You are on page 1of 20

పిఠాపురం భారతదేశంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి

జిల్లా లో ఉన్న ఒక ప్రసిద్ధ దత్త క్షేత్రం.

పిఠాపురంను దక్షిణ కాశి లేదా దక్షిణాది కాశి అని కూడా పిలుస్తా రు.

దీనిని శ్రీ క్షేత్ర పిఠాపురం అని కూడా పిలుస్తా రు.

పిఠాపురం ఒక గొప్ప వైశిష్ఠ్యం కలిగిన యాత్రిక సందర్శన క్షేత్రం,

ఎందుకనగా ఇచ్చట వేంచేసియున్న శ్రీ పురుహూతికా దేవి (శక్తి

పీఠాలలో ఒకటి), శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ దత్తా త్రేయ మరియు

పాద గయ ఈ క్షేత్రానికి వన్నెతెచ్చాయి.

అసలు పిఠాపురం అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దా ము.

దక్ష యజ్ఞ సమయములో,

సతీ దేవి ఆత్మ త్యాగానికి పాల్పడిన తరువాత,


శివుడి నుదుటి నుండి చెమట బిందువు నేలపై పడి వీరభద్రు డు

జన్మించి దక్షుడి తల తెగనరికిన తరువాత,

రుద్రగణముతో బయలుదేరి కైలాసానికి వెళ్ళి శివునకు జరిగినది

విన్నవించాడు.

దక్షాధ్వర ధ్వంసం విన్న తరువాత శివుడు బయలుదేరి యజ్ఞవాటికకు

వచ్చాడు.

భార్య సతీదేవి శరీరం అక్కడనే పడి ఉన్నది.

ప్రాణరహితమైన శరీరాన్ని చూడగానే శివునకు దుఃఖం కల్గింది.

తనభార్య ప్రాణాలను తీసుకొని వెళ్ళిన వారెవ్వరు?

ఆమెలోని జీవుడు ఎక్కడికి వెళ్ళాడు?

ప్రాణులకు మరణాన్ని ఇచ్చి ప్రాణాలను తీసుకెళ్ళే యమధర్మ రాజు తన

క్రింది వాడే,
దిక్పాలకులందరూ తన కింకరులే,

సతీదేవి ప్రాణాలను తీసుకెళ్ళే సాహసం వీరెవ్వరికీ లేదు.

ఆమె ఏమైనది?

శివునకు కోపం వచ్చింది.

దుఃఖము, క్రోధమూ తనను ఆవేశింపగా సతీదేవి శరీరాన్ని రెండు

చేతులతో పైకెత్తా డు శివుడు.

అప్రయత్నంగా ఆయన శరీరం కదలడం మొదలు పెట్టింది.

అది తాండవంగా మారింది.

శివతాండవము భువనభీషణముగా జరుగుతున్నది.

ఆ ధాటికి లోకాలన్నీ కదలిపోతున్నవి.

దేవతలకు ఏం చేయాలో తోచలేదు.

అందరూ విష్ణుదేవునకు విన్నవించుకున్నారు.


విష్ణువు వచ్చి చూచి పరిస్థితి గమనించి ఈ తాండవం ఆపకపోతే లోక

ప్రళయం జరిగేటట్లు న్నది అని గ్రహించి

“శివతాండవం” ఆపాలంటే సతీదేవి శరీరాన్ని ఆయన చేతుల నుండి

తొలగించాలి.

అదొక్కటే మార్గము.

కానీ శివుడు దాన్ని విడిచిపెట్టేలా లేడు.

అని ఆలోచించి తన ఆయుధంతో సతీదేవి శరీరాన్ని ఖండ ఖండములు

చేశాడు.

దానితో శివునకు స్పృహవచ్చి ఇది పరమేశ్వరి లీల అని గ్రహించి

హిమాలయ పర్వతానికి వెళ్ళి దక్షిణామూర్తియై తపస్సు చేసుకోవడం

మొదలు పెట్టా డు.


అక్కడ ఖండములైన సతీదేవి శరీరభాగాలు ఆకాశం నుండి భూమి

మీద 54 చోట్ల వివిధ భాగాలలో పడినవి.

అందులో 18 పెద్ద ఖండాలు.

అవి పడిన చోట్లే అష్టా దశ మహాశక్తి పీఠములైనవి.

అందులో అమ్మవారి పీఠం లేదా వెనుక భాగం లేదా ముడ్డి భాగం పడిన

ప్రదేశం ఈ పురహూతికా పురం తరువాత పీఠికాపురం గాను

కాలక్రమేణ పిఠాపురం గాను పేరు మార్చుకున్నది.

భారతదేశంలోని 18 ప్రముఖమైన శక్తి పీఠాలలో పదవదిగా

ప్రఖ్యాతిగాంచినది ఈ పురుహూతికా ఆలయం.

శ్రీ దత్తా త్రేయుల వారి మొట్టమొదటి అవతారం అయిన శ్రీపాద

శ్రీవల్లభుల వారు సింహ లగ్నం, తులా రాశి, చిత్త నక్షత్రంలో, వినాయక


చవితినాడు కాలిలో కొన్ని చిహ్నములతో 1320 వ సంవత్సరములో

శ్రీక్షేత్ర పిఠాపురం లో జన్మించినారు.

శ్రీపాద శ్రీవల్లభుల వారు తనకు 30 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు

పిఠాపురం మరియు కురువపురంలో నివసించి ఎన్నో అద్భుతాలు

మరియు మహిమలు ప్రదర్శించినట్టు శ్రీ గురుచరిత్ర మరియు అనేక

గ్రంథాల ద్వారా తెలుస్తు న్నది.

ఆయన కేవలం ధర్మ పరిరక్షణ కోసం మరియు మహా సిద్ధు లను, మహా

యోగులను ఆశీర్వదించటానికి మత్రమే అవతరించారు.

శ్రీపాద శ్రీవల్లభుల వారు జన్మించిన తరువాత ఒక 3 తలల పాము తన

పడగ విప్పి గొడుగులాగా 18 రోజుల పాటు స్వామి వారి వద్దనే వున్నది.


శ్రీపాద శ్రీవల్లభుల వారు గొప్ప వెలుగుతో జన్మించారు, అది చూసి వారి

తల్లి సుమతీ దేవి మూర్చపోయినది.

ఆ ప్రసవం జరిగిన గది నుండి ఆహ్లా దకరమైన సంగీతం తో పాటు ఒక

అశరీర వాణి అక్కడ వున్నవారిని ఆ గది నుండి వెళ్ళిపొమ్మని

హెచ్చరించినది.

4 వేదాలు, 18 పురాణాలు, మహా యోగులు అందరు ఆ ప్రసవ గదిలోని

స్వామికి గొప్ప వెలుతురు రూపములో దర్శనమిచ్చారు.

కాసేపట్లో ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది.

దైవం ముందుగానే నిర్ణయించిన విధముగా ఆయన జాతక చక్రం

ఎవరికీ చూపబడలేదు,
కేవలం త్రిపురలో నివసించే జైన మతస్తు డైన అక్షయ కుమార్ ద్వారా

చేరవలసిన సమయానికి పిఠాపురం చేరినది.

ఈ పిఠాపురం లో చాలా ఆలయాలు వున్నప్పటికి ముఖ్యంగా గోదావరి

నది సమీపములో వున్న ఈ క్షేత్ర ప్రాంగణములో

శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం,

శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆలయం,

పాదగయ క్షేత్రం,

పురుహూతిక ఆలయం,

శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం,

స్వయంభు దత్త ఆలయం దర్శించదగ్గవి.

లేపాక్షి లోని అతిపెద్ద ఏకశిల బసవేశ్వరుడి తరువాత

రెండవ అతి పెద్ద ఏకశిల బసవేశ్వరుడు ఇక్కడ వున్నాడు.


ఈ క్షేత్రములో నెలకొనియున్న శ్రీదత్తా త్రేయుడి విగ్రహం స్వయంభువు.

అనగా ఎవరూ చేతితో చెక్కనిది.

మిగతా దత్త క్షేత్రములలో వున్నవి చేతితో చెక్కినవి.

శ్రీపాద శ్రీవల్లభుల తండ్రి గారైన శ్రీ అప్పలరాజ శర్మ ఈ స్వయంభు

విగ్రహాన్ని 1350 వ సంవత్సరం నుండే పూజిస్తు న్నట్టు గా శ్రీపాద

శ్రీవల్లభుల చరిత్ర ద్వారా తెలుస్తుంది.

మన ఆత్మీయులు మరణించినప్పుడు పిండ ప్రధానం చేయటానికి ఈ

భారత దేశములో 3 అతి ముఖ్యమైన మరియు పవిత్రమైన స్థలాలు

మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి.

ఈ సందర్భముగా మనం ఇక్కడ ఒక పురాణగాథ తెలుసుకోవాలి.

పూర్వం కృత యుగములో గయాసురుడు అనే రాక్షసుడు

వుండేవాడు.
గయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా మహా భక్తు డు.

ఆయన రాక్షసులకు రాజు.

వేలాది సంతవ్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా

గొప్ప తపస్సు చేశాడు.

తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం

కోరుకొమ్మనగా,

నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థా లకన్నా పవిత్రమై ఉండేలాగా

వరం కావాలని కోరుకున్నా డు.

విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ

పవిత్రమైపోయింది,

అది ఎంతలా పవిత్రం అయిపోయింది అంటే చివరకు సువర్ణస్తేయము,

సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీ సంగమము, పై పాతకములు


చేసినవానితో స్నేహము, మొదలైన పంచమహాపాతకములు సహితంగా

అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి.

బ్రహ్మహత్య (బ్రాహ్మణుని చంపిన పాపము), భ్రూణహత్య (కడుపులో

ఉన్న శిశువుని గర్భస్రావం ద్వారా తొలగించటం), బాలహత్య, గోహత్య,

స్త్రీ హత్య ఇవి కూడా పంచ మహాపాతకములే.

ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు,

అంతేకాక కీటకాలు, సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టు కువస్తూ

ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి.

ఇది కాక ఆయన చేసిన గొప్ప యాగాలు,

పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్రపదవి లభించింది,

అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రు డు పదవీభ్రష్టు డయ్యాడు.


పదవిని కోల్పోయిన ఇంద్రు డు కూడా ఘోరమైన తపస్సు చేసి

బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు.

బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టా నని,

దానికి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుణ్ణి

కోరాడు.

గయాసురుడు చాలా భారీకాయుడు.

576 మైళ్ళ పొడవు,

268 మైళ్ళ నడుము చుట్టు కొలత కలిగిన అతికాయుడు

కాబట్టి పవిత్రమూ, విశాలమూ అయిన తన తలపై యజ్ఞం చేసుకొమ్మని

అనుమతించాడు .

బ్రహ్మ యాగం వేడికి గయుని తల కదలడం ప్రారంభించింది.


దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్దపెద్ద శిలలను

గయాసురిని తలపై పెట్టసాగాడు .

ఆ శిలలేవీ కూడా గయాసురుని తల కదలకుండా ఆపలేకపోగా అవన్నీ

చుట్టూ పడి రామపర్వతం, ప్రేతపర్వతం వంటివి ఏర్పడ్డా యి.

దానితో బ్రహ్మ చివరకు మరీచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత

అయిన దేవవ్రత శిలను తీసుకువచ్చి తలపై పెట్టా రు.

శిలారూపంలోనున్న మహాపతివ్రతను తోసివేయలేక కదలికలు కట్టడి

చేసుకున్నా మొత్తా నికి మానుకోలేకపోయాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన గదాధారుడై

వచ్చి తన కుడికాలు గయాసురుని తలపై పెట్టి తొక్కిపట్టా డు.

గయాసురుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి నా శరీరం

పరమ పవిత్రమైన తీర్థక్షేత్రంగా వరం పొందింది.


నా తలపై బ్రహ్మదేవుడే యాగం చేశాడు.

పతివ్రతయైన దేవవ్రత శిలారూపంలో నిలిచింది.

సాక్షాత్తూ మహావిష్ణువువైన నీవే కుడిపాదాన్ని పెట్టా వు.

ఇన్ని పొందిన నా శిరో,మధ్య,పాద భాగాలు పితృదేవతలను సైతం

తరింపజేసే ప్రభావశాలి,

పరమ పవిత్రమూ అయిన దివ్యక్షేత్రములయ్యేట్టు గా,

అవి తన పేరున వ్యవహరింపబడేట్టు గా వరం కావాలని కోరి పొందాడు .

గయాసురుని అంత్యకాలంలో విష్ణుమూర్తిని కోరుకున్న వరప్రభావంతో

ఆయన తల, నాభి, పాదం ప్రాంతాల్లో గయాక్షేత్రాలు ఏర్పడ్డా యి.

శిరోగయ, మధ్యగయ, పాదగయగా పిలవబడే వీటిలో శిరస్సుకు

సంబంధించినది గయ క్షేత్రంగా నేటికీ పేరుపొందుతోంది.

పాదగయను పిఠాపురంగా వ్యవహరిస్తు న్నారు.


అందులో మొదటిది శిరో గయ. బీహార్‌ రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధ పుణ్య

క్షేత్రం. ఇక్కడ గయాసురుడి శిరస్సు వున్న ప్రాంతం. ఇది బీహార్ లోని

గయ. ఇక్కడ శ్రీ మహావిష్ణువు గధాధరుడుగా పూజింపబడుతున్నాడు.

ఇక్కడ 18 శక్తి పీఠాలలో ఒక్కరైన మంగళ గౌరీ అమ్మవారు

కొలువైవున్నారు.

దేశంలో ఎక్కడెక్కడి వారు జన్మలో ఒక్కసారైనా గయను దర్శించి,

పితృ దేవతలకు అక్కడ పిండోదక క్రియలు జరిపి, అక్కడి ఒక వట

వృక్షానికి అభిముఖులై నిలచి, తమకు ఇష్టమైన ఒక కూరను, ఒక

పండును, ఒక ఆకును వదలివేయడం అనాదిగా వస్తు న్న సంప్రదాయం.

పితృదేవతలను తలచు కోవడం, విషయవాసనలను వీలైతే


వదలించుకోవడం, సాధ్యం కాకపోతే కనీసం తగ్గించుకోవడం ఈ

సంప్రదాయం వెనుక ఉన్న సూత్రమని పెద్దల మాట.

రెండవది నాభి గయ. గయాసురుడి నాభి వున్న ప్రాంతం. ఇది ఒడిస్సా

లోని బీజాపూర్ రైల్వే స్టేషన్ కు దగ్గరలో వున్నది. ఇక్కడ బ్రహ్మ

పూజింప బడుతున్నాడు. 18 శక్తి పీఠాలలో ఒక్కటై న గిరిజాదేవీ ఇక్కడ

కొలువైవున్నారు.

ఇక మూడవది ఆఖరిది అయిన పాదగయ. ఇది ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలోని, తూర్పుగోదావరి జిల్లా లో వున్న ఈ పిఠాపురం క్షేత్రం.

ఇక్కడ గయాసురుడి పాదాలు వున్న ప్రాంతం.

ఇక్కడ శివుడు కుక్కుటేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు.


18 శక్తి పీఠాలలో ఒక్కటై న శ్రీ పురుహూతికా అమ్మవారు ఇక్కడ

కొలువైవున్నారు.

ఈ క్షేత్రములోనే విష్ణు పాద, గయ పాద ఆలయాలు కూడా వున్నాయి.

కుక్కుటేశ్వర స్వామి ఆలయములో ఉదయం 5:30 నుండి 11 వరకు

అభిషేకాలు జరుగుతాయి.

మధ్యాహ్నం 12:30 కి మహా నివేదన

తిరిగి 4:30 కి పునర్దర్శనం

సాయంత్రం 6 గంటలకు ధూప సేవ

రాత్రి 7 గంటలకు నివేదన, నీరాజనం, మంత్ర పుష్పం, దర్భారు సేవ,

పవళింపు సేవ జరుగుతాయి.


ఈ ఆలయములో ప్రతీ అమావాస్యకు ఉదయం 10 గంటల నుండి

11:30 వరకు మహా మృత్యుంజయ హోమం జరుపబడుతున్నది.

దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తు ల కొరకు ఉచిత వసతి మరియు

భోజన సదుపాయాలు శ్రీపాద శ్రీవల్లభ సేవ సంఘం వారు వారి శక్తి

కొలది ఏర్పాటు చేస్తు న్నారు.

రెండు అంతస్తు ల భవనాలు 3 వున్నాయి. వాటిలో మొత్తం 47 గదులు,

2 చిన్న హాలులు, 70 కి సరిపడా ఒక డార్మిటరీ, 120 భక్తు లకు సరిపడా

1 పెద్ద భోజనాలయం వున్నాయి.


ఇవి కాక రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖవారు 13 AC and 6 non

AC గదులను ఏర్పాటుచేసినారు.

ఈ క్షేత్రం కాకినాడకు 20 కిలోమీటర్ల దూరములోను,

రాజమండ్రికి 70 కిలోమీటర్ల దూరములోను,

సామర్లకోట నుండి 20 కిలోమీటర్ల దూరములోను వున్నది.

బీహారులోని శిరో గయకు ఆర్ధిక, శారీరక కారణాల రీత్యా వెళ్ళి గయా

శ్రార్ధం నిర్వహించలేని వారు ఇక్కడకు వచ్చి గయా శ్రార్ధం నిర్వహిస్తా రు.

అందులోను మహాలయ పక్షములో ఈ ఆలయములో పిండప్రధానాలు

చేయటానికి వేలాదిగా జనం వస్తా రు.


ఇంతటి చారిత్రాత్మిక గొప్ప వైశిష్ఠ్యం కలిగిన ఈ ఆలయాన్ని ప్రతీ ఒక్క

మానవుడు తన వీలునుబట్టి దర్శించుకోవలసిన అవసరం ఎంతైనా

వుందంటే అతిశయోక్తి కాదు.

శుభంభవతు.

You might also like