You are on page 1of 44

Sandhyavandanam – WIP

మొదటి భాగం - అర్ఘ్య ప్రధానం 

1.మార్జనం

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా\ య: స్మరేత్‌పుండరీకాక్షం\ సబాహ్యా భ్యంతర

శ్శుచి:\ పుండరీకాక్ష\ పుండరీకాక్ష\ పుండరీకాక్షాయ నమ:

(3 సార్లు ,  శిరస్సు మీద నీళ్ళు జల్లు కొనవలెను)

2.ఆచమనం

1. ఓం కేశవాయ స్వాహా ఉద్ధరిణితో కుడిచేతిలోకి నీటిని తీసుకొని మూడుసార్లు మంత్రం అంటూ త్రాగాలి  


2. ఓం నారాయణాయ స్వాహా
3. ఓం మాధవాయ స్వాహా

4. ఓం గోవిందాయ నమ: అని రెండు  చేతులని కడుగుకొనవలెను 

5. ఓం విష్ణవే నమ:

6. ఓం మధుసూదనాయ నమ:  అని అంగుష్ఠంముతో పైపెదవిని, తర్వాత క్రింది పెదవిని తుడుచుకోనవలెను 


7. ఓం త్రివిక్రమాయ నమ: 
8. ఓం వామనాయ నమ:,  అని శిరమున రెండు మార్లు నీళ్లు తలపైన చల్లు కోనవలెను 
9. ఓం శ్రీధరాయ నమ
10. ఓం హృషీకేశాయ అని ఎడమ చేతిపై నీరు చల్లు కోనవలెను 
11. ఓం పద్మనాభాయ నమ:   అని పాదాలు మీద నీరు చల్లు కోనవలెను 

12. ఓం దామోదరాయ నమ:  అని శిరస్సుపై నీరు చల్లు కోనవలెను 

13. ఓం సంకర్షణాయ నమ:  అని చేతివ్రేళ్ళను గిన్నేవలె చేసి వ్రేల్లమూలములతో గడ్డమును స్ప్రు శిమ్చావలెను 

14. ఓం వాసుదేవాయ నమ:  అని అంగుష్ట - తర్జనులతో ముక్కు ఎడమ,కుడి రంధ్రములను తాకవలెను 
15. ఓం ప్రద్యు మ్నాయ నమ:
16. ఓం అనిరుద్ధా య నమ:  అని అంగుష్ట - అనామికలతో నేత్రములు  ఎడమ,కుడి
17. ఓం పురుషోత్తమాయ నమ: తాకవలెను 

18. ఓం అధోక్షజాయ నమ:  అని అంగుష్ట - అనామికలతో ఎడమ,కుడి చెవులను తాకవలెను 


19. ఓం నారసింహాయ నమ:
20. ఓం అచ్యుతాయ నమ: అని అంగుష్ట - కనిష్టికలతో నాభిని తాకవలెను 
21. ఓం జనార్ధనాయ నమ:  అని అరచేతితో వక్షః స్థలమును తాకవలెను 

22. ఓం ఉపేంద్రాయ నమ:  అని కరాగ్రంముతో శిరస్సు తాకవలెను 

23. ఓం హరయే నమ:  అని ముకుళిత హస్తముతో కుడి,ఎడమ బహుమూలము(భుజము)లను తాకవలెను 


24. ఓం శ్రీ కృష్ణాయ నమ: 
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ: నమస్కారం - ఈ విధముగా ఆచమనము చేసిన యడల శ్రిమన్నరయనునితో సమానుదగును 

3.ఆసనం ప్రార్ధన

ఓం పృథివ్యాః మేరుపృష్ట ఋషిః\ కూర్మోదేవతా \ సుతలం ఛంధః \ ఆసనే వినియోగః \


అనంతాసనాయ నమః 
(వేదమంత్రముల వినియోగామునకు ముందు, ఆయా మంత్రములకు సంబంధించిన ఋషి, ఛందస్సు, దేవతల  స్మరణము

నిర్దిష్టముగా చేయవలయును.  అది శాస్త్రీయము. ఋషిఋణ విమోచనము అనుమాట గమనార్హము. వినియోగ మునందు
జలమును విడువవలసినపనిలేదు)

ఓమ్, పృథ్వి ! త్వయా దృతా లోకా దేవి ! త్వాం విష్ణునా దృతా 

త్వం చ ధారయు మాం దేవి ! పవిత్రం కురు చాసనమ్ 

(ఈ మంత్రమును కొన్ని ప్రదేశములు వారు చెప్పుచున్నారు.  మరికొందరు చెప్పడము లేదు.  తమ-తమ సంప్రదాయము అనుసరించుట

మంచిది )

(ఈ మంత్రమును కొన్ని ప్రదేశములు వారు చెప్పుచున్నారు. మరికొందరు చెప్పడము లేదు.  తమ-తమ సంప్రదాయమును అనుసరించుట

మంచిది)

( పై మంత్రమును పటించి ఆసనము క్రింద భూమిని కుడి ఉంగరపు వ్రేలితో (దక్షినకర అనామికంగులినా భూమిం స్ప్రు శేత్) స్పృశించి చక్కగా
కూర్చోవలెను )
4.ప్రాణాయామం

ప్రణవస్య\ పరబ్రహ్మఋషిః\ పరమాత్మా దేవతా\ దైవీ గాయత్రీ ఛంధః\ ప్రాణాయామే వినియోగః 

(ముక్కు పట్టు కొని ఎడమ రంధ్రంతో గాలిని మెల్లగా పీల్చి, బంధించి, ఈ క్రింది మంత్రమును జపించి మెల్లగా కుడిరంధ్రం నుండి విడిచిపెట్టా లి)

(Inhale until end of satyam)

ఓం భూః \ఓం భువః \ ఓం సువః\ఓం మహః\ఓం జనః\ఓం తపః\ఓం సత్యమ్ 

(Hold air until prachodayata)  ఓం తత్స’ వితుర్వరే’’ణ్యం \భర్గో ’ దేవస్య’ ధీమహి ధియో యో నః’  ప్రచోదయా’’త్ \

(Exhale by saying) ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్స్వ రోమ్ ||

5.సంకల్పం

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే\

శోభన\, అభ్యుదయ ముహూర్తే అద్యబ్రహ్మణ: ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే, వైవస్వత

మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరో: దక్షిణ దిగ్భాగే,

భరతదేశే ఆగ్నేయ దిగ్గబాగే సింహపురి దేశే , సమస్త దేవతా బ్రా హ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్‌వర్త మాన వ్యావహారిక

చాంద్రమానేన______________నామ సంవత్సరే _____________యనే

________________ ఋతౌ ______ మాసే ______ పక్షే, _____ తిధౌ

________________ వాసరే, శుభనక్షత్రే, , శుభ యోగే శుభ కరణ యేవం గుణ విశేషణ విశిష్టా యాం

శుభతిథౌ, శ్రీమాన్‌. కౌశికస గోత్ర: యనమండ్ర లక్ష్మి నరసింహా రావు శర్మనామధేయ:, మమ ఉపాత్త

సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ప్రీత్యర్థం ప్రా తః (మధ్యాహ్నిక / సాయం) స్సంధ్యా

ముపాసిష్యే (అని చేతిలో నీటిని పో సుకుని పళ్లెంలో వదలాలి).


ఆదివారం Shukla- Before Pournami
రావివసరే/భానువాసరే  Krishna – After Pournami

సోమవారం ఇందువసరే 
మంగళవారము
వసంత ఋతువు  భౌమవాసరే /కుజవాసరే  
చైత్ర - వైశాఖము
బుధవారము
గ్రీష్మ ఋతువు  సౌమ్యవాసరే 
జ్యేష్ఠ  - ఆషాడం
గురువారము గురువాసరే 
వర్ష ఋతువు శ్రావణ- భాద్రపదము
శుక్రవారము బృగువాసరే 
శరద్ ఋతువుశనివారము ఆశ్వయుజ/- మందవాసరే 
స్స్థిరవాసరే కార్తీకం
హేమంత ఋతువు మార్గశిర - పుష్యమి
శిశిర ఋతువు  మాఘ, ఫాల్గుణ

6.మార్జనం

ఓం ఆపోహిష్టేతి త్రయాణాం మంత్రాణాం సింధుద్వీప ఋషిః | ఆపోదేవతా | గాయత్రీ ఛందః | పాదాంత మార్జనే వినియోగః ||

(ఉద్దరినిలో నీరు తీసుకొని ఎడమచేత పట్టు కొని క్రింది మంత్రమునందలి ఒక్కొక్క వాక్యము చివర ఒకసారి మొత్తము తోమ్మిదిమార్లు శిరముపై
దర్భాలతో జలమును మార్జనము చేసి కొనవలెను. మిగిలిన జలమును పళ్ళేములో విడువవలెను )

ఆదివారం రావివసరే/
భానువాసరే 
ఓం ఆపో హి ష్ఠా మ’ యోభువః’ | సోమవారం ఇందువసరే 
మంగళవార భౌమవాసరే
తాన’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | ము /కుజవాసరే  
బుధవారము సౌమ్యవాసరే 
గురువారము గురువాసరే 
యోవ’శ్శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ శుక్రవారము బృగువాసరే 
నః’ |
శనివారము స్స్థిరవాసరే /
ఉశతీరి’వమాతరః’ |
మందవాసరే 

తస్మా ఆరం’ గమామ వః |

యస్యక్షయా’య జిన్వ’ధా | ఆపో’ జన య’థా చ నః |


7.మంత్రాచమనం

ప్రాతః కాలమంత్రచనము

సూర్యశే్చత్యస్య మంత్రస్య | యాజ్ఞవల్క్య ఉపనిషద్ ఋషి: । (నారాయణ ఋషి:।) సుర్యమన్యు

మన్యుపతి రాత్రాయో దేవతాః | ప్రక్రు తిశ్చందః | అంతశ్శుధ్యర్ధం మంత్రాచమనే వినియోగః ||

(కుడి చేతి బోతనవ్రేలును నడిమి వ్రేలి మొదటికి తగులునట్లు గా వంచి, దాని మీదికి చూపుడువ్రేలును వంచి పట్టినచో, గో  కర్ణా కృతిగా
ఏర్పడు అరచేతిలో ఉద్దరిణెడు నీటిని పోసుకొని, ఈ క్రింది పేర్కొనబడిన విధముగా మూడు వేళలలో , ఆయ మంత్రములతో అభి మంత్రించి

త్రాగవలెను )

ఓం సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యు’ కృతేభ్యః | పాపేభ్యో’ రక్షన్తా మ్ | యద్రాత్రియా

పాప’ మకార్షమ్ । మనసా వాచా’ హస్తా భ్యామ్| పద్భ్యా ముదరే’ణ శిశ్నా| రాత్రి స్తద’వలుమ్పతు |

యత్కించ’ దురితం మయి’। ఇదమహం మా మమృ’త యోనౌ | సూర్యే జ్యోతి’షి జుహో’మి స్వాహా

॥ (ఇతి జలం పీత్వా ) ॥

మాధ్యాహ్నికమంత్రాచమనము
ఆపః పున్వంత్విత్యస్య మంత్రస్య । పూత  ఋషి: । 

ఆపోదేవతా । అష్టీ ఛందః అపాం ప్రాశనే వినియోగః ॥ 

ఓం ఆపః' పునన్తు పృథివీం పృ'థివీ పూతా  పు'నాతు మామ్ । 

పునన్తు  బ్రాహ్మ'ణస్పతి బ్రహ్మ' పూతా పు'నాతు మామ్ ।

యదుచ్చి'ష్టం మభో''జ్యం యద్వా' దుశ్చరితం మమ' । సర్వం' పునన్తు  మా మాపో'అసతాం చ'

ప్రతి గ్రహం (గ్గ్) స్వాహా'' (ఇతి జాలం పీత్వా)


సాయంకాలమంత్రాచమనము
అగ్ని శ్చేత్యస్య మంత్రస్య । యాజ్ఞ వల్క్య ఉపనిషద్ ఋషి: । 

అగ్నిమన్యు మన్యుపత్యహాని దేవతా : । ప్రక్రు థిశ్ఛ ప్రకృతి శ్చందః । 

మంత్రాచామనే వినియోగః 

ఓం అగ్నిశ్చ మా మన్యుశ్చ  మన్యుపతయశ్చ మన్యు  కృతేభ్యః । పాపెభ్యో రక్షంతామ్ । యదహ్న


పాప మకార్ ష మ్ । మనసా వాచా హస్తా భ్యామ్ । పదాభ్య ముద రేణ  శిశ్న  । ఆహాస్త దవ
లుమ్పతు  । యత్కించ దురితం మయి । ఇదమహాం  మామమృత యౌనౌ । సత్యేజ్యోతిషి
జిహోమి స్వాహ (ఇతి జాలం పీత్వా)

ఆచమ్య ॥ స్మృత్యాచామన ద్వయమ్ కృత్వా


8.స్మృత్యాచామానము / స్మార్తచామానము

త్రిరాచామేత్ హృదయజ్ఞ మాభిరద్భి: ॥  జలమును తీసుకొని స్వాహా, స్వాహా, స్వాహ అని మూడు మార్లు
అచ మిమ్పవలెను.  జలము గొంతులోని దిగి హృదయ స్థా నము
చేరినట్లు తోచిన తర్వాతనే మరల ఆచమింపవలెను.  ఇట్లు
ముమ్మారు ఆచమింపవలెను
త్రిరోష్టౌ పరిమృజ్యేత్ ॥ (ద్విరిత్యేకే) పిదప (అంగుష్ట్ మూలమున కుడి బ్రోటనవ్రేలి క్రింది భాగముతో)
పెదవులు మూడు సార్లు తుడుచుకోనవలెను. (రెండు సార్లు అని
కొందరు చెప్పెదరు)

సకృదుపస్ప్ర శేత్ ॥ (ద్విరిత్యేకే) మధ్యమ -అనామికలతో పెదవులు ఒకసారి తుడుచుకోనవలెను.


(రెండు సార్లు అని కొందరు చెప్పెదరు)

దక్షిణేన పాణినా సవ్యం ప్రోక్ష్య, పాదౌ, కుడి చేతిలో ఎడమ అరచేతిపై, రెండు పాదముల మీద, శిరముపై

శిరశ్చ్ ॥  నీళు చల్లు కోనవలెను 

ఇంద్రియాణ్యుపస్ప్రు శేత్, చక్షుషీ నాసికే శ్రోత్రే అంగుష్ట్ - అనమికలతో నేత్రములను, అంగుష్ట్ - తర్జనులతో
చ ॥  ముక్కు రంధ్రములను, అంగుష్ట్ - 
కనిష్టికలతో చెవులను స్ప్రు శిమ్పవలెను
అధాప ఉపస్ప్రు శేత్ ॥ పిదప అరచేతులను ముందు వెనుక భాగములను తుడువవలెను.

ఈ ఆచమనమును సంధ్యావందన ప్రారంభమున, పురాణా చమనమునకు పిదప మరియు మధ్య , మధ్యన చేయవలసి
యుండును 

త్రిరాచామేత్ హృదయజ్ఞ మాభిరద్భి: (స్వాహా, స్వాహా,

స్వాహ)॥  త్రిరోష్టౌ పరిమృజ్యేత్ ॥ సకృదుపస్ప్ర శేత్ ॥  దక్షిణేన పాణినా సవ్యం ప్రోక్ష్య, పాదౌ, శిరశ్చ్ ॥  

ఇంద్రియాణ్యుపస్ప్రు శేత్, చక్షుషీ నాసికే శ్రోత్రే చ ॥  అధాప ఉపస్ప్రు  శేత్ ॥


9.పునర్మార్జనం

ఆపోహిష్టేతి నవర్చస్య సూక్తస్య| సింధుద్వీపోంబరీషోవా| ఋషిః ఆపోగాయత్రీ పంచమీ వర్ధమానా| స

ప్తమీ ప్రతిష్టా | అంత్యేద్వే అనుష్టు భౌ| పునర్మార్జనే వినియోగః 

(దర్బలతో శిరమున క్రింది ముంత్రముతో తొమ్మిది సార్లు నీరు మార్జనము చేసుకొనవలెను)

ఓం ఆపో హి ష్టా మ’యోభువః’ తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే !

యోవ’ శ్శివత’మో రసః’ తస్య’ భాజయతే హ నః’ ! ఉశతీరి’వ మాతరః’ ! తస్మా అరం’గమామ

వః యస్యక్షయా’య జిన్వ’థ! ఆపో’ జన య’థా చ నః !

(ఈ క్రింది ముంత్రముతో కూడా నీటితో మార్జనము చేసికోనవలెను )

శన్నో’ దేవి రభీష్టయ ఆపో’ భవంతు పీత యే’’| శంయోరభిస్ర ’వంతునః |

ఈశా’నా వార్యా’ణాం  క్షయం’తీశ్చర్షణీనామ్ | ఆపోయా’చామి భేష జమ్ |

అప్సు మే సోమో’ అబ్రవీదంతర్విశ్వా’ని భేషజా | అగ్నిం చ’విశ్వ శం’భువమ్ |

ఆపః’ పృణీత భే’షజమ్ వరూ’ధం త న్వే మమఁ’ | జ్యోక్చ సూర్యం’ దృశే |

ఇదమా’పః ప్రవ’హత యత్కించ’ దురితం మయి’ | యద్వాహ మ’భిదుద్రోహ యద్వా’

శేప ఉతానృ’తమ్ | ఆపో’ అద్యాన్వ’చా రిషమ్ రసే’న సమ’గస్మహి | పయ’స్వానగ్న ఆ’గహి |


తం మా సంసృ’జ వర్చ’సా| ససృషీ స్తదపసో దివానక్తంచ ససృషీః’’| వరే’ణ్య

క్రతూ రహ’మాదేవీ రవ’ సేహువే || ఆపో మాం రక్షంతు |

(ఇతి మార్జయిత్వా ||) 

10.పాప పురుష విమోచనము

ఋతంచ సత్యంచేత్యస్య మంత్రస్య । అఘమర్షణ ఋషిః । భావ వృ త్తో 


దేవతా। అను ష్టు ప్  ఛందః । మమ పాప పురుష జల విసర్జనే వినియోగః ॥  

(కుడిచేతిలో జలమును తీసుకొని, క్రిందిమంత్రమును పాటించి, ఎడమ ముక్కు శ్వాసను నిలిపి, ఆ జలములోనికి కుడి ముక్కులోనుండి
పపపురుషుని నిశ్వాసరూపమగు విడిచి తనకు ఎడమవైపున ఆ జలమును విసర్జిం పవలెను.   అట్టి జలమును తిరిగి చూడకూడదు )

ఓం ఋతం చ’ సత్యం చాభీ’ద్దా త్త పసో2_ధ్య’జాయత । తతో రాత్ర్య’ 

జాయత । తత’ స్సముద్రో అ’ర్ణవః । సముద్రాద’ర్ణవాదధి’ సంవత్సరో 


అ’జాయత । అహోరాత్రాణి’ విదధద్విశ్వ’స్య  మిషతో వశీ । 
సూర్యాచం ద్రమసౌ’ ధాతా య’థా పూర్వ మ’కల్పయత్ । దివం’ చ పృ ధివీం చాన్తరి’క్ష మథో  స్వః’
॥ 
ఆచమ్య ॥ స్మృత్యాచామన ద్వయమ్ కృత్వా

11.స్మృత్యాచామానము / స్మార్తచామానము

త్రిరాచామేత్ హృదయజ్ఞ మాభిరద్భి: ॥  జలమును తీసుకొని స్వాహా, స్వాహా, స్వాహ అని మూడు మార్లు అచ
మిమ్పవలెను.  జలము గొంతులోని దిగి హృదయ స్థా నము చేరినట్లు తోచిన
తర్వాతనే మరల ఆచమింపవలెను.  ఇట్లు ముమ్మారు ఆచమింపవలెను
త్రిరోష్టౌ పరిమృజ్యేత్ ॥ (ద్విరిత్యేకే) పిదప (అంగుష్ట్ మూలమున కుడి బ్రోటనవ్రేలి క్రింది భాగముతో) పెదవులు మూడు
సార్లు తుడుచుకోనవలెను. (రెండు సార్లు అని కొందరు చెప్పెదరు)

సకృదుపస్ప్ర శేత్ ॥ (ద్విరిత్యేకే) మధ్యమ -అనామికలతో పెదవులు ఒకసారి తుడుచుకోనవలెను.  (రెండు సార్లు
అని కొందరు చెప్పెదరు)

దక్షిణేన పాణినా సవ్యం ప్రోక్ష్య, పాదౌ, కుడి చేతిలో ఎడమ అరచేతిపై, రెండు పాదముల మీద, శిరముపై నీళు

శిరశ్చ్ ॥  చల్లు కోనవలెను

ఇంద్రియాణ్యుపస్ప్రు శేత్, చక్షుషీ నాసికే శ్రోత్రే అంగుష్ట్ - అనమికలతో నేత్రములను, అంగుష్ట్ - తర్జనులతో ముక్కు
చ ॥  రంధ్రములను, అంగుష్ట్ - కనిష్టికలతో చెవులను స్ప్రు శిమ్పవలెను

అధాప ఉపస్ప్రు శేత్ ॥ పిదప అరచేతులను ముందు వెనుక భాగములను తుడువవలెను.


ఈ ఆచమనమును సంధ్యావందన ప్రారంభమున, పురాణా చమనమునకు పిదప మరియు మధ్య , మధ్యన చేయవలసి యుండును 

                 

12.ప్రాణాయామం

(ముక్కు పట్టు కొని ఎడమ రంధ్రంతో గాలిని మెల్లగా పీల్చి, బంధించి, ఈ క్రింది మంత్రమును జపించి మెల్లగా కుడిరంధ్రం నుండి విడిచిపెట్టా లి)

(Inhale until end of satyam)

ఓం భూః \ఓం భువః \ ఓం సువః\ఓం మహః\ఓం జనః\ఓం తపః\ఓం సత్యమ్ 

(Hold air until prachodayata)  ఓం తత్స’ వితుర్వరే’’ణ్యం \భర్గో ’ దేవస్య’ ధీమహి ధియో యో నః’  ప్రచోదయా’’త్ \

(Exhale by saying) ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్స్వరోమ్ ||

13.ప్రాతః కాల అర్ఘ్యప్రధానమ్

ఈ క్రింది విధముగా సంకల్పము చెప్పి, సుర్యభాగవానునకు మూడు మార్లు అర్ఘ్యమును ఈయవలెను. ఉదయము మరియు మధ్యాహ్నము

కూర్చుండి, దోసిట్లో జలము తీసుకొని సమంత్ర కముగ భ్రూ స్థా నము వరకు ఎత్తి మడమలు ఎత్తి నిలిచి, పైకి చల్లవలెను లేద క్రింది పళ్ళెములో

విడువవలెను.  ఒకవేళ ముఖ్య కాలాతి క్రమణ మైనచొ సంకల్ప పూర్వకముగా, దిగువన పెర్కొనబడినట్లు ముందుగా ప్రాయశ్చి త్తా ర్ఘ్య మును
ఇచ్చిన తర్వాతనే ప్రదానర్ఘ్యం ఈయవలెను 
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టా యాం శుభ తిధౌ । మమ ఉపాత్త  దురితక్షయ ద్వారా శ్రీ
పరమేశ్వర ముద్దిశ్య । శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ప్రాతః సంధ్యార్ఘ్య ప్రధానం కరిష్యే ||

ఓం తత్సవితు రిత్యస్య మంత్రస్య! గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః సవితాదేవతా! గాయత్రీ ఛంధః! ప్రాత ర

ర్ఘ్యప్రదానే వినియోగః ! 

ఓం భూర్భువస్వః’ | తత్స’వితుర్వరే’’ణ్యం భర్గో’దేవస్య’ ధీమహి | ధియో యో నః’  ప్రచోదయా’’త్

||

(అని ఇదే మంత్రమును పఠించుచు మూడు మార్లు అర్ఘ్యమునీయవలెను )

కాలాత్రిక్రమణ ప్రాయశ్చిత్తా ర్ఘ్యమ్


(ఒక వేళ ముఖ్య కాలత్రికమణ మైనచో ముందుగా దిగువనీయబదినట్లు గా సంకల్పించి ప్రయస్చిత్యర్ఘ్యమునీయవలెను

ప్రయశ్చిత్యార్ఘ్యమునీయవలెను.  ఋగ్వే దులకు త్రికాల సంధ్యలు యందు ప్రయశ్చిత్యార్ఘ్యమునకు వేరు - వేరు మంత్రములు పేర్కొనబడినవి.

ఈ మంత్రములతో కొందరు, మరికొందరు గాయత్రీ ముంత్రముతోనే ప్రయశ్చిత్యార్ఘ్యమును ఇచ్చుచున్నారు.  కాని ప్రత్యెక ముంత్రముతో

ప్రయశ్చిత్యార్ఘ్యమును ఇచ్చుటయే ఉత్తమము.  ఆ తర్వతనే ప్రధాన అర్ఘ్యత్రయమును ఈయవలయునని గమనింప వలెను.  )

1. ప్రాతః సంధ్యాంగ ముఖ్య కాలాతిక్రమణ దోష


పరిహారార్ధం ప్రాయశ్చిత్తా ర్ఘ్య ప్రధానం కరిష్యే ||
యదద్యకచేత్యస్య మంత్రస్య । కుత్సఋషిః । సవితాదేవత 
గాయత్రీ ఛందః  । ప్రాతః సంధ్యాంగా ప్రాయశ్చిత్తా ర్ఘ్య ప్రధానే వినియోగః   
యదద్య కచ్చ వృత్రహన్ను దగా’’ అభిసూ’’ర్య  । 
సర్వం తదిం’ద్ర తే  వశే’ ॥  (అని ప్రాయశ్చిత్త అర్ఘ్యమును ఈయవలెను)

మధ్యాహ్నిక ఆర్ఘ్యప్రదానమ్

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టా యాం శుభ తిధౌ । మమ ఉపాత్త  దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వ
ర ముద్దిశ్య । శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం మాధ్యాహ్నిక సంధ్యార్ఘ్య ప్రధానం కరిష్యే ||
హంసశ్శుచిషదిత్యస్య మంత్రస్య । గౌతమపుత్రో వామదేవఋషి: । 

సుర్యోదేవత । జగతీ ఛందః । మాధ్యాహ్నిక సంధ్యార్ఘ్య ప్రదానే వినియోగః 

ఓం హంస శ్శు’చిషద్వ సు’రన్తరిక్ష సద్ధో’ తావేదిష దతి’థి ర్దు రోణ సత్ । 


నృష ద్వ’రసదృ’త సద్వ్యో’మ సదబ్జా గోజా ఋ’తజా అ’ద్రిజా ఋతం బృహత్  
(ఇతి ప్రధమార్ఘ్యం)

ఆకృష్ణే నేత్యస్య మంత్రస్య । హిరణ్యస్తూప ఋషి: । సవితాదేవతా । త్రిష్టు ప్ ఛందః । మధ్యాహ్నిక


సంధ్యాంగా ద్వితీయార్ఘ్య ప్రదానే వినియోగః 

ఓం ఆకృష్ణేన రోజ’సా వర్త’మానో నివేశ య’న్న మృతం మర్త్యం’ చ ।


హిరణ్య యే’న సవితారథే నా22 దేవోయా’తి భువ’నాని పశ్య’న్ ॥ 

(ఇతి ద్వితీయార్ఘ్యం)

తత్సవితురిత్యస్య మంత్రస్య । గాధిపుత్రో విశ్వామిత్ర ఋషి: । 

సవితాదేవతా । గాయత్రీ ఛందః । మాధ్యాహ్నిక సంధ్యాంగత్రు తీయర్ఘ్య ప్రదానే వినియోగః ॥ 

ఓం భూర్భువస్వః’ | తత్స’వితుర్వరే’’ణ్యం భర్గో’దేవస్య’ ధీమహి | ధియో యో నః’  ప్రచోదయా’’త్

||

(ఇతి తృతయార్ఘ్యాం)

 
కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తా ర్ఘ్యమ్

2. మధ్యాహ్నిక సంధ్యాంగ ముఖ్య కాలాతిక్రమణ దోషపరిహారార్ధం ప్రాయశ్చిత్తా ర్ఘ్య ప్రధానం కరిష్యే ||

ప్రాతర్దేవీత్యస్య మంత్రస్య । అభితప ఋషి: । సూర్యోదేవతా । త్రిష్టు ప్ ఛందః మాధ్యాహ్నిక


సంధ్యాంగా ప్రాయశ్చిత్తా ర్ఘ్య ప్రదానే వినియోగః ॥ 

ప్రాతర్దేవీమది’తిం జోహవీమి మద్యంది’న ఉది’తా సుర్య’స్య । రాయేమి’త్రా వరుణా సర్వతాతే’ళే


తోకాయ తనయాయ శం యో: ॥ 

(అని ప్రాయశ్చిత్త అర్ఘ్యమును ఈయవలెను) 

సాయంకాల అర్ఘ్యప్రదానమ్
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టా యాం శుభ తిధౌ । మమ ఉపాత్త  దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వ
ర ముద్దిశ్య । శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం సాయం సంధ్యార్ఘ్య ప్రధానం కరిష్యే ||

ఓం భూర్భువస్వః’ | తత్స’వితుర్వరే’’ణ్యం భర్గో’దేవస్య’ ధీమహి | ధియో యో నః’  ప్రచోదయా’’త్

||

(అని ఇదే మంత్రమును పట్టించుచు మూడు మార్లు అర్ఘ్యమునీయవలెను)

కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తా ర్ఘ్యమ్


3.సాయం సంధ్యాంగ ముఖ్య కాలాతిక్రమణ దోషపరిహారార్ధం ప్రాయశ్చిత్తా ర్ఘ్య ప్రధానం కరిష్యే ||

ఉద్ఝేదభీత్యస్య మంత్రస్య । కుత్స ఋషి: । సవితాదేవతా । గాయత్రీ ఛందః ।


సాయం సంధ్యాంగాప్రాయశ్చిత్తా ర్ఘ్య ప్రదానే వినియోగః ॥
ఉద్ఝేదభిశ్రు తా మ’ఘం వృషభం నర్యా’’పసమ్ । అస్తా ’’ర మేషి సూర్య ॥ 
(అని ప్రాయశ్చిత్త అర్ఘ్యమును ఈయవలెను) 

రెండవ భాగం - గాయత్రి జపం 

14.ఆత్మ ప్రదక్షిణము - పరిషేచనము

(దోసిట్లో నీరు తీసికొని దిగువ మంత్రమును పఠించుచు ప్రదక్షిణము చేసి చేతిలోని ఉదకమును (తన) చుట్టు విడువ వలయును)

బ్రహ్మైవ సత్యం బ్రహ్మైవా హమ్ । యోసావాదిత్యో హిరణ్మయః పురుషస్స ఎవాహమస్మి ॥ 

అసావా’దిత్యో బ్రహ్మ ॥ ( ఆసావాదిత్యో బ్రహ్మేతి యద్ద్యానం క్రియతే స్వహమ్ |


తదేవ సాంధ్య  మిత్యుక్తం కర్మ బ్రహ్మోపకారకమ్ || (స్మ్రు తిరత్న మహోదధి))

(అని పఠించి ఈ ఆదిత్యుడే  పరబ్రహ్మము - అని లేద సూర్య మండలమున ఇష్ట దైవతమును కొంత తడవు ధ్యనిమ్పవలెను )

ఆచమ్య ॥ స్మృత్యాచామన ద్వయమ్ కృత్వా

15.స్మృత్యాచామానము / స్మార్తచామానము

త్రిరాచామేత్ హృదయజ్ఞ జలమును తీసుకొని స్వాహా, స్వాహా, స్వాహ అని మూడు మార్లు అచ మిమ్పవలెను.
మాభిరద్భి: ॥  జలము గొంతులోని దిగి హృదయ స్థా నము చేరినట్లు తోచిన తర్వాతనే మరల
ఆచమింపవలెను.  ఇట్లు ముమ్మారు ఆచమింపవలెను
త్రిరోష్టౌ పరిమృజ్యేత్ ॥ పిదప (అంగుష్ట్ మూలమున కుడి బ్రోటనవ్రేలి క్రింది భాగముతో) పెదవులు మూడు సార్లు
(ద్విరిత్యేకే) తుడుచుకోనవలెను. (రెండు సార్లు అని కొందరు చెప్పెదరు)
సకృదుపస్ప్ర శేత్ ॥ మధ్యమ -అనామికలతో పెదవులు ఒకసారి తుడుచుకోనవలెను.  (రెండు సార్లు అని
(ద్విరిత్యేకే) కొందరు చెప్పెదరు)
దక్షిణేన పాణినా సవ్యం కుడి చేతిలో ఎడమ అరచేతిపై, రెండు పాదముల మీద, శిరముపై నీళు చల్లు కోనవలెను
ప్రోక్ష్య, పాదౌ, శిరశ్చ్ ॥ 

ఇంద్రియాణ్యుపస్ప్రు శేత్, అంగుష్ట్ - అనమికలతో నేత్రములను, అంగుష్ట్ - తర్జనులతో ముక్కు రంధ్రములను,

చక్షుషీ నాసికే శ్రోత్రే చ ॥  అంగుష్ట్ - కనిష్టికలతో చెవులను స్ప్రు శిమ్పవలెను

అధాప ఉపస్ప్రు శేత్ ॥ పిదప అరచేతులను ముందు వెనుక భాగములను తుడువవలెను.


ఈ ఆచమనమును సంధ్యావందన ప్రారంభమున, పురాణా చమనమునకు పిదప మరియు మధ్య , మధ్యన చేయవలసి
యుండును 

16.ప్రాణాయామం

(ముక్కు పట్టు కొని ఎడమ రంధ్రంతో గాలిని మెల్లగా పీల్చి, బంధించి, ఈ క్రింది మంత్రమును జపించి మెల్లగా కుడిరంధ్రం నుండి విడిచిపెట్టా లి)

(Inhale until end of satyam)


ఓం భూః \ఓం భువః \ ఓం సువః\ఓం మహః\ఓం జనః\ఓం తపః\ఓం సత్యమ్ 

(Hold air until prachodayata)  ఓం తత్స’ వితుర్వరే’’ణ్యం \భర్గో ’ దేవస్య’ ధీమహి ధియో యో నః’  ప్రచోదయా’’త్ \

(Exhale by saying) ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్స్వ రోమ్ ||

17.తర్పణము

మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య ।  శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ప్రాతః
(మాధ్యాహ్నిక/సాయం) సంద్యాంగ తర్పణం కరిష్యే ॥ 

(కూర్చొని తర్పణము చేయవలెను.  దిగువ నామములు చేప్పుచు కుడిచేతిలో జలముపోసికొని దేవతీర్ధము ద్వారా ఒక్కొక్క నామమునకు

ఒకసారి తర్పణము విడువవలెను)

ప్రాతః కాలమునందు :

సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి,


బ్రా హ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి

మాధ్యాహ్నికమునందు 
సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి,
రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి 

సాయం కాలమునందు 
సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి,
వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి 
ఆచమ్య ॥ స్మృత్యాచామన కృత్వా ||

త్రిరాచామేత్ హృదయజ్ఞ మాభిరద్భి: ॥  జలమును తీసుకొని స్వాహా, స్వాహా, స్వాహ అని మూడు మార్లు అచ
మిమ్పవలెను.  జలము గొంతులోని దిగి హృదయ స్థా నము చేరినట్లు తోచిన
తర్వాతనే మరల ఆచమింపవలెను.  ఇట్లు ముమ్మారు ఆచమింపవలెను

త్రిరోష్టౌ పరిమృజ్యేత్ ॥ (ద్విరిత్యేకే) పిదప (అంగుష్ట్ మూలమున కుడి బ్రోటనవ్రేలి క్రింది భాగముతో) పెదవులు మూడు
సార్లు తుడుచుకోనవలెను. (రెండు సార్లు అని కొందరు చెప్పెదరు)

సకృదుపస్ప్ర శేత్ ॥ (ద్విరిత్యేకే) మధ్యమ -అనామికలతో పెదవులు ఒకసారి తుడుచుకోనవలెను.  (రెండు సార్లు
అని కొందరు చెప్పెదరు)

దక్షిణేన పాణినా సవ్యం ప్రోక్ష్య, పాదౌ, కుడి చేతిలో ఎడమ అరచేతిపై, రెండు పాదముల మీద, శిరముపై నీళు

శిరశ్చ్ ॥  చల్లు కోనవలెను

ఇంద్రియాణ్యుపస్ప్రు శేత్, చక్షుషీ నాసికే శ్రోత్రే అంగుష్ట్ - అనమికలతో నేత్రములను, అంగుష్ట్ - తర్జనులతో ముక్కు
చ ॥  రంధ్రములను, అంగుష్ట్ - కనిష్టికలతో చెవులను స్ప్రు శిమ్పవలెను

అధాప ఉపస్ప్రు శేత్ ॥ పిదప అరచేతులను ముందు వెనుక భాగములను తుడువవలెను.


ఈ ఆచమనమును సంధ్యావందన ప్రారంభమున, పురాణా చమనమునకు పిదప మరియు మధ్య , మధ్యన చేయవలసి యుండును 

18.స్మృత్యాచామానము / స్మార్తచామానము
                 

19.గాయత్రీ ఆవాహనము

(త్రికాల సంధ్యలయందు ఒకే విధముగా నుండును)

ఓ మిత్యేకాక్ష’రం బ్రహ్మ! అగ్నిర్దేవతా! బ్రహ్మ’ ఇత్యార్షమ్ ! గాయత్రం ఛందం ! పరమాత్మం’

సరూపమ్ ! సాయుజ్యం వి’నియోగమ్ || (ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని కాని లేదా అహంబ్రహ్మాస్మి అని

కొంత సమయము ధ్యానింపవలెను)

ఆయా’తు వర’దా దేవీ అక్షరం’ బ్రహ్మసమ్మి’తమ్ ! గాయత్రీం’’ ఛంద’సాంమా తేదం బ్ర’హ్మ

జుషస్వ’మే ! యదహ్నా’’త్  కుర్రు ’తే పాపం తదహ్నా’’త్ ప్రతి ముచ్య’తే ! యద్రాత్రియా’’త్ కురు’తే

పాపం తద్రాత్రియా’’త్ ప్రతి ముచ్య’తే ! సర్వ’వర్ణే మ’హాదేవి సంధ్యా వి’ద్యే సరస్వ’తీ!  (అరచేతులు రెండూ

జోడించి) ఓజో’సి సహో’సి బల’మసి భ్రాజో’సి దేవానాం ధామనామా’సి! విశ్వ’మసి విశ్వాయు: సర్వ’మసి

సర్వాయురభిభూరోమ్ !(తరువాతి మాటలను చెప్తూ చేతుల్ని తనవైపు త్రిప్పుకోవాలి) 

గాయత్రీ మావా’హయామి! సావిత్రీ మావా’హయామి! 
సరస్వతీ మావా’హయామి ! ఛందర్షీ నావా’హయామి! 

శ్రియ మావా’హయామి (|| బల మావా’హయామి ||)

గాయత్రియా గాయత్రీ చ్ఛన్దో విశ్వామిత్ర ఋషి: సవితా దేవతా అగ్నిర్ముఖం (కుడి చేతితో ముఖాన్ని)

బ్రహ్మశిరో (శిరస్సును), విష్ణుర్ హృదయం (హృదయాన్ని), 

రుద్ర శ్శిఖా (శిఖను ముట్టు కోవాలి) పృథివీయోని: ప్రాణాపానవ్యానోదానసమాన సప్రాణ

శ్వేతవర్ణా సాంఖ్యాయనస సగోత్రా గాయత్రీ చతుర్వింశ్యత్యక్షరా త్రిపదా’ షట్కుక్షి: (అని కుడిచేతితో

ఎడమచేతిని కొట్టా లి) పఞ్చశీర్ షోపనయనే వి’నియోగ:! 

ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓం సత్యమ్ |ఓం తత్స’వితుర్వరే’’ణ్యం 

భర్గో’దేవస్య’ ధీమహి ధియో యోనః’ ప్రచోదయా’’త్ | ఓమాపోజ్యోతి రసో మృతం బ్రహ్మ భూర్భువస్వరోమ్ ||

20.శ్రౌతాచమనం కృత్వా ॥ ప్రనాయామత్రయం కృత్వా ॥

ఓం తత్సవితుర్వరేణ్యం గ్గ్ స్వాహ॥   అని ఈ మూడు మంత్రములచేత ముమ్మారు చేతిలో జలమును తీసికొని
ఓం భర్గోదేవస్య ధీమహి స్వాహ॥  ఆచమింపవలయును. 
ధియోయోనః ప్రచోదయాత్ స్వాహ॥

ఓం ఆపోహిష్టా మయోభువః అని అరచేతులు నీటితో తుడుచుకొనవలెను 


తాన ఊర్జే దధాతన
మహేరణాయ చక్షసే  అని కుడిచేతి బొటన వ్రేలిని నీటిలో ముంచి, ఎడమ నుండి కుడికి రెండు పెదవులను
యోవశ్శివతమో రసః   వేర్వేరుగా తుడుచుకోనవలెను 
తస్య భాజయతేహ నః  అని రెండుమార్లు దర్భాలతో లేదా కుడి చేతి వ్రేళ్ళతో శిరమున నీరు చల్లు కోనవలెను 
ఉశతీ రివ మాతరః 
తస్మా ఆరంగ మామ వః అని కుడిచేత ఎడమ చేతిని నీటితో ప్రోక్షించుకొనవలెను
యస్యక్షయాయ జిన్వధా  అని రెండు పాదముల మీద నీరు  ప్రోక్షించుకొనవలెను 
ఆపోజన యథాచనః అని శిరమున జలమును చల్లు కొనవలయును 

ఓం భూః  అని కుడి చేతి వ్రేళ్ళను ముడిచి మొదళ్ళతో గడ్డమును స్ప్రు శింపవలెను


ఓం భువః  ఓగమ్ సువః అని అంగుష్ఠ  తర్జనులతో ఎడమ ముక్కు పుటమును తర్వాత కుదిముక్కు పుటమును
తాకవలెను  

ఓం మహః ఓం జనః  అని అంగుష్ఠ- అనామికలతో ఎడమకన్ను తర్వాత కుడి కన్ను తాకవలెను  

ఓం తపః ఓగమ్ సత్యమ్  అని అంగుష్ఠ- అనామికలతో ఎడమ చెవిని తర్వాత కుడి చెవిని తాకవలెను 

ఓం తత్సవితుర్వరేణ్యం  అని అంగుష్ఠ- కనిష్ఠలతో నాభిని తాకవలెను 


ఓం భర్గోదేవస్య ధీమహి  అని కుడిచేతితో హృదయమును తాకవలెను 
ఓం ధియోయోనః ప్రచోదయాత్  అని కుడిచేతి వ్రేళ్ళతో శిరమును తాకవలెను 
ఓమాపోజ్యోతి రసోమృతం అని ముకుళ హస్తముతో కుడి భుజమును ఆ తర్వాత 
ఓం బ్రహ్మ భూర్భువస్వరోమ్ అని ఎడమ భుజమును తాకవలెను 

21.ప్రాణాయామం
(ముక్కు పట్టు కొని ఎడమ రంధ్రంతో గాలిని మెల్లగా పీల్చి, బంధించి, ఈ క్రింది మంత్రమును జపించి మెల్లగా కుడిరంధ్రం నుండి విడిచిపెట్టా లి)

(Inhale until end of satyam)

ఓం భూః \ఓం భువః \ ఓం సువః\ఓం మహః\ఓం జనః\ఓం తపః\ఓం సత్యమ్ 

(Hold air until prachodayata)  ఓం తత్స’ వితుర్వరే’’ణ్యం \భర్గో ’ దేవస్య’ ధీమహి ధియో యో నః’  ప్రచోదయా’’త్ \

(Exhale by saying) ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్స్వ

రోమ్ ||

22.గాయత్రి జప సంకల్పం

మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య । శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ప్రాతః
(మాధ్యాహ్నిక/సాయం) సంధ్యంగా దశ / అష్టోత్తరశత / సహస్ర (అని చేయదలచిన జప సంఖ్య
చేర్చవలెను) గాయత్రీ మహా ముంత్రజపం కరిష్యే  ॥ ( అని ఉద్దరినితో నీరు తీసుకొని కుడిచేతి ద్వార
పళ్ళెములో విడువవలెను)

23.కరన్యాసము (రెండు చేతులతో చేయాలి)

ఓం తత్స’వితు: బ్రహ్మాత్మనే అంగుష్టా భ్యాం నమ: (చూపుడువేలితో బొటనవేలును క్రింది నుండి పైకి)

ఓం వరే’’ణ్యం విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమ:


(బొటన వేలితో చూపుడు వేలును క్రింద నుండి పైకి)

ఓం భర్గో’దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమ: 


(బొటనవేలితో మధ్యవేలును క్రింద నుండి పైకి)

ఓం ధీ మ హి సత్యాత్మనే అనామికాభ్యాం నమ: (బొటనవేలితో అనామిక వేలును క్రింది నుండి పైకి)

ఓం ధియోయోన:’ జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమ: 


(బొటనవేలితో చిటికెన వేలును క్రింద నుండి పైకి స్పృశించాలి)

ఓం ప్రచోదయా’’త్‌ సర్వాత్మనే కరతలకర పృష్టా భ్యాం నమ: 


(అరచేతుల రెండింటిని ఒకదానితో ఒకటి స్పృశించాలి)

24.అంగన్యాసము

ఓం తత్స’వితు: బ్రహ్మాత్మనే హృదయాయనమ: (కుడి అరచేతితో హృదయాన్ని)


ఓం వరే’’ణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా (కుడి అరచేతితో శిరస్సును)
ఓం భర్గో’ దేవస్య’ ‘రుద్రాత్మనే శిఖాయై వషట్‌(కుడి అరచేతితో శిఖను స్పృశించాలి)
ఓం ధీ మ హి సత్యాత్మనే కవచాయహుం (కుడి అరచేతితో ఎడమ చెవులు ఎడమ
అరచేతితో కుడి చెవులు స్పృశించాలి)
ఓం ధియోయోన:’ జ్ఞానాత్మనే నేత్ర త్రయాయ వౌషట్‌! (కుడి ఎడమ నేత్రాలను వాటిపై
మధ్యభాగాన్ని స్పృశించి ఎడమ చేతిపై కొట్టా లి)
ఓం ప్రచోదయా’’ త్‌ సర్వాత్మనే అస్త్రా య ఫట్‌(తల కుడి నుండి ఎడమకు కుడుచేతిని
చుట్టూ త్రిప్పి ఎడమ అరచేతిపై కొట్టా లి) 
ఓం భూర్భువ దిగ్భంధ: (కుడి చేతి చూపుడు వ్రేలును ఎడమ చేతి చూపుడు
స్సువరో మితి వ్రేలుతో ముడివేయాలి)s

25.ధ్యానం

శ్లో || ముక్తా విద్రు మ\ హేమనీల\ ధవళచ్ఛాయై: \ముఖై: త్రీక్షణై :!

యుక్తా బిందు \నిబద్ధమకుటాం \తత్వార్ధ వర్ణాత్మికాం!

గాయత్రీం \ వరదాభయాం కుశకశా:\ శుభ్రం కపాలం గదాం!

శంఖం చక్రమథారవింద యుగళాం\ హస్తైర్వహంతీంభజే!

శ్లో || ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణస్సరసిజాసన సన్నివిష్ట:  |

కేయూరవాన్ మకరకుమ్దలవాన్ కిరీటీ హరీ హిరణ్మయ వపుర్ధవృతశంకచక్రః  ||

26.గాయత్రి మంత్రార్ధ శ్లోకః

శ్లో || యోదేవస్సవితాస్మాకం\ ధియోధర్మాది గోచరా:!

ప్రేరయేత్ త్తస్య యద్భర్గ: \తద్వరేణ్యముపాస్మహే!!

27.చతుర్వింశతి ముద్రా

  
శ్లో || సుముఖం సంపుటం చైవ వితతం విస్త ృతం తథా |
ద్విముఖం త్రిమ్రు ఖం చైవ చతు: పంచముఖం తథా |
షణ్ముఖో 2_(అ)ధోముఖం చైవ వ్యాపకాంజలికం తథా|
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్‌|
ప్రలంబం ముష్టికం చైవ మత్స్య: కూర్మో వరాహకమ్‌|
సింహాక్రా న్త ం మహాక్రా న్త ం ముద్గ రం పల్ల వం తథా||
ఏతే ముద్రా చతుర్వింశ గాయత్ర్యాం సుప్రతిష్టతః । 
ఇతి ముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలాభవేత్  ॥ 
(ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సంధ్యోపాసనలో దిగువవిధముగా గాయత్రి మాతను
ధ్యానింపవలయును)
28.గాయత్రీమాత ధ్యానము

ప్రాతఃకాలము బ్రహ్మరూపిణి యగు గాయత్రీమాత ధ్యానము


ఓం బాలాం విద్యాం తు గాయత్రీం లో హితాం  చతురాననామ్ । 
రక్తాంబరద్వయోపేతామ్ అక్షసూత్రకరాం  తథా ॥ 
కమండలుధరాం దేవీం హంస వాహనసంస్థితామ్ । 
బ్రహ్మాణీం  బ్రహ్మై దైవత్యాం బ్రహ్మలోక నివాసినీమ్ ॥  
మధ్యాహ్నము విష్ణురూపిణియగు గాయత్రీమాతధ్యానము 
ఓం మధ్యాహ్నే విష్ణురూపాం చ తార్ క్ష్యస్థా o పీతవాసనామ్ । 

యువతీం చ యజుర్వేదాం సూర్యమండలసంస్థితామ్ 


సాయంకాలము శివరూపిణియగు గాయత్రీ మాతధ్యానము 
ఓం సాయాహ్నే శివరూపాం చ వృద్దాం వృషభవాహినీమ్ । 
సూర్యమండలమధ్యస్థా o సామవేదసమాయుతామ్ 

29.గాయత్రీ మంత్రం జపం

ఓం ప్రాత (సాయం) సంధ్యాంగ యధాశక్తి గాయత్రీ మంత్రజపం కరిష్యే!!

ఓం భూర్భువ: స్వ:’ తత్స’ వితుర్వరే’’ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి! ధియో యో న:’ ప్రచోదయా’’త్‌||
గాయత్రీ మంత్రమును 108 సంఖ్యకు తక్కువకాకుండా జపము చేయాలి.  సహస్రం (1008) చేస్తే మరీ మంచిది.  యథా శక్తిగా జపం

చేయవలెను. ప్రాతః కాలము తూర్పు ముఖముగా నిలబడి, సాయంకాలము పశ్చిమ ముఖముగా కూర్చుండి గాయత్రీ జపము

చేయవలయును. మధ్యాహ్నము ప్రాజ్ఞుఖముగా నిలబడి లేదా కూర్చుండి యైనను జపించవచ్చును.  సంధ్యలో కెల్ల రుద్రక్షమాల శ్రేష్టము అని
చెప్పబడినది

The hands should be covered with the angavastra, or a piece of cloth. The mantra should be
chanted mentally without movement of the lips.   At navel in morning, at heart in afternoon, at
face in evening  Use Chitram-1 to count for 10 times. Do 10 times as in Chitram-1 which makes it

100 followed by Chitram-2 for 8 times to make it 108 times. Skip middle fingers 2 specific places as

it represents spinal cord (merudanda)

(108 జపించుట ఉత్తమము లేనిచో కనీసం 10 సార్లు అయినా జపించవలెను)

అతః గాయత్రి జపః

30.పునః కరన్యాసము (రెండు చేతులతో చేయాలి)


ఓం తత్స’వితు: బ్రహ్మాత్మనే అంగుష్టా భ్యాం నమ: (చూపుడువేలితో బొటనవేలును క్రింది నుండి పైకి)

ఓం వరే’’ణ్యం విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమ:


(బొటన వేలితో చూపుడు వేలును క్రింద నుండి పైకి)

ఓం భర్గో’దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమ: 


(బొటనవేలితో మధ్యవేలును క్రింద నుండి పైకి)

ఓం ధీ మ హి సత్యాత్మనే అనామికాభ్యాం నమ: (బొటనవేలితో అనామిక వేలును క్రింది నుండి పైకి)

ఓం ధియోయోన:’ జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమ: 


(బొటనవేలితో చిటికెన వేలును క్రింద నుండి పైకి స్పృశించాలి)

ఓం ప్రచోదయా’’త్‌ సర్వాత్మనే కరతలకర పృష్టా భ్యాం నమ: 


(అరచేతుల రెండింటిని ఒకదానితో ఒకటి స్పృశించాలి)

31.పునః అంగన్యాసము

ఓం తత్స’వితు: బ్రహ్మాత్మనే హృదయాయనమ: (కుడి అరచేతితో హృదయాన్ని)


ఓం వరే’’ణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా (కుడి అరచేతితో శిరస్సును)
ఓం భర్గో’ దేవస్య’ ‘రుద్రాత్మనే శిఖాయై వషట్‌(కుడి అరచేతితో శిఖను స్పృశించాలి)
ఓం ధీ మ హి సత్యాత్మనే కవచాయహుం (కుడి అరచేతితో ఎడమ చెవులు ఎడమ
అరచేతితో కుడి చెవులు స్పృశించాలి)
ఓం ధియోయోన:’ జ్ఞానాత్మనే నేత్ర త్రయాయ వౌషట్‌! (కుడి ఎడమ నేత్రాలను వాటిపై
మధ్యభాగాన్ని స్పృశించి ఎడమ చేతిపై కొట్టా లి)
ఓం ప్రచోదయా’’ త్‌ సర్వాత్మనే అస్త్రా య ఫట్‌(తల కుడి నుండి ఎడమకు కుడుచేతిని చుట్టూ
త్రిప్పి ఎడమ అరచేతిపై కొట్టా లి) 
ఓం భూర్భువస్సువరో మితి దిగ్వమౌకః  అని విప్పెయవలెను (rub right palm over left palm three times)
32.ఉత్తర ముద్ర

శ్లో || సురభి: జ్ఞాన చక్రం చ యోని: కోర్మొ2_థ పంకజమ్ । 

లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రః ప్రకీర్తితాః  ॥ 

/alternate / సురభి: జ్ఞాన వైరాగ్య యోని: శం ఖో2_థ  పంకజమ్ । 

లింగం నిర్యాణ ముద్రశ్చ జపాంతేష్టౌ ప్రదర్శయేత్


అనేనా ప్రాతః సంధ్యంగా గాయత్రీమంత్రజపేన సర్వాంతర్యామీ  పరమే శ్వరః 
ప్రీ ణా తు న మమ తత్సత్ పర బ్రహ్మార్ప ణ మస్తు ॥ 
(అని తాము చేసిన గాయత్రీ మంత్ర జపమును ఈశ్వరా ర్పణ బుద్ధితో నీటిని చేతిలో పోసుకొని దేవ
తీర్ధము ద్వార పళ్ళెములో జలమును విడువవలయును)

మూడవ భాగం - సుర్యోపస్థా నము

33.సుర్యోపస్థా నము

( ఉపస్థా నము అనగా స్థా నియమముతో కూడిన ప్రార్ధనము.  ఉపస్థా న మంత్రములను ప్రాతః కాలము
మరియు మధ్యాహ్న కాలముల యందు ప్రాజ్ఞు ముఖముగా (తూర్పు దిశగా) నిలబడి,
సయంకాలమునందు పశ్చిమా భి ముఖముగా (పడమర దిశగా) కూర్చుండి పట్టిమ్పవలెను )
ప్రాతః కాల సుర్యోపస్థా నమ్
(అనంతరము లేచి సుర్యాభి ముఖముగా నిలబడి చేతులు జోడిం చుకొని ఈ క్రింది మంత్రముతో
ప్రాతః కల సుర్యోపస్థా నము పతిమ్పవలెను)

మిత్రస్య చర్షణీ ధృత ఇతి చతసృఊణామ్ మంత్రాణామ్ । 


గాధి పుత్రో విశ్వామిత్ర ఋషి: । మిత్రో దేవతా । గాయత్రీ చందః 

మిత్రోప (సుర్యోప) స్థా నే వినియోగః  ||

ఓం మిత్రస్య’  చర్షణీధృతో వో’’దేవస్య’ సానసి । ద్యుమ్నం  చిత్రశ్ర’వస్తమమ్ 


అభియోమ’హినా దివం’’ మిత్రో బభూవ’ సప్రథాః ‘’। అభిశ్రవో’’భి: పృథివీం । 

మిత్రాయ పంచ’యే  మిరేజనా’ అభిష్టి’శవసే । సదేవాన్విశ్వా’’న్బిభర్తి ।  మిత్రో దేవేష్వా యుస్తు


జనా’’య వృక్త బ’ ర్హిషే । ఇషట ఇష్ట వ్రటతా అకః ||

జాతవేదసే త్యస్య మంత్రస్య మరీచిపుత్రః కశ్యప ఋషి:  జాతవేదాగ్నిన్ (దుర్గా) దేవతా । త్రి ష్టు ప్

ఛందః  (సూర్య) ఉపస్థా నే వినియోగః  ||

ఓం జాత వే’దసే సునవామ సోమ’ మారాతీయతో నిద’హాతివేద:’ ।

సనః’ పర్షదతి’ దుర్గాణి విశ్వా’నావేవ సింధుం’ దురితాత్యగ్ని: ॥ 

త్రయంబకమితి మంత్రస్య । మై త్రా వరుణీరవశిష్ట ఋషి:  |

రుద్రోదేవత । అనుష్టు పచందః ఉపస్థా నే వినియోగః ||


ఓం త్ర్యం’బకం యజామహే సుగంధిం  పు’ష్టి వర్థ’నం | 

ఉర్వా రుక మి’వ బంధ’నా  న్మృత్యో ర్ము’క్షీయ మామృతా’ ’త్ ||

తచ్చంయోరితి మంత్రద్వాయస్య । శంయుర ఋషి: । 

విశ్వేదేవా దేవతా: శక్వరీ ఛందః ।  శ్యాంత్యర్దే జపే వినియోగః ॥ 

ఓం తచ్చంయో రావృ’ణీమహే గాతుం యజ్ఞాయ’ గాతుం యజ్ఞప’తయే 


దైవీ’’ స్వస్తిర’స్తు నః స్వస్తిర్మా ను’షేభ్యః ఊర్ధ్వం జి’గాతు భేషజమ్ ।

శంనో’ అస్తు ద్విపదే’’ శం చతు’ష్పదే । ఓం న’మో బ్రహ్మణే నమో’2_

స్త్వగ్నయే నమః’ పృథివ్యే నమ ఒష’ధీభ్యః  నమో’ వాచే నమో’ వాచాస్ప’తయే 


నమో విష్ణ’వే మహతే క’రోమి ॥ ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:’ ॥ 

మాధ్యాహ్నిక సూర్యోపస్థా నమ్


(ప్రజ్ముఖముగా నిలువబడి రెండు చేతులు పైకెత్తి అరచేతులు చాచి ముందువైపునకు ఉంచి లేదా రెండు చేతులు జోడించి

సుర్యోపస్థా నము చెప్పవలయును)

ఉదుత్యం జాతవేదసమితి త్రయోదశర్చస్య సూక్తస్య । కణ్వపుత్రః ప్రస్కణ్వ ఋషి: । సూర్యోదేవత । నవాద్యా గాయత్రీచ్చందః ।

ఉద్వయంత మసస్పరీతి చతస్రో అనుష్టు ప్ భః ఉద్యన్నద్యేతి త్రయంతృచో రోఘ్న: । ఉపనిషదంత్యాత్ । అర్ధర్చశోద్విషం నాశనీ ॥
చిత్రందేవానా ముదగాదనీకమితి షడర్చస్య సూక్తస్య । అంగిరసపుత్రః కుత్స ఋషి: । సూర్యోదేవతా । త్రిష్టు ప్ ఛందః ।

సుర్యోపస్థా నే వినియోగః 

ఓం ఉదుత్యం జాత’వేదసం దేవం వ’హంతి కేతవః’ దృశే విశ్వా’య సూర్య’మ్ । అపత్యే తాయ వో’ యథా నక్ష’త్రాయం

త్యక్తు భి:’ । సూరా’య విశ్వచ’క్షసే । అదృ’శ్రమస్యకేతవో విరశ్మయో జనాం అను' । భ్రాజం’తో అగ్నేయో’ యథా । తరణి’ర్విశ్వ

ద’ర్శతో జ్యోతిష్క్రద’సి సూర్య । విశ్వమాభా’సి రోచనమ్ । ప్రత్యజ్ దేవానాం విశః’ ప్రత్యజ్జు దే’షి మాను’షాన్ । ప్రత్యాజ్ విశ్వం
స్వ’ర్ దృశే ॥ 

యే నా’ పావక చక్ష’సాభురణ్యం తం జనాం అను’ । త్వం వ’రుణ పశ్య’సి । విద్యామే’షి రాజ’స్ప్ర థ్వహ మిమా’నో అక్తు భి:’ ।

పశ్యన్ జన్మాని సూర్య । సప్తత్వా’ హరితో రథే వహం’తి దేవ సూర్య । శోచిష్కే’శం విచక్షణ । ఆయు’క్త సప్త శుంధ్యువః  సూరో
రథ’స్య నప్త్యః’ । 

తాభి’ర్యాతి స్వయు’క్తిభి: । ఉద్వయం తమ’సస్పరిజ్యోతి ష్పశ్యం’త ఉత్త ’రమ్ । దేవం దే’వత్రా సూర్యమగ’న్మ  జ్యోతి’రుత్తమమ్

। ఉద్యన్నద్వమి’త్ర మహ అరోహన్నుత్తరాం దివ’మ్ । హృద్రోగం మమ’ సూర్యహరిమాణం’ చ నాశయ । శుకే’షు మే


హరిమాణం’ రోపణాకా’సు దధ్మసి । అథో’ హరిద్రవేషు’ మే హరిమాణం నిద’ధ్మసి । ఉద’గాదయ మాదిత్యో విశ్వే’న సహ’సా
సహ । ద్విషంతం మహ్యం’ రంధయన్మో అహం ద్వి’షతేర’థమ్ ॥ 

చిత్రం దేవానాముద’గాదనీ’కం చక్షు’ర్మిత్రస్య వరు’ణ స్యాగ్నే: । ఆప్రాద్యావా’ పృథివీఅంతరి’క్షం సూర్య’ ఆత్మా జగ’తస్త స్థు ష’శ్చ

। సూర్యో’ దేవీ ముషసం రోచమానాం మర్యో నయోషా’ మభ్యే’టి పశ్చాత్ । యత్రానరో’ దేవయం’తో యుగాని’ వితన్వతే ప్రతి’

భద్రాయ’ భద్రం । భద్రా అశ్వా’ హరితః సూర్య’స్య చిత్రా ఎత’గ్వా అనుమాద్యా’సః । నమస్యంతో’ దివ అపృష్ట మ’స్థు :
పరిద్యావా’ పృథివీయం’తి సద్యః తత్సుర్య’స్య దేవత్వం తన్మ’ హిత్వం మధ్యాకార్తో ర్విత’తం సంజ’భార । యదేదయు’క్త
హరితః’ । సధస్థా దా ద్రాత్రీవాస’స్తనుతేసి మస్మై’  । తన్మిత్రస్య వరుణస్యాభి చక్షే సూర్యో’రూపం కృ’ణు తేద్యోరుపస్థే’  । అనంత
మన్య ద్రు శదస్య పాజః’ కృష్ణ మన్యద్దరితః సంభ’రంతి । అద్యాదే’వా ఉది’తా సూర్య’స్య నిరంహ’సః పిపృతా నిర’వద్యాత్ ।

తన్నో’మిత్రో వరు’ణో మామహంతా మది’ తి:


సింధు:’ పృథివీ ఉతద్యౌ: ॥ ఓం నమో’ బ్రహ్మణే నమో’ అస్త్వగ్నయే నమః’ పృథివ్యై నమ ఓష’ధీభ్యః  నమో‘ వాచే నమో’

వాచస్ప’తయే నమో విష్ణ’వే మహాతే క’రోమి ॥ ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తి శ్శాన్తి:’ ॥ 

సాయంకాల సూర్యోపస్థా నమ్


[సాయంకాలము పస్చిమాభిముఖముగా కూర్చుండి కమల సదృశముగ ముకుళితహస్తు డై సూర్యోపస్థా నము

పట్టింపవలయును]

యచ్చిద్దితేతి దశర్చస్య సూక్తస్య । అజీగర్తి: శునశ్హేప ఋషి: । 

వరుణో దేవతా । గాయత్రీఛందః । వరుణోపస్థా నే వినియోగః ॥ 

ఓం యచ్చిద్దితే విశో’’యథా ప్రదే’’వ వరుణవ్రతమ్ । మినీ మసిద్యవి’ద్యవి । మానో’’వధాయ’ హత్నవే’’ జిహీళా నస్య’రీరదః ।
మాహృ’ణా నస్య’ మన్యవే’’ । విమృ’ళీ కాయతే మనో’’రథీరశ్వం న సంది’త । గీర్భిర్వ’రుణ సీమహి । పరాహిమే విమ’న్యవః
పతం’తి వస్య’ ఇష్టయే । వయొనవ’సతీ రుప’ ।  కదాక్ష’త్ర శ్రియం నరమావరు’ణం కరామహే । మృళీకాయో’రుచక్ష’సం ।
తదిత్స’మాన మా’శాతే వే’నంతాన ప్రయు’చ్చతః । ధృత వ్ర’తాయదాశుషే’’ । వేదయౌవీనాం పదమంతరి’క్షేణ పత’తాం ।
వేద’నావస్స’ముద్రియః’ । వేద’మాసోదృత వ్రతో ద్వాద’శప్రజావతః । వేదాయ ఉ’పజాయ’తే । వేదవాత’స్య వర్తని మురో

ఋష్వస్య’ బృహతః । వేదాయే అధ్యాస’తే । నిష’సాద ధృతవ్ర’తో వరు’ణః పస్త్యా స్వా । సామ్రా’’జ్యాయ సుక్ర’తు: ॥

జాతవేదసేత్యస్యమంత్రస్య । మరీచిపుత్రః । కశ్యపఋష: । జాతవేదాగ్నిర్ (దుర్గా) దేవతా । త్రిష్టు ఫ్ ఛందః । (సూర్య) ఉపస్థా నే

వినియోగః  ॥ 

ఓం జాత వే’దసే సునవామ సోమ మరతీయతో నిద’హాతివేదః’ । సనః’ పర్షదతి’ దుర్గాణి విశ్వా’నావేవ సింధుం’ దురితాత్యగ్ని:

। త్ర్యంబకమితి మంత్రస్య । మైత్రా వరుణిర్వసిష్ఠ ఋషి: । రుద్రోదేవతా । అనుష్టు ప్ ఛందః । ఉపస్థా నే వినియోగః ॥ 

ఓం త్ర్యం’బకం యజామహే సుగంధిం  పు’ష్టి వర్థ’నం | 
ఉర్వా రుక మి’వ బంధ’నా  న్మృత్యో ర్ము’క్షీయ మామృతా’ ’త్ ||

తచ్చంయో రితి మంత్రద్వాయస్య । శంయుర ఋషి:

విశ్వేదేవా దేవతాః శక్వరీ ఛందః శాంత్యర్ధే జాపే వినియోగః ॥ 

ఓం తచ్చంయో రా వృ’ణీమహే గాతుం యజ్ఞాయ’ గాతుం యజ్ఞప’తయే  దైవీ’’స్స్వస్తిర’స్తు నః । స్వస్తిర్మా ను’షేభ్యః । ఊర్ధ్వం

జి’గాతు బేషజమ్ । శంనో’ అస్తు ద్విపదే’’ శం చతు’ష్పదే । ఓం నమో’ బ్రహ్మణే నమో’2 స్త్వగ్నయే నమః’ పృథివ్యై నమ

ఒష’ధీభ్యః నమో’ వాచే నమో’ వాచస్ప’తయే నమో విష్ణ’వే మహాతే క’రోమి ॥ ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:’ ||

34.దిగ్దేవతా నమస్కారము

(నిలబడాలి)

ఓం నమ: ప్రాచ్యై’ దిశై: యా శ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంతి ఏతాభ్య’శ్చనమోనమ: (తూర్పు దిక్కుకి
తిరిగి నమస్కరించాలి) (E)

ఓం ద’క్షిణాయై దిశై: యా శ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంతి ఏతాభ్య’శ్చనమోనమ: (దక్షిణం) (S)

ఓం నమ: ప్రతీ’’చ్యై దిశై: యా శ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంతి ఏతాభ్య’శ్చనమోనమ: (పడమర) (W)

ఓం నమ: ఉదీ’’చ్యై దిశై: యా శ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంతి ఏతాభ్య’శ్చనమోనమ: (ఉత్తరం) (N)
ఓం నమ: ఊర్ధ్వాయై’ దిశై: యా శ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంతి ఏతాభ్య’శ్చనమోనమ: (పైకి) (UP)

ఓం నమ: అధ’రాయై దిశై: యా శ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంతి ఏతాభ్య’శ్చనమోనమ: (కిందకి)


(DOWN)

ఓం నమ: అవాంతరాయై’ దిశై: యా యా శ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంతి ఏతాభ్య’శ్చనమోనమ:


(మూలలు) (turn)

35.ఋషి దేవతాది నమస్కారము

నిలబడాలి

ఓం నమో గంగా యమున యో ర్మధ్యే యే’ వసంతి, తేమే ప్రసననాత్మాన శ్చిరం జీవితం వ’ర్ధయంతి

నమో గంగా యమున యోర్మునిటభ్యశ్చ నమో నమో గంగా యమునయో  ర్మునిటభ్యశ్చ నమః’ |

సంధ్యా’యై నమ:’ | సావి’త్ర్యై నమ:’ | గాయ’త్ర్యై నమ:’ | 

సరస్వ’త్యై నమ:’ | సర్వా’’భ్యో దేవతాభ్యో నమ:’ |

దేవేభ్యో’’ నమ: | ఋషి’భ్యో నమ:’ |


ముని’భ్యో నమ:’ | గురు’భ్యో నమ:’ |

మా’తృభ్యో: నమ:’ | పితృ;భ్యో: నమ:’ | 

కామో2_కార్ షీ’’ న్నమో నమః  | మన్యురకార్ షీ’’ న్నమో నమః  ||

పృధి వ్యాప స్తేజో వాయు’ రాకాశాత్‌| 

ఓం నమో భగవతే వాసు’దేవాయ |

యాం సదా’ సర్వ’భూతాని చరా’ణీ స్థా వరా’ణి చ | 

సాయం’ ప్రాతర్న’మస్యంతి సామాసంధ్యా’ అభిర’క్షతు ||

36.దేవతా స్మరణము

శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే |

శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయం శివ: || 

యథా శివమయో విష్ణు: ఏవం విష్ణుమయశ్శివ: |

యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||

బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన: |

బ్రహ్మణ్య: పుండరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యుతః || 

నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ | 

జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ: ||

37.గాయత్రీ ప్రస్థా న ప్రార్ధన


ఉత్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వత మూర్ధ’ని | బ్రాహ్మ ణే’’ భ్యో 2_ భ్య’ను జ్ఞాతా గచ్చ దే’వి |

యథా సు’ఖమ్ | స్తు తో మయా వరదా వే’దమాతా ప్రచోదయన్తీ  పవనే’’ ద్విజాతా | ఆయు: పృధివ్యాం ద్రవిణం

బ్ర’హ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్  | | 

38.నారాయణ నమస్మృతి

నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే! 

సహస్రనా మ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమ:! 

39.భూమ్యా కాశ  (పితృ మాతృ) వందనము

ఇదం ద్యా’వాపృథివీ సత్య మ’స్తు । పిత ర్మాత ర్యది హో ప’బ్రు వే వా’’మ్ | 

భూతం దేవానాం’ అవమే అవో’భి : । విద్యా మేషం వృజనం’ జీరాదా’నుమ్ ||

ఆకాశాత్పతితం తోయం యథాగచ్ఛతి సాగరం | 

సర్వ దేవ నమస్కార: కేశవం ప్రతి గచ్ఛతి ||  

సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం |


తత్ఫలం పురుష ఆప్నోతి స్తు త్వాదేవం జనార్ధనం ||

వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్త్రయం! 

సర్వభూత నివాసోసి వాసుదేవ ! నమోస్తు తే! 

34.ప్రవర

[లేచి నిలువబడి రెండు చేతులను రెండు చెవులకు సమానముగా ఉంచి, ఈ క్రింది విధముగా తమ-
తమ గోత్ర ప్రవర, నామదికములను చెప్పుకొని రెండు చేతులు జోడించి అభివాదము
చేయవలయును]  

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య: శుభం భవతు! 

వైశ్వామిత్ర ఆగమర్షణ కౌశిక త్రయారుశేయ  ప్రవరాన్విత

కౌశిక సగోత్ర: 

అశ్వలాయన సూత్ర: 

శాకల ఋక్‌శాఖాయీ 
లక్ష్మి నరసింహా  రావు  శర్మా అహం భో అభివాదయే ||

॥ ఆచమ్య ॥ పురణాచమనం  కృత్వా,  తతః  స్మ్రు త్యాచమనం కృత్వా 

36.ఆచమనం
25. ఓం కేశవాయ స్వాహా ఉద్ధరిణితో కుడిచేతిలోకి నీటిని తీసుకొని మూడుసార్లు మంత్రం అంటూ త్రాగాలి  
26. ఓం నారాయణాయ స్వాహా
27. ఓం మాధవాయ స్వాహా

28. ఓం గోవిందాయ నమ: అని రెండు  చేతులని కడుగుకొనవలెను 

29. ఓం విష్ణవే నమ:

30. ఓం మధుసూదనాయ నమ:  అని అంగుష్ఠంముతో పైపెదవిని, తర్వాత క్రింది పెదవిని తుడుచుకోనవలెను 
31. ఓం త్రివిక్రమాయ నమ: 
32. ఓం వామనాయ నమ:,  అని శిరమున రెండు మార్లు నీళ్లు తలపైన చల్లు కోనవలెను 
33. ఓం శ్రీధరాయ నమ
34. ఓం హృషీకేశాయ అని ఎడమ చేతిపై నీరు చల్లు కోనవలెను 
35. ఓం పద్మనాభాయ నమ:   అని పాదాలు మీద నీరు చల్లు కోనవలెను 

36. ఓం దామోదరాయ నమ:  అని శిరస్సుపై నీరు చల్లు కోనవలెను 

37. ఓం సంకర్షణాయ నమ:  అని చేతివ్రేళ్ళను గిన్నేవలె చేసి వ్రేల్లమూలములతో గడ్డమును స్ప్రు శిమ్చావలెను 

38. ఓం వాసుదేవాయ నమ:  అని అంగుష్ట - తర్జనులతో ముక్కు ఎడమ,కుడి రంధ్రములను తాకవలెను 
39. ఓం ప్రద్యు మ్నాయ నమ:
40. ఓం అనిరుద్ధా య నమ:  అని అంగుష్ట - అనామికలతో నేత్రములు  ఎడమ,కుడి
41. ఓం పురుషోత్తమాయ నమ: తాకవలెను 

42. ఓం అధోక్షజాయ నమ:  అని అంగుష్ట - అనామికలతో ఎడమ,కుడి చెవులను తాకవలెను 


43. ఓం నారసింహాయ నమ:
44. ఓం అచ్యుతాయ నమ: అని అంగుష్ట - కనిష్టికలతో నాభిని తాకవలెను 
45. ఓం జనార్ధనాయ నమ:  అని అరచేతితో వక్షః స్థలమును తాకవలెను 

46. ఓం ఉపేంద్రాయ నమ:  అని కరాగ్రంముతో శిరస్సు తాకవలెను 

47. ఓం హరయే నమ:  అని ముకుళిత హస్తముతో కుడి,ఎడమ బహుమూలము(భుజము)లను తాకవలెను 


48. ఓం శ్రీ కృష్ణాయ నమ: 
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ: నమస్కారం - ఈ విధముగా ఆచమనము చేసిన యడల శ్రిమన్నరయనునితో సమానుదగును 

37.సమర్పణము
[కుడిచేతిలో జలమునుంచుకొని ఈ క్రింది శ్లోకమును పాట్టించి ఈశ్వరార్పనముగా పళ్ళెములో నీటిని
వదిలివేయవలెను]

యస్యస్మ్రు త్య చ నామోక్త్య  తపస్సంధ్యా క్రియాదిషు | 

నూన్యం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతమ్ ॥ 

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన | 

యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||

అనేనా ప్రాతః సంధ్యవందనేన భగవాన్ పర్వాత్మకః 


స్వరం శ్రీ పరమేశ్వరార్పణ మస్తు ॥ (అనుచు జలము వదలవలెను)

ఆబ్రహ్మ లోకా దాశేష దాలోకా లోక పర్వతాత్ | 

యే సంతి బ్రాహ్మణా దేవాః తేభ్యో నిత్యం నమోనమః ||

కాయేన వాచా మంసేన్ద్రి యెయ్ర్వ బుద్దా త్మనా వా ప్రకృతే: స్వభావాత్ 

కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణా యే  తి సమర్పయామి ॥ 

ఓం తత్సత్ సర్వం శ్రీ పర బ్రహ్మా ర్పణ మస్తు ॥ 


శ్రీ విష్ణవే నమః । శ్రీ విష్ణవే నమః । శ్రీ విష్ణవే నమః |।

॥ ఇతి ఋగ్వేద (త్రికాల) సంద్యోపాసనమ్  ||


End of Sandhyavandanam

You might also like