You are on page 1of 12

కశ్యపుని వంశవృక్షం

 కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ...
 కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మించారు. ...
 కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు.
 కశ్యపునికి కద్రు వ వలన నాగులు (పాములు) జన్మించారు. ...
 భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి ముని వలన అప్సరసలు జన్మించారు.
భూగోళంపై తూర్పు పడమర కలుపుతూ అడ్డంగా గీసిన ఊహా రేఖను అక్షాంశాలు అంటారు వీటిని లాటిట్యూడ్ అని
కూడా అంటారు భూగోళంపై ఉత్త ర దక్షిణ ధ్రు వ బిందువులను కలుపుతూ నిలువుగా గీసిన ఊహా రేఖను రేఖాంశాలు
అని లాంగిట్యూడ్ అని కూడా అంటారు అక్షాంశాలు అన్నియు వృత్తా లు అక్షాంశాలు అన్నిట్లో భూమధ్యరేఖ అది
పొ డవైనది ఈ ప్రాంతంలో భూమి చుట్టు కొలత 4007 కిలోమీటర్లు ఉంటుంది మిగతా అన్ని అక్షాంశాలు పో ను పో ను
తగ్గి ధ్రు వాల వద్ద బిందువుగా ఏర్పడుతుంది భూమధ్యరేఖ ఉత్త ర దక్షిణ వైపు వెళ్లే కొద్దీ అక్షాంశాలు చిన్నవిగా
కనిపిస్తా యి 90 డిగ్రీల వద్ద అక్షాంశము బిందువు లాగా ఉంటుంది భూమధ్యరేఖను ఈక్వేటర్ అని జీరో అక్షాంశం అని
గ్రేటర్ సర్కిల్ అని కూడా అంటారు భూమధ్యరేఖ భూగోళాన్ని రెండు అర్థ భాగాలుగా విభజిస్తుంది భూమధ్య రేఖకు
ఉత్త రం వైపున 90 రేఖలు దక్షిణం వైపున 90 రేఖలు మొత్తం కలిపి 181 రేఖలు ఉంటాయి అక్షాంశానికి అక్షాంశానికి
మధ్య 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ దీర్ఘ వృత్తా కార కక్షలో సూర్యుని
చుట్టూ 23.5 డిగ్రీల వంగి తిరుగుతుంది దీనివల్ల మన రుతువులు ఏర్పడుతున్నాయి రేఖాంశములు ఉత్త ర దక్షిణ
దృవాలను కలుపుతూ భూమధ్యరేఖను ఖండించుకుంటూ భూమికి నిలువుగా గీయబడిన ఊహారేకలను రేఖాంశాలు
అని అంటారు వీటినే లాంగిట్యూడ్ అని కూడా అంటారు భూమధ్యరేఖ చుట్టూ పూర్వార్త గోళంలో 180 మరియు
పశ్చిమార్థ గోళంలో 180 మొత్తం కలిపి 360 రేఖలుగా విభజించారు ఒక రేఖాంశ గల అన్ని ప్రదేశాలలో సూర్యోదయం,
మధ్యాహ్న, కాలము సూర్యాస్త మయం ఒకే సమయానికి ఉంటుంది జీరో డిగ్రీ రేఖాంశా ఇంగ్లాండ్ లోని గ్రీన్ విచ్
ప్రదేశం మీదుగా వెళుతుంది అందుకే దీనిని ప్రధాన రేఖాంశ అని ప్రైమ్ మెరీడియన్ అని కూడా అంటారు దీనినే
అంతర్జా తీయ దిన రేఖా అని కూడా అంటారు గ్రీన్ విచ్ రేఖకు తూర్పున ఉన్న రేఖలను తూర్పు రేఖాంశం అని
పడమర ఉన్న రేఖను పశ్చిమ రేఖాంశాలు అని అంటారు భూమి ఒక డిగ్రీ రేఖాంశ తిరగడానికి నాలుగు నిమిషాల
సమయం పడుతుంది. 15 డిగ్రీలకు ఒక కాలమండలంగా నిర్ణయించి ప్రపంచం మొత్తా న్ని 24 కాల మండలాల
విభజించారు రేఖాంశాలు ధ్రు వాల వద్ద కేంద్రకతమవుతాయి. రేఖాంశాలు పూర్ణ వృత్తా లు కావు అర్ధా లు భూమధ్యరేఖ
వద్ద రేఖాంశకు రేఖాంశకు మధ్య ఎక్కువగా ఉంటాయి.
ఖగోళ, గణిత, పంచాంగ సాధనా పద్ధ తులు (కంప్యుటేషన్స్) - విశ్లేషణ

ఆది నుండి విజ్ఞా నానికి నిలయం - భారతం. తర తరాలుగా వారసత్వ రూపేణ, పరంపరల ఫలస్వరూపంగానో
సాంప్రదాయ బధ్ధంగానో, శృతి, లేదా విభిన్న గ్రంధాల ద్వారానో విజ్ఞా న సంపద భావి తరాలకు
అందజేయబడుతున్నాయి. విద్యా శక్తి, మేధా శక్తి, ఇచ్చా, క్రియా శక్తు లు కాలనుగుణంగా ప్రవహిస్తూ నే ఉన్నాయి. ఈ
శక్తు ల సమన్వయీకరణ, మానవాళికి ఉపయుక్త సాధనంగా మారి, జీవన గమనం సులభసాధ్యం చేస్తూ , జీవిత
సాఫల్యానికి దో హదపడుతున్నాయి.

ఈ పరివ్యాప్త సంపదలలో శాస్త్ర, సిద్ధాంత, వేద, గ్రంధాదులే కాదు, సమస్త జన, వస్తు వులు నిక్షిప్త మై ఉన్నాయి. భారత
దేశ మేదా శక్తిని, ఔన్నత్యాన్ని చాటి, ప్రపంచానికి అందించిన, అదిస్తు న్న, అనేక జ్ఞా న, విజ్ఞా న, పరిజ్ఞా న విశేషాల
సమ్మేళనంతో - వాటి అర్ధమే కాక, భావార్ధం, నిగూఢ, నిక్షిప్త , పరమార్ధా లను విశ్లేషించి తదనుగుణ విషయాలను
సేకరించి, సమన్వయం చేసి ఈ విజ్ఞా న భారతీయం " శీర్షికలో ప్రస్తు తీకరిస్తు న్నాం.
చాణుక్యుడి కాలం ముందు (500 బీ సీ) నుండి, ఖగోళ గణిత శాస్త్రా ధ్యయనం చేయాలంటే - సంస్కృతం, వ్యాకరణం,
తర్కం, (లాజిక్) ప్రా ధమిక గణితం చదివి మంచి ప్రా వీణ్యం గడించి ఉండాలి. ఈ నాలుగు కీలక అంశాలు నేర్చుకోనిదే,
ఖగోళ శాస్త్రం (ఖగోళ గణిత శాస్త్రం) లో ప్రవేశం దుర్లభమే. సిధ్ధాంతాలు లోకానికి తెలియచేయడానికి చక్కని భాష
అవసరం. ఇంతేకాక గ్రంధాధ్యయనం చేయాలంటే వెరే దారి లేదు. భాషా పటిమ పెరగాలంటే వ్యాకరణం బాగా
వచ్చివుండాలి. తర్కం ఓ సమస్యని క్రమబద్ధ శైలిలో విశ్లేషించేందుకు దో హదపడుతుంది. గణితం చదివి ఉండటంతో
వివిధ గణాంక పద్ధ తులు ప్రయోగం చేసి సమస్యలను సాధన చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ చతుర్-క్షేత్రా లు
నేర్చుకోవాలన్న నియమం సూచించారు ప్రా చీన భారతీయ శాస్త్రవేత్త లు, వైజ్ఞా నికులు. ఈ పూర్వాకాంక్షిత పాత్రమైన
పాండిత్యం లేక పో తే ఖగోళ గణితం వైపు మొగ్గు చూపటం అనవసరమని కూడా కొందరు వైజ్ఞా నికులు (బ్రహ్మగుప్త ,
మధవాచార్య వంటి వారు) చెప్పారు.
విశ్వవిఖ్యాత ఖగోళ గణిత శాస్త్రవేత్త , "న్యూమరికల్ అనాల్సిస్" పితామహుడు, బ్రహ్మగుప్త (628 ఏ డీ లో) ఇలా
రాసారు – "సూర్యుడు తారల కాంతిని తన ప్రకాశంతో అధిగమించినట్లు మహాజ్ఞా ని పరిషత్తు లలో బీజగణిత సమస్యల
సాధనతో గణితవేత్త లు వెలుగొందుతారు. ఈ సమస్యలను పూర్ణిస్తే ఇంకా ప్రజ్వలమానమవుతాడు" అని. నేటి
గణితకారులు కూడా ఈ దృక్పదాన్ని సమర్దిస్తా రు. భారత శాస్త్రవేత్త లు యే ప్రా ధమికమైన గణితానికి ఎంత
ప్రా ధన్యతనిచ్చేరో దీనిద్వారా తెలుస్తోంది.
ఖగోళ, గణిత, పంచాంగ క్షేత్రా లకు ప్రా ధమికమైన, ముఖ్యమైన, ప్రభావాత్మకమైన సాధనా పద్ధతులూ, గణాంకాల
విశ్లేషణలు కొన్ని ఈ వ్యాసంలో ప్రస్తా వించబడ్డా యి. భారతీయ ఖగోళ, గణిత శాస్త్ర పరమైన గ్రంధాలు అపారమైనవి.
వీటిలోని అన్నీ అంశాలు, పద్ధతుల గురించి ఒక్క వ్యాసంలో చెప్పడం దుస్సాధ్యం. అనేక గ్రంధాలు
వెలువడించాల్సిందే. కొన్ని కీలక అంశాలు, పద్ధతులను సమీకరిస్తూ అవి ఈ క్షేత్ర రంగాలలో తెచ్చిన పరిణామాత్మక
మార్పులను వివరించే ప్రయత్నం ఈ వ్యాసం ఉద్దే శ్యం.
ప్రపంచానికి దిశామార్గం చూపిన భారతీయ ఖగోళ, గణిత శాస్త్రవేత్త లు, గ్రంధాలు
వివిధ భారతీయ గణిత సాధనా పద్ధతులు ప్రపంచ - గణిత, ఖగోళ, ఖగోళ గణిత రంగాలను పూర్తిగా మార్చేసాయి.
ఆయా క్షేత్రా లకు ఓ కొత్త దిశ, మార్గం రూపొందించాయి. మరి కొన్ని కొత్త క్షేత్రా లకు, అంశాలకు బీజం వేసి, స్థి ర రూపం
ప్రదానం చేశాయి. ఈ శాస్త్రా లలో ప్రా ధమిక సమస్యా పరిష్కరాలు చేసిన, ప్రశస్తి చెందిన మహత్త ర గ్రంధాలు:

శుల్బ సూత్రా లు (800 బీ సీ నుండి 300 బీ సీ) - వీటిలో విభిన్న జ్యామితీ శాస్త్ర (జామెట్రీ) సంబంద విషయాలు
పేర్కొనబడ్డా యి. ముఖ్య మైన శుల్బ సూత్రా లు - బౌధాయన శుల్బ సూత్రం, ఆపస్తంభ శుల్బ సూత్రం, కాత్యాయన
శుల్బ సూత్రం, మనవ శుల్బ సూత్రం, మైత్రేయ శుల్బ సూత్రం, వరాహ శుల్బ సూత్రం, వాధుల శుల్బ సూత్రం;
పాణిణి అష్టా ధ్యాయి; గణితానుయోగ; ప్రా ముఖ్యం చెందిన జైన ఖగోళ, విశ్వాంతరాళ, గణితశాస్త్ర సంబంద గ్రంధాలు -
సూర్యప్రజ్ఞా ప్తి , జంబూ ద్వీపప్రజ్ఞా ప్తి , భగవతి సూత్రం, ఉత్త రాధ్యయన సూత్రం; అనుయోగద్వార సూత్రం. సూర్య
సిద్ధాంతం వాటి భాష్యాలు; ఆర్యభట్ట ఆర్యభాటీయం; భాస్కరుడి - మహాభాస్కరీయం; లఘుభాస్కరీయం; బ్రహ్మగుప్త -
బ్రహ్మస్పుట సిద్ధాంతం; ఖండాకాధ్యాయక; మహావీరాచార్య గణిత సారసంగ్రహము; భాస్కరాచార్య - లీలావతి గణితం;
సిద్ధాంత శిరోమణి - ఈ విఖ్యాత గ్రంధం మీద వెలువడైన భాష్యాలు, టికలు - గణిత కౌముది (1350 ఏ డీ),
గణితామృతసార (1420 ఏ డీ.), బుద్ధి విలాసిని (1540 ఏ డీ), గణితామృత (1538 ఏ డీ), సూర్యప్రకాశ (1541 ఏ డీ), "
వాసన భాష్య " రంగనాథ (1573 ఏ డీ); బీజగణితం, గోళాధ్యాయ; గ్రహగణితం; త్రైశతిక; చయాగణితం; కాల శంకలిత;
దామోదర దృక్ గణిత స్ద్ధాంతం; కమలాకర భట్ట " సిద్ధాంత తత్త్వవివేక "; నీలకంట సో మయాజి - " తంత్ర సంగ్రహ ", "
గ్రహపరీక్ష కారణ "; ఉమాస్వతి తత్త్వార్థా ధిగమ సూత్ర; వారహమిహిర పంచసిద్ధాంతిక, శ్రీపతి సిద్ధాంత శేఖర, కర్న
కుతూహలం, గ్రహాగమ కుతూహలం, బ్రహ్మతుల్యం, సిద్ధాంత దర్పణ; జ్యేష్ఠ దేవ యుక్తిభాశ; అన్నంభట్ట
తర్కసంగ్రహము;బౌధాయన (800 బీ సీ) శుల్బ సూత్రం లో - " బౌధాయన సిద్ధాంతం " (ఇది నేడు పైతాగొరుస్ తీరం
గా కూడా వ్యవహారంలో ఉంది), వేదీల నిర్మాణాల విషయాలున్నాయి. ఈ గ్రంధంలోనే వేది (యజ్ఞా లకు ఉపయోగించే
చతురశ్రం) లో వలయం యెలా మలచాలో విశదంగా ప్రస్తా వించారు. ప్రపంచంలో తొలి సారిగా చతురశ్రంలో వృత్తం
యెలా నిర్మించాలన్న సూత్రా లు ప్రస్తా వించారు. మహావీరాచార్య (850 ఏ డీ) గణిత సార సంగ్రహంలో క్రమచయనం
(పెర్ముటేషన్స్), సంయోగాలకు (కాంబినేషన్స్) సంబంధిమిన సూత్రా వళి తొలిసారిగా ప్రపంచానికి అందించారు. అంతే
కాదు - "సంభావ్యత" సూత్రా లు ప్రతిపాదించారు. ఇది తరువాతి కాలంలో గణిత రంగంలో ఓ కొత్త శాఖగా ఏర్పడింది.
నేడు ఆంగ్లంలో దీన్ని " ప్రా బబిలిటీ తీరీ " గా వ్యవహరిస్తు న్నారు.
వటేశ్వర (880 ఏ డీ), శ్రీధరాచార్య (991 ఏ డీ), శ్రీపతి (1000 ఏ డీ), శతంద (1100 ఏ డీ) మరికొన్ని గణిత సంబంధ
గ్రంధాలు ప్రకటించారు. పరమేశ్వర (1430 ఏ డీ) ఆర్యభాటీయం మీద భాష్యం రాసి "భటదీపిక "రూపంలో
అందించారు. ఇవి కాక భాస్కర గ్రంధాల మీద" కర్మదీపిక", "సిద్ధాంతదీపిక "వివరణలు ప్రకటించారు. ఆ తరువాత
భాస్కరాచార్యుని లీలావతి గణితం పై వ్యాఖ్యానం వ్రా శారు. కేరళ ఖోగళ శాస్త్ర పరంపరలో వాసికెక్కిన ఇంకొన్ని ఖగోళ
గణిత గ్రంధాలు - "కారణపద్ధతి", "సద్రత్నమాల", "యుక్తిభాశ", "గణితయుక్తిభాశ". గోవిందస్వామి (800 – 850 ఏ
డీ), సూర్యదేవ, భాస్కరుని మహాభాస్కరీయం వ్యాఖ్యానాలు రచించారు. శంకరనారాయణ (869 ఏ డీ),
ఉదయదివాకర (1073 ఏ డీ), పరమేశ్వర లఘుభాస్కరీయం భాష్యాలు వ్రా శారు. మంజులాచార్య (950 ఏ డీ) "
లఘుమానస ", " బ్రహ్మమానస " అన్న కారణ గ్రంధాలను ప్రకటించారు. ఈ కారణ గ్రంధం విశేషం ఏమిటంటే ఇది "
ఆర్యపక్ష ", " అర్ధరాత్రికపక్ష " పద్ధతులను అనుసరించాయి. ప్రశస్తా ధర (958 ఏ డీ), సూర్యదేవ యజ్వన్ (1248 ఏ
డీ), పరమేశ్వర (1409 ఏ డీ) దీని మీద భాష్యాలు ప్రకటించారు.
తెలుగు నాట పావులూరి మల్ల న (1120 ఏ డీ) మహావీరాచార్య గణిత సార సంగ్రహం భాష్యం తెలుగులో వ్రా సి
తెలుగులో గణితశాస్త్రా ధ్యానికి నాందీ పలికేరు. యల్ల య్య (1482 ఏ డీ) " లఘుమానస " భాష్యం రాసేరు. మల్లికార్జు న
సూరి (1178 ఏ డీ) సూర్య సిద్ధాంతం భాష్యం తెలుగులో రచించారు; నరసిమ్హ (1500 ఏ డీ ప్రాంతం) కారణ గ్రంధం "
తిథి చక్ర " ప్రకటించారు; ఇది బాగా ప్రసిద్ధి చెంది, పంచాంగ గణితసాధనకు ఉపయోగించాడానికి వాడడం
మొదలుపెట్టే రు.
వీటన్నిటికీ మునుపు వాడకంలో ఉన్న పద్దెనిమిది సిద్ధాంతాలు విశ్వాంతరాళం, అందులోని గ్రహాల గూర్చి,
తదనుబంధ విషయాలు చెప్పాయి. అవి - సూర్య సిద్ధాంతం; సో మ సిద్ధాంతం; వశిష్ట సిద్ధాంతం; రోమక సిద్ధాంతం;
పౌలిస సిద్ధాంతం; బృహస్పతి సిద్ధాంతం; గర్గ సిద్ధాంతం; వ్యాస సిద్ధాంతం; పరాశర సిద్ధాంతం; భోజ సిద్ధాంతం; వరాహ
సిద్ధాంతం; బ్రహ్మస్ఫుట సిద్ధాంతం; సిద్ధాంత శిరోమణి; సుందర సిద్ధాంతం; తత్త్వవివేక సిద్ధాంతం; సార్వభౌమ
సిద్ధాంతం; లఘు ఆర్య సిద్ధాంతం; బృహదార్య సిద్ధాంతం.
ఖగోళ - గణిత కోవిదుడు పరమేశ్వర గ్రహణలను పరిశోదిస్తూ , 1393 ఏ డీ నుండి 1432 ఏ డీ వరకు రాత్రిళ్ళు
పరిశీలనలు చేసి లభించిన విషయాలతో తదనుగుణ " సంస్కరణలు" చేసి కొన్ని పద్ధతులను మెరుగు పరిచారు. ఈ
ధోరణినే అనుసరించారు ఆయన శిష్య, ప్రశిష్యులు. అచ్యుత పిశారతి (1550 - 1621 ఏ డీ) సూర్య చంద్ర గ్రహణాల
మీద " ఉపరాగక్రియాక్రమ " రూపంలో రాసారు. అదే రీతిలో నందగ్రా మ మిశ్ర (1730 - 1800 ఏ డీ) గ్రహణాలను
విశిదీకరిస్తూ , " గ్రహణ పద్ధతి " అన్న కారణ గ్రంధాన్ని వ్రా శారు. శంకర వారియార్ (1500-1560 ఏ డీ) " కారణసార "
అన్న ఖగోళ గణిత గ్రంధాన్ని రచించారు. దీని మీద చిత్రభాను (1530 ఏ డీ లో), అచ్యుత పిశారతి " కారణోత్త మ "
రూపంలో భాష్యాలు ప్రకటించారు. శంకర వారియార్ నీలకంట సో మయాజి "తంత్ర సంగ్రహం" మీద "లఘువివృత్తి "
రూపంలో భాష్య గ్రంధం ప్రకటించారు.
జ్ఞా నరాజ (1503 ఏ డీ), గొదావరి నదీ తీరంలోని పార్తపురంలో " సిద్ధాంత సుందర " గ్రంధాన్ని ప్రచురించారు. ఆయన
కుమారుడు చింతామణి (1530 ఏ డీ) ఈ గ్రంధంపై భాష్యం రాసారు. జ్ఞా నరాజ శిష్యుడు ధుందిరాజ (1541 ఏ డీ) అనేక
గణిత శాస్త్ర భాష్యాలు రాసారు. గణేశ దైవజ్ఞ (1507 ఏ డీ) "గ్రహలాఘవ " రచించారు. గణేశ రచించిన " బుద్ధి
విశాలిని", భాస్కరాచార్య లీలావతి గ్రంధం మీద భాష్యం. ఇది గణిత క్షేత్ర రంగంలో ప్రా మాణిక గ్రంధంగా ఉపయోగంలో
ఉంది.
సూర్య సిద్ధాంతం
తర తరాల పరీవ్యాప్త జ్ఞా న సంపదకు నిదర్శనం భారతం. ప్రపంచ ఇతిహాశంలో మరే ఇతర ఖగోళ గణిత గ్రంధం ఈ
ద్రంధమంత ప్రచురణ, ప్రా చుర్యం పొందలేదు. గత 1700 యేళ్ళలో అనేక వివరణ గ్రంధాలు, కారణ గ్రంధాలు, టికలు
ప్రకటించబడ్డా యి.
ఈ అతి విశిష్ట ఖగోళ గణిత ప్రధానమైన గ్రంధాన్ని - భటోట్పల (966 ఏ డీ), దివాకర (1606 ఏ డీ), కేశవ,
విజయనంది, చిత్రభాను, శ్రీ రంగనాథ, మకరంద, నరసిమ్హ స్వల్ప సవరణలతో, మెరుగులతో భాష్యాలు ప్రకటించారు.
భాస్కరాచార్య " సిద్ధాంత శిరోమణి " లో తాను సాధించిన కొన్ని ఫలితాలను, సూర్యసిద్ధాంతం లో పేర్కున్న కొన్ని
అంశాలను సమీకరించారు.
ఇవే కాక - తెలుగానువాధం మల్లికార్జు న సూరి చేయగా, చందేశ్వర, మదనపాల, పరమేశ్వర, యల్ల య, రామకృష్ణ
ఆరాధ్య (1472 ఏ డీ), భుధర (1572 ఏ డీ), తమ్మ యజ్వన్ (1599 ఏ డీ), రంగనాథ (1603 ఏ డీ), నరసిమ్హ (1611 ఏ
డీ), విశ్వనాధ (1628 ఏ డీ), కమలాకర (పదిహేడవ శతాబ్ధం), దదా బాయి (పద్దె నిమిదవ శతాబ్ధం) సూర్య సిద్ధాంతంపై
భాష్యాలు, వివరణలు, టికలు ప్రకటించారు. దదాపు పదిహేడు వందల సంవత్సరాలకుపైగా అవిచ్చినంగా
ఓ శాస్త్ర గ్రంధం ప్రమాణిక గ్రంధంగా మన్నన పొందడం ప్రపంచంలో మరెక్కడా తటస్థించలేదు. ఇలా మెరుగు
దిద్దు కుంటూ కాల ప్రవాహంలో అత్యంత ఉపయుక్త ఖగోళ, గణిత, పంచాంగ క్షేత్ర గ్రంధంగా నడుస్తూ వస్తోంది.

నేటికీ ఇది పరంపరాగత భారత శాస్త్రనిధిలో సుప్రసిద్ధ గ్రంధమే.


సూర్యసిద్ధాంతంలో జాతక నిర్ణయానికి ఉపయోగించే కొన్ని ప్రా ధమిక విషయాలు:
 మందఫల (ఈక్వేషన్ ఆఫ్ సెంటర్); మంద సంస్కారం - " ఎపీసైక్లిక్ మోడల్ " ఆధారంగా దీన్ని లెక్కిస్తా రు;
మందగ్రహ (మీన్ ప్లా నెట్); మధ్యమగ్రహ, మందోచ్చ మధ్య ఉన్న కోణం మందకేంద్రం; మందవృత్త పరిధి
(సర్కంఫరెన్స్ ఆఫ్ ఎపీ సైకిల్); (ఓ గ్రహం మందఫలానికి సవరణ చేబడితే దాన్ని " మందస్పుటగ్రహం "
అని అంటారు) శీఘ్రో చ్చ, శీఘ్రకేంద్ర, శీఘ్ర సంస్కార తదితరాలు.
 క్రాంతి వృత్త (ఎక్లిప్టిక్), క్షితిజ (సెలెస్టియల్ హొరైజన్); ఉదయ లగ్నం (అసండెంట్) - ఇది ఓ వ్యక్తి జాతకానికి
ముఖ్య అంశం. మిగతా గణాంకాలు ఈ లగ్న బిందువు మీద ఆధారపడి ఉంటాయి. దీనికి 180 డిగ్రీలకు
ఉన్నది "అష్ట లగ్నం " (డిసండెంట్); వేదాంగ జ్యోతిశం ప్రకారం "క్రాంతి వృత్త " కి మూలం 0 డిగ్రీ అశ్విణి
(బీటా ఏరిటిస్); ఇతర ముఖ్య అంశాలు
 "మధ్య లగ్న"; "పాతాల లగ్న"; శీగ్ర సంస్కారం; జ్యర్ధపిందక (సైన్ టేబుల్స్), ఉత్క్రమజ్యర్ధపిండక (వెర్సడ్
సైన్); జ్య,జివ, మౌరిక పర్యాయ జ్యర్ధ (సైన్) పదాలు; పరమపక్రమ / పరమక్రాంతి; పరిధి (ఎపీసైకిల్స్);
 అష్టక వర్గ పద్ధతి, షడ్ వర్గ వివరణాపటాలు, షడ్బల అంచనాల పద్ధతులు - ఇవి భారతీయ జ్యోతిష
పద్ధతులు, పాశ్చాత్త పద్ధతులలో లేవు. భారతీయ కుశల పద్ధ తులకు మరొక నిదర్శనం.
 గ్రహాల సంయోగ సమీకరణం; భుజజ్యఫల సమీకరణం (ఈక్వేషన్ ఆఫ్ బేస్-సైన్); శీఘ్రకర్మ సమీకరణం
(ఈక్వేషన్ ఆఫ్ కంజంక్షన్); దశాంతరఫల (ఈక్వేషన్ ఫర్ డిఫ్ఫరెన్స్ ఆఫ్ మెరిడియన్); లగ్న నిర్ణయము
ఓ రోజులో ఉన్న కాల మానాన్ని నిర్ణయించేందుకు వాడీ విషయాలు:
 చంద్రు డు సూర్యుని వెనుక రాశిలో ఉంటే అది కృష్ణ పక్షము
 చంద్రు డు సూర్యునికి ముందు రాశిలో ఉంటే అది శుక్ల పక్షము
 లగ్నం సూర్యుడి రాశిలో ఉంటే అది " సూర్యోదయం " కాలం (ఉదయం)
 లగ్నం సూర్యుడి నుంచి యేడవ రాశిలో ఉంటే అది సూర్యాస్త మ కాలం (సాయంత్రం)
 లగ్నం సూర్యుడి నుంచి నాల్గ వ రాశిలో ఉంటే " మధ్యాన్నం "కాలం
 లగ్నం సూర్యుడి నుంచి పదవ రాశిలో ఉంటే అది " అర్ధరాత్రి " కాలం
ఇలా నిత్య కృత్యాలకు, రోజుకి, గ్రహాలకి, అవి తిరుగాడే రాశులకి ఒక సమైక్య బంధం వేసి ఒక తాట నడిపించి,
తదనుబంధ విషయాలను చక్కగా ఇమిడించారు. ఇలా మనుషుల కాలాన్ని, విశ్వాంతరాళంతో అనుసంధాన
పరచడం వారి ఊహ, దివ్య ద్రిష్టి, క్షుణ్ణ మైన అవగాహనకి నిదర్శనాలు.
దుర్ముహూర్తా లు
ఒక " అహో రాత్రి " ముప్పై (30) ముహూర్తా లుగా విభజించబడింది. పదిహేను ముహూర్తా లు పగలు, తద్సమాన
ముహూర్తా లు రాత్రి అని వర్గీకరించారు. ఈ కింది పట్టి క " దుర్ముహూర్తా ల " ఉటంకిస్తు న్నది.

వారం 1 వ దుర్ముహూర్తము 2 వ దుర్ముహూర్తము


ఆదివారం 14 వ దుర్ముహూర్తము -
సొ మవారం 9 వ దుర్ముహూర్తము 12 వ దుర్ముహూర్తము
మంగళవారం 4 వ దుర్ముహూర్తము రాత్రి 7 వ దుర్ముహూర్తము
బుధవారం 8 వ దుర్ముహూర్తము -
గురువారం 6 వ దుర్ముహూర్తము 12 వ దుర్ముహూర్తము
శుక్రవారం 4 వ దుర్ముహూర్తము 9 వ దుర్ముహూర్తము
శనివారం 1, 2 వ దుర్ముహూర్తా లు
ఆర్యభట్ట ఖగోళ, గణిత శాస్త్రా లకు సంభందించి పరిణామాత్మక పద్ధ తులను కనిపెట్టే రు. వాటితో పాటు
ప్రా ధమిక, సంక్లిష్ట సమస్యలకు పరిష్కరణలు ఇస్తూ విభిన్న పద్ధ తులు తన గ్రంధాలలో పేర్కున్నారు. వాటిలో కొన్ని
ముఖ్యమైనవి:
- బీజగణిత విశ్లేషణ (ఆల్జీబ్రైక్ అనాలసిస్)
- గణితశాస్త్రంలో తొలి సారిగా " కుట్ట క పద్ధతి " (ఇండిటర్మినేట్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ) పరిష్కరణలు ఇచ్చారు. ఈ
పద్ధతిని బ్రహ్మగుప్త తన " బ్రహమస్పుట సిద్ధాంతం " గ్రంధంలో, భాస్కరాచార్య (1150 ఏ డీ లో) " సిద్ధాంత శిరోమణి "
గ్రంధంలో వివరించి ఉదాహరణలు ఇచ్చారు.
- తీరీ ఆఫ్ ఎపీసైకిల్స్
- ప్రపంచ ఇతిహాసంలో జ్య (సైన్), కోటిజ్య (కాస్) కోశ్తా లు (టేబుల్స్). ఇవి నేటి అంతరిక్ష శాస్త్రా నికి ప్రా ధమిక,
అత్యవసరమైన పద్ధ తులు.
ఇవి కాక - ఖవృత్త ; స్వవృత్త ; సముఖమధ్యం; ఉపసితి; వర్గ; ఘన; వర్గమూల; వ్యతిపత; అధిక మాసాలు; కాలక్రియ
పద; మిశ్రక; శ్రేధి; క్షేతి; ఖత; సితి; సూన్యతత్యం; యవత్-తవత్ (తీరీ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్); వర్గా వర్గ (తీరీ ఆఫ్
క్వాడ్రా టిక్ ఈక్వేషన్స్); ఘనా-ఘన (తీరీ ఆఫ్ క్యూబిక్ ఈక్వేషన్); విశమ (తెరీ ఆద్ ఈక్వేషన్స్ విత్ సెవరల్
అన్నోన్స్); గోళ-పాద; వదవముఖ; ఉన్మండల; అగ్ర; ద్రెక్క్సేపజ్య; దృగ్గణితజ్య; దృక్కర్మణ - అక్శ అంద్ ఆయన;
స్తి త్యార్ధ; విమరదర్ధ; ఫలవల్లి; కుత్త క (పల్వరైసెర్); ఉక్రమజ్య (వెరిసైన్); ఉత్క్రమజ్య (ఇన్వర్స్ సైన్); సూర్య గ్రహణం;
చంద్ర గ్రహణం; తాత్కాలిక గతి (ఇంఫినైటిస్మల్స్); స్తి త్యార్ధ; భూమధ్య రేఖ; సంకాలిత (సం ఆఫ్ సీరీస్); సంకలన;
సమ్మేళణ, ప్రక్షేపణ; సమ్యోజన; ఏకీకరణ; యుక్తి; యోగ; అభ్యాస; సర్వధన (టోటల్); వ్యుత్కలిత, వ్యుత్కలన,
సో ధన (క్లియరింగ్), పతన, వియోగ, వ్యోజక, గుణణ, హనన, వధ, క్ష్యయ; గుణకార, గుణ-ఫల; ప్రత్యుత్పన్న; వర్గ
(కృతి); అక్షాంశ; విక్షేప (లాటిట్యూడ్ లెక్కకట్ట డం); పత (నోడ్); శాగ్ర, నిరగ్ర ఇత్యాది పద్ధతుల వివరణలు ఇచ్చారు.
అహర్గణ - ఆర్యభట్టు ని ఖగోళగణిత శాస్త్ర అద్బుత సృష్టిఅద్వితీయ బుద్ధి కుశలత కలిగిన, గణిత, ఖగోళ శాస్త్రవేత్త
ఆర్యభట్ట " అహర్గణ " పద్ధ తి ప్రతిపాదించారు. అహర్గణ పద్ధతిలో ఈ కల్పం మొదలు యెన్ని దినములు గడచినాయో
గణాంకముల ద్వరా లెక్కించ వచ్చు. ఇది కలియుగారంభం నుంచి తీసుకున్నారు. ఇది 17 - 18 ఫిబ్రవరి 3102 బీ సీ
అర్ధరాత్రి గా తీసుకున్నారు, ఇదే పందాలో ఫ్రెంచ్ దేశ విద్వాంసుడు - జోసెఫ్ స్కాలిగర్, 1582 ఏ డీ లో, ఆర్యభాటీయ
అహర్గన పద్ధతి అవలంబించి ఖగోళశాస్త్రంలో జూలియన్ డే నంబర్ వాడేరు.
ఆర్యభట్ట తాను రచించిన ఆర్యభాటీయం - గోళ పాదం - పదకొండవ శ్లో కంలో ఈ విశ్వంలోని అనంత వాయువు
గురించి వివరణ ఇచ్చారు. ఒక్క ముక్కలో సమస్తాంతరాళం యెలా నడుస్తోందో , దానికి కారణాలు ఏమిటో సుస్పష్టం
చేసిన అద్వితీయ గణితశాస్త్రవేత్త . ఇంత అసాధరణ బుద్ధి కుశలత చూడడం అరుదే. అంత అపూర్వ జ్ఞా న సంపూర్ణత
కలిగిన వారు ఆర్యభట్ట .
గ్రహాల అష్టా గతులు - ఆర్యభట్ట ఆవిష్కరణ
లక్షల మైళ్ళ దూరంలో ఉన్న గ్రహాలకు, సమ గతులు కాక, భిన్నమైన గతులు ఉన్నాయని ప్రా చీన భారతీయ ఖగోళ
శాస్త్రవేత్త లు తేల్చిచెప్పేరు. అంతే కాదు సుప్రసిద్ధ ఖగోళ - గణిత శాస్త్రవేత్త , ఆర్యభట్ట గ్రహాల అష్టా గతులు కనుగొని
ప్రపంచానికి ప్రప్రధమ సారిగా శాస్త్రీయ ప్రమాణాలతో, ఉదాహరణలతో ప్రకటించాడు. ఈ అష్టా గతులు: వక్ర (రెట్రో గ్రేడ్);
అణువక్ర (లిట్టి ల్ రెట్రో గ్రేడ్); కుటిల (ట్రా న్స్వర్స్); మంద (స్లో ); మందతర (వెరీ స్లో ); సమ (ఈవెన్); అతిశీఘ్రతర /
అతిశీఘ్ర (వెరీ స్విఫ్ట్); శీఘ్ర (స్విఫ్ట్)
ఊపు (వాబుల్) కారణంగా అక్షం మార్పు సప్రా మాణికంగా నిరూపించారు. ఈ ప్రా ధమిక మూలసూత్రా న్ని ఆర్యభట్ట
కనుగొనగా, భాస్కర, బ్రహ్మగుప్తా దులు కూడా ఈ సూత్రా న్ని పేర్కున్నారు. దదాపు వెయ్యేళ్ళ తర్వాత కెప్ల ర్ - లాస్
ఆఫ్ మోషన్ గా తిరిగి కనిపెట్టే రు.
గణిత శిఖామణి బ్రహ్మగుప్త
బ్రహ్మగుప్త గణితంలో వాడే పాలీనామియల్ ఈక్వేషన్స్ పద్ధ తిని 628 ఏ డీ లో కనిపెట్టే రు. ఇది ఆచార్య కంక (ఉజ్జై నీ
ఖగోళ శాస్త్ర పండితుడు) పెర్షియాకి ప్రసారం చేసారు.బ్రహ్మగుప్త పాలీనామియల్ ఈక్వేషన్స్ గణితంలో ఓ కొత్త
క్షేత్రా భివృద్ధికి దారితీసింది. ఇంతటి ప్రభావాత్మక ఆవిష్కరణలు చేసిన ఉదాహరణలు ప్రపంచ గణిత చరిత్రలో లేవు.
ఇవి కాక: - "గోమూత్రిక పద్ధ తి " (జిగ్ జాగ్ మెతడ్), " ఇష్ట గణన " (ఆల్జీబ్రైక్ మెతడ్) పద్ధ తులను వివరించారు. ఈ
దిశామార్గ పద్ధ తులను మునుపు ఎవ్వరూ ప్రస్తా వించిన ఉదహరణలు లేవు.ప్రపంచానికి తొలిసారిగా వినూత్న
పద్ధతులు బ్రహ్మగుప్త అందించారు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని:

బ్రహ్మగుప్త వర్గ ప్రకృతి పద్ధతి (ఇండిటర్మినేట్ ఈక్వేషన్ ఆఫ్ సకండ్ ఆర్డర్)


బ్రహ్మగుప్త సూత్రం (ఫార్ములా) - దీన్నే హెరాన్ ఫార్ములా అని కూడా వ్యవహరిస్తు న్నారు.
బ్రహ్మగుప్త సమీకరణం - (సైక్లిక్ క్వాడ్రిలేటరల్)
బ్రహ్మస్ఫుట సిద్ధాంతం – "ధ్యానగ్రహో పదేశాధ్యయ" శీఘ్ర గణణానికి వినూత్న పద్ధ తులు అందించారు.
బ్రహ్మగుప్త ప్రకారం కుటక పద్ధతి గూర్చిన జ్ఞా నం " ఆచర్యపదవి " కి అనివార్యం అని చెప్పేరు. అంత ప్రజ్ఞ ఉన్నవారే
ఆచర్య పదవి చేపట్టి నిర్వర్తించగలరని అప్పటి వారి వ్యవహార నియమం.బ్రహ్మగుప్త పతిగణితం లో అనేక గణిత
పద్ధతులను వివరించారు. వాటిలో - సంకలిత, వ్యవకలిత, గుణన, భాగహార, వర్గ, వర్గమూలం, ఘన, ఘన-మూల,
పంచ-జతి, త్రైరశిక (రూల్ ఆఫ్ త్రీ), వ్యస్త -త్రైరసిక (ఇన్వెర్స్ రూల్ ఆఫ్ త్రీ), పంచరశిక, సప్త రశిక (రూల్ ఆఫ్ సెవెన్),
నవరశిక (రూల్ ఆఫ్ నైన్), ఎకదసరశిక (రూల్ ఆఫ్ లెవన్), మిశ్రక, శ్రేఢి (ప్రో గ్రెస్షన్, సీరీస్), క్షేత్ర, ఖత, సితి, క్రా కసిక
(సా), రాశి, ఛాయ వివరించారు.ఇవేకాక సమగమ; అస్త మన; " ఖంద "; " భేద "; ఇత్యాది ఖగోళ శాస్త్ర పద్ధ తులను
విశిదీకరించారు. గణిత మహాకోవిదులు శ్రీధర, మహావీరాచర్య - కపటి సంధి, తస్త (క్రా స్ మల్టిప్లి కేషన్), రూప విభాగ,
స్థా న విభాగ పద్ధతులను ఉదాహరణలతో వివరించారు.
వీటిలో కొన్ని పద్ధ తులు, ఉదాహరణకు - " కపట సంధి " పద్ధ తి ముందు పర్షియా, అరబ్ దేశాలకు ప్రసారమై అల్-
ఖ్వార్జీమీ (825 ఏ డీ), అల్ అన్శావి (1025 ఏ డీ), అల్ బెరునీ (1030 ఏ డీ), అల్ బత్తా ని, అల్ హస్సర్ (1175 ఏ డీ),
అల్ కలశది (1475 ఏ డీ) ద్వరా యూరోప్ కి ప్రసారమయ్యాయి. అల్ నశావి ఈ పద్ధతిని "అల్ అమల్ అల్ హిందీ",
"తారీక్ అల్ హిందీ (హిందువుల పద్ధతి) అన్న నామ వ్యవహారాలతో వివరించాడు.ఆర్యభట్ట ప్రకారం నక్షత్ర సంవత్సర
(సిడరల్ ఏడాది) 365.25868 రోజులు. 628 ఏ డీ లో బ్రహ్మగుప్త ఇది 365.26875 రోజులుగా సరిచేశారు.
పృత్యూదకస్వామి (864 ఏ డీ), భటోట్పల (966 ఏ డీ), లల్ల , సో మేశ్వర, యమత, అమరాజ (1200 ఏ డీ), శ్రీదత్త ,
వరుణ బ్రహ్మగుప్త బ్రహ్మస్ఫుట సిద్ధాంతం పై భాష్యాలు వెలువరించారు. హెన్రీ టీ కోల్బ్రూక్ బ్రహ్మస్ఫుట సిద్ధాంత
ఆంగ్లా నువాదం "హిందూ ఆల్జీబ్రా - ఫ్రం సాన్స్కృట్ వర్క్స్ ఆఫ్ బ్రహ్మగుప్త అండ్ భాస్కర (1817)" అన్న పేరుతో
చేశాడు.
ఛాయాగణితం
నిత్యం కనిపించే సూర్య, చంద్రు ల స్థితిగతుల ఆధారంగా చంద్రు ని ఛాయలు మారుతాయి. చంద్ర చాయను బట్టి చంద్ర
ఛాయాగణితాన్ని ప్రా చీన భారతీయ శాస్త్రవేత్త లు, వైజ్ఞా నికులు విశ్లేషణతో, అనుభవపూర్వక జ్ఞా నంతో కనుగొన్నారు.
కొన్ని ప్రా మాణికమైన చంద్ర ఛాయ గణిత పద్ధ తులను అందించారు. వీటి ద్వారా ఛాయా గణాంకాలు చేయవచ్చు.
అనాదిగా వెలువడిన ప్రతీ ఖగోళ గణిత కారణ గ్రంధాలు చంద్ర ఛాయ గణిత తత్సంబంధ "వ్యాతిపత", "గ్రహణ",
"శృంగోన్నతి", "మౌఢ్య" వంటి అంసాలు అంతర్భాగంగా పేర్కుంటూ వచ్చాయి. ఈ ప్రకృతి విలక్షణాన్ని క్షుణ్ణంగా
పరిశీలించి వాడకంలోకి తీసుకొచ్చారు భారతీయ వైజ్ఞా నికులు.
గణిత చక్ర చూడామణి, భారతీయ ఖగోళ - గణిత దిగ్గజం - భాస్కరాచార్య
సుప్రసిద్ధ ఖగోళ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య - బైక్వాడ్రా టిక్ పద్ధ తి, కంటిన్యూస్ ఫ్రా క్షన్స్ గణన పద్ధ తిని
కూలంకషంగా వివరించారు. వీటిని ప్రపంచవిఖ్యాతం చెందిన " సిద్ధాంత శిరోమణి " గ్రంధంలో పేర్కొన్నారు. తన బుద్ధి
కుశలతను, అసమాన ప్రతిభను చాటుతూ, భాస్కరాచార్య " కలన గణితం / శూన్యలబ్ది " (నేటి - డిఫరెన్షి యల్
కాల్కులస్) గణిత క్షేత్రా నికి అంకురార్పణం చేస్తూ ఈ సమీకరణం ఇచ్చారు:

జ్య వై' - జ్య వై = (వై' - వై) కోటిజ్య వై; ఇది (జ్య వై ) = (కోటిజ్య వై) వై (ఇందులో - జ్య అంటే సైన్; కోటిజ్య అంటే
కోసైన్;)

1150 ఏ డీ లో "సిద్ధాంత శిరోమణి " గ్రంధంలో భాస్కరాచార్య అనేక విషయాలు, అంశాలు పేర్కున్నారు. వాటిలో కాల
పట్టి కలు కూడా ఉన్నాయి:

1 దినము = 60 ఘడియలు (24 గంటలు)


1 ఘడియ = 60 విఘడియలు (24 నిమిషాలు)
1 విఘడియ = 60 పరఘడియలు (24 సకెండ్లు )
1 పరాగఘడియ = 60 సూక్ష్మ-ఘడియలు (0.4 సకెండ్లు )
1 నక్షత్ర-ఘడియలు = 0.0067 సెకండ్లు
భారతీయ గణిత దిగ్గజం భాస్కారాచార్య ప్రకారం సంవత్సరానికి 365.25848 రోజులు. చాంద్ర-మాసంలో 29.53
రోజులుంటాయి. కాబట్టి పన్నెండు నెలల్లో 354.36 రోజులుంటాయి. సూర్య సంవత్సరము, చాంద్ర సంవత్సరము, ఈ
రెండిటి వ్యత్యాసం " శుద్ధి " / "అధి-మాస శేషం ", ఇది 10.898 దినములు. ఏ ఏ కృష్ణస్వామి అనే గణిత కోవిదుడు,
ఆచార్యుడు " ది అర్లియెస్ట్ సొ ల్యూషన్ ఆఫ్ బైక్వాడ్రా టిక్ " అన్న (పేపర్) "కరెంట్ సైన్స్ ", వాల్యూం 7, నంబర్ 4
(పత్రికలో) ప్రకటించి, ఈ పద్ధతికి భాస్కరాచార్య ఆద్యుడని, ఫెరారి కన్నా 400 యేళ్ళ క్రితమే భారత దేశంలో ఇవి
ఉన్నాయని తన పరిశోధనా ఫలితాలు వెళ్ళడించారు.
సంగమగ్రా మ మాధవ " వెన్వరోహ పద్ధతి "
గణితంలో " సిరీస్ " గా వ్యవహరించబడే సైన్ సీరీస్, కాస్ సీరీస్ పద్ధ తులను కనిపెట్టి న అద్బుత ఖగోళ గణిత
మేధావి. తను కనిపెట్టి న పద్ధతులతో ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచాడు. మాధవ వినూత్న పద్ధ తి నెలకొల్పి రెండు
గంటల 40 నిమిషాల అంతరాలతో చంద్రు డి తులాంశం కనుగొన్నారు. ఈ పద్ధతిని " వెన్వ " (బాంబూ ట్రీ) నాట్ల
అధారంగా ఏర్పరచినందుకు దీన్ని వెన్వరోహ పద్ధతిగా వ్యవహరించారు. తాను రచించిన స్పుర్టచంద్రా ప్తి , వెన్వరోహ
గ్రంధాలలో ఈ పద్ధ తి వివరణలు ఇచ్చారు.
చంద్ర గ్రహం గతిలో అంతర్భేదాలు -
భారతీయ ఖగోళ శాస్త్ర వికాసానికి మచ్చుతునక, సూక్ష్మ చంద్రగతిపై పరిశోధనలు. మరి ఈ లెక్కలు యెందుకింత
ముఖ్యం? కొద్ది గా మారితే వచ్చే నష్టం ఏమిటీ? ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం - 3 డిగ్రీల వక్ర దైర్ఘ్యం (ఆర్క్
వేరియేషన్) పంచాంగాలలో 6 గంటల కాల వ్యవధి మార్పు తెస్తుంది. అందుకనే ఇంత ముఖ్య మైన అసమానతల
మీద నిశిత దృష్టి సారించి, భారతీయ ఖగోళ గణిత శాస్త్రేవేత్త లు, వైజ్ఞా నికులు గత 1300 యేళ్ళ గా దీనికి అత్యంత
శ్రద్ధ గా చూస్తూ , కాలానుగుణంగా ఒక్కకొక్క అసమానతలను కనుగొంటూ దానికి మెరుగులు దిద్దు తూ వచ్చారు; కొత్త
సమీకరణలు ఇచ్చారు. వీరి అపార నైపుణ్యానికి జోహారులర్పించక తప్పదు. వారు ఎంతటి జ్ఞా న సంపూర్ణు లో చాటి
చెప్తోంది. అంతే కాదు వారు ఓ సమస్యని పూర్ణం చేయాడానికి యెంతకి సుదీర్ఘ ప్రయత్నాలు చేస్తా రో ప్రపంచానికి ఓ
ఉదాహరణంగా చాట వచ్చు.
చంద్ర గ్రహ గతిలో అసమానతలకి మూడు ముఖ్య కారణాలు. అవి:
మందఫలం - (ఈక్వేషన్ ఆఫ్ సెంటర్) – ఈ గతి అసమానత వల్ల భూమి, చంద్రు డి గ్రహ గతుల కోణం, దాని వల్ల "ట్రూ
మూన్", "మీన్ మూన్" వ్యత్యాసం 6.17' వరకూ ఉండవచ్చు.అంతర్భేదం (ఎవెక్షన్)ఆర్యభట్ట కాలం (450 ఏ డీ)
నుండి చంద్ర గతిభేదాలు (ఇనీక్వాలిటీ ఆఫ్ మూన్స్ మోషన్) లెక్కించేందుకు సమీకరణలు ఇస్తూ వచ్చారు.
కాలానుగుణంగా అవి మరింత మెరుగవుతూ వచ్చాయి.

భారతీయ గ్రంధాలలో లభించిన కొన్ని వివరాలు:

ఆర్యభట్టీ యం 300’.25 సైన్ జీ1


సూర్య సిద్ధాంతం 300’.25 సైన్ జీ1
ఖండఖాద్యక 296’ సైన్ జీ1
బ్రహ్మస్ఫుట సిద్ధాంత 293’.5 సైన్ జీ1

ఇవి కాక గణిత కోవిదులు ఆచార్య మంజుల (932 ఏ డీ), శ్రీపతి (1039 ఏ డీ) చంద్ర గతి అంతర్భేద సమీకరణం ఇచ్చి
దానికి (" ఎవెక్షన్ ") అసమానతను కూడా కలిపేరు. ఇది వారు కనుగొన్న మార్పు. మంజుల ఇచ్చిన సమీకరణం:

-144’ కాస్ (ఎస్ ఎల్ – ఆల్ఫ) సైన్ డీ

1150 ఏ డీ లో ఖగోళ, గణిత శాస్త్ర ఉద్దండ మహా పండితుడు, గణిత చక్ర చుడామణి భాస్కరాచార్య చంద్ర గతిలో
మూడవ అసమానతను తన విశ్లేషణలో కనుగొన్నారు. దాన్ని లెక్కవేసేందుకు ఈ సమీకరణం ఇచ్చారు:

379’.8 సైన్ జీ1 + 34’ సైన్ 2 డీ


ఖగోళ శాస్త్ర మహాపండితుడు చంద్రు డి సరైన నిజ (ట్రు ) గతి (మోషన్) కనుకున్నేందుకు మొదట శ్రీపతి సమీకరణం
వాడాలని ఆతరువాత దామోదర పద్ధ తిని ఉపయోగించుకోవాలని " తంత్ర సంగ్రహం" గ్రంధంలో
సూచించారు.నాలుగవ అసమానత చంద్రశేఖర సామంత కనుగొన్నారు - ఇది "సంవత్సర సమీకరణం". సంవత్సర
సమీకరణం (అన్నూల్ ఈక్వేషన్) – భూమి సూర్యభ్రమణం చేస్తూ సూర్యునికి ఉఛ్ఛ లో అత్యంత సమీపంలో, నీచ
స్థా నం లో అత్యంత దూరంలో ఉంటుంది. యెందుకంటే భూమి దీర్ఘవృత్త కక్షలో పరిబ్రమిస్తుంది కాబట్టి . ఈ వ్యత్యాసం
11 ' ఆర్క్ దాకా వుండ వచ్చు. దీనే సంవత్సర సమీకరణం అంటారు.
************************************
ఈ విధంగా అంతులేని నైపుణ్యంతో ఆధునిక పరికరాల ఆసరా లేకుండా ఎన్నో విషయాలను కనిపెట్టి అపార శాస్త్ర
సంపదను మానవాళికై అందించిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞు లు ధన్యులు. ఆచంద్ర తారార్కం భారతీయ శాస్త్రవేత్త లు,
గణిత కోవిదులు, వైజ్ఞా నికులు చేసిన కృషి, సాధించిన ఫలితాలు మానవాళి పురోభివృధ్ధి కి దో హదం చేస్తా యి. ఈ క్షేత్ర
రంగాలలో ప్రపంచమంతటికీ మార్గదర్శనం చూపిన మహనీయ వ్యక్తు లుగా చరిత్రలో శాశ్వత స్థా నాన్ని వారు పొందేరు.
వారి కృషికి ఆదర్శంగా తీసుకుని ఆయా శాస్త్రా లను మనవైన చేర్పులు చేయడానికి ఉద్యుక్తు లమవాలి

You might also like