You are on page 1of 21

ఒలింరిక్స్

ఒలింపిక్స్ కవితావళి
వాక్కేళి

1
ఒలింరిక్స్

ఒలింపిక్స్
అత్యున్నత శిఖరాగ్ర స్థా యి క్రీ డాంగణం. ప్ర తీ క్రీ డాకారిణీ, క్రీ డాకారుడూ
చుట్టు కోవాలని కలలుగనే కీర్తి పతాకం. ప్ర తిభకి గీటురాయి.
పరిపూర్ణ మై న ప్ర దర్శనకి పరాకాష్ట ! పాలుపంచుకు పతకం కొట్టా లని,
ఆటగాళ్ళైన ప్ర తీ ఒక్కరికీ చిరకాల స్వప్నం.

మాటగాళ్ళమే తప్ప ఆటగాళ్ళం కానీ మనబొంట్లు ,


టీవీ/టాబ్లె ట్/మొబై ళ్ళు ముందేసుకు, గెలిస్తే విజిలేసి, ఓడితే
బూజుదులిపేసి మూడెంకేయడం మినహాయించేమీ చేయలేం. కానీ
ఏదో చేయాలి, విజులుకిమించి ఇంకేదో వేయాలి అన్న తపనే ఇదిగో
ఆ ఐదు రింగుల సమరాంగణంలో కలం పట్టించిలా ఐదు పంక్తు ల
కవితలకి అంకురార్పణ చేసింది. ఆంగ్ల భాషలోని లిమరిక్కు ప్ర క్రి య
తీసుకు, నేటివిటీకి దగ్గ రగా, కొండొకచో విట్టీ గా పదాలని
పరుగుపెట్టించి, గంతులేయించిన, జావలీన్లా డించిన నా ప్ర యత్నం.

మీకు నచ్చుతుందనే ఆశిస్తూ - నచ్చితే ఇంకోళ్ళతో పంచుకు,


నచ్చకపోతే ఇంకోళ్ళని బాధపెట్టే లా వాళ్ళతో పంచుకు, మొత్తా నికి
సిటియస్-ఆల్టి యస్-ఫోర్టి స్-కమ్యూనిటర్ స్ఫూర్తి తో పేజీలు తిప్పండి!

-వాక్కేళి

వాక్కేళి

2
ఒలింరిక్స్

రంభంభం ప్రా రంభం

టోక్యోలో మొదలాటలు
టోకున మెడల్ వేటలు
మనవాళ్ళు సాగించి
పతకాలు సాధించి
వేయు బంగరు బాటలు

Ṭōkyōlō modalāṭalu
ṭōkuna meḍal vēṭalu
manavāḷḷu sāgin̄ci
patakālu sādhin̄ci
vēyu baṅgaru bāṭalu

వాక్కేళి

3
ఒలింరిక్స్

ఆహ్హా -కీ

ఠక్కునేయగ గోలు
చిక్కకుండా కదులు
ఉక్కు బాడీ ఉడుకు
స్టి క్కు ఊతగ దుడుకు
నిక్కు మెడలో మెడలు!

Ṭhakkunēyaga gōlu
cikkakuṇḍā kadulu
ukku bāḍī uḍuku
sṭikku ūtaga duḍuku
nikku meḍalō meḍalu!

వాక్కేళి

4
ఒలింరిక్స్

హీ-రోయింగ్

సర్వశక్తు లు ఒడ్డు
వెయ్యి ఒకటిగ తెడ్డు
చూపు చక్కని చేవ
దూసుకెళ్లు ను నావ
చేరు బంగరు ఒడ్డు !

Sarvaśaktulu oḍḍu
veyyi okaṭiga teḍḍu
cūpu cakkani cēva
dūsukeḷlunu nāva
cēru baṅgaru oḍḍu!

వాక్కేళి

5
ఒలింరిక్స్

జిమ్‍నేస్తం

ఆర్టి స్టి క్‌విన్యాసం


జిమ్నాస్టి క్ అభ్యాసం
నేడు తెచ్చెను చోటు
రేపు గోల్డె న్ ఫీటు
రబ్బరు బాడీ వశం!

Ārṭisṭik‌vin'yāsaṁ
jimnāsṭik abhyāsaṁ
nēḍu teccenu cōṭu
rēpu gōlḍen phīṭu
rabbaru bāḍī vaśaṁ!

వాక్కేళి

6
ఒలింరిక్స్

గుడ్‍మింటన్

షటిలు ఆడే తీరు


టాపు కెళ్ళిన జోరు
అదే విన్నింగ్ ఊపు
సింధు దండిగ చూపు
పోడియమ్ దరి చేరు!

Ṣaṭilu āḍē tīru


ṭāpu keḷḷina jōru
adē vinniṅg ūpu
sindhu daṇḍiga cūpu
pōḍiyam dari cēru!

వాక్కేళి

7
ఒలింరిక్స్

వెండిలిఫ్టింగ్

భుజబలమది తస్సదియ్య
తొడలున్నది అందుకయ్య
తేలిగ్గా బరువు మొయ్యి
ఓపిగ్గా దింపి వెయ్యి
మెడలేసుకు చిందులెయ్య!

Bhujabalamadi tas'sadiyya
toḍalunnadi andukayya
tēliggā baruvu moyyi
ōpiggā dimpi veyyi
meḍalēsuku cinduleyya!

వాక్కేళి

8
ఒలింరిక్స్

పింగుపాంగు

టాపు స్పిన్నుల హంగు


ఛాపు షాటుల జింగు
చూపెట్టు రాకెట్టు
ప్ర త్యర్థి పనిపట్టు
గెలిపించు పింగ్ పాంగు!

Ṭāpu spinnula haṅgu


chāpu ṣāṭula jiṅgu
cūpeṭṭu rākeṭṭu
pratyarthi panipaṭṭu
gelipin̄cu piṅg pāṅgu!

వాక్కేళి

9
ఒలింరిక్స్

బాక్సింగు-సాంగు

కడతేరగ అరి తాపమ్


పిడిగుద్దు ల శఠగోపమ్
ఒడలు మరిచి పోవునట్టు
పడిలేవని విధము పెట్టు
మెడకప్పుడు మణిహారమ్!

Kaḍatēraga ari tāpam


piḍiguddula śaṭhagōpam
oḍalu marici pōvunaṭṭu
paḍilēvani vidhamu peṭṭu
meḍakappuḍu maṇihāram!

వాక్కేళి

10
ఒలింరిక్స్

విలువై నవిద్య

ఏకలవ్యుడి గురిని
కిరీటేకాగ్ర తని
పొందుపరుచుకు కొట్టు
విల్లంబు చేపట్టు
ఎగరెయ్యి జెండాని!

Ēkalavyuḍi gurini
kirīṭēkāgratani
ponduparucuku koṭṭu
villambu cēpaṭṭu
egareyyi jeṇḍāni!

వాక్కేళి

11
ఒలింరిక్స్

డిస్కసన్

గుండ్ర మీ డిస్కస్సు
గుండ్రా యి బై సెప్సు
తిప్పి రోదసి వై పు
ఒక్క ఊపున పంపు
కాదు మెడలిక మిస్సు!

Guṇḍramī ḍiskas'su
guṇḍrāyi baisepsu
tippi rōdasi vaipu
okka ūpuna pampu
kādu meḍalika mis'su!

వాక్కేళి

12
ఒలింరిక్స్

హాక్వీనులు

ఉత్కంఠభరితంగ
ఈ గేము సాగంగ
హ్యాట్రి క్కు సాధించి
సౌతాఫ్రి కని దంచి
గెలిచిరో సారంగ!

Utkaṇṭhabharitaṅga
ī gēmu sāgaṅga
hyāṭrikku sādhin̄ci
sautāphrikani dan̄ci
gelicirō sāraṅga!

వాక్కేళి

13
ఒలింరిక్స్

పోతేపోనీ పోతేపోనీ!

ధన్యవాదాల్ సింధు
నీ పటిమనేమందు?
ఇంతదూరం వచ్చి
మాకు స్ఫూర్తి ని ఇచ్చి
నిల్చితివి హృదియందు!

Dhan'yavādāl sindhu
nī paṭimanēmandu?
Intadūraṁ vacci
māku sphūrtini icci
nilcitivi hr̥diyandu!

వాక్కేళి

14
ఒలింరిక్స్

కంచుకి పోతావ సింధమ్మా!

కంచు పతకం పొందు


బంగారి మా సింధు
అచ్చ తెలుగింటి పిల్ల
ఇచ్చె చై నాకి డిల్ల
జాతి ఆనందమొందు!

Kan̄cu patakaṁ pondu


baṅgāri mā sindhu
acca telugiṇṭi pilla
icce caināki ḍilla
jāti ānandamondu!

వాక్కేళి

15
ఒలింరిక్స్

ఖుష్‍తీ

చేయి చేయి కలుపు


ఒంటి దుమ్ము దులుపు
మెలికలేసి కాలు
కిందతోయి చాలు
నీదేలే గెలుపు!

Cēyi cēyi kalupu oṇṭi


dum'mu dulupu
melikalēsi kālu
kindatōyi cālu
nīdēlē gelupu!

వాక్కేళి

16
ఒలింరిక్స్

కుస్తీ పట్టు పట్టు !

జడుపునిక పోగొట్టు
ఒడుపుగా పడగొట్టు
కరిపించగా మట్టి
పట్టి , నేలకి కొట్టి
గెలవుమా పోఘట్టు !

Jaḍupunika pōgoṭṭu
oḍupugā paḍagoṭṭu
karipin̄cagā maṭṭi
paṭṭi, nēlaki koṭṭi
gelavumā pōghaṭṭu!

వాక్కేళి

17
ఒలింరిక్స్

గోల్ఫు

అద్వితీయం అదితి
ఎన్నడెరుగని రీతి
ఊపిరిని బిగబట్టి
పనులు పక్కనబెట్టి
గోల్ఫుకంటుకుపోతి!

Advitīyaṁ aditi
ennaḍerugani rīti
ūpirini bigabaṭṭi
panulu pakkanabeṭṭi
gōlphukaṇṭukupōti!

వాక్కేళి

18
ఒలింరిక్స్

జావళిన్

గురిపెట్ట గా ఈటి
వేరెవరురా సాటి
ఆఖరున మొదలెట్టి
స్వర్ణా న్ని చేపట్టి
చూపితివి నీ ధాటి!

Guripeṭṭagā īṭi
vērevarurā sāṭi
ākharuna modaleṭṭi
svarṇānni cēpaṭṭi
cūpitivi nī dhāṭi!

వాక్కేళి

19
ఒలింరిక్స్

మంగళం

కనక, రజతం, కంచు


పతక పంటని కాంచు
మూడు వన్నెల జ్యోతి
హారతిదే భారతి
అంది మము దీవించు!

Kanaka, rajataṁ, kan̄cu


pataka paṇṭani kān̄cu
mūḍu vannela jyōti
hāratidē bhārati
andi mamu dīvin̄cu!

వాక్కేళి

20
ఒలింరిక్స్

These limericks, created by me, are for fun and to spread


awareness of the games as well as interest in Telugu
literature. This ebook is not intended for any kind of
commercial usage by me; nor I give any kind of permission
to anyone to do so on my behalf.

The Olympics logo and all the images have been


downloaded from different websites and I don’t own
copyright for any of them.

వాక్కేళి

21

You might also like