You are on page 1of 7

హేతువాది వేమ‌న‌ (part-1)

వేమన పద్యాలు అనగానే మనలో చాలా మందికి ఉప్పు కప్పురంబు, గంగిగోవు పాలు లాంటి అతి సాధారణమైన పద్యాలు మాత్ర‌మే
గుర్తు కొస్తా యి. కానీ వేమ‌న చెప్ప‌ని అంశం లేదు. కులం, మ‌తం, దేవుడు, దెయ్యం, మ‌త గురువుల మోసం, స‌మాజంలోని
ర‌క‌ర‌కాల మూఢ‌న‌మ్మ‌కాలు, వేదాలు, య‌జ్ఞాలు, బూట‌క‌పు ఉప‌న‌య‌నాలు, క‌లిమి లేములు, బ‌ల‌వంతుల దోపిడి.... మొద‌లై న
స‌మాజంలోని చెడునంతా ఎండ‌గ‌ట్టి త‌న హేతువాదంతో మేడిపండులాంటి సంఘం గుట్టంతా విప్పాడు. త‌ర్క‌బ‌ద్ధ‌మైన త‌న ప‌ద్యాల‌తో
అజ్ఞాన‌పు జ‌నాన్ని సూటిగా ప్ర‌శ్నిస్తూ అన్యాయంపై దాడి చేసిన‌, వేమ‌న ఆ కాలానికే కాదు నేటి స‌మాజానికీ ఆద‌ర్శ‌వంతుడే.

మ‌నుషులు చేసిన దేవుళ్ల పై

గ‌ట్టు రాళ్ళు దెచ్చి, కాలుచేతుల దొక్కి,


కాసె ఉలుల చేత గాసిజేసి,
మొర‌పరా ‌ ళ్ళ కెర‌గు మొప్పెల నేమందు?
విశ్వ‌దాభిరామ వినురవేమ

పలుగురాళ్ళు దెచ్చి, పరగ గుడులుగ‌ట్టి,


చెల‌గి శిల‌ల సేవ జేయ‌నేల‌?
శిల‌ల సేవ‌జేయ ఫ‌లమే‌ మి గ‌ల్గురా?
విశ్వ‌దాభిరామ వినురవేమ

మ‌న్ను మెత్తి క‌రిగి, మ‌రి రూపుగావించి,


గుంట నిండ పూడ్చి, గురుతు నిలిపి,
మ‌నుషులెల్ల జేరి, మ‌రి దేవుడందురు
విశ్వ‌దాభిరామ వినురవేమ

రాతి బొమ్మ‌ల కేల రంగైన వ‌లువ‌లు?


గుళ్ళు గోపుర‌ములు కుంభ‌ములును?
కూడు గుడ్డ తాను కోరునా దేవుండు?
విశ్వ‌దాభిరామ వినురవేమ

ముచ్చు గుడికి పోయి ముడి విప్పునేగాని


పొస‌గ స్వామి జూడ పోడ‌తండు
కుక్క యిల్లు జొచ్చి కుండ‌లు వెద‌క‌దా?
విశ్వ‌దాభిరామ వినురవేమ

రాతి బ‌స‌వ‌ని గ‌ని రంగుగా మ్రొక్కుచు,


గునుక బ‌స‌వ‌ని గ‌ని గుద్దు చుండ్రు
బ‌స‌వ భ‌క్తు లెల్ల పాపులు త‌లపో
‌ య‌
భూతి దేహ‌మందు పూసితే నాయ‌నా,
భ‌స్మమందు గాడిద పొర్ల‌దా...
అని మూఢ భ‌క్తు ల‌ను సూటిగా ప్ర‌శ్నించాడు.

హేతువాది వేమ‌న - part 2


దేవ‌త‌ల శ‌క్తి సామ‌ర్థ్యాల గురించిః

క‌న‌క‌మృత‌ము భువిని క‌ద్దు లేద‌న‌కుండ‌,


త‌రుణి విడిచిపోయె దాశ‌రధి ‌ యు,
తెలివిలేనివాడు దేవుడెట్లా యెరా?
విశ్వ‌దాభిరామ వినురవేమ

బంగారు లేడి భూమి మీద ఉండ‌ద‌ని, మారీచుడు రాక్ష‌సుడ‌ని గుర్తించ‌లేని రాముడు దేవుడు ఎలా అయ్యాడు అని ప్ర‌శ్నిస్తు న్నాడు.

అగ్ని బాణ‌ము చేత అంబుధింకిన‌పుడె,


రాము డ‌వ‌లికేగ లావు మ‌రచె
‌,
వ‌రుస కొండ‌లు మోసి, వార‌ధేటికి గ‌ట్టె ?
విశ్వ‌దాభిరామ వినురవేమ

అగ్నిభాణంతో స‌ముద్రాన్ని ఇంకించిన‌ప్పుడే లంక‌లోకి ప్ర‌వేశించ‌కుండా వాన‌ర సేన స‌హాయంతో వార‌ధిక‌ట్టి స‌ముద్రాన్ని దాటిన రాముని
బుద్ధిమాంద్యాన్ని వేమ‌న అవ‌హేళ‌న చేశాడు.
పాల సాగ‌ర‌మున ప‌వ్వ‌ళించిన వాడు
గొల్ల యిళ్ల పాలు కోర‌నేల‌?
ఎదుటివారి సొమ్ములెల్ల‌వారికి తీపి
విశ్వ‌దాభిరామ వినురవేమ

పాల స‌ముద్రంపై ప‌వ‌ళించే విష్ణుమూర్తి దొంగ‌త‌నం ఎందుకు చేశాడో, ప‌రుల సొమ్ము అంటే ఎవ‌రికైనా తీపియే అని చెబుతున్నాడు

కంటి మంట చేత కాముని ద‌హించి,


కామ‌మున‌కు క‌డ‌కు గౌరి గూడె,
ఎట్టి వారికైన ప‌ట్టు ప్రార‌బ్ధ‌ము
విశ్వ‌దాభిరామ వినురవేమ

త‌న‌లో కామం పుట్టించినందుకు శివుడు మూడో క‌న్ను తెరిచి మ‌న్మ‌ధున్ని బూడిద చేశాడు, చివ‌రికి అదే కామానికి బానిస అయ్యాడు

కొడుకును బ్ర‌తికించుకొన‌లేదు శంభుండు


కొడుకును బ్ర‌తికించుకొన‌డు శౌరి,
దైవ‌బ‌ల‌ము లెల్ల దీన‌నే క‌నిపించు
విశ్వ‌దాభిరామ వినురవేమ

వినాయ‌కుడ్ని య‌ధాత‌ధంగా శివుడు బ‌తికించుకోలేక‌పోయాడు, శివుడు బూడిద చేసిన మ‌న్మ‌ధుడ్ని విష్ణువు బ‌తికించుకోలేక‌పోయాడు దైవ
బ‌లం ఎంత గొప్ప‌దో ఇక్క‌డే తెలిసిపోతుంది అన్నాడు వేమ‌న‌

ఇంద్రు డాయె కామి, హీనుడై పోయెను,


మారుడాయె కామి, మ‌డిసిపోయె,
బ్ర‌హ్మ‌యాయె కామి, బ‌య‌సిపోనాడెను
విశ్వ‌దాభిరామ వినురవేమ

హేతువాది వేమ‌న part-3


వేదాలు, య‌జ్ఞ యాగాలపై వేమ‌న సంధించిన బాణాలు

స్వానుభ‌వ‌ము లేక శ‌స్త్ర‌వాస‌న‌ల‌దే,


సంశ‌యంబు చెడ‌దు సాధ‌కున‌కు
చిత్రిదీప‌మున‌కు చీక‌టి చెడ‌న‌ట్లు
విశ్వ‌దాభిరామ వినురవేమ

వాస్త‌వ జీవితానుభ‌వం లేకుండా, వేద‌మంత్రాలూ, మ‌త గ్రంథాలూ వ‌ల్లిస్తే వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమీ లేక‌పోగా మ‌తిపోవ‌డం ఖాయ‌మ‌ని,
చిత్ర‌(గార‌డీ) దీపం వ‌ల్ల చీక‌టి పోతుందా... అని ప్ర‌శ్నిస్తు న్నాడు.

చ‌దువుల‌న్ని చ‌దివి, చాల వివేకింప‌,


క‌ప‌టి కెన్న‌నేల క‌లుగు ముక్తి?
దాలిగుంట కుక్క ద‌ల‌చిన చందంబు,
విశ్వ‌దాభిరామ వినురవేమ

ఎంగిలెంగిల‌నుచు యీనోటి తోడ‌నే,


వేద‌ముల‌ను చ‌దువు వెర్రు లార‌,
ఎంగిచూడ న‌దియె ఎంగిలి కాదోకో?
విశ్వ‌దాభిరామ వినురవేమ

వెర్రికుక్క‌ల వ‌లె వేదాలు చ‌దివితే,


ఆశ‌యంబు లెరుగ ర‌య్య‌వార్లు
వేద విద్య‌లెల్ల వేశ్య‌ల వంటివి
భ్ర‌మ‌ల బెట్టి తేట‌ప‌డ‌గ‌నియవు
అని గుడ్డి వేదాంత సూత్రాల్నీ, వేద మంత్రాల్నీ సూక్తిముక్తా వ‌ళిలోని రూళ్ళ‌క‌ర్ర సిద్ధాంతాల్నీ, దోపిడీవ‌ర్గాల్ని స‌మర్థిం
‌ చే శ్లోకాల్నీ బ‌ట్టీ కొట్టి,
అమాయ‌కుల్ని మోస‌గించే క‌ప‌టుల్ని ఉతికి ఆరేశాడు. వేద విద్య‌ల్ని వేశ్య‌ల‌తో పోల్చాడు వేమ‌న‌.

య‌జ్ఞం చేసేట‌ప్పుడు, య‌జ్ఞం చేసే అత‌ని భార్య (సోమ‌యాజి భార్య‌) తాను గ‌తంలో వ్య‌భిచ‌రించి ఉంటే, ఎన్నిసార్లు ఎవ‌రెవ‌రితో
వ్య‌భిచ‌రించిందీ సూచించ‌డానికి, అన్ని గ‌డ్డిపోచ‌ల్ని య‌జ్ఞ‌వేదిక మీద పెడ‌తారు. అంటే సోమ‌యాజి భార్య రంకు య‌జ్ఞంతో
బ‌య‌ట‌ప‌డుతుంది. అదే విధంగా పిండం వేసేవాడి తండ్రి, త‌ల్లికి రంకు మొగుడైతే, ఆ పిండం వీడికే చెందుతుందిగానీ, పేరుకు
తండ్రిగా ఉన్న‌వాడికి మాత్రం కాదు అని వేమ‌న య‌జ్ఞంలోని గుట్టు నీ, త‌ద్దినంలోని క‌ట్టు ని బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు.

ఆలి రంకు తెలుపు అఖిల య‌జ్ఞంబులు


త‌ల్లి రంకు తెలుపు త‌ద్దిన‌ములు,
కాని తెరువు క‌ర్మ‌కాండ క‌లిత‌మాయె

అస‌లు ఈ య‌జ్ఞాలు ఎందుకు చేస్తా రు...??? ఈ య‌జ్ఞాలు చేస్తే, చ‌చ్చిన త‌రువాత స్వ‌ర్గానికి పోయి, దేవేంద్రు డి ఉంపుడుక‌త్తె
రంభ‌తో సంభోగాన్ని పొంద‌వ‌చ్చ‌నే రాక్ష‌స కాంక్ష‌, అంధ‌విశ్వాసం నాటి పురోహిత వ‌ర్గాల్లో ఎక్కువ‌గా ఉండేది. య‌జ్ఞంలో న‌ల్ల‌మేక‌ను
చంపి, ఆ మేక‌నంజుడు ఆర‌గిస్తే, ఆ య‌జ్ఞం కామ‌య‌జ్ఞంగా మారుతుంద‌ని, స్వ‌ర్గంలో రంభా సంభోగం ల‌భిస్తుంద‌ని భావించేవారు.
అప్పుడు సోమ‌యాజి కాస్తా కామ‌యాజిగా మారుతాడు అని వేమ‌న దారుణంగా గేలిచేశాడు.

లంజ కొర‌కు మేక‌నంజుడు తిన‌సాగ‌


య‌జ్ఞ‌మెల్ల కాయ‌జ్ఞ‌మాయె,
మొద‌ట సోమ‌యాజి, తుద కామ‌యాజిరా!
విశ్వ‌దాభిరామ వినురవేమ

క్ర‌తువు జేసెద‌మ‌ను క‌డు విర్ర‌వీగుచు,


క‌చ్చ క‌డుగు నెయ్యి క‌డుపు దించు
రంకు కొడుకుల‌ను రంగాన మొత్తు రో?
విశ్వ‌దాభిరామ వినురవేమ

య‌జ్ఞం చేస్తా మ‌ని విర్ర‌వీగుతూ, క‌చ్చ క‌డిగే నెయ్యిని క‌డుపారా తాగే రంకు కొడుకుల్ని వైకుంఠంలో (రంగాన‌) మెచ్చుతారా అని
సూటిగా ప్ర‌శ్నించాడు.

హేతువాది వేమ‌న‌- (part-4)

మూఢ‌విశ్వాసాల‌పై దాడి
చ‌నిపోయిన త‌ల్లిదండ్రు లు ప‌ర‌లోకంలో ఉంటార‌ని న‌మ్మి వారికి త‌ద్దినాలు, మాసిక‌లు పెట్టి పిండాలు వేయ‌డం హిందూ సంప్ర‌దాయం.
ఆ పిండాలు కాకుల ద్వారా ప‌ర‌లోకంలోని త‌ల్లిదండ్రు ల‌కు చేర‌తాయ‌ని న‌మ్మేవారి సంఖ్య స‌మాజంలో నేటికీ అధికంగానే ఉంది. ఈ
గుడ్డిన‌మ్మ‌కాన్ని వేమ‌న ఆ కాలంలోనే త‌న త‌ర్కంతో ఎండ‌గ‌ట్టా డు. ఆ ఆచారాల‌ను గేలిచేశాడు.

పిండ‌ముల‌ను జేసి, పిత‌రుల త‌లపో ‌ సి


కాకుల‌కును బెట్టు ఖ‌లుడు దిన‌ము,
పియ్యి దినెడి కాకిపిత యెట్టు ల‌య్యెనో?
విశ్వ‌దాభిరామ వినురవేమ

పిత‌ర‌య‌న్న మ‌న‌సు ప్రీతితో బిలిపించి,


కాకుల‌కును బెట్టు గాడ్దెలార‌,
కాకులందు నేమి, ఘ‌నుల‌కు బెట్టు డి
విశ్వ‌దాభిరామ వినురవేమ

అశుద్ధం తినే కాకులు పిత్రు దేవుళ్లు ఎలా అయ్యారు అని ప్ర‌శ్నించాడు. ఇంత చిన్న విష‌యాన్ని కూడా ఆలోచించ‌లేక త‌ద్దినాలు పెట్ట‌డం
గొప్ప పుణ్య‌కార్యంగా ఆచ‌రించే వారిని గాడిద‌ల‌తో పోల్చాడు. బుద్ది జెప్పువాడు గుద్దితే ఏమ‌యా..! అంటూ హిందూ సంఘం
ముక్కుమీద గుద్దిమ‌రీ బుద్ది చెప్పాడు.

హిందువులు మేన‌త్త ‌, మేన‌మామ పిల్ల‌ల్ని పెళ్ళి చేసుకుంటారు. మ‌హ్మ‌దీయుల్లో చెల్లెలి వ‌రుస అవుతుంది. హిందువులకు పెద‌నాన్న‌,
చిన్నాన పిల్ల‌లు చెల్లెలి వ‌రుస అయితే మ‌హ్మ‌దీయుల్లో ఆ వ‌రుస వ్య‌తిరేకంగా ఉంటుంది. హిందువులు చెల్లెలుగా భావించేవారిని
మ‌హ్మ‌దీయులు వివాహాలు చేసుకుంటారు. వీరిది వారికి త‌ప్పు వారిది వీరికి త‌ప్పు. స‌మాజంలో చెలామ‌ణి అవుతోన్న ఇలాంటి మ‌లిన
సిద్దాంతాల్ని నిల‌దీశాడు.

మేన‌మామ బిడ్డ మెర‌సి పెండ్లా మాయె,


తుర‌క‌లందు చెల్లెలాయె న‌దియు,
వ‌ల‌సిన పుణ్యంబు, వ‌ల‌ద‌న్న పాపంబు
విశ్వ‌దాభిరామ వినురవేమ

మంచి, చెడులు మ‌న‌తోనే వుంటాయ‌న్న వాస్త‌వం తెలుసుకోలేక శ‌కునాల‌ను న‌మ్మేవారిని విమ‌ర్శిస్తూ...

పాల‌ప‌క్షి శ‌కున ఫ‌ల‌మిచ్చు నందురు,


పాల‌ప‌క్షికేమి ఫ‌ల‌ము తెలియు?
త‌న‌దు మేలు కీళ్ళు త‌న‌తోడ నుండ‌గ‌
విశ్వ‌దాభిరామ వినురవేమ

తీర్థ‌యాత్ర‌లు చేసి, న‌దుల్లో మునిగితే పుణ్యం వ‌స్తుంద‌ని న‌మ్మేవారి గురించి....

తిరుమ‌ల‌కును పోను తుర‌క - దాస‌రి గాడు,


కాశి కేగ పంది - గ‌జ‌ము కాదు,
కుక్క సింగ‌మ‌గునె గోదావ‌రికి బోవ‌?!!
విశ్వ‌దాభిరామ వినురవేమ

తీర్థ‌యాత్ర‌ల వ‌ల్ల పంది ఏనుగు కాదు, న‌దుల్లో మునిగినంత మాత్రాన కుక్క సింహ‌ము కాదు. ఇవ‌న్నీ అజ్ఞానంతో చేసే వృధా ప్ర‌యాస
అంటాడు.

స‌క‌ల తీర్థ‌ముల‌ను, స‌క‌ల య‌జ్ఞంబుల‌,


త‌ల‌లు గొరుగ‌కున్న ఫ‌ల‌ము లేదు,
మంత్ర‌జ‌ల‌ము క‌న్న మంగ‌లిజ‌ల‌మెచ్చు
విశ్వ‌దాభిరామ వినురవేమ

తీర్థ‌యాత్ర‌ల‌కు పోయి గుండ్లు గొరిగించుకోవ‌డం వ‌ల్ల ఏమీ ఉప‌యోగం ఉండ‌దు. మంగ‌లి వ‌ద్ద గొరిగించుకోవ‌డం మేలు... అని
గేళిచేశాడు.

పెళ్లి మంత్రాల పేరిట వెర్రి కూత‌లు కూసి, ముహూర్త బ‌లం గొప్ప‌దీ అంటూ, జాత‌కాలు, శుభ‌ల‌గ్నం గాడిద గుడ్డు అని విర్ర‌వీగే
జ్యోతిష్యుల‌ను సూటిగా ప్ర‌శ్నించాడు.

విప్రులెల్ల‌జేరి, వెర్రికూత‌లు కూసి,


స‌తిప‌తుల‌ను గూర్చి స‌మ్మ‌త‌మున‌
మును ముహూర్త‌ముంచ ముండెట్లు మోసెరా....?
విశ్వ‌దాభిరామ వినురవేమ

గొప్ప ముహూర్త‌మ‌ని, మంత్రాలు చ‌దువి పెళ్లి చేస్తా రు. కానీ పెళ్లి జ‌రిగిన కొంత కాలానికే విధ‌వ‌రాళ్లు అయిన వారి సంగ‌తేంటి?

హేతువాది వేమ‌న (part-5)


కుల‌వ్య‌వ‌స్థ‌పై ఎక్కుపెట్టిన బాణాలుః-
కుల‌ర‌హిత స‌మాజాన్ని నిర్మించ‌మ‌ని ఎలుగెత్తి చాటిన వేమ‌న‌

అగ్ర‌కులంగా భావించే బ్రాహ్మ‌ణులు ఉప‌న‌య‌న సంస్కారం (జందెం వేయ‌డం) వ‌ల్లే వారికి బ్రాహ్మ‌ణత్వం ‌ సిద్ధిస్తుంద‌ని చెబుతారు.
అయితే ఈ ఉపన‌య‌న సంస్కారాన్ని శాస్త్రా లు స్త్రీల‌కు నిరాక‌రిస్తు న్నాయి. ఉప‌న‌య‌న సంస్కారం లేని ఈ బ్రాహ్మ‌ణ స్త్రీలు శూద్రు ల‌తో
స‌మానం. త‌ర‌త‌రాలుగా అలాంటి శూద్ర స్త్రీల‌కు పుట్టిన వాడు బ్రాహ్మ‌ణుడు ఎలా అయ్యాడ‌ని ప్ర‌శ్నిస్తు న్నాడు వేమ‌న‌.

త‌ల్లి గ‌న్న త‌ల్లి, త‌న త‌ల్లి, పినత‌ల్లి,


తండ్రి గ‌న్న త‌ల్లి, తాత త‌ల్లి,
ఎల్ల శూద్రు లైరి, ఏటి బాప‌డు తాను ?
విశ్వ‌దాభిరామ వినురవేమ

తాడు మెడ‌ను వేసి, త‌న‌కు శూద్ర‌త్వంబు


పోయెన‌నెడి దెల్ల బుద్దిలేమి,
మ‌ది వెలువ‌క తాడు మ‌రి వ‌న్నె దెచ్చునా?
విశ్వ‌దాభిరామ వినురవేమ

వ‌డుగు ద్విజుల‌కెల్ల క‌డు ముఖ్య‌మందురు,


వ‌డుగు చేసెద‌మ‌ను వ‌దరుకొనుచు,
క‌డుగు తాగి, కాకి కర్రు క‌ర్ర‌న్న‌ట్లు
విశ్వ‌దాభిరామ వినురవేమ

మెడ‌లో వేసుకున్న తాడు వారికి ఏదో గొప్ప‌తనాన్ని తెస్తుంద‌నుకొనే వారు బుద్ధిలేనివార‌ని, క‌డుగునీళ్లు తాగిన కాకి క‌ర్రు క‌ర్రు
అన్న‌ట్లు గా ఈ బుద్ధిలేని మ‌నుషులు వ‌డుగు (ఉప‌న‌య‌నం) చాలా ప‌విత్ర‌మైన‌ద‌ని విర్ర‌వీగుతార‌ని బూట‌క‌మైన ఉప‌న‌య‌నాల‌పై
దుమ్మెత్తిపోశాడు.

బ్రాహ్మ‌ణుల్లో వ‌సిష్ట గోత్రానికి చెందిన‌వారే ఎక్కువ‌. త‌మ‌ది చాలా గొప్ప వంశంగా చెప్పుకుంటుంటారు. వ‌సిష్టు డి త‌ల్లి వేశ్య‌, భార్య శూద్ర
కులానికి చెందిన‌ది. వ‌సిష్టు డి కుల‌మేదో ప్ర‌పంచానికి తెలుసు అని ఎద్దేవా చేశాడు

త‌ల్లి ఊర్వ‌శి లంజ‌, త‌న ఆలు మాదిగ‌,


తాను బాహ్మ‌ణుడ‌న త‌గునె జ‌గ‌తి ?
వాసిష్ట కుల‌మును వ‌సుధ‌లో నెరుగ‌రా
విశ్వ‌దాభిరామ వినురవేమ

బ్రాహ్మ‌ణుల మటండ్రు బ్ర‌హ్మ‌త్వ‌మ‌దిలేని


బ్రాహ్మ్య‌మ‌ద్దియేల బ్రాహ్మ‌ణుడ‌టె ?
బొమ్మ‌వ‌లెను తాను దిమ్మ‌పై గూర్చుండ‌
విశ్వ‌దాభిరామ వినురవేమ

విప్ర‌వ‌రుల మ‌నుచు, వేదంబు చ‌దువుచు,


పామ‌రుల‌ను జూచి ప‌రిహ‌సించు
ధ‌ర‌ణిసుర‌ల క‌న్న దాస‌రిమ‌త‌మెచ్చు
విశ్వ‌దాభిరామ వినురవేమ

ఒక కులం పెద్ద‌ది, మ‌రొక‌టి చిన్న‌ది అని చూడ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. మ‌నుషులంతా ఒక్క‌టే అని చెబుతూ.. 300 సంవ‌త్స‌రాల
క్రిత‌మే వేమ‌న ఈ కుల‌పిశాచి మీద దాడి చేశాడు.

కుల‌ము హెచ్చుత‌గ్గు కొదువ‌లు ప‌నిలేదు,


సానుజాత‌మ‌య్యె స‌క‌ల కుల‌ము,
హెచ్చు త‌గ్గుమాట లెట్లెరుంగ‌వ‌చ్చు?
విశ్వ‌దాభిరామ వినురవేమ

కులాన్నిబ‌ట్టి కాదు, ఆ మ‌నిషికి ఉన్న జ్ఞానాన్ని బ‌ట్టి వారు గౌర‌వ‌నీయుడౌతాడ‌ని చెబుతూ...


జాతులందు నెట్టి జాతి ముఖ్య‌ము చూడ‌,
ఎరుక లేక తిరుగ నేమి గ‌ల‌దు ?
ఎరుక గ‌లుగు మ‌నుజుడే జాతి గ‌ల‌వాడు
విశ్వ‌దాభిరామ వినురవేమ

ఇక్క‌డ వేమ‌న కులాన్ని జాతితో పోల్చాడు.


ఎరుక‌లేని (జ్ఞానం లేని) వాడు యే జాతియైన‌ను, మాల కంటె చెడుగు అన్నాడు.

అంట‌రానిత‌నాన్ని అస‌హ్యించుకుంటూ........

మాల మాల‌కాడు మ‌హిమీద నే పొద్దు ,


మాట తిరుగువాడు మాల‌గాక‌
వాక్కుశుద్ధి లేనివాడు చండాలుడు
మాల‌వాని జూచి యేల నిందింప‌గ ?
పాటికాని మాట ప‌లుకుటె గ‌ద ?
వానిలోని ప‌లుకు, వాని కులంబేది ?
విశ్వ‌దాభిరామ వినురవేమ

మాల‌వాని నంటి మ‌రి నీట మునిగితే,


కాటి కేగిన‌పుడు కాల్చుమాల‌,
అప్పుడంటిన యంటు యిప్పుడెందేగెనో?
విశ్వ‌దాభిరామ వినురవేమ

మాల‌వాడిని ముట్టు కుంటే అప‌విత్రు లైపోతార‌ని భావించి నీళ్ల‌లో మునిగి త‌మ‌ని తాము శుద్ధిచేసుకుంటారు. చ‌చ్చిన‌పుడు వారిని కాల్చేది
ఆ మాలవాడే క‌దా, అప్పుడేమైంది వీళ్ల అంటు అని సూటిగా ప్ర‌శ్నించాడు.

కుల‌ము లేనివాడు క‌లిమిచే వెల‌యును,


క‌లిమి లేనివాడు కుల‌ము దిగును
కుల‌ముక‌న్న మిగుల క‌లిమి ప్ర‌ధానంబు
విశ్వ‌దాభిరామ వినురవేమ

మాసిన త‌ల‌తోడ‌, మ‌లిన వ‌స్త్ర‌ము తోడ‌,


ఒడ‌లు జిడ్డు తోడ నుండెనేని,
అగ్ర‌జ‌న్మునైన అట్టే పొమ్మందురు
పూస‌పోగులును, పుట్టంబు, విడియంబు
కాయ‌పుష్టి మిగుల గ‌లిగియున్న‌
హీన‌జాతినైన యిట్టె ర‌మ్మందురు

కులం త‌క్కువ వాడైనా డ‌బ్బు ఉంటే అంద‌రూ గౌర‌విస్తా రు. డ‌బ్బులేని వాడు ఎంత గొప్ప కులంలో పుట్టినా డ‌బ్బు ఉన్న‌వాడికి అణుగి
ఉండాల్సిందే. మురికి బ‌ట్ట‌ల‌తో జిడ్డు కారుతూ ఉండేవాడు అగ్ర‌కుల‌మైనా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు. బంగారం దిగేసుకుని, కండ‌పుష్టి
క‌లిగిన వాడు త‌క్కువ కులం వాడైనా అత‌డిని అంద‌రూ గౌర‌విస్తా ర‌ని, నేటి స‌మాజంలో కులం కంటే ధ‌న‌మే ప్ర‌ధాన‌మ‌ని, డ‌బ్బు
ఉన్న‌వారికి అంద‌రూ లొంగి ఉంటార‌ని స్వార్థ‌పూరిత‌మైన మ‌నుషుల స్వ‌భావాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు.

ఉర్వివారి కెల్ల నొక్క కంచ‌ము బెట్టి


పొత్తు గుడిపి కుల‌ము పొల‌య‌జేసి
త‌ల‌ను చేయిబెట్టి త‌ద‌న‌మ్మ జెప్ప‌రా
విశ్వ‌దాభిరామ వినురవేమ

భూమి మీద ఉన్న మ‌నుషులంద‌రికీ ఒకే కంచంలో వడ్డించి, వారి మ‌ధ్య స్నేహభావాన్ని పెంపొందించి, కులాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తా మ‌ని,
అంద‌రిలో ఆ న‌మ్మకా ‌ న్ని క‌లిగించే విధంగా అంద‌రూ విశ్వ‌సించేలా త‌లపై
‌ చేయిపెట్టి (ప్ర‌మాణపూర్తిగా) మ‌రీ చెప్పి కుల గ‌జ్జిని
పార‌ద్రోల‌మ‌ని, కుల‌ర‌హిత‌మైన స‌మాజాన్ని నిర్మించ‌మ‌ని చెబుతున్నాడు. మూడు వంద‌ల ఏళ్ల క్రిత‌మే ఇంత‌టి విప్ల‌వాత్మ‌క‌మైన సూచ‌న‌ను
ప్ర‌తిపాదించిన వేమ‌న మ‌హ‌నీయుడు.

హేతువాది వేమ‌న - (part-6)


స్వామీజీలు, దొంగ‌స‌న్యాసుల గురించి.....

పొట్ట‌కూటి కోసం బాబాలు, స్వామీజీలంటూ కాషాయ‌వేషాలు వేసుకొని అమాయ‌క జ‌నాన్ని మోస‌గించే ప‌నిదొంగ‌లు, తిండిపోతులు,
స్త్రీలోలులూ అయిన దొంగ‌స‌న్యాసుల‌, క‌పట
‌ యోగుల బూట‌కాల్ని వేమ‌న బ‌ట్ట‌బ‌య‌లు చేసాడు.

బార‌డేసి జ‌డ‌లు, భ‌స్మంపు పూత‌లు,


మ‌రునితోడ మారు మ‌ల‌య‌గ‌ల‌రు,
ముంజికోక‌లెల్ల లంజ‌కోక‌ల‌కాయె
విశ్వ‌దాభిరామ వినురవేమ

పొడుగు గ‌ల్గున‌ట్టి పులితోలు, భూతియు,


క‌క్ష‌పాల‌లు ప‌ది ల‌క్ష‌లై న‌,
మోత చేటె గాని మోక్షంబు లేద‌యా
విశ్వ‌దాభిరామ వినురవేమ

మ‌న‌సు నిలుప‌లేని మాయావిర‌క్తు లు


మ‌న‌సు ప‌డుదురేల మ‌గువ కొర‌కు ?
నంత పాప‌పొత్తు - స‌న్యాసి జేర‌డా ?
విశ్వ‌దాభిరామ వినురవేమ

పులితోలు క‌ప్పుకుని, జ‌డ‌లు పెంచుకుని, బూడిద పూసుకుని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నా వీరి మ‌న‌సు మాత్రం మ‌గువ మీద ఉంటుంద‌ని,
ఈ వేషాల వ‌ల్ల మోత బ‌రువేగానీ మోక్షంబు ఉండ‌ద‌ని ఎద్దేవా చేశాడు.

బ‌తుకుదెరువులేని బ‌డుగులంద‌రు, పెద్ద


యోగివ‌రుల మ‌నుచు సాగిరాగ‌,
బండ‌వాళ్లు ముందుదండంబు లిడుదురు
విశ్వ‌దాభిరామ వినురవేమ

అల్ల‌బోడి త‌లలు
‌ , తెల్ల‌ని గొంగ‌ళ్ళు,
ఒడ‌ల బూది పూసియుందురెపుడు,
ఇట్టి వేష‌ము లిల పొట్ట‌కూటికేగాని

క‌ష్ట‌పడి
‌ ప‌నిచేసి బ‌త‌కడం
‌ చేత‌గాని చ‌వ‌ట‌ద‌ద్ద‌మ్మ‌లు పొట్ట‌కూటికోసం ఇలాంటి దొంగ‌బాబాల వేషాలు వేస్తే స్వార్థ‌ప‌రులైన మ‌రికొంద‌రు వీరికి
ముందుగా దండాలు పెడుతూ అండ‌గా ఉంటున్నార‌ని ఆనాడు వేమ‌న చెప్పిన మాటలు ఎంత‌టి న‌గ్నస ‌ ‌త్యాలో బాబాలకు సాస్టాంగాలు చేసే
ఇప్ప‌టి రాజ‌కీయ‌నాయ‌కులను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

వేష‌భాష లెరిగి కాషాయ‌వ‌స్త్ర‌ముల్‌,


క‌ట్ట‌గానే ముక్తి క‌లుగ‌బోదు
త‌లు బోడులైన త‌ల‌పులు బోడులా ?
విశ్వ‌దాభిరామ వినురవేమ

మ‌త‌పు వేష‌దార్లు మ‌హిమీద ప‌దివేలు


మూఢ‌జ‌నుల గ‌ల‌ప మూగుచుంద్రు
కావిబ‌ట్ట గ‌ట్టి, క‌డుయోగివ‌లె నుండి,
వెలికి కోర్కెలెల్ల విడిచిపెట్టి
తొడ‌రి తిరుగువాడు దొంగ‌స‌న్యాస‌యా
మూర్ఖ‌పు జ‌నం ఉన్నంత వ‌ర‌కు మ‌త‌పు వేష‌దార్లు వీదికొక్క‌రు ఉంటార‌నేది వేమ‌న అభిప్రాయం.

గోమూత్రం తాగి, గోవు పెంట తిన‌డం ప‌విత్రంగా భావించే మూర్ఖుల‌ను ఉద్దేశించి...

ప‌చ్చి పెంట తినుచు, పండుటాకులు న‌మిలి


ఉచ్చ ద‌ప్పితీర్చ‌, ఉడుకు కోర్చి,
క‌చ్చ‌ను బిగియించ క‌లుగునా త‌త్వంబు
విశ్వ‌దాభిరామ వినురవేమ

జ‌డలు‌ దాల్చుటెల్ల‌, జ‌గ‌ము చీయ‌నుటెల్ల‌


ఒడ‌లు విర‌చుటెల్ల‌, యోగ‌మెల్ల‌
ముక్తికాంత బ‌ట్టి ముద్దా డు కొర‌కురా
విశ్వ‌దాభిరామ వినురవేమ

మ‌త‌ము దారి మ‌ర‌చు మ‌ధురాధ‌ర‌ము చూచి,


మ‌గువ రూపు జూచి మ‌న‌సు మ‌ర‌చు,
యోని జూచి స‌ర్వ‌యోగంబు మ‌ర‌చురా
విశ్వ‌దాభిరామ వినురవేమ

గుహ‌ల‌లోన జొచ్చి, గురువుల వెద‌కంగ‌,


క్రూ ర‌మృగ‌మొకండు తార‌సిలిన‌,
ముక్తిమార్గ‌మ‌దియె ముందుగా చూపురా
విశ్వ‌దాభిరామ వినురవేమ

అమాయ‌క ప్ర‌జ‌ల‌కు ముక్తి మార్గం పేరిట మోసం చేసే ఈ దొంగ స‌న్యాసులు ఆడ‌దాన్ని చూడ‌గానే అన్నీ మ‌ర్చిపోయి వారికి
దాసోహ‌మంటార‌ని, గురువుల కోసం గుహ‌ల్లో వెదికితే అప్పుడు ఏదైనా క్రూ ర‌మృగం ఎదురైతే ముందుగా అదే వారి ముక్తిమార్గం
చూపిస్తుంద‌ని హేళ‌న చేశాడు.

ఆకుల‌న్ని తిన్న మేక‌పోతున కేల‌


కాక‌పోయెన‌య్య కాయ‌సిద్ధి?
లోకులెల్ల వెర్రిపోకిళ్ళు పోదురు
విశ్వ‌దాభిరామ వినురవేమ

ఆకులూ, అల‌ములూ తింటేనే మోక్షం వ‌చ్చేప‌నై తే రోజూ ఆకులు తినే మేక‌పోతుకు మోక్షం రావాలి క‌దా..! అని మూర్ఖ‌పు జ‌నాన్ని
త‌న హేతువాద దృక్ప‌ధంతో సూటిగా ప‌్రశ్నిస్తు న్నాడు వేమ‌న‌.
ఇంద్రు డు, మ‌న్మ‌ధుడు, బ్ర‌హ్మ కామానికి దాసులై ఎలా భ్ర‌ష్టు ప‌ట్టిపోయారో చెబుతున్నాడు

బ్ర‌హ్మ‌వ్రాత కెదురు ప‌ల్కెడు వాడును,


ఆదివిష్ణు సూత్ర మ‌డ‌చువాడు,
మూడు క‌నుల వాని మొన‌సి నిల్చిన‌వాడు
సృష్టి-స్థితి-ల‌య ల‌కు కార‌కులుగా చెప్పుకునే బ్ర‌హ్మ‌- విష్ణు-మ‌హేశ్వ‌రుల‌ను తార్కికంగా నిల‌దీసిన వేమ‌న గొప్ప హేతువాది.

You might also like