You are on page 1of 11

4.

అప్పన్న పల్లిలో గొప్పగా వెలిసావా

శ్రీ నాగాభట్ల కామేశ్వరరావు


అభేరి రాగము చాపుతాళము

అప్పన్న పల్లిలో గొప్పగా వెలిసావా..

అలమేలు మంగతో కొలువైయున్నావా స్వామి. ||అప్పన్న||

నారికేళము పైన నామాలతో వెలసి... 2

ఆరాధించెడి వారి నాలించి పాలించి… 2

జాలిగా వనమాలిగా బాలాజి పేరున వెలిసినావట… 2 ||అప్పన్న||

వచ్చిపోయెడి వారి వరుసతో నడిపించి… 2

పిండి వంటల తోటి పులిహోర వడ్డించి

ఆకులో అరిటాకులో చిగురాకులో తినిపించినావట ||అప్పన్న||

ఎక్కడున్నను నీవే దిక్కని

నమ్మేము - 2

చిక్కులన్నియు బాపు స్వామి నీవన్నాము.

ఈశ్వరా లోకేశ్వరా కామేశ్వరార్చిత పాదయుగళ. ||అప్పన్న||


1. అన్ని పూజల కన్న ఆరంభం

అన్ని పూజల కన్న ఆరంభం

నీదన్నా

యెన్నెన్నో దేవతలున్నా

అనుకున్న పనులు – అవవలెనన్నా

గుడి నిండిన దేవుడనీవు - గుజ్జు వేల్పువై యున్నావు... 2

కైలాస గిరీశు ని కొలువు - గైకొన్న మహాత్ముడు నీవు... 2

నీ చల్లని వెన్నెల దారులలో... 2

ఈ దేశము శోభిల నడిపించవయా ||అన్ని పూజల కన్నా||

నీ కోవెల మది నిర్మించి - నీ రూపము నట స్థా పించి.....2

నీ నామ జపాలతో కొలచి - నీ దీవెన కొరకై వేచి......2

నిలుచుంటిమి మొరలా - లించవయా......2

తొలి పూజల నందు - దయామయ హృదయ ||అన్ని పూజల కన్నా||

కామేశ్వర కలమున వ్రాత - కరుణాకర నీ చేయూత ....2

అరివీర అఖండ విజేత - అమరార్చిత పాద సుచరిత......2


గణనాథ వినాయక - గౌరిసుత....2

గణనీయ ఘనాఘన - గజ శిర ధరణా ||అన్ని పూజాల కన్నా||


2. అందుకోరా ఆదిదేవ

ఆ...........ఆ..... అందుకోరా ఆదిదేవ

వందనాలు గణేశ్వర ఆ..........ఆ.......

ఎందరున్నా ఏ పనైనా

ముందుకొలుతుము విగ్నేశ్వర

సందడి చేసే భజనలు పూజలు

ముందుగ నీవే రా

అందరి పనులు సఫలము చేయగా

ఆరాధింతుము రావేమిరా ||అందుకోరా ఆదిదేవ||

పంచమ వేదం భారత చరితం ఎంచినావా

వేదవ్యాసుని వాచసుధనే వ్రాసినావా

ఘనమైన దేవా ... కరుణాకరా మొరాలకించర

ఘనమైన దేవా కావ రావా...

కరుణా స్వభావ ఆదుకోవా..

ఆఆ.........ఆ....... ||అందుకోరా ఆదిదేవా||

స్థిరమైతిమమ్మ వరము నందు చేరినావు


సీతారామ భజన మండలి చేకొనేవు

కామేశ్వరావూ పిలిచేనురా

వినాయక.... నిను

కామేశ్వరావు - కవిత నీవు

ఈ మాయ తనువు - ఎరుక నీవు ||అందుకోరా ఆదిదేవ||


3. హరిఓం, హరిఓం సాంబశివా

హరిఓం, హరిఓం సాంబశివా .. అడిగేనని కోపించవుగా


మూడవ కంటితో చుర
చూడగ.. మన్మధుడైన మసేగా

ఇంటింటికి భిక్షాటనము - ఉండేందుకు స్మశాన స్థలము


కైలాసము రజతాచలము - కరువెందుకయో కనలేము.
దేవతలంతా ........
దేవతలంతా దాసులైయుండుగ- దేవనికయా భూతగణము ||హరి ఓం||

తొలిపూజలు నిమ్మ నువాడు- తెలుపనిచో సలుపగు వాడు


గణముల కథి పతి నీ సుతుడు గజముఖమును కలిగినవాడు..
ఏనుగుబోలే.......
ఏనుగు బోలే ధీటుగు వాడు. ఎలుకెటు మోయునో ఏమో ||హరి ఓం||

సగమేనున గౌరి విలాసం - శిరమందున గంగ ప్రతాపం


మెడలందున పాముల బుసలు - నొసలందున అగ్నికణాలు
త్వరపడి నిన్నే......
త్వరపడి నిన్నే చేరుదమన్నా.. చాలదు నా గుండె భయము ||హరి ఓం||

కామేశ్వర కలమున దాగి - కవితాలను వ్రాయు విరాగి


మునులంతా కానల నెరిగి జపియింతురు తపమున మునిగి
ఆ తపమంతా........
ఆ తపమంతా నిను చేరుటకు - నీ తపమెవ్వరి కొరకు ||హరి ఓం||
8. గజముఖం వందేహం

రాగం: నాట రాగం తాళం : దేశాయి తాళం

|| పల్లవి||

సిద్దివినాయక | బుద్ధి ప్రకాశక

బుద్ధస్వరూపా | ఇద్ధప్రతాపా

గ- గజవదనుండవు | విజయ ప్రదుండవు

సుజన ప్రియుo డవు కుజనదూరుండవు|| …2

జ- జగతిలో నీకు |మొదలగ మ్రొక్కిన

సుగముగ పనులను | ముగియగ సేతువు|| …2

ము - ముక్కంటిముద్దు లయ్యా | మ్రొక్కితి నీకయ్యా

మక్కువ జూపుము |గ్రక్కున బ్రోవవుము || …2

ఖం - ఖండన జేస్తివి | భండన మందున

చండ ప్రచండుల | దండి సురారులన్ || …2

వం - వంతల బాపుచు | చింతల ద్రోలచు

సంతసమొ సగుచు | చెంతనేయుండుము || …2


దే - దేవత లాదిగా | జీవుల కెల్లను

ఈవుల మ్రానువు | నీవని యందురు || …2

హం - హం జలు పట్టెద | ప్రాంజలి జెసెద

కుంజముల్ జల్లెద | వింజామ రేసెద || …2


5. ఇన్నాళ్ళకు పిలిపించితివా ఓ వేంకటరమణా

శుద్ధ ధన్యాసిరాగం. ఆది తాళం

ఇన్నాళ్ళకు పిలిపించితివా ఓ వేంకటరమణా .... 2


ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకుర -
ఎన్నాళ్ళకు దయగలిగెనురా.....
ఓ వేంకటరమణా ||ఇన్నాళ్లకు||

కోరితిమా ఎపుడైనా మీరినకోరికలు


మితిమీరిన కోరికలు ...2

నీముంగిట గానము చేయుట


నీ మంగళ నామము పాడుట
కోరితిమి కోరితిమి
మరిమరిమరిమది వేడితిమి...2
చేరితిమి చేరితిమి
నీ పద సన్నిధి చేరితిమి.....2 ||ఇన్నాళ్లకు||

నీ పదరేణువు మా శిరమందున దాల్చిన చాలునయా


ధన్యతనొందునయా జన్మలు ధన్యతనొందునయా
నీ తిరునామము - నీ చిరుహాసము
నీ మణిహారము - నీ పదభోగము
కాంచితిమి గాంచితిమి
కనులారా నిను గాంచితిమి ||ఇన్నాళ్లకు||
6. జనకసుతావరా వినతులివేనురా
(పగలే వెన్నెల జగమే)
జనకసుతావరా వినతులివేనురా
ఇనకుల సుందర నన్నేలుకోరా

కన్నులార నిన్నెగాంచి కలువరించి


చిన్నెలెల్ల వన్నెమించి సన్నుతించి
మన్నన సేయగా మరపున జూడగా
ఎన్నటి కోర్తు జగముగన్నయన్నా ||జన||

ఇల్లు గుల్లజేసి మిమ్మెల్లవేళ


కొల్లకొల్లగొల్చి పాదపల్లవంబుల
తెల్లముగాగనా దిక్కని నమ్మిన
పొల్లు గ జేసి మము బ్రోవవేలా ||జన||

దీనపాల జాలమేల గానలోలా


మౌనముద్రిబూని మమ్ముగానవేలా
దానము మానము ప్రాణము నీవని
ధ్యానము సేయుటే నిదానమౌరా ||జన||

దేవదేవ బ్రోవుమంచు దీక్షతోడి


భావమలర సేవచేయప్రాకులాడి
జీవనభాగ్యము నీవనివేడిన
ఏవిధినైన నెంతుయింత శోచనా ||జన||

భుక్తి ముక్తి ఫలము విచ్చుభద్రు డీవె


భక్త సత్యన్నారాయణ భాగ్యమీవే
ముక్తి నిధానమా ముందున నిల్వమా
భక్తు లు పెనుగొల్లు న భజన సేయ ||జన||

7. ఈశరయ్య శంకరయ్య ఇస్సేసయ్యో

(దేశాది తాళం) హరికాంభో జి రాగాస్వరాల అనుసరించి


ఈశరయ్య శంకరయ్య ఇస్సేసయ్యో
నీ సేతలన్ని యింతలయ్య పరమేశయ్యో

ఇసమిత్తే మింగుతావు - యారికైన లొంగుతావు


గజ చర్మం గట్టు కొని - గానుగెద్దు నెక్కుతావు

బూది పూసుకుంటావు - బువ్వ అడుక్కుంటావు


బూతాలతొ పేతాలతొ - బుజం కలిపి తిరుగుతావు

ముక్కు మూసుకుంటావు - పక్కన కూకుంటావు


మూడు కళ్ళతోటి మా - ముచ్చట సూత్తుంటావు

జడను గట్టు గుంటావు - జగమంతా వుంటావు


జనమ జనమ పాపాలను - జలమదంబు సేత్తా వు

You might also like