You are on page 1of 43

సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫు ర-

త్తా రానాయక శేఖరాం స్మి తముఖీ మాపీన వక్షోరుహామ్ |


పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్ప లం బిభ్రతీం
సౌమ్యాం రత్న ఘటస్థ రక్త చరణాం ధ్యా యేత్ప రామంబికామ్

లలితా సహస్రనామం అర్ధా లు, రహస్యా ర్ధా లు:


లలితా సహస్ర నామములు- 1-100
శ్లో కం 01
శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రథమైన తల్లి.
శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్ప దైన రాణి.
శ్రీమత్సింహాసనేశ్వ రీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.
చిదగ్ని కుండ సంభూతా : చైతన్య మనెడి అగ్ని కుండము నుండి చక్క గా
ఆవిర్భా వము చెందినది.
దేవకార్య సముద్య తా : దేవతల యొక్క కార్య ములకై ఆవిర్భ వించింది.
శ్లో కం 02
ఉద్య ద్భా ను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యు ల యొక్క కాంతులతో
సమానమైన కాంతి కలది.
చతుర్బా హు సమన్వి తా : నాలుగు చేతులతో కూడినది.
రాగస్వ రూప పాశాఢ్యా : అనురాగ స్వ రూపముగా గల పాశముతో ఒప్పు చున్న ది.
క్రోధాకారాంకుశోజ్జ్వ లా : క్రోధమును స్వ రూపముగా గలిగిన అంకుశముతో
ప్రకాశించుచున్న ది.
శ్లో కం 03
మనో రూపేక్షు కోదండా : మనస్సు ను రూపముగా గల్గిన చెఱకుగడ విల్లును
ధరించింది.
పంచతన్మా త్ర సాయకా : ఐదు తన్మా త్రలు అను బాణములు ధరించింది.
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్ర హ్మాండ మండలా : తన సహజమైన ఎఱ్ఱని కాంతుల
నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.
శ్లో కం 04
చంపకాశోక పున్నా గ సౌగంధికలసత్క చా : సంపంగి, అశోక, పున్నా గ, చెంగల్వ
పుష్ప ముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది.
కురువిందమణిశ్రేణి కనత్కో టీర మండితా : పద్మ రాగముల వరుసచేత
ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడింది.
శ్లో కం 05
అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా : అష్టమినాటి చంద్రుని వలె
ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్య ముతో అలరారుచున్న ది.
ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా : ముఖము అనెడి చంద్రునియందు
మచ్చ వలె ఒప్పె డు కస్తురి బొట్టును కలిగినది.
శ్లో కం 06
వదనస్మ ర మాంగల్య గృహతోరణ చిల్లికా : ముఖమనెడు మన్మ థుని శుభమైన
నివాసమునకు తోరణమువలె ఒప్పు కనుబొమలు కలిగినది.
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభ లోచనా : ముఖదీప్తి అనెడు సంపదప్రథమైన
స్రోతస్సు నందు కదలాడుచున్న చేపలవలె ఒప్పు చుండు కన్ను లు కలిగినది.
శ్లో కం 07
నవచంపక పుష్పా భ నాసాదండ విరాజితా : క్రొత్తగా వికసించుచున్న సంపెంగ
పువ్వు ను పోలెడు ముక్కు దూలముతో ప్రకాశించునది
తారాకాంతి తిరస్కా రి నాసాభరణ భాసురా : ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు
చుక్క ల యొక్క కాంతిని తిరస్క రించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది.
శ్లో కం 08
కదంబ మంజరీ క్లు ప్త కర్ణపూర మనోహరా : కడిమి పూల గుచ్చ ముల చేత
కూర్చ బడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సు ను దోచునంత
అందముగా నున్న ది.
తాటంక యుగళీభూత తపనోడుప మండలా : చెవి కమ్మ లుగా జంటగా అయిన
సుర్య చంద్ర మండలమును గలది.
శ్లో కం 09
పద్మ రాగ శిలాదర్శ పరిభావి కపోలభూః – పద్మ రాగ మణుల అద్దమును
పరిహసించు చెక్కి ళ్ళ యొక్క ప్రదేశము గలది.
నవవిద్రుమ బింబ శ్రీ న్య క్కా రి రథనచ్ఛ దా – కొత్తదైన పగడముల యొక్క
దొండపండు యొక్క శోభను తిరస్క రించు పెదవులు గలది.
శ్లో కం 10
శుద్ధ విద్యాంకురాకార ద్వి జ పంక్తిద్వ యోజ్జ్వ లా – శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య
లేదా శ్రీవిద్య కు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మ లు కలిగిన లేదా
పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది.
కర్పూ ర వీటికామోద సమాకర్షద్దిగంతరా – కర్పూ రపు తాంబూలము యొక్క
సువాసన లేదా పరిమళమును చక్క గా గ్రహించుచున్న దిగంతముల వరకు
ఆవరణములు గలది.
శ్లో కం 11
నిజసల్లా ప మాధుర్య వినిర్భ ర్త్సి త కచ్ఛ పీ – తన యొక్క సంభాషణ యొక్క
తియ్య దనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛ పీ అను
పేరుగల వీణ గలది.
మందస్మి త ప్రభాపూర మజ్జత్కా మేశ మనసా – చిరునవ్వు నిండిన కాంతి
ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది.
శ్లో కం 12
అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా – లభ్య ము గాని లేదా దొరకని పోలిక గల
గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది.
కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా – పరమశివుని చేత కట్టబడిన
మంగళసూత్రముచే, పవిత్ర సౌందర్య ముతో ప్రకాశించుచున్న మెడ గలిగినది.
శ్లో కం 13
కనకాంగద కేయూర కమనీయ భూజాన్వి తా – బంగారు ఆభరణాలు, వంకీలతో
అందమైన బాహువులు కలిగినది.
రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వి తా – రత్న ముల చేత కంఠమునందు
ధరించు చింతాకు అనే ఆభరణముతో కదులుచున్న ముత్యా లహారంతో కూడినది.
శ్లో కం 14
కామేశ్వ ర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ – కామేశ్వ రుని యొక్క ప్రేమ అనెడి
శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు
గలది.
నాభ్యా లవాల రోమాళి లతాఫలకుచద్వ యీ – బొడ్డు అనెడి పాదు లోని నూగారు
అనెడి తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది.
శ్లో కం 15
లక్ష్య రోమలతాధారతఅ సమున్నే య మధ్య మా – కనబడుచున్న నూగారు అనెడు
తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది.
స్తనభార దళన్మ ధ్య పట్టబంధ వళిత్రయా – వక్షముల బరువు చేత విరుగుచున్న
నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలౌ
గలది.
శ్లో కం 16
అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వ త్క టీ తటీ – ఉదయ సూర్యు ని రంగువలె
కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.
రత్న కింకిణికా రమ్యా రశనాదామ భూషితా – రత్న ములతో కూడిన చిరుగంటలతో
అందమైన ఒడ్డా ణపు త్రాటి చేత అలంకరింపబడింది.
శ్లో కం 17
కామేశజ్ఞా త సౌభాగ్య మార్దవోరుద్వ యాన్వి తా – కామేశ్వ రునికి మాత్రమే తెలిసిన
సౌభాగ్య వంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది.
మాణిక్య మకుటాకార జానుద్వ య విరాజితా – మాణిక్య సంబంధమైన కిరీటము
వంటి ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించునది.
శ్లో కం 18
ఇంద్రగోప పరీక్షిప్త స్మ ర తూణాభజంఘికా – ఆరుద్ర పురుగుల చేత చుట్టును
పొదగబడిన మన్మ థుని యొక్క అమ్ము ల పొదులతో ఒప్పు పిక్క లు గలది.
గూఢగుల్ఫా – నిండైన చీలమండలు గలది.
కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వి తా – తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు
భాగపు నునుపును గెలుచు స్వ భావము గల పాదాగ్రములు కలిగినది.
శ్లో కం 19
నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా – గోళ్ళ యొక్క కాంతుల చేత చక్క గా
కప్పి వేయబడిన నమస్క రించుచున్న జనుల యొక్క అజ్ఞా నం గలది.
పద ద్వ య ప్రభాజాల పరాకృత సరోరుహా – పాదముల జంట యొక్క కాంతి
సముదాయము చేత తిరస్క రింపబడిన పద్మ ములు గలది.
శ్లో కం 20
శింజానమణి మంజీర మండిత శ్రీపదాంభుజా – ధ్వ ని చేయుచున్న మణులు గల
అందెలచేత అలంకరింపబడిన శోభగల పద్మ ముల వంటి పాదములు గలది.
మరాళీ మందగమనా – హంసవలె ఠీవి నడక కలిగినది.
మహాలావణ్య శేవధిః – అతిశయించిన అందమునకు గని లేదా నిధి.
శ్లో కం 21
సర్వా రుణా – సర్వ ము అరుణ వర్ణంగా భాసించునది.
అనవద్యాంగీ – వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.
సర్వా భరణ భూషితా – సమస్తమైన నగల చేత అలంకరించబడింది.
శివకామేశ్వ రాంకస్థా – శివస్వ రూపుడు కామ స్వ రూపుడు అగు శంకరుని యొక్క
తొడయందున్న ది.
శివా – వ్య క్తమైన శివుని రూపము కలది.
స్వా ధీన వల్లభా – తనకు లోబడిన భర్త గలది.
శ్లో కం 22
సుమేరు శృంగమధ్య స్థా – మేరు పర్వ తపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో
ఉంది.
శ్రీమన్న గర నాయికా – శుభప్రథమైన ఐశ్వ ర్య ములతో కూడిన నగరంనకు
అధిష్ఠా త్రి.
చింతామణి గృహాంతఃస్థా – చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల
ఉంది.
పంచబ్రహ్మా సనస్థితా – ఐదుగురు బ్రహ్మ లచే నిర్మింపబడిన ఆసనములో ఉంది.
శ్లో కం 23
మహాపద్మా టవీ సంస్థా – మహిమగల లేదా గొప్ప వైన పద్మ ములు గల అడవియందు
చక్క గా ఉంది.
కదంబ వనవాసినీ – కడిమి చెట్ల యొక్క తోటయందు వసించునది.
సుధాసాగర మధ్య స్థా – చక్క గా గుర్తించుకొని తనయందు ధరించి
అవసరమైనపుడు వ్య క్తము చేయగలుగునది.
కామాక్షీ – అందమైన కన్ను లు గలది.
కామదాయినీ – కోరికలను నెరవేర్చు నది.
శ్లో కం 24
దేవర్షిగణ సంఘాత స్తూ యమానాత్మ వైభవా – దేవతల యొక్క , ఋషుల యొక్క ,
గణదేవతల యొక్క సముదాయము చేత స్తో త్రము చేయబడుచున్న తన యొక్క
గొప్ప దనము గలది.
భండాసుర వధోద్యు క్త శక్తి సేనా సమన్వి తా – భండుడు అను రాక్షసుని
సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్క గా
కూడియున్న ది.
శ్లో కం 25
సంపత్క రీ సమారూఢ సింధుర వ్రజసేవితా – సంపత్క రీ దేవి చేత చక్క గా
అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడింది.
అశ్వా రూఢా ధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతా – అశ్వా రూఢ అనే దేవి చేత ఎక్క బడిన
గుఱ్ఱముల యొక్క కోట్లా నుకోట్లచే చుట్టుకొనబడింది.
శ్లో కం 26
చక్రరాజ రథారూఢ సర్వా యుధ పరిష్కృతా – చక్రరాజము అను పేరుగల
రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా – గేయచక్రము అని పేరుగల రథమును
అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.
శ్లో కం 27
కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా – కిరిచక్రము అను పేరుగల రథమును
ఎక్కి న దండము చేతియందు ఎల్లప్పు డూ వుండు దేవి ముందు ఉండి
సేవింపబడునది.
జ్వా లామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్య గా – జ్వా లా మాలిని అను పేరు గల
నిత్య దేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్ని ప్రాకారము యొక్క
మధ్య నున్న ది.
శ్లో కం 28
భండసైన్య వధోద్యు క్త శక్తి విక్రమ హర్షితా – భండాసురుణ్ణి, అతని సైన్యా న్ని
సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యా ల విక్రమాన్ని చూచి
ఆనందించింది.
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సు కా – నిత్యా దేవతల యొక్క పరులను
ఆక్రమించుకోగల శక్తి, సామర్థ్య , ఉత్సా హాలను చూసి సంతోషించింది.
శ్లో కం 29
భండపుత్ర వధోద్యు క్త బాలా విక్రమనందితా – భండాసురుని పుత్రులను
సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు
సంతసించునది.
మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా – మంత్రిణీ దేవి చేత చేయబడిన
విషంగ వధను విని సంతసించింది.
శ్లో కం 30
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా – విశుక్రుని ప్రాణాలను హరించిన
వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది.
కామేశ్వ ర ముఖాలోక కల్పి త శ్రీగణేశ్వ రా – కామేశ్వ రుని యొక్క ముఖమును
చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది.
శ్లో కం 31
మహాగణేశ నిర్భి న్న విఘ్న యంత్ర ప్రహర్షితా – మహాగణపతి చేత
నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కి లి సంతోషించింది.
భండాసురేంద్ర నిర్ము క్త శస్త్రప్రత్య స్త్రవర్షిణీ – రాక్షస రాజైన భండాసురిని చేత
ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది.
శ్లో కం 32
కరాంగుళి నఖోత్ప న్న నారాయణ దశాకృతిః – చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన
విష్ణు మూర్తి యొక్క దశావతారములు గలది.
మహాపాశుపతాస్త్రా గ్ని నిర్దగ్ధా సుర సైనికా – మహాపాశుపతము అను అస్త్రము యొక్క
అగ్ని చేత – నిశ్శే షంగా దహింపబడిన రాక్షస సైన్య ము గలది.
శ్లో కం 33
కామేశ్వ రాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్య కా – కామేశ్వ రాస్త్ర ప్రయోగముతో నిశ్శే షంగా
దహింపబడిన భండాసురునితో కూడిన శూన్య కా నగరం గలది.
బ్రహ్మో పేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవా – బ్రహ్మ , విష్ణు వు, ఇంద్రుడు
మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది.
శ్లో కం 34
హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః – శివుని యొక్క మూడవ కంటికి
నిశ్శే షంగా దహింపబడిన మన్మ థునికి సంజీవనము వంటి మందువలె
పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించునది.
శ్రీ మద్వా గ్భ వ కూటైక స్వ రూప ముఖపంకజా – మంగళకరమైన లేదా
మహిమాన్వి తమైన వాగ్భ వము అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్య మైన
స్వ రూపముగాగల పద్మ ము వంటి ముఖము గలది.
శ్లో కం 35
కంఠాధః కటిపర్యంత మధ్య కూట స్వ రూపిణీ – కంఠము యొక్క క్రింద నుండి
నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్య కూట
స్వ రూపముగా గలది.
శక్తికూటైక తాపన్న కట్య ధోభాగ ధారిణీ – శక్తికూటముతో సామ్య మమును పొందిన
నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.
శ్లో కం 36
మూలమంత్రాత్మి కా – మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును
ఆత్మ స్వ రూపముగా గలది.
మూలకూట త్రయకళేబరా – మూలమంత్రము యొక్క కూటత్రయమును తన
శరీరముగా గలది.
కులమృతైక రసికా – కులమునకు సంబంధించిన అమృతములో మిక్కి లి ఆసక్తి
కలది.
కులసంకేత పాలినీ – కుల సంబంధమైన ఏర్పా టులను పాలించింది.
శ్లో కం 37
కులాంగనా – కుల సంబంధమైన స్త్రీ.
కులాంతఃస్థా – కులము యొక్క మద్య ములో ఉంది.
కౌలినీ – కులదేవతల రూపంలో ఆరాధింపబడునది.
కులయోగినీ – కుండలినీ యోగ దేవతా స్వ రూపిణి.
అకులా – అకులా స్వ రూపురాలు లేదా కులము లేనిది.
సమయాంతఃస్థా – సమయాచార అంతర్వ ర్తిని.
సమయాచార తత్ప రా – సమయ అనే ఆచారములో ఆసక్తి కలది.
శ్లో కం 38
మూలాధారైక నిలయా – మూలాధార చక్రమే ముఖ్య మైన నివాసముగా గలది.
బ్రహ్మ గ్రంథి విభేదినీ – బ్రహ్మ గ్రంథిని విడగొట్టునది.
మణిపూరాంతరుదిరా – మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది
లేదా ప్రకటమగునది.
విష్ణు గ్రంథి విభేదినీ – విష్ణు గ్రంథిని విడగొట్టునది.లలితా సహస్ర నామములు- 101-
200
శ్లో కం 39
ఆజ్ఞా చక్రాంతళస్థా – ఆజ్ఞా చక్రము యొక్క మధ్య లో ఉండునది.
రుద్రగ్రంథి విభేదినీ – రుద్రగ్రంథిని విడగొట్టునది.
సహస్త్రా రాంభుజారూఢా – వెయ్యి దళములు గల పద్మ మును అధిష్టించి యున్న ది.
సుధాసారాభివర్షిణీ – అమృతము యొక్క ధారాపాత వర్షమును కురిపించునది.
శ్లో కం 40
తటిల్లతా సమరుచిః – మెఱపుతీగతో సమానమగు కాంతి గలది.
షట్చ క్రోపరి సంస్థితా – ఆరు విధములైన మూలాధారాది చక్రముల యొక్క
పైభాగమందు చక్క గా నున్న ది.
మహాసక్తిః – బ్రహ్మ మునందు ఆసక్తి గలది.
కుండలినీ – పాము వంటి ఆకారము గలది.
బిసతంతు తనీయసీ – తామరకాడలోని ప్రోగువలె సన్న ని స్వ రూపము గలది.
శ్లో కం 41
భవానీ – భవుని భార్య .
భావనాగమ్యా – భావన చేత పొంద శక్య ము గానిది.
భవారణ్య కుఠారికా – సంసారమనెడు అడవికి గండ్రగొడ్డలి వంటిది.
భద్రప్రియా – శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది.
భద్రమూర్తిః – శుభమైన లేదా మంగళకరమైన స్వ రూపము గలది.
భక్త సౌభాగ్య దాయినీ – భక్తు లకు సౌభాగ్య మును ఇచ్చు నది.
శ్లో కం 42
భక్తప్రియా – భక్తు ల యెడ ప్రేమ, వాత్స ల్య ము గలది.
భక్తిగమ్యా – భక్తికి గమ్య మైనటువంటిది.
భక్తివశ్యా – భక్తికి స్వా ధీనురాలు.
భయాపహా – భయములను పోగొట్టునది.
శాంభవీ – శంభుని భార్య .
శారదారాధ్యా – సరస్వ తిచే ఆరాధింపబడునది.
శర్వా ణీ – శర్వు ని భార్య .
శర్మ దాయినీ – శాంతిని, సుఖమును ఇచ్చు నది.
శ్లో కం 43
శాంకరీ – శంకరుని భార్య .
శ్రీకరీ – ఐశ్వ ర్య మును ఇచ్చు నది.
సాధ్వీ – సాధు ప్రవర్తన గల పతివ్రత.
శరచ్చంద్ర నిభాననా – శరత్కా లము లోని చంద్రునితో సమానమైన వదనము
గలది.
శాతోదరీ – కృశించిన లేదా సన్న ని పొట్ట గలిగినది.
శాంతిమతీ – శాంతి గలది.
నిరాధారా – ఆధారము లేనిది.
నిరంజనా – మాయా సంబంధమైన అజ్ఞా నపు పొరలేని దృష్టి గలది.
శ్లో కం 44
నిర్లేపా – కర్మ బంధములు అంటనిది.
నిర్మ లా – ఏ విధమైన మలినము లేనిది.
నిత్యా – నిత్య సత్య స్వ రూపిణి.
నిరాకారా – ఒక ప్రత్యే కమైన ఆకారము లేనిది.
నిరాకులా – భావ వికారములు లేనిది.
నిర్గుణా – గుణములు అంటనిది.
నిష్క లా – విభాగములు లేనిది.
శాంతా – ఏ విధమైన ఒడిదుడుకులు, తొట్రుపాటు లేనిది.
నిష్కా మా – కామము, అనగా ఏ కోరికలు లేనిది.
నిరుపప్లవా – హద్దులు ఉల్లంఘించుట లేనిది.
శ్లో కం 45
నిత్య ముక్తా – ఎప్పు డును సంగము లేనిది.
నిర్వి కారా – ఏ విధమైన వికారములు లేనిది.
నిష్ప్ర పంచా – ప్రపంచముతో ముడి లేనిది.
నిరాశ్రయా – ఆశ్రయము లేనిది లేదా అవసరము లేనిది.
నిత్య శుద్ధా – ఎల్లప్పు డు శుద్ధమైనది.
నిత్య బుద్ధా – ఎల్లప్పు డు జ్ఞా న స్వ రూపురాలు.
నిరవద్యా – చెప్ప రానిది అంటూ ఏమీ లేనిది లేదా నిందించుటకూ ఏదీ లేనిది.
నిరంతరా – ఏ మాత్రము సందు లేకుండా అంతటా వ్యా పించింది.
శ్లో కం 46
నిష్కా రణా – ఏ కారణము లేనిది.
నిష్క ళంకా – ఎటువంటి దోషము లేదా పాపము లేనిది.
నిరుపాధిః – ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది.
నిరీశ్వ రా – ఇంకా తనను పైన ప్రభువు అనువారెవరూ లేనిది.
నిరాగా – రాగము అనగా కోరికలు లేనిది.
రాగమథనీ – రాగమును పోగొట్టి, వైరాగ్య మును కలుగుజేయునది.
నిర్మ దా – మదము లేనిది.
మదనాశినీ – మదమును పోగొట్టునది.
శ్లో కం 47
నిశ్చింతా – ఏ చింతలూ లేనిది.
నిరహంకారా – ఏ విధమైన అహంకారము లేనిది.
నిర్మో హా – అవగాహనలో పొరపాటు లేనిది.
మోహనాశినీ – మోహమును పోగొట్టునది.
నిర్మ మా – మమకారము లేనిది.
మమతాహంత్రీ – మమకారమును పోగొట్టునది.
నిష్పా పా – పాపము లేనిది.
పాపనాశినీ – పాపములను పోగొట్టునది.
శ్లో కం 48
నిష్క్రో ధా – క్రోధము లేనిది.
క్రోధశమనీ – క్రోధమును పోగొట్టునది.
నిర్లోభా – లోభము లేనిది.
లోభనాశినీ – లోభమును పోగొట్టునది.
నిస్సంశయా – సందేహములు, సంశయములు లేనిది.
సంశయఘ్నీ – సంశయములను పోగొట్టునది.
నిర్భ వా – పుట్టుక లేనిది.
భవనాశినీ – పుట్టుకకు సంబంధించిన సంసార బంధక్లేశములు లేకుండా
చేయునది.
శ్లో కం 49
నిర్వి కల్పా – వికల్ప ములు లేనిది.
నిరాబాధా – బాధలు, వేధలు లేనిది.
నిర్భే దా – భేదములు లేనిది.
భేదనాశినీ – భేదములను పోగొట్టునది.
నిర్నా శా – నాశము లేనిది.
మృత్యు మథనీ – మృత్యు భావమును, మృత్యు వును పోగొట్టునది.
నిష్క్రి యా – క్రియలు (చేయవలసిన, చేయకూడని) లేనిది.
నిష్ప రిగ్రహా – స్వీ కరణ, పరిజనాదులు లేనిది.
శ్లో కము 50
నిస్తులా – సాటి లేనిది.
నీలచికురా – చిక్క ని, చక్క ని, నల్లని, ముంగురులు గలది.
నిరపాయా – అపాయములు లేనిది.
నిరత్య యా – అతిక్రమింప వీలులేనిది.
దుర్లభా – పొందశక్య ము కానిది.
దుర్గమా – గమింప శక్య ము గానిది.
దుర్గా – దుర్గా దేవి.
దుఃఖహంత్రీ – దుఃఖములను తొలగించునది.
సుఖప్రదా – సుఖములను ఇచ్చు నది.
శ్లో కము 51
దుష్టదూరా – దుష్టత్వ ము అంటనిది. దుష్టు లకు అంటనిది.
దురాచార శమనీ – చెడు నడవడికను పోగొట్టునది.
దోషవర్జితా – దోషములచే విడిచి పెట్టబడింది.
సర్వ జ్ఞా – అన్ని టినీ తెలిసింది.
సాంద్రకరుణా – గొప్ప దయ గలది.
సమానాధిక వర్జితా – ఎక్కు వ తక్కు వ భేదాలచే విడువబడినది అనగా ఎక్కు వ
వారు తక్కు వ వారు లేనిది.
శ్లో కము 52
సర్వ శక్తిమయీ – సర్వ శక్తి స్వ రూపిణి.
సర్వ మంగళా – సర్వ మంగళ స్వ రూపిణి.
సద్గతి ప్రదా – మంచి మార్గమును ఇచ్చు నది.
సర్వే శ్వ రీ – జగత్తు లేదా విశ్వ మునంతకు ప్రధానాధికారిణి.
సర్వ మయీ – సర్వ ములో అనగా విశ్వ మంతటా నిండి ఉంది.
సర్వ మంత్ర స్వ రూపిణీ – అన్ని మంత్రములును తన స్వ రూపముగా గలది.

లలితా సహస్ర నామములు- 201-300


శ్లో కము 52
సర్వ శక్తిమయీ – సర్వ శక్తి స్వ రూపిణి.
సర్వ మంగళా – సర్వ మంగళ స్వ రూపిణి.
సద్గతిప్రదా – మంచి మార్గమును ఇచ్చు నది.
సర్వే శ్వ రీ – జగత్తు లేదా విశ్వ మునంతకు ప్రధానాధికారిణి.
సర్వ మయీ – సర్వ ములో అనగా విశ్వ మంతటా నిండి ఉంది.
సర్వ మంత్ర స్వ రూపిణీ – అన్ని మంత్రములును తన స్వ రూపముగా గలది.
శ్లో కం 53
సర్వ యంత్రాత్మి కా – అన్ని యంత్రములకు స్వ రూపముగా గలది.
సర్వ తంత్రరూపా – అన్ని తంత్రములను తన రూపముగా గలది.
మనోన్మ నీ – మననస్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది.
మాహేశ్వ రీ – మహేశ్వ ర సంబంధమైనది.
మహాదేవీ – మహిమాన్వి తమైన ఆధిపత్య ము కలది.
మహాలక్ష్మీ – గొప్ప వైన లక్ష్మ లు గలది.
మృడప్రియా – శివుని ప్రియురాలు.
శ్లో కం 54
మహారూపా – గొప్ప దైన లేదా మహిమాన్వి తమైన రూపము గలది.
మహాపూజ్యా – గొప్ప గా పూజింపబడునది.
మహాపాతక నాశినీ – ఘోరమైన పాతకములను నాశనము చేయునది.
మహామాయా – మహిమాన్వి తమైన మాయా లక్షణం కలది.
మహాసత్వా – మహిమాన్వి తమైన ఉనికి గలది.
మహాశక్తిః – అనంతమైన శక్తి సామర్థ్య ములు గలది.
మహారతిః – గొప్ప ఆసక్తి గలది.
శ్లో కం 55
మహాభోగా – గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది.
మహైశ్వ ర్యా – విలువ కట్టలేని ఐశ్వ ర్య మును ఇచ్చు నది.
మహావీర్యా – అత్యంత శక్తివంతమైన వీర్య త్వ ము గలది.
మహాబలా – అనంతమైన బలసంపన్ను రాలు.
మహాబుద్ధిః – అద్వి తీయమైన బుద్ధి గలది.
మహాసిద్ధిః – అద్వి తీయమైన సిద్ధి గలది.
మహాయోగేశ్వ రేశ్వ రీ – గొప్ప యోగేశ్వ రులైన వారికి కూడా ప్రభవి.
శ్లో కం 56
మహాతంత్రా – గొప్ప దైన తంత్ర స్వ రూపిణి.
మహామంత్రా – గొప్ప దైన మంత్ర స్వ రూపిణి.
మహాయంత్రా – గొప్ప దైన యంత్ర స్వ రూపిణి.
మహాసనా – గొప్ప దైన ఆసనము గలది.
మహాయాగ క్రమారాధ్యా – గొప్ప దైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో
ఆరాధింపబడునది.
మహాభైరవ పూజితా – ఆదిత్య మండలంలో మధ్య నవుండే మహాభైరవుడు
(నారాయణుడు) చేత పూజింపబడింది.
శ్లో కం 57
మహేశ్వ ర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ – సదాశివునిచే మహాప్రళయ
సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్య మును సాక్షి స్వ రూపిణి.
మహా కామేశ మహిషీ – మహేశ్వ రుని పట్టపురాణి.
మహాత్రిపుర సుందరీ – గొప్ప దైన త్రిపురసుందరి.
శ్లో కం 58
చతుష్షష్ట్యు పచారాఢ్యా – అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది.
చతుష్షష్టి కళామయీ – అరువది నాలుగు కళలు గలది.
మహాచతుష్షష్టి కోటియోగినీ గణసేవితా – గొప్ప దైన అరువది కోట్ల యోగినీ
బృందముచే సేవింపబడునది.
శ్లో కం 59
మనువిద్యా – మనువు చేత ఉపాసింపబడిన విద్యా రూపిణి.
చంద్రవిద్యా – చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యా రూపిణి.
చంద్రమండలమధ్య గా – చంద్ర మండలములో మధ్య గా నుండునది.
చారురూపా – మనోహరమైన రూపము కలిగినది.
చారుహాసా – అందమైన మందహాసము కలది.
చారుచంద్రకళాధరా – అందమైన చంద్రుని కళను ధరించునది.
శ్లో కం 60
చరాచర జగన్నా థా – కదిలెడి, కదలని ఈ జగత్తుకు అధినాథురాలు.
చక్రరాజ నికేతనా – చక్రములలో గొప్ప దైన దానిని నిలయముగా కలిగినది.
పార్వ తీ – పర్వ తరాజ పుత్రి.
పద్మ నయనా – పద్మ ములవంటి నయనములు కలది.
పద్మ రాగ సమప్రభా – పద్మ రాగముల కాంతికి సమానమగు శరీరకాంతి కలది.
శ్లో కం 61
పంచప్రేతాసనాసీనా – పంచప్రేతలైన బ్రహ్మ , విష్ణు , రుద్ర, ఈశ్వ ర, సదాశివులను
ఆసనముగా కలిగి ఆసీనులైనది.
పంచబ్రహ్మ స్వ రూపిణీ – పంచబ్రహ్మ ల స్వ రూపమైనది.
చిన్మ యీ – జ్ఞా నముతో నిండినది.
పరమానందా – బ్రహ్మా నంద స్వ రూపము లేక నిరపేక్షకానంద రూపము.
విజ్ఞా నఘనరూపిణీ – విజ్ఞా నము, స్థిరత్వ ము పొందిన రూపము గలది.
శ్లో కం 62
ధ్యా న ధ్యా తృ ధ్యే యరూపా – ధ్యా నము యొక్క , ధ్యా నము చేయువాని యొక్క , ధ్యా న
లక్ష్య ము యొక్క సమన్వ య రూపము కలది.
ధర్మా ధర్మ వివర్జితా – విహితకర్మ లు, అవిహిత కర్మ లు లేనిది.
విశ్వ రూపా – విశ్వ ము యొక్క రూపమైనది.
జాగరిణీ – జాగ్రదవస్థను సూచించునది.
స్వ పంతీ – స్వ ప్నా వస్థను సూచించునది.
తైజసాత్మి కా – తేజస్సు వంటి సూక్ష్మ స్వ ప్నా వస్థకు అధిష్ఠా త్రి.
శ్లో కం 63
సుప్తా – నిద్రావస్థను సూచించునది.
ప్రాజ్ఞా త్మి కా – ప్రజ్ఞయే స్వ రూపముగా గలది.
తుర్యా – తుర్యా వస్థను సూచించునది.
సర్వా వస్థా వివర్జితా – అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.
సృష్టికర్త్రీ – సృష్టిని చేయునది.
బ్రహ్మ రూపా – బ్రాహ్మ ణ లక్షణము గల రూపము గలది.
గోప్త్రీ – గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది.
గోవిందరూపిణీ – విష్ణు మూర్తితో రూప సమన్వ యము కలది.
శ్లో కం 64
సంహారిణీ – ప్రళయకాలంలో సమస్త వస్తుజీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ
గావించి, లీనము చేసుకొనునది.
రుద్రరూపా – రుద్రుని యొక్క రూపు దాల్చింది.
తిరోధానకరీ – మఱుగు పరచుటను చేయునది.
ఈశ్వ రీ – ఈశ్వ రుని యొక్క శక్తిరూపములో ఉండునది.
సదాశివా – సదాశివ స్వ రూపిణి.
అనుగ్రహదా – అనుగ్రహమును ఇచ్చు నది.
పంచకృత్య పరాయణా – సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు
కృత్య ముల యందు ఆసక్తి కలది.
శ్లో కం 65
భానుమండల మధ్య స్థా – సూర్య మండలములో కేంద్రము వద్ద ఉండునది.
భైరవీ – భైరవీ స్వ రూపిణి.
భగమాలినీ – వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది.
పద్మా సనా – పద్మ మును నెలవుగా కలిగినది.
భగవతీ – భగశబ్ద స్వ రూపిణి.
పద్మ నాభ సహోదరీ – విష్ణు మూర్తి యొక్క సహోదరి.
శ్లో కం 66
ఉన్మే షనిమిషోత్ప న్న విపన్న భువనావళి – తెరువబడుటతోను, మూయబడుటతోను
పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది.
సహస్రశీర్షవదనా – వెయ్యి లేదా అనంతమైన శిరస్సు లతో, ముఖములు కలది.
సహస్రాక్షీ – వెయ్యి లేదా అనంతమైన కన్ను లు కలది
సహస్రపాత్ – అనంతమైన పాదములు కలది.
శ్లో కం 67
ఆ బ్రహ్మ కీటజననీ – బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి.
వర్ణా శ్రమ విధాయినీ – వర్ణములను, ఆశ్రమములను ఏర్పా టు చేయునది.
నిజాజ్ఞా రూపనిగమా – తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు
అయినది.
పుణ్యా పుణ్య ఫలప్రదా – మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన
ఫలములను చక్క గా ఇచ్చు నది.
శ్లో కం 68
శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా – వేదములనెడు స్త్రీలయొక్క
పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిఅన్ పాదపద్మ ము యొక్క ధూళిని
కలిగినది.
సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికా – అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్య పు
చిప్ప లచే చక్క గా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్య ము.
శ్లో కం 69
పురుషార్థప్రదా – పురుషునకు కావలసిన ప్రయోజనములను చక్క గా ఇచ్చు నది.
పూర్ణా – పూర్ణురాలు.
భోగినీ – భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చు నది.
భువనేశ్వ రీ – చతుర్దశ భువనములకు అధినాథురాలు.
అంబికా – తల్లి.
అనాదినిధనా – ఆది, అంతము లేనిది.
హరిబ్రహ్మేంద్ర సేవితా – విష్ణు వు చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత
సేవింపబడునది.
శ్లో కం 70
నారాయణీ – నారాయణత్వ లక్షణము గలది.
నాదరూపా – నాదము యొక్క రూపము అయినది.
నామరూపవివర్జితా – పేరు, ఆకారము లేనిది
హ్రీంకారీ – హ్రీంకార స్వ రూపిణి.
హ్రీమతీ – లజ్జా సూచిత బీజాక్షర రూపిణి.
హృద్యా – హృదయమునకు ఆనందము అయినది.
హేయోపాదేయవర్జితా – విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.

లలితా సహస్ర నామములు- 301-400


శ్లో కం 70
నారాయణీ – నారాయణత్వ లక్షణము గలది.
నాదరూపా – నాదము యొక్క రూపము అయినది.
నామరూపవివర్జితా – పేరు, ఆకారము లేనిది
హ్రీంకారీ – హ్రీంకార స్వ రూపిణి.
హ్రీమతీ – లజ్జా సూచిత బీజాక్షర రూపిణి.
హృద్యా – హృదయమునకు ఆనందము అయినది.
హేయోపాదేయవర్జితా – విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.
శ్లో కం 71
రాజరాజార్చి తా – రాజులకు రాజులైన వారిచేత అర్చింపబడునది.
రాజ్ఞఈ – రాణి.
రమ్యా – మనోహరమైనది.
రాజీవలోచనా – పద్మ ములవంటి కన్ను లు కలది.
రంజనీ – రంజింప చేయునది లేదా రంజనము చేయునది.

ణీ
రమణీ – రమింపచేయునది.
రస్యా – రస స్వ రూపిణి.
రణత్కింకిణి మేఖలా – మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన మొలనూలు లేదా
వడ్డా ణము గలది.
శ్లో కం 72
రమా – లక్ష్మీ దేవి.
రాకేందువదనా – పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది.
రతిరూపా – ఆసక్తి రూపమైనది.
రతిప్రియా – ఆసక్తి యందు ప్రీతి కలది.
రక్షాకరీ – రక్షించునది.
రాక్షసఘ్నీ – రాక్షసులను సంహరించునది.
రామా – ఎప్పు డూ సంతోషంగా, క్రీడాత్మ కంగా వుండేది.
రమణ లంపటా – రమణునితో అత్యంత సాన్ని హిత్య , సామ్య సంబంధము గలది.
శ్లో కం 73
కామ్యా – కోరదగినటువంటిది.
కామకళారూపా – కామేశ్వ రుని కళయొక్క రూపమైనది.
కదంబకుసుమప్రియా – కడిమి పువ్వు లయందు ప్రేమ కలిగినది.
కళ్యా ణీ – శుభ లక్షణములు కలది.
జగతీకందా – జగత్తుకు మూలమైనటువంటిది.
కరుణా రససాగరా – దయాలక్షణానికి సముద్రము వంటిది.
శ్లో కం 74
కళావతీ -కళా స్వ రూపిణీ.
కలాలాపా – కళలను ఆలాపనా స్వ రూపముగా కలిగినది.
కాంతా – కామింపబడినటువంటిది.
కాదంబరీ ప్రియా – పరవశించుటను ఇష్టపడునది.
వరదా – వరములను ఇచ్చు నది.
వామనయనా – అందమైన నేత్రములు గలది.
వారుణీమదవిహ్వ లా – వరుణ సంబంధమైన పరవశత్వ ము చెందిన
మనోలక్షణము గలది.
శ్లో కం 75
విశ్వా ధికా – ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు.
వేదవేద్యా – వేదముల చేత తెలియదగినది.
వింధ్యా చలనివాసినీ – వింధ్య పర్వ త ప్రాంతమున నివాసము గలది.
విధాత్రీ – విధానమును చేయునది.
వేదజననీ – వేదములకు తల్లి.
విష్ణు మాయా – విష్ణు మూర్తి యొక్క మాయా స్వ రూపిణి.
విలాసినీ – వినోదాత్మ క, క్రీడాత్మ క లక్షణము గలది.
శ్లో కం 76
క్షేత్రస్వ రూపా – క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వ రూపంగా నుండునది.
క్షేత్రేశీ – క్షేత్రమునకు అధికారిణి.
క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ – స్థూ లభాగమైన దేహమును, సూక్ష్మ భాగమైన దేహిని
పాలించునది లేదా రక్షించునది.
క్షయవృద్ధివినిర్ము క్తా – తరుగుదల, పెరుగుదల లేనిది.
క్షేత్రపాల సమర్చి తా – క్షేత్రపాలకులచే చక్క గా అర్చింపబడునది.
శ్లో కం 77
విజయా – విశేషమైన జయమును కలిగినది.
విమలా – మలినములు స్పృశింపనిది.
వంద్యా – నమస్క రింపతగినది.
వందారుజనవత్స లా – నమస్క రించు శీలము గల జనుల యందు వాత్స ల్య ము
గలది.
వాగ్వా దినీ – వాక్కు లను చక్క గా వ్య క్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు పరావాగ్దేవత.
వామకేశీ – వామకేశ్వ రుని భార్య .
వహ్ని మండవాసినీ – అగ్ని ప్రాకారమునందు వసించునది.
శ్లో కం 78
భక్తిమత్క ల్ప లతికా – భక్తికలవారిపట్ల కల్ప వృక్షపు తీగవంటిది.
పశుపాశ విమోచనీ – వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తు లను
చేయునది.
సంహృతాశేషపాషండా – సంహరింపబడిన సకలమైన పాషడులు కలది.
సదాచారప్రవర్తికా – సంప్రదాయబద్దమైన, శ్రోత్రీయ మార్గము ననుసరించి
యుండునట్లు ప్రవర్తింప చేయునది.
శ్లో కం 79
తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా – ఆధ్యా త్మి క, అధిభౌతిక, అధిదైవిక
తాపములనెడి అగ్ని చేత తపింప చేయబడిన వారలకు మిక్కి లి సంతోషమును
కలుగజేయునట్టి వెన్నె ల వంటిది.
తరుణీ – ఎప్పు డు తరుణ వయస్సు , అనగా ఒకేరీతి యౌవనము గలది.
తాపసారాధ్యా – తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది.
తనుమధ్యా – కృశించిన అనగా సన్న ని కటి ప్రదేశము అనగా నడుము గలది.
తమో పహా – చీకటిని లేదా అజ్ఞా నమును పోగొట్టునది.
శ్లో కం 80
చితిః – కూర్పు , జ్ఞా నబిందు సమీకరణ.
తత్ప దలక్ష్యా ర్థా – తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్య ము యొక్క ప్రయోజనముగా
నున్న ది.
చిదేకరసరూపిణీ – జ్ఞా నచైతన్య మే ఒకే ఒక రసముగా లేదా సర్వ సారముగా
స్వ రూపముగా గలది.
స్వా త్మా నంద లవీభూత బ్రహ్మా ద్యా నంద సంతతిః – తనకు సంబంధించిన
ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మా నందము, ప్రజాపతి ఆనందము – మొదలైన
ఆనందముల సమూహము గలది.
శ్లో కం 81
పరా – పరాస్థితిలోని వాగ్రూపము.
ప్రత్య క్చి తీరూపా – స్వ స్వ రూపము యొక్క జ్ఞా నమే స్వ రూపముగా గలది.
పశ్యంతీ – రెండవస్థితిగా వ్య క్తం కాబోయే వాక్కు
పరదేవతా – పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మ రూపము.
మధ్య మా – పశ్యంతీ, వైఖరీ వాక్కు లకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు .
వైఖరీరూపా – స్ప ష్టముగా వ్య క్తమైన వాక్కు .
భక్తమానసహంసికా – భక్తు ల యొక్క , మనస్సు లందు విహరించు ఆడు హంస.
శ్లో కం 82
కామేశ్వ రప్రాణనాడీ – శివుని ప్రాణనాడీ స్వ రూపిణి.
కృతజ్ఞా – చేయబడే పనులన్నీ తెలిసింది.
కామపూజితా – కామునిచే పూజింపబడునది.
శృంగారరససంపూర్ణా – శీర్షములతోను, కోణములచేతను, నవరసాదినావముల
చేతను కూడి నిండుగా ఉంది.
జయా – జయస్వ రూపిణి.
జాలంధరస్థితా – జాలంధరసూచిత స్థా నము నందున్న ది.
శ్లో కం 83
ఓడ్యా ణపీఠనిలయా – ఓడ్యా ణ పీఠమునందు ఉంది.
బిందుమండలవాసినీ – బిందువును పరివేష్టించి యుండు స్థా నమున
వసించునది.
రహోయాగక్రమారాధ్యా – ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా
ఆరాధింపబడునది.
రహస్తర్ప ణతర్పి తా – రహస్య ముగా చేయు తర్ప ణములచే తృప్తి చెందునది.
శ్లో కం 84
సద్యఃప్రసాదినీ – తక్షణములోనే అనుగ్రహించునది.
విశ్వ సాక్షిణీ – విశ్వ ములోని కృత్య ములకు ఒకే ఒక సాక్షి.
సాక్షివర్జితా – సాక్షి లేనిది.
షడంగదేవతాయుక్తా – ఆరు అంగదేవతలతో కూడి ఉంది.
షాడ్గుణ్య పరిపూరితా – ఆరు విధములైన గుణములచే పుష్క లముగా నిండి
యుండునది.
శ్లో కం 85
నిత్య క్లిన్నా – ఎల్లప్పు డూ దయార్ద్రతతో తడుపబడి యుండునది.
నిరుపమా – పోల్చి చెప్పు టకు ఉపమానము ఏమియు లేనిది.
నిర్వా ణసుఖదాయినీ – సర్వ నివృత్తి రూపమైన బ్రహ్మ పద ప్రాప్తి లేక మోక్ష
సంబంధమైన ఆనందమును ఇచ్చు నది.
నిత్యా షోడాశికారూపా – నిత్యా దేవతలగానున్న పదహారు కళల రూపము.
శ్రీకంఠార్థశరీరిణీ – శివుని సగము శరీరముగా నున్న ది.
శ్లో కం 86
ప్రభావతీ – వెలుగులు విరజిమ్ము రూపము గలది.
ప్రభారూపా – వెలుగుల యొక్క రూపము.
ప్రసిద్ధా – ప్రకృష్టముగా సిద్ధముగా నున్న ది.
పరమేశ్వ రీ – పరమునకు అధికారిణి.
మూలప్రకృతిః – అన్ని ప్రకృతులకు మూలమైనది.
అవ్య క్తా – వ్య క్తము కానిది.
వ్య క్తావ్య క్తస్వ రూపిణీ – వ్య క్తమైన, అవ్య క్తమైన అన్ని టి యొక్క స్వ రూపముగా
నున్న ది.
శ్లో కం 87
వ్యా పినీ – వ్యా పనత్వ లక్షణము కలది.
వివిధాకారా – వివిధములైన ఆకారములతో నుండునది.

ణీ
విద్యా విద్యా స్వ రూపిణీ – విద్య కు సంబంధించిన భాగమును, అవిద్య కు
సంబంధించిన భాగమును తన రూపముగా గలది.
మహాకామేశ నయనకుముదాహ్లాద కౌముదీ – మహాకామేశ్వ రుని కన్ను లనెడు
కలువపువ్వు లకు ఆనంద వికాసమును కలిగించు వెన్నె లవెల్లువ.

లలితా సహస్ర నామములు- 401-500


శ్లో కం 87
వ్యా పినీ – వ్యా పనత్వ లక్షణము కలది.
వివిధాకారా – వివిధములైన ఆకారములతో నుండునది.
విద్యా విద్యా స్వ రూపిణీ – విద్య కు సంబంధించిన భాగమును, అవిద్య కు
సంబంధించిన భాగమును తన రూపముగా గలది.
మహాకామేశ నయనకుముదాహ్లాద కౌముదీ – మహాకామేశ్వ రుని కన్ను లనెడు
కలువపువ్వు లకు ఆనంద వికాసమును కలిగించు వెన్నె లవెల్లువ.
శ్లో కం 88
భక్తహార్దతమోభేద భానుమద్భా ను సంతతిః – భక్తు ల హృదయగతమైన అంధకార
అజ్ఞా నమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్య కిరణ పుంజము.
శివదూతీ – శివుని వద్దకు పంపిన దూతిక.
శివారాధ్యా – శివునిచే ఆరాధింపబడునది.
శివమూర్తిః – శివునియొక్క స్వ రూపము.
శివంకరీ – శుభములు చేకూర్చు నది.
శ్లో కం 89
శివప్రియా – శివునికి ఇష్టమైనది.
శివపరా – శివుని పరమావధిగా కలిగినది.
శిష్టేష్టా – శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము గలిగినది.
శిష్టపూజితా – శిష్టజనుల చేత పూజింపబడునది.
అప్రమేయా – ప్రమాణము లేనిది; ప్రమాణములకు లొంగనిది.
స్వ ప్రకాశా – తనంతట తానే ప్రకాశించునది.
మనోవాచామగోచరా – మనస్సు చేత వాక్కు ల చేత గోచరము కానిది అనగా గ్రహింప
వీలుకానిది.
శ్లో కం 90
చిచ్ఛ క్తిః – చైతన్య శక్తి.
చేతనారూపా – చలించు తెలివి యొక్క రూపము.
జడశక్తిః – ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయు శక్తి.
జడాత్మి కా – జడశక్తి యొక్క స్వ రూపము.
గాయత్రీ – గానము చేసిన వారిని రక్షించునది.
వ్యా హృతిః – ఉచ్చ రింపబడి వ్యా ప్తి చెందునది.
సంధ్యా – చక్క గా ధ్యా నము చేయబడునది.
ద్వి జబృంద నిషేవితా – ద్వి జుల చేత నిశ్శే షముగా సేవింపబడునది.
శ్లో కం 91
తత్త్వా సనా – తత్ సంబంధమైన భావమే ఆసనముగా గలది.
తత్ – ఆ పరమాత్మ ను సూచించు పదము.
త్వ మ్‌– నీవు.
అయీ – అమ్మ వారిని సంబోధించు పదము.
పంచకోశాంతరస్థితా – ఐదు కోశముల మధ్య న ఉండునది.
నిస్సీ మ మహిమా – హద్దులు లేని మహిమ గలది.
నిత్య యౌవనా – సర్వ కాలములందును యవ్వ న దశలో నుండునది.
మదశాలినీ – పరవశత్వ ముతో కూడిన శీలము కలది.
శ్లో కం 92
మదఘూర్ణితరక్తా క్షీ – పరవశత్వ ము వలన తిరుగుటచే ఎర్రదనమును పొందిన
కన్ను లు గలది.
మదపాటల గండభూః – ఆనంద పారవశ్య ము వలన తెలుపు, ఎరుపుల సమిశ్ర
వర్ణములో ప్రకాంశించు చెక్కి ళ్లు కలది.
చందనద్రవదిగ్ధాంగీ – మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది.
చంపేయకుసుమప్రియా – సంపెంగ పుష్ప ములందు ప్రీతి కలది.
శ్లో కం 93
కుశలా – క్షేమము, కౌశల్య మును గలది.
కోమలాకారా – సుకుమారమైన లేదా మృదులమైన స్వ రూపము గలది.
కురుకుల్లా –
కులేశ్వ రీ – కులమార్గమునకు ఈశ్వ రి.
కులకుండలయా – కులకుండమును నిలయముగా గలది.
కులమార్గతత్ప రసేవితా – కౌలమార్గమును అనుసరించువారిచే సేవింపబడునది.
శ్లో కం 94
కుమార గణనాథాంబా – కుమారస్వా మికి, గణపతికి తల్లి అయినది.
తుష్టిః – తృప్తి, సంతోషముల రూపము.
పుష్టిః – సమృద్ధి స్వ రూపము.
మతిః – బుద్ధి
ధృతిః – ధైర్య ము.
శాంతిః – తొట్రుపాటు లేని నిలకడతనము గలది.
స్వ స్తిమతీ – మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము
గలది.
కాంతిః – కోరదగినది.
నందినీ = ఆనందిని అంటే ఆనందమును అనుభవించునది.
విఘ్న నాశినీ – విఘ్న ములను నాశము చేయునది.
శ్లో కం 95
తేజోవతీ – తేజస్సు కలది.
త్రినయనా – మూడు కన్ను లు కలది.
లోకాక్షీ కామరూపిణీ – స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము గలది.
మాలినీ – మాలికారూపము చెల్లునది. లేదా మాల గలది.
హంసినీ – హంసను (శ్వా సను) గలిగినది.
మాతా – తల్లి.
మలయాచలవాసినీ – మలయపర్వ మున వసించునది.
శ్లో కం 96
సుముఖీ – మంగళకరమైన ముఖము కలది.
నళినీ – నాళము గలిగినది.
సుభ్రూః – శుభప్రధమైన కనుబొమలు కలిగినది.
శోభనా – సౌందర్య శోభ కలిగినది.
సురనాయికా – దేవతలకు నాయకురాలు.
కాలకంఠీ – నల్లని కంఠము గలది.
కాంతిమతీ – ప్రకాశవంతమైన శరీరము కలది.
క్షోభిణీ – క్షోభింపచేయునది అనగా మథించునది.
సూక్ష్మ రూపిణీ – సూక్ష్మ శక్తి స్వ రూపిణి.
శ్లో కం 97
వజ్రేశ్వ రీ – వజ్రేశ్వ రీ నామంగల ఒక అతిరహస్య శక్తి.
వామదేవీ – అందముగా నున్న దేవత.
వయోవస్థా వివర్జితా – వయస్సు యొక్క ప్రభావం గాని అవస్థా ప్రభావం గాని లేనిది.
సిద్ధేశ్వ రీ – సిద్ధులకు అధికారిణి.
సిద్ధవిద్యా – సిద్ధిని ప్రసాదించు విద్యా రూపిణి.
సిద్ధమాతా – సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచునది.
యశస్వి నీ – యశస్సంపన్ను రాలు అనగా కీర్తిమంతురాలు.
శ్లో కం 98
విశుద్ధి చక్రనిలయా – విశుద్ధి చక్రములో వసించునది.
ఆరక్తవర్ణా – రక్తవర్ణములో నుండునది.
త్రిలోచనా – మూడు లోచనములు కలది.
ఖట్వంగాది ప్రహరణా – ఖట్వాంగాది ఆయుధములు ధరించునది.
వదనైక సమన్వి తా – ఒకే ఒక నోటితో సమన్వ యింపబడిన రూపము గలది.
శ్లో కం 99
పాయసాన్న ప్రియా – పాయసాన్న ములో ప్రీతి గలది.
త్వ క్ స్థా – చర్మ ధాతువును ఆశ్రయించి ఉండునది.
పశులోక భయంకరీ – పశుప్రవృత్తికి భయమును కలుగచేయునది.
అమృతాది మహాశక్తి సంవృతా – అమృతా మొదలైన మహాశక్తు లచేత
పరివేష్టింపబడి యుండునది.
ఢాకినీశ్వ రీ – ఢాకినీ అని పేరుగల విశుద్ధి చక్రాధిష్టా న దేవత.
శ్లో కం 100
అనాహతాబ్జ నిలయా – అనాహత పద్మ ములో వసించునది.
శ్యా మభా – శ్యా మల వర్ణములో వెలుగొందునది.
వదనద్వ యా – రెండు వదనములు కలది.
దంష్ట్రో జ్వ లా – కోరలతో ప్రకాశించునది.
అక్ష్మ మాలాదిధరా – అక్షమాల మొదలగు వాటిని ధరించి యుండునది.
రుధిర సంస్థితా – రక్త ధాతువును ఆశ్రయించి ఉండునది.
శ్లో కం 101
కాళరాత్ర్యా ది శక్త్వౌ ఘవృతా – కాళరాత్రి మొదలైన పన్నెండి మంది శక్తి దేవతలచే
పరివేష్టింపబడి యుండునది.
స్ని గ్థౌ దన ప్రియా – నేతితో తడిపిన అన్న ములో ప్రీతి కలది.
మహావీరేంద్ర వరదా – శ్రేష్ఠు లైన ఉపాసకులకు అవసరమైన వన్నీ
సమకూర్చు నది.
రాకిణ్యంబా స్వ రూపిణీ – రాకిణీ దేవతా స్వ రూపిణి.

శ్లో
శ్లో కం 102
మణిపూరాబ్జనిలయా – మణిపూర పద్మ ములో వసించునది.
వదనత్రయ సంయుతా – మూడు ముఖములతో కూడి యుండునది.
వజ్రాదికాయుధోపేతా – వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
డామర్యా దిభిరావృతా – డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే
పరివేష్టింపబడి యుండునది.
శ్లో కం 103
రక్తవర్ణా – ఎర్రని రక్త వర్ణంలో ఉండునది.
మాంసనిష్ఠా – మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది.
గుడాన్న ప్రీతమానసా – గుడాన్న ములో ప్రీతి కలది.
సమస్త భక్త సుఖదా – అన్ని రకముల భక్తు లకు అవసరమైన సుఖసంతోషాలను
ప్రసాదించునది.
లాకిన్యంబా స్వ రూపిణీ – లాకినీ దేవతా స్వ రూపముగా నున్న ది.
లలితా సహస్ర నామములు- 501-600
శ్లో కం 104
స్వా ధిష్ఠా నాంబుజగతా – స్వా ధిష్ఠా న పద్మ ములో వసించునది.
చతుత్వ క్త్ర మనోహరా – నాలుగు వదనములతో అందముగా నుండునది.
శూలాధ్యా యుధ సంపన్నా – శూలము మొదలైన ఆయుధములు ధరించి
యుండునది.
పీతవర్ణా – పసుపు పచ్చ ని రంగులో ఉండునది.
అతిగర్వి తా – మిక్కి లి గర్వంతో నుండునది.
శ్లో కం 105
మేదోనిష్ఠా – మేదస్సు ధాతువును ఆశ్రయించి యుండునది.
మధుప్రీతా – మధువులో ప్రీతి కలిగినది.
బందిన్యా ది సమన్వి తా – బందినీ మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి
ఉండునది.
దధ్య న్నా సక్త హృదయా – పెరుగు అన్నం ఇష్టపడునది.
కాకినీ రూపధారిణీ – కాకినీ పేరుగల దేవతగా రూపమును ధరించి ఉండునది.
శ్లో కం 106
మూలాధారాంభుజారూఢా – మూలాధార పద్మ ములో అధివసించునది.
పంచ వక్త్రా – ఐదు ముఖములతో నుండునది.
అస్థి సంస్థితా – ఎముకలను ఆశ్రయించి ఉండునది.
అంకుశాది ప్రహరణా – అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
వరదాది నిషేవితా – వరదా మొదలైన నలుగురు పరివార దేవతలచే
సేవింపబడునది.
శ్లో కం 107
ముద్గౌ దనాసక్తచిత్తా – పులగములో ప్రీతి కలది.
సాకిన్యంబా స్వ రూపిణీ – సాకినీ దేవతా స్వ రూపముగా నుండునది.
ఆజ్ఞా చక్రాబ్జనిలయా – ఆజ్ఞా చక్ర పద్మంలో వసించునది.
శుక్లవర్ణా – తెలుపురంగులో ఉండునది.
షడాసనా – ఆరు ముఖములు కలది.
శ్లో కం 108
మజ్జా సంస్థా – మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది.
హంసవతీ ముఖ్య శక్తి సమన్వి తా – హంసవతీ, క్షమావతీ ముఖ్య శక్తు లతో కూడి
ఉండునది.
హరిద్రాన్నై క రసికా – పచ్చ ని అన్న ములో మిక్కి లి ప్రీతి కలది.
హాకినీ రూపధారిణీ – హాకినీ దేవతా రూపమును ధరించి ఉండునది.
శ్లో కం 109
సహస్రదళ పద్మ స్థా – సహస్రార కమలములో ఉండునది.
సర్వ వర్ణోప శోభితా – అన్ని అక్షరాలు, అన్ని మంత్రాలు, వర్ణపటంలోని అన్ని
రంగులతో శోభిల్లునది.
సర్వా యుధ ధరా – అనంతమైన అన్ని రకముల ఆయుధములను ధరించి
ఉండునది.
శుక్ల సంస్థితా – శుక్ల ధాతువును చక్క గా ఆశ్రయించి ఉండునది.
సర్వ తోముఖీ – సర్వ తోముఖమైన ఏర్పా ట్లతో నుండునది.
శ్లో కం 110
సర్వౌ దన ప్రీత చిత్తా – అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీ కరించునది.
యాకిన్యంబా స్వ రూపిణీ – యాకినీ దేవతా స్వ రూపములో ఉండునది.
స్వా హా – చక్క గా ఆహ్వా నించునది.
స్వ ధా – శరీర ధారణ ప్రక్తియకు సంబంధించిన స్వా గత వచనము.
అమతిః – మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు శక్తి.
మేధా – ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుంది.
శ్రుతిః – చెవులతో సంబంధము కలిగినది.
స్మృతిః – మరల మరల గుర్తుకు తెచ్చు కొను లక్షణము.
అనుత్తమా – తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేనిది.
శ్లో కం 111
పుణ్య కీర్తి – మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది.
పుణ్య లభ్యా – సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కా ర్యా ల వలన పొందబడునది.
పుణ్య శ్రవణ కీర్తనా – పుణ్య ప్రథమైన వాక్కు లను వినుటకు, కీర్తనము చేయుటకు
అవకాశము కలుగజేయునది.
పులోమజార్చి తా – పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడింది.
బంధమోచనీ – అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది.
బంధురాలకా – అందమైన చిక్క నైన ముంగురులు కలది.
శ్లో కం 112
విమర్శ రూపిణీ – జ్ఞా న విశ్లేషణకు సంబంధించిన బిందుస్వ రూపము కలది.
విద్యా – జ్ఞా న రూపిణి.
వియదాది జగత్ప్ర సూ – ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును
సృజించునది.
సర్వ వ్యా ధి ప్రశమనీ – అన్ని విధములైన వ్యా ధులకు ఉపశమనము
కలుగజేయునది.
సర్వ మృత్యు నివారిణీ – సకల మృత్యు భయాలను పోగొట్టునది.
శ్లో కం 113
అగ్రగణ్యా – దేవతలందరిలో ముందుగా గణింపబడేది.
అచింత్య రూపా – చింతన ద్వా రా తెలుసుకొనుటకు అలవికానిది.
కలికల్మ షనాశినీ – కలియుగ మలినములను పోగొట్టునది.
కాత్యా యనీ – కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది.
కాలహంత్రీ – కాలమును హరించునది.
కమలాక్ష నిషేవితా – విష్ణు మూర్తిచే నిశ్శే షంగా సేవింపబడునది.
శ్లో కం 114
తాంబూల పూరితముఖీ – తాంబూలము చేత నిండి పండిన నోరు కలది.
దాడిమీ కుసుమప్రభా – దానిమ్మ పువ్వు ప్రభతో విరాజిల్లునది.
మృగాక్షీ – ఆడలేడి కన్ను లకు ఉండే లక్షణాలుగల కళ్ళు కలది.
మోహినీ – మోహనమును కలుగజేయునది.
ముఖ్యా – ముఖ్యు రాలు.
మృడానీ – మృడుని పత్ని .
మిత్రరూపిణీ – మిత్రుడని పిలువబడే సూర్యు ని రూపముగా ఉంది.
శ్లో కం 115
నిత్య తృప్తా – నిత్య సంతుష్టి స్వ భావము కలది.
భక్తనిధిః – భక్తు లకు నిధి వంటిది.
నియంత్రీ – సర్వ మును నియమించునది.
నిఖిలేశ్వ రీ – సమస్తమునకు ఈశ్వ రి.
మైత్ర్యా ది వాసనాలభ్యా – మైత్రి మొదలైన వాసనా చతుష్టయము గలవారిచే
పొందబడునది.
మహాప్రళయ సాక్షిణీ – మహాప్రళయ స్థితియందు సాక్షి భూతురాలుగా ఉండునది.
శ్లో కం 116
పరాశక్తిః – అన్ని శక్తు లకు అతీతంగా ఉండి, వాటన్ని టికీ నేపథ్యంలో వర్తించే శక్తి.
పరానిష్ఠా – సర్వాంతర్యా మిని సర్వ మునందు చూడగలుగు నిష్ఠను సూచించునది.
ప్రజ్ఞా న ఘనరూపిణీ – ఘనరూపం దాల్చి న ప్రజ్ఞా నం.
మాధ్వీ పానాలసా – మధుసంబంధిత పానము వలన అలసత్వ ము చెందినది.
మత్తా – నిత్య ము పరవశత్వ ములో ఉండునది.
మాతృకావర్ణరూపిణీ – అన్ని రంగులకు తల్లివంటి రంగు యొక్క రూపంలో
ఉండునది.
శ్లో కం 117
మహాకైలాస నిలయా – గొప్ప దైన కైలసమే నిలయముగా గలది.
మృణాల మృదుదోర్లతా – తామరతూడులవంటి మృదువైన బాహువులు గలది.
మహనీయా – గొప్ప గా ఆరాధింపబడునది.
దయామూర్తిః – మూర్తీభవించిన దయాలక్షణము గలది.
మహాసామ్రాజ్య శాలినీ – పరబ్రహ్మ కు చెందిన ఈ విశ్వ సామ్రాజ్య మునకు
అధినాయకురాలు.
శ్లో కం 118
ఆత్మ విద్యా – ఆత్మ కు సంబంధించిన విద్యా స్వ రూపురాలు.
మహావిద్యా – గొప్ప దైన విద్యా స్వ రూపురాలు.
శ్రీవిద్యా – శ్రీ విద్యా స్వ రూపిణి.
కామసేవితా – కాముని చేత సేవింపబడునది.
శ్రీ షోడశాక్షరీ విద్యా – సకల మంగళప్రదమైన పదహారు అక్షరాల మంత్రమునకు
సంబంధించిన విద్యా స్వ రూపిణి.
త్రికూటా – మూడు కూటములుగా ఉన్న మంత్ర స్వ రూపిణి.
కామకోటికా – కామమునకు పై అంచునగలదాని స్వ రూపిణి.
శ్లో కం 119
కటాక్షకింకరీ భూతకమలాకోటిసేవితా – అనుగ్రహ వీక్షణ మాత్రముచే భృత్యు లుగా
చేయబడిన శ్రీసతుల సమూహముచేత సేవింపబడునది.
శిరఃస్థితా – తలమిద పెట్టుకోవలసినది.
చంద్రనిభా – చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడు యుండినది.
ఫాలస్థా – ఫాల భాగమునందు ఉండునది.
ఇంద్రధనుఃప్రభా – ఇంద్రధనుస్సు లోని రంగుల కాంతులతో సమానమగు
కాంతులతో వెలుగొందునది.
శ్లో కం 120
హృదయస్థా – హృదయమునందు ఉండునది.
రవిప్రఖ్యా – సూర్యు నితో సమానమైన కాంతితో వెలుగొందునది.
త్రికోణాంతర దీపికా – మూడు బిందువులతో ఏర్ప డు త్రిభుజము యొక్క
మద్య మున వెలుగుచుండునది.
దాక్షాయణీ – దక్షుని కుమార్తె.
దైత్య హంత్రీ – రాక్షసులను సంహరించింది.
దక్షయజ్ఞవినాశినీ – దక్షయజ్ఞమును నాశము చేసినది.
లలితా సహస్ర నామములు- 601-700
శ్లో కం 121
దరాందోళితదీర్ఘా క్షీ – కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్ను లు గలది.
దరహాసోజ్జ్వ లన్ము ఖీ – మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.
గురుమూర్తిః – గురువు యొక్క రూపముగా నున్న ది.
గుణనిధిః – గుణములకు గని వంటిది.
గోమాతా – గోవులకు తల్లి వంటిది.
గుహజన్మ భూః – కుమారస్వా మి పుట్టుటకు తల్లి అయినది.
శ్లో కం 122
దేవేశీ – దేవతలకు పాలకురాలు.
దండనీతిస్థా – దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది.
దహరాకాశరూపిణి – హృదయములో ఉండు చోటు రూపముగ ఉండునది.
ప్రతిపన్ము ఖ్య రాకాంతతిథిమండల పూజితా – పాడ్య మి నుండి ముఖ్య మైన పౌర్ణమి
వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది.
శ్లో కం 123
కళాత్మి కా – కళల యొక్క రూపమైనది.
కళానాథా – కళలకు అధినాథురాలు.
కావ్యా లాపవినోదినీ – కావ్య ముల ఆలాపములో వినోదించునది.
సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా – వింజామరలను కలిగియున్న
ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీ దేవి చేత, సరస్వ తీదేవి చేత
సేవింపబడునది.
శ్లో కం 124
ఆదిశక్తిః – ప్రథమముగా నున్న శక్తి స్వ రూపిణి.
అమేయా – కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వ హించుటకు గాని అలవికానిది.
ఆత్మా – ఆత్మ స్వ రూపిణి.
పరమా – సర్వీ త్కృష్టమైనది.
పావనాకృతిః – పవిత్రమైన స్వ రూపము గలది.
అనేకకోటి బ్రహ్మాండజననీ – అనంతమైన సమూహములుగా నుండు
బ్రహ్మాండములకు తల్లి.
దివ్య విగ్రహా – వెలుగుచుండు రూపము గలది.
శ్లో కం 125
క్లీంకారీ – ‘ క్లీం ‘ అను బీజాక్షరమునకు కారణభూతురాలు.
కేవలా – ఒకే ఒక తత్వ మును సూచించునది.
గుహ్యా – రహస్యా తి రహస్య మైనది.
కైవల్య పదదాయినీ – మోక్షస్థితిని ఇచ్చు నది.
త్రిపురా – మూడు పురములను కలిగి ఉంది.
త్రిజగద్వంద్యా – మూడు లోకములచే పూజింపబడునది.
త్రిమూర్తిః – త్రిమూర్తులైన బ్రహ్మ , విష్ణు , రుద్రుల రూపములో ఉండునది.
త్రిదశేశ్వ రీ – దేవతలకు ఈశ్వ రి.
శ్లో కం 126
త్ర్య క్షరీ – మూడు అక్షరముల స్వ రూపిణి.
దివ్య గంధాడ్యా – దివ్య మైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పు నది.
సిందూర తిలకాంచితా – పాపటయందు సిందూర తిలకముచే ప్రకాశించునది.
ఉమా – ఉమా నామాన్వి తురాలు.మూడు లోకములచే పూజింపబడునది.
శైలేంద్రతనయా – హిమవత్ప ర్వ తము యొక్క కుమార్తె.
గౌరీ – గౌర వర్ణములో ఉండునది.
గంధర్వ సేవితా – గంధర్వు లచేత పూజింపబడునది.
శ్లో కం 127
విశ్వ గర్భా – విశ్వ మును గర్భ మునందు ధరించునది.
స్వ ర్ణగర్భా – బంగారు గర్భ ము గలది.
అవరదా – తనకు మించిన వరదాతలు లేనిది.
వాగధీశ్వ రీ – వాక్కు నకు అధిదేవత.
ధ్యా నగమ్యా – ధ్యా నము చేత పొందబడునది.
అపరిచ్ఛే ద్యా – విభజింప వీలులేనిది.
జ్ఞా నదా – జ్ఞా నమును ఇచ్చు నది.
జ్ఞా నవిగ్రహా – జ్ఞా నమును మూర్తిగా దాల్చింది.
శ్లో కం 128
సర్వ వేదాంత సంవేద్యా – అన్ని ఉపనిషత్తులచే చక్క గా తెలియబడునది.
సత్యా నంద స్వ రూపిణీ – నిత్య సత్య మైన ఆనందమును స్వ రూపముగా గలది.
లోపాముద్రార్చి తా – లోపాముద్రచే అర్చింపబడింది.
లీలాక్లు ప్త బ్రహ్మాండమండలా – క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే
బ్రహ్మాండముల సమూహము గలది.
శ్లో కం 129
అదృశ్యా – చూడబడనిది.
దృశ్య రహితా – చూడబడుటకు వేరే ఏమీలేని స్థితిలో ఉండునది.
విజ్ఞా త్రీ – విజ్ఞా నమును కలిగించునది.
వేద్య వర్జితా – తెలుసుకొనబడవలసినది ఏమీ లేనిది.
యోగినీ – యోగముతో కూడి ఉంది.
యోగదా – యోగమును ఇచ్చు నది.
యోగ్యా – యోగ్య మైనది.
యోగానందా – యోగముల వలన పొందు ఆనంద స్వ రూపిణి.
యుగంధరా – జంటను ధరించునది.
శ్లో కం 130
ఇచ్ఛా శక్తి జ్ఞా నశక్తి క్రియాశక్తి స్వ రూపిణీ – స్వే చ్ఛా సంకల్ప శక్తి, జ్ఞా నకారకమైన శక్తి,
కార్యా చరణ శక్తు ల స్వ రూపిణిగా ఉంది.
సర్వా ధారా – సమస్తమునకు ఆధారమైనది.
సుప్రతిష్ఠా – చక్క గా స్థా పించుకొనినది.
సదసద్రూపధారిణీ – వ్య క్తమైనదిగాను, వ్య క్తముకాని దానిగాను రూపమును
ధరించునది.
శ్లో కం 131.
అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రావిధాయినీ
ఏకాకినీ భూమరూపా నిర్ద్వై తా ద్వై త వర్జితా
అష్టమూర్తి: 8 రూపములు కలిగినది (పంచేంద్రియాలు, చిత్తము,
బుద్ధి,అహంకారము)
అజా : పుట్టుకలేనిది
జైత్రీ : సర్వ మును జయించినది
లోకయాత్రావిధాయినీ : లోకములను నియమించునది
ఏకాకినీ : ఏకస్వ రూపిణీ
భూమరూపా: భూదేవిరూపము ధరించునది
నిర్ద్వై తా : అద్వై తము కలిగినది (రెందవది అనునది లేకుండుట)
ద్వై త వర్జితా : ద్వై తభావము లేనిది
శ్లో కం 132.
అన్న దా వసుదా వృద్ధా బ్రహ్మ త్మై క్య స్వ రూపిణీ
బృహతి బ్రాహ్మ ణీ బ్రాహ్మీ బ్రహ్మా నందా బలిప్రియా
అన్న దా : సర్వ జీవులకు ఆహారము ఇచ్చు నది
వసుదా : సంపదలిచ్చు నది
వృద్ధా : ప్రాచీనమైనది
బ్రహ్మ త్మై క్య స్వ రుపినీ : ఆత్మ , పరమాత్మ ల ఐక్య స్వ రూపిణి
బృహతీ : అన్ని టికన్న పెద్దది
బ్రాహ్మ ణీ : బ్రహ్మ ఙ్ఞా న స్వ రూపిణీ
బ్రాహ్మీ : సరస్వ తీ
బ్రహ్మా నందా : బ్రహ్మా నందస్వ రూపిణీ
బలిప్రియా : బలి(త్యా గము) యందు ప్రీతి కలిగినది
శ్లో కం 133.
భాషారూపా బృహత్సే నా భావాభావ వివర్జితా
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభా గతి:
భాషారూపా : సమస్తభాషలు తన రూపముగా కలిగినది
బృహత్సే నా : గొప్ప సైన్య ము కలిగినది
భావాభావ వివర్జితా : భావము, అభావము రెండింటినీ లేనిది
సుఖారాధ్యా : సుఖులైనవారిచే (నిత్య తృప్తు లు) ఆరాధింపబడునది
శుభంకరీ : శుభములను కలిగినది
శోభనా : వైభవములను కలిగినది
సులభాగతి: తేలికగా చేరతగినది

శ్లో కం 134.
రాజరాజేశ్వ రీ రాజ్య దాయినీ రాజ్య వల్లభా
రాజత్కృపా రాజపీథ నివేశితనిజాశ్రితా
రాజరాజేశ్వ రీ : ఈశ్వ రుని హృదయేశ్వ రీ
రాజ్య దాయినీ : రాజ్య ములను ఇచ్చు నది
రాజ్య వల్లభా : రాజ్య మునకు అధికారిణీ
రాజత్కృపా : అధికమైన కరుణ కలది
రాజపీఠనిశేవితనిజాశ్రితా : తనను ఆశ్రయించినవారిని సింహాసనము పైన
కూర్చొండపెట్టునది

శ్లో కం 135
రాజ్య లక్ష్మి : కోశనాధా చతురంగబలేశ్వ రీ
సామ్రాజ్య దాయినీ సత్య సంధా సాగరమేఖలా
రాజ్య లక్ష్మి : రాజ్య లక్ష్మీ రూపిణీ
కోశనాధా : కోశాగారముకు అధికారిణీ
చతురంగబలేశ్వ రీ : చతురంగ బలాలకు (రధ, గజ, తురగ, పదాదులు) అధిపతి
సామ్రాజ్య దాయినీ : సామ్రాజ్య మును ఇచ్చు నది
సత్య సంధా : సత్య స్వ రూపిణి
సాగరమేఘలా : సముద్రములే వడ్డా ణముగా కలిగినది

శ్లో కం 136
దీక్షితా దైత్య శమనీ సర్వ లోకవశంకరీ
సర్వా ర్ధదాత్రీ సావిత్రీ సచ్చి దానందరూపిణీ
దీక్షితా : భక్తు లను రకించుట యెందు దీక్ష వహించినది
దైత్య శమనీ : రాక్షసులను సం హరించునది
లో లో
సర్వ లోకవశంకరీ : సమస్తలోకములను వశము చేసుకొనునది
సర్వా ర్ధదాత్రీ : కోరిన కోర్కె లన్ని టినీ తీర్చు నది
సావిత్రీ : గాయత్రీ మాత
సచ్చి దానందరూపిణీ : సత్,చిత్, ఆనందములే రూపముగా కలిగినది.

లలితా సహస్ర నామములు 701-800

శ్లో కం 137
దేశకాలాపరిచ్ఛి న్నా సర్వ గా సర్వ మోహినీ
సరస్వ తీ శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణీ
దేశకాలపరిచ్ఛి న్నా : దేశకాలములచే మార్పు చెందినది
సర్వ గా : సర్వ వ్యా పిని
సర్వ మోహినీ : అందరిని మోహింప చేయునది
సరస్వ తీ : విద్యా స్వ రూపిణి
శాస్త్రమయీ : శాస్త్రస్వ రూపిణి
గుహాంబా : కుమారస్వా మి తల్లి
గుహ్య రూపిణి : రహస్య మైన రూపము కలిగినది
శ్లో కం 138
సర్వో పాధి వినిర్ము క్తా సదాశివపతివ్రతా
సంప్రదాయేశ్వ రీ సాధ్వీ గురుమండలరూపిణీ
సర్వో పాధివినిర్ము క్తా : ఏరకమైన శరీరము లేనిది
సదాశివపతివ్రతా : శివుని భార్య
సంప్రదాయేశ్వ రీ : అన్ని సంప్రదాయములకు అధీశ్వ రి
సాధ్వీ : సాధుస్వ భావము కలిగినది
గురుమండలరూపిణీ : గురుపరంపరా స్వ రూపిణి

శ్లో కం 139
కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ
గణాంబా గుహ్య కారాధ్యా కోమలాంగీ గురుప్రియా
కులోత్తీర్ణా : సుషుమ్నా మార్గమున పైకిపోవునది
భగారాధ్యా : త్రికోణ యంత్రమును ఆరాధింపబడునది
మాయా : మాయాస్వ రూపిణీ
మధుమతీ : మధురమైన మనస్సు కలది (ఆనందస్వ రూపిణీ)
గణాంబా : గణములకు తల్లి
కుహ్య కారాధ్యా : గుహ్యా దులచే ఆరాధింపబడునది
కోమలాంగీ : మృదువైన శరీరము కలిగినది
గురుప్రియా : గురువునకు ప్రియమైనది
శ్లో కం 140
స్వ తంత్రా సర్వ తంత్రేశే దక్షిణామూర్తి రూపిణీ
సనకాది సమారాధ్యా శివఙ్ఞా న ప్రదాయినీ
స్వ తంత్రా : తన ఇష్టప్రకారము ఉండునది
సర్వ తంత్రేశీ : తాను ఉపదేసించిన తంత్రమునకు తానె దేవతైయున్న ది
దక్షిణామూర్తిరూపిణీ : దక్షిణామూర్తి రూపము ధరించినది
సనకాది సమారాధ్యా : సనక, సనంద, సనత్కు మార, సనత్ సుజాత సనాతనులు
అను దేవఋషులచే ఆరాధింపబడునది
శివఙ్ఞా నప్రదాయినీ : ఆత్మ ఙ్ఞా నమును ఇచ్చు నది
శ్లో కం 141
చిత్క ళానందకలికా ప్రేమరూపా ప్రియంకరీ
నామపారాయణాప్రీతా నందివిద్యా నటేశ్వ రీ
చిత్క ళానందకలికా : ఙ్ఞా నము, ఆనందము అను జ్యో తిస్వ రూపిణీ
ప్రేమరూపా : ప్రేమమూర్తి
ప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునది
నామపారాయణప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి
కలిగినది
నందివిద్యా : అమ్మ వారికి సంబందించిన ఓక మంత్ర విశేషము
నటేశ్వ రీ : నటరాజు యొక్క శక్తి
శ్లో కం 142
మిధ్యా జగదధిష్తా న ముక్తిదా ముక్తిరూపిణీ
లాస్య ప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా
మిధ్యా జగదధిష్టా నా : మాయాజగత్తునందు చైతన్య రూపిణియై యుండునది
ముక్తిదా : విముక్తి నిచ్చు నది
ముక్తిరూపిణీ : మోక్షరూపిణీ
లాస్య ప్రియా : లలితమైన నృత్య మునందు ప్రీతి కలిగినది
లయకరీ : జగత్తును లయము చేయునది
లజ్జా : లజ్జా స్వ రూపిణీ
రంభాదివందితా : రంభ మొదలగు అప్స రసలచే నమస్కా రములు
అందుకొనునది
శ్లో కం 143
భవదావసుధావృష్టి: పాపారణ్య దవానలా
దౌర్భా గ్య తూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా
భవదావసుధావృష్టి: జన్మ పరంపరలు అను దావాగ్ని ని చల్లా ర్చు టకు
అమృతవర్షము వంటిది
పాపారణ్య దవానలా : పాపములు అనెడి అరణ్య మునకు కార్చి చ్చు వంటిది
దౌర్భా గ్య తూలవాతూలా : దారిద్ర్య ము, దురదృష్టము అనెడి పక్షి ఈకలకు
హోరుగాలి వంటిది
జరాధ్వాంతరవిప్రభా : ముసలితనమనే చీకటికి సూర్య కాంతి వంటిది
శ్లో కం 144
భాగ్యా బ్ధిచంద్రికా భక్తచిత్తకేకి ఘనాఘనా
రోగపర్వ తదంభొళి ర్మృత్యు దారుకుఠారికా
భాగ్యా బ్ధిచంద్రికా : సంపద అనెడి సముద్రమునకు వెన్నె ల వంటిది
భక్తచిత్తకేకిఘనాఘనా : భక్తు ల మనస్సు లు అనే నెమళ్ళ కు వర్షా కాలపు మేఘము
వంటిది
రోగపర్వ తదంభొళి : పర్వ తములవంతి రోగములకు వజ్రాయుధము వంటిది
ర్మృత్యు దారుకుఠారికా : మృత్యు వనెడి వృక్షమునకు గొడ్డలి వంటిది
శ్లో కం 145
మహేశ్వ రీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా
అపర్ణా చండికా చండముండాసుర నిషూదిని
మహేశ్వ రీ : మహేశ్వ రుని ప్రియురాలు
మహాకాళీ : కాళికా దేవి రూపము దాల్చి నది
మహాగ్రాసా : అధికమైన ఆహారమును కోరునది
మహాశనా : లయకారిణి
అపర్ణా : పార్వ తీ దేవి
చండికా : చండికాస్వ రూపిణి
చండముండాసుర నిషూదిని : చండుడు, ముండుడు అను రాక్షసులను
సమ్హ రించినది
శ్లో కం 146
క్షరాక్షరాత్మి కా సర్వ లోకేశీ విశ్వ ధారిణీ
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మి కా
క్షరాక్షరాత్మి కా : నశించునట్టి జగత్తు, శాశ్వ తమైన చిన్మ య తత్వ ము రెండూను
తానె రూపంగా ఐనది
సర్వ లోకేశీ : అన్ని లొకములకు అధీశ్వ రి
విశ్వ ధారిణీ : విశ్వ మును ధరించినది
త్రివర్గదాత్రీ : దర్మ , అర్ధ, కామములను ఇచ్చు నది
సుభగా : సౌభాగ్య వతి
త్ర్యంబకా : మూడు కన్ను లు కలది
త్రిగుణాత్మి కా : సత్వ , రజో, తమో గుణములను ఇచ్చు నది.
శ్లో కం 147
స్వ ర్గా పవర్గదా శుద్ధా జపాపుష్ప నిభాకృతి:
ఓజోవతీ ద్యు తిధరా యఙ్ఞరూపా ప్రియవ్రతా
స్వ ర్గా పవర్గదా : స్వ ర్గమును, మోక్షమును కూడా ఇచ్చు నది
శుద్ధా : పరిశుద్ధమైనది
జపాపుష్ప నిభాకృతి: : జపాపుష్ప ములవలె ఎర్రని ఆకృతి కలది
ఓజోవతీ : తేజస్సు కలిగినది
ద్యు తిధరా : కాంతిని ధరించినది
యఙ్ఞరూపా : యఙ్ఞము రూపముగా కలిగినది
ప్రియవ్రతా : ప్రియమే వ్రతముగా కలిగినది
శ్లో కం 148
దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమ ప్రియా
మహతీ మేరునిలయా మందార కుసుమప్రియా
దురారాధ్యా ; కష్ట సాధ్య మైన ఆరాధన కలిగినది
దురాధర్షా : చుచూటకు కష్ట సాధ్య మైనది
పాటలీ కుసుమప్రియా : పాటలీపుష్ప మునందు ప్రీతి కలిగినది
మహతీ : గొప్ప దైనది
మేరునిలయా : మేరుపర్వ తము నివాసముగా కలిగినది
మందారకుసుమప్రియా : మందారపువ్వు లు అంటే ప్రీతి కలిగినది.

శ్లో కం 149
వీరారాధ్యా విరాద్రూపా విరజా విశ్వ తోముఖీ
ప్రత్య గ్రూపా పరాకాశా ప్రణదా ప్రాణరూపిణీ
వీరారాధ్యా : వీరులచే ఆరాధింపబదునది
విరాద్రూపా : అన్నింటికీ మూలమైనది
విరజా : రజోగుణము లేనిది
విశ్వ తోముఖీ : విశ్వం అంతటినీ ఒకేసారి చూడగల్గిన ముఖము కలిగినది
ప్రత్య గ్రూపా : నిరుపమానమైన రూపము కలిగినది
పరాకాశా : భావనామాత్రమైన ఆకాశ స్వ రూపిణి
ప్రణదా : సర్వ జగత్తుకూ ప్రాణము ను ఇచ్చు నది
ప్రాణరూపిణీ : జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది

శ్లో కం 150
మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్య స్తరాజ్య ధూ:
త్రిపురేశీ జయత్సే నా నిస్త్రైగుణ్యా పరాపరా
మార్తాండభైరవారాధ్యా : మార్తాండభైరవునిచే ఆరాధింపబడునది (శివుని యొక్క
ఒకరూపం మార్తాండభైరవుడు)
మంత్రిణీ : శ్యా మలాదేవి
న్య స్తరాజ్య ధూ: రాజ్యా ధికారము ఇచ్చు నది
త్రిపురేశీ : త్రిపురములకు అధికారిణి
జయత్సే నా : అందరినీ జయించగల సైన్య ము కలది
నిస్త్రైగుణ్యా : త్రిగుణాతీతురాలు
పరాపరా : ఇహము, పరము రెండునూ తానై యున్న ది
శ్లో కం 151
సత్య ఙ్ఞా నానందరూపా సామరస్యా పరాయణా
కపర్ధినీ కళామాలా కామధుక్ కామరూపిణీ
సత్య ఙ్ఞా నానందరూపా : సచ్చి దానందరూపిణీ
సామరస్యా పరాయణా : జీవుల యెడల సమరస భావముతో ఉండునది
కపర్ధినీ : జటాజూటము కలిగినది (జటాజూటధారీఇన శివునకు కపర్ధి అను పేరు
కలదు)
కళామాలా : కళల యొక్క సమూహము
కామధుక్ : కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది
కామరూపిణీ : కోరిన రూపము ధరించునది
లలితా సహస్ర నామములు 801-900
శ్లో కం 152
కళానిధి: కావ్య కళా రసఙ్ఞా రసశేవధి:
పుష్టా పురాతనా పూజ్యా పుష్క రా పుష్క రేక్షణా
కళానిధి: కళలకు నిధి వంటిది
కావ్య కళా : కవితారూపిణి
రసఙ్ఞా : సృష్టి యందలి సారము తెలిసినది
రసశేవధి: రసమునకు పరాకాష్ట
పుష్టా : పుష్ఠి కలిగించునది
పురాతనా : అనాదిగా ఉన్న ది
పూజ్యా : పూజింపదగినది
పుష్క రా : పుష్క రరూపిణి
పుష్క రేక్షణా : విశాలమైన కన్ను లు కలది.

శ్లో కం 153
పరంజ్యో తి: పరంధామ పరమాణు: పరాత్ప రా
పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదినీ
పరంజ్యో తి: దివ్య మైన వెలుగు
పరంధామ : శాశ్వ తమైన స్థా నము కలిగినది
పరమాణు: అత్యంత సూక్ష్మ మైనది

లో
పరాత్ప రా : సమస్తలోకములకు పైన ఉండునది
పాశహస్తా : పాశమును హస్తమున ధరించినది
పాశహంత్రీ : జీవులను సంసార బంధము నుంది విడిపించునది
పరమంత్ర విభేదినీ : శత్రువుల మంత్రప్రయోగములను పటాపంచలు
చేయునది

శ్లో కం 154
మూర్తా మూర్తా నిత్య తృప్తా ముని మానస హంసికా
సత్య వ్రతా సత్య రూపా సర్వాంతర్యా మినీ సతీ
మూర్తా మూర్తా : రూపం కలది, రూపం లేనిది రెందూ తానే ఐనది
నిత్య తృప్తా :ఎల్లప్పు దు తృప్తితో ఉండునది
మునిమానసహంసికా : మునుల మనస్సు లనెడి సరస్సు లందు విహరించెడి
హంసరూపిణి
సత్య వ్రతా : సత్య మే వ్రతముగా కలిగినది
సత్య రూపా : సత్య మే రూపముగా కలిగినది
సర్వాంతర్యా మినీ : సృష్టీ అంతటా వ్యా పించినది
సతీ : దక్షప్రజాపతి కూతురు, శివుని అర్ధాంగి ఐన సతీదేవి

శ్లో కం 155
బ్రహ్మా ణీ బ్రహ్మ జననీ బహురూపా బుధార్చి తా
ప్రసవిత్రీ ప్రచండాఙ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి:
బ్రహ్మా ణీ :సరస్వ తీ దేవి (బ్రహ్మ దేవుని భార్య )
బ్రహ్మ జననీ : బ్రహ్మ డేవుడిని సృస్టించినది
బహురూపా : సమస్త రూపములు తానై ఉన్న ది
బుధార్చి తా : ఙ్ఞా నులచే పూజింపబదునది
ప్రసవిత్రీ : జగజ్జనని
ప్రచండాఙ్ఞా : తీవ్రమైన ఆఙ్ఞ కలది
ప్రతిష్టా : కీర్తియే రూపముగా కలిగినది
ప్రకటాకృతి: బహిరంగమైన ఆకారము కలిగినది

శ్లో కం 156
ప్రాణేశ్వ రీ ప్రాణదాత్రీ పంచాశత్పీ ఠరూపిణీ
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్ర సూ:
ప్రాణేశ్వ రీ : ప్రాణములకు అధీశ్వ రి
ప్రాణదాత్రీ : ప్రాణములు ఇచ్చు నది
పంచాశత్పీ ఠరూపిణీ : శక్తిపీఠముల రూపమున వెలసినది
విశృంఖలా : యధేచ్ఛ గా ఉండునది
వివిక్తస్థా : ఏకాంతముగా ఉండునది
వీరమాతా : వీరులకు తల్లి
వియత్ప్ర సూ: ఆకాశమును సృష్టించినది

శ్లో కం 157
ముకుందా ముక్తినిలయా మూల విగ్రహ రూపిణీ
భావఙ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ

ముకుందా : విష్ణు రూపిణీ


ముక్తినిలయా : ముక్తికి స్థా నమైనది
మూలవిగ్రహరూపిణీ : అన్నింటికీ మూలమైనది
భావఙ్ఞా : సర్వ జీవుల మానసిక భావములను తెల్సి నది
భవరోగఘ్నీ : జన్మ పరంపర అను రోగమును పోగొట్టునది
భవచక్రప్రవర్తినీ : లోకచక్రమును నదిపించునడి

శ్లో కం 158
ఛంద: సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ
ఉదారకీర్తి రుద్దమవైభవా వర్ణరూపిణీ

ఛంద:సారా : వేదముల సారము


శాస్త్రసారా : వేదాంతాది సమస్త శాస్త్రముల సారము
మంత్రసారా : మంత్రముల యొక్క సారము
తలోదరీ : పలుచని ఉదరము కలిగినది
ఉదారకీర్తి : గొప్ప కీర్తి కలిగినది
రుద్దమవైభవా : అధికమైన వైభవము కలిగినది
వర్ణరూపిణీ : అక్షరరూపిణి
శ్లో కం 159
జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయినీ
సర్వో పనిషదుద్ఘుష్టా శాంత్య తీతకళాత్మి కా

జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయినీ : చావు, పుట్టుకలు, ముసలితనము


మొదలైన వాటితో బాధపడు జనులకు విశ్రాంతిని ఇచ్చు నది.
సర్వో పనిషదుద్ఘుష్టా : అన్ని ఉపనిషత్తులచే చాటిచెప్ప బడినది
శాంత్య తీతకళాత్మి కా : శాంతికంటే అతీతమైన చిదానందస్వ రూపిణి ( సంకల్ప ,
వికల్ప , రాగద్వే షములు లేని మానసిక స్థితి “శాంతి”, ఆనందము దానిని
మించినది)

శ్లో కం 160
గంభీరా గగనాంతస్తా గర్వి తా గానలోలుపా
కల్ప నారహితా కాష్ఠా కాంతా కాంతార్ధ విగ్రహ
గంభీరా : లోతైనది (అమ్మ ణ్ణి తత్వ ము తెల్సు కొనుట కష్టము)
గగనాంతస్తా : ఆకాశమునందు ఉండునది
గర్వి తా : గర్వ ము కలిగినది
గానలోలుపా : సంగీతమునందు ప్రీతి కలిగినది
కల్ప నారహితా : ఎట్టి కల్ప న లేనిది
కాష్ఠా : కాలపరిగణన లో అత్యంత స్వ ల్ప భాగము (రెప్ప పాటుకన్న తక్కు వ
సమయం)
కాంతా : కాంతి కలిగినది
కాంతార్ధ విగ్రహ : కాంతుడైన ఈశ్వ రునిలో అర్ధభాగము
శ్లో కం 161
కార్య కారణ నిర్ము క్తా , కామకేళి తరంగితా |
కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ

కార్య కారణ నిర్ము క్తా : కార్యా కరణములు లేని శ్రీ మాత


కామకేళీ తరంగితా : కోరికల తరంగముల యందు విహరించునది.
కనత్క నక తాటంకా : మనోహరమగు ధ్వ ని చేయు బంగారు చెవి కమ్మ లు కలది.
లీలావిగ్రహ ధారిణి : లీలకై అనాయాసముగా అద్భు త రూపములను ధరించునది.
శ్లో కం 162
అజాక్షయ వినిర్ము క్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ
అంతర్ము ఖసమారాధ్యా బహిర్ము ఖసుదుర్లభా
అజా : పుట్టుక లేనిది
క్షయ వినిర్ము క్తా : మాయాతేతమైనది
ముగ్ధా : 12 – 16 సంవత్స రముల బాలికా రూపము కలిగినది
క్షిప్రప్రసాదినీ : వెంటనే అనుగరించునది
అంతర్ము ఖసమారాధ్యా : అంతర్ దృష్టి గల యోగులచే ఆరాధింపబడునది
బహిర్ము ఖసుదుర్లభా : ప్రాపంచిక దృష్టి కలవారికి లభింపనిది.

శ్లో కం 163.
త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలినీ
నిరామయా నిరాలంబా స్వా త్మా రామా సుధాసృతి:
త్రయీ : వేదస్వ రూపిణి
త్రివర్గ నిలయా : ధర్మా ర్ధ కామములకు నిలయం ఐయ్న ది
త్రిస్థా : మూడు విధములుగా ఉండునది
త్రిపురమాలినీ : త్రిపురములను మాలికగా ధరించినది
నిరామయా : ఏ బాధలూ లేనిది
నిరాలంబా : ఆలంబనము అవసరము లేనిది
స్వా త్మా రామా : తన ఆత్మ యందే ఆనందించునది
సుధాసృతి: : అమృతమును కురిపించునది
శ్లో కం 164.
సంసారపంకనిర్మ గ్న సముద్ధరణ పండితా
యఙ్ఞప్రియా యఙ్ఞకర్త్రీ యజమాన స్వ రూపిణి
సంసారపంకనిర్మ గ్న : సముద్ధరణపండితా : సంసారము అను ఊబిలో
కూరుకొనిపొయిన జనలను ఉద్ధరించుటకు సామర్ధ్య ము కలిగినది.
యఙ్ఞప్రియా : యఙ్ఞములయందు ప్రీతి కలిగినది
యఙ్ఞకర్త్రీ : యఙ్ఞము చేయునది
యజమానస్వ రూపిణి : యఙ్ఞము చేయువారి స్వ రూపం తానై ఉన్న ది.
శ్లో కం 165.
ధర్మా ధారా ధనాధ్య క్షా ధనధాన్య వివర్ధినీ
విప్రప్రియా విప్రరూప విశ్వ భ్రమణకారిణీ
ధర్మా ధారా : ధర్మ మునకు ఆధారభూతమైనది
ధనాధ్య క్షా : సర్వ సంపదలకు అధికారిణి
ధనధాన్య వివర్ధినీ : ధనము, ధాన్య ము వర్ధిల్లచేయునది
విప్రప్రియా : వేదాధ్య యన సంపన్ను లైన వారియందు ప్రీతి కలిగినది
విప్రరూప : వేదవిదులైనవారి యెందు ఉండునది
విశ్వ భ్రమణకారిణీ : విశ్వ మును నడిపించునది

శ్లో కం 166.
విశ్వ గ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణు రూపిణీ
అయోని ర్యో నినిలయా కూటస్థా కులరూపిణీ
విశ్వ గ్రాసా : విశ్వ మే ఆహారముగా కలిగినది
విద్రుమాభా : పగడము వలె ఎర్రనైన కంతి కలిగినది
వైష్ణవీ : వైష్ణవీ దేవి రూపమున అవతరించినది
విష్ణు రూపిణీ : విష్ణు రూపమున జగత్తును రక్షించునది
అయోని: పుట్టుక లేనిది
యోనినిలయా : సమస్త సృష్టి కి జన్మ స్థా నము
కూటస్థా : మూలకారణ శక్తి
కులరూపిణీ : కుండలినీ రూపిణి
శ్లో కం 167.
వీరగోష్టేప్రియా వీరా నైష్క ర్మ్యా నాదరూపిణీ
విఙ్ఞా న కలానా కల్యా విదగ్ధా బైందవాసనా
వీరగోష్టేప్రియా : వీరభక్తు లు చేయు తీవ్రసాధన యెందు ప్రీతి కలిగినది
వీరా : వీరత్వ ము కలిగినది
నైష్క ర్మ్యా : కర్మ బంధము లేనిది
నాదరూపిణీ : ఓంకారస్వ రూపిణి
విఙ్ఞా న కలానా : విఙ్ఞా న స్వ రూపిణి
కల్యా : మూలకారణము
విదగ్ధా : గొప్ప సామర్ధ్య ము కలిగినది
బైందవాసనా : బిందువు ఆసనముగా కలిగినది

లలితా సహస్ర నామములు 901-1000


శ్లో కం 168.
తత్త్వా ధికా తత్త్వ మైయీ తత్త్వ మర్ధస్వ రూపిణీ
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ
తత్త్వా ధికా : సమస్త తత్వ ములకు అధికారిణి
తత్త్వ మైయీ : తత్వ స్వ రూపిణి
తత్త్వ మర్ధస్వ రూపిణీ : తత్ = అనగా నిర్గుణ నిరాకర స్వ రూపము , త్వం =
ప్రత్య గాత్మ , తత్+ త్వం స్వ రూపముగ ఉన్న ది
సామగానప్రియా : సామగానమునందు ప్రీతి కలిగినది
సౌమ్యా : సౌమ్య స్వ భావము కలిగినది
సదాశివకుటుంబినీ : సదాశివుని అర్ధాంగి
శ్లో కం 169.
సవ్యా పసవ్య మార్గస్థా సర్వా పద్వి నివారిణీ
స్వ స్థా స్వ భావమధురా ధీరా ధీరసమర్చి తా
సవ్యా పసవ్య మార్గస్థా : వామ, దక్షిణ మార్గములలో పూజింపబడునది
సర్వా పద్వి నివారిణీ : అన్ని ఆపదలను నివారించునది

స్వ స్థా : మార్పు లేకుండా ఉండునది


స్వ భావమధురా : సహజమైన మధురస్వ భావము కలది
ధీరా : ధైర్య ము కలది
ధీరసమర్చి తా : ధీరస్వ భావము కలవారిచే ఆరధింపబడునది

శ్లో కం 170.
చైతన్యా ర్ఘ్య సమారాధ్యా చైతన్య కుసుమప్రియా
సదొదితా సదాతుష్టా తరుణాదిత్య పాటలా

చైతన్యా ర్ఘ్య సమారాధ్యా : ఙ్ఞా నులచే పూజింపబడునది

ప్రీ
చైతన్య కుసుమప్రియా : ఙ్ఞా నము అనెడి పుష్ప ముల యెందు ప్రీతి కలిగినది
సదొదితా : సత్య స్వ రూపిణీ
సదాతుష్టా : ఎల్లప్పు డూ సంతొషముతో ఉండునది
తరుణాదిత్య పాటలా : ఉదయసూర్యు ని వంటి కాంతి కలిగినది

శ్లో కం 171.
దక్షిణా దక్షిణారాధ్యా దరస్మే రముఖాంబుజా
కౌలినీకేవలా నర్ఘ్య కైవల్య పదదాయినీ

దక్షిణా : దాక్షిణ్య ము కలిగినది


దక్షిణారాధ్యా : దక్షిణాచారముచే పొజింపబదుచున్న ది
దరస్మే రముఖాంబుజా : చిరునవ్వు తొ కూదిన ముఖపద్మ ము కలిగినది
కౌళినీ : కౌళమార్గమున ఉపాసించబదుచున్న ది
కేవలా : సమస్తమునకు తాను ఒక్క టియే మూలమైనది
అనర్ఘ్య కైవల్య పదదాయినీ : అత్యు త్తమమైన మోక్షము ప్రసాదించును
శ్లో కం 172.
స్తో త్రప్రియా స్తు తిమతే శ్రుతిసంస్తు తవైభవా
మనస్వి నీ మానవతీ మహేశే మంగాళాకృతి:
స్తో త్రప్రియా : స్తో త్రములు అనిన ఇస్టము కలిగినది
స్తుతిమతే : స్తుతించుట అనిన ఇస్టము కలిగినది
శ్రుతిసంస్తుతవైభవా : వేదములచేత స్తుతింపబడెడి వైభవము కలిగినది
మనస్వి నీ : మనస్సు కలిగినది
మానవతీ : అభిమానము కలిగినది
మహేశే : మహేశ్వ ర శక్తి
మంగాళాకృతి: మంగలప్రదమైన రూపము కలిగినది
శ్లో కం 173.
విశ్వ మాతా జద్ధా త్రీ విశాలాక్షీ విరాగిణీ
ప్రగల్భా పరమోదారా మరామోదా మనోమయీ
విశ్వ మాతా : విశ్వ మునకు తల్లి
జద్ధా త్రీ : జగత్తును రక్షించునది
విశాలాక్షీ : విశాలమైన కన్ను లు కలది
విరాగిణీ : దేనిథోనూ అనుభందము లేనిది
ప్రగల్భా : సర్వ సమర్ధురాలు
పరమోదారా : మిక్కి లి ఉదారస్వ భావము కలిగినది
మరామోదా : పరమానందము కలిగినది
మనోమయీ : మనశ్శే రూపముగా కలిగినది
శ్లో కం 174.
వ్యో మకెశే విమానస్థా వజ్రిణీ వామకేశ్వ రీ
పంచయఙ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ
వ్యో మకెశే : అంతరిక్షమే కేశముగా కలది
విమానస్థా : విమానము (సహస్రారము) నందు ఉండునది
వజ్రిణీ : వజ్రము ఆయుధముగా కలిగినది
వామకేశ్వ రీ : వామకేశ్వ రుని శక్తి
పంచయఙ్ఞప్రియా : నిత్య ము చేయు పంచయఙ్ఞములచే ప్రీతి చెందునది
పంచప్రేతమంచాధిశాయినీ : పంచప్రేతములచే ఏరడిన మంచముపై కూర్చు ని
ఉండునది.
శ్లో కం 175.
పంచమే పంచభూతేశే పంచసంఖ్యో పచారిణి
శాశ్వ తీ శాశ్వ తైశ్వ ర్యా శర్మ దా శంభుమోహినీ
పంచమే : పంచకృత్య పరాయణి
పంచభూతేశే : పంచభూతములను ఆఙ్ఞా పించునది
పంచసంఖ్యో పచారిణి : శ్రీవిద్యో పాసకులచే 5 విధములుగా ఆరధింపబడునది
శాశ్వ తీ : శాశ్వ తముగా ఉండునది
శాశ్వ తైశ్వ ర్యా : శాశ్వ తమైన ఐశ్వ ర్య ము కలది
శర్మ దా : ఓర్పు ను ఇచ్చు నది
శంభుమోహినీ : ఈశ్వ రుని మోహింపజేయునది
శ్లో కం 176.
ధరాధరసుతా ధన్యా ధర్మి ణీ ధర్మ వర్ధినీ
లోకాతీతా గుణాతీతా సర్వా తీతా శమాత్మి కా
ధరా : ధరించునది
ధరసుతా : సమస్త జీవులను తన సంతానముగా కలిగినది
ధన్యా : పవిత్రమైనది
ధర్మి ణీ : ధర్మ స్వ రూపిణి
ధర్మ వర్ధినీ : ధమమును వర్ధిల్ల చేయునది
లోకాతీతా : లోకమునకు అతీతమైనది
గుణాతీతా : గుణములకు అతీతమైనది
సర్వా తీతా : అన్ని టికీ అతీతురాలు
శమాత్మి కా : క్షమాగుణము కలిగినది

శ్లో కం 177.
బంధూకకుసుమప్రఖ్యా బాలాలీలావినోదినీ
సుమంగళి సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ
బంధూకకుసుమప్రఖ్యా : మంకెనపూలవంటి కాంతి కలిగినది
బాలా : 12 సంవత్స రముల లోపు బాలిక,,,,బాల
లీలావినోదినీ : బ్రహ్మాండములను సృస్టించు అను లీల యందు వినోదమును
కలిగినది
సుమంగళి : మంగళకరమైన రూపము కలిగినది
సుఖకరీ : సుఖమును కలిగించునది
సువేషాఢ్యా : మంచి వేషము కలిగినది
సువాసినీ : సుమంగళి
శ్లో కం 178.
సువాసిన్య ర్చ నప్రీతా శోభనా శుద్ధమానసా
బిందుతర్ప ణ సంతుష్టా పూర్వ జా త్రిపురాంబికా
సువాసిన్య ర్చ నప్రీతా : సువాసినులు చేయు అర్చ న యెందు ప్రీతి కలిగినది
శోభనా : శోభ కలిగినది
శుద్ధమానసా : మంచి మనస్సు కలిగినది
బిందుతర్ప ణ సంతుష్టా : అమృత బిందు తర్ప ణము చే సంతృప్తి పొందినది
పూర్వ జా : అనాదిగా ఉన్న ది
త్రిపురాంబికా : త్రిపురములందు ఉండు అమ్మ
శ్లో కం 179.
దశముద్రాసమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ
ఙ్ఞా నముద్రా ఙ్ఞా నగమ్యా ఙ్ఞా నఙ్ఞేయస్వ రూపిణీ
దశముద్రాసమారాధ్యా : 10 రకముల ముద్రలచే ఆరాధింపబదునది
త్రిపురా : త్రిపురసుందరీ
శ్రీవశంకరీ : సంపదలను వశము చేయునది
ఙ్ఞా నముద్రా : బొతనవ్రేలును చూపుడు వ్రేలితో కలిపి మిగిలిన 3వ్రేళ్ళ ను నిటారుగా
ఉంచుట
ఙ్ఞా నగమ్యా : ఙ్ఞా నము చే చేరదగినది
ఙ్ఞా నఙ్ఞేయస్వ రూపిణీ : ఙ్ఞా న చే తెలియబడు స్వ రూపము కలిగినది
శ్లో కం 180.
యోనిముద్రా త్రికండేశీ త్రిగుణాంబా త్రికోణగా
అనఘాద్భు త చారిత్రా వాంఛితార్ధప్రదాయినీ
యోనిముద్రా : యోగముద్రలలో ఓకటి
త్రికండేశీ : 3 ఖండములకు అధికారిణి
త్రిగుణా : 3 గుణములు కలిగినది
అంబా : అమ్మ
త్రికోణగా : త్రికోణమునందు ఉండునది
అనఘాద్భు త చారిత్రా : పవిత్రమైన అద్భు త చరిత్ర కలిగినది
వాంఛితార్ధప్రదాయినీ : కోరిన కోర్కె లు ఇచ్చు నది.
శ్లో కం 181.
అభ్యా సాతియఙ్ఞా తా షడధ్వా తీతరూపిణీ
అవ్యా జకరుణామూర్తి రఙ్ఞా నధ్వాంతదీపికా
అభ్యా సాతియఙ్ఞా తా : అభ్యా సము చేసిన కొలది బొధపడును
షడధ్వా తీతరూపిణీ : 6 మార్గములకు అతీతమైన రూపము కలిగినది
అవ్యా జకరుణామూర్తి : ప్రతిఫలాపేక్షలేని కరుణ కలిగినది
రఙ్ఞా నధ్వాంతదీపికా : అఙ్ఞా నమును అంధకారమునకు దీపము వంటిది
శ్లో కం 182.
ఆబాలగోపవిదితా సర్వా నుల్లంఘ్య శాసనా
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్ త్రిపురసుందరీ
ఆబాలగోపవిదితా : సర్వ జనులచే తెలిసినది
సర్వా నుల్లంఘ్య శాసనా : ఎవరునూ అతిక్రమించుటకు వెల్లులేని శసనము
కలిగినది
శ్రీచక్రరాజనిలయా : శ్రీ చక్రము నివాసముగా కలిగినది
శ్రీమత్ త్రిపురసుందరీ : మహా త్రిపుర సుందరి
శ్లో కం 183.
శ్రీశివా శివశక్తైక్య రూపిణీ లలితాంబికా

శ్రీశివా : సుభములను కల్గినది


శివశక్తైక్య రూపిణీ : శివశక్తు లకు ఏకమైన రూపము కలిగినది
లలితాంబికా : లలితానామమునా ప్రసిద్ధమైన జగన్మా త

ఏవం శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తో త్రం సంపూర్ణం .

StotraVeda.Com < Https://Www.Stotraveda.Com/>


Proudly powered by WordPress < https://wordpress.org/> .

You might also like