాగా ఆచరించ కలిగినా సరే, అది
ఎందుకూ ఉపయోగపడదు.

162
స్వధర్మమును మరణము వరకూ చేయువలసినదే. అదే
శ్రేయస్కరము. నీది కాని పర ధర్మములు చాలా భయము
కలిగిస్తా యి (నరకము, చెడ్డ సంస్కారములు కలిగిస్తా యి, జ్ఞాన
మార్గము ప్రవేశమునకు అర్హత కోల్పోతారు).

అర్జు న ఉవాచ ।
అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః।
అనిచ్ఛన్నపి వార్ ష్ణేయ బలాదివ నియోజితః ॥ 36 ॥
ప్రతి మానవుడు సవ్యమైన మార్గములో నడవాలనే
అనుకుంటాడు. తను సర్వోత్తముడు అనికూడా అనుకుంటాడు.
కాని ఆ దారిలో నడవడు, నడవ లేడు కూడా. ధర్మ మార్గమును
విడిచిపెట్టి, పాప మార్గము మీద ఆసక్తిని బాగా పెంచుకుంటాడు.
మానవుల పాప మార్గములో నడిచే స్వభావము ఎక్కువై పోతున్నది.

దుర్గుణములు: శ్రద్ధ లేమి (నాస్తికుడు, పరమాత్మ, ఇతర


లోకములు లేవు అనే వాడు), అసూయ (పరమాత్మ మీద
దోషారోపణ), దుష్ట చిత్తత్వము (మనస్సును దోషములతో
నింపుకొనుట), ప్రకృతే వశ వత్తిత్వము (ప్రకృతిని తన వశములోనికి
తెచ్చుకునే ప్రయత్నము, సంస్కారముల ఎలా చెప్పితే అలా
నడుచుకొనుట), రాగ ద్వేషస్య పుష్కలం (రాగము - ప్రీతి, ద్వేషము -

163
శత్రు త్వము, పగ పెంచుకొనుట), శాస్త్ర ఉల్లంఘన (చేయవద్దనినవి
చేయుట, చేయమన్నవి చేయకుండుట).

అర్జు నుడు ఇలా అన్నాడు l మానవుడిని పాప


మార్గములోనికి ప్రేరేపించే శక్తి ఏమిటి? మానవుడికి పాప భీతి (పాప
మంటే భయము) లేకపోవుటకు కారణము ఏమిటి? మానవులను
పాప కర్మల వైపు తోసే బలము ఏమిటి?

ఎవ్వరికీ పాపములు చేయాలనే కోరికలు ఉండవు. వారు


ష్ణేయ (వృష్ణి, యాదవ) వంశములో పుట్టిన వాసుదేవా, వృష్ణి -
ఉపనిషత్తు లు చెప్పే ఆత్మ తత్త్వము ద్వారా తెలుసుకునే పరమాత్మ
స్వరూపము నువ్వే, నువ్వే హృషీకేశ – అందరి మనస్సులలో
అంతర్యామిగా ఉన్న నువ్వే ఈ విషయమును చెప్పగలవాడా l ఎవరో
బలవంతము చేసి పాపములు చేయిస్తు న్నట్లు గా పాప కర్మలతో
మునిగిపోతున్నాడు. దీనికి అసలు కారణము ఏమిటి?

 శ్రీభగవానువాచ ।
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః ।
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణం ॥37॥

భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు l మానవుల


ప్రధానమైన శత్రు వు – కామము (అందరికీ తెలుసున్న కోరిక,
164
కమనీయముగా, అందముగా, ఆనందముగా ఉంటుంది). ఆ కోరిక
తీరితే మరొక కోరిక, అది తీరితే మరొక కోరిక – ఆశ, పేరాశ,
అత్యాశ, దురాశగా ఇలా అంతులేకుండా మారుతుంది. కొరిక
తీరకపోతే అది క్రోధముగా పరిణమిస్తుంది (కోపముగా – ప్రతివాళ్లకీ
వాళ్ళ కోపము వాళ్లకు ఇష్టమే). ఇవి అధర్మ మార్గము వైపు ప్రేరేపించి,
వినాశనమునకు దారి తీస్తా యి – ఇవి రజో గుణము (అనుకూల
భావన) నుండి ఉద్భవిస్తా యి.
కామము, అగ్ని వలె, ఎంత వేసినా (చాలా) తినేస్తుంది, ఎంత
పాపముకేనా ఒడికడుతుంది, చేయిస్తుంది. మనిషిని ఎంత హీన
స్థితికైనా దిగజారిస్తుంది. ఈ ప్రధాన పరమ శత్రు వైన కామమును
వెంటనే కొట్టివేస్తే (జయిస్తే), ఇతర దుర్గుణములను సులభముగా
జయించవచ్చు.

 ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ ।


యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం ॥ 38 ॥

కామము (కోరిక) యొక్క స్వరూపము పొగ, బూడిద


కప్పుకున్న నిప్పు లాంటిది. లేదా బాగా దుమ్ము పట్టిన

అద్దము ‍వంటిది లేదా గర్భములో మావి పొరలో


(జరాయువు) కప్పబడిన శిశువు వం
‍ టిది.

165
బృహదారణ్యకోపనిషత్ – 1 లేదా 3-5-3 –
“కామస్సంకల్పో విచికిత్సా శ్రద్దా అశ్రద్ధా థృతిరథృతిః హ్రీర్దీర్భీ రిత్యే
తత్సర్వం మన ఏవ తస్మాదపి పృష్టత ఉపస్పృష్టో మనసా విజానాతి
.......” – కామము, సంకల్పము, సంశయ జ్ఞానము (సందేహము),
ఆస్తిక్య బుద్ధి (పరమాత్మను నమ్ముట), అశ్రద్ధ, ధారణ (జ్ఞాపక శక్తి),
లజ్జ (సిగ్గు), ప్రజ్ఞ (తెలివి, సామర్థ్యము), భయము ఇవన్నీ మనస్సు
చేయుచున్నది.

మనస్సులో ఉండే కామము యొక్క స్వభావము –


మానవులకు ఉన్న జ్ఞానమును కప్పేసి, వారి వివేక శక్తిని పూర్తిగా
హరించి, వారిని అవివేకము, పాపము మార్గము వైపు
తీసుకెళ్లు తుంది. బూడిద కమ్మిన నిప్పు నుండి వేడిమి ఎలా రాదో,
అద్దము మీద దుమ్ము ఉంటే ప్రతిబింబము ఎలా కనిపించదో,
గర్భములో మావి పొరతో (జరాయువు) కప్పి ఉన్న శిశువు కదలలేక
ఎలా బాధపడుతుందో, అలా మనిషిని కామము కమ్మేస్తే,
వాడిలోపల ఉన్న జ్ఞానము పనిచేయక నాశనమునకు దారితీస్తుంది.

కామము మనస్సులో పుట్టింది. మనస్సు సృష్టి


ప్రారంభములో పుట్టినది. సృష్టికి ముందు మనస్సు త్రిగుణాత్మకమైన
మూల ప్రకృతిలో సూక్ష్మముగా లీనమై ఉన్నది. సృష్టి ప్రక్రియలో
మూల ప్రకృతి పరిణామము చెందుతూ – మహత్తు (సమిష్టి బుద్ధి,

166
cosmic intelligence) – సమిష్టి అహంకారము – చిత్తము
(స్మరణ లేక జ్ఞాపక శక్తి, బుద్ధి, మనస్సు, అహంకారము). మనస్సుతో
సహా కామము పుట్టినది.

కామము మొలకెత్తితే జ్ఞానమును కప్పివేస్తుంది. కామము


మొగ్గగా ఉండే దశలో, చిన్న, చిన్న సాధనములను చేసుకొని,
కామమును ప్రాధమిక దశలో (సత్త్వ గుణ ప్రధానము) తుంచివేసి
కామమును లొంగతీసుకోవచ్చును. అప్పుడు జ్ఞానము ప్రకాశిస్తుంది.
కామము పెరిగితే, మనస్సు ఆ వస్తు వు గురించే అన్ని ఆలోచనలు
చేస్తూ ఉంటే, కామము బలపడి స్థూల తరము అయి కామము
తీవ్రము అవుతుంది (రజో గుణ ప్రధానము). అప్పుడు మనస్సు,
బుద్ధి తమ శక్తిని కోల్పోతుంది. అప్పుడు కామమును
లొంగదీసుకొనుట కొంచెము కష్టము. అప్పుడు సత్కర్మలు చేస్తూ
కామమును లొంగదీసుకోవాలి. కామము ఫలిస్తే, దానిని అనుభవిస్తూ
మనస్సును దానిమీదే లగ్నమయి ఉంటుంది. అప్పుడు కామము
స్థూల తమము అయి కామము చాలా తీవ్రమవుతుందని (తమో
గుణ ప్రధానము). ఈ దశలో ఎవ్వరూ కామమును ఏమీ చేయలేరు,
అసంభవము. అప్పుడు మానవుడు సర్వమూ కోల్పోయి పూర్తిగా
నాశనము అవుతాడు.

167
 ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా ।
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ॥ 39 ॥

కామము (కోరిక) అనే శత్రు వు మానవులలో ఉండే


వివేకమును, జ్ఞానమును ఆవరించి పూర్తిగా కప్పి వేస్తోంది. సాధారణ
మానవులు ఈ శత్రు వును గుర్తించుట లేదు. కామమును అందమైన
మిత్రు డిలా భావించి, పెంచి, పెద్ద చేసి తరువాత కలిగే కష్టములతో
బాధపడుతున్నారు. కాని వివేకులు, జ్ఞానులు మాత్రమే కామము
అనేది పరమ శత్రు వుగా గుర్తించి, దీనికి దూరముగా ఉంటున్నారు.

కుంతీ పుత్రా I సాధారణ మానవులు ఈ కామమును ఇంకా,


ఇంకా పెంచుకోవాలి అని తహ, తహ లాడిపోతున్నారు. ఏ విధముగా
అయినా సరే నా కోరికలను, పూర్తి చేసుకోవాలి, తీర్చుకోవలసినదే
అని భ్రమ పడుతున్నారు. కాని కామమును తీర్చుట, తృప్తి
పరచటము ఎవ్వరికీ సాధ్యము కాదు. సముద్రమును ఖాళీ
చేయటము లేదా సముద్రమును మంచి నీళ్ళతో నింపటము ‍
వంటిది. కామము నిప్పు లాంటిది. కోరికకు, అగ్నికి చాలు అనే మాట
లేదు. నిరంతరమూ దహించివేస్తుంది.

ఉదాహరణ:

భాగవత మహా పురాణములో (Book 9, Discourse 18,


19). ఈ కధ మహా భారతములో కూడా ఉన్నది. కురు వంశములో

168
పాండవులకు పూర్వజుడు నహుస చక్రవర్తికి ఆరుగురు కుమారులు.
పెద్ద కుమారుడు యతికి రాజ్య కాంక్ష లేనందున, రెండవ
కుమారుడు యయాతి రాజు అయ్యాడు. యయాతికి ఇద్దరు
భార్యలు – దేవయాని (శుక్రా చార్యుని కుమార్తె) మరియు శర్మిష్ఠ
(రాక్షస రాజు రుషకేషుడు కుమార్తె). యయాతి ద్వారా
దేవయానికి ఇద్దరు కుమారులు యదు, తుర్వసు మరియు శర్మిష్టకి
ఇద్దరు కుమారులు ద్రు హ్యు, అను కలిగారు. యయాతి శర్మిష్ఠతో
సంతానము పొందాడని కోపముతో దేవయాని తండ్రి
శుక్రా చార్యుడు, యయాతికి ముసలితనము రావాలని శపించాడు.
యయాతికి భోగముల మీద కోరిక తీరక, భోగములు
అనుభవించుటకు యవ్వనము అవసరము అని ఆలోచించి, తన
కుమారులను, వారి యవ్వనము తనకు ధారపోయమని అడిగారు.
యదు (ఈ యదు వంశములోనే కృష్ణుడు జనించాడు), ద్రు హ్యు,
అను నిరాకరించారు. యయాతి వాళ్లను “మీరు ఎప్పటికీ మహారాజు
కాలేరు” అని శపించాడు. అందరి కంటె చిన్న కుమారుడైన పురు
అంగీకరించాడు.

యయాతి యోగ ప్రక్రియ ద్వారా పురు నుండి యవ్వనము


తీసుకొని చాలా కాలము (1000 సంవత్సరములు) భోగములు
అనుభవించినా సంతృప్తి చెందలేదు. కొన్నాళ్ళకు యయాతికి,
మార్పు కలిగి, తను చేసిన తప్పుకు బాధపడుతూ, తన కుమారుడు

169
పురుతో యయాతి ఇలా అన్నాడు – భాగవతము - 9-19-14 - “న
జాతు కామః కామానాముపభోగేన శామ్యతి I హబిశా కృష్ణవత్మేవ
భూయ యేవాభివర్ధతే” – ఇంద్రియ సంతృప్తి కోసము తృష్ణతో
(కోరికలతో) ఇంద్రియ వస్తు వులను ఆనందిస్తూ ఉంటే, ఆ కోరికలు
నెయ్యి పోసిన అగ్ని వలె బలపడి మరింత బలపడి పెరుగుతుందే,
కాని ఇంద్రియ తృప్తి అనేది ఎప్పటికీ కలగదు. కోరికలను
తీర్చుకొనుట అసంభవము.

ఇంకొక ఉదాహరణ:

నాకు ఆకలి, దప్పిక, ఆశ అనే ముగ్గురు భార్యలు. వాళ్లకు


నా మీద చాలా ప్రేమ. వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఎక్కడకూ వెళ్ళరు.
ఎప్పుడూ నాతోనే ఉంటారు. ఆకలి, దప్పిక వేళ, వేళకు (సమయము
అయినప్పుడు) ఏదో చిన్న, చిన్న వాటితో తృప్తి పడతారు. కాని నా
చిన్న భార్య ఆశకు నేనంటే, ఆశ అంటే నాకు చాలా ప్రేమ, ఇష్టము.
ఆవిడ ప్రణయ కలహముతో చాలా బాధ పడుతున్నాను.

 ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠా న ముచ్యతే ।


ఏతై ర్విమోహయ త్యేష జ్ఞాన మావృత్య దేహినామ్ ॥ 40 ॥

జీవుడి శరీరమును కామ శత్రు వులు వివిధమైన


స్థా వరములను వశ పరచుకొని ఉన్నవి. ఆ స్థా వరములు

170
కర్మేంద్రియములు (5), జ్ఞానేంద్రియములు (5) ప్రవృత్తు లకు
మనస్సు కేంద్రము. మనస్సు ఇంద్రియ తృప్తికి సంబంధించిన
భావములకు నిలయము. తరువాత బుద్ధి కామ (కోరికలు)
సహితమైన ప్రవృత్తు లకు కేంద్రము.

కామ సహితమైన బుద్ధి, జీవాత్మ మిథ్య మరియు


అహంకారమును పొంది, ఇతర జీవులతో, లౌకిక వస్తు వులతో,
తద్వారా మనస్సుతో, ఇంద్రియములతో తాదాప్యము చెందును.
అప్పుడు జీవాత్మ లౌకిక భోగములతో కలిగే ఆనందమే నిజమైన
ఆనందము అను భ్రాంతి పొందును.

కామము (కోరిక) అనే మహా శత్రు వుకి మనలో


ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనే మూడు స్థా నములలో ఉండి,
మనకు చేయారాని అపకారము చేస్తూ ఉంటాడు. మన ఆత్మను
(జ్ఞాన స్వరూపము), ఆత్మ జ్ఞానమును కప్పేసి, మొహమునకు
(అజ్ఞానము) గురిచేసి, ఏ విధమైన వివేకము, జ్ఞానమును బయటకు
రానీయడు. అప్పుడు ఆత్మ స్వరూపము యొక్క జ్ఞానమును
పనిచేయదు

భాగవతము – 10-84-13 – “యస్యాత్మ బుధిః కుణ సే


త్రిదాతుకే స్వథీః కలత్రాదిషు భౌమ ఇథ్యథీః I యతీర్ధబుధిః సలిలేన
కర్హిచిత్ జనేష్వభిజ్ఞేషు న ఏవ గోఖర” – మూడు ధాతువులతో (1

171
వాతము, 2 పిత్తము, 3 శ్లేష్మము) కూడిన దేహమే ఆత్మ అని
భావిస్తూ, దేహమునకు సంబంధించిన వాళ్ళే తన బంధువులు
అనుకుంటూ, కేవలము వినోదము, వివిధ ప్రదేశములను చూచుటకే
తీర్థ యాత్రలు చేసే మానవుడిని గాడిదగా గాని, పశువుగా గాని
భావించవలెను.

 తస్మాత్త్వ మింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ।


పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనం ॥ 41 ॥

భరత వంశములో శ్రేష్టు డైన ఓ అర్జు నా I పాపమునకు


చిహ్నమైన కామము (కోరికలు) జ్ఞానమును (ఆత్మ జ్ఞానము),
విజ్ఞానమును (శాస్త్ర జ్ఞానము) నాశనము చేయును. ఇంద్రియములు
ప్రాపించక విషయములను తీసుకువచ్చి, మనస్సుకు అందచేస్తే
మనస్సులో సంకల్ప వికల్పములు బలపడి, కామము (కోరికలు)
కలుగుతాయి. కాబట్టి మొట్టమొదటే ఇంద్రియములను నిగ్రహించి,
ఈ కామమును సంహరించుము.

 ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః ।


మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః ॥42॥

జడమైన ప్రాపించక వస్తు వులు, దేహము కంటె, సూక్ష్మమైన,


చైతన్యవంతమైన ఇంద్రియములు ఉత్తమములు. మనస్సు ఏ
ఇంద్రియముతో లగ్నమవుతుందో, ఆ ఇంద్రియము ద్వారా వచ్చే
172
విషయములు మన మనస్సుకు తెలుస్తా యి. మనము జాగ్రత్త
అవస్థలో ఉన్నప్పుడే ఇంద్రియములు పనిచేస్తా యి. నిద్రావస్థలో
ఇంద్రియములు పనిచేయవు. కాని మనస్సు నిద్రావస్థలో కూడా
పనిచేస్తుంది. ఇంద్రియముల కంటె మనస్సు సూక్ష్మమైనది.
అందుచేత ఇంద్రియముల కంటె మనస్సు ఉత్తమము.

స్వయం చైతన్యవంతమైన ఆత్మద్వారా చైతన్యవంతమైన


బుద్ధి (జడమైనది) ద్వారా చైతన్యము మనస్సు మీద పడినప్పుడే
మనస్సు కూడా చైతన్యవంతమయి పనిచేస్తుంది. మనస్సు సుషుప్తి
అవస్థలో పనిచేయదు. కాని బుద్ధి సుషుప్తి అవస్థలో కూడా
పనిచేస్తుంది. మనస్సు కంటె బుద్ధి సూక్ష్మమైనది. మనస్సు పంపిన
సంకల్ప, వికల్పములను బుద్ధి విచారణ చేసి ఒక నిశ్చయము చేసి,
ఆ నిశ్చయమును మనస్సుకు పంపితే, అప్పుడు మనస్సులో ఆ
నిశ్చయము కోరికగా పరిణమిస్తుంది. అందుచేత మనస్సు కంటె
కూడా బుద్ధి ఉత్తమము. ఆత్మ స్వయం చైతన్యవంతమైనది. ఆత్మ
యొక్క చైతన్యము బుద్ధి మీద పడినప్పుడే బుద్ధి చైతన్యవంతము
అయి పనిచేస్తుంది. బుద్ధి కంటె ఆత్మ స్వరూపము (చైతన్యము)
సూక్ష్మమైనది. అందుచేత బుద్ధి కంటె, అన్నిటి కంటె ఆత్మ
ఉత్తమము.

కఠోపనిషత్ – 2-3-7 – “ఇంద్రియేభ్యః పరం మనో, మనసః


సత్త్వముత్తమం I సత్వాదధి మహానాత్మా, మహతోవ్యక్తముత్తమమ్”
173
– ఇంద్రియముల కంటె మనస్సు శ్రేష్టమైనది. ఆ మనస్సు కంటె
సత్త్వము (బుద్ధి) శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటె మహదాత్మ శ్రేష్టమైనది.
ఆ మహదాత్మ కంటె సర్వ కారణమగు అవ్యక్తము (పరమాత్మ)
శ్రేష్టమైనది.

కఠోపనిషత్ – 1-3-10 – “ఇంద్రియేభ్యః పరాహ్యర్ధాః


అర్దేభ్యశ్చ పరం మనః I మనసస్తు పరా బుద్ధి ర్భు ద్దేరాత్మా మహాన్
పరః” – ఇంద్రియములు స్థూలములను గ్రహించును.
ఇంద్రియములకు కారణభూతులైన (పంచ తన్మాత్రలు (సూక్ష్మ
భూతములు) - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ) ఇంద్రియముల కంటె
సూక్ష్మమైనవి. తన్మాత్రలు కంటె ప్రత్యగాత్మ భూతమైన మనస్సు
శ్రేష్టమైనది. మనస్సు కంటె బుద్ధి గొప్పది. బుద్ధి కంటె మహతత్త్వము
ఉత్తమమైనది.

 ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా ।


జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం ॥ 43 ॥

ఈ విధముగా ఇంద్రియముల కంటె, మనస్సు కంటె, బుద్ధి


కంటె అత్యున్నతమైన ఆత్మ అతీతమని తెలుసుకొని, మనస్సుతోనే
ఇంద్రియములను, మనస్సుని, బుద్ధిని శరీరమును, అనవసరమైన
వ్యవహారములపై వెళ్ళకుండా ఆపుకొని, అదుపులో ఉంచుకొని,
నిగ్రహించుకొని,

174
కామ రూపమైన శత్రు వుని (సామాన్యమైన శత్రు వు కాదు)
జయించవలెను. శత్రు వులను జయించగల గొప్ప బాహువులు కల
అర్జు నా (మనకు – ఆత్మకు - శత్రు వైన కామమును కూడా అలా
జయించమని సంకేతము) I కామము అనే శత్రు వు ఎక్కడ ఉందో, ఏ
రకముగా మారుతుందో, ప్రవర్తిస్తోందో తెలియదు.

బయటకు ప్రసరించే బుద్ధిని, లోపలకి ప్రసరించుకొని, బుద్ధికి


చైతన్యము ప్రసాదించే, బుద్ధి కంటె సూక్ష్మమైన, లోపల ఉండే ఆత్మ
గురించి అర్ధము చేసుకొని, మనస్సుని, ఇంద్రియములను స్థిరమైన
బుద్ధితో నిలదీసుకొని, ఇంద్రియ ప్రవృత్తు లను ఆపుకొని, తగ్గించుకొని,
అదుపులో పెట్టు కొని, వివేకముతో కామము అనే శత్రు వును
జయించవలెను.

ఉదాహరణ

ఒక రాజుగారికి కుక్కలు అంటే చాలా ఇష్టము. చలా


కుక్కలను పెంచి, పేరు పేరుతో రోజూ వాటికి బిస్కటులు వేసేవాడు.
కొన్నాళ్ళకు ఆ రాజుగారికి కుక్కలా మీద వైముఖ్యత (విముఖత,
వద్దనిపించి) కలిగి, వాటితో ఈవాళతో మీకు, నాకు సంబంధము
ఆఖరు. ఈ బిస్కటులు తిని, మీరు వెళ్ళిపోండి అని వాటితో చెప్పి,
బిస్కటులు ఎగరవేశాడు. ఆ కుక్కలు ఆ బిస్కటులు తిని, రాజుగారి
దగ్గరకు వచ్చి తోకలు ఊపుతున్నాయి. సరేనని మరలా అలానే చెప్పి

175
బిస్కటులు ఎగరవేశాడు. ఆ కుక్కలు వాటిని తినేసి మరలా తోకలు
ఊపుతున్నాయి. ఇలా చాలా సార్లు జరిగింది. దీనిని ఒక మంత్రిగారు
చూసి, రాజుగారితో అలా బిస్కటులు వేస్తుంటే కుక్కలు వెళ్లిపోవు,
కుక్కలకు ఆహారము పెట్టకుండా ఉంటే, వాటికి ఆకలి వేసి,
ఆహారము కోసము బయటకు వెళ్ళిపోతాయి అని చెప్పాడు.

అలాగే కోరికలు తీర్చుకుంటున్నంతసేపు కోరికలు తగ్గే


అవకాశము లేదు, తగ్గవు కదా, ఇంకా పెరుగుతాయి. ఆ కోరికలను
తీర్చుకునే ప్రయత్నము తగ్గించి, తగ్గించి, తరువాత పూర్తిగా
ఆపగలిగితే, అప్పుడే గొప్ప శత్రు వు అయిన కోరికలను జయించుట
సాధ్యము అవుతుంది. (పైన 37 వ శ్లోకము నుండి 43 వరకు, 2 వ
అధ్యాయము 59 వ శ్లోకము, 4 వ అధ్యాయము 21 వ శ్లోకము
చూడుము).

ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం


యోగశాస్త్రే శ్రీకృష్ణార్జు నసంవాదే
కర్మయోగో నామ తృతీయోఽధ్యాయః ॥ 3 ॥

మంగళా శ్లోకములు

యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః l

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రు వా నీతిమతిర్మమ ll

176
అధ క్షమా ప్రార్ధనా

యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ l తత్సర్వం క్షమ్యతాం


దేవ నారాయణ నమోస్తు తే ll

అధ భగవత్ సమర్పణమ్

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ l


కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ll

అధ లోకక్షేమ ప్రార్ధనా

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః l


సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ll

అధ మంగళమ్

శ్రియః కంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినామ్ l


శ్రీవేంకట నివాశాయ శ్రీనివాసాయ మంగళమ్ ll

కృష్ణ నామ సంకీర్తన

కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l


కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l

177
మానవుడు పుట్టిన క్షణము నుండి, మరణించే క్షణము
వరకూ పొందే జ్ఞానమును విద్య అంటారు. మానవుడు తన
జీవనముకు కావలసిన విద్యను సిద్ధము చేసుకునే జన్మ
పొందుతారు. శిశువుకు ప్రాధమిక జ్ఞానము తల్లి ఇస్తుంది. ఆ
విధముగానే మానవ జాతి యొక్క సృష్టికి ముందే మానవ జాతి
యొక్క జీవన విధానములకు, అభివృద్ధికి, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి
అవసరమయ్యే జ్ఞానము, ఆ జ్ఞానము యొక్క వ్యవస్థ సిద్ధమై
ఉండాలి అని నిశ్చయించి, పరమాత్మ ముందు వేదములను
తయారు చేసి, తరువాతే మానవులను సృష్టి చేశాడు. మానవ జాతి
సృష్టి తరువాత, మానవ జాతిలో, కొంతమంది ప్రధానులను
ఎన్నుకొని, వారి, వారి యోగ్యతలను అనుసరించి, వారికి ఆ, యా
వేద భాగములను పరిచయము చేశాడు. మానవ జాతికి ప్రధమ
గురువు పరమాత్మ. మానవులలో ఉత్తమోత్తములకు నివృత్తి
మార్గమును (జ్ఞాన యోగము) ఉపదేశము చేశాడు. కొంత ఉత్తమ
మానవులకు ప్రవృత్తి మార్గమును (కర్మ యోగము) బోధించాడు.
మానవులు జీవన విధానములోని నియమములను పాటించుటకు,
మానవులు సన్ మార్గములో నడిపించుటకు యోగ్యులైన వారిని
మానవుల పాలకులుగా నియమించాడు. వారికి పాలనా
విధానములకు సంబంధించిన విద్యలను (వేద సారములు) వాళ్ళకు
ఉపదేశము చేసి, వాళ్ళ ద్వారా మానవులను సన్ మార్గములో

178
నడిపించే విధానము ఏర్పాటుచేశాడు. ఈ యోగము సమతా బావ
పూర్వకముగా కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. రాగ, ద్వేషములకు
అతీతముగా కర్తవ్యములు నిర్వహించాలి. ఏ రకమైన దోషములకు
(బుద్ధి దోషములు 1. కామము, 2. క్రోధము, 3. భయము, 4.
లోభము, 5. దైన్యము, 6. దర్పము, 7. లజ్జ, 8. అభిమానము)
అవకాశము ఇవ్వకూడదు. మనస్సును నిరంతరమూ శుభ్రముగా
ఉంచుకుందుకు సత్కర్మ ఆచరణ చెయ్యాలి.

ఈ నాలుగవ అధ్యాయములో పైన చెప్పిన విషయములను


ప్రస్తా విస్తు న్నాడు.

అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యానాం యోగశాస్త్రే


శ్రీకృష్ణార్జు న సంవాదే జ్ఞానకర్మసంన్యాసయోగో నామ
చతుర్థోఽధ్యాయః ll

శ్రీభగవానువాచ ।
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం।
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ॥1॥

భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు l నేను ఈ జ్ఞాన


యోగమును, కర్మ యోగమును సృష్టి ఆదిలో వివస్వాన్ కు
(సూర్యుడుకు) ఉపదేశము చేశాను. ఈ యోగములు వేదములకు

179
సారముగా వచ్చినవి, మోక్షము కలిగించేవి, ఏ విధమైన నాశనము
లేనివి.

వివస్వాన్, ఆయన పుత్రు డైన మనువుకు ఈ యోగములు


ఉపదేశము చేశాడు. ఆ మనువు, ఇక్ష్వాక అనే సూర్య వంశపు ప్రధమ
రాజుకు ఉపదేశము చేశాడు.

సూర్యుడు ఈ సృష్టి మొత్తమునకు మొట్టమొదటి వాడు.


సూర్యుడు యొక్క వేడి లేనిదే ఏ విధమైన సృష్టి, జీవనము జరిగే
అవకాశము లేదు. పరమాత్మ ఈ యోగమును సూర్యుడికి
ఉపదేశము చేశాడు. సృష్టిలో రెండవ వాడు మనువు. సూర్యుడు ఈ
యోగమును మనువుకు ఉపదేశము చేశాడు. మనువు నుండే
మానవులు (మనమందరము) పుట్టు కొచ్చారు. ఎప్పుడైతే మానవులు
పుట్టా రో, మానవులు ఇతర జీవుల కంటె విలక్షణముగా ఉన్నారు.
మానవులు మనస్సు కలిగి ఉన్నందున, మానవులు మనస్సుతో
ఆలోచించి చెప్పినట్లు పనిచేస్తా రు. మానవులకు బుద్ధి ఉన్నందున
బుద్ధి శక్తిని (వివేకము – మంచి, చెడు యొక్క నిర్ణయము చేయగల
శక్తి) వాడుకోగలుగుట. అందుచేత వాళ్ళు స్వతంత్రముగా (ఎవరికి
ఇష్టము వచ్చినట్లు వాళ్ళు – మాట వినని) వ్యవహరిస్తా రు.
అందుచేత అభివృద్ధి పథమును అందుకోలేడు. అది ప్రమాదమునకు
దారి తీస్తుందని మనువు గ్రహించి, మానవులను సరైన దారిలో
నడచుటకు, ఒక విధానమును ఏర్పాటు చేయాలని ఆలోచించి, ఒక
180
రాజును పాలకుడుగాను, ఆయన క్రింద మిగిలిన మానవులు
(ప్రజలు), సరైన దారిలో నడిచేందుకు, ఆ రాజు చెప్పిన విధముగా
నడిచే విధముగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అప్పుడు
మనువు తన పుత్రు డైన ఇక్ష్వాకుడిని రాజు చేసి, మనువు ఇక్ష్వాకుడికి
ఈ యోగమును ఉపదేశము చేశాడు. ఇక్ష్వాకుడు రాజులలో
మొదటి రాజు. వేదములు తల్లి పాలు అయితే, రాజులకు చేసిన
ఉపదేశమును ఉగ్గుపాలు అనవచ్చు. అప్పటి రాజులు ఈ
ఉపదేశములను చక్కగా అనుసరించి, ప్రజలను కూడా అలా
పాలించి, వాళ్లను కూడా ఆ మార్గములో నడిచేలా చేసి, వారి
తరువాత తరములకు అందించారు.

ఏవం పరంపరాప్రాప్తమ్ ఇమం రాజర్షయో విదుః ।


స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ॥ 2 ॥

పరంపరగా (తాత – తండ్రి – కొడుకు – మనవడు ఒకరి


ద్వారా ఒకరికి) యోగ్యులైన చాలా మంది రాజర్షులు (రాజు +
ఋషి, ఋషులు వంటి రాజులు) వచ్చిన ఈ మహా యోగము
(జ్ఞాన, కర్మ యోగములు – రాగ, ద్వేషములకు అతీతముగా,
సమతా భావముతో స్వధర్మాచరణ) సారమును రాజర్షులు, వారి
ద్వారా ప్రజలు తెలుసుకున్నారు.

181
దీర్ఘ కాలములో, కాలక్రమేణా ఆ గొప్ప జ్ఞాన, కర్మ యోగము
(ఇంద్రియములను అదుపులో పెట్టు కొని, సుఖముల లాలస
లేకుండా, దోషములు లేకుండా చేయవలసిన యోగము)
శిథిలమైపోయింది. పరంతప = శత్రు వులను తపింపచేయువాడివి
(ఓడించగలవాడివి, కాల్చివేసేవాడివి) – మానవుల లోపల ఉండే
శత్రు వులను కాల్చివేసేవాడివి.

స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః ।


భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం ॥ 3 ॥

సృష్టి ఆదిలో నేను సూర్యుడుకు చేసిన ఈ


సాంప్రదాయకమైన ఉత్తమమైన యోగ విద్యను (రాగ ద్వేషములు
లేకుండా, సమతా భావనతో సత్కర్మాచరణ), దానినే మరలా నేను
నీకు చెప్పుతున్నాను. ఇది పురాతనమైనది, ఏ కాలములోనైనా
మార్పు లేకుండా ఉండేది. ఇది నేను కొత్తగా అల్లిన యోగము
కాదు.

నీవు నా భక్తు డివి, నాకు స్నేహితుడివి, నాకు శిష్యుడివి


కనుక నేను నీకు ఉపదేశము చేస్తు న్నాను. ఈ యోగము
రహస్యమైనది మరియు చాలా ఉత్తమమైనది.

భక్తు డు అనగా భగవంతుడిని శరణు వేడుకొని, అపారమైన


ప్రీతి కలిగి ఉండుట. నిజమైన స్నేహితుడు అనగా తన మరొక

182
స్నేహితుడుకు మార్గము తెలియక సతమతమైనప్పుడు, ఆ
స్నేహితుడికి నిస్వార్దముతో సరైన సలహా ఇచ్చి, మంచి మార్గములో
పెట్టు వాడు. మానవులందరికీ పరమాత్మ, జగద్గురువు అయిన
శ్రీకృష్ణుడు అసలైన, ఉత్తమమైన స్నేహితుడు.

అర్జు న ఉవాచ ।
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః ।
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ॥4॥

అర్జు నుడు ఇలా అంటున్నాడు I నీ జన్మ ఇప్పటిది


(శ్రీకృష్ణుడుగా, వాసుదేవుడికి పుత్రు డుగా, చెరసాలలో నా కంటె కొన్ని
నెలలు ముందు పుట్టినవాడు) నాకు బాగా తెలుసు. కాని నీవు సృష్టి
ఆదిలో, సూర్యుడికి ఈ యోగము ఉపదేశము చేసావు అని
అంటున్నావు.

నీవు సృష్టి ఆదిలో సూర్యుడికి ఈ యోగము ఉపదేశము


చేసావు అన్న దానిని నేను ఎలా అర్ధము చేసుకోవాలి? (నీవు తప్పు
చెప్పుతున్నావని మాత్రము నా భావము కాదు).

శ్రీభగవానువాచ ।
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జు న ।
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ॥ 5 ॥

183
భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు I ఇలాంటి
జన్మలు (అవతారములు) నేను ఎన్నో ధరించాను, తీసుకున్నాను.
నాకే కాదు, నీకు కూడా చాలా జన్మలు అయినాయి. అర్జు నా (తెల్లని
వాడు. తెల్ల మద్ది చెట్టు – పెద్ద చెట్టు గా ఏపుగా పెరిగినా, తత్త్వము
తెలియనివాడా – ఇది మనందరికీ వర్తిస్తా యి) I

నేను సర్వజ్ఞుడిని. ఆ జన్మలన్నీ నాకు తెలుసు. నీవు


అల్పజ్ఞుడివి. అందుచేత నీ జన్మలు గురించి నీకు మాత్రము
తెలియవు. శత్రు వులను తపింప చేయగలవాడా (లోపల శత్రు వులను
తపించి, జయించి జ్ఞానము పొందాలని తపన లేనివాడా – ఇది
మనందరికీ వర్తిస్తుంది) I

జీవులు (అజ్ఞానముతో కూడిన ఆత్మ) చేసుకున్న పుణ్య,


పాప కర్మలకు ఫలితములు అనుభవించుటకు ఆ, యా జీవులకు
వారి, వారి కర్మానుగుణముగా జన్మ కలుగుతుంది. జీవులకు ఆ,
యా జన్మల వివరములు వాళ్లకు తెలియదు. జీవుల జన్మలకు
మూల కారణము వారి అజ్ఞానము (ఆత్మ జ్ఞానము లేకపోవుట). ఈ
అజ్ఞానమును మాయ, త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, ఈశ్వర శక్తి,
వైష్ణవ మాయ అంటారు. అజ్ఞానము ప్రధానముగా రెండు శక్తు లు –
1. ఆవరణ శక్తి – ఆత్మ స్వరూపమును, జ్ఞానమును కప్పివేస్తుంది.
2. విక్షేప శక్తి – ఇతర ప్రాపించక వస్తు వులను చూపిస్తుంది.

184
కాని అవన్నీ నాకు (పరమాత్మకు) తెలుసు. పరమాత్మకు ఏ
విధమైన అజ్ఞానము, కర్మ సంబంధము లేదు కనుక పరమాత్మకు
జన్మ ఉండదు. అందుచేత పరమాత్మ యొక్క అవతారములు పుణ్య,
పాప కర్మల ఫలితముగా వచ్చిన కావు. ఈ ప్రపంచమును అధర్మము
నుండి రక్షించుటకు, ధర్మమును స్థా పించుటకు, పరమాత్మ
తనంతట తాను అవతారము (పై నుండి క్రిందకు దిగి వచ్చుట)
స్వీకరిస్తా డు. ప్రధానమైనవిగా పది (10) లేక ఇరవై ఒకటి (21) అని
అంటారు. కాని పరమాత్మ యొక్క అవతారములు అనంతము,
లెక్క ఎవ్వరికీ తెలియదు.

 అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।


ప్రకృతిం స్వామధిష్ఠా య సంభవామ్యాత్మమాయయా ॥ 6 ॥

నేను అజుడిని. ఏ రకమైన పుట్టు క లేనివాడిని. నేను సత్


పదార్ధమును. నాకు ఏ రకమైన వినాశనము లేదు. సమస్త
ప్రపంచములో ఉండే అన్ని ప్రాణులకు (వాళ్ళ శరీరములకు), అన్ని
వస్తు వులకు నేనే ఈశ్వరుడిని (సృష్టి కర్తను, సంరక్షణ చేస్తా ను,
లీనము చేసుకోగలిగినవాడిని).

మూల ప్రకృతిని నా వశములో ఉంచుకొని,


అవసరమైనప్పుడు నా అధీనములో ఉన్న నా యొక్క వైష్ణవ
మాయను ఉపయోగించుకొని, నేను అవతారములను స్వీకరిస్తా ను.

185
సత్ = ఉనికి, సత్యము, నిత్యము. ఋగ్వేదము – 1-164-
46 – “ఇంద్ర ॑ మిత్రా వర్ణమగ్నిమ ॑ హురతో దివ్య ः స్పార్పర్నో
గరుత్మాన్. ఏకం సద్విప్ర బహుధ వేదాంత్య िं అగ్ని యమ
మాతర్వనామహు ः ‘‘ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి.’’ -
అందరూ అతన్ని ఇంద్ర, మిత్రా (సూర్యుడు), వరుణ, అగ్ని అని
పిలుస్తా రు; మరియు అతను అందమైన రెక్కలు కలిగిన స్వర్గపు
గరుడ. సత్యం ఒక్కటే, కానీ విప్రులు, పండితులు (లేదా
నేర్చుకున్నవారు) దీనిని అనేక పేర్లతో పిలుస్తా రు లేదా అతన్ని అనేక
విధాలుగా వివరిస్తా రు; వారు అతన్ని అగ్ని, యమ, వాయువు అని
పిలుస్తా రు.

బృహదారణ్యకోపనిషత్ 1 లేదా 3-4-7 – “తద్థేదం


తర్హ్యవ్యాకృతమాసీత్ త న్నామరూపాభ్యామేవ వ్యా క్రియాతాసౌ
నామయ మిదగ్ం రూపమితి ....” – ఈ సమస్త సృష్టి మొదట
అవ్యక్తముగా ఉన్నది. అది నామ రూపముల వలన వ్యక్తమయినది.

నిరాలంబోపనిషత్ – 11 - “బ్రహ్మ సత్యం జగన్మిధ్యే


త్యపరోక్షజ్ఞానా ......” – బ్రహ్మ సత్యము (ఎల్లప్పుడూ, మూడు
కాలములలో ఉండేది). జగత్లు మిథ్య (ఉన్నట్లు కనిపిస్తు న్నా, అది
సత్యము కాదు) అను ప్రత్యక్ష జ్ఞానము. ఈ సూత్రము మీద
జగద్గురు ఆది శంకరాచార్యులు అద్వైత సిద్దాంతమును
పునరుద్ధరించారు.
186
తైత్తీరీయోపనిషత్ – శిక్షావల్లి – 1-6-2 – “ఆకాశ శరీరం
బ్రహ్మ I సత్యాత్మ ప్రాణారామం మన ఆనన్దమ్ .......” అవ్యాకృత
ఆకాశము (మహామాయ, ప్రధానము, వికారములు చెందనది, మన
పంచభూత ఆకాశము కాదు) పరమాత్మకు శరీరము ‍వంటిది.
వాస్తవానికి పరమాత్మకు శరీరము అనేది లేదు. ఆ మహామాయతో
కూడిన పరమాత్మ ఈ ప్రపంచమును సృష్టి, స్థితి, లయలకు
పూనుకుంటాడు.

 యదా యధా హి ధర్మస్య గ్లా నిర్భవతి భారత ।


అభ్యుత్థా నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ॥ 7 ॥

ఎప్పుడెప్పుడు ధర్మాచరణమునకు హాని కలుగుతుందో,


ధర్మము యొక్క కాంతి తగ్గిపోతుందో, వెలవెలపోతుందో,
క్షీణిస్తుందో,

అధర్మము పెరిగిపోతుందో అప్పుడు, నా యొక్క మాయ


ద్వారా నేను అవతరిస్తా ను.

 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ।


ధర్మసంస్థా పనార్థా య సంభవామి యుగే యుకే ॥ 8 ॥

సాదువులను (వేదములను ప్రమాణముగా తీసుకొని,


ధర్మమును ఆచరించేవాళ్లను, లోకమునకు ఉపకారము చేసేవాళ్ళను)

187
అన్ని విధముల రక్షణ కల్పించి కాపాడుటకు, అధర్మ మార్గములో,
దుర్మార్గములో సంచరించే వాళ్లను వినాశనమునకు
(దండించుటకు)

ధర్మమును మరలా చక్కగా స్థా పించుటకు, ప్రతిష్టించుటకు


ప్రతి యుగములోను నేను అవతరిస్తా ను.

జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః।


త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఽర్జు న ॥ 9 ॥

నేను ఇంతవరకు నా యొక్క అలౌకికమైన, దివ్యమైన


అవతారములు (జన్మ), లీలలు (కర్మలు) గురించి చెప్పాను. నేను
చెప్పినట్లు గా నా తత్త్వమును, సాత్వికమైన స్వరూపమును
వాస్తవముగా ఎవరైతే తెలుసుకుంటారో,

వారికి ఈ దేహము విడిచిపెట్టిన తరువాత మరొక జన్మ


అనేది ఉండదు. నన్ను పొందుతారు. నాలో ఐక్యమైపోతారు.
అర్జు నాI

పరమాత్మకు వాస్తవముగా శరీరము లేని వ్యాపకమైన


రూపము. పరమాత్మ తత్త్వము నిత్య, శుద్ధ, బుద్ధ. ముక్త, విజ్ఞాన,
ఆనంద స్వరూపుడు. పరమాత్మ సాధకులను అనుగ్రహించుటకు,
సృష్టి ప్రారంభములో త్రిగుణాత్మకమైన మూల ప్రకృతినే శరీరముగా
స్వీకరించి, ఆ శరీరముతో సృష్టి ప్రారంభములో ఉన్న సూర్యుడికి
188
తత్త్వ జ్ఞానము ఉపదేశము చేస్తా డు. పరమాత్మ త్రిగుణాత్మకమైన
మూల ప్రకృతిని తన ఆధీనములో ఉంచుకొని, ఆ మూల ప్రకృతిని
సాధనముగా తీసుకొని శరీరమును, అవతారమును స్వీకరిస్తా డు.

ధర్మ మార్గములో ఉన్నవారి రక్షణ, అధర్మ మార్గములో


ఉన్నవారిని శిక్షించి, సంహరించి (దుష్టత్వ భావనలను వినాశనము
చేయుట, ఇతరులకు గుణ పాఠము చెప్పుట), వారి మరుసటి
జన్మలో ధర్మ మార్గములోనికి తీసుకువచ్చును.

ధర్మమును పునః ప్రతిష్ఠ చేయును. ధర్మము అనే పదము


సంస్కృత మూలము ధారణాత్ నుండి ఉద్భవించింది, దీని అర్థము
సమాజమును, మానవులను ఒకటిగా కలిసి పట్టు కొని,
నిలబెట్టు తుంది. అందువల్ల మన శాస్త్రములు “ధారణాత్ ధర్మ
ఇత్యాహుః” – ధర్మము సమాజమును, మానవులను ఒకటిగా కలిసి
ఉంచుతుంది. “ధర్మో రక్షతి రక్షితః” ధర్మమును మనము రక్షిస్తే,
ధర్మము మనలను రక్షిస్తుంది. ధర్మము వలన మానవుల మనస్సులు
శుద్ధ పడి, సంస్కారములు ఉత్తమముగా మారతాయి. మానవుల
ప్రవృత్తు లు, భావములు, ప్రవర్తన సక్రమముగా ఉండి ప్రకృతి
సమతుల్యముగా ఉండి, సమాజము, మానవులు అభివృద్ధి
చెందుతుంది. .

189
వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః ।
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః l10l

విషయ వాసనలు లేని (ప్రాపించక వస్తు వుల మీద తృష్ణ, ఆశ


లేని), కోరికలను, కోరికలు తీరవేమో అనే భయమును, కోరికలు
తీరకపోతే వచ్చే కోపమును విడిచిపెట్టి, కేవలము పరమాత్మ మీద
భావన ఉంచుకొని, పరమాత్మతో తాదాప్యము చెంది, నా దగ్గరకు
వచ్చి నన్ను ఆశ్రయించిన వాళ్ళు

చాలామంది పరమాత్మ తత్త్వ జ్ఞానము అనే తపస్సుతో


పవిత్రమై, నాలో ఐక్యమైపోయారు. .

తపస్సు

ఏ పనైనా సరే పరమాత్మను చేరాలి అనే


సంకల్పముతో శ్రద్ధతో, నిష్టతో, భక్తితో చేస్తే అది తపస్సు అవుతుంది.
తపస్సు అంటే స్వీయ క్రమశిక్షణ. ఇంద్రియములను, శరీరమును
నియంత్రించి సాధనతో మానవుల లోపల నిద్రాణ స్థితిలో ఉన్న
సామర్ధ్యమును మేల్కొలిపి పెంపొందించుకొనుట. ఉపనిషత్తు లలో
ఎన్నో విధములైన తపస్సుల గురించి చెప్పుచున్నవి. వాటిలో కొన్ని
తపస్సులు - సృతం తపః, కృతం తపః, సత్యం తపః, శాంతం తపః,
దమ తపః, శమ తపః, దానం తపః, యజ్ఞం తపః. జ్ఞాన తపః.

190
ముండకోపనిషత్ 1-1-8 – “తపసా చీయతే బ్రహ్మ తతోన్న
మభిజాయతే” అక్షర బ్రహ్మము జ్ఞాన తపస్సుతో అభివృద్ధి
అగుచున్నది. 1-1-9 – “య స్సర్వజ్ఞః సర్వవిద్యస్త్య జ్ఞానమయం
తపః" – సామాన్య వృత్తిలో సర్వజ్ఞుడు, విశేష జ్ఞానముతో సర్వవేత్త.
అట్టి వానికి జ్ఞానమే తపస్సు.

తైత్తీరీయోపనిషత్ – బృగువల్లి – 3-3 – “తపసా


బ్రహ్మవిజిజ్ఞా సస్వ I తపో బ్రహ్మేతి I స తపోతప్యత I స తప స్తప్త్వా”
– బృగు మహర్షి తన తండ్రి వరుణుడిని బ్రహ్మ స్వరూపము
చెప్పమని అడిగాడు. వరుణుడు “తపస్సు బ్రహ్మ స్వరూపము.
తపస్సు చేతనే బ్రహ్మమును తెలుసుకొనవలెను” అని చెప్పెను.

కఠోపనిషత్ – 1-2-14 – “సర్వే వేదాయత్పదమామనన్తి,


తపాగ్ం సర్వాణి చ యద్వదన్తి” – సమస్త వేదములు దేని గురించి
చెప్పుచున్నవో, దానిని లక్ష్యముగా పెట్టు కొని, తపస్సు ద్వారా
పరమాత్మ యొక్క మహాత్మ్యము, గొప్పతము తెలుసుకొని,
సర్వోత్తమమైన ప్రయోజనమును పొందుదురు.

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం ।


మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ॥ 11 ॥

191
ఎవరెవరు ఏ, ఏ విధముగా నన్ను ప్రార్ధిస్తా రో, ఆశ్రయిస్తా రో
ఆ, యా విధమునకు అనుగుణముగా వాళ్లను నేను
అనుగ్రహిస్తు న్నాను.

నేను ఏ మార్గములను (కర్మ మార్గము, జ్ఞాన మార్గము)


ఏర్పాటు చేశానో, ఆ మార్గములనే మానవులు అనుసరిస్తు న్నారు.
అందరూ నా వారే.

బ్రహ్మ సూత్రములు 2-1-12. ద్వితీయోధ్యాయము – ప్రధమ


పాదము - 12. వైషమ్య నర్థు ణ్యాధికరణమ్ - 34.
“వైషమ్యనైర్థు ణ్యాధికరణమ్” – పరమాత్మ మానవులకు వేరు, వేరు
ఫలితములను ఇస్తు న్నాడంటే, పరమాత్మకు మానవుల అందరి
యందు సమతా భావము, దయ లేదు అనే దోషములు వస్తా యి.
కాని మానవులు చేసుకున్న కర్మలు (పుణ్య, పాపముల) బట్టి, వాటికి
తగట్టు గా పరమాత్మ ఫలితములను ఇస్తా డు. కాబట్టి పరమాత్మకు ఏ
విధమైన బేధ బావన లేదు. కాబట్టి పరమాత్మకు ఏ విధమైన
దోషములు లేవు.

బ్రహ్మ సూత్రములు 3-2-8 – తృతీయోపాధ్యాయ –


ద్వితీయ పాదము – 8 -ఫలాధికరణము – 38 – “ఫలమత
ఉపపత్తేః” – మానవులు ఏ పుణ్య కర్మ కాని, ఏ పాప కర్మ కాని

192
చేసినా, వాటికి ఫలితములు ఇచ్చేవాడు పరమాత్మ మాత్రమే తప్ప
మరొకరు కాదు.

కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః ।


క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ॥12॥

మానవులలో వారు చేసిన కర్మలకు ఫలితము కావాలనే కోరిక,


కాంక్ష బలముగా ఉండి, ఆ ఫలితముల కోసము వాళ్ళు
తహతహలాడుతారు. వాళ్ళ, వాళ్ళ కోరికలకు ఒక్కొక్క దేవతను
నియమించుకొని (ధనముకు లక్ష్మీదేవి, విద్యకు సరస్వతీదేవి,
సంతానమునకు కుమారస్వామి, వీసాకు ....) ఆ, యా దేవతలను
సేవించి, ఆ దేవతల నుండి ఆ, యా కోరికలు కోరుకుని, ఆ దేవతల
నుండి ఫలితముల కోసము ఎదురు చూస్తూ ఉంటారు. కాని వాళ్ళ
కర్మలకు ఫలితములు నేనే ఇస్తు న్నాను.

మానవ లోకములో మానవులకు, వాళ్ళ కర్మలకు ఫలితములు


త్వరగా, వెంటనే దొరుకుతుంది.

ఒక కోరిక ఫలించగానే, వెంటనే మరొక కోరిక, తరువాత


వెంటనే మరొక కోరిక మొదలవుతూ కోరిక, ఫలితము
లంపటములో మానవులు మునిగిపోయి ఉన్నారు. భోగములు
అనుభవించుటకు అందరూ స్వర లోకమే కోరుకుంటారు.
అందుచేత మానవులకు పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు,

193
మోక్షము అనేది ఒకటి ఉన్నది అని ఆలోచించే సమయము వాళ్లకు
లేనే లేదు. పరమాత్మ, వేదాంతము (ఆత్మ జ్ఞానము), ఉపాసన,
వైరాగ్యము, మోక్షము అనగానే ఇప్పుడే ఎందుకు, రిటై ర్ అయ్యాక,
ముసలితనము వచ్చాక అప్పుడు ఆలోచిద్దా ములే అంటారు. రిటై రు
అయి, ముసలివాడయ్యాక, అప్పటికే మూడు వంతుల పైన
జీవితము అయిపోయి, అంతవరకూ నిషిద్ధమైన కర్మలు,
అన్యాయములు, అక్రమములు చాలా చేసేసి నరక లోకములో, నీచ
జన్మలకు సీటు రిజర్వేషను చేసేసుకొని, అంతవరకూ
భోగములకు, సుఖములకు అలవాటై న శరీరముతో అప్పుడు
వేదాంతము నేర్చుకుని, అవలంబించేందుకు ఓపిక లేక కాలము
వృధా చేసుకుంటారు. అందుకు మానవులకు లౌకికమైన,
ప్రాపించక భోగములపైన, సుఖములపైన అంతులేని కోరికలు, వాటి
ఫలములపై ఉన్న ఆసక్తి మాత్రమే కారణము. భూలోకములో తప్ప,
పై లోకములలో యజ్ఞములు, సత్కర్మలు చేయుటకు అవకాశము
లేదనే చెప్పాలి.

 చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః ।


తస్య కర్తా రమపి మాం విద్ధ్యకర్తా రమవ్యయం ॥ 13 ॥

నేను త్రిగుణాత్మకమైన (సత్త్వ గుణము, రజో గుణము, తమో


గుణము) మూల ప్రకృతితో సృష్టిని చేశాను. ఆ మూడు గుణముల

194
వలన కలిగే ప్రభావము, ప్రయోజనములను, ఫలితములను
అనుసరించి, వాళ్ళు చేయగల కర్మలకు అనుగుణముగా నేను
మానవులను నాలుగు వర్ణముగా నా చేత సృష్టించబడ్డా రు.

నేను ఏ కర్మ ఫలితమును ఆశించి ఏ పని చేయుట లేదు.


అందుచేత ఏ రకమైన కర్మలకు నేను కర్తను కాను అని తెలుసుకో.
నేను ఏ రకమైన వినాశనము లేని, సర్వ వ్యాపకమైన ఆత్మ, ఆనంద
స్వరూపమును అని తెలుసుకో.

శుద్ధ సత్త్వ గుణము

సృష్టిలో ఉన్న ప్రతి జీవిలోనూ, ప్రతి వస్తు వులోనూ మూల


ప్రకృతి యొక్క మూడు గుణములు (సత్త్వ, రజో, తమో
గుణములు), వాటి ప్రభావము ఉంటాయి. శుద్ధ సత్త్వ గుణము
వివేకము, జ్ఞానము, ఆనందము అనే ప్రయోజనములు
కలిగిస్తుంది. శుద్ధ సత్త్వగుణము ఎక్కువగా ఉండి (రజో గుణము,
తమో గుణము తక్కువగా ఉండే) మానవులలో శమము
(కామము, క్రోధములు లేకుండా శాంతముతో ఉండుట), దమము
(ఇంద్రియ నిగ్రహము) కలవారు చేయగలిగే యజ్ఞము, యాగము,
వేద పఠనము, ఉపాసన, బ్రహ్మ జ్ఞానమును సంపాదించుకొని,

195
శిష్యులకు ఉపదేశించుట మొదలైన కర్మలను నిర్దేశించి సృష్టి
చేశాను.

రజో గుణము

రజో గుణము ఎక్కువగా ఉండి (సత్త్వ గుణము, తమో


గుణము తక్కువగా ఉండే) మానవులలో ఆత్మాభిమానము,
అనుబంధము, కార్యకలాపములు, ఉద్యమము, ఆందోళన,
దురాశ, కోపము మరియు ఇతరులు మీద ఆధిపత్యము అనే
ప్రభావము కలిగిస్తుంది. అటువంటి మానవులలో బలము, శౌర్యము,
క్రియా శక్తి ఎక్కువగా ఉన్న వారికి జ్ఞాన పూర్వకమైన క్రియలతో
మానవులను రక్షణ కల్పిస్తూ, పరిపాలించే కర్మలను నిర్దేశించి సృష్టి
చేశాను.

రజో గుణము, తమో గుణము సమ్మేళనము

సత్త్వ గుణము తక్కువగా ఉండి, రజో గుణము, తమో


గుణము సమానముగా ఉండే మానవులకు వాళ్ళ గుణముల
ప్రభావమునకు తగ్గట్టు గా వ్యవసాయము, వ్యాపారము,
పారిశ్రామికము కర్తవ్యముగా నిర్దేశించి సృష్టి చేశాను.

196
తమో గుణము

సత్త్వ గుణము, రజో గుణము తక్కువగా ఉండి, తమో


గుణము ఎక్కువగా ఉండే మానవులలో అజ్ఞానము ఎక్కువగా ఉన్న
మానవులకు చేతి పనులు చేయుట, శుశ్రూష (సేవ) కర్తవ్యముగా
నిర్దేశించి సృష్టి చేశాను.

ఆ, యా గుణముల ప్రభావముతో ఎవరు ఏ, ఏ కర్మలు


చేయగలరో ఆ విధముగా వాళ్ళ కర్తవ్యములను నిర్ణయించి పెట్టా ను.
వాళ్ళు ఆ, యా కర్మలలో పాటిస్తూ ఉంటే వాళ్లకు ఫలితము వెంటనే
కలుగుతుంది, సమాజము కూడా సవ్యముగా నడుస్తుంది. ఎవరైనా
వాళ్లకు విహితమైన, నిర్దేశించబడిన, కర్మలను విడిచిపెట్టితే, దానికి
నేను (పరమాత్మ) బాధ్యుడను కాను.

అజ్ఞానము, అహంకారము

నేను ఈ పని చేశాను. నేను ఈ పనికి కర్తను. నాకు ఈ


కర్మకు ఫలితము కావాలి, రావాలి అని అందరూ అనుకుంటారు.
అహంకార పూరితమైన (నేను అనే స్వభావము, దేహమునే నేను
అని భ్రమించుట) అజ్ఞానముతో, ప్రాపించక విషయములపై కామము

197
(కోరిక, స్పృహ, ఇచ్చ, కాంక్ష) కలిగి, కోరికతో కర్మ ఏర్పడి, కోరికతో
చేసే ఆ కర్మకు కర్తృత్వ భావము (కర్త) ఏర్పడి, ఆ కర్తృత్వ భావనతో
చేసిన కర్మ యొక్క ఫలితము తీసుకోవలసి ఉంటుంది. ఏ పని ఎవరు
చేస్తే, ఆ పని యొక్క ఫలితము వాళ్లకు దక్కుతుంది. అహంకారము
(నేను అనే భావన) ఆత్మ మరియు శరీరము యొక్క
సంపర్కముతో, తాదాత్మ్యముతో ఏర్పడుచున్నది.

ఈ పరిమితి అయిన శరీరము త్రిగుణాత్మకమైన మూల


ప్రకృతి నుండి పుట్టినది. ఆత్మ స్వరూపము పరమాత్ముని యొక్క
అంశము, త్రిగుణాత్మకమైన మూల ప్రకృతితో ఏ విధమైన
సంబంధము లేని వ్యాపకమైన శుద్ధ ఆనంద స్వరూపము. ఈ
రెండింటికి వేర్వేరు స్వభావములు ఉన్నా, అజ్ఞానము (మాయ) అనే
మూల కారణముతో ఆత్మ వేరు, శరీరము వేరు అనే సత్యము
కప్పబడి, శరీరమే నేను లేక నేను అనే స్వభావము (అహంకారము)
ఏర్పడుచున్నది.

అజ్ఞానము వలన అహంకారము (నేను అనే భావన),


అహంకారము వలన ప్రాపించక విషయములపై ఎడతెగని కోరికల
పరంపర, కోరికలను తీర్చుకొందుకు కర్మలు, కోరికలతో చేసిన

198
కర్మలకు కర్తృత్వ భావన, కర్తృత్వ భావన వలన కర్మ ఫలములు, కర్మ
ఫలముల వలన జన్మ, మరణ చక్రము (సంసారము) ఏర్పడి,
మానవుడు ఈ చక్ర భ్రమణములో తిరుగుతూనే ఉన్నాడు.

న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా।


ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ॥ 14 ॥

నేను (పరమాత్ముడు) ఏ కర్మలకు కర్తను కాదు. నేను చేసిన


కర్మలకు ఫలితములు రావాలని, ఆ ఫలితములు నాకు దక్కాలని
నాకు కోరిక లేదు. అందువలన నాకు కర్తృత్వబావన లేదు, కాబట్టి ఆ
కర్మలు నాకు అంటవు (పరమాత్మకు అజ్ఞానము లేదు. అందుచేత
శరీరమే నేను అనే అహంకారము లేదు. అందుచేత పరమాత్మకు
కోరికలు లేవు. కోరికలు లేవు కాబట్టి పరమాత్మకు కర్తృత్వబావన
లేదు).

ఇలా ఎవరైతే తెలుసుకుంటారో, వాళ్లకు కూడా కర్మతో


సంబంధము ఉండదు. అందుచేత వాళ్లను కూడా కర్మ బంధించదు.

కఠోపనిషత్ – 2-2-11 – “సూర్యో యథా సర్వలోకస్య చక్షు


ర్నలిప్యతే చాక్షుషై ర్బాహ్యదోషైః I ఏక స్తథా సర్వభూతాస్త రాత్మా, న
లిప్యతే లోకధుఃఖేన బాహ్యః” – సూర్యుడు తనంతట తాను
ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ ప్రకాశమునకు ఈ ప్రపంచము అంతకు

199
కళ్ళులా వెలుగు ఇస్తు న్నాడు. కాని ప్రపంచములో జరిగే ఏ క్రియలకు,
సూర్యుడికి ఏ విధమైన సంబంధము లేదు, బాధ్యతా లేదు.
సూర్యుడు ప్రపంచములో జరిగే క్రియలకు సాక్షి మాత్రమే.
ప్రపంచమంతా సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మకు,
ప్రపంచములో జరిగే క్రియలకు కర్తృత్వము ఉండదు. కర్తృత్వము
లేనందున ఆ క్రియతో ఫలముతో పరమాత్మకు ఏ సంబంధము
లేదు.

చాణక్య అర్ధ శాస్త్రములో - “నిరీహాణాం ఈషత్ త్రు ణమేవ


తిరస్కార విషయః” – ఏ కోరికా లేనివాడికి రాజుగారు గడ్డి పోచతో
సమానము.

కౌషీతకీబ్రాహ్మణోఉపనిషత్ – 3- 1 – కొన్ని యుగములకు


పూర్వము దేవతలు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధములో, ప్రతర్దన
మహారాజు దేవతలకు సహాయము చేశాడు. దేవతలు ఆ
యుద్ధములో గెలిచారు. ఇంద్రు డు ప్రతర్దన మహారాజుతో – నీకు
ప్రియమైన వరమును కోరుకో అని అన్నాడు. అప్పుడు ప్రతర్దనుడు
“...స్త్వమేవ వృణీష్య యమ త్వం మనుష్యాయ హితతమం మన్యస్య
ఇతి....” - ఇంద్రా I మానవులకు ఏది హితమో, మంచిదో, నీవే
నిర్ణయించి నాకు వరముగా ప్రసాదించుము అని అన్నాడు. దానికి
ఇంద్రు డు సంతోషించి, మానవులకు అన్నింటికంటే ఆత్మ జ్ఞానమే
హితమైనది అని చెప్పి ప్రతర్దన మహారాజుకు ఆత్మ జ్ఞానము
200
వరముగా బోధించెను. మానవులకు నేను ప్రియమైనవాడను. వాళ్ళు
నన్ను అర్ధము చేసుకోవట లేదు. నేను చాలా మంచి పనులు, చాలా
చెడ్డ పనులు చేశాను. “త్రిశీర్షణం త్వాష్ట్ర మహన
మవాణ్ముఖాన్యతీంత్సాలావృ కేభ్యః ప్రాయచ్చం .....” త్వష్ట ప్రజాపతి
(ద్వాదశ ఆదిత్యులలో ఒకడు) కుమారుడు మూడు తలలు కల
వృత్రాసురుడు అనే రాక్షసుడిని నేను సంహరించాను. కొంతమంది
మహర్షులు తపస్సు చేస్తా మని అడవులకు వెళ్లి, తప్పుడు సాధనాలు
చేసి కాలక్షేపము చేస్తు న్నారు. చేస్తు న్నారు. అది ప్రజలకు ఉదాహరణ
కాకూడదని వాళ్లను అడవి కుక్కలకు ఆహారముగా వేశాను. “స్తస్య
మే తత్ర న లోమచనా మీయతే ......” – నా ఒక్క వెంట్రు కకు కూడా
అపకారము కలగలేదు. నాకు ఆత్మ జ్ఞానము బాగా తెలుసు. నేను
నా బాధ్యతను స్వీకరించి, నేను ఇటువంటి కర్మలు చేశాను. నాకు
ఈ కర్మలతో ఏ విధమైన సంబంధము లేదు. ఈ కర్మ ఫలితములపై
నాకు కోరిక కూడా లేదు. అందుచేత ఈ కర్మలు నాకు అంటవు.

బ్రహ్మ సూత్రములు – 1-11-30 – ప్రధమోపాధ్యాయ, ప్రధమ


పాదము - 11. ప్రతర్దనాధికరణమ్ - 30. శాస్త్ర దృష్ట్యా తూపదేశో
వామ దేవవత్ – శాస్త్ర జ్ఞానము పూర్తిగా పొంది, పూర్తిగా అర్ధము
చేసుకొని, సరైన బాధ్యతలను నిర్వర్తిస్తు న్న ఇంద్రు డు, ఈ విధమైన
(పైన చెప్పిన) ఉపదేశము చేయవచ్చును.

201
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః ।
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతం ॥ 15 ॥

కర్మ ఫలము మీద కోరిక లేకుండా, కర్తృత్వ భావము


లేకుండా, రాగ ద్వేషములు లేకుండా, సమతా భావముతో సత్కర్మ
ఆచరణ చేస్తే, ఆ కర్మ బంధించదు మరియు అంతఃకరణ
పరిశుభ్రము అవుతుందని చాలా మంది అర్ధము చేసుకున్నారు.
అనాది నుండి, ప్రాచీనులు కొంతమంది మహానుభావులు మోక్షము
తప్ప ప్రాపించక ప్రయోజనములు అక్కర లేదు అనుకునే
ముముక్షువులు కూడా వారి, వారి సాధనలో ఒక భాగముగా
నిర్దిష్టమైన సత్కర్మ ఆచరణ చేశారు.

నీవు కూడా నీకు విహితమైన సత్కర్మ ఆచరణ


చేయవలసినదే. నీవు కర్మ మార్గములోనే ఉండాలి, మరొక
మార్గములో వెళ్ళుటకు నీకు యోగ్యతా లేదు. నీ పూర్వ తరము
వాళ్ళు, వాళ్ళ పూర్వ తరము వాళ్ళు కూడా సత్కర్మ ఆచరణ
చేశారు.

ఉదాహరణ

శ్రీరాముడికి (రాఘవుడు) పూర్వజుడు (ముత్తా త) రఘు


మహారాజు పేరు మీద ఆ వంశమునకు రఘు వంశము అనే పేరు
వచ్చినది. రఘు మహారాజు చాలా ధర్మాత్ముడు. రాజ్య భారము

202
వహించిన తరువాత, దుర్మార్గులైన రాజులపై దండ యాత్ర చేసి, వాళ్ళ
దగ్గర నుండి కప్పములు తెచ్చి, ఆ ధనముతో విశ్వజిత్ అనే మహా
యాగము చేశాడు. ఆ యాగములో రాజ్య రక్షణకు అవసరమయ్యే
ధనము తప్ప, తనకు ఒక్క భోజనమునకు కావలసిన ధనము తప్ప,
తన దగ్గర ఉన్న మిగిలిన ధనమును అంతా దక్షిణగా ఇచ్చెయ్యాలి.
రఘు మహారాజు అలానే ఆయన సంపదలన్నీ దక్షిణగా ఇచ్చేశాడు.
తను మట్టి పాత్రలలో ఆహారమును వండుకుంటూ, రాజ్య పాలన
చేస్తు న్నాడు.

గురువు దగ్గర విద్యను పూర్తి చేసుకొన్న స్నాతకుడు వస్తే


అందరూ ఆదరముగా ఆహ్వానించి గౌరవించి, అతను ఏది కోరితే,
దానిని అందరూ తీర్చవలసినదే (ఇది శాస్త్ర నియమము). గొప్ప
విద్యావంతుడు వరతంతు మహర్షి యొక్క శిష్యుడు కౌస్తు డు,
రఘు మహారాజు దగ్గరకు వచ్చి, నేను స్నాతకుడను అని చెప్పగా,
రఘు మహారాజు అతనిని ఆహ్వానించి, తన దగ్గర ఉన్న మట్టి
పాత్రలలో ఉన్న నీళ్ళతో కౌస్తు డి పాదములు కడిగి ఆదరించి,
త్రాగటానికి మట్టి పాత్రలో నీళ్ళు ఇచ్చాడు. రఘు మహారాజు,
కౌస్తు డుని ఏమి కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు కౌస్తు డు
మీ పరిస్థితి చూస్తే, నా పని అవదు. నేను వెళ్ళు తాను అన్నాడు.
రఘు మహారాజు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉత్త చేతులతో

203
వెళ్ళకూడదు. నీకు ఏమి కావాలో చెప్పు అని అన్నాడు. అప్పుడు
కౌస్తు డు తన వృత్తాంతము చెప్పాడు.

కౌస్తు డు, వరతంతు మహర్షి దగ్గర విద్య పూర్తి చేసుకొని,


గురువుకి నమస్కరించి, తను గురు దక్షిణగా ఏమి ఇవ్వాలో
చెప్పమని గురువుగారిని ప్రార్థించాను. వరతంతు మహర్షి నీవు నా
దగ్గర చక్కగా విద్య నేర్చుకున్నావు. అదే నాకు గురు దక్షిణ. నాకు
ఇంకేమీ ఏమీ వద్దు . నీవు గృహస్థ ఆశ్రమము స్వీకరించి, వివాహము
చేసుకొని నీ జీవితము ధర్మ మార్గములో చక్కగా సాగించు అన్నారు.
నేను అలా కాదు, మీరు గురు దక్షిణ తీసుకోవాలని అని అడిగితే
ఆయన వద్దు , వద్దు అని నిరాకరించారు. నేను ఆయన మాట
వినకుండా మరలా, మరలా గురు దక్షిణ తీసుకోవాలని అని
పట్టు పట్టా ను. దానికి ఆయన చిరాకులో, సరే నీవు నా దగ్గర
పద్నాలుగు (14) విద్యలు నేర్చుకున్నావు, ఒక్కొక్క విద్యకు కోటి
బంగారు నాణెములు చొప్పున 14 కోట్ల బంగారు నాణెములు నాకు
గురు దక్షిణగా ఇవ్వు అని అన్నారు. ఇప్పుడు ఆ గురు దక్షిణ నేను
ఇవ్వాలి. కాని నేను బీదవాడిని. అందుకని మీ లాంటి రాజుగారిని
దగ్గర అడిగి తీసుకొని ఆయనకు ఇవ్వాలని వచ్చాను. ఇప్పుడు మీ
పరిస్థితి చూచాను. మీరు ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఇక నేను
వెళ్ళు తాను అన్నాడు.

204
రఘు మహారాజు ఒప్పుకోలేదు. కౌస్తు డుతో నేను ఏదో చేసి
నీ పని చూస్తా ను. నీవు ఉండు అన్నాడు. తరువాత రఘు మహారాజు
ఆలోచనలో పడ్డా డు. ఖజానాలో మిగిలి ఉన్న ధనము రాజ్య
పాలనకు మాత్రమే ఉపయోగించాలి. ఇంకొక పనికి ఉపయోగించ
కూడదు. అధర్మముగా పరిపాలిస్తు న్న రాజులను ఇదివరకే
దండించేశాడు. అలాంటివారు ఇంక ఎవ్వరూ లేరు. ధర్మముగా
పాలించే రాజులపైన దండెత్తకూడదు. ఏమి చెయ్యాలి అని
ఆలోచించి, ఆలోచించి ధనాధిపతి కుబేరుడి మీదకు దండెత్తితే తగిన
ధనము వస్తుంది అని నిర్ణయించి, తన నిర్ణయమును ప్రకటించాడు.
మర్నాడు ఉదయమునే కుబేరుడి మీదకు యుద్ధమునకు
బయలుదేరుటకు, నియమము ప్రకారము, ఆ రాత్రి రధములోనే
నిద్రపోయాడు. ఈ విషయము తెలిసిన కుబేరుడు, రఘు
మహారాజు యొక్క ప్రతాపము (తన పూర్వజుడు అయిన సగర
మహారాజు అశ్వమేధ యాగము గుర్రమును అపహరించి, సముద్ర
గర్భములో కపిల మహర్షి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న
చెట్టు కు కట్టిన ఇంద్రు డినే భయపెట్టిన వాడు) కూడా తెలుసును
కాబట్టి, కుబేరుడు భయపడి ఆ రాత్రే రఘు మహారాజు ఖజానా
అంతా పూర్తిగా నింపేశాడు. రఘు మహారాజు మర్నాడు ఉదయమే
లేచి, కుబేరుడితో యుద్ధమునకు బయలుదేరుటకు సిద్ధము
అవుతుండగా, ఖజానా అధికారులు రాజు గారి దగ్గరకు వచ్చి,

205
ఖజానా అంతా నిండిపోయింది అని చెప్పారు. కుబేరుడు భయపడి
ఖజానా నింపేశాడని తెలుసుకొని, యుద్దము విరమించి, ఆ
కౌస్తు డుని పిలిపించి, కుబేరుడు నింపిన ధనము అంతా, నేను నీ
కోసము సంపాదించాను. కాబట్టి నీవు (కౌస్తు డుని) ఆ ధనమంతా
తీసుకొని వెళ్ళమన్నాడు. కౌస్తు డు నేను గురు దక్షిణ ఇవ్వటానికి
నాకు కావలసినది, నిన్ను అడిగినది 14 కోట్ల బంగారు నాణెములు
మాత్రమే. అంతకంటే ఎక్కువ నేను తీసుకోను. నాకు ఇంత ధనము
వద్దు , నేను ఇంత ధనము తీసుకు వెళ్ళను అంటాడు. రఘు
మహారాజు ఈ ధనమంతా నేను నీ కోసమే సంపాదించాను. కాబట్టి
ఆ ధనమంతా నువ్వు తీసుకెళ్లా లి అంటాడు. ఇంకా ఆ వివాదము
జరుగుతూనే ఉన్నది. కోట్ల సంవత్సరములు అయినా వాళ్ళ మధ్య
ఈ వివాదము ఇంతవరకూ తేలలేదుట.

పూర్వ కాలములో కర్మ ఫలము మీద ఏ ఆశ లేకుండా,


సత్కర్మ ఆచరణ చేసిన మహాత్ములు చాలా మంది ఉన్నారు.
పరమాత్మ యొక్క ఈ ఉపదేశము అందరికీ వర్తిస్తుంది.

కిం కర్మ కిమకర్మేతి కవయోఽప్యత్ర మోహితాః ।


తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ॥ 16 ॥

సత్కర్మ ఆచరణ, ఏది కర్మ, ఏది అకర్మ, కర్మ మార్గము


గురించి ఉపదేశము చాలు అనుకుంటే అది పెద్ద భ్రమ. గొప్ప, గొప్ప

206
మేధావులకు, పండితులకు, కవులకు, మహానుభావులకు ఏది కర్మ,
ఏది క్రియ, ఏది అకర్మ గురించి స్పష్టతే లేక సందేహములతో మొహ
పడుతున్నారు.

అందుచేత నేను కూడా ఆ కర్మ మార్గము గురించి చక్కగా


స్పష్టముగా చెప్పుతాను. ఆ కర్మ మార్గమును చక్కగా తెలుసుకొని,
చక్కగా ఆచరించినట్లయితే, అశుభమైన ఈ సంసార దుఃఖము
(జన్మ, మరణ అనే అశుభ ఫలము) నుండి విముక్తి లభిస్తుంది.

ఉదాహరణ

రైలులో ప్రయాణించే ప్రయాణికుడు, బయటకు చూసి


చెట్లు , భూమి అంతా వెనక్కు వెళ్ళుతున్నట్లు , తను, రైలు మాత్రము
కదలకుండా ఉన్నట్లు భ్రమ అందరకూ కలిగేదే. అంటే తను, రైలు
కదిలే క్రియను, కదలకుండా ఉండే ఆ చెట్లకు, భూమికి ఆపాదించి,
తను, రైలు కదిలే క్రియను తను చేయుట లేదు అని భ్రమిస్తా డు.
ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొన్న మనిషి, నేను ఏమీ చేయుట
లేదు అని అనుకుంటాడు. కాని అతను నేను ఏమీ చేయుట లేదు
అనే ఆలోచన అనే క్రియను మనస్సుతో చేస్తు న్నాడు.

కర్మణో హ్యపి బోద్ధవ్యం హయపు చ వికర్మణః ।


అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ॥17॥

207
ఏ కర్మ చేస్తు న్నా, ఆ కర్మ (చేయవలసిన కర్మ) గురించి
పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఆ కర్మకి విరుద్ధమైన కర్మల
(వికర్మ, చేయ కూడని కర్మ) గురించి కూడా పూర్తిగా అవగాహన
ఉండాలి.

ఏ విధమైన కర్మలు చేయకపోవటము (అకర్మ) అంటే


ఏమిటి, అని కూడా పూర్తిగా అవగాహన ఉండాలి. కర్మలు, కర్మ
ఫలముల యొక్క గతి, తీరు చాలా గహనమైన (లోతైన తెలియని)
విషయములు.

ఉదాహరణ

ఒక రాజుగారు తన దగ్గర ఉన్న ముగ్గురు మంత్రు లను


పిలిచి, వాళ్లను అడవికి వెళ్ళు, పళ్ళు కోసుకొని సంచిలో
తీసుకురమ్మని ఆజ్ఞ వేశారు. ఆ ముగ్గురు మంత్రు లు, మూడు
వేర్వేరు సంచులు తీసుకొని, అడవికి వెళ్ళారు. మొదటి మంత్రి
(శ్రద్ధగా చక్కగా పని చేసేవాడు - కర్మ) చెట్లు ఎక్కి మంచి, మంచి
పళ్ళు ఏరి సంచి నింపాడు. రెండవ మంత్రి (అడ్డదిడ్డముగా పని
చేసేవాడు - వికర్మ) రాజుగారికి ఇవన్నీ చూచుటకు సమయము
ఉండదు, కాబట్టి మనము ఎలా చేసినా సంచి నింపటమే ముఖ్యము
అని ఆలోచించి, కొన్ని మంచి పళ్ళు, కొన్ని కుళ్లిన పళ్ళు, కొన్ని పచ్చి
కాయలు కోసి సంచి నింపాడు. మూడవ మంత్రి (అసలు పని

208
చేయనివాడు - అకర్మ) రాజుగారు మర్చిపోయే రకము. ఆయన
మనలను అడగడు, అని ఆలోచించి ఎండిపోయిన ఆకులతో సంచి
నింపేశాడు. వాళ్ళు రాజ్యములోకి రాగానే రాజుగారి ఆజ్ఞ ప్రకారము,
రాజ భటులు ఆ ముగ్గురు మంత్రు లను బంధించి, వాళ్లను వాళ్ళు
తెచ్చిన సంచులతో, వేర్వేరుగా కారాగారములలో బంధించి, ఏ
ఆహారమూ ఇవ్వకుండా, వాళ్ళు తెచ్చుకున్న పళ్ళను తినమని
చెప్పారు. కర్మ సరిగ్గా చేసిన మొదటి మంత్రి, తాను తెచ్చిన మంచి
పళ్ళను తిని చక్కగా ఉన్నాడు. అడ్డదిడ్డముగా పని చేసేవాడు –
వికర్మ చేసిన రెండవ మంత్రి, తను తెచ్చిన కొన్ని మంచి, కొన్ని కుళ్లిన,
కొన్ని పచ్చిగా ఉన్న పళ్ళను తిని, కొంత సేపు చక్కగా ఉండి, కొంత
సేపు బాధ పడ్డా డు. ఇంక అసలు పని చేయనివాడు – అకర్మ చేసే
మూడవ మంత్రి, తను తెచ్చిన ఎండిన ఆకులను తినలేక పస్తు ఉండి
ఆకలితో చాలా బాధ పడ్డా డు.

 కర్మణ్యకర్మ యః పశ్యేద్ అకర్మణి చ కర్మ యః ।


స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ॥ 18 ॥

కర్మ తత్త్వము గురించి పరిపూర్ణముగా అవగాహన ఉన్న


సాధకుడు, ఎక్కడైనా కర్మ జరుగుతున్నట్లు అనిపించినా, అక్కడ ఏ
విధమైన కర్మ జరుగుటలేదు అని తెలుసుకుంటాడు. అలాగే

209
ఎక్కడైనా ఏ కర్మ జరుగుటలేదు అని అనిపించినా, అక్కడ కర్మ
జరుగుతున్నది అని తెలుసుకుంటాడు.

వాడే మనుష్యులలో తెలివైనవాడు మరియు నేను చెప్పిన


కర్మ యోగమును (సత్కర్మ ఆచరణ సమతా భావనతో చేయుట)
పొందినవాడు వాడు. ఆ మహానుభావుడు చేయవలసిన కర్మలు
అన్నిటినీ సక్రమముగా, చక్కగా చేసినవాడు.

శరీరము మరియు అవయవములు కర్మలు చేస్తు న్నాయి.


ఆత్మ స్వరూపము కర్మ చేయదు. అందుచేత ఏ విధమైన కర్మలు,
కర్మ ఫలములు ఆత్మకు అంటవు. ఆత్మ స్వరూపము వ్యాపకమైనది,
నిష్క్రియా స్వరూపము. ఆ కర్మ, కర్మ ఫలము మీద కోరిక లేకుండా
అ కర్మతో ఏ సంబంధము లేకుంటే, అ కర్మ మరియు ఆ కర్మ
ఫలము ఆత్మకు అంటదు అని తెలుసుకుంటారో, లేదా తను
మానసికముగా ఏ పనీ చేయుట లేదు అని అనుకుంటూ
(సూక్ష్మమైన అనుకొనుట అనే మానస క్రియ జరుగుతున్నది కదా),
నేను ఆలోచన అనే మానస కర్మ చేస్తు న్నాను అని తెలుసుకుంటాడో
(వాస్తవముగా ఎక్కడ కర్మ లేదో, ఎక్కడ కర్మ ఉందో అని స్పష్టముగా
అవగాహన చేసుకుంటారో, వారే నిజమైన బుద్ధిమంతులు.

ఉదాహరణ

210
ఒక రాజు కుమారుడు, గురువుగారి ఆశ్రమములో విద్య
నేర్చుకుంటున్నాడు. గురువు గారు, ఆ రాజ కుమారుడికి కర్మ
గురించి చెప్పుతూ – “కర్మ అనేది త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి
నుండి వచ్చిన శరీరమునకు మాత్రమే పరిమితము. ఆత్మ
స్వరూపమునకు ఆ కర్మతో ఏ సంబంధము లేదు. కాని ప్రతీ వ్యక్తీ,
తనలో తాను నేను (ఆత్మ) కర్మ చేస్తు న్నాను అని అనుకుంటాడు. ఏ
కర్మా చేయకున్నా, మన అజ్ఞానముతో, ఆ కర్మలను ఆత్మకు
ఆరోపిస్తు న్నాము” అని గురువుగారు ఆ రాజ కుమారుడికి
చెప్పారు. ఆ రాజ కుమారుడు తనకు ఏ మాత్రమూ అర్ధము కాలదు
అని చెప్పి, దిక్కులు చూస్తు న్నాడు.

ఇంతలో బయట రాజుగారు ఏనుగు అంబారి మీద కూర్చొని


ఉన్న ఊరేగింపు వెళ్లు తున్నది. ఆ రాజ కుమారుడి దృష్టి అటు మళ్లి,
అటు చూస్తూ ఉన్నాడు. గురువుగారు ఏమి జరుగుతోంది అని
అడిగారు. రా కుమారుడు ఆటే చూస్తూ, మా నాన్న గారు
ఊరేగింపుతో వెళ్ళుతున్నారు అని అన్నాడు. గురువుగారు అదే
ప్రశ్నను రెండు, మూడు సార్లు మరలా అడిగారు. రాజ కుమారుడు
- రాజు అయిన మా నాన్నగారు ఏనుగు మీద ఊరేగింపుగా
వెళ్ళుతున్నారు అనే జవాబే చెప్పుతున్నాడు.

దానికి గురువుగారు నీవు చెప్పుచున్నది తప్పు, మీ నాన్న


అయిన రాజుగారు ఏనుగు మీద కూర్చొనే ఉన్నారు. రాజుగారు
211
ఎక్కడికీ కదలట, నడక లేదు (ఏ కర్మ చేయుట లేదు). ఏనుగు
నడుస్తూ వెళ్లు తున్నది (ఏనుగు నడక అనే కర్మ చేస్తు న్నది). కర్మ
చేయని రాజుగారికి (అకర్మకు), ఏనుగు చేస్తు న్న కర్మను
ఆరోపిస్తు న్నావు అని వివరించారు.

 యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః ।


జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ॥ 19 ॥

నేను చెప్పిన ఆత్మ కర్మ చేయదు, ఆత్మకు కర్మలతో


సంబంధము లేదు అని పూర్తిగా అవగాహనలోకి వచ్చిన తరువాత
వారికి విహితమైన సత్కర్మ ఆచరణ, ఆ కర్మల ఫలముల మీద కోరిక,
సంకల్పము (మనోనిశ్చయము) లేకుండా చెయ్యాలి.

ఆ జ్ఞానము అగ్ని వలె కర్మలను కాల్చివేస్తుంది (కర్మ


ఫలితములు రాకుండా చేస్తుంది). అటువంటి వారిని నిజమైన జ్ఞాని
అని అనుకోవచ్చు.

కర్మలు విత్తనముల వలె, మానవుల సంస్కారములలో


(వాసనలుగా) మానవుల సూక్ష్మ శరీరములో నిలిచిపోయి, తరువాత
వారి జన్మలకు, వారి ప్రవృత్తు లకు (అలవాట్లకు) కారణము
అవుతున్నాయి. జ్ఞానాగ్నిలో కర్మ విత్తనములను వేయించి వేస్తే, కర్మ
అనే విత్తనములు మొలకెత్తవు. అప్పుడు సంస్కారములు (వాసనలు,
ప్రవృత్తు లు) రావు. అప్పుడు తరువాత జన్మలు కూడా రావు.

212
మానవులు అజ్ఞానముతో (శరీరమే ఆత్మ అని భ్రమించి),
నేను (ఆత్మ) కర్మ చేస్తు న్నాను అని అనుకొని, ఆ కర్మ ఫలములు
నాకు (ఆత్మకు) కావాలనే కోరికతో, శరీరము చేసే కర్మలను ఆత్మకు
ఆరోపిస్తు న్నారు. ఆత్మకు శరీరముతో ఏ సంబంధము లేదు అనే
ఆత్మ జ్ఞానము కలిగితే (అజ్ఞానము తొలగిపోయినట్లే), తన చేసే
కర్మలు శరీరమే చేస్తోంది, తాను (ఆత్మ) చేయుట లేదు అనే
జ్ఞానముతో చేసే కర్మలు, వేయించిన విత్తనముల వలె మొలకెత్తవు.

ఉదాహరణ - మార్కండేయ పురాణములోని కధ -


విశ్వావసుడు అనే గంధర్వ రాజు యొక్క కుమార్తె అయిన
మదాలస, చిన్నతనములో సంగీతము, నృత్యము నేర్చుకుంటున్నది.
ఒకరోజు గాలవ మహర్షి ఆమెను చూసి, ఆమె యోగ్యురాలని
గ్రహించి, యోగ నియమముల ప్రకారము ఆమెకు శక్తి పాశము
చేశాడు. వెంటనే ఆమె పూర్వ జన్మలలో సాధించుకున్న యోగ
శక్తు లు అన్నీ ఆమెకు సంక్రమించినవి. అప్పుడు ఆమె అడవులకు వెళ్లి
ఒక్కతే అక్కడ ఉండాలని అనుకుంది. అది ఆ యోగి కనిపెట్టి, నీవు
అలా చేయుటకు వీలులేదు. ఇంకొక నలుగురు ఈ లోకములో
ఆఖరు జన్మ ఎత్తు తారు. వారికి సరైన సమయములో వారు
చేసుకున్న సాధనలను గుర్తు చేసి, వారిని సన్మార్గములో నడిపించే
బాధ్యత నీ మీద ఉన్నది. నీవు ఈ కర్మ మార్గములో ఉండవలసినదే
అని చెప్పారు. ఆవిడ గురువు గారి ఆజ్ఞను ఒప్పుకుంది. తరువాత

213
ఆవిడ తండ్రిగారు మదాలసను ఒక ఋతధ్వజుడు అనే రాజ
కుమారుడుకు ఇచ్చి వివాహము చేశారు. కొన్నాళ్ళకు
ఋతధ్వజుడు మహారాజు అయ్యాడు. మదాలస అన్ని
విషయములలోనూ ఒక రాజుగారి భార్యగా అన్ని పనులు చలాకీగా
చక్కగా చేస్తుంది. కొన్నాళ్ళకు ఆవిడకు ఒక కుమారుడు (విక్రాంత్)
కలిగాడు. ఆవిడ ఆ కుమారుడిని ఉయ్యాలలో పడుకోబెట్టి ఆమె
పాటల (మదాలస గీతములు) ద్వారా, ఆ కుమారుడికి తత్త్వ
జ్ఞానము బోధించుట మొదలుపెట్టింది. విక్రాంత్ కి తత్త్వ జ్ఞానము
బాగా అర్ధమయింది. వాడికి 5 వ ఏట వెళ్లి తండ్రితో నాకు
రాజ్యములో ఉండాలని లేదు. అడవులకు వెళ్లి తపస్సు
చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత రెండవ
కుమారుడు (సుబాహు) పుట్టా డు. తల్లి మదాలస వాడికి అలానే
తత్త్వ జ్ఞానము నేర్పింది. వాడు అలానే అడవులకు వెళ్ళిపోయాడు.
తరువాత మూడవ కొడుకు (శతృమర్ధన్) వాడికి కూడా అలానే
చేశాడు. ఋతధ్వజుడు ఆశ్చర్యపోయి ఎందుకు ఇలా
జరుగుతోందని ఆరాతీసి, తన భార్య మదాలస పిల్లకు పుట్టినప్పుడు
నుండే పాటలతో తత్త్వ జ్ఞానము నేర్పుతోంది అని తెలిసి, అలాంటి
పాటలు పాడకూడదు అని ఆమెకు ఆజ్ఞ వేశాడు. మదాలస సరే అని
ఒప్పుకుంది. తరువాత నాలుగవ కుమారుడు పుట్టా డు. వాడికి
మదాలసే పేరు పెట్టు తాను అని అంది. ఋతధ్వజుడు

214
ఒప్పుకున్నాడు. మదాలస వాడికి అలర్క (పిచ్చి కుక్క) అని పేరు
పట్టింది. దానికీ ఋతధ్వజుడు ఏమీ అభ్యంతరము చెప్పలేదు.
మదాలస అలర్కుడికి ధర్మ మార్గములు, ప్రవృత్తి ధర్మము బాగా
నేర్పింది. మదాలస ముసలివాళ్లు అయ్యారు. అలర్కుడు పెరిగి
పెద్దవాడైన తరువాత అతనికి పట్టా భిషేకము చేసి మహారాజును చేసి,
వానప్రస్థము వెళ్లు తూ. మదాలస అలర్కుడికి ఒక ఉంగరము ఇచ్చి,
నీకు భరించరాని దుఃఖము కలిగినప్పుడు, దీనిలో నేను పెట్టిన
ఉపదేశమును తీసి చదువుకో. తరువాత దత్తా త్రేయ స్వామీ దగ్గరకు
వెళ్లి, నేను పంపానని చెప్పు. ఆయన నీకు కావలసిన ఉపదేశము
చేస్తా రు అని చెప్పి, అడవులకు వెళ్లిపోయినది. అలర్కుడు చాలా
కాలము రాజ్యము చక్కగా పాలించాడు. అతనికి భోగములపై కోరిక
ఎక్కువగా పెరిగి, భోగ లాలసలతో జీవితమును గడుపుతున్నాడు.

అప్పుడు అలర్కుడి అన్న అయిన సుబాహుకు ఈ విషయము


తెలిసి, అలర్కుడికి తత్త్వ జ్ఞానమును కలుగజేయాలనే ఉద్దేశముతో,
కాశీ రాజు సహాయముతో అర్కుడిని యుద్ధములో ఓడించి,
దండించాడు. దానికి అలర్కుడికి భరించరాని దుఃఖము కలిగి, తల్లి
మదాలస ఇచ్చిన ఉంగరములో నున్న కాగితమును తీసి చూస్తే
అందులో రెండు శ్లోకములు ఉన్నాయి:

“కామ సర్వాత్మనా తాధ్యః సచే యక్తు మ్ న శక్యతే మోక్షే


కామ ప్రకర్తవ్యః సహి కామస్య భేషజం” – ఏ వస్తు వు మీదా కోరిక
215
ఉంచుకోకూడదు (పూర్తిగా వదలిపెట్టేయ్యాలి). కాని అది ఎవరివలనా
సాధ్యము కాదు. అది కనుక చేయలేకపోతే, మోక్షము కావాలని
(కోరికలు వదులుకోవాలనే) కోరిక పెంచుకో. అప్పుడు మోక్షము
కావాలనే కోరిక ఔషధముగా పనిచేస్తుంది.

“సంగః సర్వాత్మనా తాధ్యః సచే యక్తు మ్ న శక్యతే


సంగత్సస్యు విదాతః సహి సంగస్య భేషజం” – ఏ వ్యక్తితోనూ, ఏ
వస్తు వుతోనూ లేశ మాత్రము కూడా సంబంధము పెట్టు కోకూడదు
(సంబంధము పెట్టు కుంటే దానిమీద కోరిక మొదలవుతుంది).
ఒకవేళ అలా విడిచిపెట్టు కోలేకపోతే, మంచి వ్యక్తు లతో (సత్ సంగం =
సజ్జన సాంగత్యము), మంచి వస్తు వులతో సంబంధము పెట్టు కోవాలి.
సత్ సాంగత్యము, సాధారణ సాంగత్యము యొక్క దుష్ప్రభావమును
తగ్గిస్తుంది. సజ్జన సాంగత్యము ఈ సంసారం సాగరమును
దాటుటకు నౌకలా (ఔషధములాగా) పనిచేస్తుంది.

ఇది చదువుకొని అలర్కుడు వెంటనే దత్తా త్రేయ స్వామీ


దగ్గరకు వెళ్లి, ఆయన ఉపదేశము పొంది, తన అన్నలు నడిచిన
నివృత్తి మార్గములో నడిచాడు.

మదాలస అన్ని కర్మలు ఆచరించినా, ఆమె కర్మ బీజములను


వేయించి, ఫలములుగా మొలకెత్తకుండా చూసుకుంది. దాని
ఫలముగా తను, మోక్షమును పొంది, తన నలుగురు కుమారులను

216
కూడా మోక్ష మార్గములో నడిపించింది. చిన్నతనములో తత్త్వ
జ్ఞానము చెప్పకపోతే, అలర్కుడిలాగ చాలా కాలము కష్టములను
అనుభవించ వలసివస్తుంది.

త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః।


కర్మణ్యభిప్రవృత్తోఽపి నైవ కించిత్కరోతి సః ॥20॥

తత్త్వ జ్ఞానులు ఏ కోరిక లేకుండా, కర్మ ఫలముల మీద


సంబంధమును, ఆసక్తిని విడిచిపెట్టి సత్కర్మాచరణ చేస్తా రు. వారు
తత్త్వ జ్ఞానముతో కలిగిన అఖండమైన ఆనందముతో, శాశ్వతమైన
తృప్తితో ఉంటారు. ఎవరినీ, ఏ వస్తు వునీ ఆశ్రయించకుండా,
ఆధారపడకుండా ఉంటారు.

విహితమైన సత్కర్మలలో ఏ అంశమునూ విడిచిపెట్టకుండా


చిన్న, చిన్న విషయములను కూడా జాగ్రత్తగా, శ్రద్దగా చేస్తూ
ఉంటారు. కాని వాళ్ళు ఏ కర్మలూ చేస్తు న్నట్లు కాదు. (జ్ఞాని యొక్క
కర్మలు, జ్ఞానము అనే అగ్నిలో వేయించబడ్డా యి. కాబట్టి అవి
బీజములు కావు. అవి కర్మ ఫలములను, బంధనములను, పునర్జన్మ
ఇవ్వవు).

 నిరాశీర్యతచిత్తా త్మా త్యక్తసర్వపరిగ్రహః ।


శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం ॥ 21 ॥

217
తత్త్వ జ్ఞానికి ఏ విధమైన కోరికలు ఉండవు తన చిత్తమును
(స్మరణ లేక జ్ఞాపక శక్తి, బుద్ధి, మనస్సు, అహంకారము), శరీరము,
ఇంద్రియములు, అవయవములు అన్నీ అదుపులో, నియంత్రణలో
ఉంచుకున్నాడు (పతంజలి మహర్షి యోగ సూత్రములలోని
ప్రత్యాహారము), తన శరీరమునకు బయట ఉండే వస్తు వులు
అన్నిటినీ వదులుకున్నాడు, విడిచిపెట్టేశాడు (యమ, నియమ లోని
అపరిగ్రహము).

కేవలము తన శరీరము జీవించుటకు, రక్షించుటకు ఎంత


కావాలో అంత మాత్రమే చేస్తూ ఉంటాడు. అటువంటి వాడికి ఏ
విధమైన పాపమూ అంటదు. కర్మ బంధనములకు లోను కాడు (2
వ అధ్యాయము 59 వ శ్లోకము, 3 వ అధ్యాయము, 37 నుండి 43
వ శ్లోకము వరకూ చూడుము).

మన ఇంద్రియముల స్వభావము శరీరము నుండి బయట


ప్రపంచములోనికి వెళ్లి, ప్రాపించక విషయములను మన లోపలికి
తీసుకువచ్చి, మనస్సుకు అందించును. మనస్సు ఆ ప్రాపించక
విషయములను సంకల్పము చేస్తుంది (దాని అన్ని గుణములు,
విషయములను చూపిస్తుంది). అప్పుడు బుద్ధి ఇది కావాలి అనే
నిశ్చయము చేస్తుంది. ఆ మూడు కలిసి మనలో ఆ ప్రాపించక
విషయములపై కోరికలను పుట్టించును. కోరిక పుట్టకుండా

218
ఉండాలంటే, ఇంద్రియములను అలా బయటకు వెళ్ళనీయకుండా
నిగ్రహించి, మనలోపలే ఉంచుకోవాలి.

యోగము

యోగ శాస్త్రములో పతంజలి మహర్షి చెప్పిన నిర్వచనము –


యోగ సూత్రము 1.2 - “యోగ చిత్త వృత్తి నిరోధః” – అనగా
మనస్సు యొక్క సంచారమును నిగ్రహించుట అనేది యోగము.
యోగము అంటే మన మనస్సును అనవసరపు విషయములను
ఆలోచించకుండా, మనకు కావలసిన విషయముల (లక్ష్యము) మీద
స్థిరముగా ఉండేలా నిగ్రహణ సాధించుట. పతంజలి మహర్షి యోగ
సూత్రములలో - 2-31 – “జాతి దేశ కాల సమయా అవిచ్చిన్నాః
సార్వభౌమా మహావ్రతం” – అపరిమిత సాధన ద్వారా ఈ యోగ
అంగములను సాధించుట ఒక మహా వ్రతము. మహర్షి పతంజలి
మహర్షి ప్రకారము, యోగము యొక్క ఎనిమిది అవయవములు
(అష్టాంగ (8) యోగ సూత్రములు 2 : 29) వివరములు:

1. యమ (స్వీయ నియంత్రణ, చేయ కూడనివి):


“యమస్వరూపా సకలా నివృత్తిః, తధా ప్రవృత్తిర్ నియమ స్వరూప”
– యమ స్వరూపము చేయకూడనివి. నియమ స్వరూపము
చేయవలసినవి. 1. అహింస (హింస – 1. కృతం – మనము చేసే
219
అశాస్త్రీయమైన హింస. 2. కారితం - మనము చేయించే
అశాస్త్రీయమైన హింస, 3. అనుమోదితం – మనము సంతోషముగా
అంగీకరించిన అశాస్త్రీయమైన హింస). 2. సత్యము (అబద్ధము
చెప్పకుండుట. మన సత్యము వలన ఇంకొరికి కీడు, హింస
జరగకూడదు. అలా జరిగితే మన సత్యము కూడా అసత్యమే
అవుతుంది. ఆ సత్యము చెప్పే కంటె మౌనముగా ఉండాలి). 3.
అస్తేయము – ఇతరుల అనుమతి, ఇష్టము లేకుండా వారి
ద్రవ్యములను మనము తీసుకోవాలని అనుకొనుట, మనస్సు చేసే
దొంగతనము. తీసుకొనే దొంగతనము అనే కర్మ. 4. బ్రహ్మచర్యము
– నిగ్రహము. 5. అపరిగ్రహము – మన జీవితమునకు కనీస
అవసరమయ్యే దాని కంటె ఎక్కువ ధనము, వస్తు వుల ఉండాలి అనే
కోరిక, ప్రయత్నము లేకపోవుట. (యోగ సూత్రము 2 : 30,
భాగవతము 2 : 9 : 39).

2. నియమ (ఆచరించవలసిన ధర్మ పరమైన


నియమములు, ఆచారములు): 1. శౌచము – పరిశుభ్రత - బయట
శరీరము మరియు లోపల మనస్సు, బుద్ధిలో మాలిన్యములు కామ,
క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము/ద్వేషములను
తొలగించుకొని, మనస్సులో సద్గుణములను పెంచుకొని శుద్ధము,

220
పవిత్రము చేసుకొనుట. 2. సంతోషము – ఉన్నదానితో తృప్తి
పడుట. 3. తపస్సు - మౌనము అనేది గొప్ప తపస్సు. 1. ఆకార
మౌనము – మాట్లా డ కుండా ఉండుట. 2. కాష్ట మౌనము –
మాట కాకుండా, ఏ విధమైన ఇంగితము – అభిప్రాయములు,
ఆలోచనలు కూడా లేకపోవుట. 4. స్వాధ్యాయము – 1. యోగ్యులు
అయినవారు చేసే వేదములు అధ్యయనము, 2. మోక్షము కోసము
శాస్త్రముల, మంత్ర జపములు అధ్యయనము. 5. ఈశ్వర ప్రణిధానం
– మనము చేసే ప్రతి సత్కర్మను, ఫలాపేక్ష లేకుండా, ఈశ్వరుడికి
సమర్పించుట, పరామేశ్వరార్పణము (యోగ సూత్రము 2 : 32).

3. ఆసనములు: సరైన భంగిమలో (స్థిరమైన, కదలికలేని,


అలాగే సౌకర్యవంతమైన భంగిమలు 84 ఆసనములు) ధ్యానము
(యోగా సూత్రము 2 : 46).

4. ప్రాణాయామము: సరైన పద్ధతిలో ఊపిరి


నియంత్రణతో మనము చేసే పనిని శ్రద్దగా చేయగల శక్తిని ఇస్తుంది.
(యోగ సూత్రము 2 : 49 నుండి 2.53 వరకు). ప్రాణాయామ
వివరములకు 4 అధ్యాయము 29 వ శ్లోకములో చూడుము.

221
ప్రాణాయామము వివరములకు 4 అధ్యాయము 29, 30 శ్లోకములు
చూడుము.

5. ప్రత్యాహారము: ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని


బయటకు పోనీయకుండా, మన హృదయము లోపలకి తీసుకు
వచ్చే సాధన. ప్రాపించక విషయముల నుండి ఇంద్రియములను
మరలించుట. ఇంద్రియ నిగ్రహము (యోగ సూత్రము 2 : 54).

6. ధారణ: ఒక్క లక్ష్యముపై మనస్సును, బుద్ధిని స్థిరముగా


కేంద్రీకరించుట. ఎల్లప్పుడూ బయటకు సంచరిస్తూ ప్రాపించక
విషయములను లోపలకి తీసుకువచ్చే చంచలముగా ఉండే
మనస్సును, బుద్ధిని మన హృదయములో స్థిరముగా కట్టివేయుట
(యోగ సూత్రము 3 : 1).

7. ధ్యానము: అలా హృదయములో కట్టివేసి కూర్చోపెట్టిన


మనస్సు, బుద్ధిని హృదయము లోపలే ఉండి, కొన్నిసార్లు పరమాత్మ
మీద లగ్నముయినా, మరి కొన్నిసార్లు ఇదివరకే తెలుసుకున్న,
సంపాదించుకున్న ప్రాపించక విషయములను గుర్తు చేసుకునే
తపనలో ఇటూ, అటూ ఊగిసలాడుతూ ఉండే స్థితి. ఆ ధారణను

222
చాలా సేపు కొనసాగించగల సామర్థ్యమును ధ్యానము సాధన (యోగ
సూత్రము 3 : 2).

8. సమాధి: మానసిక ఏకాగ్రత సాధన. ధ్యానము సాధనను


పెంచుకొని, ఇతర ప్రాపించక విషయముల మీదకు మనస్సు
వెళ్ళకుండా, నిరంతరము పరమాత్మ మీదే మనస్సు స్థిరముగా
లగ్నమయ్యే స్థితి. అహంకారము నిర్మూలమయి, మనస్సు శారీరక
భావన కోల్పోయి, ఆత్మనుభూతి కలిగి అంతిమ సత్యమును
గ్రహించి, ఆ సత్యముతో లయము, ఐక్యము అయిపోవుట (యోగ
సూత్రము 3 : 3).

యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ।


సమః సిద్ధా వసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే॥22॥

అలాంటి జ్ఞాని, జీవన్ ముక్తు డు ఏ భోజనమును, ఏ


వస్త్రమును, ఏ వస్తు వులనూ తను కోరడు. ఏదైనా తనంతట తాను ఏ
వస్తు వైనా తనకు చేరితే, తన శరీరము జీవించుటకు అవసరమైనంత
వరకూ మాత్రమే తీసుకొని సంతోషిస్తా డు. ఏ విధమైన
ద్వంద్వములకు (సుఖము లేక దుఃఖము, చలి లేక వేడి, లాభము
లేక నష్టము) అతీతముగా ఉంటాడు. సుఖము కలిగితే పొంగిపోడు,

223
దుఃఖము కలిగితే కుంగిపోడు. చలి పుడితే బాధపడడు, విచ్చగా
ఉంటే సంతోషపడడు.

భోజనము దొరికినా లేక దొరకక పోయినా, ఉత్తమమైన


భోజనము దొరికినా లేదా అతి నీచమైన భోజనము దొరికినా సమతా
భావముతో ఉంటాడు (సంతోషము కాని లేక బాధకాని ఉండదు).
ఇటువంటి సిద్ధు డు, తన శరీర పోషణకు, రక్షణ కోసము ఏమైనా
కర్మలు చేస్తే, అతనికి ఆ కర్మల బంధనము ఉండదు.

జీవన్ ముక్తు డు, జ్ఞాని శరీరము మీద ప్రేమతో శరీర పోషణ,


రక్షణ చేసుకోడు. ఈ శరీరము ఒక కర్మ ఫలముగా వచ్చినది. ప్రారబ్ద
కర్మ (ప్రారబ్ద కర్మ – కర్మ ఫలము ప్రారంభము అయినది) తెచ్చిన
శరీరము మీద ఏ మాత్రమూ ప్రీతి, సంగము లేకుండా ఎంతవరకూ
నడవాలో, అంతవరకూ ఆ శరీరమును నడిపించాలి. శరీరము వద్దు
అనుకుంటే లేక చంపితే అది ఒక అజ్ఞానము, ఘోర పాపము.

కర్మతో సంపాదించుకున్న జన్మ, శరీరము తిరిగే ఒక చక్రము ‍


వంటిది. కర్మలు చేస్తు న్నంతసేపూ ఆ చక్రము తిరుగుతూనే
ఉంటుంది. జీవన్ ముక్తు డు, జ్ఞాని తన కర్మలను ఆపినా, ఆ తిరిగే
చక్రము యొక్క వేగము ఉన్నంతసేపు దానంతట అది తిరిగి
తరువాత ఆగిపోతుంది. అలాగే జ్ఞానము కలిగిన తరువాత, ఆ జ్ఞాని
ఆ శరీరము ఉన్నంతసేపు, ఆ శరీరమునకు పోషణ, రక్షణ చేయాలి.

224
అటువంటి సిద్దు లు మూడు రకములు – 1. నిత్య సిద్ధు లు
= బ్రహ్మ మానస పుత్రు లు సనకాది పంచకము = సనకః, సనందనః,
సనాతనః, సనత్ సుజాతః, సనత్ కుమారః. 2. జీవన్ముక్తు లు –
జనకాది మహారాజు సిద్ధు లు – కర్మ మార్గములో ఉన్నా మహా
జ్ఞానులు. 3. పరమాత్మ – అవతారము ఎత్తి మానవులుగా ఉన్న
సిద్ధు డు శ్రీకృష్ణ పరమాత్మ.

భాగవతము 7 వ స్కంధము – 13 అధ్యాయము – ప్రహ్లా ద-


అజగర యోగీంద్రు డు సంవాదము (అజగర = కొండచిలువ)
(అజగర వ్రతము – తన శరీర పోషణకు అవసరమైన ఆహారము,
వస్త్రముల కొరకు తను ఏ ప్రయత్నమూ చేయడు, ఎక్కడకూ
వెళ్ళడు. వాటంతో అవి వచ్చిన వాటితో సంతృప్తి పడును).

భాగవతము – 7-13-21 – “యస్య నారాయణో దేవో


భగవాన్హృద్రతః సదా I భక్త్యా కేవలయాజ్ఞానం ధునోతి
ధ్వాంతమకర్తవత్” - ఎవరి హృదయములో ఎప్పుడూ
నారాయణుడు (పరమాత్మ) కొలువై ఉంటాడో, సూర్యుడు తన
ప్రకాశముతో చీకటిని ఎలా తొలగిస్తా డో, అలాగే పరమాత్మ
అటువంటి వాడి మనస్సులో ఉండే చీకటి అనే అజ్ఞానమును
తొలగిస్తా డు.

225
ఎవరైతే ఏదైనా కావాలనే కోరికతో, కర్మలు (పుణ్యమైనా లేక
పాపమైనా) చేస్తే, ఆ కర్మలు బంధనములు అవుతాయి. ఆ కర్మ
ఫలములు అనుభవించుటకు జన్మలు ఎత్తవలసినదే.

 గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః ।


యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ॥23॥

జీవన్ ముక్తు డు ఏ జీవితోనూ, ఏ వస్తు వుతోనూ ఆసక్తని


పెంచుకోడు, అనవసరమైన సంబంధము ఉండదు. ధర్మమైన కర్మలు
కాని, ప్రాపించక కర్మలు కాని తనకు అంటించుకోడు. నిరంతరము
మనస్సులో ఆత్మ (పరమాత్మ) జ్ఞానము అనుభవము పొందుతూ,
తనలో తాను రమించుతూ ఉంటాడు.

అతను వైదికమైన లేక తన లౌకిక శరీర స్థితికి అవసరమైన


కర్మలు చేసినా, అవి నిస్వార్ధముగా, యజ్ఞము రూపముగా చేస్తా డు
(పరమాత్మ ప్రీతి కొరకు, తన బాధ్యతగా). అతను చేస్తు న్న ఆ
కర్మలకు ఫలితము అతనికి అంటదు, రాదు. ఆ కర్మలు, ఆ కర్మ
ఫలితములు జ్ఞానాగ్నిలో కరిగి, లీనమయిపోతున్నాయి.

ఛాందోగ్యోపనిషత్ – 3-14-1 – “సర్వంఖల్విదం బ్రహ్మ


తజ్జలానితి శాస్త్ర ఉపాసీత అధకలు క్రతుమయః పురుషో యదాక్రతు
రాస్మింల్లోకే పురుషో భవతి .....” – నామరూపాత్మకమగు ఈ జగత్లు

226
అంతా, మనకు కనిపించేది అంతా పరబ్రహ్మయే అయి ఉన్నది. సృష్టి,
స్థితి, లయలు బ్రహ్మము నందే కలుగుచున్నవి. కావున శాస్త్రముతో
బ్రహ్మను ఉపాసించవలెను. పరమాత్మ యజ్ఞ మయుడు.

సరస్వతీరహస్యోపనిషత్ – 8 లేక 23, 24 – “ఆస్తి, భాతి,


ప్రియం, రూపం నామ చే త్యంశపంచకమ్ ఆద్యత్రయం బ్రహ్మరూపం
జగద్రూపం తతో ద్వయమ్.....” – ఉనికి, ఉండుట (సత్),
తెలియుచున్నది (చిత్), ఇష్టమైనది (ఆనందము), ఆకారము, పేరు
ఈ ఐదు ఉంటేనే మనకు ఏ వస్తు వైనా తెలుస్తోంది, అనుభవము
కలుగుతోంది. సత్ + చిత్ + ఆనందము = సచ్చితానందము =
బ్రహ్మ - మొదటి మూడు పరమాత్మ తత్త్వము. ఇవి అన్నిటిలోనూ
ఉంటాయి. వీటికి మార్పు ఉండదు. మిగిలిన రెండూ జగత్తు
తత్త్వము. ఇవి మార్పుకు గురి అవుతూ ఉంటాయి.

మొదటి మూడు ఆస్తి, భాతి, ప్రియము (సచ్చితానందము)


అయిన ఆ పరమాత్మ తత్త్వము గుర్తించ లేకపోతున్నాము. ఎవరికైతే
ప్రతి వస్తు వులోనూ సచ్చితానందము లేక బ్రహ్మ అనే అనుభవము
కలుగుతుందో, అటువంటి వారిలో పరిపూర్ణమైన జ్ఞానము ఉండి,
వారు చేసే కర్మలు వారి జ్ఞానాగ్నిలో కరిగి, దగ్ధమై, కర్మ బంధనములు
ఉండవు. ఆ జీవన్ ముక్తు డికి తరువాత జన్మ ఉండదు.

227
సామాన్యులు చివరి రెండూ రూపము, నామము అయిన
ప్రపంచ తత్త్వమును మాత్రమే గుర్తించి, వాటితో సంబంధము
పెట్టు కొని, వాటిపై కోరికలు పెంచుకొని, వాటి కోసము కర్మలు చేసి,
కర్మల బంధనములకు లోనై జనన, మరణ (సంసార) చక్రములో
తిరుగుతూనే ఉంటారు.

 బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం ।


బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ॥ 24 ॥

(9 వ అధ్యాయము 16 శ్లోకముతో అన్వయించుము)

తత్త్వ జ్ఞాని చేసే కర్మలలో సాధనములు (దర్వి – చెక్క


గరిటె) అన్నీ బ్రహ్మమే, తత్త్వ జ్ఞాని ఉపయోగించే హవిస్సులు
(ద్రవ్యములు) బ్రహ్మమే, తత్త్వ జ్ఞాని యజ్ఞములో అగ్ని బ్రహ్మమే,
తత్త్వ జ్ఞాని చేసే ప్రతి కర్మ హోమము, ఆహుతి బ్రహ్మమే. తత్త్వ జ్ఞాని
(యజ్ఞము చేసే యజమాని) కూడా బ్రహ్మమే.

తత్త్వ జ్ఞాని చేసిన కర్మల యొక్క ఫలితము కూడా బ్రహ్మమే.


ఆ స్థితి రావాలంటే, చేసే ప్రతి కర్మలోనూ, ఉపయోగించే ప్రతి
వస్తు వులోనూ బ్రహ్మ దృష్టి, బ్రహ్మమునే మనస్సులో చూసుకోగలిగితే,
ఏకాగ్రత, సమాధి సాధించుకుంటే, వాడికి బ్రహ్మానందమే
కలుగుతుంది.

228
యజ్ఞము అంటే “దేవతోద్దేశ్యేన ద్రవ్యతో త్యాగో యాగః” –
ఒక దేవతను మనస్సులో ఉంచుకొని, మనకు సాధ్యపడే, మన దగ్గర
ఉండే విహితమైన (శాస్త్రములో చెప్పబడిన) ద్రవ్యమును, “ఇది నాది
కాదు, ఇది ఆ దేవతకు చెందుగాక” అని మానసికముగా ఆ దేవతకు
చెందేలా అగ్నిలో సమర్పించుట. ఇందులో “అర్పణం” – సమర్పించే
సాధనము – దర్వి (చెక్క గరిటె), దర్విలో ఉంచే ద్రవ్యము “హవిః”,
ఆ హవిస్సును ఏ అగ్ని ద్వారా ఆ దేవతకు సమర్పిస్తు న్నామో అది
“యజ్ఞాగ్ని”, ఆ యజ్ఞమునకు విహితమైన “కాలము”, ఆ యజ్ఞము
ఏ ప్రదేశములో చేస్తు న్నారో ఆ “ప్రదేశము”, ఆ యజ్ఞ క్రియ “హుతం”,
ఆ యజ్ఞము చేసే కర్త “యజమాని”, ఆ యజ్ఞము యొక్క
“గంతవ్యము (ఫలము)” – ఇవన్నీ బ్రహ్మ స్వరూపములే అనే దృష్టి
కలిగి ఉండాలి. ప్రతి జీవిలోనూ, ప్రతి వస్తు వులోనూ, ప్రతి క్రియ
లోనూ మూల ముడి పదార్ధము పరబ్రహ్మమే. వాటిలో పరమాత్మను
మనస్సులో ఏకాగ్రతతో గోచరము చూసుకోగలిగితే, పరమాత్మ
అనుభవము కలుగుతుంది.

దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే ।


బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి ॥ 25 ॥

కర్మ మార్గములో ఉన్న సాధకులు ఆ, యా దేవతలను


పరమాత్మ స్వరూపముగా భావించకుండా, ఒక్కొక్క దేవతకు,
ఒక్కొక్క యాగము, పూజ అనే భావముతో, ఆ దేవతలను
229
ఇష్టముగా భావిస్తూ, కొంతమంది దేవతలంటే ఇష్టము లేక,
ద్వేషముతో భావిస్తూ, ఆ దేవతలకు మాత్రమే సంబంధించిన
ప్రత్యేకమైన యాగము లేక పూజ భక్తి శ్రద్ధలతో చేసేవారు, ఆ కర్మలకు
తగ్గ ఫలితములను పొందుతారు.

జ్ఞాన మార్గములో ఉన్న సాధకులు, బ్రహ్మనే అగ్నిగా భావించి,


తమని తాము (జీవాత్మను) పరమాత్మ అంశముగా భావిస్తూ, ఆ
బ్రహ్మాగ్నిలో తమని తాము ఆహుతి చేసుకుంటున్నారు. ఆ సాధకులు
సిద్ధిని పొందుతున్నారు.

ఈ రెండింటిలో బేధమునకు కారణము మానవులలో ఉండే


బేధ దృష్టే. కర్మ మార్గములో ఉన్నవాళ్లు కర్మలను శ్రద్ధగా చేస్తూ,
దేవతలు కాని, మానవులు కాని, పరమాత్మ కంటె వేరుగా భావిస్తూ,
ఆ దేవతలకు ప్రత్యేకించి శ్రద్ధగా పూజలు చేస్తూ, ఆ కర్మలకు తగ్గ
ఫలితములను పొందుతున్నారు.

జ్ఞాన మార్గములో ఉన్నవాళ్లు బాహ్యమైన దేవతల మీద కాని,


వస్తు వుల మీద కాని ఎక్కువగా దృష్టి ఉంచుకోకుండా, “నేను” అనే
ఆత్మ తత్త్వమును అర్ధము చేసుకొని, ఆ ఆత్మ స్వరూపము నుండి,
శరీరమును, ఇంద్రియములను వేరుచేసి, శుద్ధమైన ఆత్మ
తత్త్వమును, పరమాత్మ యొక్క అంశముగా, భాగముగా భావిస్తూ
సాధన చేస్తూ సిద్ధిని కూడా పొందుతారు.

230
“శ్రేయాన్ ద్రవ్యమయా యజ్ఞాః జ్ఞాన యజ్ఞం పరంతపా” –
ద్రవ్యములతో చేసే యజ్ఞములు శ్రేయస్సును కలిగిస్తా యి.
యజ్ఞములలో జ్ఞాన యజ్ఞము సర్వోత్కృష్టమైన యజ్ఞము, గొప్ప
తపస్సు.

 శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి ।


శబ్దా దీన్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ॥ 26 ॥

సంయమము

పతంజలి మహర్షి అష్టాంగ యోగ సూత్రములో మొదటి


యమ, నియమ, ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారము సాధించిన
తరువాత చివరి మూడు యోగములు – ధారణ + ధ్యానము +
సమాధి = సంయమము అంటారు – “త్రయమేకత్ర సంయమః”.
పతంజలి మహర్షి యోగ సూత్రములలో 3.4, 3.5, 3.6
సంయమము గురించి వివరిస్తా యి. సంయమము యొక్క
అనుభవములు యోగ సూత్రములు 3.17 నుండి 3.56
సూత్రములు వివరిస్తా యి. ఈ సంయమము అనేది ఒక అగ్ని. ఈ
సంయమమునకు ముందు ప్రత్యాహారము – అనగా
ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని బయటకు పోకుండా మన
హృదయము లోపలకి తీసుకు వచ్చే సాధించుకొని సంయమమును
సాధన చేయాలి. ఎల్లప్పుడూ బయటకు సంచరిస్తూ ప్రాపించక

231
విషయములను లోపలకి తీసుకువచ్చే చంచలముగా ఉండే
మనస్సును మన హృదయములో స్థిరముగా కట్టివేయుబడిన స్థితి
– ధారణ. అలా హృదయములో కట్టివేసి కూర్చోపెట్టిన మనస్సు
హృదయము లోపలే ఉండి, కొన్నిసార్లు పరమాత్మ మీద
లగ్నముయినా, మరి కొన్నిసార్లు ఇదివరకే తెలుసుకున్న,
సంపాదించుకున్న ప్రాపించక విషయములను గుర్తు చేసుకునే
తపనలో ఇటూ, అటూ ఊగిసలాడుతూ ఉండే స్థితి – ధ్యానము.
ధ్యానము సాధనను పెంచుకొని, ఇతర ప్రాపించక విషయముల
మీదకు మనస్సు వెళ్ళకుండా, నిరంతరము పరమాత్మ మీదే
మనస్సు స్థిరముగా లగ్నమయ్యే స్థితి – సమాధి (మానవుడు
సాధించవలసిన ఉత్తమమైన స్థితి). ఈ మూడు స్థితుల కలిపితే
సంయమము అంటారు.

మనస్సు

మనస్సు త్రిగుణాత్మకమైనది. మనస్సును ప్రవర్తన


పరిశీలించగా అనంతము అని తేలింది. మనస్సు యొక్క
వ్యవహారములను విభాగములు చేసి మనస్సు యొక్క దశలను
వివరించారు. అవి 1. క్షిప్తము, 2. మూఢము, 3. విక్షిప్తము, 4.
ఏకాగ్రము, 5. నిరుథ్థం. మొదటి మూడు దశలలో ఏమీ
సాధించలేరు.

232
క్షిప్తము: క్షిప్తము అనగా నిరంతరము కదిలిపోవుట,
చంచలముగా ఉండే దశ. ఇది రజో గుణము యొక్క ప్రభావము.

మూఢము: నిద్రలో కాని, బద్ధకముగా కాని, పని చేయకుండా


మొద్దు బారిన స్థితిలో ఉండే దశ. ఇది తమో గుణము యొక్క
ప్రభావము. ఎక్కువగా ఉంటే ఈ దశ ఉంటుంది.

విక్షిప్తము: కొంచము క్షిప్తము గాను, కొంచము మూఢము


ఉంటూ, పనికొచ్చే విషయములను కొద్దిగా, చిన్నపాటిగా ఆలోచించే
దశ. ఈ దశలో రజో గుణము, తమో గుణము మరియు కొద్దిగా
సత్త్వ గుణము యొక్క ప్రభావము మినుకు, మినుకు మంటూ
ఉంటుంది.

ఏకాగ్రత: విక్షిప్త దశ నుండి పైకి వెళ్లి, మనస్సును ఇటు, అటు


కదల కుండా, ఒకే విషయము (పరమాత్మ) మీద మనస్సు స్థిరముగా
ఉండే దశ. ఈ దశలో శరీరమును శుద్ధిగా ఉంచుకుందుకు ఆహార
నియమములు పాటిస్తూ, కొంచెము యోగాభ్యాసము చేస్తూ ఉండే
దశ.

నిరుథ్థం: ఏకాగ్రత పూర్తిగా సిద్ధించిన తరువాత (సత్త్వ


గుణమును పెంచుకొని), మనస్సు బాహ్యమైన విషయముల వైపుకు
పోకుండా, అనవసరమైన విషయములను ఆలోచించకుండా,
మనస్సు మన లక్ష్యము అయిన పరమాత్మ మీదే స్థిరముగా

233
లగ్నమయ్యే దశ. ఈ స్థా యికి రావాలంటే చాలా సాధన చేయాలి. ఈ
దశ కలిగితే సమాధి సాధించినట్లు (మనస్సు ఒకే విషయము మీద
స్థిరముగా ఉండుట. చాలా రకములు సమాధులు కూడా
ఉన్నాయి).

కొంతమంది సాధకులు పైన వివరించిన సంయమము అనగా


ఇంద్రియ నిగ్రహము (ప్రత్యాహారము), మనోనిగ్రహము (ధారణ),
మనస్సు ఏకాగ్రత కోసము సాధన (ధ్యానము), మనస్సు సమాధి
స్థితి ఒక అగ్ని వం
‍ టిది. కొంతమంది సాధకులు తమ శ్రవణము
(వినుట) మొదలైన జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను
సంయమము అనే అగ్నిలో వేసి హోమము చేసుకుంటున్నారు. ఇది
గొప్ప యోగ బలము ద్వారా సాధించుటకు మహా సాధకులకు
మాత్రమే సాధ్యము. ఈ యోగ యజ్ఞము ద్రవ్య యజ్ఞము కంటె
ఉత్తమమైనది. తత్త్వ జ్ఞానము సిద్ధించే వరకూ ఈ జ్ఞాన యజ్ఞము
పూర్తి కాదు.

అంత యోగ బలము లేని కొంతమంది సాధారణ సాధకులు


శబ్దము మొదలైన తన్మాత్రలను (శబ్ద, స్పర్శ, రస, రూప,
గంధములు) కనిపించే ప్రాపించక వస్తు వులలో, విషయములలో
హానికరము కాని, అవసరమైనవి, కావలసినవి మాత్రమే స్వీకరిస్తూ
(అనవసరమైన విషయములను తీసుకోకుండా) ఇంద్రియములు అనే
అగ్నిలో హోమము చేసుకుంటున్నారు. అలా అగ్నిలో వేసి
234
వస్తు వులను, విషయములను పవిత్రము చేసి, ఏ విధముగానూ
ఆధ్యాత్మిక పురోగతికి, లౌకిక అభివృద్దికి ఆటంకము, హాని కాని
కలగని వస్తు వులను, విషయములను మాత్రమే జాగ్రత్తగా స్వీకరిస్తూ
ఉంటారు. అలా పవిత్రమైన విషయములను గ్రహిస్తే, మనస్సు కాస్త
శుద్ధమై, అటు సంయమము వైపు కాని, ఇటు ప్రత్యాహారము వైపు
కాని అభిముఖము అయ్యే స్థితి కలిగి ఆధ్యాత్మిక పురోగతి సాధించ
వచ్చు. ఈ యజ్ఞము కూడా ద్రవ్య యజ్ఞము కంటె ఉత్తమమైనది.

 సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ।


ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ॥ 27 ॥

మనస్సు (సంకల్పము), బుద్ధి (నిశ్చయము) యొక్క


కర్మలు, ఐదు జ్ఞానేంద్రియములు (1. శ్రోత్రము, 2. చర్మము, 3.
చక్షుస్సు, 4. జిహ్వ, 5. నాసిక) కర్మలు, ఐదు కర్మేంద్రియములు (1.
వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ)
కర్మలు, ఐదు ప్రాణములు (1. ప్రాణము (హృదయమున
ఉండునది), 2. అపానము (గుదమున ఉండునది), 3. సమానము
(నాభి మండలమున ఉండునది), 4. ఉదానము (కంఠమున
ఉండునది), 5. వ్యానము (శరీరమంతట వ్యాపించి ఉండునది)
కర్మలు – ఈ మొత్తము 17 చేసే కర్మలు

235
ఆత్మ స్వరూపములో సాధించిన సంయమము ద్వారా తత్త్వ
జ్ఞానముతో జ్వలిస్తు న్న యోగాగ్నిలో, పైన వివరించి మొత్తము 17
చేసే కర్మలను హోమము చెయ్యాలి. ఆ యోగాగ్నిలో ఈ క్రియలు
అన్నీ లయించిపోతాయి.

పైన వివరించిన 17 ఇంద్రియములు, అవయవములు


అవంతట అవి పనిచేయలేవు. ఇవన్నీ ఆత్మ స్వరూపము (జీవుడు)
యొక్క శక్తితోనే పనిచేస్తా యి. ఇది పైన వివరించిన యోగ
యజ్ఞమునకు ఫలితమైన యజ్ఞము. ఈ జ్ఞానముతో అగ్ని
ప్రజ్వలించినట్లయితే, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, ఏకాగ్రత,
నిరోధం అన్నీ సిద్ధిస్తా యి.

కఠోపనిషత్ – 2-2-5 – “న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి


కశ్చన I ఇతరేణ తు జీవన్తి, యస్మి న్నేతా వుపా శ్రితౌ” – ఏ వ్యక్తీ
ప్రాణము, అపానములతో బతికి ఉండడు. ఆ ప్రాణ, అపానములకు
మరియు పంచ ప్రాణములను కూడా నిలబెట్టే ఆత్మ స్వరూపము
ఇచ్చే శక్తితో మాత్రమే జీవిస్తూ ఉంటాడు. ఆ ఆత్మ స్వరూపమును
పూర్తిగా తెలుసుకొనవలెను.

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే ।
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ॥ 28 ॥

236
ఈ లోకములో కొంతమంది ద్రవ్య యజ్ఞము, కొంతమంది
తపో యజ్ఞము, కొంతమంది యోగ యజ్ఞము చేస్తా రు

కొంతమంది స్వాధ్యాయము (మోక్ష శాస్త్రములు


అధ్యయనము చేయుట) యజ్ఞము, కొంతమంది తత్త్వ జ్ఞానము
పొందుటయే జ్ఞాన యజ్ఞముగా చేస్తా రు. వీరందరూ నిరంతరము
వారి నియమములను శ్రద్ధగా ఆచరిస్తూ, వారి, వారి వ్రతములను
తీక్షణము చేసుకొని, వారి యజ్ఞములు చేస్తూ సాధనను చేస్తూ
ఉంటారు.

ద్రవ్య యజ్ఞములు:

ఇవి మూడు రకములు – 1. ఇష్టం – దేవతలను ఉద్దేశించి


చేసే యజ్ఞము. 2. పూర్తం – “వాపీ కూప తటాకాది
దేవతానయతానీచ, అన్న ప్రధాన ఆరామః పూర్త ఇత్యభితీయతే” –
మన దగ్గర ఉన్న ధనముతో ప్రజలకు ఉపయోగపడే బావులను,
కుంటలు, చెరువులను తవ్వించుట, దేవస్థా నములను నిర్మించుట,
శిథిలమైన దేవాలయములను పునరుద్దరించుట, తోటలను
(పార్కులు) అభివృద్ధి చేయుట, చెట్లు పెంచుట, అర్హులైన వారికి,
అవసరము ఉన్నవారికి అన్న ప్రదానము చేయుట. ఈ సామాజిక సేవ
యజ్ఞము చేసిన ఫలితము ఇస్తుంది. 3. దత్తం - అర్హులైన వారికి,

237
యోగ్యమైన వారికి మన దగ్గర ఉన్న ద్రవ్యమును, మన
ఆదాయములో 6 వ వంతు దానము చేయుట.

తపో యజ్ఞము

మన శరీరమును కొంచెము కష్ట పెట్టి, సరైన మార్గము లోనికి


తీసుకు వచ్చే ప్రయత్నమును తపస్సు అంటారు. 1. ఉపవాసము
(పరమాత్మకు దగ్గరగా వెళ్ళుటకు, ఉండుటకు అవసరమైన శారీరక
ఆహారము, నిద్ర నియమములు పాటించుట. పస్తు , లంకణము
కాదు ఉండుట కాదు), 2. కృత్స్నం, 3. చాంద్రాయణము
(భుజింపఁదగిన ముప్పదిరెండు ముద్దలలో చంద్రు ని యొక్క క్షయ
వృద్ధు ల అనుసరించి క్రమముగా కృష్ణపక్షమునందు ఒక్కొక్క ముద్దా
తగ్గిస్తూ, శుక్లపక్షమునందు ఒక్కొక్క ముద్దా పెంచుతూ భుజించి
ఆచరించే వ్రతము).

యోగ యజ్ఞము

యోగ శాస్త్రములో పతంజలి మహర్షి చెప్పిన నిర్వచనము –


1.2 - “యోగ చిత్త వృత్తి నిరోధః” – అనగా మనస్సు యొక్క
సంచారమును నిగ్రహించుట అనేది యోగము. మనస్సు ఎల్లప్పుడూ
సంచరిస్తూ ఉంటుంది, చంచలమైనది. ఆ సంచారములను
238
నిరోధించి, నిగ్రహించి ఒకచోట స్థిరముగా ఉంచే ప్రక్రియను యోగము
అంటారు. పైన 21 వ శ్లోకములో వివరించిన అష్టాంగ యోగ
సూత్రములు (యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార,
ధారణ, ధ్యాన, సమాధి). ఈ ఎనిమిది అంగములను
సాధించుకుంటే చిత్త వృత్తి నిరోధము సిద్ధిస్తుంది.

పతంజలి మహర్షి యోగ సూత్రములలో - 2-31 – “జాతి


దేశ కాల సమయా అవిచ్చిన్నాః సార్వభౌమా మహావ్రతం” –
అపరిమిత సాధన ద్వారా ఈ యోగ అంగములను సాధించుట ఒక
మహా వ్రతము. నేను ఏ జాతి, దేశ, కాల, ప్రయోజనములతో
నిమిత్తము లేకుండా హింస చేయను, అసత్యము చెప్పను అని
నియమబద్ధముగా ఉండే దానిని సార్వభౌమ మహా వ్రతము
అంటారు. .

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే।


ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః ॥ 29 ॥

మనము లోపలకి తీసుకున్న వాయువులో (ప్రాణములో),


బయటకు విడిచిపెట్టే ప్రాణమును హోమము చేస్తా రు (లోపలకి
తీసుకున్న ప్రాణమును బయటకు విడిచిపెట్టకుండా, కొంచెము సేపు
లోపలే ఉంచుకుని పూరక ప్రాణాయామము చేయుట. ఇది కూడా
239
ఒక యజ్ఞమే). అలాగే బయటకు విడిచిపెట్టే ప్రాణములో, లోపలకి
తీసుకున్న ప్రాణమును హోమము చేస్తా రు (లోపలకి తీసుకున్న
ప్రాణము కంటె ఎక్కువ ప్రాణమును బయటకు విడిచిపెట్టి రేచక
ప్రాణాయామము చేయుట. ఇది కూడా ఒక యజ్ఞమే).

పాణ గతిని, అపాన గతిని కొంత నిర్దిష్టమైన సమయము


నిరోధించుకొని, ప్రాణమును స్థిరముగా ఉంచే కుంభక
ప్రాణాయామమును కూడా ఒక మహా యజ్ఞమే. (అలాగే రేచక
ప్రాణాయామమును రేచక ప్రాణాయామమును, అంతర్బహిర్
(లోపలా, బయట) కుంభక ప్రాణాయామమును, కుంభక
ప్రాణాయామమును చేస్తూ), ప్రాణాయామమే సర్వోత్తమమైనది అనే
నమ్మకముతో ప్రాణాయామము చేయాలనే తత్పరతతో (ఆసక్తితో)
కొంతమంది మహానుభావులు ప్రాణాయామ యజ్ఞమును చేస్తూ
ఉంటారు. ఇది కూడా ఒక సర్వోత్తమమైన యజ్ఞమే.

ప్రాణాయామము

ప్రాణాయామమునకు ముందు ఆసన సిద్ధి లభించాలి.


ప్రాణాయామమునకు ముఖ్యమైన నియమము అసత్యము
ఆడరాదు. పంచ మహా ప్రాణములలో (ప్రాణ, అపాన, వ్యాన,
ఉదాన, సమాన వాయువులు). ఈ ఐదు వాయువులలో మొదటి
రెండు వాయువులు – ప్రాణ వాయువు ఉచ్ఛ్వాసము (ప్రాణ వృత్తి)

240
అపాన వాయువు నిశ్వాసము (అపాన వృత్తి) అంటారు. ఈ రెండూ
జరుగుతున్నంతసేపు మనము జీవించి ఉంటాము. ఇవి ఆగిపోతే
మనము మన ప్రాణము పోయినట్లు . సద్గురువు యొక్క నిరంతర
పర్యవేక్షణతో, శాస్త్రీయ అభ్యాసముతో సరైన రీతిలో ఈ ప్రాణ
(ఉచ్ఛ్వాస), అపానములను (నిశ్వాస) క్రియలను
నియంత్రించగలిగితే, నిరోధించుకుంటే దానిని ప్రాణాయామము
అంటారు. పతంజలి మహర్షి యోగ సూత్రములలో 2.49 నుండి
2.53 వరకూ ఈ ప్రాణాయామము, దీని ప్రయోజనముల గురించి
వివరించారు.

ఇది మూడు రకములు. 1. పూరకము – లోపలకి


తీసుకున్న ప్రాణమును నిర్దిష్టమైన కొంత సేపు లోపలే అట్టే
పెట్టు కొనుట. దీనిని పూరక ప్రాణాయామము అంటారు. 2.
రేచకము – లోపలకి తీసుకున్న ప్రాణమును, బయటకు
విడిచిపెట్టు ట. లోపలకి తీసుకున్న ప్రాణము కంటె ఎక్కువ
ప్రాణమును విడిచిపెట్టు ట. దీనిని రేచక ప్రాణాయామము అంటారు.
3. కుంభకము – లోపలకి తీసుకున్న ప్రాణాయామమునకు,
బయటకు విడిచిపెట్టే ప్రాణాయామమునకు మధ్య నిర్దిష్టమైన కొంత
సేపు (సంక్రాంతి కాలము - సంక్రమణము), మనకు తెలియకుండానే
సహజముగా ప్రాణము లోపల, స్థిరముగా ఉంటుంది. దీనిని అంతర్
కుంభకము అంటారు. అలాగే బయటకు విడిచిపెట్టే

241
ప్రాణాయామమునకు, లోపలకి తీసుకునే ప్రాణాయామమునకు
మధ్య నిర్దిష్టమైన కొంత సేపు ఆపుట (సంక్రాంతి కాలము -
సంక్రమణము) మనకు తెలియకుండానే సహజముగా
జరుగుతుంది. దీనిని బహిర్ కుంభకము అంటారు. దానంతట అదే
జరిగే అంతర్ కుంభకము మరియు బహిర్ కుంభకము కలిపి
అంతర్బహిర్ కుంభక ప్రాణాయామము అంటారు. పూరక, రేచక,
అంతర్బహిర్ ప్రాణాయామములు ఏమీ చేయకుండా నిర్దిష్టమైన
కొంత సేపు చేసే ప్రాణాయామమును కుంభక ప్రాణాయామము
అంటారు.

లోపలకి వెళ్ళే ప్రాణము హృదయము వరకూ వెళ్లు తుందని,


బయటకు వదిలే ప్రాణము ముక్కు నుండి 12 అంగుళముల
వరకూ వెళ్లు తుందని అందరికీ తెలిసిన విషయమే. సద్గురు
పర్యవేక్షణలో సరిగ్గా అభ్యాసము, సాధన చేస్తే, లోపలకి తీసుకునే
ప్రాణము నాభి స్థా నము వరకూ వెళ్లు తుందని, బయటకు విడిచే
ప్రాణము 24 లేక 26 అంగుళముల వరకూ వెళ్లు తుందని
గమనించవచ్చును. ప్రాణమును లోపలకి తీసుకోకుండా, బయటకు
విడిచిపెట్టకుండా, ప్రాణమును స్థిరముగా ఉంచుట (కుంభకము)
సాధ్యమే.

పతంజలి మహర్షి యోగ సూత్రము - 2.49 – “తస్మిన్ సతి


శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్చేదః ప్రాణాయామః” - ఉచ్ఛ్వాసము
242
మరియు ఉచ్ఛ్వాసము యొక్క ప్రక్రియల విరమణ. ఇది శ్వాసక్రియ
యొక్క ఆకస్మిక విరమణ. ఉన్నత భావనలను సరళతతో
వివరించడంలో సాధకుడు దైవిక అనుభవంతో ముఖాముఖిగా
ఉన్నప్పుడు మన శ్వాస స్థితి అకస్మాత్తు గా ఆగిపోతుంది.

అపరే నియతాహారాః ప్రాణాన్ప్రా ణేషు జుహ్వతి ।


సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః॥30॥

కొంతమంది ఆహారమును నియమములను పాటిస్తూ


నియతమైన, హితమైన, మితమైన, మేధ్యమైన (యజ్ఞములకు
అర్హమైన పవిత్రమైన ఆహారము), తమ ప్రాణములను, తమ
ప్రాణములలోనే హోమము చేసుకుంటారు. ప్రాణము అనే
పదమునకు ఇంద్రియము అని కూడా అర్ధము ఉంది. అలాగే
ప్రాపించక విషయములు ఇంద్రియములకు ఆహారము.
ఇంద్రియముల ద్వారా అవసరమైన విషయములను మాత్రమే
లోపలకి తీసుకుంటూ, అనవసరమైన విషయముల నుండి
ఇంద్రియములను నిగ్రహించినట్లయితే, ఈ సాధన కూడా యజ్ఞమే.

వీరందరూ యజ్ఞములను తెలుసుకొని యజ్ఞములను


ఆచరించే సాధన చేసేవారు. యజ్ఞములు చేసేవారు, వారి చిత్తములో
ఉన్న మాలిన్యములను పోగొట్టు కొని, తత్త్వ జ్ఞాన సాధనకు అర్హులు
అవుతారు.

243
నియతమైన ఆహారము - “అర్ధం సవ్యంజనానస్య, తృతీయం
ఉదకస్యచ, వాయు సంచారనార్ధంతు చతుర్ధ అవశేషయేత్” – మన
కడుపులో సగము వరకు ఘనమైన ఆహారమును తినవలెను. అక్కడ
నుండి ఒక పావు భాగము జలము త్రాగవలెను. చివరి పావు
భాగములో గాలి సంచరించుటకు ఖాళీగా వదలిపెట్టా లి.

నియత ఆహారమును స్వీకరించే సాధకులు మనలో ఉండే


పంచ ప్రాణములను (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన
వాయువులను) ఒక్కొక్క వాయువును జయించుకుంటూ,
జయించుకున్న వాయువులో ఇతర వాయువులను హోమము
చేస్తూ ఉంటారు. అలా సాధకుడు ఐదు వాయువులనూ జయించిన
తరువాత, అతని మనస్సు శుద్ధమై తత్త్వ జ్ఞానము పొందుటకు
అర్హత కలుగును.

ప్రాణము (క్రియా శక్తి) మరియు మనస్సు (జ్ఞాన శక్తి) ఒక


పదార్ధము యొక్క రెండు భాగములు. ఒక ప్రక్కలో ఉన్న
ప్రాణాయామముతో క్రియా శక్తి నియంత్రణతో, రెండవ ప్రక్కలో ఉన్న
జ్ఞాన శక్తి కూడా స్పటికములా శుద్ధమవుతుంది (పతంజలి యోగ
సూత్రము - 1.34). ఇలా ప్రాణములు, మనస్సు, మనస్సు నిగ్రహించే
ఇంద్రియములు కూడా శుద్ధమై స్వాధీనములోకి వచ్చి, ఏకాగ్రత,
కేంద్రీకరణ (నిర్వికార సంపత్తి) పెరిగి సూక్ష్మమైన విషయములను

244
అర్ధము చేసుకునే సామర్థ్యము కలుగుతుంది. పతంజలి యోగ
సూత్రములలో (1-33 నుండి 1-39 వరకు) వివరముగా ఉన్నది. .

యజ్ఞశిష్టా మృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం।


నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ ॥ 31 ॥

పైన వివరించిన వివిధమైన యజ్ఞములు (ద్రవ్య, తపో, దాన,


స్వాధ్యాయ, జ్ఞాన, ప్రాణాయామ మొదలైన), పూజలు, దేవతల
ఆరాధనలు చేసిన తరువాత, దేవతలకు సమర్పించగా మిగిలిన
ప్రసాదమును అమృతము అంటారు (ద్రవ్య యజ్ఞము కానిచో –
స్వాధ్యాయ, జ్ఞాన, ప్రాణాయామ యజ్ఞములలో – మిగిలిన
సమయములో శుద్ధమైన ఆహారము భుజించవలెను). ఆ
అమృతమును స్వీకరించినట్లయితే, క్రమముగా వారి మనస్సు
శుద్ధమై, తత్త్వ జ్ఞానమును పొంది, శుద్ధమైన, సనాతనమైన బ్రహ్మను
పొందుతారు.

ఏ రకమైన యజ్ఞము చేయని వాడికి ఈ లోకములో ఏ


విధమైన ఫలితము దక్కదు. తరువాత పై లోకములలో కూడా
స్థా నమే ఉండదు. క్రింద లోకములకు పోవలసివస్తుంది. ఈ
లోకములో జీవించుటకు కూడా వాడు నియతముగా కొన్ని
యజ్ఞములు (కర్తవ్యము) చేయవలసినదే. కురు వంశములో

245
జన్మించిన ఓ అర్జు నా I మీ వంశము యొక్క కురు మహారాజు ఎన్నో
యజ్ఞములు చేసి గొప్ప సాధన చేసినవాడు.

 ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే ।


కర్మజాన్విద్ధి తాన్సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే ॥ 32 ॥

ఇంతవరకూ చెప్పిన యజ్ఞములే కాక, ఇంకా చాలా


రకములైన యజ్ఞములు ఉన్నాయి. బ్రహ్మ ముఖము నుండి
జాలువారిన వేదములలో, కల్ప సూత్రములలో అన్ని యజ్ఞముల
గురించి విస్తృతముగా ప్రతిపాదించబడినవి.

ఈ యజ్ఞములన్నీ ఏదో ఒక క్రియ (శారీరక, మానసిక,


వాయువుతో) చేయుట ద్వారా నిర్వర్తించ వచ్చును అని తెలుసుకుని
చేస్తే నీకు మోక్షము వరకూ కలుగుతుంది. (ఈ యజ్ఞములు
చేసుకుంటే మనస్సు శుద్ధమై ఆత్మ జ్ఞానము పొందుటకు అర్హత
కలుగుతుంది. ఈ క్రియలు అన్నీ శరీరాదులకే కాని ఆత్మ
స్వరూపమునకు ఈ క్రియలు ఏ విధముగానూ అంటవు అని
తెలుసుకుంటే, ఈ కర్మల యొక్క బంధనముల నుండి పూర్తిగా
విముక్తి లభిస్తుంది).

పంచ మహా యజ్ఞములు:

ఈ ఐదుగురు ఉపకారములు లేకుండా ఏ మానవుడు ఈ


ప్రపంచములో జీవించలేడు. అందుచేత ఈ లోకములో జీవించే ప్రతి
246
మానవుడికి ఈ పంచ (5) ఋణము కలుగుతాయి. కాబట్టి ప్రతి
మానవుడు తన ఋణములను తీర్చుకొనుటకు ఈ పంచ
యజ్ఞములు ప్రతి దినము చేయవలెను.

దేవ యజ్ఞము – దేవతలు చేసే ఉపకారములకు కలిగే దేవ


ఋణము తీర్చుటకు అగ్నిలో ఆహుతులను సమర్పించి అగ్ని
ముఖముగా దేవతలను సంతృప్తి పరచటము. మన శరీరమునకు
మనకు ముఖము ఎలాగో, అలాగే దేవతలందరికీ ఒకే ఒక ముఖము
అగ్ని దేవుడు. శాస్త్ర రీతిలో అగ్నిని ప్రజ్వలించి, ఆ అగ్నిని పూజించి, ఆ
అగ్నిలో శాస్త్ర విహితమైన వస్తు వులను ఏ, ఏ దేవతను ఉద్దేశించి
ఆహుతి చేసి సమర్పిస్తే, అగ్ని దేవుడు (పోస్టా ఫీసు వలె) ఆ
సమర్పణను ఆ, యా దేవతకు అందచేస్తా డు. లేదా పూజలు,
వ్రతములు ద్వారా దేవతలను సంతృప్తి పరచవలెను. ఇది ప్రతి
నిత్యమూ చేయవలసినదే.. .

పితృ యజ్ఞము – నిత్యమూ పితృ దేవతలను తలచుకొని


నీళ్ళను సమర్పించవలెను. తండ్రి, తాతలు లేనివాళ్లు ఆ, యా
ప్రత్యేకమైన రోజులలో మరియు అమావాస్య, సంక్రాంతి,
గ్రహణములు సమయములలో వాళ్లను తలచుకొని, వాళ్లకు నీళ్ళు,
విహితమైన ద్రవ్యములను సమర్పించుకొనవలెను. శ్రాద్ధ కర్మలు
తప్పకుండా, శ్రద్ధగా చేయవలెను. ఇది వేదముల ఆదేశము.

247
భూత యజ్ఞము – మన చుట్టూ ఉండే పశు పక్ష్యాదులకు
చక్కగా ఆహారమును అందించవలెను. భూత దయ నిరంతరము
కలిగి ఉండాలి.

మనుష్య యజ్ఞము – మన ఇంటికి వచ్చిన అతిధులకు


ఆదర పూర్వకముగా భోజనము పెట్టవలెను. మన ఇంటికి వచ్చిన
అతిధి ఆకలితో ఉంటే, మన సమస్త శుభములను హరించి వేస్తా డు.

కఠోపనిషత్ – 1-1-8 – “ఆశా ప్రతీక్షే సంగతగ్ం సూనృతాం


చేష్టా పూర్తే పుత్రపశూగ్ంశ్చ సర్వాన్ I ఏతద్వృంక్తే పురుష స్యాల్ప
మేధసో యస్యానశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే” – ఎవరి గృహములో
బ్రాహ్మణుడు, అతిథి నిరాహారముతో ఉండునో, ఆ గృహములో
ఉన్నవాళ్లు అన్ని సంపదలు, ఆశలు, ఆకాంక్షలు, మైత్రి, యజ్ఞములు,
పుణ్య దానములు, పుత్రా, పశు సంపద అన్నియూ నాశనము
అవును.

తైత్తిరీయోపనిషత్ – బృగువల్లి తృతీయాధ్యాయము –


దశమోనువాకము – “ఏతద్వై ముఖతోన్నంరాద్దం I ముఖతోస్మా
అన్నగ్ం రాధ్యతే I ఏతద్వై మధ్యతోన్నగ్ం రాద్దమ్ I మధ్యతోస్మా
అన్నగ్ం రాధ్యతే I ఏతద్వై అంతతోన్నగ్ం రాద్దమ్ I అంతతోస్మా
అన్నగ్ం రాధ్యతే” – మనము గౌరవ పూర్వకముగా అతిధులను
ఆదరించి, అన్నాదులను సమర్పించినట్లయితే మనకు తిరిగి అదే

248
విధముగా ఫలితము లభిస్తుంది. మనము అతిధులను
మధ్యమముగా అన్నాదులను సమర్పించినట్లయితే మనకు తిరిగి
అదే విధముగా ఫలితము లభిస్తుంది. మనము అతిధులను నిరాశ
పరిచినట్లయితే మనకు ఫలితము కూడా అంతే తీవ్రముగా
ఉంటుంది.

బ్రహ్మ యజ్ఞము – అర్హత కలిగిన వేద బ్రాహ్మణులు వారు


అధ్యయనము చేసిన వేదములోని భాగములను ప్రతి దినము కొంత
భాగము అధ్యయనము చేసిన, స్వాధ్యాయ యజ్ఞము – మోక్ష
శాస్త్రములను ప్రతి దినము అధ్యయనము చేయుట, వాటి
అర్ధములను కొద్దిగా నయనా మనస్సులోకి ఎక్కించుకొనుట.

 శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప ।


సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ॥ 33 ॥

ఈ యజ్ఞము అయినా సరే అది ద్రవ్యమయమైన యజ్ఞము


అవుతుంది. వాటికంటె సర్వోత్కృష్టమైనది జ్ఞానమయమైన
(పరమాత్మను తెలుసుకునే ఆత్మ జ్ఞానము) యజ్ఞము.

ప్రతి కర్మకు ఏదో ఒక ఫలితము ఉన్నది. ఏ కర్మ చేసినా, దాని


ఫలితము లభిస్తు న్నది. ఏ కోరికా లేకుండా కర్మ (నిష్కామ కర్మ) చేస్తే
మనస్సు శుద్ధ పడుతుంది. మనస్సు శుద్ధ పడితే జ్ఞాన మార్గము
అవలంభిచే అర్హత కలుగుతుంది. జ్ఞానము వలన కలిగే ఫలితము,

249
కర్మ ఫలముల కంటె అత్యుత్తమమైనది. ఆ కర్మ ఫలములు అన్నీ ఆ
జ్ఞాన ఫలములో కలిసిపోయి, కర్మ ఫలములు సూన్యమైపోతాయి.

మనము చేసుకున్న సత్కర్మల ఫలితములు చిన్న, చిన్న


ఫలితములతో ఖర్చు చేసుకున్నట్లయితే, పెద్ద ఫలితము (మోక్షము)
పొందుటకు ఏమీ మిగలవు. అలా కాకుండా ఆ చిన్న, చిన్న
ఫలితములను (నిష్కామ కర్మ ద్వారా) ఖర్చు చేసుకోకుండా ఉండి,
వాటన్నిటినీ నిలవ చేసుకొని, పెద్ద ఫలితము కొరకు వినియోగించితే,
పెద్ద ఫలితమే లభిస్తుంది.

 తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।


ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ॥34॥

ఆ జ్ఞానమును సంపాదించుకోవాలంటే సద్గురువును


ఆశ్రయించి, ఆయన ముందు వినయముతో సాగిల పడాలి
(సాష్టాంగపడి నమస్కరించి, బోర్లపడి మొక్కుకొని, శరణాగతి
పొందాలి). శరణాగతి పొందిన తరువాత, ఆ గురువుకు సేవ
చెయ్యాలి. గురు శుశ్రూష బాగా చేసుకున్న తరువాత, ఆ గురువును
ఆత్మ తత్త్వము విషయముల గురించి ప్రశ్నలు వేసి, అడిగి ఆ
గురువు చెప్పే సమాధానముల ద్వారా ఆత్మ తత్త్వము వివరములు
అన్నీ తెలుసుకోవాలి.

250
అప్పుడు సద్గురువులు నీకు జ్ఞానము కలిగేంతవరకూ,
కలిగేటట్లు గా తప్పక ఉపదేశము చేస్తా రు (యోగ్యుడైన శిష్యుడికి
గురువు చెప్పి తీరాలి. ఇది నా ఆజ్ఞ). వేదాంతములలో
(ఉపనిషత్తు లలో) చెప్పిన తత్త్వ జ్ఞానము పొంది, (పరమాత్మను కళ్లతో
చూసినట్లు గా) పరమాత్మ అనుభవమును కూడా పొందిన
సద్గురువులను మాత్రమే ఆశ్రయించాలి.

ప్రశ్నోపనిషత్ – ప్రధమ ప్రశ్న, 2 వ శ్లోకము – “తాన్హ స ఋషి


రువాచ, భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్సరం
సంవత్స్యథ, యధాకామం ప్రశ్నాన్ పృచ్చత, యది విజ్ఞాస్యామః
సర్వం హ వే వక్ష్యామ ఇతి” – భక్తిశ్రద్ధలతో శుశ్రూష చేయుటకు
వచ్చిన (సుకేశుడు, సత్యకాముడు, సౌర్యాయణి, కౌసల్యుడు,
వైదర్భి, కబంధి) మునీశ్వరులతో పిప్పలాద మహర్షి ఇట్లు చెప్పెను.
మీరు పూర్వమే తపస్సులు చేసి ఉన్నారు. అయినను మరొక
సంవత్సరము తపస్సు, శ్రద్ధ, బ్రహ్మచర్యము మరియు గురు శుశ్రూష
చేయుచు ఇచ్చటే నివసించండి. ఆ పిమ్మట మీకు ఇష్టము వచ్చిన
రీతిగా నన్ను ప్రశ్నలు అడగవచ్చును. నాకు తెలిసిన బ్రహ్మ జ్ఞానము
ఉపదేశించగలను. (అలా సంవత్సరము తరువాత వారు అడిగిన
ప్రశ్నలకు పిప్పలాద మహర్షి సమాధానములు, చక్కగా బ్రహ్మ
తత్త్వము పూర్తిగా చెప్పారు. ఈ ఉపనిషత్తు లో బ్రహ్మ తత్త్వము
గురించి పూర్తి వివరములు ఉన్నవి).

251
ముండకోపనిషత్ – 1-2-13 – “తస్మై స విద్యా
నుపసన్నాయ సమ్యక్ ప్రశా న్తచిత్తా య శామాన్వితాయ, యేనాక్షరం
పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్త్వతో బ్రహ్మవిద్యామ్” –
గురువును ఆశ్రయించిన శాంత, శమ, దమ మొదలైన సద్గుణములు
కల శిష్యులకు, ఆ గురువు అక్షరమును (పరమాత్మను), సత్యము
అయిన పరమాత్మను తెలుసుకొనుటకు సాధకమగు బ్రహ్మ విద్యను
ఉపదేశించవలెను. (బ్రహ్మ విద్య సద్గురువు ద్వారానే కలుగుతుంది.
మరొక దారి లేదు. పుస్తకముల ద్వారా కలగదు).

ఛాందోగ్యోపనిషత్, చతుర్ధ ప్రపాఠకః – రైక్వుడు – జానశ్రు తికి బ్రహ్మ


విద్య బోధించిన వివరములు:

జానశ్రు తి పౌత్రాయణుడు అనే మహారాజు చాల


యజ్ఞములు, అన్న దానములు చేసేవాడు. రాజ్యమంతా అన్న
సత్రములు ఏర్పాటు చేసి, యోగ్యులైన వారికి నిరంతరము అన్న
దానములు చేసే వాడు. రాజ్యమును ధర్మముతో సక్రమముగా
పరిపాలిస్తు న్నాడు. ఒక రోజు రాత్రి మేడ మీద పడుకుండగా, ఇద్దరు
యోగ సిద్దు లైన మహర్షులు రెండు హంసల రూపములు ధరించి
ఆకాశములో ఎగురుతూ వెళ్ళుతున్నారు. అందులో ఒక హంస,
భల్లా క్షుడు అనే మరొక హంసతో, క్రింద జానసృతి మహారాజు గారు
పడుకుని ఉన్నారు. ఆయన చేసిన యజ్ఞములకు, దానములకు,
ఆయన తేజో పుంజము భూమి నుండి స్వర్గ లోకము వరకూ
252
వ్యాపించి ఉంది. ఆ తేజో పుంజమును తప్పించుకొని వెళ్ళు.
లేకపోతే ఆ తేజస్సులో నీ రెక్కలు కాలిపోతాయి అని
హెచ్చరించాడు. దానికి భాల్లా క్షుడు అనే హంస అదేమీ ఇతని లోని
గొప్ప. ఆ బండి క్రింద పడుకున్న రైక్వుడి కంటె ఇతడేమి గొప్ప. నీవు
ఇతనిని అలా కీర్తిస్తు న్నావు అని అన్నాడు. ఆ హంసలు
ఎగిరిపోయాయి. హంస భాష తెలిసిన జానశ్రు తి మహారాజు అది
విని, అంతవరకూ ఈ రాజ్యములో ఆయనే గొప్ప ధార్మికుడు,
అందరికంటే గొప్ప సాధకుడు అనే అభిప్రాయములో ఉన్నవాడు,
మొదటి హంస ఆయనను పొగడగానే చాల సంతోషించి, రెండవ
హంస బండి క్రింద పడుకున్న రైక్వుడి కంటె ఇతడు చాల తక్కువ
అని అన్న దానికి, ఆయన నుండి బ్రహ్మ జ్ఞానము నేర్చుకోవచ్చు అనే
ఆత్రు తతో, ఆయనకు రాత్రంతా నిద్రపట్టలేదు.

మర్నాడు పొద్దు న్నే లేవగానే, తన సారధిని పిలిపించి, నీవు


వెంటనే వెళ్లి బండి క్రింద పడుకున్న రైక్వుడు ఒక బ్రహ్మ జ్ఞాని,
ఆయనను తేలికగానే గుర్తు పట్టవచ్చు. ఆయన ఎక్కడ ఉన్నారో
తెలుసుకొని, అతనిని వెంటనే తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. ఆ
సారధి అన్ని చోట్లా వెతికి, వెతికి ఒక బండి క్రింద ఆయనను చూసి,
ఆయనతో నీవు రైక్వుడివా అని అడిగాడు. ఆయన అవునురా అని
సమాధానము చెప్పాడు. అప్పుడు ఆ సారధి ఆయన తనతో రాడని
నిర్ణయించుకొని, వచ్చి రాజుగారితో అలా చెప్పాడు.

253
అప్పుడు రాజుగారు 600 గోవులను, ఒక కంఠ హారము,
ఒక రధమును తీసుకొని రైక్వుడి దగ్గరకు వెళ్లి, వాటిని తీసుకొనమని,
మీరు పూజార్హులు, మీకు తత్త్వ జ్ఞానము తెలుసును, నేను మీకు
శిష్యరికము చేస్తా ను, నాకు ఆ తత్త్వ జ్ఞానము బోధించండి అని
ప్రార్థించాడు. దానికి ఆ రైక్వుడు, రాజుగారితో నీవు ఇవన్నీ నాకు
ఇచ్చి, విద్యను కొనుక్కోవాలను అనుకుంటున్నావు. నీ పద్ధతి నాకు
నచ్చలేదు. ఇవన్నీ తీసుకొని నీవు వెళ్లిపో అన్నాడు.

రాజుగారు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఆలోచించి,


ఆలోచించి ఈ సారి ఒక వెయ్యి ఆవులు, రధము, బంగారము,
ధనము మరియు ఆయన కుమార్తెను కూడా తీసుకు వెళ్లి, ఇవన్నీ
తీసుకొని, నీ కుమార్తె నిర్మలను వివాహమాడి, గృహస్థ ఆశ్రమము
స్వీకరించు. ఈ ప్రదేశము అంతా నీకు సమర్పించి, దీనికి రైక్వపర్ణ
అని పేరు కూడా పెడతాను. నన్ను కరుణించి నాకు తత్త్వ జ్ఞానము
ఉపదేశము చేయి అని ప్రార్థించాడు. రైక్వుడు జానశ్రు తి యొక్క
ప్రణిపాతమునకు (శరణాగతికి) సంతోషించి, జానసృతి కుమార్తె
నిర్మలను స్వీకరించి, జానశ్రు తికి సంవర్గ విద్యను (సంవర్గము =
విలీనము) అనే తత్త్వ జ్ఞానము బోధిస్తా డు.

ఛాందోగ్యోపనిషత్ – 8-7-3, 8- 9-3, 8-10-4, 8-11-3 –


దేవేంద్రు డు సకల భోగములు విడిచిపెట్టి 32 + 32 + 32 + 5 =
మొత్తము 101 సంవత్సరములు ప్రజాపతి (బ్రహ్మదేవుడు) దగ్గర
254
నుండి ఆత్మ తత్త్వము ఉపదేశము పొందుటకు కఠోర తపస్సు
చేసెను. (గురువు సేవ చాలా అవసరము).

ఛాందోగ్యోపనిషత్ – 7-1-3 – “సోహం భగవో


మన్త్రవిదేవాస్మి నాత్మవిత్ శ్రు తం హ్యేన .....” – నారదుడు, సనత్
కుమారులతో నాకు వేదములు, వేదాంగములు, ఉపవేదములు,
ఇతిహాస, పురాణములు, శాస్త్రములు అన్నీ తెలుసు. మహాత్మా I నేను
మంత్ర వేత్తగా ఉన్నాను. ఆత్మ వేత్త కాలేదు. ఆత్మ వేత్తయే శోకము
నుండి విముక్తు డు అవునని నేను విన్నాను. నేను శోకముతో
ఉన్నాను. నన్ను శోక సముద్రము నుండి దరి చేర్చమని ప్రార్థన.
తరువాత సనత్ కుమారులు భూమ విద్య 7-23-1 లో బోధిస్తా రు.
యోగ్యులైన శిష్యులు వారి సంశయములను, యోగ్యులైన
గురువును నిరంతరము ప్రశ్నలు వేస్తే, ఆ ప్రశ్నలకు గురువులు
సమాధానములు చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉంటారు.

కఠోపనిషత్ – 1-2-8 – “న నరేణావరేణ ప్రోక్త ఏష


సువిజ్ఞేయో బహుదా చింత్య మానః I అనన్యప్రోక్తే గతిరత్ర నాస్తి
అణీయాన్ హ్యతర్క్య మాణుప్రమాణాత్” – ఆత్మ తత్త్వము చెప్పే
వాళ్ళు, వినే వాళ్ళు బహు విధములు విచారణ చేయవలెను. అల్ప
బుద్ధు లచేత, కేవలము చదివిన వాళ్ళు లేక విన్న వాళ్ళు బోధించ
శక్యము కాదు. ఆత్మ అనువు కంటె అణువైనది. ఇది అతి
సూక్ష్మమైన, గహనమైన విషయము. ఆత్మ తత్త్వమును దర్శించి,
255
అనుభవములోనికి తెచ్చుకొని, ఆత్మ తత్త్వముతో మమేకమైపోయిన
వాళ్ళు మాత్రమే ఉపదేశము చేయగలరు. వాళ్ళు ఉపదేశము చేస్తేనే
ఆత్మ తత్త్వము అర్థమవుతుంది.

 యద్ జ్ఞాత్వా న పునర్మోహమ్ ఏవం యాస్యసి పాండవ ।


యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ॥ 35 ॥

తత్త్వ జ్ఞానము మానవులకు ఫలిస్తే, ఆ తరువాత ఏ విధమైన


మోహము కలగదు (నేను అనుకునే ఈ శరీరము మీద - నేను,
ఈ శరీరమునకు సంబంధించిన వాటి మీద - నాది). పాండు
మహారాజు పుత్రు డా I

తత్త్వ జ్ఞానములో, ఈ సృష్టిలో కనిపించే జీవులు,


వస్తు వులు అన్నీ పరమాత్మలోని భాగములు మాత్రమే. వీటన్నిటినీ
చూసే నేను కూడా పరమాత్మలోని భాగమే. వీటన్నిటికీ పరమాత్మే
మూల కారణము (ఎలాగైతే బంగారముతో చేసిన ఆభరణములు
అన్నీ, అంతా బంగారమో, అలాగే పరమాత్మ నుండి పుట్టినవన్నీ
పరమాత్మే). అన్నిటిలోనూ పరమాత్మనే చూడగలిగితే, పరమాత్మ
తప్ప ఈ ప్రపంచములో మరొకటి (నేను కూడా) లేదు అనే భావన
స్థిరముగా కలిగితే, ఏ విధమైన మొహమునకు అవకాశము ఉండదు.

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః ।


సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి॥36॥

256
ప్రపంచములో అందరూ చేసిన అన్ని పాపములను
మూటగట్టి, అవన్నీ నీవే చేసావు, అందరికంటే నీవే ఎక్కువ
పాపాత్ముడివి అని అనుకుందాము.

అయినప్పటికీ అవన్నీ నీవు కనుక తత్త్వ జ్ఞానము అనే నావ


పొందగలిగితే, నీకు జన్మ, మరణ బంధనములు తీసుకువచ్చే అన్ని
పుణ్య, పాపములు అనే సముద్రమును దాటవచ్చును (సంసారము
అనే సముద్రమును, జ్ఞానము అనే నావతో దాటవచ్చును. మరొక
మార్గము లేదు).

యుద్ధములో నీవు భీష్ముడు, ద్రోణాచార్యలను చంపితే, ఆ


పాపము నీకు అంటుకుంటుంది అని నీవు అనుకుంటున్నావు. నీ
కర్తవ్యము, బాధ్యత, నీ స్వధర్మము ఏ విధమైన రాగ, ద్వేషములు
లేకుండా, నిష్కామముగా నిర్వర్తించేటప్పుడు నీకు ఏ పాపము
అంటదు. అదే కర్మ నీవు అవే రాగ, ద్వేషములతో, కర్మ ఫలముల
కోసము చేస్తే, ఆ కర్మల ఫలితములు నీవు అనుభవించవలసి
వస్తుంది.

పాపములు ఎన్ని విధములు – 1. మహా పాతకములు


(బ్రహ్మ హత్య), 2. ఉప పాతకములు (సురా పానములు), 3. సుంకరీ
కరణములు (సాత్విక భావములను పాడుచేయుట), 4. మలినీ
కరణములు, 5. అపరాత్రీ కరణములు. మరొక విధముగా 1. పర

257
ద్రవ్య ఆపేక్ష, 2. అనిష్ట చింతనము, 3. వితథాభినివేశము (పర
లోకము లేదు, దేహమే ఆత్మ అనే అభినివేశము) [ఇవి మానసిక
పాపములు], 4. కఠినోక్తి, 5. అసత్యోక్తి, 6. పరోక్షమున పరదూషణ
చేయుట, 7. అసంబద్ధ ప్రలాపము [ఇవి వాచిక పాపములు], 8. పర
ద్రవ్యము అన్యాయముగా గ్రహించుట, 9. నిషిద్ధ హింస, 10.
పరదారగమనము [ఇవి శరీర పాపములు] [మనుస్మృతి 12-5,6,7]

 యథైధాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జు న ।


జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ॥ 37 ॥

ఎలాగైతే పెద్ద, పెద్ద ఎండిపోయిన కట్టెల మోపులను, బాగా


ప్రజ్వలిస్తు న్న అగ్ని క్షణములలో కాల్చి భస్మముగా చేసేస్తుందో ఓ
అర్జు నా I

అదే విధముగా జ్ఞానము అనే అగ్ని అన్ని కర్మలను వెంటనే


పూర్తిగా దహించి భస్మము చేసేస్తుంది.

ప్రకాశమునకు, చీకటికి ఉండే విరోధము లాగే, జ్ఞానమునకు,


అజ్ఞానముతో మాత్రమే విరోధము ఉన్నది. జ్ఞానముతో అజ్ఞానము
నశిస్తుంది. అప్పుడు అజ్ఞానముతో పుట్టే కోరికలు నశిస్తా యి.
అంతవరకూ అజ్ఞానముతో, కోరికలతో చేసిన కర్మలు అన్నీ జ్ఞానము
అనే అగ్నిలో భస్మము అయిపోతాయి. ఆ తరువాత కోరికలతో
కొత్తగా కర్మలు చేయడు. కాబట్టి కొత్తగా కర్మలు అంటవు.
258
కర్మలు

వేదవ్యాస మహర్షి (బాదరాయణుడు) బ్రహ్మ సూత్రములలో


(ఉత్తర మీమాంసలో) చాలా విస్తా రముగా కర్మల గురించి
వివరించారు. ప్రాధమికముగా కర్మలు (పుణ్యము, పాపము) మూడు
భాగములు – 1. ప్రారబ్ద కర్మలు, 2. ఆగామి కర్మలు, 3. సంచిత
కర్మలు.

ప్రారబ్ద కర్మలు – ప్రారబ్ద కర్మ అనగా ప్రారంభము అయిన


కర్మ ఫలితములు. మనము పూర్వ జన్మలలో చేసిన కొన్ని కర్మలు
పరిపక్వము అయి, ఫలించే సమయము వచ్చినప్పుడు (ఎలాగైతే
చెట్లకు నాటిన కొంత కాలమునకు లేక కొన్ని ఋతువులలో పూలు,
పండ్లు కాస్తా యో అలాగే), ఆ కర్మలతో ఒక జన్మ ప్రారంభము
అవుతుంది. అవి కర్మలు అంటారు.

ఆగామి కర్మలు – ఈ జన్మలో తత్త్వ జ్ఞానము కలగక


ముందు చేసిన కర్మలు. పరమాత్మ జ్ఞానము కలిగిన తరువాత చేసిన
కర్మలు.

సంచిత కర్మలు – ఇదివరకటి జన్మలలో ఇంకా ఫలితములను


అనుభవించకుండా మిగిలి ఉన్న కర్మలు.

259
బ్రహ్మ సూత్రములు – 4 వ అధ్యాయము (ఫల
అధ్యాయము), ప్రధమ పాదము, 9. తదధిగమాధికరణము - 13.
“తదధిగమ ఉత్తర పూర్వాఘయోర శ్లేషవినాశౌ తద్వ్యపదేశాత్ “–
ముందు జన్మలలో చేసిన కర్మలు (సంచిత కర్మలు), ఈ జన్మలో
పరమాత్మ జ్ఞానము కలగక ముందు చేసిన కర్మలు (ఆగామి కర్మలు),
పరమాత్మ జ్ఞానము కలిగిన తరువాత చేసిన కర్మలు తీసుకొని
ఉపనిషత్తు ల వేదాంతముతో ఆలోచించి చెప్పినది:

పరమాత్మ జ్ఞానము కలిగిన తరువాత చేసిన కర్మలు - కర్మలు


కావు. “యధా పుష్కర పలాశే ఆపః న శ్లిష్యతే, ఏవమేవం విధి పాపం
కర్మ న శ్లిష్యన్తే” – ఎలాగైతే తామర ఆకు మీద నీటి బొట్టు కు,
తామర ఆకుకు అంటదో, సంబంధము ఉండదో, అలాగే జ్ఞానోత్పత్తి
తరువాత ఆ తత్త్వ జ్ఞానికి, ఆయన చేసే పాప కర్మలకు ఏ విధమైన
సంబంధము ఉండదు. కాని చూడటానికి తత్త్వ జ్ఞాని కర్మలు
చేస్తు న్నట్లు కనిపిస్తుంది.

ఆగామి కర్మలు – ఈ జన్మలో తత్త్వ జ్ఞానము కలగక


ముందు చేసిన కర్మలు. “తధ్యథ ఇషీకతూలం అగ్నౌ ప్రోతం
ప్రద్యుయేత ఏవం విధి సర్వే పాప్మానః ప్రద్యున్తే” - ఎలాగైతే
ఎండిపోయిన గడ్డి పూల రెమ్మలను అగ్ని వెంటనే కాల్చి భస్మము
చేస్తుందో, అలాగే తత్త్వ జ్ఞానము పొందిన జ్ఞాని ఈ జన్మలో తత్త్వ

260
జ్ఞానము కలగక ముందు చేసిన పాప కర్మలను, జ్ఞానము కలిగిన
వెంటనే జ్ఞానమనే అగ్ని కాల్చి భస్మము చేయును.

బ్రహ్మ సూత్రములు – 4 వ అధ్యాయము (ఫల


అధ్యాయము), ప్రధమ పాదము, 10. ఇతరాసంశ్లేషాధికరణము -
14. ఇతరస్యాష్యేవ మసంశ్లేషః పాతేతు – పాపము లాగానే, పుణ్యము
పరిస్థితి కూడా, జ్ఞానోత్పత్తి తరువాత ఆ తత్త్వ జ్ఞానికి, ఆయన చేసే
పుణ్య కర్మలకు ఏ విధమైన సంబంధము ఉండదు. తత్త్వ జ్ఞానము
పొందిన జ్ఞాని ఈ జన్మలో తత్త్వ జ్ఞానము కలగక ముందు చేసిన
పుణ్య కర్మలను, జ్ఞానము కలిగిన వెంటనే జ్ఞానమనే అగ్ని కాల్చి
భస్మము చేయును. కాని చూడటానికి తత్త్వ జ్ఞాని కర్మలు
చేస్తు న్నట్లు కనిపిస్తుంది.

శ్రీసరస్వతీరహస్యోపనిషత్  - 32 - “ఉభే ఉ హై వైష ఏతే


తరతి'' ఇతి ''క్షేయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే'' –
తత్త్వ జ్ఞాని పుణ్య పాపములు రెండింటినీ జ్ఞానాగ్ని కాల్చి భస్మము
చేస్తుంది. అతడు వాటిని దాటి, అతీతుడై సంచరిస్తా డు.
ప్రారబ్ద కర్మలు – తత్త్వ జ్ఞానము పొందిన మహానుభావుడు
మిగిలిన వారికి తత్త్వ జ్ఞానము ఉపదేశము చేస్తా డు (“ఉపదేక్ష్యంతి
తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః” - 34 వ శ్లోకము). ప్రారబ్ద కర్మలు
లేకపోతే లేదా తత్త్వ జ్ఞానముతో అతని ప్రారబ్ద కర్మలు కూడా
261
దగ్ధమైపోతే, ఆయనకు ఈ జన్మ, ఈ శరీరము ఉండదు. అయనకు
శరీరము లేకపోతే, మిగిలిన వారు ఆయన ద్వారా తత్త్వ జ్ఞానము
ఉపదేశము పొందుటకు అవకాశము ఉండదు.
ఛాందోగ్యోపనిషత్ – “తస్య తావనేవ స్థిరం యావత్ నవి
మోక్ష్యే అధ సంపత్యే” – తత్త్వ జ్ఞానికి విదేహ కైవల్యమునకు ఈ
శరీరము ఎంతవరకూ నిలబడుతుందో అంతవరకూ
ప్రతీక్షించవలసినదే అపేక్ష ఉన్నది. ఆయన ప్రారబ్ధ కర్మ
అంతయ్యేవరకూ జీవించి, తరువాత విదేహ కైవల్యము
పొందుతారు.

బ్రహ్మ సూత్రములు – 4 వ అధ్యాయము (ఫల


అధ్యాయము), ప్రధమ పాదము, 14. ఇతరక్షపణాధికరణము, 19.
భోగేసత్వితరేక్షపయిత్వా సంపద్యతే – తను చేసుకున్న ప్రారబ్ధ కర్మల
(పుణ్య, పాపముల) ఫలితములను పూర్తిగా అనుభవించిన తరువాతే
ఆ శరీరము పడిపోతుంది. అప్పుడు విదేహ కైవల్యము పొందుతారు.
తత్త్వ జ్ఞానము కలిగిన తరువాత, ఆయన ప్రారబ్ద కర్మలు
అనుభవిస్తు న్నప్పటికీ, ఆయనకు వాటి సుఖ, దుఃఖముల ప్రభావము
ఉండదు. ప్రారబ్ధ కర్మలు వదిలిపెట్టిన బాణము వంటివి. ఆ బాణము
వదిలి పెట్టిన తరువాత లక్ష్యము కూడా దాటినా, అందులో శక్తి
పూర్తిగా క్షీణించిన తరువాతే ఆగుతుంది.

262
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ।
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి ॥ 38 ॥
జ్ఞానము చాలా పవిత్రమైనది. జ్ఞానము కంటె పవిత్రమైనది ఈ
లోకములో ఇంకొకటి లేనేలేదు.

సమతా భావముతో సత్కర్మ ఆచరణ చేసి మనస్సును


పరిశుద్ధము చేసుకొని, మరియు సద్గురువు ద్వారా యమనియమాది
అష్టాంగ యోగములు పరిపాకము పొందిన తరువాత సద్గురువు
అనుగ్రహముతో జ్ఞానము నిదానముగా తనంతట తాను సిద్ధిస్తుంది.

జ్ఞానము యొక్క విషయములు (వాక్యములు) అందరకూ


తెలిసినవే. కాని మనస్సు పరిశుద్ధము అయ్యేంతవరకూ ఆ
విషయము మనస్సుకు ఎక్కదు. సత్కర్మ ఆచరణ, యోగాభ్యాసము
చేసుకొని మనస్సు శుద్ధమై, ఏకాగ్రత సిద్ధించిన తరువాత ఇదే
విషయముల (వాక్యములు) ద్వారా తత్త్వ జ్ఞానము అర్థమవుతుంది.
విషయము ఒక్కటే, కాని ఆ సాధకుడి అర్ధము చేసుకునే స్థితులు
వేరు. కొందరికి సిద్ధి తొందరగా కలగవచ్చు, కొందరికి ఎక్కువ
సమయము పట్టవచ్చు, కొందరికి అసలు కలగక పోవచ్చు. అది కాల
మహిమ కాదు. ఆ సాధకులు చేసుకున్న యోగ సిద్ధి మహిమ.

ఉదాహరణ:

263
ఒక అడవిలో ఒక సాధకుడు చాలా కష్టపడి పూజా సామగ్రిని
సిద్దము చేసుకొని, అమ్మవారిని ప్రత్యక్షము చేసుకునే ఒక
ప్రత్యేకమైన, ఉన్నతమై పూజ చేయుటకు కూర్చొని, మంచి
ఘడియలకు వేచి ఉన్నాడు. అంతలో ఒక పులి వచ్చి ఆ సాధకుడిని
చంపి తినేసింది. అక్కడ దగ్గరలో ఇదంతా చూస్తు న్న ఇంకొక వ్యక్తి ఆ
పులిని చూసి భయపడి చెట్టెక్కాడు. ఆ పులి మొదటి సాధకుడిని
తినేసి, కడుపు నిండగానే అక్కడ నుండి వెళ్ళిపోయింది. తరువాత
ఆ రెండవ వ్యక్తి చెట్టు మీద నుండి క్రిందకు దిగి, అక్కడ అమ్మవారి
విగ్రహము, పూజకు పూలు ఎలాగూ ఉన్నాయి కదా అని ఆ పూలు
అమ్మకు సమర్పించాడు. ఆ సమయమునకు మొదటి సాధకుడు
ఎదురు చూస్తు న్న మంచి ఘడియలు వచ్చాయి. వెంటనే అమ్మ
ప్రత్యక్షమయినది. రెండవ వ్యక్తి ఆశ్చర్యపడి, అమ్మ నీవు
ప్రత్యక్షమైనందుకు చాలా సంతోషము. కాని ఒక సందేహము – ఆ
మొదటి వ్యక్తి ఎంతో కష్టపడి ఈ అడవిలో నీ పూజకు అన్నీ
సమకూర్చుకున్నవాడిని ఆ పులి అలా తినేసింది. అతనికి ఏమీ
ఫలితము లేదు. నేను ఏమీ కష్టపడకుండా ఇక్కడ అన్నీ సిద్ధముగా
ఉన్న పూలను నీకు సమర్పించాను అంతే. నీవు ప్రత్యక్షమయి నాకు
ఫలితము కలిగింది. ఈ రకముగా అయితే మానవులకు కర్మ
సిద్ధాంతము మీద నమ్మకము ఎలా కలుగుతుంది.

264
నీవు అనేక గత జన్మలలో చేసుకున్న అనేక సాధనల
ఫలితముగా నీకు అన్నీ సిద్ధముగా దొరికేలా నేనే చేశాను. నీకు
ఇప్పుడు ఆ సాధనలకు ఫలితము ఇచ్చాను. చనిపోయిన మొదటి
వ్యక్తికి సిద్ధి కలుగుటకు పై జన్మలలో ఇంకా చాలా సాధన
చేసుకోవాలి.

శ్రద్ధా వాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః ।


జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమ్ అచిరేణాధిగచ్ఛతి ॥ 39 ॥

శ్రద్ధ = గురువులు చెప్పిన విషయముల మీద, వేదములు


(ఉపనిషత్తు లు), శాస్త్రములు, ప్రమాణ వాక్యములు మీద
యధార్థమైన, దృఢమైన విశ్వాసము. పరమాత్మ తత్త్వము
మానవులు ఊహలకు, మేధా శక్తికి అతీతమైనది. కాబట్టి వేద
ప్రమాణములు, గురువులు, తత్త్వ జ్ఞానులు చెప్పే వాటిమీద పూర్తిగా
విశ్వాసము, నమ్మకము ఉండాలి.

శ్రద్ధ ఉన్నవాడికి ఏకాగ్రత ఏర్పడి ఆత్మ జ్ఞానము కలుగుతుంది.


కేవలము ఆత్మ జ్ఞానమే కావాలి, ఇతరమైనవి ఏమీ అక్కర్లేదు అనే
ధృఢమైన నిశ్చయము మనస్సులో ఉన్నవాడికి మరియు తన
ఇంద్రియములను తన వశములో ఉంచుకున్నవాడికి మాత్రమే ఆత్మ
జ్ఞానము కలుగుతుంది. జ్ఞాన సాధన పరిపాక దశకు చేరుటకు వారి,
వారి సాధన మరియు స్థితిని బట్టి సమయము పట్టు తుంది.

265
కాని ఒక్కసారి ఆత్మ జ్ఞానము లభించిన వెంటనే, క్షణ
మాత్రము లోనే, ఆ సాధకుడు సర్వోత్తమమైన శాంతిని
పొందుతారు.

ముండకోపనిషత్ – 2-2-5 – “తమేవైకం జానథ ఆత్మన


మన్యా వాచో విముఞ్చథామృతస్యైష సేతుః” – ఆత్మ జ్ఞానము
కావాలి అని అనుకునేవాడు ఇతర విద్యలను వదిలివేయవలెను. ఈ
ఆత్మ జ్ఞానము మోక్షమునకు వారధి ‍వంటిది.

ఛాందోగ్యోపనిషత్ – షష్ఠః ప్రపాఠకః – 1 నుండి 16


ఖండములు -

ఆరుణ (ఉద్దా లక) మహర్షి యొక్క పుత్రు డు శ్వేతకేతు.


ద్వాదశ ఖండములో - ఆరుణ మహర్షిని శ్వేతకేతు ప్రశ్నించాడు. ఓ
తండ్రి I పరమాత్మ తత్త్వము ఈ ప్రపంచమునకు మూల
కారణమని, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదని చెప్పావు. వ్యాపించి
ఉన్న పరమాత్మ తత్త్వము సూక్ష్మము, కంటికి కనబడదు, ఊహలకు
అందదు అని కూడా చెప్పావు. మరి నీవు చెప్పిన దానిని
చూడకుండా ఎలా నమ్మాలి? నాకు నమ్మకము కలిగేలా ఉపదేశము
చేయము అని అడిగాడు. అప్పుడు ఆరుణ మహర్షి, ఒక మర్రి
పండును తెమ్మని, దానిని చీల్చి, అందులో అత్యంత సూక్ష్మమైన
బీజమును కూడా చీల్చి, అందులో చూసి, అందులో ఏమీ

266
కనబడుచున్నదో చెప్పమని అడిగెను. శ్వేతకేతు అందులో చూసి
ఏమీ కనిపించుట లేదు అని చెప్పెను. అప్పుడు ఆరుణ మహర్షి ఆ
కనిపించని సూక్ష్మ భాగము నుండియే, ఇంత పెద్ద మర్రి చెట్టు
పుట్టు చున్నది.

ఛాందోగ్యోపనిషత్ - 6-12-3 – “శ్రద్ధత్స్వ సోమ్యేతి స య


ఏషోణి మైతదాత్మ్య మిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్త్వమసి
....” వస్తు వు సూక్ష్మముగా ఉన్నా దానికి మొలకను పుట్టించే
సామర్థ్యము ఉన్నట్లయితే దాని శక్తిని నమ్మాలి. అలాగే అతి
సూక్ష్మమైన, వ్యాపకమైన పరమాత్మ తత్త్వములో కూడా ఈ
ప్రపంచమును సృష్టి చేసి, తనలో లయము (లీనము) చేసుకునే
సామర్థ్యము ఉన్నది.

అజ్ఞశ్చ అశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి ।


నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః ॥ 40 ॥

ఎవరైతే ఏమీ తెలుసుకోనక్కరలేదు అని అనుకొని, ఏమీ


తెలుసుకోకుండా ఉంటారో (తమో గుణము ప్రధానముగా
ఉన్నవాళ్లు ), వాళ్ళు పొందవలసిన సర్వోత్తమమైన ప్రయోజనమును
పొందలేక నాశనమైపోతారు. శ్రద్ధ లేనివాడు ప్రతీదానినీ విపరీతముగా
ఆలోచించేవాడు, నీవు లేదా గురువులు చెప్పారు కాబట్టి, వాటిని
నేను నిజము అని అనుకోను. ఉపనిషత్తు లలో ఉన్న పుక్కిటి

267
పురాణములను నేను నమ్మను అని అనుకునే వాళ్ళు
పొందవలసిన సర్వోత్తమమైన ప్రయోజనమును పొందలేక
నాశనమైపోతారు. ప్రతీ దానిమీద అపనమ్మకము ఉన్నవాళ్లు ,
నమ్మాలా లేక వద్దా అని ఆలోచించేవాళ్లు కూడా వాళ్ళు పొందవలసిన
సర్వోత్తమమైన ప్రయోజనమును పొందలేక నాశనమైపోతారు.
“స్వార్ధాః భ్రష్టో భవంతి” స్వార్ధముతో ఉన్నవాళ్లు భ్రష్టు లైపోతారు.

సంశయము స్వభావముగా ఉన్న వాళ్లకు ఈ లోకములో


కాని, పై లోకములలో కాని ఏ ఫలితము దక్కదు. వాళ్లకు అసలు
సుఖమనేదే ఉండదు. .

యోగసంన్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయం ।
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ॥ 41 ॥

ఎవరైతే నేను (పరమాత్మ) చెప్పిన జ్ఞాన యోగము ద్వారా


తత్త్వ జ్ఞానము పొంది (4-14 వ శ్లోకము) వారి, వారి కర్మలను
వాటంతో అవే ఊడిపోయేలా చేసుకుంటారో, ఎవరైతే తత్త్వ జ్ఞానము
పొంది, వారి మనస్సులలో ఉండే సందేహముల అన్నీ మూలము
వరకూ తెగిపొతాయో (తీరిపోతాయో)

ఎవరైతే అప్రమత్తతతో (జాగ్రత్తగా) వ్యవహరిస్తా రో అటువంటి


వారిని ఏ కర్మలు బంధించ లేవు, ధనంజయ (అర్జు నా) I

268
కర్తవ్య భావన, ఫలాపేక్ష, రాగ ద్వేషములు లేకుండా
సత్కర్మలను ఆచరిస్తూ, ఆ కర్మలను పరమాత్మకు పూర్తిగా
సమర్పించి, మనస్సును శుద్ధి చేసుకొని, పరమాత్మ తప్ప వేరొకటి
లేనేలేదు అనే స్థిరమైన బుద్ధితో, ప్రాపించక విషయముల వైపు
మనస్సు మరలకుండా సర్వత్రా ఆత్మ దృష్టితో ఎవరైతే ఉంటారో,
వారికి తత్త్వ జ్ఞానము కలుగుతుంది. ఆ తత్త్వ జ్ఞానము మనస్సులో
ఉండే ప్రతి సందేహమును పటాపంచలు చేస్తుంది.

ఉదాహరణ:

1. ఒక జమిందారు ఇంట్లో పనిమనిషి ఉంటూ, ఆ ఇంట్లో


ప్రతి వ్యక్తినీ తన యజమానిగా భావిస్తూ, ప్రతి వస్తు వులనూ జాగ్రత్తగా
శుభ్ర పరుస్తూ, ఆ ఇంటి యజమానులు చెప్పిన ప్రతి పనీ చేస్తూ
ఉంటున్నా, ఆ ఇల్లు ను, ఆ ఇంట్లో వ్యక్తు లను, వస్తు వులను తనదిగా
భావించకుండా, వాటిమీద ఏ వ్యామోహము లేకుండా తన ఊళ్ళో
ఉండే చిన్న ఇల్లు , తన పిల్లలు, బంధువులను తన ఇల్లు గా,
తనవాళ్లగా ఎలా భావిస్తూ, ఎప్పటికైనా అక్కడకే వెళ్ళాలి అని
అనుకుంటుందో, అలాగే పరమాత్మ అంశము అయిన మనము,
పరమాత్మే మనవాడిగా భావిస్తూ, పరమాత్మ సృష్టి చేసిన ఈ
ప్రపంచమును, యజమాని ఇల్లు గా భావిస్తూ, ఈ ప్రపంచము
యొక్క యజమాని అయిన పరమాత్మ చెప్పిన విధముగా అన్ని

269
పనులు చేస్తూ, ఎప్పటికైనా మనవాడైన పరమాత్మ దగ్గరకే వెళ్ళాలి,
అక్కడే ఉండాలి అనే భావన ఉండాలి.

2. జ్ఞానము అనే వెన్న కావాలంటే, మనస్సు అనే పాలను


సత్కర్మలతో వేడి చేసి (శుభ్రపరచి), పాలను కొంచము పెరుగుతో
తోడు పెట్టినట్లు , మనస్సును శ్రద్ధ మరియు తత్పరతతో (ఆసక్తితో)
తోడు పెట్టి, కొంత సేపు ఆ మనస్సు అనే ఆ పాలను ప్రాపించక
విషయములతో కదలకుండా, పరమాత్మ మీద దృష్టి పెట్టి
అప్రమత్తముగా, స్థిరముగా ఉంచితే, అప్పుడు పాలు తోడుకొని,
పెరుగు అయినట్లు , తోడుకున్న ఆ పాలను చిలికినట్లు , శుభ్ర పడిన
మనస్సును జ్ఞానాభ్యాసముతో చిలకాలి. పెరుగును చిలికిన తరువాత
వెన్న పైకి వచ్చినట్లు , మనస్సును జ్ఞానాభ్యాసముతో చిలికితే అప్పుడు
జ్ఞానము సిద్ధిస్తుంది. అప్పుడు ఏ రకమైన కర్మ బంధనములు
ఉండవు.

ముండకోపనిషత్ – 2-2-9 – “భిద్యతే హృదయ గ్రన్థి


శ్ఛిద్యన్తే సర్వసంశయాః I క్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే
పరావరే” – ఆ పరమాత్మను ప్రత్యక్షముగా చూసి, హృదయ
గ్రంథులు చేధించబడి (హృదయములో ఉండే ముడులు అన్నీ
విడిపోయి), సమస్త సంశయములు నివారింపబడును. పరమాత్మ
తత్త్వ జ్ఞానము స్థిరముగా ఉండి (ప్రాపించక విషయముల వైపు

270
మనస్సు మరలకుండా ఉంటుందో), సమస్త కర్మలు క్షయము
అవును (జన్మ పరంపర నుండి విముక్తి కలుగుతుంది).

తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః ।


ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత ॥ 42 ॥

అందుచేత అజ్ఞానము వలన నీ మనస్సులో దాగి ఉన్న, కలిగే


సంశయములను, ఆత్మ తత్త్వ జ్ఞానము సంపాదించుకొని, ఆ
జ్ఞానము

అనే ఖడ్గముతో సంశయములను ఛేదించి, నరికి,


తొలగించుకొని, నీ కర్మ యోగమును, కర్తవ్యమును (4-15 వ
శ్లోకము కురు కర్మైవ తస్మాత్త్వం) నీవు నిర్వర్తించు. అనవసరముగా
కూర్చోవద్దు , పైకి లే, భారత వంశములో పుట్టిన అర్జు నా I

అజ్ఞానము

అజ్ఞానము వలన ఏ ప్రయోజనము దక్కదు. అజ్ఞానము


మూడు విధములుగా ఉంటుంది – 1. అజ్ఞానము – మూల
అజ్ఞానము. ఏమీ తెలియకపోవటము – 4-40 వ శ్లోకము
చూడుము), 2. సంశయ జ్ఞానము – ఎప్పుడూ ఇదా లేక అదా అనే
సందేహములతో ఉండుట – ఏ పనిని నిర్ణయాత్మకముగా,
ధైర్యముగా చేయలేడు – 4-40 వ శ్లోకము చూడుము), 3. మిథ్యా

271
జ్ఞానము – భ్రమతో, తప్పుగా తెలుసుకొనుట (ఎండ మావులను
నీళ్ళుగా భావించుట. అనర్థము కలుగుతుంది).

బ్రహ్మ పురాణం – 129.7 – “కర్మణా బాధ్యతే జన్తుః, విద్యవ


ఏవ విముచ్యతే తస్మాత్ కర్మ న కుర్వంతి యతయః పారదర్శినః: -
కర్మలు బంధనము కలిగిస్తా యి. తత్త్వ జ్ఞానము ద్వారానే కర్మల
బంధనము నుండి విముక్తి (మోక్షము) కలుగుతుంది. అందుచేత
ఎవరైతే విముక్తిని కోరుకుంటారో, వాళ్ళు కోరికలతో కర్మలు
చేయవద్దు .

ముండకోపనిషత్ – 2-2-9 – “భిద్యతే హృదయ గ్రన్థి


శ్ఛిద్యన్తే సర్వసంశయాః I క్షీయ న్తే చాస్య కర్మాణి తస్మిన్ దృష్ట
పరావరే” - పరమాత్మను చూసిన వెంటనే హృదయ గ్రంథులు
చేధించబడి, అజ్ఞానము పోయి, అజ్ఞానము వలన మనస్సులో కలిగే
లేదా ఉండే సందేహములు అన్నీ పటాపంచలు అయిపోతాయి. అన్ని
కర్మ బంధనములు నాశనము అయిపోతాయి.

ముండకోపనిషత్ – 2-2-5 - “తమేవైకం జానథ ఆత్మన


మన్యా వాచో విముఞ్చథామృతస్యైష సేతుః” – ఆ అక్షర
బ్రహ్మమునే, అద్వితీయుడుగాను, మీ యొక్క ఆత్మగాను,
తెలుసుకోండి. పరమాత్మను ఒక్కడినే తెలుసుకునేందుకు ఏ
ప్రయత్నము చేసుకోవాలో, అది చేసుకోండి. మిగతా విద్యలను,

272
మాటలన్నీ వదిలేయండి. పరమాత్మను తెలుసుకుంటే
అమృతత్త్వము కలుగుతుంది. జన్మ, మరణ ప్రవాహములో వచ్చే
కష్టములు దరిచేరవు. పరమాత్మను తెలుసుకుంటే జన్మ, మరణ
ప్రవాహమును దాటుటకు వంతెనగా ఉపయోగపడుతుంది.

ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం


యోగశాస్త్రే శ్రీకృష్ణార్జు న సంవాదే జ్ఞానకర్మసంన్యాసయోగో నామ
చతుర్థోఽధ్యాయః ॥ 4

మంగళా శ్లోకములు

యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః l

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రు వా నీతిమతిర్మమ ll

అధ క్షమా ప్రార్ధనా

యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ l తత్సర్వం క్షమ్యతాం


దేవ నారాయణ నమోస్తు తే ll

అధ భగవత్ సమర్పణమ్

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ l


కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ll

273
అధ లోకక్షేమ ప్రార్ధనా

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః l


సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ll

అధ మంగళమ్

శ్రియః కంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినామ్ l


శ్రీవేంకట నివాశాయ శ్రీనివాసాయ మంగళమ్ ll

కృష్ణ నామ సంకీర్తన

కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l


కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l

274
అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యానాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జు న సంవాదే కర్మసంన్యాసయోగో నామ
పంచమోఽధ్యాయః l।

అర్జు న ఉవాచ ।
సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి।
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం ॥ 1 ॥

అర్జు నుడు ఇలా అంటున్నాడు I పరమాత్మా, నీవు జ్ఞానము


సర్వోత్తమమైనది, కర్మ సన్యాసము వలన జ్ఞానము కలుగుతుంది అని
అంటున్నావు, (2-72 మరియు 3-17 శ్లోకములు) కృష్ణా I మళ్ళీ
నువ్వే, నన్ను కర్మ యోగము చేయమంటున్నావు. అందువలన నాకు
మళ్ళీ సందేహము వస్తోంది.

నా సందేహము పోగొట్టటానికి సన్యాసమా, కర్మ యోగమా,


ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో నాకు ఏదో ఒకటి బాగా
నిశ్చయము చేసి నాకు స్పష్టముగా చెప్పు.

శ్రీభగవానువాచ ।
సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ ।
తయోస్తు కర్మసంన్యాసాత్ కర్మయోగో విశిష్యతే ॥ 2 ॥

275
భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు l అన్ని
కర్మలను వదలిపెట్టి , జ్ఞాన మార్గములో తత్త్వ జ్ఞానము కోసము
తీవ్రముగా నిరంతరము ప్రయత్నము చేసే సన్యాసము. రాగ
ద్వేషములు లేకుండా, కర్తృత్వ అభిమానము (భావన) లేకుండా,
కర్మ ఫలముల మీద ఆసక్తి లేకుండా, సమతా భావముతో చేసే
సత్కర్మ ఆచరణ. ఈ రెండూ మార్గములు సర్వోత్తమమైన శ్రేయస్సు,
అఖండ ఆనందము, పరమ పురుషార్థము కలిగిన ఫలితములను
తప్పకుండా ఇస్తా యి.

కర్మ మార్గము, సన్యాస మార్గము సమానమైన


ఫలితములు ఇస్తు న్నా, ఆ రెండు మార్గములలోనూ కర్మ సన్యాస
మార్గము కంటె కర్మ యోగము విశిష్టమైనది.

జ్ఞాన మార్గము లోనికి ప్రవేశము, అర్హత కలగాలంటే ముందు


(మొదటి మెట్టు అయిన) కర్మ యోగము (సత్కర్మ ఆచరణ) ద్వారా
మనస్సును శుద్ధి చేసుకోవాలి. కర్మ యోగము ద్వారా (రెండవ మెట్టు
అయిన) జ్ఞాన మార్గము లోనికి ప్రవేశము కలిగించి, ఆ జ్ఞాన
మార్గము ద్వారా తత్త్వ జ్ఞానము కలిగిస్తుంది. కాబట్టి మొదటి
మెట్టు అయిన కర్మ యోగము విశిష్టమైనది. .

జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి ।


నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ప్ర ముచ్యతే ॥ 3 ॥

276
ఎవరికైతే ద్వేషము లేదో, ఎవరికైతే ఏ విధమైన ఆశలు లేవో
వారిని మాత్రమే జ్ఞానము కలిగిన నిత్య సన్యాసి అని అనాలి.
సన్యాసము అంటే రాగ, ద్వేషములను సన్యాసము (విడిచిపెట్టు ట)
చేసుకొనుట .

ఏ రకమైన ద్వంద్వ భావములను (సుఖము-దుఃఖము,


చలి-వేడి, లాభము-నష్టము, అనుకూలము-ప్రతికూలము, నావాళ్ళు-
పరాయివాళ్లు మొదలైన వాటిమీద రాగ, ద్వేషములు)
విడిచిపెట్టు టయే సన్యాసము. గొప్ప బాహువులు కలవాడా (ఏదైనా
జయించగలవాడా – అలాగే రాగ ద్వేషములను, ద్వంద్వ భావనలను
జయించు). అలా జయించగలిగితే, నీకు ఉండే కర్మ, జన్మ
బంధనములు అన్నీ అనాయాసముగా, సులభముగా
తొలగిపోతాయి.

సన్యాసము లేదా సర్వ సంగ పరిత్యాగము అంటే చాలా


మందికి ఉన్న భ్రమ, దురభిప్రాయము - భార్య, పిల్లలను వదిలి, ఏ
రకమైన సంబంధములు లేకుండా, చేయవలసిన కష్టమైన కర్మలు
మాత్రము చేయకుండా, బాధ్యతలను తప్పించుకుని, మనకు
కావలసిన, ఇష్టమైన కర్మలు (పనులు) చక్కగా చేసుకుంటూ,
కాషాయ బట్టలు కట్టు కొని, మన ఇష్టము వచ్చినట్లు తిరగవచ్చును.
అందరూ గౌరవించేస్తా రు. కాని ఎవరికైతే రాగ ద్వేషములు లేవో,
ఎవరికైతే ద్వంద్వ భావములు లేవో, ఎవరైతే సత్కర్మ ఆచరణ చేస్తా రో
277
వారే నిత్య సన్యాసి. సన్యాసము లేదా సర్వ సంగ పరిత్యాగము
అంటే రాగ ద్వేషములను, ద్వంద్వ భావముల విడిచిపెట్టు ట.

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ।


ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం ॥ 4 ॥

సాంఖ్య = “సమీతీనా ఖ్యా ఇతి సాంఖ్య”


= తత్త్వ జ్ఞానము. తత్త్వ జ్ఞానము కోసము చేసే సన్యాసమును
సాంఖ్యము అంటారు.

యోగము = ఆ తత్త్వ జ్ఞానము సిద్ధించాలంటే చేయవలసిన


కర్మ యోగము. సమతా భావముతో, ఏ విధమైన ఫలాపేక్ష లేని
సత్కర్మ ఆచరణను యోగము అంటారు.

నా ఉపదేశ వాక్యముల ద్వారా సాంఖ్య మార్గము, యోగ


మార్గము అని అంటూ ఉంటారు. ఈ రెండూ వేరు, వేరు అని
అనుకుంటూ ఉంటారు. సాంఖ్యకు ఫలితము శాశ్వతమైన
ఆనందము లేదా మోక్షము అని, యోగమునకు సత్కర్మకు అని,
దీనికి స్వర్గము ఫలితము అని రెండింటికీ వేరు, వేరు ఫలితములు
అని చెప్పుతారు. అలా చెప్పేవాళ్ళు అవివేకులు. పండితులు ఇలా
మాట్లా డారు. రెండింటికీ ఒక్కటే ఫలితము. అది శాశ్వత
ఆనందము, మోక్షము.

278
సాంఖ్యము అయినా, యోగము లేదా సత్కర్మ ఆచరణ, ఈ
రెండింటిలో నీ అర్హతకు, యోగ్యతకు తగిన ఏ ఒక్క దానినైనా సరే
(చిత్త శుద్ధి కలిగి, ఏకాగ్రత ఉన్న వారికి సాంఖ్యము, సందేహములు
ఉండి ఏకాగ్రత, చిత్తశుద్ధి లేని వారికి యోగము (సత్కర్మ ఆచరణ),
బాగా సాధన చేస్తే రెండింటి ఫలితములను పొందుతారు. (ఈ
వివరణ 3-3 శ్లోకములో కూడా పరమాత్మ చెప్పాడు). .

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థా నం తద్యోగైరపి గమ్యతే ।


ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ॥ 5 ॥

తత్త్వ జ్ఞానము మీద తీవ్రమైన అభినివేశము (ఆసక్తి,


పట్టు దల) కలిగి ఉన్నవారు, సన్యాసము స్వీకరించి (అన్ని
సంబంధములు, కర్మలు మానసికముగా విడిచిపెట్టు కున్నవాళ్ళు)
తత్త్వ జ్ఞానము కోసము సాధన చేసుకునేవారు ఏ స్థిరమైన
స్థా నమును లేక ఫలితమును (తత్త్వ జ్ఞానమును) సాధిస్తా రో,
సత్కర్మ ఆచరణను, సమతా భావముతో చక్కగా చేసేవాళ్ళు, కర్మ
యోగముతో కూడా అదే ఫలితమును సాధిస్తా రు. సత్కర్మ ఆచరణ
లేదా కర్మ యోగము చేసే వాళ్ళు, సన్యాసుల కంటె ఒక్క అడుగు
మాత్రమే వెనక ఉన్నట్లు .

ఆ రెండు పద్దతులు ఒకటే మార్గములో కర్మ యోగము


మొదటి మెట్టు అయితే, సాంఖ్యము రెండవ మెట్టు . అందుచేత

279
సాంఖ్యము, కర్మ యోగముల యొక్క ప్రయోజనము ఒక్కటే అని
ఎవరైతే అర్ధము చేసుకోగలుగుతారో, వాళ్ళే సరిగ్గా అర్ధము చేసుకొని
చూస్తు న్నట్లు .

కర్మ యోగము అంటే ద్వంద్వముల పైన సమతా


భావముతో, నేను చేస్తు న్నాను అనే కర్తృత్వ, అభిమానము
భావములు లేకుండా, ఫలాపేక్ష లేకుండా, కర్మ ఫలములు
భగవంతుడికి అర్పిస్తూ శాస్త్రము నిర్దేశించిన సత్కర్మలను, పరమాత్మ
యొక్క ఆజ్ఞలను పాటిస్తు న్నాను అనే భావముతో ఆచరించుట
(సత్కర్మల గురించి 3-16 శ్లోకము చూడుము).

ధాన్యము పరిపక్వము కాకుండా కోస్తే అన్నము సరిగ్గా


ఉండదు. అలాగే చిత్త శుద్ధి, సర్వ సంగ పరిత్యాగము, సరైన వైరాగ్య
భావము, సరైన నిర్ద్వంద్వ భావములు రాకుండా సన్యాసము
తీసుకుంటే వ్యర్ధమవుతుంది.

ఉదాహరణ

ఒక బట్టలు నేసే సాలెవాడు, తను నేసిన బట్టలను బజారుకు


తీసుకువెళ్లి అమ్ముతాడు. దాని వెల ఎంత అని వినియోగదారులు
అడిగితే, ఆ సాలెవాడు భగవత్ ఇచ్చతో ఈ నూలు ఖరీదు ఇంత,
భగవత్ ఇచ్చతో ఈ బట్ట నేతకు ఖర్చు ఇంత, భగవత్ ఇచ్చతో ఈ
సామానులు బజారుకు తీసుకువచ్చుటకు ఖర్చు ఇంత, భగవత్

280
ఇచ్చతో నా లాభము ఇంత. మొత్తము దీని ఖరీదు ఇంత అనే
చెప్పేవాడు. వినియోగదారులు అతని నిజాయితీని,
అమాయకత్వమును గౌరవించి, బేరము అడగకుండా కొనేవారు.
ఒకరోజు ఆ సాలెవాడు చెట్టు క్రింద కూర్చొని ఉండగా, ఒక దొంగల
ముఠా దొంగతనముకు వెళ్ళుతూ, అమాయకముగా ఉన్న
సాలెవాడిని చూసి, వాళ్ళు దొంగిలించే ధనము మోయుటకు
పనికొస్తా డని, ఒరేయ్ మాటా రారా అన్నారు. వాడు భగవత్ ఇచ్చతో
సరే అని వాళ్లతో వెళ్ళాడు. వాళ్ళు ఒక బాంకులో డబ్బును
దొంగిలించి, మూటకట్టి, వాడి నెత్తి మీద పెట్టి మోసుకొని రారా
అన్నారు. వాడు భగవత్ ఇచ్చతో ఆ మూటను మోస్తూ ఆ దొంగల
వెనకాలే వెళ్ళుతున్నాడు. ఇంతలో పోలీసులు వాళ్లను వెంబడించారు.
ఆ దొంగలు పారిపోయారు. ఆ సాలెవాడు డబ్బు మూటతో సహా
పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు వాడిని ఏమి చేసావురా అని
అడిగితే, వాడు జరిగిన దంతా పూస గుచ్చినట్లు భగవత్ ఇచ్చతో
ఇలా చేశానండీ అని చెప్పాడు. పోలీసులు వాడిని సరే భగవత్
ఇచ్చతో శ్రీకృష్ణ జన్మ స్థా నములో ఉండు అని లోపల వేశారు. కోర్టు లో
కేసు జరుగుతోంది. న్యాయమూర్తి విచారణ చేస్తూ ఉంటే, ఆ ఊళ్ళో
వాళ్ళంతా వచ్చారు. ఊళ్ళో వాళ్ళు జడ్జిగారితో, అయ్యా వీడు చాలా
అమాయకుడు, మంచివాడు. వీడు దొంగతనము వంటివి చేయడు,
ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చు అని చెప్పారు. దానితో

281
న్యాయమూర్తి లాయర్లను వద్దని, వాడిని ఏమి జరిగిందో అంతా
చెప్పమని అడిగారు. వాడు భగవత్ ఇచ్చతో ఇలా జరిగింది అని
జరిగిన దంతా పూస గుచ్చినట్లు చెప్పాడు. న్యాయమూర్తి ఊళ్ళో
వాళ్లను, ఆ సాలెవాడిని నమ్మి, భగవత్ ఇచ్చతో వీడు దొంగతనము
చేయలేదు అని నమ్మి, భగవత్ ఇచ్చతో వీడిని విడుదల చేస్తు న్నాను
అని న్యాయ తీర్పు ఇచ్చాడు.

ఏమీ తెలియని అమాయకుడైన సాలెవాడికి ఈ రకమైన


ఫలితము ఎలా కలిగింది? అతడి బలము ఒక్కటే. అతడు ఏమి
చేసినా అది భగవంతుడి ఇచ్చ, భగవంతుడి ఆజ్ఞ మాత్రమే అని
గుడ్డిగా నమ్మి చేస్తా డు. అందులో అతని కర్తృత్వము ఏమీ ఉండదు,
పొందవలసినది ఏదీ ఉండదు. వాటికి పరమాత్మే కర్త. అటువంటి
వారు ఏ రకమైన తప్పు చేసే అవకాశము ఉండదు, వారికి ఏ విధమైన
కష్టము కలగదు. అటువంటి సత్కర్మ ఆచరణ చేసుకుంటే, భగవత్
సమర్పణ బుద్ధితో కర్మ యోగమును సాధించుకుంటే, సాలెవాడు
విడుదల అయినట్లు , ప్రతి జీవుడు సంసారము (జన్మ, మృత్యు
చక్రము) నుండి విడుదల అవుతాడు.

సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః ।


యోగయుక్తో మునిర్బ్ర హ్మ నచిరేణాధిగచ్ఛతి॥6॥

282
గొప్ప బాహువులు కల ఓ అర్జు నా I సన్యాసము అంటే ఒక
యోగము. సత్కర్మ ఆచరణ లేకపోతే, సన్యాసమును సవ్యముగా
పాటించలేరు. రాగ, ద్వేషములు లేకుండా సమతా బావ
పూర్వకముగా, కర్తృత్వ భావము లేకుండా, సత్కర్మ ఆచరణ
సవ్యముగా చేసుకొని, మనస్సు పరిశుద్ధమైన తరువాత మనస్సు
పరిపాకము అయిన తరువాత సన్యాసము తీసుకుంటే,
సన్యాసమును సవ్యముగా పాటించగలరు. అప్పుడే ఏ విషమైన
అడ్డంకులు లేకుండా, తత్త్వ జ్ఞానము కొరకు సాధన చేయగల
సామర్థ్యము, మానసిక స్థితి ఏర్పడుతుంది. ఆ మానసిక స్థితి
లేకుండా సన్యాసము తీసుకుంటే, అది సన్యాసమే కాదు. అటువంటి
సన్యాసము దుఃఖమయము అవుతుంది.

నిష్కామ కర్మ యోగమును బాగా సాధించుకొని, తరువాత


సన్యాస ఆశ్రమమును స్వీకరించి, సన్యాస యోగమును
అవలంబిస్తూ, తత్త్వ జ్ఞానము కొరకు సాధన, మననము
చేసుకుంటూ, ఆత్మ తత్త్వ జ్ఞానమును తొందరగా పొంది, బ్రహ్మ
స్వరూపములో లయించి, తాను బ్రహ్మ స్వరూపమే అయిపోతాడు.

ముని:

ముని అనగా మననము చేయువాడు. ఆత్మ జ్ఞానము


సంపాదించుకొనుటకు అవసరమైన మననము చేసుకోవాలి.

283
పరమాత్మ అంశముగా ఆత్మ కూడా నిత్య శాశ్వతమైన దివ్య
ఆనందము స్వరూపము కాబట్టి, ఆనందము కావాలి అని
అనుకుంటుంది. ప్రతి జీవికి ఈ ప్రపంచము నుండి ఆనందము
పొందాలని ప్రయత్నిస్తుంది. ఈ ప్రపంచము నుండి ఏది పొందినా
జీవాత్మకు తాత్కాలికమైన ఆనందము మాత్రమే దొరుకుతోంది.
తాత్కాలికమైన ఆనందము రుచి చూసే సరికి అయిపోయి,
దుఃఖము మిగిలిపోతుంది. మళ్ళీ, మళ్ళీ ఆనందము కోసము
ప్రయత్నముతోనే జీవితము అంతమై పోతుంది. అందులోనూ
మనము ఆనందము అని భ్రమపడుతున్న ఈ ప్రాపించక ఆనందము
అసలు ఆనందమే కాదు. దానిని సుఖము అని అనవచ్చును.
అటువంటి తాత్కాలికమైన సుఖముతో మన దివ్యమైన నిత్య ఆత్మ
స్వరూపము ఎప్పటికీ తృప్తి పడలేదు.

శాశ్వతమైన దివ్య ఆనందము కోసము ప్రయత్నము


చేయాలంటే, ముందు ఈ తాత్కాలికమైన ప్రాపించక సుఖముల
కోసము చేసే ప్రయత్నములను (కర్మలను) ఆపాలి. ఆ కర్మలను
ఆపాలంటే, తాత్కాలికమైన ప్రాపించక సుఖములు ఇచ్చే ఈ
ప్రాపించక వస్తు వుల మీద రాగము, కామము, కోరికలను
పోగొట్టు కోవాలి. శాశ్వతమైన వాటి కోసము ప్రయత్నము చేసుకోవాలి,
అశాశ్వతమైన వాటిమీద కోరికలు పోగొట్టు కోవాలి. దీని కోసము
మొదట మనము “నిత్యానిత్య వస్తు వివేకము” – నిత్యమైన

284
ఆనందము కావాలా, అనిత్యమైన సుఖము కావాలా, ఏ వస్తు వు
నిత్యమైనది, ఏ వస్తు వు అనిత్యమైన, ఏది కావాలి, ఏది అక్కర్లేదు
అనే విచారణ (మననము) చేసుకొని, తరువాత శాశ్వతమైన
ఆనందము కావాలని నిర్ణయించుకున్న తరువాత శాశ్వతమైన
ఆనందము కలిగించని, అనిత్యమైన ఈ ప్రపంచము, ఈ ప్రాపించక
విషయముల మీద మనకు వైరాగ్యము కలుగుతుంది. “ఇహ జగతి
సర్వ ఏవ జంతుః నిరు పత్రవం సుఖమ్ మవాస్తు ద్విపరమతు
తతోపమానం దుఃఖమ్ ఇతి స్పుర్హాన్ కరోతి” – ఏ ప్రాణి అయినా
సరే, నాకు ఏ విధమైన కష్టములు లేని శాశ్వతమైన ఆనందము
కావాలి అని కోరుకుంటారు. కాని చాలా మంది ఆ ఆనందము
కోసము ప్రయత్నము (ఆత్మ జ్ఞానము) చేయుట లేదు? దానికి
కారణము, వాళ్ళ జన్మ, జన్మల నుండి మనస్సులో పేరుకుపోయి
ఉన్న కుసంస్కారములతో, వాళ్ళ మనస్సు పరిశుభ్రముగా లేదు.
పాలు కాచుటకు, పాత్రను పరిశుభ్రము చేసుకున్నట్లు గా, ఆత్మ
జ్ఞానము పొందాలంటే, ముందు మనస్సులో ఉన్న
కుసంస్కారములు లేకుండా, శుభ్రముగా కడుక్కోవాలి. సత్కర్మ
ఆచరణతో మంచి సంస్కారములు అలవరచుకొని,
కుసంస్కారములను (కామము, కోరిక, రాగము, స్పృహ, తృష్ణ,
ఇచ్ఛ, కాంక్ష, వాంఛ, ఆపేక్ష, ఆసక్తి, ఈహ) పోగొట్టు కొని చిత్తశుద్ధి
కలిగి, శమము (కర్మేంద్రియముల నిగ్రహము), దమము

285
(జ్ఞానేంద్రియముల నిగ్రహము) కలిగి, తితీక్ష (ద్వంద్వములను –
సుఖము-దుఃఖము, లాభ-నష్టము, చలి-వేడి, మొదలైన వాటిపైన
సమతా భావము) కలిగి, ఉపరతి (సన్యాసము) మనస్సు శుభ్ర పడి
ఆత్మ జ్ఞానము పొందుటకు అర్హత కలుగుతుంది.

బృహదారణ్యకోపనిషత్ – “శాన్తో దాన్త ఉపరతి తితీక్షుహు


సమాహితః శ్రద్ధా విత్తో భూత్వ ఆత్మన్యేవ ఆత్మనామ్ పశ్యతి” –
కర్మేంద్రియములను నిగ్రహించుకొని శమమును
సాధించుకున్నవాడు, జ్ఞానేంద్రియములను, మనస్సును
నిగ్రహించుకొని దమమును సాధించుకున్నవాడు, ఉపరతి
(సన్యాసమును) పూర్తిగా అభ్యాసము చేసినవాడు, తితీక్ష
(ద్వంద్వములను – సుఖము-దుఃఖము, లాభ-నష్టము, చలి-వేడి,
మొదలైన వాటిపైన) సమతా భావము కలిగినవాడు, సమాహితః
(ఏకాగ్రత) పరిపూర్ణముగా సిద్ధించి సమాధి కలిగిన తరువాత, శ్రద్ధ
పరిపూర్ణముగా కలిగి, పరమాత్మ తత్త్వ జ్ఞానము
అనుభవించగలడు.

యోగయుక్తో విశుద్ధా త్మా విజితాత్మా జితేంద్రియః।


సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ॥ 7 ॥

కర్మ యోగమును (సత్కర్మ, నిష్కామ కర్మ ఆచరణ)


చక్కగా చేసుకున్నవాడు, చిత్తశుద్ధి, వివేకము కలిగి,

286
ఇంద్రియములను, మనస్సును గెలిచి, వాటిని తన అదుపులో
ఉంచుకొని, వైరాగ్యము కలిగి మననము చేసుకుంటే,

సర్వ భూతముల యందు కేవలము ఆత్మ స్వరూపమునే


చూస్తూ, ప్రపంచమంతా పరమాత్మ తప్ప వేరే ఇంకేమీ లేదనే అనే
స్థిరమైన నిర్ణయము కలిగి, తత్త్వ జ్ఞానము కలిగిన తరువాత అతనికి
ఏ విధమైన కర్మ సంబంధములు ఉండవు.

ఉదాహరణ:

మనము అజ్ఞానముతో ఏ మాత్రమూ పట్టించుకోలేదందునే,


మన శరీరము అనే దేవాలయములో బూజులు పట్టి, గబ్బిలములు,
తేళ్ళు, పాములు, క్రిమి కీటకములు అనే ప్రాపించక విషయములతో
నిండిపోయి, మన హృదయములో నెలకున్న పరమాత్మ అనే
విగ్రహము మీద పూర్తిగా దుమ్ము, ధూళి పడి ఉన్న దేవాలయములో
పూజలు చేయలేము. అలా ఉన్న దేవాలయమనే మన శరీరమును
సత్కర్మ ఆచరణ, ఇంద్రియ నిగ్రహము, మన శరీరము మరియు
చిత్తమును శుభ్ర పరచుకొని, అధ్యయనము, మననము, నిధిధ్యాసన,
శ్రద్ద ద్వారా జ్ఞానము అనే దీపమును వెలిగించి, పూజలు చేయ
వచ్చును.

287
 నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ ।
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ॥
8॥

 ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్నిమిషన్నపి ।


ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ॥ 9 ॥

నేను ఏమీ చేయుట లేదు. కాని నా శరీరములోని


అవయవములు, శరీరములో ఉన్న కర్మ, జ్ఞాన ఇంద్రియములు,
అంతఃకరణము (మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము) మనస్సు,
వాయువులు అనేక క్రియలు చేస్తు న్నాయి. ఇవి చేసే ఏ క్రియలకూ ఏ
మాత్రమూ నేను కర్తను కాను, వాటితో నాకు ఏ విధమైన
సంబంధము లేదు అనే భావన చేయాలి. అటువంటి భావనను
చేసుకున్న వాడు క్రమముగా తత్త్వ జ్ఞాని అవుతాడు. తత్త్వ జనానికి
ఆ భావన స్థిరముగా ఉంటుంది.

కళ్లతో చూస్తు న్నప్పుడు, చెవులతో వింటున్నప్పుడు,


చర్మముతో స్పర్శ కలిగినప్పుడు, ముక్కుతో వాసన కలిగినప్పుడు,
నాలుకతో రుచిని ఆస్వాదిస్తు న్నప్పుడు, కాళ్లతో నడిచేటప్పుడు,
నిద్రలో మరియు కలలలో (నిద్రలో మన లోపల మనస్సు చూపించే
స్వప్న క్రియ), ముక్కుతో శ్వాస పీల్చుతున్నప్పుడు,

288
నోటితో మాట్లా డుతున్నప్పుడు, మన శరీరము నుండి వ్యర్ధ
పదార్ధములు విసర్జించేటప్పుడు, చేతులతో ఏ పనైనా చేసినప్పుడు,
కనురెప్పలను తెరుస్తు న్నప్పుడు మరియు మూస్తు న్నప్పుడు,

ఏ విధమైన క్రియ జరుగుతున్నా ఆ, యా శరీర


అవయవములకు, ఇంద్రియములకు, అంతఃకరణము, వాయువుకు
మరియు ఆ, యా వ్యక్తు లకు లేదా వస్తు వుల మధ్య జరుగుతున్నవి.
ఆ క్రియలు అవి చేస్తు న్నాయి, వాటికి సంబంధించినవి. కాని అవి
నేను (జీవాత్మ) మాత్రము చేయుట లేదు అని భావించాలి. వాటితో
నాకేమీ సంబంధము లేదు అని కూడా మనస్సులో స్థిరముగా
భావించాలి.

సాధారణ మానవులు శరీరములోని అవయవములు,


ఇంద్రియములు, అంతఃకరణ, వాయువులు చేసే పనులను, నేను
(జీవాత్మ) చేస్తు న్నాను అనే భావనతో ఉంటారు. అటువంటి క్రియలు
సర్వత్రా, అంతటా, సర్వ వ్యాపకమైన ఆత్మ స్వరూపమునకు ఏ
రకమైన చలనము ఉండదు (సీసాలో నీళ్ళు నిండుగా ఉన్నప్పుడు, ఆ
నీళ్ళు కదులుటకు ఏ విధమైన అవకాశము, ఆస్కారము ఉండదు).
కాబట్టి, ఏ విధమైన క్రియలు ఆత్మ స్వరూపము చేయదు. కాబట్టి
శరీరము, ఇంద్రియములు, అంతఃకరణ, వాయువులు చేసే క్రియలు.
ఉదాహరణ: నాకు ఆకలిగా ఉంది అని అనుకోకుండా, ఈ
శరీరమునకు ఆకలిగా ఉన్నది అని అనుకోవాలి.
289
కర్మేంద్రియములు (1. వాక్కు - మాట్లా డుట, 2. హస్తములు
– చేతి పనులు, 3. పాదములు- నడచుట, 4. పాయువు – గుదము
- విసర్జనము, 5. ఉపస్థ – జననేంద్రియము – సంతానోత్పత్తి క్రియ),
జ్ఞానేంద్రియములు (1. శ్రోత్రము - వినుట, 2. చర్మము - స్పర్శ, 3.
చక్షుస్సు - చూచుట, 4. జిహ్వ - రుచి, 5. నాసిక - వాసన).
అంతఃకరణము (మనస్సు – సంకల్ప. వికల్పములు, బుద్ధి –
నిశ్చయ శక్తి, అహంకారము – శరీరమే నేను అని అనుకునే భావన,
చిత్తము – చేతనము, కదలిక).

మన శరీరము జీవించుటకు మనలో నిరంతరము వాయు


సంచారము ఉండాలి. మన శరీరములో జరిగే ఉశ్వాస, నిశ్వాసలు
వాయువు యొక్క క్రియలు. మన శరీరములో ఉండే వాయువులు
(1. ప్రాణము – ఊపిరితిత్తు లలో ఉండే ముఖ్య ప్రాణ శక్తి, 2.
అపానము - గుదము ద్వారా బయటకు పోయే వాయువు,
3. వ్యానము - శరీరములో ప్రతి దిశకు వ్యాపించి బయటకు పోయే
వాయువు, 4. ఉదానము - వాంతి అయ్యే సమయములో
నోటిద్వారా బయటకు పోయే వాయువు, 5. సమానము – నాభిలో
ఉండే జీర్ణ క్రియకు అవసరము అయ్యే వాయువు [ఇవి ముఖ్య ప్రాణ
వాయువులు], 6. నాగము – నోరు తెరుచుట, మూయుట
చేస్తుంది, 7. కూర్మము – కను రెప్పలు తెరుచుట, మూయుట
చేస్తుంది, 8. కృకరము – తుమ్ములు, దగ్గు కలిగిస్తుంది, 9.

290
దేవదత్తము – ఆవలింత చేస్తుంది, 10. ధనంజయము – ప్రాణము
పోయిన తరువాత, శరీరమును ఉబ్బి పోయేలా చేస్తుంది, కపాలము
పగులినప్పుడు శబ్దము కలిగిస్తుంది).

జీవులకు మూడు అవస్థలు ఉంటాయి. 1. జాగృతి అవస్థ –


మేల్కొని ఉండుట – ఈ అవస్థలో మన శరీరము, ఇంద్రియములు,
చిత్తము, వాయువులు అన్నీ పనిచేస్తూ ఉంటాయి. ప్రపంచము నుండి
మన శరీరములోనికి విషయములు వస్తూ ఉంటాయి. 2. స్వప్న
అవస్థ – శరీరము, ఇంద్రియములు పనిచేసి, పనిచేసి అలసిపోయి,
తమో గుణము ఆవరిస్తే ఒక విధమైన మగత కలిగి అవి పని
చేయుట ఆపివేస్తా యి. దానిని మనము నిద్ర పోతున్నాము అని
అనుకుంటాము. కాని ఈ స్థితిలో మనస్సు మాత్రము అలసిపోదు,
నిద్రపోదు. ఆ సమయములో ఇంతకు ముందు కలిగిన
అనుభవములను, మనస్సులో దాగి ఉన్న సంస్కారములను
జోడించుకొని, మనస్సుకు కావలసిన రీతిలో తన అభిరుచులకు
అనుకూలముగా కొన్ని వ్యక్తు లను, వస్తు వులను, సందర్భములను
సృష్టి చేసి, ఆ మనస్సే చూస్తుంది. దీనిని స్వప్న అవస్థ అంటారు. 3.
సుషుప్తి అవస్థ – మనస్సు కూడా అలసిపోయి, తన పని కూడా
ఆపిస్తే కలిగే స్థితిని సుషుప్తి అవస్థ అంటారు. ఈ అవస్థలో మన లోని
వాయువులు, జీవాత్మ మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. ఆ
సమయములో మన శరీరమునకు, ఇంద్రియములకు,

291
అంతఃకరణమునకు విశ్రాంతి లభిస్తుంది. ఆ సమయములో అవి
తమ శక్తు లను పుంజుకుంటాయి. వాటికి అవసరమైనంత విశ్రాంతి
లభించి, తమ, తమ శక్తు లను పుంజుకున్న తరువాతే అవి మరలా
పని చేయుటకు తిరిగి జాగృతి అవస్థకు వస్తా యి.

జాగృతి, స్వప్న అవస్థలలో శరీరములో జరిగే క్రియలకు నేను


కర్తను కాని అని భావించాలి.

 బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః ।


లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా॥10॥

పైన వివరించిన, నాలో జరిగే ప్రతి క్రియ నేను చేయుట


లేదు. పర బ్రహ్మ చేస్తు న్నాడు అనే భావన రావాలి. ఈ భావన
రావాలంటే, ముందుగా మనము ప్రయత్న పూర్వకముగా, కావాలని
చేసే సత్కర్మలను, పుణ్య క్రియలకు, తరువాత అన్ని కర్మలకు - కర్తను
నేను కాదు. ఈ సత్కర్మల ఫలితములు నాకు అక్కర్లేదు. వీటిని
ఈశ్వరుడి ఆజ్ఞగా, ఈశ్వరుడి సేవకుడిగా, ఈశ్వరుడి ప్రీతి కోసము,
ఈశ్వరుడే నా చేత చేయిస్తు న్నాడు, ఈ సత్కర్మలను, వాటి
ఫలితములను నేను పరమాత్మకే సమర్పిస్తు న్నాను. వీటితో నాకు ఏ
విధమైన సంబంధము లేదు అనే భావముతో చేయాలి. అటువంటి
వారికి ఆ కర్మలతో ఏ విధమైన సంబంధము ఉండదు.

292
ఎలాగైతే తామరాకు పైన నీళ్ళు ఉన్నా తామరాకుకు,
నీళ్ళకు సంబంధము లేకుండా, అంటకుండా ఎలా ఉంటాయో,
అలా అటువంటి వారికి ఏ పాపములు అంటవు. అలాగే ఆ కర్మలు,
ఆ క్రియలు ఆ వ్యక్తీ చేస్తు న్నట్లు కనిపిస్తు న్నా, కర్తృత్వము లేని ఆ
వ్యక్తికీ, ఆ కర్మలు, క్రియలకు ఏ విధమైన సంబంధము ఉండదు.

తత్త్వ జ్ఞాని తను చేసే క్రియలన్నీ, పరమాత్మకు సమర్పణ చేసి


స్థిరముగా ఉంటాడు. తత్త్వ జ్ఞానము కోసము సాధన చేసే సాధకుడు
పైన వివరించి విధముగా సత్కర్మ ఆచరణ చేసుకుంటూ సాధన
చేయాలి.

కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి ।


యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే ॥ 11 ॥

పాలు కాచే ముందు పాత్రను శుభ్రము చేసుకున్నట్లు గా,


తత్త్వ జ్ఞానము కోసము సాధనకు ముందు పైన కర్మ యోగములో
చెప్పిన విధముగా, కేవలము శరీరముతో, మనస్సుతో, బుద్ధితో,
ఇంద్రియములతో సత్కర్మలు చేసే యోగులు,

ఆ సత్కర్మలతో సంబంధము లేకుండా, ఆ సత్కర్మలతో


వారి చిత్త శుద్ధము అవ్వాలని అనే భావముతో సత్కర్మ ఆచరణ
చేస్తా రు.

293
సాధారణ సాధకులు ఆ సత్కర్మలను నేను (జీవాత్మ)
చేస్తు న్నాను, ఆ సత్కర్మల ఫలములు నాకు కావాలి అనే భావనతో
చేస్తా రు. కాని యోగులు ఈ శరీరము యొక్క చేతులు
పూజిస్తు న్నాయి లేదా నమస్కరిస్తు న్నాయి అని భావిస్తా రు. ఈ
శరీరము యొక్క ఇంద్రియములు, వాటి విషయముల వైపుకు
పోతున్నాయి అని భావిస్తా రు. ఆ కర్మలను కేవలము సాక్షిగా
చూస్తు న్నట్లు భావిస్తా రు. ఏ కర్మలతోనూ, ఏ విషయములతోనూ
వాళ్ళు సంబంధము, సంగము పెట్టు కోరు.

 యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం ।


అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ॥ 12 ॥

నేను చెప్పిన ఈ కర్మ యోగమును ఆచరించినట్లయితే, ఆ


కర్మల ఫలములను పరమాత్మకు సమర్పించిన్నట్లయితే, ఎవ్వరూ
ఊహించలేనంత అఖండమైన శాంతిని పొందుతారు (కర్మ
ఫలితములు అశాంతిని పెంచుతాయి). ఎవరైతే నిష్టగా తత్త్వ
జ్ఞానము సాధన చేసుకున్నవాడికి ఏ ఫలము కలుగుతుందో (తత్త్వ
జ్ఞానము, బ్రహ్మానందము), అదే ఫలము కర్మల ఫలములను
వదులుకున్నవాడికి కూడా కలుగుతుంది.

నేను చెప్పిన కర్మ యోగము చేయకపోతే, కనీసము అర్ధము


చేసుకోలేకపోతే, అవగాహన కూడా లేకపోతే, వాడు అయుక్తు డు, ఆ

294
యోగము లేనివాడు (యోగము = అదృష్టము – కనిపించని,
చూడలేని దానిని పొందుట, అంతకు ముందు లేని దానిని
పొందుట). కోరికలతో కర్మలు చేస్తూ, కర్మ ఫలముల మీద ఆసక్తితో
కర్మలు చేస్తూ, ఆ కర్మలతో, ఆ కర్మ ఫలములతో తీవ్రమైన
సంబంధము ఏర్పడి, వాటి బంధములో కూరుకుపోతాడు, కట్టు బడి
పోతాడు.

ఛాందోగ్యోపనిషత్ – 2-23-1 – “త్రయో ధర్మ స్కన్దా


యజ్ఞోధ్యయనం దాన మితి ప్రధమ స్తప ఏవ ద్వితీయో బ్రహ్మచార్యా
చార్యకులవాసీ తృతీయోత్యన్త మాత్మాన మాచార్యకులేవసాదయ
స్సర్వ ఏతే పుణ్యలోకా భవన్తి బ్రహ్మసంస్థో అమృతత్త్వ మేతిః” –
యజ్ఞ ధర్మములు మూడు రూపములు. 1. అధ్యయనము,
దానము. 2. బ్రహ్మచర్యము – బ్రహ్మ జ్ఞానము యొక్క సాధన. 3.
గురుకుల వాసము, గురువు సేవ. వీటిని ఆచరించిన పుణ్య లోక
ప్రాప్తి, బ్రహ్మ సన్నిధానములో అమృతత్త్వము లభించును.

కర్మ ఫలములు శాంతిని ఇవ్వలేవు. కర్మ చేసిన తరువాత, ఆ


కర్మ ఫలము ఎప్పుడు కలుగుతుందా అని ఆత్రు తతో (అశాంతితో)
ఎదురు చూస్తా డు. ఏ కర్మ ఫలము అయినా శాశ్వతము కాదు. ఆ
కర్మ ఫలము పొందిన తరువాత, ముందు ఉన్న కోరిక స్థా నములో
మరొక కోరిక ఏర్పడి ఆ కర్మ చేస్తూ, ముందు చేసిన కర్మ ఫలము
యొక్క ఆనందము పూర్తిగా అనుభవించ లేకపోతాడు.
295
ఉదాహరణ:

12 వ తరగతి చదివే కుర్రాడు మొదట ఆ పరీక్ష


పాసయితేచాలు అని అనుకుంటాడు. పరీక్ష పాసయిన తరువాత ఆ
ఆనందము పూర్తిగా అనుభవించకుండానే, IIT లో సీటు కోసము
కోరిక, IIT లో సీటు వచ్చిన తరువాత, IIT మంచి ర్యాంకులో పాసు
అవ్వాలి అనే కోరిక, IIT పాసయిన తరువాత మంచి ఉద్యోగము,
తరువాత మంచి భార్య, తరువాత ఉద్యోగములో మంచి
ప్రమోషనులు, మంచి కారు, మంచి ఇల్లు /ఫ్లా ట్, మంచి పిల్లలు, వాళ్ళ
చదువులు, .....అలా అంతులేని కోరికలతో జీవితము అంతమై
పోతుంది). అందుచేత ఆ ఫలము ఎప్పుడు అయిపోతుందో అని,
లేదా ఎప్పుడు పోతుందో అనే భయముతోనే ఉంటూ శాంతిని
కోల్పోతాడు. ఆ ఫలము అంతమైనప్పుడు, అయ్యో పోయిందో అని
బాధ పడతాడు. అలా కర్మ ఫలములు వచ్చే ముందు, వచ్చాక,
వెళ్లిపోయాక కూడా మానవులను ఏడిపిస్తూనే ఉంటుంది.

సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ ।


నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ॥ 13 ॥

సత్కర్మ ఆచరణ చేసి, ఆ సత్కర్మల ఫలములను


పరమాత్మకు సమర్పించి, చిత్త శుద్ధిని సంపాదించుకొని,

296
ఇంద్రియములను, మనస్సుని, బుద్ధిని తన ఆధీనములోనికి
తెచ్చుకున్నవాడు,

తను చేసే ప్రతి కర్మను మనస్ఫూర్తిగా వివేకముతో విడిచిపెట్టి


సుఖముగా ఉంటాడు.

తను చేసుకున్న కర్మల ఫలితముగా పొందిన తొమ్మిది (కళ్ళు


– 2, చెవులు – 2, ముక్కు – 2, నోరు – 1, జననేంద్రియము –
1, గుదము – 1 = 9) ద్వారములు ఉండే ఒక నగరము వంటి ఈ
శరీరములో ఇంద్రియములు వాటి పనులు చేస్తు న్నప్పుడు
జరుగుతున్న క్రియలు తాను చేయడు మరియు ఆ
అవయవములతో తాను ఆ క్రియలను చేయిస్తు న్నాడు అని కూడా
అనుకోడు.

సాధారణమైన మానవులు ఆ, యా ఇంద్రియములతో


పనులు చేస్తు న్నప్పుడు నేను (జీవాత్మ) చేస్తు న్నాను అని
అనుకుంటారు (నేను చూస్తు న్నాను, నేను వింటున్నాను, నేను
చేస్తు న్నాను, నా చేయి నొప్పిగా ఉన్నది – శరీరమే తానుగా,
జీవాత్మగా భావన). కాని కొంత సిద్ధి ఏర్పడిన సాధకులు,
ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వాళ్ళ వశములో ఉంచుకొని,
ఇంద్రియములు చేస్తు న్న క్రియలు, నేను (జీవాత్మ) చేస్తు న్న క్రియలు
కాదు, ఈ క్రియలను నాకు ఏ సంబంధము లేదు అని వాళ్ళ

297
వశములో ఉన్న మనస్సుతో అనుకుంటారు. నేను (జీవాత్మ) ఈ
దేహములో ఉన్నాను అని అనుకుంటూ చాలా సుఖముగా,
శాంతముగా ఉంటాడు.

 న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః ।


న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ॥14॥

శరీరము అనే ఈ పురమునకు, నగరమునకు రాజులా ఉన్న


జీవుడు తనంతట తాను ఏ పనీ చేయుట లేదు, శరీరములోని
ఇంద్రియములతో కూడా పని చేయించుట లేదు, ఎదురు గుండా
లోకములో ఉన్న ప్రాపించక విషయములను జీవుడు సృష్టి చేయుట
లేదు. జీవుడికి ఈ సామర్థ్యము లేదు (ఇంద్రియములు, మనస్సు,
బుద్ధి స్వతంత్రముగా కర్మలు చేయ లేవు).

శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి చేసే కర్మల


ఫలములతో జీవుడికి ఏ విధమైన సంబంధము, సంగము లేదు.
కాని ఆ కర్మలు వాడి మనస్సులో ఉన్న సంస్కారముల స్వభావము
వలను ఈ విధమైన క్రియ జరుగుతున్నది.

త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి (సత్త్వ, రజో, తమో


గుణముల) యొక్క ప్రభావము, ఆ మూల ప్రకృతితో తయారైన ఈ
శరీరములో ఉండి మరియు ఆ జీవుడు అనేక జన్మలలో చేసిన
కర్మలతో సంపాదించుకున్న సంస్కారములు (సంస్ + కార =

298
ముందుగా ఆలోచించి, చేయాలనే ఉద్దేశముతో + చేసిన కర్మలు)
సూక్ష్మ రూపములో అంతరాత్మలో ముద్రించబడి, దాగి ఉండి, ఆ
సంస్కారములను అనుసరించి (అలవాటుగా, స్వభావముగా మారి)
ఆ, యా ఇంద్రియములను, శరీర భాగములను ఆ సంస్కారముల
అనుగుణముగా కర్మలను చేయుటకు ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది.

కొంతమంది ఈ క్రింద ఉపనిషత్తు ల వాక్యములను


చెప్పుతారేమో. దానికి పరమాత్మ అటువంటి దానికి ఏ విధమైన
ఆస్కారము లేదు అని తరువాత శ్లోకములో చెప్పినాడు.

కౌషీతకీబ్రాహ్మణోపనిషత్ – 3-9 – “ఏష యు హై ఏవ సాధు


కర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్యో ఉన్నినీసతే ఏష యు
ఏవసాధు కర్మ కారయతి యమధో నినీసతే” – పరమాత్మ ఎవరికైతే
ఉన్నతమైన ఫలితములు ఇవ్వాలి, పైకి తీసుకు వెళ్ళాలి అని
అనుకున్నప్పుడు, వాళ్లతో సత్కర్మలు చేయించి, దానికి తగినట్టు
ఫలితములు ఇస్తా డు. పరమాత్మ ఎవరికైతే దుష్ఫలితములను
ఇవ్వాలి అని అనుకుంటాడో, వాళ్లతో చెడు పనులు చేయించి,
దానికి తగినట్టు ఫలితములు ఇస్తా డు.

“అజ్ఞో జంతుర్ అనీసో యం ఆత్మనః సుఖదుఃఖయోః


ఈశ్వర ప్రేరితో గచ్చేత్ స్వర్గం వస్వభ్రం ఏవ క” – పాపము జీవుడు
ఏమీ తెలియనివాడు. ఏ విధమైన సామర్థ్యము ఉన్నవాడు కాదు.

299
సుఖము కాని, దుఃఖము కాని సంపాదించుకునేందుకు
సామర్థ్యము లేక, ఏ పనీ చేయలేక కష్ట పడుతున్నాడు. ఈశ్వరుడు
ఒకడిని ఇటు వెళ్ళు అని స్వర్గము లోనికి పంపేశాడు. మరొకడిని
నీవు ఇటు వెళ్ళు అని నరకము లోనికి తోసేశాడు.

గమనిక: పైన చెప్పిన ఉపనిషత్తు ల వాక్యము అంతరార్ధము –


ఎవరైనా ఉత్తమ గతులకు వెళ్ళాలి అని నిశ్చయించుకొని, మంచి
కర్మలు చేయాలి అని అనుకొని, మంచి కర్మలు చేస్తా డు. పరమాత్మ
జీవులు చేసే కర్మలకు సాక్షిగా మాత్రమే ఉంటాడు. ఆ వ్యక్తి తాను
చేసిన మంచి కర్మలకు పరమాత్మ ఫలితములు మాత్రమే ఇస్తూ
సాక్షిగా ఉంటాడు. పరమాత్మ సాక్షిగా ఉండగా, జీవులు వారి, వారి
క్రియలు చేసుకుంటారు.

బ్రహ్మ సూత్రములు - 2-1-34 - 12. వైషమ్య


నర్థు ణ్యాధికరణమ్, 34. వైషమ్య నైర్థు ణ్యాధికరణమ్ –
వైషమ్యేనైఘ్రిన్యే న సాపెక్షత్వాత్, తథ హాయ్ దర్శయంతి –
పరమాత్మకు ఏ విధమైన బేధ భావము లేదు. ఒకరు ఎక్కువ, ఒకరు
తక్కువ అనే భావము లేదు. తల్లికి పిల్లలందరూ సమానము లాగ,
గురువుకి శిష్యులందరూ సమానము లాగ, పరమాత్మకు
జీవులందరూ సమానమే. జీవులందరూ, పరమాత్మలోని భాగములే,
అంశములే.

300
నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః ।
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ॥ 15 ॥

నేను (పరమాత్మ) ఎవరిచేత పాప కర్మలను చేయించి ఆ


పాపములకు ఫలితములు ఇవ్వను. అలాగే నేను (పరమాత్మ)
ఎవరిచేత పుణ్య కర్మలను చేయించి, వాళ్లకు మంచి ఫలితములు
ఇవ్వాలి అని అనుకోను.

శరీరములో ఉన్న జ్ఞానముతో ప్రకాశిస్తు న్న ఆత్మను,


త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, మాయ, అజ్ఞానము ఆవరించి,
కప్పేసి ఏమీ తెలియనీయకుండా ఇలాంటి భ్రమలు, సందేహములు
కలిగిస్తు న్నది.

పాప, పుణ్యములు పరమాత్మ చేయిస్తు న్నాడని ఒక రకమైన


భ్రమ. జీవుడే (నేను) చేస్తు న్నాడని మరొక రకమైన భ్రమ. ఈ రకమైన
భ్రమలకు కూడా ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతే కారణము.
త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి మాత్రమే ప్రవర్తకము, ప్రేరేపించేది,
ప్రోత్సహించేది. జీవుల పూర్వ జన్మలలో చేసుకున్న సంస్కారములు,
త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క సూక్ష్మ మనస్సులో
దాచబడి, ముద్రించబడి ఈ జన్మలో మనకు ఆ సంస్కారములు
మన స్వభావముగా మారి, ఆ స్వభావమును త్రిగుణాత్మకమైన
మూల ప్రకృతి యొక్క గుణములచే (సత్త్వ, రజో, తమో)

301
ప్రేరేపించబడి, ఆ సంస్కారములకు అనుగుణముగా మనము ఈ
జన్మలో కర్మలు చేస్తా ము.

బృహదారణ్యకోపనిషత్ – 4 లేదా 6-3-15-


“.....భవత్యసజ్గోహ్యయం పురుష ఇత్యేవమేవైత ....” - ఆ
పురుషుడు (పరమాత్మ, ఆత్మ) అసంగుడు. పరమాత్మ దేనితోనూ ఏ
విధమైన సంబంధము లేనివాడు. ఏ కర్తృత్వ భావము లేనివాడు.

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః ।


తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం ॥16॥

భ్రమలకు మూల కారణమైన అజ్ఞానము తొలగిపోవాలంటే,


కేవలము ఆత్మ/పరమాత్మ తత్త్వ జ్ఞానము ఒక్కటే శరణము. ఆత్మ
తత్త్వ జ్ఞానము కలగాలి, ఆ జ్ఞానము బుద్ధిలో వెలగాలి.

ఎవరికైతే పరమాత్మ తత్త్వ జ్ఞానముతో, అజ్ఞానము


తొలగిపోతుందో, ఉదయించిన సూర్యుడు ఎలా ప్రకాశిస్తా డో అలా,
వారిలో ఆ పరమాత్మ తత్త్వ జ్ఞానము స్పష్టముగా ప్రకాశిస్తుంది లేదా
చక్కగా గోచరిస్తుంది. అప్పుడు అజ్ఞానము వలన కలిగిన పరమాత్మ
గురించి తెలియకపోవటము, సందేహములు, భ్రమలు కలగవు.

 తద్బుద్ధయ స్తదాత్మానః స్తన్నిష్ఠా స్తత్పరాయణాః । గచ్ఛ


న్త్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ॥ 17 ॥

302
మానవుడు ఏది సాధించదలచుకున్నాడో, ఆ లక్ష్యము మీద
వాడి బుద్ధి స్థిరముగా ఉండాలి. ఆ లక్ష్యముతో మనస్సులో
మమేకము అయిపోవాలి. వాడి ప్రయత్నము, క్రియ, సాధన, నిష్ఠ
అంతా ఆ లక్ష్యముతోనే పరిసమాప్తమైపోవాలి. తను ఎంచుకున్న
ఏకైక లక్ష్యమే చాలా ఉన్నతమైనది. ఆ లక్ష్యము తప్ప మరొకటి
దేనిమీదా దృష్టి ఉండకూడదు. “తదేవ పరమం అయనం యేషాంతే
తత్పరాయణః”.

అటువంటి వాళ్ళు, వాళ్ళు ఉన్న స్థా యి నుండి క్రింద స్థా యికి


దిగిపోరు. ఎందుచేత నంటే, వాళ్ళ కల్మషములు, దోషములు,
అజ్ఞానము, భ్రమ, సందేహములు జ్ఞానముతో పూర్తిగా
తొలగిపోయాయి. వాళ్ళు పూర్తిగా పరిశుభ్రము అయ్యారు. అప్పుడు
వాళ్ళు ఏ విధమైన కర్మ బంధములు, పునర్జన్మ లేకుండా శాశ్వతమైన
ఆనందమును అనుభవిస్తా రు.

ఉదాహరణ - ధృవుడు:

భాగవతము Book – 4, Discourses – 8, 9 - మను


స్వయంభువు కుమారుడు ఉత్తా నుపాదకు ఇద్దరు భార్యలు. సునీత
మరియు సురుచి. ఒకరోజు ఉత్తా నుపాద విశ్రాంతిగా కూర్చొను
ఉండగా, పెద్ద భార్య సునీత కుమారుడు ధృవుడు ఒళ్లో కూర్చొని
ఉన్నాడు. ఇంతలో ఆ రాజుగారి చిన్న భార్య సురుచి వచ్చి, ధృవుడిని

303
రాజుగారి ఒడిలో నుండి లాగేసి, తన కుమారుడు ఉత్తమను
కూర్చిపెట్టింది. సురుచి ధృవుడితో నీకు, నీ తండ్రి ఒడిలో కూర్చొనే
అధికారము లేదు. అది అధికారము కావాలంటే, నీవు మహావిష్ణువు
కోసము తపస్సు చేసి, నాకు కుమారుడిగా పుట్టేటట్లు వరము
కోరుకొని, నాకు పుత్రు డిగా పుట్టి తేనే, నీకు ఆ అర్హత కలుగుతుంది
అని అన్నది. దానితో ఆ చిన్న పిల్లవాడికి మనస్సులో తీవ్రమైన బాధ
కలిగి, తన తల్లి సునీతకి చెప్పి, తన తండ్రి ఒల్లో కూర్చోవాలనే
లక్ష్యముతో, అడవులలో తపస్సు చేయుటకు బయలుదేరాడు.

దారిలో నారదుడు కనిపించి ధృవుడిని ఎక్కడికి, ఎందుకు


వెళ్ళుతున్నావు అని అడిగాడు. ధృవుడు జరిగినది అంతా చెప్పి, నేను
మహావిష్ణువు గురించి తపస్సు చేయుటకు (తద్బుద్ధి) అడవికి
వెళ్ళుతున్నాను అని చెప్పాడు. నీవు క్షత్రియ పుత్రు డివి. రాజ్యము
చేయవలసిన రాజ కుమారుడవు (నీలో రాజస గుణము ఉన్నది అని
అర్ధము). నీవు ఇంటికి వెళ్ళి, పెద్ద అయిన తరువాత రాజ్యమును
పాలించు అని చెప్పాడు. ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు. నేను
మహావిష్ణువు గురించి తపస్సు చేసి, ఆయన దగ్గర నుండి వరము
పొంది నా తండ్రి ఒళ్లో కూర్చోవలసినదే (తదాత్మానః) అని తన
స్థిరమైన నిర్ణయమును చెప్పాడు. దానికి నారదుడు సంతోషించి,
నీకు సహాయముగా నేను నారాయణ మంత్రము ఉపదేశము
చేస్తా ను, నీ మనస్సులో మహావిష్ణువును ఈ జగత్లు అంతా వ్యాపించి,

304
అందరిలో నివసించే తత్త్వముగా భావిస్తూ తపస్సు చేసుకోవాలి,
అని చెప్పి “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే ద్వాదశాక్షర
మంత్రమును ఉపదేశము చేస్తా డు. ఆ కుర్రవాడు మహావిష్ణువు
దర్శనము చేసుకొని ఆయన దగ్గర వరము పొందాలనే లక్ష్యముతో,
శ్రద్ధగా ఘోర తపస్సు చేశాడు (తనిష్టాః). ఎనిమిది నెలలకే సిద్ధి కలిగి
మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. అంత సుందరమైన, తేజోమయమైన
మహావిష్ణువును చూసిన పిల్లవాడికి, నోట మాట రాలేదు. అలా
చూస్తూనే ఉండిపోయాడు. మహావిష్ణువు తన శంఖమును ఆ
పిల్లవాడి బుగ్గకు ఆనించాడు. దానితో ఆ పిల్లవాడు మహావిష్ణువును
గొప్పగా స్తు తిస్తా డు. అప్పుడు మహావిష్ణువు నీ మనస్సులోని కోరిక
నాకు తెలుసు. నీవు నీ ఇంటికి వెళ్ళు, నీ తల్లి, తండ్రి అంతా నిన్ను
చక్కగా ఆహ్వానిస్తా రు. నీ తండ్రి తరువాత, నీవు 36 వేల
సంవత్సరములు యజ్ఞములు, యాగములు, సత్కర్మలు చేస్తూ
రాజ్యము పాలించి, తరువాత జన్మలో సప్త ఋషుల మండలమునకు
కూడా పైన, నా (విష్ణు) పదమైన, అన్ని లోకములకు,
అంతరిక్షమునకు ఇరుసు (axis) అయిన ధృవ మండలములో
జీవులకు ఆదర్శముగా ఉంటావు అని ఆశీర్వదించి
మాయమైపోయాడు. తరువాత నాలో చేరుతావు అని అన్నాడు
(తత్పరాయణాః).

305
ఇక్కడ దృష్టి పెట్టవలసిన విషయము – ధృవుడి ఎనిమిది
నెలల తపస్సుకే మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు, ధృవుడు
మోక్షము ఎందుకు కోరలేదు? మహా విష్ణువు కూడా ధృవుడికి
మోక్షము ఎందుకు ఇవ్వలేదు? ఇందులో ఉన్న సూక్ష్మమైన అంశము
– ధృవుడికి గురువైన నారదుడు ఉపదేశించిన మంత్రము, దాని
అర్ధము “విశ్వమంతా వ్యాపించి అందరిలో నివసించే పరమాత్మగా
భావించి” మరియు నారదుడు ప్రత్యేకముగా ఆ అర్ధమును
మనస్సులో భావిస్తూ తపస్సు చేయమన్నాడు. కాని మాయ
ప్రభావము వలన ధృవుడి మనస్సులో రాజస గుణము ప్రభావము
ఉండి, తన పినతల్లి సురుచి, ఆమె కుమారుడు ఉత్తముడి పైన
తనకు ద్వేషము ఉన్నందున వాళ్లను నా శత్రు వులుగా భావించి,
వాళ్లలో తప్ప మిగిలిన వాళ్ళందరిలో పరమాత్మను భావించి తపస్సు
చేశాడు. ఆ చిన్న లోపము వలన ధృవుడు వెంటనే మోక్షము
పొందలేకపోయాడు. ఇంకా కొన్నాళ్ళు సత్కర్మ ఆచరణ చేసి,
చిత్తమును శుద్ధి చేసుకొని, క్రమముగా పరమాత్మను పొందుతాడు.
ధృవుడిలో ఈ చిన్న లోపము వలన, పరమాత్మ, ధృవుడికి
ఫలితమును (చాలా కాలము) ఆలస్యము చేస్తు న్నాడు.

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ।


శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ॥18॥

306
విద్య (ప్రాపంచకమైన విద్య, ఆత్మ విద్య), ఆ విద్య ద్వారా
వినయముతో అలరారుతున్న, ప్రకాశించుచున్న బ్రాహ్మణుల యందు
కాని, పశువులలో ఉత్తమమైన గోవుల యందు కాని, అన్ని జీవులలో
పెద్దైన ఏనుగులలో కాని,

హీనమైన కుక్కల్లో కాని, అంత కంటె హీనమైన కుక్కలను


వండుకుతినే జంతువుల యందు కాని, ఆత్మ జ్ఞానులు వీరందరినీ
(జీవులందరిలో, ప్రపంచమంతా వ్యాపించి ఉండే పరబ్రహ్మను
చూస్తు న్నట్లు , ఆ, యా శరీరములను కాదు) సమానమైన దృష్టితో
చూస్తా రు.

విద్య రెండు విధములు (పరా విద్య – ఆత్మ జ్ఞానము, బ్రహ్మ


విద్య. అపరా విద్య – ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము,
అధర్వవేదము, శిక్ష,కల్పము, వ్యాకరణము,, నిరుక్తము, ఛందస్సు,
జ్యోతిషము ఇవన్నీ అపర విద్య. ముండకోపనిషత్ 1-1-4, 5 –
ప్రధమ అధ్యాయములో చివర “బ్రహ్మవిద్యాయాం” వివరణలో
చూడుము). ప్రస్తు తము ఏ విద్య ఉన్న వారిలోనైనా అహంకారము
ఎక్కువగా ఉన్నది. కాని విద్య యొక్క అసలు లక్ష్యము వినయము,
నిరహంకారము. అప్పుడే విద్య యొక్క ఫలితము పూర్తిగా
అందుతుంది. విద్యతో వినయము ఉన్నవాడే అసలైన సంపన్నుడు,
జ్ఞాని.

307
భతృహరి శతకములో చక్కగా వివరించారు – “యదా
కించిజ్ఞొహం గజ ఇవ మదాంధః సమభవమ్. తదా సర్వజ్ఞొస్మీత్యభవ
దవ లిప్తం మమ మనః| యదా కించిత్ కించిత్తు  బుధజన సకాశా
దవగతమ్ I తదా మూర్ఖెస్మీతి జ్వర ఇవ మదొమె వ్యపగతః” – నాకు
మిడిమిడి జ్ఞానము ఉన్నప్పుడు, నాకు ఎంతో తెలుసు, నాకు
తెలుసున్నంత ఈ ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు అని నాకు
ఏనుగుకు ఉన్నంత మదము ఉండేది. నేను పండితులలో
సహవాసము చేసి, చాల కొంచము, కొంచము వాళ్ళ ద్వారా
తెలుసుకున్న తరువాత, నేను తెలుసుకున్నది ఏమిటంటే – నాకు
ఏమీ తెలియదనీ, అన్నీ తెలుసు అని అనుకునే ఒక మూర్ఖుడిని అని,
నాకు తెలియనిది ఈ ప్రపంచములో ఎంతో ఉన్నదనీ తెలిసిన
తరువాత నాకున్న మద జ్వరము పూర్తిగా చల్లబడిపోయినది.

కాని ప్రస్తు తము లోకములో వినయము ప్రదర్శించే వాళ్ళు


(వినయము ఉన్న వాళ్ళు కాదు), డంభులు (లోపల అహంకారము
పెట్టు కొని, వినయము ప్రదర్శించేవాళ్లు ), లోభులు (మన నుండి
ప్రయోజనము ఆశించిన వాళ్ళు), భయంతో (బలహీనులు), సిగ్గుతో
(వినయము కాదు). మనస్సులో పూర్తిగా జ్ఞానముతో వైరాగ్యము
ఉన్నవాడు అసలైన వినయ సంపన్నుడు.

గౌతమ ధర్మ సూత్రములు – “సమా సమాభ్యామ్


విషమసమే పూజాతః” – విద్యలో కాని, జ్ఞానములో కాని,
308
సదాచారములలో కాని, ఇతర ఉత్తమ గుణములు ఉన్న ఉత్తమమైన
విద్వాంసులను మొదట ఉత్తములుగా సన్మానములు, మర్యాదలు,
పూజలు చేయాలి. వారి కంటె కొంచము తక్కువ స్థా యిలో ఉన్న
విద్వాంసులను కొంచము తక్కువ రకముగా సన్మానములు,
మర్యాదలు, పూజలు చేయాలి. ఎక్కువ విద్వాంసులు ఉన్నప్పుడు,
వాళ్ళ ముందు తక్కువ విద్వాంసులను ఎక్కువగా లేదా ఎక్కువ
విద్వాంసులతో సమానముగా గౌరవించిన వాళ్లు మహా పాపులు.
వాళ్ళ ఇంటిలో భోజనము చేసిన వాళ్ళు కూడా మహా పాపులే
అవుతారు. అలా భోజనము చేస్తే, వాళ్ళ సంస్కారములు వీళ్ళకు
కూడా అలవాటు అవుతాయి.

ఇహై వ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః।


నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ॥ 19 ॥

ఎవరి మనస్సులో సమస్త జీవుల యందు సమత్వ భావన


కదలకుండా స్థిరముగా ఉన్నదో, వాళ్ళు ఈ లోకములో, ఈ
జన్మలోనే పుణ్య, పాప కర్మలు మరియు పునర్జన్మ లేకుండా
చేసుకున్నారు. వాళ్ళు ఈ జన్మను సార్థకము చేసుకున్నారు.

అంతటా వ్యాపించిన, ఏ విధమైన దోషములు లేని,


అందరిలోనూ సమానముగా వ్యాపించిన పరబ్రహ్మమను సర్వత్రా,
అందరిలో, అన్నిట్లో చూస్తూ ఉన్నారు కాబట్టి, ఆ జీవులు,

309
వస్తు వులతో అనుభవించే కర్మల వలన, ఆ వ్యక్తితో, వస్తు వుతో
సంబంధము కలిగి ఉన్నా, వాళ్ళు పరబ్రహ్మతో ఉన్నారు కాబట్టి, ఆ
వ్యక్తు లు, వస్తు వులు వలన కలిగే ఏ దోషములు, బంధనములు
వాళ్ళకు అంటవు.

ఒక అడవిలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. ఆ


మహర్షి దగ్గరకు ఒక కోయ దంపతులు వచ్చి, నమస్కరించి, స్వామీ
మా ఇంట్లో కొత్తగా వివాహము అయిన మా కోడలికి, మా
అమ్మాయికి మధ్య తగాదా వచ్చి ఇద్దరూ పోట్లా డు కొంటున్నారు.
మా అమ్మాయితో వాళ్ళ అమ్మ కూడా కలిసినందున, మా కోడలితో
వాళ్ళ మధ్య పోట్లా ట ఎక్కువై పోయింది. దీనికి ఒక పరిష్కారము
చెప్పమని అడిగారు. దానికి ఆ మహర్షి గారు మీ అమ్మాయినీ, మీ
కోడలను మీరు సమానముగా చూడండి. ఇదే దీనికి పరిష్కారము
అని ఆ మహర్షి చెప్పారు. ప్రక్కనే కూర్చొన్న శిష్యుడికి “పండితాః
సమదర్శినః” - జ్ఞానులు ద్వంద్వములను (నా వాళ్ళు/పరాయి వాళ్లు ,
సుఖము/దుఃఖము, లాభము/నష్టము, చలి/వేడి మొదలైనవి)
అన్నిటినీ సమానముగా భావిస్తా రు అని శిష్యుడికి కూడా ఉపదేశము
చేశారు. ఆ కోయ దంపతులు వెళ్ళిపోయారు.

ఆ శిష్యుడు గురువుగారి ఉపదేశమును శ్రద్ధగా పాటించాలని,


ఆశ్రమములో వండిన దద్దోజనము, దేవుడికి నైవేద్యము పెట్టిన
తరువాత ఆ ఆశ్రమములో పెరుగుతున్న పులులకు, సింహాలకు,
310
జింకలకు అన్నింటికీ సమానముగా పెట్టు తున్నాడు. ఆ జంతువులు
గురువుగారి ప్రభావముతో ఆశ్రమము దాటి వెళ్ళలేవు. ఆశ్రమములో
వాటికి కావలసిన సహజమైన ఆహారము దొరకక చాలా నీరసించి
ఇబ్బంది పడుతున్నాయి.

కొన్నాళ్ళకు ఆ కోయ దంపతులు మళ్ళీ ఆశ్రమముకు వచ్చి,


మీరు మా అమ్మాయిని, కోడలిని సమానముగా చూడమన్నారు.
అమ్మాయికి దుంపలు అంటే ఇష్టము. కోడలికి పళ్ళు ఇష్టము.
దుంపలు పెడితే కోడలు తినను అంటోంది, పళ్ళు పెడితే అమ్మాయి
తినను అంటోంది. ఇద్దరికీ సమానమైన తిండిని పెడదామంటే
కుదరట లేదు. ఏమి చేయాలో తెలియట లేదు అని గురువుగారితో
చెప్పారు. దానికి గురువుగారు నేను చెప్పినది ఆహారము
విషయములో కాదు, మీ అమ్మాయి, కోడలు ఇద్దరూ అమ్మాయిలే,
వాళ్ల ఇద్దరకూ ప్రాణము, మనస్సు ఉన్నాయి. ఇలాంటి
విషయములలో వాళ్లిద్దరూ సమానము. ఇతర విషయములలో ఎవరి
ఏది ఇష్టమూ అది పెట్టండి అని చెప్పి, శిష్యుడి వంక చూసి “నిర్దోషి
హి సమం బ్రహ్మతస్మాద్ బ్రాహ్మణి తే స్థితాః” అని బోధించారు. సమ
దర్శనము అంటే జీవులు, వస్తు వులు వేరు, వేరుగా ఉన్నా, ప్రతి
ప్రాణిలోనూ, ప్రతి వస్తు వులోనూ ప్రపంచమంతా పరమ మూల
తత్త్వము అయిన ఒకే బ్రహ్మ, ఒకే చైతన్యము, ఒకే ప్రకాశము
అంతటా సమముగా వ్యాపించి, ఆవరించి ఉన్నది అని వివరముగా

311
చెప్పిన తరువాత, అప్పటికి శిష్యుడికి గురువుగారు చెప్పినది సరిగ్గా
అర్ధమయినది.

మనము బంగారు ఆభరణములు కొన్నప్పుడు, ఆ


ఆభరణముల ఆకారము, అలంకరణములు, ఇతర లోహములు,
రాళ్లు అవన్నీ కలిపి చూసి వేరు, వేరు ఆభరణముల స్వరూపముల
మీద దృష్టి పెట్టి, వాటికి ఆకర్షితమై కొంటాము (వేరు, వేరు
ఆభరణములు. వేరు, వేరు జీవులు, ప్రాపంచక వస్తు వులు,
విషయములు). కాని తరువాత వాటిని తిరిగి ఆ దుకాణము వాడికి
మనము తిరిగి ఇచ్చినప్పుడు, వాడు ఆ ఆభరణములలో ఉన్న
ఇతర పదార్ధములు తీసివేసి, వాటిలో ఉన్న మూల పదార్ధమైన
కేవలము బంగారమును (ఆభరణముల మూల తత్త్వము,
పరమాత్మ తత్త్వము) మాత్రమే తీసుకొని దాని విలువ మనకు
ఇస్తా డు. మనము స్వరూపముల మీద దృష్టి పెట్టి ఎక్కువ విలువ
ఇచ్చి నష్టపోతున్నాము. దుకాణము వాడు మూల పదార్ధము మీద
దృష్టి పెట్టి లాభము పొందుతున్నాడు. అలాగే ప్రాపంచక
విషయముల మీద దృష్టి పెట్టినవాడు నష్ట పోతాడు. ప్రపంచము
యొక్క మూలమైన పరమాత్మ తత్త్వము మీద దృష్టి పెట్టిన వాడు
లాభము పొందుతాడు.

న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య నోద్విజేత్ప్రా ప్య చాప్రియం ।


స్థిరబుద్ధిరసంమూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః ॥ 20 ॥
312
ఏ జీవిని, ఏ వస్తు వుని చూసినా అవి ప్రియము అని లేదా
అప్రియము భావించుకొని, సంతోషము లేదా ఉద్వేగము, ద్వేషము
పొందరాదు.

బ్రహ్మ గురించి చెప్పిన విషయము మీద స్థిరమైన బుద్ధితో


కలిగి ఉండాలి. ఏ విధమైన మొహమునకు, భ్రమలకు అవకాశము
ఇవ్వకూడదు. పరబ్రహ్మ జ్ఞానము పొందుటకు, నిరంతరము
ప్రయత్నము చేసుకుంటే, మనస్సులో పరబ్రహ్మ సాక్షాత్కారము
తప్పకుండా కలుగుతుంది. ఆ బ్రహ్మవిత్ స్థితిని దాటిన తరువాత, ఆ
సాధకుడికి పరబ్రహ్మ తప్ప, మరొక జీవి లేదా వస్తు వు యందు
మనస్సు పోకుండా, పరబ్రహ్మ యందే ఎల్లప్పుడూ మనస్సు
స్థిరముగా నిలిచి, పరమాత్మ యందే మనస్సు పరిసమాప్తము
అవుతుంది.

2-56 వ శ్లోకములో స్థిత ప్రజ్ఞని లక్షణములు చెప్పుతూ ఈ


విషయములు ఒకసారి చెప్పాడు.

ఛాందోగ్యోపనిషత్ – 3-14-1 – “సర్వం ఖల్విదం బ్రహ్మ


తజ్జలానితి శాన్త ఉపాసీత అధఖలు....” - ఈ ప్రపంచమునకు మూల
కారణము పరమాత్మ మాత్రమే. నామరూపాత్మకమగు, చరాచర ఈ
ప్రపంచము అంతా పరబ్రహ్మయే అయి ఉన్నది. ఈ ప్రపంచములో
పరబ్రహ్మ తప్ప వేరొకటి ఏమీ చూడరాదు. అందుచేత ఎవ్వరూ, ఏ

313
వస్తు వు మీద రాగ, ద్వేషములు కలిగి ఉండనక్కరలేదు. ఏ రకమైన
ఉద్వేగములు పొందరాదు. ఈ ప్రపంచము సృష్టి (పుట్టు క), స్థితి
(ఉండుట, ఉనికి), లయము (లీనము) బ్రహ్మము నందే
కలుగుచున్నవి. ఏ వస్తు వు పరమాత్మ కంటె వేరు, భిన్నము కాదు.
ఈ ప్రపంచము పరమాత్మ యొక్క ఒక రూపాంతరమే. అందుచేత
ఒక వస్తు వు మనకు కలిగిందని సంతోషము పొందాలని కాని, లేదా
నాకు అక్కరలేని వస్తు వు నేను కోరుకోకుండా, ఏదో వస్తు వు నాకు
వచ్చి పడింది అని నాకు దుఃఖము కలగాలని కాని వాటికి
అవకాశము కలిగించకూడదు.

బాహ్యస్పర్శేష్వసక్తా త్మా విందత్యాత్మని యత్సుఖం ।


స బ్రహ్మయోగయుక్తా త్మా సుఖమక్షయమశ్నుతే ॥ 21 ॥

ఇంద్రియములను విషయముల వైపు బయటకు


పోనీయకుండా, ఇంద్రియముల ద్వారా బయట విషయములను
మనస్సు లోపలకి తీసుకురాకుండా ఉన్నట్లయితే, మనస్సులో ఆత్మ
స్వరూపము యొక్క సుఖమును

బ్రహ్మ జ్ఞానము మనస్సులో నింపుకున్నవాడు ఆ సుఖమును


పూర్తిగా నిరంతరము, క్షయము లేకుండా, స్థిరముగా
అనుభవిస్తా డు. కాని కేవలము ప్రయత్నము చేద్దా మని
అనుకునేవారికి క్షణ మాత్రమే ఉంటుంది.

314
సుషుప్తి అవస్థలో (మనస్సు అలసిపోయి, కలలు ఆగిపోయిన
తరువాత గాఢ నిద్రలో) ఇంద్రియములు, మనస్సు అలసిపోయి,
పనిచేయుట మానివేస్తా యి. అప్పుడు బాహ్య విషయములు
మనస్సులోకి రావు. ఆ సమయములో నాకు సుఖముగా నిద్ర
పట్టినది అని అంటాము. ఆ సమయములో చాలా ఆనందము
అనుభవిస్తా ము, శరీరమునకు అలసట తీరి, చాలా హాయిగా,
ప్రశాంతముగా ఉంటుంది. అది కేవలము క్షణ మాత్రము ఉంటే
దానిని సుషుప్తి సుఖము అంటారు. అది శాశ్వతముగా ఉంటే దానిని
ఆత్మ సుఖము, ఆత్మానుభవము, బ్రహ్మానందము అంటారు. ఈ
సుఖము బాహ్యమైన వస్తు వుల ద్వారా కలిగే సుఖము కంటె ఎన్నో
రెట్లు ఎక్కువ సుఖమును కలుగుతుంది.

ఒక రాజుగారికి పట్టా భిషేకము చేస్తుంటారు. తెల్లవారి నుండి


రాత్రి వరకూ ఎన్నో సంబరాలు, ఉత్సవాలు, చేస్తూ, ప్రజలు కానుకలు
ఇస్తూ, కప్పములు కట్టు తూ ఉంటారు. రాజుగారికి బయట నుండి
ఇన్ని సుఖములు కలుగుతున్నా, రాజుగారు అలసిపోయి,
సింహాసనములో కూర్చొని కునుకు పాట్లు పడుతూ ఉంటారు.
ఎందుకంటే ఈ బయట సుఖముల కంటె ఆత్మ సుఖము ఎన్నో
రెట్లు ఎక్కువ. బాహ్య ప్రాపంచక సుఖములతో అసక్తిగా (ఆసక్తి,
కోరిక వదులుకుంటేనే), లోపల కలిగే ఆత్మ సుఖము
అనుభవములోనికి వస్తుంది. .

315
“యస్య కామ సుఖం లోకే, యస్య దివ్యం మహాత్ సుఖం,
తృష్ణా క్షయ సుఖస్యైతే నార్హత షోడశీమ్ కళాః” మనము కోరుకొని,
కష్టపడి తెచ్చుకున్న బాహ్యమైన ప్రాపంచక సుఖములు, పైన దివ్య
లోకములలో కలిగే దివ్య సుఖములు, ఇవన్నీ సుషుప్తి స్థితిలో కలిగే
సుఖము కంటె కనీసము 16 వ వంతు సుఖము కూడా ఉండవు.
ఆత్మ సుఖము ముందు ఈ సృష్టిలో ఉన్న అన్ని సుఖములు
దిగదుడుపే.

 యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే।


ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ॥ 22 ॥

బాహ్యమైన ప్రాపంచక వస్తు వులతో, ఇంద్రియముల ద్వారా


సంబంధము కలిగి నందువలన క్షణికమైన సుఖములు
కలుగుతున్నాయి. ఆ బాహ్య సుఖములు దుఃఖమునుండే
పుట్టు కొస్తు న్నాయి, ఆ సుఖము చివరికి ఇంకా ఎక్కువ
దుఃఖములోకే తీసుకువెళ్ళుతాయి.

ప్రతి సుఖమునకు ఆది (మొదలు) ఉంది, అంతము


(నాశనము) ఉంది. కుంతీ పుత్రా I పండితులు, తెలివైనవాడు,
బుద్ధిమంతుడు ఎవరైనా బాహ్య ప్రాపంచక వస్తు వులతో కలిగే
సుఖముల మీద ప్రీతి కలిగి ఉండరు.

316
మొదట ఇంత కష్టపడి ఈ సుఖము సంపాదించుకున్నాము,
ఈ సుఖము త్వరలో అయిపోతోందే అనే దుఃఖము (ఐస్క్రీం
కరిగిపోయినట్లు ). కష్టము, శ్రమ ఎక్కువ, కలిగే సుఖము తక్కువ
అనే దుఃఖము. ప్రక్క వాడికి మనకంటే ఎక్కువ సుఖము ఉంది అనే
దుఃఖము, బాధ.

గౌతమ మహర్షి న్యాయ సూత్రములు

దుఃఖము అనగా బాధనా లక్షణము ఉన్నది. ఎవరికీ,


ఎప్పుడూ ఇష్టము లేనిది దుఃఖము. దుఃఖమును ఎవ్వరూ
కోరుకోరు. సుఖములో సుఖము తక్కువగా, దుఃఖము ఎక్కువగా
ఉంటుంది. సుఖము కోసము పడే కష్టము ఎక్కువ, కలిగే సుఖము
తక్కువ. మానవులు వాళ్ళు తెలివైన వాళ్ళు అని అనుకుంటారు
కాబట్టి, దుఃఖములను లెక్క చేయకుండా, ఆ క్షణికమైన,
అనిత్యమైన, దుఃఖములు కలిగించే సుఖము కోసము
వెంపర్లా డుతూ ఉంటారు. “న తేషు రమతే బుధః” - నిజమైన
తెలివైనవాడు ఇలా ఆలోచించడు. జీవులు, వస్తు వులు, సుఖములు
మీద ప్రీతి ఉండరాదు.

“వివిధ బాధనా యోగాత్ దుఃఖమేవ జన్మోపత్తిః” – ఏ


జీవికైనా వారి జన్మలో దుఃఖము ఉండి తీరుతుంది. అసలు జన్మే
(పుట్టు కే) ఒక దుఃఖము. స్వర్గలోకములో దేవతలు కూడా వాళ్ళ

317
పుణ్యము ఖర్చు అయిపోతోంది. పూర్తిగా ఖర్చు అయిపోతే, మరొక
లోకములో ఇంకొక జన్మ ఎత్తా లనే దుఃఖము ఉంటుంది. దుఃఖము
లేని జన్మ ఉండదు.

“సుఖస్య అంతరాళ నిష్పత్తే” – జన్మలో సుఖములు


ఉన్నాయి. కాని ఆ సుఖములు మధ్యలో, మధ్యలో కొద్ది. కొద్దిగా
కలుగుతూ ఉంటాయి. సుఖములు తక్కువ, దుఃఖములు
ఎక్కువగా ఉంటాయి.

“బాధనా నివృత్తేర్ వేదయతః పర్యేషణ దోషాత్ అప్రతి


యేషః” – నీకు కనుక సుఖము కలిగి ఎల్లప్పుడూ ఉంటే, నీవు
మళ్ళీ సుఖము కోసము వెతుక్కోకూడదు. ఒకసారి సుఖము కలిగిన
తరువాత, మళ్ళీ నీవు సుఖము కోసము ప్రయత్నించావంటే, ఆ
సుఖము అయిపోయిందో లేదా సరిగ్గా కలగట లేదు. లేదా ఆ
సుఖము కంటె దుఃఖము ఎక్కువగా ఉంది కాబట్టి.

“ప్రార్ధితం న సంపద్యతే, ప్రార్ధితం సంపద్యతే తు న్యూనం,


సంపద్య విపద్యతే బహుప్రత్యనీకమ్ వా సంపద్యతే - కొన్నిసార్లు
మనము అనుకున్నట్లు అవదు, సుఖము కలగదు. కొన్నిసార్లు
మనము అనుకున్న దాని కంటె తక్కువగా సుఖము కలుగుతుంది.
కొన్నిసార్లు మనము అనుకున్నదాని కంటె వ్యతిరేకముగా
అవుతుంది. లేదా దక్కినట్లే అనిపించి, నీటి బుడగలులా, వెంటనే

318
నాశనము అయిపోతున్నాయి. సుఖము కలిగిన తరువాత, సుఖము
రాక ముందు ఉన్న కష్టముల కంటె, ఎక్కువ కష్టములు
కలుగుతున్నాయి.

వాత్సాయన మహర్షి - “కామం కామయ మానస్య, యధా


కామః సవృధ్యతే, అథైన అపర కామః, క్షిప్రమేవ ప్రభాసతే” –
మనస్సులో ఏదో ఒక కోరిక కలిగినది. మనస్సులో ఆ కోరిక
ప్రవేశించగానే, మనస్సులో మంట, ఆవేదన మొదలయింది. ఆ
మంటతో, మనిషి ఎలాగైనా ఆ కోరిక తీర్చుకోవాలని, ఆ మంటను
చల్లా ర్చుకోవాలని బయటకు పరుగెత్తి, కష్టపడి ఎన్నో ప్రయత్నములు
చేస్తే, ఆ కోరిక తీరింది, ఆ మంట చల్లా రింది అని అనుకునే లోపలే,
మనస్సులో ఇంకొక కోరిక మొదలవుతుంది, అది మళ్ళీ మంట
మొదలుపెడుతోంది (Emcet లో మంచి రాంగు రావాలి –
IIT/Medical సీటు రావాలి – మంచి ఉద్యోగము రావాలి –
అందమైన భార్య రావాలి – పెద్ద Flat కొనాలి – ప్రమోషన్లు రావాలి
– పిల్లలు – వాళ్ళ చదువులు, ఉద్యోగములు, పెళ్ళిళ్ళు, మనవులు –
వాళ్ళ ..... – ఇలా జీవితము సమాప్తము). “పర్యేషణ దోషాః
అప్రతిషేధః” - ఒక కోరిక పూర్తిగా తీరక ముందే తరువాత మరొక
కోరిక కలిగి ఆ వస్తు వుల కోసము వెంపర్లా డటము, ఆరాట పడటము
ఎప్పటికీ తగ్గటము లేదు. ఇది తగ్గట లేదు అంటే, అందులో మీకు

319
సుఖము, తృప్తి లేదు అని తెలుసుకోవలసినదే. అల్లా జీవితమంతా
మనస్సులో శాంతి అనేది ఉండనే ఉండదు.

వశిష్ట మహర్షి – యోగ వాశిష్టము

వశిష్ట మహర్షి ఉపదేశించగా, వాల్మీకి రచించిన యోగ


వాశిష్టములో కధ.

కర్కటి అనే రాక్షసికి కొండంత దేహము ఉన్నది. కనిపించిన


వాళ్ళందరిని, నమిలి మింగేస్తోంది. ఆ కర్కటికి తృప్తి కలగట లేదు.
నేను ఎక్కువ మందిని తిని, ఎక్కువ రకముల రసానుభూతిని
పొందాలనే కోరికతో తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనారు.
ఆ రాక్షసి నేను ఎక్కువ రకముల రక్తము తాగాలి. దానికి పొడవైన
సూది ముక్కు కావాలి. అందుకు, నాకు ఈ పర్వతమైన శరీరము
తీసేసి, పొడవైన సూది ముక్కు కల విసూచికగా పుట్టించమని
వరము కోరింది. తపస్సు చేసిన వాళ్లకు, వాళ్ళ తపస్సుకు తగ్గ
వరము ఇవ్వవలసినదే. అందుకు బ్రహ్మదేవుడు తథాస్తు అన్నారు.
వెంటనే ఆ రాక్షసి, ఒక చిన్న పురుగుగా పుట్టింది. అప్పుడు అందరి
రక్తము త్రాగుతోంది. కాని చిన్న పురుగు అవటము చేత రక, రకాల
రక్తము త్రాగుతున్నా, ఎక్కువ రక్తము త్రాగ లేకపోతోంది. దీని కంటె
ఆ పర్వత శరీరమే బావుందని అనుకొని, మళ్లా తపస్సు చేసింది.
బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే, నాకు ఈ చిన్న శరీరముతో ఎక్కువ

320
భోగములు అనుభవించ లేకపోతున్నాను. నాకు తిరిగి ఆ కొండంత
శరీరమే కావాలి అని వరము కోరింది. బ్రహ్మదేవుడు తథాస్తు
అన్నారు. మళ్లా ఆ కొండంత శరీరము కలిగింది.

అప్పుడు దానికి ఒక సందేహము కలిగింది. నేను ముందు


కొండంత శరీరములో ఉన్నాను, తరువాత చిన్న పురుగు శరీరములో
ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు కొండంత శరీరములో ఉన్నాను. ఆ
శరీరములే నేనా? లేదా నేను ఆ శరీరముల కంటె వేరా? ఆ రాక్షసి
భోగముల మీద కోరికతో తపస్సు చేసినా, ఆ తపస్సుల యొక్క
సాత్విక భావము యొక్క ప్రభావము మనస్సులో పెరిగి, చిత్త శుద్ధి
కలిగి, , ఆత్మను గురించి తెలుసుకోవాలనే విచారణ మొదలయింది.
ఒకే జనంలో శరీరములు మారిపోతున్నాయి. అంటే నేను శరీరము
కంటె వేరైనా ఆత్మ స్వరూపమును అని అర్ధమయినది.

ఈ కధ చాలా నడుస్తుంది. ఈ విధమైన విచారణ మొదలై


చివరకు ఈ భోగ్యమైన వస్తు వుల మీద కంటె, ఆ వస్తు వులకు మూల
కారణమైన పరమాత్మ మీద ప్రీతి పెంచుకోవాలనే విచారణ వరకూ
చేరి, తత్త్వ జ్ఞానమును పొందింది.

శక్నోతీహై వ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ ।


కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ॥ 23 ॥

321
ఈ జన్మలోనే కోరిక తీవ్రమైనప్పుడు కలిగే వేగము, ఆ కోరిక
తీరకపోతే కలిగే కోపముతో వచ్చే తీవ్రమైన వేగము, ఎవరైతే తట్టు కొని
ఇవి సరైనవికాదు అనే సహనమును ఎవరైతే పెంచుకుంటారో, ఈ
శరీరము వదిలిపెట్టి వెళ్ళే ముందే ఈ విధమైన ఆలోచన, సాధన
చేసుకుంటారో, అటువంటి వారే నిజమైన యోగము ఉన్నావారు.
వారికే నిజమైన సుఖము అందుతుంది.

మానవులకు ఒకదాని తరువాత మరొక కోరికల ప్రవాహము


వరదలలో నదీ ప్రవాహము వలె తీవ్రముగా కొనసాగుతూనే
ఉంటుంది. ఆ ప్రవాహములో కొట్టు కుపోయి ఏదైనా జరగవచ్చు. ఆ
కోరికలు తీరకపోతే వచ్చే కోపము లేదా ద్వేషము యొక్క వేగము
ఇంకా తీవ్రముగా ఉంటుంది. శరీరములో జీవాత్మ ఉన్నంత వరకే ఈ
కామము, క్రోధము కలిగేది. జీవుడు ఈ శరీరములో ఉన్నప్పుడే ఈ
కామము, క్రోధము యొక్క వేగ ప్రవాహమును ఆపుకోగలగాలి.

 యోఽంతఃసుఖోఽంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః ।
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి ॥ 24 ॥

ఇతర బాహ్యమైన వస్తు వులు, విషయముల మీద ప్రీతిని


పెంచుకోకుండా, వాటి ద్వారా కలిగే సుఖములను వదులుకొని,
తనలో తానే ఆత్మ స్వరూపము యందే రమించేవాడు,
క్రీడించేవాడికి లేదా కేవలము లోపల వెలిగే ఆత్మ జ్యోతిని తెలుసుకునే

322
స్థితిని సాధించుకోగలిగితే, బాహ్య వస్తు వుల ద్వారా దుఃఖములు
కలగవు మరియు నిజమైన, శాశ్వతమైన ఆనందము కలుగుతుంది.

ఈ యోగముతో (సమతా భావముతో సత్కర్మ యోగము,


యోగ శాస్త్రములో చెప్పిన సమాధి యోగము మరియు జ్ఞాన
యోగము) ఆత్మ జ్ఞానమును సాధించుకోవాలి. ఆలా
సాధించుకుంటే, బాహ్య వస్తు వుల ద్వారా కలిగే దుఃఖములను
పరమాత్మ స్వరూపములో పూర్తిగా చల్లా ర్చుకుంటాడు,
తొలగించుకుంటాడు. పరబ్రహ్మ నుండి విడిపోయి, బయటకు
వచ్చిన జీవుడు, మళ్ళీ ఆ పరమాత్మలో ఐక్యమయి, బ్రహ్మ
స్వరూపమే అయిపోతాడు.

సాధారణ మానవులు తన శరీరమే తాను (జీవుడు) అని


భ్రమిస్తూ మరియు బాహ్యమైన వస్తు వుల, విషయముల నుండి
సుఖము పొందే ప్రయత్నము చేస్తూ ఉంటారు. బాహ్య వస్తు వుల
ద్వారా కలిగే సుఖము చివరికి దుఃఖముగానే పరిణమిస్తుంది.
అందుచేత శాశ్వతమైన సుఖము కేవలము ఆత్మ స్వరూపము నుండే
రావాలి. దానికి ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము ఒక్కటే మార్గము.
వేరే దారి లేదు. కాబట్టి. కాబట్టి ఆత్మ జ్ఞానము కోసము ప్రయత్నము
చేసుకోవాలి. అంతర్ సుఖమును పొందే ప్రయత్నము చేసుకోవాలి.
బాహ్య వస్తు వులు నుండి సుఖమును పొందాలి అనే కోరికలు విడిచి
పెట్టు కోవాలి. బాహ్య వస్తు వుల మీద ఆసక్తి, శ్రద్ధ, మనస్సు లేకపోతే,
323
వాటంతో అవి మన దగ్గరకు వచ్చే అవకాశము ఉండదు. మన లోపల
ఉన్న ఆత్మా స్వరూపము ఒక్కటే అతి ముఖ్యమైనది, అవసరమైనది.
ఇతర బాహ్య వస్తు వులు ఏమీ అవసరము లేదు అనే స్థిరమైన
నిశ్చయము ఉన్న వాడికి, బాహ్య వస్తు వులు వచ్చి మీద పడినా సరే,
వాటి గురించి ఏ విధమైన జ్ఞానము, సుఖము, భోగము, దుఃఖము
కలగదు.

 లభంతే బ్రహ్మనిర్వాణమ్ ఋషయః క్షీణకల్మషాః ।


ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ॥ 25 ॥

సమతా భావముతో సత్కర్మ ఆచరణ చేసుకొని, చిత్త శుద్ధిని


సంపాదించుకుంటే, ఎప్పుడైతే మనస్సులో ఉండే దోషములు
(సందేహములు కలుగుట, ఏకాగ్రత లేకపోవుట, చెప్పినదానిని వేరుగా
అర్ధము చేసుకొనుట) తొలగిపోతాయో, అప్పుడు మనస్సుకు
పరమాత్మ దర్శన సామర్థ్యము ఏర్పడుతుంది.

అప్పుడు ఇంద్రియ నిగ్రహము (చిత్తము, అహంకారము,


బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను)
సాధించుకుంటే, మనము కాక మిగతా ప్రాణులు అన్నింటికీ మంచే
జరగాలి, సుఖముగా ఉండాలి అనే ప్రయత్నము చేసుకొని, ఏ ప్రాణినీ
హింసించకుండా ఉంటే, మనస్సులో ఉండే అన్ని సందేహములు

324
పూర్తిగా తొలగిపోయి, పరమాత్మ తత్త్వ జ్ఞానము కలిగి, మోక్షము
లభిస్తుంది.

బృహదారణ్యకోపనిషత్ – 4 లేదా 6-4-22 – “........త


మేతం వేదానువచనేన బ్రహ్మణా వివిదినిషన్తి I యజ్ఞేన దానేన
తపసానాశకే నైతమేవ విదిత్వా మునిర్భవతి” – మునులు,
మహాత్ములు వేద పఠనము, యజ్ఞములు, దానములు, ఉపవాస
వ్రతములు ఆచరించి, ప్రతి సత్కర్మ ద్వారా మనస్సుని శుద్ధము
చేసుకొని, ఆ పరమాత్మను తెలుసుకొనవలెను అని చెప్పుదురు.

ముండకోపనిషత్ – 3-1-8 – “న చక్షుషా గృహ్యతే నాపి


వాచా నాన్యై ర్దేవై స్తపసా కర్మణా వా I జ్ఞాన ప్రసాదేనా విశుద్ధసత్త్వ
స్తతస్తు తం పస్యతే నిష్కలం ధ్యాయమానః” - పరమాత్మను కళ్లతో
కాని, వాక్కుతో, ఉపదేశములతో కాని, ఇంద్రియములతో కాని,
తపస్సులతో కాని, వేద విహితమైన సత్కర్మలతో కాని గ్రహించుట,
దర్శించుట సాధ్యము కాదు. ఆత్మ జ్ఞానముతో కల్మషములు పోయి,
మనస్సు ప్రసన్నతతో, పరిశుద్ధమైన అంతఃకరణముతో (శుద్ధమైన
మనస్సుతో, బుద్ధితో), ఆ పరమాత్మను నిరంతరము భక్తితో
ధ్యానించువాడు మాత్రమే దర్శించగలడు.
ముండకోపనిషత్ – 2-2-9 భిద్యతే హృదయ గ్రన్థి శ్ఛిద్యన్తే
సర్వసంశయాః I క్షీయ న్తే చాస్య కర్మాణి తస్మిన్ దృష్ట పరావరే II
- పరమాత్మను చూసిన వెంటనే హృదయ గ్రంథులు ఛేదించబడి,
325
అజ్ఞానము నాశనము అయిపోయి, అజ్ఞానము వలన మనస్సులో
కలిగే లేదా ఉండే సందేహములు అన్నీ పటాపంచలు అయిపోతాయి.
మనము చేసుకున్న కర్మలు అన్నీ, ఫలితములు ఇవ్వలేని స్థితికి వచ్చి,
అన్ని కర్మ బంధనములు నాశనము అయిపోతాయి.

పరమాత్మ తత్త్వ జ్ఞానము కలిగినప్పుడు మన మనస్సులో


ఉండే అన్ని సందేహములు తొలగిపోతాయి, కర్మలు క్షీణించి,
మోక్షము లభిస్తుంది.

కఠోపనిషత్ – 2-1-1 - “పరాంచిఖాని వ్యతృణత్


స్వయంభూ స్తస్మాత్ పరాంగ్ పశ్యతి నాన్త రాత్మన్ I కశ్చిద్దీరః
ప్రత్యగాత్మానమైక్త దావృత్త చక్షు రమృతత్త్వ మిచ్ఛన్” –
ఇంద్రియముల యొక్క స్వభావము మన నుండి బయటకు
ప్రసరిస్తా యి. మన శరీరములో జరిగే ఏ క్రియను, ఏ వస్తు వులనూ
ఇంద్రియములు తెలుసుకోలేవు. ఆత్మ స్వరూపమునకు వేరుగా,
బయట ఉన్న జీవులను, వస్తు వులను మాత్రమే తెలియచేయగలవు.
మన లోపల ఉన్న ఆత్మ స్వరూపమును ఈ ఇంద్రియములతో
తెలుసుకోలేవు. అమృతత్త్వమును కోరుకుంటూ, తన
అమృతత్త్వమును పొందాలనే ఇచ్చతో ధీరులు (సాధకులు),
మొట్టమొదట ఈ ఇంద్రియములను బయటకు ప్రసరణను
ఆపివేసి. ఈ ఇంద్రియముల ప్రవృత్తి ఎక్కడ నుండి మొదలయిందో,

326
ఎవరి కోసము, ఎవరి ప్రేరణతో, ఎవరి ద్వారా పనిచేస్తు న్నాయో
తెలుసుకొని, తన ఇంద్రియములను, మనస్సును అంతర్ముఖము
చేసుకొని, శరీరము లోపలికి చూచేలా మరల్చి, ఆత్మ తత్త్వమే
పరమాత్మ తత్త్వము అని తెలుసుకోగలుగుతున్నాడు.

ఛాందోగ్యోపనిషత్ – 8-15-1 – “....అహింసం త్సర్వభూతా


నాన్యత్ర తేర్దేభ్య....” – ఆత్మ జ్ఞానముతో సంస్పర్శ లేనివారికి
(సాధారణ మానవులకు) శాస్త్ర విహితమైన (జీవనము జరుగుటకు
అనుమతించిన హింస తప్ప – వడ్లను తీసుకొని దంచి వంట
వండుట, చెట్టు నుండి పండు కోయుట – చెట్టు కు కలిగే హింస)
హింసను తప్ప ఇతర హింసలు చేస్తే అవి హింసలు అవుతాయి.
అనవసరమైన హింసలు చేయకూడదు. ఆత్మ జ్ఞాని మాత్రము ఏ
భూతమునకు హింస కలిగించకూడదు.

ఉదాహరణ:

మహాభారతము లోని కధ. ధర్మ వ్యాధుడు (బోయవాడు,


వేటగాడు) కౌశికుడికి (తపస్సు చేసిన బ్రాహ్మణుడికి) సత్కర్మ
ఆచరణ, మాతృ, పితృ దేవతలకు సేవ, స్వధర్మము, కర్తవ్యము
గురించి అనేక ఉపదేశములు చేశాడు. ధర్మ వ్యాధుడు యొక్క
కుమార్తెను ఒక సాధు కుటుంబములో కుర్రవాడికి ఇచ్చి

327
వివాహము చేశారు. ధర్మ వ్యాధుడు గొప్ప జ్ఞాని, చాలా మంచివాడు
అని తెలుసుకొని వాళ్ళు ఆ వివాహము చేసుకున్నారు. ఆ
కుటుంబములో ఎవ్వరూ ఏ విధమైన హింస చేయరు. కాని వాళ్ళ
మనస్సులో ఉన్న ఒక చిన్న అభిప్రాయ బేధముతో ఆ అమ్మాయిని,
ఆమె తండ్రి ఒక వేటగాడు. జంతువులను, పక్షులను హింసించి,
చంపి తన పొట్ట నింపుకుంటాడు, ఆమె తండ్రి హింస చేసే వాడు అని
అనేవారు. ఇంకా ఆమె ధ్యానములో పద్దతి, వాళ్ళ ధ్యానములో
పద్ధతులతో తేడా కూడా ఉండేది. దాని మీద కూడా సూటిపోటి
మాటలు అనేవారు. తన తండ్రి గురించి, తనని అలా అంటూంటే,
ఆమెకు బాధ కలిగేది. ఒకరోజు ఆమె ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు
వదలి, తన తండ్రి దగ్గరకు వెళ్లిపోయినది. అక్కడ వాళ్లకు కూడా
ఏమీ చెప్పలేదు. కొన్నాళ్ళకు ఆమె వాలకము చూసి, తండ్రి అడిగితే,
ఆమె జరిగిన దంతా తండ్రికి చెప్పింది. తండ్రి, నీవు చేసినది మంచి
పద్దతి కాదు. నీవు నీ అత్తవారి ఇంట్లో, వాళ్ళ పద్దతుల ప్రకారమే
అలవాటు చేసుకొని, అక్కడే ఉండాలి. నా గురించి వాళ్ళు అనే
విషయము నేను వాళ్లకు చెప్పుకుంటాను. నీవు ఇలా పుట్టింటికి
రావటము తప్పు అని మందలించి, నీవు మీ అత్తవారింటికి
వెళ్లిపొమ్మని అని చెప్పాడు. ఆ అమ్మాయి వాళ్ళ అత్తవారి ఇంటికి
వెళ్ళిపోయింది.

328
ధర్మ వ్యాధుడు వీలు చూసుకొని, ఒకరోజు తన కుమార్తె
అత్తవారి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు చక్కగా ఆహ్వానించి,
పలకరించారు. భోజనము వేళ అయింది. అందరూ కూర్చొని
ఉన్నారు. భోజనము వడ్డించి తినటము మొదలుపెట్టా రు. ధర్మ
వ్యాధుడు అన్నము ముట్టు కోలేదు, చేతులు నలుపుకుంటూ
కూర్చొన్నాడు. వాళ్ళు చూసి భోజనము చేయండి అని అడిగారు.
అప్పుడు ధర్మ వ్యాధుడు “ఈ అన్నము తిని, నేను ఇంత హింస
చేయలేక పోతున్నానండి” అని అన్నాడు. దానికి వాళ్ళు ఇందులో
హింస ఏమి ఉంది. మీరు చేసే హింస కంటె ఇదేమీ హింస కాదు అని
వాళ్ళు అన్నారు. అప్పుడు ధర్మ వ్యాధుడు, నేను బోయ
కుటుంబములో పుట్టా ను. వేట నా కుల వృత్తి. నేను నా
కుటుంబమునకు అవసరము వరకే వేటాడి, అంతవరకే హింస చేస్తూ
జీవిస్తు న్నాను. కాని ఈ అన్నములో నాకు ఎంతో ఎక్కువ హింస
కనిపిస్తు న్నది. ధాన్యమును, మొలక నుండి తెంపిన దగ్గర నుండి,
ధాన్యమును దంచి, ఉడక పెట్టి ఈ అన్నము వండే వరకూ, ఆ
బియ్యమును ఆశ్రయించి ఎన్నో జీవులకు ఎంతో హింస జరిగినది.
అది నాకు కనిపిస్తు న్నది. అందుచేత ఈ అన్నమును నేను తినలేక
పోతున్నాను అని అన్నాడు. ధర్మ వ్యాధుడు చెప్పినది వాళ్లకు అర్ధము
కాక, ఆయన అన్న దానికి వివరముగా చెప్పమని ప్రార్థించారు.
అప్పుడు ధర్మ వ్యాధుడు, మన జీవితము నడవటానికి తెలిసో,

329
తెలియకో తప్పనిసరిగా ఎంతోకొంత హింస జరుగుతూనే ఉంటుంది.
మనము జీవించుటకు అవసరమైనంత వరకూ, శాస్త్రము మనకు
అనుమతించిన హింసను దాటి ఎక్కువ హింస చేసే ఆ ఎక్కువగా
చేసినది మాత్రమే హింస అవుతుంది. శాస్త్ర పరిమితి లోపల జరిగే
హింసలకు కొన్ని ప్రాయశ్చిత్తములు (పఞ్చసూనా – జంతువులను
చంపే దోషములకు - పంచ యజ్ఞములు) చేసుకోవలసి ఉన్నది.
అలా శాస్త్రీయమైన మార్గములలో పోగొట్టు కోవచ్చు. ఇది విన్న
తరువాత వాళ్ళు హింస గురించి అర్ధము చేసుకొని, వాళ్ళు చేసిన
తప్పులకు క్షమించమని ప్రార్థించారు.

కామక్రోధవియుక్తా నాం యతీనాం యతచేతసాం।


అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం ॥ 26 ॥

కామము (కోరికలు), క్రోధము మొదలైన దుర్గుణములను


పూర్తిగా విడిచి పెట్టు కొని (లేశ మాత్రము కూడా లేకుండా)
పరిశుద్దముగా ఉన్న వాళ్ళు, యతీశ్వరులు (నిరంతరము తత్త్వ
జ్ఞానము పొందుటకు ప్రయత్నము చేసే వాళ్ళు), చిత్తమును
(చేతనము, స్మరణ శక్తిని, అహంకారము, బుద్ధి, మనస్సును)
అదుపులోకి తీసుకున్న వాళ్ళు,
ఆత్మ తత్త్వ జ్ఞానము తప్పకుండా పొందుతారు. వారికి ఈ
శరీరము ఉన్నప్పుడు, ఈ శరీరమును విడిచిపెట్టిన తరువాత సమస్త

330
దుఃఖములను, కష్టములను శాంతింపచేసుకొని, కేవలము బ్రహ్మ
స్వరూపముగా ఉండి, మోక్షము అనే పరమానందమును
అనుభవిస్తూ ఉంటారు. శరీరము ఉన్నంత వరకూ జీవన్ ముక్తు లుగా
ఉంటూ, శరీరము వదిలిన తరువాత విదేహ ముక్తు లు అవుతారు.

కామ, క్రోధములు పూర్తిగా విడిచిపెట్టు కోలేకపోతే, వాళ్లకు


తెలియకుండానే, ఎప్పుడో ఒకప్పుడు అవి విజృంభిస్తా యి.
అందుచేత వాటిని మాత్రము పూర్తిగా నిర్మూలించుకోవాలి.

ఉదాహరణ:

ఇక్ష్వాక వంశములో కల్మషపాదుడు అనే మహారాజు చాలా


మంచి ధార్మికుడు, తపస్ సంపన్నుడు, సత్కర్మలు చేసుకొని కొంత
సిద్ధు లను పొందినవాడు. వశిష్ట మహర్షి ఇక్ష్వాక వంశమునకు కుల
గురువు. ఒక సందర్భములో కల్మషపాదుడు, వశిష్ట మహర్షిని
భోజనమునకు ఆహ్వానించాడు. వశిష్ట మహర్షి భోజనము చేస్తూ
ఉండగా, భోజనములో వెంట్రు క పడింది అని అన్నారు. అన్నములో
వెంట్రు క పడుట మంచిది కాదు. అప్పుడు ఆ వెంట్రు కను తీసివేసి,
అన్నమును ఆవు నేతితో అభికరించిన తరువాతే తినాలి. కాని
కల్మషపాదుడు అలా వెంట్రు క పడటానికి అవకాశము లేదు అని
జవాబు చెప్పాడు. అలా వాళ్ళ మధ్య మాట, మాట పెరిగి వశిష్ట

331
మహర్షి, గురువునైన నన్ను కాదని ధిక్కరిస్తవా అని కోపము వచ్చి,
12 సంవత్సరములు బ్రహ్మ రాక్షసుడి ఉండు అని కల్మషపాదుడిని
శపించారు. కల్మషపాదుడు కూడా వశిష్ట మహర్షిని శాపించాలని
నీళ్ళు తీసుకొని మంత్రించిన సమయములో, ఆయన భార్య వచ్చి
మీరు గురువులను అలా శపించకూడదు అని నివారిస్తే, ఆ
మంత్రించిన నీళ్ళు తన కాళ్ల మీద పడితే అక్కడ కల్మషపాదుడి కాళ్లు
నల్లగా అయిపోయింది. ఆ రోజు నుండి ఆయనకు కల్మషపాదుడు
(పాదము మీద నల్లని కల్మషము ఉన్నవాడు).

అంతకు ముందే విశ్వామిత్రు డు రాజుగా ఉన్న


సమయములో, వశిష్ట మహర్షి దగ్గర్న ఉన్న నందిని అనే
కామధేనువుని తనకు ఇవ్వమని అడిగాడు. వశిష్ట మహర్షి
ఇవ్వలేదని కోపముతో విశ్వామిత్రు డు, వశిష్ట మహర్షి ఆశ్రమము మీద
యుద్దము ప్రారంభించాడు. అప్పుడు నందిని నుండి అనేక వేల
సైన్యము వచ్చింది. చాల పెద్ద యుద్దము జరిగింది, ఆ యుద్ధములో
వశిష్ట మహర్షి యొక్క వంద మంది కుమారులు మరణించారు.

కల్మషపాదుడు బ్రహ్మ రాక్షసిగా మారిపోయాడు. వశిష్ట


మహర్షి యొక్క మిగిలిన ఒక్క కుమారుడు శక్తి సమిధలు కోసము
అడవిలోకి వెళ్ళగా, బ్రహ్మ రాక్షసిగా మారిన కల్మషపాదుడు అడవిలో
మింగేశాడు. అప్పటికి సిద్ధు డైన శక్తి మహర్షి యొక్క భార్య, అతని

332
కుమారుడు పరాశర మహర్షి (అప్పటికి ఇంకా చిన్న పిల్లవాడు –
కాబోయే వేదవ్యాస మహర్షి తండ్రి) వశిష్ట మహర్షి ఆశ్రమములో
ఉన్నారు. తన వంద మంది పుత్రు లు చనిపోయినా, విశ్వామిత్రు డిని
ఏమీ అనని శాంత స్వభావమునకు ప్రతీక, బ్రహ్మ జ్ఞాని అయిన వశిష్ట
మహర్షి లాంటి వాళ్ళు కూడా, చిన్న వెంట్రు క అన్నములో వచ్చిన
దానికి తన క్షణికమైన కోపము యొక్క వేగమునకు లోనై, తనే
శాపము ఇచ్చిన కల్మషపాదుడు ద్వారా, తనకు మిగిలిన ఒకే ఒక్క
సిద్ధు డైన కుమారుడిని కూడా కోల్పోయాడు.

 స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రు వోః ।


ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ॥ 27 ॥

శరీరమునకు బయట ఉండే అన్ని ఇంద్రియ వస్తు వులను,


విషయములను బయటే విడిచిపెట్టేసి, స్థిరముగా సుఖ ఆసనమును
వేసుకొని, కనుబొమ్మల మధ్య మనస్సును కేంద్రీకరించి,

ముక్కు ద్వారా లోపలకి తీసుకుంటున్న, బయటకు


వదిలిపెట్టే వాయువును సమానముగా ఉండేలా (కుంభకము అనే)
ప్రాణాయామము ద్వారా

ఇందులో యోగ శాస్త్రము లోని రహస్యమును


చెప్పుతున్నాడు. ప్రాపించక వస్తు వులను, విషయములను
333
ఇంద్రియముల ద్వారా మన శరీరము లోనికి తీసుకు రాకుండా,
మనస్సులోకి ఆ వస్తు వులను, విషయములను చేరదీయకుండా,
బయటే ఉంచుటకు ప్రాణాయామమును చేయాలి. కళ్ళు
మూసుకుంటే నిద్ర వస్తుంది. కళ్ళు తెరిస్తే కంటి ద్వారా ప్రాపించక
విషయములు మనస్సులోకి వస్తా యి. కాబట్టి ఈ రెండూ లేకుండా
ఉండుటకు మన దృష్టిని కనుబొమ్మల మధ్యకు (భ్రూ మధ్య)
తీసుకురావాలి. ప్రాణాయామమును ప్రత్యాహారము అని అంటారు.
ప్రాణాయామము ద్వారా శరీరము, మనస్సు మన అదుపులోకి,
ఆధీనములోకి వచ్చి, మనస్సు కేంద్రీకృతము అయి, ధారణా శక్తి
పెరుగుతుంది. ప్రాణాయామము చేసిన తరువాత అనేక సిద్దు లు
కలిగి, అవి మనలో అహంకారమును పెంచి, యోగ సాధనకు
ఆటంకములు కలిగిస్తా యి. ఆ సిద్ధు లు మన లక్ష్యమును (పరమాత్మ
తత్త్వ జ్ఞానము) అడ్డు కోకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో పై
శ్లోకములో చెప్పుతున్నాడు. .

పతంజలి మహర్షి యోగ సూత్రములలో (2-29) – అష్టాంగ


యోగ సూత్రములు (8). అందులో 5 వ సూత్రము - ప్రత్యాహారము
(2-54) ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని బయటకు
పోకుండా మన హృదయము లోపలకి తీసుకు వచ్చే సాధన.
ప్రాపించక విషయముల నుండి ఇంద్రియములను మరలించుట.
ఇంద్రియ నిగ్రహము. (9-14 శ్లోకము చూడుము).
334
పతంజలి మహర్షి యోగ సూత్రములలో (2-46) – “స్థిర
సుఖ ఆసనము” – యోగ సాధనకు అనుకూలమైన ఆసనము.
కూర్చొన్న స్థలము హెచ్చు, తగ్గులు లేకుండా సమానముగా, కదల
కుండా స్థిరముగా ఉండాలి. శరీరమునకు ఏ విధమైన అసౌకర్యము
లేకుండా సుఖముగా ఉండే భంగిమలో కూర్చోవాలి.

బ్రహ్మ సూత్రములు - చతుర్థోపాధ్యాయము (ఫల


అధ్యాయము) - ప్రథమ పాదములో - 6. ఆసీనాధికరణములో - 7.
ఆసీన స్సంభవాత్ – యోగము అభ్యాసము చేయుటకు ఒక చోట
స్థిరముగా ఆసనము వేసుకొని కూర్చోవాలి.

పతంజలి మహర్షి యోగ సూత్రములలో (1-2) – “యోగష్


చిత్త వృత్తి నిరోధః” – మనస్సు చంచలము, ఒకచోట స్థిరముగా
ఉండదు. మనస్సు యొక్క స్వభావము ప్రాపించక విషయముల
కోసము బయటకు వెళ్ళుతుంది లేదా లోపలే ఉండి ఆ ప్రాపించక
విషయముల గురించి ఆలోచిస్తుంది. మనస్సు యొక్క ఆ ఆలోచనల
ప్రవాహమును ఆపుకోవాలి, నిరోధించాలి. దీనికి ప్రాణాయామము
ఒక్కటే మార్గము.

పతంజలి మహర్షి యోగ సూత్రములలో – 1-5 నుండి 1-


11 వరకు. 1-5 - మనస్సు యొక్క పరిణామము ఐదు
విధములుగా ఉంటుంది. 1-6 - 1. ప్రమాణ వృత్తి, 2. విపర్యయ
335
వృత్తి, 3. వికల్ప వృత్తి, 4. నిద్ర వృత్తి, 5.శ్మ్రు తి వృత్తి. 1-7 - ప్రమాణ
వృత్తి - బయట ఉండే వస్తు వులను, విషయములను ఉన్నది ఉన్నట్లు ,
సరిగ్గా అర్ధము చేసుకొనుట. 1-8 - విపర్యయ వృత్తి – ఆ
వస్తు వులను, విషయములను ఉన్నది లేనట్లు గా, లేనిది ఉన్నట్లు గా
అర్ధము చేసుకొనుట – భ్రమ పడుట. 1-9 - వికల్ప వృత్తి –
ఊహించుకొనుట, సందేహము. 1-10 - నిద్ర వృత్తి. 1-11 - శ్మ్రు తి
వృత్తి – ఆ వస్తు వులను, విషయములను జ్ఞాపకము ఉంచుకొనుట.

పతంజలి మహర్షి యోగ సూత్రములలో (2-49 నుండి 53


వరకు) – “ప్రాణాయామము” – నిశ్వాస, ఉచ్ఛ్వాస, ఉచ్ఛ్వాస
నిశ్వాసల మధ్య భాగము, బాహాభ్యంతర విషయక్షేపి - ఉచ్ఛ్వాస
నిశ్వాసలు దాటిన స్థితి.  

పతంజలి మహర్షి యోగ సూత్రములలో (3-1 నుండి 3-3


వరకు) “ధారణ” - ప్రాణాయామము ద్వారా మనస్సు మన
అదుపులోకి, ఆధీనములోకి వచ్చి, మనస్సు కేంద్రీకృతము అయి,
ధారణా శక్తి పెరుగుతుంది.

యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః ।
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ॥ 28 ॥

336
కర్మేంద్రియములను,జ్ఞానేంద్రియములను, మనస్సును,
బుద్ధిని నియంత్రించుకొని, అదుపులో పెట్టు కొని, పరమాత్మ గురించి
నిరంతరము మననము చేసుకుంటూ, ప్రధాన లక్ష్యమైన మోక్షము
కోసమే స్థిరమైన నిశ్చయముతో ప్రయత్నము, సాధన చేసుకోవాలి.

ఏ రకమైన సిద్ధు లు కలిగినా వాటిని తిరస్కరిస్తూ, ఏ రకమైన


కోరికలు, సుఖములు, భయము, కోపము లేకుండా ఉండే స్థితిని
సాధన చేసుకున్నవాడికి తత్త్వ జ్ఞానము కలిగినట్లే, ఎల్లప్పుడూ
ముక్తు డు అయిపోయినట్లే.

భోక్తా రం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం ।


సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ॥ 29 ॥

ఏకాగ్రతను సాధించిన యోగి, పరమాత్మ కోసము చేసే


యజ్ఞములకు, తపస్సులకు (సత్కర్మలకు) భోక్త పరమాత్మ, అన్ని
లోకములను సృష్టి కర్త, స్థితి (పాలకుడు), లయ (తనలో లీనము
చేసుకునేవాడు), ఈశ్వరుడు అని భావిస్తూ,

ఈ అన్ని లోకములు, జీవులు, వస్తు వులు అన్నింటికీ


సహృదయుడుగా, స్నేహితుడుగా (ప్రత్యుపకారము ఆశించకుండా,
హితము చేసేవాడు) తెలుసుకొని, ధ్యానము చేసుకున్నట్లయితే,
కష్టములు అన్నీ పూర్తిగా తొలగిపోయి, శాంతి లభిస్తుంది.
337
పరమాత్మను చాలా మంది చాలా విధములుగా
తెలుసుకుంటున్నారు, ధ్యానిస్తు న్నారు, పూజిస్తు న్నారు. కాని
చూడవలసిన, తెలుసుకోవలసిన, ధ్యానించే సరైన విధముగా
చేయుట లేదు. అందులో చాలా మంది కోరికలు తీర్చే దేవతగా
మాత్రమే తెలుసుకుంటూ, కోరికలు తీర్చమని ప్రార్థిస్తూ,
పరమాత్మకు ఏదో ఇస్తే లేదా చేస్తే, మన కోరికలు తీరుస్తా డనే
(వ్యాపారము) ఉద్దేశముతో పూజలు, సేవలు చేస్తు న్నారే తప్ప, ఈ
సృష్టి అంతా పరమాత్మే వ్యాపించి ఉన్నాడని, ఈ సృష్టిలో పరమాత్మ
తప్ప వేరొకటి లేదని, పరమాత్మనే పొందాలని, పరమాత్మ తప్ప
ఇంకొకటి అక్కర్లేదని చేస్తే ఉత్కృష్టమైన ఫలితము లభిస్తుంది.

కోరికలతో కపట ధ్యానము, పూజ, సేవలు చేసే వాటికి


కూడా చిన్న, చిన్న ఫలితములు తప్పకుండా ఉంటాయి.

ఉదాహరణ:
ఒక ఊళ్ళో దొంగ వెంట పోలీసులు పడుతున్నారని
పారిపోయి కాశీ క్షేత్రము చేరుకున్నాడు. ఆ రోజు సూర్య గ్రహణము
ఉన్నది. చాలా మంది భక్తు లు గంగా నదీ తీరములో, గంగలో
స్నానము చేసి, సాదువులకు బంగారము దానము చేస్తు న్నారు. అది
చూసి తన పని చాలా తేలిక అయిందని సంతోషించి, గంగా

338
స్నానము చేసి, సాధువు వేషము వేసుకొని, గంగా నదీ తీరములో
సాధువుల ప్రక్కనే కూర్చొని ధ్యానము చేస్తు న్నట్లు నటిస్తు న్నాడు.
అక్కడ ఒక భక్తు డు సాదువులకు బంగారము దానము చేస్తా అంటే,
ఆ సాదువులు ఒక్కొక్కళ్ళు నాకు వద్దు , బంగారము నేను ఏమి
చేసుకుంటాను నాకు వద్దు , సూర్య గ్రహణ సమయములో
బంగారము దానము తీసుకుంటే పాపము వస్తుంది నాకు వద్దు అని
నిజమైన సాదువులు నాకు వద్దు , నాకు వద్దు అని అంటూ ఉండగా,
ఆ దొంగ అవన్నీ ఏకాగ్రతతో వింటూ, తన వంతు వస్తోందని లోపల
సంతోషిస్తు న్నాడు. చివరికి అతని వంతు వచ్చింది. ఆ భక్తు డు
బంగారము దానము తీసుకోమని సాధువు వేషములో ఉన్న ఆ
దొంగను అడగగా, ఆ దొంగ తనకు తెలియకుండానే,
అప్రయత్నముగా మిగిలిన అందరి సాదువులు లాగ, నాకు వద్దు అని
అనేశాడు.

ఆ దొంగ చేసినది గంగా స్నానము, సాధువు వేషము, కపట


ధ్యానము, కొంత సేపు ఏకాగ్రత చేసిన మాత్రాన (మనస్సు లోపల
దొంగ బుద్ధి ఉన్నా) అతనికి తెలియకుండా, అతని మనస్సులో చిన్న
పరివర్తన కలిగి బంగారము నాకు వద్దు అన్నాడు. అందుచేత అవి
చిన్న, చిన్న పరివర్తనలు కలుగజేసి, చిన్న, చిన్న ఫలితములు ఇస్తా యి.

ఈ అధ్యాయము యొక్క సారాంశము:

339
సత్కర్మ ఆచరణ చేస్తూ, ఆ సత్కర్మల ఫలితములను
త్యజించి, ఆశించకుండా, అపేక్ష, కోరిక లేకుండా చేయాలి. ఆ
సత్కర్మలకు నేను కర్తను, నేను చేశాను అనే భావమును,
అహంకారమును విడిచిపెట్టు కోవాలి. కర్మల ఫలములను,
కర్తృత్వము, రాగ ద్వేషములను, అజ్ఞానమును విడిచిపెట్టు కోవాలి.

ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం


యోగశాస్త్రే శ్రీకృష్ణార్జు న సంవాదే
కర్మసంన్యాసయోగో నామ పంచమోఽధ్యాయః ॥ 5 ॥

మంగళా శ్లోకములు

యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః l

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రు వా నీతిమతిర్మమ ll

అధ క్షమా ప్రార్ధనా

యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ l తత్సర్వం క్షమ్యతాం


దేవ నారాయణ నమోస్తు తే ll

అధ భగవత్ సమర్పణమ్

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ l


కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ll
340
అధ లోకక్షేమ ప్రార్ధనా

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః l


సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ll

అధ మంగళమ్

శ్రియః కంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినామ్ l


శ్రీవేంకట నివాశాయ శ్రీనివాసాయ మంగళమ్ ll

కృష్ణ నామ సంకీర్తన

కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l


కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l

341
అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యానాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జు న సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోఽధ్యాయః
ll

శ్రీభగవానువాచ । అనాశ్రితః
కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ॥ 1 ॥

భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు l కర్మ


ఫలముల మీద ఆసక్తి లేకుండా, ఆశ లేకుండా, కోరక లేకుండా ధర్మ
మార్గములో తనకు విహితమైన, చేయవలసిన సత్కర్మలు ఎవరైతే
ఆచరిస్తా డో మరియు లౌకిక కర్తవ్యములను నిర్వర్తిస్తా డో

అటువంటి వాడిని నిజమైన సన్యాసి, యోగి అని


భావించాలి. కేవలము బద్ధకముతోనో లేదా భ్రమతోనో అగ్ని
ముఖముగా చేయవలసిన సత్కర్మలను విడిచిపెట్టినవాడు లేదా ఏ
విధమైన పుణ్య కర్మలు, లౌకిక కర్తవ్యములను చేయనివాడిని
సన్యాసి లేదా యోగి అని అనకూడదు.

నాకు విహితమయిన కర్మ, నా కర్తవ్యము నేను


చేయవలసినదే అని సత్కర్మలు చేసే వాడికి, కోరికలు లేకుండా,
ఫలముల మీద ఆశ్రయము, ఆసక్తి, లేకుండా సత్కర్మలు చేసేవాడికి
ఉన్నత స్థితి కలుగుతుంది (అతడు నిజమైన సన్యాసి, నిజమైన

342
యోగి, ధ్యాన యోగము యోగ్యత కలిగినవాడు). కోరికలతో కర్మ
ఫలితము కోసము కర్మలు చేసేవాడు కర్మ ఫలమును
ఆశ్రయించుకొని ఉన్నవాడు ఫలితము కోసము ఏదైనా చేస్తా డు.
అటువంటి వాడికి ఉన్నత స్థితి ఉండదు. కర్మల ఫలితము - జన్మ –
కర్మ – పునర్జన్మలలో తిరుగుతూ ఉంటాడు.

సన్యాసము అనగా నిజమైన వైరాగ్యము కలిగి, ప్రాపించక


విషయములను విడిచిపెట్టు కొనుట. కర్మ ఫలముల మీద ఆసక్తి
లేనివాడు కూడా వైరాగ్యముతో ప్రాపించక విషయములను,
కోరికలను విడిచిపెట్టినవాడే, అందుచేత అతడు నిజమైన సన్యాసి.

అతడు నిజమైన యోగి కూడా. యోగి అనగా “చిత్త వృత్తి


నిరోధః” 5-27 శ్లోకములో వివరించినట్లు గా, మనస్సులో ఏ రకమైన
విక్షేపములు, అడ్డంకులు లేకుండా, మనస్సును శుద్ధ పరచుకుని,
ఏకాగ్రతతో ఒకే లక్ష్యమైన పరమాత్ముడిని ధ్యానించగల సామర్థ్యము
ఏర్పడుట. సాధారణ మానవులకు కర్మ ఫలితముల మీద ఆసక్తి
ఉండుట వలన, మానవుల అసలైన ముఖ్యమైన లక్ష్యము
(పరమాత్మ, మోక్షము) మీద ఆసక్తి ఉండుట లేదు. ఎవకైతే కర్మ
ఫలముల మీద ఆసక్తి లేదో, జీవుడికి, పరమాత్మకు మధ్య అడ్డముగా
ఉండే ప్రాపించక ఫలాశక్తి లేనందువలన, అతని మనస్సు పరిశుద్ధమై,
మానవ జీవితము యొక్క పరమ లక్ష్యమైన తత్త్వ జ్ఞానము మీద

343
ఆసక్తి కలుగుతుంది. కర్మ ఫలముల మీద ఆసక్తి ఉన్నవాళ్లకు, ఆ
ఫలములో కోసము, కర్మల మీదే ఆసక్తి కలుగుతుంది. పరమాత్మ
తత్త్వము మీద ఆసక్తి కలగదు. దీనికి ముఖ్య కారణము, మనస్సు
అలజడితో కదిలిపోతూ, పరిశుద్ధముగా లేనందునే. ఏ విషయము
మీదైనా సరే చెప్పినది అర్ధము చేసుకోవాలంటే, మనస్సులో ఏ
అలజడి లేకుండా, శాంతముగా, స్థిరముగా ఉన్నప్పుడే ఆ
విషయము అర్థమవుతుంది. మనస్సు శాంతముగా, స్థిరముగా
లేకపోతే మనస్సు ఆ విషయము మీద కేంద్రీకరించలేక, అర్ధము కాక
ఆ విషయము మీద ఆసక్తి కలగదు.

ఉదాహరణ:
ఉత్తముడు అనే రాజుగారు చాలా ఉత్తముడు, రాజ
కుటుంబమునకు చెందని, ఒక సామాన్యమైన కుటుంబములో
అమ్మాయిని ప్రేమించి, వివాహము చేసుకున్నాడు. ఆ అమ్మాయికి
రాజ కుటుంబములో, రాజ మర్యాదలతో, రాజ గౌరవములతో ఎలా
వ్యవహరించాలో తెలియదు. కొత్తగా రాణి అయిన ఆ అమ్మాయి,
రాజుగారిని ప్రేమించే సమయములో పిలిచినట్లు , ఏక వచనముతో
పిలిచేది. అది ఆ రాజ కుటుంబములో ఇతరులకు, రాజుగారిని
అగౌరవించినట్లు అనిపించేది. అది రాజుగారికి కొంచము ఇబ్బందిగా
ఉండేది. కొన్నాళ్ళకు రాజుగారు మానసిక అశాంతికి లోని, ఆమె
ప్రవర్తనను సహించలేక, ఆమెను తీసుకు వెళ్లి అడవిలో వదిలిపెట్టా రు.
344
ఆ దగ్గరలో ఒక మహర్షి ఆశ్రమము ఉంటే, ఆ మహర్షిని
పలకరించాలని ఆ మహర్షి ఆశ్రమమునకు రాజుగారు వెళ్ళారు. ఆ
మహర్షి ఆ రాజుగారిని ఆహ్వానించటానికి, కాళ్లు కడుక్కుందుకు
అర్ఘ్యము ఇవ్వటానికి ముందుకు వెళ్ళుతుంటే, ఆ ప్రక్కనే ఉన్న ఆ
మహర్షి యొక్క శిష్యుడు, ఆ మహర్షి చెవిలో, ఈ రాజుగారు, తాను
ప్రేమించి, వివాహము చేసుకున్న భార్యను అడవిలో వదిలి పెట్టేశాడు.
అందుచేత ఈ రాజుగారు అధర్మముడు, పాపాత్ముడు, ఇతడు
అర్ఘ్యమునకు అర్హుడు కాడు అని చెప్పాడు. అప్పుడు మహర్షి నీవు
చెప్పినది నిజమే, కాని ఇతడు ఉత్తముడు. రాజుగా ఇతరులకు
ఆదర్శముగా ఉండవలసినవాడు, తెలిసో లేదా తెలియకో అతడు
తన భార్యను వదిలేసి, చాలా పెద్ద తప్పు చేశాడు. కాని ఆమె ప్రవర్తన
వలన, రాజ్య పాలన సవ్యముగా జరగట లేదని భావముతో,
మానసిక అశాంతికి గురి అయి, మనస్సులో అలజడి కలిగి, ఇదే
పరిహారము అని అనుకొని ఇలా చేశాడు. మనము సరిగ్గా నచ్చ
చెప్పితే అర్ధము చేసుకుంటాడు, అని శిష్యుడితో చెప్పి, తన చేతిలో
ఉన్న చెంబు ప్రక్కన పెట్టేశాడు. రాజుగారు అది చూసి, మీరు నాకు
అర్ఘ్యము ఇస్తుంటే, మీ శిష్యుడు ఎందుకు వద్దంటున్నాడు అని
అడిగాడు. అప్పుడు మహర్షి, నీవు నీ భార్యను అడవిలో వదిలివేసావు.
నీవు అధర్మము, పాపము చేసావు. అందుచేత నీకు అర్ఘ్యము
ఇవ్వకూడదు. భార్య ఎంత అసౌకర్యముగా నడచుకున్నా, ఎన్ని

345
ఇబ్బందులు పెట్టినా సరే, ఆమెను సరైన దారిలో మార్చుకునే
ప్రయత్నము చేసుకోవాలి. కాని అలా విడిచిపెట్టటము అనేది, మన
సంప్రదాయములో లేనేలేదు. రాజుగా నీవు, నీ ప్రజలకు ఆదర్శముగా
ఉండాలి. నీవే ఇలా చేస్తే, ఇంక నీ ప్రజలు కూలా నీలాగే చేస్తా రు.
అప్పుడు మానవులకు సంస్కృతీ చిహ్నముగా ఉన్న మన వివాహ
వ్యవస్థ దెబ్బతిని, రాజ్యములో అరాచకము పెరిగిపోతుంది. ఇప్పటికే,
మీ భార్యను ఒక రాక్షసుడు ఎత్తు కుపోయాడు. దైవవశాత్తు ఆ
రాక్షసుడి కుమార్తె, నీ భార్యను తన గదిలో పెట్టు కొని, ఆమెను ఆ
రాక్షసుడి నుండి రక్షిస్తోంది. నీవు వెంటనే వెళ్లి, నీ భార్యను ఆ
రాక్షసుడి చెర నుండి విడిపించి, ఇక్కడకు తీసుకురా. అంతవరకు
నీకు అర్ఘ్య, పానములు ఇవ్వను అని చెప్పాడు.

ఉత్తమ మహారాజు, మహర్షి చెప్పినది, తన తప్పును అర్ధము


చేసుకొని, వెంటనే వెళ్లి ఆ రాక్షసుడిని సంహరించి, తన భార్యను
తీసుకొని, అ మహర్షి దగ్గరకు వచ్చాడు. ఈ సారి మహర్షి ఆ ఇద్దరికీ
అర్ఘ్య, పానములు ఇచ్చి, ఆ అమ్మాయిని కూర్చోపెట్టి, అందరి
ముందు నీ భర్త అయిన మహారాజును రాజ గౌరవము, రాజ
మర్యాదలు ప్రకారముగా గౌరవముగా వ్యవహరిస్తే, అందరి ముందు
నీ భర్త గౌరవము ఉంటుంది. ఆ రాజ మర్యాదలు నీకు
తెలియకపోతే, అక్కడ ఉండే కంచుకిలు (మహారాణి
అంతఃపురములో ఉండే సేవకులు) నుండి అడిగి నేర్చుకొని, నీవు నీ
346
భర్తతో గౌరవముగా ప్రవర్తించాలి. తరువాత ఆ మహారాజుకు కూడా
తన భార్య మీద ఎల్లప్పుడూ ప్రేమతో వ్యవహరించమని చెప్పి, ఇద్దరు
పరస్పరము ప్రేమతో, గౌరవముగా వ్యవహరించాలని ఉపదేశము
చేశాడు ఎవ్వరూ లేనప్పుడు మీ మధ్య వ్యవహారము మీ ఇష్టము
అని ఆ ఇద్దరికీ నచ్చ చెప్పాడు. మీ మధ్య పూర్వము వలే ప్రేమ
చిగురించుటకు, పునఃరుద్దించుటకు నేను మైత్రి యాగము చేస్తా ను
అని అన్నారు. ఆ రాజ దంపతులు ఆ మహర్షి ఉపదేశము చక్కగా
విన్నారు. తరువాత ఆ మహర్షి మైత్రి యాగము చేశాడు. తరువాత
ఆ రాజ దంపతులు సుఖముగా చాలా కాలము జీవించారు.
ఈ కధలో భార్య, భర్తల మధ్య ఇద్దరూ ప్రేమతో, గౌరవముగా
ప్రవర్తన ఎలా ఉండాలో అనే విషయము గురించి అందరికీ తెలిసిన
విషయమే. ఈ రోజులలో ఆ విషయములు కూడా జాగ్రత్తగా
అందరూ తెలుసుకొని ప్రవర్తించాలి. కాని ఇందులో గమనించవలసిన
ముఖ్యమైన విషయము, మానసిక అశాంతికి గురి అయినప్పుడు,
సాధారణమైన విషయములు కూడా మనస్సుకు తోచదు, అర్ధము
కాదు. సాధారణ మానవుడు, ప్రాపించక విషయముల మీద కోరికల
ప్రభావముతో, మానసిక వత్తిడులకు గురి అవుతూ, మనస్సు
అల్లకల్లోలమై, అశాంతికి గురి అయినప్పుడు, అతి సంక్లిష్టమైన,
పరమాత్మ తత్త్వము మీద ఆసక్తి పుట్టదు, ఒకవేళ పుట్టినా అర్ధము
చేసుకునే మానసిక స్థితి ఉండదు. పరమాత్మ తత్త్వము మీద ఆసక్తి

347
కలిగి, అర్ధము చేసుకునే స్థితి కలగాలంటే పరిపూర్ణమైన మానసిక
పరిపక్వత, పరిశుద్ధత, స్థిరత్వత, ప్రశాంతత ఉన్నప్పుడే
కలుగుతుంది.

 యం సంన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ ।


న హ్యసంన్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన॥2॥

పాండురాజు కుమారుడైన ఓ అర్జు నా I దేనినైతే సన్యాసము


అని అంటారో, దానినే యోగము అని కూడా అంటారు. సన్యాసము,
యోగము వేర్వేరు కాదు, రెండూ ఒక్కటే అని అర్ధము చేసుకో.

యోగి సర్వ సంకల్పములు (ఈ ఫలితము నాకు కావాలి అనే


కోరికలు, దానికి నేను ఈ కర్మ చేయాలి అనే సంకల్పములు)
త్యాగము చేయాలి. అటువంటి సంకల్పములను
వదులుకోలేనివాడు యోగి కాలేడు. సన్యాసి కూడా కాలేడు.

సన్యాసము అంటే సర్వ సంకల్ప సన్యాసము. అన్ని కర్మ


ఫలములు నాకు దక్కాలి అనే సంకల్పమును, ఏ రకమైన
బంధనములు లేకుండా అన్నీ విడిచిపెట్టు కొనుటే సన్యాసము.
సంకల్పములు లేకపోతే, కోరికలు తగ్గే పరిస్థితి వస్తుంది. అప్పుడు
నిష్కామ కర్మ ఆచరించి, మనస్సును శుద్ధి చేసుకుంటే, ధ్యాన
గోకము, తరువాత తత్త్వ జ్ఞానము కలుగుతుంది. సంకల్పము
348
లేకపోతే, ఒక వైపు నిష్కామ కర్మ ఆచరణ, మరొక వైపు సన్యాసము
ఈ రెండూ ఏక కాలములో సిద్ధిస్తా యి.

యోగము అంటే నిష్కామ కర్మ ఆచరణ లేదా సమతా


భావముతో, రాగ ద్వేషములు లేకుండా సత్కర్మ ఆచరణ. యోగ
శాస్త్రములో చెప్పినది “చిత్త వృత్తి నిరోధము” – మనస్సులో ఏ
రకమైన ఆలోచనలు, అలజడిలు లేకుండా, మనస్సును
ప్రశాంతముగా ఉంచుకొనుట. మనకు వచ్చే ఆలోచనలు, ప్రాపించక
వస్తు వులు మనస్సును అలజడిలతో కల్లోల పరుస్తుంది. మనస్సును
స్థిరముగా ఉండకుండా, అశాంతికి లోను చేస్తుంది. మనస్సును
ఏకాగ్రత చేయలేని స్థితి కలిగిస్తుంది. దీనిని యోగ శాస్త్రములో “చిత్త
విక్షేపములు” అంటారు. మనస్సు ప్రధానమైన విషయముల వైపు
నుండి అనవసరమైన విషయముల వైపు మళ్లు తుంది. అనవసరమైన
ప్రాపించక విషయముల నుండి మనస్సును మళ్లించి, చిత్త
విక్షేపములను తొలగించి, మనస్సును స్థిరముగా ఉంచుకొని,
ఏకాగ్రతను సంపాదించుకొని, మానవులకు ప్రధాన లక్ష్యమైన
పరమాత్మ తత్త్వ జ్ఞానము వైపు మరల్చుకోవాలి. అప్పుడే తత్త్వ
జ్ఞానము అర్ధము చేసుకోగలిగే సామర్థ్యము ఏర్పడుతుంది.

“కామ జానామియతే మూలం సంకల్పాత్ కిలజాయతే


అతో న సంకల్పతే ఇష్యామి” – ఓ కోరికా నీ మూలము నాకు

349
తెలుసు, నీవు ఎలా పుడతావో నాకు తెలుసు. సంకల్పముతో
(బాగుంది లేదా బాగా లేదు అనే విచారణతో) నీవు (కోరిక)
పుడతావు. కాబట్టి నేను ఆ సంకల్పము, విచారణ చేయకుండా
ఉండి, నీకు పుట్టే అవకాశమే ఇవ్వను.

 ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే ।


యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ॥ 3 ॥

ధ్యాన యోగము (చిత్త వృత్తి నిరోధము) అనే మెట్టు ను


ఎక్కదలచుకున్నవాడికి, చెయ్యాలి అనే కోరిక ఉన్నంతవరకూ
నిష్కామ కర్మ ఆచరణ కారణము.

ఒక్కసారి యోగము అనే మెట్టు ఎక్కగలిగే సామర్ధ్యము


సిద్ధించిన తరువాత, ఈ సత్కర్మలను ఉపరతి, ఉపశమము (సర్వ
కర్మ సన్యాసము, విడిచిపెట్టు కొనుట) కారణము అవుతుంది.
యోగ సాధకులు మొదటి మెట్టు గా మరియు మొదటి
మెట్టు మీద స్థిరముగా ఉన్నంత వరకూ రాగ ద్వేషములు లేకుండా,
సమతా భావముతో నిష్కామ కర్మ (సత్కర్మములు) చేయవలెను.
నిత్యానిత్య వస్తు వివేకము, లక్ష్యము కోసము మననము
చేసుకుంటూ సత్కర్మ ఆచరణ చేస్తూ ఉంటే, వైరాగ్యము కలిగి,
రెండవ మెట్టు మీద కాలు పెట్టే యోగము కలుగుతుంది. రెండవ

350
మెట్టు మీద కాలు పెట్టిన తరువాత, సత్కర్మలను సన్యాసము
చేసుకొని, ధ్యాన యోగము అనే రెండవ మెట్టు మీద స్థిరముగా
ఉండవలెను. ఒక్కసారి పై మెట్టు ఎక్కిన తరువాత, అక్కడ నుండి
క్రిందకు దిగజారకుండా వివేక యుక్తమైన మన మనస్సుతోనే
చేసుకోవాలి. ఈ ఉద్దరణ కార్యక్రమములో, మన ఆత్మ మరియు
మన మనస్సు మనకు బంధువులు అవుతారు.

ఉదాహరణ:
ఒక రైతు తన కుమారుడుకు వ్యవసాయము ఎలా చేయాలో
నేర్పిస్తు న్నాడు. పొలమునకు తీసుకు వెళ్లి, బీడు భూమిని చూపించి,
ఇప్పుడు నెల గట్టిగా బీడు కట్టి ఉండు. నెల మెత్త బడుటకు
ముందు భూమిని దున్నాలి అని చెప్పి, ఇద్దరూ కలిసి భూమిని
దున్నారు. భూమి కొంత మెత్తబడిన తరువాత నీళ్ళు పెట్టి మరలా
దున్నారు. తరువాత పిల్లవాడు పొలమునకు రాలేదు. తండ్రి
బీజములు నాటాడు. కొన్ని రోజుల తరువాత పిల్లవాడు పొలమునకు
ముందుగా వచ్చి పొలమును దున్నుతున్నాడు. అప్పుడు తండ్రి
వచ్చి, పిల్లవాడితో నేను బీజములను నాటాను, ఇప్పుడు పొలమును
దున్న కూడదు అని చెప్పాడు – “ప్రాత్ బీజా వాపాత్ కర్షణం,
తదనంతరం ఆకర్షణం” - బీజము నాటే వరకూ భూమిని దున్నాలి.
బీజము నాటిన తరువాత భూమిని దున్న కూడదు.

351
అలాగే యోగ బీజములు మనస్సులో చల్లు కొని,
నాటుకునేంతవరకు, సత్కర్మ ఆచరణ చేస్తూ మనస్సును
పరిశుద్దపరచుకోవలెను. మనస్సును శుద్ధము చేసుకొని, వైరాగ్యము
కలిగి, ప్రాపించక విషయముల మీద ఆసక్తి, కోరికలు విడిచిపెట్టు కొని,
పరమాత్మ అనే లక్ష్యము మీద ఏకాగ్రత కలిగిన తరువాత మనస్సులో
ఏ రకమైన ఆలోచనలు, కదలికలు, అలలు కలగకుండా ఉండుటకు,
సత్కర్మ ఆచరణలను ఆపుకొని, యోగమును దృఢము చేసుకొని
యోగాభ్యాసము చేయవలెను.

యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే ।


సర్వసంకల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ॥ 4 ॥

ఇంద్రియములు ప్రాపించక వస్తు వులతో, విషయములతో


సంపర్కము ఉండికూడా, ఎప్పుడైతే ఆ వస్తు వులు లేదా విషయముల
మీద ఆసక్తి, కోరిక, సంబంధము కలగదో, కర్మ ఫలములు కావాలి
అనే కోరిక పూర్తిగా తొలగిపోతుందో, ఇంద్రియములు, గుణములు
చేసే కర్మలు నేను చేస్తు న్నాను అనే భావన కలగదో,

మనస్సులో ఏ రకమైన సంకల్పము (అనుకూలమైనది


లేదా ప్రతికూలమైనది అనే భావన) ఎప్పుడైతే ఉండదో, లోపల,
బయట ఏ వస్తు వుతో, విషయముతో, కర్మలతో సంబంధము

352
లేకపోయినట్లయితే, అప్పుడు యోగాభ్యాసము చేయుటకు అర్హత
కలిగినట్లు .

ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।l 5 l।

పైన చెప్పిన స్థితి కలిగిన తరువాత, తనకు తాను తీవ్రమైన


సాధన చేసుకుంటూ, తనను తాను పై, పైకి తీసుకు వెళ్ళాలి. తనను
తాను ఎప్పుడూ క్రిందకు దిగజార్చుకోకూడదు.

ఆ స్థితిలో ఎవరైతే పై, పై స్థా యికి వెళ్ళుటకు వివేక


విజ్ఞానముతో సాధన చేసుకుంటారో, అప్పుడు ఎవరికి వారే
బంధువులు. ఎవరైతే తనను తాను క్రింద స్థా యికి
దిగజార్చుకుంటారో, అప్పుడు ఎవరికి వారే శత్రు వులు అవుతారు.

వివేక విజ్ఞానము కలిగిన మనస్సుతో, మన ఆత్మ


స్వరూపమును పైకి తెచ్చుకోవాలి. మనస్సును ప్రాపించక
విషయముల నుండి విడకొట్టు కొని, మనస్సుతో, మనస్సుకు
సహాయము చేసుకొని, మనస్సుతో, మనస్సుని ప్రాపించక
విషయముల నుండి వెనక్కు లాక్కోవాలి. ఈ విషయము సామాన్య
జీవితములో కూడా, ఏ, ఏ విషయములలోనైనా, ఏ మెట్టు లోనైనా
సరే వర్తిస్తుంది. ఈ విషయములో మనకు మనమే బంధువులము.
353
బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః।
అనాత్మనస్తు శత్రు త్వే వర్తేతాత్మైవ శత్రు వత్ ॥6॥
ఎవరికైనా తన ఆత్మ తనకు బంధువుగా ఉండాలంటే,
ముందు వివేకముతో తన శరీరమును, ఇంద్రియములను,
మనస్సును, బుద్ధిని నియంత్రించుకొని, గెలుచుకొని ఉంటే, వాడి
ఆత్మ, శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వాడికి బంధువుగా
ఉంటాయి.

అలా తన శరీరమును, ఇంద్రియములను, మనస్సును,


బుద్ధిని నియంత్రించుకోలేని, గెలుచుకోలేని వాడి ఆత్మ వాడికి
శత్రు వుగా అయిపోతుంది.

శరీరమును, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని


అదుపులో పెట్టు కుంటే, మనస్సు, బుద్ధి వివేకముతో ప్రవర్తించి,
ఇంద్రియములను, శరీరమును ఆ విధముగా నడిపిస్తా యి. అప్పుడు
ఆ వ్యక్తి అభివృద్ధికి సహాయపడి, ఉత్తమ స్థితికి తీసుకువెళ్ళుతాయి.
అందుచేత ఇవి బంధువులు క్రింద లెక్క. లేకపోతే ఆ మనస్సు, బుద్ధి,
ఇంద్రియములు, శరీరము ఆ ఆత్మకు శత్రు వులు వలె ప్రవర్తిస్తా యి.
అప్పుడు తనకు, తానే శత్రు వు అవుతాడు. ఈ విషయము సామాన్య

354
మానవుల దగ్గర నుండి, యోగాభ్యాసము చేసే వాళ్ళ వరకూ, అన్ని
వర్గములకు అన్ని పరిస్థితిలలోనూ వర్తిస్తుంది.

ఉదాహరణ:

భారవి గొప్ప సంస్కృత మహాకవి. ఆయన


కిరాతార్జు నీయం అనే మహా కావ్యమును వ్రాశారు. నీతి శాస్త్రములో,
వర్ణనలో, కల్పనలో అన్నిటిలోనూ మహాకవి, మేధావి. భారవి చిన్న
వయస్సులోనే అతని చుట్టూ ఉన్న ప్రతిఒక్కరూ ఆయనను
మేధావిగా గుర్తించారని అంటారు. ప్రతి ఒక్కరూ ఆయని కవితలు
మరియు రచనలను ఇష్టపడేవారు మరియు ఆరాధించేవారు.
ఆయన చాలా మందికి స్ఫూర్తిదాయకముగా ఉండేవారు. అందరూ
ఆయనను గౌరవించేవారు, సన్మానించేవారు. కాని భారవి గారి తండ్రి
మరియు గురువు కూడా, మాత్రము భారవిని గౌరవించటము,
సన్మానించటము ఒప్పుకోవట లేదు. వాడికి ఏమీ తెలియదు అని
అనేవారు. ఇది భారవిగారిని పూర్తిగా నిరాశపరిచింది. భారవికి తన
తండ్రి ప్రోత్సాహము లభించినందున, ఆయన నిరాశ త్వరలో వేదనగా
మారింది. చివరికి భారవిగారికి, అందరూ తనని గౌరవిస్తు న్నందుకు,
తన తండ్రి తన మీద అసూయ పడుతున్నాడు అని అనిపించింది.
భారవి గారి గౌరవము పెరుగుతుంటే, తన తండ్రి యొక్క
తిరస్కారము కూడా అలాగే పెరిగిపోయింది. ఈ విషయము

355
అందరికీ కూడా తెలిసిపోయింది. చివరికి భారవిగారికి, తన తండ్రి
మీద కోపము, ద్వేషము పెరిగి, ప్రతీకారము తీర్చుకోవాలి అనే
అభిప్రాయము కలిగింది (పేరు గడించాలనే కోరిక, తండ్రి మీద అది
ద్వేషము, క్రోధముగా మారి, ప్రతీకార రూపము దాల్చింది). రాత్రి
తండ్రి పడుకుండగా, ఆయన తల మీద పెద్ద బండరాయి వేసి
చంపెయ్యాలని, బండరాయి పట్టు కొని, గోడ వెనక నక్కి ఉండగా,
తల్లి భర్తతో మన పిల్లవాడిని అందరూ గొప్ప పండితుడు అని
మెచ్చుకుంటుంటే, మీరెందుకు అది ఒప్పుకోవట లేదు, వాడిని అలా
ఎందుకు తిరస్కస్తు న్నారు అని అడిగింది. దానికి ఆయన “ప్రత్యక్షే
గురువు స్తు త్యాః, పరోక్షే మిత్ర బంధువాః, న కదాచన పుత్రకాః” –
గురువులను, మన కంటె పెద్దవాళ్లను ఎదురుగుండా, ప్రత్యక్షముగా
పొగడవలెను. మిత్రు లను, బంధువులను వాళ్ళు లేనప్పుడు
(పరోక్షముగా) పొగడవలెను. కాని పుత్రు లను ప్రత్యక్షముగా మరియు
పరోక్షముగా కూడా పొగడకూడదు. తల్లితండ్రు లు అలా వాళ్లను
స్తు తి చేసే వాళ్లకు ఆయువు క్షీణిస్తుంది, వాళ్లకు శ్రేయస్సు కూడా
కాదు. మన కుమారుడు గొప్ప విద్వాంసుడు, మేధావి అని నాకు
కూడా తెలుసు. ఇతరులు వాడిని పొగుడుతుంటే నాకు లోపల
ఆనందముగానే ఉంటుంది. వాడు ఇంత కంటె ఇంకా ఉన్నత స్థితికి
వెళ్ళాలి అనేదే నా కోరిక. నేను కూడా వాడిని పొగిడితే, వాడు పై
స్థా యికి వెళ్ళుటకు ప్రయత్నము చేయడు. అందుచేత నేను

356
వాడికేమీ తెలియదు అని అంటే, వాడు ఇంకా ఎక్కువ ప్రయత్నము
చేసి ఇంకా పై స్థా యికి వెళ్ళతాడు అనే ఉద్దేశముతో నేను అలా
అంటున్నాను అని అన్నాడు. తండ్రి పైన చెప్పిన శ్లోకము భారవికి
కూడా వచ్చు, తెలుసు. కాని కోపము వస్తే, వివేకము కోల్పోయి,
మనస్సు వివేకముతో ఆలోచించలేదు, తెలుసున్నవి కూడా గుర్తు కు
రావు. ఎవరైనా మంచి సలహా ఇచ్చిన, మనస్సు స్వీకరించదు.
అటువంటి సందర్భములలో తనకు తానే శత్రు వు అయిపోతాడు.

అది అంతా విన్న భారవి, తన వివేకము కోల్పోయి, తండ్రి


మీద పెంచుకున్న ద్వేషము, కక్షకు తానే సిగ్గుపడుతూ,
నిందించుకుంటూ ఆ బండరాయిని బయట పారేసి, తండ్రి దగ్గరకు
వెళ్లి, “నాన్నా, తండ్రి మీద బండరాయి వేసి చంపాలనుకున్న వాడికి
ప్రాయశ్చిత్తము ఏమిటి?” అని అడిగాడు. తండ్రి విషయము
అర్ధము చేసుకొని, దానికి పశ్చాత్తా పమే ప్రాయశ్చిత్తము అని
అన్నాడు. కాదు, కాదు అదేదో వివరముగా నాకు చెప్పాలి అని
అడిగాడు. దానికి తండ్రి “మామగారి ఇంట్లో ఆరు (6) నెలలు ఉంటే
అదే ప్రాయశ్చిత్తము” అని చెప్పాడు. అప్పుడు భారవి ఇది
ప్రాయశ్చిత్తము బాగుంది, చక్కగా మామగారు ఇంట్లో 6 నెలలు
హాయిగా ఉండవచ్చును అని అనుకున్నాడు. “అసారే ఖలు సంసారే
సారం శ్వశుర మందిరం హరో హిమాలయే శేతే హరిహి శేతే
మహాదదౌ” - ఏ అర్ధము, సారము (సుఖము) లేని ఈ
357
ప్రపంచములో సారవంతమైన (సుఖముగా) ఉండే చోటు (మొగ
పిల్లలకు) మామగారి ఇల్లు . ఎందుకంటే, మనకు అందరి కంటె పెద్ద
దేవుళ్లు – శివుడు, పార్వతీదేవి తండ్రి హిమవంతుడు (శివుడు
మామగారు) ఇల్లు అయిన హిమాలయములలో ఉంటాడు, అలాగే
విష్ణువు, లక్ష్మీదేవి తండ్రి పాల సముద్రు డు (విష్ణువు మామగారు)
ఇల్లు అయిన పాల సముద్రములో ఉంటాడు. మన దేవుళ్లే వాళ్ళ
మామగారు ఇంట్లో హాయిగా ఉన్నారు కాబట్టి, మనము కూడా
అలాగే ఉండవచ్చును, అని అందరూ ఆశపడుతూ ఉంటారు అని
అనుకొని, భారవి తన భార్యతో కలిసి ఆయన మామగారి ఇంటికి
వెళ్ళాడు.
ఆయన అత్తా , మామలు భారవికి మొదట పూర్ణ
కుంభములతో స్వాగతము పలికారు. పిండివంటలతో భోజనము
పెట్టా రు. అంత గొప్ప పండితుడు వచ్చాడని పందిరి వేసి, ఊళ్ళో
వాళ్ళంతా వచ్చి పలకరించి, గౌరవించారు. మూడు రోజులు
ఉత్సవములు జరిపించారు. వారము రోజులు గడిచాక, సందడి
తగ్గిన తరువాత మామగారి మనస్సులో, అల్లు డు ఇంకా ఎన్నాళ్ళు
మన ఇంట్లో ఉంటాడు అనే ప్రశ్న మొదలయింది. కాని అల్లు డిని
అడగలేకపోయాడు. 15 రోజుల తరువాత, తన కూతురితో మీ కార్య
క్రమము (program) ఏమిటి అని అడిగాడు. ఆమె తనకు
తెలియదు అని చెప్పింది. ఇంక వంటకములలో కూడా మార్పులు

358
వచ్చాయి. ఒకరోజు ఒక్క కూర వండితే, మరుసటి రోజు ఒత్తి
పచ్చడితో పెట్టు తున్నారు. ఒక నెల దాటింది. ఒక రోజు మామగారు
అల్లు డితో, ఈ రోజు ఆవులను కాచే కాపరి (పాలేరు - పనివాడు)
రాలేదు. నీవు ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా. కాస్త నీవు ఆవులను
అడవులకు తీసుకు వెళ్ళితే బాగుంటుంది అని అన్నాడు. భారవి
(మనస్సులో ప్రాయశ్చిత్తము అనే విషము ఉంది, అందుచేత
విషయము అర్ధము చేసుకొని) అలాగే ఆవులను అడవికి తీసుకు
వెళ్ళాడు. అక్కడ ఒక తాటాకు తీసుకొని ఈ శ్లోకము వ్రాశాడు
“సహసా విగధీత న క్రియామ్, అవివేక పరమాపదామ్ పదమ్,
మృణుతేహి వ్రిమృష్య కారిణమ్ గుణవృద్ధా స్వయమేవ పంపదః” -
ఏ పనీ తొందర పడి (ఆవేశముతోనో, అకస్మాత్తు గానో)
చేయకూడదు. వివేకముతో ఆలోచించకుండా, అవివేకముతో చేసే
పని చాలా ఆపదలను తీసుకువస్తుంది. ఆలోచించి, సరైన నిర్ణయము
తీసుకొని పని చేసే వాడికి, సంపదలు వెతుక్కుంటూ, తమంతట
తామే వచ్చేస్తా యి.
సాయంత్రము అయ్యింది. మామ గారి ఇంటికి ఆవులను
తిరిగి తీసుకువస్తుంటే, దారిలో ఒక శ్రేష్టిగారు, ఆ తాటాకు మీద ఏమి
వ్రాసావు అని అడిగాడు. ఇలా శ్లోకము వ్రాసాను అని అంటే, ఒక
రూపాయి ఇస్తా ను. ఆ తాటాకు నాకు ఇస్తా వా అని అడిగాడు ఆ
శ్రేష్టిగారు. భారవి సరే అని ఆ శ్లోకమును ఇచ్చేశాడు. భారవి గారు

359
కష్టపడి, ఆరు నెలలు మామగారి ఇంట్లో గడిపాడు. చివరి రోజుల్లో
గంజి పోసి భోజనము పెట్టేవారు. ఆఖరుకు నీవు మా ఇంట్లోంచి
వెళ్ళిపోతావా, లేదా మేము నిన్ను ఇంట్లోంచి గెంటివెయ్యమా అని
కూడా అడిగేశారు. ఆరు నెలలు అయిపోయాక భారవి గారు
వెళ్ళిపోయారు.

ఆ శ్లోకము కొన్న శ్రేష్టి ఆ తాటాకును గోడ మేకుకు


వ్రేలాడదీశాడు. వ్యాపారమునకు ఇతర దేశములకు వెళ్ళాడు. ఆ
రోజులలో చాలా కాలము పట్టేది. 10 సంవత్సరముల తరువాత
తిరిగివచ్చాడు. ఇంటికి వచ్చేసరికి రాత్రి అయ్యింది. ఇంటికి వెళ్ళే
సరికి తన భార్య ప్రక్కన ఒక పర పురుషుడు పడుకొని ఉన్నాడు. అది
చూసి, వాడిని చంపేద్దా మన్నంత కోపము వచ్చింది. వాడిని
చంపాలని, కట్టి కోసము వెతికాడు. గోడ మీద కత్తి ఉంది, అది
తీసుకుందామని వెళ్ళితే అక్కడ ఈ శ్లోకము కూడా ఉంది. ఆ
శ్లోకము చదువుకొని, దానిలో వ్రాసినట్లు ఆలోచించి చేద్దా ము అని
అనుకొని, తన భార్యను లేపి, విచారించి అప్పుడు చేద్దా ము అని
అనుకొని, భార్యను లేపాడు. ఆమె లేచి, భర్తను చూసి సంతోషించి,
ప్రక్కన పడుకున్న వాడిని లేపి, ఒరేయ్ నాయనా లేవరా, మీ
నాన్నగారు వచ్చారు, లేరా అని వాడిని లేపింది. ఆ శ్రేష్టికి ఒక్కసారి
చెమటలు పట్టేసి, నీరసము ఆవరించింది.

360
కోపము వచ్చి, తొందరపడి, వివేకము లేకుండా తన భార్యను
చింపేసి ఉంటే చాలా పెద్ద ఆపద వచ్చేది, మనకు మనమే అపకారము
చేసుకుంటాము, మనకు మనమే శత్రు వులము అయిపోతాము.
ఎవరికి వారు బంధువుగా మారాలి. ఆలా ఉండటానికి వివేకమును
వాడుకోవాలి. ఆ వివేకముతో, మనస్సును, బుద్ధిని,
ఇంద్రియములను అదుపులోకి తెచ్చుకొని, ప్రతి పని జాగ్రత్తగా
చెయ్యాలి అని పరమాత్మ ఉపదేశము చేస్తు న్నాడు.

ఉదాహరణ:

ఒక వ్యాపారి, బయట ఊరికి వెళ్లి సామానులు తెచ్చి,


తన ఊళ్ళో అమ్మాలని, డబ్బును మూట కట్టు కొని, అడవి
మార్గములో జాగ్రత్తగా వెళ్ళుతున్నాడు. దారిలో ఒకతను తగిలి, నేను
ఆ ప్రదేశమే వెళ్ళుతున్నాను. ఒకరికొకరు తోడుగా వెళ్ళితే
సహాయము ఉంటుంది అని ఇద్దరూ కలిసి వెళ్ళుతున్నారు. ఇద్దరకూ
స్నేహము అయింది. ఆ వర్తకుడికి వాడిమీద నమ్మకము కుదిరినది,
ఆ రోజు రాత్రి, ఆ వర్తకుడి డబ్బు దొంగిలించాలని ఆ వ్యక్తి
అలోచించాడు. ఆ రోజు రాతి, వర్తకుడు పడుకున్న తరువాత, ఆ
వ్యక్తి వర్తకుడి మూతలు విప్పి వెతికాడు. ఆ వర్తకుడి తల క్రింద,
అంతా వెతికాడు. డబ్బు ఏమీ కనిపించలేదు. ఆ దొంగకు
ఆశ్చర్యము వేసింది. నేను గొప్ప ఆరితేరిన దొంగను. నాకు

361
తెలియకుండా ఈ వ్యాపారి డబ్బు ఎక్కడ దాచాడు. ఈ విషయము
ఆ వర్తకుడి దగ్గర నుండి తెలుసుకోవాలి అని అనుకోని, మరుసటి
రోజున ఆ దొంగ, వర్తకుడితో అంతా చెప్పేసి, నేను మీ దగ్గర
దొంగతనము చేయను, మీరు డబ్బు సంచి ఎక్కడ దాచారో
చెప్పండి. మీరు ఈ రహస్యము చెప్పిన తరువాత నేను వెళ్ళిపోతాను
అని వాగ్దా నము చేశాడు. వర్తకుడు నవ్వి, నేను గొప్ప వ్యాపారిని. నా
డబ్బును ఎలా జాగ్రత్తగా దాచుకోవాలో నాకు బాగా తెలుసు. నా
జాగ్రత్తతో నేను ఉంటాను. నేను నా డబ్బు సంచిని నేను, నీ తల
క్రిందనే దాచి పెట్టా ను. అక్కడ నీవు వెతకవు అని నాకు బాగా
తెలుసు, అని చెప్పాడు.

అలాగే ఏ వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవాలని ఏ


ప్రయత్నమూ చేయడు. ప్రతి మనిషి బాహ్యమైన విషయముల మీద
దృష్టి ఉంచుతాడు.

శ్వేతాశ్వతరోపనిషత్ – 6-11 - “ఏకో దేవ సర్వ భూతేషు


ఘూడ సర్వ వ్యాపీ సర్వభూతాంతరాత్మా I కర్మాధ్యక్ష
స్సర్వభూతాధివాస స్సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ” - పరమాత్మ
సమస్త ప్రాణుల హృదయములలో దాగి ఉన్నాడు. లోపల, బయట
కూడా పరమాత్మ అంతా వ్యాపించి ఉన్నాడు. ప్రతీ ప్రాణి యొక్క ప్రతీ
క్రియను, ప్రతీ క్షణము కేవలము సాక్షిగా గమనిస్తూ ఉన్నాడు.

362
పరమాత్మకు, సాక్షి, చైతన్య స్వరూపుడు, త్రిగుణాతీతుడు. కాని ఆ
పరమాత్మను ఏ ప్రాణీ గమనించుట లేదు.

ఛాందోగ్యోపనిషత్ - 8-3-2 – “…..స్తద్యథాపి హిరణ్య నిధిం


నిహిత మక్షేత్రజ్ఞా ఉపర్యుపరి సంచరన్తో న విన్దేయు రేవ మే వేమా
స్సర్వాః ప్రజా అహరహ ర్గచ్చన్త్య ఏతం బ్రహ్మలోకం నవిన్ద న్త్యనృతేన
హి ప్రత్యూఢాః” – పెద్ద లంకె బిందెలలో బంగారము, సంపద పెట్టి,
పొలములో భూమిలో క్రింద పాతి పెట్టా రు. ఆ దాచిపెట్టిన ఆయన
చనిపోయాడు. అది ఎక్కడ దాచి పెట్టా రో ఇంకెవరికీ తెలియదు.
ఆయన వారసులు ఆ భూమి మీదే ఇటు, అటు సంచరిస్తు న్నారు.
వాళ్ళు అక్కడే తిరుగుతున్నా, ఆ నిధి ఎక్కడున్నదో వాళ్లకు దొరకట
లేదు. ఆ పాతరకి, వాళ్లకి మధ్య భూమి అడ్డము ఉంది లేదా ఆ
పాతరను భూమి కమ్మేసి లేదా ఆవరించి వాళ్లకు
కనబడనీయుటలేదు. అలాగే జీవుడికి, పరమాత్మకు మధ్య మాయ
(అజ్ఞానము) అడ్డముగా ఉండి, పరమాత్మను మనకు కనబడకుండా
చేస్తోంది. జీవుడిని మాయ (అజ్ఞానము) ఆవరించి నందున కలిగిన
అజ్ఞానముతో జీవులు పరమాత్మను చూడలేకపోతున్నారు. ఆ
అజ్ఞానమును తొలగించుకొని, పరమాత్మను పొందాలి.
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః॥7॥

363
చలి లేదా వేడి, సుఖము లేదా దుఃఖము మరియు నాకు
ఇక్కడ గౌరవము లభిస్తోందా లేదా అవమానము కలుగుతోందా అనే
విషయముల మీద (ఇవన్నీ బయట వస్తు వుల నుండే వస్తా యి)
సమానత్వముగా భావిస్తూ

ఎవరైతే కోరికలు, ఆసక్తిని ఉన్న శరీరమును,


ఇంద్రియములను, మనస్సుని నిగ్రహించుకొని, గెలిచి ఆ వస్తు వుల
నుండి వెనక్కు త్రిప్పుకోగలిగితే, అటువంటి వారికి మనస్సులో
ప్రశాంతత కలిగి, సమాధిలో పరమాత్మ స్పష్టముగా భాసిస్తా డు.

వస్తు వులు చేసే అవమానము – మహాకవి కాళిదాసు -


“కామార్తా హి ప్రకృతి కృపణాః చేతనా చేతనేషు” – కోరికలు మీద
ఎక్కువగా ఆసక్తి పెరిగితే, కోరికల ప్రభావము మనలో పెరిగిపోతే
చైతన్యము వున్న వ్యక్తు ల ద్వారా మరియు చైతన్యము లేని వస్తు వుల
ద్వారా కూడా అవమానములను పొందుతారు. వాటి ముందు
దీనులు అయిపోతారు. మనము కోరుకున్న వస్తు వులు
దొరకకపోవటము, దొరికిన వస్తు వు నిలవకపోవటము జరుగుతుంది.

జ్ఞానవిజ్ఞానతృప్తా త్మా కూటస్థో విజితేంద్రియః ।


యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టా శ్మకాంచనః ॥ 8 ॥

364
పరమాత్మ యొక్క జ్ఞానముతో, విజ్ఞానముతో తృప్తి కలిగిన
ఆత్మతో (ప్రాపించక విషయముల మీద కలిగే జ్ఞానము, విజ్ఞానము
మీద నాకు ఏ విధమైన తృప్తి లేదు అనే నిర్ణయము స్థిరముగా
ఉండాలి), పైన చెప్పిన ద్వంద్వములు కలిగినప్పుడు, మనస్సు
చలించ కుండా, ఏ వికారములు లేకుండా కూటము
(బంగారమును లేదా ఇనుమును కాల్చి, ఒక ఉక్కు దిమ్మ మీద పెట్టి
కొట్టి, వాటి ఆకారమును తెరచి దిద్దు తారు) వలె స్థిరముగా
ఉంటూ, ఇంద్రియములను నిగ్రహించి, జయించుకొని

మట్టి ముద్ద, రాళ్లు , బంగారము, వజ్రములు అన్నిటి మీద


సమానమైన భావనతో, ఇవన్నీ నాకు అక్కరలేని, ఆత్మ కంటె వేరైన
వస్తు వులు అనే భావన పెంచుకుంటే ఇంద్రియ నిగ్రహము,
విజయము కలుగుతుంది. అటువంటి వాడికి యోగము
సిద్ధించినట్లు .

జ్ఞానము – శాస్త్రములలో చెప్పిన పరమాత్మ తత్త్వము.


విజ్ఞానము – సాధనతో ఈ జ్ఞానముతో పరమాత్మ యొక్క
అనుభవము కలుగుట.
సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు ।
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ॥9॥

365
మంచి ప్రాణ మిత్రు డు, సాధారణమైన మిత్రు డు, శత్రు వు,
ఉదాసీనుడు, మధ్యస్థు డు, మనము ద్వేషించే వ్యక్తి, మన బంధువు,

మంచి వాళ్ళైనా, చెడ్డ వాళ్ళైనా అందరి మీద సమానమైన


భావన, బుద్ధి కలిగి ఉన్నవాడు సర్వోత్తమమైన సాధకుడు.

ఇటువంటి సాధకులు చాలా అరుదుగా ఉంటారు. మంచి


ప్రాణ మిత్రు డు – ప్రత్యుపకారము ఆశించకుండా, మంచి
హృదయముతో ఉపకారము చేసే వాడు. మిత్రు డు – ఉపకారము
పొంది, దానికి ప్రత్యుపకారము చేసేవాడు. శత్రు వు – మనము ఏ
అపకారము చేయకపోయినా, మనకు అపకారము చేసేవాడు.
ఉదాసీనుడు – ఇద్దరు కొట్టు కుంటుంటే, ఆ ఇద్దరు మీద ఏ
విధమైన సంబంధము, భావన లేకుండా, ఏమీ పట్టించుకోకుండా
మధ్యస్థముగా చూసేవాడు. మధ్యస్థు డు - ఇద్దరు కొట్టు కుంటుంటే,
వాళ్ళ మధ్యకు వెళ్లి వాళ్లను ఆపి, వాళ్ళ వాదనలను విని, ఆ
తగాదాను తీర్చేవాడు. ద్వేష్యుడు – మనము అపకారము చేస్తే,
తిరిగి మనకు అపకారము చేసేవాడు. బంధువు – ఏదో ఒక
సంబంధముతో (నాకు సంబంధించిన వాడు కాబట్టి) ఉపకారము
చేయాలి అని అనుకునేవాడు.

ఉదాహరణ:

366
రమణ మహర్షి ఆశ్రమములో యోగి రామయ్య గారు
(నెల్లూరు) అనే శిష్యుడు ఉండేవారు. ఒకరోజు గది గుమ్మము మీద
పడ్డగా బలిసిన నల్లని త్రాచుపాము పడగెత్తి ఉన్నది. అది కదలట
లేదు. దానిని చూసి అందరూ భయపడుతున్నారు. యోగి
రామయ్య గారు వచ్చి, అందరినీ తప్పుకోమని, ఆ పాము ముందు
కూర్చొని, ఆ పాము వైపు తదేకముగా చూసారు. ఆ పాము మెల్లగా
పడగ దించింది. రామయ్య గారు ఆ పాము మీద మెల్లగా చేతితో
తట్టి, వెళ్లిపో అని సంజ్ఞ చేశారు. ఆ పాము మెల్లగా వెళ్ళిపోయింది.
అందరూ ఆ పాము వెళ్ళిపోవటానికి, మీరు ఏమి చేశారు అని
అడిగారు. ఆయన చెప్పిన సమాధానము – “నేను నా మీద నా
కుండే ప్రేమను ఆ పాముకు పంచాను. ఆ పామును నాతో
సమానముగా చూశాను. ఆ పాము నేను ఒకటై పోయాము. నాకు
నేను అపకారము చేసుకోనట్లు , ఈ పాము కూడా నాకు అపకారము
చేయదు”

యోగ సూత్రము 2-35 – “అహింసా ప్రతిష్టా యాం తత్


సన్నిధౌ వైర త్యాగః” – అహింస కనుక మన మనస్సులో స్థిరముగా
స్థా పించుకున్నట్లయితే, ఏ ప్రాణి, వస్తు వు మనకు అపకారము
తలపెట్టదు, వైరము ఉండదు. 5-19 శ్లోకము – “నిర్దోషం హి సమం
బ్రహ్మ....” – ప్రతి ప్రాణిలో పరమాత్మే ఉన్నాడు అని సమ బుద్ధితో
భావించాలి.
367
పాము నాకు అపకారము చేస్తుంది. నేను పాముకి
అపకారము చేసినా పర్వాలేదు, అనే విషమ బుద్ధి, జన్మ జన్మల
సంస్కారముల ద్వారా మన మనస్సులో నాటుకు పోయింది. పాము
ఒక జీవి, నేను ఒక జీవి అనే సమ బుద్ధి పెంచుకొన్నట్లయితే,
అటువంటి జీవుల నుండి వచ్చే ప్రతి పరావర్తనము (Reflection)
చాలా మంచిగా ఉంటుంది. మహర్షులు అడవులలో ఆశ్రమములు
నిర్మించుకొని, కూర మృగముల నుండి ఏ భయము లేకుండా
తపస్సు ఎలా చేసుకునేవారు? వారి ఆశ్రమము చుట్టూ జన్మతో
శతృత్వ ఉండే జంతువులు కూడా సఖ్యతతో ఉండేవి. దానికి సమస్త
జీవుల యందు సమ బుద్దే కారణము.

ఉదాహరణ:

ఒక వ్యక్తి చిన్న పూరి పాకలో నివసిస్తు న్నాడు. కొత్తగా


వివాహమైన అల్లు డిని పండగకి తన ఇంటికి పిలిచాడు. అతనితో
పాటు అతని బంధువులు కూడా వచ్చారు. ఇంటినిండా జనము
ఉన్నారు. అప్పుడు ఆ ఊరులో ఉన్న కొంతమంది కూడా వచ్చారు.
అందులో కొంతమంది మా దగ్గర తీసుకున్న అప్పు మాకు చెల్లించు
అని అంటున్నారు. కొంతమంది నీవు మాకు ఇచ్చిన డబ్బు తిరిగి
ఇచ్చుటకు వచ్చాము అని అంటున్నారు. కొంతమంది మేము నీకు

368
దూరపు బంధువులము అంటున్నారు. కొంతమంది, నీవు మమ్ము
మర్చిపోయావు, నీకు గుర్తు చేయుటకు మేము వచ్చాము
అంటున్నారు. కొంతమంది నీవు మాకు చాలా అపకారము చేసావు,
నీవు మాకు శత్రు వు అంటున్నారు. కొంతమంది, నీవు చాలా
మంచివాడవు అని పోగొడుతున్నారు. కొత్త అల్లు డికి లోపలకు ఒక
మూల నుంచుని ఉన్నాడు. అతనితో వచ్చిన వాళ్ళు బయట
పాకచూరు క్రింద నుంచుని ఉన్నారు. వాళ్లకు కోపము వచ్చింది.
అంతా గందరగోళముగా ఉంది. ఆ రోజు కృష్ణా అష్టమి
అయినందున, పరమాత్మను పూజ చూసుకోవాలని సంకల్పించి, ఆ
పేద భక్తు డు హే కృష్ణా అని పిలిచాడు. శ్రీకృష్ణుడు ఆ పాక ముందు
వచ్చి నుంచున్నాడు. ఆ పాక తడికలకు ఉన్న చిల్లు లు ద్వారా
బయట ఉన్నవాళ్లు అందరూ పరమాత్మ శ్రీకృష్ణుడిని చూశారు. ఆ
ఇంటి యజమాని బయటకు వచ్చి, పరమాత్మను లోపలి రండి అని
ఆహ్వానించాడు. పరమాత్మ నీ ఇల్లంతా అందరితో నిండిపోయి
ఉంది. నీవు ఎక్కువగా గౌరవించే నీ అల్లు డికే నీ ఇంట్లో
కూర్చుందుకు చోటు లేక ఒక మూల నుంచుని ఉన్నాడు. నేను
లోపలికి అడుగు పెట్టటానికి కూడా చోటు లేదు. నేను ఎక్కడికి
రాను, నీవు నాకు ఎలా పూజ చేస్తా వు అని అడిగాడు. దానికి అతను
నేను అల్లు డికి బట్టలు పెట్టి, అతని బంధువులను గౌరవించి
చంపించేస్తా . ఇతరుల అందరికీ ఏదో ఒకటి చెప్పి వాళ్లను కూడా

369
చంపించేస్తా . మీరు లోపాలకి రండి. నేను మీకు శ్రద్ధగా పూజ చేస్తా
అని చెప్పాడు. దానికి పరమాత్మ ఇంత చిన్న ఇంట్లో ఇంతమందిని
పెట్టు కున్నావు. ఇలాగే నీ మనస్సులో కూడా ప్రాపించక
విషయములతో నిండిపోయింది. అందులో నాకు కొంచము కూడా
స్థా నము లేదు. నీవు పూజ చేస్తా ను అంటున్నావు. పూజ అంటే,
బాహ్యమైన పూజ కాదు. నీ మనస్సులో (హృదయములో) నన్ను
ధ్యానించాలి. నీ మనస్సు ఇన్ని ప్రాపించక విషయములతో
అల్లకల్లోలముగా ఉంటే, నన్ను పూజించుటకు నీ మనస్సుకు
ఏకాగ్రత ఎలా ఏర్పడుతుంది. నన్ను ధ్యానించాలంటే, నీ మనస్సులో
నుండి ఈ ప్రాపించక విషయములను (కల్మషములను) ఖాళీ చేసి, నీ
మనస్సుని పరిశుభ్రము చేసుకుంటే, అప్పుడు నేను ఉండేందుకు
సరైన స్థా నము కలుగుతుంది. అప్పుడు నీ మనస్సులో
(హృదయములో) ప్రశాంతత ఏర్పడి, నన్ను ధ్యానించుటకు నీకు
ఏకాగ్రత కలుగుతుంది.

 యోగీ యుంజీత సతతమ్ ఆత్మానం రహసి స్థితః ।


ఏకాకీ యతచిత్తా త్మా నిరాశీరపరిగ్రహః ॥ 10 ॥

యోగము (హృదయములో పరమాత్మను స్పష్టముగా


దర్శించి, ఏకాగ్రతతో ధ్యానించుట) అభ్యాసము చేయువాడు,
మనస్సును ప్రాపించక విషయముల నుండి నియంత్రించి, అదుపులో

370
పెట్టు కొని, స్థిరముగా యోగములోనే లగ్నము చేయుటకు
(పరమాత్మతో అనుసంధానము చేయుట) సాధన ఎల్లప్పుడూ
చేయాలి. యోగము సిద్ధించుటకు మనస్సుకు ఏకాంత వాసము
(ఒంటరిగా) అభ్యాసము చేసుకొని.

యోగి తను మాత్రమే ఒంటరిగా ఉండి (ప్రాపించక


విషయములను మనస్సు లోపలకి తీసుకోకుండా), తన శరీరమును,
ఇంద్రియములను, చిత్తమును (మనస్సుని, బుద్ధిని, అహంకారముని,
తెలివి మరియు జ్ఞాపక శక్తిని) నిగ్రహించుకొని, ఏ రకమైన కోరికలు
లేకుండా, మనస్సుని పరిశుభ్రము చేసుకొని, ప్రాపించక
విషయములను మనస్సులోకి రానివ్వకుండా మనస్సుని నిశ్చల
స్థితిలో ఉంచుకొని, పరమాత్మను మనస్సులో అనుసంధానము
చేసుకొని, అభ్యాసముతో మనస్సులో పరమాత్మను స్థిరముగా
ఉంచుకోవాలి.

 శుచౌ దేశే ప్రతిష్ఠా ప్య స్థిరమాసనమాత్మనః ।


నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరం ॥ 11 ॥

ఇంట్లో సంస్కారవంతమైన శుభ్రమైన పుణ్య ప్రదేశములో


ఆసన సిద్ధిని (ప్రతిరోజూ, ఒకే సమయములో, ఒకేచోట కదలకుండా

371
ఉండే స్థిరమైన ఆసనము మీద చాలా సేపు కూర్చోగలుగుట)
సాధించుకొనుటకు,

ఎక్కువగా లేదా చాలా తక్కువ ఎత్తు గా ఉండకుండా,


సమమైన ఎత్తు లో ఉండే స్థిరమైన ఆసనము (దిమ్మ లాంటిది), దాని
పైన దర్భలు పరిచి, దర్భలు మీద మెత్తని బట్టను (జింక చర్మము
బదులు) పరిచి, స్థిరమైన, సుఖమైన ఆసనమును ఏర్పాటు
చేసుకోవాలి.

పతంజలి యోగ సూత్రము – 2-46 – “స్థిరసుఖ ఆసనమ్”


– ఆసనము కదలకుండా, స్థిరముగా ఉండాలి, ఆసనము మీద
యోగాభ్యాసమునకు కూర్చొన్నప్పుడు సుఖముగా ఉండాలి
(శరీరము ఇబ్బంది పడేటట్లు కాకుండా, నిద్ర పట్టేటట్లు కూడా
కాకుండా, జారిపోకుండా).

మనస్సులో (హృదయము అనే ఇంట్లో), బాహ్యమైన


ప్రాపించక విషయములను లోపలి రానివ్వకుండా, ఏ విధమైన
దోషములు, క్లేశములు, అల్లకల్లోలములు లేకుండా మనస్సుని
ప్రశాంతముగా, నిర్మలముగా, శుచిగా, శుభ్రముగా, స్థిరముగా
చేసుకొని, దాని మీద అమృతమయమైన దర్భలను
(పురాణములలో చెప్పినట్లు ), దాని మీద జింక చర్మమును, దాని

372
మీద శుభ్రమైన వస్త్రమును పరిచి, పరమాత్మకు (ఆత్మ
తత్త్వమునకు) ఈ విధమైన ఆసనము కల్పించినట్లు భావన
చేసుకోవాలి.

శ్వేతాశ్వతరోపనిషత్ – 2-10 – “సమే శుచౌ శర్కరా


వహ్నివాలుకా వివర్జితే శబ్దజాల శ్రయాదిభిః, మనోనుకూలే తు చక్షు
పీడనే గుహా నివాతా శ్రయణే ప్రయోజయేత్” – తపస్సుకి,
యోగాభ్యాసమునకు సమానముగా, స్థిరముగా, శుచిగా ఉండి,
రాళ్లు , రప్పలు లేని, నిప్పు లేకుండా, నిరంతరము నీళ్ళు పారకుండా,
పొడిగా శుభ్రముగా ఉండి, మనస్సుకు అనుకూలముగా,
ఆహ్లా దకరముగా ఉండే, కళ్లకు బైర్లు (చీకట్లు ) కమ్మేటట్లు ,
పొడుస్తు న్నట్లు వెలుగు ఉండకుండా, వాయువు తీవ్రముగా వీచని
ప్రదేశము - పర్వత గుహలు కాని, చెట్టు తొర్రలలో కాని,
సురక్షితమైన (యోగాభ్యాసమును ఇతరులు భంగము చేయకుండా
ఉండే) ప్రదేశమును ఎంచుకోవాలి.

ప్రస్తు త పరిస్థితిలలో శ్వేతాశ్వతరోపనిషత్ లో చెప్పినట్లు


అడవులలో సాధన చేయలేరు కాబట్టి, పరమాత్మ మన ఇంట్లోనే ఈ
విధమైన ఆసనమును ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పుతున్నాడు.

373
బ్రహ్మ సూత్రములు - చతుర్థ అధ్యాయము (ఫల
అధ్యాయము) ప్రథమ పాదము - 7. ఏకాగ్రతాధికరణము - 11.
“యత్రైకాగ్రతాతత్రా విశేషాత్” – ఏకాగ్రత కలుగుటకు ఎక్కడ
అవకాశము ఉంటుందో, అక్కడే యోగ సాధన చేసుకోవాలి.

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియాః ।


ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే ॥ 12 ॥

మనస్సులో ఆలోచనలు ఇటూ అటూ పోనీయకుండా,


మనస్సును ఒకచోట స్థిరముగా ఉంచి, ఏకాగ్రత కలిగేలా అభ్యాసము
చేసుకుంటూ, ఇంద్రియములను, చిత్తమును (మనస్సు, బుద్ధి,
అహంకారము, తెలివి మరియు జ్ఞాపక శక్తి) యొక్క ప్రపంచమైన
క్రియలు నియంత్రించుకొని,

పైన వివరించిన ఆసనము మీద కూర్చొని, మనస్సుని


పరమాత్మ మీద మాత్రమే ఏకాగ్రతగా ఉంచుకొని, యోగ సాధన
చేసుకోవాలి. అప్పుడు మనస్సులో ఉండే కల్మషములు, దోషములు
అన్నీ తొలగిపోయి, మనస్సు, చిత్తము శుద్ది కలుగుతుంది.

బ్రహ్మ సూత్రములు - చతుర్థోపాధ్యాయము (ఫల


అధ్యాయము) - ప్రథమ పాదము - 6. ఆసీనాధికరణము - 7.

374
“ఆసీన స్సంభవాత్ – యోగాభ్యాసము కూర్చొని మాత్రమే చేయాలి
అని నిర్ణయించారు. నుంచుని, పడుకుని చేయకూడదు.

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః ।


సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ॥ 13 ॥

ఆసనము మీద కూర్చొని యోగాభ్యాసము చేసేటప్పుడు


కదలకుండా పద్మాసనము లేదా సుఖాసనము వేసుకొని కూర్చొని
ఉండాలి. నడుము పై భాగమైన శరీరము యొక్క మధ్య భాగము,
మెడ, శిరస్సు తిన్నగా, సమముగా, ఒకే సరళ లేఖలో ఉండాలి.
అటువంటి స్థితిలో కదలకుండా, స్థిరముగా కూర్చొని ఉండాలి.

ముక్కు చివరి భాగమును, రెండు కళ్లతో ఒకే సమయములో


చూస్తూ, ఇటూ అటూ, దిక్కులు చూడకుండా యోగాభ్యాసము
చేసుకోవాలి.

ఈ స్థితిలో శరీరములో వెన్నెముక క్రింద చివరి భాగములో


ఉండే మూలాధారము నుండి శిరస్సుపై భాగములో ఉండే
సహస్రారము వరకూ ఉండే ఆరు (6) శక్తి చక్రములు అన్నీ ఒకే సరళ
లేఖలో ఉంటాయి. ముక్కు చివరి భాగమును రెండు కళ్లతో
ఒకేసారి చూస్తూ ఉంటే లేదా “భ్రు వోర్ మధ్యే” కనుబొమ్మల మధ్య

375
ధ్యానమును కేంద్రీకరించాలి. అప్పుడు కళ్ళు వేరేవాటిని చూడలేవు,
దృష్టి ఏకాగ్రత ఏర్పడుతుంది. అందుకోసమే అలా చెప్పారు.
అభిప్రాయము ముక్కును చూడటము కాదు.

ఉదాహరణ:

1. ఒక పెద్ద యోగ పాఠశాలలో, ఒక ప్రసిద్ధమైన గురువుగారు


యోగాభ్యాసము చూయిస్తూ ఉంటారు. ఆ గురువుగారు
యోగాభ్యాసము నేర్పిస్తే, జంతువులకు కూడా యోగాభ్యాసము
వస్తుంది అనే పేరు వచ్చి, అంతటా ప్రచారము అయింది. అందుచేత
కొన్ని కోతులు వచ్చి, గురువుగారిని యోగాభ్యాసము నేర్పమని
ప్రార్థించాయి. దానికి గురువుగారు మీరు తిర్యక్ (భూమికి
అడ్డముగా శరీరము ఉండే) జంతువులు. మీ శరీరము వంకరగా
ఉంటుంది. మీరు యోగమునకు అత్యవసరమైన ఆసనములో
కూర్చోలేరు. అడ్డముగా శరీరము ఉండే జీవులకు యోగము
అబ్బదు. నిలువుగా ఉండే మానవులకు మాత్రమే యోగము
అబ్బుతుంది. దానికి కోతులు మీరు యోగాభ్యాసము నేర్పిస్తే,
జంతువులకు కూడా యోగము అబ్బుతుంది అనే పేరు, ప్రచారము
ఉంది. మీ పేరుని నిలబెట్టు కుందుకు మీరు మాకు యోగాభ్యాసము
నేర్పవలసిందే, లేకపోతే మీకు అపకీర్తి వస్తుంది అని చెప్పాయి.

376
కోతులు మాట వినటలేదు, కాబట్టి గురువుగారు చేసేది లేక
ఒప్పుకొని, కోతులను కూర్చోపెట్టి, ఆ కోతుల ముందు రెండు అరటి
పళ్ళు పెట్టి, ఈ అరటి పళ్ళను చూడకూడదు, వీటి గురించి
ఆలోచించకూడదు అనే నియమమును పెట్టి, ఆ కోతులను కళ్ళు
మూసుకుని కూర్చొని ధ్యానము చేయమన్నారు. ఆ కోతులు
ధ్యానమునకు కూర్చొని, మనము కళ్ళు మూసుకుని ధ్యానము
చేస్తుంటే, ఆ అరటి పళ్ళను ఎవరైనా తీసుకుపోతారేమో, అనే
ఆలోచనతో, మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే, గురువుగారు కూడా కళ్ళు
మూసుకుని ఉన్నారు. అప్పుడు ఆ కోతులు మెల్లగా ఆ అరటి
పళ్ళను తీసుకొని, అక్కడ నుంచి పారిపోయాయి. ఆ కోతుల వంటి
ప్రవృత్తి, చాలా మంది మానవులలో కూడా ఉంటుంది. మన
మనస్సులో అటువంటి వస్తు వుల ప్రభావము, కోరికలు రాకుండా
ఉండుటకు, ముందు కళ్లతో అటువంటి వస్తు వులను చూడకుండా
ఉండాలి. అందుచేత పరమాత్మ, ఏ వైపులకూ చూడరాదు అని
ప్రత్యేకించి చెప్పాడు.

2. విశ్వామిత్రు డు అంతటి గొప్ప మహర్షి, ఇంద్రియ


నిగ్రహముతో తీవ్రమైన తపస్సు చేస్తు న్నాడు. కాని ఒక్కసారి మేనక
కనబడిన తరువాత, ఇంద్రియ నిగ్రహము కోల్పోయి, ఆమె
మొహములో పడి, తపస్సును వదిలేశాడు. తరువాత తన తప్పును

377
తెలుసుకుని, పశ్చాత్తా పము కలిగి, తరువాత తపస్సును కొనసాగించి,
బ్రహ్మర్షి అయినారు.

ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః ।


మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ॥ 14 ॥

ప్రశాంతాత్మా = “ప్రశాంతాత్మా ప్రకాశేన శాంతాః ఆత్మా


అంతఃకరణం యస్యతః ప్రశాంతాత్మా”. పైన చెప్పిన విధముగా
కూర్చొని, దృష్టిని ఒకచోట నిలిపి, ఏకాగ్రతతో మనస్సులో ఉన్న
అల్లకల్లోలమును తొలగించుకొని, మనస్సును స్థిరముగా ఉంచుకొని,
ప్రశాంతముగా చేసుకొని, భయములను అన్నిటినీ పోగొట్టు కొని,
బ్రహ్మచారి వ్రతము యొక్క నియమములను పాటిస్తూ,

మనస్సును నియంత్రించుకొని, అదుపులో ఉంచుకొని,


మనస్సులో పరమాత్మనే స్థిరముగా ఉంచుకొని, యోగాభ్యాసములో
ప్రీతిగా ఉండి, పరమాత్మ తత్త్వము అన్నింటికంటే గొప్పది,
పరమాత్ముడు సర్వోత్తముడు అనే భావనతో, అదే నాకు కావాలి అనే
స్థిరమైన నిశ్చయముతో యోగాభ్యాసము చేసుకోవాలి.

యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః ।


శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థా మధిగచ్ఛతి ॥ 15 ॥

378
పరమాత్మ చెప్పిన పద్ధతులలో తన మనస్సును
యోగాభ్యాసములో స్థిరముగా ఉంచుకొని, యోగాభ్యాసము
నిరంతరము, నిర్విరామముగా చేసుకుని సిద్ధిని పొందిన యోగి,
చిత్త వృత్తు లు పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకున్న యోగి

శాంతిని పొందుతాడు. పరమాత్మను తన చిత్తములో


స్థిరముగా ఉంచుకున్న సాధకుడికి, పరమాత్మ జ్ఞానము కలిగి, ఆ
శాంతి యొక్క స్థా యి ఉన్నత స్థితులకు పెరిగి, సర్వోత్తమమైన
నిర్వాణము (సంపూర్ణమైన జ్ఞానము కలిగి, కోర్కెల నుంచీ, దుఃఖం
నుంచీ, జనన మరణముల చక్రమైన సంసారము నుంచీ విముక్తి
సిద్ధించి) కూడా పొందుతాడు. నా స్వరూపము అనుభవమునకు
కలిగితే పొందే మోక్షము అనే అత్యుత్తమమైన శాంతి క్రమముగా
పొందుతాడు.

పతంజలి యోగ సూత్రము 2-27 – “తస్య సప్తధా ప్రాంత


భూమిః ప్రజ్ఞ” – పరమాత్మ జ్ఞానమునకు ఏడు మెట్లు , స్థా యిలు,
భూమికలు ఉంటాయి. యోగ శాస్త్రము ప్రకారము - ఏడు (7)
రకముల యోగ భూమికలు ఉంటాయి. 1. దేనిని తెలుసుకోవాలో
తెలుస్తుంది. మానవుడు దేనిని వదులుకోవాలో తెలుస్తుంది. 2.
దుఃఖము, దుఃఖము యొక్క కారణములు పోగొట్టు కుంటాడు. 3.
సంపూర్ణమైన పరమాత్మ జ్ఞానము కలుగుతుంది. 4. కర్మలు పూర్తిగా

379
వదులుకుంటాడు. 5. చిత్త వృత్తు ల నుండి విముక్తి కలుగుతుంది. 6.
చిత్తము జ్ఞానము అనే అగ్నిలో కరిగిపోతుంది. 7. యోగికి
ఆత్మానుభవము కలిగి తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఒక్కొక్క
భూమికలో ఒక్కొక్క రకమైన శాంతి కలుగుతుంది అని కూడా
బోధిస్తా రు. యోగ సిద్ధి కలిగిన తరువాత యోగ భూమికలు,
సోపానములు (మెట్లు ఆరోహణ – క్రమముగా మెట్లు ఎక్కుట)
ఉంటాయి. ఆ యోగ భూమికలను ఎక్కుతూ, దాటుకుంటూ
ఏడవ భూమిక దాటిన తరువాత నిర్వాణ స్థితిని పొందుతాడు.

ఉదాహరణ:

ఒక సాధకుడు బ్రహ్మదేవుడు లేదా విష్ణువు లేదా శివుడి


గురించి తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రత్యక్షము కాక
ముందు ఇంద్రు డో లేదా అప్సరసలో లేదా మరొక పరీక్షో
ఎదురవుతుంది. అది వ్యతిరేకముగా ఉంటే ఆ సాధకుడు
ఎదురుకుంటాడు. అది అనుకూలముగా ఉన్నట్లు అనిపిస్తే, ప్రలోభ
పెట్టితే అది పరీక్ష అవుతుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణమైతే, బ్రహ్మదేవుడో,
విష్ణువో, శివుడో ప్రత్యక్షమవుతారు. అలాగే యోగ సాధన చేసుకునే
యోగులకు మధ్యలో కొన్ని చిన్న, చిన్న సిద్ధు లు కలుగుతాయి. ఆ
సిద్ధు లకు తృప్తి పడిపోయి లేదా లొంగిపోయి యోగ సాధన మానేస్తే,

380
అంతటితో యుగ సాధన ఆగిపోతుంది. ఆ యోగి అత్యున్నతమైన
స్థా యి అయిన నిర్వాణ స్థితిని పొందలేడు.

వశిష్ట రామాయణము – అయోదత్త మహర్షి శిష్యుడు


ఉద్దా లక మహర్షి యోగ సాధన చేసుకుంటూ ఉండగా, అతను 6 వ
యోగ భూమికకు చేరాడు. ఆ స్థితిలో ఇంద్రు డు అప్సరసలను,
మంచి గుర్రములను, ఏనుగులను, రధములను పంపి, వేటితో నీ
తపస్సు యొక్క ఫలితములను అనుభవించు అని సందేశమును
పంపాడు. అప్పుడు ఉద్దా లక మహర్షి, వాటి వైపు కన్నెత్తి కూడా
చూడకుండా, వాటిని తిరస్కరించి, అవమానము చేసి
పంపించేశాడు. తరువాత ఆయన యోగసాధన చేసుకొని, 7 వ
యోగ భూమిక కూడా దాటి, తత్త్వ జ్ఞానము పొందాడు.

 నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః ।


న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జు న ॥16॥

ఓ అర్జు నా I ఎక్కువగా భోజనము చేసేవాడికి యోగము


అందదు. కేవలము ఉపవాసములు ఉండి, కడుపును ఎండ గట్టు కొని
ఏమీ తినని వాడికి కూడా యోగము అందదు.

ఎక్కువగా నిద్రపోయి, కలలు మాత్రమే కనేవాడికి యోగము


అందదు. అసలే నిద్రపోకుండా, మనస్సుకు ఏ మాత్రము విశ్రాంతి
381
ఇవ్వకుండా, ఎల్లప్పుడూ మేలుకొని ఉండేవాడికి కూడా యోగము
అందదు.

ఎక్కువ తిండి తిని, కడుపుకు బరువు ఎక్కువైతే, యోగమే


కాదు కదా, రోజులో మామూలు పనులు కూడా చేయలేక
కదలలేరు. అలాగని ఏమీ తినకుండా ఉంటే, శారీర
అవయవములకు అవసరమైన శక్తి లేక మెదలలేరు.

యాజ్ఞవల్క్య రచించిన శతపద బ్రాహ్మణము – “యదు


హవా ఆత్మ సంవితమన్నం తదవతి, తన్ నహినస్తి I యత్ భూయః
తద్ భినస్తి యత్ కనీయః న తదవతి” – కడుపుకు తగినంత
అన్నము తింటే, మిత ఆహారము వలన శరీరమునకు లాభము
కలుగుతుంది. అంతకంటే కొంచము లేదా చాలా ఎక్కువ తింటే,
అజీర్ణ రోగము కలిగి, తరువాత శరీరమునకు రకరకాల దోషములు,
రోగములు కలిగి, శరీరమును కూడా హింసిస్తుంది. బాగా తక్కువ
తింటే, శరీరమునకు తగిన పోషణ లేక, శరీరము చేయవలసిన
కనీసమైన పనులు కూడా చేయలేదు. అందుచేత ఒక మోతాదులో
పరిమితముగా ఆహారము తీసుకోవాలి.

ఆహారము ఎక్కువ తిన్నారా లేదా తక్కువ తిన్నారా అని ఎలా


నిర్ణయిస్తా రు? - “అర్ధం సవ్యంజనానస్య, తృతీయం ఉదకస్యచ,

382
వాయు సంచారనార్ధంతు చతుర్ధ అవశేషయేత్” – రోజుకు రెండు
సార్లు , మన కడుపులో సగము వరకు ఘనమైన ఆహారమును
తినవలెను. అక్కడ నుండి ఒక పావు భాగము జలము త్రాగవలెను.
చివరి పావు భాగములో వాయువు సంచరించుటకు ఖాళీగా
వదలిపెట్టా లి. అప్పుడే సమాన వాయువు అన్న శక్తిని శరీరములో అన్ని
భాగములకు సమానముగా పంచగలుగుతుంది.

యోగాభ్యాసము నియమములు:

1. కడుపు నిండా భోజనము చేసిన తరువాత, కడుపు బాగా


ఉబ్బిన వాడు, లేదా ఏమీ తినక కడుపులో కరకర ఆకలితో
ఉన్నవాడు యోగాభ్యాసము చేయరాదు. రోజుకు రెండు సారూ
మాత్రమే భోజనము చేయాలి. రోజూ ఒకే సమయములో
ఆహారము తీసుకోవాలి. అకాలములో (అపరాహ్న సమయములో,
అపరాత్రి) భోజనము చేయరాదు.

2. ఎక్కువగా నిద్రపోయి, శరీరములో మత్తు గా ఉన్నప్పుడు,


అసలు నిద్ర లేక, శరీరము అలసిపోయినప్పుడు యోగాభ్యాసము
చేయరాదు.

౩. మనస్సు ప్రాపించక విషయముల వైపు పోతూ,


చంచలముగా ఉన్నప్పుడు యోగాభ్యాసము చేయరాదు.

4. సరైన ఆసనము లేకుండా యోగాభ్యాసము చేయరాదు.

383
5. శరీరము నడుమ భాగము నుండి శరీరము మధ్య
భాగము, మెడ, శిరస్సు సరైన సరళ లేఖలో స్థిరముగా ఉంచకపోతే
యోగాభ్యాసము చేయరాదు.

 యుక్తా హారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।


యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥ 17 ॥

ఆహార నియమములను పాటిస్తూ, నియతమైన,


పరిమితమైన ఆహారమును, నడకను, క్రియలను కలిగి ఉన్నట్లయితే

నియమితమైన, పరిమితమైన నిద్ర, మెలకువ, జాగ్రత్తగా


వ్యవహరించు మనస్తత్వము ఉన్నట్లయితే, దుఃఖములను తొలగించే
యోగము, నిర్వికల్ప సమాధి వరకూ తీసుకువెళ్ళే యోగము
తప్పకుండా సిద్ధిస్తుంది.

ఆహార నియమములు ముందు వివరించబడినవి. అతిగా


నడిస్తే లేదా పరిగెత్తితే చేసే మోకాళ్ల కీళ్లు అరిగిపోయే అవకాశము
ఉంది. అప్పుడు ఆసనము సరిగా వేసుకోలేరు. పరిమితమైన నడక
కూడా పాటించాలి. యోగ శాస్త్రములో నిర్వచనము – “యోజనా న
పరం గచ్చేత్” – రోజుకు 7 లేక 8 మైళ్లు కంటె ఎక్కువ
నడవకూడదు. శరీరములని అవయవములు, ఇంద్రియములు
(అతిగా మాట్లా డుట, సినిమాలు, టీవీ అతిగా చూచుట

384
మొదలైనవి) మితిమీరి పనిచేయకూడదు. నియమితమైన క్రియలు,
చేష్టలు ఉండాలి _ “హితాహిత ప్రాప్తి పరిహారనుకూల క్రియలు” –
శరీరమునకు హితమైనవి (శరీరమును పోషించుట, రక్షించుట,
శరీరము శుద్ధి, శుభ్రము) చేసుకుని, హితముకానివి చేయకుండా
ఉండాలి. నిద్ర, మెలకువ నియతముగా, సమానముగా ఉండాలి.
రాత్రి సమయమును నాలుగు భాగములుగా (ఒక జాము – 3
గంటలు) చేసుకొని, మొదటి భాగము (నిశా ప్రధమ భాగము), చివరి
భాగము (బ్రాహ్మీ ముహూర్తము) వదిలి, మధ్యలోని రెండు
భాగములలో (సుమారు 6-7 గంటలు) నిద్రపోవాలి. రాత్రి ఈ రెండు
భాగములలో మెలకువగా ఉండకూడదు. ఆ తరువాత
నిద్రపోకూడదు. ఇటువంటి నియమములను పాటించాలి.

యదా వినియతం చిత్తమ్ ఆత్మన్యేవావతిష్ఠతే ।


నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ॥ 18 ॥

సాధకుడి మనస్సులో లేదా హృదయములో


అల్లకల్లోలములు లేకుండా, పరిశుభ్రముగా ఎప్పుడైతే నియతముగా
ఉంటుందో, అటువంటి హృదయములో ఆత్మ స్వరూపము లేదా
ప్రకాశము ప్రతిబింబిస్తూ ఉంటుందో

385
అటువంటి సందర్భములో కనిపించే విషయములు లేదా
కనిపించని స్వర్గము మొదలైన విషయములు మీద మనస్సులో ఏ
విధమైన కోరికలు లేని స్థితిలో, ఆ యోగికి జ్ఞాన సహితమైన నిర్వికల్ప
సమాధి అనుభవిస్తా డు.

త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క సత్త్వ, రజో, తమో


గుణముల పరిణామములతో తయారైన మనస్సులో కూడా సత్త్వ
(పరిశుద్ధమైన, ప్రశాంతమైన, సుఖకరమైన జ్ఞానము), రజో
(ప్రాపించక విషయములపై కోరికలు), తమో (అజ్ఞానము, మోహము)
గుణములు ఉంటాయి. ఈ మూడు గుణముల ప్రభావముతో
మనస్సు నిరంతరము (సాంఖ్య సిద్ధాంతము – “చలం గుణ
వృత్తం”) కదలికలతో, అల్లకల్లోలములతో, చంచలముతో ఈ మూడు
గుణముల క్రియలను చేస్తూ ఉంటుంది. యోగ సాధకుడు
క్రమముగా మనస్సులో ఉండే తమో, రజో గుణముల
ప్రభావములను అతి తక్కువగా (పూర్తిగా నిర్మూలించ లేరు)
తగ్గించుకొని, నియంత్రించుకొని, ఏవిధమైన కోరికా లేశ మాత్రము
కూడా లేని స్థితిని సాధించుకొని, కేవలము సత్త్వ గుణము యొక్క
ప్రభావమును వృద్ధి చేసుకుంటూ, శుద్ధ సత్త్వ గుణము
సాధించుకుంటే, మనస్సు అనే అద్దమును శుద్ధ సత్త్వ ప్రధానముగా,
పరిశుభ్రము చేసుకుంటే, అటువంటి శుద్ధ సత్త్వముతో ఉండే

386
హృదయములో పరమాత్మ స్వరూపమైన జ్యోతి స్పష్టముగా
ప్రతిఫలిస్తుంది.

ఉదాహరణ:

ధృవుడు పరమాత్మ అనుగ్రహముతో 26,000


సంవత్సరములు రాజ్యము పాలించాడు, ధృవుడి మొదట
ఏడుగురు కుమారులు యోగాభ్యాసము చేసుకుంటాము అని చెప్పి,
తండ్రి అనుమతి తీసుకొని అడవులకు వెళ్ళిపోయారు. ధృవుడి
ఎనిమిదవ కుమారుడు అంగ మహారాజు అన్నలలా యోగ్యుడే. కాని
నిష్కామముగా సత్కర్మలు చెయ్యాలి అనే చిన్న కోరిక (అశ్వమేధ
మహా యాగములు చేయాలనే చాలా మంచి కోరిక) ఉన్నవాడు.
అందుచేత రాజ్యాధికారము తీసుకుందుకు అంగీకరించాడు.
ధృవుడు కుమారుడు అంగ మహారాజుకు రాజ్యము అప్పగించి,
ధృవ లోకమునకు వెళ్ళిపోయాడు. అంగ మహారాజు అశ్వమేధ
మహాయాగము మొదలుపెట్టా డు. ఋత్విక్కులు దేవతలను
హవిస్సు తీసుకుందుకు ఆహ్వానించారు. దేవతలు హవిస్సు
తీసుకుందుకు రాలేదు. దేవతలు హవిస్సు తీసుకుందుకు ఎందుకు
రాలేదో విచారించగా, అందులో అశ్వమేధ యాగమును చేసే
యజమానికి పుత్రు డు కలిగి ఉండాలి అని ఒక నియమము ఉంది.
అంగ మహారాజుకు పుత్రు లు లేనందుకు, అంగ మహారాజు

387
అశ్వమేధ యాగము చేయుటకు యోగ్యత లేని కారణముతో
దేవతలు ప్రత్యక్షముగా హవిస్సు తీసుకుందుకు రాలేదు అని
చెప్పారు. అంగ మహారాజు అశ్వమేధ యాగము వదిలేసి, పుత్ర
కామేష్టి యాగము (పుత్రు డు కావాలి అనే కోరికతో – కోరిక మొదలై
ఒక మెట్టు క్రిందకు దిగాడు) మొదలుపెట్టా రు. ఆ యాగము
ఫలితముగా మహా పరాక్రమవంతుడైన వేణుడు అనే కుమారుడు
కలిగాడు. చిన్నప్పటి నుండే పరాక్రమము చూపిస్తు న్నాడు. కాని
కొంచము పెద్ద అయిన దగ్గర నుండి పరమ దుర్గుణములు
ప్రదర్శిస్తు న్నాడు. అసలు ఈ లోకములో యజ్ఞము యాగములు
ఎందుకు చేయాలి, యజ్ఞములు, యాగములు అసలు
చేయకూడదు అని అంటున్నాడు. యజ్ఞ యాగములు చేయకపోతే,
దేవతలు ఎలా ప్రీతి చెందుతారు, దేవతలు శక్తిని ఎలా
పుంజుకుంటారు, దేవతలు మానవులను వర్షములతో, పంటలతో
ఎలా అనుగ్రహిస్తా రు. కాని వేణుడు దేవతలు అనేవాళ్ళు లేనేలేదు,
విష్ణు అంటే మహారాజే విష్ణువు. అందుచేత మహారాజే విష్ణువు అని
వాదిస్తా డు. విష్ణువు అంటే నేనే. అందుచేత యజ్ఞములు,
యాగములు, పూజలు, ఉపాసనలు నాకే చేయండి, ఇతరులకు
(దేవతలకు) ఏమీ చేయకూడదు అని ఆజ్ఞాపించాడు. అంగ
మహారాజు ఎంత చెప్పినా వినలేదు. వేణుడు మహాబలశాలి.
అందుచేత మంత్రు లు, సేనాధిపతి, సామంత రాజులు అందరూ

388
వేణుడి పక్షములో చేరిపోయారు. ఎవ్వరూ అంగ మహారాజు మాట
వినట లేదు, ఏ ధర్మ కార్యములు చేద్దా మన్నా చేయలేకపోతున్నాడు.
అంగ మహారాజు తన తండ్రి, అన్నలు యొక్క గొప్పతనము
తలచుకొని, తాను నిష్కామకర్మ, యజ్ఞ యాగములు చేయాలనే
మంచి సంకల్పముతో రాజ్యము స్వీకరించి, ఇప్పుడు ఏ ధర్మ
కార్యము చేయలేని దుస్థితికి దిగజారిపోయానే అని చింతించాడు.
ఉత్తమ స్థా యికి చేరుకున్న యోగులకు, ధర్మాచరణ మీద కూడా
అతి శ్రద్ధ ఉండకూడదు. ధర్మాచరణకు ధనార్జన, కర్మలు ఉంటాయి.
ఆ స్థితికి చేరిన వాళ్లకు ఇది “అడుసు తొక్క నేల, కాళ్లు కడగ నేల”
అవుతుంది. నేను పేరుకు మాత్రమే మహారాజును. వేణుడు రాజు
కాకపోయినా రాజ్యాధికారము చెలాయిస్తు న్నాడు. నేను ఈ
రాజ్యమును వదిలి, నా అన్నలలాగా అడవులకు వెళ్లి, నా యోగ
సాధన చేసుకోవాలి అని నిర్ణయించుకొని, ఎవ్వరికీ చెప్పకుండా, ఒక
అర్ధరాత్రి, రాజ్యము వదలి అడవులకు వెళ్ళు, యోగ సాధన చేసుకొని
సిద్ధిని కూడా పొందాడు.

అత్యుత్తమ యోగ సాధకులకు అతి చిన్న అత్యుత్తమమైన


కోరిక ఉన్నా సరే, ఆ కోరిక క్రమక్రమముగా క్రింద స్థా యిలకు
దిగాజారుస్తుంది. అందుచేత యోగ సాధనకు లేశ మాత్రము కూడా
కోరిక ఉండకూడదు.

389
యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా ।
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ॥ 19 ॥

బాగా వీస్తు న్న గాలిలో దీపము ఎలా కదిలిపోతుందో అలా,


పరమాత్మ చెప్పిన నియమములను అనుసరించని, యోగము
సిద్ధించని సాధారణమైన జనుల మనస్సు ఇటూ, అటూ కదిలిపోతూ
అంత చంచలముగా ఉంటుంది.

కాని యోగములో సంప్రజ్ఞాత సమాధి (బాగా తెలిసిన


జ్ఞానము) నుండి నిర్వికల్పసమాధి లేదా అసంప్రజ్ఞా సమాధి
(పరమాత్మ తప్ప ఇంకేమీ తెలియని జ్ఞానము, పరమాత్మలో ఏకమైన
స్థితి) వరకూ సాధించుకోగలిగిన సాధకుడి మనస్సు నివాతస్థ
దీపములా, ఏ మాత్రము కదలకుండా, నిశ్చల స్థితిలో ఉంటుంది.
గాలి వేగముగా వీచని చోట, ప్రశాంతమైన నిశ్చల స్థితిలో ఉన్న
దీపమువలె ఉంటుంది.

మనస్సుని పూర్తిగా నియంత్రించుకుని యోగ సాధన


తీవ్రముగా చేసుకున్న యోగి యొక్క మనస్సు ప్రశాంతముగా, ఏ
కదలిక లేకుండా నిశ్చలమైన మనస్సులో, నిరంతరము
ప్రకాశమానముగా ఉండే మనస్సులో పరమాత్మను లగ్నము

390
చేసుకొని, పరమాత్మ యొక్క ప్రతిబింబము స్పష్టముగా ప్రతిఫలిస్తూ
ఉండగా, ఒకే తీరులో పరమాత్మ యందే లీనమై ఉంటుంది.

శ్వేతాశ్వతరోపనిషత్ – 2-11, 12 – “
నిహారధూమార్కానలానిలానాం ఖద్యోతవిద్యుత్ స్పటికశశీనాం .....
న తస్య రోగో నజరా నమృత్యుః ప్రాప్తస్య యోగాగ్ని మయం
శరీరమ్” - యోగాభ్యాసము చేయు సమయములో యోగి యొక్క
చిత్తవృత్తి మొదట మంచు వలె, వాయువు వలె కనిపించును.
తరువాత ధూమము వలె, తరువాత సూర్యకిరణముల వలె,
తరువాత అగ్ని వలె, తరువాత సూర్యుని వలె, తరువాత మెరుపు
విద్యుత్ వలె, తరువాత స్పటికము వలె కనిపించును.
యోగాభ్యాసము సిద్ధించిన తరువాత ఆ యోగి శరీరము
యోగాగ్నిమయము అవును. అటువంటి యోగి పంచ
భూతాత్మికమైన శరీరములో ఉండే ప్రతి కణము యోగాగ్నిమయమై
ప్రజ్వరిల్లు తూ ఉంటుంది. అటువంటి యోగి మనస్సులో పరమాత్మ
స్పష్టముగా భాసిస్తా డు. యోగాగ్నిమయమైన యోగి యొక్క
శరీరమునకు వ్యాధి, వార్ధక్యము, మరణము ఉండదు. ఆ యోగి
వీటన్నిటికీ అతీతమైన స్థితికి పొందుతాడు.

ఇతరుల మనస్సు వేగముగా వీచే వాయువులో ఉన్న


దీపము వలె, నిరంతరము కదిలిపోతూ, పరమాత్మ ప్రతిబింబము

391
మనస్సులో పడుతూన్నా, అది ఇటూ, అటూ కదిలిపోతూ లేదా
వెలిగి, ఆరి, వెలిగి, ఆరిన విద్యుత్బల్బు వలె లేదా ఉందా లేదా
అన్నట్లు , కదిలిపోతూ కనిపించి కనిపించని తక్కువ స్థా యిలో
ఉంటుంది.

ఉదాహరణ:

మహాభారతము – మహాభారత యుద్ధము అయిపోయిన


తరువాత, అశ్వత్థా మ తన తండ్రి ద్రోణాచార్యులు మరణమునకు
పాండవులు కారణమనే భ్రమలో (ద్రోణాచార్యులు అధర్మ పక్షమున
యుద్ధము చేశారు. ధర్మము, అధర్మమును ఓడించింది),
ఆవేశముతో పాండవులు వంశము నాశనము అయిపోవాలని, బ్రహ్మ
శిరోమణి అనే అస్త్రమును ప్రయోగించాడు. ఆ అస్త్రము యొక్క
ప్రభావమును తట్టు కొనుటకు, అర్జు నుడు కూడా సమానమైన బ్రహ్మ
శిరోమణి అస్త్రమును ప్రయోగించాడు. ఆ అస్త్రముల ప్రభావములతో,
లోకములలో సంక్షోభము మొదలయింది. అప్పుడు కృష్ణ పరమాత్మ,
వ్యాస మహర్షి, అశ్వత్థా మను, అర్జు నుడిని వాళ్ళ, వాళ్ళ అస్త్రములను
ఉపసంహారము చేయమన్నారు. అశ్వత్థా మ తన అస్త్రమును
ఉపసంహారము చేయుట తనకు తెలియదన్నాడు. అప్పుడు
అర్జు నుడిచే ఆ రెండు అస్త్రములను ఉపసంహారము చేయించారు.
అశ్వత్థా మ తన అస్త్రమును ఉపసంహారము చేయలేదు కాబట్టి, ఆ

392
అస్త్రము యొక్క ప్రభావము పాండవులలో ఎవరో ఒకరి మీద
పనిచేయాలి కాబట్టి, ఆ అస్త్రము యొక్క ప్రభావము అభిమన్యుడి
భార్య ఉత్తర గర్భములో ఉన్న శిశువు మీద పడింది. సదోపవాసి, నిత్య
బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుడు తేజోమయమైన పురుష రూపములో
ఉత్తర గర్భములో గదను తిప్పుతూ, ఆ గర్భములో ఉన్న శిశువును
ఆ అస్త్రము యొక్క ప్రభావమును నుండి రక్షిస్తు న్నాడు. ఆ శిశువు
గర్భములో ఆ దృశ్యమును చూస్తు న్నాడు. ఆ శిశువు పుట్టిన
తరువాత, పసికందుగా, తాను గర్భములో చూసిన తేజోమయమైన
పురుషుడు వంటి వాడు ఎవరైనా ఉన్నారా అని ఇటు, అటు
అందరినీ పరికించి చూస్తు న్నాడు. అలా చూస్తు న్నాడు కాబట్టి, ఆ
పిల్లవాడికి పరీక్షిత్ (పరీక్షగా చూసేవాడు) అని పేరు పెట్టా రు.
తరువాత ధర్మరాజు సుమారు 36 సంవత్సరములు రాజ్యపాలన
చేశారు.

శ్రీకృష్ణుడి నిర్యాణము అయిన వెంటనే ద్వాపరయుగము


అంతము అయి, తరువాత కలియుగము ప్రారంభము అయింది.
ద్వాపరయుగము అంతము మరియు కలియుగము ప్రారంభము
సంధి (మధ్య) కాలములో రాబోయే కలియుగము యొక్క
ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఆ సమయములో పరీక్షిత్ పెరిగి
పెద్దవాడయ్యాడు. ధర్మరాజు కలియుగము ప్రభావము లేకుండా
చూసుకొని, జాగ్రత్తగా పరిపాలన చేశారు. అప్పుడు ధర్మరాజు, పరీక్షిత్
393
కి రాజ్యాభిషేకము చేసి, పాండవులు, ద్రౌపది స్వర్గారోహణకు
వెళ్ళారు. ధర్మరాజు, శ్రీకృష్ణుడు పెంపకము యొక్క ప్రభావముతో,
పరీక్షిత్ మహారాజు కూడా ధర్మముగా, కలియుగము ప్రభావము
లేకుండా చూసుకొని, జాగ్రత్తగా రాజ్య పరిపాలన రాజ్యము
చేస్తు న్నాడు. పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేటకు అరణ్యమునకు
వెళ్ళాడు. మధ్యాహ్నము వరకూ వేటాడాడు, సేవకులు దూరముగా
అయిపోయారు. ఎండ తీక్షణముగా ఉంది. అలసిపోయి, దాహము
వేస్తోంది. ఆ ప్రాతములో ఉన్న శమీక మహర్షి ఆశ్రమములోకి
వచ్చాడు. శమీక మహర్షి, ఆశ్రమము బయట ఎండలో యోగ
సమాధిలో ఉన్నారు. పరీక్షిత్ మహారాజు శమీక మహర్షిని మంచినీళ్ళు
ఇవ్వండి, నాకు దాహముగా ఉన్నది అని రెండు, మూడుసార్లు
ప్రార్థించాడు. శమీక మహర్షి సమాధిలో ఉన్నందున (ఇంద్రియములు
పనిచేయవు), పరీక్షిత్ మహారాజు వచ్చినట్లు కాని, మంచినీళ్ళు
అడుగుతున్నాడని కాని ఏమీ తెలియదు. పరీక్షిత్ మహారాజు, శమీక
మహర్షి ధ్యానములో ఉన్నాడని నటిస్తు న్నాడు, నన్ను పట్టించుకోవట
లేదు అని అనుకుని, ఆ మహర్షిని అవమానము చేయాలని
ఆలోచనతో, దగ్గరలో చనిపోయిన ఒక పాముని ఒక కర్రతో తీసి.
శమీక మహర్షిని మేడలో వేసి, వెళ్ళిపోయాడు. తరువాత శమీక
మహర్షి కుమారుడు వచ్చి, తన తండ్రి మేడలో చనిపోయిన
పామును చూసి, కోపముతో, ఈ పాము వేసినవాడు, వారము

394
రోజులలో పాము కాటుతో మరణించాలి అని శపించాడు. తరువాత
శమీక మహర్షి సమాధి నుండి బయటకు వచ్చి, తాను సమాధిలో
ఉండగా జరిగిన విషయములు తెలుసుకొని, పరీక్షిత్ మహారాజు తన
మేడలో చనిపోయిన పాము వేసినందుకు ఏమీ అనుకోలేదు, కాని
తన కుమారుడు, పరీక్షిత్ మహారాజును శపించినందుకు, ఇదేదో కలి
పురుషుడి ప్రభావమో లేదా దైవ సంకల్పమో అని అనుకొని, చాలా
బాధపడి, ఆ శాపమును ఎవ్వరూ వెనక్కు తీసుకోలేరు, కాబట్టి, తన
కుమారుడిని వెళ్లి, ఆ విషయమును పరీక్షిత్ మహారాజుకు
తెలియచేయమని అన్నాడు.

యోగులకు, యోగాగ్నిమయమైన శరీరము ఉన్న సమాధిలో


ఉన్న వాళ్లకు ఏ మాత్రము అపచారము జరిగినా, ఎంతటి తీవ్రమైన
చెడు ఫలితము ఉంటుందో అనేదానికి, ఇది స్పష్టమైన ఉదాహరణ.

 యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।


యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ॥ 20 ॥

యోగాభ్యాసముతో చిత్తవృత్తి (మనస్సును) నిరోధించుకున్న


లేదా నిగ్రహించుకున్న యోగికి ఏ దశలోనైతే, చిత్తవృత్తి
(మనస్సును) పూర్తిగా ఉపశమనమై, ప్రశాంతముగా ఉంటుందో

395
(నివాతస్థ దీపము వలె) లేదా ప్రాపంచకమైన ఆలోచనలు సమాప్తము
చేసి, పరమాత్మ యందు లగ్నమైపోతుందో,

ఎప్పుడైతే తన ఆత్మ స్వరూపమును, తన మనస్సుతో


చూడగలుగుతాడో, ఆ ఆత్మ ప్రకాశమును యోగి
అనుభవించగలుగుతాడో, ఆ దశలో తన మనస్సులో పరిపూర్ణమైన
తృప్తితో శాశ్వతమైన, దివ్యమైన బ్రహ్మానందమును
అనుభవించగలుగుతాడు. తన ఆత్మలో తాను రమించగలుగుతాడు.

యోగాభ్యాసముతో మనస్సుని నిశ్చల స్థితిలోకి వచ్చిన


తరువాత, యోగాభ్యాసము సిద్ధించిన తరువాత, సమాధి స్థితిలో
ఆత్మ ప్రకాశము మనస్సులో కదలకుండా స్పష్టముగా ప్రతిబింబించిన
స్థితిలో, పరిపూర్ణమైన తృప్తితో తనలో తాను ఆనందము
పొందుతాడు.

 సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం ।


వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ॥ 21 ॥

సాధారణమైన బుద్ధి కలవారికి అనుభవములోనికి రాని,


ఇంద్రియ సుఖముల కంటె అతీతమైన, అన్ని సుఖములలో కెల్ల
ఉత్తమోత్తమమైన, అలౌకికమైన, శాశ్వతమైన, దివ్యమైన సుఖము,

396
యోగాభ్యాసములో నిర్వికల్ప సమాధి చేరుకున్నవారి పరిశుద్ధమైన
బుద్ధికి మాత్రమే అనుభవమునకు వచ్చును.

ఆ సాధకుడు, తన ఆత్మ జ్ఞాన స్వరూపము స్థితి నుండి ఏ


మాత్రము కదలకుండా, నిశ్చలమైన ఆత్మ తత్త్వ జ్ఞాన స్థితిలో
స్థిరముగా ఉన్నాడు.

తైత్తీరీయోపనిషత్ – ఆనందవల్లి - 2-8-1 నుండి 4 వరకు –


“స ఏకో మానుష ఆనన్డః I శ్రోత్రయస్య చకామహతస్య II తేయే
శతం మానుషా ఆనన్దాః...........తే యే శతం ప్రజాపతే రానన్దాః I స
ఏకో బ్రాహ్మణ ఆనందః” – మనుషుల ఆనందము కంటె నూరు
రెట్లు మనుష్య గంధర్వ ఆనందము. మనుష్య గంధర్వ ఆనందము
కంటె నూరు రెట్లు దేవ గంధర్వ ఆనందము. దేవ గంధర్వ
ఆనందము కంటె నూరు రెట్లు పితృ దేవతల ఆనందము. పితృ
దేవతల ఆనందము కంటె నూరు రెట్లు అజానజ దేవతల
ఆనందము. అజానజ దేవతల ఆనందము కంటె నూరు రెట్లు కర్మ
దేవతల (పుణ్య కర్మలు చేసి వాటి ఫలితముగా దేవతలు అయిన
వాళ్ళు) ఆనందము. కర్మ దేవతల ఆనందము కంటె నూరు రెట్లు
దేవతల ఆనందము. దేవతల ఆనందము కంటె నూరు రెట్లు
ఇంద్రు డి ఆనందము. ఇంద్రు డి ఆనందము కంటె నూరు రెట్లు
బృహస్పతి ఆనందము. బృహస్పతి ఆనందము కంటె నూరు రెట్లు

397
ప్రజాపతి ఆనందము. ప్రజాపతి ఆనందము కంటె నూరు రెట్లు
బ్రహ్మానందము. ఆ బ్రహ్మము మానవుల హృదయములో ఉన్నది.

“సమాధి నిర్భూత మలస్య చేతసః నివేసిత స్యాత్మని సుఖం


భవేత్ న సఖ్యతే వరైంతుమ్ నిరాసిదా స్వయం తదంతఃకరణం నైన
దృశ్యతే” – యోగములో నిర్వికల్ప సమాధి పొందిన తరువాత, ధర్మ
మేఘము వర్షములో, లోపల ఉండే కల్మషములు పూర్తిగా
కొట్టు కుపోయి, మనస్సు పూర్తిగా పరిశుభ్రమై మనస్సు నిర్మలమై
ప్రశాంతముగా ఉన్న తరువాత, మనస్సును ఆత్మ యందే స్థిరముగా
లీనమైన సాధకుడికి కలిగే ఆద్యంతిక సుఖమును
(పరమానందమును) ఎవ్వరూ, ఏ మాటలతోనూ వర్ణించలేరు,
చెప్పలేరు. గౌడపాదాచార్యులు (ఆది శంకరాచార్యుల గురువుగారికి,
గురువుగారు) – “నా స్వాదాయేత్ సుఖం తత్ర నిస్సంగ ప్రజ్ఞా
యాచాలే” – యోగికి కలిగిన శాశ్వతమైన అలౌకిక దివ్య
ఆనందమును ఆస్వాదన చేయకూడదు (నాకే ఆ ఆనందము
కలిగినది, ఇంకెవరికీ కలగలేదు, అని అనుభవించకూడదు). ఏ
రకమైన సంబంధము లేకుండా జ్ఞాన స్వరూపమైన ఆత్మలో
స్థిరముగా లీనమై ఉండాలి. ఉదాహరణ: పాలు, ద్రాక్ష, తేనె, చెరకు
రసము అన్నీ తీయగానే ఉంటాయి. కాని వాటి తీపితనములలో
ఉండే అంతరములను, బేధములను, తేడాలను వర్ణించుటకు

398
సరస్వతీ దేవికి కూడా శక్యము కాదు. శబ్దములను మించిన
అనుభవము ఉంటుంది).

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః ।


యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ॥ 22 ॥

ఏ సుఖమును పొందితే, దీనికంటె ఇంకో గొప్ప సుఖము


ఉంది ఆ గొప్ప సుఖమును నేను పొందాలి అని అనిపించనే
అనిపించదు. ఈ సుఖమే సర్వోత్తమమైన సుఖము యొక్క
అనుభవము కలుగుతుంది.

ఆ సుఖములో ఉంటే, ఎంత పెద్ద దుఃఖమైనా మనస్సును


చేరలేదు, బాధించలేదు.

మానవులలో సాధారణముగా ఉండే స్వభావము తనకు


కలిగిన సుఖమును అనుభవించకుండా, దీని కంటె ఇంకా ఎక్కువ
సుఖము ఉంది, ఆ సుఖము నాకు కావాలనే తపన, లేదా ఇంకొకడికి
ఇంతకంటే ఎక్కువ సుఖము ఉంది, అది నాకు లేదే అనే అసూయ,
బాధ వేధిస్తూ ఉంటుంది. ఈ బాధ తన దగ్గర ఉన్న సుఖమును
కలుషితము చేస్తోంది.

ఉదాహరణ:

399
రమణ మహర్షి గారికి వీపు మీద కాన్సరు పుండు వేసింది.
చాలా పెద్ద పుండు అయింది. డాక్టర్ ఆపరేషను చేయాలి,
ఆపరేషనుకు మత్తు మందు ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పారు. రమణ
మహర్షి గారు మత్తు మందు ఇంజక్షన్ నిరాకరించి, ఇంజక్షన్
చేయకుండానే ఆపరేషనుకు అంగీకరించారు. ఆపరేషను
సమయములో ఆ బాధ రమణ మహర్షి గారి మనస్సును చేరలేదు,
బాధించలేదు.

 తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితం ।


స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ॥ 23 ॥

చిత్తవృత్తి నిరోధముతో కూడిన సమాధిని, లోపల


దుఃఖములు వాటి, వాటి సంబంధములను విడిచిపెట్టి పారిపోతున్న
స్థితిని యోగము అంటారు. యోగము అంటే ఏదో కొత్తది
కలుగుతున్నది అని కాదు. ఉన్న కష్టము విడిచి వెళ్ళిపోతున్నది.

యోగములో నిర్వికల్ప సమాధి, ఆ సమాధిలో ఆత్మ స్వరూప


జ్ఞానము, ఈ రొండింటినీ జాగ్రత్తగా నిశ్చయమైన సంకల్పముతో
సాధించుకోవాలి. ఏ దశలోనూ నిర్వేదము (నిరాశ, హేయము)
పడకూడదు. ధృఢమైన, నిశ్చయమైన సంకల్పముతో సాధన
చేసుకుంటూనే ఉండాలి.
400
అనాది నుండి జన్మజన్మలలో మనము (జీవుడు)
సంపాదించుకున్న సంస్కారములు, పుణ్య పాపములు, సుఖ
దుఃఖములు రకరకాల పాపములు, దుఃఖములు బలంగా పట్టు కొని
పీడిస్తు న్న జీవుడిని వదలి వెళ్లిపోవుట అంత సులభముగా ఉండదు.
అనవసరమైన దుఃఖములను వదిలించుకొని, పోగొట్టు కొని, తనకు
(ఆత్మకు) సహజముగా ఉండే ఆనందమును పొందే దశను
యోగము అంటారు.

గౌడపాదాచార్యులు (ఆది శంకరాచార్యుల గురువుగారికి,


గురువుగారు) – “ఉత్సేక ఉదభేర్యద్యత్ కుశాగ్రే నైక బిందునా
మనసో నిగ్రహ సద్వత్ భావే అపరిఛేదసః” – ఒక పెద్ద
సముద్రమును ఖాళీ చేయుటకు, ఒక దర్భ పుల్ల (గడ్డిపరక) ఇచ్చి,
దానిని సముద్రములో ముంచి, దానికి అంటుకున్న నీటి బిందువును
బయటకు పారపోస్తూ సముద్రమును ఖాళీ చేయుట ఎంత
సమయము, ఎంత శ్రమ ఉంటుందో, అంత సమయము, శ్రమ
యోగ సిద్ధికి, ఆత్మ జ్ఞానమునకు పట్టవచ్చు. కాని దాని గురించి
ఆలోచించకుండా నిశ్చయమైన బుద్ధితో, మనస్సు యొక్క
నిగ్రహముతో, ఏ మాత్రము దుఃఖము, నిరాశ పడకుండా, యోగ
సాధనను కొనసాగిస్తూ యోగ సిద్ధిని సాధించుకోవాలి. “శాస్త్రా చార్య
వచన తాత్పర్య విషయః సత్య ఏవ” – శాస్త్ర వాక్యములలో, గురువు

401
వాక్యములు నిజమైనవి, సత్యములు ఆనే దృఢమైన విశ్వాసముతో
సాధనను కొనసాగించాలి. అప్పుడు పరమాత్మ అనుగ్రహము కూడా
లభిస్తుంది.

ఉదాహరణ:

రెండు (దంపతులైన) చిన్న పిట్టలు, సముద్ర తీరములో


గుడ్లు పెట్టు కున్నాయి. సముద్రపు అలలు కొంచము ముందుకు
వచ్చి ఆ గుడ్లను సముద్రములోనికి తీసుకువెళ్లిపోయాయి. తమ
గుడ్లను తీసుకుపోయినందుకు ఆ పిట్టలకు, సముద్రు డు పైన
కోపము వచ్చి, సముద్ర తీరములో ఉన్న ఇసుకను సముద్రములో
వేసి, సముద్రపు నీటిని ఎండగట్టి, మా గుడ్లను మేము తెచ్చుకోవాలని
ఆలోచించి, ముక్కుతో కొన్ని ఇసుక రేణువులను తీసుకొని
సముద్రములో వేస్తు న్నాయి. మరలా అలాగే వేస్తూ, వేస్తూనే
ఉన్నాయి. వాటి ధృఢమైన సంకల్పమును మాత్రము వదులుకోలేదు.
కొన్నాళ్ళకు నారద మహర్షి వచ్చి, ఆ పిట్టలను ఏమి చేస్తు న్నాయి అని
అడిగారు. ఆ పిట్టలు, మా గుడ్లను ఈ సముద్రు డు మింగేశాడు. ఈ
సముద్రపు నీటిని ఎండగట్టి, మా గుడ్లను మేము తెచ్చుకోవాలని అని
చెప్పాయి. నారద మహర్షి మీకున్న సామర్ధ్యముతో మీరు ఈ పని
చేయలేరు అని చెప్పాడు. కాని ఆ పిట్టలు, మేము ఎంత కష్టపడినా
సరే, ఎన్నాళ్ళు పట్టినా సరే, మేము మా గుడ్లను తెచ్చుకోవలసినదే

402
అని వాటి దృఢమైన నిశ్చయమును, నారద మహర్షికి చెప్పాయి.
నారద మహర్షి ఎంత చెప్పినా వినకుండా, ఆ పిట్టలు, అవి అనుకున్న
పనిని చేస్తూనే ఉన్నాయి. నారద మహర్షి, గరుత్మంతుడి దగ్గరకు వెళ్లి,
ఈ పిట్టల విషయము చెప్పి, నీ జాతి పిట్టలు అంత కష్టపడుతుంటే,
నీవు ఏమీ పట్టించుకోకుండా, తల మీద కిరీటము పెట్టు కొని
హాయిగా ఉన్నావు. నీవు ఏ విధమైన పక్షులకు రాజువు అని
అడిగాడు. గరుత్మంతుడికి సముద్రు డిపై కోపము వచ్చి, ఆ
సముద్రము దగ్గరకు వచ్చి వేగముతో తన రెక్కలను ఆడించి,
నీళ్ళను చిందరవందర చేసి ఆ పిట్టల గుడ్లు , ఆ పిట్టలకు ఇస్తా ను అని
చెప్పి, తన రెక్కలను ఆడిస్తూ నీళ్ళను చిందరవందర చేస్తుంటే,
సముద్రు డు, గరుత్మంతుడితో నీవు చాల శక్తి కల పెద్ద గ్రద్దవి, అవి
చిన్న పిట్టలు, మీ మధ్య విరోధములు కూడా ఉన్నాయి. ఆ చిన్న
పిట్టలను గ్రద్దలు ఆహారముగా తింటాయి కూడా. నీవు, నేను గొప్ప
శక్తిమంతులము. మన ఇద్దరి స్నేహము చాలా మంచిది. ఆ చిన్న
పిట్టల సంగతి వదిలేయి అని అన్నాడు. గరుత్మంతుడు సముద్రు డి
మాటలను ఒప్పుకోలేదు. మర్యాదగా ఆ పిట్టల గుడ్లను నీ అలలతో
సముద్ర తీరమునకు తోసి, ఆ పిట్టలకు ఆ గుడ్లను తిరిగి ఇచ్చేయి.
లేదా, నేను నా రెక్కలతో నీ నీళ్ళను చిందరవందర చేసి, ఈ భూమి
మీద సముద్రము లేకుండా చేస్తా ను అని అన్నాడు. సముద్రు డు

403
భయపడి, తన అలలతో సముద్ర తీరమునకు తోసి, ఆ పిట్టలకు ఆ
గుడ్లను తిరిగి ఇచ్చేస్తా డు.

ఇది గరుత్మంతుడి గెలుపా? లేక నారదుడి గెలుపా? ఆ పిట్టల


గెలుపా? కాదు ఆ పిట్టల ధృఢ నిశ్చయము, చిత్త శుద్ధమైన
విశ్వాసము, ప్రయత్నము మరియు ఆ నిశ్చయము యొక్క
ఆచరణ యొక్క గెలుపు. ఈ విధముగా చిత్త శుద్ధమైన
విశ్వాసముతో యోగ సాధన చేసుకుంటే, పరమాత్మ తప్పకుండా
సహకారము చేసి తీరతాడు.

సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః ।


మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః ॥ 24 ॥

మనస్సులో కోరికలు లేదా ద్వేషము సంకల్పము, ఆలోచనల


నుండి పుట్టు తున్నాయి. ఈ సంకల్పములను, ఆలోచనలను,
కోరికలను ఏ మాత్రము శేషము లేకుండా, ఏదీ మిగలకుండా,
మూలము లేకుండా పూర్తిగా విడిచిపెట్టెయ్యాలి. “శత్రు శేషము,
కామ శేషము ఉండకూడదు”.

ఇందుకు ముందు మనస్సులో వివేకము అభ్యాసము


చేసుకొని, వివేక యుక్తమైన మనస్సును సాధనముగా
ఉపయోగించుకోవాలి. వివేకమైన మనస్సుతో మిగిలిన
404
ఇంద్రియములను వాటి, వాటి విషయముల వైపు వెళ్ళకుండా
పూర్తిగా నియంత్రించుకొని, పరమాత్మ మీద స్థిరముగా ఉంచే
ప్రయత్నము చేయాలి.

ఎప్పుడైతే మనస్సు మన వశములోకి వస్తుందో, అప్పుడు ఆ


వశమైన మనస్సుతో, ఇంద్రియములను మన అదుపులోకి తీసుకొని,
ప్రశాంతమైన మనస్సుతో యోగ సాధన సులభముగా
చేసుకోవచ్చును.

ఉదాహరణ:

ఒక వ్యక్తి, ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని ఒక


హల్వా ముక్క ఇచ్చాడు. ఆ వ్యక్తి, హల్వాను కొంత తిన్నాడు. ఆ
యజమాని ఎలా ఉంది అను అడిగాడు, ఆ వ్యక్తి చాలా బాగుంది,
ఇది ఎక్కడ కొన్నారు, ఇందులో ఏయే పదార్ధములు వేశారు అని
అడిగాడు. ఆ యజమాని ఆ హల్వాను ఎక్కడ కొన్నాడో, అందులో
ఏయే పదార్థములు వేస్తా రో అన్నీ చెప్పి, హల్వా రుచి మనుషులకైతే
తెలుస్తుంది, కాని కుక్కలకు ఏమి తెలుస్తుంది. ఇదే హల్వా ముక్కని
మా కుక్కకు పెట్టా ను. మా కుక్క ఈ హల్వా ముక్కని నాకి,
తినకుండా వదిలేసింది. కాని అదే ముక్కను నీకు పెట్టితే ఎంత
చక్కగా తింటున్నావు, హలా రుచి కుక్కలకు తెలియదు,

405
మనుష్యులకే తెలుస్తుంది అని అన్నాడు. అది విన్న ఆ వ్యక్తి మిగిలిన
ఆ హల్వా ముక్క తినగలడా? లేదా కొంత తిన్న హల్వా కడుపులో
నుండి బయటకు వస్తుందా? అందరూ ఊహించుకోగలరు.

ఎందుకు ఇలా అవుతున్నది? అంతవరకూ హల్వా బాగుంది


అనే ఆలోచన, ఆ హల్వా కుక్క నాకింది అనే తెలియగానే,
అంతవరకూ బాగా అనిపించిన ఆ హల్వా చెడ్డదిగా మారిపోయి, ఆ
హల్వా ముక్క మీద తీవ్రమైన వైరాగ్యము కలిగి, కడుపులోది కూడా
బయటకు వస్తుంది. ఇదంతా మనస్సుతో చేసే ఆలోచనలవలన
కలిగే భావనలతో జరుగుతుంది.

ప్రాపించక ప్రతీ వస్తు వులు మొదట కొంచము సుఖము


కలిగించినా, చివరకు దుఃఖమునే తీసుకువస్తుంది. ప్రాపంచకమైన
వస్తు వులలో దుఃఖ స్పర్శ లేని సుఖము లేనేలేదు, శాశ్వతమైన
సుఖము దీనివలన రాదు అనే వివేకము ధృఢ పరచుకున్నట్లయితే,
కుక్క నాకిన హల్వాను ఎంత సులభముగా విడిచి పెట్టా రో, అంత
సులభముగా, అంతే వైరాగ్యముతో, ఈ ప్రపంచములో ఉండే అన్ని
వస్తు వులను, సుఖములను విడిచిపెట్టగలరు. ద్వేషమును దగ్గరకు
రానీయకుండా, అనవసరము అనే భావమును, వైరాగ్యమును
పెంచుకుంటూ, ఇంద్రియ జయమును సంపాదించుకొని, తత్త్వ
జ్ఞానమును పొందుటకు ప్రయత్నము చేసుకోవాలి.

406
ఉదాహరణ:

ఒక మహర్షి, ఒక అరణ్యములో ఒక చిన్న శివాలయమును


ఏర్పాటు చేసుకొని, ఒంటరిగా ఆ పరమేశ్వరుడికి అభిషేకము,
తపస్సు, యోగ సాధన చేసుకుంటూ, ఆయన జీవితము యొక్క
చివరి క్షణములో సిద్ధిని పొందాడు. ఆ మహర్షికి ఒక ఆలోచన
వచ్చింది. నా జీవితము అయిపోవచ్చింది, జీవితమంతా ఎంతో
కష్టపడి, ఒంటరిగా సాధన చేసుకుంటే, ఈ సిద్ధి కలిగింది. ఇక
ముందు తరము వాళ్ళు, నా అంత కష్టపడకుండా, పరమేశ్వరుడి
అనుగ్రహము మరియు సిద్ధిని సులభముగా పొందుటకు నా సిద్ధిని,
తపస్సును దానము చేసి, సులభమైన సాధనను ఏర్పాటుచేయాలి
అని అనుకొని, దానికి పరమేశ్వరుడి అనుమతి తీసుకొని, ఒక చిన్న
కుండలో తన తపస్సును అంతా ధార పోసి, ఆ కుండ మీద,
“ఎవరైనా సరే (సుమారు 15 ౦ మెట్లు క్రిందలో ఉన్న నదిలోని
జలమును) ఈ కుండతో 108 సార్లు క్రిందకు వెళ్లి, 108 కుండల
నదీ జలమును తీసుకు వచ్చి, ఈ శివుడికి 108 సార్లు అభిషేకము
చేస్తే, పరమేశ్వరుడు ప్రత్యక్షము అయి, వాళ్ళ కోరికలు అన్నీ
తీరుస్తా డు” అని వ్రాసి, ఆ కుండను ఆ శివాలయములో పెట్టి, ఆ
మహర్షి సిద్ధి పొందాడు. చాలా కాలము జరిగిపోయింది. అడవిలో
మారుమూల ఉన్న ఆ శివాలయమునకు ఎవరూ రాలేదు. కొన్నేళ్ళ

407
తరువాత, ఒకతను అడవిలో దారి తప్పి, ఆ శివాలయము వైపు వచ్చి,
ఆ శివాలయములో ఉన్న ఆ కుండను చూసి, దాని మీద వ్రాసిన
దానిని చదివి, ఎలాగూ దారి తప్పి, నా అదృష్టము కొద్దీ ఇక్కడకు
వచ్చాను. తొందర పనులు కూడా ఏమీ లేవు. ఈ కుండ మీద
వ్రాసినట్లు నేను చేసి, శివుడిని ప్రత్యక్షము చేసుకొని, నా కోరికలు తీర్చే
వరము పొంది వెళ్లి పోదాము అని అనుకొని, ఆ కుండను తీసుకొని,
ఆ కుండతో ఆ మెట్లు దిగుతూ, నదీ జలమును పైకి తీసుకు వస్తూ,
శివుడికి అభిషేకము చేస్తూ ఉన్నాడు. 50 సార్లు పూర్తి చేశాడు. చాల
కష్టము అని అనిపించింది. ఎవరో వ్రాసిన దానిని గుడ్డిగా నమ్మి
చేస్తు న్నానా, అని అనుమానము వచ్చింది. ఇటూ అటూ చూశాడు.
ఏమీ కనిపించలేదు. తరువాత కష్టపడి ఇంకొక 40 సార్లు (మొత్తము
90 సార్లు ) పూర్తి చేసి, శివుడు వస్తుంటే ఆయన ముందు ఎంతో
మంది ప్రమద గణములతో, ఎన్నో వాయిద్యములతో పెద్ద
ఊరేగింపుతో వస్తా డు కదా అని ఊహించుకొని, ఏమైనా అటువంటి
శబ్దములు, అలజడిలు దూరములో ఉన్నాయా అని చూశాడు. ఏమీ
కనిపించలేదు, ఏమీ వినిపించ లేదు. ఆ కుండ మీద వ్రాసిన దానిపై
అనుమానము వచ్చి, మిగిలిన 18 సార్లు చేయాలని అనిపించ లేదు,
కాని కష్టపడి ఇంకొక 17 సార్లు (మొత్తము 107 సార్లు ) పూర్తిచేసి,
దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి, అలా దూరములో శివుడు వస్తు న్నాడేమో
అని అన్ని వైపులా చూసి, ఏ అలజడి కనిపించక, వినిపించక పోయే

408
సరికి, ఆ కుండ మీద వ్రాసిన దానిపై అతని అనుమానము ధృఢమై,
కోపము వచ్చి ఆ కుండను ఎత్తి కొట్టి, పగల కొట్టా డు. వెంటనే ఆ
శివలింగము నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఎరా ఎంత బుద్ధి
తక్కువ పని చేసావు, ఇంకొక సారి నీవు శ్రద్ధగా నాకు అభిషేకము
చేసినట్లయితే, నీ ప్రయత్నము సఫలమయ్యేది. ఆ మహర్షి
జీవితమంతా కష్టపడి, తపస్సు చేసుకొని, మీ లాంటి వాళ్లకు మంచి
చేయాలని ఉద్దేశముతో చేసిన పనిని నీవు వృధా చేసావు.
ఇంకొకళ్ళకు కూడా అవకాశము లేకుండా ఆ కుండను పగలకొట్టా వు
కూడా. నీకు పూరి విశ్వాసము లేక, ఫలితము మీద ఆశతో 107
సార్లు మొక్కుబడిగా చేసిన దానికి అటువంటి ఫలము మాత్రమే
దక్కుతుంది, కాని ఆ మహర్షి సంకల్పించిన పూర్తి ఫలము నీకు
దక్కదు అని చెప్పి అదృశ్యమయ్యాడు.

 శనైః శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా ।


ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ॥ 25 ॥

నీ లక్ష్యము సిద్ధించేంత వరకూ, కొద్ది కొద్దిగా, మెల్ల మెల్లగా,


నిదానముగా, ఓర్పుతో బాహ్యమైన ప్రాపంచక విషయముల నుండి
మనస్సును వెనక్కు మరల్చుకుని లోపలకి తీసుకున్న తరువాత

409
కేవలము పరమాత్మ స్వరూపము మీదే మనస్సును
స్థిరముగా కేంద్రీకరించి, వేరే ఏ ఇతర విషయము గురించి కొంచము
కూడా ఆలోచించకూడదు.

ఈ విషయములో ఏ మాత్రము తొందర పడకూడదు. దీనికి


ఎప్పుడు ఫలితము కలుగుతుందా అని కూడా ఆలోచించ కూడదు,
సాధన చేస్తూనే ఉండాలి. దీనినే గంగా దేవిని భూమి మీదకు తీసుకు
రావటానికి చేసిన భగీరథి ప్రయత్నము అని కూడా అంటారు.
ఫలితము తప్పకుండా దక్కి తీరుతుంది.

కఠోపనిషత్ – 1-3-13 – “యచ్ఛే ద్వా ఙ్మనసీ ప్రాజ్ఞ


స్తద్యచ్ఛేత్ జ్ఞాన ఆత్మని I జ్ఞాన మాత్మని మహతి నియచ్ఛే త్త ద్యచ్ఛే
చ్ఛాన్త ఆత్మని” – బాగా బుద్ధి శక్తి ఉన్నవాడు, తెలివైన వాడు, జ్ఞాని
బాహ్య ఇంద్రియములను (జ్ఞానేంద్రియములను,
కర్మేంద్రియములను) వెనక్కు మనస్సులోకి మరల్చుకొని,
ఇంద్రియములను మనస్సులో స్థిరముగా నియంత్రించుకొని,
మనస్సును జ్ఞాన స్వరూపమైన ఆత్మలో నిలబెట్టు కొని, నేను లేదా
నాది అనే భావన ఎక్కడ నుండి వస్తోందో (హిరణ్య గర్భ తత్త్వము,
మహాత్ తత్త్వము, సమిష్టి బుద్ధి తత్త్వము) గమనించుకొని,
పరిశుద్ధమైన పరమాత్మ తత్త్వమును తెలుసుకోవాలి.

410
పతంజలి యోగ సూత్రము – 1-2 –“యోగ చిత్త వృత్తి
నిరోధః” – మనస్సులోని ఆలోచనలను నిరోధించుట,
నిలిపివేయుట, ఆపివేయుట. మనస్సు ఐదు విధములుగా
ప్రవర్తిస్తుంది. 1. క్షిప్త – చంచలమైన అటు, ఇటు పరిగెత్తే స్థితి (కోతి
మనస్సు), 2. ముద్ద – బద్ధకమైన, నిద్ర పోయే స్థితి (గాడిద
మనస్సు), 3. విక్షిప్త – కొంచము సేపు కేంద్రీకరించే స్థితి
(సీతాకోకచిలుక మనస్సు), 4. ఏకాగ్ర – ఒకే దానిమీద, లక్ష్యము
మీద (ఆత్మ తత్త్వము మీద) కేంద్రీకరించే స్థితి, 5. నిరుద్ధ - మనస్సు
పూర్తిగా కేంద్రీకరించి ఆలోచనలు పూర్తిగా ఆగిపోయి, ఆత్మలో
లయమైన నిశ్చలమైన స్థితి.

యతో నిరుద్ధం నిశ్చరతి మనశ్చంచలమస్థిరం ।


తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ॥ 26 ॥

ఏ పని చేస్తు న్నా సరే, ఏ ప్రయత్నము చేసినా సరే ఈ


మనస్సు ఇంకొక విషయము మీదకు పారిపోతోంది. ఏ కారణముతో
పారిపోతున్నా సరే, మనస్సు చంచలము, నిరంతరము అటు, ఇటు
పరుగెట్టే స్వభావము కలది అని అర్ధము చేసుకొని, ప్రవాహమునకు
ఎదురీత ఈదిన్నట్లు గా

411
కష్టపడి ఆ యా విషయములు నీ కెందుకు అని మనస్సుకి
ప్రేమతో ప్రియముగా నచ్చ చెప్పి, మనస్సుని మళ్ళీ, మళ్ళీ వెనక్కు
తీసుకు వచ్చి, తన లక్ష్యమైన ఆత్మ తత్త్వము మీదే కేవలము
స్థిరముగా కేంద్రీకరించి ఉంచాలి.

మనస్సు త్రిగుణాత్మకమైనది. ఈ మూడు గుణముల


యొక్క లక్షణము నిరంతరము ఒక గుణము మీద మరొక
గుణము అధిగమించాలని మూడు గుణములు ఒకదానితో
మరొకటి యుద్ధము చేస్తూనే ఉంటాయి. అందుచేత మనస్సు
చంచలమైన స్వభావము, నిరంతరము కదిలిపోయే లక్షణము కలది.
సాధారణ మానవులలో ఇంద్రియములలో, మనస్సులో, బుద్ధిలో
ఆలోచనల ప్రవాహముతో, అలలతో కలత, వ్యాకులత, అశాంతి,
అలజడి, అల్లకల్లోలము ఉంటుంది. ఇంద్రియ నిగ్రహము, మనో
నిగ్రహము, స్థిరమైన బుద్ధిని – ఏ విధమైన ఆలోచనల అలజడి లేని
ప్రసన్నమైన స్థితిని కఠోపనిషత్ “జ్ఞాన ప్రసాదః” – మనస్సు, బుద్ధి
యొక్క ప్రసన్నత అని అంటుంది. .

కఠోపనిషత్ – 2-3-10 – “యదా పంచావతిష్టంతే, జ్ఞానినా


మనసా సహ I బుద్ధిశ్చ న విచేష్టతి, తా మాహుః పరమాం గతిమ్” -
ఐదు జ్ఞానేంద్రియములు వాటి, వాటి ప్రాపంచక విషయముల మీద
ప్రసరించుట వాటి సాధారణమైన లక్షణము. యోగ సాధకుడు ఆ

412
ఐదు జ్ఞానేంద్రియములను ప్రాపంచక విషయముల నుండి వెనక్కు
మరల్చి, వాటి, వాటి స్థా నములలో స్థిరముగా నిలుపుకొని, మనస్సుని
కూడా ఆ యా విషయములను ఆలోచించకుండా, బుద్ధిలో స్థిరమైన
నిశ్చయముతో ఆత్మ స్వరూపము మీద స్థిరముగా ఉంచుకొనే స్థితిని
సాధించుకోవాలి. 2-3-11 - “తాం యోగమితి మన్యన్తే స్థిరా
మిన్ద్రియ ధారణాం I అప్రమత్త స్తదా భవతి, యోగో హి
ప్రభవాప్యయౌ” – ఈ స్థితిని యోగము అని అంటారు. యోగములో
ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని స్థిరముగా ఉంచుకోవటమే
ప్రధానము. మనస్సు ఏ విధమైన ఆలోచనలు, అలజడి లేని
ప్రశాంతమైన స్థితిని సాధించుకున్న తరువాత జాగ్రత్తగా ఆ స్థితిలో
స్థిరముగా ఉంచుకోవాలి. ఏ మాత్రము అజాగ్రత్తతో ఉన్నా మనస్సు
ఆలోచనలలోకి పారిపోతుంది. అప్పుడే యోగము సిద్ధిస్తుంది.

ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ।


ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం ॥ 27 ॥

మనస్సు సంపూర్ణమైన ప్రశాంతతను సాధించుకున్న యోగి


అత్యుత్తమమైన, శాశ్వతమైన సుఖమును, బ్రహ్మానందము
పొందుతాడు. అత్యుత్తమమైన, శాశ్వతమైన సుఖము దానంతట
అదే వచ్చి ఆ యోగిని వరిస్తుంది.

413
ఈ సుఖము కలగాలంటే, మనస్సులో ఏ విధమైన ప్రకృతి
యొక్క గుణముల దోషములు లేశమంత కూడా ఉండకూడదు. ఏ
విధమైన పుణ్య, పాపములు అనే కల్మషములు కూడా
ఉండకూడదు. ఆ స్థితిలో యోగి పరమాత్మతో ఐక్యమై, లీనమై,
మమేకమైపోతుంది.

పతంజలి యోగ సూత్రము – 1-33 – “మైత్రి, కరుణ,


ముదిత, ఉపేక్ష, సుఖము, దుఃఖము, పుణ్య అపుణ్య, విషయనము,
భావనాతః, చిత్త, ప్రసాదనము – ఎవరికైనా మంచి జరిగితే వాళ్ళపైన
స్నేహము లేదా సంతోషము, ఎవరికైనా కష్టము కలిగితే వారిపై కరుణ
లేదా దయ, ఎవరైనా మంచి కార్యములు చేస్తే వాటిపై సద్భావన
మరియు ఎవరైనా పాప, చెడు కార్యములు చేస్తే వాటిని ఉదాసీనత
(పట్టించుకోని) భావములను పెంపొందించుకొని, సంతోషము,
దుఃఖము, పుణ్యము, పాపము, ప్రాపంచక విషయములపైన
విముఖతను పెంచుకుంటే మనస్సు శుద్ధమై ప్రశాంతత
పొందుతుంది.

యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః।


సుఖేన బ్రహ్మసంస్పర్శమ్ అత్యంతం సుఖమశ్నుతే ॥ 28 ॥

414
ఈ విధమైన యోగమును ప్రయత్నము, సాధన చేస్తూ,
నిరంతరము మనస్సులో ప్రసన్నత నిలబెట్టు కున్న యోగికి
మనస్సులో ఏ విధమైన దోషములు, కల్మషములు లేకపోవుట వలన

ఆ యోగి సునాయాసముగా, ఏ విధమైన శ్రమ లేకుండా


వినాశనము లేని, శాశ్వతమైన, అనంతమైన బ్రహ్మానందమును,
అత్యంతమైన సుఖమును పొందుతాడు.

యోగ సాధన మొదట్లో యోగ అంతరాయములను


ఎదుర్కోవలసి వస్తుంది. యోగ సాధన మొదట్లో కష్టముగా
అనిపించినా, యోగము సిద్ధించిన తరువాత, ఏ కష్టము లేకుండా,
సునాయాసముగా ఊహించలేని, అనంతమైన అత్యుత్తమమైన
ఫలితము లభిస్తుంది.

పతంజలి యోగ సూత్రములు – 1-30 – “వ్యాధి స్త్యాన


సంశయము ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శనమ్ అలబ్ద
భూమికత్వ అనవస్థి తత్వాని చిత్త విక్షేపాస్ తే అంతరాయః” – 1.
వ్యాధి లేక రోగము, 2. స్త్యాన - జాడ్యము లేక మంద స్వభావము
లేదా ఏ పనీ చేయని స్వభావము, 3. సంశయము - సందేహముతో
లేక అనుమానముతో ఏ పనీ ప్రారంభము కూడా చేయకపోవుట. 4.
ప్రమాద - చేయవలసిన పనిని చేయక, చేయకూడని పనిని శ్రద్ధగా
415
చేయుట లేదా అజాగ్రత్త లేక నిర్లక్ష్యము, బద్ధకము. 5. ఆలస్య –
చేయవలసిన, చేయగలిగిన పనిని చేయాలని మనస్సులో కూడా
అనుకోకపోవటము. అసలు ప్రారంభించ పోవటము. 6. అవిరతి –
ఇంతవరకు మనకు అలవాటై న వస్తు వులను, అలవాట్లను
వదిలిపెట్టు కోలేకపోవుట. 7. భ్రాంతి దర్శనమ్ – మనము
సాధించుకోవలసిన లక్ష్యము అక్కర లేదు, లేదా అసలు అలాంటి
లక్ష్యము లేదు అని అనిపిస్తుంది. మనకు అక్కరలేని లక్ష్యము
సర్వోత్తమము, అదే కావాలి అని అనిపిస్తుంది. 8. అలబ్ద
భూమికత్వమ్ – సాధన ప్రారంభించి, కొంత సాధన చేసి, మధ్యలో
ఆ ప్రయత్నము, సాధన కొనసాగించాలనే స్థిరత్వము లేకపోవుట. 9.
అనవస్థి తత్త్వము - సాధన ప్రారంభించి, కొంత సాధన చేసి, వాళ్ళ
సాధనను వాళ్ళే పాడు చేసుకొనుట. ఇవి యోగమునకు
అంతరాయములు కలిగిస్తా యి. ఈ అంతరాయములు దాటిన
తరువాత ఆ యోగికి యోగ సిద్ధి లభించి, మనస్సులో ప్రశాంతత
ఏర్పడుతుంది. ఇవికాక 1-31 - “దుఃఖ దౌర్మనస్య అంగమేజయత్వ
శ్వాస ప్రశ్వాసా విక్షేప సహభువః” - 10. దుఃఖము – ఆది
ఆధ్యాత్మికము దుఃఖము – శరీరములోపల రోగము లేక దెబ్బ వలన
కలిగే దుఃఖము, ఆది భౌతికము దుఃఖము – ఇతరులు వలన
మనకు కలిగే దుఃఖము, ఆది దైవికము దుఃఖము – దైవ విపత్తు లు
416
వరదలు, భూ కంపము , అగ్ని ప్రమాదములు వలన కలిగే దుఃఖము
అనే మూడు రకముల దుఃఖము వలన మనస్సు కలత చెంది,
అనుకున్న పని మీద మనస్సు లగ్నము చేయలేకపోవుట. 11.
దౌర్మనస్య – ఏది లభించినా, ఏది లభించకపోయినా, ఏ కారణము
లేకపోయినా ఎల్లప్పుడూ మనస్సు ఏదో రకముగా బాధ పడుతూ
ఉండుట. 12. అంగమేజయత్వము – శరీరములో స్థిరత్వము లేక,
కదలిపోతూ, వణుకుతూ, ఆసన సిద్ధి స్థిరముగా ఉండుట. 13.
శ్వాస, 14. ప్రశ్వాస – ప్రాణాయామ దశలో కుంభకము అనే
ప్రాణాయామమునకు శ్వాస, ప్రశ్వాస అవాంతరాయములుగా
ఉంటాయి.

మహాభారతము – “పుణ్యస్య ఫల మిచ్యంతి పుణ్యం


నేచ్యంతి మానవాః, పాపస్య తు న హి ఇచ్చంతి పాపం కుర్వన్తి
యత్రతః” - పుణ్య ఫలము అందరూ కోరుకుంటారు. కాని దానికి
తగ్గ పుణ్యము చేయాలని ఎవ్వరికీ ఇష్టము ఉండదు. లక్ష్య సాధనకు
చేయవలసిన దానిని చేయరు. పాపముల ఫలితములు ఎవ్వరికీ
ఇష్టము ఉండదు. కాని పాపములు చాలా శ్రద్ధగా చేస్తా రు. లక్ష్య
సాధనకు చేయకూడని దానిని తప్పకుండా, శ్రద్ధగా చేస్తా రు. ఇది
చాలా ప్రమాదమైనది.

417
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।
ఈక్షతే యోగయుక్తా త్మా సర్వత్ర సమదర్శనః ॥ 29 ॥

యోగాభ్యాసముతో మనస్సు పరిశుభ్రము అవుతుంది.


చిత్తవృత్తి, మనస్సు పరిశుభ్రత అయిన తరువాత తత్త్వ జ్ఞానము
పొందుటకు అర్హత కలుగుతుంది. మనస్సు శుభ్రముగా,
ప్రశాంతముగా లేకపోతే తత్త్వ జ్ఞానము కలిగే అవకాశము లేదు.

ఇటువంటి యోగాభ్యాసము చేసుకున్న యోగ సిద్ధు డు,


సర్వ భూతముల యందు తన ఆత్మ స్వరూపమును మరియు
పరమాత్మ స్వరూపమును స్పష్టముగా దర్శిస్తా డు. పరమాత్మ
స్వరూపములో తన ఆత్మ స్వరూపమును మరియు సర్వ
భూతములను స్పష్టముగా దర్శిస్తా డు.

యోగముతో కూడిన మనస్సుతో ఉన్న సాధకుడు ప్రతి


వస్తు వులోను, ప్రతి జీవిలోనూ విశ్వ అంతటా పరమాత్మను
సమముగా వ్యాపించినట్లు స్పష్టముగా దర్శిస్తా డు.

పరమాత్మ ఈ విశ్వమునకు పరమ మూల కారణము.


అందుచేత ఈ విశ్వములో పరమాత్మకు భిన్నముగా, వేరుగా ఏ జీవి,
ఏ వస్తు వూ లేదు. సర్వ జీవుల స్వరూపములు పరమాత్మ యొక్క
అంశములు, భాగములు. ఈ విశ్వమంతా పరమాత్మ యొక్క భిన్న,
418
భిన్న రూపములే. సంపూర్ణ వైరాగ్యము, వైశారద్యము, నిర్విచారము
వలన కలిగిన యోగ సిద్ధు డు (పతంజలి యోగ సూత్రములు – 1-
17) సవికల్పక (అంతటా పరమాత్మను దర్శించుట) లేదా సంప్రజ్ఞాత
(చైతన్యము, ప్రజ్ఞానముతో కూడిన) ప్రాధమిక సమాధి స్థితి వలన
ఈ విధముగా స్పష్టముగా దర్శించగలుగుతాడు.

మను స్మృతిలో – ఆత్మ సమదర్శనము కలిగిన యోగిని


“ఆత్మయాజి” అని అంటారు. ఆత్మయాజి = స్వరాజ్యము
ఉన్నవాడు = స్వరాజ్ = అందరి కంటె గొప్పవాడు. సోమ యాగము
చేసుకున్న వాళ్లను సోమయాజి అంటారు.

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।


తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ 30 ॥

ఏ సాధకుడైతే ప్రతి వస్తు వులోను, అంతటా నన్ను


(పరమాత్మను) చూడగలుగుతాడో, ప్రతి వస్తు వును, విశ్వమంతా
పరమాత్మలో చూడగలుగుతాడో, క్రమముగా వస్తు వులను
విశ్వమును వదిలేసి అంతటా కేవలము నన్నే (పరమాత్మనే)
చూడగలుగుతాడో,

419
అటువంటి సాధకుడికి నేను అతి దగ్గరలో, అతనిలోనే
ఉన్నట్లు అవుతుంది. అతడు నా దృష్టిలో ఏ విధమైన నాశనము,
దుఃఖము పొందడు.

అలా చూడలేని వ్యక్తు లు, నన్ను వదిలేసి నా నుండి


వేరైపోయి, నాతో సంబంధము లేకుండా, నా నుండి చాలా
దూరముగా వెళ్లిపోయినట్లు ఉంటుంది. నేను వాళ్లకు చాలా
దూరములో ఉన్నాను. అటువంటి మానవులు అత్యంత
దుఃఖమునకు గురి అవుతున్నారు.

ఈశావాస్యోపనిషత్ – 5 – “తదేజతి తన్నైజతి తద్దూరే


తద్వంతి కే I తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః” – ఆ
ఆత్మ చలించును, చలించదు. ఆ ఆత్మ చాలా దూరములో ఉన్నది,
చాలా దగ్గరలో ఉన్నది. ఆ ఆత్మయే సర్వ వ్యాపకముగా ఉన్నది. ఈ
ప్రపంచమునకు లోపల, వెలుపలా కూడా ఉన్నది. ఈ సృష్టికి మూల
కారణము పరమాత్మ.

ఎలాగైతే బంగారము షాపులో అన్ని ఆభరణములకు మూల


వస్తు వు బంగారము ఎలా అవుతుందో, అలాగే ఈ సృష్టి అంతా
పరమాత్మ యొక్క వివిధ రూపములు.

420
వేదములు కూడా పరమాత్మ తత్త్వమును, స్వరూపమును
ఇది అని నిర్ణయాత్మకముగా చెప్పలేక “తత్” = అది (దూరములో
ఉన్న దానిని చెప్పినట్లు గా “అది” అని చెప్పాయి). అటువంటి
పరమాత్మను సాధకుడు పరిశుద్ధమైన మనస్సులో ఈ ప్రపంచములో
పరమాత్మ తప్ప ఇంకొకటి లేనేలేదు అనే భావముతో
స్థా పించుకున్నట్లయితే, పరమాత్మను తన హృదయములో (అతి
దగ్గరలో) స్పష్టముగా దర్శించి, పరమానంద అనుభవమును
పొందుతాడు. హృదయములో మరియు ఈ ప్రపంచమంతా
పరమాత్మ వ్యాపించి ఉన్నా, ఆ భావమును మనస్సులోకి తెచ్చుకోని
వ్యక్తికి, హృదయములో ఉన్నా, ఆ పరమాత్మ అనుభవము పొంగా
లేక, అతనికి పరమాత్మ లేనట్లే (ఎక్కడో దూరములో అవ్యక్తముగా
అది ఉన్నట్లే).

ఉదాహరణ:

దత్తా త్రేయ స్వామీ అవతారమైన నృసింహ సరస్వతి వారి


కాలములో, త్రివిక్రమయతి అనే నృసింహ ఉపాసకులు ఉండేవారు.
ఆయన చాలా నియమ నిష్టలతో యోగాభ్యాసము ద్వారా నృసింహ
ఉపాసన చేసుకుంటూ, ఈ ప్రపంచమంతా, సమస్త భూతములలో
నృసింహ స్వామినే దర్శిస్తూ ఉండే ఉన్మత్తమైన ఉపాసకులు. ఆయన
421
కళ్ళు మూసుకుంటే నృసింహ స్వామీ మాత్రమే కనిపించేవారు.
ఒకరోజు నృసింహ సరస్వతి స్వామి పల్లకిలో వెళ్ళుతుండగా
ఆయనను చూసి, ఇటువంటి వైరాగ్యము ఉన్న వాళ్ళు నడిచి
వెళ్ళాలి కానీ నృసింహ సరస్వతి స్వామి పల్లకిలో వెళ్ళటము అంత
నచ్చక, ఇలాంటి వాళ్లతో మనము దూరముగా ఉండాలి అని
అనుకొని, ఇంటికి వెళ్లి, నృసింహ స్వామిని ధ్యానించాలని కళ్ళు
మూసుకోగానే, నృసింహ స్వామీ బదులు నృసింహ సరస్వతి స్వామీ
కనిపించారు. ఇన్నాళ్లు నృసింహ స్వామిని మనస్సులో నింపుకొని
ధ్యానిస్తే నృసింహ స్వామి మనస్సులోకి వచ్చేవారు, ఇవాళ నాకు
ఇష్టము లేని నృసింహ సరస్వతి స్వామీ నా ధ్యానములో నా
మనస్సులోకి ఎందుకు వచ్చారు అని బాధ పడి, కళ్ళు తెరిచే సరికి,
ఎదురు కుండా ఉన్న అన్ని వస్తు వులలో (చెట్టు , ఆకులు, గోడ, కుర్చీ,
బల్ల అన్నీ) కూడా నృసింహ సరస్వతి స్వామే కనిపించారు. అంతలో
నృసింహ సరస్వతి స్వామీ పల్లకిలో త్రివిక్రమయతి ఇంటికి వచ్చి, పల్లకి
దిగి త్రివిక్రమయతితో నాయనా ఏమి చేస్తు న్నావు అని అడిగారు.
దానికి త్రివిక్రమయతి జరిగినదంతా చెప్పారు. అప్పుడు నృసింహ
సరస్వతి స్వామీ, నీకు చేసిన ఉపదేశములు, యోగాభ్యాస బలము
ఎక్కడికి పోయింది. సర్వత్రా నృసింహ స్వామిని చూడమంటే, నీకు
ఇష్టమైన వాటిలో చూసి, ఇష్టము కాని వాటిలో చూడవద్దు అని
అర్ధమా? ఎవరైనా సరే అందరిలో, అన్ని చోట్లా సమముగా నృసింహ

422
స్వామిని చూడటమే (సర్వత్రా సమ దర్శనము) సరైన ధ్యానము,
ఉపాసన అని బోధించారు. అప్పుడు త్రివిక్రమయతి నృసింహ
సరస్వతి స్వామీ క్షమాపణ పొంది, ఆయన శిష్యుడై, ఆయన
ఉపదేశముల దారిలో యోగాభ్యాసము చేసుకొని, ఉత్తమ స్థితికి
పొందాడు.

ఈశావాస్యోపనిషత్ – 3 – “....యేకే చాత్మహనో జనాః” –


అవిద్యా దోషముతో అందరూ సులభముగా తెలుసుకోగలిగేటట్లు గా
అంతటా, బయట, అందరి హృదయములలో ఉన్న ఆత్మను (తన
స్వరూపమును, పరమాత్మ స్వరూపమును) తెలుసుకోలేనివారు
ఆత్మ హత్య చేసుకున్నవారితో సమానము.

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః।


సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ॥ 31 ॥

అన్ని కదిలే లేదా కదలని వస్తు వులలో కొలువై ఉన్న నన్నే


(పరమాత్మను) మాత్రమే చూసుకోవాలి. అందుకు పరమాత్మ
ఉన్నాడు, పరమాత్మ ఒక్కడే, పరమాత్మే ఈ సృష్టికి మూల
కారణము, పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, ఈ
ప్రపంచములో కనిపిస్తు న్నవి, కనిపించనివి అన్నీ పరమాత్మ యొక్క
రూపములే అనే భావన మనస్సులో స్థిర పరచుకోవాలి. ఆ స్థితి

423
కలిగిన తరువాత, ఆ, యా వస్తు వులను ప్రక్కకు తొలగించి, లేవని
భావించి, ఇంకేమీ చూడకుండా, నిరంతరము కేవలము పరమాత్మ
ఒక్కడినే దర్శించగల స్థితి పొందే వరకూ సాధన చేయాలి.

ఈ విధముగా యోగాభ్యాసము చేసుకున్న యోగి, ఏ


విధముగా వ్యవహరించినా, ప్రవర్తించినా సరే (నిజమైన జ్ఞానులు,
యోగులు రక రకములుగా ఉంటారు, ప్రవర్తిస్తా రు), నా (పరమాత్మ)
యందే ఎల్లప్పుడూ ఉంటాడు.
ఉదాహరణ:

ఒక గురువుగారు తన ఆశ్రమములో, శిష్యులకు


వేదాంతము బోధిస్తు న్నారు. ఈ సృష్టి అంతా పరమాత్మ ప్రతి
వస్తు వులో, ప్రతి జీవిలో బయట, లోపల అంతటా వ్యాపించి ఉన్నాడు.
ఆ పరమాత్మ చైతన్యమే ఈ విశ్వమంతా, సర్వత్రా విస్తరించి ఉన్నది
అని బోధించారు. ఆ రోజు పాఠము పూర్తి ఆయన తరువాత,
గురువుగారు శిష్యులకు ఒక పండు ప్రసాదముగా ఇచ్చి, ఈ
పండును ఎవ్వరూ చూడకుండా తినాలి. అప్పుడే ఈ ప్రసాదము
యొక్క ఫలితము దక్కుతుంది అని చెప్పారు. తరువాత
కొంతమంది శిష్యులు తలుపులు వేసుకొని, ఎవ్వరూ చూడట లేదు
అని అనుకొని ఆ పండును తిన్నారు. కొంతమంది రాత్రి చీకటి గదిలో
దుప్పటి కప్పుకొని, కొంతమంది నీళ్ళలో మునిగి ఆ పండుని తిని

424
ఎవ్వరూ చూడట లేదు అని అనుకున్నారు. మరుసటి రోజు
గురువుగారి పాఠమునకు, శిష్యులు అందరూ కూర్చొన్నారు.
గురువుగారు నేను నిన్న ఇచ్చిన పండును ఎవ్వరూ చూడకుండా
తిన్నారా అని శిష్యులను అడిగారు. శిష్యులు, వాళ్ళు ఎలా,
ఎక్కడెక్కడ దాగి తిన్నది వివరముగా చెప్పి, మేము ఎవ్వరూ
చూడకుండానే తిన్నాము అని జవాబు చెప్పారు. అప్పుడు
గురువుగారు, నేను నిన్న మీకు చెప్పిన పాఠము, ఎవ్వరికీ అర్ధము
కాలేదు అని అన్నారు. శిష్యులకు అర్ధము కాక, నిన్నటి పాఠమునకు,
పండు తినటానికి సంబంధము ఏమిటి అని అడిగారు. అప్పుడు
గురువుగారు, పరమాత్మ చైతన్యము సర్వత్రా వ్యాపించి ఉన్నది అని
చెప్పాను కదా. అంటే అర్ధము ఏమిటి? చైతన్యము అంటే జ్ఞాన
స్వరూపుడు. అటువంటి జ్ఞాన స్వరూపుడు అంతటా వ్యాపించి
ఉండగా, మీరు ఎవ్వరూ చూడకుండా (అంటే పరమాత్మ కూడా
చూడకుండా) ఎలా తినగలిగారు. మీరు ఎవ్వరూ చూడకుండా
తిన్నాము అంటే, మీకు నిన్నటి పాఠము అర్ధము కాలేదు అనే
అర్ధము కదా అని గురువుగారు అన్నారు.

 ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జు న।


సుఖం వా యది వా దుఃఖము స యోగీ పరమో మతః ॥
32 ॥

425
ఓ అర్జు నా I పరమాత్మ సమ దర్శనము కలగాలంటే, తనకు
తాను ఎంత సుఖముగా ఉండాలని, ఏ కష్టము, ఏ దుఃఖము
రాకూడని ఎలా కోరుకుంటాడో, అలాగే మనకు కనిపించే ప్రతి
మానవులని, ప్రతి పాణిని, ప్రతి జీవిని (ఏ ప్రాణీ మినహాయింపు
కాదు).

తనకు కోరుకున్న సుఖములు అన్నీ వాళ్లకు కూడా


కలగాలని, తాను పోగొట్టు కోవాలనుకున్న కష్టములను,
దుఃఖములను వాళ్లకు కూడా పోవాలని, అందరూ తనతో
సమానముగా ఉండాలని భావించాలి. ఎవరైతే అందరి పట్ల ఈ
విధమైన సమత్వ భావనను పెంచుకుంటారో, అటువంటి వారు
ఉత్తమోత్తమమైన యోగి అవుతాడు.

యోగి రాగము (ప్రీతి), ద్వేషము వదలి పెట్టు కోవాలి. ఒకవేళ


రాగము ఉంటే ఆ రాగము ప్రతి జీవి మీద కూడా ఉండాలి. ద్వేషము
ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎవరి మీద అసలు ఉండనే కూడదు. ప్రతి జీవి
అన్ని సుఖములు తనకే రావాలని, ఏ విధమైన కష్టము, దుఃఖము
తనకు రాకూడదని ఎలా కోరుకుంటాడు. ఆ విధముగానే ఇతర
అన్ని జీవులకు అలాగే అన్ని సుఖములు కలగాలని, ఏ విధమైన
కష్టము, దుఃఖము రాకూడని కోరుకోవాలి. ఈ విధమైన సమ
దర్శనము కలిగి ఉండాలని పరమాత్మ బోధిస్తు న్నాడు.

426
ప్రతి మానవుడికి ప్రదానమైన లక్ష్యము తత్త్వ జ్ఞానము
కలగాలని ఉండాలి. తత్త్వ జ్ఞానము కలగాలంటే, చిత్తవృత్తి నిరోధము
(మనస్సులో ఏ విధమైన ఆలోచనలు కలగకుండా, పరమాత్మ మీదే
మనస్సును కేంద్రీకరించుట) కలగాలి. చిత్తవృత్తి నిరోధన కలగాలంటే,
జన్మ, జన్మల నుండి మనమే సంపాదించుకున్న, మన మనస్సులో
సూక్ష్మ రూపములో పేరుకున్న చెడు వాసనలు క్షయము లేదా చెడు
సంస్కారములు నాశనము అవ్వాలి. మనలో చెడు వాసనలు లేదా
చెడు సంస్కారములు ఉన్నంత వరకు మనస్సులో రాగము,
ద్వేషముల అలజడి కలుగుతూనే ఉంటుంది. మనస్సులో ఈ
అలజడి ఉన్నంత వరకూ చిత్తవృత్తి నిరోధము కలగనేకలగదు.
చిత్తవృత్తి నిరోధము కలగకపోతే, పరమాత్మ తత్త్వ జ్ఞానము
పొందుటకు అర్హత కూడా కలగదు. ఈ చెడు వాసనలు లేదా
సంస్కారములను నాశనము చేసుకోవటానికి మంచి వాసనలు,
మంచి సంస్కారములు, సమతా భావన పెంచుకోవాలి. అప్పుడే రాగ,
ద్వేషములు పోయి, చెడు సంస్కారములు నాశనము లేదా చెడు
వాసనా క్షయము అయి, చిత్తవృత్తి నిరోధము కలిగి, మనస్సు
ప్రశాంత స్థితిని పొంది, పరమాత్మ తత్త్వ జ్ఞానము క్రమముగా సాధన
చేసుకోవాలి.

427
చెడు వాసనలు లేదా చెడు సంస్కారములు మూడు
రకములు – 1. లోక వాసన – నేను అందరికీ మంచిగా ఉండాలి,
నచ్చాలి అనే కోరిక. ఏ వ్యక్తి, ప్రతి వ్యక్తిని పరిపూర్ణముగా
సంతోషపరచలేడు. ఏ వ్యక్తి, అందరికీ అమోదకరముగా ఉండే
ఆస్కారము లేదు. ఏ వ్యక్తి అందరికీ నచ్చటము సాధ్యము కాదు.
ఈ లాంటి సాధారణ తెలివితో దీనిని పోగొట్టు కోవచ్చు. 2. శాస్త్ర
వాసన – ప్రతి శాస్త్రము, విజ్ఞానము నాకే అందాలి, నాకే తెలియాలి
అనే కోరిక. తత్త్వ జ్ఞానమును బోధించే శాస్త్రములు అభ్యసించి, చెడు
శాస్త్రములు వలన కలిగిన వాసనలు పోగొట్టు కోవాలి. 3. దేహ వాసన
– ఈ దేహము లేదా శరీరము నేను, ఈ దేహములో ఉండే అన్ని
చెడు గుణములు నావే, ఈ నా దేహము అన్ని సుఖములు
ఆనందించాలి, ఈ నా శరీరమునకు ఏ విధమైన కష్టము, దుఃఖము
కలగకూడదు అనే భావన (అహంకారము). ఇటువంటి భావనలను
పతంజలి యోగ శాస్త్రములో 1-33 చెప్పిన మైత్రి – అన్ని జీవుల మీద
స్నేహ భావన, కరుణ – అన్ని జీవుల మీద జాలి, దయ, ముదిత –
అన్ని జీవులతో మంచితనము, ఉపేక్ష – సర్వ జీవుల యందు
సమత్వ భావన (14-10, 14 శ్లోకములు) అనే సత్త్వ గుణములతో
సాధించుకోవచ్చును. “సర్వే భవంతు సుఖినః సర్వే సంతు
నిరామయాః l
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్” – ఈ

428
ప్రపంచములో ప్రతి ప్రాణి సుఖముగా ఉండాలి, ఈ ప్రపంచములో ఏ
జీవికి ఏ దోషములు, రోగములు ఉండకూడదు, అందరూ వారి, వారి
జీవితములలో ఉన్నత స్థా యికి ఎదగాలి, శుభ ఫలములు
అందుకోవాలి. ఈ ప్రపంచములో ఏ ప్రాణి దుఃఖము పొందకూడదు,
అనే లోక క్షేమ భావనతో ఈ దేహ వాసన పోగొట్టు కోవచ్చును.

ఉదాహరణ:

ఒక ఊళ్ళో ఒక దొంగ ఉండేవాడు. చాలా దొంగతనములు,


నేరములు చేశాడు. ఎక్కడ ఎక్కువ జనము ఉంటారో అక్కడ చేరి
జనుల ధనము, బంగారు ఆభరణములు దొంగతనము చేసి పొట్ట
పోసుకొని ఉండేవాడు. ఒకరోజు ఒక చోట ధార్మిక ప్రసంగము
జరుగుతోంది. అక్కడకు చాలా మంది జనము వెళ్ళారు. ఈ దొంగ
కూడా అక్కడకు వెళ్ళాడు. అక్కడ ప్రవచనము చేసే ఆయన
“అందరు ధర్మ మార్గములో నడవాలి. ధర్మ మార్గములో ఉంటే
మంచి జన్మలు పొంది సుఖముగా ఉంటారు. అధర్మములు
చేయకూడదు, అధర్మ మార్గములో ఉంటే నీచమైన జన్మలు,
కష్టములు కలుగుతాయి” అనే ఆ ప్రవచన కర్త మాటలు ఆ దొంగకు
నచ్చి, అతనిలో పరివర్తన కలిగి, అధర్మ మార్గము (దొంగతనము
మానేసి) వదిలిపెట్టి, ధర్మ మార్గములో నడవాలి, మంచి పుణ్య
క్షేత్రమునకు వెళ్లి అక్కడ జపము, తపము చేసుకోవాలి అనే

429
నిర్ణయము తీసుకున్నాడు. కాని జీవితము గడవటానికి కావలసిన
డబ్బు లేదు. కాబట్టి ఆఖరి సరిగా ఒక పెద్ద బ్యాంకులో, ఒక పెద్ద
దొంగతనము చేసి, ఆ డబ్బుతో జీవితమంతా గడిపేయవచ్చును అని
ఆలోచించి, ఒక మంచి ముహూర్తము కోసము ఒక జ్యోతిష్కుడు
దగ్గరకు వెళ్లి, తన బ్యాంకు దొంగతనము గురించి చెప్పి, మంచి
ముహూర్తము పెట్టమని అడిగాడు. జ్యోతిష్కుడు, అటువంటి
ముహూర్తము శాస్త్రములో లేవు, నేను పెట్టను అని అనగా, ఆ
జ్యోతిష్కుడికి 25% వాటా ఇస్తా ను అనే ఆశ చూపించి,
ముహూర్తము పెట్టమని బతిమలాడాడు. జ్యోతిష్కుడు మెత్తబడి,
ఏదో అమావాస్య అర్ధరాత్రి ముహూర్తము పెట్టా డు. తరువాత
బ్యాంకు సెక్యూరిటీ ఆఫీసరు మరియు ఆ బ్యాంకులో పనిచేసే
ఉద్యోగికి ఆ దొంగతనమునకు సహకరిస్తే ఒక్కొక్కరికి 25% వాటా
ఇస్తా ను అని చెప్పితే, మొదట వాళ్ళు ఒప్పుకోకపోయినా, వాళ్లకు
కూడా వాటా ఆశ చూపించి, మెల్లమెల్లగా నచ్చచెప్పి ఒప్పించాడు.
అనుకున్న ముహూర్తము, ప్లా ను ప్రకారము ఆ దొంగ, దొంగతనము
మొదలు పెట్టా డు. అప్పుడు ఆ దొంగకు ఇందులో మూడు వాటాలు
ఆ సహకరించిన వాళ్లకు ఇవ్వాలి, కాబట్టి తనకు మిగిలేది చాలా
తక్కువ, అందుచేత బ్యాంకులో ఉన్నదంతా దొంగిలించాలి అనే
దురాశతో అన్నీ వెతికి, వెతికి, బద్దల కొట్టి, మూటకట్టే సరికి తెల్లవారి
పోయింది. అప్పటికి పోలీసులు వచ్చి, ఆ దొంగను తరువాత ఆ

430
మిగిలిన ముగ్గురునీ కూడా పట్టు కొని బంధించి, కోర్టు లో కేసు
జరిగి, జడ్జిగారు ఆ నలుగురికీ సమానముగా జరిమానా మరియు
జైలు శిక్ష వేశారు.

ఈ కధలో మొదట నలుగురు ధర్మ బుద్దితోనే


ఆలోచించారు. తరువాత వాళ్ళు అత్యాశకు లోబడి, మనస్సులో
చాంచల్యమునకు లోనై, కష్టా ల పాలయ్యారు. ఆ మనో
చాంచల్యమునకు (చిత్త చాంచల్యము) లోను కాకపోయి ఉంటే
ఎవ్వరికీ కష్టములు కలిగేవి కావు. అందుచేత పరమాత్మ చిత్త
చాంచల్యము పోగొట్టు కొనుటకు, అందరి పట్ల సమత్వ భావన
పెంపొందించుకొమ్మని ఉపదేశము చేస్తు న్నాడు.

అర్జు న ఉవాచ ।
యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ।
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం ॥ 33 ॥
ఓ మధుసూదనుడా I నీవు రక రకాల యోగము
(చిత్తవృత్తి నివారణ, చిత్త శుద్ధి, మనో సామ్య స్థితి, ఈ సృష్టి
పరమాత్మ యొక్క రూపాంతరము, పరమాత్మ సర్వ, సమానత్వ
వ్యాపకత్వము మొదలైన విషయములు) ముఖ్యముగా
సమానత్వము గురించి విస్తా రముగా వివరించి చెప్పావు.

431
నీవు చెప్పినప్పుడు, ఆ విషయము ఒక్క క్షణ కాలము ఏదో
అర్థమైనట్లు అనిపిస్తోంది. కాని మరు క్షణములో ఆ భావన
మారిపోతోంది. నీవు చెప్పిన భావన మనస్సులో స్థిరముగా ఉండట
లేదు, కదిలిపోతోంది. ఎందుచేతనంటే మనస్సు నిరంతరము ఏవేవో,
ఎన్నెన్నో ఆలోచనలు కలుగుతూ, కదిలిపోతూ, చంచలముగా
ఉంటుంది.

మనస్సు చంచల స్వభావము కలది కాబట్టి, నీవు


ఉపదేశించిన సామ్య స్థితి, సమత్వ భావన మనస్సులో స్థిరముగా
ఉండట లేదు.

మధుసూదన అనే సంబోధనలో – నీవు మధు అనే


రాక్షసుడిని సంహరించిన వాడివి. అదే కాకుండా అందరి
మనస్సులలో ఉండే రాక్షస స్వభావములను, ప్రవృత్తు లను కూడా
సంహరించి, సంపూర్ణముగా నిర్మూలించే వాడివి కూడా అని అర్ధము
చేసుకోవాలి. మనస్సు యొక్క స్వభావము ఒక విషయము నుండి
మరొక విషయము వైపు పారిపోవుట (విక్షేపము – రజో గుణము
యొక్క ప్రభావము) లేదా నిద్రలోకి జారిపోవుట (నిద్ర - తమో
గుణము యొక్క ప్రభావము) అయిన అసుర సంపత్తు లు
పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిలలో సత్త్వ గుణము (దైవీ సంపత్తి)
ఏమీ చేయలేక, దిగజారిపోతోంది. మనస్సు యొక్క చాంచల్యము

432
యొక్క కారణము తెలుసుకొని, ఆ కారణమును సంహరించే
సామర్థ్యము కలవాడు.

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ ధృఢం।


తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం ॥ 34 ॥

మనస్సు ఒక విషయము నుండి మరొక విషయము వైపు


నిరంతరము కదులుతూ ఉండే చంచల స్వభావము కలది. శ్రీ కృష్ణ
పరమాత్మా I శరీరము ఇంద్రియములను వివశులను చేసి, బలంగా
మధించి, ఆ విషయముల వైపు లాగేస్తుంది, తోసేస్తుంది. ఇది చాలా
బలవంతమైనది, ధృఢమైనది.

ఎలాగైతే వాయువుని మనము లొంగతీసుకోలేమో, అలాగే


ఇటువంటి మనస్సుని నిగ్రహించి, లొంగతీసుకొని కదలకుండా
ఒకచోట ఉంచి, ఒక విషయము మీద ఏకాగ్రతతో లగ్నము చేయుట,
కేంద్రీకరించుట సులభముగా చేయదగినది కాదు అని నాకు
తోస్తోంది.

“మనహాత్ ఇతి మనః” – నిరంతరము ఆలోచనలను


చేసేది మనస్సు. మనస్సు యొక్క పేరులోనే దాని చంచల
స్వభావము ఉన్నదని అర్థమవుతోంది. 3-41 శ్లోకములో
ఇంద్రియములను నిగ్రహించకుంటే, మనస్సు కూడా
433
నిగ్రహించబడుతుంది అని నీవు చెప్పినది కూడా అంత సులభమైనది
కాదు. ఎలాగో కష్టపడి ఇంద్రియములను లోపలి తీసుకువచ్చినా,
చాలా శక్తి, బలము కలిగిన ఈ మనస్సు వాటిని మధించి,
బలవంతముగా విషయముల వైపు బయటకు తోసివేస్తుంది.
మనస్సుకి ఎంత చెప్పినా, ఎంత బతిమాలినా సరే మాట వినట
లేదు. ఎందుకంటే అనాది నుండి, అనంతమైన జన్మ జన్మలలో
మనమే సంపాదించుకున్న వాసనలు లేదా సంస్కారములు ఈ
మనస్సులో పేరుకుపోయి, కరుడుగట్టి చాల ధృఢముగా
తయారయింది. మనస్సు చెప్పినట్లు గానే ఇంద్రియములు, శరీరము
వ్యవహరిస్తు న్నాయి. దాని మూలముగా ఈ శరీరముతో అనర్థమైన
పనులు చేయించి, జీవుడిని అధోగతిపాలు చేస్తోంది. ఎలాగైతే
వాయువుని మనము బంధించలేమో, అలాగే ఈ మనస్సుని కూడా
మనము బంధించలేము.

కృష్ణ = “కర్షనాత్ ఇతి కృష్ణః”. కర్షణ = ఆకర్షణ శక్తి, లాగే,


ఈడ్చే శక్తి. మనస్సులో ఉండే పాపపు ఆలోచనలను, దోషములను
లాగేసి, మనస్సును శుద్ధి చేసేవాడు కాబట్టి కృష్ణ అని అర్ధము, పేరు.
“పున్యాదికమ్ ఆకర్షయతి ఇతి కృష్ణః” – మానవులకు కావలసిన
ప్రతి ఉత్తమ ప్రయోజనమును తీసుకువచ్చి, ఉపదేశము ద్వారా
అందించేవాడు పరమాత్మ. “సకలాన్ పురుషార్దా న్ ఆకర్షయతి ఇతి
కృష్ణః” – మానవులు సాధించవలసిన ఉత్తమ ప్రయోజనములకు
434
ప్రతి బంధకముగా ఉండే ఈ చాంచల్యమైన మనస్సుని పోగొట్టి
మానవులు ఉన్నత స్థితికి తోడ్పడవలసినది.

శ్రీభగవానువాచ । అసంశయం
మహాబాహో మనో దుర్నిగ్రహం చలం ।
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ॥ 35 ॥

భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు I గొప్ప


బాహువులు కల ఓ అర్జు నా I మనస్సుని నిగ్రహించుకొనుట
సులభము కాదు, చాలా కష్టము. ఈ విషయములో ఏ సందేహమే
లేదు. మనస్సు చంచలముగా ఉంటుంది అని నీవు చెప్పినది నిజమే.
మనస్సు ఒక్క చోట ఉండేది కాదు.

మనస్సును నిగ్రహించే ప్రయత్నము, అభ్యాసము, అలవాటు


మళ్ళీ, మళ్ళీ చేసుకుంటూ, వైరాగ్యమును బలపరచుకొని,
పెంపొందించుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ మనస్సు
నిగ్రహమునకు వచ్చి తీరుతుంది. కుంతీదేవి కుమారుడైన ఓ అర్జు నా
I

మనస్సును నిగ్రహించుకొనుట అసాధ్యము మాత్రము


కాదు. దానికి పరిష్కారము అభ్యాసము, వైరాగ్యము ద్వారా
నిగ్రహించుకోవచ్చును. మనస్సును నిగ్రహించుకొనుట చాలా కష్టము

435
మాత్రము నిజము. జీవితములో ఏ లక్ష్యమును సాధించుకోవాలన్నా,
దృఢమైన సంకల్పము, నిర్ణయము తీసుకొని, నిరంతరము
అభ్యాసము చేసుకోవాలి. అదే విధముగా మనస్సును కూడా
నిగ్రహించుటకు, ప్రాపించక విషయముల మీద వైరాగ్యము
పెంచుకొని, నిరంతరము ప్రయత్నము, అభ్యాసము చేసుకోవాలి.

పతంజలి యోగ సూత్రము – 1-12 – “అభ్యాస


వైరాగ్యాభ్యాం తన్ నిరోధః” - చిత్త వృత్తు లు (మనస్సు ఆలోచనలు,
మానసిక క్రియలు) అనంతముగా కలుగుతూనే ఉంటాయి. చిత్త
వృత్తు లు (5) రకములుగా విభజించ వచ్చును. 1. ప్రమాణ -
కారణము, 2. విపరిమణ - మార్పు, 3. వికల్ప – భ్రాంతి, భ్రమ,
4. నిద్ర – నిద్ర, మాంద్యము, జడత్వము, 5. స్మృతులు –
జ్ఞాపకములు. వీటిని వెనక్కి తీసుకువచ్చి, అదుపులోకి తెచ్చుకొని,
నిరోధించుకొని అభ్యాసము చేయాలి. 1-13 – “తత్ర స్థితౌ యత్నో
అభ్యాసః” – అభ్యాసము అనగా తీసుకున్న నిర్ణయమును స్థిరము
చేసుకొని, నిరంతరము సాధించుకునే ప్రయత్నము చేయాలి. 1-15
– “దృష్టా అనుస్రవిక విషయ విత్రిష్ణస్య వశీకార సంజ్ఞాన వైరాగ్యం” -
వైరాగ్యము అనగా కనిపించే లేదా కనిపించని ప్రాపించక
విషయములు, వస్తు వులు మీద తీవ్రమైన కోరికలను స్థిరమైన
నిశ్చయముతో మనస్సు లోనికి రాకుండా అదుపులోకి తెచ్చుకొని, ఆ
కోరికలను అంతము చేయుట. వైరాగ్యములు – 1. యతమాన
436
సంజ్ఞాన వైరాగ్యము – గురువుల లేదా శాస్త్రముల ద్వారా మనకు
కావలసినది ఏది, అక్కరలేనిది ఏది అని నిర్ణయించుకొని, అక్కరలేని
వాటిని నిర్మూలించే లేదా అంతము చేసుకునే ప్రారంభ ప్రయత్నము.
2. వ్యతిరేక సంజ్ఞాన వైరాగ్యము - యతమాన సంజ్ఞాన వైరాగ్యము
ప్రయత్నము కొంత చేసుకున్న తరువాత, మనలో అక్కరలేనివి ఇంకా
ఎన్ని మిగిలి ఉన్నాయి అని తెలుసుకొని, మిగిలిన వాటిని కూడా
అంతము చేసుకునే ప్రయత్నము. 3. ఏకేంద్రియ సంజ్ఞాన వైరాగ్యము
– మనలో ఉండే కోరికల స్థూల రూపము పోగొట్టు కున్న తరువాత,
ఆ కోరికల మూలమైన, సూక్ష్మ రూపమైన (వాసనలు,
సంస్కారములు – ఔత్సుక్యము, రుచి, తృష్ణ) ఇంకా మనస్సులో
మిగిలే ఉంది అని అర్ధము చేసుకునే ప్రయత్నము. 4. వశీకార
సంజ్ఞాన వైరాగ్యము - వాసనలు, సంస్కారములు – ఔత్సుక్యము
మనస్సులో లేశ మాత్రము ఉన్నా అది పెరగదు, మనస్సులో ఉన్న
కోరికలు అన్నీ పోయి, కొత్త కోరికలు పుట్టి పెరగవు అనే స్థితిని వశీకార
సంజ్ఞాన వైరాగ్యము అంటారు. ఈ వైరాగ్యము కలిగితే కాని,
మనస్సులో ఆలోచనలను ఆపటము అసంభవము. ఈ వైరాగ్యము
కలిగితే ఏ లక్ష్యమును సాధించుకోవాలన్న, ఆ లక్ష్యము తప్ప ఇతర
విషయముల మీద ఆసక్తి తగ్గించుకొని, మన లక్ష్య సాధన మీదే
మనస్సుని కేంద్రీకరించగలరు. 5. 1-16 – “తత్ పరమ్ పురుష
ఖ్యాతేర్ గుణ వైత్రిష్ణ్యం” - వశీకార సంజ్ఞాన వైరాగ్యము ఇంకా

437
బలపడిన తరువాత, వాసనలు, సంస్కారములు – ఔత్సుక్యము,
తృష్ణ లేశ మాత్రము లేకుండా సంపూర్ణముగా నిర్మూలించుకున్న
తరువాత, మనస్సులో ఏ ఆలోచన, కోరిక పుట్టే అవకాశమే లేని
స్థితిని సంపూర్ణ పరమ వైరాగ్యము అంటారు. ఈ స్థితిలో మాయ
యొక్క మూడు గుణములు యొక్క ప్రభావము ఏ మాత్రము
ఉండదు. ఈ వైరాగ్యము కలిగిన తరువాతే తత్త్వ జ్ఞానము కలిగే
అర్హత కలుగుతుంది. 3-28 శ్లోకము చూడుము.

కోరికలు రెండు విధములుగా ఉంటుంది – 1.


ఔత్సుక్యము – నేను ఉన్నత స్థితిలో ఉంటే మంచిది, బాగుంటుంది
అనే సూక్ష్మమైన ఆలోచన మాత్రమే ఉంటుంది. దీని వలన
ప్రయోజనము ఉండదు. 2. ప్రవృత్తి పర్యంతా రుచిః లేదా తృష్ణ –
ఔత్సుక్యము స్థూల రూపము పొంది రుచిగా (కోరిక) లేదా తృష్ణగా
(అనవసరమైన విషయముల మీద వ్యామోహముతో కలిగే కోరిక)
మారి, ప్రవృత్తి మార్గము వైపు – కర్మ మార్గము వైపు ప్రేరేపించుట.

“చిత్త నదీ నామ ఉభయతో వాహిని. ఒహటి కల్యానాయ,


ఒహటి పాపాయ” - మనస్సు వేగముగా ప్రవహించే ఒక నది
లాంటిది. దాని ప్రవాహము రెండు వైపులకు ప్రవహిస్తుంది. ఒక
ప్రవాహము మంచి మార్గము వైపుకు ప్రవహించవచ్చు. మరొక
ప్రవాహము చెడు మార్గము వైపుకు కూడా ప్రవహించవచ్చు.

438
మనస్సులోని ఆలోచనలు నది నీటి ప్రవాహము లాగ
ఎలాగూ వేగముగా ప్రవహించే స్వభావము ఉంది. దానిని అలా
వదిలేస్తే ఆ నది నీరు సముద్రములోకి పారి వృధా అయిపోతున్నట్లు ,
మనస్సులోని ఆలోచనలు అలా వదిలేస్తే, జీవితము వృధా
అయిపోతుంది. నది నీరు సముద్రములోకి ప్రవహించకుండా
ఆనకట్ట వేసి, పంట పొలములలోకి తెచ్చుకొని అక్కడ ఆ నీటిని
పొలములలో ఆపుకొని, వ్యవసాయమునకు ఉపయోగించినట్లు ,
మానవుల మనస్సులోని ఆలోచనలు కోరికలు అనే చెడు మార్గము
వైపు ప్రవహించకుండా అటువైపు వైరాగ్యము అనే ఆనకట్ట వేసుకొని,
ఆ ఆలోచనలనే ప్రవాహమును మంచి మార్గము వైపుకు (పరమాత్మ
వైపుకు) ప్రవహించేలా చూసుకునే అభ్యాసము చేసుకొని, మానవుల
అంతిమ లక్ష్యము (పరమాత్మ తత్త్వ జ్ఞానము) దగ్గర ఆపుకునే
చిత్తవృత్తి నిరోధన సాధించుకొని, ఉత్తమ ఫలితములు
పొందవచ్చును.

అసంయతాత్మనా యోగో దుష్ప్రా ప ఇతి మే మతిః ।


వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తు ముపాయతః ॥ 36 ॥

439
ఏ ప్రయత్నము, సాధన చేయకుండా, బద్ధకముతో
ఇంద్రియములను, మనస్సును నిగ్రహించుకోలేని వ్యక్తికి యోగము
లభించదు.

ఇంద్రియములను, మనస్సును నిగ్రహించుకుందుకు


నిరంతరము ప్రయత్నము చేసుకోవాలి. ప్రయత్నము చేసుకొని,
ఇంద్రియములను, మనస్సును నిగ్రహించుకోగలిగితే, యోగము
తప్పకుండా కలుగుతుంది. ఏదో ఒక ఉపాయమును చూసుకోవాలి.

ఉదాహరణ:

ఒక పెద్ద విదేశీ కంపెనీలో ఒకతను పెద్ద ఉద్యోగము


చేస్తు న్నాడు. అతనికి పెళ్లి సంబంధములు చూస్తు న్నారు. ఒక
పల్లెటూరు నుండి ఒక మోతుబరి వ్యవసాయదారుడు తన
కుమార్తెను ఇచ్చి అతనికి వివాహము చేయాలని వచ్చి, 50 ఎకరాలు
మాగాణి భూమి కట్నముగా ఇస్తా ను అని అన్నాడు. మాగాణి
భూమి అంటే ఏమిటి అని ఆ పెళ్ళికొడుకు అడిగాడు. మాగాణి
భూమి అంటే బాగా వారి పండే భూమి, దానిమీద సంపాదన బాగా
ఉంటుంది అని ఆ ఆసామి చెప్పాడు. అది అంతా లెక్కలు వేసుకొని
మంచి సంపాదన ఉంటుంది అని తేల్చుకున్నారు. ఆ పెళ్ళికొడుకు,
నేను ఇంకొక మంచి ఉద్యోగము లోకి మారితే కూడా నాకు ఇంత

440
ఆదాయము ఉండదు. కాబట్టి, నేను మీ అమ్మాయిని వివాహము
చేసుకొని, ఉద్యోగము మానేసి, ఇంట్లోనే ఉంటూ, ఆ 50
ఎకరములతో వచ్చే ఆదాయముతో బతికితే, మీకు ఏమైనా
అభ్యంతరమా అని అడిగాడు. ఆ ఆసామి మాకు ఏ అభ్యంతరము
లేదు అని చెప్పాడు. పెళ్లి సంబందము కుదుర్చుకొని, బాగా
ఘనముగా వివాహము చేశాడు. ఆ పెళ్ళికొడుకు ఉద్యోగము
మానేసి, ఆ పల్లెటూరుకి మకాం మార్చి, పంచ, లాల్చీ కట్టు కొని,
పడక కుర్చీలో కూర్చొని ఎదురు చూస్తు న్నాడు. 6 నెలలు, దాటింది.
ఏ ఆదాయము రాలేదు. 10 నెలలు దాటించి ఏ ఆదాయము
రాలేదు. మామగారిని పిలిపించి, మీరు చెప్పినది నమ్మి, ఉద్యోగము
మానేసి, ఇంట్లో కూర్చొన్నాను. 10 నెలలు దాటిపోయింది. మీరు
చెప్పినట్లు 50 ఎకరముల మంచి ఆదాయము వస్తుందన్నారు. నేను
ఆదాయము కొరకు ఇంట్లో కూర్చొన్నాను. ఇంతవరకూ ఏ
ఆదాయము రాలేదు. మీరు నన్ను మోసము చేశారు, అని ఫిర్యాదు
చేశాడు. మామగారు నీకు ఇచ్చినది మంచి మాగాణి భూమి.
వ్యవసాయము చేసుకుంటే మంచి ఆదాయము వస్తుంది అని
అన్నాడు. దానికి అల్లు డు తెల్లబోయి, వ్యవసాయము అంటే ఏమిటి,
వ్యవసాయము ఎలా చేస్తా రు అని అడిగాడు. మామగారు నాతో
పొలముకి రా నేను చూపిస్తా ను అని అల్లు డిని పొలముకి
తీసుకువెళ్లా డు. ఏడాది నుండి ఆ భూమిని దున్నక బీడు కట్టి

441
ఉంది. ఈ పొలమును దున్నాలి, కలుపు మొక్కలు తీసేయాలి, నీరు
పట్టా లి, నారు తెచ్చి ఊడ్చి (వరి మొక్కలు నాటాలి) ఇంకా, ఇంకా
ఏమేమి చేయాలో అంతా చెప్పాడు. వ్యవసాయము అంటే ఏమీ
తెలియని ఆ అల్లు డు, ఆ బీడు కట్టిన పొలమును చూసి ఇది క్రికెట్లు
పిచ్చిలా గట్టిగా ఉంది. దీనిని దున్నటమేమిటి, ఎలా దున్నుతారు,
కలుపు మొక్కలు ఏమిటి, నారు ఏమిటి, ఊడ్చుట ఏమిటి, పంట
అంటే ఏమిటి, పంట ఎలా పండుతుంది, అని ఎన్నెన్నో ప్రశ్నలు వేసి,
ఇది నాకు తెలియదు, నేను చేయలేను, మీరు నన్ను మోసము
చేశారు అని అన్నాడు. మామగారు నేను చెప్పినది నిజమే. ఎంత
గట్టిగా ఉన్న భూమి అయినా సరే, నీవు సరైన ప్రయత్నము చేసుకొని,
కష్టపడి దున్ని, నీరు పెట్టితే అది మెత్తబడుతుంది. నీవు నిరంతరము
ఈ వ్యవసాయము చేసుకునే పనులు చేసుకుంటూ కష్ట పడితే
తప్పకుండా మంచి పంట, ఫలితము లభిస్తుంది అని చెప్పాడు.

అర్జు న ఉవాచ ।
అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః ।
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ॥ 37 ॥

అర్జు నుడు ఇలా అంటున్నాడు I యోగాభ్యాసము శ్రద్ధగా


ప్రయత్నము చేస్తు న్నా ప్రయత్నము కావలసినంతగా లేక, యోగ సిద్ధి
పొందుటకు చాలా తక్కువ అయినందువలన, కాని శ్రద్ధ, విశ్వాసము

442
పూర్తిగా ఉన్నా, నీవు చెప్పిన తత్త్వ జ్ఞానము వరకు ఉండే ప్రతి
దశలోని ఇంద్రియ, మనస్సు నిగ్రహము, సమతా భావన మొదలైన
వాటిలో మనస్సుని యోగ స్థితిలో స్థిరముగా ఉంచలేక, మనస్సు
కదిలిపోయి

యోగము యొక్క ఫలితము పరిపూర్ణముగా సిద్ధించని


సాధకుడు ఏ మార్గములో ఎక్కడికి వెళ్ళతాడు? ఏ ఫలితమును
పొందుతాడు?

కర్మ మార్గము, కర్మ ఫలితములను వదులుకొని, శ్రద్ధగా


యోగాభ్యాసము ప్రయత్నము చేస్తూన్నా, మధ్యలో ఆరోగ్యము
బాగుండక, అవాంతరములు కలిగి, ప్రయత్నము మధ్యలో
ఆగిపోవచ్చు, లేదా ఆ సాధకుడి జీవిత కాలము అయిపోవచ్చు.
అలాంటి పరిస్థితులలో ప్రయత్నము చాలక, యోగాభ్యాసములో
మనస్సు స్థిర పడని సాధకుడి జీవిత అంతములో ఏ మార్గములో,
ఎక్కడకు వెళ్ళతాడు, ఏ ఫలితము పొందుతాడు అనే అర్జు నుడికి
కలిగిన సందేహము మనందరికీ కూడా కలగవచ్చు.

కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి ।


అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ॥ 38 ॥

443
నా సందేహమునకు, ప్రశ్నకు ఒక కారణము, బీజము
ఉంది. ఇటు కర్మ మార్గము వదులుకొని, ఏ కర్మ ఫలితము లేక,
అటు జ్ఞాన మార్గములో ప్రయత్నము సరిపోక ఏ ఫలితము దక్కే
అవకాశము లేక ఉభయ మార్గములకు భ్రష్టు డు అయిపోతాడా?

ఇటువంటి ఏ విధమైన ఆశ్రయము లేనివాడు, గొప్ప


బాహువులు ఉన్నవాడా I పరబ్రహ్మను తెలుసుకోవాలనే దారిలో
ఎటూ కాకుండా పోయాడు.

మబ్బు వేగమైన గాలికి చిన్న మబ్బు తునకగా విడిపోయి,


ముక్కలు అయిపోయి ముందు లేదా వెనక మబ్బులతో చేరలేక
వర్షించలేక ఆవిరైపోతుందో, అదే విధముగా ఈ జీవి కర్మ
మార్గములోని లేదా జ్ఞాన మార్గములోని ఫలితములు అందుకునే
ప్రయత్నము చాలక అందుచేత జ్ఞాన మార్గములో కూడా ఏ
ఫలితము పొందలేక ఎటూ కాకుండా పోతాడా?

మహాబాహో – నీ అనంతమైన, గొప్ప బాహువులతో, ఏ


వ్యక్తినైనా సరే, ఎటువంటి కష్టములో ఉన్న వాడినైనా సరే నీ గొప్ప
చేతులతో పట్టు కొని, పైకి లాగగలిగే సామర్ధ్యము ఉన్నవాడివి. ఒకవేళ
నాలుగు చేతులు ఉన్నవాడివి అని అనుకుంటే, ఆ నాలుగు
చేతులతో, మానవుడికి నాలుగు పురుషార్థములు (1. ధర్మము, 2.

444
అర్ధము, 3. కామము, 4. మోక్షము) ఇవ్వగలిగే సామర్ధ్యము
ఉన్నవాడివి.

ఉదాహరణ:

ఒక చిలుక జామ చెట్టు మీద వాలి, జామ కాయను చూస్తే


ఆది ఇంకా చిన్న పిందిగానే ఉంది. ఆ కాయ పెరిగి, పండితే గాని,
చిలుక తినలేదు. అక్కడి నుండి చూస్తే ఒక బూరుగుచెట్టు
కనిపించింది. ఆ బూరుగుచెట్టు కాయలు పెద్దగా కనిపిస్తే ఆ కాయలు
త్వరగా పండుతాయి, వాటిని తినవచ్చు అని అనుకొని, ఆ చిలుక ఆ
బూరుగుచెట్టు ని ఆశ్రయించింది. ఆ చిలుక ఆ బూరుగు కాయను
చూస్తూ, ఇది త్వరగా పండుతుంది, నేను తినాలి అని ఆశగా
ఎదురుచూస్తోంది. బూరుగు కాయ ఎప్పటికీ పండదు. అది పెరిగి,
పెరిగి ఒక రోజు పగిలిపోతుంది. అప్పుడు దానిలో నుండి బూరుగు
పత్తి (దూది) బయటకు వస్తుంది. ఆ పత్తిని చిలుక తినలేదు. ఆ
చిలుకకి అటు జామకాయ పండినప్పుడు, మరికొన్ని చిలుకలు
వాటిని తినేశాయి. ఇటు బూరుగు పత్తిని తినలేదు. ఆ చిలుకకు
ఉభయ భ్రష్టు (రెండు వైపులా నుండి నష్టము కలిగింది, ఎటూ
కాకుండా పోయింది) అయిపోయింది. ఈ విధముగానే సాధకుడు
కర్మ మార్గము వదిలి (చిలుక జామ కాయ వదిలినట్లు ), శాస్త్రములో
చెప్పిన విధముగా, వాటిపైన నమ్మకముతో, పెద్ద, గొప్ప ఫలితము

445
దక్కుతుంది అని జ్ఞాన మార్గము సాధన మొదలుపెట్టితే (భూరుగు
కాయ పెద్దదని, ఆ చిలుక దాని కోసము ఆశ పడినట్లు ) ఆ జ్ఞాన
మార్గము సాధన పూర్తి చేయలేక ఉభయ భ్రష్టు (రెండు వైపులా
నుండి నష్టము కలిగింది, ఎటూ కాకుండా పోయింది) అయితే ఆ
సాధకుడి పరిస్థితి ఏమిటి?

ఛాందోగ్యోపనిషత్ – 5-10-7 –“...కపూయచరణా


అభ్యాసో హ యత్తే కపూయాం యోని మాపద్యేరన్ శ్వ యోనిం వా
సూకరయోని వా చంణ్డా ల యోనిం వా”, - ఎవరు దురాచారులై,
శాస్త్ర విరుద్ధ కర్మలు చేస్తా రో, వారు వెనువెంటనే నీచ యోనులలో
పుట్టు దురు. కుక్క, పంది లేక చండాలుడుగా పుట్టు దురు. 5-10-8
– “అదైతయోః పధోర్నకతరే చ న తా నీమాని క్షుద్రాణ్య
సకృదావర్తీని భూతాని భవంన్తి...” ఎవరు ధర్మ కర్మలు చేయరో,
వారు రెండు మార్గములలో (అర్చిరాది – శుక్ల పక్షము - కాంతి
మార్గము - ఉత్తరాయణము మరియు ధూమ మార్గము – కృష్ణ
పక్షము – రాత్రి - దక్షిణాయణములలో) చేరక, మరలా, మరలా
జనన మరణములను పొందే క్రిమి కీటకములుగా పుట్టు దురు.

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తు మర్హస్యశేషతః ।


త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ॥ 39 ॥

446
ఈ సంశయములోని ఏ చిన్న అంశము నాలో
మిగలకుండా నీవు తొలగించాలి శ్రీకృష్ణ భగవానుడా I

నీవు తప్ప ఇంకెవ్వరూ ఈ సంశయమును తొలగించలేరు.

ఈ సంశయమును తీర్చే అర్హత నీకు మాత్రమే ఉంది. నీవు


పరమాత్మవు. నీవే ప్రతి ప్రాణి హృదయములలో ఉండి, జీవుల
కర్మలకు సాక్షిగా అందరినీ గమనిస్తూ ఉండేవాడివి. నీవే కర్మ ఫల
దాతవు.

శ్రీభగవానువాచ ।
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే ।
న హి కల్యాణకృత్కశ్చిద్ దుర్గతిం తాత గచ్ఛతి ॥ 40 ॥

భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు I ఓ


అర్జు నుడా I నీవు చెప్పిన సాధకుడికి ఈ లోకములో కాని, పై
లోకములలో కాని ఏ రకమైన వినాశనము (నష్టము) లేదా అందనిది
ఏదీ లేదు.

447
ఆ సాధకుడు శాస్త్రీయమైన మార్గములోనే ఉన్నవాడికి,
మంచి పనులు చేసేవాడికి ఏ రకమైన దుర్గతి (నరకము, చెడు
ఫలితము) మాత్రము రాదు. వాళ్లకు అధోగతి ఉండదు అని
శాస్త్రములు (ఉపనిషత్తు లు) చెప్పుతున్నాయి. తాత = తండ్రి,
నాయనా (నాకు పుత్రు డితో సమానమైనవాడైన ఓ అర్జు నా).

పంచాగ్ని విద్య - ఛాందోగ్యోపనిషత్ – 5-10-1 – “తద్య


ఇత్ధం విదుః యేచేమేరణ్యే శ్రద్ధా తప ఇత్యుపాసతే తేర్చిష మభి
సంభవంత్యర్చి షోహ రహ్న ....” - (సత్కర్మలు చేసుకున్న వాళ్ళు
ధూమ మార్గములో పై లోకములకు వెళ్లు తారు). కాని ఎవరైతే
గురువుల ఉపదేశముల మీద, వేద వాక్యముల మీద విశ్వాసము
బలముగా పొంది, శ్రద్ధగా తపస్సు, ఉపాసన సత్య స్వరూపుడైన
పరమాత్మ మీద చేసుకుంటూ ఉంటారో, అటువంటి వారు కూడా
ఉత్తమమైన అర్చిరాది (కాంతి) మార్గములో వెళ్లి పై లోకములు
పొందుతారు. అచ్చట నుండి అహార్లోక, శుక్లపక్ష ఉత్తరాయణములు,
సంవత్సరములు, ఆదిత్యుడు, చంద్రు డు, విద్యుత్ ఈ మార్గములో
వెళ్ళుదురు. (ఇదే శ్లోకము బృహదారణ్యకోపనిషత్ – 6 లేదా 8-
2-15 కూడా చూడుము).

ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః ।


శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ॥ 41 ॥

448
ఈ లోకమును విడిచిపెట్టిన తరువాత (ఈ దేహమును
చాలించిన తరువాత), అత్యుత్తమమైన పుణ్య లోకములు (అశ్వమేధ
యాగము చేసినవారు వెళ్ళే లోకములు) చేరి, అక్కడ చాలా
సంవత్సరములు (అక్కడే శాశ్వతముగా ఉంటాడా అన్నంత
కాలము) నివాసము ఉండి, అక్కడ సుఖములను అనుభవించి,
వాళ్ళ చేసుకున్న సాధన యోగ్యతను బట్టి, హిరణ్యగర్భ బ్రహ్మ
దేవుడు) లోకమునకు లేదా సత్య లోకము దాకా వెళ్లి, మరలా తిరిగి
జన్మ పొందవలసిన సమయము వచ్చినప్పుడు

మంచి శాస్త్రీయమైన, ధర్మ, జ్ఞాన మార్గములు అవలంబించే


కుటుంబములో లేదా గొప్ప శ్రీమంతుల కుటుంబములో, నీవు
చెప్పిన యోగ భ్రష్టు డు (యోగ సాధన లేదా జ్ఞాన సాధన పూర్తి
కాకుండా మరణించినవాడు) తప్పకుండా పుట్టు తాడు.

యోగ భ్రష్టు డు లేదా మధ్యలో యోగ సాధన


ఆగిపోయినవాడు, మరణ సమయములో ఏ స్థా యిలో ఉన్నాడో
నిర్ణయించి, ఆ స్థా యికి తగ్గ కుటుంబములలో తిరిగి జన్మిస్తా డు. ఒక
వేళ యోగాభ్యాసము చేస్తూ ఉండగా, మనస్సులోని కొన్ని
కుసంస్కారములు, ప్రాపంచక విషయ భోగ వాసనలు కొంత పోతూ
లేదా తగ్గుతూ ఉంటాయి (పూర్తిగా తగ్గలేదు). ఇంకా కొంత భోగ

449
వాసనలు ఉన్నవాడు, ఆధ్యాత్మిక సాధన ముందుకు సాగే మంచి
మరియు సంపన్నుల కుటుంబములలో జన్మించి, ఒక వైపు ఆ
ఐశ్వర్యము, భోగములు అనుభవిస్తూ, తన భోగ వాసనలను
తీర్చుకుంటూ, రెండవ వైపు తన యోగ సాధన కూడా సాగిస్తూ
ఉంటాడు.

అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ।


ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం ॥42॥

పైన చెప్పిన విధముగా కాకపోతే, కేవలము యోగుల


కుటుంబములలో లేదా బుద్ధిమంతుల (పరమాత్మ తత్త్వ జ్ఞాన
వంతులు) కుటుంబములో పుట్టు తారు.

కాని మంచి శాస్త్రీయమైన, ధర్మ, జ్ఞాన మార్గములు


అవలంబించే మరియు గొప్ప శ్రీమంతుల కుటుంబములో పుట్టు ట
అసంభవము. ఏ మాత్రము సంపద లేని (దరిద్రు లు), యోగమే,
జ్ఞానమే ప్రధానముగా ఉండే కుటుంబములలో జన్మించుట
దుర్లభము (అసంభవము) కంటె కూడా చాలా కష్టమైనది.

ఒకవేళ అతనికి ప్రాపంచక విషయ భోగ వాసనలు పూర్తిగా


నాశనము అయిపోయి ఉంటే, కేవలము జ్ఞానమే ప్రధానముగా ఉండే
(ఏ మాత్రము భోగములు అనుభవించాలనే ఆలోచనలు కూడా లేని)
450
యోగుల కుటుంబములలో జన్మించి, అతడు తనకు మిగిలిన యోగ
సాధన చేసుకుంటాడు.

యోగ సాధన ప్రారంభించిన ఏ సాధకుడు, ఏ విధమైన


నష్టము పొందడు. తరువాత జన్మలలో ఆ సాధన ఎక్కడ
ఆగిపోయిందో, ఆ సాధకుడు సాధన స్థా యి ఎంత ఉందో, ఆ
స్థా యికి అనుగుణముగా, అక్కడ నుండి ప్రారంభము చేసుకొని, పై,
పై సాధనలను చేసుకోగలిగే ఉన్నతమైన జన్మలనే పొందుతాడు.
యోగ సాధన ఎంత కొంచము చేసుకున్నా సరే, సత్కర్మలు
ఆచరించినవారి కంటె ఉన్నతమైన స్థా యి ఫలితములను
పొందుతాడు.
ఉదాహరణ:

మహాభారతము - ధర్మ కీర్తి అనే మహారాజు ధర్మ


కార్యములు, పుణ్య కార్యములు చేయాలి అనే ఉద్దేశముతో చాలా
సత్కర్మలు చేసి, తత్త్వ జ్ఞానము కోసము ప్రయత్నము, మానవ
జీవితమును సార్ధకము చేసుకోవాలి, ఉత్తమమైన గురువులను
ఆశ్రయించి, వారి ఉపదేశములను పొందాలనే అనే కాంక్షతో,
దత్తా త్రేయ స్వామి ఆశ్రయించి, ఆయన నుండి అనేక ఉపదేశములు
పొంది, సత్కర్మ ఆచరణ, యోగాభ్యాసముతో పాటు రాజ్య
వ్యవహారములు చక్కగా చేస్తూ ఉన్నాడు. కొంత కాలమునకు,

451
కొంతమంది చెడు స్నేహితులు ఆ మహారాజు దగ్గరకు చేరారు. ఆ
చెడు స్నేహితులు మహారాజు గమనించ లేకపోయాడు. ఆ
స్నేహితులు చెడు సావాసముతో, ప్రోత్సాహముతో సత్కర్మ
ఆచరణలు, యోగాభ్యాసము మానేసి, భోగ లాలసలు
అనుభవించటము మొదలుపెట్టా డు. ఒకరోజు ధర్మ కీర్తి మహారాజు
వేటకు అడవిలోకి వెళ్ళాడు. అడవిలో దారితప్పి, రాజభటులు
చెల్లా చెదరు అయిపోయి, అడవిలో ఏదీ దొరకక, ఆకలి, దప్పికలతో
బాగా అలసిపోయి సాయంత్ర సమయమునకు, ఒక నదీ తీరము
చేరాడు. ఆ దగ్గరలో ఒక ఋషి ఆశ్రమము ఉంది. ఆ రోజు ఏకాదశి
అయినందున, ఆ ఆశ్రమములో అందరూ పగలంతా ఉపవాసము
చేసి, రాత్రి జాగరణ చేయాలని దీపములు వెలిగించి, పరమాత్మ నామ
సంకీర్తన చేసుకుంటున్నారు. ఆ ఆశ్రమము వరకూ వెళ్ళే ఓపిక లేక,
ఆ నామ సంకీర్తన ఆ నదీ తీరము నుండే వింటూ ఉండగా,
క్రమముగా ఆ మహరాజులో ఒక ఆర్తి మొదలయింది - “నేను ఎలా
ఉండేవాడిని, ఎన్ని సత్కర్మలు, యోగ సాధన చేశాను, ఈ చెడు
స్నేహితుల సావాసముతో ఇప్పుడు ఎంత క్రిందకు స్థా యికి
దిగజారిపోయాను” అనే ఆలోచనలతో బాధ, పశ్చాత్తా పము
పడుతూ ఆ ఏకాదశి రోజున ఆహారము దొరకక ఉపవాసమే ఉండి,
ఆ ఋషులు చేస్తు న్న పరమాత్మ నామ సంకీర్తన వింటూ
ప్రాణములను విడిచిపెట్టా డు.

452
మరుసటి జన్మలో ఒక ఋషి కుమారుడిగా పుట్టా డు.
పుట్టిన వెంటనే ఆ శిశువుకి, తాను క్రితం జన్మలో ధర్మ కీర్తి మహారాజు
అని, ఆ జన్మలోని స్మృతులు అన్నీ జ్ఞాపకమునకు వచ్చి, అప్పుడే ఈ
జన్మని వ్యర్ధము చేసుకోకుండా, తన యోగ సాధన సిద్ధించే వరకూ
సాధన చేసుకోవాలి, గత జన్మలో చివరి క్షణములో తనకు
తెలియకుండానే చేసిన ఏకాదశి వ్రతమును శ్రద్ధగా పాటించాలని అనే
నిర్ణయము తీసుకొని, ఆ పిల్లవాడు పుట్టిన 11 వ రోజున ఏకాదశి
అయినందువలన, ఆ పిల్లవాడు ఆ రోజు పాలు కూడా తాగలేదు. ఆ
ఆశ్రమములో అందరూ మొదట్లో కంగారు పడినా, ఆ పిల్లవాడి తండ్రి
మహర్షి కాబట్టి, దివ్య దృష్టితో చూసి, ఈ పిల్లవాడి గత జన్మల
సంస్కారములు అన్నీ తెలుసుకున్నాడు. ఆ పిల్లవాడు పెరిగాక, ఆ
మహర్షి కుర్రవాడికి యోగ్యమైన గురువు దగ్గరకు పంపాడు. అతడి
పశ్చాత్తా పముతో, పూర్వ జన్మలో అతనిలో పెరిగిన భోగ లాలస
పూర్తిగా పోయి, సరైన యోగ సాధన చేసుకున్నాడు. ఆ తరువాత
జన్మలో అతను ఇంకా ఉత్తమ జన్మ అయిన మహర్షి జన్మని పొంది,
యోగాభ్యాసము చేసుకొని, తత్త్వ జ్ఞానము పొంది, సిద్ధిని
పొందాడు.

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికం।


యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ॥ 43 ॥

453
యోగ భ్రష్టు డు పూర్వ జన్మలో తన సాధన ఏ దశలో
ఆగిపోయింది, తరువాత జన్మలో ఆ దశ నుండి తన సాధన
కొనసాగించుకునే బుద్ధిని పొందుతాడు.

పూర్వ జన్మలో యోగ భ్రష్టు డు ఎంత ప్రయత్నము


చేసుకున్నాడో, తరువాత జన్మలో అంత కంటె ఎక్కువ ప్రయత్నము
చేసుకుని, ఆ ప్రయత్నము సిద్ధించాలనే ప్రయత్నము
చేసుకుంటాడు. ఉత్తమమైన కురు మహరాజు సత్కర్మ నిస్వార్ధముగా
చేసిన వంశములో పుట్టిన ఓ అర్జు నుడా I

పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః।


జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ॥ 44 ॥
యోగ భ్రష్టు డు కొంత కాలము చెడ్డ మార్గములో నడిచినా,
ఏదో ఒక సందర్భములో యోగ భ్రష్టమైన సమయము వరకు ఆ
సాధకుడు స్వల్పముగా చేసుకున్న యోగాభ్యాసము ప్రాబల్యముతో,
తనకు తెలియకుండానే, సన్మార్గము వైపు మళ్లించబడతాడు.

యోగము గురించి విందాము, తెలుసుకుందాము అనే


ఆసక్తితో లేదా కోరికతో, యోగము గురించి తెలుసుకున్న ప్రతి
వ్యక్తి, వేదములలో చెప్పిన సత్కర్మలు చేసుకున్న వ్యక్తి అందుకునే
ఫలములు కంటె, ఉత్తమమైన ఫలములను పొందుతాడు.

454
అమావాస్య చీకటి ఎంత దట్టముగా ఉన్నా,
సూర్యోదయము యొక్క మొదటి కిరణము పడగానే, అంత
దట్టమైన చీకటి పటాపంచలై, ప్రకాశము ఎలా వెదజల్లు తుందో,
అలాగే కుసంస్కారములు ఎంత కాలము ఉన్నా, పూర్వము
చేసుకున్న యోగాభ్యాసము ప్రభావముతో కుసంస్కారములు
పటాపంచలై, సన్మార్గము వైపు మళ్లించబడతాడు.

యోగాభ్యాసము ప్రయత్నము చేసిన, తత్త్వ జ్ఞానము


కోసము ప్రయత్నము చేసిన ప్రతి వ్యక్తికి, ప్రతి దశకు, సత్కర్మలు చేసిన
వాళ్ళ కంటె తప్పకుండా ఉత్తమమైన ఫలితములను పొందుతాడు.
దీని గురించే ఏ విధమైన సందేహము ఉండకూడదు.

2-40 వ శ్లోకములో పరమాత్మ ఈ విషయము


ముందుగానే చెప్పాడు.

ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః ।


అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిం ॥45॥

చిన్న ప్రయత్నమునకు కూడా మంచి ఫలితము ఉంది అని


అంతటితో ఆగిపోకుండా, యోగ సాధన లేదా తత్త్వ జ్ఞానము
కోసము ప్రయత్నము ఉత్తమమైన, నిరంతరము, చాలా తీవ్రముగా,
తీక్షణముగా, ప్రకృష్టముగా చేసుకున్న నిజమైన యోగికి, మనస్సులో
455
ఉండే పాపములు, అజ్ఞానము, మాలిన్యము పూర్తిగా తొలగిపోయి,
పరిశుద్ధమై

అనేక జన్మల నుండి చేసుకుంటున్న ప్రయత్నములకు సిద్ధిని


పొంది, తత్త్వ జ్ఞానము పరిపూర్ణముగా లభించి, సరోత్కృష్టమైన,
శాశ్వతమైన, అఖండమైన దివ్య ఆనందము, పరమ పదము
(మోక్షము) పొందుతాడు.

ఏ కార్యము సిద్ధించాలన్నా నిరంతరమైన ప్రయత్నము, ఓర్పు


చాలా అవసరము.
ఉదాహరణ:

ఒక క్లా సులో ఉపాధ్యాయుడు లెక్కలు గురించి పాఠము


బోధిస్తు న్నారు. గణితము, భాగాహారము గురించి చెప్పుతూ, ఒక
అంకెని సున్నాతో భాగహారము చేయకూడదు అని చెప్పారు. ఒక
విద్యార్థి ఒక అంకెని సున్నాతో భాగహారము ఎందుకు చేయకూడదు
అని అడిగాడు. ఆ విద్యార్థి అనవసరమైన, అసందర్భమైన
సందేహము అనే కారణముతో, ఉపాధ్యాయుడికి చాలా కోపము
వచ్చి ఆ విద్యార్ధిని దండించాడు. ఆ పిల్లవాడికి చాలా బాధ కలిగింది.
ఎవ్వరికీ చెప్పలేదు, కాని ఆ సందేహము మనస్సులోనే ఉంచుకొని,
తరువాత గణిత శాస్త్రములో చాలా సంవత్సరములు ప్రయత్నము,

456
కృషి, పరిశోధన చేశాడు. అలా చేసి, చేసి చాలా సంవత్సరముల
తరువాత అనంతమైన కలన గణితము అనే ఒక సిద్దాంతమును
కనిపెట్టా డు. అతని పేరు జార్జ్ బర్కలీ. ఇందులో అతని పూర్వ జన్మ
సంస్కారము ఉన్నా, ఈ జన్మలో అతని ప్రయత్నము కూడా తోడైతే
లక్ష్యము తప్పకుండా సిద్ధిస్తుంది. వర్షపు బిందువులు కలిసి, కాలువ,
అది పారి తరువాత నది, అది పారి తరువాత సముద్రము
అయినట్లు , జన్మ జన్మల సాధన కలిసి జ్ఞాన సముద్రము అయి
సిద్ధిస్తుంది.

ఆధ్యాత్మికమైన విషయములలో కూడా ఇదే పద్ధతి


వర్తిస్తుంది. అతడు యోగి అవుతాడు. ఆ యోగ ప్రభావముతో ధర్మ
మేఘములా వర్షించి, మనస్సులో ఉండే దోషములు, పాపములు
తొలగిపోయి, సమాధి స్థితి పొందుతాడు.

సప్త జ్ఞాన భూమికలు:

యోగ సాధనలో సప్త జ్ఞాన భూమికలు (7 – దశలు)


ఉన్నాయి. సాధకులు ఈ ఏడు దశలు దాటవలసి ఉంటుంది. అవి –
1. శుభేచ్చ – సత్యమును (పరమాత్మను) తెలుసుకోవాలనే తీవ్రమైన
కోరిక, తపన, ఆకాంక్ష. తత్త్వ జ్ఞానము పొందుటకు యోగ్యత
కలుగుటకు సాధన అంశములు – నిత్యానిత్య (నిత్యము -

457
పరమాత్మ, అనిత్యము - ప్రపంచము) వస్తు వుల వివేకము, శమము
(కర్మేంద్రియముల నిగ్రహము, దమము (జ్ఞానేంద్రియముల
నిగ్రహము), మనో నిగ్రహము, తితీక్ష (ద్వంద్వములు – సుఖ
దుఃఖములు, లాభ నష్టములు, శీతోష్ణములు మొదలైనవి) సమ
స్థితి, ఉపరతి (అనవసరమైన విషయముల నుండి విరమణ,
వైరాగ్యము), జిజ్ఞాస – గురువును ఆశ్రయించి సత్యమును
(పరమాత్మను) తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక ప్రకటించి,
అర్థించుట. 2. విచార – పరమాత్మను తెలుసుకోవాలనే ప్రయత్నము,
విచారణ. 3. తనుమానసి – పరిశుద్ధమైన మనస్సు. 4. సత్వాపత్తి –
పరమాత్మ తత్త్వ జ్ఞానము అనుభవము లోనికి వచ్చుట. 5. అసంసక్తి
– ప్రాపించక విషయములపైన, వస్తు వులపైన వైరాగ్యము. 6. పదార్థ
భావన – నిర్మలమైన, నిష్కళంకమైన సత్యము, ఆత్మానుభవము. 7.
తురీయము -సర్వోత్తమమైన, సర్వోత్కృష్టమైన వర్ణించలేని
పరమానంద అనుభవము.

ఇందులో మొదటి మూడు దశలు సాధన దశలు. 4 వ


దశలో పరమాత్మ తత్త్వ జ్ఞానము అనుభవము లోనికి వచ్చిన
తరువాత (బ్రహ్మవిత్ అంటారు), తరువాత మూడు దశలు
(బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ట అంటారు), తత్త్వ
జ్ఞానము స్థిరపరచుకొనుటకు సాధన చేయవలసినవి.

458
తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః।
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జు న॥46॥

తపస్సులు (శరీరమును తపింపచేసే సాధన) చేసేవారి కంటె


యోగ సాధకులు (శరీరమును, ఇంద్రియములను, మనస్సును
నిగ్రహించుకొని, తపింపచేసే చేసే సాధన) సాధకులు ఉత్తమమైన
స్థా యిలో ఉంటారు. అలాగే కేవలము వేదములు, శాస్త్రములు,
ఉపదేశముల ద్వారా పరమాత్మ తత్త్వమును పరోక్ష జ్ఞానము
(ప్రత్యక్షముగా చూచినట్లు కాదు) సాధకుల కంటె
యోగాభ్యాసముతో మనస్సుని శుద్ధ పరచుకొని, పరమాత్మ
తత్త్వమును అపరోక్ష జ్ఞానము (మనస్సుతో ప్రత్యక్షముగా
చూచినట్లు ) సాధకులు ఉత్తమమైన స్థా యిలో ఉంటారు.

సత్కర్మములు చేసేవాడి కంటె కూడా యోగాభ్యాసము చేసే


సాధకుడు ఉత్తమ స్థా యిలో ఉంటాడు. కాబట్టి నీవు
యోగాభ్యాసము ప్రారంభించి నీవు యోగమును సాధించుకో (ఇది
మనందరికీ కూడా వర్తిస్తుంది). అర్జు నా (తెల్లగా ఉన్నవాడు,
పరిశుద్ధమైన వాడా, మరికొంత పరిశుద్ధము చేసుకో).

సాధారణ మానవుడి కంటె సత్కర్మలు చేసేవారు ఉత్తములు.


సత్కర్మలు చేసే కంటె నిష్కామ కర్మలు చేసేవారు ఉత్తములు.

459
నిష్కామ కర్మలు చేసే కంటె యోగాభ్యాసము చేసేవారు
ఉత్తములు.

యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా ।


శ్రద్ధా వాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః ॥ 47 ॥

ఇతర దేవతలను ధ్యానము చేసేవాళ్ళు యోగులు చాలా


మంది ఉన్నారు. వాళ్ల కంటె తన అంతరాత్మను (మనస్సును) నా
యందే స్థిరముగా నిలిపి ఉంచిన,
శ్రద్ధ కలిగిన భక్తు డు, నన్నే ఆశ్రయించి, ఎప్పుడూ నన్నే
సేవిస్తూ ఉంటాడో, నన్నే (పరమాత్మనే) తప్ప ఇతర దేవతలను,
వస్తు వులను, విషయములను ఆశ్రయించకుండా ఉంటాడో
అటువంటివాడు, యోగుల కంటె కూడా ఉత్తమమైనవాడు,
శ్రేష్టమైనవాడు.

యోగాభ్యాసముతో శ్రద్ధను, భక్తిని కూడా కలుపుకొని,


పరమాత్మనే ధ్యేయ లక్ష్యముగా సాధన చేసేవాడు, యోగ సాధకుల
కంటె ఉత్తమమైనవాడు. 4-25 వ శ్లోకములో చెప్పిన వివిధ
యోగాభ్యాసములు చేసే సాధకులు, చేసే ప్రతి పనిని యోగముగా
భావించి చేసే సాధకుల కంటె, పరమాత్మనే మనస్సులో స్థిరముగా
స్థా పించుకొని, అంతరాత్మను పరమాత్మ యందే లగ్నము చేసి, శ్రద్ధగా,

460
భక్తితో నిరంతరము పరమాత్మనే ఎవరైతే సేవిస్తూ ఉంటాడో,
అటువంటి యోగ సాధకుడు ఉత్తమమైన యోగ సాధకుడు.

ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం


యోగశాస్త్రే శ్రీకృష్ణార్జు న సంవాదే ఆత్మసంయమయోగో నామ
షష్ఠోఽధ్యాయః॥ 6 ॥

మంగళా శ్లోకములు

యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః l

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రు వా నీతిమతిర్మమ ll

అధ క్షమా ప్రార్ధనా

యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ l తత్సర్వం క్షమ్యతాం


దేవ నారాయణ నమోస్తు తే ll

అధ భగవత్ సమర్పణమ్

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ l


కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ll

అధ లోకక్షేమ ప్రార్ధనా

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః l


సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ll
461
అధ మంగళమ్

శ్రియః కంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినామ్ l


శ్రీవేంకట నివాశాయ శ్రీనివాసాయ మంగళమ్ ll

కృష్ణ నామ సంకీర్తన

కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l

కృష్ణం వందే జగద్గురుం l శ్రీ కృష్ణం వందే జగద్గురుం l

462
కర్మ షట్కము అనే మొదటి ఆరు అధ్యాయముల సంగ్రహము

మొదటి అధ్యాయములో (అర్జు న విషాద యోగము)


అర్జు నుడు అనే మహా వీరుడు, యుద్ధము చేయవలసిన
సమయములో, తనకున్న “అహం” (నేను), “మమ” (నా వారు)
అనే అభిమానముతో మరియు అజ్ఞానముతో కలిగిన శోకము
(మనస్సులో తీవ్రమైన వేదన), మోహము (ఏమి చేయాలి లేదా ఏమి
చేయకూడదు అనే అజ్ఞానము) వలన, తన కర్తవ్యమును విడిచిపెట్టి,
విషాదముతో నేను యుద్ధము చేయను అని భీష్మించుకొని
కూర్చొన్నాడు. (ఇటువంటి పరిస్థితులు చాలా మంది సాధారణ
మానవులలో కూడా కలుగుతుంది).

రెండవ అధ్యాయములో(సాంఖ్య యోగము) కర్తవ్యము


నిర్వహించవలసి వచ్చినప్పుడు, ఎవ్వరూ వెనక్కి మళ్లకూడదు అని
పరమాత్మ ఉపదేశము చేశాడు. శోకము, మోహము
పోగొట్టు కుందుకు, ఆత్మ తత్త్వ జ్ఞానము తప్ప మరొక మార్గము
లేదని, ఆ జ్ఞానము పొందుటకు అందరూ వారి, వారి కర్తవ్యములను
నిర్వహించాలి. కర్తవ్యము రాగ, ద్వేషములు లేకుండా సమతా
భావముతో నిర్వహిస్తే, క్రమముగా తత్త్వ జ్ఞానము పొందుటకు అర్హత
లభిస్తుందని బోధించాడు. ఆత్మ స్వరూపమునకు జన్మ, మరణము

463
లేదని, స్థితప్రజ్ఞుడి లక్షణములను, ఆత్మ తత్త్వ జ్ఞానము పొందుటకు
ప్రధాన సాధనములను బోధించాడు.

మూడవ అధ్యాయములో (కర్మ యోగము) అర్జు నుడి –


నేను కర్మ మార్గములో వెళ్ళాలా, లేదా జ్ఞాన మార్గములో వెళ్ళాలా
అనే సందేహమును తీర్చుటకు – సాధారణ మానవులకు కర్మ
మార్గము ముఖ్యమైన మార్గము. కర్మ ఫలములు ఆశించకుండా
కర్మలు చేయాలని నొక్కి చెప్పాడు. ఈ కర్మ మార్గములో పరిపక్వము
పొందిన తరువాత, ఎప్పుడైతే బాహ్య ప్రాపంచక విషయముల మీద
ప్రీతి ఉండదో, సంపూర్ణ వైరాగ్యము కలుగుతుందో, కేవలము ఆత్మ
మీదే ప్రీతి ఏర్పడుతుందో, అప్పుడు కర్మ మార్గము విడిచిపెట్టి జ్ఞాన
మార్గము అవలంబించాలి అని బోధించాడు.

నాలుగవ అధ్యాయములో (జ్ఞాన యోగము) సృష్టి


ప్రారంభము నుండి ఎవరు కర్మ మార్గము అనుసరించాలి, ఎవరు
జ్ఞాన మార్గము అనుసరించాలి అని చెప్పుతూ వస్తు న్నాను. కాని
మధ్యలో ఆ సంప్రదాయము విచ్చిన్నమైపోయింది. నేను మళ్ళీ
ఇప్పుడు నీకు బోధిస్తు న్నాను అని చెప్పాడు. పరమాత్మ యొక్క
తత్త్వమును, అవతారముల లక్ష్యములను వివరముగా చెప్పాడు.
కర్మ మార్గము చాలా జటిలమైనది, క్లిష్టమైనది. తొందర పడి ఎవ్వరూ
కర్మ మార్గము విడిచిపెట్టకూడదు. పరమాత్మ తత్త్వ జ్ఞానము

464
పొందాలి అనే వంకతో, సాధారణ మానవులు కర్మ మార్గము
విడిచిపెట్టకూడదు. సత్కర్మ ఆచరణ ద్వారా పరమాత్మ తత్త్వ
జ్ఞానము ఎలా పొందాలో కూడా చెప్పాడు.

ఐదవ అధ్యాయములో (కర్మసన్యాస యోగము) అర్జు నుడు


కర్మ మార్గమును అనుసరించాలా లేదా కర్మ సన్యాసము చేయాలా
అని మరొక సందేశము గురించి చెప్పమని అడిగాడు. కర్మ
సన్యాసము అంత సులభమైనది కాదు. కర్మ ఫలముల మీదా ఆసక్తి
లేకుండా, మానసికముగా కర్మ ఫలములను విడిచిపెట్టా లి. ఇదే
అసలైన సన్యాసము. ఈ కర్మ ఫల సన్యాసము సాధించిన వారికే
సర్వ కర్మ సన్యాసమునకు అర్హత కలుగుతుంది. సత్కర్మ ఆచరణ
రాగ, ద్వేషములు లేకుండా, సమతా భావముతో, కర్తృత్వ భావన
లేకుండా, ఫలాసక్తి లేకుండా చేయగలిగే సామర్ధ్యము, నేర్పు
సాధించుకొని, ఆ కర్మలకు కేవలము సాక్షి మాత్రమే అనే భావన
పెంచుకుంటూ, మానసికముగా కర్మలు సన్యాసము చేయుటయే
అసలైన సన్యాసము. ఇటువంటి కర్మ సన్యాసము సాధించిన
తరువాత క్రమముగా జ్ఞాన మార్గము లోనికి ప్రవేశమునకు అర్హత
కలుగుతుంది.

ఆరవ అధ్యాయములో (ధ్యాన యోగము) ఈ కర్మలు ఎంత


దాకా చేసుకుంటే, పై మెట్టు ఎక్కటానికి అర్హత కలుగుతుందో చెప్పి,

465
తరువాత ఏ రకమైన యోగాభ్యాసము చేసుకోవాలో వివరించాడు.
యోగాభ్యాసమునకు ప్రదేశము, ఆసనము, ఆహారము
నియమములు వివరించి, నిస్పృహ సర్వ కామేభ్యః – ఏ విధమైన
కోరికలు లేకుండా, మనస్సులో ఏ విధమైన మాలిన్యములు
లేకుండా పరిశుభ్రము చేసుకొని, ఏ విధమైన ఆలోచనలు,
అల్లకల్లోలములు లేకుండా ప్రశాంతత, నిశ్చల స్థితిని, ఏకాగ్రతను
సాధించటమే యోగము యొక్క లక్ష్యము. యోగ శాస్త్రములోని
అనేక రహస్యములను చెప్పి, మానస క్రియలను ఎలా
నిరోధించుకోవాలో వివరించాడు. ఆ ఏకాగ్రతను పరమాత్మ మీదే
కేంద్రీకరించి, పరమాత్మ తత్త్వ జ్ఞానము కొరకు సాధన చేసుకోవాలి.

మానవులు తమకు విహితమైన కర్మలు, కర్తవ్యములు


చేయాలి. ఏ మాత్రము బద్ధకము చూపించకూడదు. రాగ,
ద్వేషములు లేకుండా, కర్తృత్వ భావన లేకుండా, సమతా భావముతో
సత్కర్మలు చేయమని, ఆ కర్మ ఫలితములను ఆశించకుండా
ఉండమని బోధించాడు. కొన్ని సందర్భములలో ఆత్మ తత్త్వమును
కూడా బోధించాడు.

466
ముఖ్యమైన శ్లోకములు

అధ్యాయము శ్లోకముల సంఖ్య

2 22, 25, 31, 38, 47, 50, 55, 56, 59,


61, 62, 63, 64, 65, 66
3 7, 9, 17, 18, 20, 27, 28, 35, 37, 38,
39, 40, 41, 42, 43
4 6, 7, 8, 13, 18, 19, 21, 23, 24, 26,
27, 32, 33, 34, 35, 37
5 8, 9, 10, 12, 14, 17, 19, 22, 24, 25,
27
6 2, 3, 6, 10, 11,16, 17, 20, 21, 23,
25, 32

467
468

You might also like