You are on page 1of 133

“ ఏడో చేప .....

” - చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి
రాజధానిలో గగ్గో లు గా ఉంది,

పిల్లా పెద్దా , పీచు పిడక , కుక్క మేక


సమస్త ప్రా ణులు వల్ల కానంత గగ్గో లు గా
ఉన్నారు . ఇలా ఎందుకు జరిగిందో
ఎవరికీ తెలియదు. ఈ అనుభవం
ఎవ్వరికీ లేదు అందుకే బాహాటం గా
కాకుండా అందరూ లోపల్లో పల
గోణుక్కుంటున్నారు.

మూలనున్న ముసలమ్మలు కలికాలం


వచ్చేసిందే అంటూ నిట్టు రుస్తు న్నారు,
అక్కడక్కడ పోయిన వారు పోగా
మిగిలిన ముసలయ్యలు ‘ ఏమే కాస్త టీ
ఇస్తా వా ‘ అనే ధైర్యం కూడా లేక
నిస్సత్తు వగా కూర్చుని ఉన్నారు .
యువసామాన్యం నాయకుల వైపు
చూస్తు న్నారు , నాయకగణం మేధావుల
వైపు చూస్తు న్నారు . మేధావులు కళ్ళు
కళ్ళు కలుపుకొని , మనస్సులోని దిగులు
ని బయట పెట్ట కుండా గంభీరంగా
ఉంటున్నారు. మధ్య వయస్సు వాళ్ళు
వాళ్ళతోనూ వీళ్ళతోనూ కలవలేక
మల్ల గుల్లా లు పడిపోతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు యధాప్రకారం పనిచేస్తు న్నారు , వ్యాపారులు సరుకు ఎంత ఉందీ? తెచ్చి స్టా క్ పెట్టు కుంటే
నయమేమో అని, పద్దు లు పెట్టేవారికి మొహమాటం లేకుండా బాకీలు అడగటం మొదలు పెట్టా రు. శాంతి
భద్రతలు చూసుకునే వారు వారి వారి సిబ్బందికి శలవులు రద్దు చెయ్యాలా ఉన్న సిబ్బంది తో సర్దు కుందామా
అని ఆలోచనల తో సతమతమవుతున్నారు.ప్రభుత్వ వ్యతిరేక బృందాలు నిశ్చేష్ట తో నిలిచి పోయి ఉన్నాయి .
ఇదేమి సామాన్యమైన సంఘటనేమీ కాదు .

మంత్రి గారి ఇంట్లో విషయం తెలిసినా అంతా సాధారణం గా నే ఉంది. రోజూ లాగానే మంత్రి గారు బ్రా హ్మీ
ముహూర్త సమయం లో లేచి కాలకృత్యాలు ముగించుకొని , ఓళ్ళు వంచి వ్యాయామం చేసుకొని , స్నాన
పానాదులు ముగించుకొని మెల్లిగా దైనందిన రాచకార్యాలకు ఉపక్రమించారు. ఈ అరాచకం ఆయన దృష్టికి
నిన్ననే వచ్చింది , ఎన్నో ఏళ్ళుగా ఆయన మంత్రి గా ఉన్నారు. ఈ రాజుగారికి ముందు ఎందరో రాజుల
పాలనలో ఆయన మంత్రి గా పని చేసిన అనుభవం ఉండి కూడా , ఆయనకు అయోమయం గా వుంది ఇది
ఎలా సాధ్యం . ఇలాగే చూస్తూ ఉరుకుంటే రేపు తన పరిస్థితి , తన అధికార ప్రా భవం, తన హోదా ఇవన్నీ
ఎటుపోవాలి?. ఇట్లా అయితే కష్ట ం . ఈ రాజుని గద్దె దింపాల్సిందే లేక పోతే ఏకు మేకై నిలిచిపోతాడు అని
ఆలోచించి, సమావేశాన్ని జరపాలి అని విపక్షీయులకు సలహా కూడా ఇచ్చాడు. రహస్య మంతనాలు జరపాలి
ఇది ఆయన మనస్సులోని ఆలోచన. ప్రభుత్వ వ్యతిరేకుల్ని అందరిని ఏకం చెయ్యాలి. ఇట్లా మనసులో
సతమతమయిపోతూ ఉన్నా , ప్రస్తు త బాధ్యతలను పక్కకు పెట్టె పిచ్చి పని చేయలేదు. యధాప్రకారం
కార్యాలయానికి బయలుదేరారు , ప్రభుత్వం ఎవరిదైనా కట్ట ప్ప లాగా ఆయన రాజ్యానికి కట్టు అధికారి.
ఆయనకు అధికారం ఇచ్చే గర్వం మాత్రం చాలు .

‘ అయ్యా వాహనం సిద్ద మండీ ‘ సేవకుడు వచ్చి చెప్పాడు. తలెత్తి చూశాడు మంత్రి , సేవకుడు వినయంగా
నిలుచున్నాడు .

‘ ఏమోయ్ రంగన్నా , ఏమిటి రాజ్యం లో విశేషాలు’

‘ తమకు తెలియని విశేషాలు నాకేమి తెలుస్తా య్ అయ్యగారు’

‘ భలే వాడివే, నాకు విషయాలు తెలీయక కాదు , ప్రజలు ఏమనుకొంటున్నారో అని ‘

నర్మగర్భంగా నవ్వాడు ...రంగన్న మాత్రం సామాన్యుడేమీ కాదు, మంత్రి గారికి చీఫ్ సేవకుడు అతనికీ అన్ని
విషయాలు తెలుస్తూ నే ఉన్నాయి , అతనికి అంత ఆందోళన గానే ఉంది కాని మరి అనుభవం ఇచ్చిన
సంయమనం మరి, అంత త్వరగా బయటపడే పరిస్థితి కాదు . ఆచి తూచి అడుగెయ్యాలి అది అత్యవసరం.

‘ అదేనండి తమరి దృష్టి కి వచ్చిన విషయమే అందరూ చర్చిస్తు న్నారండి ‘..... వినయంగా చెప్పాడు .

మంత్రి గారికి అర్ధ ం అయింది రంగన్న ఇంతకంటే పెద్ద గా బయట పడడని. అయన అనుభవం లో లేని సమస్య
అయ్యే సరికి ఆయనకు ఏమి తోచడం లేదు అట్లా అని అందరిలాగా బయట పడ నూ లేడు. ఇదొక మాయ గోల
, పదవి ఇచ్చే డోల . చూద్దా ం కాలమే సమాధానం చెబుతుంది అన్న నిశ్చయానికి వచ్చేశాడు . మెల్ల గా లేచాడు
ఒక నిశ్చయం చేసుకున్న వాడిలా అడుగులు వేశాడు తన వాహనం వైపు . ‘ పోనియ్యి ‘ సారధి కి చెప్పాడు
రహదారులన్నీ ఖాళీ గా ఉన్నాయి. కేవలం యుద్ధ ం జరిగేటప్పుడే ఇలాంటి ఖాళి కనిపిస్తు ంది . ‘ నిజమే ఇది
యుద్ధ ం లాంటి పరిస్థితే ‘ మంత్రి గారి మనస్సులో అనుకున్నాడు . అక్కడక్కడా కనిపిస్తు న్న ప్రజలలో కూడా
అంత ఉత్సాహం ఏమి కనిపించడం లేదు. రోడ్డు పక్కన పడుకున్న కుక్కలు కూడా దిగులు గానే
కనిపిస్తు న్నాయి. కాకులు కూడా ముక్కులు చెట్ల కి పూసుకుంటూ నిరాశగా ఉన్నాయి . ప్రకృతి కూడా ఇంత
దిగులు గా ఉందేమిటీ విరక్తిగా నవ్వుకున్నాడు . తన కార్యాలయానికి చేరుకున్నాడు . విచిత్రంగా తన
కార్యలయమంతా హడావిడి గా ఉందీ.అర్ధ ం కాలేదు మంత్రి గారికి . భటుడు నమస్కారం చేశాడు

‘ రాజు గారు మన కార్యాలయానికి వచ్చారండి ‘ ఉత్సాహంగా చెప్పాడు . వీడొకడు వీడికి ఏది చూడు
ఉత్సాహమే . రాజు గారు నా కార్యాలయానికి రావటం ఏమిటీ ,ఆయన కి ఏమి అర్ధ ం కాలేదు. ఆయన జీవిత
కాలం లో రాజు గారి దగ్గ రికి తాను వెళ్ళడమే గాని రాజు గారు తన కార్యాలయానికి రావడం ఎప్పుడూ
జరగలేదు. హడావిడి గా అడుగులు వేశాడు.

‘ రండి రండి మంత్రి గారు ....మీ కోసమే చూస్తు న్నాము ‘

నవ్వుతూ ఎదురొచ్చారు రాజు గారు . రాజు గారు చక్కటి నవ్వుతో ఉంటారు . ఆయన కళ్ళు మాత్రం తీక్షణం
గా మనిషి మనస్సుని చదువుతాయి. ఆయన సమక్షం లో సామాన్యమైన వ్యక్తి కూడా ఎంతో ప్రభావవంతుడై
కనిపిస్తా డు . ఆయన మాటల కంటే చేతల మనిషిగా పేరు సంపాయించుకొన్నాడు. ఆయన సమక్షం లో ప్రతీ
వ్యక్తీ ఉత్తెజితుడవుతాడు.

“ నమస్కారం ... ఏమిటీ ఈ ఆకస్మిక పర్యటన , మహారాజా ? నా మీద ఏమన్నా విచారణా ??” నవ్వుతూనే
తన అక్కసు వెలిబుచ్చాడు .
“ మీమీద ఏమన్నా ఆరోపణ వస్తే విచారణ కూడా చెయ్యాలా ........” నవ్వాడు రాజుగారి తో పాటు ఉన్న
సేనాధిపతి ...కోపం గా చూశారు మంత్రి గారు , ఏదో పదవి హోదా మీద మోజే గాని ఆయన ఎప్పుడు కక్కుర్తి
పడలేదు. సర్దు కున్నాడు సేనాధిపతి ఆయనకు మంత్రి గారంటే వ్యతిరేకత ఏమీ లేదు , కేవలం రాజు గారు
అంటే వల్ల మాలిన అభిమానం అంతే.

“ అయ్యో మీమీద విచారణ ఎందుకు చేస్తా ం మంత్రి గారు ? నేనే ఉరికే అందరి కార్యాలయాలు దర్శిద్దా ం అని
...” ఇదిగో ఇలా బయలుదేరాను నవ్వుతూ చెప్పారు రాజు గారు ... సంజాయిషీ ఇచ్చినట్టు అనిపించినా ...
ఆయన మాటలలో ఒక స్నేహం ఉంది .

‘ క్షమించండి మహారాజ ఏదో పరాకులో...’ సర్దు కున్నారు మంత్రి గారు. కార్యాలయం అంతా అప్పటికే రాజు
గారు చుట్టే సి ఉన్నారు . మంత్రి గారు వస్తే మాట్లా డదాము అని, కొన్ని విషయాలను రాజు గారు
నిర్ణయించినట్టు కనిపించింది .

‘ మంత్రి గారు ఇంతకు ముందు ఎలా జరిగిందో నాకు అనవసరం , నాకు ఉన్న ప్రణాళిక మీముందు పెట్టా ను ‘
దానికి తగ్గ ఆలోచనలు చేసి, సూచనలు ఏవన్నా ఉంటే చెప్పండి ‘ అంటూ లేచారు రాజు గారు . ఆయన
వచ్చిన పని అయిపొయింది . బయలుదేరటానికి సిద్ద పడుతున్నారు . మంత్రి గారికి అప్పుడు తెలివి వచ్చింది .

‘ మహారాజా ఒక చిన్న సందేహం , ఇది కర్ణా కర్ణి గా నేను విన్నదే , అయితే మీ నోటినుంచి ఒక్కసారి అది
నిజమో కాదో విందామని ‘ సంకోచిస్తూ నే అడిగారు మంత్రి గారు.

‘ అడగండి మీకు సంకోచం దేనికి ......? ‘ భరోసాగా చెప్పారు రాజు గారు .

‘ నేను మంత్రిని కాబట్టి , నా బాధ్యత కాబట్టి అడుగుతున్నాను. ఇందులో ఎటువంటి కుట్రా కుతంత్రం లేదు
మీరు దయచేసి మనసులో పెట్టు కుని నాకు సమాధానం ఇవ్వండి ‘ నిజాయితీ గా అడిగారు మంత్రి గారు .
వాతావరణం గంభీరం గా మారింది. రాజు గారి అంగరక్షక దళం అప్రమత్త మైంది . అంతటా నిశ్శబ్ద ం అందరి
దృష్టి రాజు గారి మీదే .

‘ అసలు ఏమి జరిగింది ఏమిటి మీ సందేహం ‘ అడగండీ అనునయంగా అన్నారు రాజు గారు . ఇప్పుడు
అందరి దృష్టి మంత్రి గారి మీద . అయన లిప్త పాటు తటపటాయించారు. రోట్లో తలపెట్టి భయపడితే
కుదురుతుందా.

‘ రాజ్యం అంతా ఇదే విషయం గా గగ్గో లు ఎత్తి పోతోంది ... ‘ కాస్త సేపు గట్టిగా ఉపిరి తీసుకున్నారు కళ్ళెత్తి
రాజు గారి వైపు చూసి మళ్ళా తల దించుకుని అడిగారు

“ ఏడో చేప కూడా ఎండిందీ అని ...........” విచిత్రంగా ఆయన మాటలు ఆయనకే సరిగ్గా వినిపించలేదు
అందుకని ఇంకొంచం స్పష్ట ంగా మళ్ళా అన్నారు “ ఏడు చేపలు ఎండ పెడితే ... ఏడు చేపలూ ఎండినాయట
నిజమేనా ... “

కాసేపు మౌనం రాజ్యమేలింది , రాజు గారు అందరినీ గమనించి చూసారు . అందరి మొహాల్లో ఆదుర్దా రాజు
గారి సమాధానం ఏమిటో అని . రాజు గారి మొహం లో ముందు చిరునవ్వు మొలకెత్తింది , తరువాత అది సరి
నవ్వుగా మారింది.

“ ఇందులో సందేహం ఏమి ఉంది ? చేపలు ఎండ పెడితే ఎండవా ? ...ఎండాయి రాజకుమారులు తెచ్చిన ఏడు
చేపలు ఎండాయి ... నిస్సందేహంగా ఎండాయి ... దీంట్లో విడ్డు రం ఏమి వుంది రాజ్యం గగ్గో లు పుట్ట టానికి
ఏమంత విషయం ఉంది ...? ... ఏదో జరిగి పోయిందని నేను కొంచెం అనుమానపడ్డా ను, సరే నేను
బయలుదేరుతాను “ అంటూ సిద్ద ంగా ఉన్న తన వాహనం ఎక్కి వెళ్ళిపొయ్యారు . ఆయన తో బాటు ఆ
రాజ్యాన్ని , ఆ రాజ్య ప్రజానీకాన్ని , ఆ రాజ్యసంపదను కాపాడే నిస్వార్ధ బలగం అంతా రేపటి వైపుకు అడుగు
వేసింది .

ఒక్క చేపన్నా ఎండకుండా ఉంటె కదా మొత్త ం కధ నడిపి చీమల పుట్ట ని . గడ్డిదుబ్బు ని చూపించి , ఆవుల్ని ,
పశువుల కాపరులని , చంటి బిడ్డ ల్ని విచారణ చేసే నెపం తో కాస్త వెనక్కి వేసుకోవడం ....ఇహ ఇట్లా అన్ని
చేపలూ ఎండిపోతే ఇక మాకు దిక్కేంటి అని శత్రు రాజుల దగ్గ రకు రాయబారాలు మొదలైనాయి .

అన్ని చేపలు ఎండటం తో సామాన్య ప్రజలు కూడా తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది అని పాత
కధను కంచికి పంపించేశారు . పదండి మనం ఇంటికి వెళ్దా ం.

నీకు అంగీకారమైతే... - శింగరాజు శ్రీనివాసరావు


Object 1

మధూ,
ముందు
ఎటువంటి
ఉపమాన
సంబోధన
లేదేమిటి

అనుకున్నావా.. ఏమని వ్రా యను? ఏ పోలికకూ అందనంత ఎత్తు లో వున్న నిన్ను వేటితోనో పోల్చి తక్కువ
చేయలేను. నీ పరిచయం కాకతాళీయమని అనుకోలేను. విధాత నాకోసమే నిన్ను మలచి నా దగ్గ రకు
పంపాడేమో అనిపిస్తు న్నది. నిన్ను కలిసే వరకు నాకూ ఒక మనసుందని తెలియలేదు. బ్రతుకులో బాధ్యతలే
తప్ప ప్రేమ, అనుబంధాలు లేవనుకున్న నాకు నీ పరిచయం సరికొత్త ఆలోచనలకు తెరలేపింది. మొదటిసారి
నిన్ను చూసిన వేళ తొలిచూపు బాణం నాటుకోలేదు. నువ్వు అందమైనదానివో కావో నేను నిర్ణయించలేను.
కారణం నేను నీలో అందాన్ని చూడలేదు. నా దృష్టిలో అందానికి కొలబద్ద లేదు. అందుకేనేమో నా కనులు నీ
అందాన్ని ఆస్వాదించలేక పోయాయి. నీతో పరిచయం పెరుగుతున్న కొలది నీ వ్యక్తిత్వం, మంచితనం,
సమస్యను ఎదుర్కోగల ధైర్యం, సమయస్పూర్తి నాలో నీ మీద ఒక సదభిప్రా యాన్ని ఏర్పరిచాయి. చిరునవ్వుతో
ఆప్యాయంగా 'దీపూ' అని పిలిచే నీ పిలుపు నీలో ఒక ఆత్మీయురాలిని నాకు చూపించింది. క్రమేపి నీ రాక
కోసం కనులు వెదకడం మొదలుపెట్టా యి. నీ పిలుపు కోసం మది ఎదురుచూసేది. నీవు రాని రోజు ఏదో
వెలితిగా అనిపించేది. ఏ చిన్న చప్పుడైనా నీవేనేమోనని తిరిగి చూసేవాడిని. ఏ పనీ చేయ మనసయేది కాదు.
నాలో మార్పు క్రమంగా నాకే తెలియసాగింది. దానినే ప్రేమంటారేమోనని నాకు నిజంగా తెలియదు. నువ్వు లేక
నేను ఉండలేనేమో అనే భయం మాత్రం బలపడసాగింది. కానీ ఏనాడూ నువ్వు చొరవ చేసిన దాఖలాలు లేవు.
నాలా నీవు కూడా ఆలోచిస్తు న్నావో లేదో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నా మీద
నీకు సదభిప్రా యమే ఉంది. మరి అది నాతో కలసి నడిచేటంతగా ఉన్నదో, లేదో తెలియదు. నాకు నీతో
జీవితాన్ని పంచుకునే అదృష్ట ం కావాలి. నీ నిర్ణయం ఏదైనా నాకు శిరోధార్యమే. చలం గారు చెప్పినట్లు ' మనం
స్త్రీని ఎంతగా ప్రేమిస్తా మో ఆమె మనలను అంతకంటే రెట్టి ంపు ప్రేమిస్తు ందని '.. అదే నిజమైతే నువ్వు నా
ప్రేమను అంగీకరిస్తా వు. నీ కులమేదయినా, మతమేదయినా నాకు అడ్డ ంకి కాదు. నా ప్రేమను అంగీకరించమని
బలవంతం చేయను. ఏ కిరాతక చర్యకు ఒడికట్ట ను. ప్రేమ ప్రేమను కోరుకుంటుంది తప్ప ద్వేషాన్ని పెంచుకోదు.
నేటి యువత అర్థ ం చేసుకోలేని విషయమదే. అందుకే పువ్వుల వంటి ఆడపిల్ల ల మీద దారుణాలు
జరుగుతున్నాయి. అలాటి దుర్మార్గా లు మన మధ్య చోటుచేసుకోకూడదు. అంతేకాదు పెద్ద లను ఎదిరించి
లేచిపోవడాలు అసలు వద్దు . ప్రేమ మన రెండు మనసులకే కాదు, మన ఇద్ద రి కుటుంబాలకు సంబంధించినది.
ఎంత కష్ట మైనా, ఎన్ని సంవత్సరాలైనా వారి ఆమోదంతోనే మనం ఒకటి కావాలి. క్షణికావేశపు నిర్ణయం కాదిది
మూడునాళ్ళలో ముగియడానికి. మనసు పొరలను మధించి వెలికివచ్చిన అమృతధార ఇది. నీతోడిదే జీవితం
అనుకుంటున్నాను. మరి నీ మనసు గదిలో నాకు రవ్వంత చోటు ఇస్తా వనే ఆశ. నీ నవ్వుల నదిలో
ఓలలాడాలని, నీ తీయని పిలుపుతో మేలుకోవాలని కనే కలలు కల్ల లు కానీయవనే నమ్మకంతో క్షరము కాని
ప్రేమను అక్షర రూపంలో పరుస్తు న్నాను. ఎదుటపడి మాట తెలుపలేని మూగవాడిని. మనసు గది తెరచి
ఆహ్వానిస్తు న్నాను. ఫలితం నిరాశను మిగిల్చినా ఉన్మాదిగా మారను. నీ ఊహల ఊపిరితో సాగుతూ సమాజం
కోసం బ్రతుకును సాంబ్రా ణి చేస్తా ను. నీ సమాధానం కోసం చకోరమై చూస్తూ .... నీకు అంగీకారమైతే.... 'నీ'
కావాలనుకునే దీపూ..... ఉత్త రం చదువుతున్నంత సేపు మధులిక కళ్ళముందు దీపక్ కనిపిస్తూ నే ఉన్నాడు.
చిన్నతనంలోనే ఒక కనుగుడ్డు నీరుకారిపోయి చూపులేకుండా పోయింది. కానీ నాలోని లోపం అతనికి
కనిపించడం లేదు. అతను నా మనసును మాత్రమే చూస్తు న్నాడు. అటువంటప్పుడు నేను అతనిలోని లోపాన్ని
చూడడం ఎంతవరకూ సమంజసం. జీవితంలో ఎంత వద్ద నుకున్నా ఎవరో ఒకరి తోడు కావాలి. లేకుంటే
బ్రతుకు భారంగా మారుతుంది. ఆ తోడు అర్థ ంచేసుకున్న వాడయితే, అంతకన్నా ఏం కావాలి. కూటికి, గుడ్డ కు
కొరగాని, మనసుకు శాంతినివ్వలేని కులాలెందుకు? మతాలెందుకు? మంచితనం ముందు అన్నీ
తలవంచాల్సిందే. మధులికలో ఏదో తెలియని ఉద్వేగం. మనసు దీపక్ వైపుకు మొగ్గు చూపసాగింది. 'నీకు
అంగీకారమైతే నాకూ అంగీకారమే దీపూ.... నీ నిరీక్షణకు నా స్పర్శతో ముగింపు పలుకుతాను. నీ పలుకును నా
పెదాల పలికించి నీ మాటలో నా బాట పరుచుకుంటాను'. రేపటి వసంతం ఈరోజే వచ్చినంత ఆనందంతో దీపక్
ఇంటికి బయలుదేరింది మధులిక.
పుట్టి నరోజు శుభాకాంక్షలు - పద్మావతి దివాకర్ల
లేడికి లేచిందే పరుగు అన్నట్లు ,
లోకనాధం లేచి లేవగానే
చరవాణి చేతిలోకి తీసుకొని
వాట్సప్‌లో తనకొచ్చిన
సందేశాలు చూడటం
మొదలెట్టా డు. తెలిసిన
వాళ్ళందరికీ ‘ శుభోదయం’
సందేశం పంపించాడు
పక్కమీద నుండి లేవకుండానే.
ఆ తర్వాత లేచి కాలకృత్యాలు
తీర్చుకొని స్నానపానాదులు
ముగించి సోఫాలో సుఖాసీనుడై
ఫోనులో ఈసారి ఫేస్‌బుక్‌పై
తన దృష్టి సారించాడు. తను
పెట్టి న పోస్టు లు లైక్ కొట్టి నవారి
పోస్టు లకి చాలా ఉదారంగా లైక్
కొడుతూ ఓ గంట గడిపాడు. ఆ
తర్వాత ఎవరెవరి
పుట్టి నరోజులున్నాయో
చూసుకొని శుభాకాంక్షలు
తెలపడానికి
ఉద్యుక్తు డైయ్యాడు.

ఆ రోజు తన స్నేహితులిద్ద రివి


పుట్టి నరోజు ఉన్నట్లు
తెలుసుకున్నాడు ఫేస్‌బుక్‌లో
నోటిఫికేషన్ చూసి. అందులో
ఒకడు సుందరంకాగా, రెండోవాడు కైలాసరావు. ముందు సుందరంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
సుందరం గతనెల జరిగిన తన పుట్టినరోజున తనకు శుభాకాంక్షలు తెలిపాడు కూడా. ఆ తర్వాత కైలాసరావుకి
సంబంధించిన పుట్టినరోజువద్ద కొద్దిగా ఆగి ఆలోచించాడు. క్రితం నెల తన పుట్టినరోజు జరిగినా తనకు ఎలాంటి
సందేశం పంపలేదు కైలాసరావు, అంతేకాదు గత నాలుగేళ్ళుగా తను అతని ప్రతీ పుట్టి నరోజుకీ శుభాకాంక్షలు
పెట్టినా కైలాసరావు మాత్రం కనీస మర్యాద కూడా పాటించలేదు. తనకు ధన్యవాదాలు తెలపలేదు సరికదా,
తన పుట్టి నరోజున కూడా ఎలాంటి సందేశం పంపలేదు. కైలాసరావుపై విపరీతమైన కోపం వచ్చింది. అతనికి
శుభాకాంక్షలు పెడదామాలేదా అని క్షణం ఆలోచించాడు. 'ఏమో పాపం! బహుశా తీరికలేక చూడకపోయి
ఉంటాడు. వాడు పెట్ట కపోతే మానే, తనెందుకు మానేయాలి? ఈసారి కనపడితే మాత్రం బాగా దులిపేయాలి.'
అని మనసులోనే అనుకొని కైలాసరావుకి తన సందేశం పంపాడు, 'ప్రియాతి ప్రియమైన స్నేహితుడు
కైలాసరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి.' అని. అయినా
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపనందుకు అతనిపై మనసులోనే కొంచెం కినుకు వహించాడు
లోకనాధం.

ఆ సాయంకాలం టివి చూస్తూ కూర్చొని ఉండగా స్నేహితుడు శేషాచలం వచ్చాడు. చాలా రోజుల తర్వాత
శేషాచలం కనబడటంతో చాలా సాదరంగా అహ్వానించాడు లోకనాధం. "రారా శేషాచలం, చాలరోజుల తర్వాత
వచ్చావు. రా కూర్చో!" అన్నాడు.

లోకనాధం మాటలు వినిపించుకోకుండా, "నేను కూర్చోడానికి రాలేదురా! పద! అలా బయటకు వెళ్ళివద్దా ం"
అన్నాడు శేషాచలం.

అలా కలిసి తిరిగిరావడం ఇద్ద రికీ అలవాటే అయినా వచ్చీరాగానే తనని బయలదేరమనేసరికి అతనివైపు
విడ్డూ రంగా చూసాడు లోకనాధం.

"కొంచెం కూర్చోరా! కాఫీ తాగి వెళ్దా ం." అన్నా వినిపించుకోక, "ముందు పద! నీకో విశేషం చూపిస్తా ను. తిరిగి
వచ్చినతర్వాత తీరిగ్గా కాఫీ తాగుదాములే!" అని బలవంతాన లోకనాధాన్ని బయలదేరదీసాడు శేషాచలం.
శేషాచలం బైక్‌పై ఇద్ద రూ బయలుదేరారు.

"ఎక్కడకి వెళ్తు న్నాం?" అని లోకనాధం అడిగినా, "చూస్తా వుగా!" అని బండిని ముందుకి నడిపాడు శేషాచలం.

పదినిమిషాల్లో ఒక ఇంటివద్ద బండి ఆపాడు శేషాచలం. లోకనాధం బండిదిగి ఆ ఇంటిని చూసి


ఆశ్చర్యపోయాడు. అది కైలాసరావు ఇల్లు .

"ఏమిట్రా ! కైలాసరావు ఇంటికి నన్ను ఎందుకు తీసుకువచ్చావు? అవును, ఇవాళ వాడి పుట్టినరోజు కదా
పార్టీకిగానీ నీకు ఆహ్వానం పంపాడా? అందుకనే నన్ను కూడా తెచ్చావా? నాలుగేళ్ళనుండీ నేను వాడి ప్రతీ
పుట్టినరోజుకీ ఫేస్‌బుక్‌లో విష్ చేస్తు న్నానాకు కనీసం ధన్యవాదాలు కూడా తెలపడు. అంతేకాక, నా
పుట్టినరోజునాడు విష్ కూడా చెయ్యడు. ఇప్పుడు చూడు, నువ్వంటే వాడికి చాలా ఇష్ట ం కాబట్టే నిన్ను పార్టీకి
పిలిచాడు, కాని నన్ను మాత్రం పిలవలేదు, అలాంటివాడిని ఇప్పుడు నేను కలవడం అంత అవసరమా!" అని
నిరసనగా, నిష్టూ రంగా అన్నాడు లోకనాధం.

"పద! ముందు ఇంట్లో కి పద! ఆ తర్వాత నువ్వు చెప్పేదేమిటో తీరిగ్గా చెబుదువుగాని." అంటూ కైలాసరావు
ఇంట్లో కి దారితీసాడు శేషగిరి. అయిష్ట ంగా లోకనాధంకూడా శేషగిరి వెనుక ఇంట్లో కి ప్రవేశించాడు.

శేషగిరిని చూసి కైలాశరావు భార్య కమల పలకరించింది, "అన్నయ్యగారూ! రండి, కూర్చోండి." అని.

"ఎలా ఉన్నారమ్మా మీరూ, పిల్ల లు?" అని అడుగుతూ సోఫాలో కూర్చున్నాడు శేషగిరి. లోకనాధం కూడా
కూర్చొని నేలచూపులు చూస్తూ సోఫాలో అసహనంగా కదలసాగాడు. మనసులో కైలాసరావుపై పీకలదాకా
కోపం ఉంది. కైలాసరావు కనపడగానే కడిగేయాలని నిర్ణయించుకొని అతనికోసం ఎదురు చూడసాగాడు.
అయితే ఆ ఇంట్లో పుట్టినరోజు హడావుడి ఏమాత్రం కనిపించలేదు లోకనాధంకి. 'ఓహో! నిరాడంబరంగా
పుట్టినరోజు వేడుక జరుపుకుంటాడు కాబోలు కైలాసరావు.‘ అని అనుకున్నాడు లోకనాధం.

"బాగానే ఉన్నాం అన్నయ్యగారూ!...ఆయన పోయిన తర్వాత మీరు మాకు సహాయం చేయకపోయి ఉంటే ఈ
పాటికి మా బ్రతుకులు ఏమై ఉండేవో తలచుకుంటేనే భయమేస్తో ంది. మీ చొరవవల్లే ఆఫీసునుండి రావలసిన
డబ్బులు వచ్చాయి. మీరు పూనుకోవడంవల్లే నాకు ఉద్యోగం కూడా వచ్చింది." అందామె కళ్ళు చెమర్చగా.

ఆ మాటలు విన్న లోకనాధం ఉలికిపడి తలెత్తి అమె వైపు చూసాడు.


కుంకుమబొట్టు లేని ఆమె ముఖం కళావిహీనంగా ఉండటం గమనించాడు. ఎదురుగా గోడపైన పువ్వులదండ
వేయబడిన కైలాసరావు ఫోటో చూసి నిశ్చేష్టు డై శేషగిరివైపు చూసాడు. 'కైలాసరావు చనిపోయాడా? ఎప్పుడు
చనిపోయాడు, తనకు తెలియదే?' అన్నట్లు ఉంది లోకనాధం ముఖంలో భావం. వాస్త వం తెలిసి ఒక్కసారి
చలించిపోయాడు లోకనాధం. అతనిలో జరిగిన మార్పు గమనించిన శేషగిరి మృదువుగా లోకనాధం చేతిని
తట్టా డు.

"స్నేహితులన్నాకా ఆ మాత్రం సహాయం చెయ్యకపోతే ఎలాగమ్మా?" అంటూ శేషగిరి తన వెంట తీసుకువచ్చిన


ఆపిల్‌పళ్ళు ఉన్న సంచీ ఆమె చేతికి అందించాడు.

కైలాసరావు తనకి పుట్టినరోజు విషెస్ చెప్పలేదని కోపం తెచ్చుకున్నలోకనాధం, ఇప్పుడు కైలాసరావే ఈ భూమి
మీద లేడన్న వాస్త వాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఓ క్షణం. తన మనసులో ఇదివరకు కలిగిన భావాలకి సిగ్గు పడి
విపరీతంగా చలించాడు. అక్కడున్నంతసేపూ లోకనాధం ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చున్నాడు.

అరగంట తర్వాత ఇద్ద రూ అక్కడనుండి బయటపడి లోకనాధం ఇంటికి చేరారు. అప్పటివరకు మౌనంగానే
ఉన్నారిద్ద రూ.

కైలాసరావు ఇక లేడన్న షాక్‌నుండి ఇంకా తేరుకోని లోకనాధం ఏమీ మాట్లా డలేకపోయాడు. "చూసావా
లోకనాధం! నువ్వు పాపం ఆ కైలాసరావుపై ఎంత పెద్ద అభాండం మోపావో? వాడు చనిపోయి నాలుగేళ్ళైనా
నీకు ఆ విషయం తెలియలేదు. పోనీ ఇంకో ఊళ్ళో ఉన్నాడా అంటే అదీలేదు, మీ ఇంటికి దగ్గ రే కూడా! నువ్వు
ఇవాళ ఫేస్‌బుక్‌లో కైలాసరావుకి శుభాకాంక్షలు పెట్టినప్పుడే అనుకున్నాను నీకీ విషయం తెలియదని. నీకు
వాస్త వం తెలియాలనే వాడింటికి తీసుకువెళ్ళాను. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, నీలాగే ఇంకో పాతికమంది
కూడా అతనికి బర్త్‌డే విషెస్ చెప్పారు. అవును మరి! ప్రస్తు తం జీవితం అంతా యాంత్రికమైపోయింది.
వాస్త వాలు మాత్రం గ్రహించడంలేదు. సెల్ లేకపోతే మన జీవితానికి అర్ధ మే లేదు అన్నంతగా అది మనతో
మమేకమైపోయింది. ఫేస్‌బుక్‌లో విషెష్ చెప్పడమే కాని, అసలు వాళ్ళు ఎలాగున్నారో అని ఎంతమంది
ఆలోచిస్తు న్నారు? మనుష్యుల మధ్యకాదు, మనసుల మధ్యకూడా దూరం పెరిగింది. నీ
పుట్టినరోజుకిఫేస్‌బుక్‌లో శుభాకాంక్షలు చెప్పలేదని కైలాసరావు మీద కోపం పెంచుకున్నావుగానీ, అతను
ఎందుకు అలా పెట్ట లేకపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా? అతను ఎలా ఉన్నాడో ఒకసారి ఆరా తీసావా?"
అడిగాడు శేషగిరి.

శేషగిరి మాటలకి లోకనాధం బిక్కచచ్చిపోయాడు. శేషగిరి మాటలు కటువుగానే ఉన్నా అందులో వాస్త వం
ఉందని గ్రహించిన లోకనాధం మౌనం వహించాడు. కొద్ది నిమిషాలు నోటమాట రాక నిరుత్త రుడైనాడు.

"అవును నిజమే! నాలుగేళ్ళై మన స్నేహితుడు పోయినా మనకు తెలియనంతగా మనం ఎలా గిరిగీసుకొని
ఉన్నామో ఇప్పుడు అర్ధ మైంది. మనుష్యుల మధ్య వారధిగా ఉండాల్సిన ఈ సాంకేతికతే మన మధ్య దూరాన్ని
పెంచుతోంది. అయితే మనం ఈ మధ్య చాలాసార్లు కలసుకున్నా మన మధ్య కైలాసరావు ప్రస్తా వన రాకపోవడం
కూడా విడ్డూ రమే!" అన్నాడు లోకనాధం తేరుకొని.

"నేను చెప్పినా నీ సెల్ ధ్యాసలో వినిపించుకునే స్థితిలో లేవు నువ్వు."జవాబిచ్చాడు శేషగిరి.

శేషగిరి మాటలు లోకనాధం హృదయాన్ని బలంగా తాకాయి. మౌనంగా ఆత్మవిమర్శ చేసుకోసాగాడు.


పాల మనసులు - కొత్త పల్లి ఉదయబాబు
అది నగరంలోని ప్రసిద్ధ మైన కార్పొరేట్
పాఠశాల మెయిన్ బ్రా ంచ్.ఎలిమెంటరీ
సెక్షన్స్ వన్ టు ఫైవ్ క్లా సెస్ ఉన్న బ్లా క్
లోని పేరెంట్ విజిటర్స్ రూంలో
ప్రిన్సిపాల్ గారి కోసం నిరీక్షిస్తు న్నాయి
రెండు జంటలు తమ పిల్ల లతో.

ఒక పక్క ఆఫీసు కు టైం అవుతోంది.


రఘువరన్ అసహనంగా భార్యకేసి
చూసాడు.యూనిఫామ్ లో ఉన్న
ఐశ్వర్య తల్లి చెయ్యి పట్టు కుని
ధీమాగా కూర్చుంది.

చరణ్ కూడా తనభార్య ప్రశాంతి తో


అక్కడే కూర్చున్నాడు. తల్లి చున్నీలో
ముఖం దాచుకుని సింహం ముందు
ఆహారమవబోతున్న లేడి పిల్ల లా
భయంగా తండ్రి వంక డోర్
వంక,ఐశ్వర్య వంకా తన తెల్ల టి
కళ్ళను తిప్పుతూ చూస్తు న్నాడు
అభినయ్.

"హోమ్ వర్క్ చేసేసావా..."హఠాత్తు గా


అడిగింది ఐశ్వర్య ముద్దు ముద్దు గా.
"ష్...సిగ్గు లేదు ఆ అబ్బాయితో
మాట్లా డటానికి?"మెల్ల గా కటువుగా కూతుర్ని మందలించాడు రఘువరన్.
"లేదు"అన్నట్టు గా తలూపాడు తల్లి చున్నీ చాటునుంచి అభినయ్.
మండి పోయింది చరణ్ కి.అతనికి కోపం వచ్చినట్టు కంద గడ్డ లా మారిన ముఖంలో దవడ కండరం
బిగుసుకోవడమే తెలుపుతోంది.ప్రశాంతి "తప్పు నాన్న మాట్లా డకు" అన్నట్టు అభినయ్ కి నోటిమీద వేలు పెట్టి
చూపించింది.

"సిగ్గు లేకపోతే సరి. పిల్ల ల్ని చిన్నప్పటినుంచి సక్రమంగా పెంచుకోకపోతే ఇలాగే దోషుల్లా నిలబడి సంజాయిషీ
ఇచ్చు కోవాల్సి వస్తు ంది.వాళ్ళు తప్పు చేసినపాపానికి మనకి టైం వేస్ట్."

గొణుక్కుంటున్నట్టు గానే రఘువరన్ అన్నా చరణ్ కి స్పష్ట ంగా వినిపించింది.

"మిస్ట ర్.మైండ్ యువర్ లాంగ్వేజ్." అనేలోపుగానే ప్రశాంతి బలంగా చరణ్ జబ్బపుచ్చు కుని ఆపింది.
అంతలో ప్రిన్సిపాల్ ప్రవేశించి ఇద్ద రిని మార్చి మార్చి చూస్తూ తన సీట్ లో కూర్చున్నాడు. సాలోచనగా తల
పంకించి కాలింగ్ బెల్ ప్రెస్ చేసాడు.

ఒక 18 సంవత్సరాల అమ్మాయి లోపలికి వచ్చింది.

"టీచర్. సెకండ్ క్లా స్ టీచర్ ప్రవల్లికను రమ్మనండి."ఆజ్ఞా పించాడు.

"ఎస్సార్"అని ఆ అమ్మాయి నిష్క్రమించింది.

"గుడ్ మార్నింగ్ సర్"అన్నాడు అభినయ్ ప్రిన్సిపాల్ కి సెల్యూట్ చేస్తూ .

అది విని ఐశ్వర్య కూడా "గుడ్ మార్నింగ్ సర్" అని ప్రిన్సిపాల్ కి సెల్యూట్ చేసింది.

"గుడ్ మార్నింగ్ మై స్వీట్ చిల్డ ్రన్"అన్నాడు ప్రిన్సిపాల్ చిరునవ్వుతో.

అపుడు పిల్ల ల పేరెంట్స్ కేసి చూస్తూ " గుడ్ మార్నింగ్ పేరెంట్స్."అని పెద్ద వాళ్ళు నలుగురికి విష్ చేసాడు.
తిరిగి విష్ చేశారు రఘువరన్,చరణ్ లు కూడా.

అంతలో "మే ఐ కమిన్ సర్?" అనుమతి అడుగుతూనే లోపలికి వచ్చింది. తిండి, గుడ్డ కరువై బీదస్థితిలో
ఉండి కాలర్ బోన్స్ బయటకు కనిపిస్తు న్న 20 ఏళ్ల ఆఅమ్మాయి స్వరం మాత్రం కోకిల కంఠం లా ఉంది.

తమ టీచర్ చూస్తూ నే మళ్లీ "గుడ్ మార్నింగ్ టీచర్" అంటూ పిల్ల లిద్ద రూ ఒకే శృతిలో విష్ చేశారు. ప్రవల్లిక
పిల్ల లిద్ద రినీ తిరిగి విష్ చేసింది.

ప్రిన్సిపాల్ కంఠం సవరించుకుని " డియర్ పేరెంట్స్.మీరు మీ పిల్ల ల్ని సపోర్ట్ చేస్తూ ఒక్క మాట కూడా
మాట్లా డకూడదు. అంతా విన్నాక మీరు మాట్లా డటానికి నేను పెర్మిషన్ ఇస్తా ను.ఈలోగా మీరు ఒక్క మాట
మాట్లా డటానికి ప్రయత్నించినా మీరు మీ పిల్ల ల టీ. సి.తీసుకుని వెళ్లా ల్సి వస్తు ంది. మళ్లీ మీ పిల్ల లకు ఇక్కడ
అడ్మిషన్ కావాలంటే ఒక ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఒకే కదా." అని వారి ని హెచ్చరించి వారి సమాధానం
కోసం చూడకుండా ప్రవల్లికని అడిగాడు.

"మిస్.మీరు చెప్పండి.నిన్న క్లా స్ లో ఎం జరిగిందో వివరంగా చెప్పండి."


పేరెంట్స్ టీచర్ చెప్పేదానికోసం అలెర్ట్ అయ్యారు.

"సర్.నా సెకండ్ క్లా స్ లో ఇద్ద రు ఐశ్వర్య లు ఉన్నారు.కె.ఐశ్వర్య, ఈపాప ఎం.ఐశ్వర్య.నిన్న కె.ఐశ్వర్య


పుట్టినరోజు.వాళ్ళ పేరెంట్స్ ఆ పాపని పుట్టినరోజు డ్రెస్ వేసి టీచర్స్ అందరికి కేక్స్,క్లా సులో పిల్ల లందరికీ
చాకలెట్స్ పంపారు.ఆ ఐశ్వర్యకు పిల్ల లందరూ క్లా స్ లో హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడాక,స్వీట్స్ పంచడానికి ఈ
ఐశ్వర్య ని చాకలెట్స్ ఉన్న బాక్స్ పట్టు కోమని చెప్పి ఒక్కొక్కరికి చాకలెట్స్ ఇవ్వసాగింది.సరిగ్గా అభినయ్
దగ్గ రకు వచ్చి చాకలెట్స్ ఇస్తు న్నప్పుడు అవితీసుకుని " ఐశ్వర్య . ఐ లవ్ యూ ఐశ్వర్య" అన్నాడు. వెంటనే ఈ
ఐశ్వర్యకి కోపం వచ్చి నేను చెబుతున్నా వినకుండా ఏడుస్తూ మీ దగ్గ రకు వచ్చి కంప్లైంట్ చేసింది సర్. తరువాత
మీరు చెప్పినట్లు గానే డైరీస్ లో వాళ్ల పేరెంట్స్ ను ఈ మార్నింగ్ మిమ్మల్ని కలవడానికి రమ్మని రాసాను. ఇదే సర్
జరిగింది."

"ఒకే. నౌ యూ కెన్ గో అండ్ సెండ్ దట్ ఐశ్వర్య." ఆర్డరేశాడు ప్రిన్సిపాల్. ఆ అమ్మాయి బతుకు జీవుడా అంటూ
అక్కడనుంచి నిష్క్రమించింది.

"విన్నారుగా పేరెంట్స్. అదీ జరిగింది. అమ్మాయి ఐశ్వర్యా...ప్లీజ్ కం టు మీ." పిలిచాడు ప్రిన్సిపాల్.

"సార్ పిలుస్తు న్నారుగా వెళ్ళు. నిన్ను అలాంటి మాటలు అన్నవాళ్ళకి లేని భయం నీకెందుకు?ధైర్యంగా సర్
ఆడిగినదానికి సమాధానం చెప్పు. నెనున్నాగా ఇక్కడ"అన్నాడు రఘువరన్.
ఐశ్వర్య ధీమాగా ప్రిన్సిపాల్ దగ్గ రగా వచ్చింది.

"అభినయ్ నిజంగా నిన్ను ఐ లవ్ యు అన్నాడామ్మా" అడిగాడు ప్రిన్సిపాల్


"ఎస్సార్.నిజంగానే అన్నాడు.నాకు భయమేసింది.వచ్చి మీతో చెప్పేసాను.కావాలంటే కె.ఐశ్వర్యని కూడా
అడగండి." అంది.

"నువ్ కూడా ఇలా రా నాన్న..."అభినయ్ ని పిలిచాడు ప్రిన్సిపాల్.


అసలు తాను అన్నదాంట్లో తప్పేముందని తనని ప్రిన్సిపాల్ ముందు నిలబెట్టా రో అర్ధ ం కాని ఆ లేతమనసు
ఒక్కసారిగా ఏడవసాగాడు.

ప్రశాంతి అభినయ్ ని ఎత్తు కుని కళ్ళు తుడుస్తూ అంది. "తప్పు నాన్న.ప్రిన్సిపాల్ సర్ ఏమీ అనరు. నేను డాడీ
ఇక్కడే ఉన్నాం కదా.సర్ ఆడిగినదానికి సరిగ్గా సమాధానం చెప్పు.ప్లీజ్ నాన్న.ఐ లవ్ యూ కదూ."

అభినయ్ ఏడుపు ఆపాడు.ప్రశాంతి అభినయ్ ని చరణ్ కి ఇచ్చింది.చరణ్ అభినయ్ ని ఎత్తు కుని "ఆ ఐశ్వర్య
కూడా వస్తు ంది కదా.సర్ ఆ అమ్మాయిని కూడా అడుగుతారు. నీకేం భయం లేదు.నిన్ను ఎవరూ ఏమీ అనరు.
నేనున్నాను కదా. యూ లవ్ మీ కదా.ఏడవకుండా సర్ అడిగినదానికి భయపడకుండా సమాధానం చెప్పు.ఒకే
నా"అని బుజ్జ గించి ప్రిన్సిపాల్ దగ్గ రకు పంపాడు.
అభినయ్ ప్రిన్సిపాల్ దగ్గ రగా వచ్చి చేతులు కట్టు కున్నాడు.

"గుడ్ మార్నింగ్ సర్.మే ఐ కం ఇన్ సర్" అని నవ్వుతూ అడిగి లోపలికి వచ్చిన ఆ పాపను చూస్తూ నే అక్కడి
అందరి కళ్ళూ పెద్ద వయ్యాయి ఆశ్చర్యం తో.

బాదం పాలతో స్నానం చేసిన బాల దేవకన్యలా మెరిసిపోతోంది ఆ అమ్మాయి. నవ్వితే పారిజాతపు పూలు
జలజలా రాలుతున్నాయా అన్నంత అద్భుతంగా నవ్వుతోంది.
"ఎందుకు సర్ నన్ను రమ్మన్నారు?" అడిగింది ప్రిన్సిపాల్ ని.

"ఎం లేదురా.చిన్న మాట అడుగుదామని.నిన్న క్లా స్ రూమ్ లో నువ్ స్వీట్స్ పంచినపుడు అభినయ్ ఏమైనా
అన్నాడా?"

గుర్తు కు వచ్చినట్టు అంది ఐశ్వర్య.


"ఎస్ సర్. క్లా స్ రూమ్ లో అందరూ థాంక్స్ చెప్పారు.కానీ అభినయ్ కి ఇచ్చినప్పుడు "ఐశ్వర్య. ఐ లవ్ యూ
ఐశ్వర్య." అన్నాడు.అపుడు ఎం.ఐశ్వర్య ఏడుస్తూ వచ్చి మీకు కంప్ల యింట్ చేసింది. అంతే సర్" అంది
అమాయకంగా.

"అభినయ్ అలా అని నిన్ను అన్నాడా...ఎం.ఐశ్వర్య ని అన్నాడా?" అడిగారు ప్రిన్సిపాల్.


"నాతోనే అన్నాడు సర్.మరి ఎం.ఐశ్వర్యకు ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్ధ ం కాలేదు సర్."అంది కె.ఐశ్వర్య
నవ్వుతూ.

"ఒకే. యూ కెన్ గో టు యువర్ క్లా స్."


"థాంక్యూ సర్."కె. ఐశ్వర్య వెళ్ళిపోయింది.
ప్రిన్సిపాల్ అభినయ్ ని దగ్గ రకు తీసుకున్నాడు.

"నాన్నా అభినయ్.ఇపుడు నువ్ చెప్పు. నువ్ ఐ లవ్ యూ అని ఎవరిని అన్నావు?కె.ఐశ్వర్యనా?


ఎం.ఐశ్వర్యనా? చెప్పు నాన్నా?" అనునయంగా అడిగాడు ప్రిన్సిపాల్.

వాళ్ళిద్ద రిని అడిగాక తనని అడుగుతున్నారన్న ధైర్యంతో అన్నాడు అభినయ్ " సర్.నిన్న కె.ఐశ్వర్య వేసుకున్న
బర్త్ డే డ్రెస్ చాలా చాలా బాగుంది.అలాంటిది మా చెల్లికి మమ్మీ చేత కొనిపించాలనిపించింది. సరిగ్గా అపుడు
కె.ఐశ్వర్య నాచేతుల్లో చాకలెట్స్ పెట్టింది. అంత దగ్గ రగా వచ్చిన కె.ఐశ్వర్య ను చూసి ఐ లవ్ యూ అన్నాను.
అంటే నువ్ ఈ డ్రెస్సులో చాలా బాగున్నావ్ అని అన్నాను. ప్రా మిస్ సర్.నేను కె.ఐశ్వర్యనే
అన్నాను.ఎం.ఐశ్వర్య ని అనలేదు.ప్లీజ్ సార్.నన్ను స్కూల్ నుంచి పంపకండి సర్. మా మమ్మీ ఏడుస్తు ంది
సర్.ప్లీజ్ సర్."చివరలో అభినయ్ కి దుఃఖం పొర్లు కు వచ్చేసింది.

"నో నాన్నా.నువ్వు ఈ స్కూల్ లొనే చదువుతావ్.సరేనా.ఇంకెప్పుడూ అలాంటి మాటలు


అనకూడదు.సరేనా.అభినయ్ ఈజ్ ఏ గుడ్ బాయ్.గో టు యువర్ క్లా స్ రూమ్. ఎం.ఐశ్వర్య కమాన్.విన్నావ్
గా.అభినయ్ అన్నది నిన్ను కాదమ్మా.కె.ఐశ్వర్య ని. అయినా ఐ లవ్ యూ అంటే నీకు ఏమి అర్ధ ం
అయిందమ్మా?" అడిగాడు ప్రిన్సిపాల్.

" టి.వి.లో వేసిన సినిమాలో హీరోయిన్ హీరోకి ఐ లవ్ యూ చెప్పకపోతే ముఖం మీద ఆసిడ్ పోసేసాడు
సర్.ఇంకో సినిమాలో అయితే కత్తి పెట్టి హీరోయిన్ గొంతు కోసేసాడు సర్.అందుకే భయమేసి వచ్చి మీతో
చెప్పాను సర్.కె.ఐశ్వర్య నైనా అనకూడదు కదా సర్."ఆరిందాలా చేతులు తిప్పుతూ అంది ఎం.ఐశ్వర్య.
"ఒకే. నేను మీ పేరెంట్స్ తో మాట్లా డి పంపిస్తా ను.యూ బోత్ గో టు యువర్ క్లా స్.బాగా చదువుకోవాలి..నౌ
మీరిద్ద రూ గుడ్ ఫ్రెండ్స్.సరేనా?" అన్నాడు ప్రినిపాల్.
"ఒకే అండ్ థాంక్యూ సర్.బై మమ్మీ బై డాడీ..."అని పిల్ల లిద్ద రూ హుషారుగా అక్కడనుండి వెళ్లిపోయారు.

ప్రిన్సిపాల్ పేరెంట్స్ వైపు తిరిగారు.


" చూసారా సర్స్.ఈ ప్రపంచంలో అతి పవిత్రం గా పలకవలిసిన "ప్రేమ"అన్న పదం, ఆ పదానికి పూర్తి అర్ధ ం
తెలియని పాలమనసుల్లో ఎటువంటి స్థితికి దిగజారిపోయిందో అర్ధ మైందా సర్? అభం శుభం ఎరుగని ఆ పసి
మనసుల్లో పుచ్చు విత్త నమై నాటుకుని అది మొక్కగా పెరిగి వృక్షమైతే దానికి బాధ్యులు ఎవరు సర్? మీరా?
మేమా? చెప్పండి.

అనురాగం ఆత్మీయత అభిమానం ఇలాంటి అమృత తుల్యమైన మాటలున్న మన మాతృభాష కు


సమాంతరంగా పరిజ్ఞా నం కోసంఆంగ్లభాష నేర్చుకోవలసిందే. నేర్చుకునే భాషల పట్ల మమకారాన్ని పెంచి
అవగాహన కలిగించండి. అభం శుభం తెలియని ఏనిమిదేళ్ల వయసులో ఐశ్వర్యకు ఐ లవ్ యూ అంటే ఎలా
అర్ద మైందో చూసారా..?ఎవరు దానికి కారణం?,మేమా?

అలాగే పిల్ల ల పట్ల ప్రేమ ఉండాల్సిందే.కానీ వాళ్ళని సముదాయించడం కోసం ఐ లవ్ యూ నాన్న.యూ లవ్ మీ
కదా...అని ముద్దు చెయ్యడం ఎంతవరకు సమంజసం?ఈ ప్రపంచం లో ప్రతీ దానికి ఒక హద్దు ఉంటుంది.ఆ
హద్దు దాటితే ఎంత అమృతమైనా విషమౌతుంది.
పిల్ల ల పెంపకంలో ప్రేమ ఎంత అవసరమో క్రమశిక్షణా అంతే అవసరం.వాటిని సమపాళ్ల లో పెంపకంలో పిల్ల లకు
అందించిన నాడు పిల్ల లలో ఈ విపరీత ధోరణు లుండవు.

డబ్బు అవసరానికి మించి సంపాదించి పిల్ల ల చదువులకు అవసరాలకు ధారపోస్తు న్నామనుకుంటారే గాని
వారి ప్రవృత్తి,ప్రవర్తన తల్లిదండ్రు లు పట్టించుకోక పోతే రాబోయే తరం చేతిలో రాజీ పడలేక బ్రతకలేక జీవశ్చవా
లల్లా బ్రతుకు ఈడ్చుకు రావలసిందే. ఆ పరిస్థితి మీకు రాకూడదనుకుంటే మీరు ఇప్పటినుంచీ జాగ్రత్తపడటం
మంచిది. అర్ధ మైందనుకుంటాను.ఇక మీరు వెళ్ళవచ్చు సర్" అన్నాడు ప్రిన్సిపాల్ లేచి నిలబడి.

తన పిల్ల లో తప్పు పెట్టు కుని ఎదుటివారిని పరుషంగా మాట్లా డినందుకు పశ్చాత్తా పపడ్డా డు రఘువరన్. తన
పిల్ల వాడితో ఎలాంటి మాటలు మాట్లా డాలో అర్ధ మైన చరణ్ తన ప్రవర్త నను మనసులో నొచ్చుకున్నాడు.

నలుగురు లేచి వెళ్ళడానికి ఉద్యుక్తు లౌతుండగా రఘువరన్ చరణ్ తో " ఐయాం వెరీ సారి బ్రదర్. వెరీ వెరీ
సారీ." అన్నాడు చరణ్ తో కరచాలనం చేసి.
చరణ్ కూడా "అయామ్ అల్సొ సో సారి ఫర్ ద ఇన్ కన్వీనియన్స్ బ్రదర్. రియల్లీ వెరీ సారీ." అన్నాడు.

"మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని మాట ఇస్తు న్నాం సర్. మీ అమూల్య సూచనలకు సదా
కృతజ్ఞ తలు సర్.నమస్తే." అందరూ బయటకు కదులుతుండగా చివరగా ప్రశాంతి చెప్పిన మాటలకు
మెచ్చుకోలుగా చూస్తూ చిరునవ్వుతో వీడ్కోలు పలికాడు ప్రిన్సిపాల్.
Bsc - శ్రీనివాసరావు జీడిగుంట
Object 2

ఎందుకో రెండు రోజులు నుంచి కళ్ళు


తిరుగుగుతున్నట్లు గా అనిపించడం తో
ఎందుకైనా మంచిది అని కాలనీలో
క్లినిక్ పెట్టి న కొత్త డాక్టర్ దగ్గ రికి
బయలుదేరాడు పద్మనాభం. కొత్త
హాస్పిటల్ అయినా జనం బాగానే
వున్నారు. డాక్టర్ గారు బాగా
చాదస్తు డు అనుకుంట, ఒక్కొక్కరు ని
యిరవై నిముషాలు పైన చూస్తు న్నాడు.
ఒక గంట తరువాత పద్మనాభం వంతు
రావడం తో తలుపు తోసుకుని
లోపలికి వెళ్ళాడు. డాక్టర్ చాలా
చిన్నవాడు లాగా వున్నాడు
అనుకుంటూ ఆయనకు ఎదురుగా
కుర్చీలో కూర్చున్నాడు. అప్పటి వరకు
ఎవరితోనో సెల్ లో మాట్లా డి, నన్ను
చూసి "ఏమిటి problem"అన్నాడు
డాక్టర్. "BSC " అన్నాడు పద్మనాభం.
డాక్టర్ మొహం చిత్త లించుకుని, మీరు
ఏమి చదివారని కాదు, ఏమిటి రోగం
అనబోయి, ప్రా బ్లెమ్ అన్నాడు. దానికి
పద్మనాభం అదేనండి, BSC. BP,
షుగర్, cholesteral అన్నాడు. దాంతో డాక్టర్ గారు ఒక్కసారిగా విరగబడి నవ్వుతు, బలేవారండి, మీ పేరు కి
తగ్గ ట్టు గానే మాట్లా డుతున్నారు, అంటూ బీపీ చూసి కొద్దిగా ఎక్కువ వుంది, మీ వయసు కి పరవాలేదు. కొత్త
మందులు ఏమిరాయటం లేదు, యిప్పుడు వాడుతున్నవి చాలని, ప్రిస్క్రిప్ష న్ చేతికి యిచ్చాడు.
"యింతోటిదానికి ఫీజు నష్ట ం "అనుకుంటూ పై జేబులో రెడీ గా పెట్టు కున్న అయిదు వందల నోటు బయటకి
తీస్తో "మీ ఫీజు "అన్నాడు పద్మనాభం. అప్పటి వరకు, రాబోయే పేషెంట్ కేసు షీట్ చూస్తూ , కొద్దిగా వాకింగ్
చేస్తో వుండండి, డబ్బు తీసుతున్న పద్మనాభంతో, NCC అన్నాడు డాక్టర్ గారు. నడక పరవాలేదు గానీ, NCC
ఈవయసులోనా అన్నాడు పద్మనాభం. దానికి డాక్టర్ హాయిగా నవ్వుతు NCC అంటే మీకు "No కన్సల్టెన్సీ
charges " అన్నాడు. దానికి పద్మనాభం విరగబడి నవ్వుతు "బలే వాడివి, నీ పేరు కి తగ్గు ట్టు గా అన్నావు
సుధాకర్ అని లేచి నుంచున్నాడు. డాక్టర్ దగ్గ ర కి రమ్మని పిలవటం correct అవునో కాదో నాకు తెలియదు,
మీరు మాత్రం అప్పుడప్పుడు తప్పకుండా రండి సరదాగా నవ్విద్దు రుగాని, నాకూ ఫ్యూచర్ లో BSC రాకుండా
వుండటానికి అంటూ, next పేషెంట్ ని పిలిచాడు డాక్టర్.
నిజం - పద్మావతి దివాకర్ల
Object 3

అభయ్ పెళ్ళికుదిరింది. ప్రేమించిన


అమ్మాయి అర్చితతో అభయ్ వివాహం
జరిపించడానికి ఇరుపక్షాల పెద్ద లు
సుముఖులవడంతో వాళ్ళిద్ద రూ చాలా
ఆనందంగా ఉన్నారు. అభయ్, అర్చిత
ఇద్ద రూ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. ఒకే
సంస్థ లో ఉద్యోగం చేస్తు న్న వాళ్ళిద్ద రిమధ్య
చిగురించిన ప్రేమ పెళ్ళి వరకూ
దారితీసింది. పెళ్ళిపనులు
జోరందుకున్నాయి. ఇద్ద రు కలసి పెళ్ళికి
కావలసిన వస్తు వులు షాపింగ్ చేస్తు న్నారు.
పెళ్ళిపనులవల్ల ఎవరికీ క్షణం తీరికలేదు.
శుభలేఖలు ఎంపిక చేయడం, వాటిని
అచ్చువేయడానికి ఇవ్వడం కూడా
జరిగిపోయాయి.

అభయ్ అంటే శారద, శేఖర్ దంపతులకి


అవ్యాజ్యమైన ప్రేమ. అతని మీదే తమ
పంచప్రా ణాలు పెట్టి బతుకుతున్నారు ఆ
దంపతులు. అందుకే ఎప్పుడైతే అభయ్
అర్చితని ఇష్ట పడుతున్నానని, పెళ్ళి
చేసుకుంటానని చెప్పాడో వాళ్ళు అతని కోరిక వెంటనే మన్నించారు ఆమె తమ కులం కాకపోయినా. అయినా
ఆ దంపతులకి కులం పట్టింపు ఏ మాత్రం లేదు. వాళ్ళ ప్రేమకి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. అభయ్‌కి
అర్చిత సరైన ఈడు జోడు అని అభిప్రా యం వాళ్ళది. అర్చిత చాలా మంచి, అణుకువగల అమ్మాయి అని
మొదటి చూపులోనే గ్రహించారు వాళ్ళు. అర్చితని తమ కోడలుగా స్వీకరించడానికి వాళ్ళు మనస్ఫూర్తిగా
అంగీకరించారు.

పెళ్ళి ఇంక నెలరోజులుందనగా అభయ్ తల్లి శారద అభయ్‌ని పిల్చి, "అభయ్! మన ఊరికి వెళ్ళి
పెద్ద తాతగారిని ఒకసారి కలిసి అతని ఆశీర్వాదం తీసుకో! నిన్ను చూసి చాలా కాలమైందని కబురు పెట్టా రు.
నీకు తెలుసు కదా. అతను పక్షవాతంతో కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి చాలా
రోజులైంది. నిన్ను చూసి అతను చాలా సంతోషిస్తా రు. మళ్ళీ పెళ్ళైనతర్వాత అర్చితతో కలసి మనమందరం
అక్కడికి వెళ్దా ం." అందామె. తల్లి మాటలు విని మౌనంగా తల ఉపాడు అభయ్, తనకి అక్కడికి వెళ్ళడానికి
ఇష్ట ం లేకపోయినా.

"అలాగైతే రేపు శనివారం. రేపే బయలుదేరు. రేపు, ఎల్లు ండి ఆదివారం అక్కడే గడిపిరా, పెద్ద తాతగారు నిన్ను
చూసి చాలా సంతోషిస్తా రు." అందామె తిరిగి.
ఆమె మాట తీసెయ్యలేక ఆ మరుసటి రోజు కారు తీసుకొని బయలుదేరాడు అభయ్ పెద్ద తాతగారు ఉండే
ఊరికి. ఆ ఊరు తాముండే పట్ట ణానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. తన తాతగారూ, పెద్ద
తాతగారు కూడా అదే ఊళ్ళో ఉమ్మడిగా ఒకే కుటుంబంలో ఉంటున్నారు. దాదాపు పదేళ్ళక్రితం తన తాతగారు
చనిపోయినప్పుడు ఆ పళ్ళెటూరు వెళ్ళిన అభయ్ ఇప్పటివరకూ మళ్ళీ ఎప్పుడూ ఆ ఊళ్ళో
అడుగుపెట్ట నేలేదు. అతను మళ్ళీ ఆ ఊరికి వెళ్ళకపోవడానికి బలమైన కారణమే ఉంది.

శారద, శేఖర్ మధ్యమధ్య వెళ్తూ నే ఉన్నారు. వాళ్ళు వెళ్తూ న్నప్పుడు అభయ్‌ని కూడా రమ్మని పిలిస్తే, ఏదో సాకు
చెప్పి తప్పించుకునేవాడు. అలాగని అభయ్‌కి పల్లెటూర్లంటే ఇష్ట ం లేదని కాదు. నిజానికి పల్లె వాతావరణం,
పచ్చని పైర్లు , కల్మషం లేని ఆత్మీయతలు, అనురాగాలు, చెరువుగట్లు , గలగలపారే సెలయేరులాంటివంటే
అభయ్‌కి చాలా చాలా ఇష్ట ం. అయితే తాతగారు ఊరంటే కన్నా పెద్ద తాతగారంటే ఇష్ట ం లేకపోవడమే దానికి
ప్రధాన కారణం కూడా. పైగా చాలా ఏళ్ళుగా అతనిమీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు అభయ్.

కారు నడుపుతున్న అభయ్‌మదిలో బోలెడన్ని ఆలోచనలు, గత స్మృతులు సుడులు తిరుగుతున్నాయి. తను


చిన్నప్పుడు తాతగారింటికి వెళ్ళినప్పుటి సంగతి గుర్తు కు వచ్చింది. అప్పుడు తన వయసు సరిగ్గా పన్నెండేళ్ళు.

శారద తండ్రి మాధవరావు, పరంధామయ్య అన్నదమ్ములిద్ద రిదీ ఉమ్మడి కుటుంబం. వాళ్ళిద్ద రికీ కలిపి పాతిక
ఎకరాల పొలం, ఓ పది ఎకరాల కొబ్బరి తోట ఉండేవి. మాధవరావుకి శారద ఒక్కర్తే కూతురు, అయితే ఆమె
పెద్ద నాన్న పరంధామయ్యకి ఇద్ద రు కొడుకులు. అందర్లో కి శారద ఒక్కర్తే అమ్మాయి అవడంవల్ల ఆమె పుట్టి ంట్లో
చాలా గారాబంగా పెరిగింది. ఆ ఇద్ద రు అన్నదమ్ములకీ శారద ముద్దు ల చెల్లెలు. అలాగే మేనల్లు డు అభయ్
అన్నా కూడా వాళ్ళందరికీ చాలా గారాబం. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో ఆ ఊరికి వెళ్ళినప్పుడల్లా చెరువు
గట్ల మ్మట తిరగడం, కొబ్బరి తోటలో ఆడుకోవడం అంటే చాలా ఇష్ట ం అభయ్‌కి. తన కన్న పెద్ద వాళ్ళైన
మావయ్య పిల్ల లతో వెళ్ళి చెరువులో ఈత కొట్టేవాడు. ముందు అభయ్‌కి నీళ్ళల్లో కి దిగడానికి భయం చేసేది.
పెద్ద బావ తనకి ధైర్యం చెప్పి ఈత నేర్పాడు. అలాగే కొబ్బరి తోటలోకి వెళ్తే వాళ్ళని చూడగానే పాలేరు వెంకన్న
లేత కొబ్బరి బోండాలు కొట్టి ఇచ్చేవాడు. బావలతో కలసి అలిసిపోయేవరకూ కొబ్బరితోటలో తిరిగేవాడు.

తాతగారంటే అంటే అభయ్‌కి చాలా ఇష్ట ం. అతను తనపై కురిపించే ప్రేమానురాగాలు ఎప్పటికీ మర్చిపోలేడు.
పెద్ద తాత పరంధామయ్యకి కూడా అభయ్ అంటే అభిమానమే! చిన్నప్పుడు తనని ఎత్తు కొని పోలంగట్ల మ్మట
షికారుకి తీసుకెళ్ల డం, కొబ్బరితోటకు తీసుకెళ్ళడం చేసేవాడు అతను. పొరపాట్న తనని ఎవరైనా ఏడ్పించినా
ఊరుకునేవాడు కాదు. పెద్ద తాతగారు చెప్పే కథలన్నా, కబుర్లన్నా చాలా ఇష్ట ం అభయ్‌కి. కాస్త పెద్దైనాక కూడా
బయటకి వెళ్ళేటప్పుడు తనని ఒక్కడ్నీ వదిలేవాడు కాదతను, వీలుంటే తనే వచ్చేవాడు, లేకపోతే ఇంకెవర్నైనా
వెంట పంపేవాడు. ఊళ్ళో మాత్రం పైవాళ్ళనెవర్నీ మాత్రం కలవనిచ్చేవాడు కాదు. అలా చిన్నప్పుడు అతనంటే
చాలా ఇష్ట ం ఉన్న అభయ్ ఆ తర్వాత కొన్ని సంఘటనల వల్ల అతనిపట్ల అయిష్ట ం పెంచుకున్నాడు. రానురాను
ఆ అయిష్ట ం కాస్తా ద్వేషంగా మారింది.

తనకి పన్నెండేళ్ళ వయసప్పుడు జరిగిన సంఘటన మనసులో బలంగా నాటుకుంది. అదే తనకి పెద్ద తాతైన
పరంధమయ్య మీద అంతులేని ద్వేషం ఆ పసి వయసులోనే ఏర్పడటానికి కారణమైంది. సనాతన
సంప్రదాయాలు పాటించే పరంధామయ్య పూర్తిగా ఛాందసుడు. చాదస్త ం పాలు కాస్త ఎక్కువే. అలాగే మడి,
ఆచారం కూడా.

ఆ రోజు ఎవరితోడూ లేకుండా, ఎవరికీ చెప్పకుండా ఒక్కడూ కొబ్బరితోటవైపు వెళ్ళాడు. అక్కడ పాలేరు
రంగన్న కొడుకు వెంకన్న, తన ఈడు వాడే కనిపిస్తే వాడిని పరిచయం చేసుకుని వాడితో ఆడుకున్నాడు.
తనకన్న వయసులో పెద్ద వారైన బావలకంటే కూడా వెంకన్నతో ఆడుకోవడం బాగా నచ్చింది అభయ్‌కి. వాడు
తనకి రకరకాల కొత్త ఆటలు కూడా నేర్పాడు. అలా తామిద్ద రూ ఆడుకుంటున్న వేళ అప్పుడే అజమాయిషీ
చేయడానికి అక్కడికి వచ్చిన పరంధామయ్య కంట్లో పడ్డా రిద్ద రూ. వెంటనే అభయ్‌ని బలవంతంగా అక్కణుంచి
లాక్కువచ్చాడు.

అప్పుడు తనతో అన్న మాటలు ఇంకా గుర్తు న్నాయి.

"ఎందుకురా, అలాగా జనాలతో ఆడతావు? అంతగా నువ్వు ఆడుకోవాలని అనుకుంటే నీ బావలతో అడుకో,
అంతేగానీ ప్రతీ అడ్డ మైన వాళ్ళతో అడకు." అని గట్టిగా మందలించారు. అంతేకాక, రంగన్నని, అతని కొడుకుని
పిలిపించి గట్టి గా మందలించారు.

ఆ సంఘటన అభయ్‌మదిలో బాగా నాటుకుపోయింది. ఇంకా ఇలాంటి చాలా సంఘటనలు అతనిపై ద్వేషాన్ని
పెంచాయి. అతను పూజ చేయడానికి మడి కట్టు కొని ఉంటే ఎవరైనా పొరపాటున అతని వద్ద కు వచ్చినా
విపరీతమైన కోపం వచ్చేది. తను పొరపాటు చేసినా ఏమీ అనేవాడు కాదు కాని, ఒకసారి పనిమనిషి మంగి
కొడుకు పొరపాటున అతనిని ముట్టు కున్నందుకు ఎన్ని చీవాట్లు వేసాడో తనకింకా గుర్తే! అభయ్‌కి ఇలాంటి
చాలా సంఘటనలవల్ల ద్వేషం బాగా పెరిగిపోయింది. తన పెద్ద తాతకి బాగా అహంకారం అని అభయ్
మనసులో గాఢంగా ముద్ర పడిపోయింది. ఇంట్లో గానీ, పొలంలోగానీ పనిచేసే వాళ్ళపైన అతను చూపించే నోటి
దురుసు తనం అన్నా, తన కిందపని చేసే వాళ్ళపైనా అతను చూపే వివక్ష, ప్రవర్తన వలన ఆ చిన్న
వయసులోనే అతనిపై విపరీతమైన అసహ్యం పెంచుకున్నాడు అభయ్. అందుకే పెద్ద తాతగారైన
పరంధామయ్య అంటే అంత అయిష్ట ం, అంతకు మించి అసహ్యం. ఆ తర్వాత మరి ఆ ఊరికి వెళ్ళాలంటేనే
కంపరమెత్తేది అభయ్‌కి. ఒకవేళ ఊరికెళ్ళినా అతని వద్ద కు వెళ్ళేవాడుకాడు. అతనెప్పుడు కలుగజేసుకొని
అభయ్ వద్ద కు వచ్చి ఆప్యాయంగా పలకరించినా మనసుపెట్టి మాట్లా డటానికి ఇష్ట పడేవాడు కాదు.

క్రమంగా ఆ దూరం పెరిగింది. పెద్దైన తర్వాత ఆ ఊరికి వెళ్ళడమే మానుకున్నాడు. తల్లీ తండ్రి రమ్మని
బలవంతం పెట్టి నా చదువు సాకుతో తప్పించుకునేవాడు. పదేళ్ళక్రితం తన తాతగారు, మాధవరావు
గుండెపోటుతో మరణిస్తే ఊరికి వెళ్ళాడు. అదే ఆ ఊరికి చివరిసారి వెళ్ళడం.

ఇప్పుడు ఇష్ట ం లేకపోయినా తల్లి బలవంతంవల్ల మళ్ళీ వెళ్తు న్నాడు.

ముఖ్య రహదారి నుండి తమ ఊరికి వెళ్ళే మట్టి రోడ్డు రావడంతో ఆలోచనల్లో ంచి బయటపడి ఎడమవైపు
కారుని తిప్పాడు. అక్కణ్ణు ంచి ఆ మట్టి రోడ్డు లో ఓ పది కిలోమీటర్ల దూరం వెళ్తే తమ ఊరు వస్తు ంది. ఆ
రోడ్డ ంతా గతుకులమయంగా ఉండటంవల్ల జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ముందుకి పోనిస్తు న్నాడు కారుని.

దారికి ఇరువైపులా పచ్చని పైరు కనువిందు చేస్తో ంది. గాలికి ఊగుతూ పౌర్ణమినాడు అలలురేగే కడలిని
గుర్తు కు తెస్తు న్నాయి. పల్లెటూరి సోయగాలు మనసుని మైమరపిస్తు న్నాయి. ఆ దారిలోనే ఉండుండి ఎడ్ల
బళ్ళు, ట్రా క్టర్లు ఎదురవుతున్నాయి.

కొంతమంది వాళ్ళ బళ్ళు ఆపి తిరిగి చూస్తు న్నారు కార్లో వస్తు న్నది ఎవరా అని. అందులో మధ్యవయస్కుడు
ఒకడు మాత్రం కుతూహలం కొలదీ కారు ఆపి అడిగాడు, "ఎవరు బాబూ?” అని.

కారు ఆపి అద్ద ం కిందకు దించి చూసాడు అభయ్ పలకరించింది ఎవరా అని. పరిశీలనగా చూసిన తర్వాత
గుర్తు పట్టా డు.

"రంగన్నా!...నేను...అభయ్‌ని" అన్నాడు.

"ఎవరూ...అభయా!" అని కొద్దిసేపు ఆలోచించి, "ఆ నువ్వా బాబూ! బాగున్నావా బాబు, ఇదేనా రావడం?"
అన్నాడు.
"అఁ...రంగన్నా! మా పెద్ద తాతగారు ఎలా ఉన్నారు?" ఏదో మాట్లా డాలి కదా అన్నట్లు అడిగాడు.

పెద్ద గా నిట్టూ ర్పు విడిచి, "మీ తాతగారికి ఏం బాగులేదు బాబూ! ధర్మప్రభువులు! కొడుకులందరూ దగ్గ రే ఉన్నా
మీ కోసమే అతని కలవరింతలు బాబు! మిమ్మల్ని చూడాలని తహతహ లాడుతున్నారు." అన్నాడు కంటతడి
పెట్టు కుంటూ.

అతనికి ఒంట్లో బాగులేదన్న సంగతి ఎలాగూ తనకి తెలిసిందే అయినా అతనికోసం రంగన్న కంటతడి పెట్ట డం,
ధర్మప్రభువులని కీర్తించడం మాత్రం అభయ్‌కి విడ్డూ రమనిపించింది. పాపం అమాయకుడు రంగన్న! మూర్ఖపు
చాదస్త ంతో హింసించిన వానిపై అభిమానం చూపిన రంగన్నని చూసి జాలిపడ్డా డు అభయ్.

"అయితే ఆయన నా కోసమే ఎదురు చూస్తు న్నారా?" అడిగాడు.

"అవును బాబూ! మీ కోసమే ఆయన ఎదురుచూపులు! ఇవాళ అమ్మగారివద్ద నుండి ఫోన్ వచ్చినప్పటినుండి
కళ్ళల్లో వొత్తు లు వేసుకొని మరీ ఎదురు చూస్తు న్నారు, బేగి వెళ్ళండి బాబూ!" అన్నాడు రంగన్న పక్కకి జరిగి
దారి ఇస్తూ .

రంగన్నవైపే సాలోచనగా చూస్తూ , "అలాగే, రంగన్నా! అన్నట్లు మరిచాను. నీ కొడుకు వెంకన్న


ఇప్పుడెక్కడున్నాడు? ఇక్కడే పాలేరుగా ఉన్నాడా?" అడిగాడు అభయ్. తన పెద్ద తాతగారి వద్ద పని చేసే
రంగన్న కొడుకు వెంకన్న అంతకు మించి ఎలా ఎదుగుతాడన్నది అభయ్ ఊహ.

అభయ్ మాటలకి ఆశ్చర్యపోయి,"అందేంటిబాబు, అలాగంటారు? వెంకన్న ఇంజినీరింగ్ చదువు పూర్తిచేసి


హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తు న్నాడు కదా! అవునులే మీకు తెలియదు కదా? మీరు ఇక్కడికి వచ్చి చాలా
రోజులైందాయె!" అన్నాడు రంగన్న.

"ఆఁ..." ఈ సారి ఆశ్చర్యపోవడం అభయ్‌వంతైంది. పాలేరు రంగన్న కొడుకు అంత ఎదిగి ఉంటాడని
ఊహించలేదు అభయ్. వెంకన్న ఇంజినీరయ్యాడా? నమ్మశక్యంగా అనిపించలేదు అభయ్‌కి.

"అవును బాబూ, నిజం! అంతా ఆ ధర్మ ప్రభువుల దయ! మీరు వెళ్ళండి బాబు, నేను కొద్దిసేపు తర్వాత
వస్తా ను." అన్నాడు రంగన్న అక్కణ్ణు ంచి కదులుతూ.

ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి కొద్దిసేపుపట్టింది అభయ్‌కి. రంగన్న వెళ్ళినవైపే చూస్తూ కారుని ముందుకి
పోనిచ్చాడు.

ఊరు దగ్గ రకొచ్చేసింది. ఈ పదేళ్ళలో ఊరు చాలా మారిపోయింది. ఇంతకు మునుపు గుడిసెలు ఉన్న స్థా నంలో
చిన్న పెంకుటిళ్ళు, డాబా ఇళ్ళు లేచాయి. సినిమా హాలు కూడా ఒకటి వెలిసింది. కొత్త గా కనిపిస్తు న్న ఊరిని
చూస్తూ ముందుకి సాగాడు అభయ్. అంతా మారింది కాని ఊరి రహదారుల్లో మాత్రం పెద్ద గా మార్పు లేదు.

ఓ పదినిమిషాలలో తాతగారి ఇంటికి చేరుకున్నాడు. వీధి అరుగులోనే కూర్చున్న పెద్ద బావ భాస్కరం కారు
చూస్తూ నే ముందుకి వచ్చాడు.

"ఏరా! అభయ్!...చాలా ఏళ్ళ తర్వాత వచ్చావు. బహుశా, పదేళ్ళు దాటిందేమో నువ్వు ఇక్కడికి వచ్చి."
అన్నాడు పలకరించి.

"అవును, చాలా రోజులైంది." అని భాస్కరంకి జవాబిచ్చి కారు డిక్కి తెరిచి తన బ్యాగ్ భుజానేసుకొని ఇంట్లో కి
అడుగుపెట్టా డు. చాలా రోజుల తర్వాత ఆ లోగిలిలో అడుగుపెట్టా డేమో ఆ ఇల్ల ంతా విచిత్రంగా కనిపిస్తో ంది. ఆ
పాత ఇల్లు చాలావరకూ రీమోడలింగ్ అయి బాగా కొత్త గా కనిపిస్తో ంది.
ఇంట్లో కి వెళ్ళగానే బిలనిలమని పిల్ల లు చుట్టు ముట్టా రు అభయ్‌ని. పిల్ల ల్ని చూసేసరికి ఇంతదూరం కారు నడిపి
వచ్చిన అలసట ఒక్కసారి దూరమైనట్లు అనిపించింది. బ్యాగ్ తెరిచి తనతో తెచ్చిన చాక్లెట్లు అందరికీ
అందించాడు. అప్పుడే బయటనుండి వచ్చిన చిన్న బావ ఆదిత్య అభయ్‌ని పలకరించాడు.

"బావా! నీ బ్యాగ్ ఈ రూములో ఉంచు. ఎప్పుడనగా బయలుదేరావో, స్నానం చేసి ఫ్రెష్ అయి రా! భోజనం
చేద్దా ం! తాతగారు భోజనం చేసి నిద్రపోతున్నారు. అతను మేలుకున్నాక కలుసుకుందాం." అన్నాడు ఆదిత్య.

అభయ్ స్నానం చేసి వచ్చేసరికి హాల్లో అతని కోసం అందరూ వేచి చూస్తు న్నారు. మావయ్యలిద్ద రూ అభయ్‌ని
కలవడానికి కాచుకొని ఉన్నారు. అభయ్‌ని ఆప్యాయంగా పలకరించారిద్ద రూ.

"మీ అమ్మ, నాన్న కూడా రావలసింది. వాళ్ళని కూడా కల్సి చాలా రోజులైంది.” చెప్పాడు పెద్ద మావయ్య.

"పెళ్ళిపనుల్లో తీరుబాటులేదు మావయ్యా! అయితే వీలు చూసుకొని అందర్నీ పిలవడానికి వస్తా మన్నారు.
బహుశా, వచ్చే వారం వస్తా రనుకుంటా!" అన్నాడు.

చాలా రోజులతర్వాత వాళ్ళందరితోనూ కలిసి భోజనం చేయడం అభయ్‌కి చాలా ఆనందమనిపించింది.


చిన్ననాటి రోజులు గుర్తు కు వచ్చాయి. అత్త లిద్ద రూ కొసరికొసరి వడ్డిస్తూ ంటే, పెద్ద బావ, చిన్నబావ
హాస్యాలాడుతుంటే వాళ్ళ అభిమానానికి కళ్ళు చెమర్చాయి అభయ్‌కి. వాళ్ళ మాటలతోనే కడుపు
నిండిపోయినట్ల నిపించింది అభయ్‌కి. పెద్ద తాతగారిపై ద్వేషం లేకపోయుంటే తను ఇక్కడికి నెలకోసారైనా వచ్చి
ఉండేవాడనని మనసులోనే అనుకున్నాడు అభయ్.

భోజనం చేసిన తర్వాత తాతగారు లేచారని తనకోసం ఎదురు చూస్తు న్నారని చెప్పాడు ఆదిత్య. అభయ్
ఆదిత్యతో తాతగారి గదికి వెళ్ళారు. బెడ్‌పైన ఉన్న పరంధామయ్యని చూసాడు అభయ్. తను పదేళ్ళక్రితం
చూసినప్పటికి ఇప్పటికి అతనిలో ఎంతో తేడా! ఠీవిగా రాజసం ఉట్టిపడే ఆ పరంధామయ్య ఎక్కడ, ఇప్పుడు
బెడ్‌పై నిస్సహాయంగా పడి ఉన్న ఇతను ఎక్కడ! చాలా చిక్కిపోయి, శుష్కించిపోయి ఉన్నాడతను. అంతగా
ద్వేషించే అభయ్ కళ్ళలో కూడా అప్రయత్నంగా చిన్న కన్నీటిపొర ఏర్పడింది. మాట్లా డే స్థితిలో కూడా ఉన్నట్లు
లేరతను. అభయ్‌ని దగ్గ రకు పిలిచి చేయి నిమిరారు ప్రేమగా.

ఇంతకుముందు అతను అలా చేయి వేస్తే తేళ్ళు జెర్రిలు ప్రా కిన ఫీలింగ్ కలిగేది. కాని అభయ్‌కి ఇప్పుడలా
అనిపించలేదు. అందుకు కారణం నిస్సహాయ స్థితిలో ఉన్న అతనిపై జాలి కావచ్చని అనుకున్నాడు అభయ్.

"ఎలా ఉన్నావు?" అస్పష్ట ంగా ఆ ఒక్కమాట వినబడింది అతని నోట. బాగున్నానని తల ఉపాడు అభయ్.

"నా మీద నీకు కోపం ఉంది కదూ?..."అన్నారు అతను మెల్ల గా కూడదీసుకొని.

లేదన్నట్లు తల అడ్డ ంగా ఉపాడు ఈ స్థితిలో అతన్ని మరి బాధించడం ఇష్ట ంలేని అభయ్.

కొద్దిసేపు అక్కడే ఉండి తన రూముకి తిరిగివచ్చాడు అభయ్. విశ్రా ంతికోసం మంచంపై వాలాడు గాని ఎంతకీ
నిద్ర కరుణించలేదు. దీనంగా తనవైపు చూస్తు న్న పెద్ద తాతగారి మొహమే కళ్ళముందు కదులుతోంది.
ఇంకొద్దిసేపు చూసి మరెలాగూ నిద్రపట్ట దని గ్రహించి లేచి ముఖం కడుక్కుని టివిముందు కాస్సేపు
కూర్చున్నాడు.

సాయంకాలం నాలుగు గంటలైనతర్వాత ఇంట్లో ఏమి తోచక ఓ సారి తిరిగివస్తా నని బయలుదేరాడు అభయ్.
చిన్నబావ తోడు వస్తా నని వెంటబడితే, "నేనింకా చిన్నపిల్ల డ్ని కాను బావా! చిన్నప్పుడైతే నన్నెక్కడికీ ఒంటరిగా
వెళ్ళనిచ్చేవారు కాదు. అయినా వెళ్ళేవాడిననుకో! ఓ సారి అలా తిరిగివస్తా ను." నవ్వుతూ చెప్పి ముందుకి
నడిచాడు.
అలా బయలుదేరిన అభయ్‌కి ఊళ్ళో చాలా మార్పులు కనబడ్డా యి. అభయ్‌ని తెలిసినవాళ్ళు
పలకరిస్తు న్నారు. తెలీనివాళ్ళు కుతూహలంగా అడిగి తెలుసుకుంటున్నారు. తను చిన్నప్పుడు తిరిగిన
ప్రదేశాలన్నీ తిరిగి చివరికి కొబ్బరితోటకి వెళ్ళాడు. ఆ తోటలో ఓ మూల ఉన్నఇంట్లో ఉంటున్నాడు రంగన్న.

అభయ్ అక్కడికి వెళ్ళి తలుపు తట్టా డు. రంగన్న భార్య తలుపు తీసి అభయ్‌ని చూసి భర్తని పిలిచింది, "నీ
కోసం ఎవరో వచ్చారు చూడు మావా!" అని. రంగన్న బయటి వచ్చి అభయ్‌ని చూసి, "నువ్వా బాబూ! రా
బాబూ లోపలికి రా!" అన్ని, భార్యవైపు తిరిగి, "రంగీ! ఈ అబ్బాయి ఎవరో తెలుసా!" అంటూ ఆమెతో ఏదో
చెప్పాడు. అతని మాటలు వింటూనే ఆమె అభయ్‌వైపు కుతూహలంగా చూసి మెల్ల గా ఏదో అన్నది.

ఆమె రంగన్నతో ఏదో గుసగుస లాడటం గమనించాడు అభయ్ కానీ అదేమిటో తెలియలేదు. "ఏమిటి
రంగన్నా?" అని అడిగాడు. రంగన్న "ఏమీ లేదు బాబు! చాలా రోజులైంది కదా చూసి, తమరిని గుర్తు పట్ట లేదు
రంగి." అన్నాడు. రంగన్న మాటల్లో తడబాటు గ్రహించాడు అభయ్. "పదండి బాబూ! తోటలోకి వెళ్దా ం"
అంటూ బయటకి వచ్చిన రంగన్నని అనుసరించాడు అభయ్. రంగన్న, రంగి ఏమి గుసగుసలాడుకున్నారో,
ఎందుకు రంగన్న తనతో మాట్లా డేటప్పుడు తడబడ్డా డో అర్ధ ం కాలేదు అభయ్‌కి.

తోటలో రంగన్నతో తిరిగి తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు అభయ్. అప్పుడు గుర్తు కు వచ్చింది
అభయ్‌కి రంగన్న కొడుకు వెంకన్న గురించి. వెంకన్న గురించి అడిగాడు.

"మీ పెద్ద తాతగారే ఆదుకోకపోతే మా వెంకన్న ఇలాంటి స్థితిలో ఉండేవాడా బాబూ? మీ తాతగారు ధర్మ
ప్రభువులు! వాడి చదువంతా అతని చలువవల్లే సాగింది. ఏం చేసినా అతని ఋణం తీర్చుకోలేను బాబూ!"
అన్నాడు రంగన్న కళ్ళు చెమర్చగా.

"ఆఁ...నిజమా!" రంగన్న మాటలు నమ్మలేక అన్నాడు అభయ్.

"అవును బాబూ! మీకు అతని మీద అలక ఉందని తెలుసు. పైకి ఆయనెంత కఠినంగా కనిపించినా, మనసు
మాత్రం వెన్న. మాకెప్పుడూ ఏ లోటూ చేయలేదు. అలానే ఒక్క వెంకన్ననేకాదు, ఈ ఊళ్ళో చాలామందిని
చదివించారాయన. అందరికీ పైకి తెలిసేది అతని చాదస్త ం మాత్రమే! అతని మనసు ఎంతమందికి తెలుస్తు ంది?
ఇలా ఎంతమంది చదువులకి, పెళ్ళిళ్ళకి సహాయం చేసారో ఆయన?" చెప్పాడు రంగన్న.

"ఆఖరికి మీరు..." ఏదో చెప్పబోయి ఆగిపోయాడు రంగన్న.

"ఆఁ...ఏంటి రంగన్నా! నేను..."

"ఏమీలేదు బాబూ, చాలా చీకటిపడింది, ఇంటికిపదండి. మీరు వచ్చి చాలా సేపయ్యింది. ఇంట్లో మీ కోసం
ఎదురు చూస్తూ ఉంటారు. పదండి. నేనూ వస్తు న్నా!" అని మాట మార్చాడు. రంగన్న ముందుకి దారితీయగా
అభయ్ అతని వెంట నడిచాడు. చీకటిపడినా ఊళ్ళో సందడి సద్దు మణగలేదు. తోవలో ఎదురుపడినవాళ్ళు
రంగన్నతో మాట్లా డుతూనే ఉన్నారు. ఏదో అడుగుతూంటే, అతను వారికి ఏవో సమాధానాలు చెప్తూ ఉన్నాడు.

వాళ్ళు కుతూహలంగా తనని చూడటం అభయ్ చూపుని దాటిపోలేదు. ముందు ఆ సంగతి


పట్టించుకోలేదుకాని, రంగన్నతో మాట్లా డిన వాళ్ల ందరూ తనని గుచ్చిగుచ్చి చూడటం విడ్డూ రమనిపించింది.

ఈ లోగా ఇంటి వద్ద కు చేరుకున్నారిద్ద రూ. వరండాలోనే ఎదురైంది వాళ్ళ ఇంట్లో పనిచేసే మంగి. రంగన్నతో
ఉన్న అభయ్‌ని చూస్తూ నే, "ఆఁ...! ఈ అబ్బాయేనా మన సోమన్న కొడుకు! ఎప్పుడో చిన్నప్పుడు చూసాను.
ఎంత ఎదిగిపోయాడు?" అంది అతనివైపే చూస్తూ , రంగన్న చూపులతో ఎంత వారిస్తు న్నా గమనించకుండా.
అయితే అభయ్ మాత్రం అది గమనించాడు. తనని ‘సోమన్న కొడుకు ‘అని అంటున్నదేమిటి ఆమె అని
మాత్రం అర్థ ం కాలేదు. అందులో ఏదో రహస్యం ఉందని మాత్రం తోచింది అభయ్‌కి. అప్పుడు ఇంకేమీ
మాట్లా డకుండా ఇంట్లో ప్రవేశించాడు.

రంగన్న కూడా ఇంట్లో ప్రవేశించగానే, "ఏమిటి రంగన్నా, నన్ను పట్టు కొని సోమన్న కొడుకంటుందేమిటి?" అని
అడిగాడు.

"ఆఁ...ఏం లేదు బాబు. ఆమె ఈ మధ్య కొంచెం అలా అర్ధ ంపర్ధ ం లేని మాటలు మాట్లా డుతోంది." తడబడుతూ
తప్పించుకోచూసాడు రంగన్న.

"చూడు, రంగన్నా! నేను వచ్చినప్పటి నుండి చూస్తు న్నాను. నన్నందరూ ఎందుకో గుచ్చి గుచ్చి చూస్తు న్నారు,
చివరికి నీ భార్య కూడా! ఇప్పుడేమో ఈమె కూడా ఏమంటుందో అర్ధ ం కావడంలేదు. మీరందరూ ఏదో
దాస్తు న్నారు. నువ్వైనా చెప్పు సంగతేమిటో?" అన్నాడు అభయ్.

ఏమీ చెప్పకుండా దిక్కులు చూస్తు న్న రంగన్నని తన గదిలోకి లాక్కుపోయాడు అభయ్. రంగన్న రెండు
చేతులూ పట్టు కొని, "చెప్పు రంగన్నా! నిజం చెప్పు! చిన్నప్పటినుండీ నువ్వంటే నాకు చాలా గౌరవం. నన్ను
అందరూ అదోలా ఎందుకు చూస్తు న్నారు? సోమన్న ఎవరు?" అడిగాడు అభయ్ కుతూహలం ఆపుకోలేక.

అభయ్ చేతులు విడిపించుకొని దూరంగా జరిగాడు రంగన్న. రెండు నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత నోరు
విప్పాడు, "బాబూ ఆ విషయం మీకు చెప్పకూడదు. మీకు తెలియకపోవడమే మంచిది." అన్నాడు
తలవంచుకొని.

"ఏం రంగన్నా! ఏమిటంత రహస్యం! నాకు చెప్పకూడనంత రహస్యం ఏమిటి? నిజం చెప్పు, నా మీద ఒట్టు !"
రెట్టించాడు అభయ్.

ఆఖరికి చెప్పకతప్పలేదు రంగన్నకి. "అసలు...అసలు బాబూ...మీరు ఆ సోమన్న సొంత బిడ్డ ." చెప్పలేక
చెప్పాడు రంగన్న.

"అఁ..." ఆ మాటలు విన్న అభయ్ నిశ్చేష్టు డైయ్యాడు. అతని మొహం తెల్ల గా పాలిపోయింది.

"నిజమా!...నిజమా!!..." రంగన్న మాటలకి తట్టు కోలేక అతని భుజాలు పట్టు కు కుదిపేస్తూ అడిగాడు అభయ్.

"అవును బాబూ...మీరు శారదమ్మ బిడ్డ కారు. మీ పెద్ద తాతగారు పరంధామయ్యగారి వద్ద పాలేరుగా పని
చేస్తు న్న సోమన్న బిడ్డ మీరు. పట్నం వెళ్ళి తిరిగివస్తూ మీ అమ్మానాన్నా రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు.
మీరొక్కరే ఆ ప్రమాదం నుండి బయటపడ్డా రు. మీ అమ్మానాన్నా ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవడంతో
వాళ్ళని బంధువులందరూ వెలివేసారు. అప్పుడు వాళ్ళని ఆదుకున్న మీ పెద్ద తాతగారే వాళ్ళకి దేవుడు. మీ
నాన్న తరఫు వాళ్ళుగానీ, అమ్మ తరఫు వాళ్ళుగానీ మీ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాకపోతే మీ
బాధ్యత అతనే తీసుకున్నారు పాపం. శారదమ్మగారికి పిల్ల లు కలగకపోవడం వల్ల మిమ్మల్ని వాళ్ళకి
పెంచుకోవడానికి ఇచ్చారు." అని ఆగాడు రంగన్న.

రంగన్న మాటలు విన్న అభయ్‌కి తల తిరుగుతున్నట్లు అనిపించి నిస్త్రా ణంగా సోఫాలో కూలబడ్డా డు. నమ్మలేని
ఈ నిజాన్ని జీర్ణించుకోవడం అసాధ్యమైంది.

"అలా మీరు శారదమ్మ, శేఖర్‌గారి వద్ద పెరిగారు. వాళ్ళు మిమ్మలెంత అలారు ముద్దు గా పెంచుకున్నారో మీకు
తెలుసుగా. అసలు ఈ రహస్యం ఎవరికీ చెప్పకూడదని పరంధామయ్యగారు మా అందర్నీ శాసించారు కూడా.
అందుకే మీరు ఈ ఊరు వచ్చినప్పుడు ఒంటరిగా ఎక్కడికీ వదిలేవారు కాదు. ఎవరితోనూ కలవనిచ్చేవారు
కాదు, ఈ రహస్యం బయటపడుతుందని, అందుకు మీరు నొచ్చుకుంటారని. మీరు ఎప్పటికీ ఈ నిజం
తెలుసుకోకూడదనే ఆయన భావన. అందుకే మీరు బయటకి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు తోడు వచ్చేవారు. ఈ
విషయం కనీసం మీ బావలిద్ద రికీ కూడా తెలియకుండా పెంచారాయన. అంత గొప్ప వ్యక్తి మీ పెద్ద తాతగారు.
అందుకే మీకు చెప్పలేదు. కానీ మీరు మీ మీద ఒట్టు పెట్టు కునేసరికి నాకు చెప్పక తప్పలేదు. మీకు అతనిపై
కోపం ఉందని నాకు తెలుసు. అతని మనసు వెన్న బాబూ! పైకి మాట కఠినంగా కనిపించినా అతని హృదయం
చాలా మెత్త న! మా వెంకన్న కూడా ఇప్పుడు ఇంత ఉన్నత స్థితిలో ఉన్నాడంటే అతని చలువే కారణం. అతను
తన చాదస్త ంతో, మాటలతో బాధించడమే మీరు చూసారుగాని, ఆయన ఎంతమంది మా లాంటి వారికి కొలిచే
దేవుడో మీకు తెలియదు బాబూ. మాలాంటి అందరి బ్రతుకులు చల్ల గా సాగడానికి కారణం అతని కృపే బాబూ!
ఎంతమంది మాలాంటి వారికి అజ్ఙా తంగా అతను సహాయం చేసారో?" చెప్పాడు రంగన్న కళ్ళు చెమర్చగా.

ఆ మాటలు విన్న అభయ్ కళ్ళు వర్షించాయి. ‘తనెంత అపార్థ ం చేసుకున్నాడు తనపాలిట దైవంలాంటి అతన్ని.
తనలాంటి వాడికి ఎంత ఉన్నత స్థితి కలిగించారు. తను కలలో కూడా ఊహించలేని ఉజ్జ్వల భవిషత్తు
ఇచ్చారాయన, అలాంటి అతనిపైనా తను అలకబూనాడు? అప్పటికి అభయ్‌కి అర్ధ మైంది తను ఊరికి
వచ్చినప్పుడు తనకెందుకు అంత కట్టు దిట్ట ం చేసేవారో అని. తను ఏం చేస్తే అతని ఋణం
తీర్చుకోగలుగుతాడు! తనని ఆదరించి ఇంత మంచి జీవితం ప్రసాదించిన అతన్ని అకారణంగా తనెంత
ద్వేషించాడు? తన పాపానికి ప్రా యశ్చిత్త ం లేదా!’ ఆక్రో శించింది అభయ్ మనసు.

తనకి దైవంలాంటి పెద్ద తాతగార్ని క్షమాపణ అడగాలి అని తలచి వర్షించిన కళ్ళతో అతని గదిలోకి
దూసుకువెళ్లా డు అభయ్. పరంధామయ్యగారి చెంతకువెళ్ళి కూర్చున్నాడు. అభయ్ కన్నీళ్ళు అతని పాదాలని
అభిషేకించసాగాయి. అప్పుడే నిద్రలోనుండి లేచి కళ్ళు తెరిచిన పరంధామయ్యగారి చల్ల ని చూపు అభయ్‌పై
ప్రసరించింది. అతని కళ్ళల్లో అనంతమైన వెలుగు గోచరించింది అభయ్‌కి. ఆ వెలుగే తనకి దారి చూపిస్తు న్నట్లు
అనిపించింది. తన తప్పుల్ని క్షమించి, తనని ఆశీర్వదిస్తు న్నట్లు అనిపించింది అభయ్‌కి. అప్రయత్నంగా చేతులు
రెండూ జోడించి కన్నీళ్ళతో పరంధామయ్య గుండెలపై వాలాడు అభయ్.
మమతానురాగాలు - మల్ల వరపు సీతాలక్ష్మి
Object 4

నిద్ర లేవడం తోనే టీవీ ఆన్


చేసి న్యూస్ చూడడం
అలవాటు శ్రీ రామ్ కి. కానీ
ఇటీవలి కాలంలో రోజంతా
మహమ్మారి అనే వ్యాధి
గురించిన వార్తలే.
మహమ్మారి అనేది ఇటీవలే
దేశమంతా వ్యాపిస్తు న్న ఒక
వ్యాధి. టీవీ నిండా దానికి
సంబంధించిన వార్తలే.
ఎప్పటిలాగే ఆ రోజు టీవీ ఆన్
చేసి వెంటనే ఛానల్
మార్చేశాడు శ్రీరామ్. వ్యాధి
కంటే దానికి సంబంధించిన
వార్తలే ప్రజలకు ఎక్కువ
ఆందోళన కలిగిస్తు న్నాయి.
మహమ్మారికి గురైన వారిని
కుటుంబ సభ్యులే దూరంగా
ఉంచుతున్నారు. ప్రతి
ఒక్కరూ తాము బ్రతికితే
చాలు అనుకునేంతగా ఆ
వ్యాధి అందరినీ
భయపెడుతోంది.

వంటింట్లో ఫోన్
మాట్లా డుతున్న సునీత
గొంతులో ఆదుర్దా .

“ఎప్పుడూ.....! అవునా.....! అయ్యో......! మరి నాన్నగారి పరిస్థితి ఏమిటి?.....” ఫోన్ ముగించి ఆందోళనగా
భర్త వద్ద కు వచ్చింది సునీత.

"ఏమైంది సునీతా!” అడిగాడు శ్రీరామ్.

"మా తమ్ముడికి జ్వరంగా ఉందట.”

"ఎప్పటినుంచి?"

"నాలుగు రోజులుగా ఉందట.”

"మరి మహమ్మారి టెస్ట్ చేయించారా?”


"లేదు భయపడుతున్నాడు.”

"నిజమే! మహమ్మారి ఉన్నట్టు తేలితే నలుగురూ వెలి వేసినట్లు చూస్తు న్నారు. అలాగని దాచి పెడితే దాగేది
కాదు. ఇంట్లో అందరికీ వస్తు ంది.”

"అదేనండి ఆందోళన. వాడంటే చిన్నవాడు తట్టు కునే శక్తి ఉంది. కానీ మా నాన్నగారు పెద్ద వారు. ఈ వ్యాధి
ఆయనకు వస్తే తట్టు కోలేరు." బాధగా చెప్పింది సునీత.

సునీత తండ్రి జనార్ధ న రావు గారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు . నెల్లూ రులో తన పెద్ద కొడుకు
రామారావు దగ్గ ర ఉంటున్నారు. రెండవ కొడుకు సురేష్ అమెరికాలో ఉంటున్నాడు

జనార్ధ న రావు గారికి ఇటీవలే హార్ట్ సర్జరీ జరిగి కోలుకున్నారు. ఈ పరిస్థితులలో ఆయనకి మహమ్మారి వస్తే
చాలా ఇబ్బంది పడాల్సి వస్తు ంది.

సునీత కు తండ్రి మీద చాలా అభిమానం. ఆయనకు ఈ వ్యాధి రాకుండా ఎలాగైనా కాపాడుకోవాలి. కానీ
ఏమిటి మార్గ ం? అమెరికాలో ఉన్న తన తమ్ముడు సురేష్ కు ఫోన్ చేసింది.

"అక్కయ్యా! నువ్వు చెప్పిన వివరాలను బట్టి అన్నయ్యకు మహమ్మారి వచ్చినట్లు ంది. మరి నాన్న ను ఎలా
కాపాడుకోవాలి? అన్నయ్య ను ఒప్పించి హాస్పిటల్ లో చేర్పించాలి లేదా విడిగా గది తీసుకొని అందులో
ఉంచాలి.”

“ఈ వయసులో నాన్నగారు ఒంటరిగా ఎలా ఉంటారు? ఈ పరిస్థితులలో ప్రయాణం చేసి ఇక్కడికి రావడం
కూడా ప్రమాదమే! ఏం చేయాలో పాలుపోవడం లేదు దిగులుగా చెప్పింది సునీత.”

“బహుశా నాన్నకు ఈపాటికే ఈ వ్యాధి వచ్చి ఉండవచ్చు .లక్షణాలు బయటకు రావడానికి మరికొన్ని రోజులు
పట్ట వచ్చు. ఈ పరిస్థితులలో మీ దగ్గ రకు తీసుకొని వస్తే నీకు ,బావకు కూడా ప్రమాదమే! ఎటూ తేల్చలేని
ఇబ్బంది వచ్చింది .ఒకసారి నాన్న గారికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పు.” అన్నాడు సురేష్.

"నెల్లూ రు లో మేము కొన్న ఇల్లు ఖాళీగా ఉందిగా. నాన్నగారిని అక్కడికి వచ్చి ఉండమని చెబుతాను" చెప్పింది
సునీత. ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే జనార్ధ న రావు గారు నుండి ఫోన్ వచ్చింది.

, "అమ్మా! మీ తమ్ముడికి నాలుగు రోజులుగా జ్వరంగా ఉంది .నాకు ఇక్కడ ఉండాలంటే భయంగా ఉంది .ఏం
చేయాలో పాలుపోవడం లేదు "దీనంగా చెప్పారు జనార్ద న్ రావు గారు. ఏమీ చెప్పలేక మౌనంగా
ఉండిపోయింది సునీత. అంతా గమనిస్తు న్న శ్రీరామ్ ఆమె చేతి నుంచి ఫోన్ తీసుకున్నాడు.

"మామయ్యగారూ!మా దగ్గ రకు వస్తా మని చాలా రోజు నుంచి చెప్తు న్నారు .కానీ రాలేదు .అక్కడ ఏవో పనులు
ఉన్నాయని వారం పడుతుందని పోయిన వారం చెప్పారు. బహుశా మీ పనులు ఈపాటికి పూర్తి అయి
ఉంటాయి వెంటనే బయలుదేరి మా దగ్గ రకు రండి .కారు ఏర్పాటు చేస్తా ను " చెప్పాడు శ్రీరామ్." అలాగే
అల్లు డు గారు తప్పకుండా వస్తా ను" జనార్ద న్ రావు గారి గొంతులో ఆర్ద ్రత.

భర్త ఫోన్ పెట్ట గానే అతని దగ్గ రకు వచ్చింది సునీత . "ఏమండీ! ఒకవేళ నాన్నగారికి కూడా ఆ వ్యాధి సోకి
ఉంటే?----" సునీత కళ్ళలో నీళ్ళు. ఆమెను ఓదార్పుగా దగ్గ రకు తీసుకున్నాడు శ్రీరామ్. ఈ పరిస్థితిలో మా
నాన్నగారు ఉంటే వదిలివేయ లేను కదా! మీ నాన్నగారు అయినా అంతే! ఎలాగైనా ఆయనను కాపాడుకోవాలి
చెప్పాడు శ్రీరామ్. ఆ రోజు రాత్రికే వారి దగ్గ రకు చేరుకున్నారు జనార్ద న్ రావు గారు. అక్కడకు వచ్చిన
మూడవరోజే ఆయనకు జ్వరం మొదలైంది. దాంతోపాటే ఇతర మహమ్మారి లక్షణాలు కూడా కనిపిస్తు న్నాయి.
దిగులుగా భర్త దగ్గ రకు వచ్చింది సునీత.
" ఏమండీ! నాన్నగారికి జ్వరం మొదలైంది. ఒకవేళ మహమ్మారి అయితే ఏం చేయాలి? ఆయనని విడిగా ఒక
గదిలో ఉంచాలా ?

టెస్ట్ చేసి మహమ్మారి అని తేలితే ఎలా? ఒంటరిగా హాస్పిటల్లో ఉంచాలా?"

“80 ఏళ్ల వయసులో ఆయన లో చాలా భయాలు ఉంటాయి. తనకు మహమ్మారి అని తేలితే ఆయన
తట్టు కోలేరు. ఏదో మామూలు జ్వరం అని చెబుతూ ఉండు. వీలైనంత వరకు ఇంట్లో నే ట్రీట్ చేద్దా ం. మరీ విధి
లేని పరిస్థితులలోనే హాస్పిటల్లో చేరుద్దా ం. జ్వరంతో ఉన్న వారిని ప్రేమగా దగ్గ రకు తీసుకుని ,తల నిమరడం ఆ
తరం వారికి అలవాటు.విడిగా ఒక గదిలో బంధిస్తే ఆయన తట్టు కోలేరు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను.

ఆయనతో పాటే మనమిద్ద రమూ!.మామూలు జ్వరం అయినా, మహమ్మారి అయినా భరించడానికి సిద్ధ ంగా
ఉందాం. ఆత్మవిశ్వాసంతో వ్యాధిని జయిద్దా ం. అలాగని మన వల్ల ఇతరులకు ఈ వ్యాధి సోక కూడదు .నేను
ఆఫీసుకు సెలవు పెడతాను .నువ్వు కూడా పనిమనిషిని మాన్పించు. ముగ్గు రము ఇల్లు కదలకుండా ఉందాం"
అన్నాడు శ్రీరామ్.

తన తండ్రి గురించి భర్త మనసులో ఉన్న ఆలోచన చూసి సునీత కళ్ల లో నీళ్లు తిరిగాయి. భయపడినంతా
జరిగింది. జనార్ధ న రావు గారికి వదలకుండా జ్వరం వస్తో ంది. అది మామూలు జ్వరమేనని, త్వరలో
తగ్గిపోతుందని ధైర్యం చెబుతున్నారు, శ్రీరామ్ ,సునీతలిద్ద రూ!

మరో నాలుగు రోజులు గడిచాయి. రోజు ఉదయం ఆరింటికల్లా నిద్ర లేచే శ్రీరామ్ ఆరోజు ఏడైనా లేవక
పోవడంతో దగ్గ రికి వచ్చి కదిలించింది సునీత. శ్రీరాం ఒళ్ళు వెచ్చగా తగలడంతో ధర్మామీటర్ పెట్టి చూసింది.
కొద్దిపాటి జ్వరం ఉంది. మెల్ల గా అతనిని నిద్ర లేపింది. “ఏం పర్వాలేదు ముందే ప్రిపేర్ అయ్యాము కదా” అని
ధైర్యం చెప్పాడు శ్రీరామ్. “ తనవల్ల అల్లు డికి కూడా జ్వరం వచ్చిందని తెలిస్తే మామగారు బాధపడతారని
ఆయనకు ఈ విషయం చెప్పవద్దు ” అన్నాడు .

సునీతకు ఆందోళన పెరిగింది. భర్త కి కూడా మహమ్మారి సోకినట్లు ఉంది. భర్త కి ఏమవుతుందో అన్న భయం
పెరిగింది ఆమెకు. హైదరాబాదులో ఉన్న కొడుకు విజయ్ కి ఫోన్ చేయాలని నిశ్చయించుకుంది.

విజయ్ అమెరికా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తు న్నాడు. కోడలు ప్రణవి కూడా అక్కడే పని చేస్తో ంది.
హైదరాబాదులో తన ఫ్రెండ్ మ్యారేజ్ కోసం ఇండియాకి వచ్చిన విజయ్ మహమ్మారి కారణంగా ఫ్ల యిట్స్
రద్ద వడంతో అక్కడే ఉండిపోవాల్సివచ్చింది. విజయ్ కి ఫోన్ చేసి ఈ విషయం వివరించింది సునీత. తల్లి
ద్వారా విషయం తెలుసుకున్న విజయ్ తండ్రికి ఫోన్ చేశాడు.

“నువ్వు కంగారు పడి రావాల్సిన అవసరం లేదు. చాలా మైల్డ్ గానే వచ్చినట్లు ంది. త్వరలోనే తగ్గిపోతుంది.

మీ తాతయ్య టెస్ట్ చేయించుకోవడానికి కాస్త భయపడుతున్నారు. నేను టెస్ట్ చేయించుకుని, ఆ మందులే


ఆయనకి వాడుతాము” అని చెప్పాడు శ్రీ రామ్. "అలాగే!" అని ఫోన్ పెట్టేసిన విజయ్ మరుసటి రోజు
ఉదయానికి తండ్రి ముందు ఉన్నాడు.

"అదేమిటి? రావద్ద న్నాను కదా?" ప్రశ్నించాడు శ్రీ రామ్.

"మామగారు ఇబ్బంది పడుతుంటే తట్టు కోలేక దగ్గ రికి రమ్మన్నారు మీరు మరి నాన్న ఇబ్బంది పడుతుంటే
నేనెలా ఉండగలను" సమాధానమిచ్చాడు విజయ్.

మరుసటి రోజే తండ్రిని హాస్పిటల్కి తీసికొని వెళ్ళాడు విజయ్. హాస్పిటల్ నిండా మహమ్మారి పేషెంట్ లే. టోకెన్
కౌంటర్ దగ్గ ర చాలా పెద్ద క్యూ ఉంది. తండ్రిని ఒక చోట కూర్చోబెట్టి, రెండు గంటలు క్యూలో నిల్చొని టోకెన్
సంపాదించాడు . తండ్రికి టెస్ట్ చేయించి ఇంటికి తీసికొని వచ్చాడు. తిరిగి సాయంత్రం హాస్పిటల్ కి వెళ్లి రిపోర్ట్స్
తెచ్చాడు విజయ్.

శ్రీరామ్ కు మహమ్మారి వచ్చినట్టు నిర్ధా రణ అయింది. మరుసటి రోజు సునీతకు జ్వరం గా ఉండటంతో ఆమెకు
కూడా టెస్ట్ చేయించాడు విజయ్. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో చాలా బాధపడ్డా డు .

శ్రీరామ్ అన్నగారి పేరు మధుసూదన రావు గారు .ఆయన వయస్సు అరవై ఐదు ఏళ్ళు .వదిన లక్ష్మి
గారు.ఇద్ద రూ చాలా మంచివారు. శ్రీరామ్ పక్క పోర్షన్ లోనే ఉంటున్నారు ఇద్ద రూ. శ్రీరామ్ కి జ్వరం గా
ఉండటం తో చూడకుండా ఉండలేక పోయారు . దగ్గ రకు వచ్చి ధైర్యం చెప్పారు.జనార్ధ న రావు గారిని కూడా
పరామర్శించారు.

మనిషికి మనిషి తోడుగా ఉండటం మహమ్మారికి నచ్చదేమో మరి! మరో రెండు రోజుల్లో వారిద్ద రికీ మహమ్మారి
వచ్చింది.

వాళ్ళ అబ్బాయి రవి, కోడలు ప్రణీత మలేషియా లో ఉండటం తో వారి బాధ్యతను కూడా తన భుజాలపై
వేసుకున్నాడు విజయ్. వాళ్ల ను కూడా హాస్పిటల్ కి తీసుకువెళ్లి టెస్ట్ చేయించాడు వారికి కూడా పాజిటివ్ అని
నిర్ధా రణ అయింది.

అందరికీ ధైర్యం చెప్పాడు విజయ్, ఎంతమాత్రం భయపడాల్సిన అవసరం లేదని. కేవలం కొద్ది రోజులు
మాత్రమే ఉంటుందని, ఇంట్లో అందరికీ ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని చెప్పాడు.

శ్రీరామ్ మరో ఇద్ద రు అన్నలు సుబ్బారావు గారు, శివప్రసాద్ గారు వెంటనే శ్రీరామ్ ను చూడటానికి
వస్తా మన్నారు. కానీ శ్రీరామ్ సున్నితంగా వారించాడు.

మూడు రోజులపాటు అందరి గురించి హాస్పిటల్ చుట్టూ తిరిగిన విజయ్ కి నాలుగోరోజు జ్వరం వచ్చింది.
అందరికీ టెస్ట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించిన విజయ్ మీద మహమ్మారికి మరి కోపం వచ్చిందేమో, మరుసటి
రోజు నుండి జ్వరం పెరగడం ప్రా రంభమైంది.

తడిగుడ్డ తో విజయ్ వొళ్ళంతా తుడుస్తు న్నారు శ్రీరామ్, సునీతలు. జ్వరం అంతకంతకూ పెరిగి ఊపిరి
తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు విజయ్.

ఇక ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్లో చేర్పించారు శ్రీరామ్, సునీత లు. హాస్పిటల్లో చేర్పించిన వెంటనే
విజయ్ కు స్కానింగ్ చేయించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆక్సిజన్ మాస్క్ తగిలించారు.

రెండు రోజులు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు డాక్టర్లు .

విజయ్ పరిస్థితి అందరినీ కలచివేసింది. తనకు ఏమైనా ఫరవా లేదని ,తన వాళ్ల ను కాపాడుకోవాలని తపన
పడే విజయ్, అచేతనంగా హాస్పిటల్ లో పడి ఉండటం చూసి అందరూ బాధ పడ్డా రు.

మొదటి నుండి విజయ్ ది నలుగురికి సహాయపడే మనస్త త్వం. స్నేహితులకు అవసరం వస్తే తన అవసరాల
కోసం దాచుకున్న డబ్బులు అయినా సరే ఇచ్చేసేవాడు.తన పనులన్నీ మానుకుని ఇతరుల పనిమీద
తిరిగేవాడు.

అలాంటి విజయ్, ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ కావడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు.

అమెరికాలో ఉన్న ప్రణవి ని ఓదార్చే వారే లేరు పాపం. భర్తకు చిన్న దెబ్బ తగిలినా తల్ల డిల్లి పోయే
ప్రణవి,విజయ్ హాస్పిటల్ లో ఉండటం జీర్ణించుకోలేక పోతోంది .ఆమె పడే బాధను మాటల్లో వర్ణించడం
ఎవ్వరికీ తరం కాదు.
విజయ్ కుటుంబ సభ్యులే కాక,ఇతర బంధువులు,స్నేహితులు,ఆఫీస్ సిబ్బంది .....

ఇలా ఒక్కరేమిటి,అందరూ విజయ్ క్షేమంగా తిరిగి రావాలని తమ ఇష్ట దైవాలను ప్రా ర్థిస్తు న్నారు.

మహమ్మారికి మమతానురాగాలను జరిగిన యుద్ధ ంలో మహమ్మారి ఓడిపోయింది.

విజయ్ క్షేమంగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు.

శ్రీరామ్, సునీత, జనార్ద న్ రావు గారు అందరూ కోలుకున్నారు. జనార్ధ నరావు గారి అబ్బాయి రామారావు
కూడా కోలుకున్నాడు.

శ్రీరామ్ అన్నా వదినలు మధుసూదన రావు గారు,లక్ష్మిగారు కూడా రికవర్ అయ్యారు.

అందరూ కోలుకున్నాక వారిని treat చేసిన డాక్టర్ గోపాల్ గారు శ్రీ రామ్ కి ఫోన్ చేశారు.

“కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో మీరు ఉదాసీనంగా వ్యవహరించారు.

అయినా ఒకరి మరొకరు తోడుగా ఉన్నారన్న ధైర్యం వ్యాధిని జయించింది. మంచి మనసులకు తోడు
భగవంతుని అనుగ్రహం కూడా పనిచేసింది” అన్నారు డాక్టర్ గోపాల్.

“నిజమే డాక్టర్ గారు ఈ రోజుల్లో భగవంతుడు డాక్టర్ రూపంలో ఉన్నాడు. మీరు చేసిన సహాయం
మర్చిపోలేను. “కృతజ్ఞ తతో అన్నాడు శ్రీరామ్.

“వ్యాధి కంటే తాము ఒంటరి అయ్యామనే బాధ మనిషిని కబళించి వేస్తు ంది.

మీ కుటుంబంలో అలా జరగలేదు .ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. తమకేదో అవుతుందని ఆలోచించకుండా
తమవారితో కలిసి నడిచారు. ఈ కథ శుభం తో ముగియడానికి కారణం మీ మధ్య ఉన్న ప్రేమానురాగాలే.”
అభినందించారు డాక్టర్ గోపాల్ గారు.
మాధవ సేవ (బాలల కథ) - సరికొండ శ్రీనివాసరాజు
Object 5

‌"ఈ లెక్కలు
నాకు అర్థ ం
కావడం లేదు.
నువ్వైనా నాకు
అర్థ ం అయ్యేటట్లు
చెప్పవా శిల్పా!"
అన్నది సుష్మ.
"నాకూ అర్థ ం
కావడం లేదు.
మన లెక్కల
టీచరుని
అడుగుదామంటే
వారం రోజుల
నుంచి అనారోగ్య
కారణాల వల్ల
వారు పాఠశాలకు
రావడం లేదు."
అన్నది శిల్ప.
"అయితే శ్రా వణి
మన తరగతిలో
మొదటి ర్యాంకు
కదా! ఆమెను
అడుగుదాం రా!"
అన్నది సుష్మ.
"అమ్మో! దాని దగ్గ ర చెప్పించుకోవడమా! ఎప్పుడు మొదటి ర్యాంకు మా ఇద్ద రిలో ఎవరు వస్తా రో చెప్పడం
కష్ట ం. తాను చదువులో ముందు ఉంటానని తనకు బాగా పొగరు. ఈ ఒక్కసారికి గణితంలో వెనుకబడ్డా ను కానీ
ఎప్పుడూ దానిమీద నాదే పైచేయి. ఫెయిల్ అయినా ఫర్వాలేదు కానీ దానితో మాత్రం లెక్కలు చెప్పించుకోను."
అన్నది శిల్ప. "ఎందుకే తనను అలా అంటావు. తాను ఎప్పుడైనా నీతో గొడవ పడిందా? నీ గురించి ఇతరులకు
చెడుగా చెప్పిందా? అందరితోనూ కలసిమెలసి ఉండి, వారు చదువులో వెనుకబడితే వారిని తెలివైన వారిని
చేయడమే శ్రా వణి చేసిన తప్పా? తాను అలా ఉండబట్టే చాలామంది తనకు స్నేహితులు అయ్యారు. నువ్వు
ఎవరితోనూ కలువవు కాబట్టే అందరూ నీకు దూరంగా ఉంటున్నారు. నువ్వూ అందరితో స్నేహం చేసి, వారిని
ప్రో త్సహించి చూడు. వారంతా నీతోనూ స్నేహం చేస్తా రు. శ్రా వణి నువ్వూ కలిసిపోయి ఒకరి సందేహాలను
మరొకరు నివృత్తి చేసుకుంటూ ఉంటేనే కదా! ఇద్ద రికీ చదువు మరింతగా పెరుగుతుంది." అన్నది సుష్మ. ప్రా ణ
స్నేహితురాలి సలహాతో ఆలోచనలో పడింది శిల్ప.

నిజానికి శ్రా వణి ఎంత తెలివైన అమ్మాయో అన్ని మంచి గుణాలు కలిగిన అమ్మాయి. శ్రా వణిపై శిల్పకు
ఎప్పుడూ అసూయ. మొదటిసారి ఆ అసూయను పక్కన పెట్టి శ్రా వణితో లెక్కలు చెప్పించుకుంది శిల్ప. శ్రా వణి
ఎంతో ఆప్యాయంగా శిల్పతో కలిసిపోయింది. శ్రా వణి కూడా తనకు సందేహాలు వస్తే శిల్పతో చెప్పించుకుంది.
అలా వారిద్ద రూ ప్రా ణ స్నేహితులు అయ్యారు. ఎంతటి వారినైనా మంచివారిగా, తెలివైన విద్యార్థు లుగా
మార్చడం శ్రా వణికి ఉన్న ప్రత్యేకత.

ఇంతలో శ్రా వణికి వైరల్ ఫీవర్ వచ్చింది. వారం పది రోజులుగా కోలుకోలేదు. చాలా సీరియస్ అయింది. శ్రా వణి
కోలుకుంటే ప్రసిద్ధ పుణ్యక్షేత్రా లు కొన్నింటికి ఒక్కో పుణ్యక్షేత్రా నికి పదివేల నూట పదహార్ల చొప్పున దేవుళ్ళకు
కానుకగా ఇస్తా నని మొక్కింది శ్రా వణి వాళ్ళ అమ్మమ్మ. శ్రా వణి కోలుకుంది. పదవ తరగతి పరీక్షలలో అత్యుత్త మ
మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.

శ్రా వణి వాళ్ళ అమ్మమ్మ శ్రా వణికి ఏఏ గుళ్ళకు కానుకలుగా డబ్బును మనీ ఆర్డర్ ద్వారా పెట్టా లో వివరిస్తూ
తగినంత డబ్బును ఇచ్చింది. కొన్నాళ్ళ తర్వాత అమ్మమ్మ ఫోన్ చేసి, ఆ డబ్బులను శ్రా వణి ఆయా
దేవాలయాలకు పంపించిందా అడిగింది. పంపలేదని జవాబిచ్చింది శ్రా వణి. అమ్మమ్మకు కోపం వచ్చి తిట్టింది.
"ఎందుకింత నిర్లక్ష్యం నీకు? ఆ దేవుళ్ళకు మొక్కుకోవడం వల్ల నే కదా నీవు ఆరోగ్యంగా ఉన్నావు. మరి ఆ
దేవుళ్ళనే మర్చిపోయావా?" అన్నది. "ఏం మర్చిపోలేదు అమ్మమ్మా! మా పాఠశాలలో ఇద్ద రు తెలివైన
విద్యార్థు లు ఇంటర్మీడియట్ చదవడానికి ఆర్థిక స్థో మత లేక 10 వ తరగతితోనే చదువు అనేస్తు న్నారు. వారికి
నువ్వు ఇచ్చిన డబ్బులను ఇచ్చాను. వారు పై చదువులు చదివి, మంచి ఉద్యోగం సాధిస్తే వారి భవిష్యత్తు
బాగుంటుంది కదా! మానవ సేవే మాధవ సేవ అని నువ్వు ఎప్పుడూ చెబుతుంటారు కదా! అలా పేద
విద్యార్థు లకు దానధర్మాలను చేస్తే ఆ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటాయి కదా అమ్మమ్మా!"అన్నది. చిన్న
వయసులోనే తన మనవరాలికి ఉన్న సుగుణాలకు శ్రా వణి వాళ్ళ అమ్మమ్మ మురిసిపోయింది. శ్రా వణి చేసిన
సాయం గురించి తెలుసుకున్న శిల్ప శ్రా వణిని అభినందించింది. తానూ తన తల్లిదండ్రు ల సాయంతో మరో
ఇద్ద రి పేద విద్యార్థు లకు ఆర్థిక సాయం చేసింది.
బావా బావా పన్నీరు.... - గొర్తి.వాణిశ్రీనివాస్
Object 6

ఏమేవ్ కనకం!ఇహ నా స్నానం అదీ అయ్యింది కానీ భోజనం పెడతావా.. మామిడికాయ పప్పు,ఇంగువ వేసి
రోట్లో నూరిన చింతకాయ పచ్చడి,వడియాలు,పచ్చి పులుసు, చెయ్యమన్నానుగా చేసేవా.. జాడీలోంచి
ఆవకాయ పచ్చడి రాచిప్పలోకి తీయవే.తిని చాలా రోజులయ్యింది.కరోనా వచ్చినదగ్గ ర్నుంచీ జాడీల మూతికీ
వాసిన కట్టా వు..ఇవాళన్నా విప్పు ..వంట పూర్తయిందా ఇహ వచ్చి కూర్చోవచ్చా?" పంపు నీళ్లు కొట్టి బకెట్లో
పట్టు కుని తీసుకెళ్లి అరటి చెట్ల మొదట్లో వేసిన పెద్ద రాతి బండమీద నిలబడి స్నానం చేస్తూ ,ఇత్త డి చెంబుతో
మిగిలిన మొక్కలకి నీళ్లు పోస్తూ పెరడంతా తిరుగుతున్నాడు సీతాపతి. "ఇంకా స్నానం అవలేదా బావా
!"అంటూ లోపలికి వచ్చాడు చెలపాయి. "రావయ్యా బామ్మరిదీ!,ఇదేనా రావటం. ఏమేవ్..మీ తమ్ముడు
వచ్చాడు చాన్నాళ్ళకి.ఆ చేత్తో నే కాస్త పరవాన్నం,పులిహారా కూడా చెయ్యి." అన్నాడు "అన్నగారూ..మీ ఇంటి
వంటల లిస్టు వింటుంటే నాకు నోరూరిపోతోంది.నా భోజనం కూడా ఇవాళ మీ ఇంట్లో నే"అంది పక్కింటి పంకజం
గోడ మీదనుంచి తొంగి చూస్తూ . "అదేంభాగ్యం తల్లీ.నువ్వు రావడమే పరమానందం.మా బావ వెధవని కూడా
తీసుకురా.ఎంచక్కా అందరం కలిసే భోంచేద్దా ం." "మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చినట్టు న్నారు.మరో మారు
వస్తా ం లేండి."అంది "ఏవే అక్కా..!ఆకలి మండిపోతోంది.నేనొచ్చినప్పుడు మా బావ వంటకాల లిస్టు
చెపుతుంటే ఆకలి పెరిగుపోయింది.ఊ.. రానీ రానీ అన్నిటినీ ఓ పట్టు పడతాను."అంటూ మఠం వేసుకుని
కూర్చున్నాడు చెలపాయి. ఒక అన్నం గిన్నా,ఉప్పూ కారం పూసిన నాలుగు మావిడి కాయ బద్ద లు,వేడి పాలు
పోసిన ఉగ్గి గిన్నెంత చిన్న గిన్నె.చింతకాయ తొక్కు పెట్టిన రాచిప్ప తప్ప అక్కడ మరేం లేకపోవడంతో వెర్రి
మొహం వేసాడు చెలపాయి. మీ తమ్ముడికి వడ్డిస్తూ ఉండు.నేను మరోమారు గురుశంఖ తీర్చుకోస్తా .నిన్న తిన్న
గారెలు ఆరిగినట్టు లేవు"అంటూ పెరట్లో పచార్లు చేస్తు న్నాడు సీతాపతి. "అఘోరించారు లేండి.ఆ పెరట్లో నే
తగలడండి"అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది కనకం "ఇదేవిటే అక్కా..బావగారు ఈ పూట వంటల్లో
చెప్పిన మెనూలు కనపడవేమే? బావగారి మాటంటే అంత లెక్క లేదేవిటే నీకు.మొగుడ్ని ఖాతరు చేయక
పోవడం మన ఇంటా వంటా అసలు ఉందిటే?. భయం భక్తీ లేకుండా అట్టా తిడుతున్నావేమే?" అన్నాడు
చెలపాయి "తిట్టా లా కొట్టా లా కొయ్యాలా.. మీ బావగారు చేసే వెర్రి చేష్ట ల్ని నేను కాబట్టి గుట్టు గా భరిస్తు న్నాను.
ఇంకోత్త యితే ఉరిపెట్టు కుని చచ్చేది." అంటూ కొంగుతో కళ్ళొత్తు కుంది. "ఏవైందే అక్కా.ఏం చేసారే.. చెట్ట ంత ఈ
తమ్ముడితో నీకొచ్చిన కష్ట వేవిటో చెప్పుకోవే"అన్నాడు చెలపాయి. "చూస్తు న్నావుగా.ఇదీ నా సంసారం.పాత
చింతకాయ తొక్కు,మావిడికాయ బద్దా . ఆయన పీనాసితనం ఎక్కడ బైట పడుతుందో అని ఊరంతా
వినపడేంత గొంతేసుకుని ఇవి చెయ్యి అవి చెయ్యి అని అరుస్తా రు. చుట్టు పక్కల వాళ్ళు మేం తెగ
వండేసుకుంటున్నాం అని అనుకోవాలని. ఇంట్లో చూస్తే కోటా బియ్యం తప్ప ఏవీ లేవురా తమ్ముడూ..వెధవ
బడాయికి మాత్రం తక్కువ లేదు. నువ్వు వచ్చేముందు చూసుంటావ్. ఎండిన చెట్ల పుల్ల ల్నీ కాకి గూళ్ల నీ
పోగేస్తు న్నారు. ఎందుకంటే మనిద్ద ర్లో ఎవరు ముందో ఎవరు వెనకో అప్పటికప్పుడు పుల్ల లకి ఎక్కడికి
పరిగెడతాం అంటారు. పిచ్చుకలు గూట్లో దాచుకున్న కొబ్బరి పీచుని దానికే తెలియకుండా లాఘవంగా
లాక్కొచ్చి దాస్తా రు. ఎందుకంటే పుల్ల లు మండాలంటే కిరసనాయల ఖర్చు దండగట. ఆ పీచైతే సురసురా
మండి శవం తొందరగా అంటుకుంటుందిట. ఒకటా రెండా ఏవని చెప్పను. ఎన్నని చెప్పను. నువ్వు దూరదేశంలో
ఉన్నావు .నీకివన్నీ ఎందుకని చెప్పలేదు. ఈయన పీనాసి రకం అని తెలిసే ఆ దేవుడు మాకు సంతాన భాగ్యం
లేకుండా చేసాడు. "అంటూ తమ్ముడితో బాధని వెళ్ల గక్కింది కనకం. "ఊరుకోవే అక్కా..నీ బాధ పక్కింటి వాళ్ళకి
కూడా రాకూడదే. ఉండు బావ మనసు నేను మారుస్తా ను." అంటూ ఊపు మీద వెళ్లి బావ సీతాపతి ముందు
నిలబడ్డా డు. "బావా...మీ పెళ్ళై ఇన్నేళ్లు గడిచినా,మా అక్కకి నేనేమీ ఇవ్వలేదు.అందుకే మీకు ఒక కోటి
రూపాయలు ఇద్దా మనుకుంటున్నాను. ఇక హాయిగా దర్జా గా గడపండి బావగారూ.ఏమంటారు"అన్నాడు.బావ
పీనాసి తనాన్ని ఈ నాటితో వదిలేస్తా డన్న ఆశాభావంతో చూస్తూ . "హమ్మయ్యో ,కోటి రూపాయలే....నీదెంత
మంచి మనసు బామ్మరదీ.. ఇక చూస్కో మెమెంత దర్జా గా బతుకుతామో.. ఏమేవ్..మన పెళ్లికి మీ నాన్న పెట్టిన
రెండు కొత్త పంచలూ,నీ చీరా ఇటు తీసుకురా అక్కడక్కడా తూట్లు పడ్డ చోట కాస్త అతుకుల వేయిస్తే చాలు..
ఇహ మన తరం వెళ్ళిపోతుంది.. చాలా సంతోషంగా ఉంది బామ్మరిదీ.. ఇప్పుడే దర్జీ దగ్గ రకి వెళ్ళి ,ఆ బట్ట ల్ని
కుట్టించుకొచ్చి నా దర్జా చూపిస్తా గా... నువ్వు కడుపునిండా భోంచేశావా. ఖాళీ అయిన తేనె పట్టు లన్నిటినీ కలిపి
కుట్టి ఏర్పాటు చేసిన పందిరి కింద తాటి గులకలు పేర్చి చేసిన మంచం మీద భుక్తా యాసం తగ్గేదాకా హాయిగా
విశ్రా ంతి తీసుకో. నేనిప్పుడే చిటికెలో వచ్చేస్తా .." అంటూ బట్ట లకి అతుకుల వేయించటానికి వెళుతున్న
బావవంక పిచ్చి పట్టినట్టు చూస్తు ండి పోయాడు చెలపాయి. పిసినారితనం నరనరాల్లో జీర్ణించుకుపోయాక
జీవుడు వెళ్లా లే కానీ లోభత్వం మాత్రం పోదు. మార్చాలని చూసేవాళ్ళని కూడా పిచ్చివాళ్ళని చేస్తా రు
.అనుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యాడు చెలపాయి. వెళుతూ బావకు తెలీకుండా లక్ష రూపాయలు అక్క
చేతిలో పెట్టి "అక్కా!బావకి ఎట్టా గూ సుఖపడేయోగం లేదు.నువ్వైనా కావాల్సింది కొనుక్కుని కడుపునిండా
తిను. తెచ్చిన సరుకుల లెక్క బావకు చెప్పకు.బావ గుండాగిపోతుంది.జాగ్రత్త"అని చెప్పి చక్కా వెళ్ళిపోయాడు.
కొత్త కోడలు - యు.విజయశేఖర రెడ్డి
Object 7

పాతిక

సంవత్సరాలు పై బడుతున్నాయని మా ఏకైక పుత్ర రత్నానికి వివాహం చేశాము. మా అబ్బాయి రవి


అమెరికాలో ఉద్యోగం చేస్తు న్నాడు. పెళ్లికని నెల రోజుల సెలవు మీద వచ్చాడు.
పెళ్లి కడపలోను రిసెప్సన్ హైదరాబాద్‌లో చేశాము. చుట్టా లు పక్కాలు ఎక్కడివాళ్లు అక్కడకు వెళ్ళి పోయారు.

మాది త్రిబుల్ బెడ్రూ ం ఫ్లా ట్ సొంతమే. కొడుకు కోడలికీ ఏ పనులు పురమాయించవద్ద ని నేను మా ఆవిడ
నిర్ణయించుకున్నాము. ఇల్లు చిమ్మడానికీ తడి గుడ్డ పెట్టి తుడవడానికి మాత్రమే పనిమనిషిని పెట్టు కున్నాము.
అంట్లు సరిగా తోమదని ఆ పనికి పెట్టు కోలేదు గుడ్డ లు వాషింగ్ మెషిన్‌లో వేస్తు ంది.

ఒక రోజు కోడలు స్వప్న బాత్ రూమ్‌లో బ్రేష్ చేసి రాగానే సుశీల టూత్ పేస్ట్ కోసం వెళ్లింది. బయటకు వచ్చి
అష్ట వక్రంగా ఉన్న టూత్ పేస్ట్ ట్యూబ్‌‌ను చూపించింది.దానిని నేను సరి చేశాను.

అందరం టీ తాగిన తరువాత స్వప్న స్నానానికి వెళ్లింది.కాసేపటికి బాత్రూ ంలో నుండి ఒక్కటే శబ్దా లు బయటకు
వినబడ సాగాయి మగ్గు కింద పపడిన శబ్ధ ం సబ్బు పెట్టె పడిన చప్పుడు.

“ఏమండీ కోడలు స్నానానికి వెళ్ళిందా యుద్ధా నికా?” అంది సుశీల గొంతు చించుకుని.

“మెల్ల గా...రవి బయటకు వెళ్ళాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నీవు అన్నది వింటే నొచ్చుకునే వాడు”
అన్నాను.

స్వప్న మళ్ళీ రాత్రి బ్రష్ చేసింది అప్పుడు కూడా టూత్ పేస్ట్ పరిస్తితి అష్టా వక్రమే అయ్యింది.

రాత్రి పడుకున్నాక సుశీల ముఖ కవళికలు గమనించాను.

“సుశీ! నువ్వు అలా ఉండడం నాకు నచ్చదు”

“స్వప్నకు ఎలా నేర్పాలండీ?”

“పోనీ లేవే! కొత్త అమ్మాయి నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది” పడుకో అన్నాను.

తెల్ల రింది “అత్త గారు నేను ఉన్న నాళ్ళు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ కొన్ని పనులైనా నేర్చుకుంటాను”
అంది స్వప్న.

అలాగే అంది సుశీల. ఆ పూట భోజనాలయ్యాక స్వప్న వంటింట్లో షింక్ దగ్గ ర అంట్ల న్నీ ఎంతో శుభ్రంగా
తోమింది. తోమిన వాటిని బాల్కనీలో గిన్నెల స్టా ండ్లో చక్కగా పెట్టింది.

ఆటో మేటిక్ వాషింగ్ మెషిన్‌లో గుడ్డ లు వేసి నీళ్ళు పట్టి తగినంత వాషింగ్ పౌడర్ వేసింది. గుడ్డ ల పని కూడా
చక్కగా చేసింది.

రాత్రి మేము పడుకున్న తరువాత “సుశీ! నువ్వు ఏ పూటైన అంట్ల గిన్నెలు చప్పుడు కాకుండా తోమావా?
స్వప్న చూడు గుండు సూది పడినంత చప్పుడైనా కాకుండా ఎలా వాటిని శుభ్రం చేసి ఆరబెట్టిందో?” అన్నాను.

“అవునండీ నాకు అదే అర్ధ ం కావడం లేదు గిన్నెలు సరే గుడ్డ లు కూడా చక్కగా ఆరేసింది ఆరిన వాటిని చక్కగా
మడత పెట్టింది”

“కొన్ని విషయాలు తనే చూసి నేర్చుకుంటుంది” అన్నాను.

మరుసటి రోజు స్వప్న బ్రష్ వేసింది టూత్ పేస్ట్ ఏ మాత్రం వంకరాలు లేకుండా చక్కగా ఉంది అది చూసి సుశీల
ముఖం ఆనందంతో వెలిగి పోయింది. తరువాత స్వప్న స్నానానికి వెళ్లింది బాత్ రూంలో నుండి బయటకు
ఎలాంటీ శబ్దా లు వినబడ లేదు.

“స్వప్నా! నిన్ను చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాలి” అంది సుశీల.

“అదేంటి అత్త గారు మీ దగ్గ ర నేర్చుకోవాల్సింది బోలెడు ఉంది”


“అవునమ్మా! మీ అత్త గారు చప్పుడు చేయకుండా గిన్నెలు తోమింది నేను రెటైర్ అయ్యింది మొదలు ఏనాడూ
చూడలేదు”

“ఊరుకోండీ! కోడలి ముందు మరీ నన్ను ఆటపట్టిస్తు న్నారు”

“అవును నాన్న! అమ్మ ముందు కోడలిని ఎక్కువగా పొగడకండీ!” అన్నాడు రవి.

“అంతేలెండీ! మీరంతా ఒక్కటే నేనే పరాయి దానిని” అంది స్వప్న మూతి ముడుచుకొని.

“లేదు స్వప్న మీ మామయ్యను చేసుకుని కోడలిగా పల్లెటూరు నుండి సరాసరి పట్నంలో అడుగు పెట్టి న కొత్త లో
నాకు టీ పెట్ట డం కూడా రాలేదు... అత్త గారు మామయ్యగారు ఊరులోనే ఉండడం వల్ల నేర్పేవారు లేక అన్నీ మీ
మామగారే నేర్పించారు”

“అదిగో సుశీ! కొత్త కోడలికి పాత విషయాలు చెప్పి నన్ను చిన్న బుచ్చుతున్నావు” అన్నాను.

రవి,స్వప్న,సుశీల హాయిగా నవ్వుకున్నారు నేనూ శృతి కలిపాను.

మరో వారంలో రవి స్వప్న అమెరికా వెళ్ళిపోయారు. మంచి కోడలు దొరికిందండీ... రవిని బాగా
చూసుకుంటుంది అంది సుశీల.

నువ్వు నన్ను చూసుకున్నట్లే అన్నాను నవ్వుతూ. తనూ ముసిమిసిగా నవ్వింది.


ఐ హేట్ మై రూమ్మేట్ - గంగాధర్ వడ్ల మన్నాటి
Object 8

“హలో,హలో లలితా ఎక్కడున్నావ్”అడిగింది సునంద.

“వచ్చేస్తు న్నా,అయిపోయింది పని.ఆఫీస్ గట్టు దిగి నడిచి, ఇపుడే రెస్టా రెంట్ మెట్లెక్కుతున్నా” చెప్పి ఫోన్
పెట్టేసింది లలిత.

లలిత రెస్టా రెంట్ కి రాగానే, “ఏంటి అప్పుడప్పుడూ నాకీ టార్చర్. మనం ఎంత మరీ పక్క,పక్క ఆఫీసులలో
పని చేస్తే మాత్రం,ఎంత మరీ స్నేహితురాళ్ళమైతే మాత్రం,నన్నిలా టెన్నిస్ బంతిలా ఆడుకోవడం బాలేదు.
వారంలో కొన్ని సార్లు నువ్వు మీ ఆఫీస్ అయిపోగానే నన్ను ఇలా రెస్టా రెంట్ కి రమ్మని ఫోన్
చేయడం.నువ్వొచ్చాక ఇద్ద రం కలిసి బోంచేయడం.లేదా ఇద్ద రం కలిసి ఏదోటి మెక్కడం,ఆ తర్వాత కొంతసేపటికి
నువ్వు నీ హాస్ట ల్ కి, నేను మా ఇంటికీ వెళ్ల డం. ఏవైనా అంటే మీ హాస్ట ల్లో ఫుడ్ బాగోదని తల బాదుకుంటావ్.
పోనీ ప్యాక్ చేయించుకుని మీ రూమ్ కి వెళ్లి తినొచ్చు కదా అంటే,చచ్చు మొహం పెట్టి ,విచ్చలవిడిగా నన్ను తిట్టి
, భూమి బద్ద లయ్యేట్టు నా మీద విరుచుకు పడిపోతావ్.పోనీ ఏకంగా హాస్ట ల్ మారిపో తల్లీ అంటే,మన
ఆఫీసుకి దగ్గ ర ఉన్న ఏకైక హాస్ట ల్ ఇదొక్కటే ,వేరే హాస్ట ల్స్ లేవు అంటావ్. నాకు మాత్రం రోజూ నీకీలా
చెప్పి,చెప్పి నా గాత్రం పోతోంది. నీ కోసం వెయిట్ చేయడంతో మా కొంపకి వెళ్ల డం ఆలస్యం అయిపోతోంది.ఇక
నీతో కలిసి తినడంతో, ఇంట్లో సరిగా తినడం లేదని మా అమ్మ నా మొహాన తిట్టే స్తూ ,నెత్తిన మొట్టే స్తో ంది.
అయినా నాకు తెలియక అడుగుతానూ, ఎంతకాలం నాకీ తిప్పలు . నువ్వు విషయం ఏంటో కూడా క్లియర్ గా
చెప్పవు. అసలు ఏవిటి ప్రా బ్ల ం. నువ్వు హాస్ట ల్ కి ఫుడ్డు పట్టు కు వెళితే నీ రూమ్మేట్ తిడుతుందా? లేక హాస్ట ల్
వాళ్ళు చేసిన ఫుడ్ కాదని ఇలా బయటి నుండి తెచ్చుకు తినడం వల్ల మిగతా వాళ్ళు కూడా అలా
తయారవుతారు అని మీ హాస్ట ల్ వాళ్ళు నిన్ను ఏమైనా అంటున్నారా. ఎందుకంటే నువ్వు అప్పుడప్పుడు ఇలా
బయట తిని హాస్ట ల్ కి వెళ్ల డం ఏవిటో నాకు అర్ధ మై చావడం లేదు. ఏవైనా అంటే నాకిష్ట మైనవి అన్నీ బయటే
తింటాను, రూమ్ కు మాత్రం తీసుకు వెళ్ళను అని అంటావు. ఈరోజు నాకు అసలు విషయం అంతా క్రికెట్ స్లో
మోషన్ రిప్లే అంత స్పష్ట ంగా తెలియాల్సిందే.” .పట్టు బట్టి ంది సునంద.

“చెప్తా ను సునందా చెప్తా ను” అని తల వంచుకుని “ఈ గుండెల్లో ని నా బాధ, ఊర పిచ్చుకలు కట్టు కున్న
గూడులా అలానే ఉండిపోయింది.ఆ బాదం పప్పంత బాధ కాస్తా పెరిగి పెరిగి పందికొక్కంత అయింది. ఈరోజు
అది నీతో పంచుకుంటాను.గ్యాస్ బండంత పెరిగిన నా గుండె బరువుని తల దిండులా తేలిక చేసుకుంటాను”.
అని లలిత మరేదో ఏదో చెప్పేలోపు.

“ ఇలాంటి అర్ధ ం పర్ధ ం లేని అనవసర పాత చింతకాయ వర్ణనలు వద్దు .నేరుగా జోరుగా చెప్పు”.విసిగిందామె.

“ సర్లే కోప్పడకు.సింపుల్గా చెబుతా విను.నా రూమ్మేట్ మంచిదే. కానీ కొంచెం స్వార్థ ం. నేను ఏదైనా కొని
తీసుకుని వెళితే, ఆమే తీసుకుని తినేస్తు ంది. మొహమాటం అనే పదం ఆమెకి తెలీదు.పైగా ఆ హాస్ట ల్ వాళ్ళకి
దూరపు బంధువు.అలా అని ఎప్పుడూ ఆమెకీ,నాకు సరిపోయే అంత కొని పట్టు కెళ్ల డం అంటే అసాధ్యం కదా.
అందుకనే ఇలాంటి ఏ ఇబ్బందీ లేకుండా నాకు నచ్చినవి హాయిగా బయట తినేసి హాస్ట ల్ రూమ్ కి వెళ్తా ను.
పోనీ ఆమె తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా నన్ను కనీసం తింటావా అని కూడా అడగదు. అడగడం మాట
అటుంచు,కనీసం వాసన కూడా చూడనివ్వదు. పైగా నా ఒక్క దానికే కొని తెచ్చుకున్నాను, ఏమీ అనుకోవద్దూ ,
నేను నీకు ఇవ్వలేను అని నా ఎదురుగానే లబ,లాబా లైలా తుఫాను బాధితురాల్లా తినేస్తు ంది.దాంతో నాలో ఓ
హూద్ ,హూద్ తుఫాన్ చెలరేగుతుంది. ఆ తరువాత నా ఒళ్ళు మేలో ఎండల్లా సల సలా మండిపోతుంది.
పోనీ ఈ హాస్ట ల్ రూమ్ లో ఈ ఫుడ్ ఘోస్ట్ తో ఇబ్బందని కనీసం వేరే రూము తీసుకుందావంటే ,ఆ రూముల్లో
ముగ్గు రు నలుగురు అమ్మాయిలు కలిసి ఉంటున్నారు. ఈమె ఆ హాస్ట ల్ వాళ్ళ బంధువు కావడంతో ఆ రూంలో
ఇద్ద రినే ఉంచారు.పైగా రూమ్ కూడా కొంత బావుంటుందిలే.అందుకే తప్పక ,తప్పించుకోలేక,ఆమెని ఓ మాట
అని నొప్పించే ధైర్యం చేయలేక ఇలా మౌత్ మూసుకుని ఈ మార్గ ం అనుసరిస్తు న్నాను” అని చెప్పి ఓ క్షణం
తర్వాత “నా బాధ నీతో పంచుకున్నాక , పనసపండంత బరువుగా ఉన్న నా మనసు... ఇపుడు ఈతపండులా
తేలిగ్గా అనిపిస్తో ంది.నా మనసు ఇపుడు బూజు దులిపిన గాజు అద్ద ంలా” అని లలిత మరేదో చెప్పేంతలో.

“వద్దు మళ్ళీ వద్దు .ఇప్పటికే నీ దిక్కుమాలిన వర్ణనలు విని నా బుర్ర బద్ద లైంది. నా సమయం చాలా
వ్యర్ధ మైంది.నీ బాధా అర్ధ మైంది.కానీ నీ ఆలోచన బావుంది.అయితే ఇలా ఎంతకాలం ఇబ్బంది
పడతావ్”.అడిగింది సునంద.

“ఎంతే? ఇంకా వన్ మంతే .ఆ తరువాత మా వసంతరావ్ బాబాయి బదిలీ మీద ఈ ఊరే వచ్చేస్తు న్నాడు.నన్ను
వాళ్ల తోనే ఉండమన్నారు కూడా”.చెప్పింది లలిత ఉత్సాహంగా.

“అలాగా? సూపర్” అనేసి ,లలిత చేతిలోని స్వీట్స్, బేకరీ కవర్స్, ప్యాకెట్స్ చూసి,. “ఇదేంటి, ఇప్పటిదాకా
హాస్ట ల్ రూమ్ కి ఏవైనా తీసుకు వెళితే , అన్నీ మీ రూమ్మేట్ తినేస్తు ంది అని నా బుర్ర తినేసావు. మళ్లీ ఇప్పుడు
ఇలా స్వీట్లు , కేకులు ,బేకరీ ఐటమ్స్ పట్టు కెళుతున్నావు! నాకేం అర్థ ం కావడంలేదు” అడిగింది సునంద.

“అదా! ఏం లేదు సునందా, ఇందాకనే మా రూమ్మేట్ ఫోన్ చేసింది. ఈరోజు డెంటల్ డాక్టర్ దగ్గ రికి వెళ్లిందట.
ఒక పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారట. రెండు మూడు రోజులు లిక్విడ్ డైట్ లోనే ఉండమని చెప్పారట.
అందుకే నేను ఇలా రెండు ,మూడు రోజులు రెచ్చిపోవచ్చు మరి”. చెప్పింది లలిత నవ్వుతూ.
గురుప్రీత్ సింగ్ - యు.విజయశేఖర రెడ్డి
Object 9

మా

అబ్బాయి,కోడలు అమెరికాలో ఉంటున్నారు. మా కోడలు వాళ్ల చెల్లెలు పెళ్లికని ఇండియా వచ్చింది. మా వాడికి
రావడం కుదరలేదు.

ఈ లోగా మవాడికి నేధర్లా ండ్, ఫిలిప్స్ కంపెనీలో సైంటిస్టు గా ఉంద్యోగం వచ్చింది. వీసా ప్రా సెస్ అంతా కంపెనీ
వాళ్లు చేయడంతో మావాడికి అక్కడకు వెళ్ళడం సులువయ్యింది. డిపెండెంట్ అయిన మా కోడలికి మా వాడు
వీసా ప్రా సెస్ అంతా ఆన్ లైన్లో చేసి పంపాడు.

మా కోడలు,చెల్లెలు పెళ్లి అయిన తరువాత నేను,నా శ్రీమతి,కోడలుతో ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లా ము.
ఫ్లైట్ దిగిన తరువాత మా లగేజి తీసుకొని బయటకు వచ్చి లాడ్జ్ వెళ్ల డానికి క్యాబ్ కోసం చూశాము.
క్యాబ్అయితే అర గంట సమయం పడుతుందని ఆటో‌లో వెళదామని ఒక ఆటో అతణ్ణి అడిగాను
మహిపాల్పుర్‌కు ఎంత తీసుకుంటావని. అతను వంద రూపాయలన్నాడు.

సరేనని ఆటో ఎక్కి మహిపాల్పుర్ లోని లాడ్జ్‌లో దిగాము. లాడ్జ్ ముందుగానే ఆన్ లైన్లో బుక్ చేసుకున్నాము.

“నా పేరు గురుప్రీత్ సింగ్ సార్! అని అతని విజిటింగ్ కార్డ్ ఇచ్చి అవసరమైతే పిలవమన్నాడు.

మూగ్గు రమూ ఫ్రెష్ అప్ అయ్యాక రూంలో మెను చూసి రోటీస్, కర్రీస్ తెప్పించుకొని తిన్నాము.

మా కోడలు వీసా ఇంటర్వ్యూ మరుసటిరోజు ఉంది. నేధర్లా ండ్ వీసా ఆఫీస్ చాణక్యపురిలో ఉంది. కాసేపు
పడుకొని తరువాత వెళదామని నిర్ణయించుకున్నాము.

3.30 నిముషాలకు ఆటో అతనికి ఫోన్ చేశాను. 4.00 గంటలకల్లా రాగలవా అని. ఇదే ఏరియాలోనే ఉన్నాను
మీరు రెడీ అయ్యి నాలుగు గంటలకల్లా లాడ్జ్ బయట ఉండండి అన్నాడు.

మేము తయారయ్యి లాడ్జ్ బయట నిలబడ్డా ము.

ఆటో ఎక్కి ఎక్కడికి పోవాలో చెప్పాను.

అర గంటలో వీసా ఆఫీస్ చేరుకున్నాము. అక్కడ అన్ని వివరాలు తెలుసుకున్నాక ఇండియా గేట్ దగ్గ రలోనే
ఉందా అని సింగ్‌ను అడిగాను. పది కిలోమీటర్లు ఉంటుందని అక్కడ నుండి పార్లమెంట్ భవన్ కూడా
దగ్గ రవుతుందని చెప్పాడు. మేము వెళదామని నిశ్చయించుకొని ఆటో పోనియ్యమన్నాము.

ఇండియా గేట్‌క
‌ ు కొద్ది దూరంలో రోడ్ పైన ఆటో ఆపి నేను పార్కింగ్ వద్ద ఉంటాను మీరు ఇక్కడకు వచ్చి ఫోన్
చేస్తే వస్తా ను అన్నాడు అతను.

ఇండియా గేట్ వీర జవాన్ల జ్ఞా పకార్థ ం కట్టిన అద్బుతమైన కట్ట డం. మేము కూడా వీర జవాన్ల కు బయట చుట్టూ
కట్టి న ఇనుప కంచె నుండే నివాళులు అర్పించాము.

తరువాత ఆ చుట్టు పక్కల తిరిగి ఫోటోస్ తీసుకున్నాము. పర్యాటకులతో ఆ ప్రా ంతం కిటకిటలాడింది. అక్కడ
సుమారు గంటన్నర పాటు గడిపాము.

అక్కడ నుండి రోడ్ పైకి వచ్చి ఫోన్ చేయగానే సింగ్ వచ్చాడు. ఆటోను పార్లమెంట్ వైపు పోనిచ్చాడు.

ఆటో కొద్ది దూరంలో ఆగింది. లోపలకు అనుమతి లేదు కాబట్టి బయటనుండే చూడగలిగాము.

“సార్! కొద్ది దూరంలో మంచి హిందూ టెంపుల్ ఉంది” అన్నాడు సింగ్.

సరేనన్నాను. ఆర్.కె.పురంలో ఉన్న కార్తికేయస్వామి గుడికి తీసుకెళ్లా డు. తమిళులు కట్టిన చక్కటి ఆలయం
అది ఎత్తైన ప్రదేశంలో ఉంది. స్వామివారిని దర్శించుకున్న తరువాత తిన్నగా లాడ్జ్‌కి పోనియ్యమన్నాను.

లాడ్జ్ చేరుకునేసరికి రాత్రి 8.30 నిముషాలయ్యింది.

మా వాళ్ల ను రూంకు పంపించాక ఆటో చార్జ్ ఎంతయ్యిందన్నాను.

“రూ. 1400-00 సార్! అన్నాడు.

నాకు ఒక్కసారే మతిపోయింది “అదేంటి చాలా ఎక్కువ చెబుతున్నావు” అన్నాను.

“నాలుగున్నర గంటలు మీ కోసమే తిరిగాను... అంతా కలిపి అరవై కిలోమీటర్ల పైనే వచ్చింది” అన్నాడు.
“తగ్గించుకో సింగ్!” అన్నాను.

“మీరు డబ్బులు ఇవ్వకున్నా పర్వాలేదు నేను కరెక్టు గానే చెప్పాను సార్!” అన్నాడు.

ముందుగా డబ్బు విషయం మాట్లా డక పోవడం నేను చేసిన పెద్ద తప్పు అని చేసేదిలేక అతను అడిగిన డబ్బు
ఇచ్చి రూంకు వచ్చాను.

విషయం అడిగి తెలుసుకున్న మా ఆవిడ ప్రొ ద్దు న వంద రూపాయలకే వచ్చి నిజాయితీ పరుడనిపించుకొని భలే
మోసం చేశాడు అంది.

“ఢిల్లీ అంటే అంతే అత్త య్యా! మోసాలు బాగా చేస్తా రని చాలా మంది చెప్పారు” అంది కోడలు.

ముగ్గు రం కాసేపు బాధ పడ్డా ము. బయటకు వెళ్లే ఓపిక లేక మళ్లీ రూంకే ఆర్డరిచ్చి తెప్పించుకొని తిన్నాము.

మరుసటి రోజు ఉదయం రిసిప్సన్ లో నిన్న జరిగింది చెప్పాను. మీరు డబ్బు ఎక్కువ ఇచ్చారు సార్! వెయ్యికి
మించి అవ్వదు అన్నారు వాళ్లు . వాళ్ల ఏ.సి. కారు అయితే ఎనిమిది గంటలు, 80 కిలోమీటర్ల వరకు రూ.1600-
00 అవుతుందని చెప్పారు.

టిఫిన్ తిని రెడీ అయి వేరే ఆటోను ముందుగానే మాట్లా డుకొని వీసా ఆఫీసుకు వెళ్లా ము. మా కోడలు అక్కడ
ఆఫీసులో డాక్యుమెంట్స్ ఇచ్చాక వాళ్లు టోకెన్ ఇచ్చి కూర్చోమన్నారు.

ముగ్గు రం ఒక చోట కూర్చున్నాము. వీసా ఏమవుతుందోనని నా శ్రీమతికి కాస్త కంగారుగా ఉంది.

“డిపెండెంట్‌గా వెళుతున్నాను కాబట్టి ఏమీ కాదు అత్త య్యా!” అని ధైర్యం చెప్పింది.

కాసేపటికి మా కొడలి టోకెన్ నెంబర్ వచ్చింది. సుమారు గంట తరువాత చిరునవ్వుతో మా వద్ద కు వచ్చింది.
వీసా అయిపోయిందని పాస్ పోర్ట్ రేపు మధ్యాహ్నం మూడు నుండి నాలుగు గంటల మధ్య వచ్చి
తీసుకోవచ్చని స్టా ంప్ వేసిన పేపర్ చూపించింది.

వీసా అయిపోయిందన్న సంతోషంతో ఆటోలో లాడ్జ్ చేరుకొన్నాము.

మా రిటర్న్ జర్నీ మరుసటి రోజు రాత్రి పదిగంటలకు ఫ్లైటెలో.

మన లాడ్జ్ వాళ్లు చెప్పిన ప్యాకేజీ బాగుంది రేపు లోకల్ ట్రిప్ చూసుకొని మూడున్నరకల్లా వీసా ఆఫీసుకు వెళ్లి
పాస్ పోర్ట్ కలెక్ట్ చేసుకుందాము అన్నాను. మా వాళ్లు సరేనన్నారు.

రేపు ఉదయం ఏడు గంటలకల్లా లోకల్ ట్రిప్ వెళతాము అని లాడ్జ్ వాళ్ల కు చెప్పి రూ. 1600-00 ప్యాకేజ్
మాట్లా డుకొని లోటస్ టెంపుల్, కుతుబ్‌మినార్, స్వామినారాయణ్ టెంపుల్, రెడ్ ఫోర్ట్‌తో పాటు వీసా ఆఫీసు
కవర్ చేయాలని చెప్పాను. వాళ్లు క్యాబ్ బుక్ చేశారు.

మేము ఆ రోజు ఉదయం త్వరగా లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి రిసెప్ష న్ లో కూర్చున్నాము. క్యాబ్ 7.30
నిముషాలకు వచ్చింది.

ముందుగా కుతుబ్ మినార్ చేరుకున్నాము. డ్రైవరు క్యాబ్ పార్కింగ్ లో పెట్టు కున్నాడు. నేను వెళ్ళి ఎంట్రీ టికెట్
తెచ్చేలోగా నా సెల్ మ్రో గింది ఆ నెంబర్ చూడగానే నాకు చిర్రెత్తు కొచ్చింది. అది సింగ్ ది, ఏంటి విషయం అని
అడిగాను.

“సార్! చాలా ముఖ్యమైన విషయం మిమ్ములను కలవాలి” అన్నాడు.

“మేము బయట ఉన్నాము వచ్చేసరికి సాయంత్రం ఐదు పైనే అవుతుంది” అన్నాను.


“అలాగే సార్! అప్పుడే కలుస్తా ను” అన్నాడు.

“ఆ సింగ్‌‌కు మనతో ఏంపనో?” అంది శ్రీమతి.

“ఏమో తెలియదు... హ్యాపీగా ఎంజాయ్ చేద్దా ం పదండి” అని లోపలకు వెళ్లా ము.

దాని తరువాత లోటస్ టెంపుల్, స్వామినారాయణ్ టెంపుల్, రెడ్ ఫోర్ట్ చూసుకొని చివరగా వీసా ఆఫీసుకు
వెళ్లి పాస్ పోర్ట్ కలెక్ట్ చేసుకుని లాడ్జ్ కు బయలుదేరము. అన్ని కట్ట డాలు ఎంతో ఆకట్టు కున్నాయి. కానీ ఢిల్లీలో
వాతావరణ కాలుష్యం చాలా ఎక్కువ. ట్రా ఫిక్ ఎక్కువ ఉన్నా నియంత్రణ బాగుంది.

లాడ్జ్ చేరుకునే సరికి సాయంత్రం ఐదు పైనే అయ్యింది. సింగ్ మా కోసమే లాడ్జ్ రిసెప్ష న్ లో
ఎదురుచూస్తు న్నాడు. ఏంటని అడిగాను.

“సార్! మొన్న రాత్రి ఆటోలో మీరు తిరిగిన తరువాత తిన్నగా మా ఇంటికే వెళ్ళాను. ఉదయం ఆటోను శుభ్రం
చేస్తు ండగా వెనుక సీట్లో కాళ్లు పెట్టు కునే చోట ఒక మూలాన ఈ ఉంగరం దొరికింది మీ దేనేమో చూడండి” అని
ఇచ్చాడు.

అది డైమండ్ రింగ్ దాని మీద మణి అని ఉంది అది మా కోడలుదే మేము ఎంగేజ్ మెంట్‌‌కు పెట్టా ము. అయ్యో!
అని అప్పుడు వేలు చూసుకుంది మా కోడలు.

“ఎప్పుడు పడిపోయిందో.. ఈ రోజుకు మూడు రోజులవుతోంది వేలికి ఉన్న ఉంగరం పోయిందన్న ద్యాస కూడా
లేకపోతే ఎలాగ అమ్మాయ్యి ” అంది నా శ్రీమతి.

“కొద్దిగా లూజుగా ఉండడంవల్ల జారిపోయి ఉంటుంది నన్ను క్షమించడి అతయ్యా!”

“వీసా టెన్ష న్లో చూసుకొని ఉండదులే” అని సర్ది చెప్పాను.

దాని ఖరీదు రూ.60,000-00 పైనే అయ్యింది.

“సార్! అది ఎవరి కంట్లో నూ పడలేదు.. మీ సొమ్ము గట్టి ది”

“అవును ఇది మాదేనని ఎలా అనుకున్నావు”

“నిన్న అంతా మా చుట్టా ల పెళ్లికి వెళ్లా ము వచ్చే సరికి రాత్రి పదకొండు గంటలు దాటింది... ఈ రోజు
కూరగాయల బస్తా లు దింపాను.మీ తరువాత ఎవ్వరూ ఎక్కలేదు” అని చెప్పాడు.

నేను ఆ ఆనందంలో రెండు వేల రూపాయలను తీసి ఇవ్వబోయాను.

“వద్దు సార్! ఇప్పటికే మీరు నాకు ఎక్కువ డబ్బు ఇచ్చారు” అని నవ్వుతూ వెళ్లిపోయాడు.

అతనికి ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోవడం నాకు బాధ అనిపించింది.

ఆటోకు రూ. 1400-00 కారుకు రూ.1600-00 . అతనికి డబ్బు ఎక్కువ ఇచ్చానన్న భావనను నా మనసులో
నుండి ఆ క్షణమే తొలగించాను. ఎందుకంటే అతను నిజాయితీపరుడు లేకపోతే డైమండ్ రింగ్ తిరిగి ఎలా
తెచ్చి ఇస్తా డు.

గురుప్రీత్ సింగ్‌కు నా మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాను.

******
యు.విజయశేఖర రెడ్డి
పాపం సుందరం! - పద్మావతి దివాకర్ల
Object 10

డైనింగ్ టేబుల్‌
ముందు కూర్చున్న
సుందరం తనకి
ఎదురుగా అమర్చి
ఉన్న ఆహారపదార్థా లు
చూసి ఎక్కడలేని
నీరసానికి
గురయ్యాడు. ప్లేట్లో
సర్దిఉన్న జొన్న
రొట్టెలు, రాగి జావ,
పచ్చి కూర ముక్కలు
చూసేసరికి
అప్పటివరకూ ఉన్న
ఆకలి ఎటో
మాయమైపోయింది.

భార్యా పిల్ల ల ముందు


మాత్రం రకరకాల
వంటకాలు ఉన్నాయి.
అవి చూసి నోరు
ఊరిన సుందరం
ఉండబట్ట లేక, "నాకు
కొంచెం మెంతివంకాయ
కూర, ఆవకాయ
వెయ్యకూడదూ!" అని
అడిగాడు భార్య
సుందరిని.

"ఇంకా నయం దుంపలు వేపుడు, కొబ్బరి చట్నీ కూడా వెయ్యమన్నారు కాదు." అందామె వ్యంగ్యంగా.

ఆమె మాటల్లో ని వ్యంగ్యం అర్ధ ంకాని, "అయితే అవికూడా వెయ్యు." అన్నాడు ఆశగా సుందరం.

"ఏమిటేమిటి, అవి కూడా వెయ్యాలా? ఎంత ఆశ! మతి ఉండే మాట్లా డుతున్నారా? మర్చిపోయారా మీ
ఆరోగ్య పరిస్థితి? మీరిలా చిన్నపిల్ల ల్లా మారాం చేస్తే ఎలా? ఇవన్నీ మీరు తినకూడదని డాక్టర్ చిలక్కి చెప్పినట్లు
చెప్పారు గుర్తు లేదా మీకు? మీరు ఇప్పుడు కేవలం నేను పెట్టి న జొన్న రొట్టెలు, రాగి జావ, పచ్చి కూర ముక్కలు
మాత్రమే తినాలి. అంతే, మరేం అడగకండి." నిర్మొహమ్మాటంగా చెప్పింది సుందరి.

"నాన్నా, మీ ఆరోగ్యం కోసం అమ్మ ఎంత తపిస్తు న్నదో చూసారా! ఇక మీ పాత ఆహారపు అలవాట్లు
మర్చిపోవాలి నాన్నా!" అన్నాడు కొడుకు సురేంద్ర.
తన మాట ఇక చెల్ల దని గ్రహించాడు సుందరం. అతి కష్ట ంమీద వాటి మీదనుండి చూపు మరల్చుకొని
దిగులుగా తనకిచ్చిన జొన్న రొట్టెలు తినడంలో నిమగ్నమైయ్యాడు. తినలేక తినలేక కష్ట పడి తినసాగాడు తన
ముందు ఉంచిన పదార్థా లు.

సుందరంకి రక్తపోటు, మధుమేహంతో పాటు కొలష్ట్రాలు కూడా ఉంది. ఈ మధ్యనే గుండెపోటు వచ్చి
శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. డాక్టర్ అతనికి, అతని భార్యకి తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు ఆహార
విషయంలో కూడా తగు జాగ్రత్తలు చెప్పాడు. ఆ డాక్టర్ చెప్పిన జాగ్రత్తలే కాకుండా సుందరి ఇంకా చాలా చోట్ల
సామాజిక మాధ్యమాల్లో సేకరించిన సమాచారంబట్టి సుందరానికి భోజనం సమకూరుస్తో ంది. రుచిపచీ లేని ఆ
చప్పిడి తిండి తినలేక నానా బాధ పడుతున్నాడు పాపం సుందరం. ఏం చేసినా భార్య తనకి తినడానికి
ఇష్ట మైనవి పెట్ట డంలేదు. డాక్టర్ చెప్పిన విషయాలు తూచా తప్పకుండా పాటిస్తు న్నది సుందరి. చేసేదేమీలేక
అలాగే అడ్జ స్ట్ అయిపోతున్నాడు పాపం సుందరం.

మధ్యాహ్నం కొద్దిగా విశ్రా ంతి తీసుకున్న తర్వాత సాయంకాలం ఏదో నల్ల టి కషాయం లాంటి పానీయం ఇచ్చింది
సుందరి. సామాజిక మాధ్యమాల్లో విని అలాంటి కషాయం చేయడం నేర్చుకొని సాయంకాలం వేళ భర్తకి
ఇస్తో ందామె. పాపం సుందరం నోరేమో కమ్మటి కాఫీ కోసం కాయకాచిపోయింది. అయినా చేసేదేమీ లేదు.
ఏమైనా ఇంటే గయ్‌మని ఇంతెత్తు లేస్తు ందామె. 'అంతా మీ ఆరోగ్యం కోసమే కదా!' అంటుంది ఏమైనా అంటే.

తనేమో చక్కగా రకరకాల చిరుతిళ్ళు తింటూ కాఫీ సేవిస్తు ంది. ఆమె వైపు జాలిగా చూడటం తప్ప ఇంకేం
చెయ్యలేడు సుందరం.

సోఫాలో విశ్రా ంతిగా చేరబడ్డ సుందరం మనసు గతంలోకి పరుగులు తీసింది. నలభై ఏళ్ళ కిందటి మాట.
అప్పుడే తను కొత్త గా ఉద్యోగంలో చేరిన రోజులు. అందరిలానే ఏ పెద్ద నగరంలోనో, పట్ట ణంలోనో ఉద్యోగం చేసి
బ్రహ్మచారి జీవితాన్ని ఆనందంగా గడపాలని భావించిన సుందరంకి ఆశాభంగం కలిగింది. గిరిజన ప్రా ంతంలో
ఒక మారు మూల పల్లెటూళ్ళో ప్రభుత్వరంగ బ్యాంక్‌లో పోస్టింగ్ వచ్చింది సుందరంకి. ఆ గిరిజన గ్రా మంలో
సరైన వసతి, ఇతర సౌకర్యాలు కూడా లేవు. అలాగే ప్రయాణ సౌకర్యాలు కూడా. జిల్లా కేంద్రా నికి వెళ్ళడానికి,
రావడానికి రోజుకి ఒక బస్సు మాత్రమే ఉండేది. అత్యవసర వస్తు వులన్నీ ఆ జిల్లా కేంద్రం నుండే రావాలి. ఆ
పల్లెటూరిలో కాయగూరలు మాత్రం ఏవో కొద్దిగా లభిస్తా యి, అంతకు మించి ఇంకేం దొరకవు. వెచ్చాలు కూడా
బయట నుండి రావలసిందే. ఏ కారణంవల్ల నైనా బస్సులు ఆగిపోతే ఇక అంతే సంగతులు. ఓసారి అలాగే
ప్రతిపక్ష రాజకీయ పార్టీ నిర్వహించిన బంద్ వలన వరసగా మూడు నాలుగురోజులు పట్నం నుండి సరుకులు
రాలేదు. బంద్ వలన దగ్గ రున్న పట్నంలో ఉంటున్న మేనేజరు కూడా రాలేకపోయాడు. ఊళ్ళోఉన్న చిన్నచిన్న
దుకాణాలు, హోటళ్ళు కూడా తెరవలేదు. ఓ చిన్న హోటల్లో నే భోజనం చేసేవాడు. సుందరం అప్పటికింకా
స్వయంపాకం ప్రా రంభించలేదు. సుందరంకి భోజనం ఓ సమస్య అయింది. అయితే అతని పరిస్థితి గ్రహించిన
ఆ బ్యాంక్‌లో స్వీపర్‌గా పని చేస్తు న్న అప్పన్న సుందరంని తన ఇంటికి పిల్చాడు. అతని ఇంటికి భోజనానికి
వెళ్ళడానికి ముందు మనస్కరించలేదు సుందరం. అయితే ఆకలికి తట్టు కోలేక అప్పన్న ఇంటికి వెళ్ళక తప్పింది
కాదు. అప్పన్న ఉండేది ఓ చిన్న పాకలో. అందులోనే అప్పన్న తన తల్లితండ్రు లు, భార్యాపిల్ల లతో
ఉంటున్నాడు. అప్పన్న పేదరికం ప్రతిబింబిస్తో ంది ఆ ఇంట్లో . అప్పటికే ఆ ఇంట్లో వాళ్ళందరూ భోజనం
చేయడానికి కూర్చున్నారు. అప్పన్న తన భార్యతో ఏదో చెప్పడంతో అమె సుందరకి కూడా కింద కూర్చోవడానికి
నేలమీద ఓ చిన్న గుడ్డ ముక్క పరిచింది. అప్పన్న తనవాళ్ళనందర్నీ సుందరంకి పరిచయం చేసాడు. సుందరం
చాలా బిడియపడుతూ వాళ్ళని పలకరించి కూర్చున్నాడు. అప్పుడు అప్పన్న భార్య అందరికీ తినడానికి
ఆకులలో కొన్ని జొన్నరొట్టెలు, ఆకుదొన్నలలో ఏదో పదార్థ ం తెచ్చింది. అందరూ తినడానికి
ఉద్యుక్తు లవుతూంటే, ఆ పదార్థా లేమిటో తెలియక అయోమయంగా వాటివైపు చూస్తూ కూర్చున్నాడు
సుందరం.
అప్పుడు సుందరం పరిస్థితి చూసిన అప్పన్న, "సార్! అది రాగి జావ. మేము రాగిజావ, జొన్న రొట్టి లే
సాధారణంగా తింటాము. అవే మాలాంటి వారికి పరమాన్నం సార్! ఇంట్లో బియ్యం లేకపోవడం వల్ల మీరు తినే
వరి అన్నం వండలేదు. రేపు ఎలాగోలా ఎక్కణ్ణు ంచైనా తెచ్చి అన్నం వండగలం. ఇవాళకి ఎలాగోలా వీటితో
సరిపెట్టు కొండి." చెప్పాడు సంకోచంగా.

"ఏం ఫర్వాలేదు అప్పన్నా! మీరందరూ తినగా లేంది నేను మాత్రం తినలేనా!" అన్నాడు బింకంగా సుందరం.
మాటవరసకి, మొహమ్మాటానికి అలా అన్నాడే కాని అలవాటులేని ఆ జొన్నరొట్టె లు, రాగిజావ తినడానికి చాలా
కష్ట పడవలసి వచ్చింది. అవి కష్ట పడి తిన్నతర్వాత, పాపం అప్పన్న, అతని కుటుంబ సభ్యులు అవి ఎలా
తింటున్నారో అని మనసులో అనుకున్నాడు. పేదవారు అంతకుమించి ఇంకేం తినగలరు పాపం అనుకున్నాడు
సానుభూతిగా. అయితే అక్కడ గిరిజనులకి అవే ముఖ్యమైన అహారం అని ఆ తర్వాత తెలుసుకున్నాడు
సుందరం. రెండురోజుల తర్వాత మళ్ళీ బళ్ళు నడిచాయి. హోటళ్ళు కూడా తెరవడంతో సుందరం స్థిమిత
పడ్డా డు. అయితే ఆ తర్వాత హోటళ్ళపై ఆధారపడకుండా స్వంతంగా వండుకునేందుకు ఏర్పాట్లు
చేసుకున్నాడు. అప్పన్న ఇంట్లో తిన్న జొన్న రొట్టెలు, రాగి జావ గురించి మాత్రం ఇప్పటివరకూ మరిచిపోలేదు
సుందరం. ఆ ఊరినుండి నాలుగేళ్ళ తరవాత బదిలి అయి మరో ఊరికి వెళ్ళినా అక్కడి అనుభవాలు
సుందరం మదిలో అలానే నిక్షిప్త మై ఉండిపోయాయి.

ఉద్యోగంలో క్రమంగా పైకెదిగి సకాలంలో పదోన్నతులు సాధించి ఈ మధ్యనే ఉద్యోగ విరమణ చేసాడు
సుందరం. ప్రస్తు తం ఆరోగ్య పరిస్థితుల ప్రభావం వల్ల చివరికి తను ఆ రోజు గిరిజన గ్రా మంలో తిన్న తిండే
ఇప్పుడు తినవలసి వస్తో ందని గ్రహించి మనసులోనే విరక్తిగా నవ్వుకున్నాడు సుందరం. అప్పుడది పేదవారి
భోజనమని భావించాడు కాని, ఇప్పుడు అదే తినక తప్పడంలేదు తనకు. తను ఆర్థికంగా ఇప్పుడు ఎంత
ఉన్నత స్థితిలో ఉన్నా అవే తినక తప్పడంలేదు తనకు. ఆరోగ్య పరిరక్షణకు ఇవాళారేపూ చాలామంది అవే
భోజనంగా స్వీకరిస్తు న్నారని గుర్తొ చ్చి కొద్దిగా సమాధాన పడ్డా డు.

గతంలో జరిగిన ఆ విషయాలు గుర్తు కు తెచ్చుకొని నిర్లిప్త ంగా తనలోతాను నవ్వుకున్నాడు సుందరం.

"ఏమిటండీ మీలో మీరే నవ్వుకుంటున్నారు. రాత్రి తొమ్మిది గంటలు దాటింది. లేవండి భోజనానికి!" అన్న
శ్రీమతి మాటలు వినిపించి ఉలిక్కిపడి ఈ లోకం లోకి వచ్చాడు.

తనకి పెట్ట బోయే భోజనం తలచుకుంటూ విరక్తిగా నవ్వుకొని భోజనానికి లేచాడు పాపం సుందరం.
చెప్పుడు మాటలు వింటే...! -
మీగడ.వీరభద్రస్వామి
Object 11

ఒక వనంలో ఒక తూనీగ ఉండేది. ఆ తూనీగకు ఒక సీతాకోక చిలుకతో స్నేహం ఉండేది. వీటికి ఒక గండు
చీమతో స్నేహం కుదిరింది. మూడూ ఎంతో స్నేహంగా ఉండేవి. ఒక రోజు ఒక మిడత ఆ వనములోకి వచ్చింది.
తూనీగ, సీతాకోకచిలుక, గండుచీమల మద్య ఉన్న స్నేహాన్ని చూసి మిడత ఈర్ష్య పడింది. ఎలాగైనా ఆ
మిత్రు ల మద్య గొడవ పెట్టి వాటిని విడదీయాలని ప్రణాళిక వేసుకుంది. ఒక రోజు గండు చీమ, తూనీగ ఆహారం
సంపాదనకు వెళ్ళినప్పుడు సీతాకోక చిలుక వద్ద కు వెళ్లి" చీమను నమ్మకూడదు నువ్వు గాఢ నిద్రలో
వున్నప్పుడు నిన్ను తన జాతి చీమల సాయంతో చంపి తినేయగలదు, అందుకే ఆ చీమ నీతో స్నేహం
నటిస్తు ంది, దానితో నీకు ఏ క్షణాన్నైనా ప్రా ణాపాయం తప్పదు. ఇక ఆ తూనీగ పెద్ద కర్రలాంటి తోకపెట్టు కొని
బంతిలాంటి తల, అందం చందం లేని శరీరంతో చూడటానికి అసహ్యంగా ఉంటుంది,అలాంటి జీవితో నీలాంటి
అందగత్తెకు స్నేహం ఏమిటి? నువ్వు ముందు చీమని చంపేసి తూనీగతో స్నేహంగా ఉండకుండా దూరంగా
ఉండు"అని సీతాకోకచిలుకకు తప్పుడు సలహా ఇచ్చింది.మరో రోజు తూనీగ ఒంటరిగా ఉండటం చూసి
"మిత్రమా సీతాకోకచిలుక ఇప్పటి రూపం చూసి మోసపోకు దాని గతరూపం గొంగళిపురుగు, అలాంటి దానితో
స్నేహం అవమానకరం, ఇక చీమ ప్రమాదకారి దాని జాతిని నమ్మరాదు"అని చెడు మాటలు నూరిపోసింది.
మిడత పాచిక పారింది ముగ్గు రు మిత్రు లు మద్య అభిప్రా య భేదాలు పొడచూపాయి. ఇంకో రోజు చీమ పుట్ట
దగ్గ రకు పోయి " ఓ పిపీలకమా! నువ్వు వెఱ్ఱిబాగులదానిలా వున్నావు సీతాకోకచిలుక, తూనీగ ఆహారంగా
చీమల్ని దోమల్ని తింటుంటాయి అని విన్నాను, ఏదోరోజు నిన్ను తినేస్తా యి, వాటికి దూరంగా ఉండు" అని
చీమకి అనుమానాన్ని రేకెత్తించింది. మిడత చెప్పుడు మాటల ప్రభావం బాగా పనిచేసింది, ఆ మిత్రు లు మద్య
ఎడముఖం పెడముఖం అన్నట్లు కొన్నాళ్ళు సాగింది, ఒకరోజు తూనీగ ఒక పువ్వుపై వాలి ఉండగా మిడత ఒక
చెట్టు కొమ్మను విరిచి తూనీగ పైకి విసిరింది, తూనీగని చంపేడానికి, అదే సమయంలో చీమ తూనీగపై కొమ్మ
పడకుండా అడ్డు పడి కొమ్మను పక్కకు విసిరేసింది, అదే సమయంలో పక్క ఆకుమీద ఉన్న సీతాకోకచిలుక
తూనీగకి కొమ్మతగలకుండా తూనీగని పక్కకు లాగేసింది. తృటిలో ప్రమాదంనుండి బయట పడ్డ తూనీగ తనని
చంపడానికి మిడతే ప్రయత్నించిందని గమనించక, చీమను, సీతాకోకచిలుకను నిందించింది,"మీరే నన్ను
చంపడానికి కుట్ర చేశారు"అని చీమతోనూ, సీతాకోకచిలుకతోనూ గోడవపడింది, అంతలో మిడత అక్కడకు
వచ్చి "కొమ్మను చీమ, తూనీగలు ఇద్ద రు మీదకూ విసిరింది సీతాకోకచిలుక , అయితే చీమ చాకచక్యంగా
తప్పించుకొని తూనీగ మీదకు విసరబోయింది" అని చీమ, తూనీగ, సీతాకోకచిలుకల మద్య తగువును
పెంచింది. సీతాకోకచిలుక అవాక్కై "నాకు ఏ పాపమూ తెలీదు, ఇది చీమ కుట్ర" అని లబోదిబోమంది,
"నేనేందుకు తూనీగను చంపుతాను తూనీగ, నువ్వూ కలిసి నన్నే చంపేస్తా రు ఏనాటికైనా" అని చీమ మండి
పడింది. విషయం స్పష్ట ంగా తెలియక పోయినా మిడత జిత్తు లుమారి మాటలు నమ్మి ఆ మూడు ప్రా ణులూ
ఒకదానికొకటి నిందించుకుంటూ కీచులాడుకున్నాయి, అవి తన్నుకొని చస్తే తినడానికి సిద్ధ ం అన్నట్లు కూర్చుంది
మిడత తగువు తీర్చకుండా... ఒక పిచ్చుక అక్కడకు వచ్చి" మిత్రు లు మద్య అనుమానం మంచిది కాదు నేను
చాలా రోజులు నుండి గమనిస్తు న్నాను ఈ మిడత వాలకం బాగాలేదు మీలో మీకు తగువులు పెట్ట డానికే
చూస్తు ంది, అసలు కొమ్మను తూనీగ పైకి విసిరింది మిడత, కొమ్మ తూనీగపై పడకుండా అడ్డు కుంది చీమ, కొమ్మ
పొరపాటున తూనీగకు తగులుతుందేమో అని తూనీగను పక్కకు లాగింది సీతాకోకచిలుక, మీ ముగ్గు రూ
ప్రా ణమిత్రు లే, ఒకర్ని రక్షించడానికి మరొకరు ప్రయత్నం చేశారు, మధ్యలో ఈ అనుమానాలు,
అభిప్రా యభేదాలూ దేనికి, మిడత మాటలు నమ్మి మిత్రత్వాన్ని, శత్రు త్వంగా మార్చుకోవడం దేనికి అని చీమ,
తూనీగ సీతాకోకచిలుకలకు హితవు పలికింది. అవి మిడత మాటలు నెమరువేసుకొని, మిడత చెడ్డ బుద్ధిని
గ్రహించి,కోపంతో మూకమ్మడిగా మిడతపై దాడి చేశాయి. పిచ్చుక వాటిని శాంతపరిచి, చంపడం... చావడం
మంచి సాంప్రదాయం కాదు, మిడతకు ఈ వనం నుండి బహిష్కరిద్దా ం అని మిడతను తీవ్రంగా మందలించి
వనం విడిచి పొమ్మని అదేశించి, చీమ, సీతాకోకచిలుక, తూనీగలను కలిపి...లివ్ లాంగ్ అంటూ వాటికి
ఐకమత్యం గొప్పతనం కథలు చెప్పి తుర్రు న ఎగిరిపోయింది. రచన::- మీగడ. వీరభద్రస్వామి
బలవంతుడ నాకేమని - మీగడ.వీరభద్రస్వామి
Object 12

ఒక ఊర్లో
ఒక
వస్తా దు

ఉండేవాడు.తాను బలవంతుడ్ని అనే గర్వం అతనికి ఎక్కువగా ఉండేది. దానికి తోడు అతనికి ధనబలం కూడా
ఎక్కువ ఉండటంతో అతనికి పొగరు విపరీతంగా ఉండేది.అతను ఊర్లో పెద్ద లను గౌరవించేవాడు
కాదు,బంధుమిత్రు లను ఆదరించేవాడు కాదు.అతని గర్వాన్ని పోగొట్టే మొనగాడు ఉంటే బాగుణ్ణు అని ఊర్లో
వారు అనుకునేవారు. ఒక రోజు ఊర్లో కుస్తీ పోటీలు పెట్టా రు.కుస్తీ పోటీల్లో చాలా మందిని ఓడించాడు
వస్తా దు.విజయ గర్వం బాగా తలకెక్కిన ఆ వస్తా దు,అకారణంగా ఒక పెద్దా యన మీద చెయ్యి
చేసుకున్నాడు.ఊర్లో వారందరూ బాధ పడ్డా రు. ఒక ముసలాయన వచ్చి వస్తా దుని మందలించాడు, వస్తా దు
ముసలాయనపై మండిపడుతూ,నేను ఒక్క దెబ్బ వేశానంటే చచ్చిపోతావు అని హేళనగా మాటలాడాడు,
నన్ను కొట్ట డం నీ తరం కాదు,నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను కుస్తీ పోటీల్లో ఓడించు అని సవాలు విసిరాడు
ముసలాయన,అందుకు వస్తా దు బిగ్గ రగా నవ్వుతూ,నీతో కుస్తీ పోటీల్లో నేను ఓడిపోతే నా ఆస్తి మొత్త ం నీకు
ఇచ్చేసి నేను నా జీవితాంతం బానిసగా ఉంటాను అని బీరాలు పలికాడు. ముసలాయనకు వస్తా దుకు మధ్య
కుస్తీ పోటీ మొదలయింది.ముసలాయ వస్తా దుని కావాలనే హేళన చేసాడు.వస్తా దు మండి పడి అతనిపై కాస్తా
మట్టి విసిరాడు.ఇదే మంచి అదును అనుకొని ముసలాయన కుస్తీ మైదానం పక్కనున్న చీమల పుట్ట ను
చెదరగొట్టి గుప్పెడు చీమలు తెచ్చి వస్తా దు మీద గుమ్మరించాడు. చీమలుకొన్ని వస్తా దు లోదుస్తు ల్లో కి చేరి తమ
ఇష్టా నుసారంగా కాట్లు వేసి వస్తా దుకి నానా ఇబ్బందులు పెట్టా యి,వస్తా దు నేలమీద పడి దొర్లు తూ కిర్రో మొర్రో
అంటుండగా ముసలాయన వస్తా దు గుండెలుమీద కూర్చున్నాడు,వస్తా దు ముసలాయనకు దండం పెట్టి తాను
ఓడిపోయినట్లు ఒప్పుకున్నాడు.అప్పటి నుండి ముసలాయనకు కట్టు బానిసయ్యాడు.

విచిత్ర పుష్పం. - కనుమ ఎల్లా రెడ్డి


Object 13

మాండవ పురాన్ని
పరిపాలిస్తు న్న వీరవర్మ
మహారాజుకు ఇద్ద రు మగ
పిల్ల లు. అందులో
పెద్ద వాడు రామ వర్మ పుట్టు
గుడ్డి.రెండవ వాడు రాఘవ
వర్మ చక్కగా ఉన్నాడు.
మహా రాజు రామవర్మ
గురించే చింత
చేస్తు న్నాడు.మహారాణి
రత్న ప్రభ ఇద్ద రిని సమంగా
పెంచింది. రాఘవ వర్మ ను
ఉద్దేశించి
" అన్నదమ్ములు ఎప్పుడూ
విడిపోకూడదు,పగలు
పెంచుకోకూడదు.రాజ్యం లోని ప్రజల సాధక బాధకాలను చూడాలి.మీరు సఖ్యతగా ఉండాలి.అన్నకు చూపు
లేదని చిన్న చూపు చూడకు నాయన" అంది.
"ఛా.. అలాంటి దేమి ఉండదమ్మా. అన్నకు చూపు వస్తు ంది " అని రాఘవ వర్మ చెబుతుంటే " నీ మాట ఫలిస్తే
చాలు నాయన" అంది. రోజులు గడుస్తు న్నాయి.పిల్ల లిద్ద రూ అన్ని విద్యలు నేర్చుకున్నారు.యుక్త వయస్సు
వచ్చింది.వీరవర్మ గుడ్డి కుమారుడైన రామవర్మను ఎందరో వైద్యులకు చూపించాడు.ఎన్నో పసరులు, ఔషధాలు
ద్వారా వైద్యం చేయించాడు.ఉహు అవి ఏవీ ఫలితాలు ఇవ్వలేదు. ఒక రోజు రాజ్యానికి సిద్ధ మహర్షి వచ్చాడని
ఆయన మాట నిజం అవుతుందని ,ఎన్నో రోగాలను కుదిర్చిన వాడని తెలిసింది రాజుకు. ఈ విషయం తెలిసి
సిద్ధ మహర్షికి కబురు పెట్టా డు. సిద్ధ మహర్షిని సాదరంగా ఆహ్వానించాడు వీరవర్మ.
"పిల్ల లకు కబురు పెట్ట ండి" అన్నాడు సిద్ధ మహర్షి. " రామవర్మ,రఘువర్మ"అని పిలువగానే వినాయముగా
చేతులు కట్టు కుని
వచ్చి నిలబడ్డా రు.మహర్షికి పాదాభివందనం చేశారు. సిద్ధ మహర్షి రామవర్మను పరీక్ష గా చూసి కళ్ళు
మూసుకుని నోటి తో ఎదో జపిస్తు న్నాడు.కాసేపటికి మహర్షి కళ్ళు తెరచి "రాజా! నీకుమారునికి చూపు
వస్తు ంది.ఇది వైద్యంతో నయం అయ్యేది కాదు.ఓ విచిత్ర పుష్పం తో నయం అవుతుంది" అన్నాడు.
రాజు ఆ మాటకు " విచిత్ర పుష్పమా! ఎక్కడవుంటుంది స్వామి?" అన్నాడు. సిద్ధ మహర్షి ఇలా చెప్పాడు
"రాజా! తూర్పు దిక్కున ఓ కొండ పైన శివాలయం ఉంది.ఆ శివాలయం ప్రక్కనే కోనేరు ఉంది.అందులో
ఉంటుంది.చాలా మహిమాన్వితమైన పుష్పం.పౌర్ణమి రోజునే అది కోనేరు లోనుంచి బైటకు వస్తు ంది.ఆ
పుష్పాన్ని తీసుకు వచ్చి శివునికి జలాభిషేకం చేసి ,రాజ ప్రా సాదములోనే ఓ ప్రత్యేక మైన కొలను లో ఆ
పుష్పాన్ని విడవాలి.తరువాత పౌర్ణమి రోజునే ఆ పుష్పాన్ని మీ కుమారుని కళ్ళకు తాకించాలి. అప్పుడే పూర్తి
దృష్టి వస్తు ంది. ఆ పుష్పం ఉన్న రాజ్యంలో సుఖశాంతులు ఉంటాయి.దుష్ట పీడలు ఉండవు"అని చెబుతూ
"కానీ రాజా!" అంటూ ఆగాడు.
" చెప్పండి మహర్షి "అన్నాడు రాజు. మహర్షి గడ్డ ం దువ్వుకుంటూ రాజును ప్రక్కకు ఆహ్వానించాడు.మహర్షి
ఇలా చెప్పాడు.
" రాజా! ఆ పుష్పం మీ ఇద్ద రి కుమారుల మధ్య చిన్న పాటి ఘర్షణను తెస్తు ంది" అన్నాడు. " స్వామి" అన్నాడు
రాజు ఆందోళనగా.
"రాజా! విచారించకు నీ కుమారుడు రఘువర్మ ద్వారానే ఈ కార్యం జరుగుతుంది.పుష్పం తెచ్చే వరకు నేను
యోగ నిద్రలో నే ఉంటాను" అన్నాడు. "మహర్షి మీ ఆశీస్తు లతో నేను ఆ పుష్పాన్ని తీసుకు వస్తా ను.అన్నకు
కంటి చూపు వస్తు ంది అన్నాడు రాఘవవర్మ.
మహర్షి రాఘవవర్మ భుజం తడుతూ " భేష్ నీ సోదర ప్రేమ గొప్పది .రేపే బయలుదేరు" అన్నాడు. " చిత్త ం
స్వామి"అంటూ మహర్షికి పాదాభివందనం చేశాడు రఘువర్మ.
"విజయోస్తు " ఆశీర్వదించాడు మహర్షి.
వీరవర్మ ఆలోచనలో పడ్డా డు.పుష్పం ఇద్ద రికి ఘర్షణ తెస్తు ందా!ఏమిటి ఈ వైపరీత్యం అనుకున్నాడు. రఘువర్మ
అన్నయ్య వైపు చూసి " అన్నయ్య చూపు లేదని నీవు బాధపడకు ఆ పుష్పం తీసుకు వస్తా ను"అన్నాడు.
"మంచిది సోదరా "అంటూ ఆలింగనం చేసుకున్నాడు రామవర్మ. ఆ సోదర ప్రేమకు సంతోషించింది రత్నప్రభ.
ఇంతటి అనోన్య సోదరులకు ఘర్షణా!అర్థ ం కాలేదు వీరవర్మ కు.
**** *** *** ***
ఆ రోజు శివునికి పూజ చేసి నుదుట కుంకుమ తిలకం పెట్టి "వెళ్ళి రా నాయన" అంది రత్నప్రభ. తల్లిదండ్రు లకు
నమస్కరించి పయనం మైనాడు రాఘవవర్మ.
మాండవ పురంలో ఆ రాత్రి నడి ఝాములో ఓ సుందరి పిలుపు "రాజా" అంటూ మధురంగా పిలిచింది.
"ఎవరు " అంటూ దిగ్గు న లేచాడు రామవర్మ. ఓ కిల..కిలా నవ్వు వినిపించింది
"ఎవరు" అన్నాడు. తరువాత మౌనం.కొన్ని క్ష ణములు గడిచాయి. రామవర్మ ఏదో అనుకుని
విశ్రమించాడు.ఇంతలో ఓ చల్ల ని స్పర్శ అతని కళ్ళకు తాకింది.వెంటనే ఆ చేయిని పట్టు కున్నాడు. ఆశ్చర్యం
అతనికి చూపు వచ్చింది.ఎదురుగా అపురూప లావణ్య రాశి. తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు. " నాకు
చూపు వచ్చింది" అంటుంటే అది వారించింది ఆ సుందరి. " రాజా!అరవకు ఈ చూపు కాసేపే, మళ్ళీ నీకు
చీకటే" అంది మధురంగా అతని మెడపై చేతులు ఉంచి. " రాజా "అంటూ రామవర్మ తల దువ్వుతూ " నేను
అప్సరసను నిను కోరి వచ్చాను.ప్రతి రోజు ఇదే సమయానికి వస్తా ను. నీతో కులాసాగా గడుపుతాను రా "
అంటూ ఆలింగనం చేసుకుంది.ఆ ఆలింగనంలో కరిగి పోయాడు.సరిగ్గా తెల్ల వారే సమయానికి ఆమె
మాయమైంది.రామవర్మను మళ్ళీ చీకటి ఆవరించింది.అలా మూడు,నాలుగు రోజులు సమయానికి
రావడం,రామవర్మను శృంగారా కేళిలో ఓలలాడించడం జరిగి పోతోంది.
*** ***** ***** ****
రఘువర్మ శివాలయం పైకి చేరుకున్నాడు.ప్రక్కనే కోనేరు ఉంది.అయితే అది ఎండిపోయి ఉంది.ఈ కొనేరులో
పుష్పమా! చూద్దా ం.రేపే కదా పౌర్ణమి అనుకున్నాడు.
ఆ రోజు రాత్రి రామవర్మ ఆ సుందరి గాఢ కౌగిలిలో ఒదిగిపోయాడు. "రాజా"అంది.
"చెప్పు దేవి" అన్నాడు కళ్ళు మూసుకుని.
" నా మాట వింటావా" అంది
"నీ కోసం ఏమైనా చేస్తా ను "అన్నాడు.
" రేపు పౌర్ణమి మీ తమ్ముడు రాఘవవర్మ ఆ పుష్పాన్ని తీసుకు వచ్చి నీ కళ్ళకు తాకిస్తా డు".
"నాకు చూపు వస్తు ంది ఇక రోజంతా ఈ అందం నాదేగా"!అన్నాడు.
" కాదు నీవు మరణిస్తా వు" అంది. ఆ మాటకు ఆమె కౌగిలిలో నుంచి విడి వడి " నిజమా!"అన్నాడు.
"అవును రాజా!నీ మరణమే అతనికి కావాలి .ఈ రాజ్యం నకు తనే రాజు కావాలనే కాంక్ష కలిగి ఉన్నాడు. నీతో
ప్రేమతో మాట్లా డతాడు.ఎట్టి పరిస్థితుల్లో నూ ఆ పుష్పాన్ని కళ్ళకు తాక నీయవద్దు . మళ్ళీ వస్తా ను" అంటూ
వెళ్ళింది.కటిక చీకటి అతన్ని ఆవరించింది.ఆలోచనలో పడ్డా డు రామవర్మ.తమ్ముడు ఇంతకు తెగించాడా!
అనుకున్నాడు.
**** **** **** ****
నిండు పౌర్ణమి. వెన్నెల పగటిని తలపించేలా ఉంది.రఘువర్మ శివుడిని పూజించి కోనేరు ఒక్కో మెట్టు దిగాడు
ఆశ్చర్యం కొద్దిగా నీరు వచ్చింది.మళ్ళీ ఇంకో మెట్టు దిగాడు.మరికొంత నీరు.అలా మెట్లు దిగుతుంటే నీళ్ళు
వస్తు న్నాయి.పూర్తి మెట్లు దిగాడు.నడుం లోతు వరకు నీళ్ళు వచ్చి ఆగిపోయాయి.వెంటనే ఆ నీళ్ళల్లో నుంచి ఓ
పుష్పం పైకి వచ్చింది.ఆనందం తో కళ్ళు మెరి శాయి. " జై శివ దేవా!"అని నమస్కరించి ఆ పుష్పాన్ని
అందుకుని ఒక్కో మెట్టు ఎక్కి వస్తు ంటే నీళ్ళు తరిగి పోతున్నాయి.కోనేటి పైకి వచ్చిన తర్వాత ఓ శిలా శాసనం
అతన్ని ఆకర్షించింది.ఇలా చదువు కుంటున్నాడు.
" ఈ పుష్పం ప్రతి పౌర్ణమి రోజంతా విక సిస్తూ నే ఉంటుంది.పౌర్ణమి రోజునే ఈ పుష్పాన్ని రోగులకు తాకిస్తే
రోగాలు బాగవుతాయి.కళ్ళు లేని వారి కళ్ళకు తాకిస్తే కళ్ళు వస్తా యి.ఈ పుష్పం ఉన్న రాజ్యములో
కరువు ఉండదు.దుష్ట శక్తు లు ఉండవు.ఇది ప్రతి రోజు పగలు విచ్చు కుంటుంది.రాత్రి
ముడుచుకుంటుంది.అభిషేకించిన ప్రత్యేక జలం తోనే ఈ పుష్పాన్ని ఉంచాలి" అని రాసుంది.
****** ****** ***** ******
ఆ పౌర్ణమి రోజు నడి జాము లో ప్రత్యక్ష మైంది ఆమె.అడుగుల సవ్వడి చూసి " దేవి "
అన్నాడు. ఆమె రఘువర్మ కళ్ళను తాకింది.ఆ రోజు ధగ.. ధగ కాంతితో మెరిసిపోతోంది ఆమె.మేని వంపులతో
ఆకర్షిస్తు ంది.రెండు చేతులు చాచింది.ఆమె గాఢ పరిష్వ 0 గం లో ఒదిగిపోయాడు రామవర్మ. "దేవి"
అంటున్నాడు మత్తు గా." నాకు చూపు శాశ్వతంగా ఇవ్వరాదు"అన్నాడు.
" అది నా చేతుల్లో లేదు రాజా!"అంది.
"ప్రతి రోజు రాత్రి నీ కోసం ఎదురు చూడటం ,ఈ రాత్రి ఇలా ఉంటేనే మేలు అనుకుంటున్నాను దేవి"అన్నాడు.
"నేనంటే అంత ఇష్ట మా రాజా!"
"నాకీ లోకంలో నీవు తప్ప ఎవరూ లేరు" అన్నాడు.
" మరి నీ తమ్ముడు".
" వాడా!సోదర ద్రో హి" అన్నాడు కోపంగా.
" ఆ పుష్పాన్ని చేజిక్కించు కున్నాడు రాజా" అంది.
వెంటనే ఆమె కౌగిలిలో నుంచి బైట పడి "ఎలా
సాధ్యమైంది" అన్నాడు.
" దిగులు చెందకు నీకు ప్రమాదం లేదు.వచ్చే మాసం పౌర్ణమి రోజున నీ సోదరుడు పుష్పాన్ని నీ కళ్ళకు తా
కించడానికి ముందు గానే నీవు ఆ పుష్పాన్ని నాకు ఇవ్వాలి".
"అదేలా సాధ్యం"అన్నాడు.
"ఆ పుష్పాన్ని మీ ప్రా ంగణం లోనే ప్రత్యేకంగా ఓ కొలనులో అభిషేకించిన జలంతో
ఉంటుంది" అంది.
"ఇది నీ కెలా తెలుసు" అన్నాడు.
" పిచ్చి రాజా!"అని అతని మోముపై ముద్దు పెట్టి మాయ చేసింది." నీవు లేనిదే నేను లేను .ఎట్టి
పరిస్థితుల్లో నూ ఆ పుష్పాన్ని కళ్ళకు తాకనీయకు.నీవు మరణించ కూడదు.నీవు నా రాజువు" అని అతన్ని తన
రొమ్ముకు ఆన్చుకుంది. " దేవి" అంటూ ఒదిగిపోయాడు.
******* ****** *****
పుష్పాన్ని తీసుకుని ముందుగా సిద్ధ మహర్షి దగ్గ రకు వెళ్ళాడు రాఘవవర్మ. "స్వామి"అని పిలిచాడు.యోగ
నిద్రలో కళ్ళు మూసుకుని ఉన్న మహర్షి రాఘవవర్మ పిలుపుతో కళ్ళు తెరిచాడు.ఎదురుగా చేతిలో పుష్పాన్ని
పట్టు కుని రాఘవవర్మ కనిపించాడు. అతన్ని చూడగానే చిరునవ్వు నవ్వి " కూర్చో" అంటూ ఆసనం
చూపించాడు.పుష్పాన్ని మహర్షికి ఇచ్చి పాదాలకు నమస్కరించాడు.
"దీర్ఘా యువుతో జీవించు నాయన" ఆశీర్వదించాడు మహర్షి.
"రఘువర్మ నీకో విషయం చెప్పాలి" అంటూ చెవిలో ఎదో చెప్పాడు. అది వినగానే దిగ్భ్రాంతి చెందాడు రఘువ
వర్మ "అలాగా"అన్నాడు. మహర్షి దగ్గ ర సెలవు తీసుకుని రాజ భవనం చేరుకున్నాడు.రాఘవవర్మ విచిత్ర
పుష్పాన్ని తీసుకు వచ్చాడని రాజ్యము అంతా కోలాహలంగా ఉంది.రాజు,రాణి ఆనంద
భరితులైనరు.రామవర్మకు ఈ విషయ తెలిసి కోపంతో ఊగి పోయాడు. "నన్ను చంపాలని వచ్చావా"!
అనుకున్నాడు మనసులో.
******* ******** *******
పౌర్ణమి రాత్రి. శివునికి ప్రత్యేక పూజ
చేసి ,అర్చిన చేసి ,అభిషేకించిన జలంతో ప్రత్యేక కొలనులో ఆ పుష్పాన్ని వదిలారు రాజు,రాణి.రాఘవవర్మ వడి
వడి గా ముందుకు వెళ్ళి పోయాడు.సరిగ్గా అదే సమయానికి రామవర్మ ప్రా సాదము లోకి వచ్చింది ఓ ఆకారం. "
రాజా"! అంది. ఆ పిలుపు పరిచయం ఉండగా "దేవి వచ్చావా!"అన్నాడు. ఆమె రామవర్మ కన్నులు
తాకింది."ఈరోజు తొందరగానే నా మీద దయ కలిగిందే"అన్నాడు.
"రాజా నీ మేలు కోరి చెబుతున్నాను .ఇక కాసేపటిలో నీ మరణం ఉంది.మీ తమ్ముడు నీ కళ్ళకు ఆ పుష్పాన్ని
తాకించాలని చూస్తా డు.కాబట్టి ముందుగానే ఆ పుష్పాన్ని తీసుకు వచ్చి నాకు ఇవ్వు వెళ్ళు"అని అతని
చెక్కిలిపై ముద్దా డింది.అదంతా వింటున్నాడు రాఘవవర్మ. రాత్రి వేళలో చూపు రావడమేమిటి?ఎవరీ
మాయవి? అన్న మాయ మొహంలో ఉన్నాడు అనుకుని తన అన్న కంటే ముందుగా కొలనుచేరుకుని అక్కడ ఆ
పుష్పాన్ని తీసుకుని దాని స్థా నంలో మరో పుష్పాన్ని అక్కడ పెట్టి దాపుగా ఉండి చూస్తు న్నాడు.అనుకున్నట్లు గా
రామవర్మ వస్తు న్నాడు.అన్నను పరీక్ష గా చూస్తు న్నాడు రాఘవవర్మ. అతనికి ఆశ్చర్యం కలిగించిన విషయం
రాత్రి వేళలో చూపు రావడం, రామవర్మ మెల్ల గా కొలనులోకి దిగి ఆ పుష్పాన్ని తీసుకుని అటు ఇటు చూసి తన
ప్రా సాదం లోకి వెళ్ళాడు.వయ్యారంగా పానుపు పై పడుకుని అందాలు ఒలకపోస్తూ ఉంది."సుందరీ"అని
పిలిచాడు.
ఆ పిలుపుకు ' వచ్చావా రాజా!' అని పైకి లేచింది.
"ఇదిగో పుష్పం" అన్నాడు అందిస్తూ .
" నా మంచి రాజా!"అంటూ ముద్దు లతో ముంచింది. పుష్పం ఇస్తే వెళుతుందని కాసేపు పుష్పం ఇవ్వకుండా
ఆట పట్టిస్తు న్నాడు రామవర్మ.ఇద్ద రూ నవ్వుతూ ఆటపాటలతో ఉన్నారు.
******* ******** ******
"రాఘవవర్మ.. రాఘవవర్మ" తండ్రి పిలుస్తు న్నాడు.
"నాన్నగారు వస్తు న్నా".
"త్వరగా రా నాయనా పౌర్ణమి పోక ముందే ఆ పుష్పాన్ని తీసుకుని అన్నగారి కళ్ళకు తాకించాలి" అన్నాడు.
"రా నాయన " అంది తల్లి.
"సిద్ధ మహర్షి వారికి కూడా కబురు పంపాను "
అన్నాడు రాజు.అనుకున్న సమయానికి సిద్ధ మహర్షి వచ్చాడు.అందరూ కొలను దగ్గ రకు వెళ్ళి పుష్పానికి
నమస్కరించారు.రాఘవవర్మ పుష్పాన్ని అందుకుని వడి వడి గా రామవర్మ దగ్గ రకు వెళుతున్నాడు.అతన్ని
అనుసరించారు సిద్ధ మహర్షి, రాజు,రాణి.
రామవర్మ పానుపు పై సరస సల్లా పాలతో నవ్వుతూ ఆమెను కౌగిలిలో బంధించాడు. పుష్పం మంచం కింద
ఉంది. ఎవరో రావడం తో అటు చూసింది సుందరి.వెంటనే కళ్ళ పై చెయ్యి వేయగానే చీకటి అలుముకుంది.
రాఘవవర్మ ముందుకు అడుగు వేసి "మాయవి అగు"అనగానే ఆమె అదృశ్యమైంది. "దేవి..దేవి అంటున్నాడు
రామవర్మ కళ్ళు నలుపుకుంటూ.దేవి అనే పిలుపు ఆశ్చర్యం కు గురి చేసింది రాజు,రాణిలకు.
"అన్నయ్య పుషాన్ని తెచ్చాను నీ కళ్ళకు తాకించుకో" అన్నాడు.
"ఆపు ద్రో హి,అది పుష్పం కాదు .మరణ
పుష్పం"అన్నాడు.
"ఆ పుష్పం నీకు ఎలా వచ్చింది?" నేను ..... ఆగాడు. తమ్ముడి చేతికి మరో పుష్పం ఎక్కడ నుంచి వచ్చిందో
అర్థ ం కాలేదు రామవర్మకు.
రాజు,రాణి అర్థ ం కాక అయోమయంలో వున్నారు.
"అన్నయ్య ఇది మహిమ గల పుష్పం.నీ కళ్ళకు అద్దు కో" అన్నాడు రాఘవవర్మ ముందుకు వస్తూ .
"వద్దు ఆ పుష్పాన్ని నా కళ్ళకు తాకించకు అది నా కళ్ళకు తాకితే నేను మరణిస్తా ను"అన్నాడు. ఆ మాటకు
అదిరిపడ్డా రు రాజు,రాణి.
"అన్నయ్య " అంటూ ముందుకు వస్తు న్నాడు తమ్ముడు.
"ద్రో హి అగు అక్కడే అన్నను చంపి రాజ్యం దక్కించు కోవాలనుకుంటున్నవా!"అన్నాడు కోపంగా.
"కాదు అన్నయ్య నేను ద్రో హిని కాను .నువ్వు మాయవి మొహంలో ఉన్నావు"అన్నాడు.
రాజు,రాణి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మహర్షి వైపు చూశారు.మహర్షి తల ఆడిస్తూ ఇలా చెప్పాడు.
"రామవర్మా!గత కొన్ని రోజులుగా నీకు రాత్రి వేళల్లో మాత్రమే చూపును ఇచ్చి మొహావేశం లో నిన్ను పడవేసిన
ఆ సుందరి రాక్షసి.నీకు నీ తమ్ముడికి తగవు పెట్టి మిమ్మలను చంపి ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని
,విచిత్ర పుష్పాన్ని సైతం దాని అధీనం లో ఉంచుకోవాలని దాని పన్నాగం.ఇది ముందే నేను మీ తమ్ముడికి
చెప్పాను.నీ మంచం కింద ఉండేది నకిలీ పుష్పం. నీవు నమ్మకపోతే ఇప్పుడే ఆ రాక్షసిని నీ ముందర ప్రవేశ
పెడతాను.అయితే ముందు నీవు ఆ పుష్పాన్ని కళ్ళకు అద్దు కో" అన్నాడు.రాఘవవర్మ వెంటనె ఆ పుష్పాన్ని
అన్న కళ్ళకు తాకించాడు.
నెమ్మదిగా కళ్ళు తెరిచాడు రామవర్మ.ఎదురుగా తల్లిదండ్రు లు, సిద్ధ మహర్షి. "అమ్మ..నాన్న "అంటూ ముందుకు
వెళ్ళాడు.తల్లిదండ్రు ల పా దాలకు ,మహర్షి పాదాలకు నమస్కరించాడు.
"తమ్ముడూ 'అంటూ ఆలింగనం చేసుకున్నాడు.
"నిన్ను రాత్రిళ్ళు మొహంలో పడేసిన ఆ రాక్షసిని చూస్తా వా!"అన్నాడు సిద్ధ మహర్షి.
"నేనే కాదు.నా లాగా ఎవరూ దాని వలపు వలలో చిక్కుకోరాదు.ప్రవేశ పెట్ట ండి మహర్షి"
అన్నాడు.
మహర్షి రాఘవవర్మ వైపు చూసి "రాఘవవర్మ ఆ పుష్పం లోని మూడు రెక్కలను మృదువుగా తాకు"అన్నాడు.
రాఘవవర్మ మృదువుగా మూడు రెక్కలను చేతితో చిక్కు ఆ ప్రా ంతంలో ఓ దట్ట మైన పొగ కనిపించింది.
"మాయవి" బైటకు రా"అన్నాడు మహర్షి. భయంకర ఆకారంతో గజ..గజ వణుకుతూ కనపడింది రాక్షసి.
"రాజా!ఇన్నాళ్ళు నీవు దీని వలపు లో చిక్కుకున్నావు.పుష్పం చేజిక్కించు కోవాలని ఇది ఎన్నో ప్రయత్నాలు
చేసింది.మిమ్ములను వధించి రాక్షస రాజ్యాన్ని స్థా పించాలనుకుంది
అన్నదమ్ములకు తగవు పెట్టా లనుకుంది.చివరకు ఇలా పట్టు బడింది.
ఆ మాటలకు రామవర్మ తల దించుకున్నాడు.వెంటనే రాఘవవర్మ ఒర లో నుంచి ఖడ్గ ం తీసి రెప్పపాటులో ఆ
రాక్షసి తల ఎగురగొట్టా డు. అప్పుడే తెలవారింది.
రామవర్మ రాక్షసి బంధం నుండి విముక్తు డైనందుకు రాజు,రాణి ఆనందించారు.
సిద్ధ మహర్షి అన్న తమ్ములను పిలిచి "ఈ విచిత్ర పుష్పం ఈ రాజ్యంలో ఉన్నంత వరకు రాజ్యం సుభిక్షంగా
ఉంటుంది.ఏ దుష్ట శక్తి ఈ రాజ్యం వైపు కన్నెత్తి చూడ లేదు.మహిమాన్వితమైన ఈ పుష్పాన్ని కొలనులోనే
వదులు దాం రండి" అన్నాడు.
అందరూ కొలను దగ్గ రకు చేరుకున్నారు. సిద్ధ మహర్షి శివ సోత్రా లు చదువు చుండగా కొలను లోకి పుష్పాన్ని
వదిలారు రాజు,రాణి.
ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకున్నారు అన్నదమ్ములు.కొలను నీటిలో కదులుతూ ఉన్న ఆ పుష్పానికి
అందరూ నమస్క రించారు.

తోటకూర -
మల్లా ది ఉష
Object 14

తోటకూర మీద కథ ఏంటి అని ఆశ్చర్య


పోకండి.నిజమే మా తోట కూర .ఆ
రోజుల్లో ఊరంతా కథలు కథలు గా
చెపు కునే వారు.పెద్డ మేడ వాళ్ల కథ
విన్నారా? తోట కూర తిని
పిచ్చెక్కిందిట.పాపం పెద్ద ఆవిడతో
ఆడపిల్ల లు ఉన్నరుట. ఈ విథంగా
రకరకాల కథలు

2. అసలు జరిగిందేమిటంటే
,నేను ఇంటర్మీడియట్ చదువు
తున్నరోజులు.మాఅమ్మ ,మా
అన్నయ డిల్లి వెళారు.
మాఅమ్మమ్మ మాకు కాపలా.
మేము ఐదుగురు
అక్కచెళ్లెళ్ళం.ఇంట్లో కూరలు
లేవు ఎవరెయ్డి నా తెండిరా
అని అందరిని అడిగింది. అందరికి ఏదో కారణాలు,సాకులు.ఎవరికి వాళ్ల ం బిజీ పాపం.. ఆవిడ
మాటలు ఎవ్వరం పట్టించు కోలేదు. ఇంతలో మా తోటమాలి వచ్చాడు వయస్సు లో పెద్ద వాడు, వాడికి
ఎవరూ లేరు, మా అమ్మ వాడికి పని ఇచ్చి డబ్బులిచ్చేది. మా తోట పని చేసే వాడు వాడు అమ్మమ్మ
సమస్య తీర్చాడు .పెద్ద మ్మ గారూ తోటలో తోటకూర ఉంది తేనా అని అడిగాడుట ఆవిడ సమస్య
తీరింది.అమ్మమ్మ కూర చేసింది

మేమందరం బోజనానికి ఇంటికి వచ్చాము.వాళ్ళు గబగబా తిని వెళ్ళారు నాకు వెధవ అలవాటు నెమ్మదిగా
తినేదాన్ని,మా అమ్మమ్మ నా కు కబుర్లు చెప్పుతూ అన్నం నోటో్్ల కుక్కేది , ఆ రోజు కూడా అదే చేసింది.నేను ఆ
రోజు మినిస్ట రు గారు వసు్తన్నారు కాలేజిలో పాట పాడాలి హడావిడి మరి అమ్మమ్మ వినకుండా గిన్న కాళి చేసి
వదిలంది

4. ఇంకేముంది సోఫాలో కుార్చున్న దాన్ని అక్కడే తూలి పోయాను. మా అక్కలు విపరీతంగా నవ్వులట.
అమ్మమ్మ తల తిరుగుతోంది అని మంచం మీద వాలి పోయ్దిు ందిట చూసి మా అక్కలు పక్కింటికి వెళ్లి
డాక్టరు కి ఫోను చేస్తా మని వెాళ్ళారుట. పాపం ఆవిడికి వీళ్ల స్తితి చూసి నీళ్లిద్దా మని వెళ్లేటప్పటికి వీళ్లు
వాళ్ల ఇంట్లో పుస్త కా లు చింపి ఇంటికి వచ్చారుట.

5. ఇంతలో మా చెల్లెలు స్కూలు నించి వచ్చిఇంట్లో అందరిని చూసి కంగారు పడి ముందు అద్దె
కున్నవాళ్ల కి చెప్పి ఊళ్లో ఉన్న మా బాబా్య్ గారి అబ్బాయ్య కి చెప్పిందిట. మా కింద అద్దెకున్న వాళ్లు
వచ్చి వెండి సామాను బీరువాలో పెట్టి తాళం వేసి ఇంటికి తాళం వేసి కూర్చున్నారుట

6. మా కజ్జిన్ వచ్చి అమ్మమ్మని ఆసుపత్రి కి ఎడ్మిట్ చేసి అమ్మకి ఫోను చేసారుట. వాళ్లు రైలు లో
వచ్చేటప్పటికి రెండు రోజులు పట్టింది.నాకు మెలుకువ వచ్చింది కానీ చేతులూ కాళ్లు కదల్లేదు

7. అన్నయ్య మామయ్యకి ఫోను చేసాడు.మా మామయ్య లాయరు.సహజంగా వ్రుత్తి పరంగా లాయరు


అవ్వటంతో ఏం తింటే ఇలా అయ్యంది అని ఆరా తీసారు. ఇలా ఎందుకయ్యిందని రిసర్చ్ చేసారు

8. మా పక్క మేడలో ఫార్మా కంపెనీ ఉండేది వాళ్లు మందులు ఎండ పెట్టేవారు. వాళ్ళ మందులు
ఏమయ్యనా మా తోటలో పడ్డా యా? తోటకూర వేసిన చోట కలుపు మొక్కలు మొలిచాయా?అవి
చూడకుండా మాలి కోసాడా?

9. మా మామయ్య రిసర్చలో తేలిందేమిటంటే తోట కూరలో ఉమ్మెత్తా కు కలిసిందిట.ఉమ్మెత్త ఆకు మెదడు


మీద పని చేస్తు ందట. శారీరిక ఆరోగ్యంలో మెదడు కీలక పాత్ర వహిస్తు ంది. అందుకే అది మా అందర్నీ
రక రకాలుగా హింసించింది.

10.మా అమ్మమ్మ మైకం లోకి వెళ్లింది, నాకు రెండేళ్లు నరాల బలహీనతతో కాలి వేళ్లు మెలి తిరిగేవి
నడవలేక పోయే దాన్ని.భగవంతుడి దయ వలన మా అక్కలు కోరుకున్నారు.ఉమ్మెత్త చాలా
డేంజరండోయ్. మా మామయ్య చెప్పిన విషయం ఏమిటంటే కోర్టు కేసుల్లో తప్పుడు సాక్ష్యాలు
చెప్పడానికి ఉమ్మెత్త ఇస్తా రుట. ఇదండీ మా తోట కూరకధ

11.ఇదంతా చదివి తోటకూర తినటం మానలేదండోయ్ ఇవ్వాళ మా ఇంట్లో తోట కూర పులుసేనండోయ్.
టైలర్ మజాకా - రేణుక జలదంకి
Object 15

సాయంత్రం ఆఫీస్ వదిలే సమయానికి


ఓ అరగంట ముందుగా మెల్ల గా
మేనేజర్ రూమ్ లోకి
అడుగుపెట్టా డుసుబ్బారావు.

కాళ్ళు బార్లా చాపి సీలింగ్ వైపు


చూస్తూ కులాసాగా కాళ్లు ఊపుతున్న
రామారావు గుమ్మం దగ్గ ర అలికిడి
విని, చటుక్కునఫైళ్ల లో తల దూర్చాడు
ఎడతెరపి లేని పనులలో
సతమతమవుతున్న వాడు మల్లే.

"సార్..!" అంత భయం, భక్తితో


తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం
ముందు కూడా నిలబడడడేమో
అన్నట్లు మేనేజరుముందు నిలబడ్డా డు
సుబ్బారావు.

"ఏంటి?" సీరియస్ గా అడిగాడు


మేనేజర్.

‘వీడి ముఖంలో మన్ను పడా! వీడి ముఖం ఉండడమే అంతంత మాత్రం. కాస్త నవ్వుతూ అడిగితే వీడి
సొమ్మేంపోతుందో..? దానికి తోడు ఆ సీరియస్ నెస్ ఒకటి. అది అసలు వీడి ముఖానికి సరిపడదు. సీరియస్ గా
వున్నప్పుడు వీడిముఖం, తిరుణాళ్ల లో అన్నిటికీ అరటిపళ్లు దొరికి తనకు తొక్క కూడా దొరకని వానరం లాగా
ఉంటుంది.‘

" ఓ అరగంట పర్మిషన్ కావాలి సార్!" అనాలనుకున్నవి అన్నీ మనసులో అనుకుని, కాస్త ముందుకు ఒంగి
వినయంగాఅడిగాడు సుబ్బారావు.

"దబ్!" టేబుల్ మీద ఫ్ల వర్ వాజ్ క్రింద పడింది.

"ఏమైంది? ఫ్ల వర్ వాజ్ ఎందుకు కింద పడింది ?" మేనేజర్ సీరియస్ గా ముఖం పెట్టు కొని అడిగాడు.

"ఏమో సర్! గాలికి పడినట్లు ంది."

"నీ ముఖం! గాలి ఎక్కడ ఉంది ఇక్కడ? నువ్వు అంత వినయంగా వంగడంతో టేబుల్ మీద ఫ్ల వర్ వాజ్ నీ
తలకు తగిలికింద పడింది."

"అవునా...! వినయంతో మరీ అంత ముందుకు వంగానా?" ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టా డు సుబ్బారావు.

"నోటిలోకి ఈగలు పోగలవు. జాగ్రత్త! ఇక్కడ గాలి ఉండదన్నాను కానీ ఈగలు లేవనలేదు." అన్నాడు మేనేజర్
గాండ్రిస్తూ .
"మరీ..అదీ..మరే..." సుబ్బారావు నసుగుతూ అన్నాడు.

"ముందు విషయం చెప్పు!" గదిమాడు మేనేజరు.

"ఓ అరగంట పర్మిషన్ కావాలి సార్! ఇంటికి వెళ్ళాలి." గబగబా పాఠం అప్పగించినట్లు గా చెప్పాడు.

"ఇంటికా? ఏంటి సంగతి? మీ ఆవిడ పప్పు నానబోసిందా? ఇంట్లో గ్రైండర్ పనిచేయడం లేదా?" కిసుక్కున
నవ్వాడురామారావు.

‘నీ ఇంట్లో సంగతులన్నీ నన్ను అడుగుతావేంట్రా అడ్డ గాడిదా?‘ మనస్సులోనే కోపాన్ని అణచుకుంటూ, "అబ్బే!
అదేంలేదు సార్! చిన్న పని ఉంది."

"అదే..ఏంటా పని?" కులాసాగా కాళ్లు ఊపుతూ అన్నాడు రామారావు.

"శ్రా వణమాసం కదా సార్!"

"అయితే...? పేరంటాళ్ల ను నిన్నే బొట్టు పెట్టి పిలిచి రమ్మందా మీ ఆవిడ?" ఈసారి ఊగిఊగి నవ్వాడు
రామారావు.

‘నీ పిండాకూడు..! నీ ముఖం మీద కాకి రెట్ట వెయ్య! నీ పిండం కాకులకు గద్ద లకు పెట్ట !‘ మనసులోనే పళ్లు
నూరాడుసుబ్బారావు.

"లేదు సార్! మా ఆవిడ టైలర్ దగ్గ ర తన జాకెట్ తీసుకు రమ్మంది." సుబ్బారావు నోటిలో మాట నోటిలో
వుండగానే,

"టైలరా? ఏ టైలర్?" ఒక్క ఉదుటున లేచి అడిగాడు రామారావు.

ఆయన అలా లేవడంతో ఉదయం నుంచి కుర్చీలోనే కూర్చుని ఉన్నాడేమో, దానికి తోడు భారీకాయం
కావడంతో, అంటుకుపోయినట్టు ఉన్న కుర్చీ ఆయనతో పాటే అంటిపెట్టు కుని లేచింది.

సుబ్బారావు అద్భుతాన్ని చూస్తు న్నట్టు గా నోరెళ్ల బెట్టి చూస్తు ండిపోయాడు.

"ఏమైంది సుబ్బారావు?"

"సార్! ఇప్పుడు మీరు నాకు ఏమైనా బోధించబోతున్నారా?"

"నేను నీకు బోధించడమా? నీకేమైనా పిచ్చి పట్టిందా?"

"కురుక్షేత్రంలో శ్రీకృష్ణు డు భగవద్గీ త చెప్పేటప్పుడు ఆయన ఆకాశం లో పెద్ద రూపంలో కనిపిస్తా డు కదా సార్!
అలా మీరులేవగానే మీతో పాటు కుర్చీ కూడా లేచింది సార్!" ఇంకా ఆశ్చర్యంతో నోరు తెరిచే అన్నాడు
సుబ్బారావు.

రామారావు వెనక్కి చూసుకుని ప్యాంటుకు అతుక్కుని ఉన్న కుర్చీని విదిలించి, "నీ ముఖం! శ్రీకృష్ణు డు లేదు!
భగవద్గీ తలేదు! ఇంతకు నువ్వు వెళ్లేది ఏ టైలరు దగ్గ రికి చెప్పు?" టేబుల్ మీద కూర్చుంటూ అన్నాడు.

"పాషాణం అండ్ కఠినం టైలర్స్ సార్!" ఈసారి టేబుల్ పైకి లేస్తు ందేమోనని టేబుల్ వైపు భయంగా చూస్తూ
అన్నాడుసుబ్బారావు.

"హా..! పాషాణం టైలర్సా?" రామారావు ఒక్క ఉదుటున వచ్చి సుబ్బారావును కౌగిలించుకున్నాడు.


"ఏమైంది సార్? ఆ టైలర్ మీకు బంధువా? ఆప్త మిత్రు డా? బాల్య స్నేహితుడా? మీకు లైఫ్ ఇచ్చిన వాడా?"
గబగబాఅడిగాడు సుబ్బారావు రామారావు కౌగిలిలో నలిగిపోతూ.

"ఛ! వాడు నా బంధువేంటి?" గబుక్కున సుబ్బారావును వదిలేసి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు.

"మరి ఏమైంది సార్? అతని పేరు వినగానే మీరు ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారు?" సుబ్బారావు
కుతూహలంగాఅడిగాడు.

"మా ఆవిడ బట్ట లు కూడా అక్కడే ఇస్తు ందయ్యా!తన జాకెట్లు కూడా అక్కడే ఇచ్చింది. నెల రోజుల
నుంచీత్రిప్పుకుంటున్నాడు. నువ్వు ఎటూ వెళ్తు న్నావుగా! మా ఆవిడ జాకెట్లు కూడా అడిగి తీసుకురా!"

"అలాగే సార్!" మనసులో ‘ తప్పుతుందా!‘ అనుకున్నాడు.

"వెళ్ళనా సార్?" మరలా మర్యాదగా, వినయంగా వంగి అడగబోతూ ఫ్ల వర్ వాజ్ వైపు భయంగా చూశాడు.

"హహ్హ హ! భయపడకు. నేను పట్టు కున్నానులే!" ఫ్ల వర్ వాజ్ ను పట్టు కుంటూ పళ్ళికిలించాడు.

"ఉండు. స్లిప్ ఇస్తా ను." అంటూ జేబులో ఉన్న స్లిప్ తీసి ఇచ్చాడు.

"డబ్బులు" అడగబోయి నోరు నొక్కుకున్నాడు.

********. *******
సుబ్బారావు బైకును టైలరు షాపు వున్న రోడ్డు లోకి వెళ్లి పార్క్ చేస్తూ బెదిరిపోయాడు. షాపు ముందు ఎక్కడ
చూసినాజనం! ఏమైంది? ఏమైనా ప్రమాదం జరిగిందా? గబగబా జనాన్ని తోసుకుంటూ ముందుకు
వెళ్ల బోయాడు.

"అబ్బా..!" బాధతో కడుపు పట్టు కుని మెలికలు తిరిగిపోతూ, తనను మోచేత్తో పొట్ట లో పొడిచిన అతని వైపు
కోపంగాచూశాడు.

"మరి? ఇప్పుడు వచ్చి తోసుకుంటూ వెళ్తు న్నావు. మాకు లేదు నీ తెలివి పాపం!" వెకిలిగా నవ్వాడు మోచేత్తో
పొట్ట లోపొడిచిన అతను.

కళ్ళలో తిరుగుతున్న నీళ్ల ను అదుపు చేసుకుంటూ పైకి నవ్వేందుకు ప్రయత్నిస్తూ ,

"అక్కడ ఏంటి? బట్ట లు ఇస్తు న్నారా?" అని అడిగాడు షాపు ముందు కుర్చీ లో కూర్చుని ఉన్న అతని ముందు
జనంగుంపుగా గుమికూడి ఉండటం చూసి.

"కాదు. మన స్లిప్స్ అక్కడ ఇస్తే, అతను లోపల కనుక్కొని మన బట్ట లు పూర్తయ్యాయో లేదో చెప్తా డు.
అవునూ...మీముఖం ఏంటి అలా అష్ట వంకరలు తిరిగింది?" అడిగాడు మో.పొ.పొ.అతను.

"ఓ...అదా? ఇందాక మీరు నా పొట్ట లో పొడిచారు కదా? నాకు ఏడుపు రాబోతే ఆపుకుని నవ్వానన్నమాట.
అందుకే అలాముఖం అష్ట వంకరలు తిరిగింది. నయం ఇప్పుడు అష్ట వంకరలు తిరిగింది. మా ఆవిడ ముందైతే
అప్పుడప్పుడుపదహారు వంకర్లు కూడా తిరుగుతుంది. తెలుసా?" గొప్పగా చెప్పాడు సుబ్బారావు.

మో.పొ.పొ. అతను వింతగా చూసి నవ్వి, "అదుగో! మన ముందు ఆ నలుగురు అయిపోతే మన వంతే!"
చెప్పాడు.

ఈ లోపల కొందరు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ కనిపించారు.

"ఏమైంది? మీరెందుకు వెళ్ళిపోతున్నారు?" ఆదుర్దా గా వారికి ఎదురు వెళ్లి అడిగాడు.


"మా బట్ట లు కుట్ట డం పూర్తి కాలేదట. మరొక వారం పడుతుందంటున్నారు." ఇంటర్వ్యూలో ఉద్యోగం
జారిపోయినట్లు గాముఖం పెట్టి అన్నాడు.

"అయ్యో! ఎలా?" సుబ్బారావు బెంబేలు పడిపోయాడు.

"ఏమైంది?" అడిగాడు మో.పొ.పొ.అతను.

మోచేత్తో పొట్ట లో పొడిస్తే పొడిచాడు కానీ, అతను తనకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు.

"ఇవాళ బుధవారం, రేపు గురువారం, ఎల్లు ండి శుక్రవారం!" అన్నాడు సుబ్బారావు ఆందోళన పడిపోతూ.

"ఇవాళ బుధవారమా..?" గుండె పట్టు కుని కూలబడిపోయాడు మరోపక్క నిలుచుని వున్న యాభై ఏళ్ల
గోవర్ధ నం.

"అయ్యో భలేవాడివి! నువ్వేం మనిషి వయ్యా? అలా ఉన్న పళాన చెప్తే గుండె ఆగిపోదూ? నయం. గురువారం
అని ఉంటేఅసలు చచ్చి ఊరుకునేవాడు." అతని పక్కన ఉన్న అతను బాటిల్లో నీళ్లు అతని ముఖం మీద
చల్లు తూ అన్నాడు.

"అసలు ఏంటి ఈ వారాల గొడవ?" మరొక అమాయకుడు బిక్కమొహం వేసి అడిగాడు.

" ఎల్లు ండే శ్రా వణ శుక్రవారం. మా ఆవిడ ఇవాళ జాకెట్టు తీసుకు వెళ్ల కపోతే చంపేస్తు ంది. ఉతికి ఆరేస్తు ంది.
ఇవాళ స్లిప్ ఇస్తే జాకెట్ అయిందో లేదో చెప్తా రు. కుట్ట కపోతే మరల గుర్తు చేసి వెళ్తే రేపైనా ఇస్తా రు. మా ఆవిడ
జాకెట్టు తీసుకువెళ్ల కపోతే...!" సుబ్బారావు నుదుటిన చెమటలు అలుముకున్నాయి.

చెమట తుడుచుకుంటూ పక్కకు చూసి ఉలిక్కి పడ్డా డు. ఇంతకుముందు పడిపోయిన అతనిని నీళ్లు చల్లి
లేపిన అతను, బాటిల్ చేత్తో పట్టు కుని, నీళ్లు కుడి చేతిలోకి కొద్దిగా తీసుకుని ఆత్రంగా సుబ్బారావు వైపు
చూస్తు న్నాడు.

"ఏంటి?" అయోమయంగా చూస్తూ అన్నాడు సుబ్బారావు.

"పడిపోతే...నీళ్ళు చల్లు దామని." అన్నాడు నీళ్ల బాటిల్ అతను.

సుబ్బారావుకు చిర్రెత్తు కొచ్చింది.

"పదండి! పదండి! పదండి ముందుకు! పదండి తోసుకు! " అంటూ పాటపాడుతూ ముందుకు వెళ్లిన
మో.పొ.పొ.అతను స్లిప్పులు తీసుకుంటున్న అతని దగ్గ రకు వెళ్లి, తన స్లిప్పు అతని చేతిలో పెట్టా డు.

"రేయ్ మల్లీ! నెంబరు డి. టూ జీరో వన్ సంగతేంటి?" తన ముందున్న ఇంటర్ కమ్ లో అడిగాడు స్లిప్పులతను.

కాసేపటి తర్వాత అవతలినుంచి వచ్చిన సమాధానం విని, " అయిపోయింది." అన్నాడు సీరియస్ గా.

"హమ్మయ్య!" మో.పొ.పొ.అతను పెద్ద గా నిట్టూ ర్చాడు. సుబ్బారావు అదిరిపడి చుట్టూ చూశాడు.

"ఏంటి?" వింతగా చూశాడు మో.పొ.పొ.అతను. "ఇక్కడ పాము బుస పెట్టి న శబ్ద ం వినిపిస్తో ంది.
మీకువినిపించలేదూ..?" భయం భయంగా చూశాడు.

"ఓహ్! అదా! నేను మా ఆవిడ జాకెట్టు అయిపోయింది అనేసరికి పెద్ద గా నిట్టూ ర్చాను కదా! ఆ శబ్ద ం మీకు
అలావినిపించిందన్నమాట."వివరించాడు మో.పొ.పొ.అతను సుబ్బారావు స్లిప్ తీసుకుని.
"మల్లీ! ఎఫ్ ఫైవ్ టూ ఎయిట్ అయిందా?" సుబ్బారావు ఊపిరి బిగబట్టి చూస్తు న్నాడు. స్లిప్పులతను ఇంటర్
కంపట్టు కుని అవతలి వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూస్తు న్నాడు. అతని నోటివెంట ‘అయిపోయింది,
కాలేదు‘ ఈరెండు మాటలలో ఏ మాట వస్తు ందో ? అని సుబ్బారావు ఎదురు చూస్తు న్నాడు.

మో.పొ.పొ.అతను సుబ్బారావు కు వెళ్ళొస్తా నని చెబుదామని సుబ్బారావు వైపు చూసి బిత్త రపోయాడు.
అప్పటికేసుబ్బారావు కింద పడిపోయివున్నాడు.నీళ్ల బాటిల్ పట్టు కున్న అతను సుబ్బారావు ముఖం మీద నీళ్లు
చల్లా డు.

"నువ్వు అంత సేపు విషయం చెప్పకుండా వుంటే ఎలాగయ్యా బాబూ! అతను ఊపిరి బిగబట్టి నీ వైపు చూసి,
చూసిఊపిరి అందక క్రింద పడ్డా డు." స్లిప్పులతన్ని కోప్పడ్డా డు నీళ్ల బాటిల్ అతను.

సుబ్బారావు ముఖం మీద నీళ్లు పడగానే లేచి అయోమయంగా చూశాడు.

"జాకెట్టు రెడీ అయింది." స్లిప్పులతను సుబ్బారావు వైపు భయంగా చూస్తూ అన్నాడు.

బాటిల్ ని పట్టు కొని ఉన్న అతను చేతిలో నీళ్లు పోసుకుందామా? వద్దా ? అన్నట్లు చూస్తు న్నాడు.

సుబ్బారావుముఖం వైపు.

"హమ్మయ్య! హు..!" ఈసారి లేచి నిలుచున్న సుబ్బారావు గట్టిగా నిట్టూ ర్చాడు.

ప్రక్కనున్న అతని చేతిలోని నీళ్లు బాటిల్ దబ్బున కింద పడింది.

"ఈసారి ఏమైంది?" స్లిప్పులతను చిరాగ్గా చూశాడు.

సుబ్బారావు కూడా అర్థ ం కాక చూశాడు.

"ఏం మనిషి వయ్యా అంత గట్టిగా నిట్టూ రుస్తా రా ఎవరైనా? బాటిల్ క్రిందపడి నీళ్లన్నీ నేలపాలయ్యాయి కదా
నీనిట్టూ ర్పుకు."

సుబ్బారావు ముక్కుకు చేయి అడ్డ ం పెట్టు కుంటూ మేనేజర్ ఇచ్చిన స్లిప్పు ఇవ్వబోయాడు.

"ఇదేంటి?" పెన్ష న్ ఆఫీస్ లో గుమస్తా లా ముఖం చిట్లించాడు.

"మా మేనేజర్ భార్య జాకెట్ కూడా ఉందట. ఆ స్లిప్పు..!"

"అయితే ఆయన్నే రమ్మని చెప్పు పో!" ఆ మర్యాదకు బిత్త రపోతూ, ‘పర్లేదులే మరీ రేయ్ అనలేదు కదా!‘ అని
మనసులోసంబరపడిపోయాడు.

"ఆయన నన్ను తీసుకురమ్మని పంపించారు." వినయంగా అన్నాడు.

"ఒక మనిషికి ఒకే స్లిప్పు." సీరియస్ గా అన్నాడు వేరే వాళ్ల స్లిప్ తీసుకుని ఇంటర్ కమ్ తన చేతిలోకి
తీసుకుంటూ.

నీళ్ల బాటిల్ అతను "ఇలా ఇవ్వండి నేను ఇస్తా ను." అన్నాడు.

"సరే, అయినా ఇన్ని రూల్స్ ఏమిటి?" అన్నాడు.

"రేయ్ మల్లీ! జి 809 అయిందా?"

మేనేజర్ భార్య స్లిప్, బాటిల్ అతను ఇవ్వగానే తీసుకొని, ఇంటర్కమ్ లో అడిగాడు.


సుబ్బారావు మరల ఊపిరి బిగబట్ట బోతూ ఇంతకుముందు జరిగింది గుర్తు కు వచ్చి ఆగిపోయాడు. నీళ్ళ
బాటిల్ అతనుబాటిల్ లో అడుగున ఉన్న నీళ్ల ను చేతిలోకి తీసుకుని సుబ్బారావు ముఖం వైపు చూశాడు.

"నేను ఊపిరి బిగబట్ట నుగా?" కొంటెగా అన్నాడు సుబ్బారావు.

"కాలేదు." స్లిప్పులతను ఈ సారి పెద్ద గా అరిచాడు.

‘మరలా రేపు రావాలా....?" సుబ్బారావు వెనక్కి పడిపోతుంటే మో.పొ.పొ.అతను పట్టు కున్నాడు. నీళ్ల బాటిల్
అతనుమిగిలిన కొద్ది నీటిని తన చేతిలోకి తీసుకున్నాడు సుబ్బారావు ముఖం మీద చల్లేందుకు.

*శుభం*

అపోహ - పద్మావతి దివాకర్ల


Object 16

చాలారోజుల తర్వాత ఆ సాయంకాలం రాఘవరావుని వాళ్ళింటో కలిసాడు రంగారావు. ఇద్ద రూ


చిన్నప్పటినుండీ స్నేహితులు, అయితే ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రా ంతాల్లో ఉద్యోగం చేసి ఇటీవలే ఉద్యోగ
విరమణ చేసి స్వంత ఊరికి తిరిగివచ్చి స్థిరపడ్డా రు. చాలా రోజులనుండి రాఘవరావుని కలవాలని
అనుకున్నాడు కాని వీలుపడలేదు. ఈ మధ్యనే రాఘవరావు ఫోన్ నంబర్ సంపాదించి ముందుగా వస్తు న్నానని
కబురు చేసి బయలుదేరాడు రంగారావు.
రాఘవరావు తన ఇంటిగుర్తు లు సరిగ్గా చెప్పడంతో చాలా సులభంగానే ఇల్లు కనుక్కున్నాడు రంగారావు. చాలా
రోజుల తర్వాత స్నేహితుణ్ణి చూసిన రాఘవరావు చాలా ఆనందం చెందాడు. అలాగే రంగారావు కూడా!
రాఘవరావు భార్య సీతమ్మ వచ్చి రంగారావుని పలకరించి ఇద్ద రికీ కాఫీలు అందించింది. ఇద్ద రూ కాఫీ తాగి
పిచ్చాపాటి కబుర్లలో పడ్డా రు. ఆ కబుర్లలో చిన్నప్పటి విషయాలు చాలా దొర్లా యి. ఆ తర్వాత వాళ్ళ మాటలు
కుటుంబ విషయాలపైకి మళ్ళాయి.

"చాలా రోజులైందిరా నీ పిల్ల ల్ని చూసి. ఇంతకీ నీ పిల్ల లు ఏం చేస్తు న్నారు?" అని అడిగాడు రాఘవరావు.

"పెద్ద వాడు హైదరాబాద్‌లోను, రెండోవాడు బెంగుళూరులోనూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లగా ఉన్నారురా! మరి నీ


పిల్ల లేం చేస్తు న్నారు?" అడిగాడు రంగారావు.

"పెద్ద వాడు అటు అమెరికాలోనూ, రెండవవాడు ఇటు ఆస్ట్రేలియాలోనూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు గా ఉద్యోగం
చేస్తు న్నారు..."అని ఆగాడు రాఘవరావు.

"ఆహా, అలాగా! పెద్ద వాళ్ళిద్ద రూ బాగానే వృద్ధిలోకి వచ్చారన్నమాట, సంతోషం! మరి మూడో వాడో?"
అడిగాడు రంగారావు.

"మూడోవాడికి పెద్ద ఉద్యోగంలేదురా! ఈ ఊళ్ళోనే జైల్లో ఉన్నాడు." చెప్పాడు రాఘవరావు.

పెద్ద కొడుకిలిద్ద రూ మంచి ఉద్యోగం చేస్తూ ంటే రాఘవరావు చిన్నకొడుకు మాత్రం జైలుపాలవడం
బాధకలిగించింది రంగారావుకి. రాఘవరావు ఎంత ఉత్త ముడో తెలుసు రంగారావుకి. అతని తండ్రిగురించి,
మొత్త ం కుటుంబం గురించి పూర్తిగా తెలుసు. అలాంటి ఉన్నత కుటుంబంలో పెరిగి ఆ కుటుంబానికి మచ్చ
తెచ్చి, ఆ ఇంటి పరువుప్రతిష్ఠ మంటగలిపినందుకు రాఘవరావు చిన్నకొడుకు చంద్రంపై విపరీతమైన కోపం
వచ్చింది రంగారావు.

"అయ్యో పాపం! ఏం చేసాడేమిటి?" అన్నాడు రంగారావు రాఘవరావువైపు సానుభూతిగా చూస్తూ .

"వాడు డిగ్రీ పూర్తి చేసాడులే." చెప్పాడు రాఘవరావు.

"అయ్యో! అంత చదువు చదివి ఆఖరికి అలా అయ్యాడన్నమాట!" విచారం వెలిబుచ్చాడు రంగారావు మనసు
బాధతో నిండిపోగా.

సరిగ్గా అదే సమయంలో రాఘవరావు చిన్నకొడుకు చంద్రం ఇంట్లో కి వచ్చాడు. చంద్రంని రంగారావుకి
పరిచయం చేసాడు రాఘవరావు.

'అదేంటి! జైల్లో ఉన్నవాడు ఇంతలోనే ఇంటికి ఎలా వచ్చాడు.' అనుకొని విస్మయంగా చూసాడు రంగారావు
చంద్రం వైపు.

"ఇదిగో, వీడే మా మూడోవాడు చంద్రం. మమ్మల్ని ఈ వయసులో వదిలిపెట్టి బయటకి వెళ్ళడం ఇష్ట ంలేక బియే
చదివి మన ఉళ్ళోనే జైలర్‌గా ఉద్యోగం చేస్తు న్నాడు. ఒకవేళ బదిలీ అయితే ఉద్యోగం మానేసి వ్యవసాయం
చేసుకుంటానంటున్నాడు." చెప్పాడు రాఘవరావు.

అంతవరకూ రాఘవరావు చిన్నకొడుకు ఏదో నేరం చేసి జైలుకి వెళ్ళాడని ఏదేదో ఊహించి అపోహ పడ్డ
రంగారావు చంద్రం జైలర్‌గా పని చేస్తు న్నాడని తెలిసుకుని తన ఆలోచనకి సిగ్గు పడ్డా డు. తర్వాత
తల్లితండ్రు లను వృధ్యాప్యంలో వదిలి వెళ్ళకుండా స్వంత ఊళ్ళోనే ఉద్యోగంలో చేరిన చంద్రంని మనస్పూర్తిగా
అభినందించాడు రంగారావు.

-పద్మావతి దివాకర్ల
gorintaku - శింగరాజు శ్రీనివాసరావు
Object 17

రాజమ్మ మంచం మీద కూర్చుని మనవరాలి చేతికి కోడలు అపర్ణ గోరింటాకు పెడుతుంటే చూస్తు న్నది.
మనవరాలు రిషికను చూస్తు ంటే తన చిన్నతనం గుర్తొ చ్చింది రాజమ్మకు. తనకు గోరింటాకంటే మహాపిచ్చి, అదే
చాలు వచ్చింది రిషికకు. బహుశ తనే ఆ అలవాటు చేసిందేమో కూడ. భర్త బ్రతికి ఉన్నన్నాళ్ళు రెండు
చేతులకు, కాళ్ళకు ఠంచనుగా నెలకు ఒకసారైనా గోరింటాకు పెట్టు కునేది. ఆయన పోయిన తరువాత ఈ
నాలుగేళ్ళ నుంచి పెట్టు కోవాలని కోరిక వున్నా కోడలు ఏమనుకుంటుందోనని కోరికను చంపుకుంది. కానీ
ఈరోజు ఎందుకో పెట్టేటప్పుడే ఎర్రగా పండిన కోడలి చేతులు చూసి మనసు లాగుతున్నది. అందుకే
గుడ్ల ప్పగించి చూస్తు న్నది వాళ్ళను. " ఏంటి బామ్మా కొత్త గా చూసినట్లు అలా చూస్తు న్నావు. అమ్మ నీలాగ
పెట్ట డం లేదా" అడిగింది పదిహేనేళ్ళ రిషిక.

" బాగానే పెడుతుందిలేవే. అయినా ఎప్పుడూ పెట్టే డిజైనేగా, కొత్త వి రావు మీ అమ్మకి" తనను
పెట్ట మంటుందేమోననే ఆశతో, కనీసం ఆ సాకుతో నైనా చేతికి ఆ ఎర్రదనం అంటుకోవాలని చిరు కోరిక. " మీరు
చేసిన నిర్వాహకమే ఇది. మామయ్య గారు ఉన్నన్నాళ్ళు ఆయన ప్రా ణంతోడి ఊరి మీదకు పంపి గోరింటాకు
తెప్పించుకుని మీరు పెట్టు కోవడమే కాదు. దీనికి కూడ రకరకాల డిజైన్లు పులిమి పాడు అలవాటు చేసిపెట్టా రు.
ఇప్పుడిదేమో వాళ్ళ నాన్నను చంపుకుతింటున్నది" కస్సుమన్నది అపర్ణ. " ఎందుకమ్మ బామ్మను అరుస్తా వు.
మొన్నటిదాకా బామ్మే పెట్టేది కదా. నువ్వేకదా కొత్త రూలు పెట్టింది. తాతయ్య చనిపోయిన తరువాత మీరు
పెట్ట కూడదని చెప్పి, బామ్మను పెట్ట నీకుండా చేశావు. ఏం బామ్మ పెడితే ఏమవుతుంది. నువ్వు ఎప్పుడు
చూసినా అరచేతిలో చందమామ, దాని చుట్టూ చుక్కలు. అంతకంటే చాతకాదు నీకు" మూతి మూడు వంకలు
తిప్పింది రిషిక.

" నోరుమూసుకుని కదలకుండ కూర్చో. ఇది ఎప్పటినుంచో వచ్చిన ఆచారమట. భర్త పోయిన వాళ్ళు
గోరింటాకు లాంటి షోకులు చేసుకోకూడదట. అరిష్ట మన్నారు. మొన్న భక్తి ఛానల్ లో కూడ చెప్పారుకదా" "
గొడవపడకే రిషిక. వద్ద న్న పని ఎందుకు చేయడం" మనసు నొచ్చుకుని అన్నది రాజమ్మకు. " వితంతువులు
పెట్టు కోవడం బాగుండదన్నాడంతే కాని. పెట్టు కోకూడదు, పెట్ట కూడదు, అరిష్ట ం అనేమీ చెప్పలేదు. నేనూ
విన్నాను. సగం వాళ్ళు చెబితే సగం వీళ్ళ కల్పన. నాన్న చెబుతాడుగా బామ్మా. 'కవిగారి కవిత్వం కొంత, నా
పైత్యం కొంత అని' అలా అన్నమాట" " అఘోరించావులే గాని. కాళ్ళు పట్టు , పాదాలకు పెడతాను"

" ఇదిగో వేళ్ళకు పులమకుండా జాగ్రత్తగా పెట్టు . లేకుంటే బామ్మ చేత పెట్టించుకుంటా" " బెదిరింపులు ఆపి.
చాపు కాళ్ళు. నాలుగు పీకుతా అతి చేశావంటే" గుడ్లు రిమింది అపర్ణ. కాళ్ళు చాపి కూర్చుంది రిషిక మాటలు
లేక మౌనంగా చూస్తు న్నది రాజమ్మ. ఏం సంప్రదాయాలో ఏమిటో, తనకు ఊహ తెలిసినప్పటి నుంచి
పెట్టు కుంటున్నది గోరింటాకు. మరి భర్తకు, ఆ గోరింటాకుకు మధ్యగల సంబంధం ఏమిటో అర్థ ంకాలేదు.
అయినా గోరింటాకు పెట్టు కోగానే కోరికలు రేగి మనసు వశం తప్పుతుందా. భర్తతో పాటే అన్నీ పోతాయా. మరి
ప్రా ణం పోదేం. ఏమిటో ఈ ఆచారాలు మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టినట్లు . కాలాన్నిబట్టి మనం మారాలి.

అంతేగానీ మనకిష్ట మైనవైతే ఒకరకంగా, లేనివైతే మరోరకంగా మార్చకూడదు. అసలు సాంప్రదాయం ప్రకారం
గుండు కొట్టించుకుని, తెల్ల ధోవతి కట్టు కోవాలి. మరి అలా వద్ద న్నది ఇదే కోడలు ఆరోజు. అలా నన్ను ఆమె
చూడలేదట. ఏమిటో ఇదంతా.... " బామ్మా పెట్టేసుకున్నా చూడు" అంటూ కేక పెట్టింది అపర్ణా . " బాగుంది
తల్లీ . అప్పుడే తీయకు. కనీసం రెండు గంటలయినా ఉంచుకో బాగా పండుతుంది" " సరే బామ్మా" అని అటు
తిరిగి కూర్చుంది రిషిక. ****** " ఏమండీ కొంచెం బాల్ పెన్ను ఇచ్చి, అదే చేత్తో అగ్గిపుల్ల ఒకటివ్వరా" భర్త
ప్రసాదును అడిగింది రాజమ్మ " మొదలుపెట్టా వా పండగ. నెలలో ఒకరోజు ఈ గోల తప్పదటే నాకు. అయినా
ఈ గోరింటాకు పిచ్చేమిటే. ఏదో పెళ్ళయిన కొత్త ల్లో ముచ్చటేమో అనుకున్నాను. యాభైలో పడినా ఇంకా ఈ
యావేమిటే" అని శతమానం పెడుతూనే అడిగినవి తెచ్చి ఇచ్చాడు. " మీ సణుగుడు భరించలేకే నేను
గోరింటాకు పనివాళ్ళతో తెప్పించుకుంటున్నాను. అయినా నేను మిమ్మల్ని వంటచెయ్యమన్నానా, అగ్గిపుల్లేగా
ఇవ్వమన్నాను. దానికే అంత విసుగెందుకు నాయనా" " నా సగం జీవితం వీధుల వెంట గోరింటాకు కోసం
తిరగనే సరిపోయింది" " అంత అతొద్దు . ఎవరైనా వింటే ఏమి చోద్యం అనుకుంటారు. ఇదిగో కొంచెం లేచి
మగ్గు తో కాసిని నీళ్ళు తెచ్చిపెట్ట ండి" " నువ్వు గోరింటాకు పెట్టు కుని, అది పండేలోపు కనీసం వందసార్లయినా
లేపుతావు కదే నన్ను. నెలకు సరిపడా వ్యాయామం చేయిస్తా వు. ఏమన్నా అందామంటే నెత్తిన నీళ్ళకుండతో
సిద్ధ ంగా ఉంటావు" విసుక్కుంటూ లేచి వెళ్ళాడు ప్రసాదు. ఇది నెలకొకసారి తప్పని యుద్ధ ం వాళ్ళిద్ద రి మధ్య.
భర్త చిటపటలు చూచి నవ్వుకుంది రాజమ్మ ముసిముసిగా.

*****

ఆ రోజులు గుర్తు కు వచ్చి మనసంతా భారంగా మారిపోయింది రాజమ్మకు. ఆ హవా అంతా భర్తతోనే
పోయింది. ఇప్పుడు మిగిలింది ఒక యాంత్రిక శరీరం మాత్రమే. ఎందుకో వద్ద నుకున్నా మనసు స్పందించి,
కన్నీటిని సృష్టించాయి. " బామ్మా. నా చెయ్యి చూడు ఎలా పండిందో " అని పక్కన కూర్చుని చేతులు
చూపించింది రిషిక. కొంగుతో కళ్ళు తుడుచుకుని చూసింది. అసలే పచ్చని చేతులు రిషికవి తన చేతులలాగే.
గోరింటాకు బాగా పండే ఆకులాగుంది, చేయంతా సింధూర వర్ణంతో మెరిసిపోతున్నది. అప్రయత్నంగా
మనవరాలి చేతులను ముద్దు పెట్టు కుంది. " బుజ్జితల్లీ . ఎంత బాగా పండిందమ్మా గోరింటాకు. నీ చేతికి మరీ
అందాన్నిచ్చిందిరా. సింధూరంలా పండింది చేయి. నీకు చందమామే మొగుడుగా వస్తా డు బంగారం" అని
బుగ్గ ల మీద ప్రేమగా ముద్దు పెట్టు కుంది రాజమ్మ. " థాంక్యూ బామ్మా. ఏమయింది బామ్మా కళ్ళు తడిగా
ఉన్నాయి." అంది రిషిక రాజమ్మ కళ్ళు తుడుస్తూ . " అబ్బే ఏమీలేదమ్మా. కంట్లో నలకపడితే గట్టిగా రుద్దా ను
అంతే" మాట దాటేసింది. " నీకు కూడ గోరింటాకు పెట్టు కోవాలని వుంది కదూ" బామ్మ మెడచుట్టూ
చేతులువేసి అడిగింది రిషిక. " లేదమ్మా. తాతయ్య లేడుగా. అందుకని పెట్టు కోకూడదు. అవన్నీ ఆయనతోనే
పోయాయి. ఇప్పుడిది ఎండిన మోడు" గద్గ దమైంది రాజమ్మ కంఠస్వరం. " బాధపడకు బామ్మా. అవన్నీ
ఛాదస్తా లు. మా తెలుగు మాష్టా రు చెప్పారు. సంప్రదాయాలన్నీ మనం ఏర్పరచుకున్నవేనట. కాలాన్నిబట్టి అవి
మారుతుంటాయట. కాలాన్నిబట్టి మనిషి నడవాలి కాని, మూర్ఖంగా ప్రవర్తించకూడదట. నేనున్నాగా బామ్మా
నీకు. సంతోషంగా వుండు" బామ్మ బుగ్గ ను చుంబించి భరోసా ఇచ్చి వెళ్ళింది రిషిక. ****** అపర్ణ పేరంటం
నుంచి వచ్చి పంచలో దృశ్యాన్ని చూసి నిర్ఘా ంతపోయింది. తన భర్త కిరణ్ వాళ్ళ అమ్మ చేతులకు గోరింటాకు
పెడుతున్నాడు. పక్కనే బాల్ పెన్ చేతిలో పట్టు కుని తండ్రికి సూచనలిస్తు న్నది రిషిక. కొడుకును
తన్మయత్వంతో చూస్తు న్నది రాజమ్మ. ఆ దృశ్యం చూసి చిర్రెత్తు కొచ్చింది అపర్ణకు. ఒక్కసారి కోపం కట్ట లు
తెంచుకుని హూంకరించింది. " ఏంచేస్తు న్నారు మీరక్కడ " " వచ్చావా. నువ్వు వచ్చేలోపే అమ్మకు గోరింటాకు
పెట్టేసి నిన్ను సర్ ప్రైజ్ చేద్దా మనుకుంటే. అప్పుడే వచ్చేసి ఛాన్స్ మిస్ చేశావే అపర్ణా " తన శైలిలో చెప్పాడు
కిరణ్. " చేయకూడని పని చేస్తూ ఏం ఆనందపడిపోతున్నారండి మీరు" " హలో. ఇదేం చెయ్యకూడని పని
కాదు. ముత్తైదువలు మా అమ్మలాంటి వారికి గోరింటాకు పెడితే వారికేదో అయిపోతుందని కదా మీ ఆలోచన.
అందుకే మా అమ్మకు నేనే గోరింటాకు పెట్టా ను. తప్పేముంది" " తప్పా. తప్పున్నరా. అది అరిష్ట మండీ" " ఏ
సిద్ధా ంతి చెప్పాడు. ఒకవేళ చెప్పాడే అనుకుందాం. ఆయనకు ఏ దేవుడు ఫోనుచేసి చెప్పాడట. ఆయన పేరు
చెప్పమను. నేనూ ఫోను చేసి కనుక్కుంటా" " వెటకారాలొద్దు . సాంప్రదాయం సాంప్రదాయమే" " ఛ. నిజమా.
మరి భర్త పోయిన తరువాత జుట్టు ఉండకూడదు. రంగురంగుల చీరలు కట్ట కూడదు. తెల్ల ధోవతులు మాత్రమే
ధరించాలి. మరి దీన్నెవరూ పాటించరే. మీ అమ్మగారు డజను బంగారుగాజులు చేతులకు వేసుకుని, మెడలో
చాంతాడంత గొలుసు వేసుకుని, పాతికవేలు తక్కువ ధర చేయని పట్టు చీరకట్టి , ఫ్యాషన్ గా చుట్ట చుట్టి మరీ
వస్తు ందిగా. మరి ఆమెకు లేదా సాంప్రదాయం." " ఏమండీ. మీరు మరీ రెచ్చిపోయి మాట్లా డుతున్నారు. అది
ఆమె ఇష్ట ం. మీరేమీ పెట్టి పోషించడం లేదు" ఉక్రో షం తన్నుకు వచ్చింది అపర్ణకు. " అలాగే అమ్మ కూడ తనకు
ఎంతో ఇష్ట మైన గోరింటాకును పెట్టు కుంటుంది. దీనివలన ఎవరికి సమస్య. చెప్పు. ఎదుటివారికి ఇబ్బంది
కలిగించని ఏ పనైనా ఎవరి ఇష్ట ం కొద్ది వాళ్ళు చేసుకోవచ్చు. చూడు అపర్ణా ఎప్పుడో తాతల కాలం నాటి
ఆచారాలను, నేటి సమాజానికి అనువుగా, అనుకూలంగా మార్చుకోవాలి గాని, మూర్ఖంగా వాటినే పట్టు కుని
వేలాడకూడదు. మనిషి మనసులోని చిన్న చిన్న అభ్యంతరం లేని కోరికలను సంప్రదాయం పేరుతో
చంపకూడదు. అమ్మకు గోరింటాకు అంటే ప్రా ణం. నేను కూడ ఇన్నాళ్ళూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఈ
రోజు రిషిక నన్ను నిలదీసి అడిగింది." బామ్మ గోరింటాకు ఎందుకు పెట్టు కోకూడదు. దానివలన ఎవరికి నష్ట ం"
అని. నా దగ్గ ర సమాధానం లేదు. ఏదీ కావాలని నోరు తెరిచి అడగదు అపర్ణా అమ్మ. రిషిక మాటలలో అమ్మకు
మనసులో గోరింటాకు పెట్టు కోవాలని ఉన్నదని తెలిసింది. అందుకే నేను ఆమెకు గోరింటాకు పెట్టా ను.

ఆమెను సంతోషపెట్ట డం నా బాధ్యత. సారీ అపర్ణా మీ అమ్మ గురించి మాట్లా డి నిన్ను బాధపెట్టా ను. మనిషి
పోయాడని మనసును రాయి చేసుకుని గడపకూడదు. మనుషులు రావడం, పోవడం జీవితంలో ఒక భాగమే.
ఈ విషయాన్ని ఇలా వదిలేయ్. లైట్ తీసుకో లైఫ్ పార్ట్ నర్." అంటూ చిన్న సందేశాన్ని వదిలాడు కిరణ్. " మీ
అబ్బాకూతుర్లు ఒకటైతే ఇంకెవరి మాట వినరుగా. కానివ్వండి మీ ఇష్ట ం. ఏం అత్త య్యా సంతోషమేనా
ఇప్పుడు. అమ్మలక్కలడిగితే చెప్పండి. మా ఇంట్లో వాళ్ళు ఇష్ట ంగా పెట్టా రు. మీకేమిటి నష్ట మని. ఏ
మాటకామాటగాని అత్త య్యా మీ పచ్చటి చేతులకు గోరింటాకు అదుర్స్" అంటూ ఒక కాంప్లిమెంట్ పారేసి
లోపలికి వెళ్ళింది. " బామ్మా సంతోషమేనా." అడిగింది రిషిక ఇద్ద రినీ దగ్గ రకు పిలిచింది రాజమ్మ. చెరొక
భుజంపై తలలు వాల్చి రాజమ్మను ఆనందపరిచారు కిరణ్, రిషిక. తన మనసులోని కోరిక తీర్చిన కొడుకును,
మనవరాలిని చిరంజీవులుగా వర్ధిల్లా లని దీవిస్తూ తన చేతులను తృప్తిగా చూసుకున్నది రాజమ్మ.

****** అయిపోయింది*******

అరెరే గుండు - రవి మంత్రి


Object 18

ఎన్నాళ్ళనుంచో మా NRI ల
సాధకబాధకాలు చెప్తూ ఒక సిరీస్
స్టా ర్ట్ చేద్దా ం
అనుకుంటున్నా.కానీ,దానికి కొంత
సమయం,ఓపిక,అన్నిటినీ మించి
ఎక్కడ మొదలెట్టా లో అన్న ఆలోచన
రాక కొట్టు కుంటూ
ఉండగా...ఉండగా..ఉండగా,ఇంక
ఇంతకంటే ఎక్కువ ఉంటే
బాగోదని,ముందు ఇది చెప్పేద్దా ం
అని,చెప్పకపోతే ఎక్కడ
మర్చిపోతానో అని అర్జెంటుగా
వచ్చేసా..

టూకీగా చెప్పాలంటే ఇదో పిట్ట


కథ..నా జుట్టు కథ..

అతుకుల బొంతలా ఉండే నా


మొహానికి నా జుట్టే అందం అని
నాకు పెద్ద ఫీలింగు.పందెంకోడికి
బాదాంపప్పు,పిస్తా పప్పు పెట్టి
మేపినట్టు ..ఛీఛీ,ఇదేం పోలిక?
పొలానికి సేంద్రియ ఎరువులు వేసి
పెంచినట్టు ..వేపనూనె,కొబ్బరినూనె,
కుంకుడుకాయలు అవి దొరకవు కాబట్టి మంచి షాంపూ గట్రా పెట్టు కుని ఆ ఉన్న జుట్టు ఊడకుండా,
కాపాడుకుంటూ ఉంటా.నా సర్కిల్లో నన్నో ట్రైకాలాజిస్టు లా చూస్తా రు మాట.ఏ చిన్న జుట్టు సమస్య వచ్చిన నా
సలహా తీసుకుంటారు.
మా గతమెంతో ఘనం అనీ,ఇదంతా నేను ఇండియాలో ఉన్నప్పటి మాట.ఇక్కడికొచ్చిన వేళావిశేషం
ఏవిటోగానీ ముచ్చటగా అర సెంటీమీటరు జుట్టు చూసుకుని ఎన్ని యుగాలైందనీ?

ఇక్కడి తలతిక్క వాతావరణానికి అసలు జుట్టు పెరిగి చావనేచావదు.పొద్దు పొద్దు న్నే నా అంత మనిషిని కూడా
విసిరికొట్టేసే అంత గాలి,మధ్యాన్నం మాడ్చేసే ఎండా,సాయంత్రం సరదాగా వర్షం,రాత్రికి చంపేసే చలి.ఇన్ని
వేరియేషన్స్ ఒకేరోజు చూపించేస్తే తలతిక్క వాతావరణం అనే అంటారు మరి.పోనీ నానా కష్టా లూ పడి ఒపిగ్గా
ఒక ఆరు నెల్లు పెంచేసి(నేను చెప్పిన ఆ అర సెంటీ పెరగడానికి నాకు పట్టి న టైము),సరే ఓ మోస్త రు అందంగానే
ఉన్నాం అనుకుని...అనుకుని అక్కడ ఆగొచ్చుగా? ఆహా..ఆశ..సినిమాల్లో వాడిని చూసి,బైట ఇంకొకణ్ణి చూసి
కొద్దిగా,చాలా కొద్దిగా చివర్లు కట్ చేయించుకుంటే,షేప్ చేయిస్తే,మనం కూడా వాడిలా,ఆ మాటకొస్తే
వాడికన్నాఇంకా అందంగా కనిపించేస్తా ం ఏమో.నా పిచ్చి!!!అని అనుకుని,ఒక వెచ్చని శని/ఆదివారపు
మధ్యాన్నం బయల్దేరా.

బాగా లేకిగానూ,మహా రిచ్చుగాను కాకుండా ఒక మోస్త రుగా ఉన్న సెలూన్ చూసి,బియ్యం డ్రమ్ముపక్కన పెట్టి న
ఉల్లిపాయ కోసం కక్కుర్తిపడి ఏ అర్ధ రాత్రో అపరాత్రో జాగ్రత్తగా బోనులో పడ్డ పందికొక్కులా నేనుకూడా
తిన్నగావెళ్లి వాడి బుట్ట లో పడ్డా .
ఇహ అక్కడ మొదలైంది.

ఏ దేవలోకం నుండో ఇంతోసి నా జుట్టు కత్తిరించి నాకు మోక్షం ప్రసాదించడానికి కత్తెర,దువ్వెన పట్టు కుని
వచ్చిన దేవకన్యలా ఒక అందం వచ్చినుంచుంది.ఆ అందాన్ని చూసిన మత్తు కాసేపటికి వదిలాకా ఆవిడ
వచ్చిరాని ఇంగ్లీషులో ఏం ఇలా తగలడ్డా వ్? అంది.ఆవిడ భాషని బట్టి ఆవిడ ఏ రొమేనియా నుండో,బ్రెజిల్
నుండో,చైనా నుండో లేక మరేదో దేశం నుండో వచ్చిందని అర్ధ ం అయింది.ఇక్కడ సాధారణంగా అక్కడ నుండి
వచ్చిన వాళ్ళు ఎక్కువ.సరేలే అని,అసలు నాకు ఏ హెయిర్ స్టైల్ చెయ్యాలో,ఎలా చెయ్యాలో ఒక అరగంట
ఆవిడకి వివరించి,అప్పటికే డౌన్లో డ్ చేసిపెట్టు కున్న దిక్కుమాలిన నలుగురైదుగురు హీరోలు,మోడల్స్ ఫోటోలు
రిఫరెన్స్ చూపించి ఇలా కావాలి అని చెప్పా.

ఆవిడ భోజపురి సినిమాని మళయాళం ఉపశీర్షికలతో చూసినట్టు ,అదో రకంగా నా వంకచూసి,అంతా


విని/విన్నట్టు నటించి దీర్ఘంగా నిట్టూ ర్చి,కత్తెర,దువ్వెన పక్కన పడేసింది.ఇదేంటా అనుకునేలోపే ఒక ట్రిమ్మర్
తీసుకొచ్చి చిన్న వెకిలి నవ్వునవ్వి(నీ తిక్క తీరుస్తా అని అర్ధ ం ఏమో ఆ నవ్వుకి)దానితో నా నెత్తిమీద
మెరుపుదాడి చేసింది.ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పచ్చగా పెరిగిన
మొక్కల్ని పిచ్చి మొక్కలతో పాటు చెక్కేసినట్టు ఒక పక్క అంతా ఒకే దెబ్బలో,సెకనులో అరవై ఆరో వంతు
వేగంతో గొరిగేసింది.ఇంకేంఉంది?

నా ఆరునెల్ల కష్ట ం,నా హీరో కలలు,ఆ అప్సరస కాళ్ళదగ్గ ర శాశ్వతంగా నిద్రపోయాయి.ఇహ అప్పుడు అడిగింది
ఇదేనా నువ్వు అడిగింది అని.నీ మొహంమండా!!!ఒక నిమిషం ముందు అడిగి చావొచ్చు కదా??అన్యాయంగా
గొరిగేశావ్ అని ఏడవలేక,నవ్వలేక హిహిహి... ఇదే అన్నా.ఒహవేళ కాస్త ధైర్యంచేసి ఇదికాదు అన్నా మళ్ళీ
ఈసారి ఏ ఒరియా సినిమానో చూపిస్తు ంది అని భయం.తదనంతరం ఆవిడ విజయగర్వంతో ఇంకో పక్క
చెక్కడం మొదలెట్టింది.ఆలా కుడిపక్కన ఎక్కువైంది అని ఎడమపక్క,పైన తక్కువైంది అని వెనకపక్క,మొత్త ం
అయిదు నిముషాల్లో క్షవరం చేసేసి,అద్ద ంలో నా మొహాన్ని నాకే చూపించింది.
అదెలా ఉందంటే వెనకటికి మా చిన్నపుడు ప్రతీ ఆదివారం ఒక చిన్న పాత సంచి,ఒక నిక్కరు వేసుకుని
కొండయ్యతాత అని వచ్చేవాడు.ప్రతీ ఆరునెల్ల కి ఓసారి పిల్ల మూకని ఆ తాత దగ్గ ర వరసగా కూచోపెట్టేవారు
పెద్దా ళ్ళు.ఆ తాత మా నెత్తిచుట్టూ ఒక పురికొస కట్టి,దాని చుట్టూ ఉన్న జుట్టు గొరిగేసి,ఆ లోపల మిగిలిన
జుట్టు ని అంట కత్తెరేసేసేవాడు. మేము ఎంత ఏడ్చి మొత్తు కున్నా వినేవాడు కాదు మా కొండయ్యతాత.
పెద్ద వాళ్ళకి 5 రూపాయిలు,నాలాంటి పిల్ల కాయలకి 2 రూపాయలు.తాత ఒకసారి క్షవరం చేస్తే ఆరునెల్ల వరకు
మళ్ళీ దువ్వెన్న అక్కర్లేదు.

అలా మా కొండయ్యతాతకి ఏకలవ్య శిష్యురాలు అప్పుడే చెక్కిన నా నెత్తి కళాఖండానికి తుదిమెరుగులు


దిద్దు తుండగా..ఒక అరవై డెబ్భయి మధ్య వయసు ఉన్న మామ్మగారు వచ్చింది.ఆవిడని ఇంకో దేవకన్య
దీవించింది.ఆ వృద్ధ నారికి నెత్తిమీద ఒక 40 వెంట్రు కలకి మించి ఉండవ్.నమ్మనివాళ్ళు వచ్చి
లెక్కెట్టు కోవచ్చు.ఆవిడ ఎలా కావాలో చెప్పింది.యధాప్రకారం లేత పనసకాయని చెక్కినట్టు ఆ గుండుని
అరగంటసేపు చెక్కి,ఎలా ఉంది అన్నట్టు బామ్మ వంక చూసి కళ్లెగరేసింది చైనా దేవకన్య. నేనేమో,ఏవండీ
బామ్మగారూ...ఆ గుండు మీద ఏం ఉందండీ?నా శ్రా ర్థ ం,అదేదో నన్నే అడిగితే ఫ్రీగా చేసిపెట్టేవాడిని కదా అని
అడిగేద్దా ం అనుకునేలోగా...ఆ గుండుని,దానిమీద మెరుపుని చూసుకుని ఆ బామ్మ కళ్ళలో ఆనందభాష్పాలతో
ఆ దేవకన్యకి బిల్లు ,దాంతోపాటు టిప్పుకూడా ఇచ్చి డైరెక్ట్ గా ఏ హాలీవుడ్ సినిమా ఆడిషన్ కో వెళ్లినంత
గర్వంగా,తల,అదే అదే..గుండు ఎగరేసుకుంటూ వెళ్లిపోయింది.

ఈలోగా నా సినిమాకి కూడా శుభంకార్డు వేసేసింది మా రోమేనియన్ అప్సరస.నా అవతారం అచ్చం


అహనాపెళ్ళంట సినిమాలో బ్రహ్మానందంలా అరగుండుతో అదో రకంగా తయారైంది.నెత్తి మీద చెయ్యి పెడితే
చల్ల గా తగుల్తో ంది.ఇంటికొచ్చి ఆ అరగుండుని చూస్కుని దిక్కులు పిక్కటిల్లేలా,లోపల్లో పలే అనుకో నేను
ఏడ్చిన ఏడుపు కి బాత్రూ మ్ అద్ద మే సాక్షి.

అయినా మీ కన్నా మా కొండయ్యతాతే నయ్యం.ఆయనే ఉంటే ఈ హెయిర్ స్టైయిల్ కి పేటెంట్ తీసుకునే వాడు.
బైటికొస్తే నాలాంటి ఎన్నో అరగుళ్ళు.ఇప్పుడు ఇదే ఫాషన్ గా మోసు.

నాకు అర్ధ మైందేంటంటే మనం ఎలా చెప్పినా వాళ్ళు వాళ్ళకి వచ్చిందే చేస్తా రు,నచ్చినట్టే చేస్తా రు.

అల్పమైన జుట్టు గురించి కలలు కనడం కలే!!!!


కృషితో నాస్తి దుర్భిక్షం - శ్రీమతి దినవహి సత్యవతి
Object 19

డిగ్రీలో పట్ట భద్రు రాలినయ్యాక పై


చదువులు చదవాలని ఆశపడినా
కుటుంబ పరిస్థితులవల్ల వెంటనే
ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. రాష్ట ్ర
రాజధానిలో ఒక ప్రైవేటు కంపెనీలో
ఉద్యోగం దొరికింది. సాయంత్రం
ఆఫీసయ్యాక దొరికిన తీరుబాటు
సమయాన్ని సద్వినియోగం
చేసుకుందామని దగ్గ రలోనే ఉన్న
కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో చేరాను.
సాయంత్రం 6 నుంచీ 8 గంటల వరకూ
తరగతులు జరిగేవి. అలా 2 కంప్యూటర్
కోర్సులు చేసాను.

ఆ తరువాత కొంతకాలానికి వివాహం


జరగడం, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి
శ్రీవారితో వెళ్ళిపోవడం జరిగింది.
మరుసటి ఏడాది బాబు పుట్టా డు. వాడి
ఆలనా పాలనలో రోజులు ఆనందంగానే
గడుస్తు న్నప్పటికీ పోస్ట్ గ్రా డ్యుయేషన్
చేయాలి అనే కోరిక రోజు రోజుకీ నాలో
బలపడసాగింది.

అయితే ఆ ప్రయత్నం
మొదలుపెట్టినప్పటికీ బాబు బాగా చిన్న పిల్ల వాడవటాన చదువు సాఫీగా సాగక మధ్యలోనే విరమించుకోవాల్సి
వచ్చింది. అయినా నిరుత్సాహ పడలేదు. పోనీ కొన్నాళ్ళు ఉద్యోగం చేద్దా మా అనుకున్నా మరీ పసివాడైన
బాబుని క్రెష్ లో పెట్ట డానికి నా తల్లి మనసు ఒప్పలేదు. అందుకని బాబు స్కూల్లో చేరేదాకా వేచి ఉండి, ఆ
తరువాత దగ్గ రలోనే ఉన్న ఎన్.ఐ.ఐ.టి. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టా ను. నేను
ముందు చేసిన కంప్యూటర్ కోర్సుల ఆధారంగానూ, నా చదువు, ఆంగ్ల, హిందీ భాషలలో నాకున్న పరిజ్ఞా నాన్నీ
పరిగణనలోకి తీసుకుని ఇన్స్టిట్యూట్ డైరక్టర్ గారు, కాప్ట న్ సింగ్, నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది.

ఉదయాన బాబుని స్కూల్లో దింపడం, సాయంత్రం వాడిని స్కూలునించి తీసుకుని మళ్ళీ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి
సాయంత్రం ఆరు గంటలదాక పని చేసి ఇంటికి రావడం, ఇంట్లో వంటా వార్పూ, రాత్రి భోజనాలూ ..ఇదీ నా
దినచర్య !!!!

కొన్ని నెలలు గడిచాక ఇన్స్టిట్యూట్ డైరక్టర్ నన్ను పిలిచి “కంప్యూటర్ అప్లికేషన్స్ లో పోస్ట్ గ్రా డ్యుయేట్
డిప్లొ మా చేయండి మీరు, అది మీ పదోన్నతికి సహాయపడగలదు” అని సలహా ఇచ్చారు.
సాయంత్రం పూట ఆఫీసు టైం అయ్యాక క్లా సులకి హాజరవ్వాలి, అయితే బాబుని ఎక్కడుంచాలి అన్న
మీమాంశ వచ్చింది. నేనూ శ్రీవారూ... ఇద్ద రం సంపాదిస్తు న్నప్పటికీ, అప్పటి మా ఆర్థిక పరిస్థితి బాబుని క్రెచ్ లో
ఉంచేలా లేదు..

‘ఏం చెప్పాలా?’ అని ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయిన నన్ను చూసి “మీకెమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి”
అన్నారు డైరెక్టర్. బాబు గురించి, మా పరిస్థితి గురించి చెప్పాను.

అందుకు కాప్ట న్ సింగ్ కొంచం ఆలోచించి “అయితే ఒక పని చెయ్యండి, బాబుని స్కూలునించి తీసుకొచ్చి మీతో
పాటే క్లా సులో కూర్చోపెట్టు కోండి. అందుకు మీకు వెసులుబాటు కలుగజేస్తా ను” అన్నారు.

నా ఆనందానికి అవధులు లేవు. బాబు అప్పుడు ఎల్. కె.జి. లో ఉన్నాడు. ఆయనకు ధన్యవాదాలు తెలిపి
మర్నాడే కోర్సుకి రిజిస్ట ర్ చేసుకున్నాను. ఫీజు నెల జీతంలో మినహాయించేలా ఒప్పందం చేసుకున్నాను. రోజూ
సాయంత్రం బాబుని స్కూలునుంచి తీసుకొచ్చి, ఇన్స్టిట్యూట్ లోనే ప్రెష్ చేసి, యూనిఫాం మార్చి (ఒక జత
బట్ట లు నా బ్యాగులో పెట్టు కునే దాన్ని), క్యాంటీన్ లో పాలు త్రా గించి...క్లా సులో ఆఖరి వరుసలో నేను కూర్చుని,
ప్రక్కన బాబుని కూర్చో పెట్టు కునేదాన్ని. క్లా సులో లెక్చర్ జరుగుతున్నంతసేపూ బుధ్ధిగా కూర్చునే వాడు లేదా
బాగా అలిసి పోయినప్పుడు నిద్ర వస్తే అలానే తల కుర్చీలో వాల్చుకుని పడుకుండిపోయేవాడు.

ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి ఏడున్నర ఒక్కొక్కసారి ఎనిమిదయ్యేది. గబ గబా రాత్రి భోజనం ఏర్పాట్లు
చూసేదాన్ని. ఈ ప్రక్రియలో శ్రీవారు కూడా చేతనైనంత సహకారం అందించేవారు. అలా ఒక ప్రక్క బాబుని
చూసుకుంటూ, ఇల్లు నడుపుకుంటూ, ఉద్యోగం చేస్తూ ....మొత్తా నికి కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు లో ఒక
ఏడాది పి.జి. డిప్ల మా పూర్తి చేసాను. ఆ కోర్సులో అత్యధ్భుతమైన ప్రతిభ కనపరచినందుకుగాను ‘అవుట్
స్టా ండింగ్ పర్ఫార్మెంస్’ అవార్డు కూడా పొందాను .

ఆ తరువాత కొద్ది రోజులకి శ్రీవారి ఉద్యోగ రీత్యా మా మకాము బెంగళూరు మారింది. బాబు తరువాత మాకు
ఒక పాప. నా ఉద్యోగ పర్వానికి మళ్ళీ రెండు సంవత్సరాలు విరామం. పిల్ల ల చదువులూ మధ్య మధ్యలో
అనారోగ్యాలూ, సంసారపరమైన చిక్కులూ, ఆందోళనలూ...వీటన్నిటినీ దాటుకుంటూ కాలగమనంలో మరో
కొన్ని సంవత్సరాలు గడిచాయి. కాలంతో పాటుగా, ఉపాధ్యాయ వృత్తిలో నాది, చదువులలో పిల్ల లదీ,
ఉద్యోగంలో శ్రీవారిదీ పయనం ముందుకు సాగింది.

సరిగ్గా ఆ సమయంలోనే, సంసార బాధ్యతల మాటున మనసు పొరలలో నిక్షిప్త మైపోయిన అలనాటి నా కోరిక
....పోస్ట్ గ్రా డ్యుయేషన్ చెయ్యాలని ...మళ్ళీ వెలుగుచూడాలని తాపత్రయపడసాగింది. పిల్ల లతో, శ్రీవారితో
సంప్రదించాను. ఇరువురూ కూడా నాకెంతో ప్రో త్సాహాన్నిచ్చారు. దాంతో వెంటనే కార్యాచరణ ప్రా రంభించి,
ఎం.సి.ఎ. చేయడానికని ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) కి దరఖాస్తు చేసాను.

ఉద్యోగాన్ని కొనసాగిస్తూ , పిల్ల లని చదివించుకుంటూ, ఇంటిని నిర్వహించుకుంటూ ....బాబు 10 వతరగతి లోకి,
పాప ఎనిమిదవ తరగతిలోకి వచ్చేటప్పటికి ఎమ్..సి.ఎ. పూర్తి చేయడమే కాదు ప్రథమ శ్రేణిలో
ఉత్తీర్ణు రాలినయ్యాను. ఉపాధ్యాయ వృత్తిలో పదోన్నతి పొంది సీనియర్ లెక్చరర్ అయ్యాను.

‘ఉత్త మ ఉపాధ్యాయిని’ అని విద్యార్థు లనుంచి, యాజమాన్యంనుంచి ప్రశంసలు అందుకుంటూ దాదాపు


పండ్రెండు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన తదుపరి అనివార్య కారణాలవలన ఉద్యోగ
విరమణ చేయాల్సి వచ్చింది.

వృత్తినుంచి విరమణ పొందిన తదుపరి రచనా వ్యాసంగమే ప్రవృత్తిగా చేసుకుని, నేర్చిన ఉన్నత విద్య ఇచ్చిన
పరిజ్ఞా నాన్ని జోడించి సామాజిక విషయాలపై, తెలుగులో, రచనలు చేస్తూ సమాజాన్ని చైతన్యపరచే దిశగా
నావంతు కృషి చేస్తు న్నాను.
*****శుభం*****

రాజుకు అర్హత (బాలల కథ) - సరికొండ


శ్రీనివాసరాజు‌
Object 20

మగధ సామ్రా జ్యాన్ని విక్రముడు అనే రాజు పరిపాలించాడు. అతడు పేరుకు తగ్గ ట్లు పరాక్రమవంతుడే కాదు.
ఆదర్శ రాజు. ప్రజలను కన్న బిడ్డ లుగా చూసుకుంటూ వారికి ఏ సమస్యలూ లేకుండా చూసుకునేవాడు.
రామరాజ్యాన్ని తలపింపజేసేవాడు. శత్రు వులు విక్రముని పరాక్రమానికి భయపడి ఆ రాజ్యంపై కన్నెత్తి కూడా
చూడటానికి సాహసించలేదు.

ఆ విక్రమునికి విజయుడు అనే కుమారుడు ఉండేవాడు. విక్రముడు తన కుమారునికి యుద్ధ విద్యలు,


రాజనీతినీ నేర్పడమే కాదు, ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరగనిచ్చాడు. ప్రజల మంచీ చెడులను స్వయంగా
తెలుసుకొనేలా చేశాడు. వారి మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేలే చేశాడు. విజయునికి ప్రజలలో
వస్తు న్న మంచి పేరును చూసి, సంతోషించాడు. తన తదనంతరం తన కుమారుడు పాలనలో తన
వారసత్వాన్ని నిలబెడతాడని పొంగి పోయాడు.

కాలం గడుస్తు న్నది. విక్రమునికి వృద్ధా ప్యం వచ్చింది. విజయుని తక్షణమే రాజును చేసి, తాను విశ్రా ంతి
తీసుకోవాలనుకున్నాడు. ఆ విషయం కుమారునికి చెబుతాడు. "క్షమించండి మహారాజా! నాకు రాజుగా
అయ్యే అర్హత లేదు." అన్నాడు. ఖంగుతిన్న మహారాజా "ఎందుకు?" అన్నాడు. "నేను అనేక ప్రా ంతాలు
తిరిగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొనే క్రమంలో రామాపురం అనే గ్రా మంలో విశ్వనాథుడు అనే వ్యక్తి
గురించి విన్నా! అతడు ఎంతో పరాక్రమం కలవాడు. ధర్మాత్ముడు. కష్ట పడి సంపాదించిన డబ్బును
దానధర్మాలకే వినియోగించేవాడం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా విశ్వనాథుని దగ్గ రికే వెళతారు. అతడు
పారదర్శకంగా ఆ సమస్యలను పరిష్కరించేవాడు. ఆ చుట్టు పక్కల ప్రా ంతాల వారు మిమ్మల్నే మరచి, అతని
వద్ద కు వెళుతున్నారంటే అతనిలో నాయకత్వ లక్షణాలు ఏ స్థా యిలో ఉన్నాయో చెప్పవచ్చు. పరిపాలనలో మీ
వారసత్వాన్ని నిలబెట్టేది విశ్వనాథుడే. ప్రజా క్షేమం కోరే మీకు మీకు నా ఆలోచన నచ్చుతుందని
భావిస్తు న్నాను. పరిపాలనలో అతనికి నేను చేదోడు వాదోడుగా ఉంటాను." అన్నాడు.

అవును. తన కుమారుని ఆలోచన సరియైనదే. రాజు పదవి వారసత్వంగా రాకూడదు. సుపరిపాలన అనేది
వారసత్వంగా రావాలి. కుమారునిలో రాజ్యకాంక్ష లేకపోవడం అనే లక్షణానికి ఆశ్చర్యానందానికి లోనైన
విక్రముడు విశ్వనాథుని పిలిపించి, అతనిని మగధ సామ్రా జ్యానికి రాజుని చేశాడు. ప్రజలు మరికొన్ని దశాబ్దా ల
పాటు రామరాజ్యాన్ని చవి చూశారు.

ప్రమాణం - చెన్నూరి సుదర్షన్


Object 21

తాళి కట్టేటప్పుడు మొదటి


రెండుముళ్ళు గట్టి గాను, మూడవముడి
కాస్తా వదులుగానూ పంతులు గారు
వేయిస్తా రు. మొదటిది భార్యాభర్తల
బంధాన్ని, రెండవది కన్న బిడ్డ ల
అనుబంధాన్ని సూచిస్తా యి. ఇక
మూడవ ముడి వృద్ధా ప్యంలో..
భార్యాభర్తల మధ్య కాస్తా ఎడం
పాటించాలనే హెచ్చరిక.

ప్రస్తు తం మురళి మూడవ ముడి


ముంగిట కొట్టు మిట్టా డుతున్నాడు.

దానికి తోడు అతని శ్రీమతి


అమెరికాయానం అతణ్ణి మరింత
పిచ్చివాణ్ణి చేస్తో ంది. అలుక అయినా..
కలహమైనా, భార్యామణి కళ్ళ
ముందుంటే.. ఆ కళ్ళ చలువే వేరు.

’ఆపదలలో, ఆవేదనలలో గుర్తు కొస్తా రు ఆపద్భాంధవులు’ అన్నట్లు మురళి యుక్తవయసులో ఉండగా


పరిచయమైన లలిత గుర్తు కొచ్చింది. ‘రుచి ఎరిగిన ఎద ఏబది ఏడాదులైనా ఎదురి చూస్తు ందట’ అనే నానుడి
పుట్టించిన మహాను భావునికి మదిలో శతకోటి వందనాలు సమర్పించుకున్నాడు. ‘ఆమె దగ్గ ర నాపద్దు రద్దు
చేసుకుంటుందని నేననుకోను. దానికి తార్కాణం.. హద్దు లేకుండా నాకానాడిచ్చిన వీడ్కోలు ముద్దు ’ అని
మనసులో ముద్రించుకో సాగాడు.
అలా అతని మనసులో లలితను చూడాలనే ఆరాటం ఆరంభమయ్యింది. ‘మనసుంటే మార్గ
ముంటుంద’న్నట్టు ఆరాతీశాడు.. ‘వాట్సాప్’ పుణ్యమా అని, అతని పని చాలా సులభమయ్యింది. లలిత
సంగారెడ్డిలో ఉంటున్నట్లు , ఆమె ఫోన్ నంబరుతో సహ తెలిసింది.

వెంటనే ఫోన్ చేశాడు. అతని లాలాజలామృతం లలిత అధరాలకు అంటినట్లు న్నది. మురళిని చాలా తేలికగా
గుర్తు బట్టింది. ఆనాడు మురళి ప్రదర్శించిన నైపుణ్య మటువంటిది.

ఇంటి చిరునామా.. మురళి రావాల్సిన రోజును కరారు జేసింది. లైన్ క్లియర్ అని ఎగిరి గంతేశాడు.. ఆ
వయసులో అలా ఎగరడం ప్రమాదకరమని అతనికి గుర్తు కే రాలేదు.

ఆరోజు లలిత యింటికి కార్లో బయలు దేరాడు. ఆమెతో గడిపిన ప్రతీక్షణం మురళికింకా కళ్ళకు కట్టి నట్లు గా
ఉంది. ఆ రాత్రికి లలిత యింట్లో నే గడిపేయాలని మురళి తనువు ఉవ్విళ్ళూరుతోంది. బహుశః లలితదీ అదే
పరిస్థితి కావచ్చనుకున్నాడు. లేకుంటే ప్రత్యేకంగా యీరోజే రావాలంటూ ఎందుకు కరారు జేస్తు ందని మురళి
మనసు గుర్రంపై దౌడు తీస్తు న్నట్లు గా వుంది. ఆలనాటి మధుర స్మృతులు కళ్ళ ముందు కదలాడసాగాయి.

***
మురళి స్కూల్ ఫైనల్ చదువుతున్న రోజులవి. అతని బెంచీ మేట్స్, జిగ్రీ దోస్తు లు.. హీరాలాల్, కొమురయ్య
ఇంకా రాములు. వీళ్ళను సరదాగా మురళి త్రీమస్కటీర్స్ అని పిలిచే వాడు.

కొమురయ్య సైకిలు మీద ప్రతీ రోజు కొత్త పల్లి నుండి వచ్చి వెళ్ళే వాడు.

త్రీమస్కటీర్స్ చదువులో ఎంత చురుకో.. అమ్మాయిల సఖ్యం సంపాదించడంలోనూ అంతే తీస్‌మార్‌ఖాన్లు .


మురళి ఈవిషయంలో చాలా పూర్.

తరగతి గదిలో ఏమాత్రం ఖాళీ దొరికినా.. త్రీమాస్కటీర్స్ గత వారపు వారి, వారి అనుభవాలను చెరుకుగడ
రసంలా రుచి చూపిస్తూ .. మురళిని ఉడికించే వాళ్ళు.

అలా మురళి మనసులో అమ్మాయి అధరం కోసం అంకురార్పణ జరిగింది.

ఒక రోజు కొమురయ్య తన ఊళ్ళో చంద్రకళ అనే అమ్మాయి గురించి మురళికి ఈస్ట్ మన్ కలర్లో చూపిస్తూ ..
చాక్లెట్ యిస్తే చాలని చప్పరించుకుంటూ చెప్పాడు.

“మీ ఊరొస్తా ..” అని ఛంగున ఎగిరి గంతులేశాడు మురళి.

‍ గూడా తీసుకొనిరా..” అంటూ


“అయితే వచ్చే రెండవ శనివారం, ఆదివారం సెలవుల్లో హీరాలాల్ను
కొమురయ్య పచ్చ ఝండా ఊపాడు. కొత్త టేస్ట్ చూడొచ్చని ఉవ్విళ్ళూరించాడు.

రాబోయే శనివారం కోసం ఆత్రంగా ఎదురి చూడసాగాడు మురళి.

‘కనులు మూసినా నీవాయే.. కనులు తెరిచినా నీవేనాయే..!’ అనుకుంటూ సదరు చంద్రకళ రూపు రేఖల్ని
ఊహల్లో ఊహించుకోసాగాడు. క్లా సులో పాఠాలు చంద్రకళ ప్రణయ గాధలుగా వినిపించసాగా

అనుకున్న రోజు రానే వచ్చింది. మధ్యాహ్నం భోజనం చేసి.. హీరాలాల్, మురళి ఆరు కిలోమీటర్ల దూరంలో
ఉన్న కొత్త పల్లికి బయలుదేరారు.

‘ప్రేమ కోసమై వలలో పడెనే.. పాపం పసివాడు’ అనే పాట యుగళ గీతంలా పాడుకుంటూ కాళ్ళను
ప్రో త్సహించారు.
కొత్త పల్లికి చేరే సరికి సాయంత్రం ఆరయ్యింది. సరియైన సమయానికే చేరుకున్నామని.. ఈరేయి గూడా వేస్ట్
గానివ్వద్ద ని కొమురయ్యను పురమాయించారు. అతని తల్లి దండ్రు లు చూపించే ఆప్యాయతలో.. చేతులు
కట్టు కుని బుద్ధి మంతుల్లా వెలిగిపోసాగారు.

కాసేపటికి కొమురయ్య ముఖం వేలాడేసుకుంటూ బ్యాడ్ కబురు మోసుకొచ్చాడు. చంద్రకళ కోసం చాక్లెట్లు
గూడా కొన్నట్లు చూపించాడు. అయితే ఆమె అరగంట క్రితమే సినిమా చూడ్డా నికి ములుగు వెళ్ళిందట.

రాత్రంతా మురళి మనసు విరహ జ్వాలల్లో రగులుతూ.. రగులుతూ.. నిద్ర లేమికి గురిచేసింది.

ఆమరునాడు ఉదయమే మళ్ళీ ప్రయత్నించాడు కొమురయ్య. నిరాశే ఎదురైంది. ఆమె సోమవారం గాని
రాదట.. చాక్లెట్లు నీరు గారిపోయాయి. తూర్పు తిరిగి దండం బెట్టి, తలపై తెల్ల ని చేతిరుమాలు వేసుకొని
హీరాలాల్, మురళి ములుగుకు బయలుదేరారు.. ‘ఆశా.. నిరాశేనా.. జీవితాన వెలుగింతేనా..!’ అని మనసులో
వగచుకుంటూ.

మురళి కొత్త పల్లి నుండి తిరిగి వచ్చినట్లు తెలుసుకొన్నాడు రాములు. ఆరాత్రి చదువుకోడానికి మురళి ఇంటికి
వచ్చీ రావడంతోనే..

“గొప్ప చాన్స్ మిస్సయ్యావు గురూ..” అంటూ.. మురళి లోని అసంతృప్తి జ్వాలలపై గుగ్గిలం గుప్పించాడు.
చదువుతున్నట్లు నటిస్తు న్న మురళి చేతిలో నలుగుతున్న పుస్త కాన్ని ఠక్కున ప్రక్కకు బోర్లించి విషయం ఆరా
తీశాడు ఆసక్తిగా.. మురళిలో నరాలు తెగుతున్నంత ఉత్కంఠ.

గత రాత్రి తను సినిమా కెళ్ళాడట.

చుట్టూ తడకలు.. పైన ఇనుప రేకులు.. క్రింద నేల టిక్కట్ల ప్రేక్షకులు. అదీ ములుగు టూరింగ్ టాకీస్ ఠీవీ..
సొగసు చూడతరమా..! నేల మీద ఆడా, మగా ఐకమత్యంగ అంతా కలిసే కూర్చుంటారు. పేరుకు మాత్రమే
మధ్యలో తెర. సింగిల్ ప్రొ జెక్టర్.. రీలు మార్పు.. ఈలలు.. యివీ విశేషాలు.

సినిమా చూస్తు ండగా కొత్త పల్లి చాక్లెట్ చంద్రకళ తనకు తాను పరిచయం చేసుకొని సినిమా అయ్యాక తన
యింట్లో ఆశ్రయ మడిగిందట. తాను ఫ్లా టై పోయాడట. ఆతెల్ల వార్లూ చాక్లెట్ చంద్రకళతో.. అని చెబుతుంటే
శ్వాసించడం మర్చి పోయాడు మురళి.

దేనికైనా పెట్టి పుట్టా లని మురళి మనసు క్షోభించింది. అతని దురదృష్టా నికి లోలోన నలిగి పోయాడు. విధి
అతనిపై కక్షబూనిందని లోలోన కుమిలిపోసాగాడు. మురళి ఎదలోని బడబాగ్ని గమనించి హీరాలాల్ జాలి
చూపడం.. అతణ్ణి మరింత రెచ్చగొట్టింది.

ఎలాగైనా స్త్రీసాంగత్యాన్ని చవిచూడాలనే కోర్కెలు మురళిలో శృతిమించి తారా స్థా యికి చేరాయి.

తారల్లో దాక్కున్న చంద్రు డు కరుణించి ఒక తారను మురళి ముంగిట పంపాడేమో..! అలా తళుక్కున
మెరిసింది మురళి కళ్ళెదుట ఒక నయనతార. కాలనీకి కొత్త గా కాపురానికి వచ్చింది.

ఆమె పేరు లలిత.. వివాహిత. అయితేనేం.. కన్నెపిల్లే గావాలని కాచుకు కూర్చుంటే కార్యం సిద్ధించేదెప్పుడు?..
కార్యానికి అనుభవజ్ఞు రాలైన కాంత దొరికినా.. కాసులు తప్పినట్లే.. అని పొంగి పోయాడు. పైగా ’వనిత గానీ..
కవిత గానీ.. వలచి రావాలి’ అనుకునే మురళి దృక్ఫధానికి అనుకూలవతి. ఆమె భర్త ఆఫీసు పని మీద
తరచూ ఊర్లు తిరగడమందుకు కారణం కావచ్చు.
లలిత తరచుగా రేడియోలో పాటలు వినడానికి మురళి యింటికొచ్చేది. ఓరోజు వార్తల్లో ’టెస్ట్ ట్యూబ్ బేబీ’
పరిశోధనల గూర్చి చెప్తు ంటే.. ‘అంటే ఏమిటో..!’ తెలుసు కోవాలనే ఆమె జిజ్ఞా స వారి సాన్నిహిత్యానికి బాటలు
వేశాయి.

ఆరోజు ’హోళీ’ పండుగ. రంగులు పులుముకోవడానికి అనుకూలంగా కాటన్ ఖాకీ నిక్కరు, ఎడం భుజంపై
కొద్దిగా చిరిగిన చేనేత చేతుల బనీను తొడుక్కొని యింటి వెనకాల వాకిట్లో ముఖం కడుక్కుంటున్నాడు మురళి.

లలిత వెనక నుండి వాన పాములా వచ్చి ఆమె రెండు అరచేతులకున్న ఆకుపచ్చ రంగును మురళి ముఖాన్ని
అదిమి బట్టి మరీ పూసింది. మురళి నరాలు జివ్వుమన్నాయి. యవ్వనంలో ఉన్న స్త్రీ, అలా తమలపాకుల
బోలిన అరచేతులతో మురళి బుగ్గ లపై అచ్చాదన.. అదే ప్రథమం. అతని ముఖంపై పులిమిన పచ్చరంగు ఆమె
కళ్ళళ్ళో మెరిసేసరికి అది ప్రణయానికి ‘గ్రీన్ సిగ్నల్‍’ అనుకుకున్నాడు. ఆమె వెళ్తూ .. వెళ్తూ .. మురళి బనీను
చిరుగులో నుండి బూరెలా పొంగిన అతని ఎడం భుజంపై తన గులాబి రేకుల పెదవులతో లవ్ సింబల్
ముద్రించింది. అలా ఆమె అద్దిన అధరామృతం యింకి మురళి హృదయాన్ని చేరుకుంది.. పులకించి పోయాడు.

కాసేపటికి మురళి అరచేతులకు లలితకిష్ట మైన నీలిరంగు రాసుకొని ఆమె ఇంటికి వెళ్ళాడు.. ఒక్కర్తే ఉంది.
వెనుక నుండి అడుగులో అడగు వేసు కుంటూ పిల్లిలా వెళ్ళి, ఆమె రెండు చెక్కిళ్ళపై దాడికి.. తన రెండు
చేతులను పురమాయించాడు.

లలితా ఏమాత్రమూ ప్రతిఘటించలేదు సరికదా.. మురళికెదురుగా మళ్లింది.. మైకపు చూపులతో.. తాను


వివశురాలైనట్లు పరవశిస్తూ .. సగానికి పగిలి తెరచుకున్న దానిమ్మ పండులా గోచరిస్తు న్న తన నోట్లో ని నాలుకతో
పెదాలపై సున్నాలు చుట్టు కో సాగింది. కాని మురళికి ధైర్యం చాలలేదు. గుండె దడతో వెనుదిరిగాడు. కాళ్ళు
వణక సాగాయి.

ఆనాటి సాయంత్రం మల్లెపూలు కోసిమ్మని మళ్ళీ ప్రత్యక్షమయ్యింది లలిత. మురళి వాకిట్లో పందిరికి పారిన
మల్లెతీగకు పూలు విరగబూయడం అతని అదృష్టా నికి తెరలేపింది. మురళి కోసిచ్చిన పూలపళ్ళెంతోబాటు
నెత్తా వి మధురిమలను అతని హృదయానికద్ది తీసుకెళ్ళింది లలిత.. కేవలం మురళి శరీరాకృతి మాత్రమే
మిగిల్చింది.

‍ ఆరాత్రి విషయమంతా విశదీకరించాడు మురళి. తర్వాత ఎపిసోడ్లో


హీరాలాల్కు ‍ ఏంచేయాలని సలహా
ఆడిగాడు.

“ఇంకా ఆలస్యమెందుకు?’’ అంటూ ధైర్యం నూరి పోశాడు హీరాలాల్.

‘’ఆమె కాలు జారేలా నువు కాలు ముందుకు జరపకుంటే చూపులకే మగాడు గాని శృంగానికి గాదని.. ‘సూడు
పిన్నమ్మో.. పాడు పిల్లో డు.. పైన, పైన పడుతూ ఉన్నాడు..’ అని పాడుకోడానికే పనికోస్తా డని మరో విధంగా
అర్థ ం చేసుకుంటుంది” . అని గీతోపదేశం జేశాడు. ఇలాంటి సందర్భాలలో తాను ప్రదర్శించిన నైపుణ్యాన్ని
‍ చూపించాడు, ఇదే శృంగారపు ఆటలు గనుక ఓలంపిక్స్‌లో పెడితే తనకు గోల్డ్ మెడల్
సింగిల్ ఎపిసోడ్లో
ఖాయమన్నంత ధీమాతో. ఇక్కడొక జోక్ గూడా పేల్చుతూ.. విరగబడి నవ్వాడు. నాకూ నవ్వాగలేదు.. దొంతర,
దొంతరులుగా నవ్వాను. ఊహల్లో తేలి పోయాను.

ఏకాంతం.. ఆకాంత గూర్చి గతరాత్రి తీసుకున్న నానిర్ణయాన్ని అమలు పర్చాను. ఆమెను నాబాహువుల్లో బంధీ
చేశాను. అదే తొలి సారి. అనుభూతి అనిర్వచనీయం. జగత్తు లో ఏమధుర ఫలాలందివ్వని ఫలసాయమది.
‍ సశేష మన్నట్లు సడలించుకొని
లలిత మత్తు గా మురళికి మర్చిపోలేని కితాబిచ్చింది.. పొంగిపోయాడు. సడెన్గా
జారిపోయింది లలిత.
మురళికి అన్నం సహించడం లేదు. ఆమె దయ అతని ప్రా ప్త ం. ’శుకసప్త తి’ కథల్లో మాదిరిగా కాంతలు
తల్చుకుంటే తప్ప కార్య సిద్ధి జరగదు.

ఆమరునాడు పగటి పూట లలిత కటాక్షించింది. మురళి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిధిరోహించి ఝండా నాటినంత
గర్వంగా ఫీలయ్యాడు. హీరాలాల్ మదిలో అతని విజయ కేతనాన్ని ఎగరవేశాడు.

మురళి మనసులో కోరిక తీరింది గాని లోలోన భయం, భయంగానే ఉంది. మిగిలిన మిత్రద్వయం వద్ద గూడా
ఈవిషయం పొక్క నీయలేదు. ఆమె నూతన వధువు, కాళ్ళ పారాణి గూడా ఆరలేదు. సూది మొనంత
అనుమానం పొడ సూపినా ఆమె బ్రతుకు ఛిద్రమై పోతుందనే ఆందోళన అతనిలో మొదలయ్యింది.

‘అదియును ఒకందుకు మంచిదే’ అన్నట్లు .. ఆమరునాడే ఆమె భర్తకు హైద్రా బాదుకు బదిలీ కావడంతో..
మురళికి వీడ్కోలు గుర్తు నిచ్చి వెళ్ళి పోయింది లలిత.

‘చెలియ లేదు.. చెలిమి లేదు.. వెలుతురే లేదు.. చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే..’ అని
పాడుకోసాగాడు మురళి.

ఆమరునాడు కొమురయ్య భయంకరమైన వార్త మోసుకు వచ్చాడు. చాక్లెట్ చంద్రకళను ఎవరో అత్యంత
కిరాతకంగా రేప్ చేసి హత్య చేశారట.

అధికంగా నవలలు చదివే అలవాటున్న మురళికి చంద్రకళ చావు పరి, పరి విధాల ఆలోచనలను రేకెత్తించింది.
సంఘం కట్టు బాట్లు తప్పి.. ఆమె చావును ఆమెనే కోరి తెచ్చుకుందనిపించింది. కాని ఆమె ఒక్కర్తెదే తప్పు
కాదు. ఆమెననుభవించిన వారందరిది కూడానూ. ఆ జాబితాలో తనూ చేరే వాడే. తృటిలో తప్పిపోయింది.
మరి ఇప్పుడు లలితతో వ్యవహారం.. నేరం కాదా..! అవును ముమ్మాటికీ క్షమించరాని నేరమే.. ఇక ముందు
ఇలాంటి అసాంఘిక నేరాలు చేయరాదంటూ మురళి మనసు మౌన రోదనతో.. కళ్ళు జలపాతాలయ్యాయి.

మిత్రు లతో.. ‘పూర్తిగా చదువు మీద ధ్యాస పెడదాం. మన బడికి మంచి పేరు తెద్దా ం. ఎలాంటి అసాంఘిక
నేరాలు చెయ్యొద్దు .. ప్రో త్సహించొద్ద ని..’ తన నిర్ణయాన్ని తెలియజేశాడు మురళి. త్రీమస్కటీర్స్
స్వాగతించారు. ఆనిర్ణయానికి కట్టు బడి ఉంటామని రామాలయానికి వెళ్ళి శ్రీరామచంద్రప్రభువు ఎదుట
ప్రమాణం చేశారు.

***
కారులోని మురళి సెల్‌ఫోన్ మ్రో గడంతో.. అతని ఆలోచనల ఆగిపోయాయి. కారు పక్కకు తీసుకుని ఆపి.. ఫోన్
తీసి చూశాడు. అది హీరాలాల్ దగ్గ రి నుండి. వేదన భరితమైన గొంతుతో చెప్పసాగాడు..

“మురళీ.. మన రాములు చూశావా.. భగవంతుని పేరు పెట్టు కొని పాపం చేశాడు. ఆనాడు రామాలయంలో
మనమంతా ప్రమాణం చేశాం కదా..! రాములు మాట తప్పాడు. అందుకే భగవంతుడు శిక్షించాడు”

“ఏమయ్యింది హీరాలాల్” అంటూ ఆందోళనగా అడిగాడు మురళి.

“’అక్రమసంబంధం’ నేరంలో రాములు జైలుకెళ్లా డు” అంటూ ఐదు నిముషాల పాటు విషయం సంక్షిప్త ంగా
వివరించి ఫోన్ పెట్టేశాడు.

ఏదో అవాంతరం ఏర్పడినట్టు మురళి మనసు క్షోభించింది.

కాసేపటికీ తేరుకుని తిరిగి బయలు దేరాడు. కనుమసకవుతోంది.

లలిత ఇంటి గేటు ముందు కారు ఆపాడు.


గేటు తెరచుకొని అడుగులు ముందుకు వేస్తు ంటే.. మరో వంక అతని మనసులోని అలజడి గుండె వేగాన్ని
పెంచుతోంది.. కాళ్ళూ, చేతులు వణకసాగాయి. గుండె చిక్క బట్టు కుని కాలింగ్ బెల్ నొక్కాడు.

గుమ్మం ముందు లైటు వెలిగింది.. లిప్త కాలంలో తలుపు తెరుచుకుంది.

ఎదురుగా లలిత..!

కళ్ళజోడు సరిజేసుకుంటూ.. పోల్చుకునే సరికి ఆమెలో దివ్య తేజస్సు కలిగిన మాతృమూర్తి దర్శన మిచ్చింది.
అలనాడు రామకృష్ణ పరమహంసకు తన సతీమణి శారదాదేవీలో మాతృమూర్తిని గాంచినట్లు . అలాంటి
అనుభవం చవిచూడడమే గాని రుచి చూపించడం ఎవరి తరమూ గాదు.

దేవాలయంలో ప్రవేశించిన భక్తు డిలా రెండు చేతులు జోడించి నమస్కరించాడు. మురళిని సాదరంగా
ఆహ్వానించింది. చాలాకాలం తర్వాత చూస్తు న్నందుకు సంతోషం వ్యక్తపర్చింది.

“ఎలా ఉన్నావు మురళీ..!” అంటూ కుశల ప్రశ్నలు వేసింది.

బాగున్నాను అన్నట్లు గా తల ఊపాడు మురళి. గొంతు పెకలడం లేదు. మురళిని హాల్లో కూర్చోమని..

“కాఫీ తెస్తా ను” అంటూ వంట గదిలోకి వెళ్ళింది.

మురళికి ఆనాటి అనుభవపు ప్రథమ రోజు గుర్తు కొచ్చింది. ఈరోజు గూడా లలిత ఇంట్లో ఒక్కర్తే ఉందని
గమనించినా.. వెనకాలే వెళ్ళడం.. మనస్కరిం లేదు.

హాల్లో టీ.వీ. పక్కనున్న షోకేసు లోని ఫోటోలు చూస్తూ ఉండి పోయాడు. ఆమె కుటుంబ సభ్యుల ఫోటోలు
అతణ్ణి ఆత్మీయుడిగా పలుకరించసాగాయి.

ఇంతలో లలిత ట్రేలో కాఫీ కప్పులు పట్టు కుని వచ్చింది. ఫోటోలలో ఉన్న వారిని పరిచయం చేసింది. ఇద్ద రు
సోఫాలో కూర్చొని కాఫీ సేవిస్తూ .. కాసేపు వారి, వారి సంసార స్థితిగతులు ఆత్మీయంగా మాట్లా డుకున్నారు.

మురళి కూకట్పల్లిలో ఉంటున్నట్లు , పదవీ విరమణకు దగ్గ రలో ఉన్నానని చెప్పాడు. వీలు చూసుకొని
అన్నయ్య, పిల్ల లతోబాటు తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.

లలిత కళ్ళల్లో కళ్ళు బెట్టి చూడలేకపోతున్నాడు. లలిత భర్త లేని సమయంలో ఎక్కువసేపు ఉండడం సబబు
గాదని లేచాడు. భోజనం చేసి వెళ్ళమంది లలిత. మరో సారి వస్తా నన్నాడు. అతని సతీమణిని కూడా తీసుకొని
రమ్మంది. ముందు మీరు రండి. ఆతరువాత మేము వస్తా మని చెప్పి బయలు దేరాడు.

అన్యమనస్కంతో కారు నడపడం మంచిది కాదని ఎంత జాగ్రత్త పడ్తు న్నా.. అతని మనసు లోని అలజడి ఎగిసి,
ఎగిసి పడ్తోంది. వెంటనే.. హీరాలాల్ ఫోన్ కాల్ గుర్తు కు వచ్చింది. తోవ లోనే అతని ఇల్లు . వెళ్లి కాసేపు
మాట్లా డితే ఉపశమనం కలుగుతుందని.. అలాగే రాములు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని కారు
మియాపూర్కు పోనిచ్చాడు.

హీరాలాల్ ఇంట్లో అడుగుబెట్టి నిర్ఘా ంత పోయాదు మురళి.. అతని కెదురుగా త్రీమస్కటీర్స్.

ఆనందభాష్పాలతో అందరినీ హత్తు కున్నాడు. హీరాలాల్ను మృదువుగా పిడికిలి బిగించి ఒక్కటిచ్చుకున్నాడు.


రాములు గురించి అలా చెప్పావేమని చిరుకోపం ప్రదర్శించాడు.

మురళిని ఒక పిచ్చివాడిలా చూస్తూ అంతా నవ్వసాగారు. మురళి ముఖం జేవురించింది. అది గమనించి
హీరాలాల్ నవ్వు ఆపి అసలు విషయం చెప్పసాగాడు.
“చూడు మురళీ..! నీ కోసమే ఇదంతా నాటకమాడాం. ఆరోజు మనం రామాలయంలో ప్రమాణం చేసింది నీకు
గుర్తు కు రావాలని. మనం దేవుని మీద ప్రమాణం చేసినట్లు గానే నడుచుకుంటూ.. జీవితంలో మచ్చ పడకుండా
ఉన్నత స్థా నాలకు ఎదిగాం.

ఈ మధ్య నువ్వు లలిత గురించి వాకబు చెయ్యడం వాట్సాప్ పుణ్యమా అని నాకు చేరింది. ఈవిషయం
రాములుకు, కొమురయ్యకు చెప్పి మాఇంటికి రమ్మన్నాను. ముగ్గు రం కలిసి ముందు జాగ్రత్త కోసం పథకం
వేశాం. నీ మీద నమ్మకం లేక కాదు గానీ.. మన ప్రమాణం నీకు గుర్తు కు రావాలని.. రాములు గురించి ఒక
అబద్ధ ం చెప్పాను. ఒకవేళ లలిత గురించి నీలో తపన ఉంటే తప్పటడుగు వేయకుండా ఉంటావని.

మీ దంపతులు తొలి దశలో సన్నిహితంగా ఉన్నట్లు మలిదశలో ఉండడం లేదని మేము గమనించాం. నీతో
చెప్పా చెయ్యకుండా వదినమ్మ అమెరికా వెళ్ళినట్లు తెలుసుసుకున్నాం. నువ్వు పడ్తు న్న బాధ స్నేహితులకు
సైతం చెప్పుకోలేనిదని తెలుసు. అయినా నీ మూలాన లలిత కుటుంబంలో ప్రళయం రాగూడదనే ఈ
నాటకమాడాం. సారీ..” అంటూ నా చేతులు పట్టు కున్నాడు హీరాలాల్.

నాకు దుఃఖమాగింది కాదు, నా కళ్ళ నుండి జల, జలా కన్నీటి బొట్లు రాలసాగాయి. నన్ను త్రీమస్కటీర్స్
అమాంతం హత్తు కున్నారు. నేనూ మువ్వురిని ఆప్యాయంగా నిమురుతూ..

”నిజమే.. మీ ఊహ సరియైనదే హీరాలాల్..” అంటూ నాలో రేగిన అలజడి చెప్పసాగాను.

“శృంగారం కూడా తనువుకు కావాల్సిన ఒకరకమైన ఔషధమని చెప్పినా వినక మొండిగా తిరస్కరించే
నాజీవనసహచరితో.. ఒక రోజు జరిగిన వాగ్యుద్ధ ం తారాస్థా యికి చేరింది. నాకు చెయ్యి చేసుకుందా మన్నంత
కోపం వచ్చి చెయ్యి ఎత్తా ను. కాని నాలోని మానవత్వం నన్నాపింది. ఆమరునాడే నాతో చెప్పకుండా ఆమె
తమ్మునితో కలిసి అమెరికా వెళ్ళిపోయింది. ఆవిషయం మా బంధువు ద్వారా తెలిసింది. నెల రోజులు
గడిచాయి. నాకు లలిత గుర్తు కు వచ్చింది. ఆమె కోసమే నేను చిరునామా కనుక్కొని బయలుదేరాను. ఆమెతో
ఒక రాత్రి గడపాలని అనుకున్నాను.

ఇంతలో నీ ఫోన్ రావడం.. మన ప్రమాణం గుర్తు కు వచ్చింది. ఇంత దూరం వచ్చాను కనీసం లలితను
చూడాలనే కోరిక వారి ఇంటి తలుపును తట్టించింది.

ఇంట్లో మరెవ్వరూ లేరు. అయినా నా మనసు చలించ లేదు. మర్యాదపూర్వకంగా మాట్లా డుకొన్నాం. హృదయ
పూర్వకంగా నమస్కరించి శెలవు తీసుకున్నాను” అని చెప్పగానే.. మురళి మనసు తేలిక పడింది. *
అంతరార్థం - పద్మావతి దివాకర్ల
Object 22

ముద్దు లమూట కడుతున్న తన కూతురు లల్లీ చెప్పే వచ్చీరాని మాటలు వింటూ మురిసిపోతోంది వాసంతి.
అప్పుడే లల్లీకి రెండేళ్ళు నిండి మూడో ఏడు వచ్చింది. ఇంకో ఆర్నెల్లు దాటితే ప్లేస్కూలో చేర్చాలని
నిర్ణయించుకుంది వాసంతి. ఇప్పటినుండే దగ్గ రలో ఎక్కడెక్కడ ప్లేస్కూళ్ళు ఉన్నాయో అని వాకబు చేస్తో ంది.
ఇంత చిన్నవయసులోనే స్కూల్‌కి పంపడం ఇష్ట ంలేదు ఆమె భర్త వీరేంద్రకి. ప్రస్తు తం చదువులో ఉన్న పోటీ
తట్టు కోవాలంటే ఇప్పటినుండే స్కూల్‌లో చేర్చాలనేది వాసంతి వాదన. చివరికి తన వాదనే నెగ్గించుకొని
ప్లేస్కూళ్ళ వేటలో పడిందామె.

వాసంతికి నాలుగిళ్ళ ఆవతల ఉండే వాహిని తన అబ్బాయిని వాళ్ళున్న వీధికి దగ్గ రలోనే ఉన్న ప్లేస్కూల్లో ఈ
మధ్యనే చేర్చినట్లు తెలిసింది. ఆ స్కూలు గురించిన వివరాలు తెలుసుకుందామని వాళ్ళింటికి వెళ్ళింది
వాసంతి.

వాహిని వాసంతిని చూస్తూ నే తన ఇంట్లో కి ఆహ్వానించింది. వాసంతి వచ్చిన కారణం తెలియగానే, "మా
బాబుని పక్కవీధిలో ఉన్న 'వాగ్దేవి విద్యాలయం'లో నెలరోజుల క్రితమే చేర్పించాము. అక్కడ ప్లేస్కూల్ నుండి
ఏడవ తరగతి వరకూ ఉంది. ఇప్పుడు జాయిన్ చేస్తే ఏడో తరగతి వరకూ చూసుకోనక్కరలేదు. స్కూలు కూడా
చాలా దగ్గ ర. పెద్ద స్కూలు, ఆవరణ కూడా పెద్ద దే! స్కూల్ ఫీజులు కూడా మనలాంటివారికి అందుబాటులోనే
ఉన్నాయి. మీ పాపని కూడా అందులోనే చేరిస్తే బాగానే ఉంటుంది. మనిమిద్ద రమూ కలిసి వెళ్ళి వాళ్ళని
సులభంగా దిగబెట్ట వచ్చు, తీసుకురావచ్చు. పిల్ల లు కూడా ఒకళ్ళకొకళ్ళు తోడు ఉంటారు." అందామె.

వాహిని చెప్పిన స్కూలు వివరాలు వాసంతికి నచ్చాయి. పైగా స్కూలు చాలా దగ్గ రలోనే ఉంది. నడిచివెళ్ళే
తోవే. స్కూలుకి వెళ్ళి ఒకసారి చూడాలని భావించిన వాసంతి, "రేపు మీరు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తా ను.
ఓ సారి స్కూలు చూసినట్లూ ఉంటుంది. మిగతా వివరాలు కూడా కనుక్కోవచ్చు." అందామె. వాహిని
అలాగేనంది.

ఆ మరుసటి రోజు ఉదయం ఏడుగంటలకే వాహిని బాబుతో వాసంతి ఇంటికి వచ్చింది. పాప లల్లీని భర్తకి
అప్పచెప్పి వాసంతి కూడా వాళ్ళతో బయలుదేరింది.

పక్క వీధిలోనే ఉంది ఆ స్కూల్. పైకి చాలా అందంగా ఉందా స్కూల్. బయట పెద్ద గేట్, దాని పక్కనే స్టూ ల్
వేసుకొని కూర్చొని ఉన్నాడు వాచ్‌మేన్. వీళ్ళని చూడగానే గేట్ తీసాడు. లోపలికి ప్రవేశించగానే పూల
మొక్కలతో ఒక చిన్న తోట ఉంది. స్కూలుకి ముందుభాగాన వరండాలో పిల్ల లకి సంబంధించిన రకరకాల
ఆటవస్తు వులు, ప్లేస్కూల్ పిల్ల లకోసం జారుడు బల్ల లులాంటివి, టెడ్డి బేర్లు , మీక్కి మౌసులు వగైరాలు
ఉన్నాయి. వరసగా అరడజనుకు పైగా గదులు, ఆ పక్కనే ప్రిన్సిపాల్ గది, ఆఫీసు గది కూడా ఉన్నాయి.

వరండాకి రెండుప్రక్కలా లాన్, అందులో రకరకాల పూలమొక్కలు, కుండీల్లో క్రో టన్సు ఉన్నాయి. వాటిని
తేరిపార చూసింది వాసంతి. అన్నీ పరిశీలిస్తూ ముందుకి నడిచింది వాసంతి. అవన్నీ దాటుకొని వాహిని,
వాసంతి ఇద్ద రూ ప్రిన్సిపాల్ రూములోకి ప్రవేశించారు.

బాబుని చూస్తు నే వాళ్ళ స్కూల్ టీచర్ వాహినిని పలకరించి బాబుని క్లా స్ గదిలోకి తీసుకెళ్ళింది.

వాసంతిని ప్రిన్సిపాల్‌కి పరిచయం చేసి విషయం చెప్పింది వాహిని.

"మా స్కూల్లో మీ పాపని చేర్చాలని నిర్ణయం తీసుకున్నందుకు మీకు అభినందనలు. మా స్కూల్లో పిల్ల ల్ని
జాగ్రత్తగా చూసుకొని మంచి విద్యార్థు లుగా తీర్చిదిద్దు తాం. ఇంతకీ మీ పాపని ఎప్పుడు స్కూల్లో చేరుస్తా రు?"
అంది ప్రిన్సిపాల్.

"ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఏ సంగతి చెప్తా ను." అంది వాసంతి.

"అలాగే! మా విద్యా సంస్థ కి సంబంధించిన వివరాలన్నీ ఈ బ్రో చర్‌లో ఉన్నాయి. చదవండి." అని ఓ బ్రో చర్
అందించిందామె.

అది అందుకొని ఆమెకి నమస్కరించి వాసంతి కుర్చీలోంచి లేచింది. వాహిని ఆమెని అనుసరించింది.
వెళ్తూ న్నప్పుడు వాసంతి స్కూలులోపల, బయట నిశితంగా పరిశీలించసాగింది.

"చూసారా! స్కూల్ ఎంత బాగుందో? ప్రిన్సిపాల్, టీచర్లు కూడా చాలా మంచివాళ్ళు. మీ పాపని కూడా
తప్పకుండా ఇక్కడే చేర్చండి." అంది వాహిని.

"మా లల్లీని ఇక్కడ చేర్చడం నాకు ఇష్ట ం లేదు." అంది వాసంతి ఓ నిర్ణయానికి వచ్చి.

ఆమె మాటలకి ఆశ్చర్యపోయింది వాహిని.

"అదేంటి? స్కూలంతా తిరిగి చూసారు కదా. అంతా బాగానే ఉంది కదా! మరి మీ అభ్యంతరమేమిటో నాకు
బోధపడలేదు." అంది వాసంతి విస్మయంగా.
"అంతా శ్రద్ధగా చూసాను కాబట్టే చెబుతున్నాను. మీరు గమనించారో లేదో ఆ స్కూల్ తోటలో, వరండాలో ఉన్న
పూల చెట్లు చూసారా! ఎలా ఎండిపోయాయో! సంరక్షణ కరువైంది వాటికి. పూల చెట్ల పైనే శ్రద్ధ చూపలేని
స్కూలువాళ్ళు పూలలాగే నాజూకైన మన పసిపిల్ల ల్ని శ్రద్ధగా ఎలా చూస్తా రన్నది నా సందేహం. అందుకే మా
లల్లికోసం ఇంకో స్కూల్ చూస్తా ను." అంది వాసంతి.

వాసంతి మాటల్లో ని అంతరార్థ ం బోధపడింది వాహినికి. ఆ తర్వాత అరకిలోమీటర్ల దూరంలో ఉన్న మరో
ప్లేస్కూల్లో లల్లీని చేర్చింది వాసంతి. కొద్ది రోజులలోనే వాహినికి కూడా బాబు చదువుతున్న స్కూలుపై
అనుమానం కలిగి, ఆమె కూడా లల్లి చేరిన స్కూల్లో నే తన బాబుని కూడా చేర్చింది.
భారతి - చెన్నూరి సుదర్శన్
Object 23

ఇల్ల ంతా దద్ద రిల్లేలా నోటితో విజిల్ వేస్తు న్నాడు ఖాజా.


ఖాజాకు అమితమైన సంతోషంకలిగినప్పుడల్లా అలా విజిల్ వేయడం పరిపాటేనని.. వంటింట్లో ఉన్న అతని
భార్య భారతి పెద్ద గా పట్టించుకోలేదు. వంటపని పూర్తి కాగానే.. ఏమిటా సంతోషానికి కారణం మన్నట్లు గా
హాల్లో కి అడుగుపెట్టింది. అక్కడి దృశ్యం చూసి నివ్వెరపోయింది.

ఎడం చేతి రెండు వేళ్ళను నోట్లో పెట్టు కొని విజిల్ వేస్తూ దానికనుగుణంగా ఒంటి కాలుపై నృత్యం చేయసాగాడు
ఖాజా. అలా నృత్యం చేస్తు ండగా భారతి ఎన్నడూ చూడలేదు.

“ఏంటి ఖాజా..! ఏమయ్యింది..?” అంటూ ఆశ్చర్యంగా అడిగింది భారతి.

అటు చూడు అన్నట్లు గా టీ.వీ. వైపు చెయ్యి చూపిస్తూ వాలుకుర్చీలో వాలిపోయాడు. భారతిని తన దగ్గ రికి
వచ్చి కూర్చోమన్నట్లు గా మరోచేత్తో సైగ చేశాడు. అతని ముఖంలో ఉత్సాహం ఉవ్వెత్తు న ఉరకలు వేస్తూ ండడం
గమనిస్తూ .. పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది భారతి. టెలివిజన్ వంక దృష్టి సారించింది.

అందులో విదేశపు ప్రధానమంత్రి, భారతదేశంతో వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్లు


మెరుపు వార్తలు వస్తు న్నాయి. ఆమెరుపుల ప్రతిబింబాలతో చూశావా..! అన్నట్లు భారతి వంక చూసి
కళ్ళెగరేశాడు ఖాజా.

“దాని వల్ల మాదేశానికి వచ్చిన నష్ట మేమీ లేదు” అంటూ నిర్లిప్త ంగా సమాధానమిచ్చింది, భారతి.

ఖాజా ముఖం జేవురించింది. కస్సున భారతి పైకి లేచి కళ్ళళ్ళో నిప్పులు కురిపిస్తూ ..“నష్ట మెందుకు లేదు.. మా
ప్రథాని చాలా తెలివి గల వాడు. క్రికెట్టు లో ఎన్నో సార్లు తన చివరి ఓవర్‌లో చివరి బంతి వరకూ పోరాడి
జట్టు ను గెలిపించిన మహానాయకుడు. మీ ప్రధానమంత్రినీ మట్టికరిపించక మానడు.

త్రీసెవెంటీ అధికరణ రద్దు కు ప్రతీకారంగా రేపు మరెన్ని ప్రకటనలు వస్తా యో చూస్తూ ఉండు. కీలెరిగి వాత పెట్టే
రకం మాప్రధాని” అంటూ తన లోని ఉక్రో శాన్ని వెళ్ళగక్కాడు ఖాజా.

భారతి నిర్ఘా ంతపోయింది. తనను ప్రా ణప్రదంగా ప్రేమించిన ఖాజాయేనా..! అన్నట్లు ఆశ్చర్యంగా అతని వంకే
చూస్తూ ..

“అదేంటి ఖాజా.. ఈరోజు కొత్త , కొత్త పదాలు వాడుతున్నావు. మీ దేశం.. మా దేశం అంటూ వింతగా
మాట్లా డుతున్నావు. మా దేశాన్ని ఆరాధించే కదా.. నన్ను వివాహం చేసుకున్నావు. ఆరోజు నువ్వు చేసిన
బాసలు మర్చి పోయావా..!” అంటూ నింపాదిగా అడిగింది.

“చూడు భారతీ.. అన్ని రోజులు ఒక్క తీరుగా ఉండవమ్మా..” అంటూ ఎకెసెక్కెంగా చేతులూపుకుంటూ..
“ఇప్పుడు నీతో వాదించలేను” అని లేచి విసురుగా వెళ్ళి బాత్‌రూంలో దూరాడు. ‘అందులో అయితే తన
ఇష్టా నుసారంగా నృత్యం చేయవచ్చని కాబోలు’ అని మనసులో అనుకుంది భారతి.

ఖాజా అన్నట్లు గానే ఆతెల్ల వారి సంఝౌతా ఎక్స్ ప్రెస్, మరి కొన్ని బస్సులు రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన
వచ్చింది.

“ఇలా ప్రజలకు అసౌకర్యం కలిగించడమేనా మీప్రధాని పని” అంటూ కోపంగా ప్రశ్నించే సరికి ఖాజా అగ్గి మీద
గుగ్గిలమయ్యాడు.

తోక తొక్కిన త్రా చులా బుసలు కొడుతూ.. భారతి చెంప ఛెళ్ళుమనిపించాడు.

భారతి వెంటనే ఖాజా రెండు చెంపల మీద పిడి గుద్దు ల వర్షం కురిపించింది. అది ఊహించని ఖాజా దిమ్మ దిరిగి
సోఫాలో కూలిపోయాడు.
“చూడు ఖాజా.. నేనూ బాక్సింగులో జాతీయ చాంపియన్ అనే విషయం మరిచి పోయావా..! నన్ను కానీ.. నా
దేశాన్ని కానీ అవమానిస్తే సహించను. ఇన్నాళ్ళూ నువ్వు చూపించించింది కపట ప్రేమ అని ఇప్పుడే తెలిసింది.
నీ నిజస్వరూపమేమిటో చూశాను. మాదేశపు తిండి తింటూ.. నమక్ హర్రా ంలా మీదేశపు పాట పాడుతున్నావు
” అని ఉరిమి చూసింది.

భారతిలో అంత ఆవేశం ఎన్నడూ చూసి ఎరగడు ఖాజా. ఒంట్లో వణకు పుట్టింది. కాని దాన్ని కప్పి
పుచ్చుకోవాలనే యత్నంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ .. “బాక్సింగ్ చాంపియన్ అయినంత మాత్రా న
నీభర్త మీదనే ప్రయోగిస్తా వా?.. తిరిగి కొట్ట డం ఎంత తప్పు. నీలాంటి భారత స్త్రీ చెయ్యాల్సిన పనేనా ఇది”
అంటూ నీళ్ళు నములుతూ గొణిగాడు ఖాజా.

“నువ్వే అన్నావు.. అన్ని రోజులు ఒక్కతీరుగా ఉండవని. నేను నేటి భారత స్త్రీని. ఒక చెంప కొడితే.. మరో చెంప
చూపించమని గాంధీజీ చెప్పిన కాలపు దాణ్ణి కాదు. ఒక చెంప కొడితే రెండు చెంపలు పగలగొట్టా లన్నదే
నాసిధ్ధా ంతం. నేను బుధ్ధెరిగినప్పటి నుండీ నాకిదే అలవాటు. ఇక ముందు మన ఇంటా, బయటా.. ఇమ్రా న్
పొగడ్త లు గానీ.. పాకిస్తా న్ పొగడ్త లు గానీ.. వినరావద్దు . ఖబడ్దా ర్..!” అంటూ చూపుడు వేలుతో తీక్షణ సైగలు
చేసింది.

ఊహించని పరిణామానికి ఊపిరి ఆగిపోయినట్టు గా కనుగుడ్లు తేలేశాడు ఖాజా.

“ఆరోజు నువ్వు నాదేశం మీదా.. నామీదా ప్రమాణం చేశావా.. లేదా..! ఇండియాకు ఇల్ల రికం వచ్చానని
అనుకోమన్నావు. నాకాళ్ళు మొక్కినంత పని చేసి నన్ను వివాహం చేసుకున్నావు. నయవంచకుడివి.

మాదేశం మీద నీఅక్కసు బయట పడింది. అది నేను సహించలేను” అంటూ తన కోర్టు లోని బంతిని ఖాజా
కోర్టు లోకి విసిరికొట్టినట్లు గా కొర, కొరా చూస్తూ .. పడకగది లోనికి వెళ్ళిపోయింది.

భారతి మనసంతా అల్ల కల్లో లమవుతోంది.. తాను దేశాంతర వివాహం చేసుకున్నానని అందరి మన్నలను
పొండుతూ పొంగి పోతోంది. కాని నేడు అవహేళనపాలయ్యే రోజు వచ్చింది. విదేశీ వాళ్ళలో కూడా మనదేశాన్ని
ప్రేమించే వారున్నారని నిరూపిస్తా అని అందరి ముందు ప్రమాణం చేసిన ఖాజా, ఇప్పుడు మన ప్రధాని గారి
ప్రకటనతో అతని నిజస్వరూపమేమిటో బయటపడింది.

తన జీవితం ఇంత ఉన్నతంగా నిలబడదానికి ఎందరో మహాను భావులు కృషి చేశారు. ఆవిషయం ఎలా మరిచి
పోగలదు. మనసు ఆలోచనలతో.. ఆర్ద ్రమవుతోంది.. ఆనాటి సంఘటనతో తన దెశ.. దిశ తిరిగిన వైనం కళ్ళకు
కట్టి నట్టు గా కళ్ళముందు దృశ్యాలు కదలాడసాగాయి.

***
భారతి తొమ్మిదవ తరగతి చదువుతోంది.

పుస్త కాల బ్యాగును వీపుకు తగిలించుకుని బడికి వెళ్తు న్న ఆమెకు వెనుక నుండి పిచ్చి వాగుడు వినబడ్తోంది..

“భారతిని ‘భా’ తో భాగిస్తే ఏమవుతుందిరా.. ! భాజన్నా. అదీ తెలియదారా..! వాజమ్మ”

“ఒరేయ్ హేమంత్.. అలా మాట్లా డకురా. భారతి నాన్న పరుశురాం పహిల్వాన్. మనల్ని ఉతికి, ఆరేస్తా డు.
భారతిని కూడా అంత తక్కువగా అంచనా వేయకు” అన్నాడు.. అతని పక్కనే నిలబడి వంత పాడుతున్న
వసంత్ భయం భయంగా.

“అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడేం పహిల్వాన్‌రా..! తొక్కల్ది. ముసలోడై పోయాడు. అయినా ‘పండిత
పుత్రు డు శుంఠః’ అన్నట్టు పహిల్వాన్ పుత్రిక పిరికిరా..” అంటూ హేళనగా నవ్వ సాగాడు హేమంత్.
భారతి గబుక్కున వెను తిరిగి మెరుపు వేగంతో హెమంత్‌పై పిడి గుద్దు ల వర్షం కురిపించింది..

కుప్పలా కూలిపోయాడు హేమంత్. వసంత్ ఉన్నఫళంగా అదృశ్యమయ్యాడు.

అదంతా చూస్తు న్న అభిరాం అచ్చెరువొంది భారతి దగ్గ రకు వచ్చాడు. భారతి ఏమాత్రమూ తొణకకుండా
అభిరాం వంక చూసింది.. నీకు గూడా వడ్డించనా..! అన్నట్టు గా కళ్ళెగరేసింది. ఆమె ధైర్యానికి అబ్బుర పడ్డా డు
అభిరాం.

“భేష్ భారతీ.. చాలా బాగా బుద్ధి చెప్పావమ్మా” అంటూ అభినందించాడు అభిరాం. అలా అపరిచితుని
అభినందనలు వింటూ ఎగాదిగా చూడసాగింది భారతి. నాపేరెలా తెలిసిందా అని ఆశ్చర్య పోయింది. బహుశః
వాళ్ళ మాటలు విని ఉంటాడనుకుంది.

తనకు మధ్ధ తుగా వచ్చాడనుకున్నతను తన నడ్డి విరగ్గొ డతాడని పసిగట్టి న హేమంత్, శక్తినంతా కూడగట్టు
కొని కాళ్ళకు బుద్ధి చెప్పాడు.

“నాపేరు అభిరాం” అంటూ ఆ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. “నేనీ మధ్య మన ఊళ్ళో ‘బాక్సింగ్’ కోచింగ్
సెంటర్ పెట్టా నమ్మా. అందులో ముఖ్యంగా ఆత్మరక్షణ కోసం అమ్మాయిలకు మెళకువలు నేర్పుతున్నాను”

ఆమాట అనగానే భారతిలో ఉత్సాహం పెల్లు బికింది. అది గమనించి “నేను సాయంత్రం మీఇంటికి వచ్చి
వివరాలన్నీ చెబుతానమ్మా” అంటూ భారతి వీపు తట్టి వెళ్ళిపోయాడు అభిరాం.

భారతి చెదిరిన పుస్త కాల బ్యాగును సర్దు కొని బడికి బయలు దేరింది.

ఆ సాయంత్రం భారతి అదృష్ట పు తలుపు తట్టా డు అభిరాం. వచ్చిన పని విన్నవించుకున్నాడు.

అంతా విన్న పరుశురాం “సార్.. ఇదంతా నావల్ల కాని పని. నా జవసత్వాలుడిగి పోయాయి. బండి మీద
కూరగాయలమ్ముకుంటూ భారతిని ఆమాత్రం చదివించడమే గగనమై పోతోంది. ఏదో బిడ్డ నాలుగు అక్షరాలు
నేర్చుకుంటే మంచి సంబధం చూసి పెళ్ళి చేయవచ్చనే ఆశ” అంటూ తన అనుభవమంతా చెప్పసాగాడు.

“ఒకప్పుడు నన్ను రాజకీయ నాయకులంతా వాడుకున్నారు. వారి కుట్రలు, కుతంత్రా లకు బలయ్యాను. అసలు
జీవితమంటే ఏమిటో..! అర్థ మయ్యే సరికి ఈడు మీద పడింది. నాకు అమ్మాయినివ్వడానికి ఎవరూ ముందుకు
రాలేదు. బాగా ఆలోచించాను.

నాపాపాలకు పరిహారంగా.. ఒకరికి జీవితాన్నివ్వాలనుకున్నాను. భర్త చనిపోయిన ఒక అభాగ్యురాలిని పెళ్ళి


చేసుకున్నాను. భారతి పుట్ట గానే నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయింది” అంటూ కంట నీరు పెట్టు కోసాగాడు
పరుశురాం. భారతి పరుగుత్తు కుంటూ వచ్చి తండ్రి తలను తన హృదయానికి హత్తు కుంది మాతృమూర్తిలా.

“చూడు అభిరాం.. ఇలాంటి ప్రేమను నూచుకునే నేనింకా బతికి ఉన్నాను. భారతి ఉన్నతి తప్ప నాకింకేమీ
అవసరం లేదు. భారతి భవిష్యత్తు ను నీచేతుల్లో పెడ్తు న్నాను” అంటూ వేడుకున్నాడు పరుశురాం.

“పరుశురాం.. భారతి చదువు ఆగదు. పైచదువులూ చదివిస్తా ను. నువ్వు నిశ్చింతగా ఉండు.. ఆమె
ధైర్యసాహాసాలు ఈరోజు ఉదయం నా కళ్ళారా చూశాను. మన దేశం గర్వించేలా తీర్చి దిద్దు తాను. ఒకప్పుడు
నువ్వు కుస్తీ పోటీల్లో చాంపియన్ కావాలని కలలుగన్నావు. నీ కలలను భారతి ద్వారా సఫలీకృతం
చేసుకోబోతావు. ఖర్చులన్నీ నేను భరిస్తా ను” అంటూ అభిరాం భరోసా ఇచ్చాడు.

అభిరాం శిక్షణలో ఆరు మాసాల్లో నే ఊహించని రీతిలో రాటు దేలింది భారతి.


మొదటి సారిగా అభిరాం ఆశీర్వాదబలంతో.. బాక్సింగ్ మండలస్థా యి పోటీల్లో ప్రథమ స్థా నంలో నిలిచింది
భారతి. ఆనాటి సభలో ఆమె ఆశయాలను వివరించాడు అభిరాం. గ్రా మ సర్పంచులంతా కూడబలుక్కోని ఆర్థిక
సాయం అంద జేశారు.

అలా అంచెలంచెలుగా ఎదిగిన భారతి జాతీయస్థా యి పోటీలలో పాల్గొ ంది. మొదటి సారిగా ఓడిపోయింది.

అప్పుడు పరిచయమయ్యాడు ఖాజా మక్సూద్ అలీఖాన్. అతను విదేశీయ కుస్తీపోటీల్లో పాల్గొ న్న
అనుభవముంది. తనకు భారతదేశమంటే ప్రా ణమని పలికాడు. మనదేశ కీర్తి పతాకను ఎగరేయాలని ప్రో త్సాహ
పర్చాడు. అభిరాం మధ్ధ తు లభించింది. భారతికి రెట్టింపు ఉత్సాహం వచ్చింది. మానసిక స్థైర్యం
ఇనుమడించింది.

ఆ అతరువాత జరిగిన జాతీయ స్థా యి పోటీలో బంగారు పథకం సాధించి తండ్రికి కానుకగా సమర్పించింది
భారతి.

పరుశురాం ఆనందడోలికల్లో మునిగిపోయాడు. అదే మంచి తరుణమని భారతి, ఖాజాలు తమ మనసులోని


మాటను బయట పెట్టా రు.

ఖాజా విదేశీయుడు అనే భావం తప్ప అతనిలో ఏలోటునూ గమనించ లేదు పరుశురాం. అతని భావాన్ని
గమనించిన ఖాజా అత్యంత నేర్పుగా సమాధాన పరిచి భారతిని వివాహం చేసుకున్నాడు.

అల్లు డు కూడా మల్ల యోధుడు కావడం పరుశురాం గర్వంగా అందరికీ చెప్పుకోసాగాడు. కాని కొద్ది రోజులకే
వాస్త వం బయట పడింది. ఖాజా నిషిధ్ధ ప్రేరకాలు వాడాడని తేలడంతో అతన్ని క్రీడా సమాఖ్య కుస్తీ పోటీలలో
పాల్గొ నకుండా నిషేధించింది. దీనితో మానసికంగా కృంగిపోతూ అసువులుబాసాడు పరుశురాం.

ఖాజా అలా దొరికి పోయే సరికి భారతికీ అతని మీద విశ్వాసం క్రమేణా సన్నగిల్ల సాగింది.

మన భారత ప్రధాని ‘తలాక్’ బిల్లు ను ప్రవేశ పెట్టినప్పటి నుండీ అతని ప్రవర్తనలో రసాయనిక మార్పులు
గమనిస్తూ వస్తూ ంది.

ఇంతలో భళ్ళున తలుపులు తెరుచుకున్న శబ్దా నికి భారతి ఉలిక్కి పడి లేచింది.

“చూడు భారతీ.. ఇందులో నువ్వు అంతగా బాధ పడాల్సిన పనేమీ లేదు. ఎవరి అభిప్రా యాలు వారివి. ఎదుటి
వారి అభిప్రా యాలను గౌరవించడం నేర్చుకో..” అంటూ భారతి ప్రక్కనే మంచంపై పడుకోబోయాడు ఖాజా.
దిగ్గు న లేచి నిలబడింది భారతి.

“ఖాజా.. నువ్వు ముందుగా భారత దేశాన్ని, ఆతరువాత భారతిని ప్రేమించావు. మా దేశపు నిర్ణయాలకు
బధ్ధు డవు కావాలి కాని మీదేశానికి మధ్ధ తు పలుకుతున్నావు. ఈపధ్ధ తి మార్చుకోకుంటే మనం కలిసి
జీవించడం అసాధ్యం” అంటూ ఉక్రో షంగా అంది.

ఆమె వివర్ణమైన ముఖాన్ని చూస్తూ ..

“అయితే వెరీ సింపుల్.. నీ ఇష్ట మే కానియ్యి. ‘తలాక్’ అని మూడు సార్లు చెప్పి మాదేశం వెళ్ళిపోతాను.
అన్నాడు ఖాజా.

“అంత సులభమనుకుంటున్నావా..? తలాక్ అనే పదం రద్దైనట్లు తెలియదా..?”

“అది మీదేశస్థు లకు వర్తిస్తు ంది. నాకు కాదు గదా..”

“అలా అని తప్పించుకోవాలని చూడబోకు. నీ నిజస్వరూపమేమిటో బయట పెడ్తా ను.”


“బెదిరిస్తు న్నావా..? అది నీవల్ల కాదు” అంటూ ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ .. హాయిగా మంచంపై
నడుంవాల్చాడు ఖాజా.

“నాకు నాదేశమంటే ప్రా ణం. నా దేశానికి ద్రో హం తలపెట్టే వాళ్ళను వదలను” అంటూ భారతి విసురుగా మరో
గదిలోకి వెళ్తు ంటే.. ఒక నిర్లక్ష్యపు నవ్వు ప్రదర్శించాడు ఖాజా.

భారతి నిద్రకు స్వస్తి చెప్పి తన పనిలో తాను నిమగ్నమయ్యింది.

***
తెల, తెల వారుతోంది..

దబ, దబమనే చెవులు పగిలే శబ్దా లకు.. భారతి మీద విసుక్కుంటూ లేచి తలుపు తెరిచాడు ఖాజా.

ఉన్నఫళంగా ఇద్ద రు పోలీసులు ఖాజా మీద పడి ఒడిసి పట్టు కున్నారు. చేతులకు బేడీలు తగిలించారు.
ఎదురుగా ఇనస్పెక్టర్ ఇబ్రహీంను చూసి నిర్ఘా ంత పోయాడు ఖాజా.

ఇన్నాళ్ళూ ఇబ్రహీంను బుట్ట లో వేసుకున్నాననుకునే ఖాజా సంతోషం అరసెకన్లో ఆవిరై పోయింది.

“చూడు ఖాజా నాబహెన్ (చెల్లెలు) భారతి మనఃస్త త్వం నీకింకా పూర్తిగా తెలియదు. ఆమెకు ఒక బాక్సింగ్
తప్ప మరేదీ రాదనే అపోహ పడ్డా వు. భారతి చదువులోనూ మేటి. కన్నతల్లి అవస్థ చూసి ఆసుయంత్ర
వ్యవస్థ ను కనుగొన్న మల్లేశం ఆమెకు స్ఫూర్తి.

నేటి కాలానుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకోవడంలో ఆమెకామెయే సాటి. నువ్వు డోపింగ్‌లో


దొరికి పోయినప్పటి నుండి నీపై ఒక కన్నేసి ఉంచిందన్న వాస్త వం నీకు తెలియకుండా జాగ్రత్త పడింది.

మీ వివాహమై ఒక సంవత్సరమైనా నిండకనుందే నీ నిజస్వరూపమేమిటో బయట పడింది” అన్నాడు ఇబ్రహీం.

“నేను ఏనేరమూ చెయ్య లేదు. కేవలం భారతప్రధాని తీసుకునే నిర్ణయాలు తప్పని వాదించానంతే.. నాకు
వాక్‌స్వాతంత్ర్యం లేదా.. ప్రతీ పౌరునికి తన అభిప్రా యాల్ను వ్యక్తపరిచే హక్కు వుంది. ఆ మాత్రా నికే నన్ను
అరెస్టు చేసే అధికారం నీకు లేదు” అంటూ మేకపోతు గంభీరపు వచనాలు పలికాడు ఖాజా.

“అయితే విను” అంటూ భారతి వైపు చూశాడు ఇబ్రహీం.

భారతి తన చరవాణి తెరచి స్పీకర్ ఆన్ చేసింది.

గత రాత్రి ఖాజా తన దేశపు సోదరులతో, భారత దేశం చేబడ్తు న్న సంస్కరణలకు ఎలా గండి కొట్టా లో,
కశ్మీరంలో ఎలా అల్ల కల్లో లంరేపాలో.. పన్నిన పథకాలన్నీ వివరించడం.. విని నిర్ఘా ంత పోయాడు ఖాజా.

ఇదెలా సాధ్యమయ్యింది..! అన్నట్టు గా భారతి వంక చూశాడు ఇబ్రహీం.

“ఖాజా నైపుణ్యంగా తన చరవాణి లోని మాటలు ఎవరూ పసిగట్ట కుండా చేసుకున్నాడు. అయితే దాన్ని
ఛేదించింది నా అనువర్తనం (APP)” అంది భారతి.

అర్థ ం కాలేదన్నట్లు గా చూశాడు ఇబ్రహీం. భారతి తిరిగి చెప్పసాగింది.

“ఆమధ్య మన ఉపరాష్ట ్రపతి మనదేశం గురించి చక్కని వివరణ ఇచ్చారు. దేశంలో ఉన్నది ముస్లింలా,
హిందువులా, క్రైస్త వులా కాదు.. ఒకే దేశం, ఒకే శాసనం, ఒకే చట్ట ం, ఒకేన్యాయం, ఒకే దేశం – ఒకే ప్రజ. ఒకే
ఝండా.. అదే మన ఎజెండా.
దానిని స్ఫూర్తిగా తీసుకున్నాను. కొందరు అస్మదీయులు, తస్మదీయులు మనదేశానికి ద్రో హం తలబెట్టే వారు
లేకపోలేదు. అయితే వారిని ఎలా పట్టు కోవాలా అని ఆలోచించాను మధ్య, మధ్యలో నా బి. టెక్ క్లా స్ మేట్స్
సలహాలు తీసుకుంటూ చివరికి ఒక అనువర్తనం కనుగొన్నాను. దానిని మనం అనుమానితుల చరవాణికి
అనుసంధానం చేసుకోవచ్చు. అది చాలా శక్తివంతమైనది. తద్వారా నేను దేశద్రో హుల ఆటకట్టిస్తా ను. ఎలా
అన్నది అత్యంత రహస్యం” అంటూ ఖాజావైపు తిరిగి “చూడు ఖాజా.. నాకు కండబలం, గుండెబలమే కాదు
బుధ్ధిబలం గూడా ఉంది” అంటూ వెటకరిస్తూ .. కళ్ళెగరేసింది భారతి.

“భారతీ బహెన్.. యు ఆర్ గ్రేట్ “ అంటూ ఒక కడక్ పోలీసు సలాం చేశాడు ఇబ్రహీం.*

మేనత్త . - నాగమణి తాళ్ళూరి


Object 24

నా చిన్నతనం లో ఎన్నెన్ని ఆటలు ఎంతలా ఆడేవాళ్ళమనీ.... ఆటలు తప్ప మరొకటి తెలియనట్లు , అసలు
అందుకే పుట్టి నట్లు . లేడి పిల్ల లా ఛంగు ఛంగున గంతులేస్తూ రయ్యిమంటూ పరుగెత్తు తూ.... నాకైతే కాళ్ళు
ఒక్క చోట నిలిచేవి కావు. వీధికి ఆ చివర నుండీ ఈ చివర వరకూ తూనీగ లాగా జుయ్యిమంటూ పొయ్యేదాన్ని.
నడక అనేది ఒకటుందనే గుర్తు ండేదే కాదు. పడినా లేచి దులుపుకుని మళ్ళీ పరుగెత్త డమే. సాయంకాలం
చల్ల ని నీళ్ళు పడినప్పుడు చుర్రు న మండే వరకూ గాయం అయిందని తెలిసేది కాదు. పగటి ఆటలు సరే.. రాత్రి
వేళ చల్ల ని చిరుగాలులతో సావాసం చేస్తూ వెన్నెల వెలుగుల్లో ఆడే ఆటలు మరింత మనోహరం గా ఉండేవి.
అసలు పున్నమి నాటి వెన్నెల......ఎలా ఉండేదనీ! వెండిని కరిగించి భూమిపై చిక్కగా పోసినట్లు . మెరుపులతో
జలతారు వస్త్రం నేసి భూమి ని చుట్టేసినట్లు ... తెల్ల ని తామర లను నేలంతా పరిచేసినట్లు .. ఏదో మాయ జరిగి
లోకమంతా వింత సోయగాలు పొందినట్లు ... ఏదో ఉషారు లోనుండి బయటకు తన్నుకొస్తూ ఉంటే ఆ వన్నెల
వెన్నెల సొబగుల్లో మైమరిచి పోయి వేప చెట్టు కింద ఇసుక గుట్ట లో దూదుం పుల్ల ఆడుతూ, ఒంటిని ఇసుకలో
కప్పేసుకుంటూ , గుప్పెళ్ళతో ఇసుక తీసుకుని ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆడుకుంటున్నప్పుడు ఆకలే
ఉండేది కాదు , దాహమైనా తెలిసేది కాదు. అమ్మ కన్నెర్ర జేస్తూ పిలిచేదాకా ఇల్లు గుర్తొ చ్చేదే కాదు. అలాంటి
వెన్నెల రేయి నాడు చూసానో గమ్మత్తైన దృశ్యం. "అమ్మాయ్!" అని నాన్న పిలవగానే చేతులు దులుపుకుంటూ
వెళ్ళాను. వాకిట్లో కుర్చీలో కూచుని ఉందో ఆడ మనిషి. ఆమెను "మనిషి" అనుకోలేదు నేను. పాల మీగడలో
పసుపు కలిపిన ఛాయ. గులాబీల వర్ణా న్ని సొంతం చేసుకున్న పెదవులు. ఆమె కట్టు కున్న లేత చామంతి రంగు
చీర ఆమె మేని రంగులో కలిసిపోతే గాలికి ఆమె పవిట చెంగు కొద్దిగా రెపరెప లాడుతూ ఆమెకు ఏదో
రాజసాన్ని తెచ్చి పెడుతున్నాయి. నమ్మండీ ,నమ్మకపోండి మీ ఇష్ట ం కానీ ఇన్నేళ్ళుగా నా మనసులో మాట
ఇప్పటికైనా మీకు చెప్పి తీరాలి. ఆమె చెవి దిద్దు లు , మెడ లోని నక్లెస్ లోని ల తెల్ల ని రాళ్ళపై పడిన వెన్నెల
కిరణాలు పరావర్త నం చెందుతూ జిగేల్ జిగేల్ మంటూ మెరుస్తూ ఉంటే ఆమె నా కంటికి దేవ కన్యలాగే
కనిపించింది. ఆమె అందమో లేక వెన్నెల చేసిన మాయో నాకు తెలీదు కానీ మొదటసారి ఆమెను
చూసినప్పుడు నోరు తెరుచుకుని మరీ చూస్తూ ఉండిపోయాను. "చిన్నా! కాఫీ!" అంటూ అమ్మ మర్యాదలు
చేస్తో ంది. ఆమె మా మేనత్త అంట. గొప్పింటి కోడలంట. అస్త మానూ పుట్టి ంటికి పంపరంట. "చిన్నా!" నీ
మేనకోడలు మణి" అని నాన్న నన్ను ఆమెకు పరిచయం చేసినప్పుడు పలకరింపుగా ఆమె నవ్వింది. అప్పుడు
మరింత మనోహరంగా కనిపించింది. దారి తప్పి ఏ వన దేవతో మా ఇంటికి వచ్చినట్లు గా అనిపించింది. ఆమె
ముందు నల్ల గా ఉండే మా అమ్మ మరీ తేలిపోయినట్లు ఉంది. మొదటిసారి నాకు మా అమ్మ నచ్చలేదు. ఆమె
మితభాషి. "చిన్నా చిన్నా"అంటూ నాన్న చెప్పే కబుర్లు వింటూ కూర్చుందే కానీ తనకు తానుగా ఏం
మాట్లా డలేదు.ఏం చదువుతున్నావని నన్ను పలకరించలేదు. అందగత్తెలు అలాగే ఉంటారు కాబోలు
అనుకున్నాను. ఆమె ఉన్న రెండు రోజులు నేను ఏదో మైకం కమ్మినట్లు , ఏదో మాయ నన్ను గట్టిగా చుట్టేసినట్లు
ఆమె వెంటే ఉన్నాను తన వెనకే తిరిగాను. ఆమెకు వేడి నీళ్ళు తోడింది అమ్మ. ఉడుకు అన్నంలో గుడ్డు కూర,
పెరుగు వేసి భోజనం పెట్టింది. ఎప్పటిలానే నాకు అర గుడ్డే వేసినా, నీళ్ళ మజ్జిగ పోసినా మొండికెత్తి ఏడిస్తే
బాగోదని తమాయించుకున్నాను. మూడవ రోజు అమ్మ చీరా రవికెలతో ఆమెకు బొట్టు పెట్టి సాగనంపింది. అత్త
వెళుతూ నా బుగ్గ లు పుణికింది. నా చేతిలో రూపాయి బిళ్ళ పెట్టి ంది. ఆ క్షణం నాకు అత్త తో వెళ్ళిపోవాలి
అనిపించింది. ఆ రాత్రి పడుకున్నా నిద్రపట్ట లేదు నాకు. "చిన్నా ఇప్పుడు బావుంది కదండీ , బాగా రంగు తేలింది
పిల్ల . పిల్ల ని కూడా తీసుకు వస్తే బావుండేది. పద్దు కి ఆరేళ్ళు వచ్చే ఉంటాయి.ఎప్పుడో పారాడేటప్పుడు
చూడటమే కదా! అది కూడా మీ తమ్ముడి పెళ్ళిలో. ఆ తరువాత వాళ్ళు పంపనూ లేదు , నేనూ వెళ్ళిందీ లేదు,
మధ్యమధ్యలో మీరెళ్ళడమే కదా" అమ్మ అంటోంది. అమ్మా నాన్న ఎప్పుడూ మేము నిద్ర పోయాకే
మాట్లా డుకుంటారనుకుంటా.మొన్న అన్నం తినకుండా పడుకున్న రోజు మెలకువ వస్తే ఇలాగే
మాట్లా డుకుంటున్నారు. "చిన్నా ఎందుకు వచ్చిందో తెలుసా!" అంటున్నాడు నాన్న. "చాన్నాళ్ళైంది కదా!
చూసిపోవడానికి వచ్చి ఉంటుంది" "నీ పిచ్చి గానీ మనల్ని చూసిపోవడానికి ఎందుకు వస్తు ందే! మన పేద కొంప
వాళ్ళకి నచ్చుతుందా! ఊళ్ళో ఇళ్ళ స్థ లం ఉంది కదా! ఐదు సెంట్లు . మా తమ్ముడు అమ్మి పంచుకుందాం
అంటున్నాడు కదా! అది అమ్మినప్పుడు తనకూ వాటా కావాలని అడగటానికి వచ్చింది" నాన్న కొద్దిగా
బాధపడుతున్నాడనుకుంటా, మాట వణికినట్లు గా ఉంది. "అదేంటండీ? వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి పెళ్ళి
చేసాం , మనకు తాహతు లేకపోయినా పిల్ల నలుగురిలో వెలితి అవకూడదని సారె ఘనంగా పంపాం. పురుళ్ళు
పోసాం. ఇంకా మనదగ్గ ర ఏముందని భాగం అడగమని పంపారండీ? మనకంటూ ఉన్నది ఆ కాస్త నేల.వాళ్ళకేం
తక్కువైందంట ఇప్పుడు" "మూడు భాగాలు వేయకపోతే బావ మీ ఊరుకోరు అన్నయ్యా" అంటోంది. అమ్మ ఏం
మాట్లా డలేదు. కళ్ళు తెరిచి చూసాను. దీపం వెలుగులో అమ్మ కళ్ళలో చిన్న కన్నీటి బిందువులు
కనపడుతున్నాయి.చప్పున కళ్ళు మూసుకున్నా. అమ్మ ఏడుస్తో ందా! పాపం. నాకూ ఏడుపొచ్చింది. చిన్నా
పెళ్ళికి కట్నం ఇవ్వడానికి పెళ్ళి ఖర్చులకూ మీ అమ్మ వాళ్ళు ఇచ్చిన నలభై సెంట్ల పొలం అమ్మేసాను.పెళ్ళయిన
మొదటి ఏడాది పండుగకు రేడియో కావాలని అడిగితే నా ఉంగరం అమ్మి కొన్నాను. దానికి మొదటిసారి
అబార్షన్ అయినప్పుడూ,రెండోసారి గుర్రపు వాతం కమ్మినప్పుడు ఆసుపత్రి ఖర్చులకు నీ మెడలోని గొలుసు
అమ్మేసాను. నిన్ను బోసి మెడతో నిలబెట్టేసాను. ఇంటి స్థ లం అమ్మగా వచ్చే డబ్బుతో నీకో తాడు
చేయించుదామనుకున్నాను. చిన్నాకు కూడా భాగం ఇస్తే బాకీలు కట్ట గా మనకేం మిగలదే" నాన్న మెల్లిగా
అంటున్నాడు. "సరే కానివ్వండి! చిన్నా అత్తా రింట్లో సుఖంగా ఉండటం కన్నా నాకేమీ ఎక్కువ కాదండీ..
బంగారం లేకపోతే నన్నెవరైనా కొడతారా ఏంటి? కానీ మనకూ ఓ ఆడపిల్ల ఉంది. దానికంటూ ఏమీ మిగల్లేదు
అనే బాధ. కానివ్వండి దీని రాత ఎలా ఉందో! ఇది పెరిగే నాటి కన్నా మన పరిస్థితులు బాగు పడతాయేమో!"
నా తల నిమురుతూ అంటోంది అమ్మ. "నా తల్లికే లోటు తెలియనివ్వనే! ఇది బంగారం. కట్నం కూడా
అడక్కుండా ఎగరేసుకుపోతారు నా తల్లిని. చూస్తూ ఉండు. దాని కాళ్ళ దగ్గ ర పడి ఉండే మొగుడు
దొరుకుతాడు" నాన్న నవ్వినట్లే ఉన్నాడు. ఊరుకోండి దిష్టి తగుల్తు ంది అంటోంది అమ్మ. వాళ్ళ మాటలు పూర్తిగా
అర్ధ ం కాకపోయినా అత్త కూర్చుంది మా అమ్మ త్యాగం చేసిన సింహాసనం మీద అన్నమాట. అయినా అమ్మలో
అత్త మీద కోపం లేదు. నాకెందుకో ఇప్పుడు అత్త కంటే అమ్మ అందంగా కనిపిస్తో ంది. అమ్మ మెడను
చుట్టే సుకుని బజ్జు న్నా....

విహారయాత్ర(క్రైమ్ స్టో రీ) - యు.విజయశేఖర రెడ్డి


Object 25

విశాఖలో విఖ్యాత డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ విద్యార్థినీ,విద్యార్థు లు కొందరు సంక్రా ంతి సెలవులను
సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. ఫలితంగా విశాఖపట్ట ణంలోని అరకు, దాని పరిసర ప్రా ంతాలను
చూడడానికి విహారయాత్రకు పంతొమ్మిది మంది బయలుదేరారు.

ముందుగా అరకు చేరుకుని హోటల్ మయూరిలో దిగారు. అబ్బాయిలు,అమ్మాయిలు విడివిడిగా ఇద్ద రేసి
చొప్పున ఒక్కొక్క డబుల్ బెడ్రూ ం తీసుకున్నారు. తొమ్మిది డబుల్ బెడ్రూ ంలు పద్దెనిమిది మందికి
సరిపోయాయి. మురళి సింగిల్ బెడ్రూ ం తీసుకున్నాడు.

వారం రోజులకు సరిపడా ప్రణాళికల రూపు రేఖలు దిద్దు కుని యువతరపు హద్దు లు దాటకుండా ఆనందంగా
గడపసాగారు.

రెండు రోజులు గడిచాయి.

****
ఉదయం ఎనిమిది కావస్తో ంది.

అరకు పోలీసు స్టేషన్‌‌లోకి ఇన్స్పెక్టర్ అడుగు పెడుతుండగా.. .అతడి టేబుల్ పైన ఉన్న ల్యాండ్ ఫోన్ మ్రో గింది.
అడుగుల వేగం పెంచి ఫోనెత్తా డు.
“హలో...అయాం ఇన్స్పెక్టర్ రాజీవ్” అన్నాడు.

“నమస్తే సార్! నేను హోటల్ మయూరి మేనేజర్ మేఘనాథ్‌ను మాట్లా డుతున్నాను...వైజాగ్ నుండి
విహారయాత్రకు వచ్చిన వారిలో ఒక వ్యక్తి చనిపోయాడు”

“ఆ గదిని లాక్ చేయండి.. నేను ఒక పది నిముషాల్లో అక్కడుంటాను” అన్నాడు రాజీవ్.

తన అసిస్టెంట్ మూర్తిని తీసుకుని జీప్‌లో సంఘటనా స్థ లానికి బయలుదేరాడు రాజీవ్.దారిలో రాజీవ్ సూచన
మేరకు క్లూ స్ టీమ్‌కు, అంబులెన్స్‌‌కు ఫోన్ చేశాడు మూర్తి.

పోలీసు జీప్ ఆగగానే పరుగులాంటి నడకతో వచ్చిన వ్యక్తి...”సర్..ఇందాక ఫోన్ చేసిన మేఘనాథ్‌ను.
చనిపోయింది మురళి సర్...రూమ్ నంబర్ నైన్” అంటూ దారితీశాడు. గది ముందు విద్యార్థినీ,విద్యార్థు లంతా
గుమికూడి చర్చించుకుంటున్నారు. అందరి ముఖాలలో భయాందోళన అద్ద ంపడుతోంది.

“వీరంతా ఎవరు? ముందుగా ఎవరు చూశారు? ఎప్పుడు చూశారు?” అంటూ మేఘనాథ్ పై రాజీవ్ ప్రశ్నల
వర్షం కురిపిస్తు ంటే...ఒక విద్యార్థి కలుగజేసుకుని.

“సార్! మేమంతా వైజాగ్ విఖ్యాత డిగ్రీ కాలేజీ ఫైనలియర్ విద్యార్థు లం. విహారయాత్రకు బయలుదేరాము. నా
పేరు వినయ్‌కుమార్ సర్. నిన్న అందరం అరకు వెళ్లి రాత్రికి తిరిగి వచ్చాం. ఉదయం టిఫిన్ చేద్దా మని
క్యాంటిన్‌కు బయలుదేరాం. మురళి రాక పోవడంతో అతని గదికి వెళ్ళి కాలింగ్ బెల్ నోక్కాను. కాసేపు వెయిట్
చేసి తలుపు తట్టా ను. లోపల గడియ పెట్టు కోలేదేమో..! తెరుచుకుంది. దగ్గ రికి వెళ్లి పిలిచాను. సమాధానం
రాకపోయేసరికి తట్టి లేపుదామని భుజం ముట్టు కోగానే చల్ల గా తగిలింది. చలనం లేక పోయేసరికి భయమేసి
మేనేజర్‌ను పిలిచాను” అంటూ వినయంగా రెండు చేతులు కట్టు కున్నాడు వినయ్‌కుమార్.

ఇంతలో క్లూ స్ టీం వచ్చింది. రాజీవ్ సూచనలతో క్లూ స్ టీం తమ పనిలో మునిగి పోయింది. రాజీవ్
అమ్మాయిలతో...మూర్తి అబ్బాయిలతో మమేకమై వివరాలు సేకరించసాగారు. ఇంతలో అంబులెన్స్
రావడంతో..క్లూ స్ టీం గ్రీన్ సిగ్నలివ్వగానే..మురళి శవాన్ని జాగ్రతగా అంబులెన్స్ లోకి ఎక్కించి, అరకు ప్రభుత్వ
ఆసుపత్రికి పంపించారు.

“నా అనుమతి లేనిదే ఎవరూ గదులు ఖాళీ చెయొద్ధు ” అంటూ రాజీవ్ విద్యార్థు లందరినీ హెచ్చరించాడు.
మూర్తికి మరింత సమాచారం లాగమన్నట్టు తగిన సూచనలిచ్చి స్టేషన్‌‌కు బయలుదేరాడు.

***
సాయంత్రం స్టేషన్‌కు వస్తు న్న రాజీవ్‌ను చూడగానే అంతవరకు చెట్టు కింద కూర్చొని ఏడుస్తు న్న మురళి
తల్లిదండ్రు లు చటుక్కున లేచి నిలబడ్డా రు. గుండెలు పగిలేలా ఏడ్చుకుంటూ..ఎదురు వెళ్లా రు. వాళ్ళను లోనికి
రమన్నట్టు గుగా సైగ జేస్తూ తన గదిలోకి వెళ్ళాడు రాజీవ్. రెండు చేతులా దండం పెట్టు కుంటూ రాజీవ్ వెనకాలే
వెళ్లా రు మురళి తల్లిదండ్రు లు.

“మీ అబ్బాయికి ఎవరైనా శత్రు వులున్నారా...” అంటూ ఆరాతీశాడు రాజీవ్.

“ఎవ్వరూ లేరు సార్! మాకు ఒక్కగానొక్క కొడుకు మురళి” గద్గ ద స్వరంతో అంటూ సుతారముగా నుదురు
కొట్టు కోసాగారు.

“దోషిని సాధ్యమైనంత త్వరలో పట్టు కుంటాము” అని వారిని ఓదార్చి, మురళి పార్థీవదేహం తీసుకెళ్ల డానికి
అనుమతి పత్రం ఇస్తూ ...ఆసుపత్రికి వెళ్ల మన్నాడు.
సాయంత్రం సుమారు ఆరుగంటలకల్లా పోస్ట్‌‌మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. రాజీవ్ వాటిని
చదవగానే...హంతకులను పట్టు కోగలననే ధైర్యం కలిగింది. వెంటనే మూర్తిని, మరొక లేడీ కానిస్టేబుల్‌ను
తీసుకుని హోటల్ మయూరికి బయలుదేరాడు.

నేరుగా మేనేజర్ మేఘనాథ్‌ను కలిసి గత రాత్రి సి.సి. కెమెరా రికార్డింగ్ తన సెల్ ఫోన్లో కాపీ చేసుకున్నాడు
రాజీవ్. ఆ దృశ్యాలను మూర్తి, తను చూస్తూ ...కాసేపు చర్చించుకున్నారు.పిల్ల లను ఇంటరాగేట్ ఎలా
చెయ్యాలో ప్రణాళిక రచించుకున్నారు. పథకం ప్రకారం మేఘనాథ్ కేటాయించిన గదిలోకి వెళ్లి కూర్చున్నారు.
రాజీవ్ చెప్పినట్లు ఒకరయ్యాక మరొక విద్యార్థినిని గదిలోకి పంపిస్తో ంది లేడీ కానిస్టేబుల్. రాజీవ్ ప్రశ్నల
పరంపర కొనసాగిస్తు న్నాడు. మూర్తి విధ్యార్థు ల సమాధానాలను రికార్డు చెయ్యసాగాడు.

రాజీవ్ తన సెల్ ఫోన్లో ఒక ఆగంతకుని ఫోటో నవీన్‌కూమర్‌కు చూపిస్తూ ...”ఇతను నిన్న రాత్రి నీ దగ్గ రికి
వచ్చాడు కదూ...” అంటూ రెట్టించాడు. నవీన్‌కుమార్ వణికిపోయాడు.

గాడ్ ప్రా మిస్ సర్...నా దగ్గ రకు రాలేదు” అంటూ నెత్తి మీద అరచెయ్యి పెట్టు కుని బిక్కముఖమేశాడు. అతని
పేరు ప్రదీప్,పవిత్ర బావ సర్. బహుశా ఆమెను కలిసి ఉంటాడు . పవిత్ర,చరిత ఇద్ద రు ఒకే గదిలో ఉన్నారు.
చరితకు కూడా తెలిసి ఉంటుంది సర్!” అంటూ మరి కొన్ని వివరాలు అందించాడు. ప్రదీప్ ఇంటి చిరునామా
తెలుసుకుని నవీన్‌కుమార్‌ను పంపిస్తూ ...మూర్తికి సైగ చేశాడు. వెంటనే మూర్తి స్టేషన్‌కు ఫోన్ చేసి ఆ
చిరునామా చెప్పి అర్జెంట్‌గా
‌ అతణ్ణి పట్టు కు రావాలని ఆదేశించాడు.

పవిత్రను బెదిరించగానే చరిత తాననేలా వేధించిందో చెప్పింది. సెల్ ఫోన్లో ప్రదీప్ ఫోటోను చూపిస్తూ ...ఆరా తీస్తే
అతనెవరో తెలియదని బొంకింది. రాజీవ్‌కు సీన్ సాంతం అర్థ మయ్యింది. చరితను తనదైన శైలిలో అడగగానే
మొత్త ం కథ వివరించింది. ఆమె కళ్ల వెంట ధారాళంగా కన్నీరు..జలపాతాల్లా ఎగిసి పడసాగాయి.

తృప్తిగా గాలి పీల్చుకున్నాడు రాజీవ్. పవిత్రను,చరితను లేడీ కానిస్టేబుల్ సాయంతో జీపులో ఎక్కించుకుని
స్టేషన్‌కు బయలుదేరాడు. దారిలో మూర్తి పత్రికా విలేఖరులకు సమాచారమిచ్చాడు.

స్టేషన్ చేరే సరికి ప్రదీప్ సెల్లో రెడీగా ఉన్నాడు అతణ్ణి చూసి పవిత్ర ఖంగుతింది.

మరో పావుగంటలో పత్రికా విలేఖరులతో సమావేశమై దొషులను పట్టు కున్న వివరాలను, కేసు పూర్వాపరాలను
వివరించసాగాడు రాజీవ్.

“నా సర్వీసులో హత్య కేసులెన్నో ఛేదించాను. కాని ఈ మురళి హత్య ఒక కొత్త కోణంలో జరిగింది.
విచిత్రంగానూ ఉంది” అంటూ ప్రా ంభించాడు. “మురళిది మంచి హాండ్సమ్ పర్సనాలిటీ. తను ఇలా చిటికేస్తే
చాలు ఆడవాళ్ళు అలా వలలో పడతారని అతని ప్రగాఢ విశ్వాసం. కాని పవిత్ర విషయంలో అది నిజం కాలేదు.
ఒక రోజు అతని చెంపలు వాయించింది కూడా. ఆ విషయం పెద్ద లదాకా ప్రా కింది. మురళిని అందరి ముందు
పవిత్ర పాదాలనంటి క్షమాపణలు చెప్పించారు. పవిత్ర బావ ప్రదీప్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడు” అంటూ
మూర్తిని చూసి తాను రికార్డు చేసిన సారాంశాన్ని చెప్పమన్నట్టు గా సైగ చేశాడు రాజీవ్.

మూర్తి గొంతు సవరించుకుని..”మురళి పవిత్ర మీద కక్షగట్టా డు. ఆమె క్లో జ్ ఫ్రెండ్ చరితను, మురళి వలలో
వేసుకుని..ఆమెను పావులా వాడుకున్నాడు. చరితను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి గర్భవతిని చేశాడు.
చరిత పెళ్లి గురించి మురళిపై ఒత్తిడి తీసుకురాసాగింది. అరకు విహార యాత్ర నుండి రాగానే రిజిస్ట ర్ మ్యారేజ్
చేసుకుందామని ప్రమాణం చేశాడు.

అరకు వచ్చాక తన పథకం చరితకు చెప్పి కేవలం ప్రతీకారం కోసమే అని మభ్యపెట్టా డు. అలా తాను చెయ్యక
పోతే మన పెళ్లి గురించి మర్చిపోవాల్సి ఉంటుందని బెదిరించాడు. చరిత ఒప్పుకోక తప్పలేదు. చరిత స్నానం
‌ ు పంపింది. మురళి వాటిని ఫార్వార్డ్ చేస్తూ ...’రేపు నువ్వు అదే పెద్ద ల
చేస్తు ంటే ఫోటోలు తీసి మురళి ఫోన్‌క
ముందు నన్ను ప్రేమిస్తు న్నాను అని చెప్పాలి..లేదంటే నీ దృశ్యాలన్నీ వాట్సప్‌లో సామాజిక
సంచలనాలవుతాయని మురళి మెసేజ్ పెట్టా డు. పవిత్ర, చరితను నిలదీసింది. తాను మురళి వల్ల
మోసపోయానని విషయమంతా చెప్పింది.

పవిత్ర, ప్రదీప్‌కు మెసేజ్ పెట్టింది. తాను రావడానికి కాస్త ఆలస్యమవుతుందని...మురళిని దొంగ దెబ్బ కొట్టా లని
ప్రదీప్ మెసేజ్ పెట్టా డు.

మరుసటిరోజు అరకులో వాటర్ ఫాల్స్ చూడడానికి అందరూ బయలుదేరారు.ఎవరికి వారు చుట్టు పక్కల
అందాలను వీక్షిస్తు న్నారు. అరకు పల్లె జనం పుట్ట తేనె పండ్లు అమ్ముతున్నారు కొని తినే వారు తింటున్నారు.

ఒక చోట ఒక గుడిసె ముందు పాము కాటుకు మందు ఇవ్వబడును అన్న బోర్డ్ చూసింది చరిత.పామూకాటుకు
మందు కొని పాము విషం అమ్ముతారట నాకు వైద్యంలోకి కావాలి అని అధిక మొత్త ంలో డబ్బు ఆశ చూపింది
ముసలాయనకు. డబ్బు చూడగాని ఆశ పుట్టి ఒక చిన్న సీసాలో పాము విషం ఇచ్చాడు. దానిని హ్యాండ్
బ్యాగ్‌లో భద్రంగా పెట్టు కుంది.

ఆ రోజు రాత్రి మురళి గదికి చరిత చేరుకుని నీవు చెప్పినట్లే చేశాను...అని ప్రేమతో ఎన్నో కబుర్లు చెప్పింది.
అవును మనం విజయవాడ చేరుకోగానే పెళ్లి చేసుకుందాము అని మద్యం సీసా మూతను తీశాడు.. ఉండు
నీకు ఈరోజు గ్లా సులో పోసి నేనే స్వయంగా తాగిస్తా ను అంది. ఆగు బాత్రూ ంకు వెళ్ళి వస్తా ను లేకపోతే తాగిన
మత్తు దిగిపోతుంది అన్నాడు. మురళి వెళ్ళి వచ్చేలోగా చరిత పాము విషాన్ని మందు పోసిన గ్లా సులో
కలిపింది. మురళి మంచం మీద కూర్చుని తాగుతూ మెల్ల గా వాలిపోయి... కాళ్ళూ, చేతులూ గట్టి గా
ఆడించసాగాడు... ఆ గది తలుపు ఆటోమెటిక్ లాక్ సిస్ట ం, దానివల్ల ఆన్ చేయకుండానే తోసుకుని తన గదికి
భయంతో చేరుకుంది చరిత.మురళి గది డోర్ లాక్ కాలేదు”

రాజీవ్ వెంటనే మూర్తిని ఆగమని సైగ చేస్తూ ...”చివరి అంకం నేను చెబుతాను” అంటూ
చెప్పడమారంభించాడు.చరిత విషం కలిపిన విషయం పవిత్రకు తెలియదు. అదే రాత్రి ప్రదీప్ వచ్చాడు.
పవిత్రనడిగి మురళి రూమ్ నంబరు తెలుసుకున్నాడు. మురళి పడుకున్నాడో! లేడో! పరిసరాలు స్ట డీ చేసి
వస్తా నని పవిత్రకు చెప్పి మురళి గదికి వెళ్ళాడు. తలుపు కాస్త ఓరగా తెరచి ఉన్నట్లు కనబడింది. నెమ్మదిగా
తోసుకుని లోనికి వెళ్ళాడు. అప్పటికే మురళి నోటి గుండా నూరగలు ఉన్నాయి. బాగా తాగడం మూలాన అలా
వాంతి చేసుకున్నాడనుకున్నాడు. మురళి అప్పుడు కొస ఊపిరితో ఉన్నాడు. ప్రదీప్ దిండు తీసి మురళి
ముఖంమ్మీద పెట్టి గట్టిగా నొక్కి పెట్టా డు. చనిపోయాడని నిర్ధా రణ చేసుకుని అక్కడ నుండి పారిపోయాడు.

అందుకే పోస్ట్‌‌మార్టం రిపోర్ట్స్‌లోవిషప్రయోగమూ...ఊపిరి ఆడక పోవడమూ మురళి మరణానికి


మార్గా లయ్యాయని ఉంది” అంటూ ముగించాడు ఇన్స్పెక్టర్ రాజీవ్.
ఉదార బుద్ధి (బాలల కథ) - సరికొండ శ్రీనివాసరాజు‌
Object 26

రాఘవ
10 వ
తరగతి
పరీక్షలు
పూర్తి

అయ్యాయి. వాళ్ళ అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళి 3 సంవత్సరాలు అయింది. అందుకే రాఘవ 10 వ తరగతి
పరీక్షలు, అతని చెల్లెలు స్రవంతి 8 వ తరగతి పరీక్షలు పూర్తి కాగానే కుటుంబం అంతా రాఘవ వాళ్ళ అమ్మమ్మ
ఇంటికి వెళ్ళారు. సెలవులన్నీ సరదాగా గడిపిన అనంతరం మళ్ళీ రాఘవ వాళ్ళు వాళ్ళింటికి చేరుకున్నారు.

రాఘవ వాళ్ళ ఇల్లు చాలా విశాలమైన స్థ లంలో ఉంది. సగం స్థ లంలోనే రెండంతస్థు ల భవనం కొట్ట గా, చాలా
ఖాళీ స్థ లంలో రకరకాల పూల, పండ్ల , కూరగాయల, అందమైన చెట్ల ను పెంచారు. వర్షా కాలం వచ్చింది.
నాలుగైదు వర్షా లు కూడా పడ్డా యి. ఎండాకాలంలో చాలా చెట్లు ఎండిపోగా, ఈ వర్షా లకు బాగా కలుపు
మొక్కలు పెరిగాయి. కలుపు మొక్కలన్నీ తీసెయ్యాలి. కొత్త మొక్కలను, విత్త నాలను నాటాలి. ఒక రోజంతా
పని. దానికి ఒక కూలివాని అవసరం పడింది.

రాఘవ తండ్రి మాధవయ్య సోమయ్య అనే కూలివాడిని పిలిపించాడు. సోమయ్య మాధవయ్య ఇంట్లో ఏం పని
ఉన్నా వచ్చి చేస్తూ ఉండేవాడు. దశాబ్దా నికి పైగా సోమయ్య సేవలను వినియోగించుకుంటున్నారు మాధవయ్య
కుటుంబం. సోమయ్య వచ్చాడు. రాఘవ తల్లి మంగమ్మ సోమయ్యతో ఆరోజు చేయాల్సిన పనులను గురించి
చెప్పింది. "ఒక్క రోజంతా పని. ఒక్కరోజు కూలిపని చేసినా 600 రూపాయలు వస్తా యి. కనీసం 500
రూపాయలు అయినా ఇవ్వండమ్మా!" అన్నాడు సోమయ్య. "చిన్నపనికి అంత అడుగుతారా? నీకు బాగా
పొగరు ఎక్కింది. ఓ 200 ఇస్తా ం! చేసిపో!" అన్నది మంగమ్మ. "కష్ట ం అమ్మగారూ! కనీసం 400 అయినా
ఇవ్వండి." అన్నాడు సోమయ్య. "ఆలోచిస్తా లే!" అన్నది మంగమ్మ.

సోమయ్య రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చెప్పిన పనిని పూర్తి
చేశాడు. మధ్యలో అతనికి విశ్రా ంతి లేదు. భోజనమూ లేదు. ఆరోజు ఆదివారం కాబట్టి ఇంటివద్ద నే ఉన్న
రాఘవ అక్కడే కూర్చుని సోమయ్య చేసే పనిని శ్రద్ధగా గమనిస్తు న్నాడు. రాఘవకు సోమయ్య మీద జాలి
వేసింది. పనంతా అయిపోయాక మంగమ్మ వచ్చి, సోమయ్యకు 300 రూపాయలు ఇచ్చింది. "నా కష్టా న్ని చూసి
ఇవ్వండి అమ్మగారు!" అని సోమయ్య బ్రతిమాలాడు. "ఇష్ట ం ఉంటే తీసుకో! లేకపోతే తీసుకోకు." అని
నిష్టూ రంగా మాట్లా డింది మంగమ్మ. చేసేది లేక సోమయ్య 300 తీసుకుని వెళ్ళిపోయాడు.

ఇంతలో రాఘవ పుట్టినరోజు వచ్చింది. రాఘవ అమ్మ మంగమ్మ కోరిక ప్రకారం ఇంటిల్లిపాదీ పెద్ద స్టా ర్
హోటలుకు వెళ్ళారు. ఇష్ట ం ఉన్న వంటకాలను ఆర్డర్ చేసి, తృప్తి తీరా తిన్నారు. బిల్ 2000 అయింది. సర్వర్
బిల్ తీసుకువచ్చాడు. మాధవయ్య 2000 రూపాయలు సర్వరుకు ఇచ్చాడు. అప్పుడు మంగమ్మ "ఆహారం
పదార్థా లు అన్నీ ఎంతో రుచిగా ఉన్నాయండీ! వడ్డించిన సర్వరుకు ఎంత ఇచ్చినా తక్కువే! మన అబ్బాయి
పుట్టినరోజు సంతోషంతో సర్వరుకు ఓ 300 రూపాయలు టిప్పుగా ఇవ్వండి." అన్నది. అలాగే చేశాడు
మాధవయ్య.

ఇంటికి వచ్చాక రాఘవ చాలా అసంతృప్తిగా కనిపించాడు. "అమ్మా! నీ పద్ధ తి ఏమీ బాగాలేదు. రోజంతా
రెక్కలు ముక్కలు చేసుకుని, తిండి, విశ్రా ంతి లేకుండా కష్ట పడిన సోమయ్యకు 300 రూపాయలు ఇచ్చావు.
హోటలులో సర్వరుకు తన పని చేసినందుకు యజమాని జీతం బాగానే ఇస్తా డు. కానీ అతనికి అవసరం
లేకున్నా 5 నిమిషాల పనికి అదే 300 రూపాయలు ఇచ్చావు .‌ ఇదేమి న్యాయం? శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇస్తే
మనకే పుణ్యం. పేదోడి కడుపు కొట్ట డం, ఉన్నోడికి పంచి పెట్ట డం ఇదేనా మన న్యాయం? సోమయ్య కష్టా న్ని
కళ్ళారా చూశాక అతడు నువ్వు ఇచ్చిన 300 రూపాయలు తీసుకొని వెళ్తు ంటే నీకు తెలియకుండా అతని
వద్ద కు వెళ్ళి, నా పాకెట్ మనీలోని మరో 300 రూపాయలు తీసి ఇచ్చాను." అన్నాడు రాఘవ.

చిన్న వయసులోనే వ్యక్తిత్వంలో తనను మించిన తన తనయుని చూసి, పొంగిపోయింది మంగమ్మ. తాను
చేసిన పనిని తలచుకొని సిగ్గు పడింది. పేదల పట్ల ఉదార బుద్ధిని అలవరచుకున్నారు రాఘవ తల్లిదండ్రు లు. .
నీడలోని మొక్కలు.. - గొర్తి.వాణిశ్రీనివాస్
Object 27

" ఏంటి రాజీ..! అలా వున్నావ్?భార్య రాజీవిని అడిగాడు రాఘవ. "ఏం లేదండీ!మన వాడు ప్రమోద్
విషయంలోనే కాస్త ఆందోళనగా ఉంది.వాడు హాస్ట ల్ నుంచి వచ్చిన దగ్గ రనించీ మనిషి మనలోకంలో
లేడు.నాతో సరిగ్గా మాట్లా డట్లేదు" అంది రాజీవి బాధగా. "నేనూ గమనించాను రాజీ!వాడు ముభావంగానే
ఉంటున్నాడు. వాడికేమైనా కావాలేమో అడిగి చూడు.చెప్పటానికి మొహమాట పడుతున్నాడేమో "అన్నాడు
రాఘవ. "మన దగ్గ ర మొహమాటం ఎందుకండీ.వాడు వచ్చిన దగ్గ ర్నుంచీ వాడితోనే ఉంటున్నా. అది కావాలా
ఇది కావాలా ఆంటూ అడుగుతూనే వున్నా ఏమీ చెప్పట్లేదు. నేనేది మాట్లా డినా చిరాకు పడుతున్నాడు.
మనవాడు మునపటిలా లేడని మాత్రం చెప్పగలను" అంది రాజీవి దిగాలుగా " మనం ఆత్రేయపురాన్ని,ఉమ్మడి
కుటుంబాన్ని వదిలిపెట్టి , మన బాబు చదువుకోసం,వాడికో బంగారు భవిష్యత్తు అందించాలని ఆ
ఊరినీ,అయినవాళ్ళందరికీ దూరంగా వచ్చేశాం. ఉమ్మడిలో వున్నప్పుడు పిల్ల లందరూ కలిసి ఆడుకోవడం కష్ట
సుఖాలు పంచుకోవడం సమిష్టిగా ఉంటూ లోటు లేని జీవితాన్ని గడిపారు. అందరూ కలిసి ఉండటంలో పిల్ల లు
పొందుతున్న భద్రతా భావం పట్ల మనకి సంతృప్తి వున్నా ప్రమోద్ చదువు కోసం విశాఖ రావాల్సొచ్చింది ".
"అవునండీ! మనం ఒంటరి వాళ్ళం ఐపోయామనే బాధ కొన్నాళ్ళు వున్నా, కాల క్రమేణా కొత్త స్నేహితుల
పరిచయాలతో ఆ లోటుని భర్తీ చేసుకున్నాం ప్రమోద్ మాత్రం ఆ పల్లెనీ,స్నేహితులనీ మర్చిపోలేక ఇక్కడి
పరిస్థితులకు అలవాటు పడలేక సతమవుతున్నాడేమో. మన వల్ల వాడి చదువుకు ఇబ్బంది కలగకూడదనేగా
హాస్ట ల్ ఉంచాం . ఒక్కగానొక్క కొడుకని ఎంతో గారాబంగా పెంచుకున్నాం.ఏది కావాలన్నా క్షణాల్లో సిద్ధ ం
చేస్తూ నే ఉన్నాం. ఎన్ని సౌకర్యాలు కల్పిస్తు న్నా మన ప్రమోద్ సంతోషంగా వుండట్లేదు.ఎప్పుడూ మొహంలో
ఏదో తెలియని అసంతృప్తి"అంది రాజి విచారంగా "నువ్వు కంగారు పడకు రాజీ. ప్రమోద్ ట్యూషన్ మాస్టా రు
సుందరం గారిని ఊరునించి రమ్మని కబురు చేశాను.రేపే సిటీకి వస్తు న్నారు. ప్రమోద్ మనసులోని వెలితిని
కనిపెడతారేమో చూద్దా ం సుందరం మాస్టా రంటే ప్రమోద్ కే కాదు,ఆయన దగ్గ ర చదువుకున్న పిల్ల లందరికీ
ప్రత్యేకమైన ఇష్ట ం,అంతకు మించిన గౌరవం. పిల్ల వాని మానసిక స్థితిని బట్టి, బోధనా విధానాన్ని మారుస్తూ
,సరళమైన పద్ధ తుల్లో శిక్షణ నిస్తూ ,అందరి హృదయాలలో ప్రత్యేక స్థా నాన్ని
సంపాదించుకున్నారాయన."అన్నాడు రాఘవ ఆరోజు ఆదివారం. సుందరం మాస్టా రు వచ్చారు. సాదరంగా
ఆహ్వానించారు రాఘవ దంపతులు. ఆయన వస్తూ నే ఇంటి ఆవరణ చుట్టూ తిరిగి పరిసరాలను బాగా
పరిశీలించి ఇంట్లో కి వచ్చి కూర్చున్నారు. "మాస్టా రూ! మా ప్రమోద్ ప్రవర్తనకు కారణం ఏమిటో మీరైనా
కనిపెట్ట గలరన్న నమ్మకంతో మిమ్మల్ని పిలిపించాం. వాడి సమస్య ఏమిటో మీకైనా చెపుతాడేమో. ఒక్కగానొక్క
కొడుకు ఇలా అయిపోతుంటే తట్టు కోలేక పోతున్నాం.వాడికి మీదైన పద్ధ తిలో కౌన్సిలింగ్ ఇచ్చి మామూలు
మనిషిని చేశారంటే మీ మేలు మర్చిపోలేము మాస్టా రూ "అన్నాడు రాఘవ చేతులు జోడిస్తూ . ప్రమోద్ ని హాల్
లోకి పిలిచాడు రాఘవ. సుందరం మాష్టా రికి నమస్కారం చేసాడు ప్రమోద్. "రా ప్రమోద్! ఇలా వచ్చి నా పక్కన
కూర్చో"అంది రాజీ. విసుక్కుంటూనే వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు ప్రమోద్. "నేను నీ బెడ్ మీద పెట్టి న
కొట్ట బట్ట లు వేసుకోకుండా పాత టీ షర్ట్ వేసుకున్నావే?" ఇందాక నీ రూమ్ లో పెట్టిన బూస్టు పాలు తాగావా
నాన్నా?" అంది రాజీవి. "నాకు బూస్టు వద్దు .మిల్క్ షేక్ కావాలని ముందే చెప్పానుగా మమ్మీ.నేను
తాగను."అన్నాడు ప్రమోద్ చిరాగ్గా . "ఇదండీ మాస్టా రూ వీడి వరస,మంచి మాట ఏది చెప్పినా గిట్ట టం లేదు
ఎందుకోమరి,నేనొకటి చెపితే వాడొకటి అంటాడు.నేనేది చెప్పినా వాడి మంచి కోసమే కదండీ" విచారంగా అంది
రాజీవి. సుందరం మాస్టా రికి విషయం అర్ధ మైంది . ప్రమోద్ ని దగ్గ రకు పిలిచారు. "నీకు విద్యాబుద్ధు లు నేర్పిన
ఈ మాష్టా రుకి గురుదక్షిణ ఏమిస్తా వ్ ప్రమోద్ ? అన్నారు. "మీరేదడిగినా ఇస్తా ను ,చెప్పండి మాస్టా రు" అన్నాడు
"నేను నాలుగు రోజులు మీ ఇంట్లో నే ఉంటాను. నాకు కావల్సిన పనులన్నీ నువ్వే చేసి పెడతావా. వంటతో
సహా.దానికి కావలసిన సరుకులు నువ్వే బయటనుంచి తీసుకురావాలని.చేయగలవా ప్రమోద్?"అన్నారు-
మాస్టా రు "తప్పకుండా చేస్తా ను మాస్టా రూ"అన్నాడు ప్రమోద్ ఉత్సాహంగా ఆ రాత్రి మాస్టా రు "ప్రమోద్ !నాకు
రెండు రోటీలు ,కలగలపు కూర,పటిక పంచదార వేసి మజ్జిగ చేసి తీసుకునిరా"అన్నారు ప్రమోద్ వంటగదిలోకి
మొదటిసారిగా అడుగుపెట్టా డు. తల్లి చేసిపెడితే తినడం తప్ప అసలు అవన్నీ ఏవిటో అర్ధ ం కాలేదు . రోటీలు
ఏ పిండితో చేస్తా రో కూడా తెలియదు. 'కలగలుపు'కూర అనే మాటే ఎప్పుడూ వినలేదు. చేయకపోతే మాష్టా రు
ఏమనుకుంటారో? అనుకుంటూ "అమ్మా!రోటీలు ఏ పిండితో చేస్తా రు ?"అని అడిగాడు. మాస్టా రు చెప్పినవన్నీ
నేనే స్వయంగా చేస్తా ను.నువ్వు నాకు హెల్ప్ చెయ్యవా ప్లీస్."అన్నాడు ఆమె కోరుకుంది అదే.కొడుకు తనతో
మాట్లా డుతుంటే సంతోషించింది.తనే దగ్గ రుండి అన్నీ చెప్పి చేయించింది. "భోజనం బాగుంది ప్రమోద్ "అని
మెచ్చుకున్నారు మాస్టా రు. ప్రమోద్ మాస్టా రు చెప్పినవి బయటకు వెళ్లి తేవడం తెలీదు. తండ్రి సరుకులు ఎలా
ఎక్కడినుంచి తెస్తా డో కూడా అసలు తెలీదు. "నాన్నా!నాతో షాప్ కి వచ్చి,సరుకులు కొనడానికి సహాయం
చేస్తా రా.ప్లీస్?"అని అడిగాడు. గురువుగారు ఉన్న నాలుగు రోజులూ తండ్రీ కొడుకూ బయట కలిసి తిరిగటం
తల్లితో కలిసి వంట గదిలో మాట్లా డుతూ పదార్ధా లు వండి అందరూ కలిసి తినడం వల్ల ప్రమోద్ లో మునుపటి
ఉత్సాహం మళ్లీ వచ్చింది. మాస్టా రు తన ఊరికి తిరుగు ప్రయణమయ్యారు. "మా ప్రమోద్ ని మళ్లీ మామూలు
మనిషిని చేశారు. మీ బోధలతోనాలుగు రోజుల్లో నే వాడి మనసు మార్చారు .ఇప్పుడు చాలా ఉత్సాహంగా
కనబడుతున్నాడు"అన్నారు రాఘవ,రాజీవి . "ఇందులో నేను చేసిందేమీ లేదుమ్మా.మీ ఇంట్లో కి వచ్చేటప్పుడు
మీ పెరటి చెట్ల ను చూశాను. పెద్ద చెట్ల నీడలో చిన్న మొక్కలు ఎదగలేవు. కొంత నీడ కావాలి.కొంత
వెలుతురుకావాలి. మీరే తన తోడూ నీడని తెలుసుకున్నాడు ప్రమోద్. అతనికి మీ అవసరం ఎంత మేరకో
మీకూ అర్ధ మయ్యింది అతనికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి.కష్ట ంలోనే సుఖం ఉందని స్వయంగా
తెలుసుకోనీయండి.అప్పుడు అతనిలో సహజ వికాసం కలుగుతుంది.ఇక నా అవసరం మీకు
కలగకపోవచ్చు.సెలవు"అని చెప్పి వెళ్లిపోయారు మాస్టా రు. ప్రమోద్ తల్లీ దండ్రు లు తనని ఎంతగా
ప్రేమిస్తు న్నారో,తనగురించి ఎంత తాపత్రయ పడుతున్నారో అర్ధ ం చేసుకున్నాడు.
ఙానోదయం - పద్మావతి దివాకర్ల
Object 28

సాయంకాలం సమయం ఆరుగంటలు దాటినా ఇంకా తన సీట్లో నే కూర్చొని సీరియస్‌గా ఫైల్ చూస్తూ
కూర్చున్నాడు రాంబాబు. పనిలో నిమగ్నమై తన స్నేహితుడు కుమార్ వచ్చిన సంగతి కూడా గమనించలేదు
రాంబాబు.
"ఏరా! ఆరుగంటలు దాటినా ఇంకా ఏమిటి చేస్తు న్నావురా?" అన్న కుమార్ మాటలు వినపడి ఉలిక్కిపడి
ఫైల్లో ంచి తలెత్తి చూసాడు.

"చాలా అర్జెంట్ ఫైల్‌రా! బాస్ చూడమని ఇచ్చాడు. రేపట్లో గా పూర్తవాలట. నాకు ఇంకో రెండుగంటల సమయం
పడుతుంది. నేను తర్వాత వస్తా నుగాని, నువ్వెళ్ళు." చెప్పాడు రాంబాబు.

"సాధారణంగా ప్రతీ రోజూ నీవింతేగా! సరే! నేను నీకోసం మరో రెండు గంటలు వేచి ఉండలేను, నేను
బయలుదేరతాను." అని చెప్పి బయటకు నడిచాడు కుమార్.

రాంబాబు, కుమార్ ఒకే ఆఫీసులో వేర్వేరు సెక్షన్ల లో పని చేస్తు న్నారు. ఇద్ద రూ ఉందేది ఒకే కాలనీ కావటం వల్ల
ఇద్ద రూ ఆఫీసుకి కలిసి వస్తా రు. కాని ఆఫీస్ వదిలి వెళ్ళేటప్పుడు మాత్రం కుమార్ వెళ్ళిన తర్వాత ఓ
రెండుగంటలు దాటాక గానీ రాంబాబు కదలడు. రాంబాబు తనతో వచ్చినా రాకపోయినా వెళ్ళేముందు
ఒకసారి పలకరించి వెళ్ళడం పనిగా పెట్టు కున్నాడు కుమార్. ఆ విధంగా రోజూలాగే ఈ రోజూ వచ్చాడు.

రాంబాబు చేతిలో ఉన్నపని పూర్తయ్యేసరికి తొమ్మిది దాటింది. ఆఫీసులో వాళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు.
బాస్ చిదంబరం కూడా గంట ముందే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఒక్క సెక్యూరిటి అతను మాత్రం రాంబాబు
ఎప్పుడు వెళ్తా డా, ఎప్పుడు తాళం వేస్తా నా అని ఎదురు చూస్తు న్నాడు. ఫైళ్ళన్నీ అలమరాలో సర్దేసి ఇంటికి
బయలుదేరాడు రాంబాబు.

రాంబాబు ఆ కార్యాలయంలో పద్ధ తి ప్రకారం పని చేసే ఉద్యోగి. నిజాయితీ, నిబద్ధ తకు నిలువెత్తు సాక్ష్యం
రాంబాబు. కష్ట పడి పనిచేసే ఉద్యోగి కావడంతో పై అధికారులందరూ అతనిపై పూర్తిగా ఆధారపడేవారు.
సాధారణంగా ప్రతీ ఆఫీసులోనూ ఉద్యోగుల్లో రెండురకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది కష్ట పడి పనిచేసే
వారైతే, మరికొంతమంది ఏదో సాకు చెప్పి పని ఎగ్గొ ట్ట డమో లేక మెల్ల గా పని చేసే విధానం పాటించే వాళ్ళో
ఉంటారు. కార్యాలయాలన్నీ సక్రమంగా నడవాలంటే రాంబాబులాంటి ఉద్యోగులు చాలా అవసరం. అయితే
అన్నీ చోట్లా అది సాధ్యం కాదు కదా! ఈ ఆఫీసులో రాంబాబు మినహా మహా అయితే ఇంకో ఇద్ద రో ముగ్గు రో
ఒళ్ళు వంచి పనిచేస్తా రు. రాంబాబు మాత్రం ఒంటిచేత్తో నే మొత్త ం ఆఫీసు పని చేయగల సమర్థు డు. అందుచేత
అధికార్లు రాంబాబు చేతే తమకు కావలసిన పనంతా చేయించుకుంటారు. అలాంటివాళ్ళు ప్రతీ
కార్యాలయాల్లో నూ ఒకరో, ఇద్ద రో ఉండబట్టే ఆ మాత్రం పనులైనా జరుగుతున్నాయన్నది వాస్త వం.

ఆ మరుసటిరోజు ఆఫీసుకి చేరిన తర్వాత తనకి అప్పగించిన ఫైల్ తీసుకెళ్ళి ఆఫీసరుకి ఇచ్చాడు రాంబాబు.

"రావోయ్ రాంబాబూ! నీలా సమయానికి పని పూర్తిచేసిన వాళ్ళంటే నా కెంతో ఇష్ట ం. నీ లాంటి వాళ్ళు
ఉండబట్టే ఈ ఆఫీసు నడుస్తు ందోయ్." అని రాంబాబుని పొగిడాడు చిదంబరం.

ఆ మాటలు రాంబాబులోని ఉత్సాహాన్ని పెంచాయి. రాంబాబులోని ఉత్సాహాన్ని గమనించిన చిదంబరం ఇంకో


రెండు ఫైళ్ళు అందించాడు అతనికి.

"చూడు రాంబాబు నీకు పనెక్కువ ఇస్తు న్నానని నాకు చాలా బాధగా ఉందోయ్! అయినా తప్పడంలేదు. నీలా
సరిగ్గా పని చేసే వాళ్ళెవరూ లేరు మరి! నీవు లేకపోతే మన ఆఫీసే నడవదయ్యా!" అని, "ఇదిగో ఈ రెండు
ఫైళ్ళూ కూడా అర్జెంట్‌గా మన హెడ్ ఆఫీసుకి పంపాలి. కాస్త చూడు. ఇంకెవరికీ పని రాక నీకే అప్పగించాల్సి
వస్తో ందోయ్! ఏమనుకోకు!" చెప్పాడు చిదంబరం.

"ఫర్వాలేదు సార్! మీరేం వర్రీ అవకండి. పని పూర్తిచేసే బాధ్యత నాది." చెప్పాడు రాంబాబు చిదంబరం
పొగడ్త లకి ఉబ్బిపోతూ.
ఆ ఫైళ్ళు రెండూ తీసుకొని తన సీటుకి వచ్చి పనిలో మునిగిపోయాడు రాంబాబు. ఆ రోజు కూడా సాయంకాలం
అరుగంటలైనా ఇంకా పని పూర్తవలేదు. కుమార్ మళ్ళీ ఠంచనుగా ఆ సమయానికల్లా రాంబాబు వద్ద కు
వచ్చాడు.

"ఏమిటి రాంబాబు!...ఈ రోజు కూడా నీ పని పూర్తైయేట్లు లేదనుకుంటాను." అని చెప్పాడు.

"అవునురా! ఏం చేయమంటావు? నేను కాకపోతే ఇంకెవరు చేస్తా రు చెప్పు? వచ్చేవారం మా చెల్లి పెళ్ళికి
సెలవు కావాలి, ఎలా వెళ్తా నో ఏమిటో? బాస్ సెలవు ఇస్తా డో లేదో కదా! నేను లేకపోతే అసలు పని జరగదని
అంటాడు.” చెప్పాడు రాంబాబు ఫైల్‌నుండి తలెత్త కుండానే.

రాంబాబు మాటలు విని ఫక్కున నవ్వాడు కుమార్.

"ఏమిటీ నువ్వు లేకపోతే ఆఫీస్ సాగదా! ఎవరున్నా, లేకపోయినా పని దానంతట అదే జరుగుతుంది. పనంతా
మనవల్లే జరుగుతుందని, మనం లేకపోతే పనే జరగదని భ్రమ పడతాం. అంతే! నువ్వు ఓ పదిహేను రోజులో,
నెల రోజులో సెలవుపెట్టి చూడు, అప్పుడు తెలుస్తు ంది." చెప్పాడు కుమార్.

"నేనెప్పుడూ మరీ అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోలేదు. అదీ ఓ రోజో, రెండురోజులు మాత్రమే. ఈ
సారి నాకు వారం రోజులు సెలవు కావాలి. ఆ వారం రోజులకే ఎలా అడగాలా అని మధనపడుతూ ఉంటే
ఏకంగా పదిహేను రోజులో, నెలరోజులో అంటే మాటలా! నేనన్ని రోజులు సెలవుపై వెళ్తే ఆఫీసు పని ఎలా
జరుగుతుంది?"

"ఒక రోజు సెలవు అడగటానికే నీకు మొహమ్మాటం జాస్తి. ఇన్ని రోజులు సెలవు తీసుకుంటే ఆఫీసు పని ఎలా
సాగుతుందోనని బెంగ పెట్టు కోవడం కూడా నీ అమాయకత్వానికి నిదర్శనమే మరి! బహుశా, నువ్వు సెలవులో
ఇంట్లో ఉన్నా కూడా ఆఫీసు విషయాలే ఆలోచిస్తూ ఉంటావో ఏమిటో? ఏమైనా మరీ అంత అమాయకత్వం
పనికిరాదోయ్! నువ్వు లేకపోతే పని జరగదని అనుకోవడం కూడా ఓ పెద్ద భ్రమే! పోనీ ఇంత
కష్ట పడుతున్నావని ఎప్పుడైనా పిలిచి ఓ రెండు రోజులు సెలవులో వెళ్ళు అని ఇంతవరకెవరైనా చెప్పారా?
అలాగని నేను పని ఎగ్గొ ట్ట మని నీకు సలహా ఇవ్వటం లేదు. నీ సీటు పని చూసుకో! కావాలంటే అర్జెంట్
పనులేవైనా చూడు, ఇతరులకు కావలసివచ్చినప్పుడు పనిలో సహాయపడు, అంతేకానీ మొత్త ం ఆఫీసు
పనంతా నీ భుజంపై వేసుకొని నేనే మొనగాణ్ణి అని మాత్రం అనుకోకు. దీన్ని ఆధారం చేసుకొని పనులు
ఎగ్గొ ట్టే వాళ్ళు ఎగ్గొ ట్ట గా, వాళ్ళ పని కూడా నువ్వే చేస్తు న్నావు మరి! నువ్విలా చేసినన్నాళ్ళూ మిగతా
వాళ్ళుఎవరూ పని ముట్టు కోరు కూడా! వాళ్ళని పెడదారిన పట్టించిన పాపం కూడా నీదే సుమా! అధికారులు
ఎలాగూ తమ పని పూర్తైతే చాలని అనుకుంటారు. కాస్త నిదానంగా ఆలోచిస్తే నీకే అంతా అర్ధ మవుతుంది.”
అన్నాడు కుమార్.

కుమార్ మాటలు విన్న రాంబాబుకి ముందు కోపం వచ్చింది. కుమార్ వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా
ఆలోచిస్తే అతను చెప్పిన దానిలో యదార్ధ ం ఉందని గోచరించింది. అందరూ కావలసినప్పుడు సెలవులపై
వెళ్ళగా తనొక్కొడే ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నాడు. ఎవరి పని తనకి అప్పగించినా ఎదురు చెప్పకుండా
చేయడాన్ని అలుసుగా, అవకాశంగా తీసుకుంటున్నారని అనిపించింది లోతుగా ఆలోచిస్తే. తను
అనుకుంటున్నట్లు తను లేకపోతే ఆఫీసు పని సాగదా! మరి తనకి బదిలీ అయి వెళ్ళిపోతేనో? కుమార్
చెప్పినట్లు తను కొద్ది రోజులు సెలవు పెడితేనో? ఎలాగూ చెల్లెలు పెళ్ళి కూడా ఉంది. తండ్రికి సహాయపడినట్లూ
ఉంటుంది కూడా అనుకొని అది ఆచరణలో పెట్టా లని భావించాడు రాంబాబు.

ఆ రోజు ఆఫీస్ వదిలేటప్పుడు బాస్ రూముకి వెళ్ళాడు రాంబాబు. తలెత్తి రాంబాబుని చూసి, "ఏమిటి
రాంబాబూ! ఏమిటి సంగతి?" అని అడిగాడు చిదంబరం.
"సార్! మా చెల్లిపెళ్ళి ఉంది సార్! నాకో వారం రోజులు సెలవు కావాలి." అడగలేక అడిగాడు రాంబాబు.

రాంబాబు మాట విన్న చిదంబరం వినకూడదనిది వినట్లు తుళ్ళిపడ్డా డు.

"ఏమిటీ? ఏకంగా వారం రోజులు సెలవు కావాలా? నో! నో! నువ్వు కూడా అందరిలాగా అన్నేసి రోజులు
ఉండిపోతే మన ఆఫీసు ఏమికాను? నీమీదే పూర్తిగా ఈ ఆఫీసు ఆధారపడి ఉంది. నువ్వు లేకపోతే ఈ ఆఫీస్
ఎలా నడుస్తు ంది చెప్పు? చెల్లెలు పెళ్ళి కాబట్టే ఓ రెండు మూడు రోజులు సెలవు పెట్టు . ఇస్తా ను." అన్నాడు.

ఈసారి చిదంబరం పొగడ్త లకి రాంబాబు పొంగిపోలేదు. కుమార్ మాటలే గుర్తు కి రాసాగాయి. కుమార్ సలహా
కూడా గుర్తు కు వచ్చింది. చేసేదిలేక అలాగేనన్నట్లు ఓ మూడు రోజులకి సెలవు చీటీ ఇచ్చి బాస్ చాంబర్‌నుండి
బయటపడ్డా డు రాంబాబు.

రెండు రోజుల తర్వాత సెలవుపై రాంబాబు ఇంటికి వెళ్ళాడేకాని, ప్రతీక్షణం ఆఫీసే గుర్తు కు రాసాగింది. తను
లేకపోవడంవల్ల తన బాస్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో, తన సహద్యోగులు ఎంత ఇక్కట్లు పాలవుతున్నారో
అన్న ఆలోచనలతోనే సతమతమవసాగాడు. అయితే పెళ్ళి పనుల్లో తలదూర్చి అందులో బిజీ అయిపోయిన
తర్వాత ఆఫీసు గురించి ఆలోచించడం తాత్కాలికంగా మానేసాడు. ఆఫీసు నుండి మధ్యమధ్య ఫోన్లు మాత్రం
వస్తు న్నాయి, వాటికి సమాధానాలు చెప్తూ నే ఉన్నాడు.

కుమార్ సలహా అనుసరించి వారం రోజులు సెలవు పొడిగించాడు రాంబాబు తనకు ఒంట్లో బాగులేదన్న సాకు
చూపి. అప్పటికీ చిదంబరం ఫోన్ చేసాడు, "ఏంటి రాంబాబూ! చెల్లెలి పెళ్ళి అవగానే నువ్వు
వస్తా వనుకున్నాను. ఒంట్లో ఎలాగుంది? నయమవగానే వెంటనే వస్తా వు కదూ?" అని చిదంబరం ఆదుర్దా గా
అడిగినా, అతని ఆదుర్దా అంతా పని గురించేనని, తన గురించి కానే కాదని అతని మాట్లా డే తీరులోనే
గోచరించింది రాంబాబుకి. కుమార్ చెప్పిన మాటలు నిజమని అప్పుడు అనిపించింది రాంబాబుకి.

"సార్! పెళ్ళి పనుల్లో ఉండగా వైరల్ ఫీవర్ వచ్చింది సార్! వారం రోజులు సెలవు అడిగాను, కానీ ఇంకా
ఎక్కువరోజులు పట్ట వచ్చు సార్!" చెప్పాడు రాంబాబు తడబడుతూ. ఎప్పుడూ అబద్ధ ం ఆడని రాంబాబు
అబద్ధ ం ఆడవలసి వచ్చింది. అయితే పెళ్ళి పనుల్లో అలసిపోయి ఉండటంవల్ల రాంబాబు గొంతు నీరసంగానే
ఉంది. అందుకే చిదంబరంకి డౌటేమీ రాలేదు.

"రాంబాబూ, నువ్వు త్వరగా కోలుకొని ఆఫీసుకి రావాలి." అన్నాడు చిదంబరం ఫోన్ పెట్టేస్తూ .

రాంబాబు మీద అమితమైన నమ్మకంగల చిదంబరం ఏమాత్రం అనుమానించలేదు. వారం రోజులు పూర్తవగానే
ఇంకా తనకి నయం కాలేదంటూ మరో వారం రోజులు పొడిగించాడు సెలవుని. రాంబాబు మీద సానుభూతితో
మళ్ళీ ఆ సెలవు మంజూరు చేసాడు చిదంబరం, మధ్యమధ్య అతని ఆరోగ్య పరిస్థితి కనుక్కుంటూ. చెల్లెలి
పెళ్ళై అత్త వారింటికి దిగబెట్టిన తర్వాత కూడా సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్న రాంబాబుని చూసి అతని
తల్లితండ్రు లు ఆశ్చర్యపోయారు. వాళ్ళెప్పుడు కొడుకు ఇంటికివచ్చినా రాంబాబు ఒకంతట వాళ్ళకి కనపడడు.
ఆదివారాలు కూడా ఆఫీసరు ఏదో అత్యవసరమైన పని అప్పచెప్పారంటూ ఆఫీసుకి వెళ్ళిపోయేవాడు.
రాంబాబుకి ఉద్యోగంలో ఇబ్బంది ఏమైనా వచ్చిందేమోనని అనుమానపడ్డా డు అతని తండ్రి చలపతిరావు.
సరిగ్గా అలాంటి సందేహమే వచ్చింది రాంబాబు తల్లి అన్నపూర్ణమ్మకి కూడా.

రాంబాబు ధ్యాస మళ్ళీ ఆఫీసు మీదకు మళ్ళింది. తను లేకపోవడంవల్ల పనెంత పెండింగ్ పడి ఉంటుందో
ఊహించుకోసాగాడు. ఎలాగూ సెలవు నుండి తిరిగి వెళ్ళినతర్వాత మళ్ళీ ఆ పనంతా తనే చేసుకోవాలికదా
అన్న భావన కూడా కలిగింది. ఇక ఎంత వేగం వెళ్ళి ఆఫీసు పనిలో పడతానా అని అనికోసాగాడు.
"ఏమండీ! మనవాడికి ఆఫీసులో గొడవలేమైనా అయ్యాయో ఏమో నాకు భయంగా ఉందండీ. ఆఫీసు
మాటెత్త డే!" అందామె ఆదుర్దా గా.

"ఏమో నాకూ అనుమానంగా ఉంది. అమ్మాయి శ్రీదేవి పెళ్ళై పదిహేను రోజులైందా, వీడికిక్కడ ఇంకేం పనులు
లేవు కదా! మనం సెలవు రోజుల్లో రమన్నా ఊరికి రానివాడు ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఉండిపోయాడో
అంతుబట్ట డం లేదు. వాడి స్నేహితులనెవరినైనా అడగాలి." చెప్పాడు చలపతిరావు. ఇలా వాళ్ళిద్ద రూ
మల్లా గుల్లా లు పడుతున్నారు. కొడుకుని అడగాలంటే ఎలా అడగాలో తెలియడం లేదు. చివరికి రాంబాబు
స్నేహితుల ఫోన్ నంబర్లు సేకరించారు. ఇంకా ఆ మరుసటి రోజు ఫోన్ చేయాలని అనుకుంటూండగానే, ఇన్ని
రోజులు పనిపాటా లేక బాగా విసిగిపోయిన రాంబాబు తన బ్యాగ్ సర్దు కోవడం చూసారు వాళ్ళిద్ద రూ.

రాంబాబు స్నేహితునికి ఫోన్ చేయబోయిన చలపతిరావు విరమించుకొని, "ఏమిట్రా ! అప్పుడే వెళ్ళిపోతావా!


మరో వారం రోజులు ఉండకూడదూ?" అన్నాడు కొడుకు ఏమంటాడో అని తెలుసుకోవాలన్న ఉత్సుకతతో.

"లేదు నాన్నా! ఇప్పటికే నేను వచ్చి చాలా రోజులైంది. మా బాస్ రోజూ రమ్మని పిలుస్తు న్నాడు. అక్కడ చాలా
పని పెండింగ్‌లో ఉంటుంది నాన్నా! ఇవాళ రాత్రి బస్సుకే నేను బయలుదేరతాను." చెప్పాడు రాంబాబు.

అన్నట్లు గానే రాత్రి బస్‌లో ప్రయాణం చేసి తెల్లా రేసరికి తను ఉద్యోగం చేసే ఊరు చేరాడు రాంబాబు.
ఇన్నాళ్ళూ తను సెలవులో ఉండటంవల్ల ఆఫీసు పని ఎంత పేరుకుపోయి ఉందోనన్న బెంగ ఒకవైపు ఉంది.
ఇంతకమునుపు ఒకటిరెండు రోజులు సెలవు తీసుకున్నప్పుడే తన సీటు పని ఎవరూ ముట్టు కోక తనకోసం
అలాగే అట్టి పెట్టి ఉంచారు. అంతేకాక, ఇతరులు సెలవుపెట్టి వెళ్ళినా వాళ్ళపని కూడా తనపైనే పడేది. 'ఇది
అతని పని, ఇది నా పని ' అని కాకుండా ప్రతీదీ ఆఫీసుకి సంబంధించే పనే కదా అని ఏది తనకి అప్పచెప్పినా
త్రికరణశుద్ధిగా పూర్తి చేసేవాడు. మరి ఇప్పుడు తను ఇన్ని రోజులు సెలవు పెట్ట డం వల్ల తన పనే కాక ఇంకా
ఇతర అత్యవసర పనులు ఎన్ని తన కోసం ఎదురు చూస్తు న్నాయో అని కలవరం కూడా కలిగింది రాంబాబుకి.

సెలవు మరో వారం రోజులు పొడిగించినా మధ్యలోనే హఠాత్తు గా ఊడిపడ్డ రాంబాబుని పలకరించి, అతని
ఆరోగ్యం గురించి వాకబు చేసారు తోటి సహోద్యోగులు. వాళ్ళతో మాట్లా డి ఆ తర్వాత ఆఫీసరుని కలిసాడు.

"రా రాంబాబూ! ఎలా ఉన్నావు? ఒంట్లో బాగుందా? ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడిందా?" అని పలకరించాడు
చిదంబరం.

"ఆఁ...సార్! ఇప్పుడు బాగానే ఉన్నాను." అని జవాబిచ్చి తన సీటువద్ద కు వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు
రాంబాబు.

రాంబాబు టేబులుపై ఫైళ్ళు ఏమీ లేవు. తను ఇప్పుడే వచ్చాడు కదా, ఇక అరగంటలోపు ఫైళ్ళు కుప్పలు
తెప్పలుగా వచ్చిపడవా అని వాటి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.

గంటసేపు గడిచినా తన సీటుకు సంబంధించిన ఒకటో రెండో ఫైళ్ళేగానీ ఇంకేవీ రాలేదు. అది చూసి
ఆశ్చర్యపడిపోయాడు రాంబాబు. తను లేనప్పుడు పెండింగ్ లేకుండా పనంతా ఎలా పూర్తైందని విస్మయం
చెందాడు. అంతేకాక ఇప్పుడు సహోద్యోగులందరూ అటూ ఇటూ తిరగకుండా తమ సీట్లో నే కుదురుగా
కూర్చొని పని చేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంత మార్పు ఈ కొద్ది రోజుల్లో ఎలా సంభవమైందో
రాంబాబు ఊహకి అందలేదు. తను లేకపోతే ఆఫీసులో పనే జరగదని భావించాడు ఇంతవరకూ కానీ, ఇప్పుడు
తను లేకపోయినా పని జరుగుతోంది.
సాయంకాలం ఆరులోపునే యధావిధిగా కుమార్ రాంబాబు వద్ద కు వచ్చాడు. ఎప్పుడూ ఏదో ఫైల్ పట్టు కొని
సీరియస్‌గా పనిలో మునిగితేలే రాంబాబు ఖాళీగా కనిపించాడు. అలా రాంబాబుని ఖాళీగా చూడటం ఇదే
ప్రథమం కుమార్‌కి.

"చూసావా రాంబాబూ!...నువ్వు లేకపోయినా ఆఫీస్ పని ఆగదు. ఇప్పటికైనా గ్రహించావా? వెనకటికి ఒక


ముసలమ్మ పెంచుకున్న కోడిపుంజు తను కూయకపోతే తెల్ల వారదనుకున్నది నీలాగే. ఎవరున్నా, ఎవరు
లేకపోయినా ఎలాగోలా పని జరిగే తీరుతుంది. మనం లేకపోతే పనే జరగదన్నది మన భ్రమ మాత్రమే."
చెప్పాడు కుమార్.

"నువ్వన్నది నిజమే. అయితే నేనున్నన్నాళ్ళూ పనంతా నా మీదనే వేసిన వాళ్ళు ఇప్పుడు ఇంత హఠాత్తు గా
బుద్ధిమంతులయ్యారు ఎలా? నా చేతనే బాస్ పూర్తి పనంతా చేయించుకునేవాడు కదా?" ఇంకా సందేహం
తీరని రాంబాబు అడిగాడు.

"అదా!...చూడు రాంబాబూ! మన పై అధికార్లకి ఎలాగైనా పని జరగడం అన్నది కావాలి, అది ఎవరి వల్ల
అయింది అన్నది అప్రస్తు తం. నీలాంటి వాళ్ళతో ఏ గొడవా లేకుండా శాంతియుతంగా జరిపించుకోవచ్చు.
అందుకే అందరూ నీ చేతే పని చేయించుకునేవారు. పని చేయనివాళ్ళూ, రాజకీయంగా అండదండలున్నవారు,
యూనియన్ల తో సంబంధంగలవాళ్ళూ, ఇతరత్రా ప్రభావితం చేయగలవారితో అనవసరంగా గొడవ
పడటమెందుకని వాళ్ళ జోలికి సాధారణంగా వెళ్ళరు. అయితే ఈ సారి నువ్వు ఏకంగా పదిహేను
రోజులకుపైగా సెలవులో ఉండటంవల్ల వాళ్ళచేత పని చేయించక తప్పింది కాదు మీ బాస్ చిదంబరానికి. సామ,
దాన, భేద, దండోపాయలు ఉపయోగించాడు. మొదట్లో వాళ్ళు నానా గొడవ చేసారు కూడా. అయితే బాస్ వద్ద
బ్రహ్మాస్త్రం కూడా ఉంది కదా! అదే మెమోలు, చార్జిషీట్లూ వైగైరాలూ. దెబ్బకి దయ్యం జడుస్తు ంది మరి! అంతే
అందరూ దారిలోకి వచ్చారు." అన్నాడు కుమార్.

కుమార్ చెప్పినదంతా ఆసక్తిగా, ఆశ్చర్యంగా విన్నాడు రాంబాబు. రాంబాబుకి ఇప్పుడు పూర్తిగా ఙానోదయం
అయింది.

"ఇంకో విషయం! అసలు తప్పంతా నీదే! పనంతా నువ్వే కల్పించుకొని చెయ్యడంవల్ల వాళ్ళకి పని ఎగ్గొ ట్ట డానికి
అవకాశం దొరికింది. పని నేర్చుకోవడంలో కూడా ఆలసత్వం చూపారు. ఇప్పుడేమో తెలియని పనులు కూడా
కష్ట పడి నేర్చుకొని మరీ చేస్తు న్నారు. మీ సెక్షన్లో జరుగుతున్నదంతా నేను గమనిస్తూ నే ఉన్నాను. ఒక్క మీ
సెక్షన్లో నే కాదు, ప్రతీ ఆఫీసులో జరిగేదిదే! పోనీ, ఇప్పటికైనా నీకు అవగతం అయింది కదా!" చెప్పాడు కుమార్.

"బాగానే తెలిసిందిరా. ఇవాళ నా పనంతా అయిదున్నర అయ్యేసరికే పూర్తైంది. ఇక వెళ్దా మా!" అన్నాడు
రాంబాబు లేస్తూ .

కుమార్ కూడా లేచాడు. ఇద్ద రూ అదే మొదటిసారి ఆఫీసునుండి కలసి బయటపడటం.

-పద్మావతి దివాకర్ల
కళాకారులు - సుస్మితా రమణమూర్తి
Object 29

ఎయిర్ పోర్టు లోంచి


బయటకు వచ్చేసరికి మా
అబ్బాయి, కోడలు,
మనవడు చేతులు
ఊపుతూ కనిపించారు.
మమ్మల్ని చూడ్డ ంతో వారి
ముఖాల్లో ఆనందం చోటు
చేసుకుంది. “ ప్రయాణం
బాగా సాగిందా
డాడీ?...మమ్మీ!..
ఇబ్బందేమీ పడలేదు
కదా?” మా అబ్బాయి
ఆప్యాయంగా అడిగాడు.
“ మిమ్మల్ని చూసి చాలా
కాలం అయింది.
బాగున్నారా?” మా కోడలి
పలకరింపు. “
తాతయ్యా! నాన్నమ్మా!”
అంటూ మనవడు
మమ్మల్ని కౌగలించు
కున్నాడు. కారు మెత్త గా
సాగిపోతోంది. “ ఎంత
దూరంరా ఇల్లు ?” “
పాతిక కిలోమీటర్లు
ఉంటుంది. ముప్పావు
గంటలో వెళ్ళి పోతాం.” “
మన విజయవాడలో ఎండలు దంచేస్తు న్నాయ్. ఇక్కడేఁవిట్రా ఎండ కాస్తు న్నా,ఇంత చల్ల గా ఉందేఁవిటి !?”
మావాడు నవ్వుతూ చెబుతున్నాడు. “ ఇక్కడ వాతావరణం ఇలానే ఉంటుంది. మాకిప్పుడు ఎండాకాలం
ప్రా రంభం అయింది. ఇక్కడ ఎండ కాస్తు న్నా చలిగానే ఉంటుంది. “ ‘ దేశం మారితే, వాతావరణంలో ఇంత
మార్పా!?...’ “ ఇంటికి దగ్గ రగా వచ్చేస్తు న్నాం…అటువేపు చూడండి. కుడివేపు పెద్ద పార్కు, దానికి దగ్గ రలోనే ఓ
చర్చ్ కనిపిస్తా యి. ఇక్కడ క్రైస్త వులు ఎక్కువ. రేపు ఆదివారం ఆ చర్చికి, పార్కుకి వెళ్దా ం. “ రేపటి కార్యక్రమం
గురించి మావాడి ప్రణాళిక. ఇంటికి చేరుకున్నాం. “ ప్రయాణం చేసి వచ్చారు.విశ్రా ంతి తీసుకోండి. “ పక్క గది
చూపించింది కోడలు. మరుసటి రోజు పది గంటలకు ఆ పార్కుకి వెళ్లా ం. బయల్దేరే ముందు మావాడు, అక్కడి
అడ్రస్, ఫోన్ నెంబర్లు రాసిన కాగితంతో బాటు, రెండు వందల యూరోలు ఇచ్చి—” మీ దగ్గ ర ఉంచుకోండి. మన
రూపాయలు ఇక్కడ చెల్ల వు. ఏదైనా కొనాలంటే ఈ డబ్బు పని చేస్తు ంది.” అని చెప్పాడు. విశాలమైన ఆ
పార్కులో నేలంతా పచ్చని తివాచీ పరిచినట్లు ంది.ఎటు చూసినా రకరకాల పూల మొక్కలు. పార్కు చుట్టూ
పెద్ద పెద్ద చెట్లు . పార్కు మధ్యలో అక్కడక్కడ కూర్చోడానికి బెంచీలు . కాఫీ,టీ,బిస్కెట్లు , ఐస్క్రీం షాపులు
ఉన్నాయి. పిల్ల ల ఆట పాటలతో చాలా సందడిగా ఉంది అక్కడ. మావాడు ఐస్క్రీంలు తెచ్చిచ్చాడు. ప్రక్కనున్న
బెంచీల మీద కూర్చున్నాం. “ తాతయ్యా!...అటు చూడండి. గోల్డెన్ మేన్ ” ఆవేపు చూసాం. ఒళ్ళంతా
బంగారపు రంగు పూత. బొమ్మలా కదలకుండా కూర్చుని ఉన్నాడు ఓమనిషి. అప్పుడప్పుడు కనురెప్పలు
కదులు తున్నాయి. శరీరంలో కదలిక లేదు. అలా ఎప్పటి నుంచి కూర్చుని ఉన్నాడో!?... కాళ్ళ ముందు తెరచి
ఉన్న ఎయిర్ బేగుంది. పిల్ల లు గోల్డెన్ మేన్!...అంటూ తన చుట్టూ తిరుగుతున్నారు. మాకది వింతలా
అనిపించింది. కొందరు ఫోటోలు తీసుకుంటున్నారు. బేగులో డబ్బులు వేస్తు న్నారు. ఆ మనిషికి ఫోటో తీసి
బెంచీపై కూర్చున్నాను. “ డాడీ!...అలా ఫోటో తీసుకుని వచ్చేయ కూడదు. మనకు తోచినంత బేగులో వేయాలి.
“ మావాడి మాటలకు నవ్వుకున్నాను. అక్కడికి మరికొంత దూరంలో స్పైడర్ మేన్ బట్ట లు వేసుకుని గెంతులు
వేస్తు న్న మనిషి అందరినీ ఆకర్షిస్తు న్నాడు. ఇంకో చోట మాసిన బట్ట లతో, ముఖానికి మసి పులుముకుని,
చేతిలో పెద్ద వెదురు కర్రకి కట్టిన చీపురుతో నేల తుడుస్తు న్నట్లు కదలకుండా నిల్చొని ఉన్నాడొక మనిషి.
ఇలాంటి దృశ్యాలకు ఇక్కడి వారు అలవాటు పడినట్లు న్నారు.చూసి ఆనందిస్తు న్నారు. వివిధ భంగిమలలో
ఫోటోలు తీసుకుంటున్నారు. వారి ముందున్న బేగుల్లో డబ్బులు వేస్తు న్నారు. ‘ వీళ్ళు బెగ్గ ర్లన్న మాట!?...’
స్వగతంలా అనుకున్నా మావాడు నా మాటలు విన్నాడు. “ అలా అనకూడదు డాడీ!...నటులు, నాట్యకారులు,
చిత్రకారులు, సంగీత విద్వాంసులు, గాయకులు, కవులు, రచయితలు….ఇలా ఎంతోమందిని మనకు తెలుసు.
కళకు అనంత రూపాలు. వీళ్ళది కూడా ఓ కళా రూపమే!...వేష ధారణలో ఎన్ని గంటలైనా అలా ఉండగలగడం
ఈ కళాకారుల ప్రత్యేకత!. కదలరు. మెదలరు. తమ కళను అలా ప్రదర్శిస్తు ంటారు. ఈ కళాకారులలో ఎక్కువ
మంది విదేశీయులే. ఇక్కడ చదువు కుంటున్న విద్యా ర్ధు లు. సెలవు రోజుల్లో వారలా తమ కళను
ప్రదర్శిస్తు ంటారు….. “ అదుగో అటు చూడండి. అక్కడ జనం మధ్యలో సంగీత కళాశాల విద్యార్థు లు, వివిధ
వాయిద్య పరికరాలతో తాము నేర్చు కుంటున్న కళను అలా అందరిలో ప్రా క్టీసు చేస్తు ంటారు. “ ఆవేపు చూసాం
మేము. “ వారలా ప్రా క్టీస్ చేస్తు ండటం వలన. వారికి ఎంత మందిలో అయినా తమ కళను ధైర్యంగా ప్రదర్శించ
గల నైపుణ్యం వస్తు ంది. జనంతో నిండిన ఇలాంటి పార్కులు,ప్రా ర్ధనా మందిర పరిసరాలు వారికి ప్రా క్టీసు
చేసుకోవడానికి మంచి వేదికలు.” మావాడు అలా చెబుతుంటే మవునంగా వింటున్నాం. “సందర్శకులను
ఆకట్టు కోవడానికి,అలరించడానికి వారలా తమ కళను ప్రదర్శిస్తు ంటారు. మనకు నచ్చితే డబ్బులు వేస్తా ం. మన
చిరు ఆర్థిక సహాయం వారి చదువుకి ఉపయోగ పడుతుంది. ఎవరినీ అడగరు. ఇస్తే పుచ్చుకుంటారు.” “
అవునవును. వాళ్ళు ఎవరినీ ఏమీ అడగటం లేదు. అవున్రా వీళ్ళదీ ఓ రకం కళే!...వీళ్ళూ కళాకారులే!..” నా
మాటలకు మావాడు నవ్వుతూ తలూపాడు. పార్కులో చాలా దూరం నడిచాం. దగ్గ రలో ఉన్న చర్చ్ దగ్గ రకు
వెళ్ళాం. విశాలమైన ఆవరణలో ఉంది ఆ చర్చి. చర్చి లోపలికి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కాలి . అలసటగా
ఉంది. కాళ్ళు పీకుతున్నాయి. “ ఇక నడవడం కష్ట ంరా!...” అంటూ ప్రక్కనున్న బెంచీపై కూర్చుండి పోయాను. “
కాస్త ఓపిక చేసుకుని రండి డాడీ!...చర్చి లోపల చాలా బాగుంటుంది.” మావాడి మాటలు వినే పరిస్థితిలో లేను
నేను. “ మీరు వెళ్ళండి “ ఆయాస పడుతూ చెప్పాను. “ సరే తాతా!...ఇక్కడే కూర్చో, ఎక్కడికీ వెళ్ళకు. ముఖం
మీద ఎండ పడకుండా ఉంటుంది , ఈ టోపీ పెట్టు కో! “ అంటూ మావాడి టోపీ తీసి నా తలపై పెట్టా డు
మనవడు. అలసిన శరీరంకి విశ్రా ంతి దొరికింది. కళ్ళు మూసుకుని కూర్చునే నిద్ర పోయాను. ఎంత సేపు నిద్ర
పోయానో తెలియదు. ప్రక్కన ఏదో పడిన శబ్ద ం వినిపించింది. కళ్ళు విప్పి చూసాను. నా చుట్టూ పిల్ల లు,పెద్ద లు
గుమికూడి ఉన్నారు. కెమేరాల్లో నన్ను అందరూ బందిస్తు న్నారు. కదలక మెదలక అలా బెంచీపై నిద్ర
పోతుండటంతో బహుశా నన్ను కూడా అంతా, వేషధారినని ఆనుకున్నారేమో !?... క్రింద పడిన టోపీ తీసాను.
నేను లేవడంతో అందరూ చేతులు ఊపుతూ వెళ్ళి పోయారు. టోపీ బరువుగా ఉంది. అందులో చిల్ల ర
నాణాలు, కొన్ని నోట్లు కనిపించాయి. పరిస్థితి అర్ధ ం అయింది. నాలో నేనే నవ్వుకున్నాను. ‘ ఇక్కడి వారు
కళారాధకులు. ‘ స్వగతంలా అనుకుంటూ ఆ డబ్బులు జేబులో వేసుకున్నాను. ఇంతలో మావాళ్లు వచ్చారు. “
ఏం డాడీ!...అలసట తీరిందా?...ఇంకాసేపు రెస్ట్ తీసుకుంటారా?...” “ ఇప్పుడు ఫరవాలేదు. బడలిక తీరింది.
పదండి వెళ్దా ం. “ చర్చికి ఎదురుగా ఓ యువతి గిటార్ వాయిస్తూ ఏసుక్రీస్తు పాటలు పాడుతోంది. ఆమె
ముందున్న బేగులో చిల్ల ర నాణాలు వేసి, చర్చ్ వేపు తిరిగి నమస్కారం చేసాను. మళ్ళీ పార్కులోకి వెళ్ళాం. ఆ
స్పైడర్ మేన్ బేగులో, గోల్డెన్ మేన్ బేగులో, చీపురుతో నేల తుడుస్తు న్నట్లు కదలకుండా ఉన్న వాడి బేగులో
మిగతా డబ్బులు వేసి తృప్తిగా నవ్వుకున్నాను. “ మీ దగ్గ ర చిల్ల ర డబ్బులు ఎక్కడివి డాడీ!?.... యూరోలు
మార్చేశారా?...” ఆశ్చర్యంగా అడిగాడు మావాడు. జరగింది వివరంగా చెప్పాను. “ అంటే!?...ఇక్కడి వారు
మిమ్మల్ని కూడా…” నవ్వుతూ ఆశ్చర్యపోయాడు మావాడు. “ అవును. నాలోని కళాకారుణ్ణి ఇక్కడి వారు
గుర్తించారు. తోచిన సహాయం చేసారు.సాటి కళాకారులకు ఆ డబ్బులతో నా వంతు సహాయం చేసి, వారిని
గౌరవించాను. కళాకారులను ప్రో త్సహించాలి. ఆదరించాలి. ఆదుకోవాలి. మర్యాద పూర్వకంగా చూడాలి. “ ”
అవునవును. చక్కగా చెప్పారు. మీ కళాకారులందరికీ మా అందరి కళాభివందనాలు. “ అంటూ మావాళ్లు
నవ్వుకున్నారు.

దైవం మానస రుపెయే.... - ఎ. అశోక్ కుమార్


Object 30

ఏమోయ్ ఈరోజు ఏంటి కూర అని


కొంటెగా అడిగాడు శివయ్య .ఆ గన్నేరు
పప్పు అని కోపంగా చెప్పింది పార్వతి.
అయినా నా పిచ్చి గానీ నీ చేతితో ఏం
వండిన పాయసం లాగా ఉంటుంది
అని చిలిపిగా బదులిచ్చాడు శివయ్య.
ఉంటుంది ఉంటుంది అయినా నా
కోపం కరివేపాకు లాంటిది మీకు
ఊరకనే తీసి పారేస్తా రు అని విసుగ్గా
అంటుంది పార్వతి .నాకు తెలియదా
పార్వతి నీ కోపం హిమాలయాలలో
మంచు లాంటిది కొంచెం ఎండ తగిలితే
కరిగిపోతుంది అని తనని దగ్గ రగా
తీసుకుని ముద్దు గా చెప్తా డు శివయ్య
.అంతేలే నేను కన్నీరులా కరగడం
తప్పా నా మాటలకి మీరెప్పుడూ
కరుగుతారు ఓట్టి బండ రాయి మనిషి
అని బదులిస్తు ంది పార్వతి. అయినా
ఇప్పుడు ఏమయింది నిన్న పొలం
నుండి వస్తు ంటే తన భార్య ప్రసవానికి
టైం అయింది చేతిలో రూపాయి
లేదయ్యా ఇప్పుడు మా ఇంటి దాన్ని ఎట్టా ఆసుపత్రికి తీసుకెళ్లా లి?? బయటికి వస్తా ను అన్నా నా బిడ్డ ని ఈ
భూమి మీదకి ఎట్టా తీసుకురావాలి ??అని అమాయకంగా అడిగిన నరసయ్య కు నా దగ్గ ర ఉన్న ఆ కవులు
డబ్బులు 10000 ఇచ్చాను .సాయం చేయడం నేరం కాదు కదా అని జరిగింది చెప్పాడు శివయ్య. అయినా
అడిగిన వారందరికీ దానం చేస్తూ పోతే రేపు మనకి తినడానికి దాన్యం ఎక్కడినుండి వస్తా యి అందరికీ సాయం
సహాయం చేస్తూ పోతే రేపు నా కొడుక్కి ఎవరో ఒకరు చేయాలి సహాయం అని బాధగా తన మనసులో మాట
చెబుతుంది పార్వతి. పిచ్చిదానా మనం తినడానికి తిండి ఉండటానికి ఇల్లు బతకడానికి పొలం ఉన్నాయి కదా
భయమెందుకు అని అంటాడు శివయ్య.ఆ ఉన్నాయి నేను కాపురానికి వచ్చినప్పుడు ఇంట్లో నాలుగు కార్లు
ఉండేవి ఐప్పుడు ఉన్నది ఒకటే కారు అప్పుడు 30 ఎకరాల పొలం ఉండేది ఇప్పుడు ఇరవై ఎకరాల పొలం
ఉన్నది పిల్ల లు పెరిగే కొద్దీ ఆస్తు లను కూడా పెంచుకుంటారు కానీ మీల ఎవరు తగ్గించుకుంటూ పోరు అని
కసురుకుంది పార్వతి . నేను వీడికి వారసత్వంగా ఇవ్వాళ అనుకుంటుంది మా తాతలు సంపాదించిన ఆస్తు లు,
అంతస్తు లు కాదు మంచితనాన్ని ,మానవత్వాన్ని ఒక మంచి వ్యక్తిత్వాన్ని అని అప్పుడే అటుగా వచ్చిన వారి
అబ్బాయి వినయ్ నీ చూసి అంటాడు శివయ్య.ఓ ఇవ్వండి ఇవ్వండి మంచితనం ,మానవత్వం ఈ రోజుల్లో
వీటిని మించిన హాస్యాస్పద మాటలు మరొకటి లేవు ఈరోజు సాయం పొంది మరసటి రోజు కి మర్చిపోయే
రోజులు ఇవి . సమాజానికి న్యాయం చేయకపోయినా పర్వాలేదు ఉన్నదంతా ఊడ్చి నా కొడుక్కి మాత్రం
అన్యాయం చేయకండి .ఉండండి ఇద్ద రికీ భోజనాలు రెడీ చేస్తా ను అంటూ అక్కడి నుండి వెళ్లి పోతుంది
పార్వతి .అసలు మానవత్వం అంటే ఏమిటి నాన్నగారు అని దీర్ఘంగా ఆలోచిస్తు న్నా శివయ్య ని అడుగుతాడు
కొడుకు వినయ్. తోటివారు కష్టా లలో ఉన్నప్పుడు సాయం చేయడం. లేనివారికి ,కష్ట ం అంటూ మన దగ్గ రకు
వచ్చిన వారికి సహాయం చేయడం .ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం.
మానవత్వం అని చెబుతాడు శివయ్య. ఇవన్నీ దేవుడు చేస్తా డు అని చెప్పింది అమ్మ అసలు దేవుడు ఎవరు
నాన్న అని అమాయకంగా అడుగుతాడు వినయ్ .దేవుడంటే మనం ఫోటోలో పూజించేవాడు ,విగ్రహాలలో
అలంకరించే వాడు, కోట్లు పెట్టి కట్టిన నాలుగు గోడల మధ్య ఉండే వాడు కాదు .నీకు ఆకలిగా ఉన్నప్పుడు
తిన్నావా అని అడిగేవాడు, నీ కష్టా న్ని పంచుకునే వాడు ,ఇష్టా న్ని గౌరవించేవాడు ,ఎల్ల ప్పుడూ న్యాయం వైపు
ఉండే వాడు ,అందరికీ సహాయం చేసేవాడు దేవుడు అని వివరంగా చెబుతాడు శివయ్య .. ఇప్పుడు
అర్థ మైందా దేవుడు ఎవరో కథ అయిపోయింది ఇక పడుకో నాని అని అంటూ తన కథల పుస్త కాన్ని
తీసుకెళ్తు ంది గంగా.. అమ్మ ఇంతకీ కథ పేరు చెప్పలేదు అని అడుగుతాడు నాని కథ పేరు "దైవం మానస
రూపాయే"అంటూ చెబుతుంది గంగా ఇక ఆనందంగా నిద్రపోతాడు నాని ... ఎప్పుడు న్యాయం వైపు ఉంటూ,
ఎల్ల ప్పుడు తోటి వారికి సాయం, సహాయం చేసే ప్రతి మనిషి దేవుడు తో సమానమే.. అందుకే అన్నారు పెద్ద లు
దైవం మానస రూపెయే .ఇది తెలుసుకొని మనం పాటించిన రోజు మానవ వనం అవుతుంది నందన వనం..
పెళ్లి ఒక చిక్కుముడి - భాస్కట్ కాంటేకార్
Object 31

"ఒకటి ప్ల స్
ఒకటి ఎంత
?",అని
ఆడగాడు
గుర్నాథమ్.
"రెండు"
అంది
సుజాత.
"కాదు"
అన్నాడు
గుర్నాథమ్
తలా అడ్డ ంగా
ఊపుతూ.
"మరీ",
అన్నట్టు గా
ఆశ్చర్యంగా
చూసింది
సుజాత.
"రెండు టీ
లు" అని పక
పక నవ్వాడు
గుర్నాథమ్.
"సరే మరో
ప్రశ్న
అడుగుతాను,
సరైన
సమాధానం
చెప్పు",
అన్నాడు గురునాథం. సరే అన్న సుజాత కు , రెండు ప్ల స్ ఒకటి ఎంత అని ఎదురు ప్రశ్న వేశాడు గుర్నాథమ్.
అమ్మో ఈసారి పప్పులో కాలు వేయోద్ద ని తెగ ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చి, "నాకు సమాధానం తెలుసు
కానీ అది ఒక షరతు మీద చెపుతాను "అంది సుజాత. "ఏంటో ఆ షరతు " నొసలు చిట్లిస్తూ అడిగాడు
గుర్నాథమ్. "నేను ఒక సమదానం చెపుతాను.దానికి మీరు 'ప్రశ్న' చెప్పాలి. ఆ ప్రశ్న - జవాబు సరయినదైతే ,
నేను మీ ప్రశ్నకు సమాధానం చెపుతాను. ఓకేనా" అంది తన చూపుడు వేలును గుర్నాథమ్ వైపు చూపిస్తూ .
ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం కష్ట ం.కానీ జవాబు చెప్పినప్పుడు ప్రశ్న అడగడం పెద్ద కష్ట ం కాదు.సమాధానాలు
దొరక్క దేశద్రిమ్మరులైన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు మహానుభావులైన వారు కూడా
ఉన్నారు. బాగా ఆలోచించి వప్పుకున్నట్లు గా " సరే "అన్నట్టు తల ఊపాడు గుర్నాథమ్. సుజాత తన పేరుతో
మొదలుపెట్టింది. సుజాత "సుజాత "అంది. గుర్నాథమ్ జవాబుగా "నీ పేరేంటి? " అన్నాడు. సుజాత
జవాబుగా,వెరీ గుడ్, కాన్సెప్టు మీకర్థ మయ్యింది. ఇప్పుడు అసలు ప్రశ్న, "పెళ్లి" అంది సుజాత. గుర్నాథమ్ కి
అర్థ మయ్యింది,ఇది కొంచం జటిలమైన ప్రశ్నే!! జవాబుగ ,"ఇద్ద రు మనుషులు మరియు మనసులు కలయిక
దేనికి దారి తీస్తు ంది?" అన్నాడు గుర్నాథమ్. సుజాత 'నో 'అంది. "ఇద్ద రు మనుషులు అంటే వారూ అడా ,
మగా లేక ఇద్ద రు స్వలింగులా ,అయిన వారి మనసులు కలిసినవి అంకుందాము, అంత మాత్రా న అది పెళ్లికి
దారి తీస్తు ందని చెప్పలేము.మరో విదంగా ప్రయత్నించండి. "ఇద్ద రు ప్రేమికులు ఒకటై, జీవితాంతం ఒకటిగా
జీవించాలనుకుని చేసుకొనే ఫంక్షన్ ఏమిటి ?" అన్నాడు గుర్నాథమ్. సుజాత మళ్ళీ లాయర్ పాయింట్
లేవనెత్తింది. "జీవితాంతం ఒకటిగా జీవించాలనుకోవడానికి , వారిద్ద రూ ప్రేమికులే కా నవసరం లేదు , పెద్ద లు
లేక స్నేహితులు కలిపిన లేదా తామంతా తాము కలుసుకున్న జంటలు కావచ్చు. మన హిందూ
సంప్రదాయంలో అరేంజ్డ్ మేరేజేసే చాలా వరకు సక్సెఫుల్ " అంది సుజాత. గుర్నాథమ్ కూడా చాలా వరకు
ఏకీభవించాడు. తన డెఫనేషన్ ను ఇంకాస్త కుదురు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సారి ఓ రెండు
క్షణాలు ఆలోంచించి " ఒక ఇద్ద రూ, లేదా ఒక అడ మగా ఒకటిగా కలసి జీవించబోతున్నారని బాహాటంగా
ప్రకటింప బడే కార్యక్రమము పేరేంటి? " అన్నాడు గుర్నాథమ్. సుజాత దీనికి కూడా ఒప్పుకోలేదు."ఈ మధ్య
నాగరికం ముసుగులో నలుగురిని పిలిచి, మేమిద్ద రం సహజీవనం చేయబోతున్నామని ఎంతమంది ప్రకటన
చేయడం లేదు. అంత మాత్రా న అది 'పెళ్ళని' నేను భావించను", అంది సుజాత. "హంగులు ,ఆర్భాటాలు లేని
ప్రైవేట్ ఫంక్షన్ అంటూ ఖరీదైన హోటల్లో పూలదండలు మార్చుకుని, సడి చప్పుడు లేకుండా చేసుకునే
తంతుని కూడా పెళ్ళని పిలవడం కష్ట మే" అంటూ తన అభిప్రా యాన్నీ వెలిబుచ్చింది సుజాత. ఆదేదో ఫన్నీ
టాపిక్ కాస్త ,తమ తమ అభిప్రా యాలను ప్రకటించుకునే వరకు వెళ్ళిపోయింది. ఈ సారి ఏ లాగైన సుజాతను
సమాధాన పరచాలిసిందే అని, శ్వాసను గట్టిగా లోనకి పీల్చుకుని, తన ఆఖరి ప్రయత్నంగా, "వరుడు ,సకల
బంధుజన సమూహ కోలహలంలో,పచ్చని పందిరి కింద ,బాజా బంత్రి మంగళ వాయిద్యాల మధ్య,బ్రహ్మణ
ఘన సమక్షంలో వేద మంత్రా ల సాక్షిగా , భగవంతుని ఆశీర్వాదంతో విందు భోజనాలతో అందరికి
ఆమోదయోగ్యంగా మనసా వాచా కర్మా , వధువు ను ఆత్మ సాక్షిగా అర్థా ంగిగా అంగీకరించడం అంటే ఏంటి?"
అన్నాడు గుర్నాథమ్. సుజాత మనసు ఆ జవాబుని అంగీకరించింది. సుజాత మళ్ళీ కల్పించుకొని, మూడు
ముళ్ళు అనే పదం ఎక్కడ రాలేదే అంది. అవును మూడు ముళ్ళకు అర్థ ం మనసా, వాచా, కర్మలకు అన్నట్లేగా
అన్నాడు గుర్నాథమ్. "ఓహో , అవును మూడంటే ఆవేనా ?అని ఒకింత ఆశర్యన్నీ చూపిస్తూ అడిగింది
సుజాత. "అయితే నీ ప్రశ్నకు కూడా సమాధానం దొరికిన్నట్లేగా" గుర్నాథమ్ వైవుకు కొంటెగా చూస్తూ అడిగింది
సుజాత. పెళ్లిళ్లు పరిపక్వతతో జరగాలి.పెళ్లి అర్థ ం తెలియాలి. అంతర్లీనమై ఉన్న విలువలు, వింత పోకడలతో
వికటించే బంధాలు తదుపరి పరిణామాలు,భావి తరాల మీద వాటి ప్రభావం, ఇవన్నీ క్షుణ్ణ ంగా అర్థ ం
చేసుకోవాల్సిన అవసరం నేటి యువత మీద ఉంది. ఒకటి ప్ల స్ ఒకటి రెండు అయినప్పటికీ, రెండు టీ లు అని
పెడర్థ ములతో సమర్ధించే వారు ఉన్నారు మరియు 'ఒకటి ప్ల స్ ఒకటి ఒకటే 'నని నిగూడార్థా న్నీ విప్పి
చెప్పేవారు కూడా ఉన్నారు. ఎవరిని అనుసరిచాలన్నది మనకే వదిలి వేయ బడ్డ నిర్ణయం.
నమ్మకం - పద్మావతి దివాకర్ల
Object 32

ఆ రోజు శ్రా వణ శుక్రవారం. తెల్ల వారి నాలుగింటికే లేచిన శ్రా వణి వాకిలి శుభ్రపరచింది. స్నానం ముగించి
ముంగిట ముగ్గు లు వేసి వరలక్షి పూజ కోసం పువ్వులు కోసింది. శ్రద్ధగా పూజ చేసుకుంది. శ్రా వణికి దైవభక్తి
మెండుగా ఉంది. శ్రా వణికి వ్రతాలు, నోములు, పూజలు అవీ శ్రద్ధగా చేసుకోవడం అలవాటు. ఆమె భర్త శైలేంద్ర
ప్రభుత్వ రంగ సంస్థ లో ఉద్యోగం చేస్తు న్నాడు.

ప్రతీ సోమవారం ఉదయమే లేచి శివుని గుడికివెళ్ళి అర్చన చేయించడం అలవాటు. అలాగే శనివారం
శ్రీనివాసుని కోవెలకి వెళ్తు ంది. అలాగే దాదాపు వారంలో ప్రతీరోజు ఏదో ఒక గుడికి వెళ్ళి వస్తూ నే ఉంటుంది.
ఆమెకి పాతతరం వాళ్ళలా చాలా నియమాలే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది లక్ష్మివారం, శుక్రవారం
డబ్బులు ఖర్చు పెట్ట కూడదన్నది ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో నూ ఆమె ఆ రోజుల్లో తనెలాగూ ఖర్చుపెట్ట దు,
అంతేకాక భర్త చేత కూడా ఖర్చుపెట్ట నివ్వదు.

ఆ రోజుల్లో డబ్బులు ఖర్చుపెడితే తమ ఇంట్లో ని లక్ష్మి దూరమవుతుందని ఆమె ప్రగాఢ విశ్వాసం. చిన్నప్పుడు
తల్లితండ్రు లవద్ద కన్నా బామ్మ దగ్గ రే ఆమెకి చేరిక ఎక్కువ. శ్రా వణి బామ్మ ఆమెకి చిన్నప్పటినుండి బాగా
భక్తిభావం నూరిపోసింది. భక్తికథలు, రామాయణ మహాభారతాలు ఆమెకి చిన్నప్పుడే బోధించేది. అలాగే నీతి
కధలు కూడా చెప్పేది. అలా పెద్ద యినాక కూడా తనకంటూ కొన్ని నియమాలు ఏర్పరచుకొని వాటిని తూచా
తప్పక పాటిస్తో ంది శ్రా వణి. లక్షివారం, శుక్రవారం డబ్బులు ఖర్చు చేయకూడదన్న నియమంకూడా అలా
ఏర్పరచుకున్నదే. తన బామ్మ నమ్మకాల్ని పుణికిపుచ్చుకుందామె. శ్రా వణి బామ్మకి ఇలాంటి చాదస్తా లెన్నో!
వాటన్నిటికీ శ్రా వణి సరైన వారసురాలైంది. పూర్వకాలపు ఆచారాలన్నీ పాటిస్తు ంది. అద్భుదయ భావాలకల
శైలేంద్ర ఆమె ప్రవర్తనకి అప్పుడప్పుడు విసుక్కునేవాడు కూడా.

ఓ శుక్రవారం నాడు తన స్కూటర్ చెడిపోవడంతో మెకానిక్‌ని పిలవవలసి వచ్చింది. అతను బండి రిపేర్ చేసిన
తర్వాత శైలేంద్ర డబ్బులు ఇవ్వబోతుంటే ఒప్పుకోలేదు ఆమె.

"శుక్రవారం డబ్బులు ఖర్చు చేస్తే శ్రీమహాలక్ష్మి ఇల్లు వదిలిపోతుందండీ! అతనికి డబ్బులు రేపు ఇస్తా నని
చెప్పండి." అందామె. ఆ విధంగానే ఏదో సాకు చెప్పి ఆ మెకానిక్‌కి అప్పటికి ఎలానో పంపవలసి వచ్చింది
అతనికి. ఆ మరుసటి రోజు అతనికి డబ్బులు చెల్లించాడు.

అలాగే ఒకసారి రాకరాక శైలేంద్ర చెల్లెలు, బావగారు ఇంటికి వచ్చారు. వాళ్ళకి బట్ట లు కొనడానికి బజారుకి
తీసుకెళ్ళడానికి బయలుదేరుతూంటే శ్రా వణి అందుకు ఒప్పుకోలేదు.

"మర్చిపోయారా! ఇవాళ శుక్రవారం. ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్ట కూడదు. రేపు ఉదయమే వెళ్ళి కొనండి."
అందామె.

అన్నతో బజారుకు వెళ్ళడానికి తయారైన శైలేంద్ర చెల్లెలు గిరిజ వదిన మాటలకి చిన్నబుచ్చుకుంది.

"రేపు ఉదయమే వాళ్ళు వెళ్ళిపోతారు కదా! రేపెలా కొనగలను?" అన్నాడు అయోమయంగా శైలేంద్ర భార్య
ప్రవర్తనకి చిరాకు పడుతూ.

"ఏది ఏమైనా ఇవాళ డబ్బులు ఖర్చు పెట్ట డానికి వీల్లేదు." అందామె ఖరాఖండీగా.

భార్య మాటలకి చెల్లెలు, బావగారిముందు తలకొట్టేసినట్లైంది శైలేంద్రకి. భార్య మాటలకి కోపం వచ్చి ఆ
రోజంతా మాట్లా డలేదు. అతని చెల్లెలు గిరిజ కూడా వదిన్ని చూసి మొహం తిప్పుకుంది. అయితే ఆ
మరుసటిరోజు, వాళ్ళిద్ద రూ బయలుదేరినప్పుడు శైలేంద్ర తనకోసం పదివేల రూపాయలు పెట్టి కొన్న కొత్త చీర
పసుపుకుంకుమలతో ఆడబడుచుకి ఇచ్చి, ఆమె భర్తకోసం బట్ట లు కొనుక్కోవడానికి తను దాచుకున్న ఐదువేల
రూపాయలు కూడా ఇచ్చింది శ్రా వణి. ఆమె ప్రవర్తనకి విస్తు పోయాడు శైలేంద్ర. గిరిజ కూడా తన వదినని
తప్పుగా అర్ధ ం చేసుకున్నందుకు మనసులోనే బాధపడింది. ఆ తర్వాత వదిన నియమాలు, నమ్మకాలు గుర్తు కు
వచ్చి సర్ధు కుంది.

ఇంకోసారిలాగే శైలేంద్ర స్నేహితుడు సత్యమూర్తి వాళ్ళింటికి వచ్చాడు. మాటలవరసలో అతను తనో ఫ్లా ట్
కొనడానికి ముందుగా కొంత డబ్బులు ఇచ్చినట్లు చెప్పాడు. అంతేకాక ఆ అపార్ట్‌మెంట్‌లోనే ఇంకొక్క ఫ్లా ట్
మాత్రమే మిగిలి ఉందని, అది బుక్ చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజని తెలిపాడు. ఆ అపార్ట్‌మెంట్ మంచి
లోకాలిటీలో ఉండటమేకాక ధరకూడా అందుబాటులో ఉంది. చాలారోజులనుండి శ్రా వణికి, శైలేంద్రకి
బ్యాంక్‌లోన్ తీసుకొని ఓ ఫ్లా ట్ కొనుక్కోవాలని ఉంది. అయితే ఆ రోజు లక్ష్మివారం కావడంవలన ఆ రోజు
బయానాగా డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు శ్రా వణి. ఆ విధంగా లభించిన అరుదైన అవకాశం చేజారిందని
విచారించాడు శైలేంద్ర. భార్య చాదస్తా నికి అతనికి కోపం కూడా వచ్చింది. అయితే ఆమె పట్టు దల తెలిసిన
శైలేంద్ర ఏమీ అనలేకపోయాడు.

అయితే శ్రా వణి చాదస్త ం వల్ల కొన్ని సార్లు మేలు కూడా జరిగింది. ఓ సారి శ్రా వణికి మామయ్య వరసైన
ఏకాంబరం ఏదో అత్యవసరమైన పని ఉందని, పాతికవేలు అప్పుకావాలని అడిగాడు. భార్య తరఫు బంధువని,
శ్రా వణి అతనికి అప్పు ఇవ్వడానికి అభ్యంతరం పెట్ట దని అనుకున్నాడు. అయితే తన అంచనా తప్పని
తెలుసుకోవడానికి అతనికి ఎక్కువసేపు పట్ట లేదు. ఆ రోజు లక్ష్మివారం కావడంతో శ్రా వణి అందుకు
ఒప్పుకోలేదు. ఏకాంబరం వాళ్ళని చీదరించుకొని వెళ్ళాడు. అతనికి బాధ కలిగించినందుకు శైలేంద్ర
బాధపడ్డా డు కాని శ్రా వణి ఏమాత్రం బాధపడలేదు. ఆ మరుసటి రోజు తెలిసినదేమిటంటే, ఏకాంబరం
ఇంకెక్కణ్ణు ంచి అప్పు తెచ్చాడో ఏమో మాత్రం, పేకాట ఆడుతూ పోలీసులకి దొరికిపోయాడు. అది తెలిసిన
శైలేంద్ర తను ఏకాంబరంకి అప్పు ఇవ్వనందుకు సంతోషించాడు.

అలాగే ఒకసారి శైలేంద్రకి దూరపు చుట్ట ం ఒకరు చిట్ ఫండ్‌లో డబ్బులు పెడితే మంచి లాభాలు, బహుమతులు
వస్తా యని ఊరించాడు. అతని వాగ్ధా టికి చిత్త యిపోయిన శైలేంద్ర అందులో ఓ రెండు లక్షలు జమ చేద్దా మని
అంటే ఆ రోజు శుక్రవారం కావటం మూలాన శ్రా వణి ఒప్పుకోలేదు. ఆ చిట్ ఫండు కంపెనీ నిర్వాహకులు
నెలరోజుల్లో పే బోర్డ్ తీప్పేసారని తెలిసి గుండెలమీద చెయ్యేసుకున్నాడు శైలేంద్ర. ఆ విధంగా శ్రా వణి నమ్మకం
వాళ్ళిద్ద ర్నీ చాలా సార్లు కాపాడింది.

శ్రా వణి చాదస్త ం తెలిసిన ఇరుగూ, పొరుగూ, చుట్ట పక్కల వాళ్ళు కూడా ఆమెని ఆ రోజుల్లో చేబదులు
అడగడానికి జంకుతారు. బంధువులైతే సరే సరి! పొరపాటున ఎవరైనా వారంలో ఆ రెండురోజుల్లో ఆమె చేత
ఖర్చు పెట్ట దలిస్తే ఇక అంతే సంగతులు! ఆమె సంగతి తెలిసిన పనిమనిషి, వాడుకగా పాలు పోసేవాడు,
ఇలాంటివాళ్ళందరూ కడు జాగ్రత్తగా ఆమెతో మసులుతారు. మిగతా రోజుల్లో దానకర్ణు డైన ఆమె ఆ
రెండురోజుల్లో మాత్రం చిల్లిగవ్వకూడా బయటకు వెళ్ళనివ్వదు. ఏదిఏమైనా తన నమ్మకం ఆమెకి ముఖ్యం.

**** **** **** **** ****


ఆ శ్రా వణ శుక్రవారం పూజ ముగించిన తర్వాత భర్తకి కేరియర్ సర్దింది శ్రా వణి. శైలేంద్ర ఆఫీసుకి
బయలుదేరడానికి స్కూటర్ తీసేసరికి పక్కింటి సుమతి అదరాబాదరాగా వచ్చింది వాళ్ళింటికి.

ఆమె గాబరా పడుతూండటం చూసి, "ఏమైంది అక్కా!” అని అడిగింది శ్రా వణి ఆమెకి ఎదురెళ్ళి.

"బాబుకి రెండు రోజులనుండీ విపరీతమైన జ్వరం. ఇందాక ఫిట్సు కూడా వచ్చాయి. సమయానికి ఆయన
ఊరిలో కూడా లేరు. ఇంట్లో డబ్బులు కూడా పెద్ద గా ఏమీ లేవు. ఇరుగుపొరుగు అందర్నీ అప్పు అడిగాను, కాని
ఎక్కడా దొరకలేదు. నాకు ఏం చేయాలో కాళ్ళు చేతులూ ఆడటం లేదు." అంది సుమతి విపరీతమైన
ఆందోళనతో. ఆమె పరిస్థితి చూసి చలించింది శ్రా వణి.

"అయ్యో! ఇప్పుడెలా?" అన్న శ్రా వణి వెంటనే తేరుకుని ఓ నిర్ణయం తీసుకొని, "ఒక్క నిమిషం ఉండు అక్కా!
నేను కూడా వస్తా ను, హాస్పిటల్‌కి తీసుకెళ్దా ం బాబుని." అని ఇంటిలోకి వెళ్ళి పర్సు చేతపట్టు కుని ఇంటికి తాళం
వేసింది.

అప్పుడే ఆఫీసుకి బయలదేరబోతున్న శైలేంద్ర కూడా అక్కడికి వచ్చి పరిస్థితి తెలుసుకున్నాడు. "మిమ్మల్ని
ఆటో ఎక్కించి నేను కూడా హాస్పిటల్‌కి వస్తా ను. ఏం భయం లేదు." అని వెంటనే తన ఆఫీసుకి ఫోన్ చేసి
పరిస్థితి వివరించి సెలవు పెట్టా డు. ఈ లోపు సుమతి, బాబుని తీసుకొని వీధిలోకి వచ్చింది శ్రా వణి. శైలేంద్ర
బాబు వంటిమీద చెయ్య వేసి చూసాడు. ఒళ్ళు కాలిపోతోంది. ఇక జాగు చెయ్యక అటు పోతున్న ఆటోని పిల్చి
వాళ్ళని ఎక్కించి, తను స్కూటరుపై వాళ్ళ వెనక వెళ్ళాడు.

స్కూటర్‌పై వెళ్తూ న్న శైలెంద్రకి హఠాత్తు గా ఓ సందేహం వచ్చింది. ఇవాళ శుక్రవారం, అంతేకాదు శ్రా వణ
శుక్రవారం! సుమతి వద్ద బాబు వైద్యానికి సరిపడా డబ్బులు లేవు. శ్రా వణి మానవతా దృష్టితో ఆమెని, బాబుని
హాస్పిటల్‌కి తీసుకెళ్ళిందేగాని, అక్కడ డబ్బులు కట్ట డానికి ఒప్పుకోదే! ఏమి చేయటమా అని
ఆలోచించసాగాడు శైలేంద్ర.
ఇలా ఆలోచిస్తూ నే హాస్పిటల్‌కి చేరాడు శైలేంద్ర. సరిగ్గా అప్పుడే ఆటోకూడా అక్కడకి చేరుకుంది. ఆటోలోంచి
దిగారు శ్రా వణి, సుమతి బాబుతో. ఆటో అతనికి డబ్బులివ్వడానికి జేబులో చెయ్యపెడుతూ ఆగిపోయాడు
శ్రా వణిని చూస్తూ నే. సుమతి తను డబ్బులు ఇవ్వబోతుంటే ఆమెని వారించి పర్సు తెరిచి ఆటోఅతనికి
డబ్బులిచ్చింది శ్రా వణి. ఆమె వంక ఆశ్చర్యంగా చూసారు శైలేంద్ర, సుమతి కూడా. బహుశా ఈ గందరగోళంలో
ఆమె ఇవాళ శుక్రవారం అన్న సంగతి మర్చిపోయిందేమో అని అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు శైలేంద్ర.

ఆ తర్వాత సుమతిని వెంటబెట్టు కొని ఆస్పత్రి లోనికి వెళ్ళింది శ్రా వణి. ఆ వెనుకే శైలేంద్ర కూడా వెళ్ళాడు.
బాబుని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసారు. శ్రా వణే శైలేంద్రని పిల్చి కౌంటర్‌లో డబ్బులు కట్ట మని చెప్పింది, "అక్క
దగ్గ ర డబ్బులు లేవుట పాపం, మీరు కట్టేయండి." అంది. ఎప్పుడూ శుక్రవారం తనచేత కూడా డబ్బులు
ఖర్చుపెట్ట నివ్వని శ్రా వణేనా ఈ మాటలు అంటున్నది అని ఆమెవైపు అపనమ్మకంగా చూసాడు.

"మీకే చెప్పేది! వేగం వెళ్ళి డబ్బులు కట్టి రండి." అందామె బాబుని తీసుకువెళ్ళిన వార్డు వైపు కదులుతూ.
ఆమె వెళ్తు న్నవైపు విస్మయంగా చూస్తూ ఆ పనిలో పడ్డా డు శైలేంద్ర.

ఆ రోజు సాయంకాలం వరకూ శైలేంద్ర, శ్రా వణి కూడా సుమతికి తోడుగా హాస్పిటల్‌లోనే ఉన్నారు. మధ్యాహ్నం
తను హోటల్లో తిని వాళ్ళిద్ద రికీ భోజనం తెచ్చాడు. సాయంకాలమయ్యేసరికి బాబుకి కొంచెం నెమ్మదించింది.
ప్రా ణాపాయ పరిస్థితి తప్పింది. ఈ లోపు ఫోన్‌ద్వారా కబురు తెలుసుకున్న సుమతి భర్త శివరాం హుటాహుటిన
హాస్పిటల్‌కి చేరుకున్నాడు. బాబు పరిస్థితి బాగుపడటం చూసి ఊపిరి పీల్చుకున్నాడు.

"మీరిద్ద రూ మాకెంతో సహాయం చేసారు. మీ మేలు మర్చిపోలేను." చెప్పాడు శివరాం కన్నీళ్ళతో శైలేంద్ర
చేతులు పట్టు కొని.

"నిన్న రాత్రి నుండి బాబుకి విపరీతమైన జ్వరమండి. ఫిట్సు కూడా వచ్చాయి. చేతిలో డబ్బులు కూడా లేవు.
సమయానికి అక్కయ్యావాళ్ళు సహాయం చేయకపోతే బాబు పరిస్థితి ఏమై ఉందేదో తలచుకోవడానికే భయం
వేస్తో ంది." చెప్పింది సుమతి కంటతడి పెట్టి.

"ఇరుగూ పొరుగూ అన్నాకా ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలాగా!" అంది శ్రా వణి.

సాయంకాలం ఏడు గంటల వరకూ అక్కడే ఉండి ఇంటికి తిరిగివచ్చారు శైలేంద్ర, శ్రా వణి.

స్కూటర్‌పై ఇంటికి తిరిగివచ్చాక, "ఎంత గండం గడిచింది! సమయానికి హాస్పిటల్‌కి బాబుని తీసికెళ్ళకపోయి
ఉంటే ఎంత ప్రమాదం జరిగేది!" అంది శ్రా వణి ఇంటి తాళం తీస్తూ .

సోఫాపై అలసటగా చేరబడిన శైలేంద్రకి ఒక విషయం మాత్రం అంతుబట్ట లేదు. లక్ష్మివారంగానీ, శుక్రవారంగానీ
పైసా కూడా ఖర్చుపెట్ట నివ్వని శ్రా వణి తను స్వయంగా డబ్బులు ఖర్చుపెట్ట డమే కాకుండా, తన చేత కూడా
ఎలా డబ్బులు కట్టించింది అన్న విషయమే అర్ధ ం కాలేదు శైలేంద్రకి. పొరపాటున ఇవాళ శుక్రవారమన్న
సంగతిగాని ఆమె మర్చిపోయిందా?

ఈలోపు బాత్‌రూముకివెళ్ళి స్నానంచేసి కాఫీ కలిపి భర్తకి ఇచ్చింది శ్రా వణి. తనని వేధిస్తు న్న ప్రశ్నకి సమాధానం
తెలుసుకోగోరి ఆమెని అడిగాడు, "అవునూ, ఇవాళ శుక్రవారం, అందులో శ్రా వణ శుక్రవారం కదా! డబ్బులు
కట్ట మన్నప్పుడు కొంపతీసి ఆ విషయం మర్చిపోయావా?"

"భలేవారే! ఎందుకు మర్చిపోతాను? అయితే డబ్బులు కన్న ప్రా ణం గొప్పది కదా! డబ్బులు పోతే
తిరిగివస్తా యి, కానీ ప్రా ణం అలాకాదుగా! ఎవరైనా ప్రా ణాపాయ స్థితిలో ఉంటే మనం వారం వర్జ్యం చూస్తే
అవుతుందా? మామూలు ఖర్చులంటే ఆ రోజుల్లో చెయ్యకపోయినా ఉపద్రవం ఏమీ లేదు కానీ, ఇలాంటి
పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు చెయ్యకపోతే ఎలా? నా నమ్మకం నమ్మకమే, కాని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో
మాత్రం కాదు." చెప్పిందామె తను కూడా సోఫాలో కూర్చొని.

అవాక్కై ఆ మాటలు వింటున్నాడు శైలేంద్ర. ఆమె చెప్పింది నిజమే! అనవసర ఖర్చులు ఆ రోజుల్లో
మానుకోవచ్చు కానీ, అత్యవసర పరిస్థితులు మనకోసం ఆగవుగా! అందుకే ప్రా ణాపాయ పరిస్థితిలో ఆమె తన
నమ్మకాన్ని సడలించిందన్న నిజం గ్రహించి భార్యవైపు అభినందన పూర్వకంగా చూసాడు శైలేంద్ర.

-పద్మావతి దివాకర్ల

జీవన మాధుర్యం - ఎన్.వి. రామశేషు


Object 33

శిరీష ఆఫీస్ నుండి వచ్చి


సోఫాలో కూలబడింది. ఈరోజు
అంతా ఆఫీస్ లో ఇటు అటు
తిరిగి పనిచేయడమే
సరిపోయింది. దాంతో కాళ్ళు
నొప్పులు. ఇంటికి రాగానే
మంచి నీరు ఇచ్చే వారు లేరు.
ఏం కావాలన్నా తనే
చూసుకోవాలి. అక్కడితో
సరిపోయిందా. కాసేపటికి
శ్రీవారు వస్తా రు. ఏది రెడీగా
లేకపోయినా
చిరచిరలాడతారు. అది భరించే
కన్నా ఆయన వచ్చే లోపు ఏదో
ఒక టిఫిన్ చేసి రెడీ గా ఉంటే
సరి. ఈ విషయాలన్నీ
మనసులోనే
నెమరేసుకుంటున్న శిరీష
తప్పని సరిగా లేచి బట్ట లు
మార్చుకుని పని లోకి
జొరబడింది. అలా ఒక గంట
గడిచేసరికి పకోడీ, కాఫీ రెడీ
అయ్యాయి. తను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంది, ఇంతలో ఆకాశ్ వచ్చాడు. ‌రాగానే "శిరీ, తల బద్ద లై
పోతోంది, వేడిగా కాఫీ ఇవ్వు. అదే చేత్తో తినడానికి ఏమైనా ఉంటే పెట్టు . ఆకలి దంచేస్తో ంది." అన్నాడు. శిరీష
మారు మాట్లా డకుండా అన్ని టేబుల్ మీద పెట్టి ంది. ఆకాశ్ ఫ్రెష్ అయి వచ్చి అవన్నీ చూసి "ఆహా, ఎంతదృష్ట ం"
అంటూ కాఫీ అందుకొని పకోడీ నమలసాగాడు. సడెన్ గా అతనికి గుర్తు వచ్చింది, భార్య నుండి ఏ రెస్పాన్స్
లేదని. తననే చూస్తూ " ఏమిటి అలా ఉన్నావ్. ఆఫీస్ లో ఏమైనా గొడవా." అన్నాడు. "అదేం లేదు." అంది
ముభావంగా. "మరెందుకు అలా ఉన్నావ్. ఏదో అయిపోయినట్లు "‌అన్నాడు ఆకాశ్ అసహనంగా. "ఈ రోజు
కాస్త త్వరగా వచ్చాను. కొంచెం సరదాగా గడపవచ్చు అనుకుంటే. నా ఖర్మ. అంత అదృష్ట మా నాకు. ఇవాళే
ఇలా ఏడుపు ముఖం తో ఉండాలా." అన్నాడు మళ్లీ. "ఎందుకు ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అంటారు. జవాబు
చెపితే కోసం, చెప్పకుంటే కోపం. నా మానాన నేను ఉండడం కూడా తప్పేనా." కొంచెం కోపం, బాధ మిళాయించి
అడిగింది శిరీష. "శిరీష, నీ మానాన నువ్వు, నా మానాన నేను ఉండేదానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు."
విసుగ్గా అని ఆకాశ్ బైటికి వెళ్ళి పోయాడు. శిరీష సోఫా లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచన లో

పడింది. అలా ఎంతసేపు గడిచిందో తలుపు శబ్ద ం విని కళ్ళు తెరిచింది. ఆకాశ్ వస్తూ నే " ఏమిటి ఇంకా అలానే
ఉన్నావా. మూవీ కి టికెట్స్ బుక్ చేశాను. ఇంకా వంట పెట్టు కుంటే కుదరదు కాని త్వరగా తెములు. హోటల్ లో

తిని మూవీ కి పోదాం." అన్నాడు. అవును, కాదు అని వాదించే కన్నా‌మాట్లా డకుండా వెళ్ళడమే నయం
అనిపించింది శిరీష కి. రోజులు మామూలుగా గడుస్తు న్నాయి. ఆకాశ్ శిరీష గురించి ఎప్పుడూ పెద్ద గా
ఆలోచించడు. తనకేమైనా లోటు అనిపిస్తే శిరీష నే తప్పు పడతాడు. శిరీష కి తన మనసు విప్పి చెప్పే
అవకాశం ఇవ్వడు. శిరీష రోజులు గడిచేకొద్దీ డల్ అవుతూ ఉంటుంది. కానీ ఆకాశ్ ఏమాత్రం పట్టించుకోడు.
శిరీష కజిన్ రాధ వివాహం కుదిరింది. చిన్ననాటి నుండి వారిద్ద రి మధ్య మంచి స్నేహం ఉంది. తన పెళ్లి
కిముందుగా రాకపోతే ఇంక ఎప్పటికీ మాట్లా డనని బెదిరించడం తో ఆకాశ్ ని అడిగింది శిరీష. తనను
వెళ్ళమని, పెళ్ళి టైం కి వస్తా నని ఆకాశ్ హామీ ఇవ్వడంతో ఆఫీస్ కి శెలవు పెట్టి కజిన్ రాధ ఊరికిప్రయాణమైంది
శిరీష. రాధ శిరీష ని చూసి చాలా సంతోషించింది. మిగిలిన స్నేహితుల తో కలిసి శిరీష కూడా చాలా రోజుల
తర్వాత ఆనందంగా ఉంది. పెళ్లి పనుల్లో , రాధకి సహాయం చేయడంలో శిరీష కి సమయమే తెలియలేదు.
అనుకున్న దానికంటే ముందే ఏవో శెలవులు కలిసి వచ్చాయని ఆకాశ్ కూడా వచ్చేశాడు. ఆకాశ్ ది అందరితో
త్వరగా కలిసిపోయే మనస్త త్వం కావడంతో ఏ ఇబ్బంది లేకుండా తను కూడా బాగానే ఎంజాయ్ చేస్తు న్నాడు.
శిరీష కి అతని రాక వలన ఇబ్బంది కలగకపోవడం తో ఇంకా ఆనందంగా ఉంది. మరునాడు పెళ్లి. ముందు రోజు
సాయంత్రం ఆడ, మగ అంతా రాధ బామ్మ దగ్గ ర చేరారు. శిరీష రాధని అడిగింది " ఇప్పుడు ఏంచేస్తా రు" అని.
"ఏంలేదు శిరీష, మా ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అయితే మా బామ్మ చెప్పవలసిన విషయాలు ఇలాగే కూర్చోపెట్టి
చెపుతుంది. ఇంకెవరైనా ఏమైనా.అడగాలనుకున్నా, చెప్పాలనుకున్నా ఇప్పుడే చెపుతారు. ఇది మా ఇంటి
అలవాటు." నవ్వుతూ చెప్పింది రాధ. 'ఓహో, అలానా! ఈ పద్ధ తి ఏదో బాగున్నట్లు ంది' అనుకొని తను
కూర్చుంది. బామ్మ అందరినీ ఒకసారి చూసి, "ఏమర్రా ! ఎవరైనా మొదలు పెట్ట ండి" అంది. "నువ్వు చెప్తే
విందామని వస్తే, నువ్వేంటి బామ్మా, మమ్మల్ని అడుగు తున్నావు" అన్నారెవరో. "ఏమో కాలం మారుతోంది. నా
మాటలు నచ్చుతాయో లేదో" అంది బామ్మ. "అబ్బా, బామ్మా, మొదలు పెట్టు . ఆలస్యంగా మొదలు పెడితే ఇంక
ఎవరికీ నిద్రలు ఉండవు" అంది ఇంకొక అమ్మాయి. "సరే, సరే. చూడమ్మా పెళ్లి కూతురా, నువ్వు జాగ్రత్త గా
విను. భార్య అంటే భారమైనది. భర్త అంటే భరించే వాడు అని కాదమ్మా. భార్య భర్తలు ఒకరినొకరు అర్థ ం
చేసుకోవాలి. ఒకరికోసం ఒకరుగా ఉండాలి." అని అంటూండగా ఒక కోణంగి, "అదేంటి బామ్మా, కార్యేషు దాసి
అని మొదలు పెట్ట లేదేం" అన్నాడు. "ఉండరా భడవా, నీకు వెటకారం ఎక్కువైంది. భార్య భర్తని సేవించడం లో
దాసి లాగా, సలహాలిచ్చేటప్పుడు మంత్రి లాగా, సహనం లో భూదేవి లాగా, ఎప్పుడూ లక్ష్మి లాగా కళ కళ
లాడుతూ, భోజనం పెట్టినప్పుడు కన్నతల్లి లాగా ఉండాలి." అంది బామ్మ. అబ్బాయిలు ఆనందంగా చప్పట్లు
కొట్టా రు. "బామ్మా, ఎప్పుడూ పాత పాటే నా, కొత్త గా ఏమైనా చెప్పవచ్చ కదా,"అంది రాధ గారంగా. ఆమె తలపై
చేయి వేసి నిమురుతూ,"అవునమ్మా ఈసారి కొత్త గా నే చెప్పబోతున్నాను. ఎంతసేపు మేమెలా ఉండాలో
చెప్తా రు. అబ్బాయిలు ఇలా ఉండాలి అని ఎవరూ చెప్పలేదా. అనుకుంటారు మీరు. అవును. అబ్బాయిలకు

కూడా కొన్ని లక్షణాలు అవసరమే. అబ్బాయిలు చేపట్టిన కార్యములను విజయవంతంగా పూర్తి చేయాలి.
కుటుంబాన్ని సమర్ధ వంతంగా నడిపించాలి. రూపానికి శ్రీకృష్ణు ని లాగా భార్య ను ఆనందింప చేస్తూ , శాంతం లో
శ్రీ రాముని లాగా ఉండగలగాలి. భార్య పెట్టిన భోజనం తో తృప్తి చెందాలి. సుఖ దుఃఖాలలో ఆమె చేతిని
వదలక ఒక మిత్రు ని లాగా సహకరించాలి. కుటుంబ పెద్ద గా ఎవరికీ కష్ట ం కలగకుండా అందరినీ సంరక్షించాలి.
ముఖ్యంగా భార్య కష్ట సుఖాల్లో తోడునీడగా ఉండాలి." ఈ మాటలు విన్న అమ్మాయిలు ఆనందంగా చప్పట్లు
కొట్టా రు. "ఆగండాగండి. మీరు మీ కష్ట సుఖాలు అరమరికలు లేకుండా భర్తతో పంచుకోవాలి. అతని
‌ సంసారం సుఖసంతోషాలతో వర్థిల్లు తుంది. జీవనమాధుర్యం
కష్ట సుఖాలు అర్థ ం చేసుకోవాలి. అప్పుడే మీ
అనుభవం లోకి వస్తు ంది. అర్ద మైందా. సరె. ఇక పడుకోండి. మళ్లీ ప్రొ ద్దు న్నే లేవాలి." అంటూ బామ్మ లోపలికి
దారితీసింది. మెల్ల గా కబుర్లు చెప్పుకుంటూ అందరూ సర్దు కున్నారు. శిరీష కూడా రాధతో వెళ్ళబోతూ పక్కకి
‌ చూసిన రాధ
తిరిగేసరికి అక్కడ ఆకాశ్ కనిపించాడు. " అరే, మీరు పడుకోలేదా." అంది ఆశ్చర్యంగా. ఆకాశ్ ని
"నువ్వు లేకపోతే ఆకాశ్ కి తోచదేమో." అంది నవ్వుతూ. "అబ్బే, అదేం లేదు. బామ్మ గారు చెప్పే విషయాలు
చాలా బాగున్నాయి. వింటూ ఉండిపోయాను" అన్నాడు. "అవును. ఆవిడ చాలా మంచి విషయాలు చెప్పారు"
అంది శిరీష. బాగా రాత్రి అవడంతో అందరూ వెళ్లి పడుకున్నారు. తెల్లా రి లేచి పెద్ద వాళ్ళు పెళ్ళి పనుల్లో పడితే
రాధ స్నేహితురాళ్ళు ఆమె ను అలంకరించడంలో మునిగి పోయారు. పంతులు గారు తొందర పెట్ట డంతో
ముస్తా బు ముగించి రాధని పెళ్లి తంతు లో కూర్చోపెట్టి స్నేహితురాళ్ళు ఛలోక్తు లతో సంతోషాన్ని వ్యక్తం
చేస్తు న్నారు. పెళ్లి తంతు అంతా ముగిసిన తర్వాత శిరీష, ఆకాశ్ లు రాధ కి చెప్పి వెనుదిరిగారు. రాధ ఆకాశ్ కి
మరీ మరీ థాంక్స్ చెప్పింది. శిరీష, ఆకాశ్ లు తిరిగి వచ్చి తమ తమ పనులలో ములిగి పోయారు. కాని
ఇద్ద రిలోనూ కొంత మార్పు చోటు చేసుకుంది. శిరీష ఆఫీస్ నుండి వచ్చి కాఫీ, స్నాక్స్ రెడీ చేసి ఫ్రెష్ అయి ఆకాశ్
కోసం ఎదురు చూడటం, రాగానే ప్రేమ గా పలకరించడం చేస్తో ంది. ఆకాశ్ కూడా ముందులాగా చిరాకు
పడకుండా ఆమె మంచి చెడులు కనుక్కుంటున్నాడు. ఇద్ద రూ తమ ఆఫీస్ విషయాలు ఆనందంగా
పంచుకుంటున్నారు. ఆరోజు ఆదివారం. ఇద్ద రూ తీరికగా కాఫీ తాగుతూ మాట్లా డుకుంటున్నారు. ఆకాశ్ "శిరీ
ఒక విషయం అడగనా" అన్నాడు. శిరీష "అడగండి" అంది ఏమైఉంటుందా అని ఆలోచిస్తూ . "శిరీ, మీ ఫ్రెండ్
పెళ్లి కి వెళ్లి వచ్చాక మన లైఫ్ లో చాలా మార్పు వచ్చింది కదూ. ముందు లాగా మనలో గొడవలు లేవు కదూ."
అన్నాడు ఆకాశ్. "అవును. ఆ రోజు బామ్మ గారి మాటలతో నేను చేసే పొరపాటు నాకర్థ మైంది. ఎంతసేపు
మీరు అర్థ ం చేసుకోవాలి అని అనుకొనే దానిని, కాని మీ వైపు నుంచి ఆలోచించే దానిని కాదు. బామ్మ గారి
మాటలతో నన్ను నేను మార్చుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది "‌ అంది శిరీష. ఆకాశ్
"నిజమే. బామ్మ గారి మాటలతో నాలో కూడా మార్పు వచ్చింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ
కష్ట సుఖాల్లో తోడునీడగా ఉంటేనే జీవితాన్ని ఆనందమయం చేసుకోగలనని అర్థ ం చేసుకున్నా. ఇన్నాళ్ల నా
ప్రవర్తనకి నేను సిగ్గు పడుతున్నాను శిరీ. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు." శిరీష ని దగ్గ రకు తీసుకొని
ఆర్తిగా అన్నాడు. "అయ్యో, అవేం మాటలండీ. నావల్ల కూడా పొరపాటు జరిగింది. అందులో నా బాధ్యత
కూడా ఉంది. మీరే నన్ను క్షమించాలి." అంది శిరీష. "పోనీ, తప్పొప్పులు మరిచి పోయి ఇంక నుండి ఆనందంగా
ఉందామా" అన్నాడు ఆకాశ్ నవ్వుతూ దానికి సమాధానం గా శిరీష అతని గుండెలకు హత్తు కుపోయింది
సంతోషంగా.
ఓ...గోపాలకృష్ణ (పిల్ల ల కథ) - అన్నపూర్ణ .
జొన్నలగడ్డ
Object 34

అమ్మ...అమ్మ...నా ముంత తయారు చేశావా? అవతల ఆలస్యం అయితే నాకు తెప్ప దాటిపోతుంది. అప్పుడు
నాకు గురుకులం వేళ దాటిపోతుంది. ఇంక గురువుగారు కొప్పడతారు. పాఠం మళ్ళీ చెప్పరు కదా... అమ్మ
వింటున్నావా ? అంటూ గుడిసెలోనుంచి రంగడు అరుస్తు న్నాడు. రంగడి తల్లి... కావేరి, ఆవు దగ్గ ర పాలు
తీస్తో ంది. ఇదిగో పాలు తెస్తు న్నా రంగా, తాగి బయలుదేరుదువుగాని అని అంది. కాసేపటికి లోపలికి వచ్చి
రంగా... ఈ పాలు తాగు నాన్న అని ఇచ్చింది. అమ్మ ఇచ్చిన పాలు తాగి, రంగడు పరుగు పరుగున రేవుకు
వెళ్ళాడు. తెప్పలో కూర్చుని తన భుజాన వేసుకున్న సంచి పొదివి పట్టు కుని, నవ్వుకుంటూ ఆవల మా అన్న,
నా గురించి ఎదురు చూస్తూ ఉంటాడు అని కాస్త అటు ఇటు సర్దు కుని తన ముంత ను ఒకసారి
చూసుకున్నాడు. అన్నయ్య, నేను వస్తు న్నాను అని మనసులో ఒకసారి తల్చుకున్నాడు. తెప్ప నది దాటుతోంది
రంగని చెవిలో అల్ల ంత దూరం నుండి వేణునాదం వినిపించింది. పెదవులపై చిరునవ్వు విరిసింది. ఆవలితీరం
చేరుకోగానే తెప్పలోనుంచి ముందే దుమికి పరుగు అందుకున్నాడు. అలా ముందుకు సాగిపోతూ..... అన్నా...!
గోపాలకృష్ణ ... ఓ....గోపాలకృష్ణ .... అని పిలుస్తూ సాగుతున్నాడు. ఆ పిలుపుకు జవాబుగా ఆ....వస్తు న్నా,
ఇదిగో ఇక్కడే ఉన్నాను అంటూ ఒక పిల్ల వాడు ఎదురు వచ్చి పలకరించాడు. నీ గురించే చూస్తు న్నాను అంటూ
కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగిపోయారు. అలా నడుస్తూ గురుకులం చేరుకున్నారు. రంగడు పిల్ల ల
మధ్య చేరి చదువుకు సిద్ధ ం అయ్యాడు. గురువుగారు వచ్చారు పాఠం మొదలు పెట్టా రు. సాయంత్రా నికి
చదువు పూర్తి అయ్యి మళ్ళీ రంగడు ఇంటికి బయలుదేరాడు. రేవుకు వెళ్లే దారి కొంచం చీకటి పడేసరికి
గుబురు చెట్ల మధ్య కాస్త భయానకంగా ఉంటుందని, తన అన్న తోడు రాగా మళ్ళీ తెప్ప ఎక్కి ఇల్లు చేరటం
రంగనికి అలవాటు. ఇలా కాలం గడుస్తో ంది. ఇంతలో గురుపూజోత్సవం వచ్చింది. ఆ రోజు గురుకులంలోని
విద్యార్థు లు అందరూ గురువుగారికి ఏం సమర్పించాలో ఆలోచిస్తు న్నారు. ఇదంతా వింటున్న రంగడు ఆలోచన
లో పడ్డా డు. ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరిన రంగడు ఆ విషయం వాళ్ల అమ్మతో చెప్పాడు. మనం ఏం
ఇవ్వగలం నాయనా, మనకి ఉన్నది ఆ గోమాలక్ష్మి ఒక్కటే. ఒక ముంతలో పాలు, ఒక ముంతలో పెరుగు
తీస్కుని వేళ్ళు. అవే ఇవ్వు, వారికి అవే మనం ఇవ్వగలిగిన కానుకలు అని అంది వాళ్ల అమ్మ. అలాగే అని
మరునాడు అవే తీసుకుని వెళ్లా లని రంగడు సిద్ధ ం అయ్యాడు. చక్కగా ముంతలకు వాసిని కట్టి జాగర్తగా
పట్టు కుని తీసుకు వెళ్ళాడు. రేవు దాటి ఆ అడవిలో నడుస్తు ంటే కాలు కి ఏదో అడ్డ ం వచ్చి రంగడు ఎదురు
దెబ్బ తగిలి ముందుకు పడిపోయాడు. లేచి ఒళ్ళు దులుపుకుని, చూసేసరికి ఆ ముంతలు పగిలిపోయాయి.
అయ్యో..ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ , తన ఆలవాటు ప్రకారం అన్నా! ఓ... గోపాలకృష్ణ .. అని పిలిచాడు.
అన్న వచ్చాడు. పగిలిన ముంతలు చూపించి నేను ఇప్పుడు గురువుగారికి ఏమి ఇవ్వాలి? అని బాధపడ్డా డు.
అపుడు గోపాలకృష్ణ , మరేమీ ఫరవాలేదు అని ఒక చెట్టు కు కట్టి ఉన్న ఉట్టి లోనుంచి అలాగే ఉన్న రెండు
ముంతలు తీసి రంగనికి ఇచ్చి ఇవి తీసుకువెళ్ళి మీ గురువుగారి కి ఇవ్వు వీటిలో కూడా పాలు, పెరుగు
ఉన్నాయి అన్నాడు. రంగడు మళ్ళీ లేచి కళ్ళు తుడుచుకుని అలాగే, అని వెళ్ళొస్తా ను అని పరుగు పెట్టా డు.
గురుకులం చేరాడు రంగడు. అక్కడ పెట్టిన పెద్ద కుండలు లాంటి బానలు లో పాలు, పెరుగు పోస్తు న్నారు. తను
కూడా వెళ్లి ఆ బానల్లో ముంతలు వంచాడు. తిరిగి తుస్తే మళ్ళీ ముంతల్లో పాలు, పెరుగు వచ్చాయి. మరలా
వంచాడు. బానల్లో తొలపటం, తిరిగి చూస్తే మళ్ళీ ముంతలు నిండటం. ఇలాగే నడుస్తో ంది. ఆ చోద్యం
చూస్తు న్న ఒక పిల్లా డు అక్కడకు వచ్చి ఏదీ ఇలాతే నేను చూస్తా ను అని ముంత లాక్కున్నాడు. అలా లాగటం
లో పాల ముంత కింద పడి పగిలింది. సగం విరిగింది, అయినా మిగిలిన సగం లో పాలు నిండాయి. అందరూ
ఆశ్చర్యం తో చూస్తు న్నారు. గురువుగారు వచ్చి ఏమైంది మీరు అందరూ ఎం చూస్తు న్నారు అని అడుగగా
అక్కడ జరిగిన వింత చెప్పారు. రంగా, నీకు ఈ ముంతలు ఎవరు ఇచ్చారు అని అడిగారు గురువులు. మా
అన్న గోపాలకృష్ణ ఇచ్చాడండి అన్నాడు రంగడు. అన్నా? నీకు తోబుట్టు వులు ఎవరు లేరు కదా అని గురువులు
అంటే.. రంగడు వెంటనే, లేదండి నాకు ఒక అన్న ఉన్నాడండీ, ఇక్కడికి దగ్గ ర్లో ఉన్న అడవి లొనే ఉంటాడు.
నాకు రేవు దగ్గ ర నుంచి రోజు గురుకులం చేరెవరకు సాయం వస్తా డు, అలాగే సాయంత్రం మళ్ళీ రేవు దగ్గ ర
దించుతాడు అని చెప్పాడు. అతను మీ అన్న అని నీకు ఎవరు చెప్పారు అని గురువుగారు అడిగారు. రంగడు
ఇలా చెప్పసాగాడు. గురుకులం లో చేరిన కొత్త ల్లో నాకు ఈ అడవి దాటి ఇక్కడకు రావటానికి చాలా భయం
వేసేది. చీకటి పడితే ఇంక నాకు భయంతో ప్రా ణాలు గుప్పెట ఉండేవి. ఇలా నాలుగు రోజులు గడిచేసరికి నాకు
జ్వరం వచ్చింది. కానీ, నేను పాఠాలు వినలేకపోతున్నానని ఏడిచేవాడిని. నాకు ఆరోగ్యం కుదుట పడ్డా క మా
అమ్మ చెప్పింది. అడవిలోకి వెళ్ళగానే అన్నా... ఓ..గోపాలకృష్ణ .... అని పిలువు. ఆ పిలుపు విని, నల్ల నివాడు,
నీకంటే ఒక గుప్పెడు ఎత్తు ఉన్నవాడు, పసుపు పచ్చని పంచె కట్టు కుని, చేతిలో పిల్ల నగ్రో వి పట్టు కుని ఒక
పిల్ల వాడు నీ పిలుపుకు జవాబిస్తూ ఇక్కడే ఉన్నాను అని అంటూ ఎదురు వస్తా డు. అతడే నీ అన్న అని అమ్మ
చెప్పింది. నాతో రోజు వస్తా డు, నాకు చాలా విషయాలు చెప్తా డు, ఎన్నో నేర్పిస్తా డు, అసలు అతనితో
ఉన్నంతసేపు నాకు ఏమి గుర్తు కు రాదు, ఎంతో ఆనందంగా ఉంటుంది గురువుగారు అన్నాడు రంగడు. మీ
అన్న నీకు చాలా నేర్పించాడు అన్నావు ఏది మచ్చుకకు ఒకటి చెప్పు అన్నారు గురువుగారు. ఓ... మా అన్న
నాకు వేళ్ళ మధ్య పచ్చడి బద్ద లు పెట్టు కుని చలిది తినటం నేర్పించాడు గురువుగారు, చక్కని పద్యాలు
నేర్పాడు అంటూ రంగడు చెప్పుకుంటూ పోతున్నాడు. ఇవతల చూస్తే గురువు గారి కళ్లు ఆనందబాష్ప ధారలు
కురుస్తు న్నాయి. ఆయనకు భాగవతం లోని గోకులం లో బాల కృష్ణు డు స్నేహితులతో మెలిగిన సన్నివేశాలు,
పద్యాలు, లీలలు అన్ని గుర్తు కు వచ్చాయి. వేగంగా వచ్చి రంగా... నువ్వు ఎంత అదృష్ట ం చేస్కున్నావురా
భగవంతుడిని కళ్లా రా చూసావు, ఆయనతో ఆడుకున్నావు అని రంగడిని గుండెలకు హత్తు కుని, మనసారా
ఆశీర్వదించి, నువ్వు నా శిష్యునివి కావటం నా అదృష్ట ం నాయనా అని అన్నారు. ఈ మాటలు రంగనికి అర్ధ ం
కాలేదు. వెనుకనుంచి అంతా వింటున్న గురువుగారి భార్య ఆయనను ఏవిటి ఇదంతా అని అడిగింది. గురువు
గారు అప్పుడు ఇలా చెప్పారు ఏముంది “యద్భావం తత్భవతి” అన్నారు. అంటే రంగనికి వాళ్ళ అమ్మ
ఎలాంటి గుర్తు లతో తనకు అన్న గా ఒక పిల్ల వాడు కనిపిస్తా డు అని చెప్పిందో ఆ మాటలపై పూర్తిగా నమ్మకం
ఉంచి అలాగే ఆ గోపాల కృష్ణు డిని ఎలుగెత్తి పిలిచాడు రంగడు. అందుకని అతని నమ్మకాన్ని దృఢపరుస్తూ
అలాగే భగవంతుడు కనిపించాడు. మనం ఆయనను ఎలా కొలుచుకుంటామొ, ఎలా ఆరాధిస్తా మొ అలాగే
మనల్ని కరుణించి ఆ స్థా యికి సర్వాంతర్యామి కరుణ, ఆకృతి దాల్చి కటాక్షం చూపిస్తా డు. అదే ఈ రంగనితో
జరిగింది. ఆ పరమాత్ముని కరస్పర్శ వల్లే ఆ ముంతలు మరల మరల నిండి ఆయన లీలని ప్రకటించాయి.
వాళ్ల మ్మ పూజ ఫలించింది. వాడి మనసు నిర్మలం అందుకే పరమేశ్వరుడు వాడికి కనిపించాడు అని అన్నారు.
ఇద్ద రూ ఒకసారి ఆ కృష్ణు నికి మనసారా నమస్కారం చేసుకున్నారు. బయట పిల్ల లు కూడా “ నంద కిశోరా
హే,గోపాల బాల...” అంటూ తాళాలు వాయిస్తూ కృష్ణ భజనలు చేస్తు న్నారు. అడవిలోనుంచి మధురమైన వేణు
గానం గాలిలో సుగంధాలు నింపుతూ అందరిని తన్మయులను చేసింది. 🙏 ౼ ౼ 🙏
స్వాతంత్ర్య దినోత్సవం - ఎం బిందుమాధవి
Object 35

"నీకు
ఇవ్వాళ్ళ
ఆఫీస్
లేదు
కదా!
సరదాగా
మా
ఫ్యాక్టరీలో
జరిగే
జెండా

వందనానికి నువ్వూ రా" అన్నాడు ప్రభాకర్..

భార్యఛాయతో. వారి పెళ్ళయి నాలుగు నెల్ల యింది.


ఛాయ సిటీ లో చదువుకుని ఉద్యోగం చేస్తు న్నా..ఎప్పుడూ ఫ్యాక్టరీలకి వెళ్ళి ఎరగదు. అక్కడి వాతావరణం
తనకి కొత్త కనుక

తను పని చేసే కంపెనీలో తన పరపతి చూపించాలని ప్రభాకర్ ఇలా ప్లా న్ చేశాడు.

ప్రభాకర్ కి వర్కర్స్ అందరితోను సానుకూలమైన సంబంధాలు ఉన్నాయి. అంచేత ఈ సారి స్వాతంత్ర్య


దినోత్సవాన్ని వారికి

గుర్తు ండిపోయే వేడుక లాగా జరిపించాలని ముందే నిర్ణయించుకున్నాడు.

ఒక నెల రోజుల ముందు నించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాడు. వర్కర్స్ కి బాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, కబడి,
థ్రో బాల్....

మొదలైన ఆటలపోటీలు నిర్వహించాడు.

అందులో బహుమతులు నిర్ణయించబడ్డా యి. కానీ వివరాలు జెండా వందనం రోజే..కంపెనీ జీఎం
సమక్షంలోతెలియజేయబడతాయని ప్రకటించారు. అలా చెయ్యటం వల్ల ఆ రోజు ఎవ్వరూ ఎగ్గొ ట్ట కుండా
ఉత్సాహంగా ఆఫీస్ కివస్తా రు అనేది ప్రభాకర్ ఆలోచన.

*******
ప్రభాకర్ పని చేసే ఫ్యాక్టరీ లో షుమారు 300 మంది వర్కర్స్ ఉంటారు. అది మొక్కజొన్న నించి స్టా ర్చ్ తయారు
చేసే కంపెనీ.

వర్కర్లకి చిన్న పెద్దా , మెజారిటీ- మైనారిటీ..అన్నీ కలిపి నాలుగు యూనియన్స్ ఉన్నాయి.

సూపర్వైజరీ స్టా ఫ్ కి మరొక యూనియన్.

వెల్ఫేర్ ఆఫీసర్ కనుక ప్రభాకర్ తన భావోద్వేగాలని ఎప్పుడు అదుపులో..ఉంచుకోవాలి..అలా ఉంచుకుంటాడు


కనుకనే ఇంచు మించు అన్ని యూనియన్స్ తోను సానుకూలమైన సంబంధాలే ఉన్నాయి.

క్లిష్ట సమయాల్లో వర్కర్స్ తరఫున వకాల్తా పుచ్చుకుని మేనేజ్మెంట్ వారితో గట్టి గా మాట్లా డి వారి
హక్కులువారికిప్పించేవాడు.

నాలుగేళ్ళకో సారి వారి వేతన సవరణలు, ఉత్పత్తి స్థా యితో (production linked bonus) లింకైన బోనస్
లు...ఇతర సంక్షేమపధకాలు..సమస్త ం యాజమాన్యంతో చర్చించి వర్కర్లకి న్యాయం చేస్తా డని

ప్రభాకర్అంటే అందరు యూనియన్ లీడర్లకిగౌరవమే!

వృత్తి ధర్మంగా ఏదైనా గొడవ చేసినా, ప్రభాకర్ మీద ఈగ వాలనిచ్చేవారు కాదు.

*******
అనుకున్నట్టే ఉదయం తొమ్మిది గంటలకల్లా ప్రభాకర్- ఛాయ ఫ్యాక్టరీకి వెళ్ళారు. అప్పటికే వర్కర్స్ అందరూ
వచ్చి ఉన్నారు. జీఎం వచ్చాక జెండా ఎగరేసి, జాతీయ గీతాలాపన జరిగాక..వర్కర్స్ అందరినీ రెండు మూడు
బృందాలుగా విభజించారు.

మ్యూజికల్ చైర్స్ ఆట ప్రా రంభమయింది. మైక్ లో మ్యూజిక్ వినబడుతున్నది. అందరూ ఉత్సాహంగా ఛైర్స్
చుట్టూ పరుగెడుతున్నారు. మ్యూజిక్ ఆగినప్పుడల్లా కుర్చీలు ఆక్రమించుకోబడుతూ ఆట హుషారుగా
సాగుతున్నది.
అలా ఒక్కో గ్రూ ప్ లోను ఫస్ట్ వచ్చిన వారిని అభినందిస్తూ పక్కకి కూర్చోబెడుతూ అన్ని గ్రూ ప్ ల ఆట పూర్తి
చేసి, చివరికి ఆ ఫస్ట్ వచ్చిన వారి మధ్య మళ్ళీ ఆట నడిపి చివరగా ఫస్ట్..సెకండ్ వచ్చిన వారి పేర్లు
ప్రకటించారు.

ఇక..ఆటల పోటీల్లో ను, వినోద కార్యక్రమాల్లో ను విజేతలని అభినందిస్తూ బహుమతి ప్రదానం మొదలయింది.

ప్రభాకర్ అనౌన్స్మెంట్ చేస్తు న్నాడు. విజేతలని ఒక్కొక్కరినే క్రమ పద్ధ తిలో వచ్చి స్టేజ్ దగ్గ రకి తీసుకొచ్చే పని
అసిస్టెంట్ శంకర్చే స్తు న్నాడు.

"వెంకటేష్ ..బాడ్మింటన్ లో ఫస్ట్ ప్రైజ్" ప్రకటన వినబడగానే ఒక యూనియన్ లో కింది స్థా యి లీడర్ వచ్చి
ఆనందంగా బహుమతి అందుకున్నాడు.

"రామా రావు..బ్యాడ్మింటన్ లో సెకండ్ ప్రైజ్" ప్రకటన వస్తూ నే చిన్న కలకలం! "అంతా మోసం, అన్యాయం.. ఆ
రోజు అతను తన వైపు వచ్చిన "కాక్" ని వదిలేశాడు. అది కాక రెండు-మూడు సార్లు రాంగ్ సర్వీస్ చేశాడు.
తనకి వచ్చిన కాక్ ని బౌండరీ బయటికెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. అయినా సార్ ఆయన వైపు మాట్లా డి
పాయింట్స్ అతనికే వేశారు" అంటూ ఇంకో యూనియన్ లో వర్కర్స్ గట్టిగా అరవటం మొదలు పెట్టా రు.

"ఆటలు, రూల్స్ గురించి మీకు పూర్తిగా తెలియదనే కదా మనం ఆ రోజు మన యూనియన్స్ గురించి గానీ, మీ
గురించిగానీ తెలియని వ్యక్తు లని జడ్జిలుగా బయటి నించి తెప్పించాం.. మీకు తెలుసు కదా" అన్నాడు,
ప్రభాకర్.

సందడి సర్దు మణిగింది. కార్యక్రమం కొనసాగుతున్నది.

"మల్లేష్..బృందం కబడీ లో ఫస్ట్ ప్రైజ్" ప్రకటించాడు ప్రభాకర్. లావుగా ఉన్న మల్లేష్ తన బృందం తరఫున
బహుమతి అందుకోవటానికి వేదిక మీదికి వచ్చాడు. "ఇతనికి స్టేజ్ దాకా నడవటానికే ఇంత సేపు పట్టింది.
వీళ్ళకి కబడీ లో ఫస్ట్ ప్రైజా" అని అక్కడి వర్కర్స్ మధ్యలో సన్నగా గుస గుసలు!

"సామయ్య..బృందం సెకండ్ ప్రైజ్"...ప్రకటన వినగానే ఫస్ట్ ప్రైజ్ రానందుకు అసంతృప్తిగా ముఖం పెట్టు కుని
గొణుక్కుంటూ వేదికనెక్కాడు..సామయ్య. సామయ్య ముఖ కవళికలు చూసిన అతని యూనియన్ వర్కర్స్..."
అన్నిబహుమతులు ఒక యూనియన్ సభ్యులకే వస్తు న్నాయ్.. తమ యూనియన్ ని యాజమాన్యం కావాలనే
చిన్న చూపుచూస్తు న్నదని, అందుకే సెకండ్ ప్రైజ్ ఇచ్చారని... "పీ ఎం డౌన్ డౌన్..జీఎం డౌన్ డౌన్, అన్యాయం
నశించాలి. ఆటల పేరు చెప్పి మాపట్ల పక్షపాతం చూపిస్తు న్నారు. పిఎం సార్ బయటికి రండి మీ సంగతి
చూస్తా ం" అని గట్టిగా నినాదాలివ్వటం మొదలు పెట్టా రు.

ఇలాంటివి ఎప్పుడూ చూడని ఛాయ కి ప్రభాకర్ ని వాళ్ళేం చేస్తా రో అని చెమటలు పట్టేశాయి.

సామయ్యకి చెందిన యూనియన్ నాయకుడు ముందుకొచ్చి .."ఇంత వరకు ఇలా మనకి ఆటల పోటీలు పెట్టి న
పిఎం సారే లేరు. ఇప్పుడు మీరు ఇలా చేస్తే మనకి ఇక ముందు ఇలాంటి సరదాలు ఉండవు. నిజంగా
యాజమాన్యం పక్షపాతంగా ఉంటే నేనూ ఊరుకోనని" వారిని ఊరుకోబెట్టి కార్యక్రమం కొనసాగటానికి
సహాయం చేశాడు.

ఛాయ ముఖంలో భయం గమనించిన ప్రభాకర్ ఆమెని తన ఛేంబర్ లోకి పంపేశాడు.

ఇలా నినాదాల మధ్యే మిగిలిన ఆటలకి సంబంధించిన ప్రకటనలు, బహుమతి ప్రదానాలు జరిగాయి.

వచ్చిన వారందరికీ తినుబండారాలు..టీ ఇచ్చి ఆ రోజు కార్యక్రమం ముగించి ప్రభాకర్, ఛాయ ఇంటికొచ్చారు.
ఫ్యాక్టరీలో వినోదంతో ప్రా రంభమయి, టెన్ష న్ తో ముగిసిన కార్యక్రమం ఛాయని భయ పెట్టింది. రాత్రి
పడుకునేటప్పుడు భర్తతో "ఛీ ఈ పాడు ఉద్యోగం మానెయ్యండి. మీరు ఫ్యాక్టరీ నించి వచ్చేటప్పుడు దారి కాచి
ఏమైనా చేస్తే...అమ్మో" అని గుండెల మీద చెయ్యేసుకున్నది. "అయినా మీ ఉద్యోగం ఇలా ఉంటుందని నాకు
తెలియదు! " అన్నది.

"అలా భయ పడితే ఉద్యోగాలేం చేస్తా ం! వాళ్ళ దూకుడు అలా ఉంటుంది. మన లాగా చదువుకున్న వారు
కాదు కదా! ఏమీ చెయ్యరు. ఆ యూనియన్ నాయకుడిని చూశావు కదా.. వెంటనే వచ్చి ఎలా వాళ్ళని అదుపు
చేస్తు న్నాడో! ఒక్కోసారి ఆ నాయకులే మమ్మల్ని బెదిరించినట్లు నలుగురిలో నటించి, తన క్రింద వర్కర్స్ ని మా
మీదకి రాకుండా కాపాడుతూ ఉంటారు" అని భార్యని బుజ్జ గించి ఊరుకోబెట్టా డు.

********
కాలంలో పదేళ్ళు గడిచాయి. ఛాయ కూడా ప్రభాకర్ ఉద్యోగంలో ఉండే ఆటు-పోటులకి అలవాటు పడింది.

వర్కర్ల అభిమానం పొందటమంటే మాటలు కాదు. వారితో వ్యవహారం కత్తి మీద సాము. వారికి ఆగ్రహం
వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్ట లేం! అలాగే యాజమాన్యం వారు...బోనస్ పెంచటమన్నా, వేతన
సవరణలన్నా, ఇతర సంక్షేమ పధకాలన్నా..తమకి ఎంత ఆర్ధిక భారమో అనే దృష్టిలో గీచి గీచి బేరాలాడి
పర్సొనేల్ అధికారులకి పగ్గా లేస్తూ ఉంటారు.

ఇన్ని పరిమితుల మధ్య పని చేస్తూ ..విజయవంతంగా పదిహేనేళ్ళ సర్వీస్, మూడు ఫ్యాక్టరీల్లో వేతన సవరణ
అగ్రిమెంట్స్ చేసిన ప్రభాకర్ ఆ సంవత్సరం "బెస్ట్ పర్సొనేల్- మరియు సంక్షేమ అధికారి" గా జాతీయ అవార్డ్ కి
ఎన్నికయ్యాడు.

రేడియో లో దూరదర్శన్ లో కూడా ప్రభాకర్ తో ఇంటర్వ్యూలు వచ్చాయి.

అతను అప్పటి వరకు పని చేసిన అన్ని కంపెనీల్లో ను అభినందన సభలు ఏర్పాటు చేసి యూనియన్
నాయకులు, యాజమాన్యం వారు పొగడ్త ల్లో ముంచెత్తా రు.

ఆ అభినందన సభకి ప్రభాకర్ ఛాయని కూడా తీసుకెళ్ళాడు. యూనియన్ లీడర్ ఒకతను వేదిక మీదకి
వచ్చి.."ఈ సార్ కి అవార్డ్ రావటం మాకు దక్కిన గౌరవంగా భావిస్తు న్నాం. మా తోటి వర్కర్, కంపెనీ సరుకు
తేవటానికి లారీ మీద వెళ్ళి ఎక్కడో రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోతే, ఈ సార్ ఆ ఊరు వెళ్ళి అక్కడే రెండు
రోజులుండి ఆ పోలీసులతో మాట్లా డి..కేస్ అవకుండా చూసి ఆ వర్కర్ ఇంటికి శవాన్ని చేర్చి అతని కుటుంబ
సభ్యులకి ధైర్యం చెప్పి, దహన సంస్కారాలకి తన జేబులో డబ్బిచ్చి వచ్చారు." అని ఇంకా ఏదో
చెబుతున్నాడు.

ఛాయ, "ఇతనే కదండీ, మన పెళ్ళైన కొత్త లో మీ ఫ్యాక్టరీలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ... పిఎం
సార్ డౌన్ డౌన్అని అరిచి, బయటికి రా...నీ సంగతి చూస్తా అని బెదిరించింది" అనడిగింది ప్రభాకర్ ని.

"నేను నీకు అప్పుడే చెప్పాను కదా! వాళ్ళకి ఆగ్రహం వచ్చినా..అనుగ్రహం వచ్చినా పట్ట లేము అని... కొత్త లో
భయపడి నన్ను ఈ ఉద్యోగం మానెయ్యమన్నావు! ఏదో ఒక రకమైన రిస్క్ ప్రతి ఉద్యోగంలోను ఉంటుంది.
జాగ్రత్తగా, లౌక్యంగా నిర్వహించుకోవటం నేర్చుకుంటే మంచి గుర్తింపు, గౌరవం అందులోనే వస్తు ంది" అన్నాడు.

*******
షుమారు నలభయ్యేళ్ళ తరువాత, లండన్ లో ఉన్న మనవడు అఖిల్ ..స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు టీవీ
లో చూస్తూ ... అందులో త్రివిధ దళాల్ మార్చ్ పాస్ట్ లు, గౌరవ వందనాలు, ప్రధాన మంత్రి సెక్యూరిటీ అన్నీ
గమనించి "అమ్ముమ్మా నువ్వెప్పుడైనా రెడ్ ఫోర్ట్ మీద జెండా వందనానికి వెళ్ళావా" అనడిగాడు ఛాయని.
"నా పెళ్ళైన కొత్త లో తాతయ్యా వాళ్ళ ఫ్యాక్టరీ లో జెండా వందనానికి వెళ్ళాను. అది రెడ్ ఫోర్ట్ లో లాగా త్రివిధ
దళాల గౌరవ వందనం లేదన్న మాటే కానీ ఏమీ తక్కువ కాదు. అబ్బో ఉన్నట్టు ండి ఎంత హడావుడి, ఎంత
టెన్ష న్...నాకు భలే భయమేసింది" అని నవ్వుతూ ప్రభాకర్ వంక చూసింది.

ప్రశ్నార్ధ కంగా ముఖం పెట్టిన మనవడిని ఒళ్ళో కూర్చోపెట్టు కుని..అమ్ముమ్మ మా ఫ్యాక్టరీకి వచ్చిన రోజు ఏం
జరిగిందో చెబుతూ.. తన ఉద్యోగం లో ఉండే దైనందిన ప్రమాదాలు గురించి చెప్పటం మొదలు పెట్టా డు.

"ఒకసారి ఒక డ్రైవర్ తన షిఫ్ట్ టైం లో డ్యూటీ చెయ్యకుండా క్యాంటీన్ లో తాగేసి గొడవ చేస్తు ంటే డ్యూటీ టైం
లో క్యాంటీన్లో ఎందుకున్నావని షో కాజ్ నోటీస్ ఇచ్చాను. అతను ఆ తాగిన మైకంలో ఆ సస్పెన్ష న్ లెటర్ ని
నోటీస్ బోర్డ్ లోంచి తీసిచించి పారేశాడు."

"అలా చెయ్యచ్చా తాతయ్యా? అప్పుడు నువ్వేం చేశావ్" అన్నాడు ఆశ్చర్యంగా అఖిల్.

"అలాంటప్పుడు అతన్ని సస్పెండ్ చెయ్యటమే!" అన్నాడు ప్రభాకర్.

"తరువాత ఏమయింది" అన్నాడు

"అలాంటప్పుడు నాయకులు తమ వర్కర్లని కాపాడుకోవటానికి విషయాన్ని దారి మళ్ళించి తమ వాదన కరెక్టే


అని నిరూపించుకోవటానికి స్ట్రైక్ చేస్తా రు. అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి అక్కసుతో తనని, జీఎం ని సీట్లో
నించి కదలనివ్వకుండా ఘెరావ్ చేస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. అధికారులం ఆఫీస్ లోకి
వస్తు ంటే నినాదాలు ఇస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తా రు. మనం భయపడ్డ ట్టు కనిపిస్తే ఇంకా
రెచ్చిపోతారు."

"అప్పుడు యాజమాన్యం తరఫున మేము, వారి తరఫున యూనియన్ నాయకులు కూర్చుని చర్చలు జరిపి
వర్కర్ చేసినతప్పు నిరూపించి.. ఎక్స్ ప్ల నేషన్ తీసుకుని వార్నింగ్ ఇచ్చి వదిలెయ్యటమో, తప్పు పెద్ద దైతే
ఇంక్రిమెంట్ కట్ చెయ్యటమో లాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం" అన్నాడు.

ఇలా తాతయ్య తన ఉద్యోగం గురించి కధలు కధలుగా చెబుతుంటే కళ్ళు విప్పార్చుకుని విన్న అఖిల్ "అందుకే
అమ్ముమ్మ రెడ్ ఫోర్ట్ లో సెక్యూరిటీ గురించి మాట్లా డింది! పాపం ఎంత భయపడిందో! నీకు కూడా అలా రక్షక
భటులుండాలనుకుందేమో!" అన్నాడు.

ఆరిందా లాగా మాత్లా డుతున్న మనవడి బుగ్గ లు పుణికి, "నువ్వు కూడా అలా జాతీయ అవార్డు లు తెచ్చుకుని
తాతయ్య పేరు నిలబెట్టా లి" అని చెప్పింది అమ్ముమ్మ.
కెప్టెన్ - ఆకెపతి కృఇష్ణమోహన్
Object 36

అప్పుడు సమయం
మధ్యాహ్నం 2
గంటలునేను బస్టా ండ్
సెంటర్ లో రిక్షా ఎక్కి
సంధులు, గొందులు
లోంచి రైల్వే స్టేషన్ కి
చేరుకునేటప్పటికి
బొంబాయి మెయిల్
కోసం గంట కొట్ట డం
వినిపించింది. గంట
కొట్టినాబండి రావడానికి
ఇరవై నిముషాలు పైన
పడుతుందని చెప్పారు.
బెంచీ మీద కూర్చోని
స్టేషను చూస్తూ ఉన్నాను.
మిట్ట మధ్యాహ్నం ఎండ
దెబ్బకి స్టేషన్లో పెద్ద గా
జనసంచారం లేదు .
రెండు కుక్కలు బెంచీ
మీద జేరి పడుకొని
ఉన్నాయి .ఈ టైంలో
వచ్చే పోయే బండ్లు
లేవేమో, ప్రయాణికులు
కూడా పెద్ద గా లేరు. ఈ
ఊరి నుంచి బొంబాయికి
పొయ్యే వాళ్ళెవ్వరు ఉంటారు? నాకు తప్పదు కదా, మిలటరీ వారెంట్ మీద నా కోసమే ఆ రోజు అక్కడ
ఆపుతున్నారు. స్టేషను బయట నల్ల టి రైల్వే నీళ్ల టాంకు లోంచి నీళ్ళు పట్టు కునేదానికి యిద్ద రు పిల్లో ళ్ళు
తిరుగుతూ ఉన్నారు. ఈ బండికి నన్ను ఎక్కించి ఇంటికి పొయ్యి తినేసి వద్దా మని స్టేషను మాస్టా రు ఎదురు
చూస్తూ ఉన్నాడు.

ఇంటి దగ్గ ర వీడ్కోలు చెప్పేటప్పుడు చుట్టు ప్రక్కల వాళ్ళందరూ బయటికి రావడం గుర్తు కొచ్చింది. అమ్మ ఏడుపు
ఆపుకోలేక పోయింది. నాయన మాత్రం ఏం మాట్లా డలేదు. చేరిన తరువాత ఉత్త రం రాయడం మర్చిపోవద్ద ని
మాత్రం చెప్పాడు. అక్క వీధిలోకి రావడానికి సిగ్గు పడుతున్నట్లు తలుపు వెనకాలనుంచి చూస్తూ నిలబడింది.
తమ్ముడు మాత్రం బస్సెక్కించేదానికి సూట్ కేసు మోసుకుంటూ నా వెనకాలే వచ్చాడు. ఒకరిద్ద రు నా
ఈడువాళ్ళు మళ్ళీ ఆర్మీ సెలెక్షన్స్ జరిగినప్పుడు మాకు చెప్పన్నా అని అడ్రస్సు రాసిచ్చారు.
రెండో లైన్లో గూడ్స్ ఇంజను షంటింగ్ జరిగిందన్నట్లు వెనక్కి ముందుకి రైలు పెద్ద శబ్ద ంతో కదిలింది. సెలవుల
మీద ఊరికొస్తే యుద్ధ ం మొదలయ్యే సూచనలున్నాయని వెంటనేవచ్చెయ్యమని కల్నల్ నుంచి టెలిగ్రా ం
రావడంతో బయల్దేరాల్సి వచ్చింది. స్టేషన్ అసిస్టెంట్ వచ్చి నిమ్మకాయ షోడా తెచ్చినాడు. మెయిల్
వచ్చేస్తో ందని చెప్పి ఫ్లా ట్ ఫారం పైన నిలబడ్డా డు. నా కోసమే ప్రత్యేకమైనస్టా ప్ కాబట్టి సామాను తీసుకొని
సిద్ద ంగా నిలబడ్డా ను.

డీజిలు ఇంజను లాక్కుంటూ వచ్చిబొంబాయి మెయిల్ ని ఆపింది. మొదటి తరగతి పెట్టె లోకి ఎక్కి సామాను
అందుకున్నాను. స్టేషన్ మాస్టా రుకి, అసిస్టెంట్ కివీడ్కోలు చెప్పి పోయి నాసీట్లో కూర్చున్నాను. రైలు వేగం
అందుకుని ఊరు దాటేసింది. రైలు కిటికీ లోంచి వేడి గాలి దూసుకొస్తో ంది. ఇల్లు , ఊరు వదిలిపోతున్నందుకు
ఏదో భాధ. రైలు వేగానికి తాటిచెట్ల తోపులు వెనక్కెనక్కి దాటుకుని పోతున్నాయి. రాత్రి భోజనానికి అమ్మ
కట్టి చ్చిన అన్నం పాకెట్టు ప్రక్కన పెట్టి కిటికీ మీదకి ఆనుకుని పడుకున్నాను. కెప్టెన్,కెప్టెన్, అని ఊళ్ళో వాళ్ళు
పిలుస్తు ంటే ఒక ఆనందం ఇంకో పక్క ఊరి వదలి దూరం పోతున్నందుకు భాధ. ఈ రెండు భావాల మధ్య
ఊరికొచ్చిన ప్రతీసారి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. కాలేజీ రోజుల్లో ఎప్పుడూ మిలిటరీలో చేరాలని
అనుకోలేదు. అమ్మ వాళ్ళకి మిలిట్రీఅంటేనే భయం. ఆ ఉద్యోగాలు వద్దు లేయ్యా, ఊళ్లో నేఏ గుమస్తా నో,
టీచరుఉద్యోగమో చూసుకుందాం లేయ్యా అనేది. నాయన కూడా మిలిట్రీ గురించి ఎప్పుడూ చెప్పలేదు.
ఇంజనీరు గాని, డాక్టరుగాని చదివి పెద్ద ఉద్యోగం చేయాలనీ ఆయన ఆశ.

మిలిట్రీ వాడికి పిల్ల నియ్యరని ఇంట్లో ఇంకో భయం. అసలు నేనెందుకు మిలిట్రీకి పోవాల్సి వచ్చిందంటే
బలరామ్ గురించి చెప్పాల్సిందే.

కెప్టెన్ బలరామ్ పొడవైన విగ్రహం, దేహ ధారుడ్యం, చురుకైన మేధస్సు, ధైర్యం అన్నీ కలిసిన
వ్యక్తిత్వంబలరాంది.

కాలేజీ రోజుల్లో బలరామ్ గురించి అందరూ గొప్పగా అనుకునేవాళ్లు . బాగా చదువుతాడని, బాగా తెలివిగల
వాడని, మనసు పెట్టి చదివితే IAS ఆఫీసర్ అవుతాడని అనుకొనేవాళ్ళు. కాని బలరామ్ ఆలోచనలు వేరేగా
ఉండేవి. యూనిఫారం ధరించి దేశానికి సేవ చేయాలనీ అనుకునేవాడు. ముఖ్యంగా గగన తలంలో విన్యాసాలు
చేసే వాయుసేన అంటే అతడికి చాలా యిష్ట ంగా ఉండేది.

కాలేజీ చదువు పూర్తయిన తరువాత రెండు సంవత్సరాలు ఎవరికీ అతని ఆచూకీ తెలియలేదు. ఒకరోజు మా
స్నేహితుడు భాషాకు ఒక ఉత్త రం వచ్చింది, అందులో “నేను ట్రైనింగ్ పూర్తి చేసికొని ఎల్లు ండి బొంబాయికి
వెళుతున్నాను. మిమ్మల్నందరిని చూడాలని ఉంది. మధ్యాహ్నం మెయిల్ లో వస్తు న్నాను. నువ్వు,
వెంకటేశ్వర్లు , సుబ్బరాం అందరూ స్టేషన్ కి రాగలరు” ఇట్లు బలరామ్ .

భాషా ద్వారా తెలిసికొని నేనూ, వెంకటేశ్వర్లు మా మిత్ర బృందం అంతా రైల్వే స్టేషన్ కి చేరుకున్నాము.
ఒకరిద్ద రు దండలు పట్టు కొచ్చారు. అందరూ మెయిల్ కోసం ఎదురు చూస్తు న్నారు.బలరామ్ కిబంధువులు
పెద్ద గా లేరు. తోబుట్టు వులు కూడా లేరు. అమ్మ మాత్రం ఊళ్ళో ఉండి పాడి వ్యాపారంతో కుటుంబం లాక్కొస్తూ
ఉండేది.

బొంబాయి మెయిల్ రాగానే అందరం గబగబా బోగి లోకి ఎక్కాము. ఎదురుగా నిండైన Air force
యూనిఫారంలో కెప్టెన్ బలరామ్. “మామ ఉండు ఉండు” అని గట్టి గా ఊపుతూ, టోపి తీసేసి ఆలింగనం
చేసుకున్నాడు. హుందాగా నవ్వుతు మమ్మల్ని ఆప్యాయంగా పలకరించాడు. బోగిలో వాళ్ళు, బయటి జనం
అందరూ మమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వెంట తీసుకొచ్చిన పండ్లు ఇచ్చేసి ఆటోగ్రా ఫ్, అడ్రస్
తీసుకున్నాము. బండి బయల్దేరే సమయం అవుతున్నట్టు గార్డ్ పచ్చ జెండా ఊపాడు. మేము త్వరగా బోగి దిగి
ప్లా ట్ ఫారం నుంచి చేతులు ఊపాము. బలరామ్ మా అందరితో గేటు నుంచి మాట్లా డుతూ నిలబడ్డా డు. మళ్ళీ
ఎప్పుడు వస్తా వు? అని అడిగాము. ”When Duty permits” బలరామ్ మాతో అన్న చివరి మాటలు, వేగం
పుంజుకుని రైలు కనుచూపు దాటి పోయింది. బలరామ్ రూపం అదృశ్య మయ్యింది.

రోజులు గడిచిపోయాయి. మూడు సంవత్సరాలలో మేము కాలేజీ చదువులు పూర్తి చేసుకుని బయటకు
వచ్చాము. బలరామ్ గురించి ఏమీతెలియలేదు. సరిహద్దు ల్లో వైమానిక దళంలో పోస్టింగ్ పడిందని మాత్రం
తెలిసింది. అదే సమయంలో భారత్ సరిహద్దు ల్లో యుద్ద ప్రకంపనలు మొదలయ్యాయి. మేమందరం రోజూ
పేపర్ల ద్వారా, రేడియో ద్వారా తెలుసుకొని యుద్ధ ం గురించి చర్చించుకునే వాళ్ళం. మా కందరికీ
బలరామ్గు రించి ఆందోళనగా ఉండేది.

ఒకరోజు పిడుగు లాంటి వార్త “సరిహద్దు ల్లో జరిగిన భీకర వైమానిక యుద్ద ంలో భారత వాయుసేన
బృందంలోని నలుగురు మృతి చెందినట్లు ‘సైన్యం ధృవీకరించింది. అందులో వీర మరణం పొందిన కెప్టెన్
బలరామ్ కూడా ఒకడు. మిగతా ముగ్గు రి మృత దేహాలు దొరికినట్లు , కాని కెప్టెన్ బలరామ్ విమాన శకలాలు
ఇతర దేశం భూభాగంలోపడిపోవడం వల్ల అతని మృతదేహం లభ్యం కాలేదని టెలిగ్రా ం పంపించారు.స్థా నికంగా
అధికారులు, నాయకులు అందరూ బలరామ్ వాళ్ళ అమ్మను పరామర్శించారు. చిరునవ్వుతో వీర మరణాన్ని
పొందిన కెప్టెన్బలరామ్ రూపం నాలో చెరగని ముద్ర వేసింది.

ఎలాగైనా నేను కూడా కష్ట పడి Armed Forces లో ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నాను.
ఆలోచనల్లో ంచి బైట పడేటప్పటికి చీకటి పడుతూ ఉంది. రైలు అద్దా ల్లో ంచి చలిగాలి లోపలికి చొచ్చుకు
రావాలని ప్రయత్నిస్తూ ఉంది. రైలు ఉత్త ర భారత దేశంలోకి అడుగు పెడుతోంది అనేందుకు సూచనగా చలి
తీవ్రత ఎక్కువయ్యింది. రాత్రి అయ్యింది. ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తిని బెర్త్ పైకి ఎక్కి పడుకున్నాను.
దారిలోని స్టేషన్ల లో రైలు ఆగుతూ బయలు దేరుతూ ఉంది. నా ఆలోచనలంతా యుద్ధ ం గురించి, ఇంటి చుట్టూ
తిరుగుతున్నాయి. ప్రత్యక్ష యుద్ద ంలో మా బృందం అంతా పాల్గొ ంటున్నట్లు , యింకా అలాంటి ఆలోచనల మధ్య
ఎప్పుడో నిద్ర పట్టేసింది.

తెల్ల వారేటప్పటికి రాత్రి రైలు ప్రయాణం ఆలస్యమయ్యిందని, గమ్యం చేరడానికి ఇంకా 6 గంటలు ప్రయాణం
చేయాల్సి ఉందని తెలిసింది.

బలరామ్ మరణం తర్వాత వాళ్ళ అమ్మ ఎక్కువ రోజులు బ్రతకలేదు. సంవత్సరం లోపలే ఆమె చనిపోయింది.
ఒక్కడే కొడుకు. కాయ కష్ట ం చేసి చదివించింది. వృద్ధిలోకి వచ్చి తనను ఆదుకుంటాడని అనుకున్నా, బలరామ్
వాయుసేనలో చేరాడని విన్న ఆ తల్లి భాధ పడలేదు. ఎప్పటికైనా తిరిగి వస్తా డని ఎదురు చూసింది.

పలకరించినప్పుడు “అయ్యా? యుద్ధ ం ఏమి లేదు కదా! బలరామ్ ఎప్పుడొస్తా డో అని అడిగేది. బలరామ్
అక్కడి నుంచి అమ్మకు డబ్బులు పంపేవాడు. ఆ డబ్బు కొడుకు వచ్చాక ఉండడానికి పాక కాకుండా యిల్లు
కట్టు కోవాలని దాచి పెట్టేది. బలరామ్ మరణ వార్త ఆమెను పూర్తిగా క్రు ంగదీసింది. ఇంట్లో నే ఉండి పోయింది.
ఎప్పు డైనా యింటికి వెళితే“అయ్యా, అబ్బాయి వస్తా డు – ఎక్కడో ఉండే ఉంటాడు, నాకు నమ్మకం ఉంది.
దేముడు - నా కెందుకు యింతశిక్ష వేశాడో – నేనేం పాపం చేశాను. అయ్యాపై వాళ్ళకి రాయండయ్యా “ ఇలా
బాధపడేది.

బలరామ్ అమ్మ కోసం నేనే ఒకసారి రాసాను. “A.బలరామ్, కెప్టెన్ IAF యుద్ధ ం ముగిసిన తర్వాత ఏమైనా
ఆచూకీ తెలిసిందా అని ఎప్పటిలాగే” కెప్టెన్ బలరామ్ మరణించినట్లు గానే భావిస్తు న్నాము. ఆయన
మృతదేహం లభ్యం కాలేదు. తదుపరి సమాచారం ఏమైనా తెలిస్తే తెలియజేయగలము.
కెప్టెన్ బలరామ్ మరణం ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఆ దిగులు తోనే బలరామ్ వాళ్ళ అమ్మ కన్ను
మూసింది. ఆమె చనిపోయే ముందు ఒక రోజు వాళ్ళింటికి వెళ్ళాను. “బాబు అందరూ అబ్బాయి
చచ్చిపోయాడని అంటున్నారు. నాకు మాత్రం వాడు ఎక్కడో బ్రతికే ఉన్నాడని నమ్మకంగా ఉంది. నేను
చచ్చిపోయిన తరువాత మీ అమ్మ నువ్వు వస్తా వని, ఇల్లు కడతావని డబ్బు దాచి పెట్టిందని చెప్పు నాయన.
నా పెట్టె లో దాచి పెట్టిన డబ్బు, లక్ష రూపాయల పైనే ఉంటుంది. దానిని నీ దగ్గ ర ఉంచుకొని వాడికి చేర్చు. ఇది
నేను నీకు ఇచ్చే బాధ్యతగా అనుకో” అన్నది.

బలరామ్ గురించి నేను తెలుసుకోవడానికి నాకు అవసరం ఏర్పడింది. నేను ఆర్మీలో చేరిన కొద్ది రోజుల తర్వాత
ఈశాన్య ప్రా ంతంలో విధులు నిర్వహించడానికి నన్ను ఎంపిక చేసారు.

బలరామ్ చివరిగా పనిచేసిన పటాలం కనుక్కొనిబయలుదేరాను. అక్కడి కమాండర్ ని కలిశాను. “కెప్టెన్


బలరామ్ గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కదా
అప్పటి వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. నేను కూడా పోయినసంవత్సరం ఈ రెజిమెంట్ లోకి వచ్చాను అని
ఆయన అన్నాడు”. వాళ్ళ తల్లి గారు నాకు అప్పజెప్పిన ముఖ్యమైన కార్యం మీద వచ్చాను. ఆయన బ్రతికే
ఉన్నారా లేకచనిపోయారా అనేది ఖచ్చితంగా తెలియాలి”.

“ఇక్కడి రికార్డు ల ప్రకారం ఆ సంవత్సరం అక్టో బర్ 29 వ తేది 4 విమానాలు శత్రు దేశ సరిహద్దు లోకి వెళ్ళాయి.
అటు ప్రక్కనుంచి చేసిన శత్రు వులకాల్పుల్లో 4 విమానాలు ధ్వంసమయ్యాయి. విమాన శకలాలన్ని మన
భూభాగంలో పడ్డా యి. ముగ్గు రు పైలెట్ల మృత దేహాలు మేము స్వాధీనం చేసుకున్నాము. కెప్టెన్ బలరామ్
ఆచూకీ మాత్రం తెలియలేదు. యుద్ధ ం తర్వాత సరిహద్దు దేశాలనుకూడా అడిగినట్లు రికార్డు ల్లో ఉత్త రాలు
ఉన్నాయి. కానీ ఎటువంటి సమాచారం రాలేదు.

ఆ రాత్రికి రెజిమెంట్ లో ఉంటానని చెప్పి బలరామ్ ను ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మెస్ లో
అడిగాడు. కాంటీన్ కి వస్తు వులు తెచ్చే గుర్మిత్ సింగ్ గురించి తెలిసింది. మరుసటి రోజు ఉదయం గుర్మిత్ సింగ్
ని కలిసి బలరామ్ గురించి అడిగాను.

“అచ్ఛా బలరామ్ సాబ్, బహుత్ బడా ఆద్మీ, దేశ్ ప్రేమీ. ఆ సంవత్సరం అక్టో బర్ లో యుద్ధ ం తరువాత అక్కడ
ఎవ్వరూ కనపడ లేదు సాబ్. బలరామ్ సాబ్ బ్రతికి ఉంటే నాకు తెలుస్తు ంది. లేదు సాబ్ ఆయన చనిపోయే
ఉంటాడు” అన్నాడు.

మరుసటి రోజు గుర్మిత్ తోడుగా విమాన శకలాలు పడిన ప్రా ంతాల్లో తిరిగాను. అది దట్ట మైన అడవి. జన
సంచారం అసలు లేని ప్రా ంతం. శత్రు సైనికుల పహారా కూడా ఎక్కువగా ఉన్న ప్రా ంతం. సాయంత్రం కంటే
ముందుగానే వెనక్కి వచ్చేశాము. కనపడిన గిరిజనులు, గ్రా మస్తు లు ఎవ్వరూ ఎటువంటి ఆచూకీ తెలుపలేక
పోయారు. కమాండర్ ని అడిగి అప్పటి యుద్ధ ం తాలూకు రేడియో ట్రా న్స్మిషన్ సంభాషణలు ఏమైనా ఉంటే
చూస్తా నని అడిగాను. “మీరు చూసుకోవచ్చు” అని అనుమతి తీసుకొని యుద్ధ ం తాలూకు లాగ్ బుక్కులు,
అప్పటి రేడియో సంభాషణలు అన్ని రికార్డు రూమ్ లో వెదకడం ప్రా రంభించాను. అన్ని కాగితాల కట్ట లు, ఫైళ్ల
దొంతర్లు , రేడియో మెసేజ్ కాగితాలు, అప్పటి ఉత్త ర ప్రత్యుత్త రాలు మధ్య, ఆనాడు జరిగిన విషాద సంఘటన
వివరాల కోసం వెతికాను.

అప్పటి విమాన పటాలం బయల్దేరిన సమయం, అందులోని సభ్యులవివరాలు పొందుపరిచారు. కెప్టెన్


బలరామ్ నాలుగవ సభ్యుడుగా ఆ జాభితాలో ఉన్నాడు. రేఖకు అవతల వైపుకి వెళ్ళి కేంద్రీకరించబడిన కొన్ని
యుద్ధ టాంకులు మరియు ఆయుధ కారాగారాలను ధ్వంసం చేయడం ఆ దాడి ప్రణాళికగా ఉన్న కాగితం
కనబడింది. కానీ రేడియో సంభాషణల తాలూకు వివరాలేవీ ఆ ఫైలులో లేవు. మధ్యలో ఎవరో పేజీలు
చించేసినట్లు గా అనిపించింది. చివరిగా ఉన్నతాధికారులకు కమాండర్ వ్రా సిన రిపోర్ట్ నకలు, దాడి
విఫలమైనట్లు , అందులో పాల్గొ న్న వారందరు మరణించినట్లు , మృత దేహాల్లో ఒకటి దొరకలేదన్నట్లు గా
అందులో వ్రా సి ఉంది.

గుర్మిత్ సింగ్ కి వీడ్కోలు చెప్పి, కమాండర్ కి నా అడ్రస్ ఇచ్చి నేను తిరిగి వచ్చేశాను. కొన్ని నెలలు
గడిచిపోయాయి. ఈశాన్య భారతం నుంచి నాకు బదిలీ ఉత్త ర్వులు వచ్చాయి, రాడార్ ట్రైనింగ్ కోసం నన్ను
హైదరాబాద్ పంపిస్తు న్నట్లు తెలిసి సంతోషపడుతూ బయల్దేరాను.

కెప్టెన్ బలరామ్ స్మృతికి దగ్గ రగా ఉన్న ఆ ప్రా ంతం నుంచి బయల్దేరుతున్నప్పుడు అతని ఆలోచనలు నాలో
మెదిలాయి. కొద్ది నెలల తర్వాత నా విధి నిర్వహణలో కెప్టెన్ బలరామ్ గురించి మెల్ల గా మర్చిపోవడం
ప్రా రంభించాను. ఒక రోజు from address లేకుండా నా పేరు మీద ఒక పోస్ట ల్ కవరు వచ్చింది.

డియర్,

కొద్ది నెలల క్రితం కెప్టెన్ బలరామ్ ను వెతుక్కుంటూ రెజిమెంట్ కు వచ్చినట్లు తెలిసింది. దేశం కోసం వీర
మరణం పొందిన ఒక సైనికుని గౌరవాన్ని నిలబెట్టు . లోకం ఎప్పుడో అతన్ని మరచి పోయి ఉండవచ్చు. కానీ
చరిత్ర లో అతనుయుద్ధ భూమిలో ప్రా ణాలొడ్డిన వీరుడు. ఆ స్మృతి అతనికి దక్కడం న్యాయం. అమ్మ ఇచ్చిన
మొత్తా న్ని ధార్మిక కార్య క్రమాలకు వినియోగించండి. నా జీవితం యుద్ధ రంగంలో ఆ రోజే అంతమయింది.
బలరామ్ గురించి మళ్ళి శోధించకు. సమయం దొరికినప్పుడు కెప్టెన్ బలరామ్ ను ఎప్పుడైనా తలుచుకో.
సెలవు.


ఆ ఉత్త రం జాగ్రత్తగా కాల్చి వేశాను. బలరామ్ మాత్రం నా హృదయం లో నిలిచిపోయాడు. గుర్మిత్ తో
సంభాషణల్లో త్వరగా ఇంటికి వెళ్ళాలని, మరీ ఆలస్యమైతే కాలు, చెయ్యి లేని తన తమ్ముడు ఎదురు చూస్తూ
ఉంటాడని చెప్పిన విషయం ఎందుకో స్ఫురించింది.

ఇదంతా జరిగి చాలా రోజులయ్యింది. కెప్టెన్ బలరామ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో. రైలు నెమ్మదిగా వంతెన దాట
సాగింది. ఒక సైనికుడి జీవితం గురించి ఆలోచిస్తూ నది వైపు చూడసాగాను.

కొన్ని సంఘటనలు ఈ కథకు స్పూర్తి. వీరులందరికీ వినమ్ర గౌరవ వందనాలతో...


రాణీమహల్ - ప్రశాంత్ వర్మ ఉప్పలపాటి
Object 37

కృష్ణ దేవరాయలు విజయనగర సంస్థా నాన్ని పరిపాలిస్తు న్న కాలం,. తమ సంస్థా నానికి, మరియు శ్రీ
వేంకటేశ్వరుని సన్నిధికి అందుబాటులో, చంద్రగిరిలో ఒక కోటను నిర్మించుకున్నారు. అద్భుతమైన
నిర్మాణశైలితో ఆ కోట ఐదంతస్థు లుగా నిర్మితమై ఉంది, అప్పటికే విజయనగర సామ్రా జ్యానికి తూర్పు, పశ్చిమ,
ఉత్త రాన మూడు రాజధానులు ఉండగా, ఈ కోటను తమ రాజ్యానికి దక్షిణ రాజధానిగా ప్రకటించుకుని
తరచుగా అక్కడకు వచ్చి కొద్దిరోజులు ఉండి వెళ్ల డం ఆనవాయితీ అయింది. విజయనగర మహారాజుకి,
అయితే కేవలం పురుషులు మాత్రమే ఇక్కడకు వచ్చేవారు, స్త్రీలను అనుమతించేవారు కాదు, అందుకుగల
కారణాలు ఉన్నాయి. ఆకోటలో ప్రత్యేకమైనది, ప్రా ముఖ్యం సంపాదించుకున్నదీ, రెండంతస్తు ల రాణీమహల్,..
దానిని అద్భుత శిల్ప సౌందర్యంతో విశాలమైన సభామందిరంలా నిర్మించారు,. వివిధ ప్రా ంతాలనుండి
తీసుకువచ్చిన కొందరు స్త్రీలు ఇక్కడికి వచ్చే మహారాజుని తమ నృత్య, గాన, వాద్య కళలతో అలరిస్తూ
ఉంటారని చెప్పుకుంటారు.. అక్కడ ఉండే స్త్రీలు కూడా అమితమైన సౌందర్యాన్ని కలిగి అప్సరసలను పోలి
ఉంటారని, రాజ వంశీయులకు తప్ప అన్యులకు వారు కనిపించని చెబుతుంటారు.. అత్యంత రహస్యంగా ఉన్న
ఆ రాణీమహల్ గురించి బయటకు తెలిసింది వాస్త వమేనా!? లేక తెలియని రహస్యం మరేదైనా ఉందా అనే
అనుమానం కొందరు శత్రు రాజులకి ఉంది, వాస్త వమే ఐతే విజయనగర సామ్రా జ్యంపై దండెత్తి ఎలాగైనా
రాజ్యాన్ని, ఆ చంద్రగిరి కోటను స్వాధీనపరుచుకుని, ఆ వైభవం అనుభవించాల్సిందే అన్నది వారి వాంఛ,
అప్పటికీ కొందరు రాజులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు ఉత్త రాన గోదావరి తీరప్రా ంతాన్ని
పాలిస్తు న్న రాజు మార్తా ండ వర్మ దృష్టి దీనిపై పడింది.. ******************* విజయనగర సంస్థా నం,
సభలో అందరూ కొలువుదీరి ఉన్నవేళ సైనికుడు ఒక సమాచారాన్ని తీసుకువచ్చాడు.. "మహారాజా!! వేగులు
సమాచారంతో విచ్చేసి ఉన్నారు, తమరికి విషయం విన్నవించాలని తెలియజేస్తూ అనుమతికోసం
నిరీక్షిస్తు న్నారు.." "అనుమతినివ్వండి" సెలవిచ్చారు మహారాజు.. రాజు అనుమతి ఇవ్వగానే సభలోకి
ప్రవేశించారు, ఇరువురు వేగులు.. "ప్రణామాలు మహారాజా!!" "భద్రా ! మహావీరా! ఏ సమాచారంతో
వచ్చారు?" మంత్రి తిన్నడు అడిగాడు.. "మహరాజా! ఉత్త రాన గోదావరి ప్రా ంతాన్ని పాలిస్తు న్న మార్తా ండవర్మ
మన చంద్రగిరి కోటపై దాడికి పథకం రచిస్తు న్నట్టు గా సమాచారం" "రాజ్యన్ని వదిలి ఆ విడిది ప్రా ంతం మీద
దండెత్తా లని యోచనెందుకు చేస్తు న్నాడు!" అంటూ మంత్రి వైపు చూసాడు ఆశ్చర్యంగా మహారాజు..
"ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు మహారాజా! దక్షిణ భారతంలోనే విశిష్ట ప్రా ముఖ్యం పొందిన ఆ చంద్రగిరి
కోట మీద ఎందరిదో రాజుల కన్నుపడింది,. దానిని ఆక్రమిస్తే అన్ని ప్రా ంతాలకు అనువుగా ఉండే ప్రా ంతం, దక్షిణ
భారతావనికి కేంద్రంగా ఉన్నచోట ఉండటం, అన్నిటినీ మించి దాని నిర్మాణశైలి ఎందరికో ఆశ్చర్యాన్ని
కలిగిస్తో ంది,. మహాభారత కాలంలో మాయసభలా ఇక్కడ ఉన్న అద్భుత శిల్పసంపద, విశాలమైన సభా
మందిరాలు, ముఖ్యంగా ఆ ప్రా ంతంలో దాన్ని గెలుచుకుంటే, అయితే రాజధానిగా చేసుకోవచ్చు, లేదా విడిదిగా
ఉంచుకోనూ వచ్చు,. ప్రస్తు తం మనం అనుసరిస్తు న్న విధంగానే., ఇదే వారి ఎత్తు గడ.." "అంతేనంటారా?"
అడిగాడు మహారాజు.. "ఖచ్చితంగా కాదు మహారాజా! అందులో ఉన్న సౌందర్యాన్ని సొంతం చేసుకునేందుకు
కూడా కావచ్చు,. అచ్చటి విషయం ఎంత రహస్యంగా ఉంచాలని ప్రయత్నం చేస్తు న్నప్పటికీ ఎలానో బయటకి
తెలిసిపోతుంది,. బహుశా అదీ వారి ప్రయత్నానికి కారణం అయ్యుండచ్చు.." చిరునవ్వుతో బదులిచ్చాడు
మహామంత్రి.. మంత్రి నవ్వులో అంతర్యాన్ని గ్రహించాడు మహారాజు.. బదులుగా చిరునవ్వు నవ్వాడు.. "ఆ
విషయమై సమగ్ర సమాచారం సేకరించండి, వాస్త వమే ఐతే అతడికి సందేశం పంపండి, ఎదురుదాడికి సిద్ధ ం
అని,. మన సామర్థ్యం గురించి తెలిసీ సాహసం చేస్తు న్నాడు అంటే అతడికేదో బలం సమకూరి ఉండాలి,..
అవశ్యం, అదేంటో కూడా తెలుసుకోండి.." అంటూ ఆజ్ఞ జారీ చేసి సభ ముగించాడు.. **************
"అసలు ఆ రాణీమహల్ రహస్యం ఏమై ఉంటుంది మార్తా ండ వర్మా!" "ఉంది మిత్రమా!" "ఒక రాజు
రాజ్యంమీద దాడిచేసి ఆ రాజ్యాన్ని పొందాలి అనుకోవడం న్యాయం,. కానీ, ఇలా ఎప్పుడో కానీ వినియోగించని
ఆ చంద్రగిరి కోటమీదకి దండెత్త డం ఆక్రమించుకోవాలి అనుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తు ంది" "మిత్రమా! అది
విడిదికాదు,. అలా భ్రమింపచేయాలని చేసిన ప్రయత్నం మాత్రమే, అందులో ఒక విశేషం ఉంది, ఆ కోట
మొత్త ంగా ఒక అద్భుత నిర్మాణం అయితే అందులో మొదటి అంతస్తు లో నిర్మితమైన రాణీమహల్ ఒక్కటి
మరో అద్భుతం" "అవునా?" "అవును మిత్రమా! అందులో దేవకాంతల సమానమైన సౌందర్యంతో విరాజిల్లే
స్త్రీలు ఉంటున్నారు, వారి నృత్యాలతో, గానాలతో ఆ మహల్ నిత్యం పౌర్ణమి శోభతో వెలిగిపోతోంది"
"విజయనగరం మహారాజుకి ఇదెలా సాధ్యమైంది?! సరే, ఒకవేళ మనం ఆక్రమించుకున్నా వాళ్ళు ఉంటారని
నమ్మకం ఏముంది..? ఆ మహారాజు పరాజయం పొందితే వాళ్ళు ప్రా ణత్యాగం చేయరా..? ఈ దిశగా ఎందుకు
ఆలోచన చేయకూడదు.." ఆశ్చర్యంగా అడిగాడు.. "అతడికున్న బలం, స్నేహగుణం వల్ల ఎన్నోదేశాల నుండి
సౌందర్యవతులైన స్త్రీలను కానుకగా పంపిస్తు ంటారు, వారి కళలు ప్రదర్శించి అతడిని మెప్పిస్తూ ఉండటమే
వారిపని.. అన్యులకి ఆ కోటలోకి ప్రవేశం ఉన్నప్పటికీ, రాణీమహల్ లోనికి మాత్రం కేవలం రాజ కుటుంబీకులు
మాత్రమే వెళ్ల గలరని సమాచారం, రాజకుటుంబ స్త్రీలకు కూడా ఆ కోటలోకి ప్రవేశం లేదు, ఇక వారి ప్రా ణత్యాగం
అంటావా! బందీలు చేసి వశపరుచుకుందాం, లేనప్పుడు మనకి ఆ రాజ్యం దక్కుతుందిగా" "ఇదంతా సరే
మిత్రమా! మన లక్ష్యం ఆ విజయనగర సంస్థా నం కదా! ఆ సంస్థా నం మీద మనం దాడి జరిపితే అప్పుడు ఈ
కోట కూడా మనదే అవుతుందిగా!!" "ఆ రాజ్యంపై దాడికి వెళ్ళాలి అనుకున్నా, మనం ఈ కోటను దాటి
వెళ్ళాల్సిందే,. రాజ్యానికి నలుదిక్కులా ఇలాంటి కోటలను నిర్మించి రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడు ఆ
మహారాజు.. నేరుగా రాజ్యంపై దాడిచేయడం అంత సులభమైన విషయంకాదు,. వినోదం, విలాసం కోసం ఈ
ప్రా ంతానికి విచ్చేసే మహారాజు, తక్కువ సైన్యంతో, పెక్కు జాగ్రత్తలు లేకుండా వస్తా డు, అదే మనకి అవకాశంగా
మారుతుంది,. అదను చూసి మన బలగంతో నలుదిశలా దాడి ఆరంభిస్తా ం, రాజ్యానికి సమాచారం అంది,
సైన్యం వచ్చేలోపు మహారాజు మన బందీ అవుతాడు" అంటూ పథకం వివరించాడు. "శభాష్ మార్తా ండా! నీ
ఆలోచన అమోఘం, ఇక మిగిలింది కార్యాచరణ మాత్రమే.." అంటూ అభినందించాడు మిత్రు డు..
********************* వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున విడిదికోసం చంద్రగిరికి తన పరివారంతో
బయలుదేరాడు విజయనగర మహారాజు,. ముందుగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని, అనంతరం కోటకి
చేరుకున్నాడు,. కోటలో సందడి మొదలైంది,, వివిధ ప్రా ంతాలనుండి వచ్చిన నర్తకీ మణులు, గాయకులు,
వాయిద్యకారుల సమక్షంలో సంబరాలు జరిగాయి.. మహావీరుడు ఆదుర్దా గా కోటలోని రాజమహల్ లోకి
ప్రవేశించాడు, "మహారాజా! ఆ మార్తా ండవర్మ, అతడి మిత్ర రాజులు నలుదిశలా ఆక్రమించి ఉన్నారు, మనపై
దాడికి సిద్ధ ంగా ఉన్నారు.." కంపిస్తు న్న స్వరంతో చెప్పాడు,. తమ సైన్యం సన్నద్ధ ంగా లేదు,. ఇక్కడ ఉన్న
బలగాలూ సరిపోవు,, 'ఏం చేయాలో' అన్నది మహావీరుడి గాభరాకి కారణం, అతడి వెనకే మరో వేగు భద్ర
కూడా వచ్చాడు,. అప్పుడే ఎవరూ ఊహించని విధంగా ఓ సంఘటన జరిగింది. మహారాజు తన ఒరలో ఉన్న
పిడిబాకును మహావీరుడి వైపు గురిచూసి విసిరాడు, రెప్పపాటులో అది అతడి గొంతులో దిగింది..
"మహారాజా!" ఆశ్చర్యంగా చూసాడు భద్ర.. "భద్రా ! సైన్యాన్ని సిద్ధ ం కమ్మని కబురందించు.. కోటలో, కొండపైన,
చుట్టు పక్కల ఉన్న సైనికులందరికీ వర్తమానం అందించు, యుద్ధా నికి సంసిద్ధు లు కమ్మను.." "ఆజ్ఞ
మహారాజా!" అంటూ కింద పడివున్న మహావీరుడి కాయం వైపు దీనంగా చూసాడు.. "భద్రా ! చింతించనవసరం
లేదు. ఈ మహావీరుడు మార్తా ండవర్మ వేగుగా ఎప్పుడో మారాడు,. మన సమాచారం అంతా చేరవేస్తు న్నాడు,.
ఈక్షణం మనం తక్కువ సైన్యంతో ఇక్కడకు విచ్చేసామని, దాడికి ఇదే అనువైన సమయమని సమాచారం
అందించింది ఇతడే, దాన్ని అదనుగా తీసుకునే ఆ మార్తా ండ వర్మ దండయాత్రకి వస్తు న్నాడు,. ఆ విషయం
వాళ్ళు మనల్ని చుట్టు ముట్టేవరకూ గోప్యంగా ఉంచాడు" విషయం అర్థ మైన భద్రు డు తక్షణమే అచటనుండి
కదిలాడు,. పహారా కాస్తు న్న సైనికులకి సమాచారం అందించాడు.. ఖచ్చితంగా విజయం తనదేనని,
అతిత్వరలో విజయనగర సామ్రా జ్యాన్ని కైవసం చేసుకోబోతున్నానని మహదానందంగా ఉన్నాడు
మార్తా ండవర్మ.. కానీ, అతడి అంచనాలు తారుమారయి, తన పతనానికి మార్గ ం వేసుకున్నాడని
ఊహించలేకపోయాడు. **************** "మహారాజా! అతడు నలుదిశలా ఆక్రమణకు వస్తు న్నాడు.."
చెప్పాడు మహామంత్రి. "మనసైన్యాన్ని మూడు దిశలు పంపండి,. మూడు వైపులా నాయకత్వం వహించడానికి
మన ప్రత్యేక అశ్వదళం సిద్ధ ంగా ఉందిగా, మరో వైపు నేను కొంతమంది సైనికులతో దాడికి వెళతాను" అంటూ
సిద్ధ మయ్యాడు మహారాజు. అనుకున్నట్టు గానే మార్తా ండవర్మ తూర్పుదిశగా రాగా మిగతా మూడువైపులా
అతడి మిత్ర, సామంత రాజులు దాడికి దిగారు, చిత్రంగా వాళ్ళ అంచనాలకు మించి విజయనగరం సైన్యం
ఎదురుదాడికి దిగింది,.. ఇది వాళ్ళు ఊహించని పరిణామం, ఇదెలా సాధ్యం??! మార్తా ండవర్మకి అర్థ ంకాలేదు,
ఒక్కొక్క యోధుడు ఆకారంలో భీముడికి మల్లె ఉండి ప్రచండదాడి చేస్తు న్నారు,.. ఎంతో శిక్షణ లభిస్తే కానీ ఇది
సాధ్యంకాదు,. విజయనగరం సామ్రా జ్యంలో ఇంతటి యోధులా! ఎలా సాధ్యం అన్నది అంతు చిక్కలేదు,.
అప్పటికే అతడి సామంతులు పరాజయం పొంది లొంగిపోయారు,. ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధ పడని
మార్తా ండవర్మ మాత్రం అవిశ్రా ంతంగా పోరాటం చేస్తు న్నాడు. విజయనగర సైన్యం, వారి అశ్వదళ పోరాటం
బహుచిత్రంగా అనిపించింది.. తనని తప్పుదారి పట్టించారని అతడికి అర్ధ మైంది, అయినా ఊపిరి
ఉన్నంతవరకూ పోరాటం చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు, కోటభాగానికి చేరుకున్నాడు, ఇతర
రాజులను బంధించిన మహారాజు కొద్దిసేపటికే మార్తా ండవర్మని కూడా పరాజితుణ్ణి గావించి.. కోటలో దిగుడు
బావి పక్కన ఉన్న రహస్యగుహలో బంధించాడు.. ***************** అక్కడ ఒక వ్యక్తిని చూసిన
సారంగధరుడు ఆశ్చర్యపోయాడు,. "మీరు!?" "కౌండిన్యదేశ రాజు విద్యాధరుడిని" "మీరు అసామాన్యమైన
ప్రతిభావంతులని విని ఉన్నాను.., కానీ!" సందేహంతో ఆగిపోయాడు.. "విజయనగర రాజు మాయలో ఎంతటి
వీరుడైనా ఓడిపోవాల్సిందే" "మాయా! నిజమే,, నాకిప్పుడే అర్థ మౌతుంది" "అవును.., ఈ చంద్రగిరికోటలో
ఉన్న రాణీమహల్ ఓ మాయా ప్రపంచం,. దాని ప్రలోభానికి లోనై నేను దాడికి వచ్చాను.. నా అంచనా,, నువ్వు
వచ్చింది కూడా అందుకే అనుకుంటా" నవ్వుతూ అన్నాడు అతడు. "అతడిని ఓడించాలన్నది ప్రధాన లక్ష్యం,
మీరన్నట్టు ఈ రాణీమహల్ అద్భుతాలు కూడా అందుకు కారణమే, ఐతే స్త్రీలు నృత్యంతో అలరించే ఈ
రాణీమహల్ లో వీరుడిని ఓడించే మాయలా!! ఇదెలా సాధ్యం?" "అది నృత్యమందిరం కాదు, సుశిక్షితులైన
సైన్యాన్ని తయారుచేసే ప్రదేశం, పేరుకి మాత్రమే రాణీ మహల్!! కానీ అక్కడ ఉండేదంతా దేశంలో పలు
ప్రా ంతాలనుండి ఖరీదుచేసి, కొన్న మేలుజాతి అశ్వాలు,, వాటికి శిక్షణ నిచ్చే శిక్షకులు,. వారితో పాటు శిక్షణ
పొందే సైనికులు,, మొదటి రెండవ అంతస్థు లలోనే ఉంటారు" "సైనికులకు శిక్షణ రాజ్యంలో కదా ఇస్తా రు!"
"అది మాములు సైనికులకు, కానీ ఇక్కడ శిక్షణ పొందే ఒక్కో సైనికుడు ఒక్కో బ్రహ్మాస్త్రం లాంటివాడు, ఒక్కో
సైనికుడు వెయ్యిమంది యోధులకు సమానమైన వాడు" విద్యాధరుడి మాటలకి విస్మయం చెందాడు,,
మార్తా ండవర్మ. "మరి అప్సరసలు, సౌందర్యవతులు నాట్యం అని ఏవో కథలు!" "అవన్నీ కట్టు కథలు, అసలు
విషయం లోకానికి తెలియనివ్వకుండా చేసే ప్రయత్నం మాత్రమే.., అది నమ్మే నేనూ ఇటుగా దాడి
ఆరంభించాను, దట్ట మైన మేఘాలనుండి జారిన పిడుగులమల్లే దూకారు సైనికులు కోటలోనుండి,,
ఆశ్చర్యపోయాను.. అయినప్పటికీ ఎదురుతిరిగాను కానీ, నిలవలేకపోయాను" అంటూ ఆగాడు..
"ఎంతమోసం!" అన్నాడు మార్తా ండవర్మ.. "మోసమా, అప్పుడు మీరూ, నేనూ చేసింది న్యాయమా?
రాజ్యపరిరక్షణ కోసం కృష్ణ దేవరాయ మహారాజు తంత్రం ఇది,.. పక్కవారికి అన్యాయం జరగనిది, తనని తాను
రక్షించుకునేందుకు చేసిన పథకం మోసమవ్వదు మిత్రమా!" "ఇక మన జీవితకాలం ఇక్కడేనా విద్యాధరా!"
"క్షమించమని వేడుకుంటే క్షమ లభిస్తు ంది,. నేను అందుకు సిద్ధ ంగా లేను, నువ్వు సిద్ధ మైతే వెళ్లి యాచించు,
సామంతుడిగా జీవితాన్ని గడుపు.." ఆమాట వినగానే ఉలిక్కిపడ్డా డు, "చావనైనా చస్తా ను కానీ, యాచన
ప్రసక్తే లేదు" అంటూ తన ఒరలో ఉన్న ఖడ్గా న్ని తీసుకుని గొంతు కోసుకుని అక్కడిక్కడే మరణించాడు,
అతడితోపాటు అతడి మిత్రరాజులు కూడా ప్రా ణత్యాగం చేసారు. జీవితాంతం బందీలుగా ఉండేకన్నా అదే
ఉత్త మమని నిర్ణయించుకున్నారు. "శత్రు సంహరం పూర్తయింది మహారాజా!!" అంటూ వర్తమానం అందించాడు
విద్యాధరుడు. (చిత్తూ రు జిల్లా లో గల చంద్రగిరి కోట,. అందులో ఉన్న రాణీమహల్ ను కథా వస్తు వుగా
తీసుకుని కల్పిత సన్నివేశాలతో అల్లు కున్న కథనం, ఇది వాస్త వం కాదు అని మనవి) ***స్వస్తి***

You might also like