Professional Documents
Culture Documents
శుక్రుడు జ్యోతిషం - వికీపీడియా
శుక్రుడు జ్యోతిషం - వికీపీడియా
శుక్రు డు రాక్షస గురువు, భృగుపుత్రు డు, విష్ణు ద్వేషి. స్త్రీగ్రహం. రుచులలో పులుపుకు ప్రతీక, తెలుపు వర్ణా న్ని సూచిస్తా డు. జాతి -బ్రా హ్మణ, అధి దేవత -
ఇంద్రియాని. ఏడు వయసును సూచిస్తా డు. మనోహర శరీరం, నల్లని జుట్టు , సౌందర్యవంతులకు ప్రతీక. శ్లేష్మ, వాత ప్రకృతిని సూచిస్తా డు. తత్వము -జలతత్వం,
దిక్కు -ఆగ్నేయము, రత్నము -వజ్రము, లోహము -వెండి, ఋతువు -వసంతం, దిక్బలం చతుర్ధ స్థా నం, గుణము -రజోగుణము, ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల
మధ్య ప్రాంతం. శుక్రు డు భరణి, పూర్వఫల్గు ణి, పూర్వాషాఢ నక్షత్రా లకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థ. వృషభం, తులా రాశులకు ఆధిపత్యం
వహిస్తా డు. రవి, చంద్రు లు శత్రు వులు. శని, బుధులు మిత్రు లు. కుజుడు, గురువులు సములు. శుక్ర దశా కాలం ఇరవై సంవత్సరాలు. శుక్రు డు మీన రాశిలో ఉచ్ఛ
స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.
శుక్రా చార్యుడు
కారకత్వములు
శుక్రు డు శారీరక సుఖము, భార్య, యౌవనం, సౌందర్యం, రాజసము, వినోదము, స్త్రీలు, ఐశ్వర్యం, జలవిహారం, ఆభరణములు, సౌందర్య సాధనములు, చతుష్షష్టి
కళలు, వీర్యము, మన్మధుడు, సుగంధద్రవ్యములు, గౌరి, లక్ష్మి ఆలయములు, క్రీడా ప్రదేశములు, పాలు, పాల కేంద్రా లు, పాలకు సంబంధించిన వస్తు విక్రయము,
వస్త్రములు దానికి సంబంధించిన వృత్తు లు, అలంకార సామాగ్రి, పరిమళ ద్రవ్యములు వాటికి సంబంధించిన వృత్తు లు, పానీయములు, పండ్లరసాలు వాటికి
సంబంధించిన సంస్థలు, పెట్రో లు వాహనములు, నౌకలు, సముద్ర యానం, రస సంబంధం ఉన్న నిమ్మ, నారింజ, కమలా, బత్తా యి మొదలైన పండ్లు , నేత్ర, సుఖ,
చర్మ, కంఠముకు సంబంధించిన రోగములు, దర్జీ, కళాసంబంధ వృత్తు లు, సౌందర్య సంబంధిత వృత్తు లు, స్నేహితులు, బహుమతులు, హనీమూన్, ప్రేమ,
విందులు విలాస విహారాదులు, పూలు, అలంకరణ సామాగ్రి, లౌక్యము, లాభము, ఒప్పందము, ఆకర్షణ మొదలైన వాటికి కారకుడు.
రూపము
శుక్రు ని వర్ణం ధవళ వర్ణం. నాలుగు భుజములు కలిగి ఉంటాడు. చేతులలో దండము, కమండలం, రుద్రా క్షమాలను ధరించి ఉంటాడు. రథాన్ని అధిరోహిస్తా డు.
ఇతడి తండ్రి భృగువు, తల్లి హిరణ్య కశిపుని కుమార్తె ఉష. ఇతడికి కావ్యుడు, సితుడు, భృగుసుతుడు, దానవాచార్యుడు, ఉశనుడు అనే ఇతర నామాలు
ఉన్నాయి.
వ్యాధులు
గర్భాశయ వ్యాధులు, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాధులు మొదలైన వాటికి కారకుడు. కుజుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు
వాపు మొదలైనవి కలుగుతాయి. బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం, శనితో కలిసిన సుఖ వ్యాధులు, రాహువుతో కలిసిన గర్భ
సంబంధిత వ్యాధులు, కేతువుతో కలిసిన సంతాన లేమి మొదలైన వ్యాధులు కలుగుతాయి.
వృత్తు లు
శుక్రు డు కళారంగ సంబంధిత వృత్తు లు, స్వీట్ షాపులు, పానీయాల షాపులు, పండ్లరసాల వ్యాపారం, పాల సంబంధిత వృత్తు లు, వెండి, బంగారు, రత్న
వ్యాపారములు, ఫ్లా స్టిక్, కలప, రబ్బరుకు సంబంధించిన వృత్తు లు శుక్ర ప్రభావితులకు లాభిస్తా యి. సముద్ర యానం, నౌకాయాన సంబంధిత వృత్తు లు, సముద్ర
సంబంధిత వృత్తు లు, ఆహార సంబంధిత వృత్తి వ్యాపారాలు, ఉప్పు సంబంధిత వృత్తి వ్యాపారాలు, పెట్రో ల, వాహన సంబంధిత వ్యాపారాలు, ముత్యాల
వ్యాపారం, మత్యకారులకు సంబంధిత వృత్తి వ్యాపారాలను సూచిస్తుంది.
శుక్రు డు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందరశరీరం కలిగిన వాడు, సుఖజీవి, చిరంజీవి ఔతడు.
తృతీయముస్థా నమున శుకృడు ఉన్న జాతకుడు భార్యాహీనుడు, కష్టవంతుడు, బీదవాడు, దుఃఖవంతుడు, అపకీత్రి కలవాడు ఔతాడు.
చతుర్ధస్థా నమున శుక్రు డు ఉన్న జాతకుడు వానములు కలవాడు, మంచిగృహం కలవాడు, నగలు, వస్త్రములు, సుగంధద్రవ్యములు కలవాడు ఔతాడు.
పంచమస్థా నమున శుక్రు డు ఉన్న జాతకుడు అపారధనవంతుడు, ఇతరులను రక్షించు వాడు, బహుమేధావి, పుత్రు లు కలవాడు ఔతాడు,భార్య వల్ల లాభం,
సుఖ సంసార జీవితంలో లాభం
షష్టమస్థా నమున శుక్రు డు ఉన్న జాతకుడు శతృవులు లేని వాడు, ధనమును లేని వాడు, యువతుల చేత వంచింపబడిన వాడు, విచారగ్రస్తు డు ఔతాడు.
సప్తమస్థా నమున శుక్రు డు ఉన్న జాతకుడు మంచి కళత్రం ఉన్న వాడు, పరస్త్రీ ఆసక్తు డు, కళత్రం లేని వాడు, ధనవంతుడు ఔతాడు.
అష్టమ స్థా నమున శుక్రు డు ఉన్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడు, రాజు ఔతాడు.
నవమస్థా నమున శుక్రు డు ఉన్న జాతకుడు భార్యాబిడ్డలు, సంతానం, ఆప్తు లు కలిగి రాజాశ్రయం కలిగి అభివృద్ధి చెందుతూ ఉంటాడు.
దశమస్థా నమున శుక్రు డు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగినవాడు, మిత్రు లు కలిగిన వాడు, ప్రభువు ఔతాడు.
ఏకాదశ స్థా నమున శుక్రు డు ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడు, బహు సుఖవంతుడు ఔతాడు.
ద్వాదశము స్థా నమున శుక్రు డు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతుడు, ధనవంతుడూ ఔతాడు.
వెలుపలి లింకులు
"https://te.wikipedia.org/w/index.php?
title=శుక్రు డు_జ్యోతిషం&oldid=3257605" నుండి వెలికితీశారు
Last edited 5 months ago by K.Venkataramana
వికీపీడియా