You are on page 1of 9

తెలంగాణ

Telangana

Assamese Bengali English Gujarati Hindi Kannada Malayalam Marathi Oriya Punjabi Tamil T
ముఖ్యాంశాలు రాష్ట్రం‌ మీ జిల్లా భారత్ సితార చిత్రమాలిక వీడియోలు నేరాలు ఛాంపియన్ వాణిజ్యం ప్రపంచం సాంకేతి

HOME /
STATE /
HYDERABAD /
ETV BHARAT SPECIAL STORY ON WISDOM BRIDGE BOOK PRINCIPLES TO LIFE AND CHILD CARING

పిల్లల్ని ఇలా పెంచాలట.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..!

Follow Us
Published: Jan 8, 2023, 8:57 AM

Wisdom Bridge Book Life Principles: ‘నా బిడ్డకేం తక్కువ... రాజాలా పెంచుతా...’ ప్రతి తండ్రీ
అనుకునే మాటే ఇది. అడిగినవన్నీ కొనిచ్చీ... ఆస్తు లు సంపాదించిపెట్టీ... నిజంగానే పిల్లల కోసం మన దేశంలో
తల్లిదండ్రు లు చేస్తు న్నంత మరెవరూ చేయరేమో! అందుకే రెండేళ్ల క్రితం 64 వేల కోట్లు ఉన్న పిల్లల వస్తు వుల
మార్కెట్‌విలువ ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని నిపుణుల అంచనా. పిల్లల్ని
పెంచడమంటే అన్ని సౌకర్యాలూ అమర్చడమేనా, వాళ్లకి కావలసిందేమిటీ, మనం ఇస్తు న్నదేమిటీ... అన్న
ఆలోచన అమ్మానాన్నల్ని ఎప్పుడూ వేధిస్తూ నే ఉంటుంది. ఆ ఆందోళనని ఆచరణ దిశగా మళ్లిస్తుంది ‘ద
విజ్‌డమ్‌బ్రిడ్జ్‌’ పుస్తకం. ‘దాజి’గా పేరొందిన ఆధ్యాత్మికవేత్త కమలేశ్‌డి.పటేల్‌రాసిన ఈ పుస్తకం తల్లిదండ్రు ల
ఎన్నో సందేహాలకు సమాధానమిస్తుంది.

Wisdom Bridge Book Life Principles: ఒక యువకుడు గురుకులంలో ఉండి అన్ని విద్యలూ నేర్చుకున్నాడు.
అతడు తిరిగి ఇంటికి వెళ్లిపోయే సమయం వచ్చింది. గురువు భార్య దగ్గర వీడ్కోలు తీసుకోవడానికి వెళ్లా డు. తమ
కళ్లముందు చదువుకుంటూ పెరిగిన ఆ అబ్బాయి మీద ఆమెకి పుత్రవాత్సల్యం. తమను విడిచి వెళ్లిపోతున్నాడని
బెంగ. ‘వెళుదూ గానీలే... ముందు భోజనం చెయ్యి, కాసేపు విశ్రాంతి తీసుకో...’ అంటూ ఆ వంకా ఈ వంకా చెప్పి
సాయంత్రం వరకూ కళ్లకెదురుగా కూర్చోబెట్టు కుంది. ఇక గురువు వచ్చే వేళ కాగానే ఆ అబ్బాయి చేతికి ఒక
లాంతరు ఇచ్చి జాగ్రత్తగా వెళ్లిరమ్మని సాగనంపింది.

కాస్త దూరం వెళ్లా డో లేదో గురువు పిలిచినట్లు వినిపించింది అతనికి. వెనక్కి వెళ్లా డు. శిష్యుడి చేతిలోని లాంతరు
తీసుకుని ఆయన ‘ఇక వెళ్లు . జాగ్రత్త’ అన్నాడు. చీకట్లో వెళ్తు న్నవాడి చేతిలో దీపం తీసేసుకుని జాగ్రత్తగా
వెళ్లమంటాడేంటీ... ఇంతకీ అతడు క్షేమంగా చేరాడా..! నిజానికి ఈ సందిగ్ధా వస్థ ప్రతి తల్లీ తండ్రీ పిల్లల పెంపకంలో
ఎదుర్కొనేదే. ఇక్కడ గురువు భార్య- పిల్లల పట్ల మన ప్రేమకు ప్రతీక అయితే గురువు క్రమశిక్షణకు సంకేతం.
విద్యావంతుడైన ఆ అబ్బాయికి జ్ఞా నమే దారి చూపుతుందనీ దీపంతో పనిలేదనీ గురువు ఉద్దేశం. ప్రేమా
క్రమశిక్షణా... ఈ రెంటి మధ్యా నలిగిపోని తల్లిదండ్రు లు ఉండరు కదా. అందుకే తన పుస్తకాన్ని దాజి ఈ కథతోనే
ప్రా రంభించారు. పిల్లల పెంపకం గురించి ఆయన ప్రధానంగా తొమ్మిది సిద్ధాంతాలను చర్చించారు.
తన జీవితం నుంచి ఉదాహరణలు ఇస్తూ , సందర్భానుసారం శాస్త్రీయ పరిశోధనలను పేర్కొంటూ రాసిన ఈ
పుస్తకం- మంచి తల్లిదండ్రు లు ఎలా కావచ్చో చెబుతుంది. పిల్లల పెంపకంలో తాతయ్యలూ బామ్మల విలువేమిటో
చాటుతుంది. ఈ ఆంగ్ల పుస్తకంలోని విశేషాల సారాంశం చూద్దా మా!
ఊరంటే... ప్రాంతం కాదు : బిడ్డను పెంచాలంటే ఊరంతా పూనుకోవాలని ఆఫ్రికన్ల సామెత. ప్రపంచంలో ఎక్కడైనా
అంతేనేమో. ఒకప్పుడు మన సమాజాలన్నీ గ్రా మీణ సమాజాలే. అక్కడ అందరూ కలిసిమెలిసి బంధాల్నీ
బాధ్యతల్నీ పంచుకునేవారు. పిల్లల్ని పెంచడంలోనూ తలా ఒక చెయ్యీ వేసేవారు. బోలెడంత మంది సభ్యులతో
సమష్టి కుటుంబాలుండేవి. వారందరి ప్రేమా ఆప్యాయతల నడుమ పిల్లలు భద్రంగా, స్వేచ్ఛగా పెరిగేవారు. నగర
జీవితమూ, చిన్న కుటుంబాలూ, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడమూ తప్పనిసరైన ఈ రోజుల్లో అలాంటి
పెంపకం సాధ్యంకాదు. మరెలా..?

Don't miss Ashadam Up to60%off


యొక్క ప్రకటనలు
Kankatala Ashadam sale is back. Get upto 60% Off , Limited Period offer . Visit Shop Now
today
ఈ యాడ్‌ని చూడటం ఆపు ఈ ప్రకటన ఎందుకు? 
Kankatala

* చిన్న కుటుంబాల్లో పెరిగే పిల్లలు ఒంటరితనంతో బాధపడతారు. ఊరంటే ఒక ప్రాంతం కాదు, మనుషులు. పిల్లల్ని
పెంచడానికి ఊరంతా తీసుకురాలేం కానీ తాతయ్యనీ, బామ్మనీ తీసుకురావచ్చు. వాళ్ల అనుభవం పిల్లల
పెంపకంలోని సవాళ్లను ఎదుర్కొనడంలో సాయపడుతుంది. పిల్లల సంరక్షణకు బయటివారిమీద ఆధారపడితే
ఆందోళనా ఆర్థికభారమూ కూడా. అదే సొంత మనుషులైతే అవేవీ ఉండవు.
* పెద్దలు దగ్గర ఉండడం సాధ్యం కాక పోయినా పిల్లలు వారి ప్రేమకి దూరం కానక్కర్లేదు. ఫోన్లూ టెక్నాలజీని
అందుకు వాడుకోవచ్చు. వారానికోసారైనా వీడియోకాల్‌చేసి పెద్దలతో మాట్లా డించాలి. అనుబంధాలే
ఒంటరితనాన్ని దూరంచేస్తా యి.

Don't miss Ashadam Up to60%off


యొక్క ప్రకటనలు
Kankatala Ashadam sale is back. Get upto 60% Off , Limited Period offer . Visit Shop Now
today
ఈ యాడ్‌ని చూడటం ఆపు ఈ ప్రకటన ఎందుకు? 
Kankatala

* అచ్చం అమ్మానాన్నల్లా గా చూసుకునే బంధువులూ పిల్లలకు అవసరం. ‘హాలో పేరెంటింగ్‌’ అంటారు దీన్ని.
తాతయ్యా బామ్మలో, పెదనాన్నో, మామయ్యో... అందుబాటులో ఉండే ఎవరో ఒకరు ఆ పాత్ర పోషించాలి. ఆ
సాన్నిహిత్యం పిల్లలు పెద్దయ్యాక కూడా మనసు విప్పి తమ కష్టసుఖాలు చెప్పుకోవడానికి వీలు కల్పిస్తుంది.
* దొరికిన సమయమంతా పిల్లలకు ఏవో నేర్పించేయాలనీ, చదివించేయాలనీ తాపత్రయం కూడదు. పిల్లల
ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి.

Don't miss Ashadam Up to60%off


యొక్క ప్రకటనలు
Kankatala Ashadam sale is back. Get upto 60% Off , Limited Period offer . Visit Shop Now
today
ఈ యాడ్‌ని చూడటం ఆపు ఈ ప్రకటన ఎందుకు? 
Kankatala

* తల్లిదండ్రు లు తమ బిడ్డ ‘స్పెషల్‌, టాలెంటెడ్‌’ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ పిల్లలు ‘స్పెషల్‌’గా
కాదు, ‘సెక్యూర్‌’గా ఫీలవ్వాలి. తమ పిల్లలు ‘స్పెషల్‌’ అనుకునే తల్లిదండ్రు లు వారి సామర్థ్యాలపైనే దృష్టిపెడతారు.
ఇతరుల ముందు గొప్పగా వారి విజయాలను ప్రదర్శిస్తా రు. దాంతో పిల్లలు ఒకలాంటి అభద్రతాభావంలోకి
నెట్టివేయబడతారు. ఈ విజయాలు సాధించకపోతే అమ్మానాన్నా నన్ను ప్రేమించరేమో- అని దిగులుపడతారు.
పిల్లల గెలుపుని కాకుండా వివిధ అంశాల్లో వారు చూపే చొరవని ప్రశంసించాలి.
.
జ్ఞా నవారధి నిర్మించాలి : జ్ఞా నం- బోధించేది కాదు, గ్రహించేది... అంటారు దాజీ. ఒక తరం నుంచి మరో తరానికి
జ్ఞా నం ప్రసారమయ్యేది తల్లిదండ్రు లనుంచి కాదు, తాతలూ బామ్మల నుంచేనట. దీనికి కారణం లేకపోలేదు...
తల్లిదండ్రు ల మీద ఉన్న సంపాదన బాధ్యతవల్ల పిల్లల్ని ఇంట్లో ఉన్న పెద్దల మీద వదిలేయడం మొదటినుంచి
ఉన్నదే. అప్పుడు వేటకు వెళ్లేవారు, ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తు న్నారు. దాంతో పిల్లల వ్యక్తిత్వానికి పునాది పడే
బాల్యం అంతా వారు తాతయ్యలూ, నాయనమ్మ, అమ్మమ్మల పర్యవేక్షణలోనే గడుపుతారు. వారి దగ్గరే జీవన
నైపుణ్యాలను నేర్చుకుంటారు. నిత్యజీవితంలో చేసే పనుల్లో నే అనుభవంతో తాము నేర్చుకున్న మెలకువలను
సందర్భాన్ని బట్టి చెబుతూ ఉంటారు పెద్దలు. ఆచరణలో నేర్చుకునే ఇలాంటి అంశాలు పిల్లల మీద చెరగని
ముద్రవేస్తా యి. అందుకే పెద్దల్ని ‘లివింగ్‌విజ్‌డమ్‌బ్రిడ్జ్‌’ అంటారు దాజీ. ప్రతి ఒక్కరి దగ్గరా ఏదో ఒక నైపుణ్యం
ఉండితీరుతుంది. దాన్ని నేర్చుకునే అవకాశం పిల్లలకు ఇవ్వాలి. పెద్దల అనుభవజ్ఞా నాన్ని తర్వాత తరాలకు
అందించేందుకు ఉన్న ఏకైక మార్గం అదే.

Don't miss Ashadam Up to60%off


Kankatala Ashadam sale is back. Get upto 60% Off , Limited Period offer . Visit Shop Now
today
Kankatala

సన్నద్ధత అవసరం : ఏ వయసులో పిల్లల్ని కనాలీ అన్నది నేటి సమాజంలో చర్చనీయాంశం. స్త్రీ పురుషులిద్దరూ
కెరీర్‌కి పెద్దపీట వేస్తూ పెళ్లినీ, పిల్లల్నీ వాయిదా వేస్తు న్నారు. అవి వారి వ్యక్తిగత విషయాలే కావచ్చు. ఇక్కడ మనం
పిల్లల కోణంలో మాత్రమే సమస్యను చూద్దాం. 35 ఏళ్లు దాటాక పుట్టే పిల్లల్లో శారీరక, మానసిక సమస్యలు తలెత్తే
అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. రెండోది- పిల్లల్ని పెంచడానికి చాలా ఓపికా శక్తీ కావాలి. వయసు
పెరిగే కొద్దీ అవి తగ్గిపోతాయి. తల్లిదండ్రు లకే కాదు, వారికి తోడ్పాటునందించే పిల్లల నానమ్మా అమ్మమ్మల వయసూ
పెరుగుతుంది. దాంతో వాళ్లూ ఓపిగ్గా పెంచలేకపోవచ్చు. ఆలస్యంగా పిల్లల్ని కంటే వాళ్లు జీవితంలో స్థిరపడేసరికి
తల్లిదండ్రు లు వృద్ధు లైపోతారు. మనవల ముద్దూ ముచ్చట్లను ఆస్వాదించలేరు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టు కోవాలి.
ఉద్యోగమూ ఆర్థిక విషయాల గురించి ఎలా ముందుగా ప్లా న్‌చేసుకుంటామో అలాగే పిల్లల్ని ఆహ్వానించే
సమయాన్నీ ప్లా న్‌చేసుకోవాలి. అప్పుడే సంతోషంగా తల్లిదండ్రు ల హోదాని ఆస్వాదించవచ్చు. వివాహబంధంలో
తృప్తిగా ఆనందంగా ఉన్న జంటే మంచి తల్లిదండ్రు లు కూడా కాగలరు. తల్లిదండ్రు లు ఆనందంగా ఉంటే పిల్లలూ
సంతోషంగా ఉంటారు. పిల్లలకు 50 శాతం సంతోషం జన్యుపరంగా తల్లిదండ్రు లనుంచి వస్తే మిగిలిన 50 శాతం
చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి వస్తుందట.
అమ్మ ఆనందమే.. మహిళ గర్భం దాల్చిన విషయం తెలిసినప్పటినుంచీ కుటుంబసభ్యులూ బంధువులూ ఆమెను
ప్రత్యేకంగా చూస్తా రు. తినాలనిపించినవి చేసి పెడతారు. పుట్టింటికి తీసుకెళ్లి విశ్రాంతి ఇస్తా రు. సీమంతమనో
మరొకటనో వేడుకలు చేస్తా రు. ఇవన్నీ ఆమెను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచడానికి చేసేవే. తల్లి సంతోషంగా
ఉన్నప్పుడే కడుపులోని బిడ్డ సంతోషంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో డచ్‌వాళ్లు ఆహార కొరతతో
తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. వేలాది మంది ఆకలిచావులకు గురయ్యారు. ఆ పరిస్థితుల్లో నూ అక్కడి ఆస్పత్రు లు
రోగుల ఆరోగ్య రికార్డు లను వివరంగా నమోదుచేశాయి. అప్పుడు గర్భిణులుగా ఉన్న దాదాపు 40వేల మంది
మహిళలూ వారి పిల్లల ఆరోగ్యాల మీద ఎన్నో అధ్యయనాలు జరిగాయి. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎదుర్కొన్న
పోషకాహారలేమి పలురకాల అనారోగ్యాల రూపంలో ఆ పిల్లల్ని జీవితకాలం వెంటాడిందని రుజువయ్యింది. మిగతా
సమయాల్లో పుట్టిన పిల్లలతో పోలిస్తే అప్పుడు పుట్టినవారు ఎక్కువసార్లు ఆస్పత్రిలో గడపవలసి వచ్చిందట.
గుండెజబ్బులు ఎక్కువగా వచ్చాయట. గర్భం దాల్చడమనేది కేవలం కాన్పు సాఫీగా అవడంతో అయిపోయే ప్రక్రియ
కాదనీ బిడ్డ జీవితకాలపు ఆరోగ్యాన్ని గర్భంలో ఉన్నప్పటి సమయమే శాసిస్తుందనీ ఆ అధ్యయనాలు తేల్చి
చెప్పాయి. అందుకే గర్భిణికి మంచి ఆహారమూ విశ్రాంతీ ఇస్తూ శారీరకంగానూ మానసికంగానూ ఆమె ఆనందంగా
ఉండేలా చూసుకోవాలి. సంతోషంగా ఉన్న తల్లి బిడ్డని ప్రేమగా చూసుకుంటుంది. అది బిడ్డలో భద్రతకీ
ప్రేమబంధానికీ పాదులు వేస్తుంది.

Don't miss Ashadam Up to60%off


Kankatala Ashadam sale is back. Get upto 60% Off , Limited Period offer . Visit Shop Now
today
Kankatala

.
బాల్యం... వ్యక్తిత్వానికి పునాది..

పిల్లల మెదడు తొంభై శాతం మూడేళ్లలోపలే ఏర్పడుతుంది. ఆ వయసులోనే అది అయస్కాంతంలాగా అందిన
సమాచారాన్నంతా గ్రహించేస్తుంది. భాష, అభిరుచి, ఆలోచన, విశ్లేషణానైపుణ్యాలు లాంటి ఎన్నో లక్షణాలకు గట్టి
పునాది వేస్తుంది.

Don't miss Ashadam Up to60%off


యొక్క ప్రకటనలు
Kankatala Ashadam sale is back. Get upto 60% Off , Limited Period offer . Visit Shop Now
today
ఈ యాడ్‌ని చూడటం ఆపు ఈ ప్రకటన ఎందుకు? 
Kankatala
* కొందరు పిల్లలకు అన్నీ నేర్పించేసి బాలమేధావులుగా తయారుచేయాలని ఆత్రపడుతుంటారు. దానివల్ల
ఒరిగేదేమీ ఉండదు. నీళ్లు న్నాయి కదా అని బిందెలకొద్దీ పోసేస్తే చెట్టు కాయలు కాయదు, అది కాసే సమయం
వచ్చినప్పుడే కాస్తుంది. అలాగే పిల్లలూనూ. మనం చేయాల్సిందల్లా వారి చిన్ని మెదడుకి మేత వేయడం. కథలూ
పాటలూ మాటలూ ఆటలతో బుర్రకి పదును పెట్టడం. ఆ చిన్ని మొక్క పెద్దదై తన ప్రతిభా పాటవాలతో అలరించే
దాకా వేచి చూడడం.

* అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలు చెప్పేది వినాలి. రకరకాల ప్రశ్నలు అడిగి తప్పోఒప్పో మాట్లా డనివ్వాలి,
సరిచేయకూడదు. తోటి పిల్లలతో ఆడుకోవాలి. అదే సమయంలో తల్లిదండ్రు లూ తమ స్నేహితులతో పిల్లల
పెంపకంలో అనుభవాలను పంచుకోవాలి. అంతే కానీ పోల్చుకోకూడదు. పిల్లలందరూ ఎవరికి వారే ప్రత్యేకం.

Kankatala యొక్క ప్రకటనలు


SHOP NOW
Don't miss Ashadam Upఆపు
ఈ యాడ్‌ని చూడటం to60%off
ఈ ప్రకటన ఎందుకు? 

* పిల్లల్ని తీర్చిదిద్దడంలో మాట చాలా ముఖ్యం. తల్లిదండ్రు ల మాటలు వారికి ధైర్యాన్నివ్వాలి. విలువల్ని నేర్పాలి.
చెడు అలవాట్లను సరిదిద్దడం కన్నా మొదటే మంచి అలవాట్లు అలవడేలా చూడాలి.

* పెద్దలు ఇరవై నాలుగ్గంటలూ ఫోనో టీవీనో చూస్తూ పిల్లల్ని అవతలి గదిలోకి వెళ్లి చదువుకోమనడం పద్ధతి కాదు.
పిల్లలు చుట్టూ కన్పిస్తు న్న విన్పిస్తు న్న ప్రతిదాన్నీ గ్రహిస్తా రు. అందుకే వాళ్లేం చూడాలని ఆశిస్తు న్నారో అవే కన్పించేలా
పెద్దలు నడచుకోవాలి. పిల్లలకి తల్లిదండ్రు లే రోల్‌మోడల్స్‌అన్నది మర్చిపోకూడదు. కొందరు పెద్దలు సిగరెట్లూ
మద్యం తాగుతారు. పిల్లల ముందే అసభ్యంగా మాట్లా డతారు.

Kankatala యొక్క ప్రకటనలు


SHOP NOW
Don't miss Ashadam Upఆపు
ఈ యాడ్‌ని చూడటం to60%off
ఈ ప్రకటన ఎందుకు? 

* పిల్లల్ని ఆదేశించడం, ఆజ్ఞా పించడం కన్నా ఆడుతూ పాడుతూ చెప్పాలనుకున్నది వాళ్లకి చెప్పగలగడమే సరైన
పేరెంటింగ్‌.

లక్షణాలే వ్యక్తిత్వాన్ని నిర్మిస్తా యి : తీయని జామ కాయలు కాయాలంటే జామ మొక్కే నాటాలి. నీరు పోసి జాగ్రత్తగా
పెంచాలి. చీడ పట్టకుండా కాపాడుకోవాలి. అప్పుడు తీయని జామకాయలే కాస్తా యి. ఆ చెట్టు క్యారెక్టర్‌అయితే
పండ్లు వ్యక్తిత్వం. క్యారెక్టర్‌ని మనం ఎంత బాగా కాపాడితే అంత మంచి వ్యక్తిత్వం రూపుదిద్దు కుంటుంది. పిల్లల
క్యారెక్టర్‌ని మౌల్డ్‌చేయడం తల్లిదండ్రు ల బాధ్యత. పరీక్షలో నీకెన్ని మార్కులు వచ్చాయి, అందరికన్నా ఎక్కువ
ఎవరికి వచ్చాయి, టీచరు నిన్నేమన్నారు, పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు... సాధారణంగా ఇలాంటి
ప్రశ్నలు అడగని తల్లిదండ్రు లు ఉండరేమో! ఇవాళ స్కూల్లో ఏంచేశావు, లంచ్‌ఎవరితోనైనా షేర్‌చేసుకున్నావా,
ఎవరికైనా సాయం చేశావా... ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు అరుదు. మన ప్రశ్నలు ఎప్పుడూ తెలివితేటలూ
యాంబిషన్‌మీదే ఉంటాయి. కానీ పిల్లలు నేర్చుకోవాల్సింది మంచితనం, మానవత్వం, విలువలూ. వీటిని
నేర్పక్కరలేదు, సహజంగానే వస్తా యనుకుంటారు కానీ నిజానికి నేర్పించాల్సింది వీటినే. అప్పుడే వాళ్లలో చక్కటి
వ్యక్తిత్వం రూపుదిద్దు కుంటుంది.
Kankatala
SHOP NOW
Don't miss Ashadam Up to60%off

.
కళ్లెం వదిలేయొద్దు : పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచి వాళ్లు బాల్యం నుంచి కౌమారంలోకి రాగానే పూర్తిగా వదిలేస్తా రు
తల్లిదండ్రు లు. తమ ఎత్తు ఎదిగిన బిడ్డల్ని చూసుకుని మురిసిపోతారు. పెద్దరికం ఆపాదించేస్తా రు.

నిజానికి హార్మోన్ల మార్పులతో అతలాకుతలమయ్యే ఆ వయసులోనే పిల్లలకు పెద్దల ప్రేమా మార్గదర్శకత్వమూ


చాలా అవసరం. అది లేనప్పుడే పిల్లలు పక్కదారి పడతారు. వ్యసనాల బారినపడతారు. అందుకే పసిపిల్లల్ని ఎంత
సున్నితంగా ఎత్తు కుంటామో పెద్ద పిల్లలతో అంత సున్నితంగా మాట్లా డాలి. పదేళ్లలోపు పిల్లల మనసు ఫ్లెక్సిబుల్‌గా
ఉంటుంది. నిశ్చితమైన అభిప్రా యానికి రాలేరు కాబట్టి వారి మనసులోకి మనం అనుకున్న ఆసక్తు ల్ని
చొప్పించవచ్చు. టీనేజ్‌లోకి వచ్చాక అలాంటివి సాధ్యం కాదు. ఇష్టా యిష్టా లపై వారికో కచ్చితమైన అభిప్రా యం
వచ్చేస్తుంది. అధికారంతోనో వాదనతోనో వాళ్ల అభిప్రా యాన్ని మార్చాలనుకోకూడదు. ఎంత పెద్ద పిల్లలైనా వారికి
ప్రేమ కావాలి. దాన్ని పుష్కలంగా అందించాలి. రోజూ కొంతసమయం వారితో గడపాలి. సరదాగా నవ్వుకోవాలి. మీ
చిన్ననాటి అనుభవాలూ తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పులను నిస్సంకోచంగా చర్చించాలి. నీతి బోధలకన్నా
అనుభవాలు చెప్పే పాఠాలు మనసులో నాటుకుంటాయి. పిల్లల్లో ఆలోచననీ వివేకాన్నీ పెంచుతాయి. మంచి
పౌరులుగా తీర్చిదిద్దు తాయి. చాలామంది తల్లిదండ్రు లు పిల్లలు బాధ్యత తెలుసుకోవడం లేదని
బాధపడుతుంటారు. వాళ్లకు బాధ్యత అప్పజెప్పడం ఎలాగో ముందు పెద్దలు తెలుసుకోవాలి. సవాలక్ష
అనుమానాలతో కాకుండా పిల్లల్ని నమ్మి బాధ్యత అప్పజెప్పాలి. పొరపాట్లు జరుగుతాయి. వాటినుంచే పాఠాలూ
నేర్చుకోనివ్వాలి.
Don't miss Ashadam Up to60%off
Kankatala Ashadam sale is back. Get upto 60% Off , Limited Period offer . Visit Shop Now
today
Kankatala

జీవనశైలీ, క్రమశిక్షణా... ప్రేమలో క్రమశిక్షణ చూపండి, కానీ క్రమశిక్షణను ప్రేమించకండి... అని చెబుతారు దాజి.
చాలామందికి తాము తల్లిదండ్రు లు కాగానే క్రమశిక్షణ గుర్తొ స్తుంది. అది పిల్లలకు మాత్రమే సంబంధించిన విషయం
అనుకుంటారు. క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం. అది వ్యక్తిత్వంలో భాగం. క్రమశిక్షణ అంటే స్వేచ్ఛకు సంకెళ్లు
వేయడం కాదు, స్వేచ్ఛనివ్వడం.

జీవనశైలి అలవాట్లనూ, క్రమశిక్షణనూ పెద్దల్ని చూసే పిల్లలూ నేర్చుకుంటారు. అందుకే ముందు మనల్ని మనం
మెరుగుపర్చుకుని వ్యక్తిగత క్రమశిక్షణ పాటించాలి. వయసుకి తగినట్లు పిల్లలకు మంచి అలవాట్లను నేర్పే
విషయంలో ఒకటికి పదిసార్లు చెప్పడంలో తప్పు లేదు. అయితే అది నసపెట్టినట్లో తిట్టినట్లో కాకుండా మర్యాదగా
చెప్పాలి. మంచి భాష, సమయపాలన, సహానుభూతి చూపడం లాంటివన్నీ పిల్లలకు అలవాటయ్యేలా చూడాలి.

పిల్లవాడు ఆడుకోవడానికి వెళ్లకుండా ఇవాళ హోంవర్కు చాలా ఉంది చేసుకుంటాను అన్నాడంటే- సెల్ఫ్‌డిసిప్లిన్‌
ర్చుకుంటున్నాడన్న మాటే. అలాంటప్పుడు మెచ్చుకుంటూ ఉంటే- క్రమంగా మంచేదో చెడేదో వాళ్లే
నిర్ణయించుకోగలుగుతారు.

పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే...

పిల్లల పెంపకానికి సంబంధించి కొన్ని పరిశోధనలు చూస్తే...

* రెండేళ్ల వరకూ పిల్లలకు అసలు ఏ తెరా చూపించవద్దంటుంది అమెరికన్‌అకాడమీ ఆఫ్‌పీడియాట్రిక్స్‌. చిన్నప్పుడే


స్క్రీన్‌ఎక్స్‌పోజర్‌బడికెళ్లా క పిల్లల నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందట. పిల్లలు చూడకపోయినా, ఇంట్లో ఏ
మూలో నడుస్తు న్న టీవీ వారి ఏకాగ్రతని భగ్నం చేస్తుందట. మాట తీరునీ, సమస్యల్ని ఎదుర్కొనే విధానాన్నీ
ప్రభావితం చేస్తుందట.

* యూనివర్సిటీ ఆఫ్‌బ్రిస్టల్‌కి చెందిన పరిశోధకులు మట్టికీ మనిషికీ ఉన్న బంధం గురించి పరిశోధించారు. మట్టిని
ముట్టు కున్నప్పుడు శరీరంలో సెరొటోనిన్‌స్థా యి పెరుగుతుందట. అది మన భావోద్వేగాలను నియంత్రిస్తుంది కాబట్టి
పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వాలి.

* హెల్త్‌సర్వీసెస్‌కంపెనీ సిగ్నా 2018లో 20వేల మందితో ఒక అధ్యయనం చేసింది. జనరేషన్‌జడ్‌‘లోన్లీయెస్ట్‌


తరం’ అని తేల్చింది. దీనికి కారణం పిల్లలు ఒంటరిగా పెరగడమే.

* మూడేళ్లలోపు పిల్లలతో తల్లిదండ్రు లు ఏం మాట్లా డతారూ ఎలా మాట్లా డతారూ ఎంతసేపు మాట్లా డతారూ
అన్నది వాళ్లమీద జీవితకాలం ప్రభావం చూపుతుందట. 1995లో అమెరికా పరిశోధకులు ఈ విషయంపై
అధ్యయనం చేసి ‘ద ఎర్లీ కెటాస్ట్రఫీ’ అన్న నివేదిక వెలువరించారు. పదేళ్ల తర్వాత చదువుకుంటున్న పిల్లల్ని
పరిశీలిస్తే చిన్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రు లు తక్కువ మాట్లా డిన పిల్లలు పలు అంశాల్లో వెనకబడి ఉండడాన్ని
గమనించారు.

ఆ అధ్యయనం తర్వాత తల్లిదండ్రు ల్లో చైతన్యం తేవడానికి అక్కడ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టా రు.

ఇవీ చదవండి:

'నీ సంపాదన నాకు అక్కర్లేదు.. పెళ్లి చేసుకుందాం అంటున్నాడు..'

అలా ఇలా బతకడం కాదు.. 'ట్రీ హౌస్' లా జీవించాలి..!

'నాన్నే.. అమ్మని చంపేశాడు'.. పోలీసులకు చెప్పిన నాలుగేళ్ల కూతురు

Don't miss Ashadam Up to60%off


Kankatala Ashadam sale is back. Get upto 60% Off , Limited Period offer . Visit Shop Now
today
Kankatala

You May Like Promoted Links by Taboola

25 Unbelievable Pictures Taken By Drones


investing.com

Belly Fat Removal Without Surgery In Hyderabad: The Price Might Surprise You
health-ink

An AI course could change your life, see the options


AI Course | Search Ads Read More

మందుకొట్టి పాముతో ఆట.. కాటేయగానే 'మృతి'.. అంత్యక్రియల వేళ లేచి కూర్చుని..

పగటిపూట శృంగారం చేస్తే పిల్లలు ఆరోగ్యంగానే పుడతారా? జ్వరంతో సెక్స్ చేయొచ్చా?

You might also like