You are on page 1of 20

యస్య నిశ్వసితం వేదా యోవేదేభ్యో అఖిలం జగత్ |

నిర్మమే తమహం వన్దే విద్యాతీర్థ మహేశ్వరమ్ ||


అథర్వ వేద సంహిత
కాండము : 10, అనువాకం : 1, సూక్తం : 1
ఋషి: ప్రత్యఙ్గిరసుడు

దేవతలు: మంత్రములలో పేర్కొన్నవారు

ఛందస్సు: 1 మహా బృహతీ; 2 విరాణ్ణామ గాయత్రీ; 3-8, 10, 11, 14, 21,
26, 27, 30, 31 అనుష్టు ప్; 9 పథ్యాసంక్తి; 12 పంక్తి; 13 ఉరో బృహతీ; 15
చతుష్పదా విరాడ్ జగతీ; 16,18 త్రిష్టు ప్; 17, 24 ప్రస్తా ర పంక్తి; 10 చతుష్పదా
జగతీ; 20 విరాట్ ప్రస్తా ర పంక్తి; 22 ద్విపదాఽఽర్చ్యుష్ణిక్ (ఏకావసానా); 28
త్రిపదా భురిక్ విషమా గాయత్రీ; 28 త్రిపదా గాయత్రీ; 29 మధ్యే జ్యోతిష్మతీ
జగతీ; 32 ద్వ్యసుష్టు బ్గర్భా పంచ పదాతి జగతీ.

మంత్రములు : 32 (ఋక్కులు)

వినియోగం: ఈ అర్థసూక్తా న్ని పిశాచ ప్రయోగం మారు హరించుట /


సంహారము సన్నివేశములో పఠించుట వలన పిశాచ ప్రయోగం నిశ్శేషముగా
హరింౘుట శాంతి ఉదకంలో దీనికి వినియోగం. పిశాచ ప్రయోగం మారు
హరించుట / సంహారము గూర్చి కాండము : 2, అనువాకం : 3, సూక్తం : 11
లో కలదు . వినియోగ సమయము కూడా అచ్చట కలదు.
మంత్రము:
యాం కల్పయన్తి వహతౌ వధూ మివ
విశ్వరూపాం హస్త కృతాం చికిత్సవః !
సా రా దే త్వప నుదామ ఏనామ్ ॥ 1 ॥
పదము:
యామ్ | కల్పయన్తి | వహతౌ | వధూమ్ఽఇవ | విశ్వఽరూపామ్ |
హస్తఽకృతామ్ | చికిత్సవః |
సా | ఆరాత్ | ఏతు | అవ | నుదామః | ఏనామ్ ॥ 1 ॥
అనువాదం :
ప్రయోగింౘువాళ్ళు తమ చేతులతో సంపూర్ణముగా నిర్మించిన ఈ పిశాచ
ప్రయోగం, పెండ్లి అలంకరించిన పెండ్లి కూతురు వలె ఉన్నది. ఈ ఘాతుక
ప్రయోగం దూరం నుంచే వెళ్ళి పోవు గాక ! ఈ క్రూ రమైన ప్రయోగాన్ని
దూరంగా తరిమి వేస్తు న్నాము. ॥ 1 ॥

మంత్రము :
శీర్షణ్వతీ నస్వతీ కర్ణినీ కృత్యాకృతా సంభృతా విశ్వరూపా !
సా రా దే త్వప నుదామ ఏనామ్ ॥ 2 ॥
పదము :
శీర్షణ్ఽవతీ | నస్వతీ | కర్ణినీ | కృత్యాఽకృతా ! సమ్ ఽభృతా | విశ్వఽరూపా
|
సా | ఆరాత్ | ఏతు | అవ | నుదామః | ఏనామ్ ॥ 2 ॥
అనువాదం :
ఈ ప్రయోగం చేసిన వాడు, అన్ని రూపములలో శిరస్సులతో, ముక్కులతో,
చెవులతో చేసిన పిశాచ ప్రయోగం యముఁడుచే పోషింపబడినది అయిన ఇది
దూరం నుంచే వెళ్ళిపోవు గాక ! దీనిని మేము దూరంగా తరిమివేస్తు న్నాము .
॥2॥
మంత్రము :
శూద్రకృతా రాజకృతా స్త్రీకృతా బ్రహ్మభిఃకృతా |
జాయా పత్యా నుత్తేవ కర్తా రం బన్ధ్వృచ్ఛతు ॥ 3 ॥
పదము :
శూద్రఽకృతా | రాజఽకృతా | స్త్రీ ఽకృతా | బ్రహ్మఽభిః | కృతా |
జాయా | పత్యా | నుత్తా ఽఇవ | కర్తా రమ్ | బన్ధు | ఋచ్ఛతు ॥ 3 ॥
అనువాదం :
ఈప్రయోగం శూద్రు డు చేసినా, రాజు చేసినా, స్త్రీ చేసినా, బ్రాహ్మణుడు చేసినా,
మగడు వదలి వేసిన భార్య వలె, తనను రూపొందించిన వాని వద్దకే తిరిగి వెళ్ళి
పోవు గాక ! ॥ 3 ॥

మంత్రము :
అనయాఽహ మోషధ్యా సర్వాః కృత్యా అదూదుషమ్ |
యాం క్షేత్రే చక్రు ర్యాం గోషు యాం వా తే పురుషేషు ॥ 4 ॥
పదము :
అనయా | అహమ్ | ఓషధ్యా | సర్వాః | కృత్యాః | అదూదుషమ్ ।
యామ్ | క్షేత్రే | చక్రుః | యామ్ | గోషు | యామ్ | వా | తే | పురుషేషు ॥ 4 ॥
అనువాదం :
ఈ ఓషధితో క్షేత్రంలో, గోవులలో చేసిన ఈ ప్రయోగాన్ని, ఆ చేసిన వారి మీదకే
వదలి వేస్తు న్నాను. ‘ఉత్తరేణు’ అనే ఈ ఓషధితో ఈ ప్రయోగం పరిపూర్తి
కాకుండా చేస్తు న్నాను . ॥ 4 ॥

మంత్రము :
అఘమ స్త్వఘకృతే శపథః శపథీయతే |
ప్రత్యక్ ప్రతిప్రహిణ్మో యథా కృత్యాకృతం హనత్ ॥ 5 ॥
పదము :
అఘమ్ | అస్తు | అఘఽకృతే | శపథః | శపథిఽయతే |
ప్రత్యక్ | ప్రతిఽప్రహిణ్మః | యథా | కృత్యాఽకృతమ్ | హనత్ ॥ 5 ॥
అనువాదం :
ఇతరులకు అపాయము కీడు చేయదలచుకున్న వాని మీదకే, ఆ అపాయము
కీడు వెళ్ళిపోవు గాక ! శాపాలు పెట్టే వానికే ఆ శాపాలు తగులు గాక ! ఈ
పిశాచ ప్రయోగం సిద్ధం చేసిన వాని పైనికి దీనిని విసరి వేస్తు న్నాను. అది వానినే
నాశనము, సంహారము చేయు గాక ! ॥ 5 ॥

మంత్రము :
ప్రతీచీన ఆఙ్గిరసోఽధ్యక్షో నః పురోహితః |
ప్రతీచీః కృత్యా ఆకృత్యామూన్ కృత్యాకృతో జహి ॥ 6 ॥
పదము :
ప్రతీచీనః | ఆఙ్గిరసః | అధిఽఅక్షః | నః | పురఃఽహితః |
ప్రతీచీః | కృత్యాః | ఆఽకృత్య | అమూన్ | కృత్యాఽకృతః | జహి ॥ 6 ॥

అనువాదం :
అపాయము, కీడు ప్రయోగాలను ఉపసంహరించేటట్లు చేయుటలో సమర్థు డు,
ఆంగిరసీ బృహస్పతి విద్యలో ప్రవీణుడు అయిన అధ్యక్షుడు మాకు
నాయకుడుగా ఉన్నాడు. ఆ పిశాచ ప్రయోగంలను అతను త్రిప్పికొట్టగలడు.
తనకు చెడును తలపెట్టిన వారిని నాశనం చేయగలడు . ॥ 6 ॥

మంత్రము :
యస్త్వోవాచ పరేహీతి ప్రతికూల ముదాయ్యఽమ్ |
తం కృత్యేఽభినివర్తస్వ మాఽస్మా నిచ్ఛో అనాగసః ॥ 7 ॥
పదము :
యః | త్వా | ఉవాచ | పరా | ఇహి | ఇతి | ప్రతిఽకూలమ్ | ఉత్ఽఆయ్యఽమ్
|
తమ్ | కృత్యే | అభిఽనివర్తస్వ | మా | అస్మాన్ | ఇచ్ఛః | అనాగసః ॥ 7 ॥
అనువాదం :
నిన్ను తన శత్రు వు పైకి వెళ్ళు మని చెప్పే వాని పైనే నీవు ఎదురు తిరుగు.
మమ్ములను వెదకుటకు ప్రయత్నించకు. మేము ఏ మాత్రం కీడు
చేయనివారము, నిరపరాధులము. ॥ 7 ॥

మంత్రము :
యస్తే పరూంషి సందధౌ రథస్యేవ ర్భుర్ధియా |
తం గచ్ఛ తత్ర తేఽయన మజ్ఞాత స్తేఽయం జనః ॥ 8 ॥
పదము :
యః | తే | పరూంషీ | సమ్ఽదధౌ | రథస్యఽఇవ | ఋభుః | ధియా |
తమ్ | గచ్ఛ | తత్ర | తే | అయనమ్ | అజ్ఞాతః | తే | అయమ్ | జనః ॥ 8 ॥
అనువాదం :
ఓ పిశాచ ప్రయోగమా ! శిల్పి తన బుద్ధి సంపదతో రథావయవాలను తయారు
చేసినట్లు , నీ క్రూ ర ప్రయోగాలకు చెందిన అవయవాలను (1. మస్తకము, 2.
ముఖము, 3. వక్షస్సు, 4. పృష్ఠము, 5. హృదయము.), ప్రయోక్త
(ప్రయోగింౘువాఁడు) తయారుచేస్తా డు. ఆ ప్రయోగింౘువాఁడు వద్దకే అది
తిరిగి వెళ్ళు గాక ! నిన్నెరుగని ఈ మనుష్యులు నిన్ను తీసుకుని పోయి ఆ
ప్రయోగింౘువాఁడు వద్దనే వదులుదురు గాక ! ॥ 8 ॥

యే త్వా క్తృత్వాలే భిరే విద్వలా అభిచారిణః |


శమ్వీ (శంబ్వీ) 3 దం కృత్యాదూషణం ప్రతివర్త్మ పునఃసరం తేన త్వా
స్నపయామసి ॥ 9 ॥

యాం కల్పయన్తి వహతౌ వధూమీవ విశ్వరూపాం హస్త కృతాం చికిత్సవః |


సారాదేత్వప నుదామ ఏనామ్ ॥ 1 ॥

శీర్షణ్వతీ నస్వతీ కర్ణినీ కృత్యాకృతా సంభృతా విశ్వరూపా |


సారాదేత్వప నుదామ ఏనామ్ ॥ 2 ॥

శూద్రకృతా రాజకృతా స్త్రీకృతా బ్రహ్మభిః కృతా |


జాయా పత్యా నుత్తేవ కర్తా రం బన్ధ్వృచ్ఛతు ॥ 3 ॥

అనయాహమోషధ్యా సర్వాః కృత్యా అదూదుషమ్ |


యాం క్షేత్రే చక్రు ర్యాం గోషు యాం వా తే పురుషేషు ॥ 4 ॥
అఘమస్త్వఘకృతే శపథః శపథీయతే |
ప్రత్యక్ ప్రతిప్రహిణ్మో యథా కృత్యాకృతం హనత్ ॥ 5 ॥

ప్రతీచీన ఆఙ్గిరసోఽధ్యక్షో నః పురోహితః |


ప్రతీచీః కృత్యా ఆకృత్యామూన్ కృత్యాకృతో జహి ॥ 6 ॥

యస్త్వోవాచ పరేహీతి ప్రతికూలముదాయ్యమ్ |


తం కృత్యే భినివర్తస్వ మాస్మానిచ్ఛో అనాగసః ॥ 7 ॥

యస్తే పరూంషి సందధౌ రథస్యేవర్భుర్ధియా |


తం గచ్ఛ తత్ర తేయనమజ్ఞాతస్తేయం జనః ॥ 8 ॥

యే త్వా క్తృత్వాలే భిరే విద్వలా అభిచారిణః |


శమ్వీ (శంబ్వీ) 3 దం కృత్యాదూషణం ప్రతివర్త్మ పునఃసరం తేన త్వా
స్నపయామసి ॥ 9 ॥

యద్ దుర్భగాం ప్రస్నపితాం మృతవత్సాముపేయిమ |


అపై తు సర్వం మత్ పాపం ద్రవిణం మోప తిష్ఠతు ॥ 10 ॥

యత్ తే పితృభ్యో దదతో యజ్ఞే వా నామ జగృహుః |


సందేశ్యా3 త్ సర్వస్మాత్ పాపాదిమా ముఞ్చన్తు త్వౌషధీః ॥ 11 ॥
దేవైనసాత్ పిత్ర్యాన్నామ గ్రాహాత్ సందేశ్యాదభినిష్కృతాత్ |
ముఞ్చన్తు త్వా వీరుధో వీర్యేణ బ్రహ్మణ ఋగ్బిః పయస ఋషీ ణామ్ ॥ 12 ॥

యథా వాతశ్చ్యావయతి భూమ్యా రేణుమన్తరిక్షాచ్చాభ్రమ్ |


ఏవా మత్ సర్వం దుర్భూతం బ్రహ్మనుత్తమపాయతి ॥ 13 ॥

అప క్రా మ నానదతీ వినద్ధా గర్దభీవ ।


కర్తౄన్ నక్షస్వేతో నుత్తా బ్రహ్మణా వీర్యావతా ॥ 14 ॥

అయం పన్థాః కృత్యేతి త్వా నయామోఽభిప్రహితాం ప్రతిత్వా ప్రహిణ్మః |


తేనాభి యాహి భఞ్జ త్యనస్వతీవ వాహినీ విశ్వరూపా కురూటినీ ॥ 15 ॥

పరాక్ తే జ్యోతిరపథం తే అర్వాగన్యత్రాస్మదయనా కృణుష్వ |


పరే ణేహి నవతింనావ్యా 3 అతి దుర్గాః స్స్రోత్యా మా క్షణిష్ఠాః పరే హి || 16 ||

వాత ఇవ వృక్షాన్ ని మృణీహి పాదయ మా గామశ్వం పురుషముచ్ఛిష ఏషామ్


| కర్తౄన్ నివృత్యేతః కృత్యేవి . ప్రజాస్వాయ బోధయ ॥ 17 ॥

యాం తే బర్షిషి యాం శ్మశానే క్షేత్రే కృత్యాం వలగం వా నిచఖ్నుః | అగ్నౌ వా


త్వా గార్హపత్యే భిచేరుః పాకం సన్తం ధీరతరా అనాగస మ్ || 18 |
ఉపాహృతమనుబుద్ధం నిఖాతం వైరం త్సార్యస్వవిదామ కర్ర మ్ |
తదే తు యత ఆభృతం తత్రాశ్వ ఇవ వి వర్తతాం హస్తు కృత్యాకృతః ప్రజామ్ ||
19

స్వాయసా అసయః సన్తి నో గృహే విద్మాతే కృత్యే యతిధా పరూంషి |


ఉత్తిషైవ పరే హీతో జ్ఞాతే కిమిహేచ్ఛసి || 20 ||

గ్రీవాస్తే కృత్యే పాదౌ చాపి కర్స్యామి నిరవ !


ఇన్ఫ్రా గ్నీ అస్మాన్ రక్షతాం యౌ ప్రజానాం ప్రజావతీ ॥ 21 ॥

సోమో రాజాధిపా మృడితా చ భూతస్య నః పతయో మృడయన్తు ॥ 22 ॥

భవాశర్వావస్యతాం పాపకృతే కృత్యాకృతే | దుష్ప్రుృతే విద్యుతం దేవహేతిమ్ ||


23 ||

యధ్యేయథ ద్విపదీ చతుష్పదీ కృత్త్యాకృతా సంభృతా విశ్వరూపా |


సేతో 3 స్టా పదీ భూత్వా పునః పరే హి దుచ్ఛునే || 24 ||

అభ్య 3 క్తా క్తా స్వరంకృతా సర్వం భర స్త్రీ దురితం పరే హి |


కానీహి కృత్యే కర్తా రం దుహితేవ పితరం స్వమ్ || 25 ||
హి కృత్యే మా తిష్ణో విద్ధస్యేవ పదం నయ |
మృగః స మృగయుస్త్వం న త్వా నికర్తు మర్హతి ॥ 26 ॥
ఉత హన్తి పూర్వాసినం ప్రత్యాదాయాపర ఇష్వా |
1 ఉత పూర్వస్య నిఘ్నతో ని హన్త్యపరః ప్రతి ॥ 27 ॥

ఏతద్ధి శృణు మే వచో థే హి యత ఏయథ | 2


11 యస్త్వా చకార తం ప్రతి ॥ 28 ॥

అనాగోహత్యా వై భీమా కృత్యే మానో గామశ్వం పురుషం వధీః | |


11 యత్రయత్రాసి నిహితా తతస్తో తాపయామసి పర్ణాలమీయసీ భవ ॥ 29 |

యది స్థ తమసావృతా జాలే నాభిహితా ఇవ |


11 11 సర్వాః సంలుప్యేతః కృత్యాః పునః కర్తే ప్ర హిణ్మసి || 30 |

కృత్యాకృతో వలగినో భినిష్కారిణః ప్రజామ్ |


మృణీహి కృత్యే మోచ్ఛిషో మూన్ కృత్యాకృతో జహి || 31 |

యథా సూర్యో ముచ్యతే తమసస్పరి రాత్రిం జహాత్యుషసశ్చ కేతూన్ ||


11 11 11 ఏవాహం సర్వం దుర్భూతం కర్తం కృత్యాకృతా కృతం హస్తీవ రజో
దురితం ¡ జహామి || 32 ||
... కృత్యా దూషణం సమాప్తం ...
చికిత్సకులు - విశ్వ రూపపు తమ చేతితో చేసిన కృత్యను వధువుగా
భావించుచున్నారు అది మా నుండి తొలగునట్లు దానిని గెంటి
వేయుచున్నాము.

వినియోగము: కృత్యా ప్రతిహరణ గణమున దీని పారము ఉన్నందున కృత్యను


దూరము చేయుశాంతి జలమున దీని వినియోగము .

2. కృత్య మనిషి చేసింది. అది తల, ముక్కు, చెవులు గలది. అనేక బాధలు
కలిగించునది. అది మా నుండి తొలగునట్లు గెంటి వేయుచున్నాము.

3. శూద్రకృత, రాజకృత, స్త్రీకృత, మంత్ర కృత కృత్య భర్త పంపిన బంధువుల


వరకు వెళ్లిన నారి వలె కర్త మీదకు వెళ్లు ను గాక.

4 & 5. పొలములు, గోవులు, జనుల మీద చేసిన కృత్యలన్నింటిని ఈ


ఔషధముచే పంపించుచున్నాను. హింస హింసిచు వానిని, శాపము
శపించువారిని చేరునుగాక. కృత్య ప్రయోగించువానినే వధించునట్లు కృత్యను
ఎదురు పంపుచున్నాము.

6. మా అధ్యక్ష పురోహితుడు అంగిరవంశీయుడు, పశ్చిమపువాడు. పురోహితా!


నీవు ఎదురుగా వచ్చు కృత్యను ఖండించుము. పంపిన వానిని
హతమార్చునట్లు చేయుము.

7. కృత్యా! నిన్ను నా మీదకు ప్రయోగించిన వాని మీదకే పొమ్ము. మేము


నిరపరాధులము. మమ్ము బాధించకుము .
8. వ్రడంగి రథపు సంధులను బిగించినట్లు నీ కీళ్లను సంధించిన వాని మీదకే
పొమ్ము. అదే నీ స్థా నము. మేము అపరిచితులము. ఇటు రాకుము.

9. కృత్యా! నిన్ను దుష్కార్యమునకు పంపిన అభిచారకుడు విద్వలుడు . నిన్ను


శుద్ధి చేయగలవాడు పునఃసరుడు . అతనితో నీకు స్నానము
చేయించుచున్నాము .

భావార్ధము : - రాజు దురాచారపరులను వారు యాచార విచారములు మరల


ఉత్తమముగ మారునట్లు సకల రీతుల వారిని చక్కబరచవలయును .

10. మమ్ము మృతవత్సరూప దౌర్భాగ్యము చుట్టు కున్నది. మాకు స్నానము


చేయించగల కృత్య లభించినది . అందువలన నా సకల పాపములు దూరమై ,
ధనము నా వద్ద స్థిరమగునుగాక .

భావార్ధము : - ఏ మనుష్యునితోనైన దుష్కర్మలు జరిగిపోయినచో అట్టివారు


యథావతుగ శిక్షననుభవించి ధర్మమునందు ప్రవృత్తు లై సుఖవంతులుగా
వలయును.

11. పితరుల నిమిత్తము ఇచ్చునపుడు, యజ్ఞము చేయునపుడు పెట్టు కున్న


పేరు వలన గలిగిన సందేశ్యాది పాపములు ఈ ఓషధి వలన తొలగును గాక.

భావార్థము : - ఒకవేళ ఎవరైనను పుణ్యాత్మునకెవరికైన దానము మున్నగు


శుభకర్మలందు మిథ్యాదోషము నారోపించినచో , విద్వాంసులు
యథాయోగ్యముగ పరిశీలించి ఆ దోషము నుండి వారిని విముక్తమొనర్చ
వలయును.

12. దేవతలకు చేసిన అపరాధము పితరుల విషయమున, సందేశ్య,


అభినిష్కృత పాపముల నుండి ఈ ఓషధులు, ఋషుల తపోబలము,
మంత్రబలము ఋక్కులు నిన్ను విముక్తు ని చేయునుగాక.

భావార్థము : - విద్వాంసులు దుష్కర్ములగు దుష్టు లను ధర్మానుసారముగ


దండించి మరియు యథోచితముగ వేదాది శాస్త్రముల ఉపదేశములతో
అట్టివారిని వారి దుష్టస్వభావములనుండి విముక్తపరచవలెను.

13. గాలి నేల మీది దుమ్మును లేపినట్లు , అంతరిక్షమున మేఘమును


చెదరగొట్టినట్లు , ఈ మంత్ర ప్రభావమున నా దౌర్భాగ్యము ఎగిరిపోవునుగాత.

భావార్థము : - మానవులు సదుపదేశములను పొంది పాపకర్మలను


వదలివేయుటయందు శ్రీమత్వము నొందవలయును.

14 కృత్యా! కట్లు లేని గాడిద దెబ్బలు తిని పారిపోయినట్లు నీవు మంత్ర


బలమున దెబ్బలు తిని ప్రయోగించిన వాని మీద పడుము .

భావార్ధము : - నీతినిపుణులగు వారి ఉపాయములద్వారా హింసకులు


పరస్పరము విరోధమును బెంచుకొని నిర్బలురై పోవలయును.
15. కృత్యా! ఇది నీ మార్గమని నీకు చూపుచున్నాను. నిన్ను ప్రయోగించిన
శత్రు వు మీదకే నిన్ను పంపుచున్నాను. నీవు రధ, గజ, తురగ, పదాతిసైన్యము
వలె మా శత్రు వును ముట్టడించుము.

భావార్ధము : - నీతి నిపుణుడగు సేనానాయకుడు తన పరాక్రమము,


వ్యూహము ద్వార శత్రు సైన్యమునందు తీఘ్రముగా కల్లో లముగలిగించి
పరస్పరము పోరాడుకొనునట్లు చేయును.

16. నీ జ్యోతి శత్రు వులను చేరునుగాక. నీ దౌర్భాగ్యము తప్పుదారి


పట్టు నుగాక. మా వద్ద కాక ఇతరత్ర నీ నివాసము ఏర్పరచుకొనుము. దాటరాని
నభ్య నదిని దాటిపొమ్ము. మమ్ము బాధించకుము దూరమునకు తొలిగి
పొమ్ము .

భావార్ధము : - చతురుడగు సైన్యాధిపతి తగినరీతిలో వ్యూహరచన నొనర్చి శత్రు


సైన్యములను ఆగ్నేయారి అస్త్రశస్త్రములతో వెనకాముందులనుండి
నిలిపివేయవలయును. మరియు తాము సురక్షితముగ నుండుటకు పార్శ్వ
మార్గముల నుండి వారిని పారిపోనీయవలయును.

17. పెనుగాలి చెట్లను వలె నీవు శత్రు వులను కూల్చుము. వారి గో, అశ్వ,
ప్రజను నిశ్శేషము చేయుము. కృత్యను పంపిన వారు నిస్సంతులైనారని
చెప్పుము .

భావార్ధము : - సేనాపతులు శత్రు వులను మరల తలయెత్తకుండ ,


ఉపాయహీనులు, రాజ్యభ్రష్టు లగునట్లు అణచివేయవలయును .
18. అభిచారకులు నిన్ను అగ్ని యందు, శ్మశానమున, పొలములందు,
గార్హపత్యాగ్ని యందు నిక్షేపించుచున్నారు. వారు మేము నిరపరాధులము,
మాకీ గతి పట్టినది అనునట్లు చేయుము .

భావార్థము : - శుత్రు వులెవరైన జలాది స్థా నములందు రహస్యముగ


సురంగములు మున్నగునవి త్రవ్వి హానికారక క్రియలొనర్చినచో చతురుడగు
సేనాపతి వానిని వెదకి తెలిసికొని వాని నదేవిధముగ నిధ్వంసమొనర్చి
శత్రు వులను నాశమొందించవలయును .

19. ఉపహృత, అనుబద్ధ, ఖనిత, కుటిల గమన వైరులను అభిచార కర్త మీదకు
పంపుచున్నాము. బయలు దేరిన చోటునకే చేరిన వలె కృత్య ప్రయోగము
చేసినవాని ప్రజను అశ్వము తిరుగబడి నష్టపరచునుగాక .

భావార్థము : - శుత్రు వులెవరైన జలాది స్థా నములందు రహస్యముగ


సురంగములు మున్నగునవి హానికారక క్రియలొ నర్సినచో చతురుడగు
సేనాపతి వానిని వెదకి తెలిసికొని వానినదే విధముగ విధ్వంస శత్రు వులను
నాశమొందించవలయును .

20. కృత్యా! మా ఇంట కరవాలములున్నవి. మాకు నీ ఎముకల జాడ


తెలియును. తిరిగిపొమ్ము. శత్రు వు మీద పడుము . నీవు మా విషయమున
అజ్ఞాతవు. నీకు ఇచట పని ఎమి?
భావార్ధము : - సేనాపతి ఉత్తమోత్తమ ఆస్త్రశస్త్రములద్వార శత్రు వుల
ఆయుధసామగ్రిని మరియు సైన్యములను నాశపరచి ఎరుగని ( తెలియని
వ్యక్తు లను చేరనీయవలదు .

21. కృత్యా! నేను నీ మెడ నరుకుదును కాళ్లు విరిచెదను . పారిపొమ్ము .


ఇంద్రాగ్నులు మమ్ము రక్షింతురుగాక .

భావార్థము : - రాజు మరియు మంత్రు లు దురాచారుల కంఠములను


మరియు పాదములు మున్నగు అంగములను నరికించివేసి సదా ప్రజలను
రక్షించవలెను .

22. సోముడు రాజు, అధిపతి. ప్రాణుల రక్షకుడు. మాకు స్వామి. అతడు


మమ్ము రక్షించునుగాక.

భావార్ధము : - రాజు మరియు రాజ పురుషులు ప్రజలకు సుఖముల


నందించుటయందు తత్పరులై యుండవలయును .

23. కృత్యాకృతులు పాపులు దుష్కర్మలు. వారి మీద భవ, శర్వులు పిడుగులు


- కురిపింతురుగాక .

భావార్ధము : - రాజు మరియు మంత్రి దుష్టు లను దండించి ప్రజలందు శాంతిని


స్థా పించవలెను .
24 కృత్యా! నిన్ను ప్రయోగించువారు నిన్ను రెండు కాళ్ల, నాలుగు కాళ్ల
దానినిగా చేసి పంపిన ఎనిమిది కాళ్ల దానవై వారి మీదకే ఉరుకుము.

భావార్ధము : - స్త్రీపురుషులయందు హింసాకర్మలు చెలరేగినచో ఆశ్రమ వ్యవస్థలు


నష్టమై విశ్వమున దుఃఖము వ్యాపించును . కావుననే బుద్ధిశాలియగు రాజు
హింసాక్రియలను నాశమొనర్చి శాంతిని స్థా పించవలయును .

25. ఘృతయుక్త, అలంకృత, దుష్కృత్య కృత్యే! దూరము జరుగుము. బిడ్డ


తండ్రిని ఎరిగినట్లు నిన్ను పుట్టించిన వానిని కనిపెట్టు ము.

భావార్థము : - ఏ శత్రు వులు కపటపన్నాగముతో దుఃఖమును గలిగించు


క్రియను సుఖదాయిగా జూపుచున్నను , విద్వాంసులు ఆ గుట్టు ను దెలిసికొని
దుష్టు లకు కఠినశిక్షను విధించవలయును .

26. కృత్యా! తొలగుము . నిలువకుము . వేటకాడు వలలోని మృగము వద్దకు


పోయినట్లు నీవు శత్రు వు మీదకు పొమ్ము . వాడు మృగము . నీవు వేటకత్తెవు .
వాడు నిన్నేమి చేయకలడు ?

భావార్థము : - రాజు ప్రయత్నపూర్వకముగా అన్వేషించి దురాచార శత్రు వులను


జాడదీయవలెను . ఏవిధముగ పులిగాయపడిన తనవేటను రక్తచిహ్నములతో
దానిని దెలిసికొనునో
27. మొదటి వానిని రెండవ వాడు బాణము వేసి చంపును. రెండవ వానిని
మూడవ వాడు హతమార్చుచున్నాడు.

భావార్థము : - సావధాని , దూరదర్శి యగువాడు శత్రు వు దెబ్బ తగులుటకు


పూర్వమే వానిని చంపును . మరియు వీరుడైనవాడే వైరుల దెబ్బను
తప్పించుకొని వానిని హనన మొనర్చును .

28. నా మాట వినుము. వచ్చిన చోటునకు చేరుము. ప్రయోగించిన వానివైపు


సాగుము.

భావార్థము : - రాజు నిర్ణయపూర్వకముగ అపరాధి దోషమును ప్రకటించి


దోషముననుసరించి వానికి శిక్షను విధించవలయును .

29. కృత్యా! అనాగోహత్యావైభీమా - నిరపరాధుల హత్య భయంకరము . నీవు


గోవులను, అశ్వములను, ప్రజలను వధించకుము. నిన్ను ఏ ఏ స్థలములందు
స్థా పించినారో అచటి నుంచి లేపుచున్నాము. నీవు ఆకు కన్న తేలికవగుము.

భావార్ధము : - రాజు ఆలోచనాపూర్వకముగా అనపరాధులను రహస్యముగ


బాధించు దురాచారులను ఉచితరీతిని శిక్షించి | తనవశమున నుంచవలెను .

30. కృత్యలారా! మీరు అంధకారావృతులూ , జాలావృతులైనను మిమ్ము ఇట


నుండి మాయము చేయుచున్నాము . పంపినవారల మీదకు మరలిపొండి .
భావార్ధము : - దీనులు , అజ్ఞానులను చిక్కించుకొని వారితో అపరాధము
చేయించిన కపట దుష్టు లను రాజు వెదికి పట్టు కొని తగినరీతిలో
దండించవలెను .

31. కృత్యా! కృత్యాకృతుని - వలగిని , అభినిష్కృతుని సంతానమును నాశము


చేయుము . కృత్యాకృతుని హతమార్చుము .

భావార్ధము : - చతురుడగు సేనాపతి తన చక్కని శిక్షితులగు సైనికులద్వారా


శత్రు వులను దళ , బల సహితముగా నాశమొనర్చివేయవలెను .

32. సూర్యుడు రాహు విముక్తు డైనట్లు , ఉషః కిరణములు రాత్రిని విముక్తము


చేసినట్లు , ఏనుగు దుమ్మును లేపినట్లు నేను కృత్యాకృతుని
దుష్కృత్యములను తుడిచివేయుచున్నాను.

భావార్ధము : - ఏవిధముగ సూర్యుడు అంధకారమును దొలగించి


ప్రకాశవంతుడగునో మరియు ఏనుగు కఠిన స్థా నముల నెట్లు దాటిపోవనో అట్లే
మానవులు తమ తీవ్రబుద్ధితో దుష్టు ల దౌష్ట్యమునుండి దాటిపోయి
ప్రకాశవంతులు ప్రసన్నులునై యుండవలయును .

కృత్యా దూషణం సమాప్తం

You might also like