You are on page 1of 51

https://sarasabharati-

vuyyuru.com/2015/10/12/%e0%b0%b6%e0%b0%b0%e0%b0%
a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b5-
%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%bf-
%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b0%be
%e0%b0%95%e0%b0%be
%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7/

శరన్నవ రాత్రి శుభాకాంక్షలు – శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి


”మత్స్వప్నః”(నా కల )

సాహితీ బంధువులజు రేపు 13-10-15 మంగలవారంనుండి ప్రా రంభమయ్యే శరన్నవ రాత్రి శుభాకాంక్షలు .
నిరుడు నవరాత్రు లకు డా .శ్రీ ఇలపావులూరి పాండురంగా రావు గారు రాసిన” శ్రీ సహస్రిక ”అనే శ్రీ లలితా త్రిపురసుందరీ
నామాల విశిష్ట తను ధారావాహికం గా మీకు అందించాను . ఈ సారి కూడా ఒక స్పెషల్ ను అందజేయాలనుకొంటున్నాను .
సాధారణం గా మనమందరం కలలు కంటూ ఉంటాం మరి జితేంద్రియు లైన యోగులకు కూడా కలలు వస్తా యా?వస్తే ఎలా
ఉంటాయి ?దీన్ని తెలుసుకోవటం కోసం గుంటూరు జిల్లా చందవోలు లో అనునిత్యం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఉపాసనతొ
తరించి ఎందరెందరికో గురుమూర్తు లై దీక్షనిచ్చి, ”నడయాడే దైవం ”అని పించుకొన్న శ్రీ కంచి పరమాచార్యులు మరియు ,శ్రీ
శృంగేరి పీఠాదిపతులు స్వయం గా చందవోలు వచ్చి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్ద భిక్ష స్వీకరించారంటే శాస్త్రి
గారి యోగ వైశిష్ట ్యం ఎంతటిదో తెలుస్తు ంది. అలాంటి సిద్ధ యోగిపు౦గవులు శ్రీ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు అయిన శ్రీ
శాస్త్రి గారికి ఒక కల వచ్చింది .దానిని సంస్కృత శ్లో కాలలో ”మత్స్వప్నః”(నా కల )గా రాశారు అందులో అమ్మవారు ప్రత్యక్షమై
వారికి ఏమి తెలియ జెప్పారో వీరేమి అడిగారో ఆ వివరాలన్నీ రేపు 13-10-15 మంగళవారం నుండి అమ్మవారి అనుగ్రహం తో
ధారావాహికం గా అందజేస్తా ను .. మరొక సారి నవ రాత్రి శుభా కాంక్షలతో -దుర్గా ప్రసాద్

https://sarasabharati-vuyyuru.com/2015/10/13/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0/
‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -1
‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -1

1-‘’శ్రీ మాతా శ్రీ మహా రాజ్ఞీస్శ్రీమస్సి౦హాసనేశ్వరీ –స్వధ్యాసీనా దేహలీ-

-స్వప్నే దృష్టా ద్రు స్ట తః కల్పవల్లీ –శిల్పానల్పా కల్ప బా భాసమానా ‘’

తాత్పర్యం –మంగళకరమైన తల్లి ,సహస్ర నామాది భూతమైన శ్రీ మాత్రు మంత్రా నికి అధిదేవత
,సంపత్కారిణి ,శ్రీ విద్యా స్వరూపిణీ ,శ్రీ విద్యలో సర్వాధిస్టా త కామేశ్వర స్వామి పట్ట పు దేవి అయిన
ముత్తైదువు,పూజనీయ ,మా ఇంటి గడప మధ్య భాగం లో కూర్చుని ,కల్పలతలచే సృస్టింపబడిన
అంతులేని శిల్ప ప్రా వీణ్యం గల సర్వ ఆభరణాలచేత ప్రకాశించే నా తల్లి నా అదృష్ట వశాత్తు నాకు స్వప్నం
లో కనిపించింది .

2-‘’సౌమంగల్య శ్రీ నిదానాంగ యస్టిం-తామీక్షిత్వా భూవ మస్మిస్మితాస్య

హేతుం ప్రు స్టో హంత యానైవ కించి –త్స్వాభావ్యా దేవత


ే ్య వోచం వినీతః ‘’

తా –సౌందర్య సంపాదకు నివాసమైన యష్టివంటి శరీరం కల ఆతల్లిని చూసి నేను చిన్నగా నవ్వాను
.ఎందుకు నవ్వావు అని ఆమె అడగగా ,ఆ ఏమీ లేదు స్వాభావికంగానే నవ్వా అని వినయం తో చెప్పా .

3-‘’భావోనోదీయుర్నిమిత్త ం వినాక్వా-ప్యా చక్ష్వత్వం కిన్నిమిత్త ం స్మితంతే

ఇత్థ ం ప్రు చ్చం త్యాంజనాన్యా మవోచ –మానేతవ్యో వ్యాస మౌన్యత్ర చేతి ‘’

తా-‘’నవ్వు ఊరికే రాదు .నీనవ్వుకు కారణం ఏమిటి ‘’?’’కారణం చెప్పాలంటే వేద వ్యాసమహర్షి ఇక్కడికి
పిలి పించాల్సి ఉంటు౦దితల్లీ ‘’అన్నాను

4-‘’కిం కార్యం తే నాత్ర రేత్వం వదేతి –నిర్భార్త్యోక్తః ప్రా ంజలి ప్రహ్వ భాస

సంతోషేణా స్యాంచ భక్తీ ప్రపత్యా –నామం నామం మాతరం వాచా మూచే ‘’


తా-‘’ఆయనతో నీకేం పని ?నవ్వుకు కారణం చెప్పు ‘’అని మాత గద్దించింది .అది సంతోష కారణమై భక్తితో
మాటిమాటికీ నమస్కరిస్తూ నేను చెప్పటం మొదలు పెట్టా ను .

5-‘’ప్రు చ్వా మిత్వా మాంబ సందేహ మేతం –న ప్రస్టవ్యం బాల భావాద వోచం

అస్మాన్సూత్వా సాధ్వి దేవం కిమూఢా –వోఢవేశానం మాతరస్మా న్ప్రసూతా ‘’

తా-అమ్మా !ఒకసందేహం వచ్చి నిన్ను అడుగుతున్నాను .న్యాయంగా అడగ కూడదనుకో .కుర్రచేస్టతో


అడుగుతున్నా .పతివ్రతా తిలకమా !మమ్మల్ని అందర్నీ కన్న తర్వాత శివుడిని పెళ్లి చేసుకోన్నావా ?లేక
కామేశ్వరుని పెళ్ళాడి మమ్మల్ని కన్నావా ?’’

6-‘’ప్రశ్న స్యాస్యా త్రా స్తియద్వానిమిత్త ం –మాతర్జా నే నైవ కించి ద్విమూఢః

ఆహూ యావాభ్యాంమహర్షి స్సుమేదా –వేదం వ్యాసో విష్ణు రేవా నుయోజ్యః ‘’

తా-ఈ కొంటె ప్రశ్న కు  కారణం ఏమిటి అని అడిగితె నాకేం తెలీదమ్మో-మనిద్ద రికీ ఈ సందేహ నివృత్తి
చేయగలాడు వ్యాసుడే .నన్నే పిలిచి అడగమంటే ఏను కుర్రా డిని .అంతటి మహర్షిని అడిగే
దమ్ము,అధికారం  లేనివాడిని .నువ్వే పిలిచి అడగమనే రాజసమూ లేని వాడిని .క్షమించు .

7-మంత్రా ద్రస్టా సౌ  పురాణేతి హాసాన్ –లక్షైర్ల క్శైః శ్లో క జాలైః ప్రణీయ

కృత్వా కార్షీద్విశ్వ విశ్వోపకారం –త్వత్పాఠార్ధ ం నాలమాయు ర్జ నానాం’’

తా-మంత్రం ద్రష్ట అంటే మంత్రా లను చూసినవాడు అలాంటి వ్యాస భగవానుడు పురాణ ఇతిహాసాలలో
లక్షలకొద్దీ శ్లో కాలు రాసి లోకాలకు మేలు చేశాడు .అవన్నీ చదవాలంటే మనిషి ఆయుర్దా యం చాలదు
.ఇక విమర్శించటానికి సమయమెక్కడిది తల్లీ !

8-కిన్చిత్కించి౦ చిత్త త్ర తత్త త్పఠిత్వా-సందేహాబ్దౌ మానవౌ ఘోనిమఘ్నః

ఆర్ష గ్రందేషూత్త రం ప్రశ్న దేశే –సంబద్ధ ంస్యాదిత్య నూచాన వాదః ‘’

తా- ఆ పురాణ  ఇతిహాసాలను కొంచెం కొంచెం చదివి మానవులు సందేహాలలో మునిగిపో యారు .అది
రాసినవాడిదో గ్రందానిదో తప్పుకాదు .రుషి ప్రో క్తా లలో ప్రశ్న ఉన్న చోటేసమాదానమూ ఉంటుంది .ఆరు
ప్రమాణాలతో మీమాంస శాస్త ం్ర పద్నాలుగు ప్రమాణాలతో అలంకార శాస్త ం్ర ద్వారా అర్ధం చేసు
కోమని,గురుని ముఖతానేర్చుకోమని వేదం వేదాంగాలు చెప్పాయి .

9-‘’బ్రహ్మాండే శ్రీ లాలితాఖ్యాన బంధే –భంఢో నామ్నా మొహవద్దు ర్ని వారః

ఆసీద్విశ్వం స్వాత్మ సాత్క్రుత్య కృత్యా –దక్షం రక్షః ప్రా ణిజాలం బాబాధే ‘’

తా-బ్రహ్మాండ పురాణ లలితోపాఖ్యానం లో మూల అజ్ఞా నం తో నివారింప లేని భండుడు అనే రాక్షసుడు
,ప్రయోగ దక్ష్టతతో ప్రపంచాన్ని అంతటిని తన స్వాధీనం లోకి తెచ్చుకొని ప్రా ణులను విపరీతంగా
హింసించాడు .

10-‘’ఏతస్యాసన్మ౦త్రిణస్సైనికాశ్చ –సేనా నాధాఃపుత్రా పౌత్ర ప్రవర్గా ః

తై స్తై స్సాకం గ్రీష్మ వద్భీష్మ వచ్చ-చక్రే సర్వం తాప పర్యాకులం సః’’

తా-భండాసురుడు మంత్రి సేనా కుమారాదాలుతో కలిసి ఆరేడు లోకాలను గ్రీష్మ తాపంలాగా విజ్రు మ్భించి
కలవరానికి గురి చేశాడు .

11-‘’భేదే దక్ష స్త స్య మంత్రీ విషంగః –జన్తోర్యోగం జంతునా నానుమంతా

ఉత్పన్నం శుక్రం వికర్షే ద్విశుక్రః –స్త్రీణాంపుంసాం దుర్బల స్తేన లోకః ‘’

తా-భేదో పాయం తెలిసిన వాదిమంత్రి విషంగుడు ఒకరితో మరొకరు కలవకుండా చేశాడు .స్త్రీ ,పురుషుల
శుక్ర శ్రో ణితాలనుదొ ంగతనం గా ఎత్తు కుపో యి దుర్బలులను చేస్తు న్నాడు .ఇలా జగత్తు తల్ల డిల్లు తోంది .

12-‘’ఆతార్ణ ం వ్యాప్నోతిచా బ్రా హ్మ లోకాత్ –నాస్తి త్రా తా కశ్చి దన్యోహ్య ముష్మాన్

విష్ణో ర్భీతో నైతి వైకుంఠ మేష –స్వామీ నాప్యాయాతి-హిత్వా తదత్ర ‘’

తా-భండాసురిని బారి నుండి రక్షించేవాడేవ్వరూ గడ్డిపరకనుండి బ్రహ్మ లోకం వరకు


కనిపించలేదు.విష్ణు వు అంటే భయం తో విష్ణు లోకానికి మాత్రం వెళ్ళలేదా రాక్షసుడు .

13-‘’తస్మిన్ కాలే నాదరో నిర్ద రోపి-మౌనీ ప్రా పన్నారదో విష్ణు లోకం


స్తు త్వా దేవం సత్క్రుతస్తేన సో సౌ –లోక స్యార్దే పృష్ట ఏనం జగాద ‘’

తా-భయం అభయం రెండూ లేని నారదుడు విష్ణు లోకానికి వెళ్లి ,ఆయన్ను స్తు తించి సత్కారం పొ ంది
లోకం లోని విశేషాలేమిటి అని అడిగిన దేవ దేవునితో ఇలా చెప్పాడు .

సశేషం

నవ రాత్రి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-15-ఉయ్యూరు

https://sarasabharati-vuyyuru.com/2015/10/14/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0-2/

‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -2

‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -2

14-భ్రా స్ట్రే న్యంతం బీజ మేవా భవద్ది-భండాధీనం లోకజాలం నతాత్

సామ్నా  రక్షే త్క్లేదయిత్వా య ఏత –న్నో పశ్యామ న్త ం సమర్ధ ం త్వదన్యం ‘’

తా- ‘’భండాసురుని చేతికి చిక్కిన లోకాలన్నీ మంగలం లో వేయించబడే గింజల్లా మాడిపో యాయి .వాడి
పీడ తొలగించి లోకాలను కాపాడే వాడు నువ్వు తప్ప వేరవ
ె రూ కనిపించలేదు’’అన్నాడు నారదుడు .

15-‘’స్వామిన్పశ్య  న్యంతరా చింతయే త్వా—కర్త వ్యమ్ స్యా దత్రకిం సంవిధానం

నాహం జానే క్వాపి లోకామయ౦ ప్రా –గిత్ధం హాజీ వంశ్చ కాలం విశాలం ‘’
తా-మనసులో ఆలోచిస్తు న్నావా ,కళ్ళతో ఆలోచిస్తు న్నావా ?తక్షణ కర్త వ్యమ్ ఏమిటి ?నేను చిరంజీవిగా
ఉన్నా ఇంతటి ఘోరం పూర్వం ఎప్పుడూ చూడలేదు .

16-‘’ఇత్ధ ం వాచా శోచమానం మహర్షిం –ప్రేక్ష ప్రా హ ప్రస్తు తం లోక నాదః

దుస్ట స్యా స్యోన్మూలనే స్యాదుపాయో-యస్త ం వక్ష్యే సాధనీయ సత్వయైషః’’

తా-లోకబాదను తన బాధగా చెప్పిన నారదుని చూసి ‘’వాడిని చంపే విధానం వివరంగా చెబుతాను .విని
ఆ ప్రకారం నువ్వే కద నడిపించాలి ‘’అన్నాడు హరి .

17-‘’కల్పం దాస్యా మ్యేక మేతేన దేవైః-కార్యో యాగ స్సత్వయా యాజ్ని కేన

చత్వారింశ ద్యోజనం కుండ మేకం –ఖాత్వా సమ్యచ్చైల రాజస్య సానో ‘’

తా-‘’ఒక కల్ప గ్రంధాన్ని నీకిస్తా .నువ్వ్వు అధ్వర్యుడివి గా ఉందడి  దానిలో చెప్పబడిన ప్రకారం ,దేవతల
చేత హిమాలయ సానువు మీద నలభై ఆమడల కుండం నిర్మించి విధి విధానంగా ఒక యాగం చేయించు
..

18-‘’జీవానాం తూష్ణీం స్థితిం బాధ తేయ –సో ఢా కస్మా త్సప్త తంతు ప్రవృత్తి ం

మాశంక  స్త్వైవం మయా భ్యూ హితం తత్ –మాయా మయ్యౌ ద్వే సృజామ్యద్య కన్యే ‘’

తా-వాడు ఆటంకం కలిగిస్తే దేవతలు ఏం  చేయగలరనే అనుమానం వద్దు .నేను విరుగుడుగా ఇద్ద రు
మాయావిను లైన కన్యల్ని సృష్టిస్తా ను .

19-‘’మంత్రీ రాజా ద్వౌ తయో ర్మోహ మగ్నౌ –యస్మిన్కాలే సాధ్యతే యాగ యేషః

యాగ త్రా ణ ప్రా ణితం యజ్వ లోకం –విఘ్నం కృత్వా బాధితుం కస్సమర్ధ ః ‘’

తా-భండుడు,వాడి మంత్రి మోహ పరవశం తో కామం కైపెక్కి ఒళ్ళు తెలీకుండా ప్రవర్తించే టప్పుడు ఈ
యాగ విశేషం నెరవేరుతుంది .సత్సంకల్పం తో ప్రా రంభమైన ఈ యాగము వల్ల కలిగే రక్షణ  ఆపటానికి
ఎవరి సాధ్యమూకాదు .ప్రయత్నాలన్నీ క్రమంగా ఫలిస్తా యి .
20-‘’ఇత్యుక్త్వాతం ప్రా హిణో ద్దేవ తేజ్యా –సాకల్యార్ధ ం సృస్ట వాన్ కన్యకే ద్వే

బో ద్ధ వ్యం యద్బోధ యిత్వా తయోస్స-ద్విడ్వశ్యార్దే  ప్రేషయామాస సద్యః ‘’

తా –దేవతలు చేసే ఈ యజ్ఞా నికి  ఒప్పించి నారదుడిని విష్ణు వు పంపాడు .అప్పుడే ఇద్ద రు కన్యల్ని
సృష్టించాడు .వారెం చేయాలో వివరించి పంపేశాడు .

21-‘’ప్రా రబ్ధ శ్శై లస్యమూర్ధ ్న్యధ్వరోహం-దేవై ర్మౌనీ౦ ద్రై ర్యదో క్తం విరాజా

తన్మాయా మయ్యౌచ గత్వా కుమార్యౌ –భండో ద్యానే  గాతు ముచ్చైః ప్రవృత్తే ‘’

తా-విరాట్ పురుషుడైన విష్ణు మూర్తి ఆజ్ఞ పక


్ర ారం నారద ,దేవతలు హిమాలయం పై క్రతువు
ప్రా రంభించారు .విష్ణు మాయతో పుట్టిన ఇద్ద రు కన్యలు భండాసుర వనం లో సుమధురంగా సంగీతం
పాడుతున్నారు ..

22-‘’విష్ణో ర్మాయా వాగురాం భ్రు త్య దిస్టా ం-అజ్ఞా త్వా తౌమార్గ యంతౌ మృగీవత్

గత్వా తస్యాం పేత తుర్దైవ యోగాత్ –ద్వౌ ద్వౌ పాణీ అగ్రహిస్టా ం వినస్టై’’

తా-రాక్షరాజు ,మంత్రి ఈ వార్త ను సేవకుల వలన విని విష్ణు మాయ అని తెలీక మొహం పట్ట లేక కన్య
లుండే చోటుకు వెళ్లి చెరొకరు వాళ్ళ చేతుల్ని పట్టు కొన్నారు .

23-‘’మామా మేమే త్యుచ్య మానౌచ తాభ్యాం –మేమే మేమే మేషవ ద్భాష మాణౌ

స్యాతాం భూతా విష్ణ వ చ్చా స్వతంత్రౌ –దత్వా దేయా న్యర్ధ మానాం స్త దిస్టా న్  ‘’

తా-వద్దు వద్దు అని కన్యలు వారిస్తు న్నా ఇదినాది ఇది నాది అని పో టీ పడుతూ మేకల్లా అరుస్తూ వాళ్ళు
అడిగే ఇయ్యకూడని వారాల నన్నిటి  ఇచ్చేసి దెయ్యం పట్ట్టిన వాళ్ళు లాగా బలవంతులైనా
అస్వతంత్రు లైపో యారు వారి చేతుల బందీలలో .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-15-ఉయ్యూరు


https://sarasabharati-vuyyuru.com/2015/10/15/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0-3/

‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -3

‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -3

24-నార్యోదీరా దుర్బలా భీర వశ్చ-క్వాస్తే భోగో భీత భీతాను తాను

తస్మాద్దేయం నో భయం భీతి హేతో –ర్వాచ్య స్మాకం వర్తి తవ్యం యువాభ్యాం ‘’

తా-ధైర్యం లేని ,బలహీనులు ,భయపడే ఆడవాళ్ళ తో భోగం ఆనందం ఇవ్వదు.కనుక మా భయం పో గొట్టే
ట్లు అభయ మివ్వాలి .మామాటకు కట్టు బడాలి  .మేము  ఒద్ద న్నదాన్ని చేయరాదు ‘’

25-‘’యుష్మత్పాల్యే యుష్మ దంగే ప్రభుత్వం -దత్వా తూష్ణీం స్థేయమద్ధా భవాద్భ్యాం

ఇత్యాదిం తాభ్యాం వరౌఘం గృహీత్వా –నాగా వత్తే తద్గ్రు హేషు ప్రవిస్టే’’

తా-మీ రాజ్యాలమీద ,మీ స్త్రీల పైనా మాకు అధికారం ఇచ్చి మీరు సుఖం పొ ందండి .మాటతప్పరాదు
‘’అనే షరతులు పెట్టగా మూర్ఖ రాక్షసులు డూడూ బసవన్నల్లా గా తలలూపి ఒప్పుకొనగా కన్యలు వాళ్ళ
ఇళ్ళకు చేరారు .

26-‘’రాజా మంత్రీ రాగ వంతౌ ప్రియాభ్యాం –సంబద్ధౌ నో పశ్యత స్స్మాం గణ౦ వా

ఉద్యోగిభ్యో దర్శనం భాషణం వా –దూరా పాంతంహంతహంతేశ మాయా ‘’

తా-ఇలా విష్ణు మాయలో పడి కన్నెల కౌగిలి చెరసాలలో బందీలై రాజు మంత్రీ అన్నిపనులూ వదిలేసి
అనుక్షణం రతి కార్యం లోనే నిమగ్నులయ్యారు .
27-ఇత్ధ ం భూతే దైవ యోగా ద్వ్యతీతా –దుర్విజ్నేయా పంచ శత్యబ్ద కానాం

దేవా నిర్బాదా యజ౦తి స్మ యాగం –హృస్టిం పుష్టిం తుష్టి మా సాధ్య సద్యః ‘’

తా-ఈ కామకేళీ విలాసం 500 ఏళ్ళు నిరంతరంగా  సాగింది .దేవతలు ఈ రాక్షస బాధ లేకుండా యాగం
చేస్తు న్నారు .యాగ ఫలంగా సంతోషం శారీరక బలం పొ ందారు .

28-దంతీం ద్రా ణాం వా ఘటా మ్ముక్ఛ టావా-తామిశ్రా ణాం వా తతిర్వహ్ని కుండాత్

దూమాలి ర్బ్రహ్మండ మా వ్రు ణ్వతీ త్వా –భండాస్యా౦తర్గేహమాప్యావవార ‘’

తా-ఏనుగు మందల్లా ,మబ్బుల గు౦పుల్లా ,చీకటి ప్రో వుల్లా హో మ ధూమ స్తో మం బయల్దే రి
బ్రహ్మా౦డమంతా వ్యాపించి భండాసురుని అంతః పురం ప్రవశి
ే ంచింది .

29 కేయం మాయే త్యానూ రేశేన  పృస్టో -భీతః కశ్చిన్మంత్రి పుత్రో బభాషే

హిమే శైలే సర్ష యో దివ్య వర్గా –ఇస్టిం కుర్వం త్యేషతద్వాహ్ని కేతుః’’

తా-ఇదేం మాయ అని భండాసురుడు అడిగితె ఒక మంత్రికొడుకు హిమాలయం లో మునులతో కలిసి


దేవతలు యజ్ఞ ం చేస్తు న్నారని ,యాగాగ్నిని సూచించే ధ్వజమె ఈ పొ గ అని చెప్పాడు .

30-శ్రు ణ్వన్నేవం సో ట్ట హాసం చ కార –హస్తే హస్త ం నిష్పి పేషా రుణాక్షః

ఆహ్వా తవ్యామంత్రిణిస్సైని కాంశ్చ-యామీ దానీం నాశ హేతో రరీణాం’’

తా-ఆ మాటలు విన్న వాడు విపరీతపు నవ్వునవ్వి చప్పట్లు కొట్టి కనులెర్రబడగా మంత్రి
సైనికాదులనుసమాయత్త పరచి శత్రు నాశనం చేస్తా నుఅని బీరాలు పలికాడు . .

31-సంరబ్ధ ంతం చేత్ద మా భాష మాణం-సర్వాంణ్యంగా న్యాస్ప్రుశం తీశమాయా

సర్వో పాయై ససాద  యంతీ స్వమర్ధ ం –నోయా తవ్యం భీత భీతే త్ద మూచే ‘’

తా-మహా అటో పం తో యుద్ధా నికి బయల్దే రిన వాడిని మాయాకన్య భయం నటిస్తూ వెళ్ళవద్ద న్నది .
32-‘’నో భేతవ్యం ఘాస కల్పా న్సురేశాన్ –నిష్పిష్యా గంతాస్మి దేవి క్షణేన

నోనో జేతాస్యాంభువీ త్యూచి వా౦సం-ప్రత్యూచే సాసామయ౦ స్మార యంతీ’’

తా-భయపడద్దు . గడ్డిపరకల్లా ంటి దేవతల్ని పిండి చేసి క్షణం లో వచ్చేస్తా .ఈభూమ్మీద మమ్మల్ని జయి౦
చేవాడేవ్వడూ లేడు (అజేతా అంటే మమ్మల్ని’’ జయించని వాడు ఉండడు’’-అని మరో అర్ధ ం ).అని ధైర్యం
చెప్పాడు .ఎడబాటును సహించ నట్లు నటిస్తూ  ఆమె బాధతో

33-‘’ఆద్యే సంగే సంగరో యో భవన్నౌ –విస్మర్త వ్యో నైవ రాజం స్త ్వయాద్య

సత్యం నిత్యం సేవితవ్యం తదర్ధం –నస్టౌ విష్ణో స్తౌ మధుః కైటభశ్చ’’

తా-మన మొదటి పొ ందులో చేసిన వాగ్దా నం మరచిపో వద్దు .అసత్యం ఆడటం వలననే  మధు కైటభులు
విష్ణు వు చేతిలో చచ్చారు .

34-‘’కిం కిం వేత్దం వాదినీం తామతీత్య –ప్రా ణాపాయే సంగరః కస్త వేతి

సాకం షడ్భిస్సంబలై స్స ప్రతస్థే-భేరీ భాంభా మారవై ర్దిగ్వి భేదం ‘’

తా- నా ప్రా ణాల మీదకొస్తే నీ సంగరం(ప్రతిజ్ఞ ) ఏమిటి అని చీత్కరించి ఆరు రకాల సైన్యాలతో యుద్ధా నికి
బయల్దే రాడు .

35-చాపే బాణోవా ప్రయాతో త్రయాతః –కిం వక్త వ్యం యజ్వనా మంతరాదిం

ఆవ్రు ణ్వ న్యజ్నప్రదేశం నిరాశం  కాంస్యోవప్రః కస్చిదావిర్బ భూవ’’

తా-బాణం లాగా రివ్వున యజ్న భూమి చేరాడు .దేవతలకు నోటమాట రాలేదు .అప్పుడు యజ్న ప్రదేశం
చుట్టూ ఆకాశం దాకా ఒక కంచు కోట ఏర్పడి కాపాడుతోంది .

36-నో బద్ధ ం నోన్యస్త మేనం నిరీక్ష్య –ప్రా కారం ధైర్యం సమాపుస్సురే౦ద్రా ః

రాక్షస్సైన్యం భీత భీతం దదర్శ –భండో భాండం వా పదా హో జఘాన.’’


తా-పెట్టకుండా కట్ట కుండా అప్పటికప్పుడేర్పడిన కంచు కోటను చూసి దేవతలు మహర్షు లు ఊరట చెంది
సంతోషంగా ఉన్నారు .రాక్షసులు కంగారుతో కకావికలైతే ,భండుడు కాలితో  కోటను ఒక తన్ను తన్నాడు
.

37-తత్పాదా హత్యా విశీర్ణ స్ససాల -శ్చూర్నీ భూతో భూమి మేవ ప్రపేదే

తస్మిన్దేశే హో బతాన్యః ప్రా భూతః –ప్రా దుర్భూతః  పూర్వ వత్కా౦స్య సాలః ‘

తా-వాడికాలి తన్నుతో బ్రద్దలై ముక్కలై పొ డి పొ డి అయిన కోట క్షణం లో అంతకంటే బలీయంగా మళ్ళీ
ఏర్పడింది .

38-భగ్నస్సోపి ప్రా దురాశీ త్త దన్య –స్సోపి ధ్వస్త స్త త్పర స్సద్య ఉత్ద ః

ఇత్ధ ం భండ శ్చండ విక్రా ంతి రుచ్చ్చై-ర్జా తం జాతం తచ్చతం సంబ  భంజ ‘’

తా-వీడు కూల్చేయటం,దాని  స్థా నం లో మరో కోట మొలవటం ఇట్లా నూరు కోట్ల కోటలు కూలటం మళ్ళీ
ఏర్పడటం జరిగింది .

39-‘’హీనోత్సాహో హ్రీణఉచ్చైర్విరావం –కుర్వన్నూచే ధీర వద్దైత్య వీరః

భో భో దేవా ఇష్టి మిస్త్వా సమిస్ట్యా-మా గచ్చద్వం వః కృతిం శ్వో బ్రవీమి ‘’

తా-దమ్ము తగ్గిన దానవుడు సిగ్గు పడి అయినా పౌరుషం చావక వికార చేష్టలతో ‘’మీ ఇష్ట ం వచ్చినట్లు
యాగం ఏడవండి .,అప్పుడు నా మీదకు రండి .రేపు మీపని పడతాను ‘’అన్నాడు .

40-‘’ఇత్యాక్రో శ న్సన్నివృత్త ః స్వకీయై –స్సాకం స్వంకం కంపయ న్సత్కిరీటం

ప్రా పద్గేహం కామినీ కామ కామా –క్రా ౦త  స్వాన్త స్చేతన శ్చాప్య నీశః’’

తా-ఆక్రో శం తో అట్ట హాసం చేస్తూ సైన్యం తో  మన్మధో ద్రేకం తో ఇంటి దారి పట్టా డు భండాసురుడు .

సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-15-ఉయ్యూరు

https://sarasabharati-vuyyuru.com/2015/10/16/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0-4/
‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -4

‘’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -4

41-‘’వక్రో క్తిభ్యో నాదరా ద్వి ప్రవృత్తే –ర్మాత్సర్యాత్సా  నిర్భయా సంస సార

మిష్ట ం క్షారం సౌనకం వా తదాసీ –తస్యా పీష్ణ౦ విష్ణు మాయా విలాసః ‘’

తా –ఎత్తి పో డుపులాడుతూ ,అనాదరంగా భయం లేకుండా  విపరీత వింత ప్రవర్త నతో ఆమె వాడితో
ప్రవర్తిం చింది .తీపి  ,కారం  ఉన్న పానకం లావిష్ణు మాయ చేత  ఈ పద్ధ తీ వాడికి నచ్చింది

42-‘’విజ్ఞా యాసౌ కార్య కాలం చరంతీ –తంచి క్షే పాంధౌ యదో ద్దేశమేవ

శాస్త ం్ర శాస్త ం్ర నోపకుర్యా త్ప్రసక్తే –ప్రా రబ్దే నీశస్య ధాతా విధాతా ‘’

తా-కావాలనే కన్య వాడిని కామపు రొంపిలో దింపి లేవ కుండా చేసింది .ప్రా రబ్ధ ం వాడిని అసమర్దు డిని
,శస్త ్ర  విహీనుడిని చేసి౦ది .విధాత రాతకు తిరుగులేదు కదా.

43-‘’ఇత్ధ ం వృత్వా సంవ్యతీతా శ్శతాబ్ద ్యః –పౌనః పున్యాత్పంచషాఆప్య విత్తా ః

దేవోద్దిస్ట స్సక్రతుః ప్రా ప పూర్తిం –పూర్ణా నంద స్త ద్గ ణోగ్నింపరీతః ‘’


తా-విష్ణు మాయావిలాసం తో భండుడుయుద్ధా నికి వస్తూ తిరిగి ఇంటికప
ి ో తూ ఐదారు శతాబ్దా లు
గడిపేశాడు దేవతల యజ్ఞ ం ఈ లోపు పూర్త యింది .ఆనంద సంతోషాలతో దేవతలు ఆ పవిత్ర యాగాగ్ని ని
చూస్తూ ఉన్నారు .

44-‘’అగ్నౌ తేజ స్తేజసి భ్రా జమానం –స్వారుణ్యం తస్మి న్ప్రభా భాసమానా

వ్యక్తి ర్బాలా బాలబాలా సమేతా –విశ్వా రాధ్యా సాధ్వనీ రావి రాసీత్ ‘’

తా-హో మాగ్ని కుండం లో కొత్త వెలుగు కనిపించింది .అందులో యెర్రని ఎరుపుదనం తో బాటు ఒక బాలిక
ప్రౌ ఢ లైన కన్యల పరివారం తో ఆవిర్భవించి౦ది .అర్వణం లేకుండానే ఉపాసించ దగిన పరోక్ష బ్రహ్మ విద్య
ఆమెయే .

45-‘’ప్రా దక్షణ్య  ప్రక్రమేణాభిజగ్ముః-ఉచ్చైర్నాదం స౦వదంతో జయోక్తీః

భక్త్యా భువ్యస్టా ంగ యోగం ప్రణేము-ర్బుద్దో ర్దిస్టా న్ స్తో త్ర పాఠాన్ప్ర పేఠుః’’

తా-దేవతలు అగ్ని హో త్రం చుట్టూ తిరుగుతూ ఆదేవికి ప్రదక్షిణ చేస్తూ జయజయ ధ్వానాలు చేశారు
.అందరూ భక్తితో సాష్టా ంగ ప్రణామ౦  చేశారు . స్తో త్రపాఠాలు పఠించారు.

46-‘’మాతః కాసిత్వం కుతోత్ర ప్రయాతా –కార్యం కిం తే నార్య మార్యంత్వమేభిః

అస్మాం స్త్రా తుం విష్ణు నోద్దిస్ట యాగా –దావిర్భూతా చేజ్జయో జస్ర మస్తు ‘’

తా-‘’అమ్మా !నువ్వెవరు ?ఎక్కడినుండి ఇక్కడికొచ్చావు ?మాతో నీకేమైనా పని ఉందా ?మాకోసం శ్రీ
మహా విష్ణు వుచే పంపబడిన దేవతవా ?నీకు జయం ‘’అన్నారు .

47-‘’విద్యా మూలే హేపరోక్షా జ విద్యే –మాలా గ్రంధాభీష్ట నిర్భీతి హస్తే

సర్వా రుణ్యేఫుల్ల కల్హా ర సంస్థే-మాతః పాహి ప్రా ణి లోకం ప్రసన్నం ‘’

తా-విద్యా మూలమైన పరోక్ష బ్రహ్మ విద్యా స్వరూపిణీ !పుస్త కం జపమాల ,వరదహస్త ం ,అభయ
హస్తా లతో కనిపిస్తు న్న దేవీ! ఎర్రకలువ పువ్వు లో కూర్చున్న బాలా౦బా ,ఆపన్నులమైన మా
ప్రా ణికోటిని కాపాడు .
‘’48-‘’బాలే బాల ప్రా భవే బాధ్యమానా –నస్మాన్భండే నాను రేణారి ణాత్వం

త్రా హి త్రా హి హ్యాపదబ్దేః పరం త్వాం-పారం ప్రా ప్తో విశ్వ సిత్యంత రాత్మా ‘’

తా-లోక కంటకుడైనా భండుని నుండి మమ్మల్ని కాపాడు .నిన్ను చూస్తె మమ్మల్ని తరింపజేసే నౌకలాగా
ఉండివిశ్వాసం కలిగించావు .

49-‘’ఏవం రూపా దేవతా ఆహ మాతా –విష్ణు ద్దిస్ట స్యాధ్వర స్యాస్మి సిద్ధిః

నాలం సాహం భండ మోహం నిహంతుం-మన్మాతా స్తే త్రా హరిష్యా మ్యహంతాం’’

తా-యాగ బాల ‘’విష్ణు సంకల్ప యజ్ఞా నికి నేను సిద్ధి రూపం .అంతమాత్రా న భండుని అజ్ఞా నాన్ని పూర్తిగా
నశింప జేయలేని దానిని .దానికి మా అమ్మ సమర్ధు రాలు .ఆమెను పిలుస్తా ను ‘’అన్నది .

50-‘’ఏతత్గ ం్ర ధం  సార్ధ మద్దా పఠిత్వా-జప్త వ్యోమే మాలయా మంత్రం రాజః

అంతర్యాగం సాధయిష్యామ్యహం వ –స్తేనాశేషారిస్ట మూల ప్రహాణిః’’

తా-నా చేతిలో ఉన్న గ్రంధాన్ని అర్ధ ం తో కూడా బాగా చదివి జపమాలతో ఆ మంత్రా న్ని జపించాలి .దానితో
అంతర్యాగ సాధన జరుగుతుంది .అప్పుడు మీకున్న సర్వ అరిస్టా లు తొలగిపో తాయి  భయం లేదు నేను
వరమిస్తా ను .

51-‘’నోచేదంగం కర్మ కాండ కార్యాగ్ని తప్త ం –యోవాకోవా నాల ముచ్చై రూపాస్తేః

త్యక్త్వో పాస్తిం సాధకో నైతి గమ్యం –తత్సర్వం వస్సాద యామ్యస్మి దేవాః’’

తా-ఈ స్తూ ల శరీరం కర్మకా౦డలలోని నిప్పుతో  కాలకుండా ,ఆ పొ గలో ఉక్కిరి బిక్కిరికాకుండా ,ఆ


అగ్నిని రాజేయ కుండా ఎవరైనా ఎంతటివాడైనా జప తప ఉపాసనలకు అర్హు డు కాదు .ఉపసనే గమ్య
స్థా నానికి చేరుస్తు ంది .ఇదంతా మీకు సాధించి పెట్ట టానికే నేనొచ్చా .

52-‘’ఇత్యుక్త్వా తాస్వాహ్ని కుండే తిశీతే –సంశుద్దా ంగా న్సాధకా న్సా గృహీత్వా

ఉత్త స్థౌ సా వ్యోమ్ని భూతాది చక్రం –భిత్వా౦తర్ధా మా భయే నోజ్జగామ ‘’


తా-ఈ విధంగా పలికి బాల పుణ్య విశేషం తో పరిశుద్ధ యై చల్ల గా ఉన్న అగ్ని గుండం నుంచి ,సాధకులను
దేవతలను వెంట బెట్టు కొని ఆకాశానికి యెగిరి చక్రా లన్నీ చేదించుకొని అండ పిండ బ్రహ్మాండాలు దాటి వెళ్లి
పో యింది .

53-‘’బ్రహ్మా౦ డేస్మిన్ చక్ర సో పాన పంక్త్యా –తీర్త్వా మార్గ ం దివ్య దేశే నిషన్ణా

ధ్యాయ౦తీసో పాహ్వయ  ద్దేవ మంత-స్సంస్థ ం సొ పి ప్రా దు రాసీత్తదైవ ‘’

తా-బ్రహ్మాండాలు దాటి దివ్య ప్రదేశం లో దేవి ధ్యాన ముద్ర లో అంతర్గ తుడైన దేవుని ధ్యానిస్తో ంది
.అప్పటికప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు .

54-‘’అంతర్యామీ కార్య మాహేత్య ప్రు చ్చత్ –నత్వా స్తు త్వా ప్రా దిశ త్సాపి  బాలా

ఏతే దేవాః కర్మ కాండేగ్ని శుద్ధా ః-కుర్వీ శైతాంశ్చిచ్చుచిం  ప్రా పితవ్యాన్ ‘’

తా-ఎందుకు పిలిచావని బాలను ఆయన ఆడిగితే వినమ్రంగా స్తు తి చేసి ‘స్వామీ  దేవతలంతా
కర్మకా౦డాగ్ని చేత శుచులై వచ్చారు వీరికి చిదగ్నిని పొ ందేట్లు చేయండి ‘’

55-‘’అంతర్యాగం త్వం కురుష్వేతి నున్నః –కర్త వ్య త్వేనాన్య నిశ్చిత్య ధీరః

దీక్షా దక్ష శ్చిత్త మాజ్యం జుహావ –చిత్యా చిత్యగ్నౌ సృచా సర్వ గోసౌ ‘’

తా-బాల కోరిక తీర్చటానికి ఆయన స్వయంగా యజ్న దీక్ష పొ ంది చిత్త వ్రు త్తి అనే స్రు క్కు తో ,చిత్త ం అనే
నెయ్యిని గ్రహించి జ్ఞా నాగ్నిలో  హవనం చేశాడు .ఈశ్వరుడు అందరిలో ఉన్నాడు కనుక అది అందరి
యజ్ఞ ం అయింది .

56-‘’చిత్యో పాత్త ం చిత్తా మాజ్యం చిదగగ్నిః-స్వీ చక్రే తో యోగ ఏషో మనస్కః

నాన్య చ్చ్రవ్యం దృశ్య మన్య న్నగమ్యం-నాస్త్యే వైక శ్చిద్ఘ నో చిన్నిమిత్త ం ‘’

తా-చిత్తి చేత గ్రహింప బడిన చిత్త ం అనే నేతిని అగ్ని గ్రహించి,తన రూపం తో కమ్మేసి ‘’అనమస్క యోగం
‘’గా ప్రసిద్ధి చెందింది .ఆ స్తితిలో ఇక వినటానికి వేరొకటి లేనే లేదు .నిరంతర చిత్పదార్ధ ం ఒక్కటే మిగిలింది
.
57-‘’చిత్యగ్నౌ మగ్నం మనో నాస్తి వాస్తీ –త్యేతత్ప్రుచ్చే త్కంక ఏతద్బ్రవీతి

ఆశ్వత్దా మ్నో హాని మద్దా య ఊచే -సప్రస్టవ్యో  భారతే ధర్మ రాజః ‘’

తా-చిదగ్నిలో మగ్నం అయిన చిత్త ం ఉందా పో యిందా ?దీనికి సమాధానం చెప్పాలి అంటే భారత కధలోకి
వెళ్ళాలి .అశ్వత్ధా మ హతః ‘’అన్నాడు ధర్మ రాజు  ద్రో నణుడిని అర్జు నుడు ఓడించటం కోసం .ఇందులో
సత్యం ఏమిటో ధర్మ రాజునే అడగాలి .ఇక్కడ శ్వత్దా మా అంటే గుర్రం లాగా పరిగెత్తే మనసు .గురువు
ద్రో ణుడు అడగ్గా శిష్యుడు ‘’అశ్వత్దా మ అహతం  కున్జ రరూపమైన వ్రు త్తి హతం అయింది అని లౌక్యంగా
సమాధానం .ఇది ప్రశ్నోత్త రలలాగా నడిచిన విషయం ఆని శ్రీ రాఘవ నారాయణుల మహా భాష్యం .

58-‘’యడ్ద ృశ్యం తత్కల్పితం వేదం ఊచు –తత్సాక్షిత్వంతత్ర సంలీన మేవ

అస్త్యే వైకః శూన్య తాయా విపక్షీ –యత్కధ్యే తా త్రా స్తి తచ్చిద్విలాసః ‘’

తా –కనిపించేదంతా కల్పితమే అంటుంది వేదం .బ్రహ్మ సాక్షిత్వం కూడా అందులోనే కలిసిపో యింది
.శూన్యత్వానికి ప్రతి పక్షం గా ఒకటి ఉండనే ఉంది .ఆ దీపం దగ్గ ర సర్వాభావం భాసిస్తు ంది ఇదే
చిద్విలాసం ,సత్యం .

59-‘’తూష్ణీ కామాస్తే యదానీం సురౌఘో –దేశం కాలం భూత తత్కార్య జాతం

విస్మ్రుత్యాసీ త్సంభవంతీ  చిదగ్నౌ-దృష్టా శక్తిః-కావ్య రూపా తిరూపా ‘’

తా-అలాంటి సమయం లో అన్నీ మరచి దేవతలు ఉండగా రూపం లేనిది కనుక ఒక అద్భుత శక్తి అతి
లోక సుందరిగా చిదగ్ని నుండి ఆవిర్భావిస్తూ వారికి దర్శన మిచ్చింది ‍.

60-‘’సర్వేశానా పాత యంతీ చిదగ్నౌ-దేవాంస్తా నా ధ్మాత  మాలిన్యచిత్తా న్

చిద్భానేనా భాతతత్వ  ప్రకాశాన్ –సద్య శ్చక్రే జ్ఞా న వీర్య క్రియా ద్యాన్(dhyaan ) ‘’

తా-శక్తి స్వరూపిణి అయిన ఆసర్వేశ్వరి  దేవతల్ని చిదగ్నిలో పడేసి మనోమాలిన్యాలను వదిలించి జ్ఞా న
బల సంపన్నులను చేసంి ది .

సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-15-ఉయ్యూరు

https://sarasabharati-vuyyuru.com/2015/10/17/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9/
’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -5

’మత్స్వప్నః ‘’(నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -5


61-‘’నేముం పద్భు వ్య స్తు వం శ్చక్రు కర్చా –ప్రౌ దక్షిణ్య   ప్రకమ
్ర ేణ ప్రతేయుః
  ప్రా ంజల్య ద్ధా బంధ  సంబద్ధ హస్తా ః-సర్వేతాం విజ్ఞా పయామాసు రర్ధ ్యం ‘’
తా-అందరూ ఆ దేవికి ప్రణామం చేశారు. పూజించి కొనియాడారు, ప్రదక్షిణ చేశారు .దో సిలొగ్గి ప్రా ర్ధ నగా
విన్న వించు కొన్నారు .
62-‘’స్త్రీ స్వాతంత్ర్యం నైవ శాస్త ్రం సహేత-విద్యే దేవ్యం  బో ద్వ హస్వా నురూపం
  పాల్యా   ఏతే భండ మోహ ప్రముగ్దా –దేవా యేతత్కార్యమోంనిర్వహస్వ ‘’
తా-‘’వివాహం కాని స్త్రీకి స్వాతంత్ర్యం లేదు .నీకిష్టమైన వాడిని వివాహ మాడు .భండుని చేత భంగపడ్డ
దేవతలకు నువ్వ్వు ఏలిక కావాలి   .దేవకార్యం నువ్వే చేయాలి ‘’అన్నారు .
63-‘’ఏకీ కృత్య శ్వే ద్రు శౌ సో దపశ్యత్ –సద్యో జాతో జః పురాణస్స ఏకః
  ఇచ్చా ప్రా ప్త స్సోపి కామేశ్వరో భూత్-ఉద్వా హ్యైనం సా ప కామేశ్వరీత్వం ‘’
తా-ఆ దేవి రెండుకళ్ళు ఊర్ధ ్వ ముఖం   చేసి ‘’పుట్టు క లేనివాడు ,ఏకమేవాద్వితీయం ఐనవాడు అయిన
నల దేవుడు సద్యో జాతడైనాడు .ఇచ్చ తో లభిస్తా డు .శరీర సంబంధ ఇచ్చ ఉన్నవాడు .అలాంటి
సద్యోజాతుడు కామేశ్వరుడనే పేరుతొ పిలువ బడుతున్నాడు .పూర్వం   కామేశ్వరీదేవి ఆయనను పెళ్ళాడి
కామేశ్వరి అయింది .’’అన్నది .
64-‘’తాధ్యా మాజ్ఞ ప్తో సృజ స్చ్రీ పురంత –త్త ్వస్టా ధ్యానాత్మన్మయీ భూయ భూయః
  తన్మధ్యస్త స్వాసనస్ధ స్సభర్తు –ర్వామా౦కే  సా సన్ని షణ్ణా వ్యరాజత్ ‘’
తా-కామేశ్వరీ కామేశ్వరుల చేత ఆజ్ఞా పి౦పబడిన ‘’త్వష్ట ‘’శ్రీ పురాన్ని నిర్మించాడు .అక్కడ భవనం లో
బ్రహ్మాసనం లో కూర్చున్న భర్త కామేశ్వరుని వామాంకం పై కామేశ్వరి కూర్చుని ప్రకాశించింది .
65-‘’ప్రా క్సర్వేశానాపి భూయోభి షిక్తా –దేవీ దేవై ర్విశ్వ విశ్వాది రాజ్యే
శ్రీ శ్రీమత్సి౦హాసనేశ్వర్యభూత్సా –పంచ బ్రహ్మా జిహ్మ మంచాది రూఢా’’
తా-పూర్వం సర్వేశ్వరి ఉన్నా   కూడా ఇప్పుడు నేడు మళ్ళీ సమస్త విశ్వ సామ్రా జ్యానికి సామ్రా జ్ఞిగా
అభిషేకింప బడింది .స్వాదిస్టా న ,మణిపూరక ,అనాహత ,ఆజ్ఞా ,సహస్రా ర,అనే  చక్రా లకు అధిదేవతలైన
బ్రహ్మ విష్ణు ,రుద్రా ,ఈశాన సదాశివులు అనే   మంచాన్ని అధిష్టించింది .
66-‘’శ్రీ మాతా రాజ్ఞీ మహాత్యంబికేతి-వాగ్దేవ్యస్తా ం నామభి స్తు స్టు వుర్హి
  కోటీ భి ర్ల క్షై స్సహస్త్రై శ్శతైర్వా-శాక్తేయానాం సంవదంతీ  పురాణీ’’
తా-అప్పుడు వాగ్దేవతలు ‘’శ్రీమాతా ,మహామతి ,రాజ్ఞి ,అంబిక ,అనే కోటానుకోట్ల నామాలతో కొనియాడారు
.
67-‘’గాదా విజ్ఞా నార్ధ మేతల్లి ఖామి –చిత్రీ కర్తు ం నో కవిత్వా త్త గర్వాత్
  తస్మిన్కార్యే లేఖినీ పత్ర మష్యా-దిప్రా ప్త వ్యం సాధనం చాస్మి వ్రు ద్ధిః’’
తా –కధకోసమే రాశాను .కవిననే గర్వం తోకాదు .అలాంటివాటికి కాగితా’’
లు సిరాలుకావాలి .ఒక వేళ వాటిని నాకు అందించినా నేను ముసలి వాడినైపో యాను .వర్ణించటానికి
అలవికాని దేవికి నమస్కృతి .
68-‘’మీ మాంసా యామాత్ర కి౦చి ద్వదామి-రాజ్ఞ ః కామేశో మహాత్యేవ రాజ్ఞీ
  ప్రస్టు ం దూరే పాణిని ర్యౌవ రాజ్యే –బాలా మ౦బాం   కిం పదే నాహ్వ యామః
తా-కొంచెం సందేహం వచ్చి అడుగుతున్నా .కామేశ్వరుడు రాజుకనుక ఆమె రాజ్ఞి అయింది .మహా మతి
అయిన రాజ్ఞి ని మహా రాజ్ఞి అనీ పిలవవచ్చు .మరి యువతి గా అభిషిక్తమైన్ది కనుక బాలాంబ ను యేమని
పిలవాలి ?అవివాహిత .రాజు లేడుకనుక రాజ్ఞి కూడా కాదు .స్త్రీ కనుక రాజా అనరాదు .ఈసందేహాన్ని
తీర్చమని పాణిని ని అడుగుదామంటే ఎక్కడో దూరం లో ఉన్నాడు .నేను ముసలాదడిని కనుక నేర్చి౦ది
అంతా మర్చే పో యాను .పెద్దలు నన్ను క్షమించాలి .
69-‘’సందేహో త్రా ష్యేష మాత శ్రు ణోషి-ప్రా క్సంభూతా సాకధం స్యాత్తు బాలా
పాశ్చా జ్జా తా త్వం కదంస్యాస్త దంబా-విజ్ఞా వ్యాసొ క్తిః కదం వాన్వయం తి’’
తల్లీ ! త్రిపుర సుందరీదవీ
ే !ఇంకో సందేహం .బహిర్యాగ కుండం లో ముందే  పుడితే బాల ఎలా అవుతుంది
?అంతర్యాగ కుండం లో తర్వాత పుట్టిన నువ్వు ఆమె తల్లి ఎలా అయ్యావు ?యెంత గొప్ప పండితుడైనా
వ్యాసమహర్షి ఈ చెప్పిన ఈ మాటలను ఎలా సమర్ధిస్తా డు ?
7 ౦-‘’తేషాం నామాన్యేవ తానీతి వాద-శ్చే ద్రా జ్య .వ్యత్యా సవాదో ర్ద వాన్కిం
ఇత్ధ ం మా వాదీ స్స్సకుప్యేత కృష్ణో –మైవం బ్రూ యా వ్యాస హూతిస్త దర్దా ‘’
తా-బాలమ్మ ,లలితమ్మ ,అ౦బమ్మ అనే ఆమె పేర్లు సంజ్ఞా పదానికి అర్ధ ం ఎందుకు అనే వాదం
మున్డు పుట్టింది యువరాజు మహా రాజవటం తో దీన్ని ముడి పెట్టద్దు .గీతాచార్యుడు కృష్ణు డికి
కోపమొస్తు ంది అనద్దు .అందుకే నమ్మా నేను ముందే చెప్పాను నీకు .వ్యాసుడిని పిలి పించు తల్లీ అని . వి
న్నావు కాదు .ఆ మహర్షి పద్దెనిమిది పురాణాలు రాసి విసుక్కోకుండా అడిగిన వారందరికీ విస్త రించి చెప్పి
తృప్తి పరుస్తు న్నాడు .గీతా చార్యుడు 18 వ అధ్యాయం లో సంగ్రహం గా చెప్పి దులిపేసుకున్నాడు   .మళ్ళీ
అడిగితె ఆర్జు నుడిని దులిపి నట్లు నన్నూ దులిపెస్తా డేమోననే భయం వేస్తో ంది ‘.
    
  సశేషం
    మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-15-ఉయ్యూరు

https://sarasabharati-vuyyuru.com/2015/10/19/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae
%e0%b0%b6/

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -6

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -6

71-భక్త్యా  వందేమాతరం భోః ప్రసీద -యద్వా వచ్మ్యే వాహ మ౦గీ కురుష్వ


విద్యా పారోక్ష్యా పరోక్షత్వ యోర్వా -బాలత్వా బాలత్వ సంకేత ఈద్రు క్ ”
తా-”తల్లీ !భక్తీ నమస్కరించి అడుగుతున్నాం నువ్వు చెప్పక పొ తే ,నాకుతోచింది చెబుతా అనుగ్రహించు
.బాల అంటే పరోక్ష బ్రహ్మ విద్య .నీ పంచదశి ప్రత్యక్ష బ్రహ్మ విద్య .ఈ బాలత్వ ,అబాలత్వాలు
ఒకటితక్కువ ,మరోటి ఎక్కువ అనే అర్ధా న్ని ఇవ్వటం లేదా ?
72-”మంత్రస్తే కూట త్రయాత్మా తటస్త -త్సార భ్రా జత్ర్యక్షరో స్యామనుశ్చ
తత్తా వచ్చిన్నో జయ మంగ ప్రబేదః -యద్వా హేతు స్త ద్వి భూతో ర్విభాగః ”
తా-మూడు కూటాల నీ మంత్రం 15 అక్షరాలూ కలది .ఈ మూడు కూటాల సారమే మూడక్షరాల బాల
మంత్రం .ఈ భేదం దీని నుంచి వచ్చిందా ?ఏక పాద్విభూత్య ధిస్టా త్రి బాల ,త్రిపాది విభూత్యధిస్టా త్రి  బాల
అనే విభూతులను బట్టి వచ్చిందా ?
73-”అస్మాదావిర్భావతః పూర్వ సిద్దే -రూపే వావాం మాత్రు పుత్రీ త్వ సిద్ధిం
ఊకారే నైవోత్త మా౦ గ౦ విచాల్య- దేహ్యాజ్ఞా నం  త్వం ప్రస్తు తో పక్రమాయ ”
తా-ఇక్కడ అవతరించటానికి  ముందు సిద్ధమైన మీ రూపాలలో తల్లీ కూతురు గా ఉండి ,అదే ఇక్కడ కొన
సాగుతోందా ?నువ్వేం కస్ట పడద్దు .”ఊ ”కొట్టు చాలు .లేదా తల ఊపు అంతే.ఏదో రకంగా నువ్వు ఔనను
.ఇక కధలోకి వెడ దా౦.
74-”ప్రా క్సర్వేశానో తర రాజాది రాజః -రాజ్ఞీ తస్యే హాస్తి కామేశ్వరీయం
బాలా బాలాయు వ రాజ్యేభి శిక్తా -పర్యావ వ్రు శ్శక్తి సేనా న్సమంతాత్ ”
తా-పూర్వం సర్వేశ్వరుడైన కామేశ్వరుడు జగజ్జ నకుడు .రాజాది రాజు .ఆయనభార్య కామేశ్వరి ,ఇక్కడ
రాణి ఉన్నది .ప్రౌ ఢ అయిన బాల యౌవ రాజ్యానికి అభిషేకింప బడింది .శక్తి సేన అంతటా విస్త రించింది .
75–”బాహ్యాన్త ర్ద్రు ష్టి శ్శివో దూత భూతః -మన్త్రిన్యంబా మంత్ర యత్యర్ధ జాతం
శ్రీపూశ్చక్రం దుర్గ మం దుర్ని రూపం -తత్రత్యానాం భీర్న సిద్ధా మ్రు తాత్తి ”
తా -బహిరంతర్ముఖుడైన శివ దేవుడు రాచకార్యాలలో దూతగా పని చేస్తా డు .మంత్రిణీ శక్తి  మంత్రా లోచన
చేస్తు ంది .చక్ర రూపం లో ఉన్న శ్రీ పురం నిరూపించ టానికి  వీలుకాట్టిది .ఇతరులు అక్కడికి చేరుకోలేరు
.అక్కడి వారికి భయం లేదు .అమ్రు తానుభవం సిద్దించేది .
-”సుధా సిన్దోర్మధ్యే సుర విటపి వాటీ పరివృతే -మణి ద్వీపే నీపో ప వన వతి చింతామణి గృహే
శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయాం -భజన్తి త్వాం ధన్యాః కతి చన చిదానంద లహరీ ”
తా-అమృత సముద్ర మధ్య లో  కడిమి తోటలో చింతామణి గృహం లో బ్రహ్మ రుద్ర ,ఈశాన,రూపాలలో
ఉన్న మంచం పై సదాశివుని పర్యంకం పై నివశించి ఉన్న జ్ఞా నానంద ప్రవాహమైన నిన్ను ఓ పర దేవీ
అదృష్ట వంతులైన కొందరు మాత్రమె సేవించగలరు .(శ్రీ శంకరుల సౌందర్య లహరి )
76 -సంనద్దే త్ధ ం ప్రా హి ణోత్త ం శివేశం -దౌత్యం కర్తు ం దైత్య నాదాయ సద్యః
దౌష్ట ్యం త్యక్త్వా దేవ భావే  వనద్వం -నో చేద్ధన్యా౦ మూల కాషం కషిత్వా ”
తా-సర్వ సనద్దు రలైన దేవి శివుడిని భండాసురుని వద్ద కు దూతగా పంపిది ”.రాక్షస భావం వదలి
దేవభావం తో లోకాలను బాధించకుండా ఉండు .లేక పొ తే మొదటికే మోసం వస్తు ంది ”అని చెప్పమని
పంపిది
77 -”సో యం గత్వా భండ రక్ష స్సభాంతం -నిర్భీ రూచే వాచికం తద్యదో క్తం
క్రు ద్ధ స్సంరద్దో ట్ట హాసం ప్రకుర్వన్ -జల్పన్నాల్పం హ్యాది దేశ స్వభ్రు త్యాన్ ”
తా-వాడి సభకు వెళ్లి దేవి చెప్పినట్లు శివుడు దూత వాక్యం పలికాడు .మండిన భండుడు భటులకు ఆజ్న
ఇచ్చాడు .
78-”ఆభీలో హో కాల ఉచ్చా వచో సౌ -రామా మామాకార యతీ హి యుద్ధే
కర్త వ్యమ్ యత్త త్కరిష్యా మహేశ్వో -దూతం బధ్వా తాడయద్వం సమేతా ”
తా-ఏమి కాల వైపరీత్యం !ఒక ఆడది నన్ను యుద్ధా నికి రమ్మని పిలుస్తు ందా ?వెంటనే ఈ దూతను
బంధించండి ”అన్నాడు .
79-‘భర్త్రా జ్ఞా ప్తా స్తేన సమీయు స్సమంతాత్-దండైః కాస్టై రశ్మ భిస్తా డ యంతః –
నాచే కిన్చిత్స స్మితాస్య శ్శి వోయం -స్థా ణుస్సంరంభం తదీయ౦ హిసే హె”
తా-రాక్షస భటులు ప్రభు అజ్ఞ ప్రకారం కర్రలతో రాళ్ళతో , ఆయుధాలతో శివుడి చుట్టూ చేరారు .స్థా ణు వైన
పరమేశ్వరుడు చిరు నవ్వులు చిందిస్తూ ఉన్నాడు .వారి సంరంభాన్నంతటిని  పురారి  సహి౦చాడు .
80” ఆఘతాస్తా న్ఘా తు కానేవ జఘ్నుః-భిన్నా భిన్నా రక్త సిక్తా శ్చ పేతుః
చిత్రం చిత్రం చిత్ర మిత్యుచ్చ రంతం -నో చిత్రం సహ్యాంత రాత్మా జనానాం ”
తా-వాళ్ళు శివుడిని కొట్టే దెబ్బలు వాళ్ళనే బాధిస్తు న్నాయి .ఒళ్ళు తిరిగి బ్రద్దలై ,రక్త ం కారుతూ ”చిత్రం
భళారే విచిత్రం ”అంటూ భరిస్తు న్నారు .ఆయన అందరికి అంత  రాత్మ యే కదా ”

రేపు మూలా నక్షత్రం -శ్రీ సరస్వతీ పూజ శుభా కాంక్షలతో

సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-15-కాంప్ -బాచుపల్లి -హైదరా బాద్

https://sarasabharati-vuyyuru.com/2015/10/19/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be-
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae
%e0%b0%b6-2/

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు -7

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు -7


81-”కిం కుర్వం త్యుత్సాహ హీనా నివ్రు త్తా -స్తేనో భూత్త త్రైవ ద్రు శ్యో ప్యద్య శ్యా

వాణీ కాచి ద్దివ్య భీకా చ చక్షే -శ్రు ణ్వత్స్వే తేష్వప్యానద్రు తే ”

తా-పాపం భటులు వాళ్ళెం చేయగలరు?నిరుత్సాహం తో వెళ్ళిపో యారు .ఇన్త లొ ఒక అ శరీరవాణి విని


నిపించింది  .
82-”భో మోహాత్మన్ భందచండ ప్రచండా-ప్రత్యక్ష బ్రహ్మాత్మ విద్యాననవద్యా

సన్నద్దా సీమంత సీమాంత దేశే -స్వధ్యా సీనాశాసితుం త్వాం  దురంతం ”

తా-మొహాన్ద కారా !చండ  శాసన భండా ప్రత్యక్ష బ్రహ్మ విద్యాత్మిక లలితా దేవి ప్రత్యక్షంగా యుద్ధ ం
చేయటానికి సిద్ధం గా ఉంది ,

83-”పాపాచారం గర్వ మేత త్సమస్త ం -త్యక్త్వా జీవన్ జీవ తుల్యంశ వేన

యుద్ధా దేవ్యా దివ్య శక్తి ప్రతానై -ర్మ్రుత్వా రూప స్టిస్ట  తుల్యంశివేన ”

తా-సర్వ గర్వాన్నిఒదిలెసి నిర్జీవిగాఉన్దు లేకపో తెదవి


ే దివ్యశక్తు లతో పో రాడి రూప రహితంగా శివుడిలా
ఉండు .

84-”వైధవ్యంకిం సాధయామ్య త్ర వృత్యా-ప్రగ్విష్ణౌ వ శక్తి సేనాను లీయే

యిత్యా భాష్య ప్రస్తితా విష్ణు మాయా -ద్రు శ్యానా భూత్క్వాపి కాపి ద్విరూపా ”

తా-ఇక్కడ విధవను అవటమో ,లేక నీ ముందే దేహం వదిలి విష్ణు


వులోకాని,శక్తిసేనల్లో కానిలీనమైపో తాను .”అని పలికిరెండు రూపాలలో ఉన్న విష్ణు మాయ అదృశ్యమైంది .

85-”స్మ్రుత్వాదేవంతం శివంవాచికం తత్ -మాయా దేవ్యాస్తా ం ప్రవ్రు త్తి ం చ దృష్ట్వా

శ్రు త్వా కాశే వాచ మర్ధ్యాం స భండ -స్సన్నద్దో  భూత్సర్వ సైన్యై ర్వదాయ ”

తా-ఇన్నివిధాలుగ చెప్పినా వినని, వినిపించుకోని బండుడుయుద్ధా నికే సిద్ధమయ్యాడు

86-”భేరీ భంకారై ర్మ్రుగేంద్ర ప్రణాదై -ర్మత్తే  భాశ్వా రావనై రట్ట హాసైహ్

సంరబ్దా ం స్వాం సైన్య రాజిం గృహీత్వా -దైత్యో దేవ్యా  శ్శక్తి సేనా సమభ్యైత్ ”

తా-భేరీల భం భం నినాదాలుదిక్కులు పిక్కటిల్లేట్లు   సర్వసైన్యంతోదేవీ సైన్యాన్నిఎదిరించాడు .


87-”దేవీ స్థా నం శక్తిసేనా సమాజం -యద్యద్రక్ష్య 0 తత్త దన్య త్పరీయ

జ్వాలా మాలిన్యా వ్రణోతిస్మ వహ్ని -ప్రా కారేణ  స్వ ప్రభా భాసు రేణ ”

తా-సర్వ శక్త్యాత్మకంగా జ్వాలామాలిని చూడ రాని కాంతితో అగ్ని దేవతలా వచ్చింది .

88-”మాతం గౌఘై  రాస సంపత్కరీయా-యాశ్వా రూడ్హా కోటి కోట్యశ్వ కోట్యా

ప్రా పు స్సర్వా ఆయుదీయా అమోఘా -శ్శక్తి  వ్రా తా శ్చక్ర రాజారదేన ”

తా-సంపత్కరీదేవి ఏనుగుసేనతో,  అశ్వా రూఢ శక్తిగుర్రపు దళం  తో చక్ర రాజ రధాన్నిఅధిరొహించి


సర్వాయుధ శక్తి సంపన్నంగా వచ్చింది.

89 -మంత్రిన్యంబా  గేయ చక్రా ది రూడ్హా -కోలై శ్చ క్రైహ్ స్యన్ద నే దండ నాధా

ఆయాతా స్త్వైర్వాహనై  రాయుధైశ్చ-బ్రహ్మాండేయా శ్శక్త యస్తా స్సమస్తా ః

తా-గేయచక్ర రాదాన్నిఎక్కి మంత్రిణీ  దేవి ,వారాహ చక్ర రధం పై దండనా శక్తి ,అలాగేమిగిలిన శక్తు లన్నీ
వారివారి ప్రత్యెక రదాలెక్కివచ్చారు .

గేయచక్రం ఏడ 0 తస్తు లతో ,కిరి చక్రం అయిదు అంతస్తు లతో ఉంటాయి  మంత్రిణి అంటే   శ్యామలాదేవి
.కిరి చక్రం పై వారాహిదేవి ఉంటుంది యుద్ధ ంలో ఈ మూడు రధాలు ఒక దాని వెంట ఒకటి ఉంటాయి ..

90-”సంతు స్త ంబా భండ సైన్యాది సర్వా-ణ్యాని ఘ్నంతీ0 శక్తి విక్రా ంతి మైక్ష

నిత్యా వీర్యా టోప మాలోక యంతీ –సౌత్సు క్యాతా అస్తు అద్భావ భంగ్యా”

తాశక్తి సైన్యం భండాసుర సర్వసైన్యాన్ని హతంచేస్తు ంటే శ్రీ మాతసిద్విలాసంగా నవ్వుతూ ,వారి
పరాక్రమాన్ని మెచ్చుతోంది .

సశేషం

మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ -19-10-15- కాంప్-మల్లా పూర్ -హైదరాబాద్


https://sarasabharati-vuyyuru.com/2015/10/20/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0/
‘’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -8

‘’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -8

91-‘’నో సంరబ్దా నై వభీతాన భూతా –భర్తు ర్వామామ్కేనిశాణ్ణా యదా వత్

దేవ్యా  దిస్టైశక్తి సైన్యై ర్వితున్నో –భండ శ్చిత్రంవిఘ్న యంత్రం తతానః ‘’

తా-అంతటి భండుడితో యుద్ధ ం అని భయం కాని కంపం కాని లేని దేవి భర్త వామాంకం పై కూర్చునే
ఉండి సైన్యం తో భీకర యుద్ధ ం చేయించింది .వాడు చిత్రమైన విఘ్న యంత్రా న్ని పెట్టించాడు .

92-‘’యంత్రస్యాన్య ప్రా భావాత్సం బభూవు –శక్త్యాస్థా నం సర్వ కార్యేషు విఘ్నాః

తాభిర్విజ్న స్తా విభో రైక్షతాస్యం –కామేశీ సా తక్షణే భూద్గ ణేశః’’

తా-ఆ యంత్రం దేవి కార్యాలకు విఘ్నాలు కలిగిస్తో ంది .పాలుపో క అమ్మవారు అయ్య వారి ముఖం వైపు
సాభిప్రా యంగా చూడగానే గణేశుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు .

93-ప్రు స్టా కార్యం కిం మయే త్యేతకేన  -భంజా రాతే ర్విఘ్న యంత్రం దురంతం

ఇత్యాదిస్టః ప్రేక్ష జఘ్నే వదేన –తేనా భూత్త ద్విశ్ల ధం తన్మనశ్చ’’

తా-‘’నాతొ ఏమిపని ‘’? అని అడుగగా అమ్మ  ‘’విఘ్న యంత్రా న్ని విచ్చిన్నం  చేయమన్న’’ది .కాలితో
ఒక్కతన్ను తన్నగా అది ముక్కలై పొ డి పొ డి అయింది .రాక్షసుని మనసూ విరిగిపో యింది .

94-‘’సన్నదాన్వా ఆగతా న్భండ పుత్రా –న్సంఖ్యాతీతానాహనత్తీ ప్రసంఖ్యే


బాలా బాలా యౌవ రాజ్యే పదస్థా -మాతా నందత్తా ంకృతిం సంస్తు వంతీ’’

తా-యువరాజ పదవిలో ఉన్న ప్రౌ ఢ అయిన బాలలేక్కలేని భండుని కొడుకుల్ని సంహరించింది ఈపనికి
జగన్మాత బాలను భేష్ అని మెచ్చింది .

95-‘’దుర్ధ ర్షం భందాను జాతం విషంగం –మంత్రిన్యంబా శామలాఖ్యా వదీత్సా

తద్దు స్ట ం తస్యాను జాతం విశుక్రం –వారాహ్యాభ్యా భండ నాదా హనద్ధిః’’

తా-భండుని తమ్ముడు విషండుని మంత్రిని శ్యామలాంబ చంపింది .వాడికంటే దుర్మార్గు డైన తమ్ముడు
విశుక్రా సురుడిని దండనాద అయిన వారాహి మట్టు పెట్టింది .

96-‘’కర్మభ్యా౦ ద్వాభ్యాంతయోస్సంతు తోష –సమ్రా జ్నీ తేహ్యభ్యనందన ద్ద్రు శోక్త్యా

భండే నైవోత్పాదితౌ స్వేచ్చయా మూ –స్రష్టా ౦ సాభ్యాం స్వాను జన్మ త్వ బుద్ధ్యా ‘’

తా-ఈ రెండు పనులకు రాజ రాజేశ్వరి సంతోషించింది .స్వయంగా రాక్షసులని సృష్టించే సామర్ధ ్యం ఉన్న
భండుని చేత తోడబుట్టిన వారు అనే భావం తో మళ్ళీ పుట్టించటం లేదు .

97-‘’మాయావీస్రస్టా సృజత్త త్క్షణేన –రక్షో నాదో రాక్షసాన్సోను కాదీన్

భూతాన్ భవ్యాన్ సర్వ నారాయణారీన్ –తేనాజ్ఞ ప్తా ఏకదాతే భిజగ్ముః

తా-మాయ సృష్టికర్త అయిన వాడు పూర్వపు రాక్షసులైన సో మక హిరణ్యాక్ష హిరణ్య కశిపుడుమొదలైన


వారెందరినో సృష్టించాడు .వాడి ఆజ్ఞ తో వాళ్ళంతా శక్తి సైన్యంపై విరుచుకు పడ్డా రు .

98-‘’లోకానాం మాతా హసంతీహిదృష్ట్వా తాన్ హస్త ద్వంద్వ్వా౦ గు ళీనాం నఖేభ్యః

సౌ సృష్ట్వా నారాయణ స్యా వతారాన్ –తేభ్యః ప్రా దో ద్యోద్దు మద్దా పినద్ధా న్ ‘’

తా-ఆ రాక్ష బలాన్ని చూసి నవ్వుతూ లోకమాత లలితా త్రిపురసుందరి రెండు చేతులలోని పది వ్రేళ్ళ
గోళ్ళను విదిల్చి నారాయణుని పది అవతారాలను సృష్టించి ,వారందర్నీ యుద్ధ ం చేయమని ఆజ్ఞా
పించింది .
99-‘’రక్షాం స్మేతాన్యాసు జీవేశ వ్రు త్తి –ప్రా యైః ప్రా యో హన్యమానాని వేశుః

జాతా  విష్ణో ర్మూర్తి  భేదా స్త దైవ-దేవ్యా దృష్టా నిర్ర్వ్యాణి స్శ్రమా శ్చ’’

తా-భండ సృష్టిని నారాయణ దశాక్రు తి సృష్టి పూర్తిగా నశింప జేసింది .విష్ణు అవతారాల పరాక్రమాన్ని దేవి
అభినందన పూర్వకం గా ప్రసన్న దృష్టితో చూసింది .దీనితో వారికి గాయాల బాధ లేకుండా పో యింది .

100-‘’ఆత్మీయానాం నాశ మార్తిమ్చ వీక్ష్య –భండః కోపాదస్త ్ర శస్త్రై ర్వవర్ష

దేవీ మేవ స్వాత్మనా ఖ్యేత్య సాపి –ప్రత్య స్త్రైస్తం వారయామాన త౦చ’’

తా-తనవారు చచ్చి దేవి సైన్యం హెచ్చుతుంటే వాడికి మండి స్వయంగా యుద్ధా నికి దిగి అస్త శ
్ర స్త వ
్ర ర్షం
కురిపించాడు .

సశేషం

శ్రీ దుర్గా ష్ట మి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-15

\తా

https://sarasabharati-vuyyuru.com/2015/10/21/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d/
మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు
’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -9

101-‘’తంబా తీత్య ప్రస్తితాస్త న్యసేనా-సంరంబో త్దా ఆసురీర్నిర్ద దాహా

కల్పాన్తేష్వీశ్వః పశూనాం జగంతి-భస్మీకుర్యాద్యేన  శస్స్త్రే ణతేనః ‘’

తా-కల్పాంతం లోపశుపతి అయిన  శివుడు లోకాలను సమూలంగా దహించినట్లు  ఈశ్వరి భండాసుర


సైన్యాన్ని సమస్తా న్నీ పాశుపతాస్త ం్ర తో దహించే సింది .

102-‘’సర్వాత్మీయానాం ప్రనాశం సమీక్ష్య-దేవీ మేవాభ్యద్రవ చ్చూన్య కేన

సాప్యేనంకామేశ్వరేణా భి జఘ్నే-భండం శూన్యాసుం సశూన్యం దదాహ ‘’

తా-అంతా కోల్పోయినవాడు కామకం అనే తన పట్ట ణం తో సహా దేవిపైకి వచ్చాడు .భవానీ దేవి వాడిని
కామేశ్వరమనే అస్త ం్ర తో కొత్త గా వాడినీ వాడి పట్ట ణాన్ని  కాల్చి  బూడిద చేసంి ది  .

అస్త్రా లలో కామేశ్వరాస్త ం్ర పాశుపతాస్త ం్ర కంటే శక్తి వంతమైనది .అమ్మవారి నామాలలో ‘’కామేశ్వరాస్త ్ర ‘’అని
ఉంది .భండుడు మొహానికి, శూన్యనగరం శూన్య వాదానికి ప్రతీకలు అని గ్రహించాలి .దేవుడిని చూపించి
శూన్యవాదాన్ని చిత్తు చేసంి ది అనీ భావం .

103-‘’బ్రహ్మోపేంద్రా దయ స్స్మస్తు వంతి-విస్మేరాస్యా విక్రమ ప్రక్రమర్ధిం

దేవా స్స్వస్థా స్సుస్తితాశ్చాన్యలోకాః –సో యం కామేశాన పత్నీ,ప్రసాదః ‘’

తా-త్రిమూర్తు లు మున్నగు దేవతలు దేవి పరాక్రమాన్ని కొనియాడారు .లోకాలన్నీ స్వస్థ త చెందాయి


.శూన్యవాదం నశించి మనో బుద్ధీ మొదలైన ఇంద్రియాలు సువ్యవస్తితమై సాధకులు నిర్వృతి పొ ందారని
అంతరార్ధ ం .

104-‘’గాదా సేయం వర్నితా విస్త రేణ-స్వీయే గ్రందే వ్యాస భట్టా ర కేన


లోకోద్దా రార్ధ ం హి నారాయణేన –సంగృహ్యేయం ప్రస్తు తార్ధ ం మయోక్తా ‘’

తా-వ్యాసమహర్షిగా జన్మించిన నారాయణుడు బ్రహ్మాండ పురాణం మొదలైన వాటిలో చాలా విస్తా రంగా
దీన్ని రాశాడు .నేను సంగ్రహం గా చెప్పాను అంతే.అన్నారు శాస్త్రీజీ .

105-‘’అంతర్యామీ వ్యాస నారాయణో సౌ –సర్వ త్రా స్తేసనాస్తే మయ్యహో కిం సనాస్తే

మాతస్త ్వంమే జాగ్రతి స్వప్న సుప్త్యోః-ప్రత్యా సన్నా లక్ష్యసే భాగ్య మేతత్ ‘’

తా-వ్యాస నారాయణుడు సర్వాంతర్యామి .అలాంటి వాడు నా యడల ఉండడా?అమ్మా !నువ్వు నాకు


మెలకువలోను ,కలలోను ,నిద్రలో కూడా సన్నిహితంగా ఉంటున్నావు .ఇదే నా భాగ్యం .

106-‘’నామం నామం త్వాం చ బ్రవీమి –స్థా తవ్యం వామాభి ముఖ్యేన మేం బ

ఉద్వాహే తే లోక మాతృత్వ కార్యే (కీర్తౌ )-పౌర్వా పర్యం తద్వి మ్రు స్ట వ్య మత్ర’’

తా-నీకూ వ్యాసునికి పదే పదే నమస్కరిస్తూ మళ్ళీ అడుగుతున్నాను .నీ వివాహం ,లోకాలను కనటం
లలో ఏది ముందు ?వివాహం నాటికే దేవాసురులతో ఉన్న ప్రపంచం ఉందికదా .మరి ఆ ప్రపంచాన్ని ఈ
అమ్మ ఎలా కన్నది ?అని సందేహం .

107-‘’ఈశ స్స్రస్టా లోక జాలస్య తాతః –పత్నీ తాత స్యా౦బి కైవ ప్రజానాం

ఇత్ధ ం గౌర్యా లోక మాతృత్వ మూచే –సర్వజ్ఞో సౌ కాళిదాసః కవీశః ‘’

తా-అన్నిలోకాల్ని సృష్టించిన ఈశ్వరుడు వాటికి తండ్రి అవుతాడు కదా .తండ్రి పెళ్ళాం ప్రజలకు తల్లి
అవుతుందికదా .అని మహా కవి కాళిదాసు పార్వతీ దేవి యొక్క లోక మాతృత్వాన్ని సమర్ధించాడు .

108-‘’శక్త్యా యుక్త శ్శక్త ఏతత్ క్రియాసు –నో చే దీశ స్స్పందితుం చాప్య శక్త ః

ఇత్యాచార్యా స్శంకరశ్శన్కరోయం-వ్యాచ స్టేద్ధా డిండిమం వాద యన్నోన్’’

తా-శక్తితో కూడిన శివుడు సృష్టి స్తితి లయ కారకు డౌతాడు .శక్తి లేకపో తె ఆయన వలన ఏ పనీ జరుగదు
అని సాక్షాత్తు శంకరావ తారమే అయిన శ్రీ శంకరాచార్యులవారు చెప్పారు కనుక తిరుగు లేదు .
109-‘’వేదో మూలం వ్యాస వాచాం న చేత్స-మంత్రం ద్రస్టా నో వదేత్కించ నాపి

వేద వ్యాసో క్త ప్రభావ ప్రపంచే –హ్యూహా పో హే సాధయే త్సత్కవీశః ‘’

తా-మంత్ర ద్రష్ట వ్యాసుడు చెప్పిన ప్రతిదానికి వేదమే మూలం .వారి వాక్కుల ప్రభావం తో ఊహా పో హాలను
మేళవించి సత్కవి కావ్య రూపం లో ప్రపంచానికి తెలియ బరుస్తా డు .

110-‘’వేదస్త ్వమే దృశ్యసే భాగ్య యోగాత్ –వ్యాసో మౌనీశశ్చ  సర్వత్ర గోస్తి

యుష్మ స్సాన్నిధ్యం ప్రకల్ప్య ప్రా సాదాత్-ప్రశ్నంతస్యా వ్యుత్త రం వర్ణ యామి ‘’

తా-అసలు వేద వాణివి నువ్వేకదా తల్లీ !నా అదృష్ట వశాన కలలోను , నిజంగాను  కన్పిస్తు న్నావు .ముని
ముఖ్యుడు వ్యాసుడు ఈశ భావం తో సన్నిహితుడయ్యే ఉన్నాడు .మీ ఇద్ద రి సమక్షం లో నేను సంధించిన
ప్రశ్నాస్త్రా నికి నేనే ఉపసంహారం చేసి వివరిస్తా ను. దయ చేసి వినండి మీ రిద్దరూ ‘’అన్నారు శాస్త్రిగారు .

సశేషం

మహర్నవమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-15-ఉయ్యూరు

https://sarasabharati-vuyyuru.com/2015/10/23/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9/

’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -10

’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -10

 
111-‘’ఈశో విష్ణు సశ్రీ రుమావా ణ్యు మా జో –పీశ శ్శక్ర శ్చేశ ఈశా శచీద్యా

స్త్రీ సర్వోమా పూరుష స్సర్వ  ఈశః –ఇత్యూచే కోపి శ్రు తేర్మౌళి  భాగః

తా –విష్ణు వు ,ఈశ్వరుడు ,లక్ష్మి ,పార్వతి ,వాణి,పార్వతి ,బ్రహ్మ ,ఈశ్వరుడు ,ఇంద్రు డు ,ఈశ్వరుడు


శచీదేవి ,పార్వతి మొదలైన స్త్రీలందరూ పార్వతి ,పురుషులంతా ఈశ్వరులే .అని ‘’ఉమామహేశ్వర
ఉపనిషత్ ‘’చెప్పింది .అమ్మా !వింటున్నావా ?

112-‘’ఏత త్పక్షే,జంతు జాలేషు సర్వే-ష్వంబాస్త్రీ వ్యక్తిః పుమాం స్త త ఏవ

ఏతాభ్యాం యత్సూయ మానం జగత్త త్ –సర్వే వాదా నిర్వివాదా స్థ దా చేత్’’

తా-ఈ ఉపనిషన్మార్గ ం లో నడిచేవారికి జీవరాసులలో ఆడ రూపం లో ఉన్నవారంతా తల్లి ,మగ రూపం


లోని వారంతా వారిని కనే తండ్రి ,వారి సంతానమే ఈ సర్వ జగత్తు అని తెలుసుకొంటారు .ఇలా అయితే
వాదాలూ గీదాలు జాన్తా నై అయి పో తాయి కదా !

113-తత్పక్షే వ్యుక్తా వుమేశౌ ప్రసిద్ధౌ –తా ద్రూ ప్యేణా రోప్యతేవిశ్వ మేతత్

సిద్ధం స్త్రీ పుం సస్య మాతా  పిత్రు భ్యం –ప్రా దాన్యే నై తత్వయీశే తధాపి’’

తా-ఆ పక్షం గా ఆలోచిస్తే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులని నిర్దేశించి ,ఆ ధర్మాన్ని స్త్రీ
పురుషులకందరికీ ఆపాదించటం వలన ప్రజలకు తల్లి ఆడది, తండ్రి మగాడు అవుతుంది .కాని
ప్రా ధాన్యాన్ని బట్టి జగన్మాతవు నువ్వు తల్లివి ,జగత్పిత శివుడు కాక తప్పదు .ఇలా డొంకంతా తిరిగినా
నా ప్రశ్న ప్రశ్న గానే ఉండిపో యింది .ఉమా మహేశ్వరుల వివాహ కాలానికి ఈ ప్రపంచం ఉండనే ఉందికదా
.మరి దాన్ని ఎప్పుడు కన్నావు తల్లీ ! హద్దు మీరితే క్షమించు .

114-‘’సామాన్యోక్తా ం కాళిదాసస్య వాచం –వైశిస్ట్యో క్త్యాశంకరార్యో న సేహే

అస్త ్వం బాత్వం తాత పత్నీ శతానాం –సూతే యైకాసాప్రసూ స్స్యాత్ప్రజానాం’’


తా-కాళిదాసు చెప్పిన లోక సామాన్యాన్ని ,శాక్త మతాన్ని బట్టి విశేషం చెప్పి శ్రీ శంకరులు సహింప లేదు
.తండ్రికి భార్యలు వందమంది ఉన్నా ,పిల్లలను కన్నదే తల్లి .

115-శాక్తా శ్రు త్యా జామితి స్పష్ట ముక్తా ం-అన్యోక్తిభ్యో రూపణీ యాం నిరూప్య

యోగే నాన్యే నాధ్వనోపాస తేహి –ప్రత్యక్షం కేతన్మతం  నాద్రి యంతే’’

తా-శాక్తేయులు ‘’అజామేకాం లోహిత శుక్ల కృష్ణా ం బహ్వీం ప్రజాం జనయంతీం సురూపాం ‘’అనే శ్రు తి
వాక్యాన్ని బట్టీ ,మాటలతో నిరూపింప లేని స్వరూపాన్ని నిరూపించి యోగ, జప తపాదులు  మొదలైన
వాటి చేత నిన్ను ఉపాసిస్తు న్నారు .

116-‘’దృష్టా స్రస్టా మూల భూతౌ శివౌద్వా –వభ్యస్య న్స్త్రీపుంస వర్గ ం వితేనే

ఇత్యూచే గంగా కవిత్వ ప్రసిద్ధా –సిద్ధం యుష్మ త్సర్వ మాతా పితృత్వం ‘’

తా-‘’అన్నిటికీ మూలమైన పార్వతీ పరమేశ్వరులను చూసి స్త్రీ ,పురుషులుగా భావించి బ్రహ్మ అన్ని
జాతుల జంతువుల్ని సృష్టించాడు’’ అని ‘’ప్రౌ ఢ కవయిత్రి గంగా దేవి ‘’చెప్పింది .ఎవరే రకంగా చెప్పినా మీ
ఇద్ద రు లోకాలకు మొదటి తలిదండ్రు లు అనటం లో సందేహమే లేదు .

117-‘’ఏతత్సృత్యాం ప్రశ్న ఉత్పాదితో న్యః-స్వీ యోద్వా హి పార్వతీ చేశ్వర శ్చ

విఘ్నేశానాం పూజయా మాస తుర్హీ –త్యుత్పత్తేః ప్రా గ్యు జ్యతేర్చా కధం వా ‘’

తా-ఈ మార్గ ం లో వినేవారికి మరో సందేహం కలుగుతుంది .పార్వతీ పరమేశ్వరులు తమ వివాహ


సమయం లో విఘ్నేశు ని పూజించారట .న్యాయంగా అప్పటికి గణ నాయకుడు పుట్ట నే లేదు కదా !
పుట్ట ని వాడికి పూజేమిటి నాన్సెన్స్!ఎలా సాధ్యమమ్మా ?

118-‘’ప్రశ్నో న్యోవాగ్బ్రహ్మ పత్నీ ప్రసిద్ధా –శ్రీ హర్ష స్తా ం విష్ణు పత్నీం బ్రవీతి

శంభోః పత్నీ శాంభవీ త్యాగమేస్తి-సర్వేషాం వాయస్య కస్యా పి వేయం ‘’

తా-అమ్మా మరో డౌటు –సరస్వతి బ్రహ్మ భార్య అని ప్రసిద్ధం .విష్ణు పత్ని సరస్వతి అని శ్రీ హర్షు డు
నైషధం లో రాశాడే .శంభుని పత్ని శాంభవీ అని ఆగమాలు ఆగమాగామ౦ గా ఎలు గెత్తి చాటు తున్నాయి
కదా .మరైతే నువ్వేమను కోనంటే ‘’ఈ సరస్వతి అందరికీ పెళ్ళామా “”?లేక ఒకరికే భార్య యా ?(నీతో
మాట్లా డుతున్నకొద్దీ సందేహాలు పుట్ట్టలో తేళ్ళులాగా బయటికోస్తు న్నాయి ).

119-‘’పౌరాణ్యాం వాణ్యా మితి ప్రస్పురంతి-హ్యజ్ఞా తానా మక్ష రేచాక్షరేచ

ఆద్యే ప్రశ్నే సో త్త రే సో త్త రాస్యుః-సర్వే తస్త ం ప్రస్తు తం ప్రా ర్ధ యామః ‘’

తా-పురాణాలలో ,చరితల
్ర లో అన్వయ సరణి తెలియని వాళ్ల కు పొ ట్ట నిండా సందేహాలే .ఈ చిక్కు ముడి
విప్పుదాం .ముందు నా మొదటి ప్రశ్నకు అంటే ‘’నీ జగన్మాత్రు త్వం ‘’కు  సమాధానం దొ రికితే మిగిలినవి
అవే విప్పుకొంటాయి .

120-‘’బ్రహ్మశ్రీ వేద స్వరూపాయ వందే –వేద వ్యాసాయర్షయే శక్తి ధామ్నే

శక్తిం నౌమి ప్రా ంజలి ప్రహ్వ దేహః –పాద క్ష్మా౦తే న్యస్య మూర్ధా న మర్దీ’’

తా-బ్రహ్మ వేదాల ప్రత్యక్ష శరీరం కలవాడు .శక్తి కూటం లో నిత్య నివాసి అయిన వేద వ్యాసునికి
నమస్కరించి నాకు శక్తి కలగ జేయమని అర్ధిస్తు న్నాను .

121-‘’వర్తేధాం మామాభి ముఖ్యేన దేవి –త్వం చాయం మౌనీ న నారాయణా౦శః

యుష్మద్వాత్సల్యా న్మయా త్రో చ్య మానాం-శ్రు త్వా బ్రూ తంసాధువా సాదు వేతి’’

తా-అమ్మా ! నువ్వూ, నారాయణాంశ అయిన ఈ వ్యాసమహర్షి నాకు ఎదురెదురుగా ఉండండి .నేనడిగిన


ప్రశ్నలకు నేనే సమాధానం చెబుతాను .అవునో కాదో మాత్రం చెప్పండి .

122-‘’ఏకం బ్రహ్మా స్త ్యక్రియం నిర్వికారం –మాయా బీజే౦కూర శక్తిర్వ తత్ర

వాహనా వౌష్ణ ్యం వాపి బింబన్నముష్యాం –శుద్దా యా మీశ స్సఐచ్చ ద్బహుత్వం ‘’

తా-సజాతీ విజాతీ స్వగత భేదం లేని నిష్క్రియ గల మార్పు లేని వస్తు వు ఒకటి ఉంది .దానికి బాధ లేదు
.అదే బృహత్వం లో బ్రహ్మ౦  అని మనం పెట్టు కొన్న పేర్లు .ఆ బ్రహ్మం లో అగ్నిలోని వేడల
ి ాగా ,విత్త నం
లో మొలిపించే శక్తిలాగా మాయ అనే ‘’రూపం లేని శక్తి’’ కనిపించకుండా ఉంది .ఆ మాయ శుద్ధ మైంది
.దానిలో ప్రతి ఫలించిన బ్రహ్మం యొక్క ప్రతి బింబమే ఈశ్వరుడు .ఈ ఈశ్వరుడు సత్వ గుణంఉన్న
మాయ తో  కలిసి అనేక రూపాలు పొ ందాలని భావించాడు .

123-‘’మాయాం చేమాం శంకరః ప్రా హ విద్వాన్ –సచ్చా సచ్చా భూదిదంసర్వ మస్యాః

సత్సాన్నిధ్యే  భాసతే స త్త ధైవ-లోకే సర్వేషాంస ఏష స్స్స్వభావః’’

తా-సర్వజ్ఞు డైన శ౦కరుడు ఈ శక్తినే మాయ అన్నాడు .సద సద్రూ పంగా ఉన్న ప్రపంచం అంతా ఈ మాయ
వలననే ఏర్పడుతుంది .సద్వస్తు వు దగ్గ రగా ఉంటె అసత్తు సత్తు లాగా భాసిస్తు ంది .ఈ భాసనం దీపం
దగ్గ ర ఇతర పదార్ధా లు కాంతితో కనిపించి నట్లు గా ఉంటుంది .

124-‘’మాయా బింబో ష్యేష సర్వజన ఈశ-స్సత్వో ద్రేకా దిచ్చయోపేత ఐచ్చత్

నానా భావం సక్రమేణా క్రమేణ-భేజే హిత్యాహ శ్రు తి ర్ద్విపక


్ర ారాత్ ‘’

తా-శుద్ధు డు, సర్వజ్ఞు డు అయిన పరమేశ్వరుడు ,మాయలోని సత్వ గుణ ఉద్రేకం వలన ఇచ్చా శక్తి తో
కలిసి నానాత్వం కోరాడు .వెంటనే ఈశ్వరుడు విశ్వ రూపాన్ని దాల్చాడు .మదహంకార  ,సూక్ష్మ ,స్థూ ల
భూతాలను ఒక క్రమం లో సృష్టించాడని రెండు పద్ధ తులలోశ్రు తి చెప్పింది .కనుక ఒకప్పుడు క్రమ సృష్టి
,మరొక్కప్పుడు సర్వ సృష్టి జరిగిందని భావించాలి .

125-‘’శుద్ధ మాయా బ్రహ్మ రూపా నిరూపా –తామాచార్యో బ్రహ్మ పత్నీం బ్రవీతి

బింబీ భూత స్త త్ర దేవః ప్రసూతే –సత్వన్నత్యా భిన్న రూపేచ్చ యేదం’’

తా-శుద్ధ మాయ- రూప రహితమైన నామం రూపం లేని పర బ్రహ్మానికి ‘’మహిషి ‘’అని శ్రీ శంకర
భాగవత్పాదు లవారు వర్ణించారు .దానిలో ప్రతి బింబిం చిన దేవుడు సత్వ ప్రధానం కలిగి ఉండటం వలన
వేరే రూపం లో ఉన్న మాయ లో ఉన్న గుణాలను తన వశం చేసుకొని తాను గుణ రహితుడైనా
గుణమయమై కనిపించి మనతో ఒకాట ఆడుకొంటున్నాడు .అంటే సృష్టి చేస్తు న్నాడు అని భావం .

 
సశేషం

ne image 1
        

విజయ దశమి ,అమరావతి శంకుస్థా పన శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-15-ఉయ్యూరు

https://sarasabharati-vuyyuru.com/2015/10/23/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9-2/
’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -11

’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -11

126’’మాతా తాతస్సా సమయా మహేశః –సర్వ స్వాస్య ప్రా క్ప్రభూతా వ భూతాం

కామేశ స్సత్వంచ కామేశ్వరీతి –స్వేచ్చా పర్యాయేణ శబ్దేన చోహే ‘’

తా-సర్వ ప్రపంచాని కంటేముందేపుట్ట్టిన మాయ- తల్లి ,మహేశుడు తండ్రి .ఆయన కామేశ్వరుడు అయితే
నువ్వు కామేశ్వరివి .కామం అంటే  ఇచ్చ అని లోక వ్యవహారం .

127-‘’మాయేశౌ భూత్వా ప్రపంచం ప్రసూతౌ –కామేశా భూత్వా వివోడుం ప్రవ్రు త్తౌ


రుద్రో భూత్వా ప్రా క్స దాక్షాయణీ౦ త్వాం-పశ్చాత్తా ం త్వాంపార్వతీం చోపయేమే’’

తా-ఇచ్చా రూప మాయ ,శుద్ధ మాయా ప్రతి బింబ భూతుడైన ఈశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించారు
.కామేశ్వరావతారం లో పెళ్లి చేసుకోవాలను కున్నారు .కామేశ్వరుడే రుద్ర రూపం లో దక్షుని కుమార్తె వైన
నిన్ను పెళ్ళాడాడు .ఆ దాక్షాయణి తర్వాత పర్వ త రాజ పుత్రిక పార్వతి అయి ఆయన్ను  వివాహం
చేసుకొంది.

128-‘’ఆత్మానం స్వేశాన మీషద్వి వర్జ ్య –పాద క్షేపం మాతరోం మాకరోషి

పాతి వ్రత్యం వర్ణ నీయం తవైవ –సూతాస్మాం స్తే నైవ సంభూయ భూమ్నా ‘’

తా-సత్యాత్మ స్వరూపుడు అయిన ఈశానుడి ని విడిచి ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు .అందుకే
పాతివ్రత్యానికి నిన్నే ముందు చెబుతారు .’’భూమ ‘’ఆకారం అయిన ఈశ్వరునితో నిత్యం ఉంటూ
,అప్పుడూ ,ఇప్పుడూ కూడా మమ్మల్ని కని పెట్టు కొనే ఉంటున్నావు .

129-‘’బి౦బాదారా  శుద్ధ మాయా పితామ –హ్యాస్మాకం మాతాహి సత్వ ప్రధానా

రాజస్యాం తస్యా మజో భూత్స్వయం భూః-ఈశ స్యైవా భూద్వి రాట్చక్తి భాగః ‘’

తా-‘’ఈశుని ప్రతి బింబా నికి ఆధార మైన గుణ వ్యవస్థ లోకానికి’’ నాయనమ్మ ‘’అయింది
.ఈశ్వరునితోకలిసి సత్వ ప్రధాన మాయవైన నువ్వు మా అందరికి’’ తల్లి’’ వైనావు .రజో గుణ ప్రధాన మైన
నీలో స్వయంగా’’ విరించి ‘’ పుట్టి  బ్రహ్మ మొదలైన పేర్ల తో సృష్టి కర్త అయ్యాడు .ఆ ఈశ్వరుని శక్తి భాగం
విరాట్టు అంటే విష్ణు వు అయినాడు .

130-‘’సృ ష్ట్యా మస్యాం సాస్త్ర్యు మేశః పుమాని –త్వన్వేత్వేవ శ్రో త శీర్ష ప్రసంగః

ఆదౌ సూక్ష్మా స్థూ ల రూపా తతస్సా-సృష్టి ర్జ్నేయాసర్వ మూలం త్వమేవ ‘’

తా-ఈసృష్టి క్రమం లో ఆడవాళ్ళందరూ ఉమా స్వరూపులు .మగవారు ఈశ్వర స్వరూపులు .’’ఉమా


మహేశ్వర ఉపనిషత్ ‘’చెప్పింది కూడా దీనితో సరిపో తోంది .మొదట ఈశ్వరుని చేత ఇచ్చా శక్తితో
ఏర్పడింది అక్రమ సృష్టి –సూక్ష్మ సృష్టి .తర్వాత క్రమంగా స్థూ ల సృష్టి అయింది అది .ఈ సర్వానికీ కారకు
రాలవు నువ్వేకదా తల్లీ !
131-‘’మాయాం  విజ్ఞా య ప్రకారాకృతిం త్వాం-తద్వంతం తం చేశ మద్దా విచిం త్య

త్వద్వంద్వ స్యేదం సమిద్ధ ం ప్రతీకై –ర్విశ్వం వేదః ప్రా హసో న్వేతి చాత్ర’’

తా-ప్రక్రు తి రూపిని వైన నిన్ను మాయగా తెలుసుకొని ,ఆ మాయనే కలుపుకొని వ్యవహరిస్తు న్న
ఈశ్వరుని సత్యం గా భావించి ,మీ ఇద్ద రి అవయవాలతో ఈ విశ్వం ప్రకాశిస్తో ంది అని వేదం చెప్పింది
.ఇక్కడకూడా వేద భావన సమన్వయము అయింది .

132-‘’తస్మాద్వక్తి త్వజ్జ గంమాత్రు కాత్వం –లోక శ్శాస్త ం్ర సర్వ మూలం హి వేదః

సూక్ష్మే సర్గే నాస్తి మేళో న తాళః-దృష్టా శ్రో తా నాస్తి కోవా వివాహః ‘’

తా-నువ్వే జగాలకు మాతవు అని లోకం, శాస్త ం్ర , అన్నిటికీ మూలమైన వేదం ఘోషిస్తు న్నాయి .అప్పటి
సూక్షం సృష్టి లో ‘’మేళ,తాళాలు’’లేవు .వినేవాడు ,చూచే వాడు కూదాలేరు .భాజా భజంత్రీలు
,పురోహితుడు ,మంత్రం తంత్రా లు సాక్షులు ఎవ్వరూ లేరు కనుక ఆ వివాహం ‘’ఉత్తు త్తి బాంక్ లాగా
ఉత్తు త్తి పెళ్లి ‘’అని అనుకోవాలి .

133-‘’క్షంతవ్యా మే మాతర జ్ఞా న వాణీ-భండం సంహర్తు ం హియా వాతరస్త ్వం

తస్మిన్కాలే దేవతా ప్రా ర్ధ నేన –త్వద్ధ్యానేనా విర్భవ న్నూఢవాం స్త్వాం ‘’

తా-అమ్మా ! నా అధిక అజ్ఞా న ప్రసంగాన్ని క్షమించు .భండాసుర సంహార సమయం లో దేవతల కోరిక పై
నువ్వు శివుని ధ్యానించగా నీ నాధుడే వచ్చి నిన్ను ‘’మళ్ళీ పెళ్లి ‘’చేసుకున్నాడు .

134-‘’నిత్యం వేదే షూచ్య మాన స్సయజ్ఞ –ఉద్వా హాభ్యోయ౦ తదాది ప్రసిద్ధః

కల్పాం శ్చక్రు ః కల్ప కారా అనూచ్య –వేదాన్లోకం కౌతుకం చాను సృత్య ‘’

తా-నిత్యం వేదం చెబుతూనే ఉన్నా ,నీ పెళ్లి నాటి నుండి వివాహం అనేది ఒక యజ్ఞ ం గా లోకం లో
సుప్రసిద్ధమైంది .వేదాన్ని అనుసరించీ ,లోకా చారాన్ని బట్టి కల్ప కారులైన ఆపస్త ంభుడు మొదలైన వారు
వివాహ విధానాన్ని శాస్తో క్త ం గా రచించారు .

135-‘’గౌరీ కల్యాణం చ సీతా వివాహ –మాప్యన్నేషాం దేవతానాం మహా౦శ్చ


ప్రత్యబ్ద ం కుర్వంతి భక్తా స్వాభక్త్యా –తేనేదం విశ్వం స కళ్యాణ మాసీత్ ‘’

తా-గౌరీకళ్యాణం అని సీతా కళ్యాణం ఇతర దేవతలకూ  కళ్యాణాలు  భక్తు లు భక్తీ శ్రద్ధలతో కళ్యాణ
మహో త్సవాలు అప్పటి నుంచీ చేస్తు న్నారు .స్త్రీ పురుష వివాహాలు కల్ప సిద్ధా లు .ఇదే ఇప్పుడు
దేశమంతా అనుసరించి భాజా భజంత్రీలతో హో రేక్కిస్తు న్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-15-ఉయ్యూరు

https://sarasabharati-vuyyuru.com/2015/10/25/%e0%b0%ae
%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d
%e0%b0%b5%e0%b0%aa%e0%b1%8d
%e0%b0%a8%e0%b0%83-%e0%b0%a8%e0%b0%be
%e0%b0%95%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d
%e0%b0%b0%e0%b0%b9-3/
’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -12

’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -12

136-‘’బాలా లాపాన్వత్స లత్వాన్నిశమ్య –భక్త్యా స్తిక్యా చ్చోచ్య మానాన్ మదీయాన్

పాపం భంక్త్వా యత్ప్రదేయం ప్రదేహి –మాతర్వ్యానం చాపి ప్రు చ్చా మితేగ్రే ‘’

తా-భక్తీ ,ఆస్తిక బుద్ధి లతో నేను పలికిన వెర్రి మొర్రి మాటలను బిడ్డ మీద ప్రేమ ఉన్న తల్లిలాగా విని నా
పాపాలు పో గొట్టి నాకేది ఈయాలని పిస్తే దాన్ని ఇవ్వు .నీ సముఖం లోనే వ్యాస భట్టా రకునితో రెండు
మాటలు మాట్లా డతాను .దాన్నీ విను తల్లీ !.

137-‘’స్వామిన్ వేదవ్యాస భట్టా ర కర్షె –సాక్షాద్విష్ణో   దేహిమే సంప్ర బో ధం

శిష్యస్యాజ్ఞ స్యాత్మ వాణ్యాం పురాణ్యాం-మద్విజ్ఞా నే నోచ్యమానం శ్రు ణుష్వ’’


తా-వేదం విభజన చేసి ,సాక్షాత్తు విష్ణు మూర్తి అవతారమైన వ్యాస మహర్షీ !అజ్నుడైన ఈ శిష్యుడికి
ప్రబో ధం చేయి .నువ్వు చెప్పిన పురాణాలలో ,నా బుద్ధికి తోచిన వాటిని ప్రశ్నోత్త ర రూపం లో విను .

138-‘’గౌరీ కళ్యానేర్చితో విఘ్న రాజ –ఇత్యాస్తే తేతత్పురాణ ప్రప౦చే

ఐతత్కాలం నో సజాతః కధం వా-కుర్వా తేస్మా మూ అజాతస్య పూజాం ‘’

తా-గౌరీకళ్యాణ  సమయం లో ఆ దంపతులు గణపతి పూజ చేశారని పురాణం లో ఉంది .అప్పటికి


పార్వతికి గణపతి పుట్ట లేదు కదా .పుట్ట ని వాడికి పూజేమిటి మహాత్మా ?

139-‘’ఇత్యాదీ న్ప్రశ్నా న్సముత్దా పయంతి –లోకా స్తేషా ముత్త రం కిం వదామః

తూష్ణీం స్థా తుం శక్ను వంతో న కిం వా –వచ్మో యుక్తా యుక్త తే కః ప్రవద
ే ‘’

తా-ఇలాంటి ప్రశ్నలు లోకం లో కో కొల్ల లున్నాయి .వాళ్ల కు ఏం  సమాధానం చెప్పాలో తెలియటం లేదు
.వాళ్ళ నోరు మూయించటానికి నాకు తెలిసిన సమాధానమేదో చెబుతున్నాను  .అందులో సత్యా సత్యాలు
యుక్తా యుక్తా లు  నాకు తెలియదు .సత్యాన్ని తెలుసుకోవటం ఎవరి తరం ?

140-‘’శ్రు ణ్వే తన్మే త్రో చ్య మానం సమాధిం –విష్ణ్వీశాది స్థూ ల సర్గో యదా భూత్

సర్వే దేవా స్సర్వ లోకా న్సమస్త ౦ –భూత ప్రా యం భూత మే వేతి మన్యే ‘’

తా-నేను చెప్పే సమాధానం విను స్వామీ !శివ ,విష్ణు ,బ్రహ్మా దుల స్థూ ల దేహ సృష్టి ఎప్పుడు జరిగిందో
,అప్పుడే సర్వ లోకాలు ,సర్వ దేవతలు ,సమస్త భూత జాలం ఏర్పడింది ఒకదానినొకటి పో లి ఉన్నాయి .

141-‘’తుల్యే దేహే వ్యావహారం విహారం –లోకా యోగాః పారమార్ధ ం గృణంతి

యోగీంద్రా ణాం సాను భూతిర్నవేద్యా –తే మన్యంతేస్మత్ప్ర వృత్తి ం హి తుచ్చాం’’

తా-అందరి దేహాలూ ఒకటిగానే ఉన్నా ,లౌకికులు వ్యావహారిక విషయాలనే గ్రా హి౦చారు .యోగులు
మాత్రం ఇందులో పారమార్ధిక మార్గా న్ని అనుసరించారు .యోగుల అనుభావమేమిటో మనకు తెలియదు
కదా. మనం వాడుకొనే పధ్ధ తి తుచ్చం అని వారి అభిప్రా యం .
142-బ్రహ్మాండం పిండాండ  కేత్రా స్తి గూఢం-షట్సప్తా స్టౌ వాత్ర చక్రా ణి సంతి

ఆదిక్షాంతా స్త ద్ద ల స్థా హి దేవ్యః –మధ్యే సూక్ష్మా కుండలినాఖ్య శక్తిః’’

తా-ఈ స్వల్ప మానవ శరీరం లో బ్రహ్మాండం అంతా గూఢం గా ఉంది ఇందులోనే ఆరు ,లేక ఏడు లేక
ఎనిమిది చక్రా లున్నాయి .ఆ చక్రా ల దళాలలో అ నుండి క్ష వరకు అక్షరాలు అమ్రు తాది శక్తి రూపం లో
ఉన్నాయి .ఈ చక్రా ల మధ్య కుండలిని అనే శక్తిగల నాడి వ్యాపించి ఉంది .

143-‘’ఊర్ధ ్వం వాలం శీర్ష మానీయ చాద –శ్శేతే స్మాకం పృష్ట వంశేషు సో హిః

యోగీడాయాం పింగలాయాం చ  వాయు –మా పూర్యాత్రో త్దా పయంత్య౦త రాతాం’’

తా- ఆ కుండలినీ శక్తి తకకి౦దు గా తోక పైకి ఉంచి మన వెన్నెముకలో నిద్రిస్తో ంది .దాన్ని వెన్నుపాము
అంటాము .యోగాభ్యాసం చేసేవాడు దానికి అటూ ఇటూ ఉండే ఇడ,పింగళఅనే నాడులలో గాలి గట్టిగా
పూరించి ,మధ్యలోని కుండలినీ శక్తిని కదిలిస్తా డు .

144-‘’ఊర్ధ ్వం శీర్షం వాల  మూలం తధాధః-క్రు త్వోత్తి స్ట త్యజ్జ ్వలాత్మా సుసుమ్నా

వాయుర్వహ్నీ భూయ సాకం తయోద్యన్ –మూర్ధా నం సన్నాద భీమం ప్రయాతి ‘’

తా-ఈ రెండు నాడులలో నిండిన గాలి ప్రేరేపి౦పగా తలపైకి తోక కిందికి ఉండేట్లు గా మహా ప్రకాశం తో ఆ
కు౦డలిని జ్వాలలను ఎగిసేట్లు చేస్తు ంది .ఆ గాలి అగ్ని రూపాన్ని పొ ంది ,సుషుమ్న తో ఎగసి నానా విధ
నాదాలతో భయంకరంగా సాధకుని మూర్ధ స్థా నానికి చేరుతుంది .

145-‘’’’తన్మార్గే చక్రా ణి పశ్యేత్క్రమేణ –యోగీ భాగ్యా ద్రా జ మార్గే   నిశాయాం

గచ్చన్ దీపే నాట్ట కుడ్యే పతంతీం-చాయాం తత్రత్య  ద్రు మా దేర్య దా చ్ఛే’’

తా-ఇలా నాదమయం అయిన యా కుండలిని తో సహస్రా నికి వెళ్ళే మార్గ ం లో రాత్రి వేళ దీపం తీసుకు
పో తున్నప్పుడు దారిలో ఉన్న మేడల గోడల,పై చెట్ల నీడలు చూసినట్లు సాధకుడు అదృష్ట వశాన ఆ
చక్రా లను దర్శిస్తా డు .

146-‘’మూలాధారం చక్ర మాదౌ తదీశో-విఘ్నేశాన స్త స్య పుష్టి ర్హి శక్తిః


చత్వార్యే తత్ప్ర కాణ్యే షు దేవ్యో –వశ్ష స్సస్తా వశిన్యాది సంజ్ఞా ‘’

తా-మొదట్లో మూలాధార చక్రం కని పిస్తు ంది .దీనికి గణపతి అధికారి .గణపతి శక్తి’’ పుష్టి దేవి ‘’అనే పేరు
కలది .ఇందులోని  నాలుగు దళాలలో  అవే’’ వ ,శ ష ,స ‘’అనే అక్షరాలు’’ వశిన్యాది ‘’శక్తు లుగా ప్రకాశిస్తూ
ఉంటాయి .

147-‘’వాణీ బ్రహ్మాదిష్టితం యత్త దూర్ధ ్వ్యం –స్వాధి స్టా నం చక్ర మాస్తే షడశ్రం

బాలా ద్యంతా వర్ణ కా స్త ద్ద లేషు-బందిన్యాద్యా శ్శక్త య స్సన్ని విస్టా ః

తా-దానిపై సరస్వతీ శక్తి తో కలిసి బ్రహ్మ చేత అధిస్టిం ప బడిన ‘’స్వాదిస్టా నం’’ అనే ఆరు దళాల చక్రం
ఉంటుంది .ఆ దళాలలో ‘’బ ,భ ,అ ,య ,ర,ల ‘’అనే వర్ణా లు ‘’బందిన్యాది శక్తు లు ‘’గా నిత్యం నిలిచి
ఉంటాయి .

148-‘’తస్మా దూర్ధ ్వం స్యా న్మణీపూరకాఖ్యం—లక్ష్మీ శ్శక్తిర్విష్ణు రత్రా ధి దేవః

డాద్యాః ఫాంతా అక్షరా అత్ర దేవ్యో –డాకిన్యా ద్యాస్స్యు ర్ద శ స్వశ్ర కేషు ‘’

తా-దీనిపైన(నాభి దగ్గ ర ) మణిపూరకమనే చక్రం ,దాని అధిదేవత విష్ణు వు ఉంటారు .ఇక్కడ లక్ష్మీ
దేవియే శక్తి .ఈ కమల దళాలలో’’ డ,ఢ,ణ,త,ధ.ద,ధ,న,ప,ఫ’’అనే అక్షరాలూ 15 దళాలలో’’ డాకిన్యాది
శక్తు లుగా’’ ఉంటాయి .

149-‘’తస్యాప్యగ్రే నాహతం ద్వాదశారం –శక్తిః పార్వత్యత్ర దేవా శ్శివ శ్చ

తస్యా రేషు స్యుః కఠాద్యంతవర్ణా -స్సర్వా దేవ్యః కాలరా త్ర్యాదయ స్తా ః’’

తా-మణిపూరకం పైన హృదయ స్థా నం లో ‘’అనాహతం ‘’అనే పేరుతొ 12 అంచుల చక్రం ఉంది ..దీనిలో
శక్తి పార్వతి శివుడు దేవుడు..దాని అంచులలో ‘’క ఖ ,గ ఘ ,జ్ఞ ,చ, ఛ జ ,ఝ ,జ,ట,ఠ ‘’అనే ఆగమ
ప్రసిద్దా లైన 12 అక్షరాలుంటాయి .ఇవే’’ కాలరాత్రి’’ మొదలైన ఆగమ ప్రసద
ి ్ధ  శక్తు లు .

150-‘’కంఠ స్థా నే షో డ శారం త దూర్ధ ్వం –జీవో దేవః ప్రా ణ శక్త్యా సమేతః

అశ్రేష్వస్య స్యు స్స్వరా స్షో డశర్ణా —స్తా ఏ వైషాం శక్త యశ్చా మృతాద్యాః’’
తా-అనాహతం పైన క౦ఠ స్థా నం లో (గడ్డ ం కింద )16 అంచుల చక్రం ఉంది .దీని అధిదేవత జీవుడు
ప్రా ణశక్తితో ఉంటాడు .అంచులలో ‘’అ ,ఆ,ఇ,ఈ, ఉ, ఋ,ఋాఆలు ,ఆలూ ,ఎ,,ఏ ఐ, ఒ,ఓ,ఔ,అం,అః’’అనే
16 అక్షరాలూ (అచ్చులు )’’అమృతం ‘’మొదలైన శక్తు లుగా ఉంటాయి .

151-‘’ఆజ్ఞా చక్రం ద్వ్యశ్ర మంతర్భ్రువో ర్య-త్త స్మిన్నిచ్చా శక్తి రీశః పరమాత్మా

పత్ర ద్వంద్వే హ క్ష వర్ణౌ క్షమావ –త్యేకాచాన్యా హంస వత్యేవ శక్తీ ‘’

తా-రెండు కను బొ మల మధ్య రెండంచుల ‘’ఆజ్ఞా చక్రం ‘’ఉంటుంది .ఇందులో ఇచ్చయే శక్తి రూపంగా
ఉంటుంది .దీనికి అధికారి పరమాత్మ .రెండు దళాలలో’’ హ ,క్ష’’అనే రెండక్షరాలుండి’’ క్షమావతి
,హంసవతి ‘’అనే శక్తు లను కలిగి ఉంటాయి .

152-‘’మూర్ధ న్యాస్తేయం సహస్రా ర సంజ్న-శ్చక్ర శ్శ్శ్రేస్టో   మోక్ష శక్త్యా గురుశ్చ

సర్వే వర్ణా స్సర్వ దేవాస్స్వశక్తి- ప్రో తా స్స్ఫీతా అత్ర యోగా వసంతి .’

తా-‘’మాడు’’ లో ‘’సహస్రా రం’’ అనే ఉత్త మమైన చక్రం ఉంది .ఇక్కడ’’ గురుమూర్తి’’ అధిస్టించి ఉంటాడు
.అక్షరాలన్నీ తమ శక్తు లతో కలిసి ,ఆయా దేవత లంతా ఈ చక్రం లో ఉంటారు .యోగాభ్యాసకులు ఇక్కడే
నిద్రిస్తా రు .

153-‘’దృశ్యాదృశ్యం చా స్ట మం చక్ర మూర్ధ్వే –మూర్ద ్నః పీఠే స్వాంగుళీ నాం చతుష్కే

ద్రష్టు ం దూరాద్యోగినా మప్య శక్యం –శక్తి శ్శక్తో వా పరం బ్రహ్మ మూలం ‘’

తా-సహస్రా రం పైన ఎవరి చేతి వ్రేళ్ళ తో నాలుగు అంగుళాల లెక్కలో బెత్తెడు దూరం లో ‘’పీఠం’అనే చక్రం
ఉంది .సహస్రా రం లో ఉన్న యోగులకు కూడా చూడశక్యం కానిది .ఇక్కడ సర్వ కారణమైన పర బ్రహ్మ
స్వరూపం ఉంటుంది .అది శక్తియో ,శక్తి మంతుడో ఎవరూ చెప్పలేరు .

154-‘’తస్మిన్ దేశే శక్తి మచ్చక్త ్య భేదాత్ –బ్రహ్మై వేదం శక్తి రేవే య మిత్ధ ం

ద్రష్ట్రూ ణాం ద్రు ష్టి ప్రభే ధాన్మతాని –శాక్తే యాదీ న్యానిరాసన్ హితాని ‘’
తా-ఇక్కడ శక్తికి ,శక్తి మంతుడికి అభేదమే .దీనినే ‘’బ్రహ్మం ‘’అనీ ,’’శక్తి ‘’అనీ పిలుస్తా రు .చూసే యోగుల
దృష్టి భేదాన్ని బట్టి శాక్తేయం ,వైష్ణవం శైవం మొదలైన మతాలూ ఏర్పడ్డా యి .

155-‘’శక్త ్యంశో మాతాత్ర తాతః పుమంశః –చిచిచ్చక్తీ అగ్ని శక్తీ వ రూఢే

సా మాయా మాయీ స కామేశ్వ రోయం –కామేశీ  సా పార్వతీ సా స ఈశః ‘’

తా-ఈ చక్రం లో శక్తి రూపంగా కని  పించే భాగం తల్లి .పురుష రూపంగా కనిపించే భాగం తండ్రి  .అగ్నీ
దాని శక్తి ఐన వేడి లాగా చిద్రూ పం, శక్తి రూపం గూఢ మైనవి .శక్తి రూపం’’ మాయ’’ .పురుష రూపం
‘’మాయి ‘’.మాయియే కామేశ్వరుడు .మాయ కామేశ్వరీ దేవి .కామేశ్వరే పార్వతీదేవి .కామేశ్వరుడే
పరమేశ్వరుడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-15-ఉయ్యూరు

 https://sarasabharati-vuyyuru.com/2015/10/26/%E0%B0%AE
%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D
%E0%B0%B5%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A8%E0%B0%83-
%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%95%E0%B0%B2-%E0%B0%AC
%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE
%E0%B0%B6-3/

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -13

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు -13

156-’’తన్మాయా మాయి ప్రతీక ప్రకారం –విశ్వం విశ్వం తావభివ్యాప్య సుస్థౌ

ఏతత్సర్వంస్థూ ల దేహేస్తిసౌక్ష్మాత్ –ప్రత్యక్షం తద్యోగిన స్సంవదంతి’’


తా-ఆ మాయ ,మాయి అవయవాల ప్రకృతే ఈ విశ్వం .ఆ ఇద్ద రూ విశ్వమంతా నిండి ఉన్నారు .ఈ
ప్రపంచంతా స్థూ ల దేహం లో సూక్ష్మం గా వ్యాపించి ఉంది .యోగ శాస్త్రా నుభావం కలవారికి ఇది అనుభవైక
వేద్యమే .అంటే ఈ శరీరం లో చూసి వారు సర్వ లోక వృత్తా ంతాన్ని చెప్పగలరన్న మాట .

157-‘’ఆవిర్భూతా సైవ మాయా హ మత్రే-త్వం తర్జ్నానా ల్లో క మాతా శివావా

లక్ష్మీర్వాణీవాఫై యాకా చిదన్యా-సీతా దీనాంమాతృ తేత్ధం హి సిద్ధా ’’

తా-ఆ మాయా దేవియే నేను .ఇప్పుడిక్కడ ఆవిర్భ వించాను అనే ఆనతరంగిక జ్ఞా నం వలన పార్వతి
అయినా ,లోక మాట కావచ్చు ,లక్ష్మీ దేవీ కావచ్చు నారోక రెవరైనా జగజ్జ నని కావచ్చు .ఇలా
సమన్వయము చేసుకొంటే సీతా ,రుక్మిణీ మొదలైన అవతార వ్యక్తు లకు ,లోపాముద్రా ది సిద్ధ స్త్రీ
వ్యక్తు లకు జగన్మాతృత్వం సిద్ధిస్తు ంది .

158-‘’వైరాజీయా సృష్టి రేషాత్ర దృశ్యా –యుగ్మం వామస్త ంబ పూర్వం స్వయం తత్

ఇచ్చా మాత్రా ఏష సృష్టిః పురాణీ-సూక్ష్మా సృష్టి ర్మాచ హైరణ్య  గర్భీ ‘’

తా-ఈ ప్రకరణం లో విరాట్ పురుషుని చేత చేయ బడిన సృష్టినే చూస్తు న్నాం .మీ దాంపత్యం స్వయం
సిద్ధమై ఆ రూపంగా పూర్వమే ఉంది .తలఛి నంతనే సంభ వించే పురాతన ఈశ్వర సృష్టి ,హిరణ్య గర్భుడు
చేసిన సూక్ష్మ సృష్టి –రెండిటిలోనూ మీ దాంపత్యమే భాసిస్తో ంది .

159-అస్మిన్పక్షే నిర్వివాదః ప్రసంగః –కాళీదాసో ప్యాహ పూర్వ ప్రసద


ి ్ధ ం

మాతుర్భర్తా సౌ పితా భూత్పితుస్సా-పత్నీత్వా న్మాతా భవద్బ్రహ్మ శక్తిః’’

తా-ఇలా చేసిన ప్రసంగం అంటా వివాద రహితమైనది .కాళిదాస మహా కవి కూడా పూర్వ సృష్టి ప్రసిద్ధిని
చెబుతూ తండ్రి భార్య తల్లి అనే చెప్పాడు .తల్లికి భర్త తండ్రి అవుతాడు .తండ్రిభార్య తల్లి అవుతుంది .అదే
ఇక్కడ బ్రహ్మా, శక్తి.

160-‘’ఏకా మూర్తిస్సా త్రిదా భేద మాపే –త్యాహ స్మాసౌ కాళిదాస స్త్రి మూర్తీన్

తన్యాయే నైవాప సాపి త్రిదాత్వం –నానాత్వం వా నాత్ర చోద్యా వకాశః ‘’


తా-ఈ కాళిదాసే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గూర్చి చెబుతూ అదొ క్కటే స్వరూపం మూడు విధాల వ్యక్తీ
భేదాన్ని పొ ందింది .ఈ ముగ్గు రిలో వారు చేసే పనులలో హెచ్చు తగ్గు లు ఉండచ్చు కాని స్వయం గా భేదం
లేనివారే అని చెప్పాడు .ఈ పద్ధ తిలోనే శక్తి కూడా కార్య వశాత్తు మూడు రూపాలు లేక నానా రూపాలు
పొ ందింది .ఇందులో ఎవరూ ప్రశ్నించటానికి ఏమీ లేదు .

161-‘’అస్మన్యాతా పూర్వ మూద్వా చితంసా –హ్యస్మాన్సూతా నిర్వివాదో యమర్ధ ః

పూర్వం ద్రస్ట్రూ ణా మభా వాదవిత్త ః-తత్సద్భావా దద్యవేద్యో వివాహః

తా-ప్రస్తు తానికి వద్దా ం –మా అమ్మ జగన్మాత చిద్రూ పాన్ని ముందే వివాహమాడి ,తర్వాతే మమ్మల్ని
అందర్నీ కన్నది .ఇది వివాద రహితం .అప్పటి వివాహానికి సాక్షులు లేరు .ఇప్పుడు చూసే
సాక్షులున్నారు .కనుక పార్వతీ పరమేశ్వరులు ,లక్ష్మీ నారాయణులు ,మొదలైన వారందరి పెళ్ళిళ్ళు
ఇప్పుడు తెలుస్తు న్నాయి .

162-‘’భక్తో త్సాహా ద్వత్సరే వత్స రేవా –మాసే మాసే వాసరే వాసరేవా

మాతా పిత్రో ర్నిత్య కల్యాణ మాసీత్ –అఘ్న్యే కస్మిం స్త చ్చతం వా సహస్రం ‘’

తా- ఆ దంపతులకు ఒక సారి పెళ్లి కాని ఇన్ని సార్లు పెళ్లి ళ్ళా అనే అనుమానం వద్దు .భక్తు ల ఉత్సాహం
తో ప్రతి ఏడాది ,ప్రతి నెలా ,ప్రతి రోజూ ఆ పురాణ పుణ్య దంపతుల కు నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భక్తితో
చేస్తు న్నారు .ఒక్కో సారి వందా, వెయ్యి కల్యాణాలను కూడా చేస్తు న్నారు .

163-‘’ఇత్ధ ం గాదాయాః పురాణ ప్రసిద్ధా –యోగాత్సా౦ఖ్యా ద్వా ద శారీర కార్దే

తాన్సర్వా న్సమ్యక్సమర్దా భవంతి –తద్ద్రు స్ట్యా ర్యై ర్ముక్త మన్వేతు మర్హా ః’’

తా-ఇలా పురాణ ప్రసిద్ధ కధలు ఎన్నో ఉన్నాయి .ఇవన్నీ యోగ మతం ,సాంఖ్య మతం లను అనుసరించి
,జీవుల మోక్ష ప్రయోజనానికి సర్వవిధాలా చక్కగా సమర్ధ నీయం అవుతున్నాయి .పూజ్యులైన పెద్దలచేత
పురాణాలను అన్వయింప జేసుకోవాలి .ఇదే ఉత్త మ మార్గ ం .

164-‘’ఏవం మూలాధార సంస్థ ం గణేశం –సర్వజ్ఞో సా వర్చ యామాస శర్వః


స్వస్యోద్యా ద్వాహే కాల యోగా త్కుమారం –పశ్చాదా విర్భా వ యామాస గౌరీ ‘’

తా-ఈ విధంగా సృష్టికి మొదట్లో ప్రతి జీవి మూలాధార చక్రం లో గణపతిని సర్వజ్ఞు డైన పర మేశ్వరుడు
తన వివాహ సమయం లో పూజించాడు .లోకాలకు అవసరమైనప్పుడు పార్వతీ దేవి అతడిని తన
కుమారుడిగా స్థూ ల దృష్టిలో కనిపింప జేసింది .

165-‘’శ్రీ కృష్ణ ద్వైపాయనర్షే నమాంసి-పాణిభ్యాం పాదావు పాదాయ కుర్వే

యద్వాత్వద్వా త్పాదాంత భూమౌ నిపత్య –సాస్టా ంగ స్పర్శం నమామి ప్రసీద ‘’

తా-కృష్ణ ద్వైపాయన ముని శ్రేస్టా !నా రెండు చేతులతో నీ రెండు పాదాలనంటి నమస్కరిస్తు న్నాను .ఒక
విధంగా నీ పాదాలకు దగ్గ ర భూమిపై పడుకొని కరచరణాది అవయవాలు ఎనిమిది భూమికి తాకేట్లు
నమస్కరిస్తు న్నాను .అనుగ్రహించు మహాను భావా !

166-‘’త్వద్వా గంబో దేః పరం పారమేతు౦ –కోప్యేకో ప్యాలోక్యతే నో సమర్ద ః

మాతా స్వప్నవ్యాజతో వాచ యన్మాం-బాలోక్తీసశ్శ్రో  తు౦ హి కౌతూహలేన’’

తా-ఓ గుగ్గు రూ !పరమమునీ !నీ పురాణ వాగ్దో రణి అనే సముద్రం యొక్క అవతలి ఒడ్డు ను చేరటానికి ఈ
లోకం లో ఒక్కడు కూడా సమర్ధు డు లేడు.నేను నీ పురాణాలమీద సిద్ధా ంతం చెప్ప గలిగే సమర్దు డినా !
పిల్లల వచ్చీ రాని  మాటలు వినాలనే వేడుక గల తల్లి ఐన పరాశక్తి ‘’కల ‘’అనే వంక తో నన్ను ఇట్లా
వాగించావు కదూ !

167-‘’మౌనిన్ తే త్రా కారణం త్వే తదర్ధ ం –దో షం త్యక్త్వా భాషితం మే శ్రు ణుష్వ

శ్రు త్వా స్యాయా శ్ష్రా వయా సాదు సాధూ –భీతో మాతుస్త్వాం శరణ్యం భజామి ‘’

తా-మునిముఖ్యా వ్యాసా !ఈ చిన్న విషయానికే నన్ను వీడు నన్ను పిలిచాడా అని తప్పు పట్ట కుండా నే
చెప్పేది విను .మంచి చెడు తేల్చు .తల్లి వలన భయం తో చనువుగా నిన్ను రక్షకుడిగా భావించి వేడు
కొంటున్నాను .

168-‘’వేదే వాదే త్వ త్పరీ వాద బాదే –బో ధ ప్రా యాం శేముషీం మే ప్రదేహి
స్వర్గే మోక్షేవాన్యన్య జన్మ ప్రసంగే –సాధ్వధ్వానంప్రా పయాస్తు ప్రణామః ‘’

తా-వేదం విషయం లో వాదం వచ్చినా ,నీ పురాణాల విషయం లో ఆక్షేపించే వాళ్ళ మాటలు వినాల్సి
బాధ పడేటప్పుడు గాని సత్యమైన అర్ధా న్ని తెలుసుకొనే సద్బుద్ధిని నాకు ఇవ్వు .స్వర్గ మోక్షాల విషయం
లో ,ఉత్త రజన్మ విషయ ప్రసంగాలలో  మంచి మార్గ ం లో నన్ను నడిపించు .నేను నీకేమి ఇవ్వగలను ?
ఒక్క నమస్కారం సమర్పించటం తప్ప ?

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-15-ఉయ్యూరు

https://sarasabharati-vuyyuru.com/2015/10/26/%E0%B0%AE
%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D
%E0%B0%B5%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A8%E0%B0%83-
%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%95%E0%B0%B2-%E0%B0%AC
%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE
%E0%B0%B6-4/

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు-14


(చివరిభాగం ).

మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు-14 (చివరిభాగం ).

169-‘’మాత స్మేరే విస్మరా స్మత్స్మి తాంకం-వ్యాస స్వామీ నోచి వానత్ర దో షం

మాతుర్వత్స స్యాపి మధ్యే క్వ దో షః –దో షా దో షా ప్రా ర్ధ యామి ప్రసీద ‘’

తా-ముసి ముసి నవ్వులు నవ్వే తల్లీ !నేను ఇదివరకు నవ్విన నవ్వు అనే కళంకాన్ని వాత్సల్యం తో
తొలగించు .మర్చి పో .వ్యాసస్వామి కూడా నా నవ్వు విషయాన్ని పెద్దగా పట్టించు కోలేదు .దో షమనీ
అనలేదు .

17 ౦-‘’నిశ్వాసో చ్హ్వా సస్థ సో హంత యా వా –హంసత్వేనా ప్యాంత రస్థేన హార్దా త్


బాహ్యే హాంసే మండలేవా హ మస్మి –త్యాలంబ్యా బత్వా ముపాసేన యస్వ ‘’

తా-ఉచ్వాస  నిశ్వాసాల కు ఆధారమైన’’ హంస’’ భావం తో కాని ,హృదయం మధ్యలో ఉన్న’’ హంస
మండలం నేను’’ అనే ‘’ హార్దో పాసన’’ అనుసరించి కాని ,బయట అందరికి ప్రత్యక్షం గా కనిపించే సూర్య
మండలం లోని ‘’సో హం ‘’భావం తో కాని ,శ్రు తిని అనుసరించికాని ,ఏదో ఒక మతాన్ని అనుసరించికాని
నిన్ను ఉపాసిస్తా ను .దేనికి నేను అర్హు డినో ఆ స్థితి ని నాకు కలిగించు

171-‘’హస్తే కృత్వా త్వం చి౦తితం  భ్రా మ యస్యే-తల్లో కానీక౦ చితంచా చితంచ

త్వం చిద్వా చిద్వేతి జానాతి కోవా –యోజానీయా త్సో పితా దృక్త ్వ మేతి’’

తా-అమ్మా !చిద్రూ పాన్ని చేతిలో పెట్టు కొని ,జడం ,అజడం అయిన లోక జాలాన్ని అంతా ఆడిస్తు న్నావు
.ఈ ఆటలో నువ్వు ఏ రూపం లో ఉంటావో తెలుసుకోవటం కష్ట ం .

172-.’’జాగ్రన్మానేన ప్రమాణ ప్రమేయ-ప్రఖ్యాతే ధ్వన్యాస్థితా దుర్ల భాసి

స్వప్నే దృష్టా ం కో వనిర్ణే తు మీశో –యద్వా తద్వా కుర్వనీశం త్వమీశా ‘’

తా-లోక దృష్టిలో మెలకువ స్థితిలో ప్రమాణ ,ప్రమేయ రూపం గా ప్రసిద్ధమార్గ ం లో ప్రత్యక్షంగా కనిపిస్తూ
కూడా  ,చేరటానికి శక్యం కాని దానివై ఉంటావు .కలలో కన్పించిన నిన్ను ,నీ స్వరూపాన్ని వర్ణించటం
ఎవరి సాధ్యం ?అసమర్ధు డైన నన్ను ,సమర్దు రాలవైన నువ్వు అటో ఇటో ఏదో ఒక గమ్య స్థా నానికి చేర్చు
జగన్మాతా !

173-‘’వేదే శాస్త్రే సత్పురాణేతిహాసే –ప్రఖ్యాతేధ్వన్యార్య జుస్టే వసామి

కాంచీ పీఠ స్వామిభి శ్చంద్రశీర్షై –రాదిస్టే ప్రా ప్తే సమాధౌ క్షణేన’’

తా-వేద,శాస్త ్ర ,ఇతిహాస ,పురాణాలలో ప్రసిద్ధమైన మార్గ ం లో ఆర్యజనుల చేత సేవింప బడే ప్రముఖ కాంచీ
పీఠంలో నెలకొని ఉన్న శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారిచే ఆదేశింప బడి ,పుణ్య వశం తో
క్షణిక సమాధిలో’’ నేను నేనై’’ ఉంటాను .

174-‘’యస్యాం కస్యాం వా సృతౌ సంప్రవర్తే-మా మీక్షస్వ స్వాను కంపా ద్రు శాంబ


పాపం పుణ్యం మేస్తు ,వామాస్తు వాహం –యావత్సత్యే బ్ధౌ నిమజ్జా మి తావత్ ‘’

తా-నీ బిడ్డ నైన నన్ను చూసుకొనే భారం నీదే .పుణ్య పాపాల చింత నాకు లేదు .నీ అండ ఉంటె సత్య 
సముద్రం లో మునిగే సత్య వస్తు వుకు పాపపుణ్యాలుండవు  .మాయికానికి ఉంటె ఉండనీ నాకేం ?

175-మాతర్దేవి వ్యాస మౌనిన్ క్షమద్వం –ఏతా వంతం కాల మస్మన్నిబంధం

వాచాలత్వం సన్నిధౌ వామ పీదం-వాత్సల్యా ద్వాం స్వ ప్రతిస్టో హ్యసాని ‘’

తా-తల్లీ దేవ దేవీ !  ఓ మహామౌనీ వ్యాసర్షీ ! అల్పుడనైన నేను ఇంత సేపు మిమ్మల్ని నిలబెట్టటం ,మీ
సాన్నిద్యం లో నానోటికొచ్చి౦దల్లా వాగటం చెసిన౦దుకు ఇద్ద రూ నన్నుముందుగా   క్షమించండి .మీకు
నేనేం సమర్పించుకో గలను ?మీ వాత్సల్యం తో నాకు’’ స్వస్వరూపావస్తితబాధిత కాలం’’ సంప్రా ప్త మైంది .

176-‘’ఇత్ధ ం యద్వా నిత్య సాన్నిధ్య యోగాత్ –సత్యం ధర్మం వాచయ౦ తౌ శ్రు తీద్యం

వాచం దేవీ౦ వాచిమే సన్నిదాప్య –సంతుస్టౌ స్త స్సోయమర్దో మమార్ధ ్యః ‘’

తా-నిత్యం మీ సాన్నిధ్యాన్ని ప్రసాదించి వాగ్దేవిని నా నాలుకపై ఉంచి ,శ్రు తులచేత కొనియాడ బడే సత్య
,ధర్మాలను నాచేత పలికిస్తూ ఇలాంటి వినోదాన్ని చూస్తూ సంతోషిస్తా రా ?అది నాకు నిర్బీజ సమాదికంటే
ముఖ్యమైనదిగా నేను భావిస్తా ను .

177-‘’యద్విద్యా జన్యోర్య ఆసీత్ప్ర మూలం –నౌమి స్తౌ మి స్వం గురుం తం మహాంతం

తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రీ-త్యాఖ్యాతం శ్రీరామ గాదా మ్రు తోక్త్యా ‘’

తా-నా విద్యకి ,పుట్టు వుకు మూల భూతుడైన శ్రీ రామ కదామృత గ్రంధ కర్త శ్రీ తాడేపల్లి వేంకటప్పయ్య
శాస్త్రి అని లోక ప్రఖ్యాతుడైన మహా గురువైన నా తండ్రిని మాటి మాటికి నమస్కరిస్తూ స్మరిస్తూ
కొనియాడుతాను .

178-‘’మాతా విఖ్యాతా  హనుమాంబికేతి-సాధ్వీ తాతో వే౦కటప్పః కవీశః

శ్రీ దేవీ సత్యంబికా రాధ కోహం –ఆత్రేయో నారాయణో రాఘ వాద్యః ‘’


తా-హనుమాయమ్మ అని విఖ్యాతి చెందిన మహా సాధ్వి నా తల్లి .తండ్రి తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రి .నా
పత్ని శ్రీదేవి .మాది ఆత్రేయస గోత్రం .శ్రీమాత ఆరాధకులం మేము .రాఘవ నారాయణ అని నా తండ్రి
నాకు పేరు పెట్టా రు .నాకు మా తండ్రి ఈ పేరు పెట్టినందుకుమా తండ్రి అంతర్ముఖులని ,మహాత్ముడనీ
బెజవాడ సభలో పూరీ స్వాముల వారు కీర్తించారు అందులో భావమేమిటో నాకేం తెలుసు ?

179-‘’దత్త భాగవత నామ కృతిం లిం –గోద్భావాయ విభవే నగరే దాం

చెన్న కేశవ పద ప్రభ వేయా –మా వికాంత దుభకౌ  మామ బందూ ‘’

తా-దత్త భాగవతం అనే గ్రంధాన్ని రచించి చందో లు నగరం లో’’ లింగోద్భవ స్వామి’’కి అ౦కితమిచ్చాను
.మాయావిక అనే గ్రంధాన్ని రాసి శ్రీ చెన్నకేశవ స్వామికిచ్చాను ‘ఈ రకంగా శివ కేశవులు నాకు అల్లు ళ్ళు
అయ్యారు .

180-‘’ధర్మ కాండ పిన మిత్ర సుపుత్ర –స్వాగతా వతి భయే  జననీహ

ద్వైత వాద సరణీ నభయం మే –ద్వైత పధ్ధ తి మిత స్స్వ్యమేకః ‘’

తా-   ఆ యమ ధర్మ రాజు మిత్రు ని పుత్రు డు కనుక నా వాడే. ప్రవృత్తి లో   ఏ భయం వచ్చినా జగజ్జ నని
నన్ను రక్షిస్తు ంది .కనుక ద్వైత వాద మార్గ ం లో నాకేమీ భయమే లేదు .అద్వైతమార్గా న్ని
అనుసరించేవాడిని నేనొక్కడినే కదా .రెండో వాడు ఉంటేనే కదా భయం .కనుక నేను అభయుడను
,ఆనంద స్వరూపుడను .

181-‘’వృద్ధ క్ష్మౌ భ్రు న్నాగ లింగః ప్రసిద్దో –విద్వానాసీ న్మే గురుః  పాణినీయే

శిష్య ప్రీత్యా బ్రహ్మ సూత్రం చతుర్భి- ర్భాష్యైర్మారర్గైః  ప్రా పు యద్యో విమృశ్య ‘’

తా-ముదిగొండ నాగ లింగ శాస్త్రి అనే ప్రసిద్ధ విద్వాంసుడు నాకు వ్యాకరణ గురువు .ఆయన ద్వైత
విశిష్టా ద్వైత భాష్యాలను విమర్శిస్తూ ప్రతి సూత్రా నికి నాలుగుదారుల  భేదాలను శిష్య వాత్సల్యం తో
బో ధించాడు .

182-‘’విద్వాన్ మద్దు ల్పల్లి మాణిక్య శాస్త్రీ –మాన్యోయం మే తర్క వేదాంత సమ్రా ట్


దాక్షి ణ్యా ద్యోన్మద్గ్రు హం ప్రా ప్య భవ్యే-విజ్ఞా నే స౦  మర్శ  యామాన మానం ‘

తా-మహా తర్క వేదాంత సామ్రా ట్ బిరుదాంకితుడైన శ్రీ మద్దు లపల్లి మాణిక్య శాస్త్రి గారు ,అనుకో కుండా
ఒక సారి మా ఇంటికిశిష్యులతో  వచ్చినెల రోజులుండి నేను చదివింది చదవనిది నాకున్న జ్ఞా న లేశాన్ని
మెరుగు పరచి నన్ను తీర్చి దిద్దా రు .

183-‘’తద్వద్యో యోమే లమేకం దదౌతం –చిత్తేనాహం గౌర వేణార్చ యామి

దైవేభ్యో మిత్రేభ్య ఉచ్చైర్గు రుభ్యః –పా౦డిత్యౌన్న  త్యర్ది వద్భ్యో నమా౦ స్యోం ‘’

తా-ఇలా ఏయే మహాత్ములు నాకు ఒక్కక్షరమైనా ఇచ్చ్చారో వారందరినీ గౌరవ ప్రపత్తు లతో పూజిస్తా ను
.దేవతలకు మిత్రు లకు ,సహ పాఠకులకు ,పెద్దలకు గురు వరేణ్యు లకు ,సర్వ సమత్వ భావమున్న
ప్రబుద్ధు లకు అందరికి నమస్కరిస్తా ను .ఇంతకంటే నేను చెప్పేది, చేసేది ఏమీ లేదు .పర బ్రహ్మ రూపమైన
‘’ప్రణవం ‘’ను ఉచ్చరిస్తూ ’’ తురీయా తీత దశ’’ను కోరుతున్నాను .

మత్స్వప్నః (నా కల )సమాప్త ం .అమ్మవారూ అయ్యవారూ ,కైలసానికి ,వ్యాసులవారు విష్ణు పదానికి


చేరుకున్నారు .మనం ఈ కలలోంచి బయటపడి సదసద్వివేకులమవుదాం –స్వస్తి

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ – 25-10-15

దీన్ని పంచుకోండి:

You might also like