You are on page 1of 8

అంత్యప్రాసలు - 80 మధురగీతాలు / రాధ మండువ

అంత్యప్రాస అంటూ మీకు పజిల్ ఇచ్చిన సందర్భంగా ఈ ప్రాస గురించి కొంత చెప్పి నేను మీకు క్విజ్ లో ఇచ్చిన మాధుర్య ప్రధానమైన
పాటలు (నేను అనుకున్నవి) ఏవో మీతో చెప్పాలని ఈ పోస్ట్.
పాటకు పల్లవి ప్రాణం. ఈ మాట ఎంతమందో చెప్పగా విన్నాం. అయితే పాటకి అందం చందం మాత్రం ప్రాస అనే అనాలి. ప్రాస పాటకి
వన్నె తెస్తుంది. తెలుగు పాటలో ఈ ప్రాస కోసం ప్రాకులాడేవాళ్ళు పూర్వం నించీ... ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటి పాటలని కొన్నింటిని
చూస్తుంటే - 'ఎవరయ్యా తెలుగు నాశనం అయిపోయింది అని చెప్తోందీ?' అనాలనిపిస్తుంది.
*
శబ్దం పాటకి మాధుర్యం - శబ్దా లంకారాలను ఆరు రకాలుగా విభజించారు పండితులు.
రెండు లేక మూడేసి అక్షరాలు ఉన్న పదాలను మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తూ అర్థభేదంతో కాని తాత్పర్య భేదంతో కాని అందంగా
శబ్దా లంకారాలను ఉపయోగిస్తా రు
ఈ వర్ణవిన్యాసాన్ని అనుప్రాసము అని అంటారు. వీటి గురించి చూద్దాం
1 వృత్యాను ప్రాస : ఒకే హల్లు లేక వర్ణము అనేక సార్లు మరల మరల రావటాన్ని వృత్యాను ప్రాస అని అంటారు.
* అవునే తానే నన్నేనే నిజమేనే అంతా కథలేనే అమ్మో ఎన్నెన్ని వగలోనే, అబ్బ ఏమని చెప్పేనే, నీకేమని చెప్పేనే (పాట మొత్తం ఈ ప్రాసని
చూడొచ్చు)
చిత్రం - ఒకే కుటుంబం, రచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం - కోదండపాణి, గానం - సుశీల
https://youtu.be/nDhtlILHYig
2 ఛేకానుప్రాస : రెండు కాని అంతకంటే ఎక్కువగానీ ఉన్న హల్లు ల జంటలు అర్థభేదంతో మరల మరల రావటాన్ని ఛేకాను ప్రాస
అంటారు.
కాళింది మడుగున కాళియుని పడగల ఆబాల గోపాల మాబాల గోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి
రేపల్లియ||
చిత్రం - సప్తపది, రచన - వేటూరి, సంగీతం - కెవి మహదేవన్, గానం - సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
https://youtu.be/Q8OKmT0-i-s
3 లాటానుప్రాస : అర్థము ఒకటే అయినా తాత్పర్య భేదంతో ఒకే పదం వెంట వెంటనే రావటాన్ని లాటానుప్రాస అని అంటారు.
* ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది
చిత్రం : అగ్గి పిడుగు, సంగీతం : రాజన్-నాగేంద్ర, సాహిత్యం : సినారె, గానం : ఘంటసాల, జానకి
https://youtu.be/PbuuA4GFG7U
4 యమకం : రెండు కాని అంతకంటే ఎక్కువ అక్షరాలున్న పదాలు అర్థభేదంతో మరల మరల రావటాన్ని యమకం అని అంటారు.
* నువ్వు వస్తా వని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా, నువ్వు వస్తా వని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా, వేణువు
విందామని, నీతో వుందామని నీ రాధ వేచేనయ్యా రావయ్యా.
చిత్రం : మల్లెపువ్వు, సంగీతం : చక్రవర్తి, రచన : ఆరుద్ర, నేపధ్య గానం : వాణీజయరాం.
https://youtu.be/w2XGhjiJGHw
5 ముక్త పదగ్రస్తం : మొదటి పాదంలోని చివరి పదం, రెండవ పాదంలోని మొదటి పదంగాను, రెండవ పాదం లోని చివరి పదం మూడవ
పాదం మొదటి పదంగాను , మూడవ పాదంలోని చివరి పదం నాల్గవ పాదం మొదటి పదంగాను వస్తే ముక్త పదగ్రస్తం అంటారు.
* గోదారీ గట్టుందీ, గట్టు మీద చెట్టుందీ, చెట్టు కొమ్మన పిట్టుందీ, ఆ పిట్ట మనసులో ఏముందీ...
చిత్రం - మూగమనసులు, రచన - దాశరథి, సంగీతం - కెవి మహదేవన్, గానం పి సుశీల
https://youtu.be/cMg_uUaY7rE
6 అంత్యప్రాస : ప్రతి పాదం చివరి భాగంలోని పదం ఒకే అక్షరం తో అంతమవడం అంత్యప్రాస.
***
ఇక ఇప్పుడు వరసగా నేను ఇచ్చిన పాటల క్విజ్ కి - నేను అనుకున్న పాటలూ, ఇంకా మీరు ఇచ్చిన కొన్ని మంచి పాటలతో కలిపి కింద
ఇచ్చాను.
# 1 ట్టు -
1) సరదా సరదా సిగిరెట్టు , ఇది దొరల్ తాగు భల్ సిగిరెట్టు , పట్టు పట్టి ఒక దమ్ములాగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు , కంపుకొట్టు ఈ
సిగిరెట్టు , దీన్ని కాల్చకోయి నాపై ఒట్టు
https://youtu.be/E_ODm_JQLkw
2) అట్టు అట్టు పెసరట్టు , ఉల్లిపాయ పెసరట్టు , ఉప్మాతో జత పెట్టు , చట్నితోటి కలేసి కొట్టు
https://youtu.be/zBf8E5uVV1g
3) కలలో పెట్టని ముద్దు లు పెట్టు , కరిచే గాలికి కౌగిలి పట్టు , కసిగా కలవకపోతే ఒట్టు , కంచెలు దాటిన ప్రేమను తిట్టు
https://youtu.be/s5fNPqRc8m8
**
# 2 లే -
4) తెలిసిందిలే, తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే, చలిగాలి రమ్మంటు పిలిచిందిలే, చెలిచూపు నీ పైన నిలిచిందిలే ( పాట మొత్తం
'లే' ఉంటుంది)
https://youtu.be/7njBOrk3Vsc
5) భలే చాన్సులే, భలే చాన్సులే, భలే చాన్సులే లల్లలాం లల్లలాం భలే చాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలుసునులే
https://youtu.be/fxs-yaHKuB8
6) నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే, పూవులేక తావి నిలువ లేదులే, లేదులే
https://www.youtube.com/watch?v=bN6nRqVORy8
7) అన్నీ మంచి శకునములే, కోరిక తీరే దీవెనలే, మనసున మంగళ వాద్యమహా మోగెలే, నా వలె నా బావ కూడా నాకై తపములు
చేయునులే
https://www.youtube.com/watch?v=ggtGs0vGU70
8) విన్నానులే ప్రియా, కనుగొన్నానులే ప్రియా, మిసిమి వయసు గుసగుసలన్ని కొసరి విన్నానులే, విన్నానులే ప్రియా. ఎదను దాచిన మౌన
వీణ కదలి మ్రోగెనులే, ఆ మధుర రాగాలలో నీవె ఒదిగి ఉన్నావులే, ఒదిగి ఉన్నావులే
https://youtu.be/-Y5S3R-lcd8
9) ఉన్నదిలే దాగున్నదిలే, నీ కన్నుల ఏదో ఉన్నదిలే, అది నన్నే కోరుకున్నదిలే, ఈ వెన్నెలలో సై అన్నదిలే
https://youtu.be/EAv2buLXZkY
**
# 3 నై -
10) ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
https://youtu.be/yG8l1v0nj-w
**
# 4 వో -
11) రంగులలో కలవో, ఎద పొంగులలో కళవో, నవశిల్పానివో, రతిరూపానివో, తొలి ఊహల ఊయలవో
https://youtu.be/zQ9Q3Gc0E-8
12) ఎవరివో, ఎవరివో నీవెవరివో, ఎవరివో, ఎవరివో, నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రాణివో
https://youtu.be/sK24ehMf-as
**
# 5 వ్వు -
13) సిరిమల్లే పువ్వల్లె నవ్వు, చిన్నారిపాపల్లె నవ్వు, చిరకాలముండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు
https://youtu.be/6bGOWqQOycM
14) చిన్నారి పొన్నారి పువ్వు, విరబూసి విరబూసి నవ్వు, మన ఇంటి పొదరింటి పువ్వూ, నిను చూసి నను చూసి నవ్వూ
**
# 6 ది -
15) ఈరేయి తియ్యనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది
https://www.youtube.com/watch?v=AjGFFP6c4Eg
16) ఏమో, ఏమో ఇది, నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
https://www.youtube.com/watch?v=PbuuA4GFG7U
17) గోదారీ గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, ఆ పిట్ట మనసులో ఏముంది?
https://youtu.be/cMg_uUaY7rE
18) నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది, రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లింది,
దీనురాలి గూటిలోన దీపంలా వెలిగింది
https://youtu.be/fgmx0Q887RI
19) గుట్టమీద గువ్వ కూసింది, కట్టమీద కముజు పలికింది, గుడిలోన జేగంట మ్రోగింది, నా గుండెలో తొలివలపు పండింది
https://youtu.be/J8-mLHAtOEo
**
#7 నా -
20) అంతా భ్రాంతియేనా, జీవితానా వెలుగింతేనా, ఆశా నిరాశేనా, మిగిలేది ఇంతేనా
https://youtu.be/VjRNxntTFN8
21) నీవేనా... నీవేనా నను తలచినది, నీవేనా నను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది
https://youtu.be/HS5k195SEFQ
22) చక్కని దానా, చిక్కని దానా, ఇంకా అలుగేనా, నీ మాయలన్నీ చాలించు నాతోనా
https://youtu.be/Zq_WxJQN33M
23) నువ్వేనా, సంపంగి పూవుల నువ్వేనా, జాబిలి నవ్వుల నువ్వేనా, గోదారి పొంగుల నువ్వేనా..
https://youtu.be/zZaRxzhqfrw
**
# 8 దా -
24) జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా, నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా
https://youtu.be/SIx5cCTHcXQ
25) తుమ్మెదా, ఓ తుమ్మెదా, ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా, మగడు లేనివేళ తుమ్మెదా, వచ్చి మొహమాటపెడతాడె తుమ్మెదా
https://youtu.be/r7Jvg2Nc3G4
**
# 9 రా -
26) నిను చేర మనసాయెరా, నా స్వామి తనువార దయచేయరా, విడిదికి రమ్మని చాల వేడితిరా, బిడియము నీకేలరా దొరా
https://youtu.be/XDmwW583_3o
27) రారా కౌగిలి చేర రారా దొరా, ఈ రంగేళి ప్రాయమ్ము నీదేనురా
https://youtu.be/r1Yq3ocrYE8
28) రారా కనరారా కరుణమాలినారా ప్రియతములారా
https://youtu.be/VtRcN5bHxT8
29) కన్నారా కళ్ళారా కన్నె కలల్లా రా గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తు పట్టినారా
https://youtu.be/-zT4BOu6O9s
30) పిలచిన బిగువటరా ఔరా పిలచినా బిగువటరా ఔరౌరా చెలువలు తానె వలచి వచ్చినా పిలచిన బిగువటరా భళిరా రాజా
https://youtu.be/QPw96StPG9k
31) మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథలే విన్నారా
https://youtu.be/IkBJBQgo0n4
**
# 10 లా -
32) తేటతేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా కలకలా గలగలా
https://youtu.be/5eLP693mWKo
33) వినవే బాల నా ప్రేమ గోల నిను గను వేళ నిలువగ జాల వినే బాల నా ప్రేమ గోల
https://youtu.be/caFrXnFtB8c
34) ఓహో మేఘమాలా నీలాల మేఘమాల చల్లగా రావేలా మెల్లగ రావేలా మెలమెల్లగ రావేల ఈ లీల దుడుకుతనమేలా ఊరుకోవే
మేఘమాలా ఉరుముతావేలా మెరవగానేలా
https://youtu.be/GBPzb_YYO5E
**
# 11 లి -
35) ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి ఈ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి
https://youtu.be/vTIuppxVRh0
36) హే పరుగులు తీయ్యాలి ఓ గిత్తలు ఉరకలు వేయ్యాలి హే బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి ఓ
హోరు గాలి కారు మబ్బులు ముసిరేలోగ మూసేలోగ ఊరు చేరాలి మన ఊరు చేరాలి
https://youtu.be/Hbevvl5HKPY
**
# 12 - వే
37) నాలోని రాగమీవే నడయాడు తీగవీవే పవళించెలోన బంగారు వీణ పలికించ నీవు రావే, నెలరాజువైన నీవే చెలికాడవైన నీవే
చిరునవ్వులోన తొలిచూపులోన కరగించి వేసినావే
https://youtu.be/hxJnqeV_trc
38) సిరిమల్లె వీవే విరిజల్లు కావే వరదల్లే రావే వలపంటే నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
https://youtu.be/rw99Be_Wia8
39) చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే చలువ చందనములు పూయ చందమామ రావే జాజిపూల తావి నీయ
జాబిల్లి రావే కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే గగనపు విరితోటలోని గోగుపూలు తేవే
https://youtu.be/5oLjJ7fqrS8
**
# 13 ను -
40) నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు
https://youtu.be/KhKRuHPiSqQ
41) ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును ఈ ఇలవేల్పును
https://youtu.be/svLivn_91EU
**
# 14 నే
42) అవునే తానే నన్నేనే నిజమేనే అంతా కథలేనే అమ్మో ఎన్నెన్ని వగలోనే అబ్బ ఏమని చెప్పేనే నీకేమని చెప్పేనే
https://youtu.be/nDhtlILHYig
43) నేనే రాధనోయి గోపాల నేనే రాధనోయి గోపాలా నేనే రాధనోయి అందమైన ఈ బృందావనిలో నేనే రాధనోయి అందమైన ఈ
బృందావనిలో నేనే రాధనోయి గోపాలా నేనే రాధనోయి
https://youtu.be/DB0MEJjeZvU
**
# 15 అంట – అంటావ్
44) అహ నా పెళ్లి అంట ఓహో నా పెళ్లి అంట నీకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్
https://youtu.be/6l80YC1dcFA
45) కోదండరాముడంట కొమ్మలాల వాడు కౌసల్య కొమరుడంట అమ్మలాల ఆజానుబాహుడంట అమ్మలాల వాడు అరవింద నేత్రు డంట
కొమ్మలాల
https://youtu.be/eUS08Q1ALzI
46) ఏమంట వేమంట వోయి బావా ఈ మాట కేమంటా వోయి బావా నువ్వు నా మాటకేమంటా వోయి బావా ఔనంట ఔనంట నోసి
పిల్లా నీ మాటకవునంటా నోసి పిల్లా నువ్వు ఏమన్నా సై అంటా నోసి పిల్లా
https://youtu.be/mmywoUMQ4Mc
**
# 16 రాం / రం
47) సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం పైన పటారం లోన లొటారం ఈ జగమంతా డంబాచారం
https://youtu.be/eBLb4NFmgww
48) ముద్దు కే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం
https://youtu.be/Zgzf6mPjWM8
49) సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం మనసున్న మందారం మనిషంత బంగారం బంగారు
కొండయ్యంటే భగవంతుడవతారం
https://youtu.be/rinvJFK8WS8
50) శనివారం మేము పనివారం ఆదివారం మేమూ ఆడువారం వారం వారం సంసారం వంతుల మీద కాపురం
https://youtu.be/pR1VLBCMIY0
**
# 17 మ్మా -
51) కంచికి పోదామా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా కంచిలోన ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
https://youtu.be/8fntboGbo5g
52) నవ్వులు రువ్వే పువ్వమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా పువ్వమ్మా ఉన్న నాలుగు నాళ్ళూ నీలా ఉండిపోతే
చాలమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా పువ్వమ్మా
https://youtu.be/sLH9noWaUIM
53) రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా రాధమ్మా పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
https://youtu.be/J3_TC-TjX6g
54) పంచదార బొమ్మా బొమ్మా పట్టు కోవద్దనకమ్మా మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టు కోవద్దనకమ్మా చేతినే తాకొద్దంటే చెంతకే
రావొద్దంటే ఏమవుతానమ్మా నిను పొందేటందుకే పుట్టా నే గుమ్మా నువ్వు అందక పోతే వృథా ఈ జన్మా
https://youtu.be/qTE453yc1rc
55) దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మా నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మా దాయి దాయి దామ్మా పలికే గండు
కోయిలమ్మా నీపై మనసైందమ్మా నా నిండు చందమామా
https://youtu.be/wH6-lYls3bI
**
# 18 - మ్ము
56) ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము, ఈ లవ్వనేది బబులు గమ్ము, అంటుకున్నాదంటే పోదు నమ్ము, ముందు
నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము,
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమనాపలేవు నన్ను నమ్ము
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టు కుంటివే
https://youtu.be/aRGaUZm1_Zg
57) నీలో ఉంది దమ్ము నాలో ఉంది సొమ్ము దమ్ము సొమ్ము ఏకం చేసి దులిపేద్దాం దుమ్ము దమ్ము దం దంత దం దం దమ్ము దమ్ము
https://youtu.be/SwIfKCBxhx4
**
# 19 లో -
58) సిగలో అవి విరులో అగరుపొగలో అత్తరులో మగువా సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో సిగలో అవి విరులో
https://youtu.be/yn47nsTyU1A
59) చీకటిలో కారుచీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏ దరికో ఏ దెసకో
https://youtu.be/TIFrENwR57M
60) చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో పలికెనులే హృదయాలే తొలివలుపుల కలయికలో వసంతాలు దోసిట దూసి విసిరేను
నీ ముంగిలిలో, తారలనే దివ్వెలు చేసి వెలిగింతు నీ కన్నులలో, నీవే నా జీవనాడిగా ఎగిసేను గగనాల అంచులలో
https://youtu.be/728gpo_ZhJs
61) మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు అవునా? తోటలో ఏముంది నా మాటలో
ఏముంది తోటలో మల్లియలు నీ మాటలో తేనియలు
https://youtu.be/tC3Wmxx1WpI
**
# 20 యే -
62) సన్నగ వీచే చల్ల గాలికి కనులు మూసినా కలలాయే తెల్లని వెన్నెల పానుపు పై ఆ కలలో వింతలు కననాయే అవి తలచిన ఏమో
సిగ్గాయే కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే
కనులు తెరచినా నీవాయే
https://youtu.be/JlMsatkdY9I
63) కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే మనసే పూల మండపమాయే
https://youtu.be/1DJnlqrw0gE
**
#21 వురో
కొడకా కోటేశ్వరరావు కరుసయిపోతవురో
https://youtu.be/0vV36TV0oms
**
# 22 కో -
64) కో అంటే కోయిలమ్మ కో కో, కో అంటే కోడిపుంజు కోక్కొరొకో కొండ మీద కో అంటే చుక్కలన్నీ కోసుకో నేలమీద కో అంటే పండింది
కోసుకో కోసుకో
https://youtu.be/unTqMeeU6hU
65) అందమైన మనసులో ఇంత అలజడెందుకో తీయనైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
https://youtu.be/uPR24ITeFbU
**
# 23 ళ్ళు / లు
66) నీ కాళ్ళని పట్టు కు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకు కావలి కాస్తా యె
కాటుకలా నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్ నెట్టేస్తె ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమనా
https://youtu.be/OCg6BWlAXSw
67) చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు ముద్దు గ ముద్దు గ వినవలెగా నా ముద్దు విన్నపాలు
https://youtu.be/EDGiGY2ZNws
68) సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు ఏకమైనా చోట
వేదమంత్రాలు
https://youtu.be/1MWtN95lWz8
69) పదములె చాలు రామా నీ పద ధూళులే పదివేలు నీ పదములె చాలు రామా.. నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొనే ఈ
జగమేలు
https://youtu.be/E5iSQrDGPD4
https://youtu.be/qdngQzuPnl4 (కెబికె మోహన్ రాజు గారు పాడినది)
70) అబ్బో నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు పులుపెక్కే పోకళ్ళు కైపెక్కే ఆ కళ్ళు లేలేత కొబ్బరి నీళ్ళు, అమ్మో గులాబి
ముళ్ళు అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబి ముళ్ళు ఎరుపెక్కే చెక్కిళ్ళు ఎదలోన ఎక్కిళ్ళు కోరేది కొబ్బరి నీళ్ళు
https://youtu.be/dCm_-tVMmv0
71) ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు, ఝల్లు ఝల్లు ఝల్లు న ఉప్పొంగు నింగి ఒళ్ళు, నల్లమబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు ,
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు
**
# 24 న్నో
72) స్వరములు ఏడైనా రాగాలెన్నో హృదయం ఒకటైనా భావాలెన్నో అడుగులు రెండైనా నాట్యాలెన్నో అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో
https://youtu.be/uTsk2N4XuPU
**
# 25 త్రం -
73) చిత్రం! అరె భళారేమి చిత్రం!చిత్రం! అయ్యారేమి చిత్రం! ఈ రాచనగరుకి రారాజుని రప్పించుటేమి చిత్రం!! పిలువకనే ప్రియ విభుడే
విచ్చేయుటేమి చిత్రం!!!
https://youtu.be/caTTYSOQRt8
74) చుక్కలుపాడే శుభమంత్రం దిక్కులునిండే దివ్యమంత్రం ఎక్కడనో ఎపుడో ఎవరో పలికిన వేదమంత్రం ఇక్కడనే ఇపుడే ఎవరో నా
చెవిలో ఊదిన మంత్రం మధుమంత్రం
https://youtu.be/4AJ7-1Xx0Qo
**
# 26 దం -
75) కన్నులకు చూపందం కవితలకు ఊహందం చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం
https://youtu.be/rqqZNWbOK3o
76) ఈ పాదం ఇలలోన నాట్యవేదం ఈ పాదం నటరాజుకే ప్రమోదం కాల గమనాల గమకాల గ్రంథం ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం...
https://youtu.be/OX9oy3HbG7A
77) ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్వపాదం ప్రణవ మూల నాదం
https://youtu.be/C-9_GwQB6es
***

You might also like