You are on page 1of 160

పతంజలిమహర్షి విరచిత

యోగసూత్రములు

రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ

పంచవటి స్పిరిట్యూల్ ఫౌండేషన్


blog : www.teluguyogi.net, e_mail : ssarma04@gmail.com

websites : www.mapanchawati.org, www.usapanchawati.org


యోగసూత్ర ములు
రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ

© పబ్లి షర్స్ : పంచవటి స్పిరిట్యూల్ ఫౌండేషన్

ప్ర థమ ముద్ర ణ : November 2020


అంకితం
కం|| నవమాసంబులు గాచుచు
అవనికి నను దెచ్చినట్టి యమృతమయియౌ
శివకామిని పదముల కడ
కవనంబుల సుమములుంచి కరములు మోడ్తున్
ఆ|| ఆత్మతత్త్వమెల్ల నతిశయింపగ దెల్పి
కరుణతోడ నన్ను గాచినట్టి
నారసింహ గురుని నెమ్మనంబున నిల్పి
ప్రణతులిడుదు నిచట పావనునకు
తే|| మహితమంత్రమునొసగుచు మాయ నడపి
దివ్యమార్గము జూపిన ధీవరునకు
సారగంభీర గురునకు సాంజలించి
సాగి మ్రొక్కెద నెప్పుడు సన్నుతించి

జన్మనిచ్చిన తల్లియైన శివకామేశ్వరీదేవి,


గురువర్యులైన శ్రీమత్ స్వామి నందానంద,
శ్రీమత్ స్వామి గంభీరానందుల
పావన పాద పద్మములకు
ఈ కృతి అంకితం.

- సత్యనారాయణ శర్మ
కృతజ్ఞ తలు
ఈ పుస్తకం వ్రాయడంలో అనుక్షణం తన సహకారం అందించిన నా శ్రీమతి సరళాదేవికి
కృతజ్ఞతలు ఆశీస్సులు.
ఈ పుస్తకం టైప్ సెట్టింగ్ లోనూ, తప్పులు దిద్దడంలోనూ సహకరించిన నా శిష్యురాళ్ళు అఖిల
జంపాల (డెట్రాయిట్, USA), శ్రీ లలిత (డెట్రాయిట్, USA) లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.
కవర్ పేజీ డిజైన్ ను అద్భుతంగా తయారుచేసి ఇచ్చిన నా శిష్యుడు ప్రవీణ్
(praveen00787@gmail.com, హైదరాబాద్) కు కృతజ్ఞతలు, ఆశీస్సులు.
ముందుమాట
భారతీయ షడ్దర్శనములలో యోగదర్శనం ఒకటి. దీని కర్త పతంజలిమహర్షి. ఈయన
ఆదిశేషుని అవతారమని నమ్మకం ఉన్నది. అందుకే, ఈయన విగ్రహం సగం మానవాకారంలో,
సగం సర్పాకారంలో ఉంటుంది. సంస్కృతంలో ‘పాత’ అంటే పడటం, ‘అంజలి’ అంటే దోసిలి.
కనుక పతంజలి అంటే, దైవానుగ్రహం వలన పైనుంచి దోసిలిలో పడినవాడని అర్థం.
ప్రాచీనగాథల ప్రకారం ఈయన తల్లిగారు ఒక మంచి పుత్రుని కొరకు ప్రార్థిస్తూ సూర్యునికి
అర్ఘ్యం ఇవ్వబోతున్న సమయంలో ఆమె అంజలిలో ఒక తెల్లని పాముపిల్ల పడిందని అది ఒక
పిల్లవానిగా మారిందని ఆయనే పతంజలిమహర్షి యని ఉన్నది. ఈయన క్రీ.పూ. 400
సంవత్సరప్రాంతంలో ఉత్తరభారతదేశంలో నివసించినట్లుగా పండితులు నమ్ముతున్నారు. అంటే,
యోగసూత్రములు తక్కువలో తక్కువగా 2400 సంవత్సరముల క్రిందటివని అర్థమౌతున్నది.
యోగశాస్త్రము, ఆయుర్వేదము, పాణిని వ్యాకరణము, నాట్యశాస్త్రములపైన పతంజలిమహర్షి
గ్రంథములను రచించినట్లు మన దేశంలో సాంప్రదాయపరమైన నమ్మకం ఉన్నది. కానీ, ఈ
నలుగురు పతంజలులు ఒకరో కాదో తెలియదు. తురుష్కుల దండయాత్రలలో లెక్కలేనన్ని
విలువైన గ్రంథములను మనం కోల్పోయిన ఫలితంగా మన దేశపు ప్రాచీనచరిత్ర యొక్క
రుజువులు మాయమైపోయాయి. కనుక ఋషుల కాలములను, జననతేదీలను, వంశచరిత్రలను
ఇదమిద్ధంగా చెప్పలేని పరిస్థితి మన దేశంలో ఉన్నది. మనకు ప్రస్తుతం దొరుకుతున్న
గ్రంథములలో వాడబడిన భాషను బట్టి, ఇతర ఋషులను, గ్రంథకర్తలను, వారి గ్రంథములలోని
విషయములను, వీరు స్మరించిన మాటలను బట్టి, ఆయా కాలములను అంచనా వేయవలసిన
దుస్థితి మనకు పట్టింది.
యోగశాస్త్రమనేది పతంజలిమహర్షి కంటే ఎంతో ముందునుంచీ మనదేశంలో ఉన్నది. కానీ
దానినాయన ఒక శాస్త్రంగా మలచి, దానికొక స్పష్టమైన రూపమునిచ్చాడు. ఈయన వ్రాసిన
యోగశాస్త్రంలో వాడిన పదములను, భావనలను బట్టి, దీనిపైన సాంఖ్యదర్శనము, బౌద్ధమతముల
ప్రభావం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈయన, తనకంటే కనీసం ఆరువందల సంవత్సరముల
పూర్వముదైన సాంఖ్యదర్శనమును ఆధారంగా చేసుకుని, కొన్ని క్రొత్తవిషయములను దానికి చేర్చి
యోగసూత్రములను రచించాడు.
1600 ఏళ్ళ పాటు సజీవంగా ఉన్న యోగసూత్రములు, దాదాపుగా 12 వ శతాబ్దమునుండి 19
వ శతాబ్దం వరకు, ఏడువందల సంవత్సరముల పాటు, మన దేశంలో మరుగున పడిపోయాయి.
అది తురుష్కుల దండయాత్రలతో మన దేశం వేలాది విలువైన గ్రంథములను, దేవాలయములను,
సంపదను కోల్పోయిన చీకటియుగం. ఆ సమయంలో, హఠయోగము, తంత్రయోగములు
ప్రచారంలోకి వచ్చాయి. అవికూడా కొంతమంది చేత మాత్రమే అతిరహస్యంగా అభ్యాసం
చేయబడేవి.

తో చీ
అతిగహనమైన పదములతో కూడియున్న యోగసూత్రములకు, ప్రాచీనకాలం నుంచి
అనేకమంది విద్వాంసులు పండితులు వ్యాఖ్యానములను వ్రాసి యున్నారు. వారిలో వ్యాసమహర్షి,
భోజరాజు, శంకరులు, వాచస్పతిమిశ్రుడు, విజ్ఞానభిక్షువు, రామానందసరస్వతి మొదలైనవారు
ముఖ్యులు. ఇంకా ఎన్నో విలువైన భాష్యములు ఉండి ఉండవచ్చు. కానీ అవన్నీ
నశించిపోయాయి. 125 సంవత్సరముల క్రితం వివేకానందస్వామి తన
ఆంగ్లభాషోపన్యాసములలో యోగసూత్రములను విపులముగా వివరించారు. అప్పటినుంచీ మళ్ళీ
ప్రపంచదేశములలోని పండితులు, యోగాభిమానులు వీటిని చదవడం, అర్థంచేసుకోవడం
మొదలుపెట్టారు. ఆ విధంగా మళ్ళీ ఇవి వెలుగులోకి వచ్చాయి.
అధికారభేదములను బట్టి, అయిదుస్థాయిలకు చెందిన సాధనావిధానములు
యోగసూత్రములలో చెప్పబడినాయి.

మొదటిస్థా యి
ఒకేసారిగా మనస్సును అదుపు చేసుకుని ధ్యానంలో పెట్టలిగిన ఉత్తమాధికారులకు సవితర్క,
సవిచార, నిర్వితర్క, నిర్విచార సమాధులతో కూడిన ధ్యానమార్గం బోధింపబడింది. దీనిలో
సాంఖ్యంలో చెప్పబడిన 25 తత్త్వములు మాత్రమే ఉన్నాయి. పురాణకాలపు దేవీదేవతల ప్రసక్తి
దీనిలో లేదు. ఇది స్వచ్ఛమైన ప్రకృతిపురుష వివేచనా మార్గం. దీనిని విహంగ (పక్షి) మార్గమని
అనుకోవచ్చు.

రెండవస్థా యి
ఈ స్థాయిలో ధ్యానం చేయలేనివారికి, అంటే, మధ్యమాధికారులకు, దీనికంటే ఒక మెట్టు
తక్కువదైన ఓంకారోపాసన చెప్పబడింది. ఈశ్వరుడన్న భావం ప్రవేశపెట్టబడి, ఆయన నామమైన
ఓంకారమును జపిస్తూ, దాని అర్థమును భావించాలని బోధింపబడింది. ఇది జపంతో కూడిన
ధ్యానమార్గం. దీనిని భ్రమర (తుమ్మెద) మార్గమని అనుకోవచ్చు.
మూడవస్థా యి
ఈ స్థాయిని అందుకోలేనివారికి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరప్రణిధానములతో కూడిన
సాంప్రదాయ ఆచారపూరిత మార్గము బోధింపబడింది. దీనిలో, వారి వారి స్థాయిని బట్టి ఏడు
విధములైన ధారణామార్గములు చెప్పబడినాయి. ఇది మర్కట (కోతి) మార్గమని చెప్పబడుతుంది.

నాలుగవస్థా యి
ఈ స్థాయిని కూడా అందుకోలేని మందాధికారులకు (మరీ అల్పస్థాయి వారికి) యమ
నియమములతో కూడిన అష్టాంగయోగం బోధింపబడింది. దేహమును, ఇంద్రియములను,
మనస్సును అనేక నియమనిష్ఠలకు గురిచేసి, మెల్లిమెల్లిగా, క్రమంగా, పరిపక్వతను సాధించే
మార్గం ఇది. తంత్రంలో ఇది పిపీలికా (చీమ) మార్గమని అనబడింది.
అయిదవస్థా యి
ఇవిగాక, ఈశ్వరప్రణిధానమును వివరించే సూత్రంలో సాధారణభక్తిమార్గం చెప్పబడింది.
అష్టాంగయోగమును కూడా అనుసరించలేని మరీ తక్కువస్థాయి మనుషులకు ఇది
సరిపోతుంది. నేడు లోకంలో మనం చూస్తున్న పూజా పునస్కారములు, వ్రతములు,
హోమములు, దీక్షలు, తంతులు, తీర్థయాత్రలు, పురాణకాలక్షేపములతో కూడిన మార్గం ఇదే. ఇది
మరీ నేలబారు పద్ధతి. దీనిని శంబూక (నత్త) మార్గమని అనవచ్చు.
ప్రపంచంలో ఏ మతంవారైనా ఈ అయిదుమార్గముల పరిధి లోపలనే ఉంటారు. వీటిని
దాటిన ఆరాధనావిధానములు ఎక్కడా ఉండవు. మానవుడు దైవమును వీటి ద్వారా మాత్రమే
ఆరాధించగలుగుతాడు. ఆధ్యాత్మికమార్గంలో ఈ దారులలోనే నడువగలుగుతాడు.
యోగసూత్రములకు ఆధారములుగా కనిపిస్తున్న సాంఖ్యము, బౌద్ధములను ఇప్పుడు
క్లుప్తంగా వివరిస్తాను.
సాంఖ్యదర్శనం
అతిప్రాచీనమైన ఈ సిద్ధాంతం కపిలమహర్షి చేత ఇప్పటికి దాదాపు మూడువేల
సంవత్సరముల క్రితం ప్రతిపాదించబడింది. తాత్త్వికచింతనా చరిత్రలో మొట్టమొదటిసారి సృష్టిని,
మానవజీవితమును, సక్రమంగా, నిర్దుష్టంగా, అర్థం చేసుకున్నది, వివరించినది సాంఖ్యమే.
ప్రకృతిపురుష వివేకమన్నది దీనిలో ప్రధానమైన అంశం. 24 తత్త్వములతో కూడినది ప్రకృతియని,
దీనికి పరుడైనవాడు పురుషుడని దీని సిద్ధాంతము. విష్ణుభగవానుని అవతారంగా
భావించబడుతున్న కపిలమహర్షి చెప్పిన ప్రాచీనసాంఖ్యం ఇప్పుడు దొరకడం లేదు. ఆయన
తర్వాత ఈ దర్శనం చాలా మార్పులకు లోనౌతూ వచ్చింది. 24, 25, 26 తత్త్వములతో కూడిన
మూడు విధములైన సాంఖ్యములున్నట్లుగా మహాభారతంలో చెప్పబడింది. వీనిలోని మొదటి
రెండు సాంఖ్యములలో సృష్టికర్తయైన దైవం యొక్క ప్రస్తావన లేదు. మూడవది మాత్రమే
ఈశ్వరుని నిర్దేశించింది. సాంఖ్యము దైవమును ఒప్పుకొనదు. శుద్ధమైన ఎరుక యనేది
పురుషుడని, మిగతాదంతా ప్రకృతియని అదంటుంది. ప్రకృతితో కలయికయే బంధమని,
పురుషుడు తన స్వస్థితిలో తానుంటే అది మోక్షమని దీని తత్త్వం.
క్రీ.శ. రెండవ శతాబ్దానికి చెందిన ఈశ్వరకృష్ణుని ‘సాంఖ్యకారిక’ మనకు లభిస్తున్న
సాంఖ్యగ్రంథములలో ప్రాచీనమైనది. అంతకు ముందున్న సాంఖ్యం అప్పటికే అనేక మార్పులకు
లోనైంది. చరిత్ర పరిశోధకుల అభిప్రాయములను బట్టి, క్రీ.పూ. 9 వ శతాబ్దానికి చెందిన
ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులలోనే సాంఖ్యదర్శనం యొక్క భావములు చర్చించబడి
కనిపిస్తున్నాయి. అంటే, ఈ దర్శనం అప్పటికంటే ఇంకా ప్రాచీనమైనదని తెలుస్తున్నది.
సాంఖ్యదర్శనం ముఖ్యంగా పురుష, ప్రకృతులనే రెండు విషయములను ప్రబోధిస్తుందని పైన
చెప్పాను. సాధారణంగా నేడు ఆమోదించబడుతున్న సాంఖ్యం ప్రకారం, ప్రకృతిలో 24
తత్త్వములుంటాయి. పురుషుడు 25 వ తత్త్వం. ఈ విధంగా సాంఖ్యం పంచవింశతి (25)

తో జీ లో
తత్త్వములతో, ప్రపంచమును, సృష్టిని, మానవజీవితమును, మనస్సును, ఆలోచనను, జన్మలను,
కర్మలను, బంధమును, మోక్షమును మొత్తాన్ని వివరిస్తుంది.
ఇరవై అయిదు తత్త్వములు
పురుషుడు - 1 (ప్రకృత్యతీత గుణాతీత
సాక్షీమాత్ర నిష్క్రియాస్థితి)
ప్రకృతి - 1 (త్రిగుణాత్మిక, అవ్యక్తం,
ప్రధానం, మూలకారణం)
మహత్ - 1 (విశాలమైన, గొప్ప, పెద్ద)
అహంకారం - 1 (నేనన్న స్పృహ)
మనస్సు - 1 (మననం చేసే శక్తి)
పంచ తన్మాత్రలు - 5 (పంచభూతముల సూక్ష్మస్థితులు,
రంగు, రుచి, వాసన, ధ్వని, స్పర్శ)
పంచ భూతములు - 5 (భూమి, నీరు, అగ్ని,
వాయువు, ఆకాశము)
పంచ జ్ఞానేంద్రియములు - 5 (కన్ను, ముక్కు, చెవి,
నాలుక, చర్మము)
పంచ కర్మేంద్రియములు - 5 (నోరు, చేతులు, కాళ్ళు,
గుదము, జననేంద్రియము)
-------------------------------------
మొత్తం - 25
-------------------------------------
వీనిలో, ప్రకృతి అనేది, పదార్థము, శక్తుల కలయికగా ఉంటుంది. దీనిలో సత్త్వ, రజో, తమో
గుణములుంటాయి. వ్యక్తం కాదు గనుక దీనిని అవ్యక్తమని, సృష్టిలో ఇదే ప్రధానమైనది గనుక
ప్రధానమని, సృష్టి దీనినుండే కలిగింది గనుక ‘మూలకారణ’మని, ‘మూలప్రకృతి’యని అంటారు.
సాంఖ్యదర్శనపు కాలమునకు దాదాపు రెండువేల ఏళ్ళ తర్వాత వచ్చిన పురాణకాలంలో దీనినే
‘శక్తి’ అని, ‘అమ్మవార’ని పిలవడం మొదలుపెట్టారు. లలితాసహస్రంలోని ‘మూలప్రకృతిరవ్యక్తా
వ్యక్తావ్యక్త స్వరూపిణీ’ అనే నామం సాంఖ్యదర్శనములోని ప్రకృతినే ‘అమ్మవారు’గా సూచిస్తున్నది.
మధ్యయుగముల నాటి తంత్రశాస్త్రంలోని శివశక్తులనే భావనలకు అతిప్రాచీనకాలపు
సాంఖ్యదర్శనంలోని ‘పురుష ప్రకృతు’ లనే భావనలే ఆధారములు.
మహత్ అంటే, పెద్దదైన, విశాలమైన, అని అర్థములు. మహత్తుకు ముందున్న

టే చే తో నే
త్రిగుణాత్మకమైన ప్రకృతి అంటే, చెట్లూ చేమలతో కూడిన మనం అనుకునే ‘ప్రకృతి’ కాదు.
అవ్యక్తరూపంలో ఉన్న పురుషునిలో, వ్యక్తం కావాలన్న ధోరణినే ప్రకృతి అంటారు. దానికొక
రూపం లేదు. త్రిగుణముల మిశ్రమంగా అది ఉంటుంది. దానినుంచి మహత్తు పుడుతుంది.
అంటే, ఒక విశాలత్వం మొదలౌతుంది. విస్తరించాలన్న ఇచ్ఛ కలుగుతుంది. అది మనం చూచే
విశ్వం కాదు. ఆకాశమూ కాదు. వీటికంటే ముందున్న స్థితియని, వీటికి ఆధారమైన స్థితియని,
గ్రహించాలి. ఈ మహత్తు నుంచి, అహం (నేను) అనే స్ఫురణ కలిగింది. దానికి ఒక ఆలోచన
కలిగింది. అది మనస్సు అయింది. త్రిగుణముల యొక్క రకరకములైన కలయికలతో
పంచభూతములు, వాటి తన్మాత్రలు, పది ఇంద్రియములు పుట్టుకొచ్చాయి. ఈ పంచభూతములే
మన కంటికి కనిపిస్తున్న జగత్తు లేదా విశ్వం అనబడుతుంది. వీటన్నిటికీ మూలకారణము ప్రకృతి.
దానికి అతీతుడు పురుషుడు.
ప్రకృతి పురుషులంటే మనకు తెలిసిన స్త్రీ పురుషులని అనుకోకూడదు. వాటికి ఆకారములు,
లింగములు లేవు. ఈ తత్త్వములన్నీ సృష్టిలో ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోవడం ద్వారా సృష్టిని,
దాని నియమములను, మానవజీవితమును, జన్మలను, కర్మలను, బంధమును, మోక్షమును,
వివరించింది సాంఖ్యదర్శనం.
ఇరవై నాలుగు తత్త్వములు
ప్రాచీనసాంఖ్యంలో ఇరవైనాలుగు తత్త్వములే ఉన్నాయని కొందరి భావన. దీనిలో
ప్రకృతిపురుషులు కలసి ఒకటే తత్త్వం అవుతుంది. అవ్యక్తస్థితిలో ఉన్నది పురుషుడని, సృష్టిగా
వ్యక్తమయ్యేది ప్రకృతియని, ఈ రెండూ కలసి ఒకే తత్త్వంలో రెండు భాగములని ఇదంటుంది.
కనుక దీనిప్రకారం, తత్త్వములు ఇరవైనాలుగే అవుతాయి.

ఇరవై ఆరు తత్త్వములు


పైన చెప్పబడిన 25 తత్త్వములకు తోడు, ఈశ్వరుడనిన దానిని కూడా కలుపుకున్నపుడు
తత్త్వములు 26 అవుతాయని ఈ విధానమంటుంది. ఇది యోగదర్శనపు భావంతో సరిపోతుంది.
24, 25 తత్త్వములతో కూడిన సాంఖ్యమును నిరీశ్వర (ఈశ్వరభావన లేని) సాంఖ్యమని, 26
తత్త్వములున్నదానిని సేశ్వర (స+ఈశ్వర, ఈశ్వరభావన కలిగిన) సాంఖ్యమని అంటారు.
ప్రకృతిపురుషులు ఎల్లప్పుడూ నిత్యులేనని సాంఖ్యమంటుంది. ఇవి రెండూ ఒకదానిని విడచి
మరొకటి ఉండలేవు. పనిచేయలేవు. కుంటివాడు, గ్రుడ్డివాడు కలసి నడచినట్లు ఈ ప్రక్రియ
ఉంటుందని సాంఖ్యం అంటుంది. గ్రుడ్డివాని భుజములపైన కుంటివాడు కూర్చుంటాడు. అతడు
దారి చెబుతుంటే గ్రుడ్డివాడు నడుస్తూ పోతూ ఉంటాడు. నడవలేనివాడు పురుషుడు. అతనిలో
కదలిక ఉండదు. విచక్షణాదృష్టి లేని శక్తి, ప్రకృతి. పురుషుని జ్ఞానం ప్రకృతిలో ప్రతిఫలించి దానిని
నడిపిస్తుంది. పురుషుని సహకారం లేనిదే ప్రకృతి నడువలేదు. ప్రకృతిలో ప్రతిఫలించకపోతే
పురుషుని జ్ఞానమునకు అభివ్యక్తి లేదు. ఈ రెండు తత్త్వములూ ఈ విధంగా మొదలూ చివరా
అంటూ లేకుండా, ఎప్పటినుంచో ఉన్నాయని సాంఖ్యం అంటుంది.

తే దే
అయితే, నిరీశ్వరసాంఖ్యం దేవుడు, ఈశ్వరుడు, పరమాత్మ అనిన భావనలను ఒప్పుకొనదు.
సృష్టికి మూలంగా ‘దేవుడు’ అన్నది ఉండవలసిన అవసరం లేదని అదంటుంది. ఈ
నిరీశ్వరభావమును సమర్థిస్తూ సాంఖ్యం చెప్పే తర్కం చాలా హేతుబద్ధంగా ఉంటుంది.
దేవుడు లేదా ఈశ్వరుడు అనేది ఉంటే, అది ప్రకృతి నుంచి ముక్తుడైనా అయి ఉండాలి. లేదా
ప్రకృతికి బద్ధుడైనా అయి ఉండాలి. ముక్తుడైతే సృష్టిని చేయవలసిన అగత్యం అతడికి లేదు.
బద్ధుడైతే సృష్టిని చేసే స్వాతంత్ర్యం అతనికి ఉండదు. కనుక ఏ విధంగా చూచినప్పటికీ, సృష్టికర్త
యొక్క అవసరం సృష్టికి లేదు. మనం మామూలుగా అనుకునే ‘దేవుడు’ సృష్టికర్త కాదంటుంది
సాంఖ్యం.
ఈ కారణం వల్ల సాంఖ్యమును కొందరు పండితులు నాస్తికవాదంగా భావిస్తారు. కానీ ఇది
సరికాదు. వేదప్రమాణమును ఒప్పుకున్నందువల్లనూ, బంధమోక్షములను
ప్రతిపాదించినందువల్లనూ సాంఖ్యం వైదికమే అవుతున్నది. ఋగ్వేదంలోను, ఛాందోగ్య,
బృహదారణ్యక, కఠ, శ్వేతాశ్వతరాది ఉపనిషత్తులలోను సాంఖ్యదర్శనం యొక్క భావములు
కోకొల్లలుగా కనిపిస్తాయి. విష్ణుభగవానుని అవతారంగా కీర్తించబడే కపిలమహర్షిచేత
ప్రతిపాదించబడినది గనుక ఇది ఆస్తికధర్మమే. కాకుంటే, దీని తరువాత వచ్చిన బౌద్ధ, జైనాది
అనేక అవైదికమతములు కూడా దీని భావములను ధారాళముగా స్వీకరించి తమలో
కలుపుకున్నాయి. సాంఖ్యం యొక్క భావజాలంతో ప్రభావితం కాని భారతీయ తాత్త్వికచింతన
అంటూ లేదు. సాంఖ్యదర్శనమునకు యోగదర్శనమునకు ప్రధానమైన భేదం ఈశ్వరుడే. మిగిలిన
విషయములలో ఈ రెంటిలోనూ పెద్ద భేదములు కనిపించవు.
ప్రకృతిదాస్యం నుండి విడివడిన పురుషుడు తన స్వస్థితిలో తానుండటమే మోక్షమని
సాంఖ్యం అంటుంది. దీనిని కైవల్యస్థితి యని ఈ దర్శనంలో అంటారు. ఇటువంటి ముక్తజీవులు
సృష్టిలో అనేకులుంటారని సాంఖ్యం ప్రతిపాదిస్తుంది. కానీ యోగదర్శనం దీనికి భిన్నంగా, ఈ
ముక్తజీవులకు విభిన్నుడు, ఎన్నడూ ప్రకృతిబంధంలో చిక్కుకొనని ఒక ప్రత్యేకమైన ఆత్మ సృష్టికి
అతీతంగా వెలుగుతూ ఉన్నదని అంటూ, దానిని ఈశ్వరుడని పిలుస్తుంది. ఇదే సాంఖ్య -
యోగములకు గల ముఖ్యమైన భేదం. ఇదిగాక, సాంఖ్యదర్శనంలో సూక్ష్మములైన చిక్కుముడులు,
తాత్వికపరమైన సమస్యలు, అంతుబట్టని ప్రశ్నలు, చాలా ఉన్నాయి. వాటి జోలికి ప్రస్తుతం నేను
పోవడం లేదు. వాటినన్నింటినీ ఒక వేరే గ్రంథంలో చర్చిస్తాను.
ప్రపంచంలో అతిగొప్పదైన, అతిప్రాచీనమైన తాత్త్వికదర్శనం సాంఖ్యదర్శనం. దీనిని
సూత్రీకరించి పెట్టిన కపిలమహర్షి నేడు ఎవరికీ గుర్తులేడు. ఆయనకు కనీసం అయిదువందల
ఏండ్ల తర్వాత వచ్చిన బుద్ధుడు నేడు ప్రపంచదేశాలలో పూజింపబడుతున్నాడు. కానీ బుద్ధుడు ఏ
సాంఖ్యదర్శనమును అనుసరించాడో, దేనిపైన తన బౌద్ధమును నిర్మించాడో, ఆ సాంఖ్యదర్శన కర్త
అయిన కపిలమహర్షిని ప్రపంచం మర్చిపోయింది. ఇదే లోకానికి పట్టిన దరిద్రం. మనదేశపు
తత్త్వశాస్త్రముకు గాని, పాశ్చాత్య తత్త్వశాస్త్రమునకు గాని మూలములు సాంఖ్యదర్శనంలో
ఉన్నాయని పండితులు ఒప్పుకుంటున్నారు. భారతదేశపు అత్యున్నతమైన తాత్వికచింతనగా
కొనియాడబడుతున్న అద్వైతవేదాంతమనేది సాంఖ్యదర్శనపు పునాదుల మీదనే నిర్మించబడింది.
దీ చే కో
దీనిని సరిగా అర్థం చేసుకోవలసిన అవసరం మనకున్నది.
బౌద్ధం
దీనిని క్రీ. పూ. 5 వ శతాబ్దంలో గౌతమబుద్ధుడు ప్రతిపాదించాడు. తనకంటే చాలా
ప్రాచీనమైన సాంఖ్యం నుంచి బుద్ధుడు ఎన్నో భావనలను స్వీకరించాడు. సాంఖ్యంలో ‘పురుషుడు’
అనబడినది వేదాంతంలో లేదా యోగంలో ‘ఆత్మ’ గా పిలువబడింది. అయితే, బౌద్ధం ఈ ఆత్మను
ఒప్పుకోలేదు. అందుకని అది అనాత్మవాదమైంది. ఇదొక్కటి తప్పితే సాంఖ్యమునకు బౌద్ధమునకు
పెద్దగా తేడా లేదు. సాంఖ్యములో చెప్పబడిన ఇంద్రియములను, చిత్తమును బుద్ధుడు తన
సిద్ధాంతములో ఉపయోగించుకున్నాడు. కానీ ఇంద్రియానుభవములను పొందుతున్న ‘ఆత్మ’
అనేది లేదన్నాడు. ‘నేన’న్న ఎరుక ఇంద్రియానుభవం కలిగేటప్పుడే పుడుతుంది. అది పోయాక
ఇదీ పోతుందన్నాడు. దీనిని ‘ప్రతీత్యసముత్పాదం’ అని ఆయన పిలిచాడు. బుద్ధుడు
పంచభూతములను ఒప్పుకోలేదు. ఆకాశం కాక మిగిలిన నాలుగింటిని మాత్రమే తన బోధనలలో
ఆయన చెప్పాడు. వేదాంతంలో ‘అహం’ అన్నదానినే బుద్ధుడు ‘ఆత్మ’ అని పిలిచాడు. అహమనేది
మిథ్య యని వేదాంతమంటుంది. ఆత్మ అనేది లేదని బుద్ధుడన్నాడు. సరిగ్గా అర్థం చేసుకుంటే
వేదాంతమునకు బుద్ధుని బోధకు ఏమీ భేదం లేదు. పదముల వాడకం వల్లను, సరిగా అర్థం
చేసుకోకపోవడం వల్లను వచ్చిన ఇబ్బందులే ఇవన్నీ. బుద్ధుడు వాడిన ఆత్మ అనే పదమూ,
వేదాంతంలో వాడబడిన ఆత్మ అనే పదమూ సమానార్థకములు కావన్న విషయం అర్థమైతే
వైరుధ్యం తొలగిపోతుంది.
బుద్ధుని గురువులలో ఒకరైన అలారకలాముడు సాంఖ్యదర్శనమును అనుసరించేవాడని
‘బుద్ధచరిత్ర’ ను వ్రాసిన అశ్వఘోషుడు అభిప్రాయపడ్డాడు. ఇతడు క్రీ.శ. మొదటి శతాబ్దానికి
చెందినవాడు. అంటే దాదాపుగా రెండువేల ఏండ్ల క్రిందటివాడు. కనుక, సాంఖ్యదర్శనం
బుద్ధునికంటే ఎంతో ప్రాచీనమైనదని అర్థమౌతున్నది. ప్రపంచం మొత్తంమీద మొట్టమొదటి
అత్యున్నత తాత్వికచింతన సాంఖ్యమేనని పండితుల అభిప్రాయం.
ఆత్మను ఒప్పుకోనందువల్ల బౌద్ధం ‘అనాత్మవాదం’ అయింది. ఇదే కారణం వల్ల, భారతదేశం
నుండి బౌద్ధం కనుమరుగు అయింది. ఎందుకంటే, బౌద్ధం తర్వాత మన తాత్వికచింతన ఇంకా
ఎంతో పరిపక్వతను పొందింది. ఆత్మవాదులమైన మనకు అనాత్మవాదమైన బౌద్ధం నచ్చలేదు.
అద్వైతవేదాంతులతో జరిగిన అనేక వాదప్రతివాదములలో బౌద్ధులు పరాజయం పాలయ్యారు.
వేదాంతుల నిశిత తర్కమునకు బౌద్ధులు సరియైన సమాధానములు చెప్పలేకపోయారు. కనుక
బౌద్ధం క్రమంగా సమాజపు ఆదరణను కోల్పోయింది.
యోగదర్శనమనేది, సాంఖ్య బౌద్ధముల మేలుకలయికగా కనిపిస్తుంది. దీనిలో సాంఖ్యం
నుంచి, బౌద్ధం నుంచి అనేక విషయములు తీసుకోబడినాయి. ఆయా వివరములను ఆయా
సూత్రములను వివరించే చోట ప్రస్తావిస్తాను.
సాంఖ్యమనేది గట్టిపునాదుల పైన కట్టబడిన ఒక ఇల్లు వంటిది. దానికి కొన్ని చిన్నచిన్న
మార్పులు చేసిన బుద్ధుడు, తన క్రొత్త ఇంటిని ‘బౌద్ధం’ అన్నాడు. ఇంకొన్ని మార్పులు చేసిన
చే
పతంజలిమహర్షి దానిని ‘యోగశాస్త్రం’ అన్నాడు. మరికొన్ని మార్పులు చేయబడి, ఆ ఇంటికి ఒక
పరిపూర్ణమైన రూపమును ఇచ్చినది ‘అద్వైత వేదాంతం’ అయింది. వీటన్నిటినీ అర్థం
చేసుకున్నపుడే ‘సనాతన ధర్మం’, ‘హిందూమతం’ అనేవి ఏమిటో, వాటిలో ఎంత లోతైన తాత్త్విక
చింతనలున్నాయో అర్థమౌతుంది.
పాతంజల యోగశాస్త్రమును, దానికి మూలమైన సాంఖ్యదర్శనమును, బౌద్ధంతో వీటి
సామ్యములను, భేదములను ఈ గ్రంథంలో సులభమైన భాషలో వివరించే ప్రయత్నం చేశాను.
యోగశాస్త్రాభిమానులకు ఈ గ్రంథం సరియైన అవగాహనను కలిగిస్తుందని, వారిని ఇతోధికంగా
సాధనోన్ముఖులను చేస్తుందని ఆశిస్తున్నాను.

సత్యనారాయణ శర్మ
హై దరాబాద్
నవంబర్ - 2020
విషయసూచిక
మొదటి అధ్యాయము - సమాధి పాదము
వృత్తులు - అయిదు విధములు
ప్రమాణములు - మూడు విధములు
విపర్యయము
వికల్పము
నిద్ర
స్మృతి
అభ్యాస - వైరాగ్యములు
సంప్రజ్ఞాత సమాధి
గౌతమబుద్ధుని బోధ
సమాధి స్థితులు - వివరణ
భక్తియోగంలో నాలుగు స్థితులు
జ్ఞానయోగంలో నాలుగు స్థితులు
కాలము - సమాధి స్థితులు
భవప్రత్యయము
ఉపాయ ప్రత్యయము
సాధనా తీవ్రతలోని భేదములు
ఈశ్వరుడు - యోగశాస్త్ర నిర్వచనం
ఏకాగ్రతకు ఆటంకములు
ధారణోపాయములు
ప్రాణాయామం
విషయధ్యానం
జ్యోతి ధ్యానం
గురుధ్యానం
స్వప్న - నిద్రా - ధ్యానం
అభిమత ధ్యానం
వృత్తిక్షీణత - మనశ్శుద్ధి - త్రిపుటి
సవితర్క - నిర్వితర్క సమాధులు
సవిచార - నిర్విచార సమాధులు
సబీజ - నిర్బీజ సమాధులు
రెండవ అధ్యాయము - సాధన పాదము
క్లేశములు
క్లేశములను ఎలా జయించాలి?
క్లేశములు - కర్మలు - జన్మలు
విశేషము - అవిశేషము
లింగ - అలింగములు
సంప్రజ్ఞాత సమాధి ఫలితములు
అసంప్రజ్ఞాత సమాధి ఫలితములు
అష్టాంగయోగము
యమనియమముల ఉపయోగములు
యమనియమముల ప్రాముఖ్యత
మూడవ అధ్యాయము - విభూతి పాదము
సంస్కారనిరోధం - విధానం
సంయమములు - సిద్ధులు
నాలుగవ అధ్యాయము - కైవల్య పాదము
వివేక వైరాగ్యములు - అంతర్ముఖత్వం
ధర్మమేఘ సమాధి
యోగసూత్రముల సారాంశము
శ్రీ రామకృష్ణ ప్రా ర్థ న

నా ఇష్టదైవమగు శ్రీరామకృష్ణుల ప్రార్థనతో ఈ గ్రంథము ప్రారంభించ బడుచున్నది.


శ్లో|| యోగారూఢాయ శాంతాయ యోగపట్టాభిషిక్తయే
నిత్య బోధనిమగ్నాయ రామకృష్ణాయతే నమః ||
యోగశిఖరమును అధిష్టించినవాడును, పరమశాంత స్వభావుడును,
యోగపట్టాభిషిక్తుడును, నిత్య సమాధి నిమగ్నుడును అగు శ్రీరామకృష్ణునకు ప్రణామము.
శ్లో|| యోగేశ్వరాయ నిత్యాయ యోగవిఘ్న నివారిణే
యోగనాథాయ దేవాయ రామకృష్ణాయతే నమః ||
యోగేశ్వరుడును, నిత్యుడును, యోగసాధన యందు కలుగు విఘ్నములను
నివారించువాడును, యోగనాథుడును, దేవదేవుడునగు శ్రీరామకృష్ణునకు ప్రణామం.
శ్లో|| ఈశ్వరాత్మైక చిత్తాయ విష్ణుమాయా విలాసినే
లీలాకల్పిత దేహాయ రామకృష్ణాయతే నమః ||
ఈశ్వరునితో ఒకటైన చిత్తము కలవాడును, విష్ణుమాయతో తన జీవితమును ఉల్లాసముగా
గడపినవాడును, లీలగా దేహమును ధరించినవాడును అయిన శ్రీరామకృష్ణునకు ప్రణామం.
శ్లో|| మాయామానుష వేషాయ మాయాభ్రాంతి విదారిణే
సచ్చిదానంద రూపాయ రామకృష్ణాయతే నమః ||
మాయామానుష వేషమును ధరించినవాడును, తన భక్తుల మాయాభ్రాంతిని
నిర్మూలించువాడును, సచ్చిదానంద రూపుడునగు శ్రీరామకృష్ణునకు ప్రణామం.
ప్రా ర్థ న

శ్లో|| యోగేన చిత్తస్య పదేన వాచం


మలం శరీరస్య చ వైద్యకేన
యో ప్రాకరోత్తం ప్రవరం మునీనాం
పతంజలిం ప్రాంజలిరానతోస్మి ||
యోగశాస్త్రముతో చిత్తమును శుద్ధపరచి, వ్యాకరణశాస్త్రముతో వాక్కును సరిచేసి,
ఆయుర్వేదశాస్త్రంతో శరీరమలమును (రోగమును) పోగొట్టువాడును, మునులలో శ్రేష్ఠుడును
అయిన పతంజలిమహర్షికి నమస్కరిస్తున్నాను.
శ్లో|| అబాహు పురుషాకారం
శంఖ చక్రాసి ధారిణం
సహస్ర శిరసం శ్వేతం
ప్రణమామి పతంజలిం ||
చేతులు లేని పురుషాకృతిలో, శంఖ చక్రములను ధరించి, వేయి పడగల తెల్లని సర్పాకారంలో
ఉన్న పతంజలిమహర్షికి నమస్కరిస్తున్నాను.
పతంజలిమహర్షి విరచిత
యోగసూత్రములు

మొదటి అధ్యాయము
(సమాధి పాదము)
సూ|| అథ యోగానుశాసనమ్ || 1.1 ||
ఇప్పుడు యోగశాస్త్రము చెప్పబడుచున్నది.
‘యుజ్’ అనే సంస్కృతధాతువు నుండి ‘యుజిర్ యోగ’ మనే నిర్వచనం వచ్చింది. ‘కలయిక’
యని దీని అర్థం. వ్యాసమహర్షి తన యోగసూత్రభాష్యంలో ‘యుజ్ సమాధౌ’ అంటూ,
యోగమంటే సమాధిలో లీనం కావడమని అన్నారు. కనుక, కలయికయని మూలార్థమైనప్పటికీ,
ఏకాగ్రతయని, సమాధియని కూడా ఈ పదమునకు అర్థములున్నాయి.
దేనితో దేని కలయిక? అంటే, జీవాత్మ, పరమాత్మల కలయికయని అర్థం. జీవాత్మ యంటే,
పరిమితమైనట్టి యోగియొక్క ఆత్మ. పరమాత్మ యంటే, అన్ని ఆత్మలకు మూలమైన, ఆధారమైన,
అనంతమైన విశ్వాత్మ. పరిమితమైన మానవాత్మ, అపరిమితమైన దైవాత్మతో కలవడమే యోగం.
దీనికి మార్గం ఏకాగ్రతాపూర్వకమైన కేవలసమాధిని అనుభవం ద్వారా అందుకోవడం. కనుక
యోగమంటే పరమాత్మతో ఏకాగ్రతాపూర్వకమైన సంయోగమని అర్థం వస్తుంది. ఈ సమాధిని
అందుకునే విధానమును యోగశాస్త్రం ఉపదేశిస్తుంది.
సూ|| యోగశ్చిత్తవృత్తినిరోధః || 1.2 ||
యోగమంటే చిత్తవృత్తి నిరోధం.
చిత్తము, వృత్తులు, నిరోధము అనే పదములను అర్థం చేసుకోవాలి.
చిత్తమంటే - చింతించునది, ఆలోచించునది. మనస్సు అనే పదమును కూడా ఇదే అర్థంతో
వాడుతూ ఉంటారు. మనస్సు అంటే మననం చేసేదని, చిత్తమంటే చింతించేదని అర్థములు.
మననం కంటే, చింతన లోతైనది. కనుక లోతైన ఆలోచనను చేసేదే చిత్తమని అర్థం.
వృత్తులంటే - ఆలోచనలు, ఊహలు, భావపరంపరలు. సరస్సులో కెరటముల లాగా చిత్తంలో
ఆలోచనలు లేస్తూ ఉంటాయి. మనస్సు తననుంచి బయటకు ప్రసరించడమే ‘వృత్తి’. మనస్సులో
కలిగే ఏ మార్పు అయినా ‘వృత్తి’ అనబడుతుంది.
నిరోధమంటే - నిరోధించడం, ఆపడం, ఓడించడం అని అర్థములు.

లో లో లే మే
కనుక, చిత్తంలో ఆలోచనలు, ఊహలు, భావములు, లేవకుండా ఆపడమే యోగమని
నిర్వచనం.
కృష్ణయజుర్వేదమునకు చెందిన కఠోపనిషత్తు కూడా ఇదే భావమును చెబుతుంది.
శ్లో|| తాం యోగమితి మన్యన్తే స్థిరామింద్రియధారణామ్
అప్రమత్తస్తదా భవతి యోగోహి ప్రభవాప్యయౌః || (2.3.11)
‘ఇంద్రియములను కదలకుండా స్థిరంగా బంధించడమే యోగం. ఈ సాధనలో యోగి ఎంతో
అప్రమత్తంగా ఉంటాడు. ఎందుకంటే, యోగం ఏ క్షణంలోనైనా జారిపోవచ్చు’.
యోగమును భగవద్గీత అనేక విధములుగా నిర్వచిస్తుంది. వాటిని చూద్దాం.
శ్లో|| యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ
సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే || (2.48)
‘ఓ ధనంజయా! మోహమును వదలిపెట్టి, యోగస్థితిలో ఉంటూ కర్మను చెయ్యి. అనుకున్నది
జరిగినా, జరుగకపోయినా సమంగా ఉండు. ఎందుకంటే, సమత్వమే యోగం’.
చిత్తంలో వృత్తులు లేదా భావములు లేవకుండా ఉన్నపుడే సమత్వస్థితి ఉంటుంది. అవి
లేచాయంటే సమత్వం చెదరిపోతుంది. యోగభ్రష్ఠత్వం కలుగుతుంది. కనుక, యోగి అనుక్షణం
అప్రమత్తుడై ఉండాలి.
రెండవ అధ్యాయంలో ‘యోగః కర్మసు కౌశలమ్’ అని చెప్పబడింది.
శ్లో|| బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ || (2.50)
‘బుద్ధియుక్తుడవై, ఈ జన్మలోనే ‘మంచి - చెడు’ అనే రెండు కర్మలను జయించి, యోగమును
అందుకో. యోగమంటే కర్మలను కుశలంగా చేయడమే’.
ఆరవ అధ్యాయంలో ‘దుఃఖసంయోగ వియోగమే’ యోగమని చెప్పబడింది.
శ్లో|| తం విద్యాద్ దుఃఖసంయోగ వియోగం యోగసంజ్ఞితమ్
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా || (6.23)
‘దుఃఖం ఎలా కలుగుతుందో గ్రహించి దానినుండి విముక్తుడవు కా. అదే యోగం. గట్టి
నిశ్చయంతో, క్రుంగుబాటు లేని మనస్సుతో దీనిని అభ్యసించు’.
‘యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః’ అంటూ భగవంతుని స్తుతిస్తుంది
విష్ణుసహస్రనామ స్తోత్రం. అంటే - ‘యోగము నీవే, యోగవేత్తలకు నాథుడవు నీవే, ప్రధానము
(ప్రకృతి), పురుష (ఆత్మ), ఈశ్వరులు కూడా నీవే’ అని అర్థం. ఇందులోని - ‘యోగో యోగవిదాం
నేతా’ అనే పదములు యోగదర్శమును, ‘ప్రధాన పురుషేశ్వరః’ అనే పదములు
సాంఖ్యదర్శనమును సూచిస్తున్నాయి. ఈ రెండు దర్శనములనూ సమన్వయము గావించే
ప్రయత్నం విష్ణుసహస్రనామము లలో గోచరిస్తుంది. భగవంతుడే యోగస్వరూపుడని, యోగులకు
రాజని చెప్పబడింది.
‘యోగయాజ్ఞవల్క్యము’ లో, గార్గీదేవికి యాజ్ఞవల్క్యమహర్షి ఈ విధంగా బోధిస్తారు.
శ్లో|| జ్ఞానం యోగాత్మకం విద్ధి యోగశ్చాష్టాంగసంయుతః
సంయోగో యోగ ఇత్యుక్తో జీవాత్మపరమాత్మనోః || 1.44 ||
యోగాత్మకమైనది జ్ఞానము. యోగమునకు ఎనిమిది మెట్లున్నాయి. జీవాత్మ పరమాత్మల
సంయోగమే యోగమనబడుతుంది.
‘సంయోగో యోగ ఇత్యుక్తో జీవాత్మపరమాత్మనోః’ - జీవాత్మ, పరమాత్మల సంయోగమే
యోగమనిన భావన ఇక్కడ గోచరిస్తున్నది.
సూ|| తదా ద్రష్టుః స్వరూపేఽవస్థానం || 1.3 ||
అప్పుడు ద్రష్ట తన స్వరూపంలో ఉంటుంది.
చూచేవాడు ద్రష్ట. కన్ను అనే ఇంద్రియమును ఉదాహరణగా తీసుకొని ‘చూచేవాడు’ అని
చెప్పినప్పటికీ, మిగతా ఇంద్రియములను కూడా లెక్కించినపుడు - వినేవాడు, వాసనను
గ్రహించేవాడు, రుచిని తెలుసుకునేవాడు, స్పర్శను తెలుసుకునేవాడు - అని అర్థములు వస్తాయి.
దానిని ‘ఆత్మ’ యని యోగసాంప్రదాయం అంటుంది.
ఎప్పుడైతే చిత్తంలో ఆలోచనలు లేవకుండా ఉంటాయో, అలలు లేని సరస్సులాగా, చిత్తం
నిశ్చలంగా, నిర్మలంగా ఉంటుంది. అప్పుడు, ఇంద్రియముల నుండి లోకంవైపు అది ప్రసరించదు.
తనలో తానుగా ఉంటుంది.
ద్రష్ట అనేది ఉన్నదని ప్రతిపాదించడం ద్వారా, ‘ఆత్మ’ ఉన్నదని మహర్షి మొదట్లోనే
చెబుతున్నారు. ఇది సాంఖ్యం నుంచి తీసుకున్న భావన. బౌద్ధంలో అయితే, ఆత్మ అనేది లేదని
బుద్ధుడన్నాడు. ‘చిత్తం ఇంద్రియముల ద్వారా లోకంలోకి ప్రసరించి, అనుభవములను
పొందినపుడే, ‘నేను’ అనిన స్పృహ పుట్టుకొస్తుంది గాని, అంతకు ముందు అది ఉండదు, ఆ
తరువాతా ఉండదు. దానితోనే పుట్టి దానితోనే పోతుంది’ అన్నాడు. దీనిని ‘ప్రతీత్య సముత్పాదం’
అని ఆయన పిలిచాడు. కనుక బౌద్ధంలో చిత్తమే ఆఖరుది. దానిపైన ఆత్మ లేదు. ఆత్మ లేదు గనుక
పరమాత్మా లేదు. అందుకే అది అనాత్మవాదమైంది.
చిత్తంలో ఆలోచనలు లేవకుండా ఉన్నపుడు ఆత్మ ఆత్మగా, తనలో తానుగా ఉంటుందని
అర్థం. దీనినే స్వస్థితి యని, స్వాత్మస్థితి యని అంటారు.
సూ|| వృత్తిసారూప్యమితరత్ర || 1.4 ||
ఇతరత్రా అయితే వృత్తులతో సారూప్యస్థితిలో ఉంటుంది.
సారూప్యమంటే, సమానమైన రూపమని అర్థం. ‘ఇతరత్రా’ అంటే, ఆలోచనలు లేస్తున్నపుడని
అర్థం. ఆలోచనలు లేస్తున్నపుడు, ఆత్మ వాటితో సారూప్యమైన స్థితిలో ఉంటుంది. లేకపోతే,
తనలో తానై ఉంటుంది.
ఈ సూత్రం నుంచి, వృత్తులు ఎన్ని విధములు? అవి ఎలా ఉంటాయి? అనిన ప్రశ్న
ఉదయిస్తుంది.
వృత్తులు - అయిదు విధములు
సూ|| వృత్తయః పంచతయ్యః క్లిష్టాఽక్లిష్టాః || 1.5 ||
క్లిష్టములు, అక్లిష్టములైన వృత్తులు అయిదు విధములు.
స్థూలముగా, వృత్తులు రెండు విధములు. క్లిష్టములంటే దుఃఖమును కలిగించేవి, ఇబ్బంది
పెట్టేవి. అక్లిష్టములంటే, దుఃఖమును కలిగించనట్టివి, ఇబ్బంది పెట్టనట్టివి. ఇవి మళ్ళీ ఒక్కొక్కటి
అయిదు విధములుగా ఉంటాయి.
ఆలోచనలు, సంకల్పములు, మనసులోని మార్పులు - దుఃఖమును కొనితెచ్చేవి, దుఃఖమును
తీసుకురానివి - అని స్థూలముగా రెండు విధములు. మళ్ళీ వీటిలో అయిదు తేడాలు ఉంటాయి.
సూ|| ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః || 1.6 ||
ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి - అనేవి ఆ అయిదు రకములు.
ఇవేమిటో ఒక్కొక్కదానిని వివరిస్తున్నారు.
ప్రమాణములు - మూడు విధములు
సూ|| ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని || 1.7 ||
ప్రమాణం మూడు విధములు - ప్రత్యక్షం, అనుమానం, ఆగమం. ఒక విషయమును మనం
గ్రహించడానికి ఈ మూడువిధములైన దారులు ఉంటాయి.
మొదటిది ప్రత్యక్షం. అంటే, దేనినైనా, మనంతట మనం చూచి, అనుభవించి తెలుసుకోవడం.
రెండవది, అనుమానం. అంటే, ఆలోచన సహాయంతో ‘ఇది ఇలా ఉండవచ్చు’ అని ఊహించడం.
మూడవది ఆగమం. అంటే శాస్త్రప్రమాణం. శాస్త్రములు లేదా మన మేలు కోరేవారు చెప్పినదానిని
నమ్మడం. దీనికే ఆప్తప్రమాణమని కూడా పేరున్నది. అంటే, ఆప్తులైనవారు చెబితే నమ్మడమన్న
మాట.
ఈ భావములన్నీ మూడువేల సంవత్సరముల క్రిందటిదైన సాంఖ్యదర్శనం లోనివి. సాంఖ్యం
నుంచి యోగదర్శనం వీటిని గ్రహించింది.
ఈశ్వరకృష్ణుని ‘సాంఖ్యకారిక’ ప్రకారం, ఏదైనా ఒక విషయమును గ్రహించడం ఈ క్రింది
మూడు విధములుగా మాత్రమే సాధ్యమౌతుంది.
1. ప్రత్యక్షప్రమాణం - ఇంద్రియముల ద్వారా సూటిగా ఒక విషయమును తెలుసుకోవడం.
2. అనుమానప్రమాణం - ఇంద్రియములకు అతీతమైన విషయమును దీనిద్వారా
తెలుసుకోవాలి. అంటే, కనిపించేదానిని బట్టి కనిపించని దానిని ఊహించడం. ఉదాహరణకు,
పొగ కనిపించినప్పుడు అక్కడ నిప్పు ఉంటుందని ఊహిస్తాము. టపాకాయల ధ్వని
వినిపించినప్పుడు, అక్కడ ఎవరో టపాకాయలు కాలుస్తున్నారని ఊహిస్తాము. లేదా,
వానాకాలంలో మొక్కలు మొలిచినప్పుడు, మొక్కలు మొలిచాయి గనుక, వాటి విత్తనములు
భూమిలో ఉన్నాయని ఊహిస్తాము. విత్తనములు మనకు కనిపించవు. మొక్కలను బట్టి వాటిని
ఊహిస్తాము. అదే విధంగా మిగతా ఇంద్రియములకు సంబంధించిన విషయములలో కూడా,
మన అనుభవానికి వస్తున్నవాటిని బట్టి, అనుభవానికి ఇంకా అందనివాటిని ఊహిస్తాము. ఇది
అనుమాన ప్రమాణం అనబడుతుంది.
3. ఆగమప్రమాణం లేదా ఆప్తవాక్యం - పై రెండు విధములుగా తెలుసుకోలేని
విషయములను దీనిద్వారా గ్రహించాలి. వేదములు, శాస్త్రములు, గురువాక్యములు ఈ కోవలోకి
వస్తాయి. ఇంద్రియములకు అతీతమైన విషయములను ఇవి చెబుతాయి. దీనిలో ‘నమ్మకం’ అనేది
ప్రధానపాత్రను పోషిస్తుంది. పెద్దలు చెప్పినప్పుడు, దానిని నమ్మి ఆచరించడమే ఆగమం.
ఇంద్రియముల పరిధిలో, మానవుని జ్ఞానసముపార్జనకు ఈ మూడుదారులు తప్ప వేరే దారి
లేదు.
అంటే - మనంతట మనం చూచి తెలుసుకోవడం, ఆలోచించి గ్రహించడం, ఒకరు చెబితే
నమ్మడం - అనే మూడు విధములుగా మాత్రమే మనం ఒక విషయమును తెలుసుకుంటాము.
విపర్యయము
సూ|| విపర్యయో మిథ్యాజ్ఞానమతద్రూప ప్రతిష్ఠమ్ || 1.8 ||
అది కానిదైన మిథ్యారూపము యొక్క జ్ఞానమే విపర్యయము.
అంటే, లేనిదానిని ఉన్నదని భ్రమించడం, ఉన్నదానిని లేదని అనుకోవడం. ఎదురుగా
ఉన్నదానిని ఉన్నట్లు చూడకుండా, ఇంకో రకంగా చూచి తప్పుగా అర్థం చేసుకోవడం
విపర్యయమౌతుంది. అంటే, ‘మిథ్యాదృష్టి’ యని అర్థం. ‘సత్యదృష్టి’ కలిగినప్పుడు మిథ్యాదృష్టి
పోతుంది. నిజమును తెలుసుకున్నపుడు అబద్ధం మాయమౌతుంది.
అయితే, సత్యమును గ్రహించడానికి, ఒప్పుకోవడానికి, మనస్సు అడ్డుపడుతూ ఉంటుంది.
దీనికి కారణములు, మనస్సులో ఉండే సుఖాభిలాష, కపటము. ఇవి సుఖమును కోరుకుంటాయి.
సత్యం సుఖమునకు ప్రాధాన్యతనివ్వదు. కనుక లోకులందరూ విపర్యయమును కోరుకున్నట్లుగా
సత్యదృష్టిని కోరుకోరు.
వికల్పము
సూ|| శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః || 1.9 ||
వస్తువు లేకుండా, శబ్దజ్ఞానమును మాత్రమే అనుసరించేది వికల్పం.
అంటే, వస్తువును గురించిన యథార్థజ్ఞానం లేకుండా, ఉత్తమాటలను బట్టి ఒక అవగాహనకు
లే కో
రావడమని అర్థం. దైవానుభవం లేకుండా, శాస్త్రములు చదివి మాటలు చెప్పడం ఈ కోవకు
వస్తుంది. ఎవరో చెప్పిన మాటలను నమ్మడం కూడా ఇదే.
లోకంలో ఎటుచూచినా కనిపించే ‘అనవసరమైన వాగుడు’ లేదా ‘కాలక్షేపం కబుర్లు’ దీని
క్రిందకు వస్తాయి. అనుభవం లేకుండా, ఊరకే చేసే ఆధ్యాత్మిక, లౌకిక చర్చలు ‘వికల్పం’
అనబడతాయి.
నిద్ర
సూ|| అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా || 1.10 ||
అభావప్రత్యయం మీద ఆధారపడే వృత్తి, నిద్ర.
ప్రత్యయమంటే ఒక స్థితి, ఒక ఆధారం. అభావప్రత్యయమంటే ఒక భావమంటూ లేనట్టి స్థితి.
అలాంటి స్థితిని పొంది ఉండే వృత్తి (చిత్తం యొక్క స్థితి) - నిద్ర. అంటే, ఏమీ తెలియని
అయోమయావస్థ అని అర్థం. నిద్రలో ఉన్నవాడు బయట జరుగుతున్న విషయములను
తెలుసుకోలేడు. కనుక అది అభావస్థితి.
స్మృతి
సూ|| అనుభూత విషయాసంప్రమోషః స్మృతిః || 1.11 ||
అనుభవమైన విషయముల నుంచి బయటపడలేనిది, స్మృతి.
ఒకసారి ఒక అనుభవాన్ని పొందితే మళ్ళీమళ్ళీ అదే అనుభవం కావాలని అనిపించడమే
జ్ఞాపకం లేదా స్మృతి. ఈ స్థితిలో ఉన్న చిత్తం గతంలో తాను పొందిన అనుభవంలో
మునిగిపోయి దానినుంచి బయటకు రాలేదు.
క్లుప్తంగా చెపాలంటే ఈ ప్రక్రియ అంతా ఇలా ఉంటుంది.
మనస్సు యొక్క మార్పులు: దుఃఖమును కలిగించేవి, కలిగించనివి అని రెండు రకములుగా
ఉంటాయి. దీని అయిదు రూపములు: ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతులు.
ఒక విషయమును తెలుసుకుంటున్నపుడు ప్రమాణం, తప్పుగా గ్రహిస్తున్నపుడు విపర్యయం,
అనుభవాన్ని వదలి ఉత్తమాటలలో మునిగిపోవడం వికల్పం, అయోమయస్థితిలో పడటం నిద్ర,
అనుభవాన్ని మళ్ళీ కోరుకోవడం స్మృతి.
ఈ అయిదు స్థితులకు, వేదాంతములో చెప్పబడిన జాగ్రదాది మూడు అవస్థలకు సామ్యం
ఉన్నది.
ఒక విషయమును సూటిగా తెలుసుకోవడం గాని, ఊహద్వారా తెలుసుకోవడం గాని, ఒకరు
చెబితే విని తెలుసుకోవడం గాని, తప్పుగా తెలుసుకోవడం గాని, ఊరకే మాటలలో వినడం గాని
- ఇవన్నీ మెలకువలోనే జరుగుతాయి. కనుక ఇవి జాగ్రదావస్థకు సూచికలు. ఇలా తెలుసుకున్న
దానిని జ్ఞాపకంగా నిలుపుకొని ఊహలలో దానిని దర్శించడం స్వప్నావస్థకు సూచిక.
వీ నీ
వీటినన్నింటినీ మరచిపోయిన గాఢనిద్రాస్థితి సుషుప్తి.
ఈ క్రింది పట్టిక చూడండి.
యోగసూత్రములు వేదాంతము
ప్రమాణ, విపర్యయ, వికల్పములు జాగ్రదావస్థ (మెలకువ)
స్మృతి స్వప్నావస్థ (కల)
నిద్ర సుషుప్తి అవస్థ (నిద్ర)

చిత్తం యొక్క క్రియాస్థితి (వృత్తి) అనేది ఈ అయిదు విధములుగా ఉంటుంది.


నిష్క్రియాస్థితిలో ఉన్న చిత్తం తనలో తానుగా ఉంటుంది. దానిలో ఈ అయిదు రకములైన
మార్పులు ఉండవు. అప్పుడు దాని పూర్వసంస్కారములు తప్ప అందులో ఇంకేమీ చలనం
ఉండదు.
ధ్యానస్థితిలో ఉన్నపుడు, ఈ అయిదు విధములైన స్థితులలో చిత్తము పడకుండా
చూచుకోవాలి. అదే యోగం.
గౌతమబుద్ధుడు దీనికి సమాంతరంగా రూపము, వేదన, సంజ్ఞ, సంస్కారము, విజ్ఞానములనే
భావనలనుపదేశించాడు. వీటినాయన పంచ ఉపాదాన స్కంధములన్నాడు. పతంజలిమహర్షి
ఉపదేశించిన ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతులనే వాటికి బుద్ధుని ఉపాదాన
స్కంధములకు పోలికలున్నాయి. దీనిని గమనించాలి.
అభ్యాస - వైరాగ్యములు
సూ|| అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధః || 1.12 ||
అభ్యాసము, వైరాగ్యముల చేత దానిని నిరోధించాలి.
దేనిని నిరోధించాలి? చిత్తమును నిరోధించాలి. ఏమి కాకుండా నిరోధించాలి? ఆలోచనలలో
పడి, వృత్తిరూపమును ధరించి, ఈ అయిదుదారులలో పరుగు తీయకుండా చిత్తమును
నిరోధించాలి. అలా చేయడమే యోగం. దానికి ఉపాయములు రెండు - అభ్యాసము, వైరాగ్యము.
అభ్యాసము - చిత్తము వృత్తిగా మారకుండా గమనిస్తూ, ఎప్పటికప్పుడు తలెత్తిన ఆలోచనలను
ఖండిస్తూ, దానిని దాని స్వస్థితిలో ఉంచే ప్రయత్నం చేయడమే అభ్యాసం.
వైరాగ్యం - ఈ అయిదు రకములుగా పరుగెత్తుతున్న ఆలోచనలు చివరకు దుఃఖమునే
తనకు మిగులుస్తున్నవన్న జ్ఞానం కలిగితే, వాటిమీద విరక్తి పుడుతుంది. అలాంటి స్థితి కలగడమే
వైరాగ్యం.
వృత్తులను నిరోధించే అభ్యాసమునకు, వైరాగ్యం కూడా తోడు కావాలి. లేకుంటే
విషయానుభవముల మీద ఆసక్తి చావదు గనుక, చిత్తం వశం కాదు. ఆలోచనలను నిగ్రహించడం
కుదరదు. కనుక అభ్యాసము, వైరాగ్యము ఈ రెండూ ఒకదానికొకటి తోడుగా నడిస్తేనే
చిత్తనిగ్రహం సాధ్యమౌతుంది.
‘నాకు ధ్యానం కుదరడం లేదు’ అనే మాటను తరచుగా మనం వింటుంటాము. దీనికి
కారణం ఈ రెండే. అభ్యాసములోనూ, వైరాగ్యములోను, ఒకదానిలో గాని, రెండింటిలో గాని,
లోపమున్నపుడు సాధన కుదరదు. మనస్సు లొంగదు.
భగవద్గీతలో కూడా ఇదే భావం చెప్పబడింది.
శ్లో|| చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ధృడమ్
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ || (6.34)
‘హే కృష్ణా! మనస్సు చాలా చంచలమైనది. చాలా బలమైనది. దానిని నిగ్రహించడం, గాలిని
నిగ్రహించడం లాగా, చాలా కష్టమైన పని’ అని అర్జునుడంటాడు.
శ్లో|| అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే || (6.35)
దానిని కృష్ణభగవానుడు జవాబిస్తూ - ‘నిజమే అర్జునా! సందేహం లేదు. మనస్సును
నిగ్రహించడం కష్టమే. అయినప్పటికీ, దానిని అభ్యాసముతోనూ, వైరాగ్యముతోనూ సాధించవచ్చు’
అంటాడు.
సాంఖ్యమును యోగమును సమన్వయం చేయాలన్న ప్రయత్నం భగవద్గీతలో స్పష్టంగా
దర్శనమిస్తుంది. ఉదాహరణకు భగవద్గీత మూడవ అధ్యాయంలోని ఈ శ్లోకమును గమనించండి.
శ్లో|| లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ || (3.3)
లోకంలో రెండు విధములైన నిష్ఠ (సాధనామార్గము) లున్నాయి. వాటిని ప్రాచీన కాలంలో నేనే
బోధించాను. సాంఖ్యులు జ్ఞానయోగంతోను, యోగులు కర్మయోగం తోను మోక్షమును
పొందుతారు.
ఈ శ్లోకంలో చెప్పబడిన కర్మయోగం, నిష్కామకర్మ కాదు. ప్రాణాయామ, ధారణ, ధ్యానాది
యోగకర్మల ద్వారా చేయబడే యోగమని అర్థం. ప్రాచీనకాలంలో, నిష్కామకర్మకు ఒక
యోగపుస్థాయి లేదు. అది సాధనలో ఒక అనుషంగికమైన అంశం మాత్రమేగాని, తనంతట
తానుగా పరిపూర్ణమైన ఒక సాధనామార్గం కాదు.
భగవద్గీత అయిదవ అధ్యాయం లోని ఈ క్రింది శ్లోకాన్ని కూడా గమనించండి.
శ్లో|| యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి || (5.5)
‘సాంఖ్యం ద్వారా ఏ స్థానం లభిస్తుందో యోగం ద్వారా కూడా అదే లభిస్తుంది. సాంఖ్యమూ
యోగమూ ఒక్కటే అని చూచేవాడిది సరియైన దృష్టి’.
ఇప్పుడు అభ్యాసమంటే ఏమిటి? వైరాగ్యమంటే ఏమిటి? అన్న విషయములను
చెబుతున్నారు.
సూ|| తత్ర స్థితౌ యత్నోఽభ్యాసః || 1.13 ||
దానిలో ఉండటానికి చేసే ప్రయత్నమే అభ్యాసం.
దేనిలో ఉండటానికి? చిత్తంలో వృత్తులు లేవకుండా, అది వృత్తిరూపమును ధరించకుండా,
దాని స్వస్థితిలో అది ఉండేటట్లుగా చేసే ప్రయత్నమే అభ్యాసం. దీనికి అనేక సాధనా
మార్గములున్నాయి. అవి ముందు ముందు చెప్పబడినాయి.
సూ|| స తు దీర్ఘకాల నైరంతర్య సత్కారసేవితో దృఢభూమిః || 1.14 ||
ఎక్కువకాలం, నిరంతరం దానిని అభ్యాసం చేస్తే పట్టు చిక్కుతుంది.
అయితే, ఒక్క రోజులో ఇది జరిగేపని కాదు. ఎన్నో ఏండ్ల సాధన దీనికి అవసరం అవుతుంది.
ఎందుకంటే, ఎన్నో జన్మలుగా మనస్సుకు ఒక విధమైన ధోరణి అలవాటై ఉంటుంది. దానిని
ఒక్కరోజులోనో, ఒక్క నెలలోనో మార్చడం కుదరదు. అందుకే, దీనికి సాధన అవసరమౌతుంది.
అందుకోసం, మూడు నియమములు చెప్పబడినాయి.
దీర్ఘకాలం - ఎక్కువ సేపు ఈ ధ్యానమును అభ్యాసం చేయాలి. కొద్ది సేపు చేస్తే ఇది
సిద్ధించదు.
నిరంతరం - తెంపు లేకుండా దీనిని అభ్యాసం చేస్తూనే ఉండాలి. కొన్నాళ్ళు చేసి మధ్యలో
మానివేసి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత చేస్తూ ఉంటే ఇది సిద్ధించదు.
సత్కారసేవితో - ప్రసన్నమైన మనసుతో ఈ సాధనను చేయాలిగాని విసుగుతోనో,
మ్రొక్కుబడిగానో, ఎవరో చెప్పారనో చేయకూడదు. అలా చేస్తే ఇది సిద్ధించదు.
దృఢభూమి - అంటే, గట్టి భూమిక. ఈ విధంగా కొన్నేళ్ళు సాధన చేస్తే, అప్పుడు దీనిలో గట్టి
పట్టు చిక్కుతుంది.
సూ|| దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం || 1.15 ||
చూచినవి విన్నవి అయిన విషయముల పైన తృష్ణ లేకుండా ఉండే స్థితి - వైరాగ్యం.
ఇప్పుడు వైరాగ్యమంటే ఏమిటో చెప్పబడుతున్నది. కోరిక అనేది ముఖ్యంగా ఈ రెండుదారుల
నుంచి మనకు కలుగుతుంది. ఒకటి - చూడటం, రెండు - ఎవరో చెబితే వినడం. ఇవి రెండూ
మనలో ఏదైనా ఒక విషయం పట్ల ఆసక్తిని కలిగిస్తాయి. అప్పుడు దానిని మనంకూడా
పొందాలని, అనుభవించాలని కోరిక మనలో కలుగుతుంది. ఒకసారి రుచి చూచిన తరువాత,
లేదా పొందిన తర్వాత, అది ‘స్మృతి’ గా మారి, మళ్ళీ మళ్ళీ అదే అనుభవం కావాలని అనిపిస్తుంది.
అది కర్మగా, సంస్కారంగా ఏర్పడుతుంది. వీటివల్ల జన్మలు కలుగుతాయి.
కనుక ఈ గొలుసును మొదట్లోనే త్రుంచివేయాలి. అంటే, చూచినా, వినినా, వాటిమీద కోరిక
అనేది మనసులో కలగకుండా ఉన్నపుడు ‘వైరాగ్యం’ అనే స్థితి సిద్ధించినట్లు లెక్క. అప్పుడు
వాటికోసం ప్రయత్నం చేయడం ఉండదు. మిగతా మూడు ఇంద్రియములైన, వాసన, రుచి,

లో
స్పర్శలలోకి మనస్సు పోవడం, అది క్రియగా మారడం జరుగదు.
‘వశీకారసంజ్ఞా వైరాగ్యం’ - అంటే, కోరికలవైపు పోతున్న మనస్సును బలవంతాన
అణచుకోవడం కాదు. అది వైరాగ్యం అవదు. విషయముల వెంట మనస్సు పరుగెత్తకుండా
సహజంగా తనలో తానుగా ఉండే స్థితిని పొందటమే వశీకారసంజ్ఞ. ఇది వైరాగ్యంలో
మొదటిమెట్టు కాదు. పరిపక్వస్థితి. ఎంతో సాధనా, అంతరికపరిపక్వతల తర్వాతనే ఈ స్థితి
లభిస్తుంది.
సూ|| తత్పరం పురుషఖ్యాతేర్గుణవైతృష్ణ్యం || 1.16 ||
దానికి పరముగా, గుణములు సోకని పురుషుని స్థితి ఉంటుంది.
చిత్తం యొక్క ఈ అయిదుస్థితులకు, త్రిగుణములకు, అతీతంగా ఉన్నదే పురుషుని (ఆత్మ)
స్థితి. దానికి గుణములమీద తృష్ణ ఉండదు. గుణములన్నవి సత్త్వము, రజస్సు, తమస్సు అని
మూడు. మనస్సునకు ఈ మూడింటి మీద కోరిక ఉంటుంది.
సత్త్వము - శాంతంగా, సుఖంగా, వెలుగుతో కూడి ఉండే స్థితి.
రజస్సు - నిలకడ లేకుండా పనులలో మునిగి ఉండే స్థితి.
తమస్సు - నిద్ర, సోమరితనము, బద్ధకములతో ఉన్న స్థితి.
మనస్సు ఎల్లప్పుడూ ఈ గుణములలో ఒకదానినో, లేదా రెంటినో, మూడింటినో,
కోరుకుంటూ ఉంటుంది, లేదా ఆయాస్థితులలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటుంది. అలా
కోరుకోవడమే, లేదా అలా ఉండటానికి ఇష్టపడటమే, తృష్ణ. ఆత్మ అనేది చిత్తమునకు అతీతంగా
ఉన్నది గనుక, దానికి గుణములతో సంబంధం ఉండదు. కనుక దానికి వాటిమీద కోరిక
ఉండదు. ఆయా స్థితులలో ఉండాలన్న వాంఛ కూడా దానిలో ఉండదు.
చిత్తము యొక్క స్థితులకు, గుణముల యొక్క స్థితులకు అతీతంగా పురుషుని స్థితి
ఉంటుంది. ఇది సాంఖ్యదర్శనం నుండి తీసుకున్న భావం. ప్రకృతి, పురుషుడు అనే భావములు
కపిలమహర్షి చేత సాంఖ్యదర్శనంలో వాడబడినాయి. ఈ భావములను తనకంటే ఎంతో
ముందటిదైన సాంఖ్యదర్శనం నుండి పతంజలిమహర్షి స్వీకరించినట్లు గోచరిస్తుంది.
ఇంతవరకు, సాంఖ్యదర్శనపు మార్గంలో యోగసూత్రములు సాగినాయి. ఇప్పుడు బౌద్ధపు
ఛాయలు మొదలవుతున్నాయి.
సంప్రజ్ఞాత సమాధి
సూ|| వితర్క విచారానందాస్మితా రూపానుగమాత్ సంప్రజ్ఞాతః || 1.17 ||
వితర్కము, విచారము, ఆనందము, అస్మితల క్రమంలో అనుసరిస్తూ సంప్రజ్ఞాతసమాధి
ఉంటుంది.
పైన చెప్పబడిన అయిదువిధములైన వృత్తులను, త్రిగుణములను దాటిపోయే క్రమంలో ఏయే
మెట్లున్నాయి? అవి ఎలా ఉంటాయి? ధ్యానియైనవాడు వాటిని ఎలా ఎక్కుతూ పోవాలి? అనిన
ప్రశ్నలకు జవాబులు చెప్పబడుతున్నాయి.
ఈ పదములన్నీ బుద్ధునిచే వాడబడిన పదములే. బుద్ధుని తర్వాతకాలపు వాడే
పతంజలిమహర్షి గనుక ఈ పదములను బుద్ధుని నుంచి స్వీకరించినట్లు మనం భావించవచ్చు.
లేదా, సాంఖ్యమును అనుసరించే అలారకలాముని వద్ద బుద్ధుడు వీటిని నేర్చుకున్నట్లుగా
అనుకోవచ్చు. ఉదాహరణకు, ‘మహాస్మృతిప్రస్థాన సూత్రం’ లో గౌతమబుద్ధుడు ఇలా బోధించాడు.
గౌతమబుద్ధుని బోధ
|| కతమో చ భిక్కవే, సమ్మసమాధి? ఇధ భిక్కవే, భిక్కు, వివిచ్చేవ కామేహి వివిచ్చ అకుశలేహి
దమ్మేహి సవితక్కం సవిచారం వివేకజం పీతిసుఖం పధమం ఝానం ఉపసంపజ్జా విహరతి ||
|| వితక్కవిచారానాం ఊపశమా అజ్జత్తం సంపసాదనం చేతసో ఏకోభిదావం అవితక్కం
అవిచారం సమాధిజం పీతిసుఖం దుతీయం ఝానం ఉపసంపజ్జా విహరతి ||
|| పీతియా చ విరాగా ఉపేక్కకో చ విహరతి సతో చ సంపజానో సుఖం చ కాయేన
పతిసంవేదేతి యం తం అరియా ఆచిక్కంతి ‘ఉపేక్కకో సతిమా సుఖవిహారీ’ తి తతీయం ఝానం
ఉపసంపజ్జా విహరతి ||
|| సుఖస్స చ పహాన దుక్కస్స చ పహాన పుబ్బేవ సోమనస్సదోమనస్సానం అత్తంగమా
అదుఃఖమసుఖం ఉపేక్కాసతిపారిశుద్ధిం చతుత్తం ఝానం ఉపసంపజ్జా విహరతి ||
|| అయం ఉచ్చతి, భిక్కవే, సమ్మ సమాధి ||
ఓ భిక్షువులారా! సమ్యక్ సమాధి అంటే ఏమిటి? భిక్షువైన వాడు, కామముల నుండి
విడిపడినవాడై, అకుశలములైన ధర్మముల నుండి విడిపడిన వాడై, వితర్కము, విచారము,
వివేకములనుండి ఉదయించే ప్రీతి, సుఖములతో కూడిన మొదటి ధ్యానస్థితిలో ఉంటాడు.
ఆ తరువాత వితర్కము, విచారములు ఉపశమించగా, చిత్తం శాంతించి ఏకాగ్రమై,
వితర్కము, విచారములు లేకపోయినా, ప్రీతి సుఖములను తనలో పొందుతూ రెండవ
ధ్యానస్థితిలో ఉంటాడు.
ఆ తరువాత ప్రీతి, సుఖములు కూడా ఉపశమించగా, ఉపేక్ష మరియు సమత్వములతో
కూడిన సంప్రజ్ఞానసుఖమును తన లోలోపల పొందుతూ, దేనిని గురించైతే ఆర్యులు,
‘సమత్వము, స్మృతులతో కూడినవాడే ఈ సుఖమును తనలో పొందుతాడు’ అని చెబుతున్నారో
ఆ సుఖమును తన లోలోపల పొందుతూ, మూడవ ధ్యానస్థితిలో ఉంటాడు.
ఆ తరువాత, సుఖము, దుఃఖములను దాటినవాడై, తన మనస్సులోని సంతోషము బాధలను
దాటినవాడై, కేవల సమత్వంతో కూడిన స్మృతితో అత్యంత పరిశుద్ధుడై నాలుగవ ధ్యానస్థితిలో
ఉంటాడు.
ఓ భిక్షువులారా! సమ్యక్ సమాధి అంటే ఇదే.

తో
వితర్క విచారములతో కూడిన స్థితిని బుద్ధుడు తన మొదటి సమాధిగా వర్ణించాడు. ఈ
రెంటినీ దాటి సరాసరి ప్రీతి, సుఖములను తనలోలోపల అనుభవిస్తూ ఉండే స్థితిని
రెండవసమాధిగా చెప్పాడు.
పతంజలి మహర్షి యొక్క సంప్రజ్ఞాతసమాధి ఈ నాలుగు మెట్లతో కూడినది. ఈ క్రింది
వివరణతో స్పష్టంగా అర్థమవుతుంది.
బుద్ధుని మార్గం: వితర్క, విచార, ప్రీతి, సుఖములు - మొదటి రెండు సమాధి స్థితులు.
పతంజలిమహర్షి మార్గం: వితర్క, విచార, సానంద, సాస్మిత - సంప్రజ్ఞాత సమాధి.
బుద్ధుడు తన మూడవ సమాధిని వివరిస్తూ ‘సంపజానో సుఖం’ అనే పదమును
ఉపయోగించాడు. దీనినే పతంజలిమహర్షి ‘సంప్రజ్ఞాత సమాధి’ అని మొదట్లోనే అన్నాడు.
బుద్ధుని నాలుగవసమాధిని పతంజలిమహర్షి ‘అసంప్రజ్ఞాత సమాధి’ అన్నాడు. దీనిలో
సుఖదుఃఖములు, సంతోషము, బాధ అన్నీ పోతాయి. కేవలమైన ఎరుక మాత్రమే మిగిలి
ఉంటుంది.
ఈ పట్టికలో వీరిద్దరి సాధనామార్గములలోని భేదములను పోలికలను గమనించవచ్చు.

ధ్యానస్థితులు గౌతమబుద్ధుని విధానం ధ్యానస్థితులు పతంజలిమహర్షి విధానం


వితర్కము, విచారము మొదటి సమాధి వితర్కము, విచారము సంప్రజ్ఞాత సమాధి
ప్రీతి, సుఖము రెండవ సమాధి సానంద, సాస్మిత
ఉపేక్ష, సమత్వము మూడవ సమాధి వీటికి అతీతమైనది అసంప్రజ్ఞాత సమాధి
కేవల స్మృతి నాలుగవ సమాధి

సమాధిస్థితులను చక్కగా వివరిస్తాయి గనుక, యోగసూత్రములలో ఈ రెండు సూత్రములు


చాలా ముఖ్యమైనట్టివి.
యోగసూత్రములకు వ్యాసమహర్షి మొదలుకొని ఎందరో పండితులు, మహనీయులు
వ్యాఖ్యానములను వ్రాశారు. వివేకానందస్వామి కూడా తన రాజయోగోపన్యాసములలో వీటిని
చాలా విపులముగా వివరించారు. వారి అభిప్రాయముల ప్రకారం సమాధిలోని స్థితులు ఈ
ఎనిమిది విధములుగా ఉంటాయి.
సమాధి స్థితులు - వివరణ
సవితర్క సమాధి - నిర్వితర్క సమాధి
సవిచార సమాధి - నిర్విచార సమాధి
సానంద సమాధి - నిరానంద సమాధి
సాస్మితా సమాధి - నిరాస్మితా సమాధి

వీ లో
వీటిలో, సవితర్క సమాధి, సవిచార సమాధి, సానంద సమాధి, సాస్మితా సమాధులు
సంప్రజ్ఞాతసమాధికి చెందినవి. నిర్వితర్క సమాధి, నిర్విచార సమాధి, నిరానంద సమాధి,
నిరాస్మితా సమాధులు అసంప్రజ్ఞాతసమాధికి చెందినవి. ఇవన్నీ ఒకదానిని మించి మరొకటి
మెట్లుమెట్లుగా ఉంటాయి. యోగియైనవాడు వీటిని తన లోలోపల అందుకుంటూ
యోగమార్గంలో ముందుకు ప్రయాణించాలి.
సవితర్క సమాధి - తర్కం సహాయంతో ఒక వస్తువు యొక్క పరస్పర విరుద్ధములైన
ఆలోచనలను ఖండిస్తూ ప్రశాంత ఏకాగ్రస్థితిని అందుకోవడం.
సవిచార సమాధి - ఒక విషయం పైన ఏకాగ్రమైన విచారం (ధ్యానం) తో ప్రశాంత
ఏకాగ్రస్థితిని అందుకోవడం.
సానంద సమాధి - ధ్యానవిషయములో మునిగిన మనస్సు ఆనందమును పొందుతున్న
స్థితిలో ఏకాగ్రమై ఉండటం.
సాస్మితా సమాధి - ఆనందమును కూడా దాటి, కేవలం ‘నేను’ అనిన శుద్ధమైన ఎరుకలో
ఏకాగ్రమైన స్థితిలో స్థిరంగా నిలచి ఉండటం.
నిర్వితర్క సమాధి - తర్కం సహాయం లేకుండానే సూటిగా మనస్సు ఒక వస్తువుపైన ఏకాగ్రం
అయ్యే స్థితి.
నిర్విచార సమాధి - దేనినీ ధ్యానించకుండా, విచారించకుండా ఉండగలిగే స్థితి.
నిరానంద సమాధి - ధ్యానంలో కలిగే ఏకాగ్ర ప్రశాంత ఆనందమును దాటిన స్థితి.
నిరాస్మితా సమాధి - ‘నేను’ అనిన స్పృహ పూర్తిగా లయమైపోయిన స్థితి.
సాధారణంగా లోకంలో ఉన్నవి భక్తిజ్ఞానములనే రెండు దారులు. వీటిలో సంప్రజ్ఞాత
మరియు అసంప్రజ్ఞాతసమాధులు ఎలా లభించుతాయో ఇప్పుడు వివరిస్తాను.
భక్తియోగంలో నాలుగు స్థితులు
భక్తియోగి తన ఇష్టదైవం పైన మనస్సును నిలపాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో
మనస్సు చెదరిపోతూ ఉంటుంది. అలా చెదరిపోతూ ఉన్న మనస్సును బ్రతిమాలి, అనేక
తర్కముల ద్వారా దానికి నచ్చచెప్పి దానిని మరలా మరలా ఇష్టదైవం మీద ఏకాగ్రం చేయాలని
ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది ‘వితర్క’ స్థితి.
అటువంటి అభ్యాసబలం చేత, కొన్ని ఏండ్ల తర్వాత, సునాయాసంగా మనస్సును ఇష్టదైవం
పైన ఏకాగ్రం చేయగలుగుతాడు. అప్పుడు ఇష్టదైవం యొక్క ధ్యానం అదే పనిగా సాగుతూ
ఉంటుంది. ఇది ‘విచార’ స్థితి.
ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఏండ్ల సాధనతో దైవధ్యానంలోని ఆనందాన్ని నిరంతరం పొందుతూ
ఉంటాడు. ఇది ‘సానంద’ స్థితి.

లో లో
ఆ తరువాత తాను దైవంలో ఒక భాగంగా మారినట్లు గ్రహించి ఆ ఎరుకలో స్థిరంగా
ఉంటాడు. అది ‘సాస్మితా’ స్థితి. ఇవన్నీ సంప్రజ్ఞాతసమాధిలో భాగములుగా ఉంటాయి. ‘నేను’
అనిన అహంకారం కూడా లయమైపోయిన స్థితి అసంప్రజ్ఞాతసమాధి.
జ్ఞానయోగంలో నాలుగు స్థితులు
దీనికి భిన్నమైన మార్గమును జ్ఞానయోగి అనుసరిస్తాడు. జ్ఞానియొక్క గమ్యం తన
ఆత్మయేగాని దైవం కాదు. భక్తుడు దైవధ్యానంలో పైమెట్లను వరుసగా దాటుతూ వస్తాడు.
జ్ఞానయోగి ఆత్మధ్యానంలో అవే మెట్లను ఎక్కుతూ పోతాడు. భక్తియోగంలో ‘ఇష్టదైవం’ అనినది
జ్ఞానయోగంలో ‘ఆత్మ’ అవుతుంది.
తర్కమును, విచారమును, ఆనందమును, అస్మితను ఎక్కడికక్కడ ఖండిస్తూ ఆత్మయే
గమ్యంగా జ్ఞానసాధకుడు సాగిపోతాడు. తన ఆత్మను తప్ప ఇతరత్రా ఎటువంటి ఆధారమునూ
అతడు స్వీకరించడు. చివరలో, తన ఆత్మను కూడా పరమాత్మలో లీనం చేయడం ద్వారా,
నిరాకారనిర్గుణస్థితిని అతడు పొందుతాడు. ఇది జ్ఞానమార్గంలో అసంప్రజ్ఞాతసమాధి
అనబడుతుంది.
ఇంద్రియముల పరిధిని, పంచభూతముల పరిధిని దాటిపోయే క్రమంలో వితర్క విచారముల
స్థితులుంటాయి. ధ్యానానందమును చవిచూస్తూ ఉండేది సానందస్థితి. ఆనందమును కూడా
దాటి, ‘నేను’ అనిన శుద్ధమైన అహంకార ఆలంబనతో ఉండే స్థితి సాస్మిత. ఇక్కడిదాకా
సంప్రజ్ఞాతసమాధి అవుతుంది. దీనిని కూడా దాటినది అసంప్రజ్ఞాతసమాధి అనబడుతుంది.
కాలము - సమాధి స్థితులు
సంప్రజ్ఞాతసమాధి దేశ, కాలముల పరిధిలో ఉంటుంది. అంటే, మనసు దేశ కాలములకు
లోబడి ఉన్న స్థితి సంప్రజ్ఞాతసమాధినిస్తుంది. దేశకాలములకు అతీతమైన స్థితి
అసంప్రజ్ఞాతసమాధి. వీటినే సవికల్పసమాధి, నిర్వికల్పసమాధి యని, సబీజసమాధి, నిర్బీజసమాధి
యని కూడా పిలుస్తారు.
యోగసూత్రములకు వ్యాసమహర్షి చెప్పిన భాష్యంలో వీటికి సమాంతరంగా నాలుగుస్థితులు
చెప్పబడినాయి. యోగియైనవాడు ఈ మెట్లను క్రమంగా ఎక్కుతూ వస్తాడు. అవి, 1. ప్రథమకల్పిక
2. మధుభూమిక 3. ప్రజ్ఞాజ్యోతి 4. అతిక్రాంత భావనీయ అని నాలుగు విధములుగా ఉన్నాయి.

ప్రథమకల్పిక: ఇది యోగసాధనలో ప్రాథమికస్థాయి. ప్రప్రథమంగా యోగంలో ఓనమాలు


1.
దిద్దుకుంటున్న వాడిని ఈ పేరుతో పిలుస్తారు. తన మనస్సుతో తాను యుద్ధం చేస్తున్న
వితర్కస్థాయి ఇది. ఉదాహరణకు - ఒక దేవతా ధ్యానం చేస్తున్న ధ్యానిని తీసుకుంటే, ఆ
రూపమును స్థిరంగా మనస్సులో నిలుపుకునే ప్రయత్నంతో తల్లక్రిందులౌతూ, చెదిరిపోతున్న
మనస్సును కూడగట్టుకుంటూ ఉండే స్థితి ఇది.
2. మధుభూమిక: ఈ స్థితిని అందుకున్నవాడు విచారభూమికలోకి అడుగుపెడతాడు.
ధ్యే
ధ్యేయరూపం యొక్క సూక్ష్మశక్తిని, గుణములను అతడు అనుభూతి చెందుతాడు. పై
ఉదాహరణలో, ఆ దేవత యొక్క గుణములను, శక్తిని అతడు అనుభూతి చెందుతాడు. అనేక
సిద్ధులు ఈ స్థాయిలోనే యోగికి లభిస్తాయి.
ప్రజ్ఞాజ్యోతి: ఈ మెట్టును చేరుకున్న యోగి, సానంద, సాస్మితా స్థితులను రుచి చూస్తాడు.
3.
అతనికి ఆనందము, ప్రజ్ఞలు లభిస్తాయి. వెలుగును దర్శిస్తాడు. తాను ధ్యానిస్తున్న దేవతాశక్తిలో
తానొక భాగంగా మారుతాడు. శుద్ధమైన సాత్వికాహంకారమును కలిగి ఉంటాడు.
సంకల్పమాత్రంతో కర్మను మార్చగలుగుతాడు.
4.అతిక్రాంత భావనీయ: ‘నేను’ అనిన అహమును మరచి, త్రిగుణములను దాటి, ప్రకృతికి
అతీతమైన పురుషస్థితిలో ఉంటాడు. ఇది యోగంలో చెప్పబడిన ధర్మమేఘసమాధికి, లేదా,
వేదాంతములో చెప్పబడిన జీవన్ముక్తస్థితికి సమానమైన స్థితి. అతని ప్రమేయం లేకుండా అతని
సమక్షమే పనిచేస్తూ ఉండే స్థితి ఇది.
సూ|| విరామప్రత్యయాభ్యాసపూర్వః సంస్కారశేషోఽన్యః || 1.18
ప్రత్యయముల విరామం బాగుగా అభ్యాసం చేయబడితే, మిగిలేవి సంస్కారములే. ఇది
అన్యమైన సమాధి.
ప్రత్యయములంటే మనస్సుకున్నట్టి ఆధారములు, స్థితులు. సంప్రజ్ఞాతసమాధిని పొందే
క్రమంలో, ఏదో ఒకదానిపైన ఆలోచన అనేది మనస్సుకు ఆధారంగా ఉంటుంది. అయితే, ఈ
ప్రక్రియకు భిన్నంగా ఇంకొక సమాధి ఉన్నది.
ఆలోచనకు ఆలోచనకు మధ్యన ఉన్న ‘ఏ ఆధారమూ లేని స్థితి’ ని విరామం అంటాము. ఈ
విరామస్థితిలో ఉండటం బాగా అలవాటైనప్పుడు, చిత్తం వృత్తిరూపములను ధరించదు గనుక,
అప్పుడు చిత్తపు లోలోపల ఉన్నట్టి పూర్వజన్మ వాసనలే (సంస్కారములే) మిగిలి ఉంటాయి. అవి
ఆలోచనలుగా మారవు. విత్తనముల రూపంలో చిత్తపు లోలోతులలో ఉంటాయి. వీటినే
బీజములని, సంస్కారములని యోగపరిభాషలో అంటారు.
పైన చెప్పబడిన ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతులనే ఐదు విధములైన
వృత్తులలో ఒకదానికి మరొకదానికి మధ్యలో అతి సూక్ష్మమైన విరామం లేదా ‘సంధి’ ఉంటుంది.
ఆ విరామస్థితిలో ఉండటం అభ్యాసమైతే అప్పుడు చిత్తంలోని పూర్వసంస్కారములు మాత్రమే
మిగిలి ఉంటాయి. ఇది సంప్రజ్ఞాతసమాధి కంటే భిన్నమైన అసంప్రజ్ఞాతసమాధికి దారి
చూపుతుంది. కనుకనే ‘అన్యః’ అనే పదం మహర్షిచేత వాడబడింది.
అంటే, ఒక ధ్యేయవస్తువును (ఒక దేవతను గాని, తన ఆత్మను గాని) తీసుకుని, దానిని
ధ్యానిస్తూ ఉన్నపుడు, వితర్క, విచార, సానంద, సాస్మితా స్థితులతో కూడిన సంప్రజ్ఞాతసమాధి
ఏర్పడుతుంది. అలా కాకుండా వృత్తుల మధ్యన ఉన్న విరామంలో ఉండటం అలవాటైనప్పుడు, ఆ
అభ్యాసం అసంప్రజ్ఞాతసమాధికి దారితీస్తుంది.
సంస్కారములనేవి మనం చేసే ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే చేతలను బట్టి

ఏ లో ఏ తీ లో
ఏర్పడతాయి. ఒక జన్మలో మనం ఏ తీరులో ఈ మూడింటిని నడిపించామన్న దానిని బట్టి
తరువాతి జన్మలో అవి మనకు సహజంగా సంక్రమిస్తాయి. మనస్సు, మాట, చేతలనే
త్రికరణములని అంటారు. ఇవి శుద్ధిగా లేనప్పుడు అట్టివాడు సాధనామార్గంలో
పురోగమించలేడు. ఈ మూడింటిని దిద్దుకోకుండా ఎన్ని జపతపములు, ఉపాసనలు,
ధ్యానములు, పూజలు చేసినా అవన్నీ వృధా అవుతాయి. అందుకే సాధనామార్గంలో త్రికరణశుద్ధికి
అంతటి ప్రాధాన్యత ఇవ్వబడింది.
భవప్రత్యయము
సూ|| భవప్రత్యయో విదేహ-ప్రకృతిలయానాం || 1.19 ||
విదేహులకు, ప్రకృతిలయులకు భవమే ప్రత్యయమౌతుంది.
ఈ పదములను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. యోగశాస్త్రంలో భవప్రత్యయము,
ఉపాయప్రత్యయములని రెండు విధములైన ప్రత్యయములు చెప్పబడినాయి. వీటిని
వివరిస్తున్నారు.
విదేహులంటే దేహంలేని శక్తులు. అంటే దేవతలని అర్థం. ప్రకృతిశక్తులే దేవతలు. ప్రకృతిలో
లయమైనవారు ప్రకృతిలయులు. అంటే, పురుషస్థితిని అందుకోకుండా ప్రకృతిస్థాయిలో
లయమైనవారు. పురుషుడు కాని మిగతాది ‘భవం’ అనబడుతుంది.
25 తత్త్వములలో పురుషుని విడచిపెట్టగా మిగిలిన 24 తత్త్వములే సృష్టి. దీనినే భవమని
అంటారు. ‘భవబంధం’ అనే మాట మనం తరచూ వింటూ ఉంటాము. దీని అర్థం ఇదే. పది
ఇంద్రియములు, పది భూతములు, మనసు, అహంకారము, మహత్తు, ప్రకృతి - ఈ
ఇరువదినాలుగు తత్త్వములే భవబంధములు. 23 తత్త్వములను దాటిన యోగి ప్రకృతిలో
లీనుడౌతాడు. అతనికి భవమే ప్రత్యయమౌతుంది. 23 తత్త్వముల పైన ఉన్నది అవ్యక్తమనే ప్రకృతి
గనుక, వీటిని దాటిన స్థితిలో దేహం రాలిపోతే (మరణం సంభవిస్తే) అట్టి యోగి ప్రకృతిలో
లీనమవుతాడు గాని పురుషస్థితిని పొందడు.
ప్రకృతిశక్తులే దేవతలు. పంచభూతములు, పంచతన్మాత్రలే దేవతాశక్తులు. కనుక వాటి
ధ్యానంలో వాటిలో లీనమైనవాడు ఒక దేవతగా మారుతాడు గాని మోక్షమును పొందడు.
మోక్షమనేది దేవతలస్థితి కంటే పైది.
పురుషస్థితి పరిపూర్ణమైన స్వాతంత్ర్యంతో, ఎరుకతో, స్వేచ్ఛతో ఉంటూ, ప్రకృతికి,
బంధములకు గుణములకు అతీతంగా వెలుగుతూ ఉన్నట్టి స్థితి. ఈ స్థితిని, దాని క్రింద ఉన్న
ప్రకృతి (అవ్యక్తస్థితి) తో విడదీస్తూ ఒక సరిహద్దు ఉంటుంది. అది నిరాకారలోకమునకు
సాకారలోకమునకు మధ్యన ఉండే విభజనహద్దు. దానిని ‘భావముఖం’ అంటారు. దాని క్రింద
అన్ని దేవతాలోకములు ఉంటాయి. ఆ సరిహద్దును దాటి పైకి నిరాకారలోకం లోకి పోవడానికి
దేవతలు కూడా భయపడతారు. ఎందుకంటే, ఆ స్థితిలోకి ప్రవేశిస్తే వారు తమ ఆకారములను,
శక్తులను, అస్తిత్వమును కోల్పోతారు. శ్రీ రామకృష్ణుల వారి మనస్సు నిరంతరం
డే లో డే
భావముఖమనబడే ఆ స్థాయిలో ఉంటూ ఉండేది. అది ఆయనకు సహజస్థితి.
ఉపాయ ప్రత్యయము
సూ|| శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞా పూర్వక ఇతరేషాం || 1.20 ||
ఇతరులకు, శ్రద్ద, వీర్యము, స్మృతి, సమాధి, ప్రజ్ఞలే కారణములౌతాయి.
‘ఇతరేషాం’ అంటే - విదేహులైన దేవతాస్థితిని పొందినవారికి, ప్రకృతిలయులైన వారికి - ఈ
ఇద్దరికీ భిన్నమైన ఇతరులని అర్థం. అంటే, ఈ రెండు స్థితులను దాటి పురుషస్థితిని, కైవల్యస్థితిని,
అందుకునేవారు. వారికి, పైన చెప్పబడిన అయిదు లక్షణములు, స్థితులు సాధనములౌతాయి.
వీటిని ఉపాయప్రత్యయములంటారు. అంటే, జ్ఞానసిద్ధికి ఉపాయములని అర్థం.
గౌతమబుద్ధుడు ప్రబోధించిన శీల - సమాధి - ప్రజ్ఞలకు, ఈ శ్లోకములో చెప్పబడిన
పదములకు సామ్యమును గమనించాలి. మహర్షి చెప్పిన శ్రద్ధ, వీర్య, స్మృతులే గౌతమబుద్ధుని
మార్గంలో శీలమనబడతాయి. కొద్ది వివరణతో బాగా అర్థమవుతుంది.
గౌతమబుద్ధుని మార్గము పతంజలిమహర్షి మార్గము
శీలము శ్రద్ధ, వీర్యము, స్మృతి
సమాధి సమాధి
ప్రజ్ఞ ప్రజ్ఞ

శ్రద్ధ - ఇంద్రియదాస్యం నుండి, ప్రకృతిదాస్యం నుండి విడుదల పొందాలన్న తపనను శ్రద్ధ


అంటారు.
వీర్యము - శక్తి అని ఈ పదమునకు అర్థం. సాధనామార్గంలో ఉత్త శ్రద్ధ ఉంటే చాలదు,
దానిలో నడవడానికి తగిన శక్తి కూడా ఉండాలి. అందుకే, సాధన అన్నదానిని వయసులో
ఉన్నపుడే చేయాలి, ముసలితనంలో సాధన కుదరదు. ఎందుకంటే అప్పుడు దేహమునకు,
మనస్సుకు, తగినంత శక్తి ఉండదు.
స్మృతి - అంటే ఎరుకయని అర్థం. తన గమ్యమును ఎల్లప్పుడూ మరచిపోకుండా, తన
నడకను ఎల్లప్పుడూ గమనించుకుంటూ ఉండటాన్ని ‘ఎరుక’ అంటారు. ఇది జారిపోతే మరపు
కలుగుతుంది. అప్పుడు మానవుడు ఇంద్రియముల ఊబిలో, ప్రకృతి యొక్క మాయలో
పడిపోతాడు. ఈ మరపు వల్ల అనేకజన్మలు ఆహుతి అయిపోతూ ఉంటాయి.
సమాధి - ఏకాగ్రధ్యానమని ఈ పదం యొక్క అర్థం. సమాధిస్థితియని కూడా అర్థమున్నది.
ప్రజ్ఞ - సమాధిస్థితి వల్ల కలిగే అనుభవం, సిద్ధి, జ్ఞానోదయమని అర్థం.
ప్రకృతిని కూడా మించిపోయేవారు ఈ మార్గంలో నడుస్తారని మహర్షి చెబుతున్నారు. అంటే,
అసంప్రజ్ఞాతసమాధిని అందుకునేవారని అర్థం.
కనుక సంప్రజ్ఞాతసమాధి సిద్ధించినవారికి భవప్రత్యయము, అసంప్రజ్ఞాతసమాధిని
కో చే
అందుకోవాలని ప్రయత్నించే వారికి ఉపాయప్రత్యయములు ఆలంబనలుగా ఉంటాయి.
సాధనా తీవ్రతలోని భేదములు
సూ|| తీవ్ర సంవేగానామాసన్నః || 1.21 ||
తీవ్రమైన తపన ఉన్నవారికి ముక్తి దగ్గరలో ఉంటుంది.
ఇంద్రియబంధం నుంచి, ప్రకృతిబంధం నుంచి విడివడాలన్న తపన ఎంత తీవ్రంగా ఉంటే,
కైవల్యస్థితి అంత త్వరగా లభిస్తుంది. ‘ఎంత సాధన చేసినా మాకు పురోగతి ఉండటం లేదు’ అని
చాలామంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఇదే. మోక్షంకోసం సరియైనస్థాయిలో
తపన లేకపోవడమే వారి పురోగతిలో లోపమునకు కారణం. దీనికి కారణం, జన్మపరిపక్వత
లేకపోవడం. దీనికి కారణం కర్మపరిపక్వత లేకపోవడం.
జన్మను, ఆలోచనను, కర్మను బట్టి శ్రద్ధ ఉంటుంది. దానికి తగినట్లుగా సాధన ఉంటుంది.
దానికనుగుణంగా ఫలితం లభిస్తుంది.
సూ|| మృదు మధ్యాధి మాత్రత్వాత్ తతోఽపి విశేషః || 1.22 ||
తక్కువ, మధ్యరకం, తీవ్రం అనే భేదములు దానిలో ఉంటాయి.
తపన లేదా శ్రద్ధ అనేదానిలో మూడు భేదములుంటాయి. తక్కువరకపు శ్రద్ధ ఉన్నవారు,
సాధనను సరిగా చెయ్యరు. లేదా ఏదో తూతూమంత్రంగా చేస్తూ ఉంటారు. వీరు పూర్తిగా
ఇంద్రియముల పట్టులో చిక్కుకుని ఉంటారు. పూర్తిగా నిద్రపోతూ ఉండే స్థితి ఇది.
మధ్యతరగతి శ్రద్ధ ఉన్నవారు, ఇంకొంచం గట్టిగా, శ్రద్ధగా సాధన చేస్తారు. కానీ
ఇంద్రియముల పట్టును పూర్తిగా వదిలించుకోలేరు. నిద్రనుంచి అప్పుడప్పుడు లేస్తూ మళ్ళీ నిద్రలోకి
జారిపోతూ ఉండే స్థితి ఇది.
తీవ్రమైన తపన ఉన్నవారు సాధనను తీవ్రంగా చేస్తారు. వారి సాధనాతీవ్రతకు
కారణమేమంటే, ఇంద్రియదాస్యం వారికి భరించరానిదిగా తోస్తుంది. పూర్తిగా నిద్రనుండి
మెలకువ తెచ్చుకున్న స్థితి ఇది.
మొదటిరకం సాధకులలో, శ్రద్ధ అనేది మిణుకుమిణుకుమంటున్న దీపంలాగా ఉంటుంది.
రెండవరకం సాధకులలో, చక్కగా వెలుగుతున్న దీపంలాగా ఉంటుంది. మూడవ రకం
సాధకులలో ప్రచండమైన అగ్నిలాగా మండుతూ ఉంటుంది. సాధనలో వారి వారి శ్రద్ధను బట్టి
వారికి ఫలితం లభిస్తూ ఉంటుంది.
ఈ విషయాన్ని గురించి చెబుతూ భగవద్గీత కూడా ఇలా అంటుంది.
శ్లో|| శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః
జ్ఞానం లబ్ద్వా పరాం శాంతిం అచిరేణాధి గచ్చతి || 4.39 ||
‘శ్రద్ధ ఉన్నవాడికి, ‘తత్’ పరుడైనవాడికి, ఇంద్రియముల నిగ్రహం ఉన్నవాడికి, జ్ఞానం

లోనే
లభిస్తుంది. జ్ఞానం లభించినప్పుడు, అతిత్వరలోనే పరాశాంతిని అతడు అందుకుంటాడు’.
సాధనలోని శ్రద్ధను బట్టి యోగులలో మూడువిధములైన స్థాయీ భేదములుంటాయని
భగవద్గీత చెబుతున్నది. అవి - ఆరురుక్ష, యుంజన, యోగారూఢములని చెప్పబడినాయి.
శ్లో|| ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణ ముచ్యతే
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే || 6.3 ||
శ్లో|| యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః || 6.10 ||
‘ఆరురుక్ష’ అనేది యోగసాధనలో ప్రాథమికస్థాయి. ఆహారనియమం, ఆసనములు,
ప్రాణాయామములు మొదలైనవి అభ్యసిస్తూ మనస్సును నిగ్రహించడానికి నానా అవస్థలూ
పడుతూ ఉండే స్థితి ఇది. అందుకే ఈ స్థితిలో ఉన్న యోగికి కర్మయే ముఖ్యమని చెప్పబడింది.
ఇక్కడ ‘కర్మ’ అంటే, యమనియమాదులు, శమాదిషట్కసంపత్తులు మొదలైన రకరకములైన
సాధనావిధానములని అర్థం. శ్రీ రామకృష్ణులు దీనినే కర్మయోగమని అన్నారు.
రెండవస్థాయియైన ‘యుంజన’ స్థితిలో ఉన్న యోగికి సాధనలో కొంత పట్టు చిక్కుతుంది.
దాని ఆధారంతో, ఏకాంతంలో ఉంటూ, ఇంద్రియములను నిగ్రహించి, నిరంతరం ధ్యానమును
అభ్యాసం చేస్తూ ఉంటాడు.
మూడవస్థాయియైన ‘యోగారూఢ’ స్థితిలో ఉన్న యోగికి శమం ఒక్కటే చాలు. అంటే, అతని
ఇంద్రియములు పూర్తిగా శాంతిస్తాయి. చిత్తం పూర్తిగా నిగ్రహింపబడుతుంది. అతడు ఊరకే
ఉంటాడు గాని ఏ సాధననూ, ఏ కర్మనూ చేయవలసిన అవసరం అతనికి ఉండదు. అంటే,
ప్రయత్నరహితంగా నిత్యం అతని మనస్సు ధ్యానంలో ఉంటుంది.
‘శ్రద్ధ’ అనేది కూడా ఈ మూడుస్థాయిలకు అనుగుణంగా మృదు, మధ్య, అధిమాత్ర అనే
మూడు విధములుగా ఉంటుంది.
శ్రద్ధను బట్టి సాధనలో ఫలితం ఉంటుందన్నది సారాంశం.
సూ|| ఈశ్వర ప్రణిధానాద్వా || 1.23 ||
లేదా ఈశ్వరప్రణిధానంతో గాని సాధ్యమౌతుంది.
‘ప్రణిధానం’ అనే సంస్కృతపదమునకు అనేక అర్థములున్నాయి. ఆకాంక్ష, చేరుకోవాలన్న
కోరిక, భక్తి, శరణాగతి, కర్మఫలత్యాగం మొదలైనవి వాటిలో ముఖ్యములైన అర్థములు.
ఈశ్వరప్రణిధానమంటే - ఈశ్వరుని కొరకు తీవ్రమైన ఆకాంక్ష, ఆయనను చేరుకోవాలన్న
తపన, ఆయన పట్ల శరణాగతి, సమస్తకర్మల ఫలితములను ఆయనకే సమర్పించడం, ఆయనపట్ల
భక్తిని కలిగి ఉండటం - అనిన అర్థములు వస్తాయి.
ఇవన్నీకూడా, జీవితంలో ఎంతో నలిగి, ఎంతో అంతరిక సంఘర్షణను అనుభవించి, ఎంతో
పరిపక్వతను పొందితే గాని సాధ్యం కావు. శ్రద్ధ, శరణాగతి, కర్మఫలత్యాగం, భక్తి, నిష్కామకర్మ
అంటూ పెద్దపెద్ద కబుర్లను తేలికగా చెప్పవచ్చు. కానీ వీటిని నిత్యజీవితంలో ఆచరణకు తేవడం
తే వీ
చాలా కష్టమైన విషయం. ఆచరించగలిగితే, వీటిద్వారా కూడా మోక్షం లభిస్తుందని మహర్షి
బోధిస్తున్నారు.
సాధనలో తీవ్రమైన శ్రద్ధ ఉన్నవారికి దానివల్లనే సిద్ధి కలుగుతుంది. లేకపోతే, ఈశ్వరుని పట్ల
తీవ్రమైన భక్తి ఉంటే, దానివల్ల కూడా సిద్ధి కలుగుతుంది. మొదటివారిని అభ్యాససిద్ధులని,
రెండవవారిని కృపాసిద్ధులని అంటారు. అంటే, కొంతమంది వారివారి సాధనాశక్తితో మోక్షమును
పొందితే, మరికొందరు ఈశ్వరకృపతో మోక్షమును అందుకుంటారు.
1-1-1886 నాడు కాశీపూర్ ఉద్యానవనంలో, శ్రీరామకృష్ణుల కృపతో కూడిన స్పర్శవల్ల,
అనేకమంది భక్తులు రకరకములైన సమాధిస్థితులను, దేవతా సాక్షాత్కారములను పొందినారు.
ఆయాస్థితులు వారి సాధనాఫలితంగా కలిగినవి కావు. కేవలం ఈశ్వరకృపతో కలిగినట్టివి. ఈ
భేదమును గమనించాలి.
కాకుంటే, ఈశ్వరకృప అన్నది కూడా ఎవరిమీద పడితే వారిమీద ప్రసరించదు. తీవ్రమైన భక్తి,
శరణాగతి ఉన్నవారి పైకే అది దిగివస్తుంది.
ఈశ్వరుడు - యోగశాస్త్ర నిర్వచనం
సూ|| క్లేశకర్మ విపాకాశయై రపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః || 1.24 ||
క్లేశము, కర్మవిపాకముల చేత సోకబడని విశేషమైన పురుషుడే ఈశ్వరుడు.
‘ఈశ్వరప్రణిధానం’ అనే పదం వచ్చింది గనుక, ఈశ్వరుడంటే ఏమిటో చెప్పాలి గనుక,
‘ఈశ్వర’ పదమును వివరిస్తున్నారు. యోగపరంగా ఈశ్వరుడంటే, పురాణములలోని
త్రిమూర్తులలో ఒకరైన ఈశ్వరుడు కాదు.
ప్రకృతిని దాటి, పురుషస్థితిని పొందిన జీవులు అనేకములుంటాయి. వీరిని ముక్తజీవులని శ్రీ
రామకృష్ణులు పిలిచారు. ఈశ్వరుడు వీరిలో ఒకడు కాదు. వీరికి భిన్నుడు. జీవులు క్లేశములకు
(చిక్కులకు, దుఃఖములకు) బద్ధులు. తాము చేసుకున్న కర్మఫలితములకు బద్దులు. కానీ
ఈశ్వరుడు వీటికి అతీతుడు. ఎన్నడూ ఆయన ఈ భవబంధముల పరిధిలోకి రాడు. వీటిలో
చిక్కుకొనడు. అటువంటి ఒక దివ్యాత్మ ఉన్నదని, దాని పేరే ఈశ్వరుడని మహర్షి
ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడే యోగదర్శనం, సాంఖ్యదర్శనంతో విభేదిస్తుంది. సాంఖ్యదర్శనంలో
పురుషస్థితిని అందుకున్న ముక్తజీవులు అనేకులున్నారు. కానీ, ఈశ్వరుని మాట లేదు.
యోగదర్శనంలో, ముక్తజీవులతో బాటు, ఈశ్వరుడు కూడా ఉన్నాడు. అదే ఈ రెంటికీ భేదం.
సూ|| తత్ర నిరతిశయం సార్వజ్ఞబీజం || 1.25 ||
అక్కడ, సర్వజ్ఞబీజం, తనకంటే మించినది ఇంకేదీ లేని స్థితిలో ఉంటుంది.
జ్ఞానమనేది బద్ధజీవులలో ఉండదు. వారికి లౌకికజ్ఞానం కావలసినంత ఉంటుంది గాని,
ఆధ్యాత్మికమైన అనుభవజ్ఞానం వారిలో అసలు ఉండదు. ముక్తజీవులలో జ్ఞానం వెలుగుతూ
ఉంటుంది గాని పరిమితంగా ఒక చిన్న దీపంలాగా ఉంటుంది. ఈశ్వరునిలో అది ఎల్లలు

లే
లేకుండా అపరిమితంగా వెలుగుతూ ఉంటుంది. దానిని మించిన జ్ఞానం ఇక ఉండదు. అది
అనంతంగా, సర్వతోముఖంగా, ఎల్లలు లేకుండా విస్తరించి ఉంటుంది. కనుక అది
నిరతిశయమైన (తనను మించి ఏదీ లేని), సర్వజ్ఞస్థితి (సమస్తమునూ గ్రహించే జ్ఞానం)
అనబడుతుంది. అది ఈశ్వరుని స్థితి.
ఎల్లలులేని సర్వజ్ఞత్వమే ఈశ్వరత్వమని యోగశాస్త్రనిర్వచనం.
సూ|| స పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్ || 1.26 ||
ఈ ఈశ్వరుడు కాలమునకు అతీతుడు గనుక, పూర్వులకు కూడా ఇతడే గురువై ఉన్నాడు.
ఈశ్వరుడు దేశకాలములకు అతీతుడుగా ఉంటాడు. పూర్వులైన గురువులందరూ
కాలమునకు బద్ధులే. కనుక వారు ఎంత మహనీయులైనప్పటికీ, వారు కూడా ఈశ్వరుని కటాక్షం
వల్ల, ఆయనచే బోధింపబడి, ధన్యులైనవారే. ఇదే భావన,సనక సనందనాది ఋషులకు జ్ఞానబోధ
గావిస్తున్న దక్షిణామూర్తి రూపంలో మనకు పురాణయుగంలో కనిపిస్తుంది.
శ్రీరామకృష్ణులు ఇలా అంటారు - ‘లోకానికి భగవంతుడే గురువు. మానవ గురువులు
గురువులు కారు’. మానవ గురువుల శక్తి ఏపాటిది? ఈశ్వరుని శక్తితో అనుసంధానం కాకపోతే
వారు శక్తిహీనులే. ఈశ్వరశక్తి వారిని ఆదుకుంటూ ఉన్నంతవరకే వారి శక్తి పనిచేస్తుంది. దానితో
అనుసంధానమును కోల్పోయిన మరుక్షణం వారు శక్తిహీనులౌతారు. యుగయుగములలో,
అనేక దేశములలో, అనేకమంది ప్రవక్తలకు, ఋషులకు, జ్ఞానపు వెలుగును చూపించి వారిని
ఉద్ధరించినది ఈశ్వరుడే.
‘గురువు’ అనిన పదం మొదటిసారిగా యోగసూత్రములలో ఇక్కడ మనకు గోచరిస్తుంది.
గురుసహాయం లేకుండా జ్ఞానదీపం వెలుగదని సూక్ష్మంగా ఇక్కడ బోధింపబడింది. భగవంతుని
అవతారములైన శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీరామకృష్ణాదులకే గురువులున్నారు. కనుక సాధనామార్గంలో
గురుసహాయం తప్పనిసరిగా అవసరమౌతుంది.
‘గురుతు’ చూపించే వాడే గురువని జిల్లెళ్ళమూడి అమ్మగారన్నారు. అంటే, దారి చూపించి ఆ
దారిలో నడిపించేవాడు, దారిలో ఎదురయ్యే ఆటంకములను తొలగించేవాడు,
గురువనబడతాడు. ఈనాడు మానవమాత్రులు జగద్గురువులని వారికి వారే పేర్లు
పెట్టుకుంటున్నారు. భగవంతుడొక్కడే జగత్తుకు గురువు. మానవులు ఈ బిరుదుకు అర్హులు
కారు. ఈ విషయమును మహర్షి స్వయంగా ఈ సూత్రంలో చెప్పారు.
కాలమునకు లోబడియున్నది గురుస్థితి కాదు. కాలమునకు అతీతమైన ప్రజ్ఞయే గురుస్థితి.
సూ|| తస్య వాచకః ప్రణవః || 1.27 ||
ఆయన నామం ప్రణవమై ఉన్నది.
ఈశ్వరుడనేది ఒక మనిషి కాదు. అది ఒక దివ్యాత్మ. దానికొక పేరున్నది. ఆ పేరే ప్రణవం.
దేవుడు, భగవంతుడు, ఈశ్వరుడు మొదలైన ఎన్నో పేర్లను ఈ దివ్యాత్మకు మానవులు
పెట్టుకున్నారు. ఆయా భాషలను బట్టి ఆయా పేర్లు పుట్టుకొచ్చాయి. కానీ ఈ పేర్లన్నీ రాకముందు
ఏ నే మే లో
దైవమునకున్న ఏకైకనామం ‘ఓం’ అనే శబ్దమే. అది సృష్టిలో సహజంగా మ్రోగుతున్న శబ్దం.
దానితో పోల్చుకున్నపుడు మనం పెట్టుకున్నవన్నీ అసహజములైన పేర్లు.
ప్రణవం అనే సంస్కృతపదమునకు - భవసాగరమును దాటించే నావయని, ‘ఓం’ అనిన
శబ్దమని, దివ్యజ్ఞానమును ప్రసాదించగల మంత్రమని రకరకములైన అర్థములున్నాయి.
ఓంకారమును ప్రణవనాదమంటారు. ఈ శబ్దం దీర్ఘమైన ఘంటానాదం లాగా ఉంటుందని
యోగోపనిషత్తులు అంటాయి. శ్రీరామకృష్ణులు ఓంకారమును ‘టాం……’ అనే ఘంటయొక్క
ధ్వనితో పోల్చినారు. దీనికే అనాహతనాదమని మరొక పేరున్నది. అంటే, కొట్టబడని ధ్వని యని
అర్థం. లోకంలో ఏ ధ్వనియైనా ఒక వస్తువు ఇంకొక వస్తువుతో తగిలినప్పుడు ఉద్భవిస్తుంది. కనుక
అది ‘ఆహతం’ (కొట్టబడినది) అవుతుంది. కానీ ఓంకారం అలాకాదు గనుక అది అనాహత
నాదమైనది. ఈ నాదం సృష్టిలో అనాదిగా నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటున్నది.
యోగులైనవారు తమ నాభిస్థానం నుండిగాని, హృదయస్థానం నుండిగాని ఈ ధ్వనిని
వినగలుగుతారు. ప్రణవనాదం నుండి సమస్తములైన ఇతరనాదములు మంత్రములు
పుట్టుకొచ్చాయి. ఓంకారమే సమస్తమంత్రములకు మూలం.
వేదోపనిషత్తులలో ఓంకారసాధన ఉన్నది. యోగోపనిషత్తులైతే ఓంకారసాధనను నొక్కి
చెప్పాయి. ఓంకారజపధ్యానముల ద్వారా మోక్షం లభిస్తుందని ఈ సూత్రంలో కూడా
ప్రతిపాదించబడింది.
సూ|| తజ్జపస్తదర్థభావనం || 1.28 ||
దానిని జపిస్తూ దాని అర్థమును భావించాలి.
యోగశాస్త్రపరంగా ఓంకారజపం ఏ విధంగా చేయాలో ఇక్కడ చెప్పబడింది.
ఓంకారనాదమును స్మరిస్తూ, అదే సమయంలో దాని అర్థమును కూడా భావించమని మహర్షి
ఉపదేశిస్తున్నారు. అంటే, జపం, భావం ఒకేసారి సాగుతూ ఉండాలి. అర్థమును భావించడమంటే
భావధ్యానమని అర్థం. ఓంకారము యొక్క అర్థము మాండూక్యోపనిషత్తులో వివరంగా
చెప్పబడింది.
ఓంకారనాదంలో అ, ఉ, మ అనే మూడు శబ్దములున్నాయి. నాలుగవది హుమ్ అనే
ఝుంకారధ్వని. వీటిపైది శబ్దాతీతస్థితి. అ, ఉ, మ అనే మూడు శబ్దములూ అనేకస్థితులను
సూచిస్తాయి. ఈ క్రింది పట్టికను చూడండి.

అ ఉ మ
బ్రహ్మ విష్ణువు రుద్రుడు
జాగ్రదావస్థ స్వప్నావస్థ సుషుప్త్యవస్థ
సృష్టి స్థితి లయం
సత్వగుణం రజోగుణం తమోగుణం
భూమి అంతరిక్షము స్వర్గము
అ ఉ మ
పుట్టుక పెరుగుదల మరణం
మొదలు మధ్య చివర

ఈ నాలుగూ చివరకు తమకంటే పైనున్న శబ్దాతీతస్థితిలో లీనమవుతాయి. అది


ఆలోచనలకు, అహంకారానికి వ్యక్తిస్ఫురణకు అతీతమైన స్థితి. అది పరమాత్మస్థానం.
యోగియైనవాడు ఈ నాలుగు స్థితులనూ దాటుతూ పరమాత్మలో లీనం కావాలి.
ఆయా భావములపైన మనసునుంచి ధ్యానిస్తూ, ఓంకారజపమును చేయాలి.
యోగోపనిషత్తులలో అయితే, శ్వాసప్రశ్వాసలతో ఓంకారమును అనుసంధానం గావించి,
ప్రాణనియమంతో చేసే ధ్యానవిధానములు చెప్పబడినాయి. యోగులకు ముఖ్యమైన మంత్రం
ఓంకారమే.
పై సూత్రములలో వివరింపబడిన ధ్యానములను చేయలేనివారికోసం ఓంకారనాదమును
ఆధారంగా తీసుకుని చేసే జపం ఇక్కడ చెప్పబడింది. సరిగా అభ్యసించబడితే ఈ జపం కూడా
క్రమేణా ధ్యానంగా మారుతుంది. ఉన్నతములైన సమాధిస్థితులను అందిస్తుంది.
సూ|| తతః ప్రత్యక్చేతనాధిగమోఽప్యంతరాయాభావశ్చ || 1.29 ||
అప్పుడు చేతస్సు అంతర్ముఖమై ఆటంకములు తొలగిపోతాయి.
చిత్తం అంతర్ముఖమయ్యే దారిలో అనేకరకములైన ఆటంకములుంటాయి. వాటన్నిటినీ
ఓంకారజపం తేలికగా తొలగించి చిత్తమును అంతర్ముఖం చేయగలదు. అయితే, దానిని
సరియైన విధానంలో చేయాలి. అప్పుడు ఏకాగ్రత తేలికగా సిద్ధిస్తుంది.
ఏకాగ్రతకు ఆటంకములు
సూ|| వ్యాధి స్త్యాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శనాలబ్ధ భూమికత్వానవస్థితత్వాని
చిత్తవిక్షేపాస్తేఽన్తరాయాః || 1.30 ||
రోగము, నిరాసక్తత, అనుమానము, ప్రమత్తత, బద్ధకము, మోహము, భ్రాంతి, దర్శనం
కలుగకపోవడం, దక్కిన స్థితి నిలబడకపోవడం, మనస్సు చెదరిపోతూ ఉండటం - ఇవి పది
ఆటంకములు.
చిత్తం అంతర్ముఖమై, ధ్యాననిష్ఠ కుదరడానికి మధ్యలో వచ్చే ఆటంకములను ఈ సూత్రం
వివరిస్తుంది. ఇవి ఈ క్రింది మూడు విధములుగా ఉన్నాయి.

శరీరపరమైనవి రోగము
మనస్సుకు చెందినవి నిరాసక్తత, అనుమానము, ప్రమత్తత, బద్ధ
స్థితి పరమైనవి దర్శనం కలుగకపోవడం, దక్కిన స్థితి నిలబడకపోవడం, మనస్సు చెదరిపోతూ ఉండటం

సూ|| దుఃఖ దౌర్మనస్యాంగమేజయత్వ శ్వాసప్రశ్వాసా విక్షేప సహభువః || 1.31 ||


ము మన చెడిపోవ వ వము లో వ ము
దుఃఖము, మనస్సు చెడిపోవడం, అవయవములలో వణుకు, ఉచ్ఛ్వాస నిశ్వాసముల గతి
తప్పడము ఇవన్నీ పైవాటితో పాటు కలుగుతాయి.
దుఃఖ, దౌర్మనస్యములను గౌతమబుద్ధుడు దుక్క దోమనస్సములని పిలిచాడు.
రోగం వల్ల దుఃఖం కలుగుతుంది. నిరాసక్తత, అనుమానము, ప్రమత్తత, బద్ధకము, మోహము,
భ్రాంతుల వల్ల దౌర్మనస్యం (మనస్సు చెడిపోవడం) కలుగుతుంది. అవయవములలో వణుకువల్ల
(దేహదార్డ్యం లేకపోవడంవల్ల) దర్శనం కలుగకపోవడం, దక్కినస్థితి నిలబడకపోవడం
జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసముల గతి తప్పడము వల్ల చిత్తవిక్షేపం కలుగుతుంది. ఇవన్నీ
ఒకదానితో బాటు మరొకటి జంటగా ఉంటుంటాయి.
సూ|| తత్ప్రతిషేధార్థమేకతత్త్వాభ్యాసః || 1.32 ||
వీటిని జయించాలంటే ఒకే తత్త్వమును అభ్యసించాలి.
పైన చెప్పబడిన పది ఆటంకములు, నాలుగుస్థితులు యోగసాధనా మార్గంలో ప్రతివారినీ
ముందుకు పోకుండా అడ్డుకుంటాయి. వీటిని జయించకుండా సమాధి సిద్ధించదు. సమాధి
లేనిదే ప్రజ్ఞ లభించదు. ఇవి రెండూ లేనిదే కైవల్యసిద్ధి కలుగదు. కనుక ఈ ఆటంకములను,
స్థితులను జయించే ప్రయత్నమును యోగి చేయాలి. దానికోసం ఒకే తత్త్వమును పట్టుకోవాలని
ఈ సూత్రం చెబుతుంది. అంటే, మనస్సును ఒకే విషయం పైన ధారణ చేయాలి. అప్పుడు
ఆటంకములు తొలగుతాయి. దానికి ఉపాయములు చెప్పబడుచున్నవి.
ధారణోపాయములు
సూ|| మైత్రీ కరుణా ముదితో పేక్షాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం భావనాతశ్చిత్త
ప్రసాదనం || 1.33 ||
మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే భావనలను - సుఖమైనా దుఃఖమైనా, పుణ్యమైనా
పాపమైనా - అన్ని విషయములలో కలిగి ఉంటే, చిత్తం శాంతిస్తుంది.
ఇది గౌతమబుద్ధునిచేత బోధింపబడిన నాలుగు బ్రహ్మవిహారముల ధ్యానము.
‘సుఖ దుఃఖములలోనూ, పుణ్య పాపములలోనూ’ - అనేది ఈ సాధనకు అతి ముఖ్యమైన
విధి. అంటే, ఈ సాధనను మనకు ఇష్టంగా ఉన్నపుడో, లేదా, మనకు నచ్చినపుడో చేయకూడదు.
అన్ని పరిస్థితులలోనూ, అవి మనకు అనుకూల పరిస్థితులైనా, ప్రతికూల పరిస్థితులైనా, ఈ
సాధనను అభ్యాసం చేయాలి. ఈ సాధనలో ఇది చాలా ముఖ్యమైన నియమం.

మై త్రి
ఎట్టివారితోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా, మైత్రీభావనను మాత్రమే కలిగి ఉండాలి.
వైరభావన ఎన్నడూ పనికిరాదు. ఇది అత్యుత్తమమైన ఆదర్శం. దీనిని పాటించలేనప్పుడు,
జీవితంలో సుఖపడుతున్నవారిని చూచినప్పుడైనా కనీసం మైత్రీభావనను పెంచుకోవాలి. దీనివల్ల

నే
అసూయ, కుళ్ళు అనేవి సాధకునికి దూరమౌతాయి.

కరుణ
ఎట్టివారితోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా, కరుణను కలిగి ఉండాలి. హింసాత్మకధోరణి
పనికిరాదు. మనలను హింస పెట్టినవారిని చూచి జాలిపడాలిగాని తిరిగి వారికి హాని చేయాలని
భావించకూడదు. ఇది అత్యుత్తమమైన ఆదర్శం. దీనిని పాటించలేని పరిస్థితిలో, బాధలు
పడుతున్నవారిని చూచి జాలిపడటమైనా కనీసం నేర్చుకోవాలి.

ముదిత
ఎట్టివారితోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా, సంతోషంగా ఉండాలి. ఏడుపు పనికిరాదు.
ఇది అత్యుత్తమమైన ఆదర్శం. దీనిని పాటించలేనప్పుడు, నీతిమంతులను చూచి
సంతోషపడటమైనా కనీసం నేర్చుకోవాలి.

ఉపేక్ష
ఎట్టివారితోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా, ఉదాసీనత్వాన్ని పాటించాలి. ఆయా
విషయములలో మునిగిపోవడం పనికిరాదు. ఇది అత్యుత్తమమైన ఆదర్శం. దీనిని
పాటించలేనప్పుడు, మనకు హాని చేస్తున్నవారి పట్ల, దుర్మార్గులపట్ల, ఉదాసీనంగా,
పట్టించుకోకుండా ఉండటమైనా కనీసం అభ్యాసం చేయాలి. అప్పుడు మన మనస్సు
చెడిపోకుండా ప్రసన్నంగా ఉంటుంది.
ఈ నాలుగు సాధనలను ఎల్లప్పుడూ పాటిస్తూ ఉంటే, పైన వివరించినట్టి యోగసాధనలోని
ఆటంకములను దాటడం సులభమౌతుంది. మనస్సు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది.
ధ్యానంలో తేలికగా ఏకాగ్రమౌతుంది.
ప్రాణాయామం
సూ|| ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య || 1.34 ||
ప్రాణము యొక్క రేచక కుంభకముల చేత కూడా ఇది జరుగుతుంది.
రకరకములైన ప్రాణాయామ సాధనలు ఈ సూత్రం క్రిందకు వస్తాయి. ప్రాణాయామ
సాధనలను మహర్షి తన యోగసూత్రములలో వివరంగా చెప్పలేదు. సూత్రములంటే
విషయములను చాలా సంక్షిప్తముగా చెప్పేవి గనుక ప్రతివిషయమునకూ విపులవివరణ
యోగసూత్రములలో మనకు కనపడదు. హఠయోగములో తొమ్మిది రకములైన
ప్రాణాయామములు చెప్పబడినాయి. అవి, సూర్యభేదనము, ఉజ్జయి, శీత్కారి, శీతలి, భస్త్రిక,
భ్రామరి, మూర్ఛ, ప్లావిని, భుజగీకరణము. వీటివల్ల యోగి దేహంలో రకరకములైన మార్పులు
కలుగుతాయి. కానీ, మనోనిగ్రహమునకు, ఏకాగ్రతను పొందటానికి, అంతఃకుంభకము,
తో
బాహ్యకుంభకములతో కూడిన సులభమైన ప్రాణాయామం సరిపోతుంది. శుద్ధమనస్సు
ఉన్నవారికి ఎన్నో ప్రాణాయామముల అవసరం ఉండదు.
విషయధ్యానం
సూ|| విషయవతీ వా ప్రవృత్తిరుత్పన్నా మనసః స్థితినిబంధినీ || 1.35 ||
విషయమగ్నమైనప్పుడు గానీ, ప్రవృత్తులు తలెత్తినప్పుడు గానీ, మనస్సును ఆ స్థితులలోనే
ఉంచినా కూడా అవుతుంది.
ఇది తంత్రమార్గం. ఇంద్రియవిషయములను దాటి, వాటికి అతీతంగా పొమ్మని
వేదాంతమంటుంది. ఇంద్రియానుభవములనే ధ్యానములుగా తీసుకొమ్మని తంత్రం
ఉపదేశిస్తుంది. విషయవృత్తులన్నీ పంచేంద్రియముల పైన ఆధారపడి ఉంటాయి. ఆయా
అనుభవములలో మనస్సును స్థిరంగా ఉంచితే కూడా మనస్సు ఏకాగ్రంగా నిలుస్తుంది. ఇవి
అయిదు విభాగములుగా ఉన్నాయి.

దృష్టి
దీపము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, వెలుగు, వివిధదేవతా విగ్రహములు,
సుందరదృశ్యములు ఇవన్నీ దృష్టిని బాహ్యంగా నిలపడానికి ఉపయోగించే ప్రతీకలు. ఆరు లేదా
ఏడు లేదా తొమ్మిది యోగచక్రములు, పన్నెండు ఆధారములు మొదలైనవి అంతరికంగా దృష్టిని
నిలపడానికి పనికివచ్చే స్థానములు.

ధ్వని
బాహ్యంగా వినవచ్చే ధ్వనులలో దేనినైనా మనస్సును నిలపడానికి ఆధారంగా తీసుకోవచ్చు.
తన ఇంటిప్రక్కనే ఉన్న జూట్ మిల్లు సైరన్ ధ్వని వల్ల తన ధ్యానం చెదరిపోతున్నదని చెప్పిన
నరేంద్రునితో, అదే ధ్వనిపైన మనస్సును నిలపమని శ్రీ రామకృష్ణులు బోధించారు. కుక్క
మొరుగుడు వల్ల తన మనస్సు ధ్యానంలో నిలవకుండా చెదరిపోతున్నదని చెప్పిన ఒక భక్తునితో
రమణమహర్షి ‘మొరుగుతున్నది కుక్క కాదు నీ మనసు’ అన్నారు. ఈ విధంగా బాహ్యధ్వనులను
ఆధారములుగా తీసుకోవచ్చు. లేదా, అంతరికనాదమైన ఓంకారధ్వని మీద మనస్సును
ఏకాగ్రపరచవచ్చు. దీనికి షణ్ముఖీముద్ర ఉపకరిస్తుంది. బాహ్యాంతరిక ధ్వనులలో దేనినైనా
ధ్యానానికి ఊతలుగా తీసుకోవచ్చు.

వాసన
ముక్కు కొనవద్ద మనస్సును ఏకాగ్రపరిస్తే రకరకములైన సువాసనలు అనుభూతిలోకి
వస్తాయి. ఇవి అంతరికములైన సువాసనలు. లేదా, బాహ్యంగా పూలను గాని, అగరుబత్తిని గాని,
సెంటును గాని ఉపయోగించి ఆ వాసనపైన మనస్సును ఏకాగ్రం చేయవచ్చు. పూజాద్రవ్యములలో
చే
ఉపయోగించే పువ్వులు, అగరుబత్తి, గంధము మొదలైన వాటి ప్రయోజనం మనస్సును
సులభంగా ఏకాగ్రం చేయడమే అయి ఉన్నది. ఈ విధంగా బాహ్యాన్తరికములైన సువాసనలను
ధ్యానమునకు ఊతగర్రలుగా స్వీకరించవచ్చు.

రుచి
నాలుకకొనపైన మనస్సును ఏకాగ్రం చేస్తే రకరకములైన రుచులు అనుభూతిలోకి వస్తాయి.
ఇవి అంతరికములైన రుచులు. లేదా, బాహ్యంగా మనం తినే ఆహారం యొక్క రుచిని
ధ్యానవిషయంగా తీసుకుంటే కూడా మనస్సు సులభంగా ఏకాగ్రమౌతుంది.

స్పర్శ
చర్మం ద్వారా మనకు లభిస్తున్న స్పర్శపైన ధ్యానించడం వల్ల కూడా మనస్సు సులభంగా
ఏకాగ్రమౌతుంది. లేదా, అంతరికంగా ఇష్టదేవతా స్పర్శను కూడా ధ్యానించవచ్చు.
నిత్యజీవితంలో నిజానికి మనకు జరిగేది ధ్యానమే. ధ్యానంవల్లనే లోకం నడుస్తున్నది. ఈ
విషయం లౌకికులకు అర్థం కాదు. కానీ, ఎవరి ధ్యానమును బట్టి వారికి కావలసినది లభిస్తూ
ఉంటుంది. ఇంద్రియవిషయములైన చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శలకే ప్రతిమనిషీ
దాసుడుగా పడి ఉంటున్నాడు. ప్రపంచమంతా వీటితోనే నడుస్తున్నది. వీటికి బానిస కానివాడు,
వీటి ధ్యానమును చేయనివాడు, ప్రపంచంలో లేడు. అందుకే వీటినే యోగి తన సాధనలుగా
మలచుకుంటాడు. వాటి ఆధారంగా, అంతకంటే పైమెట్లను సులభంగా అందుకోగలుగుతాడు.
జ్యోతి ధ్యానం
సూ|| విశోకా వా జ్యోతిష్మతీ || 1.36 ||
శోకంలేని వెలుగుతో కూడిన స్థితిని ధ్యానించినా కూడా అవుతుంది.
యోగియైనవాడు తన హృదయమధ్యంలో శోకమునకు అతీతమైన వెలుగును ధ్యానించాలి.
ఉపనిషత్తులలో ఇది ‘దహరం విపాపం పరమేశ్మ భూతమ్..’ అనిన మంత్రంలో చెప్పబడింది.
శ్లో|| దహరం విపాపం పరమేశ్మభూతమ్
యత్పుండరీకం పురమధ్య సంస్థమ్
తత్రాపి దహరం గగనం విశోకా
స్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యమ్ || (తైత్తిరీయోపనిషత్ 12.16)
‘పాపమునకు శోకమునకు అతీతుడైన పరమేశ్వరుని ఆత్మ ఏదైతే హృదయపద్మం మధ్యలో
నున్న శూన్యంలో వెలుగుతూ ఉన్నదో, దానిని ఉపాసించాలి’.
ఈ విధంగా ధ్యానించినా కూడా మనస్సు ఏకాగ్రమౌతుంది.
ఇది నిరాకార దేవతాధ్యానం. ఈశ్వరుని నిరాకారస్వరూపానికి అతి దగ్గరగా మనం
గే టే నే చీ
ఊహించగలిగే స్థితి ‘వెలుగు’. ఎందుకంటే, అగ్ని అనేది భౌతికమును దహిస్తుంది, చీకటిని
పారద్రోలుతుంది. కనుక ఈశ్వరుని వెలుగుగా ధ్యానించడం నిరాకార ధ్యానములలో ఒక
విధానం. దీనివల్ల పాపము, అజ్ఞానములు ధ్యాని హృదయంలో నుండి తొలగిపోతాయి.
గురుధ్యానం
సూ|| వీతరాగవిషయం వా చిత్తం || 1.37 ||
రాగము విడచిన చిత్తమును ధ్యానించినా కూడా అవుతుంది.
ఇది గురుధ్యానం. పై శ్లోకంలో నిరాకారదేవతా ధ్యానమును నిర్దేశించిన మహర్షి, దానిని
చెయ్యలేనివారికోసం ఒక మెట్టు క్రిందకు దిగి, ఇంకొక విధానమును చెబుతున్నాడు.
బ్రహ్మజ్ఞానులైన మహర్షులు రాగద్వేషములను జయించినవారు. అట్టివారి మనస్సులు ఎలా
ఉంటాయి? అనిన భావం మీద ధ్యానించినా కూడా ఆ సువాసన మనకు అంటుతుంది. శ్రీ
రామకృష్ణులు, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగారు మొదలైన మహనీయుల మనస్సుల
యొక్క స్థితులను ధ్యానించినా కూడా ధ్యాని మనస్సు తేలికగా ఏకాగ్రమౌతుంది. వారి చిత్తములు
రాగద్వేషములకు, అరిషడ్వర్గములకు అతీతంగా ఉంటాయి. ప్రేమమయములై,
కరుణాపూరితములై ఉంటాయి. కనుక అట్టివారి చిత్తముల పైన ధ్యానించినా కూడా మన
మనస్సులు పవిత్రములౌతాయి. వారి మనస్సులతో మనకు అనుసంధానం ఏర్పడుతుంది. వారి
పవిత్రత, శక్తి మనలో కూడా నిండుతాయి. గురుధ్యానం యొక్క రహస్యం ఇదే.
స్వప్న - నిద్రా - ధ్యానం
సూ|| స్వప్ననిద్రాజ్ఞానాలంబనం వా || 1.38 ||
కలలలోను, నిద్రలోను కలిగే జ్ఞానమును ఆలంబనగా తీసుకున్నా కూడా అవుతుంది.
ధ్యానమార్గంలో నడుస్తున్నవారికి స్వప్నములలో దేవతాదర్శనం అవుతూ ఉంటుంది. ఇది
సర్వసాధారణం. లేదా వెలుగు కనిపిస్తూ ఉంటుంది. లేదా ఏవేవో దేవతాలోకములను
దర్శించినట్లు, అక్కడి దేవతలతో సంభాషించినట్లు కనిపిస్తుంది. లేదా గాలిలో ఎగురుతూ పైకి
తేలిపోతున్నట్లు కనిపిస్తుంది. మహనీయులు, గురువులు, దేవతలు స్వప్నంలో కనిపించి
ఉపదేశములు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్వప్నానుభవములను మరచిపోకుండా, ఆ
సమయంలో కలిగిన అనుభూతిని నిలుపుకుంటూ, దానిపైన ధ్యానించినా కూడా మనస్సు
తేలికగా ఏకాగ్రమౌతుంది.
స్వప్నస్థితిలో తనను తాను మరచిపోకుండా ‘ఎరుక’ ను నిలుపుకుంటూ ఉండటం ఒక
మంచిసాధన. ఇది జ్ఞానమార్గమునకు చెందిన సాధన. ఈ అభ్యాసమును చేసినా కూడా మనస్సు
ఏకాగ్రస్థితిలో ఉంటుంది.
అభిమత ధ్యానం
సూ|| యథాభిమత ధ్యానాద్వా || 1.39 ||
నచ్చిన విషయమును ధ్యానించడం ద్వారా కూడా అవుతుంది.
ఇది కూడా చేయలేనివారికి, ‘మీకు నచ్చిన విషయం మీద ధ్యానించండి’ అని మహర్షి
సూచన చేస్తున్నారు. అంటే, మన స్థాయిని బట్టి పైమెట్టు నుండి క్రిందకు ఒక్కొక్క మెట్టుగా దిగి
వస్తూ, ‘కనీసం చిట్టచివరి మెట్టునైనా అందుకోండి’ అని చెబుతున్నారు.
‘అభిమతధ్యానం’ అంటే, మన ఇష్టం వచ్చిన చెత్తవిషయముల పైన ధ్యానించమని అర్థం
కాదు. అది లోకులందరూ ఎలాగూ చేస్తూనే ఉన్నారు. లోకంలో ఎవరి ధ్యానం వారిది. ఎవరికి
నచ్చిన ధ్యానమును వారు చేస్తూనే ఉంటారు. దానికి తగిన ఫలితములను పొందుతూ ఉంటారు.
ఒక తప్పుడుపని చేయాలని ప్రణాళిక వేసేవాడు కూడా, ఎంతో ఏకాగ్రతతో ఆ పనికి పథకం
రచిస్తాడు. వాడికి కూడా ఏకాగ్రత ఉంటుంది.
అసలైన విషయం ఏకాగ్రత కాదు. మనస్సు శుద్ధం అవుతున్నదా లేదా? మనం ఈశ్వరునికి
దగ్గరౌతున్నామా? లేక దూరమౌతున్నామా? అన్నదే ముఖ్యమైన విషయం.
ఇప్పటివరకూ, మనస్సును ఏకాగ్రం చేయడానికి అభ్యాసం చేయవలసిన రకరకములైన
పద్ధతులను మెట్లుమెట్లుగా మహర్షి వివరించారు. వాటిని క్లుప్తంగా ఈ క్రిందివిధంగా
క్రోడీకరించవచ్చు.
1. నాలుగు బ్రహ్మవిహార ధారణలు: మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష లను నిత్యజీవితంలో
అభ్యాసం చేయడం. ఇది గుణధ్యానం. అంటే, ఆయా గుణములపైన మనస్సును నిలిపి
ధ్యానించడమే గాక, నిత్యజీవితంలో వాటిని పాటించడం.
2. కుంభకసహిత ప్రాణాయామం: పై సాధన చేయలేనివారు ప్రాణాయామం యొక్క
సహాయం తీసుకోవాలి. వీరి ప్రాణం సరియైన స్థితిలో ఉండదు గనుక, వీరి మనస్సులు కూడా
శుద్ధంగా ఉండవు. ఏకాగ్రం కావు. గుణధ్యానం చెయ్యలేవు. కనుక వీరు మొదటగా తమ
ప్రాణమును సరిదిద్దుకోవాలి. దానికి ప్రాణాయామసాధన ఉపయోగిస్తుంది.
3. ఇంద్రియానుభవస్థితులలో మనస్సును నిలపడం: ప్రాణాయామం కూడా చెయ్యలేనివారు,
వారికి అలవాటైన పంచేంద్రియముల అనుభవములలో మనస్సును నిలిపే ప్రయత్నం చెయ్యాలి.
ఇది పైదానికంటే తక్కువమెట్టు. దీనిని సులభంగా చేయవచ్చు. ఎందుకంటే,
ఇంద్రియవిషయములలో సంచరించడం మనస్సుకు అలవాటైన పని కాబట్టి.
4. శోకమునకు అతీతమైన వెలుగును ధ్యానించడం: శోకంలేని స్థితి మనకు అప్పుడప్పుడూ
అనుభవమే. అలాగే, చీకటివెలుగులు మనకు తెలుసు. కనుక ‘విశోక - జ్యోతిష్మతీ’ స్థితిని
ధ్యానించమని ఉపదేశం. అంటే, దుఃఖమునకు అతీతమైన, వెలుగుతో కూడిన స్వరూపముల
ధ్యానం, లేదా, దేవతాధ్యానమన్న మాట.
5. రాగమును విడచిన చిత్తమును ధ్యానించడం: రాగంలేని చిత్తం మనకు మహనీయులలో
కనిపిస్తుంది. కనుక వారిని, వారి మనస్సులను ధ్యానించడం ఇంకా క్రింది మెట్టు. ఇది
గురుధ్యానం.
కలలలోను, నిద్రలోను కలిగే జ్ఞానమును ఆలంబనంగా తీసుకోవడం: మనమందరికీ
6.
అనుభవంలో ఉన్న స్వప్నానుభవములను ధ్యానించడం. ఇది ఇంకా క్రింది మెట్టు.
7. నచ్చిన విషయమును ధ్యానించడం: పై సాధనలు ఏవీ చెయ్యలేనివారు, తమ మనసుకు
నచ్చిన ఏదో ఒక మంచివిషయం పైన ధ్యానించవచ్చు. ఇది అన్నింటికంటే క్రింది స్థితి.
ప్రపంచంలోని అన్ని మతములూ, అందరు మానవులూ పాటించే సాధనలు,
ధ్యానవిధానములన్నీ ఈ ఏడు విభాగముల క్రిందకే వస్తాయి.
సూ|| పరమాణు పరమ మహత్త్వాంతోఽస్య వశీకారః || 1.40 ||
(ఈ ధ్యానముల వల్ల) పరమాణువు నుండి మహత్తు వరకూ తనకు వశమౌతుంది.
పై ధ్యానములను చక్కగా అభ్యాసం చేయడంవల్ల, అత్యంత చిన్నదైన పరమాణువు నుండి
అత్యంత పెద్దదైన మహత్తత్త్వం (విశాలవిశ్వం) వరకూ అన్నింటినీ ధ్యాని భావించగలుగుతాడు.
వాటిలోకి ప్రవేశించగలుగుతాడు. వాటి తత్త్వములను సూటిగా దర్శించి, వాటిని ‘అనుభవం’
ద్వారా తెలుసుకోగలుగుతాడు. అప్పుడు వాటి తత్త్వముల జ్ఞానం అతనికి కలుగుతుంది. ఎప్పుడైతే
వాటి తత్త్వములు అవగతములైనాయో, వాటిమీద అదుపు వస్తుంది. అందుకనే అవి
వశమౌతాయని చెప్పబడింది. అతీతమైన శక్తులు ఈ విధంగా ధ్యానికి సిద్ధిస్తాయి.
వృత్తిక్షీణత - మనశ్శుద్ధి - త్రిపుటి
సూ|| క్షీణవృత్తేరభిజాతస్యేవ మణేర్గ్రహీతృగ్రహణగ్రాహ్యేషు తత్స్థతదంజనతా సమాపత్తిః || 1.41 ||
వృత్తులు క్షీణించి, శుద్ధంగా ఉన్నపుడు, మణిలాగా మారి - గ్రహీత, గ్రహణం, గ్రాహ్యం -
వీటిలో దేనితోనైనా నిండిపోయిన సమాధిస్థితి కలుగుతుంది.
సాధనలో రెండు విషయములు చాలా ముఖ్యములైనట్టివి.
ఒకటి - వృత్తిక్షీణత. చిత్తం తన స్వరూపమును వీడి ఆలోచనలుగా మారడం వృత్తి. అది
క్షీణించడం వృత్తిక్షీణత. అంటే, మనస్సు యొక్క చంచలత్వం తగ్గిపోయి తేలికగా ఏకాగ్రమౌతూ
ఉండే స్థితి.
రెండు - మనశ్శుద్ధి. వృత్తులు క్షీణించడం ఒక్కటే సరిపోదు. మనస్సు శుద్ధత్వమును
సంతరించుకోవాలి. అంటే, రాగద్వేషములకు, మాయామోహములకు, అరిషడ్వర్గములకు
అతీతమైన స్థితిని అందుకోవాలి. అప్పుడు మనస్సు శుద్ధి అయినట్లు లెక్క.
ఈ రెండూ - వృత్తిక్షీణత, మనశ్శుద్ధి - కలిగినప్పుడు, అట్టి ధ్యాని మనస్సు ఒక స్వచ్ఛమైన
స్ఫటికమణిలాగా అవుతుంది. అప్పుడది - గ్రహీత, గ్రహణం, గ్రాహ్యం - అనే మూడింటిలో
దేనితోనైనా సూటిగా తేలికగా మమేకం అవగలుగుతుంది.
మానవజీవితంలో ఈ మూడూ లేకుండా ఏ పనీ జరుగదు.

హీ టే చే నే టే లే లో
గ్రహీత - అంటే గ్రహించేవాడు. తెలుసుకునేవాడు. అంటే, తాను, లేదా ఆత్మ. ఈ ఆత్మస్థితిలో
మనస్సు ఉండగలుగుతుంది.
గ్రహణం - అంటే, తెలుసుకునే ప్రక్రియ. అయిదు ఇంద్రియముల ద్వారా ఈ ‘తెలుసుకోవడం’
అనే ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. బాహ్యవిషయములు ఏ విధంగా ఈ అయిదు ఇంద్రియముల
ద్వారా లోనికి ప్రవహిస్తూ ‘అనుభవము’ ను ఆత్మకు కలిగిస్తున్నాయో ధ్యానికి తెలుస్తుంది.
గ్రాహ్యం - అంటే, తెలుసుకోబడే విషయం. అంటే, ఇంద్రియములు చూస్తున్న ప్రపంచం. ఇది
స్థూలం, సూక్ష్మం అని రెండు విధములు. భౌతికమైనది స్థూలం, మానసికమైనది సూక్ష్మం.
వీటినికూడా ధ్యాని యొక్క శుద్ధమైన ఏకాగ్రమనస్సు తేలికగా తెలుసుకోగలుగుతుంది.
ఈ మూడింటినీ కలిపి త్రిపుటి అంటారు.
తనలో ఏ దోషములూ లేవు గనుక, శుద్ధ స్ఫటికంగా స్వచ్ఛంగా ఉన్నది గనుక, ఈ మూడు
స్థాయులలోని ఏ విషయమునైనా ధ్యానియొక్క మనస్సు, సూటిగా, స్పష్టంగా, ఏవిధమైన
గందరగోళమూ లేకుండా, ఉన్నదానిని ఉన్నట్లుగా, తెలుసుకోగలుగుతుంది.
స్ఫటికం ఎదురుగా ఏ రంగువస్తువును ఉంచితే స్ఫటికం ఆ రంగును పొందుతుంది. అదే
విధంగా, ధ్యాని మనస్సు కూడా, తన ఎదురుగా ఉన్న విషయం యొక్క స్వభావమును
పొందుతుంది. ఈ ప్రక్రియలోనే ధ్యానికి అతీతశక్తులనేవి కలుగుతాయి.
సవితర్క - నిర్వితర్క సమాధులు
సూ|| తత్ర శబ్దార్థజ్ఞానవికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః || 1.42 ||
అక్కడ ‘శబ్ద - అర్థ - జ్ఞాన’ వికల్పములతో సంకీర్ణమై ఉంటే అది సవితర్కసమాధి
అవుతుంది.
లోకంలో ఏదైనా ఈ మూడింటితో కలసి ఉంటుంది. మనకు అనుభవానికి వచ్చే ఏ
విషయమైనా ఈ మూడుగానే ఉంటుంది. వీనిలో మొదటిది శబ్దం. లోకంలోని ప్రతిదీ ఒక
శబ్దంతో ఒక పేరుతో సూచింపబడుతుంది. ఆ శబ్దానికి ఒక అర్థముంటుంది. శబ్దము అర్థములు
కలసినప్పుడు - అది వస్తువు గాని, జీవిగాని, మనిషిగాని - దానియొక్క జ్ఞానం మనకు
కలుగుతుంది. యోగసాధనామార్గంలో కూడా ఇదే జరుగుతుంది.
సాధనామార్గంలో శబ్దమంటే మంత్రమవుతుంది. ప్రతి మంత్రమూ ‘అ’ నుంచి ‘క్ష’ వరకూ ఉన్న
అక్షరముల నుంచి పుట్టినదే. అర్థమంటే ఆ మంత్రంయొక్క అర్థం. ప్రతి మంత్రమునకూ ఒక
అర్థముంటుంది. శబ్దార్థముల కలయిక వల్ల ఆ మంత్రమునకు సంబంధించిన జ్ఞానోత్పత్తి
మనసులో కలుగుతుంది.
ఉదాహరణకు మహర్షి చెప్పిన ప్రణవ మహామంత్రమును తీసుకుంటే, దానికి ‘ఓం’ అనే
శబ్దమున్నది. ఆ శబ్దమునకు ‘ఈశ్వరుడు’ అనే అర్థమున్నది. దానిని జపిస్తూ, దాని అర్థమును
ధ్యానిస్తూ ఉన్నపుడు అది ఈశ్వరసాక్షాత్కారమును కలిగిస్తుంది. అది పరమజ్ఞానమనబడుతుంది.

నే తో
కనుక, ధ్యానసమాధి యనేది ‘మంత్ర - భావనా - జ్ఞానము’లతో కూడి ఉన్నపుడు అది
‘సవితర్క సమాధి’ అవుతుంది. సామాన్యంగా సాధకులందరూ ఈ పరిధిలోనే ఉంటారు. దీనినే
పూర్తిగా సాధించలేక నానాఅవస్థలు పడుతూ ఉంటారు.
ఇది ఎందుకు జరుగుతుంది? అంటే, మనస్సు కావలసినంతగా పరిశుద్ధం కాకుండా ఉన్నది
గనుక, దానికొక మంత్రము, ఒక ధ్యానము, ఒక ఆధారము, ఒక ఆలంబనలు
అవసరములౌతాయి. వీటినే ‘వితర్కం’ అంటారు గనుక ఇది సవితర్క సమాధి.
సూ|| స్మృతి పరిశుద్ధౌ స్వరూపశూన్యేవార్థమాత్ర నిర్భాసా నిర్వితర్కా || 1.43 ||
స్మృతి పరిశుద్ధమై, స్వరూపశూన్యమై, అర్థం మాత్రమే వెలుగుతుంటే అది నిర్వితర్క సమాధి
అవుతుంది.
కానీ, చాలా కొద్దిమందిలో మాత్రం మనస్సు చాలా పరిశుద్ధమైన స్థితిలో ఉంటుంది. ఆ స్థితి
ఎన్నోజన్మల సాధనాఫలితంగా వారికి కలుగుతుంది. అట్టివారికి ధ్యానములో శబ్దము, రూపముల
యొక్క అవసరం ఉండదు. అంటే, మంత్రమనేది వారికి అవసరం ఉండదు. ఒక
దేవతారూపమును భావించవలసిన అవసరం కూడా వారికి ఉండదు. సరాసరి, మంత్రార్థం వారి
మనస్సులో ఏకాగ్రంగా వెలుగుతూ ఉంటుంది. అది నిర్వితర్కసమాధి. అంటే, వారికి ‘నామ -
రూపముల’ వితర్కం యొక్క అవసరం లేదు.
నామరూపముల ధ్యానం దేశకాలములకు పరిమితమై ఉన్నపుడు అది సవితర్కసమాధి
అవుతుంది. అదే ధ్యానం దేశ కాలములను అధిగమించినప్పుడు నిర్వితర్కం అవుతుంది.
సవిచార - నిర్విచార సమాధులు
సూ|| ఏతయైవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మవిషయా వ్యాఖ్యాతా || 1.44 ||
ఇదేవిధంగా, సూక్ష్మవిషయములను, సవిచారము, నిర్విచారములంటూ చెప్పవచ్చు.
స్థూలవిషయముల ధ్యానంలో ‘సవితర్క నిర్వితర్క’ సమాధులు కలుగుతాయి.
సూక్ష్మవిషయముల ధ్యానంలో, ఇదే దారిలో, ‘సవిచార నిర్విచార’ సమాధులు కలుగుతాయి.
ఉదాహరణకు - పంచభూతముల స్థూలధ్యానంలో సవితర్క నిర్వితర్క సమాధులను ధ్యాని
అందుకుంటాడు. వాటియొక్క తన్మాత్రల (సూక్ష్మశక్తుల) ధ్యానం అతనికి సవిచార నిర్విచార
సమాధులను అందిస్తుంది.
నామరూపములు స్థూలవిషయములు. వాటి అర్థము సూక్ష్మవిషయం. ఈ సూక్ష్మస్థితుల
ధ్యానంకూడా పైవిధంగానే సవిచార, నిర్విచార సమాధులుగా సాగుతుంది.
అంటే, నామరూపముల బాహ్యరూపములను వదలిపెట్టి, వాటి అర్థమును, శక్తిని
దేశకాలములకు లోబడినట్లు ధ్యానిస్తే అది సవిచారసమాధిని అందిస్తుంది. ఇదే ధ్యానం
దేశకాలములకు అతీతంగా ఉన్నపుడు అది నిర్విచారసమాధికి దారిచూపుతుంది.
తనను బాధపెడుతున్న ఆలోచనలతో యుద్ధం చేస్తూ, వ్యతిరేకపు ఆలోచనలతో వాటిని
డే లో దీ లో
అధిగమిస్తూ ఉండే స్థితి సవితర్కం. నిర్వితర్కస్థితిలో ఈ అవస్థ ఉండదు. దీనిలో తాను ధ్యానిస్తున్న
స్థూలమైన విషయం పైన మనస్సు తేలికగా ఏకాగ్రం అవుతుంది.
సూక్ష్మవిషయచింతనం విచారస్థితి. సవిచారమంటే ఎడతెగని ఆలోచన. సూక్ష్మవిషయముల
ధ్యానంలో ఆలోచనారహితంగా ఉండే స్థితి నిర్విచారస్థితి.
సమాధి మనస్సు యొక్క స్థితి ధ్యానింపబడే విషయం
సవితర్క ఆలోచనలతో యుద్ధం స్థూల విషయములు
నిర్వితర్కం ఆలోచనలతో యుద్ధం ఉండదు
సవిచారం ఒకే ఆలోచన కొనసాగుతూ ఉంటుంది సూక్ష్మవిషయములు
నిర్విచారం ఆలోచనారహిత స్థితి

సూ|| సూక్ష్మవిషయత్వం చాలింగపర్యవసానం || 1.45 ||


సూక్ష్మ విషయములు అలింగములుగా అంతమౌతాయి.
స్థూలవిషయములంటే పంచభూతములు. సూక్ష్మవిషయములంటే వాటి తన్మాత్రలు.
అలింగమంటే ప్రకృతి. అంటే, ఇక దేనిలోనూ లీనం కానిది. సాంఖ్యం ప్రకారం ప్రకృతిపురుషులు
మొదటినుంచీ కలిసే ఉన్నప్పటికీ ఏనాడూ పూర్తిగా ఏకం కారు. అనాదిగా ఈ రెండూ
విడివిడిగానే ఉన్నాయి. పురుషునిలో లీనం కాదు కనుక ప్రకృతి అలింగమౌతుంది.
సాధనాక్రమంలో స్థూలవిషయములను వదలిపెడుతూ క్రమేణా సూక్ష్మవిషయములను
ధ్యానించాలి. అంటే, వితర్కం, విచారంగా పరిణమిస్తుంది. విచారం, సానందస్థితికి, అక్కడనుంచి
సాస్మితాస్థితికి దారితీస్తుంది. ఇవన్నీ అవ్యక్తరూపమైన ప్రకృతిలో లీనమౌతాయి. ఈ విధంగా
ధ్యానంలోని సూక్ష్మవిషయములు ప్రకృతిలో లీనమైనప్పుడు, యోగియొక్క మనస్సు కూడా
ప్రకృతిలో లయమౌతుంది. దీనినే ‘అలింగ పర్యవసానం’ అని మహర్షి పిలిచారు.
ఇంకొకవిధంగా చెప్పాలంటే, నామరూపముల సహాయంతో అందుకోబడేవి సవితర్క
నిర్వితర్క సమాధులు. నామరూపముల సహాయం లేకుండా సరాసరి వాటియొక్క
సూక్ష్మగుణములను, శక్తులను ధ్యానిస్తే కలిగేవి సవిచార నిర్విచార సమాధులు.
సబీజ - నిర్బీజ సమాధులు
సూ|| తా ఏవ సబీజః సమాధిః || 1.46 ||
ఇవన్నీ సబీజసమాధి అవుతాయి.
బీజములంటే సంస్కారములు. ఇవి జన్మజన్మాంతరముల నుండి జీవిని వెంటాడుతూ వస్తున్న
ఆలోచన - వాక్కు - క్రియలపరములైన అలవాట్లు లేదా పోకడలు. పైన చెప్పబడిన సవితర్క,
నిర్వితర్క, సవిచార, నిర్విచారసమాధులలో, చిత్తంలోని సంస్కారములు మిగిలే ఉంటాయి గనుక
ఈ సమాధిస్థితులన్నీ ‘సబీజసమాధి’ (బీజములతో కూడిన సమాధి) అనబడతాయి.

నే
ఈ నాలుగు సమాధిస్థితులనూ అందుకున్న యోగికి అనేక అద్భుతశక్తులు కలుగుతాయి.
ప్రకృతిశక్తులపైన అతనికి అదుపు లభిస్తుంది. కానీ అతనిలో సంస్కారనాశనం జరుగదు. మోక్షం
లభించదు.
ఈ నాలుగు సమాధిస్థితులూ సాధనలో నాలుగుమెట్ల వంటివి. వీటిలో ఒకదాని తర్వాత
ఒకదానిని యోగి తన సాధనలో అందుకుంటూ రావాలి.
సూ|| నిర్విచారవైశారద్యేఽధ్యాత్మప్రసాదః || 1.47 ||
నిర్విచారసమాధి పరిపక్వతలో ఆధ్యాత్మప్రసాదం లభిస్తుంది.
వీటిలో చివరిది నిర్విచారసమాధి. దీనిని బాగా అభ్యాసం చేసి, ఈ స్థితిలో ఎక్కువకాలం
ఉండగలిగినప్పుడు యోగికి ‘అధి - ఆత్మ’ యొక్క ప్రసాదం లభిస్తుందని యోగసూత్రముల బోధ.
అంటే, దివ్యాత్మయైన ఈశ్వరుని అనుగ్రహం ఈ స్థితిలో మాత్రమే యోగికి కలుగుతుంది.
అప్పటివరకూ అతనికి మనస్సు శుద్ధం కావడం, ఏకాగ్రం కావడం, ప్రకృతిశక్తులపైన పట్టు
రావడం, రకరకములైన దేవతాదర్శనములు కలగడం, మొదలైన స్థితులు మాత్రమే
కలుగుతాయిగాని, ఆధ్యాత్మప్రసాదం లభించదు. నిర్విచారసమాధిలో సిద్ధి కలిగినప్పుడు మాత్రమే
ఈశ్వరునితో అనుసంధానం కలుగుతుంది. అసలైన దైవానుగ్రహం అంటే ఏమిటో ఈ స్థితిలో
మాత్రమే యోగికి అర్థమౌతుంది.
సూ|| ఋతంభరా తత్ర ప్రజ్ఞా || 1.48 ||
అప్పుడు ప్రజ్ఞ ఋతముతో నిండుతుంది.
ప్రజ్ఞ అంటే జ్ఞానస్థితి. సామాన్యమానవులకు లౌకికవిషయములలో మాత్రమే జ్ఞానం
ఉంటుంది. అంటే, డబ్బు సంపాదన, సుఖములను విలాసములను అనుభవించడం, ఈ క్రమంలో
నానావిధములైన అధర్మపుదారులు తొక్కడం మొదలైన విషయములలో ‘తెలివి’ ఉంటుంది.
ఆధ్యాత్మికసాధకులకు, యోగులకు పారలౌకిక జ్ఞానం ఉంటుంది. అది వారి సాధనామార్గంలో
వారికి కలిగే అనుభవజ్ఞానం. దీనిని ‘ప్రజ్ఞ’ అంటారు.
‘ఋతమ్’ అనేది వేదంలో చెప్పబడిన పదం. దీనికి - విశ్వవ్యాప్తమైన ధర్మం, అనంతచైతన్యం,
అనంతమైన ఎరుక అని అర్థములున్నాయి. సామాన్యార్థంలో దీనిని దైవచైతన్యం, దైవశక్తి యని
పిలుస్తారు. నిర్విచారసమాధిలో విశారదుడైన వానికి, అంటే, మంచిపట్టును సాధించినవాని
ప్రజ్ఞలో మాత్రమే ‘ఋతమ్’ అనేది నిండుతుంది. దీనిని ‘ఋతంభర ప్రజ్ఞ’ అంటారు.
మామూలుమాటలలో చెప్పాలంటే, విశ్వవ్యాప్తమైన దైవశక్తితో అనుసంధానమనేది ఈ
స్థాయిలో మాత్రమే యోగికి అనుభవమౌతుంది.
సూ|| శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యామన్యవిషయా విశేషార్థత్వాత్ || 1.49 ||
శ్రుత ప్రమాణం, అనుమాన ప్రమాణం, వీటివల్ల కలిగే ప్రజ్ఞల కంటే ఇది విశేషమైనది.
శ్రుతప్రమాణం: అంటే, వినడంవల్ల కలిగే జ్ఞానం. ఎవరో చెబితే విని ‘ఓహో! ఇది ఇలా
ఉంటుందా!’ అనుకోవడమని అర్థం. లోకంలో ఉన్న ఆధ్యాత్మికత అంతా శ్రుతప్రమాణమే అయి
ఉంటుంది. మతములు, మతగ్రంథములు, గురువులు, పండితులు చెప్పారని వాటిని నమ్మడం
శ్రుతప్రమాణం.
అనుమాన ప్రమాణం: అంటే, ఊహించి తెలుసుకునే జ్ఞానం. ‘ప్రపంచం ఉన్నది కనుక దీనిని
తయారుచేసిన దైవంకూడా ఉండి ఉండాలి’ అనిన ఆలోచన అనుమాన ప్రమాణం. ఈ
అధ్యాయంలో వృత్తులను గురించి మొదట్లో చెప్పినచోట దీనిని వివరించాను. కనిపిస్తున్న దానిని
బట్టి, కనిపించని దానిని ఊహించడం అనుమాన ప్రమాణమౌతుంది.
‘ఋతంభరప్రజ్ఞ’ వల్ల కలిగే జ్ఞానం ఈ రెండువిధములైన జ్ఞానం కంటే (వినడం ద్వారా,
ఊహించడం ద్వారా కలిగే జ్ఞానం కంటే) విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే, అక్కడ
ఇంద్రియాతీతసత్యమును సూటిగా దర్శించి, అనుభవించి, తెలుసుకోవడం జరుగుతుంది.
శ్రుతానుమాన ప్రమాణముల కంటే, విశేషమైన ప్రజ్ఞ గనుక, ఇది ‘ప్రత్యక్ష ప్రమాణం’
అనబడుతుంది.
సూ|| తజ్జః సంస్కారోఽన్యసంస్కార ప్రతిబంధీ || 1.50 ||
దానినుండి పుట్టిన సంస్కారములు ఇతర సంస్కారములను బంధిస్తాయి.
నిర్విచారసమాధిలో నిరంతరం ఉండటం సాధ్యమైనప్పుడు దానివల్ల కలిగే అనుభవం,
అప్పటికి చిత్తంలో మిగిలియున్న పాతసంస్కారములను నిర్వీర్యం గావిస్తుంది. వాటిని
తలలెత్తకుండా చేస్తుంది. దీని బలం ముందు సంస్కారములు బలహీనములౌతాయి. ఎందుకంటే,
సంస్కారములన్నీ బాహ్యవిషయములకు ఇంద్రియములతో కలిగిన స్పర్శవల్ల ఏర్పడతాయి.
నిర్విచారసమాధి బాహ్యవిషయముల పరిధిని దాటి సూక్ష్మంగా, దేశకాలములకు అతీతంగా
పోతుంది గనుక, దాని బలం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని అనుభవం, చిత్తంలోని
పాతసంస్కారముల తలలను ఎత్తకుండా చేస్తుంది. అప్పుడు నిర్విచారసమాధి అనుభవం ఒక్కటే
చిత్తంలో మిగిలి ఉంటుంది.
సూ|| తస్యాపి నిరోధే సర్వనిరోధాన్నిర్బీజః సమాధిః || 1.51 ||
దీనిని కూడా నిరోధిస్తే, అన్నీ నిరోధింపబడి, నిర్బీజసమాధి కలుగుతుంది.
నిర్విచారసమాధిని కూడా దాటినప్పుడు మాత్రమే సంస్కారనాశనం జరుగుతుంది. అప్పుడు
మాత్రమే, జన్మజన్మాంతరముల నుండి వెంటాడుతున్న కర్మబంధముల నుండి, వాసనల నుండి
విముక్తి లభిస్తుంది. చిత్తపులోతులలో బీజరూపంలో దాగి ఉన్న సంస్కారములను పూరిగా
తొలగిస్తుంది గనుక దీనిని ‘నిర్బీజసమాధి’ అంటారు. ఈ స్థితిని అందుకున్నపుడు మాత్రమే యోగి
కృతార్థుడవుతాడు.
నిర్విచారసమాధిని కూడా దాటినప్పుడే యోగి చేరవలసిన పరమగమ్యం (సంస్కారనాశనం,
వాసనాక్షయం) సిద్ధిస్తుంది.

|| ఇతి పతంజలి విరచితే యోగసూత్రే ప్రథమః సమాధిపాదః ||


చే లో డే
ఇది పతంజలిమహర్షి చేత రచింపబడిన యోగసూత్రములలోని సమాధిపాదమనబడే
మొదటి అధ్యాయము.
రెండవ అధ్యాయము
(సాధన పాదము)
సూ|| తపఃస్వాధ్యాయేశ్వరప్రణిధానాని క్రియాయోగః || 2.1 ||
తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరప్రణిధానములే క్రియాయోగము.
ఈ పదములను సరిగ్గా అర్థం చేసుకోవాలి.
తపస్సు : అడవులలో ఉంటూ, తిండి మానుకొని, ఉపవాసములుండి, దేహమును
కష్టపెట్టడం తపస్సనే భావం ప్రాచీనకాలంలో ఉన్నది. బుద్ధుడు కూడా ఈ భావమునకు లోనై,
తీవ్రమైన ఉపవాసములు చేసి, చిక్కి శల్యమైనాడు. వేదములలో కృచ్ఛ చాంద్రాయణములనే
తపోదీక్షలున్నాయి. ఇవిగాక జలమధ్యంలో అగ్నిమధ్యంలో ఉంటూ, తల్లక్రిందులుగా చెట్లకు
వ్రేలాడుతూ, చేసే రకరకములైన తపస్సులున్నాయి. నిజమునకు ఇవి తపస్సులు కావు.
ఎందుకంటే, దేహమును కష్టపెట్టి ఉపయోగమేమున్నది? లోపలున్న మనస్సులో
దోషములనుంచుకుని, ఊరకే శరీరమును హింసపెడితే ఏమీ ఉపయోగం లేదు.
‘తపించడమే తపస్సు’ అని జిల్లెళ్ళమూడి అమ్మగారన్నారు. దేనికోసం తపించడం?
దైవసాక్షాత్కారం కోసం, ఆత్మానుభూతి కోసం, బ్రహ్మానుభూతి కోసం, ఇంద్రియముల పట్టునుండి,
మాయామోహముల నుండి, అహంకార మమకారముల నుండి మోక్షం కొరకు తపించడమే
నిజమైన తపస్సు. అంతేగాని, శరీరమును అతిగా బాధలు పెట్టే విధానములు తపస్సులు కావు.
మాయయనే సాగరమును దాటడానికి, శరీరం ఒక చక్కని నావవంటిది. దానిని సక్రమమైన
స్థితిలో ఆరోగ్యంగా ఉంచినప్పుడే అది సాధనకు పనికివస్తుంది. అంతేగాని, మూర్ఖత్వంతో దానిని
ధ్వంసం చేసుకోకూడదు.
‘కలియుగంలో సత్యమును పలకడమే నిజమైన తపస్సు’ అని శ్రీ రామకృష్ణులన్నారు.
ఉత్తమాటల్లో సత్యం ఉంటే చాలని దీనర్థం కాదు. సత్యాన్ని అనుసరిస్తూ మన జీవితం మొత్తం
ఉండాలి. ప్రస్తుత అధర్మపుసమాజంలో ఇలా బ్రతకాలంటే, ఎన్నింటినో వదులుకోవడానికి
సిద్ధపడాలి. అంటే, సత్యానికి త్యాగం తోడు కావాలి. ఈ రెండూ జీవితంలో నిండినప్పుడు అది
అసలైన తపస్సు అవుతుంది. అంతేగాని, మొక్కుబడిగా కొద్దిరోజులపాటు చేసే దీక్షలు,
ఉపవాసములు, తపస్సు అనిన పదమునకు తగవు.
దైవంకోసం తపించడమే తపస్సు.
స్వాధ్యాయము: ఈ పదమునకున్న సాధారణమైన అర్థం - మంత్రజపము, గ్రంథపఠనము,
శాస్త్రాధ్యయనము. కానీ ఇవి స్థూలములైన అర్థములు మాత్రమే. గ్రంథపఠనం గర్వమును
పెంచుతుంది గాని తగ్గించదు. స్వ - అధ్యాయము అంటే తనను తాను అధ్యయనం
చేయడమన్నది ఈ పదమునకు గల అసలైన అర్థము. అంటే, తనలోని తప్పొప్పులను ప్రతిక్షణం
బే వే
బేరీజు వేసుకుంటూ, అధర్మపు నడతలను తొలగించుకుంటూ, సత్యమును, ధర్మమును
అనుసరిస్తూ జీవించడమని అర్థం. ఆత్మపరిశీలన యన్నది స్వాధ్యాయమునకు గల అసలైన అర్థం.
ఈశ్వరప్ర ణిధానం: ఇది ఏమిటో మొదటిఅధ్యాయంలో వివరించబడినది. ఈశ్వరుని
నిరంతరభక్తితో ధ్యానిస్తూ, తన సమస్తకర్మఫలితములను ఆయనకు అర్పిస్తూ, ఈశ్వరార్పితమైన
బుద్ధితో, ఆయనను చేరుకోవడమే పరమగమ్యంగా తలుస్తూ, శరణాగతభావంతో జీవించడమే
ఈశ్వరప్రణిధానం.
అంటే, ఈశ్వరునికోసం తపిస్తూ, ఆత్మపరిశీలన చేసుకుని తన తప్పులను దిద్దుకుంటూ,
నిరంతర ఈశ్వరధ్యానంలో ఉంటూ, తాను చేసే కర్మఫలములను ఆయనకే అర్పిస్తూ జీవించడమే
క్రియాయోగమని పతంజలిమహర్షి ఉపదేశం.
మహర్షి చెప్పిన క్రియాయోగము, బాబాజీ గారు, లాహిరీమహాశయులు బోధించిన
క్రియాయోగము ఒకటి కావు. ఈ భేదమును స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
సూ|| సమాధిభావనార్థః క్లేశతనూకరణార్థశ్చ || 2.2 ||
వాటి ఉపయోగం - సమాధిని కలిగించడం, క్లేశములను తగ్గించడం.
ఈ క్రియాయోగమును లేదా మూడు యోగక్రియలను ఎందుకు పాటించాలి? అంటే,
సమాధిని పొందటం, క్లేశములను తగ్గించుకోవడం, అనే రెండు పనులకోసం
క్రియాయోగమును అభ్యాసం చేయాలి.
సమాధి, క్లేశములు, అనిన రెండు పదములు ఇక్కడ చెప్పబడినాయి. సమాధి ఎన్ని రకములో
మొదటిఅధ్యాయంలో వివరించబడినది. ఇప్పుడు క్లేశముల వివరం ఇవ్వబడుతున్నది.
క్లేశములు
సూ|| అవిద్యా-స్మితా-రాగ-ద్వేషా-భినివేశాః క్లేశాః || 2.3 ||
అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశములే క్లేశములు.
వీటిలో అవిద్య అంటే అజ్ఞానము, అస్మిత అంటే అహంకారము, రాగమంటే
కావాలనుకోవడం, ద్వేషమంటే వద్దనుకోవడం, అభినివేశమంటే తాను జీవించి ఉండాలని
వాంఛించడం. సమాధిస్థితిని పొందటానికి, జ్ఞానప్రాప్తికి ఈ అయిదుస్థితులే ఆటంకములు.
క్లేశమనే పదం బౌద్ధగ్రంథములలో విస్తారంగా వాడబడింది. బౌద్ధం నుంచి మహర్షి ఈ
పదమును స్వీకరించి ఉండవచ్చు. లేదా, దానికంటే ముందుదైన సాంఖ్యం నుంచి వీరిద్దరూ
తీసుకుని ఉండవచ్చు. క్లేశములంటే జ్ఞానప్రాప్తికి ఆటంకములు. క్లేశముల గురించి ‘ధమ్మపదం’లో
బుద్ధుడు ఇలా బోధిస్తాడు.
తత్రాభిరతిమిచ్ఛేయ్య హిత్వా కామే అకించనో
పరియోదపెయ్య అత్తానం చిత్తక్లేసేహి పండితో (6.13)

భో ఏ లో
పండితుడైనవాడు, వస్తుభోగముల యందు ఆసక్తిని త్యజించి, ఏకాంతుడై, తన చిత్తములోని
క్లేశములను ప్రక్షాళన గావించుకోవలెను.
బౌద్ధంలోని క్లేశములు మూడు, అయిదు, పది, మొదలైన ఎన్నో రకములుగా
వర్ణించబడినాయి. స్థూలంగా చూచినప్పుడు, అవి ఈ క్రింది విధములుగా ఉన్నాయి.
పంచేంద్రియములు, మనస్సు - ఈ ఆరింటిలో ఉన్న కోరికలే క్లేశములని
సంయుక్తనికాయంలో బుద్ధునిచేత చెప్పబడింది. కామము, క్రోధము, బద్ధకము,
నిలకడలేనితనము, సందేహములే క్లేశములని ‘మహాస్మృతిప్రస్థానసూత్రంలో’ బుద్ధుడు
బోధించాడు. క్రీ.శ 5 వ శతాబ్దమునకు చెందిన బుద్ధఘోషుడు వ్రాసిన ‘విశుద్ధిమార్గం’ అనే
బౌద్ధగ్రంథంలో పది రకములైన క్లేశములు చెప్పబడినాయి. అవి - 1. లోభము 2. ద్వేషము 3.
మోహము 4. గర్వము 5. మిథ్యాదృష్టి 6. విచికిత్స 7. సోమరితనము 8. నిలకడలేనితనము 9.
సిగ్గులేనితనము 10. నిర్లక్ష్యము.
బుద్ధుడు తన ఉపదేశములలో చాలాచోట్ల ‘కుశలధర్మములు’ ‘అకుశలధర్మములు’ అనే
పదములను ఉపయోగిస్తాడు. వీటిలో అకుశలధర్మములే క్లేశములు. అవి లోభము, ద్వేషము,
మోహము. జ్ఞానప్రాప్తివైపు పోనివ్వకుండా ఇవి ధ్యానిని ఆపుతూ ఉంటాయి. వీటికి విరుద్ధములైన
ఉదారత్వము, అద్వేషము, నిర్మోహములు కుశలధర్మములు. ఇవి ధ్యానికి సహాయపడతాయి.
మహాయానబౌద్ధం పంచవిధములైన క్లేశములను నిర్ధారించింది. అవి - అవిద్య, రాగము,
ద్వేషము, అభిమానము, ఈర్ష్య.
అవిద్య, రాగ, ద్వేషములనే త్రివిధక్లేశములను బౌద్ధంలోని అన్నిశాఖలు ఆమోదించినట్లు
గోచరిస్తుంది. పతంజలిమహర్షి ప్రతిపాదించిన క్లేశములు కూడా వీటిలోనివే గనుక, వీటిని
తనకంటే ప్రాచీనమైన బౌద్ధంనుంచి మహర్షి స్వీకరించినట్లు మనం భావించవచ్చు.
అతిప్రాచీనమైన ఈ ‘క్లేశం’ అనే భావనయే తరువాతి కాలంలో వేదాంతంలో ప్రవేశించి
‘అరిషడ్వర్గములు’ గాను, తంత్రశాస్త్రంలో ప్రవేశించి ‘అష్టపాశములు’ గాను రూపుదిద్దుకుంది.
బుద్ధుడు వీటిని క్లేశములు (కష్టపెట్టే ఆటంకములు) అన్నాడు. పతంజలిమహర్షి కూడా ఇదే
పదమునుపయోగించాడు. మహాయానబౌద్ధం వీటిని ‘విషములు’ అన్నది. వేదాంతం ‘శత్రువులు’
అన్నది. తంత్రం ‘పాశములు’ అన్నది. ఉపయోగింపబడిన పదం ఏదైనప్పటికీ, ఇవి
ధ్యానమార్గంలో ఆటంకములన్నది సత్యం.
ఈ పంచక్లేశములలో ఒక్కొక్కదానిని మహర్షి వివరిస్తున్నారు.
సూ|| అవిద్యా క్షేత్రముత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోఽదారాణాం || 2.4 ||
నిద్రిస్తున్నవైనా, క్షీణించినవైనా, ధ్వంసమైనవైనా, విస్తరించినవైనా - ఎటువంటి
ఇతరక్లేశములకైనా - అవిద్యయే మూలక్షేత్రం.
క్లేశములు మూడైనా, అయిదైనా, ఆరైనా, ఎనిమిదైనా, ఎన్నయినా, వీటన్నిటికీ మూలం
అవిద్య లేదా అజ్ఞానం. క్లేశముల పుట్టుక, పెరుగుదల, నిద్ర, క్షీణత, ధ్వంసం ఇదంతా
క్షే లోనే లే తే లే లో
అవిద్యాక్షేత్రంలోనే జరుగుతుంది. జ్ఞానం లేని పరిస్థితే అవిద్య లేదా అజ్ఞానం. జ్ఞానస్థితిలో
క్లేశములు ఉండవు. అజ్ఞానస్థితిలోనే అవి వర్ధిల్లుతాయి.
క్లేశములనేవి ముళ్ళవంటివి. అవి భూమిలోనే ఉంటాయి గాని, ఆకాశంలో ఉండవు. భూమి
అజ్ఞానస్థితి. ఆకాశమంటే జ్ఞానస్థితి.
ప్రసుప్త - అంటే, నిద్రావస్థలో ఉన్న సంస్కారములు. వాటికి కావలసిన వస్తువులుగాని,
మనుష్యులు గాని, పరిస్థితులుగాని ఎదురుపడినప్పుడు అవి బయటకు వస్తాయి. అంతవరకూ
చిత్తంలో లేనట్లే అగుపిస్తాయి. లేనివి ఎలా పుట్టడం సాధ్యమౌతుంది? సాధ్యం కాదు. కనుక
మనస్సు లోలోతులలో అణగిమణగి ఉన్న సంస్కారములు అవకాశం వచ్చినపుడు బయటపడి
విజృంభిస్తాయి. ఇవి సంచితకర్మకు సూచికలు. అనేకజన్మలలో చేసుకున్న కర్మబరువుకు ఇవి
ప్రతీకలు. అయితే ఆ కర్మ పక్వమునకు రాకుండా, చిత్తంలో నిద్రాణంగా ఉన్నది.
తను - అంటే, ‘క్షీణించిన’ అని అర్థం. కొన్ని సంస్కారములు బలంగా ఉంటే, మరికొన్ని
క్షీణిస్తూ ఉంటాయి. ఎలా క్షీణిస్తాయి? వాటికి వ్యతిరేకములైన భావనలు బలంగా ఉన్నపుడు అవి
క్షీణిస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తిపైన మనకు ప్రేమ బలంగా ఉన్నపుడు అదే వ్యక్తిపైన ఉన్న
ద్వేషం క్షీణిస్తుంది. ఉదారస్వభావం ఉన్నపుడు లోభం క్షీణిస్తుంది. దయ ఉన్నపుడు క్రూరత్వం
క్షీణిస్తుంది. ఈ విధంగా ఒక భావన బలంగా ఉన్నపుడు దానికి వ్యతికరేకభావన క్షీణిస్తుంది.
దీనినిబట్టి, మనం అనుభవించే కర్మ కూడా కొంత బలంగా ఉంటుంది. మరికొంత తగ్గిపోతూ
ఉంటుంది.
విచ్ఛిన్న - ‘ధ్వంసమైన’ అని అర్థం. సాధనాబలం వల్ల కొన్ని క్లేశములు నిర్వీర్యమై పోతాయి.
అలాగే, అనుభవంతో కొంత కర్మ ధ్వంసమై పోతూ ఉంటుంది.
ఉదార - ‘విస్తరిస్తున్న’, ‘వ్యాపిస్తున్న’ అని అర్థములు. కొన్ని క్లేశములను మనం బాగా
ఆదరించడం వల్ల, అవి బలమును పుంజుకుని, మన జీవితమంతా వ్యాపిస్తూ ఉంటాయి. వాటిని
మనం ఎంతగా బుజ్జగిస్తామో, ఎంతగా అలవాటు పడతామో అవి అంతగా బలమును
పుంజుకుంటూ ఉంటాయి. మనల్ని ఆడిస్తూ ఉంటాయి.
ఈ తతంగమంతా ‘అవిద్య’ అనబడే రంగస్థలం మీదనే జరుగుతుంది. అవిద్య లేదా అజ్ఞానం
నశిస్తే ఇవేవీ ఉండవు. భూమిని వదలి ఆకాశంలోకి పోయినప్పుడు ముళ్ళు గుచ్చుకోవు.
సూ|| అనిత్యాశుచి దుఃఖానాత్మసు నిత్యశుచి సుఖాత్మఖ్యాతిరవిద్యా || 2.5 ||
ఈ అవిద్యవల్ల - అనిత్యము నిత్యముగాను, అశుచి శుచిగాను, దుఃఖము సుఖముగాను,
అనాత్మ ఆత్మగాను గోచరిస్తాయి.
అవిద్య అంటే ఏమిటి? క్షణికమైనదానిని నిత్యమని, అశుద్ధమును శుద్ధమని, దుఃఖమును
సుఖమని, అనాత్మను ఆత్మయని భ్రమించడం అవిద్య. అంటే మిథ్యాదృష్టి. ఈ ‘భ్రమ’ అన్నదాని
నుంచి, క్రింద చెప్పబోతున్న మిగతావన్నీ పుట్టుకొస్తాయి.
‘అనిత్యమును నిత్యముగా’ - అయిదు ఇంద్రియముల ద్వారా మనకు కలిగే అనుభవములన్నీ

డే కీ
అనిత్యములని, అవి శాశ్వతముగా నిలబడేవి కావని అందరికీ తెలుసు. వస్తువుల పట్ల,
ఇంద్రియభోగముల పట్ల ఉన్న కోరికలు కూడా నిత్యములు కావన్నది కూడా తెలుసు. కానీ ఆ
విషయమును ఒప్పుకోకుండా, ఇవన్నీ నిత్యములే అని భ్రమిస్తూ, వాటికోసం రాత్రింబగళ్లు
వెంపర్లాడుతూ ఉంటారు మానవులు. ఇదే అవిద్య.
‘అశుచిని శుచిగా’ - తన ఆత్మలో తానుండటం శుచి. ఆత్మస్థితినుంచి జారి
ఇంద్రియలంపటములలో చిక్కుకోవడం అశుచి. కానీ మానవులందరికీ ఇంద్రియ సుఖములే
రుచిగా ఉంటాయిగాని ఆత్మసౌఖ్యం నచ్చదు. ఇంద్రియసుఖములే పరమావధులని భావిస్తూ
ఉంటారు. అశుచిని శుచిగా భావించడం అంటే ఇదే. ఇదే అవిద్య.
‘దుఃఖమును సుఖముగా’ - ఇంద్రియసుఖములన్నీ చివరకు దుఃఖంలో అంతమయ్యేవే. ఈ
ప్రపంచంలో దుఃఖమే సత్యమంటాడు బుద్ధుడు. ఆయనకంటే ముందరివారైన సాంఖ్యులు,
వైశేషికులు కూడా దీనినే చెప్పినారు. కోరుకున్నది లభించకపోవడం దుఃఖం, వద్దనుకున్నది
లభించడం దుఃఖం, కోరుకున్నది లభించినా అది జారిపోవడం దుఃఖం, వద్దనుకున్నది
వస్తుందేమోనన్న భయం దుఃఖం - ఈ విధంగా దుఃఖమునకు అనేక రూపములున్నాయి. మనం
సుఖంగా భావించేది ప్రతిదీ చివరకు దుఃఖంలోనే అంతమౌతుంది. మానవుని నిత్యనేస్తం
దుఃఖమే. కానీ ఆ దుఃఖమునే సుఖంగా భ్రమిస్తూ మానవుడు బ్రతుకుతుంటాడు. ఇదే అవిద్య.
‘అనాత్మను ఆత్మగా’ - 25 తత్త్వములలో పురుషుడు తప్ప, మిగిలినవన్నీ అనాత్మయే.
పురుషుడొక్కడే ఆత్మ. కానీ అనాత్మయైన ఈ 24 తత్త్వములనూ ఆత్మగా భ్రమిస్తూ మానవుడు
జీవనయాత్ర సాగిస్తూ ఉంటాడు. ఇదే అవిద్య.
అనాత్మను ఆత్మగా భావించడం అన్ని అనర్థములకూ మొదటి మెట్టు. అంటే, త్రిగుణాత్మిక
యైన ప్రకృతిని తానుగా భావించి అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, జగత్తులలో
మమేకమై తన స్వస్థితిని కోల్పోవడం వల్ల మిగతా అన్ని అనర్థములూ మొదలవుతాయి. ఇది
మొదటి పతనం.
నిత్యము, నిర్వికారము, వాసనారహితము, శుద్ధము, పరిపూర్ణము అయిన తన స్థితిని వదలి
ప్రకృతిజన్యమైన దుఃఖమును సుఖంగా భ్రమించడం రెండవ పతనం.
దేనికీ అంటని సర్వాతీతమైన తన స్వస్థితిని మరచి త్రిగుణముల ఊబిలో దిగి తద్వారా
అంటుకున్న అశుచిని శుచిగా భ్రమించడం మూడవ పతనం.
ఇక పూర్తిగా ఇంద్రియముల పరిధిలోకి దిగి ప్రపంచంతోనూ దాని అనుభవములతోనూ
మమేకమై అశాశ్వతములైన ఇంద్రియానుభవములను శాశ్వతములుగా భ్రమిస్తూ వాటిలోనే
మునిగియుండటం నాలుగవ పతనం.
ఈ విధంగా పురుషుడు తన సహజస్థితి నుంచి ఎన్నిమెట్లు క్రిందకు దిగివస్తే అంతగా తన
పరిపూర్ణస్థితిని కోల్పోతాడు. అంతగా బంధంలో చిక్కుకుంటాడు. జననమరణ చక్రంలో
పరిభ్రమిస్తుంటాడు.

క్షే లో క్లే
ఈ అవిద్యాక్షేత్రంలో ఉన్నంతవరకూ మానవునికి క్లేశములు తప్పవు. దుఃఖమూ తప్పదు.
సూ|| దృగ్దర్శనశక్త్యోరేకాత్మతేవాస్మితా || 2.6 ||
దృక్కు యొక్క శక్తి, దర్శనశక్తి - వీటి ఏకాత్మతయే అస్మిత.
అంటే, చూస్తున్నదాని శక్తి, చూడబడేదాని శక్తితో మమేకం అవడమే అస్మిత లేదా ‘అహం’
స్ఫురణ. చూస్తున్నది ఆత్మ. అది, చూడటానికి పరికరములైన మనస్సు, కన్నులతో మమేకం
అయిపోయి, తననుతాను మరచి, చూస్తున్న దృశ్యంలో మునిగిపోతుంది. ఈ క్రమంలో ‘అహం’
భావన ఉద్భవిస్తుంది. అంటే, ‘నేను చూస్తున్నాను’ అనుకుంటుంది. మిగతా
నాలుగుఇంద్రియములతో కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. ఈ క్రమంలో శుద్ధము,
పరిపూర్ణము అయిన ఆత్మ, ఇంద్రియవిషయములలో మునిగి, అవే తాననుకుంటూ, ‘నేను-నాది’
అనిన అజ్ఞానానికి లోనవుతుంది. ‘అహం’ భావనగా మారుతుంది.
బుద్దుడు బోధించిన ‘ప్రతీత్యసముత్పాద సిద్ధాంతం’ యొక్క ఛాయలు ఇక్కడ
గోచరిస్తున్నాయి. ‘ఇంద్రియములు వాటివాటి విషయములను అనుభవించే సమయంలో ‘నేను’
అనిన స్ఫురణ కలుగుతుంది. అంతకు ముందూ అది ఉండదు. ఆ తర్వాతా అది ఉండద’ని
ఆయనన్నాడు. ఈ స్ఫురణను ఆయన ‘ఆత్మ’ అన్నాడు. నిజమునకు అది లేదని, అదొక
ఎండమావివంటి భ్రమయని ఆయనన్నాడు. వేదాంతము, యోగములు ఈ స్ఫురణను
‘అహంస్ఫురణ’ అని పిలిచాయి. అహమనేది లేదని అదొక ఎండమావియని ఇవి కూడా
అనినాయి. సరిగా అర్థం చేసుకున్నపుడు బౌద్ధమునకు, యోగవేదాంతములకు పెద్దగా భేదం
కనిపించదు.
చూస్తున్నది, చూడబడుతున్న దృశ్యంతో మమేకం కాకుండా విడిగా ఉండగలిగితే ఈ ‘అస్మిత’
లేదా ‘అహం’ అన్నది అదృశ్యమవుతుంది.
సూ|| సుఖానుశయీ రాగః || 2.7 ||
సుఖమును అనుసరించేది రాగము.
సుఖమును కోరుకోవడమే రాగం. జన్మించిన ప్రతి జీవీ సుఖమును కోరుకుంటుంది.
దుఃఖమును వద్దనుకుంటుంది. కనుక, ప్రతి జీవిలోనూ రాగం అనేది అంతర్లీనంగా ఉన్నది.
సూ|| దుఃఖానుశయీ ద్వేషః || 2.8 ||
దుఃఖమును అనుసరించేది ద్వేషం.
తనకు దుఃఖమును కలిగించేదానిని ద్వేషించడం కూడా ప్రతి జీవిలోనూ పుట్టుకతో
ఉంటుంది.
సూ|| స్వరసవాహీ విదుషోఽపి తథారూఢోఽభినివేశః || 2.9 ||
తన ప్రాణము కొనసాగాలని విద్వాంసులు కూడా కోరుకోవడమే అభినివేశం.
సృష్టిలోని ఏ జీవికూడా తాను ఉండాలని కోరుకుంటుందిగాని, లేకుండా పోవాలని

కో టే చే
అనుకోదు. ‘జగత్తు మిథ్య, ఆత్మ ఒక్కటే సత్యమ’ని వల్లించే విద్వాంసులు కూడా, తమ చావు
దగ్గరపడినప్పుడు, చావాలని కోరుకోరు. ‘ప్రాణం మీద తీపి’ అనేది ప్రతి జీవిలోనూ అంతర్లీనంగా
ఉంటుంది. దీనివల్లనే ప్రతిప్రాణీ, సుఖమును కోరుకుంటూ దుఃఖమును ద్వేషిస్తూ ఉంటుంది.
సుఖంగా బ్రతకాలంటే ప్రాణం ఉండాలి గనుక, జీవించాలని ఆశిస్తూ ఉంటుంది. ఇలా, జీవులలో
ఉన్న ‘ప్రాణం మీద తీపి’ నే ‘అభినివేశం’ అని అన్నారు మహర్షి.
‘స్వరసవాహీ’ - అనే పదం నిగూఢమైన అర్థమును కలిగి ఉన్నది. దీనివల్ల పునర్జన్మ ఉన్నదని
ఒప్పుకోవలసిన పరిస్థితి కలుగుతుంది.
ఎలాగంటే - మన మనసులో ఏర్పడే రాగంగాని, ద్వేషంగాని, భయంగాని, అనుభవం నుంచే
కలుగుతాయి. ఒకసారి తీపిని రుచి చూచినవాడికి, మళ్ళీ తీపిని చూచినపుడు నోరూరుతుంది.
అంటే, మనసు లోతులలో ఉన్న పాత అనుభవం మళ్ళీ నిద్రలేస్తుంది. ఒక్కసారి కూడా తీపిని
రుచిచూడనివానికి తీపిపదార్థమును చూచినా ఏమీ అనిపించదు. ఈ తర్కం ప్రకారం,
పుట్టినజీవికీ ఈ జన్మలో మరణం అనుభవంలో లేదు గనుక, మరణమంటే భయం దాని
మనస్సులో ఉండకూడదు. కానీ ప్రతిప్రాణీ మరణమంటే భయపడుతుంది. తాను జీవించి
ఉండాలనే కోరుకుంటుంది గాని చనిపోవాలని కోరుకోదు. అంటే, ఎన్నోజన్మలలో ఎన్నోసార్లు
మరణించిన అనుభవం మానవుని అంతరాంతరములలో ఉన్నది. కనుకనే, ఈ జన్మలో ఇంకా
మరణానుభవమును పొందకపోయినా, ప్రతి జీవీ మరణమంటే భయపడుతుంది. కనుక,
ఎన్నోజన్మల నుంచి వస్తున్న సొంతబలంతో మాత్రమే, ‘జీవితమంటే ఆశ’ అనేది జీవుల లోలోపల
కొనసాగుతున్నదిగాని, ఈ జన్మలోని అనుభవముల బలంతో కొనసాగడం లేదు. అదే ‘స్వ
రసవాహి (సొంత బలంతో)’ అనే పదమునకు అర్థం.
ఈ తర్కమును బట్టి పునర్జన్మ ఉన్నదని, అప్పటి అనుభవములు ఈ జన్మలోని చిత్తంలో దాగి
ఉన్నాయని, అర్థమౌతున్నది.
క్లేశములను ఎలా జయించాలి?
సూ|| తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః || 2.10 ||
వాటి మూలములలోనికి మరలించడం ద్వారా సూక్ష్మక్లేశములను క్షీణింపజేయాలి.
సూక్ష్మక్లేశములంటే సంస్కారములు. అంటే మనస్సులోతులలో దాగి ఉండే పోకడలు. ఇవి
జన్మజన్మల నుండీ మనలను వెంటాడుతూ వస్తూ ఉంటాయి. వీటి మూలమైన అస్మిత
(అహంస్ఫురణ) గా మార్చడం ద్వారా వీటిని దాటాలి.
రాగద్వేషములతో కూడిన సంస్కారములకు రెండు స్థితులుంటాయి.
ఒకటి - నిద్రలేచి, మనస్సును ఆక్రమించి, మనల్ని ఆడించేటప్పటి స్థితి.
రెండు - కనపడకుండా మనస్సు లోతులలో దాగి ఉండే స్థితి.
మొదటిది స్థూలస్థితి, రెండవది సూక్ష్మస్థితి. ఈ రెంటినీ ఎలా దాటాలో, లేదా, ఎలా నిర్వీర్యం

చే లో దే
చేయాలో మహర్షి ఉపదేశిస్తున్నారు.
సూక్ష్మస్థితిలో, మనస్సులోతులలో నిద్రాస్థితిలో ఉంటూ, అవకాశం వచ్చినపుడు బయటపడి
మనల్ని ఆడించే సంస్కారములను (పోకడలను) వాటి మూలమైన అస్మితగా కుదించడం ద్వారా
జయించవచ్చు. అంటే, సానంద, సాస్మితా స్థితులలోకి సంస్కారములను మరలించాలి.
సూ|| ధ్యానహేయాస్తద్వృత్తయః || 2.11 ||
వీటి వృత్తులను ధ్యానం ద్వారా దాటాలి.
తలలెత్తి, వృత్తులుగా మారి, నిత్యజీవితంలో మన మనస్సును ఆక్రమించి, మనలను
రాగద్వేషములలోకి తోసి, ఆడించేవి - నిద్రలేచిన సంస్కారములు. వీటిని ధ్యానం ద్వారా
జయించాలి. అంటే, సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార ధ్యానముల ద్వారా వీటిని
నిర్వీర్యములుగా చేయాలి.
స్థూలక్లేశములే (ఆలోచనలే) ధ్యానమునకు లొంగుతాయి. సూక్ష్మక్లేశములు (సంస్కారములు)
లొంగవు. ధ్యానం ద్వారా సూక్ష్మసంస్కారములను జయించడం సాధ్యం కాదు. వాటి మూలమైన,
అహంస్ఫురణలోకి వాటిని లయం చేస్తేనే అవి తొలగుతాయి.
సంస్కారములతో చేసే యుద్ధంలోని ఈ సూక్ష్మభేదములను యోగియైనవాడు చక్కగా అర్థం
చేసుకోవాలి.
క్లేశములు - కర్మలు - జన్మలు
సూ|| క్లేశమూలః కర్మాశయో దృష్టాదృష్టజన్మవేదనీయః || 2.12 ||
క్లేశమూలములైన కర్మలు దృష్టము, అదృష్టములుగా మారి జన్మలను బాధలను కలిగిస్తాయి.
ఈ సూత్రములలో కర్మసిద్ధాంతము వివరించబడుతున్నది.
దృష్టమంటే కనిపించేది. అదృష్టమంటే కనిపించనిది. అంటే, ఇప్పుడు చేసిన కర్మకు ఇప్పుడే
ఫలితం కనిపిస్తే అది దృష్టం. ఎప్పుడో భవిష్యత్తులో దాని ఫలితం కనిపిస్తే అది అదృష్టం. ఆ
ఫలితం కనిపించిన సమయంలో, దానికి మూలమైన పూర్వకర్మ కనిపించదు గనుక, అప్పుడు
కనిపిస్తున్న ఫలితమును ‘అదృష్టం’ అంటారు.
దేహమును ఇంద్రియములను ఆడించేది మనస్సు. కనిపించే దేహమును, కనిపించని
మనస్సు ఆడిస్తూ ఉంటుంది. కనుక మొదట మనస్సు, తర్వాత దేహం వస్తాయి. క్లేశములనేవి
మనస్సులో ఉంటూ దేహం చేత కర్మలను చేయిస్తాయి. ఆ కర్మలకు బాహ్యఫలితములు
కలుగుతాయి. ఆ ఫలితముల వల్ల, మనస్సులోని రాగద్వేషములు ఇంకా బలపడతాయి. వాటివల్ల
మళ్ళీ క్రొత్తకర్మలు చేయించబడతాయి. ఈ విధంగా ఈ కర్మచక్రం నిరంతరమూ తిరుగుతూనే
ఉంటుంది.
ఈ కర్మఫలములు కొన్ని ఈ జన్మలోను, మరికొన్ని ముందటి జన్మలలోనూ అనుభవానికి
వస్తాయి. ఏయే కర్మలు ఇప్పుడు ఫలితాన్నిస్తాయి? ఏవి భవిష్యత్తులో పక్వానికి వస్తాయి? అన్నది
లే ణో చే కో
సామాన్యమానవులు గ్రహించలేరు. ‘గహనా కర్మణో గతిః’ - ‘కర్మగతిని అర్థం చేసుకోవడం చాలా
కష్టం’ అని భగవద్గీత కూడా చెప్పింది.
సూ|| సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః || 2.13 ||
ఈ మూలములు పక్వమునకు వచ్చినపుడు జన్మను, ఆయువును, భోగమును ఇస్తాయి.
క్లేశములను మూలములుగా కలిగిన ఈ కర్మలు, ఎప్పుడైతే పక్వమునకు వస్తాయో, అప్పుడు
ఆయా కర్మానుసారంగా ఆ జీవికి జన్మను, ఆ జన్మకు తగిన ఆయుస్సును, భోగభాగ్యములను,
వృత్తిని ప్రవృత్తిని అన్నింటినీ ఇస్తాయి.
ఎన్నోజీవులు మానవజన్మ కోసం సూక్ష్మలోకములలో వేచి చూస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని
అయితే, వందలాది ఏండ్ల వరకూ అలా వేచి చూడవలసి ఉంటుంది. దానికి కారణం వాటి కర్మ
పండి, పక్వమునకు రాకపోవడమే. ‘పండటం’ అంటే ఏమిటి? కొంతమంది దుర్మార్గులు చాలా
సుఖంగా జీవిస్తూ ఉంటారు. వారి పాపముల ఫలితములు ఎక్కడా కనిపించవు. దీనిని చూచిన
లోకులు, కర్మ సిద్ధాంతం తప్పేమోనని అనుమానపడుతూ ఉంటారు. అలాంటి అనుమానం
ఉన్నవారు కొద్దికాలం వేచి చూస్తే వారి అనుమానములన్నీ నివృత్తి అవుతాయి. పాపాత్ములకు
అనుభవకాలం వచ్చినపుడు వారు పడే బాధలు ఊహాతీతంగా ఉంటాయి. అందుకనే - ‘పాపం
పండాలి. అంతవరకూ వాడికి ఎదురులేదు’. అనే సామెతలు, మాటలు పుట్టుకొచ్చాయి. కర్మ
యొక్క తీవ్రతను బట్టి వాటి పక్వకాలం ఉంటుంది. తీవ్రమైన కర్మ వెంటనే ఫలితమును
చూపిస్తుంది. తీవ్రత లేని కర్మ మెల్లిగా పక్వమునకు వస్తుంది.
తనలెక్కలో ఎంత కర్మ ఉన్నదో సామాన్యమనస్సు గ్రహించలేదు గనుక, చేతనైనంతగా
మంచిపనులను చేసుకుంటూ పోవడమే సామాన్యుడు చేయగలిగిన పని. అంతకంటే అతడేమీ
చేయలేడు.
సూ|| తే హ్లాద-పరితాప-ఫలాః పుణ్యాపుణ్య-హేతుత్వాత్ || 2.14 ||
వీటిలోని పుణ్యపాప భేదములను బట్టి, అవి ఆనందమునుగాని, దుఃఖమును గాని
కలిగిస్తాయి.
పుణ్యకర్మను చేసుకుంటే అది అదృష్టంగా మారి ఆనందపు సంఘటనలను జీవితంలో
కలిగిస్తుంది. పాపకర్మను చేసుకుంటే అది దురదృష్టంగా మారి బాధలను కలిగిస్తుంది.
అదృష్టం, దురదృష్టం అంటే ఏమిటి? గతంలో మనం చేసుకున్న పుణ్యమే అదృష్టం, పాపమే
దురదృష్టం. ఒకరి జీవితం, దేనికీ లోటు లేకుండా, నల్లేరు మీద నడకలాగా, పట్టిందల్లా బంగారం
లాగా సాగుతూ ఉంటే, అతడు గతంలో ఎన్నో మంచికర్మలు చేసి, ఎంతో పుణ్యమును
ఆర్జించాడని అర్థం. దానికి విరుద్ధంగా, ఏదీ కలసి రాకుండా, అన్నీ ఎదురు తిరుగుతూ ఉంటే,
అతడు గతంలో చేసినవన్నీ పాపములే అని అర్థం.
మంత్రజపము, ధ్యానము, నియమనిష్ఠలతో కూడిన జీవితము, ఒకరికి హాని చేయకుండా
జీవించడము, మహనీయులను సేవించడము, దేవతారాధనము, ఆర్తులకు సహాయపడటము

తీ తో చే నే గే
మొదలైన మంచిపనులు తీవ్రమైన శ్రద్ధతో చేసినప్పుడు వెంటనే ఫలితమును చూపిస్తాయి. అలాగే,
వీటికి విరుద్ధంగా, మంచివారికి, అమాయకులకు, చిన్నపిల్లలకు, రోగులకు హాని చేయడము,
నమ్మకద్రోహం చేయడము, ఇతరులను తీవ్రంగా హింసపెట్టడము, సాధువులను, దేవతలను
దూషించడము మొదలైన పనులను కూడా తీవ్రస్థాయిలో చేసినప్పుడు వెంటనే వాటి
పాపఫలితాన్ని చూపిస్తాయి.
పుణ్య, పాప, కర్మలను బట్టి, జీవితంలో సంతోషము, దుఃఖము, అదృష్టము, దురదృష్టములు
కలుగుతూ ఉంటాయని గ్రహించాలి. ఆయా కర్మల తీవ్రతను బట్టి వాటి పక్వం (అవి ఎప్పుడు
ఫలితములుగా కనిపిస్తాయన్నది) ఆధారపడి ఉంటుంది.
సూ|| పరిణామ తాప సంస్కారదుఃఖై ర్గుణవృత్తివిరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకినః || 2.15 ||
పరిణామము, తాపము, సంస్కారదుఃఖము, గుణ-వృత్తి-విరోధములు, ఈ అన్నింటినీ
వివేకియైన వాడు దుఃఖంగానే చూస్తాడు.
వివేకమంటే - ఏది నిత్యం? ఏది అనిత్యం? అనిన విచక్షణ. దీనిని మరచిపోకుండా
అనుక్షణం అంటిపెట్టుకుని ఉండగలిగేవాడు వివేకి. అటువంటివాడికి లోకంలో సమస్తమూ
దుఃఖంగానే కనిపిస్తుంది. సాంఖ్యమును, బౌద్ధమును దృష్టిలో ఉంచుకుని ఈ సూత్రమును
మహర్షి వ్రాసినట్లు గోచరిస్తుంది. ఎందుకంటే, వాటియొక్క మూలబోధన దుఃఖమే కాబట్టి.
దుఃఖమును ఎలా పోగొట్టుకోవాలి? అనే ప్రశ్నతోనే సాంఖ్యం మొదలౌతుంది. బుద్ధుడు
బోధించిన నాలుగు ఆర్యసత్యములు దుఃఖం చుట్టూనే పరిభ్రమిస్తాయి.
‘పరిణామము’ - లోకంలో మనం సుఖంగా భావించేదేదీ కూడా సుఖంగానే ఎప్పటికీ
ఉండదు. కాలక్రమంలో అది ఆవిరైపోతుంది. చివరకు దుఃఖంగా మారుతుంది. ఎన్నో
అనుభవములు, వాటిని మనం పొందుతున్న సమయంలోనే, మారిపోయి ఆవిరైపోతూ
ఉండటం మనందరి అనుభవమే. ఏ అనుభవమూ శాశ్వతంగా నిలబడి ఎప్పటికీ అలాగే ఉండదు.
దానిని అనుభవిస్తున్న క్షణంలోనే అది జారిపోతూ ఉంటుంది. అందరికీ ఇది అనుభవమే. దీనికే
పరిణామమని పేరు. కాలమునకు లోబడి ఉన్న ప్రతిఒక్కటీ మార్పుకు లోనుగాక తప్పదు.
పురుషుడు ఒక్కడే కాలమునకు అతీతుడు గనుక అదొక్కటే మార్పులేని స్థితి. ప్రకృతికి లోబడిన
మిగతావన్నీ మారక తప్పదు. దీనినే పరిణామమని మహర్షి పిలిచారు. మనం మార్పును
ఇష్టపడం గనుక, ఎల్లకాలం సుఖమనేది అలాగే నిలిచి ఉండాలని కోరుకుంటాం గనుక, అన్నీ
మారిపోతూ మరణం వైపు సాగిపోతూ ఉండటాన్ని గమనించినప్పుడు మనకు దుఃఖం
కలుగుతుంది.
ప్రపంచంలో మార్పు ఒక్కటే స్థిరంగా ఉండేది. అదిగాక మిగతావన్నీ మారుతూనే ఉంటాయి.
ఈ మార్పును మనం గమనించినప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. మనల్ని మనం అద్దంలో
చూచుకున్నపుడు వయస్సు మీద పడుతున్నదన్న తాపం కలుగుతుంది. అదే విధంగా మన
జీవితంలో దేనిని గమనించినా, అది పరిణామం చెందుతూ ఉండటాన్ని మనం చూచినప్పుడు,
‘అయ్యో, ఇది మారిపోతున్నదే’ అని దుఃఖం కలుగుతుంది. లోకంలో ఏదీ స్థిరం కాదన్న స్పృహ


ఏర్పడుతుంది.
‘తాపం’ - లోకంలో తాను సుఖంగా ఉండాలంటే, ఇంకొక జీవిని కష్టపెట్టక తప్పదు. తను
జీవించాలంటే ఇంకొక జీవిని చంపక తప్పదు, లేదా హింసించక తప్పదు. కనుక మనం చేసే
పనులన్నింటిలోనూ హింస అనేది అంతర్లీనంగా ఉంటుంది. కొన్ని కర్మలలో ఇది కొట్టొచ్చినట్లు
కనిపిస్తే, మరికొన్నింటిలో కనపడకుండా ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే
‘హింస’ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం నడిచేటప్పుడు మనకు తెలియకుండానే
ఎన్నో సూక్ష్మజీవులను త్రొక్కుతూ ఉంటాము. అదేవిధంగా మనం సంకల్పపూర్వకంగా చేసే
పనులలో కూడా జరుగుతుంది. కావాలని, ఒకరికి మేలుచేసి, ఇంకొకరికి కీడును చేస్తాము. లేదా,
ఒకరికి ఇవ్వవలసిన అవకాశమును ఇంకొకరికి ఇస్తాము. అప్పుడుకూడా, ఒకరికి మేలు,
మరొకరికి కీడు జరుగుతాయి. లేదా, ఒకే కర్మలో మంచీ, చెడూ, రకరకములైన పాళ్లలో కలగలసి
ఉంటాయి. ఈ విధంగా మానవజన్మయే పుణ్యపాపముల మిశ్రమంగా, శుద్ధ, అశుద్ధకర్మల
సమ్మిళితరూపంగా ఉంటున్నది.
వివేకనేత్రంతో దీనిని గమనించినప్పుడు యోగికి తాపం కలుగుతుంది. ఈ కర్మవలయానికి
అంతులేదని, ఎంత మంచికర్మలోనైనా కొంత చెడు కలసి ఉంటుందన్నది అతనికి
అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇది అర్థమైందో, అప్పుడు కర్మవలయం నుంచి బయటపడాలన్న
తపన ఉధృతమౌతుంది. అప్పుడు అతని సాధన పుంజుకుంటుంది. మోక్షం కోసం ఆరాటం
ఎక్కువౌతుంది. కనుక, కర్మగతిని సరిగ్గా గమనిస్తే ‘తాపం’ కలుగుతుంది.
‘సంస్కారదుఃఖము’ - సంస్కారములంటే, జన్మజన్మలుగా మనలో ఉంటూ మనతో వస్తున్న
ఆలోచనాధోరణులు, కర్మపోకడలని ఇంతకుముందు చెప్పాను. సంస్కారములు కర్మలుగా మారి
పుణ్యపాపకర్మలను మనచేత చేయిస్తూ ఉంటాయి. కానీ, కర్మలవల్ల సంస్కారములు తగ్గకపోగా
ఇంకా ఇంకా బలమును పుంజుకుంటూ ఉంటాయి. కర్మలను చేయడం ద్వారా సంస్కారములను
తగ్గించుకోవాలని చూడటం, నెయ్యిని పోయడం ద్వారా మంటను ఆర్పాలని భావించడం
వంటిది. నెయ్యిని పోయడంవల్ల అగ్ని ఇంకా వర్ధిల్లుతూనే ఉంటుందిగాని తగ్గదు. అదే విధంగా,
కర్మానుభవం వల్ల సంస్కారములు పెరుగుతాయి గాని తగ్గవు. అదే సమయంలో, కర్మ
చేయకుండా మానవుడు ఉండలేడు. కర్మ లేనిదే జీవితం లేదు. కర్మ చేస్తే సంస్కారములు
పెరుగుతాయి. సంస్కారములు మళ్ళీ క్రొత్తకర్మలను చేయిస్తాయి. కర్మల వల్ల సుఖదుఃఖములు
కలుగుతూ ఉంటాయి. అవి మళ్ళీ సంస్కారములకు బలాన్ని పెంచుతాయి. అవి మళ్ళీ
క్రొత్తకర్మలకు కారణములవుతాయి. ఇదొక అంతూపొంతూ లేని విషవలయంగా వివేకియైన
వాడికి తోస్తుంది. కనుక సంస్కారములనేవి, అవి మంచివైనా, చెడ్డవైనా, చివరకు దుఃఖమునే
మిగులుస్తాయని అతనికి అర్థమవుతుంది. కనుక, సంస్కారనాశం ఎలా చేయాలి? అన్న తపన
అతనిలో కలుగుతుంది.
‘గుణవృత్తి విరోధం’ - ప్రకృతి త్రిగుణాత్మిక. కనుక, ప్రకృతిలో భాగమైన ప్రతి జీవిలోనూ
సత్త్వరజస్తమో గుణములుంటాయి. అదే విధంగా, చిత్తవృత్తులూ ఉంటాయి. అంటే, ఆలోచనలు.
ఈ గుణములు, ఆలోచనల మధ్యన సంఘర్షణ ఉంటుంది. గుణముల మధ్యన సంఘర్షణతోనే
ఏ లో టే
సృష్టి ఏర్పడింది. మూడు గుణములూ సమస్థితిలో ఉన్నపుడు ప్రకృతిని ‘అవ్యక్తం’ అంటారు. అంటే,
ఆ స్థితిలో ప్రకృతి సృష్టిగా మారదు. సృష్టిగా వ్యక్తం కాని స్థితిలో ఉంటుంది. గుణములలో కదలిక
వచ్చి, వాటి మధ్యన సంఘర్షణ కలిగినప్పుడే సృష్టి మొదలవుతుంది.
అదే విధంగా, ప్రతి మనిషిలోనూ, మూడుగుణముల మధ్యనా సంఘర్షణ ఉంటుంది. ఇదే
సంఘర్షణ ఆలోచనల మధ్య కూడా సంఘర్షణగా మారుతుంది. అంటే, ఒక ఆలోచన ఒకవైపు,
మరొక ఆలోచన మరొకవైపు లాగుతూ ఉంటాయి. ఇది త్రిగుణముల చర్య.
సత్త్వం - తేలికదనాన్ని, కాంతిని, సమత్వాన్ని ఇస్తుంది.
రజస్సు - చంచలస్వభావాన్ని, కోపతాపాలను, దూకుడుతనమును, పనిచేయకుండా
ఉండలేనితనమును ఇస్తుంది.
తమస్సు - సోమరితనమును, బద్ధకమును, నిద్రను, తెలివిలేనితనమును ఇస్తుంది.
మన ఆలోచనలలో కూడా ఇవే గుణములు, వాటి లక్షణములు ప్రతిఫలిస్తూ ఉంటాయి. అవే
మన చర్యలలో కూడా ప్రతిఫలిస్తాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణం బలంగా ఉంటుంది.
అప్పటి ఆలోచనలను అది నియంత్రిస్తుంది. దానినిబట్టి మన ప్రవర్తన ఉంటుంది. గుణములు,
వృత్తుల (ఆలోచనల) మధ్యన ఈ పరస్పరవిరోధం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఇది
అంతిమంగా దుఃఖంగానే పరిణమిస్తుంది.
ఈ నాటకం మొత్తమును వివేకియైనవాడు తన మనస్సులోనూ, తన చర్యలలోనూ స్పష్టంగా
గమనిస్తాడు. కనుక అతనికి అంతా దుఃఖమయంగానే కనిపిస్తుంది. పైపైన సుఖంగా కనిపించేది
కూడా చివరకు దుఃఖమేనన్న విషయం అతనికి స్పష్టంగా అర్థమవుతుంది. బుద్ధుడు బోధించిన
మొదటి ఆర్యసత్యం ఇదే. ‘ప్రపంచంలో దుఃఖమే సత్యం’ అనినదే బుద్ధుని మొదటి ఆర్యసత్యం.
సూ|| హేయం దుఃఖమనాగతం || 2.16 ||
ఇప్పటికి రాని దుఃఖమును రాకుండా ఆపవచ్చు.
కర్మ అనేది సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని మూడు విధములుగా ఉంటుంది.
సంచితమంటే జన్మజన్మలలో మనం చేసుకున్న మొత్తం కర్మమూట. అందులోనుంచి కొంతభాగం
ఇప్పటి జన్మలో అనుభవానికి వస్తుంది. అంటే, పక్వస్థితికి వస్తుంది. పండుతుందని మామూలు
భాషలో అర్థం. అది ప్రారబ్ధకర్మ. ఆగామి అనేది భవిష్యత్తులో పక్వమునకు రాబోయే కర్మ. అంటే,
సంచితం అనే మూటలోనుంచి, కొంత కర్మను ఈ జన్మలో వాడుకుంటున్నాము. మరికొంత
కర్మను భవిష్యజన్మలలో వాడుకుంటాము. ఈ లోపల, ఈ జన్మలో క్రొత్తకర్మ తయారై (క్రియమాణ
కర్మ) సంచితంలో కలుస్తూ ఉంటుంది. మూట బరువు పెరుగుతూ ఉంటుంది. ఇది నిరంతర
కర్మవలయం.
వీటిలో - సంచితమును మనం ఏమీ చేయలేము. అది ఎప్పుడో చేసుకున్న కర్మ.
ప్రారబ్ధమును కూడా పెద్దగా మార్చలేము. ఎందుకంటే, అది వదలిన బాణం లాంటిది. మధ్యలో
దాని దిశను మార్చడం కుదరదు. ఇక మిగిలినది ఆగామి. అంటే, భవిష్యత్తులో

బోయే దీ నే
అనుభవించబోయే కర్మ. దీనిని మాత్రం మనం మార్చుకునే అవకాశం ఉన్నది. దానికి రెండు
మార్గములున్నాయి. ఒకటి - ఇప్పుడు తీవ్రంగా మంచి పనులను చేస్తూ పోవడం. ఆ
మంచిపనులు సంచితంలో ఉన్న చెడుకర్మను పూర్తిగా ఎదుర్కోలేవు. అలాంటప్పుడు మంచి
ఎక్కువగా జరిగి, అందులో కొంత చెడు కూడా జరుగుతుంది. అంటే, మిశ్రమకర్మగా
మారుతుంది. కర్మను కర్మతో ఎదుర్కోవడం ఎందుకు సాధ్యం కాదంటే, గతంలో మనం చేసిన ఏ
చెడుకర్మను ఎంత తీవ్రతతో చేశామో మనకు తెలియదు. కనుక అదే తీవ్రతతో దానికి
వ్యతిరేకమైన మంచికర్మను చేయడం ఇప్పుడు సాధ్యం కాదు. కర్మలలో తీవ్రతలు సరిపోనప్పుడు
అవి మిశ్రమకర్మగా మారుతాయిగాని ఒకదానినొకటి తొలగించలేవు. చివరకు ఏదోఒక కర్మ
ఎంతో కొంత మిగిలే ఉంటుంది. కనుక కర్మవలయమును కర్మతో భేదించడం అసాధ్యం.
దీనికి ఉన్న ఏకైకమార్గం, కర్మఫలితములు అంటని స్థితిలో ఉండటమే. అది ప్రకృతికి
అతీతమైన పురుషస్థితి. కర్మలన్నీ ప్రకృతిపరిధిలోనివే గనుక, ఆ పరిధిని దాటినవానిని అవి ఏమీ
చేయలేవు. అంటే, అసంప్రజ్ఞాతసమాధి ద్వారా కైవల్యస్థితిని అందుకోవడం ఒక్కటే,
కర్మవలయమును దాటడానికి మనకున్నట్టి ఏకైకమార్గం.
సూ|| ద్రష్టృదృశ్యయోః సంయోగో హేయహేతుః || 2.17 ||
ద్రష్ట, దృశ్యము వీటి సంయోగమే అలా ఆపగలిగే హేతువు.
రాబోయే చెడుకర్మ పక్వతను ఆపగలిగే మార్గమును వివరిస్తున్నారు. ‘కన్ను’ అనే ఒక్క
ఇంద్రియమును ఉదాహరణగా చూపుతూ - ద్రష్ట, దృశ్యం - అంటూ ఈ సూత్రం
చెప్పబడిందిగాని, మిగతా నాలుగు ఇంద్రియములకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
చూస్తున్నవాడు, చూస్తున్నదానితో కలసిపోయి మమేకం కావడం, అంటే సంయోగం
అవడమే దీనిలోని కీలకం. ద్రష్ట, దృశ్యంతో సంయోగం చెందటం, తనను తాను మరచిపోయి,
దృశ్యమే తానని అనుకోవడంవల్లనే కర్మ అనుభవించబడుతున్నది. దీనిని త్రెంచివేస్తే కర్మ
మనలను తాకదు. ఇదే విధంగా, మిగతా ఇంద్రియములైన - చెవి, ముక్కు, నాలుక, చర్మము - ల
ద్వారా వస్తున్న ఇంద్రియానుభూతులతో కూడా మమేకం కాకుండా విడిగా ఉండగలిగితే, అంటే,
మనస్సుకు, బుద్ధికి, అహంస్ఫురణకు, ప్రకృతికి అతీతంగా పురుషస్థితిలో ఉంటూ మిగతా 24
తత్త్వములనూ తనకంటే వేరైనవిగా చూడగలిగితే, అప్పుడు మాత్రమే కర్మకు అతీతుడు కావడం
సాధ్యమౌతుంది.
చూపు, ధ్వని, వాసన, రుచి, స్పర్శలను వాటి వెనుకగా ఉండి తెలుసుకుంటున్నది ‘ఆత్మ’ యని
వైదికమతము, దాని శాఖలంటాయి. దీనికి భిన్నంగా, ఈ ‘ఆత్మ’ అనేది లేదని,
ఇంద్రియానుభూతులతోనే ఈ ‘నేను’ అనిన ఆత్మస్ఫురణ కూడా పుడుతుందని, అవి పోతే
అదికూడా పోతుందని బుద్ధుడన్నాడు. వేదాంతమునకు, యోగమునకు, బౌద్ధమునకు ఇంతే
భేదం.
సూ|| ప్రకాశ క్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం || 2.18 ||
ప్రకాశము, క్రియ, స్థితుల స్వభావశీలమై - భూతములు, ఇంద్రియములతో కూడి -
భో మో ము కో న్న
భోగమోక్షముల కోసం దృశ్యం ఉన్నది.
ప్రకాశమంటే సత్త్వగుణం. క్రియ అంటే రజోగుణం. స్థితి అంటే తమోగుణం. భూతములంటే
పంచభూతములు. ఇంద్రియములంటే పంచేంద్రియములు. భోగమంటే సుఖమును
అనుభవించడం. అపవర్గమంటే మోక్షం. దృశ్యమంటే కంటికి అగుపిస్తున్న జగత్తు.
ప్రపంచం ఎందుకున్నది? వేటితో కూడి ఉన్నది? అన్న ప్రశ్నలకు జవాబును చెబుతున్నారు.
త్రిగుణములతో, పంచభూతములతో, పంచేంద్రియములతో ఈ ప్రపంచం నిర్మితమై ఉన్నది.
వీటిలో సత్త్వగుణం యొక్క లక్షణం ప్రకాశం, అంటే, వెలుగు. సత్త్వగుణంతో నిండియున్న
మానవుడు వెలుగుతో నిండియుంటాడు. రజోగుణలక్షణం క్రియ. అంటే, తెంపులేకుండా
పనులను చేస్తూ ఉండటం. తమోగుణలక్షణం స్థితి. అంటే, తానున్నస్థితి ఎప్పటికీ ఇలాగే
ఉండాలని, అది మారకూడదని ఆశించే సోమరితనం.
ప్రకృతి, ప్రకాశ-క్రియా-స్థితిశీలం. అంటే సత్త్వరజస్తమోగుణములతో కూడి ఉన్నది. శీలమంటే
గుణం, లేదా లక్షణం. కనుక ప్రకృతిలక్షణం త్రిగుణాత్మకమై ఉన్నది.
ఈ త్రిగుణములు, పంచభూతములతో, పంచేంద్రియములతో కలసి పనిచేస్తూ ప్రపంచమును
మనకు స్ఫురింపజేస్తున్నాయి. అసలిదంతా ఎందుకు జరుగుతున్నది?
భోగాపవర్గార్థం - అంటే, భోగంకోసం లేదా మోక్షంకోసం, అని అర్థం. ప్రపంచం
ఎందుకున్నది? అంటే, అది మన భోగంకోసం లేదా మోక్షంకోసం ఉన్నది. అజ్ఞానంతో,
ప్రపంచమును భోగంకోసం వాడుకుంటే, ఇంకా ఇంకా బంధాలలో కూరుకుపోయి,
జన్మపరంపరలలో పడిపోయి, దుఃఖములను అనుభవిస్తూ ఉంటాము. జ్ఞానంతో ప్రపంచమును
స్వీకరించే విద్య నేర్చుకుంటే, కర్మలను, జన్మలను, ప్రకృతిని దాటి మోక్షమును పొందుతాము. ఈ
రెండు ప్రయోజనముల కోసమే ప్రపంచం ఉన్నది.
ఇదంతా సాంఖ్యదర్శనం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా, సృష్టిని, మానవజన్మను, కర్మను,
బంధమును, మోక్షమును, చాలా తర్కబద్ధంగా శాస్త్రీయంగా వివరించినది సాంఖ్యదర్శనమే. ఇది
దాదాపు మూడువేల సంవత్సరముల నాటిది. దీనిని సూత్రీకరించిన కపిలమహర్షి ఎంతటి
జ్ఞానియో మనం అర్థం చేసుకోవచ్చు. కనుకనే ఆయనను విష్ణుభగవానుని అవతారములలో
ఒకరిగా శ్రీమద్భాగవతం వర్ణించింది.
సాంఖ్యదర్శనం నుండి ఎన్నో భావనలను పతంజలిమహర్షి స్వీకరించారని ముందుమాటలో
చెప్పాను. అవన్నీ ఇక్కడ మనకు గోచరిస్తాయి.
సూ|| విశేషాఽవిశేష-లింగమాత్రాఽలింగాని గుణపర్వాణి || 2.19 ||
విశేషము, అవిశేషము, లింగము, అలింగము ఇవన్నీ గుణపర్వములు.
ఇదికూడా సాంఖ్యదర్శనపు భావనయే. గుణములంటే త్రిగుణములైన సత్త్వ రజస్తమో
గుణములు. వీటి ‘పర్వములు’ - అంటే, భాగములే పైన చెప్పబడిన విశేషము, అవిశేషము,
లింగము, అలింగములు. వీటిని వివరంగా అర్థం చేసుకోవాలి.

శే శే
విశేషము - అవిశేషము
‘విశేషము’ - ఈ పదమునకు ‘ప్రత్యేకమైనది’ అని అర్థం. అంటే, తమకు తాము ప్రత్యేకమైన
ఉనికిని కలిగి యున్నట్టివి, ప్రత్యేకంగా కనిపించేవి అని అర్థం. ‘అవిశేషము’ అంటే, ఆ విధంగా
ప్రత్యేకముగా కనిపించనిది, విశేషమునకు మూలమైనదియని అర్థములు.
సృష్టిలో ఈ విధంగా విశేషంగా ప్రత్యేకంగా కనిపించేవి - పంచభూతములు. ఇవి తమకు
తన్మాత్ర (సూక్ష్మస్థితు) లైన దృశ్యము, ధ్వని, వాసన, రుచి, స్పర్శలనబడే అవిశేషముల నుండి
పుట్టినవి లేదా వాటినుండి పరిణామం చెంది భౌతికమైన పదార్థములుగా కనిపిస్తున్నట్టివి. కనుక
పంచభూతములు విశేషములు కాగా, వాటి తన్మాత్రలు అవిశేషములౌతున్నాయి.
అదేవిధంగా, అయిదు జ్ఞానేంద్రియములు (ప్రపంచజ్ఞానమును తెలుసుకునే సాధనములైన
కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము), అయిదు కర్మేంద్రియములు (కర్మలను చేసే సాధనములైన
నోరు, కాళ్ళు, చేతులు, గుదము, జననేంద్రియము), అంతరింద్రియమైన మనస్సు - ఈ
పదకొండు ఇంద్రియములు - ‘విశేషములు’. అంటే ప్రత్యేకముగా కనిపిస్తూ ఉండేవి. వీటికి
మూలమైన అహం (నేనన్న) భావన అవిశేషం. అంటే వీటికంటే సూక్ష్మమైనది, ఇవి
కనిపించినట్లుగా కనిపించనట్టిది. ఈ పదకొండు ఇంద్రియములకూ ‘అహం’ భావనయే ఆధారం.
కనుక వీటికి అది అవిశేషం. ఈ పదకొండూ విశేషములు.
లింగ - అలింగములు
లింగమనే పదమునకు అనేక అర్థములున్నప్పటికీ, ఈ సందర్భంలో వాడబడిన అర్థము -
కలియునది, మునుగునది, లీనమగునది, కరగిపోవునది, అని మాత్రమే. పైన చెప్పబడిన విశేష,
అవిశేషములు ఇరువది రెండునూ, వీటికి పైనున్న మహత్ నుండి పరిణామం చెందినట్టివి.
కనుక వీటితో పోల్చినపుడు మహత్తత్త్వం అవిశేషమౌతుంది. ఇవన్నీ విశేషములౌతాయి.
మహత్తత్త్వం అవ్యక్తంలో లీనమౌతుంది గనుక అది ‘లింగం’. మహత్తుకు పైనున్న ప్రకృతి (భౌతిక
అభౌతిక స్థితులకు మూలమైన త్రిగుణాత్మకస్థితి), తనకంటే పైనున్న పురుషునితో ఎన్నడూ
పూర్తిగా కలవదు గనుక, అది ‘అలింగం’ అవుతుంది. సాంఖ్యదర్శనంలో ప్రకృతి పురుషులు రెండూ
విడివిడిగానే ఎప్పటికీ ఉంటాయి. కానీ, సృష్టిలో పురుషుని పాత్ర ఉండదు. ప్రకృతే సృష్టి అంతటినీ
చేస్తుంది. ఆ ప్రకృతిలో పురుషుని వెలుగు ప్రతిఫలిస్తూ ఉంటుంది.
ఈ క్రింది విభజనను గమనిస్తే, ఈ సూత్రం స్పష్టంగా అర్థమౌతుంది.
విశేషములు - పంచభూతములు,
పదకొండు ఇంద్రియములు = 16
అవిశేషములు - పంచ తన్మాత్రలు,
అహంకారము = 6
లింగమాత్రము - మహత్తత్త్వము = 1
అలింగము - అవ్యక్తము (ప్రకృతి) = 1
వీటన్నిటికీ అతీతుడు - పురుషుడు = 1
---------------------------------------
సృష్టిలోని మొత్తము తత్త్వములు = 25
---------------------------------------
ఈ విశేష, అవిశేష, లింగ, అలింగములన్నీ త్రిగుణములతో కూడి, నిండి ఉంటాయని
చెబుతున్నది ఈ సూత్రం. పురుషుడు మాత్రం గుణములకు అతీతుడుగా ఉంటాడు.
త్రిగుణాతీతస్థితి అంటే ఇదే.
సూ|| ద్రష్టా దృశిమాత్రః శుద్ధోఽపి ప్రత్యయానుపశ్యః || 2.20 ||
ద్రష్ట కేవలం దృశిమాత్రమే, శుద్ధమే అయినప్పటికీ ప్రత్యయమును బట్టి చూస్తుంది.
చూచేది (పురుషుడు) శుద్ధమైన చూపు మాత్రమే. అంటే, అదొక తెల్లని వెలుగు వంటిది. కానీ
కనిపిస్తున్న దృశ్యమును బట్టి అది మారుతుంది. తాను ప్రసరిస్తున్న స్ఫటికపు రంగునుబట్టి కాంతి
రకరకములుగా మారినట్లు ఈ ప్రక్రియ ఉంటుంది. మిగిలిన నాలుగుఇంద్రియముల విషయంలో
కూడా ఇదే జరుగుతుంది. లోపలనున్న ఆత్మనుంచి ప్రసరిస్తున్న వెలుగు, జ్ఞానేంద్రియములనబడే
అయిదు కిటికీల నుంచి బయటకు ప్రసరించి, విషయములపైన ప్రసరించి, అప్పుడు కలుగుతున్న
రకరకములైన అనుభవములలో లీనమై, వాటితో మమేకమౌతుంది. ఈ క్రమంలో ‘అనుభవం’
అనినది కలుగుతుంది. కానీ, నిజమునకు ద్రష్ట అనేది శుద్ధమైన దృక్కు మాత్రమే.
పంచేంద్రియముల అనుభవములలో, రాగము, ద్వేషములను తొలగించి, శుద్ధమైన
ఇంద్రియానుభవమును పొందే సాధనను యోగి అభ్యసించాలి.
సూ|| తదర్థ ఏవ దృశ్యస్యాత్మా || 2.21 ||
దానికోసమే దృశ్యం యొక్క ఆత్మ ఉన్నది.
దృశ్యమనేది ద్రష్ట కోసం ఉన్నది. ప్రకృతి, లేదా జగత్తనేది, పురుషుని కోసం ఉన్నది. జగత్తులో
లీనమైతే బంధం. దానికి అంటకుండా విడిగా ఉంటూ, ఊరకే సాక్షీమాత్రంగా దానిని గమనిస్తూ
ఉంటే మోక్షం.
అంటే, క్రింది ఇరువదినాలుగు తత్త్వములతో తాదాత్మ్యతను పొందినప్పుడు బంధం
ఏర్పడుతుంది. దీనికి విరుద్ధంగా, తన స్థితిలో తానున్న పురుషుడు ప్రకృతి బంధములనుండి
మోక్షమును పొందుతాడు.
జీవునికి, బంధమోక్షములనే రెండు ప్రయోజనముల కోసం మాత్రమే దృశ్యజగత్తు ఉన్నది.
ఇది కాక, జగత్తుకు వేరే ప్రయోజనమున్నట్లు గోచరించదు.
సూ|| కృతార్థం ప్రతినష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్ || 2.22 ||
కృతార్థమైనప్పుడు జగత్తు నష్టమవుతుంది. కానీ ఇతరులకు మాత్రం, నష్టం కానట్లుగా,
సాధారణంగానే ఉంటుంది.
లో లో
ప్రకృతిసంయోగం నుండి దూరుడైన పురుషుడు తన స్వస్థితిలో తానుండటం ఒక వ్యక్తిలో
జరిగినపుడు అతడు కృతార్థుడౌతాడు. అంటే మానవజన్మ ఎత్తినందుకు సాఫల్యతను
అందుకుంటాడు. జననమరణ పరంపరలకు దూరమౌతాడు. అప్పుడు, అతనికొక్కడికే ప్రకృతి
(జగత్తు) లేకుండా పోతుంది. కానీ, మిగతా అందరికీ అది ఉండనే ఉంటుంది. ఎందుకంటే,
వారిలో ఈ ప్రక్రియ జరుగలేదు గనుక.
బంధమైనా, మోక్షమైనా అది వ్యక్తిగతమే. ఒక వ్యక్తి మోక్షమును పొందినప్పుడు
అతనికొక్కడికే ఆ స్థితి లభిస్తుంది గాని, అతని ప్రక్కనే ఉన్నవారికి కూడా అది దొరుకదు.
లోకంలో కూడా ఎవరి అనుభవం వారిదే అయినట్లు, బంధమోక్షములు కూడా వారివారివే. ప్రకృతి
నిత్య గనుక, మిగిలినవారికి అది ఎప్పటిలాగే ఉంటుంది.
సూ|| స్వస్వామిశక్త్యోః స్వరూపోపలబ్ధిహేతుః సంయోగః || 2.23 ||
తన శక్తిని, స్వామిశక్తిని, తన స్వరూపంగా పొందటమే సంయోగమునకు హేతువు.
ప్రకృతిపురుషులు విడివిడిగా ఉన్నంతవరకూ ఒకరి తత్త్వమును, శక్తిని, మరొకరు
గ్రహించలేరు. ఈ రెంటికీ సంయోగం జరిగినప్పుడు మాత్రమే, ఒకదాని తత్త్వమును శక్తిని
మరొకటి ఆపాదించుకోవడం సంభవిస్తుంది. రెండవదానిని తెలుసుకోవాలన్న కోరికయే
సంయోగమునకు మూలమౌతుంది. ఈ ప్రక్రియ ప్రకృతిలో జరుగుతుంది గాని పురుషునిలో
జరుగదు.
ఈ సూత్రంలో చాలా లోతైన తర్కం దాగి ఉన్నది. ఎన్నో విధములైన వాదప్రతివాదములకు ఈ
సూత్రం దారితీసింది.
పురుషుని వెలుగు తనలో ప్రతిఫలించనిదే ప్రకృతిలో చలనం ఏర్పడదు. ప్రకృతిద్వారా
అనుభవమును పొందడం కోసం పురుషుడు ప్రకృతితో మమేకమౌతాడు. ఇదే తనకు బంధమన్న
విషయమును గ్రహించడం వల్ల మోక్షమును పొందుతాడన్నది దీని అర్థం.
చలనం లేని పురుషునిలో, తానుకాని మరొకదాని అనుభవంకోసం చలనం ఎందుకు
కలుగుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. అలా జరగడం వల్ల పురుషుడు తన స్వస్థితిని కోల్పోతాడు
కదా? అని ఇంకొక ప్రశ్న తలెత్తుతుంది. ఎల్లకాలమూ ప్రకృతికి అతీతుడుగా, దానికి అంటకుండా
ఉండే పురుషుడు, ప్రకృతిలోకి ఎలా వస్తాడన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. బంధమునకు
అతీతుడైన పురుషునికి బంధం ఎలా కలుగుతుందన్నది ఇంకొక ప్రశ్న.
ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడం కోసం, అనేకములైన సిద్ధాంతములు చేయబడినాయి.
ప్రకృతి పురుషుల సామీప్యం వల్ల పురుషుని వెలుగు ప్రకృతిలో ఊరకే ప్రతిఫలించి ఈ పనులన్నీ
చేయిస్తుంది గాని, నిజమునకు పురుషునిలో ఎటువంటి మార్పూ ఉండదని ఒక సమాధానం.
స్వతహాగా ఏ బంధమూ లేని పురుషుడు బంధమునకు లోనైనట్లుగా భ్రమపడటమే మాయయని
మరొక సిద్ధాంతం. బంధమోక్షములకు అవసరమైన బీజములు పురుషునిలోనే ఉన్నాయన్నది
మరొక సమాధానం. మాయను సృష్టించినది కూడా పురుషుడేనన్నది మరొక సమాధానం.
ప్రస్తుతం ఈ గ్రంథం యొక్క ఉద్దేశ్యం వీటికి సమాధానములు చెప్పడం కాదు గనుక, లోతైన ఈ
లో లే
వాదవివాదములలోకి పోవడం లేదు.
సూ|| తస్య హేతురవిద్యా || 2.24 ||
దానికి హేతువు అవిద్య.
దేనికి హేతువు? ప్రకృతి పురుష సంయోగమునకు హేతువు అవిద్య. పురుషుడు ప్రకృతితో
మమేకం కావడం అవిద్యవల్ల జరుగుతుంది. అంటే, తనకు విడిగా ఏదో ఉన్నదని భావించి,
దానిని తెలుసుకోవలెనని, పొందవలెనని ప్రయత్నించడం అవిద్య. అంటే, తన స్వస్థితిలో
తానుండకుండా ప్రకృతితో లీనం కావడం అవిద్య.
అవిద్యకు అతీతుడైన పురుషునిలో అవిద్య ఎలా తలెత్తిందన్న ప్రశ్న కూడా చాలా లోతైనదే.
పాతకాలంలో ఈ ప్రశ్నలకు జవాబులుగా గ్రంథములకు గ్రంథములే వ్రాయబడినాయి. కానీ,
వాటినన్నింటినీ చర్చించడం మన ప్రస్తుతోద్దేశ్యం కాదు గనుక, అటువైపు పోవడం లేదు.
సూ|| తదభావాత్ సంయోగాభావో హానం తద్దృశేః కైవల్యం || 2.25 ||
అది మాయమవడం వల్ల సంయోగం నశిస్తుంది. అప్పుడు కైవల్యం సిద్ధిస్తుంది. ఏది
మాయమవడం వల్ల? అవిద్య మాయమవడం వల్ల. అంటే అవిద్యకు మూలమైన తృష్ణ
మాయమవడం వల్ల. ఈ భావన బుద్ధుని భావనకు చాలా దగ్గరగా ఉన్నది. బుద్ధుడు ‘తృష్ణ’
అనినదానినే పతంజలిమహర్షి ‘అవిద్య’ అని పిలిచాడు.
తృష్ణ లేదా అవిద్య వల్లనే పురుషునికి త్రిగుణాత్మికయైన ప్రకృతితో సంయోగం
ఏర్పడుతున్నది. ఈ తృష్ణ లేదా అవిద్య నశించినప్పుడు, సంయోగం కూడా మాయమౌతున్నది.
అప్పుడు పురుషుడు, ప్రకృతికి అతీతమైన తన స్వస్థితిలో తానుంటున్నాడు. అంటే, కేవలం తానే
ఉంటున్నాడు. కనుక దానిపేరు కైవల్యస్థితి అయింది.
సూ|| వివేకఖ్యాతిరవిప్లవా హానోపాయః || 2.26 ||
నిరంతరమైన వివేకపు వెలుగును కలిగి ఉండటమే ఈ నశింపుకు ఉపాయం.
అయితే, ఈ అవిద్య ఎలా నశిస్తుంది? అనిన ప్రశ్న ఉదయిస్తుంది. దానికి ఉపాయమును ఈ
సూత్రం చెబుతున్నది. అవిద్యానాశనమునకు అవిప్లవమైన వివేకఖ్యాతియే మార్గం.
విప్లవమంటే - అలజడి, గందరగోళం, తిరుగుబాటు అని అర్థములున్నాయి. అవిప్లవమంటే
- వీటికి వ్యతిరేకములైన, నెమ్మది, నిలకడ, స్థిరత్వములని అర్థములు. వివేకమంటే, తనకంటే
వేరైనట్టి ఇరువది నాలుగు తత్త్వములను చూస్తూ, వాటికి వేరుగా ఉండటం. కైవల్యసిద్ధికి ఇదే
మార్గం. వివేకమనేదే అన్నింటిలోకీ కీలకం. వివేకపు వెలుగును కోల్పోయినవాడు అన్నింటినీ
కోల్పోతాడు. బంధములలో చిక్కుకుంటాడు.
ఏమాత్రమూ అలజడి, అశాంతి, తృష్ణలు లేనట్టి స్థితిలో నిరంతరం ఉంటూ, ప్రకృతిని, దాని
గుణములను, మహత్తును, అహంకారమును, తన్మాత్రలను, పంచభూతములను, మనస్సుతో
కలిపి పది ఇంద్రియములను, వాటి చర్యలను, తనకంటే విడిగా చూస్తూ ఉండటమే వివేకం. ఇదే
కైవల్యస్థితిని పొందడానికి గల ఏకైకమార్గం.
సూ|| తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రజ్ఞా || 2.27 ||
ఇలా ఉండటం వల్ల, ఏడు విధములైన ప్రజ్ఞాభూమికలు కలుగుతాయి. వీటిలో మొదటి
నాలుగు, సంప్రజ్ఞాతసమాధి పరిధిలోనివైతే, తరువాతి మూడూ అసంప్రజ్ఞాతసమాధి పరిధిలోనివి.
అవి,

సంప్రజ్ఞాత సమాధి ఫలితములు


1. దేనిని రాకుండా ఆపవలెనో, అట్టి అనాగతదుఃఖము యొక్క వివరమంతా తెలిసిందన్న
ప్రజ్ఞ. అంటే, ఆగామికర్మ (భవిష్యత్తులో రాబోయే కర్మఫలితముల) యొక్క మూలములన్నీ తన
లోలోపలనే తనకు అర్థమైనట్టి ధ్యానస్థితి.
2. అనాగతదుఃఖం యొక్క మూలములన్నింటినీ ఎలా ఆపాలో ఆ తెలివి. అంటే, ఆ
కర్మఫలితముల మూలకారణములేవైతే తనలో సంస్కారరూపంలో ఉన్నవో వాటిని తలలెత్తకుండా
ఎలా చేయాలో స్పష్టంగా అర్థం కావడం.
3.ధ్యానసమాధిలో ఆయా మూలములు నిరోధింపబడటం స్పష్టంగా దర్శించిన ప్రజ్ఞ. అంటే,
ఆ సంస్కారమూలములు అణగిపోవడాన్ని ధ్యానసమాధిలో సూటిగా చూచి, అవి
అణగిపోయినట్లుగా దర్శించినట్టి స్థితి.
4. నిరోధమునకు మూలమైన వివేకఖ్యాతి (వివేకపు వెలుగు) నిరంతరం తనలో వెలుగుతూ
ఉండటం యొక్క ప్రజ్ఞ. అంటే, ఆ సంస్కారములు, ఆ విధంగా నిరోధింపబడటానికి కారణమైన
వివేకపువెలుగు తనలో నిత్యం ప్రకాశిస్తూ, వాటిని నిరోధిస్తూ ఉన్నట్టి స్పృహ.
అసంప్రజ్ఞాత సమాధి ఫలితములు
5. తనలో మనోనాశం జరిగిందన్న ప్రజ్ఞ. అంటే, తన మనస్సు దాని చంచలత్వమును పూర్తిగా
విడచిపెట్టడమే గాక, దాని రూపురేఖలు కూడా లేకుండా పూర్తిగా నాశనమై పోయిందన్న
ప్రత్యక్షజ్ఞానం.
6. తన సంస్కారములన్నీ దగ్ధమైనాయని, అవి మరలా మొలకెత్తవనిన ప్రజ్ఞ. సంస్కారముల
నిరోధం వేరు, సంస్కారనాశనం వేరు. నిరోధమంటే అణచిపెట్టబడి ఉండటం. నాశనమంటే
పూర్తిగా దగ్ధమై పోవడం. మొదటిది సంప్రజ్ఞాతసమాధిలో జరిగితే, రెండవది
అసంప్రజ్ఞాతసమాధిలో మాత్రమే లభిస్తుంది. సంస్కారనాశనమును తనలోలోపల ప్రత్యక్షంగా
దర్శించినట్టి స్థితి ఇది.
7. త్రిగుణములకు అతీతమైన స్థితిలో వెలుగుతున్న ఆత్మస్థితి యొక్క ప్రజ్ఞ. సంస్కారనాశనం
జరిగినప్పుడు కలిగే కైవల్యస్థితియొక్క ప్రత్యక్షమైన అనుభూతి కలగడం.
ఈ మెట్లలో, తానే మెట్టుమీద ఉన్నాడో అర్థమైనప్పుడు, సాధనామార్గంలో తన పురోగతి
ఎంతవరకు జరిగిందన్నది కూడా యోగికి స్పష్టంగా అర్థమౌతుంది.

యే దీ వే తేః
సూ|| యోగాంగానుష్ఠానా దశుద్ధిక్షయే జ్ఞానదీప్తిరా వివేకఖ్యాతేః || 2.28 ||
యోగాంగములను అనుష్ఠించడం వల్ల అశుద్ధి క్షయమవుతుంది. వివేకఖ్యాతి, జ్ఞానదీప్తి
కలుగుతాయి.
మనస్సులోని చెడు సంస్కారములు ఎలా పోతాయి? ఇటువంటి వివేకపు వెలుగు, ఆత్మస్థితి
యొక్క ప్రత్యక్షజ్ఞానములు ఎలా కలుగుతాయి? అంటే, యోగంలోని ఎనిమిదిమెట్లను వరుసగా
ఎక్కడం ద్వారా ఈ స్థితులన్నీ కలుగుతాయని మహర్షి చెబుతున్నారు. ఇక్కడనుంచి
పతంజలిమహర్షి యొక్క అష్టాంగయోగము వివరించబడుతున్నది. ఇప్పటివరకూ చెప్పినది
సాంఖ్యము, బౌద్ధముల కలయిక మాత్రమే. మహర్షి బోధనయైన అష్టాంగయోగశాస్త్రం ఇప్పుడు
వస్తున్నది.
అష్టాంగయోగము
సూ|| యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధయో ఽష్టావంగాని ||
2.29 ||
యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము,
సమాధి - ఈ ఎనిమిది యోగమునకు అంగములు. ఇవి ప్రసిద్ధములే.
సూ|| అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్యాపరిగ్రహా యమాః || 2.30 ||
అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము - ఇవి యమములు.
అహింస - హింసను చేయకుండా ఉండటం,
సత్యము - అబద్ధమును చెప్పకుండా ఉండటం.
అస్తేయము - దొంగతనం చేయకుండా ఉండటం.
బ్రహ్మచర్యము - లైంగికక్రీడకు దూరంగా ఉండటం.
అపరిగ్రహము - ఇతరులు ఊరకే ఇచ్చినదానిని తీసుకోకుండా ఉండటం.
సూ|| జాతి దేశ కాల సమయానవచ్ఛిన్నాః సార్వభౌమా మహావ్రతం || 2.31 ||
కులము, దేశము, కాలము, సమయములతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ వీటిని
పాటించడమే మహావ్రతం.
లోకంలోని సామాన్యజనులు వారికి తోచిన ఏవేవో వ్రతములను పాటిస్తూ ఉంటారు. అవి
కొన్ని కొన్ని మాసములలో, కొన్ని కొన్ని సందర్భములలో మాత్రమే చేయబడుతూ ఉంటాయి.
వాటి ఉద్దేశ్యములు కూడా, పనులు కావడము, కోరికలు తీరడము, కలసి రావడము, మొదలైన
అల్పమైన విషయములే అవుతూ ఉంటాయి. అవి స్వార్థపూరితచర్యలే గాని, అసలైన వ్రతములు
కావు. మరి అసలైన వ్రతములేవి? అనిన ప్రశ్నకు మహర్షి ఈ సూత్రంలో జవాబునిస్తున్నారు.
యమములో ఉన్నట్టి అయిదింటిని పాటించడమే నిజమైన వ్రతం. వీటి నియమములు చాలా
వేసే కో తీ కో చేసే
కఠినమైనవి. ఇవి కొన్నినాళ్ళు పాటించి వదలివేసే నియమములు, కోరికలు తీరడం కోసం చేసే
వ్రతములు కావు. పుట్టుకతోను, ఉన్న ప్రదేశంతోను, సమయంతోను, సందర్భంతోను నిమిత్తం
లేకుండా, ఎల్లవేళలా ఈ వ్రతములను పాటించాలని మహర్షి ఆదేశం. అంటే, మనకు అనుకూల
పరిస్థితులలో వీటిని పాటించి, కుదరనపుడు వదలిపెట్టకూడదు. ఎటువంటి పరిస్థితిలో
ఉన్నప్పటికీ, తనకు లాభం కలిగినా, నష్టం కలిగినా, ఈ నియమములను వదలకుండా
పాటించాలి. అటువంటి సాధనను ‘సార్వభౌమా మహావ్రతం’ అని ఆయన పిలిచారు. అంటే, అన్ని
వ్రతములలోకి ఈ వ్రతములు మహారాజువంటివి, చాలా ఉన్నతములైనవని అంటున్నారు.
ఉన్నతులైన మానవులు మాత్రమే వీటిని పాటిస్తారు. అల్పులైనవారు, పురాణములలో
చెప్పబడిన మామూలు వ్రతములను, దీక్షలను, లౌకికములైన కోరికలు తీరడం కోసం, ఆయా
సమయములలో, ఆయా కాలములలో మాత్రమే పాటిస్తారు. యమములతో పోల్చుకున్నపుడు
నేడు మానవులు చేస్తున్న దీక్షలన్నీ హాస్యాస్పదములైనట్టివిగా కనిపిస్తాయి.
సూ|| శౌచ సంతోష తపః స్వాధ్యా యేశ్వరప్రణిధానాని నియమాః || 2.32 ||
శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరప్రణిధానము - ఇవి నియమములు.
శౌచము - శుచిగా ఉండటం.
సంతోషము - సంతోషంగా ఉండటం.
తపస్సు - తపస్సును ఆచరించడం.
స్వాధ్యాయము - మంత్రజపము, శాస్త్రాధ్యయనములను చేయడం.
ఈశ్వరప్రణిధానము - ఈశ్వరభక్తిని, శరణాగతిని, కలిగి యుండటం.
సూ|| వితర్కబాధనే ప్రతిపక్షభావనం || 2.33 ||
బాధపెట్టే ఆలోచనలను ఎదుర్కోవడానికి, వాటికి వ్యతిరేకములైన ఆలోచనలను భావించాలి.
ఈ యమనియమములను పాటించే సమయంలో మన మనస్సు వద్దంటూ మనలను వెనక్కు
లాగుతూ ఉంటుంది. యమనియమములకు విరుద్ధమైన ఆలోచనలు మనలో తలెత్తుతూ
వాటివైపు బలంగా లాగుతూ ఉంటాయి. ‘ఇటువంటి పనికిరాని నియమములను పాటిస్తూ
ఎందుకు కోరికలను అణచుకుంటూ బ్రతుకుతావు? హాయిగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ
సుఖములు అనుభవించు. ఏదో ఒక విధంగా ధనమును సంపాదించి జీవితమును
అనుభవించు, ఈ నియమములన్నీ పనికిరానివి. నీ చుట్టూ ఉన్నవారు చూడు ఎంత సుఖంగా
బ్రతుకుతున్నారో? ఎన్ని సుఖములను అనుభవిస్తున్నారో? ఎంత ధనమును సంపాదిస్తున్నారో?’
అని అవి ఉద్బోధిస్తూ ఉంటాయి.
వీటిని ఎలా ఎదుర్కోవాలి?
మనలను ఒక ఆలోచన ఇబ్బంది పెడుతున్నపుడు, దానికి వ్యతిరేకమైన ఆలోచనలోకి
మనస్సును మళ్ళించడం ద్వారా, మొదటి ఆలోచనను త్రుంచివేయాలి. దీనికి ధ్యానసాధన
అవసరం అవుతుంది. కొంత సాధనతో ఈ అభ్యాసం చాలా సులభం అవుతుంది. అప్పుడు
లో మే లో చే
ఆలోచనలు మనల్ని శాసించడం ఆగిపోయి, మనమే ఆలోచనలను నడిపించే శక్తి కలుగుతుంది.
సూ|| వితర్కా హింసాదయః కృతకారితానుమోదితా లోభక్రోధమోహపూర్వకా
మృదుమధ్యాధిమాత్రా దుఃఖాఽజ్ఞానానంతఫలా ఇతి ప్రతిపక్షభావనం || 2.34 ||
వితర్కమంటే - హింస మొదలైన ఆలోచనలు. ఇవి - చేసినవి, చేయించినవి, ఆమోదించినవి
కావచ్చు. వీటికి మూలములు - లోభము, క్రోధము, మోహములై ఉంటాయి. ఇవి మృదు, మధ్య,
అధిమాత్రలనే విధములు. ఇవి అనంతమైన దుఃఖమును, అజ్ఞానమును కలిగిస్తాయి గనుక వీటికి
ప్రతిపక్షభావన చేయాలి.
వితర్కమంటే విరుద్ధమైన తర్కం. అంటే, మనల్ని చెడుదారులలోకి లాగే ఆలోచనల బలమని
అర్థం. మనకు మంచి చెయ్యాలని లోలోపల ఉన్నప్పటికీ, విరుద్ధమైన ఆలోచనల బలం వల్ల,
చెడునే చేస్తూ ఉంటాము. దీనికి వితర్కమని పేరు. ‘ఇలా ఉండకూడదు’ అనుకుంటూ, అలాగే
ఉంటూ ఉండటం మనకందరికీ అనుభవమే. దీనికి కారణం మనసు లోతులలో దాగుకొని ఉన్న
సంస్కారముల బలం. అదే వితర్కం.
‘వితర్కా హింసాదయః’ అంటూ, ఒక ఉదాహరణను మాత్రమే మహర్షి ఇచ్చారు. ఇతరులను
హింసించాలని సాధారణంగా ఎవరికీ ఉండదు. కానీ అనుక్షణం ఇతరులను హింస పెడుతూనే
ఉంటారు. ఇదే వితర్కం.
యమంలో మొదటిది అహింస. దానికి విరుద్ధమైనది, వితర్కమైనది, హింస. అలాగే
మిగిలినవాటికి కూడా వితర్కములున్నాయి. అవి,

అహింస: దీనికి విరుద్ధమైనది హింస. అహింసను పాటించాలని ప్రయత్నిస్తున్నపుడు


పాత సంస్కారముల బలం వల్ల ఇతరులను హింస పెట్టాలని బుద్ధి పుడుతూ ఉంటుంది.
సత్యము: దీనికి విరుద్ధమైనది అసత్యము. ‘సత్యమును పలకడమే కలియుగంలో తపస్సు’
అని శ్రీరామకృష్ణుల అమృతవాక్కు. మనసా వాచా కర్మణా సత్యమును అనుసరించడం అనేది
చాలా గొప్పదైన సాధన. ఈ సాధనను ఆచరిస్తూ ఉన్నపుడు మనసు అసత్యం వైపు లాగుతూ
ఉంటుంది. నిత్యజీవితంలో అనేక సందర్భములలో అసత్యం చెప్పవలసిన పరిస్థితులు తలెత్తుతూ
ఉంటాయి. కానీ సత్యమునే అంటిపెట్టుకుని ఉండాలి. దానికోసం దేనినైనా వదులుకోవడానికి
సిద్ధంగా ఉండాలి.
అస్తే యము: అస్తేయమంటే ఇతరుల సొత్తును దొంగతనం చేయకుండా ఉండటం.
దీనికి విరుద్ధమైనది స్తేయము. అంటే, దొంగతనం చేయడం. ఇతరుల సొమ్ముకు ఆశపడటం
కూడా ఒక విధమైన మానసిక దొంగతనమే అవుతుంది. ఈ నియమములన్నింటినీ
త్రికరణములతోనూ పాటించవలెనన్నది గుర్తుంచుకోవాలి. ఈ నియమమును నిత్యజీవితంలో
పాటించాలని ప్రయత్నిస్తూ ఉన్నపుడు, అప్పటివరకూ అలవాటైన ధోరణిని బట్టి, ఎదుటివారి
సొమ్ముపైకే మనస్సు పోతూ ఉంటుంది. దానిని మార్చుకోవాలి.
బ్ర హ్మచర్యము: పురుషులైతే స్త్రీ సాంగత్యానికి, స్త్రీలైతే పురుషసాంగత్యానికి దూరంగా
ఉండటమే బ్రహ్మచర్యము. దీనికి విరుద్ధమైనది కాముకత్వము. కామమును నిగ్రహించాలని
ప్రయత్నించినపుడు అది ఇంకా ఎక్కువగా విజృంభిస్తుంది. ఇదికూడా మనస్సు చేసే వితర్కమే.
దానిని జయించాలి.

అపరిగ్ర హము: అంటే, ఇతరులు ఏది ఇచ్చినా స్వీకరించకుండా ఉండటం. దీనికి


విరుద్ధమైనది పరిగ్రహము. అంటే ఇతరులు ఏదైనా ఇచ్చినపుడు తీసుకోవడం. మనకు వస్తువుల
పైన ఆశ ఉన్నపుడు ఇలాంటి కోరికలుంటాయి. కొంతమంది ఇతరుల వస్తువులను అడిగి మరీ
తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివారిని ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాము. ఇది వారిలోని
ఆశపోతుతనానికి సూచన. అలవాటైనప్పుడు, దీనిని నిగ్రహించడం కూడా కష్టమే.
ప్రయత్నపూర్వకంగా దీనిని కూడా సాధించాలి.
వీటిలో ఒక్కొక్కదానిని ఎలా పాటించాలో ఈ సూత్రంలో మహర్షి వివరించారు.
అహింస
ఒకరిని హింసించాలని అనిపించినప్పుడు, దానికి ప్రతిపక్షమైన అహింసను గురించి
భావించాలి. అంటే, అలా హింసించడం వల్ల ఎలాంటి చెడుకర్మ పుట్టుకొస్తుంది? అది తనకు ఎలా
చుట్టుకుంటుంది? అది, దురదృష్టంగా మారి, తనను ముందుముందు ఎలా బాధ పెడుతుంది?
మొదలైన విషయములను ఆలోచించడం వల్ల, ఇతరులను హింస పెట్టాలన్న ఆలోచన
అణగిపోతుంది. ఇదే విధంగా మిగిలిన అన్నిటికీ చేయాలి. ఒక్కొక్కదానిని వివరంగా చూద్దాము.
సత్యము
అసత్యం చెప్పాలని అనిపించినప్పుడు, దానివల్ల కలిగే దుష్పరిణామముల గురించి
ఆలోచించాలి. అంటే, ఇతరుల దగ్గర మన విలువ తగ్గిపోవడము, అబద్ధాల కోరు అని పేరు
రావడము, సత్యస్వరూపమైన దైవం దృష్టిలో, మహనీయుల దృష్టిలో మనం అల్పులమై
పోవడము, పాపం చుట్టుకోవడము, ఒక అబద్ధమును నిజంగా చెలామణీ చెయ్యడం కోసం
మరికొన్ని అబద్ధములు చెప్పవలసి రావడం, ఈ క్రమంలో మన మనస్సు పాడైపోవడం - ఇలాంటి
చెడు ఫలితములను గురించి ఆలోచించాలి. అప్పుడు అసత్యం చెప్పాలన్న తపన తగ్గిపోతుంది.

అస్తే యము
ఒకరి సొత్తును వారికి తెలియకుండా మనం తీసుకుందామని అనిపించినప్పుడు దానివల్ల
ఎంత చెడు ఖర్మ మనకు చుట్టుకుంటుందో ఆలోచించాలి. ఆ వ్యక్తికి మన చర్య వల్ల ఎంతటి బాధ
కలుగుతుందో ఆలోచించాలి. ఆ బాధ దురదృష్టంగా మారి మనల్ని వెంటాడి భవిష్యత్తులో
ఎలాంటి బాధలు పెడుతుందో గమనించాలి. ఇవన్నీ ఆలోచించినప్పుడు మనలను వేధిస్తున్న
చెడు ఆలోచన అణగారిపోతుంది.
బ్ర హ్మచర్యము
అతి కాముకత్వం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ప్రాణశక్తి క్రుంగిపోతుంది. నరముల
బలహీనత పట్టుకుంటుంది. పక్షవాతం వంటి రోగములు కూడా రావచ్చు. ఇదిగాక,
పరస్త్రీసాంగత్యం వల్ల సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. దానితో బాటు ఇంకా ఎన్నో సమస్యలు
చుట్టూ మూగుతాయి. ఆధ్యాత్మికజీవితానికి, యోగసాధనకు తీవ్రమైన ఎదురుదెబ్బ
తగులుతుంది. బ్రహ్మచర్యం పాటించకుండా యోగసాధన చేస్తే పిచ్చి పుడుతుంది. క్షణికమైన
సుఖంకోసం ఇదంతా పడటం అవసరమా? అని ప్రశ్నించుచుకున్నపుడు కామం తగ్గిపోతుంది.

అపరిగ్ర హము
ఇతరుల దగ్గర మనం ఏదైనా తీసుకున్నపుడు వారికి మనం ఋణపడతాం. ఆ ఋణమును
ఏదో విధముగా వడ్డీతో సహా మనం తీర్చుకోవలసి ఉంటుంది. ఈ జన్మలో కాకుంటే ఇంకొక
జన్మలో అయినా సరే ఇది తప్పదు. అదీగాక, ఈ విధంగా తీసుకుంటూ ఉన్నపుడు, మనసులో
ఆశ పెరుగుతుంది. అది మన ఆధ్యాత్మిక జీవితానికి పెద్ద ప్రతిబంధకం అవుతుంది. ఇదంతా
ఆలోచించినప్పుడు ఇతరుల దగ్గర నుంచి ఏదీ తీసుకోవాలని అనిపించదు.
ఈ ‘ప్రతిపక్షభావన’ అనేదానిని బుద్ధుడు కూడా, ‘సుభానుపస్సిం-అసుభానుపస్సిం’ అనే
మాటలలో చెప్పాడు. ఉదాహరణకు ధమ్మపదంలోని ఈ బుద్ధవచనములను గమనించండి.
సుభానుపస్సిం విహరంతం ఇంద్రియేసు అసంవుతం
భోజనంహి అమత్తఞ్ఞుం కుసీతం హీనవీరియం
తం వే పసహతి మారో వాతో రుక్ఖం వ దుబ్బలం (1.7)
ఎల్లప్పుడూ శుభాన్ని చూస్తూ విహరించేవాడిని, ఇంద్రియనియమం లేనివాడిని, తిండే
లోకంగా బ్రతికేవాడిని, సోమరిని, వీర్యహీనుడిని - బలంలేని చెట్టుని గాలి ఊపినట్లుగా -
మారుడు ఊపి పారేస్తాడు.
ప్రపంచంలోని అన్నింటినీ అనుభవించాలని భావిస్తూ, వాటిలోని భోగ్యత్వాన్ని చూస్తూ
ఉండటమే శుభాన్ని చూస్తూ విహరించడం అంటే. అంటే కోరికలు ఎక్కువగా
పెంచుకోవడమన్నమాట.
అసుభానుపస్సిం విహరంతం ఇంద్రియేసు సుసంవుతం
భోజనంహి చ మత్తఞ్ఞుం సద్ధం ఆరద్ధవీరియం
తం వే నప్పసహతి మారో వాతో సేలం వ పబ్బతం (1.8)
ఎవడైతే ప్రతిదానియందు భోగ్యదృష్టిని వదలి, దానివల్ల తనకు కలిగే సుఖమును గూర్చి
తలచక, తన ఇంద్రియములను చక్కగా నిగ్రహించి, ఆహారనియమం కలిగి, శ్రద్ధావంతుడై,
వీర్యవంతుడై ఉంటాడో - కొండను గాలి ఊపలేనట్లుగా - అటువంటి వానిని మారుడు ఏమీ
చెయ్యలేడు.
‘సుభానుపస్సిం’ అంటే, ప్రతిదానిలో భోగం అనే కోణమును మాత్రమే చూడటం. దానివల్ల
గే గే
కలిగే కర్మ, చెడు ఫలితములపైన దృష్టిని పెట్టకుండా, దానివల్ల అప్పటికి కలిగే లాభమును
సుఖమును మాత్రమే చూడటం. ‘అసుభానుపస్సిం’ అంటే, దీనికి విరుద్ధంగా, ప్రతిదానిలోనూ
దానివల్ల మనకు చుట్టుకునే చెడుకర్మను, పాపమును, చూస్తూ జాగ్రత్తగా ఉండటం. ఇలా
ఉన్నవాడిని మారుడు లేదా మన్మథుడు లేదా కోరికలనేవి ఏమీ చెయ్యలేవని బుద్ధుడన్నాడు.
పతంజలిమహర్షి దీనినే ‘ప్రతిపక్షభావనం’ అని చెప్పాడు.
‘కృతకారితానుమోదితా’ - ఈ వితర్కభావనలు మూడువిధములైన పాత సంస్కారముల
నుండి తలలెత్తి మనలను వెంటాడతాయి. అవి,
1. కృత - అంటే, గతంలో మనం చేసిన చెడుకర్మలు. ఇవి మనలో బలమైన సంస్కారములుగా
ఉండి, మనలను మళ్ళీ అదే మార్గంలోకి లాగుతూ ఉంటాయి. దీనివల్ల ‘దృఢకర్మ’ ఏర్పడుతుంది.
దీనివల్ల మన జీవితంలో కలిగే బాధలు, ఎదురయ్యే దురదృష్టములు దారుణమైన స్థాయిలో
ఉంటాయి.
2. కారిత - అంటే, గతంలో మనం ఇతరుల చేత చేయించిన పాపపుపనులు. ఇవి కూడా
మనల్ని చెడు సంస్కారముల రూపంలో వెంటాడుతాయి. వీటివల్ల ‘దృఢాదృఢ కర్మ’ ఏర్పడుతుంది.
వీటి ఫలితంగా మన జీవితంలో కలిగే బాధలు, ఎదురయ్యే దురదృష్టములు, మధ్యస్థస్థాయిలో
ఉంటాయి.
3. అనుమోదిత - అంటే, ఇతరులు చెడుపనులను చేసినప్పుడు మనం ఆమోదించి
సమర్థించిన కర్మలు. ఇవి కూడా మనలను వెంటాడతాయి. ఇది ‘అదృఢకర్మ’ను ఏర్పరుస్తుంది.
దీనివల్ల మన జీవితంలో కలిగే బాధలు ఎదురయ్యే దురదృష్టములు స్వల్పస్థాయిలో ఉంటాయి.
ఈ మూడు వితర్కములూ, మన ఆలోచనలుగా మన మనస్సులోనే ఉంటూ, మన ఖర్మను
మనచేత అనుభవింపజేస్తాయి. అయితే, ఈ విషయం మనకు అర్థం కాదు. అదే ప్రకృతిలోని
మాయ.
‘లోభ క్రోధ మోహపూర్వకా’ - లోభం, క్రోధం, మోహం అనే ఈ మూడు గుణములే, మనకు
కలిగే సమస్తములైన చెడు ఆలోచనలకు, సాధనలోని అడ్డంకులకు, లేదా వితర్కభావనలకు
మూలములై ఉంటాయి. వీటిని విడివిడిగా చూద్దాం.
లోభం - అంటే, పిసినారితనం. అంతా తనకే దక్కాలి, ఎదుటివారికి ఏమీ చెందకూడదన్న
దుర్గుణం. ఓర్వలేనితనం, అసూయ, కుళ్ళు అనేది కూడా దీని ఛాయయే అవుతుంది. సమస్త
దుర్గుణములలోకి ఇది చాలా చెడ్డగుణం.
స్వార్థం కూడా దీని ఛాయయే.
క్రోధం - అంటే, కోపం. తను అనుకున్నది సాగనప్పుడు, ఆశించినది జరుగనప్పుడు కలిగేది
కోపం. దీనికి మూలం అహంకారం. ‘నేను అనుకోవడం ఏంటి? అది జరుగకపోవడం ఏంటి?’
అనిన అహంకారమే కోపమునకు మూలం. గర్వం కూడా దీని ఛాయయే. ఇది కూడా చాలా చెడ్డ
గుణం. కోపం సాగనప్పుడు క్రుంగిపోవడం జరుగుతుంది. శక్తిలేని క్రోధమే క్రుంగుబాటు. ఇది

దీ యే
కూడా దీని ఛాయయే.
మోహం - అంటే, కోరిక. అయిదు ఇంద్రియముల ద్వారా మనకేదైనా సుఖానుభూతి
కలిగినపుడు, అలా కలిగించిన వస్తువునో మనిషినో ‘నాకిది కావాలి’ అని వాంఛించడమే
మోహం. కామం కూడా దీని ఛాయయే.
తనది కాని మరొకదానిని కోరుకోవడం మోహం. ‘నాకు నచ్చినది నాతోనే ఉండాలి,
ఇంకెవరికీ దక్కరాద’ని అనుకోవడం లోభం. అలా జరుగనప్పుడు కలిగేది కోపం. మనిషి జీవితం
మొత్తం ఈ మూడు రాక్షసుల చేతులలోనే నాశనమైపోతూ ఉంటుంది. కానీ ఎవరూ దీనిని
గ్రహించరు. వీటిని మార్చుకుందామని ప్రయత్నించరు. ఇదే అవిద్య లేదా మాయ అంటే.
‘మృదు మధ్యాధిమాత్రా’ - అంటే, ఈ దుర్గుణములు మూడూ కూడా, మూడు విధములైన
బలములతో ఉంటాయి. ఈ బలమనేది అక్కడ పనిచేస్తున్న గుణమును బట్టి ఉంటుంది.
1. మృదు - అంటే సున్నితమైన, బలహీనమైన, గట్టిది కాని - అని అర్థములు. కొందరిలో ఈ
దుర్గుణములు అంత బలంగా ఉండవు. ఉండీ లేనట్లుగా ఉంటాయి. దానికి అనుగుణంగా వారు
చేసుకునే చెడుకర్మ కూడా అంత బలంగా ఉండదు. ఇటువంటి వ్యక్తులలో సత్త్వగుణం కొంచం
బలంగా ఉంటుంది. అందుకే వారు చెడుకర్మ వైపు త్వరగా వెళ్లరు.
2. మధ్య- అంటే మృదుస్థాయి కంటే ఇంకొంచం బలమైన స్థాయి. వీరిలో ఈ దుర్గుణములు
బలంగా ఉంటాయి. కనుక వారు చేసుకునే చెడుకర్మ కూడా బలంగా ఉంటుంది. దానివల్ల, వారిని
వెంటాడే దురదృష్టములు, కష్టనష్టములు కూడా బలంగా ఉంటాయి. ఇది రజోగుణ
తమోగుణముల మిశ్రమఫలితం. రజోగుణం కొంచం తక్కువగా, తమోగుణం ఎక్కువగా
ఉన్నపుడు ఈ పరిస్థితి ఉంటుంది.
3. అధిమాత్ర - చాలా బలంగా ఉన్న స్థితి. మరికొందరిలో ఈ దుర్గుణములు చాలా బలంగా
ఉంటాయి. వీళ్ళు కన్నూమిన్నూ గానకుండా ప్రవర్తిస్తూ, విర్రవీగుతూ, విపరీతమైన చెడుకర్మను
పోగుచేసుకుంటూ ఉంటారు. అనుభవకాలం వచ్చినపుడు, అంటే పాపం పండినప్పుడు, వీరు
పడే బాధలు చాలా దారుణంగా ఉంటాయి. ఇది కూడా మిశ్రమగుణముల ఫలితమే. కాకపోతే,
దీనిలో రజోగుణం చాలా ఎక్కువగా ఉంటుంది, తమోగుణం తక్కువగా ఉంటుంది.
‘దుఃఖాఽజ్ఞానానంత ఫలా’ - ఇవన్నీ అమితమైన దుఃఖమును, అజ్ఞానమును కలిగిస్తాయి.
చెడు ఆలోచనల వల్ల, చెడుకర్మను చేయడం జరుగుతుంది. దానివల్ల ఆ ఆలోచనలకు ఇంకా
బలం పెరుగుతుంది. అవి మనస్సులో బలమైన సంస్కారములుగా ముద్రలు పడిపోతాయి. ఈ
విధంగా ‘చెడు ఆలోచనలు - చెడు కర్మలు - చెడు ఆలోచనలు - చెడుకర్మలు’ అనబడే చక్రంలో
మనిషి పడిపోతాడు.
చెడుకర్మ వల్ల చెడ్డఫలితం ఉంటుంది. అది దురదృష్టం రూపంలో మనిషిని వెంటాడుతుంది.
ఈ వలయంలో పడి అంతులేకుండా తిరుగుతూ ఉన్నందువల్ల అంతులేని దుఃఖము, అజ్ఞానము
అంతకంతకూ పెరిగిపోతూనే ఉంటాయి. ఈ మాయను యోగియైనవాడు చక్కగా గ్రహించాలి.
ఊరకే గ్రహిస్తే సరిపోదు. మరేం చెయ్యాలి?
హీ లో క్రో నే
బలహీనమైన, బలమైన, మరీ బలమైన - లోభ, క్రోధ, మోహములనే మూలముల నుండి
పుడుతూ - తనచేత చెడుకర్మలను చేయిస్తూ, ఇతరులను చెడుకర్మలు చెయ్యమని తనచేత
ప్రేరేపింపజేస్తూ, ఇతరులు చేస్తుంటే తనచేత ఆమోదింపజేస్తూ - ఈ క్రమంలో తనకు అంతులేని
దుఃఖమును, అజ్ఞానమును కలిగిస్తున్న వితర్కములను - తన మనస్సులో, మాటలలో, చేతలలో -
ఎక్కడికక్కడ ఖండించడం యోగియైనవాడు అభ్యాసం చేయాలి.
కొంతమందిలో ‘అసలివన్నీ ఎందుకు పాటించాలి?’ అనిన ప్రశ్న ఉదయిస్తుంది. పైన
చెప్పబడిన దుఃఖము, అజ్ఞానములనే రెండు బాధాకరములైన స్థితులను తప్పించుకోవడం కోసం
వీటిని పాటించాలి. కానీ ఈ సమాధానం లోకులకు తృప్తినివ్వదు. వెంటనే కలిగే లాభం ఏదో
ఒకటి, వారికి కనిపించాలి. ఎందుకంటే, లోకంలో ఎవరైనా సరే, లాభంలేని పనిని చెయ్యరు.
‘యమనియమములను పాటించడం వల్ల మాకు వెంటనే కలిగే ఉపయోగం ఏమిటి? అందరూ
అనుభవిస్తున్న సుఖములను వదలుకొని నేనెందుకు వీటిని పాటించాలి?’ అనిన అనుమానం,
అందరిలో కాకపోయినా కొందరిలోనైనా తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు మహర్షి సమాధానం
చెబుతున్నారు.
యమనియమముల ఉపయోగములు
సూ|| అహింసాప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః || 2.35 ||
అహింసలో ప్రతిష్ఠుడైనవాని సమక్షంలో వైరం త్యజింపబడుతుంది.
యమములను పాటించడం వల్ల, లౌకికంగా కలిగే లాభములు కలుగక పోవచ్చు. కానీ,
వాటికంటే ఎంతో గొప్పవైన అంతరికలాభములు కలుగుతాయి. వాటిని ధనంతో కొలవడం
సాధ్యం కాదు. కొనడమూ సాధ్యం కాదు.
ఎవడైతే మనసా వాచా కర్మణా అహింసను పాటిస్తాడో, వాడి చుట్టూ ఒక విధమైన
స్పందనావలయం ఏర్పడుతుంది. దాని పరిధిలోకి వచ్చినవారిలో ‘వైరం’ (శత్రుత్వభావన)
మాయమైపోతుంది. పరస్పర జన్మశత్రువులైన కుక్క - పిల్లి, పాము - ముంగిస, పులి - ఆవు,
మొదలైనవి కూడా అటువంటి యోగి సమక్షంలో తమ శత్రుత్వభావనను మరచి స్నేహంగా
ఆడుకుంటాయి. ఇది అతిశయోక్తి కాదు, నిజంగానే జరుగుతుంది. ప్రాచీన ఋష్యాశ్రమములలో
ఇలాంటి దృశ్యములు సర్వసాధారణములుగా కనిపించేవి.
జిల్లెళ్ళమూడి అమ్మగారి సమక్షంలో పిల్లి ఎలుకలు ఆడుకునేవి. రమణమహర్షి వద్దకు
పులులు, కోతులు, పాములు వచ్చిపోతూ ఉండేవి. శ్రీరామకృష్ణుల శరీరం పైన పాములు పాకేవి.
ఇవన్నీ నిజములే. ఆ విధంగా ఉండగలిగినప్పుడు ఆ అద్భుతములను చూడవచ్చు.
ప్రతిదానినీ ధనంతో కొలిచేవారికి ఇందులో ఏమీ ఆసక్తి కనపడకపోవచ్చు. ‘అలా
జరిగినందువల్ల ఏంటి ఉపయోగం?’ అని వారు అడుగవచ్చు. దీనికి జవాబు ఏమిటంటే,
వైరభావన లేనివాని మనస్సులో భయం కూడా ఉండదు. ఈ రెండు భావనలు లేని మనస్సు ఎంత
తేలికగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుందో, అది ఎంతటి సుఖమును ఇస్తుందో సామాన్యులు
లే తో చే
ఊహించలేరు. అది ధనంతో లభించే స్థితి కాదు.
సూ|| సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వం || 2.36 ||
సత్యములో ప్రతిష్ఠుడైతే క్రియ, ఫలమును ఆశ్రయిస్తుంది.
‘సత్యం పలికితే అన్నీ కష్టములే’ అనిన భావన లోకంలో నానుడిగా ఉన్నది. ఇది నిజం కాదు.
పాతవాసనల వల్ల మొదట్లో అలా అనిపించవచ్చు. కానీ సత్యమును అనుసరించడం ఎంత
మంచిదో కాలక్రమేణా అర్థమౌతుంది. ఎల్లప్పుడూ సత్యమును పలికే అలవాటైతే, ఆ మనిషిలో
‘అపరాధభావన’ (గిల్టీ ఫీలింగ్) ఉండదు. అదిలేని మనస్సు కూడా చాలా తేలికగా, ప్రశాంతంగా,
సౌఖ్యంగా ఉంటుంది. ఇది కూడా ధనంతో వచ్చే స్థితి కాదు.
మనసా, వాచా, కర్మణా సత్యమును అనుసరిస్తే, అట్టివాని క్రియ, ఫలమును ఆశ్రయిస్తుందని
మహర్షి ఈ సూత్రంలో అన్నారు. అంటే, వాడు చేసేపని ఏదీ కూడా, వృధా అవదు. దాని ఉద్దేశ్యం
నెరవేరకుండా ఉండదు. అంతేగాక అట్టివానికి వాక్సిద్ధి, సంకల్పసిద్ధి కలుగుతాయి. అంటే, అతని
దీవెన ఫలిస్తుంది. అతని సంకల్పం ఫలిస్తుంది. వాటి వెనుక సత్యం యొక్క శక్తి ఉంటుంది.
భగవంతుడు సత్యస్వరూపుడు గనుక, భగవంతుని శక్తి వానికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది.
శ్రీరామకృష్ణులు సత్యసాధనకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. సత్యం పలుకనివానిని ఆయన
తన దగ్గరకు రానిచ్చేవారు కారు. ఆయన తండ్రిగారైన క్షుదీరాం గారు, ఒక అబద్ధం చెప్పడానికి
నిరాకరించి తన పంటభూమిని పోగొట్టుకున్నారు. ఒక చిన్న అబద్ధం చెప్పినట్లయితే, ఆయన
సేద్యం చేస్తున్న భూమి ఆయనకు దక్కి ఉండేది. కానీ ఆస్తి కంటే సత్యమే గొప్పదని ఆయన
భావించి, అబద్ధం చెప్పడానికి నిరాకరించారు. దాని ఫలితంగా ఆయన ఆస్తినంతా పోగొట్టుకుని
ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించవలసి వచ్చింది. అయినా సరే, సత్యమును వారు అంటిపెట్టుకుని
ఉన్నారు. వారి పూర్వీకులు కూడా గొప్ప సత్యసంధత కలిగిన సత్పురుషులే. కనుకనే అలాంటి
కుటుంబంలో శ్రీరామకృష్ణులు జన్మించారు. శ్రీ రామకృష్ణులు తన జీవితంలో ఒక్క అబద్ధమును
కూడా చెప్పలేదంటే ఆయనకున్న శక్తి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆయన
మాటను దేవతలు శిరసా వహించేవారు. ‘ఇదుగో నీ ఇష్టదైవం! చూడు!’ అని ఆయన అంటే, ఆ
భక్తుని ఇష్టదేవత ఎదురుగా ప్రత్యక్షమై కనిపించేది. ఆయన ఎవరినైనా దీవిస్తే, ఆ దీవెన
నిజమయ్యేది. ఈ శక్తి ఎలా వస్తుంది? త్రికరణశుద్ధిగా సత్యమును పాటించడం వల్ల వస్తుంది.
ఒకరోజున నరేంద్రుడిని ఆయన ఇలా అడిగారు.
‘నీ ముఖం చుట్టూ నల్లని పొర కమ్మినట్లు నాకు కనిపిస్తున్నది. అబద్ధం ఏదైనా చెప్పావా?’
అదే రోజున ఒక చిన్న అబద్ధాన్ని చెప్పవలసి వచ్చిందని నరేంద్రుడు జవాబిచ్చాడు.
‘ఇంకెప్పుడూ అబద్ధం చెప్పకు. సత్యస్వరూపుడైన దైవాన్ని చేరుకోవాలంటే సత్యాన్ని తప్పక
అనుసరించాలి’ అని ఆయన మందలించారు.
శ్రీరామకృష్ణుల భక్తులు సత్యసంధులై ఉండాలి. శ్రీరామకృష్ణులు అన్నింటినీ త్యజించారు గాని
సత్యమును వదలలేకపోయారు. వారి ప్రధానభక్తులందరూ సత్యవాక్పాలకులే. శ్రీ రామకృష్ణుల

జీ లో దీ
పరమభక్తుడైన నాగమహాశయుని జీవితంలో జరిగిన సంఘటన దీనికి నిదర్శనంగా ఉన్నది.
నాగమహాశయుని తండ్రిగారు జబ్బుతో మంచాన పడి చివరిదశలో ఉన్నారు. ఆయనకు
గంగాతీరంలో చనిపోవాలని ఆశ. గంగానది వారి ఇంటికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నది. తన
చివరికోరికగా గంగాతీరానికి తీసుకెళ్ళమని ఆయన కోరారు. నిరుపేదవాడైన
నాగమహాశయునికి అది చేయలేని పని. ‘శ్రీరామకృష్ణుల అనుగ్రహం ఉంటే అది జరుగుతుంది’
అని ఆయన అని ఊరకున్నారు. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత వారి ఇంటి ఆవరణలో ఒకచోట
నేల చీలి, నీరు ఉబికి పైకి రావడం ప్రారంభించింది. కొన్నిగంటలపాటు ఆ విధంగా ఉబికిన
నీటిధార ఇంటిలోకి కూడా ప్రవేశించి గిలకలవరకూ ముంపులాగా వచ్చింది. ఆ నీటిని తన
తండ్రిగారి మీద చల్లి ఆయన చివరి కోరికను తీర్చాడు నాగమహాశయుడు. ఆ తర్వాత, నీరు
భూమిలోకి ఇంకిపోవడం ప్రారంభించి, కొన్ని గంటల తర్వాత జాడలేకుండా
మాయమైపోయింది. సత్యమును అనుసరించేవారి మాటకు అంతటి శక్తి ఉంటుంది. వారి
మాటను ప్రకృతి శిరసావహిస్తుంది. అవసరమైతే తన నియమములను మార్చుకుని మరీ, ప్రకృతి
వారి మాటను నిజం చేస్తుంది. ‘క్రియాఫలాశ్రయత్వం’ అంటే ఇది అర్థం.
నా చిన్నప్పుడు నా గురువులలో ఒకరైన పూజ్యపాద నందానందస్వామిని నేనిలా అడిగాను.
‘ధ్యానంలో నాకు కనిపించే దర్శనములు నిజములేనా? లేక నా మనస్సు కల్పిస్తున్న
దృశ్యములా? ఎలా తెలుసుకోవాలి?’
దానికాయన ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. అది నాలో ఇప్పటికీ
మారుమ్రోగుతున్నది.
‘నువ్వు పలికేది సత్యమైతే, నువ్వు చూచేది కూడా సత్యమే అవుతుంది’.
అంటే ఏమిటి? మనం సత్యమును అనుసరిస్తుంటే, మన సాధన కూడా సత్యమే అవుతుంది.
మన జీవితం కూడా సత్యమే అవుతుంది. మనం అబద్ధాలు చెబుతుంటే, మన సాధన కూడా
అబద్ధమే అవుతుంది. మన జీవితం కూడా అబద్ధమే అవుతుంది. మహనీయులైన వారు
సత్యమునకు ఎంతటి విలువనిస్తారో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
సూ|| అస్తేయప్రతిష్ఠాయాం సర్వరత్నోపస్థానం || 2.37 ||
దొంగతనం చేయనివానికి అన్ని రత్నములూ దగ్గరౌతాయి.
దొంగతనమంటే ఏదో పెద్దపెద్ద దొంగతనములు కానక్కరలేదు. ఇతరుల వస్తువులను వారికి
తెలియకుండా తీసుకోవడం, వాడుకోవడం కూడా దొంగతనమే అవుతుంది. ఆదాయంలో
దొంగలెక్కలు చూపించడం కూడా దొంగతనమే అవుతుంది. చాటుమాటు పనులు చెయ్యడం
కూడా దొంగతనమే అవుతుంది. ఈ విధంగా ‘స్తేయం’ అనే మాటకు అనేక ఛాయలున్నాయి. ఈ
కోణంలో చూచినప్పుడు ప్రపంచంలో దొంగ కానివాడే లేడు. కొంతమంది జేబుదొంగలైతే
కొంతమంది గజదొంగలు. అంతే తేడా!
రత్నమంటే ధనమని అర్థం. ధనంకోసం ఆశపడేవారే దొంగతనం చేస్తారు. వారికి

నీ నో నో
తాత్కాలికంగా సుఖం దక్కవచ్చు. కానీ ఆ పనివల్ల ఆ ధనమునో, రత్నములనో
పోగొట్టుకున్నవాడు ఎంతో బాధపడతాడు. ఆ బాధ ఉసురుగా మారి, ఈ దొంగను
వెంటాడుతుంది. పాపం పండినప్పుడు దొంగను యమయాతనలకు గురిచేస్తుంది. కనుక,
దొంగకు చివరకు దక్కినదేమిటి? దొంగిలించగా వచ్చిన ధనమూ మిగలదు. దురదృష్టమూ
వెంటాడుతుంది. కనుక దూరదృష్టి ఉన్నవాడు, కర్మనియమమును అర్థం చేసుకున్నవాడు
దొంగతనం చెయ్యడు.
అస్తేయమును పాటించేవానికి, అంటే దొంగతనం చేయనివానికి అన్ని రత్నములూ
లభిస్తాయని మహర్షి అంటున్నారు. ఇదేమిటి? ఇది ఎలా సంభవిస్తుంది? అనిన సందేహం
కలుగుతుంది.
ప్రపంచంలో ఒక నియమం ఉన్నది. అదేమిటంటే, మనం దేనివెంటనైనా అదే పనిగా
పరుగెత్తుతూ ఉంటే, అది మనకు చిక్కదు. అది ఇంకా ఇంకా దూరంగా పోతూ ఉంటుంది.
చివరకు అదొక పరుగుపందెం అవుతుంది. కానీ, మనం పరుగును ఆపి దానివైపు చూడకుండా
నిలబడినప్పుడు, అది కూడా తన పరుగును ఆపి మన దగ్గరకు వస్తుంది. కానీ, మనం ఒకప్రక్క
దానిని ఆశిస్తూ, ఇంకొక ప్రక్క అదంటే మనకు పట్టనట్లు నటించకూడదు. నిజంగా ‘నువ్వు
నాకొద్దు’ అని పరుగును ఆపగలగాలి. అప్పుడు అదే మన వెంట పడుతుంది. ధనం కూడా అంతే.
రత్నములు, ధనం, వస్తుప్రపంచమంతా ఇంతే. అది శక్తి స్వరూపం. శక్తి ఎప్పుడూ బానిసను
కోరుకోదు. రాజునే కోరుకుంటుంది. తన వెంట పరుగెత్తేవానిని అది బానిసగా చూస్తుంది.
తనను లెక్కచెయ్యనివానిని రాజుగా చూస్తుంది. వాడిని ఆరాధిస్తుంది. ఇదొక కర్మనియమం.
కావాలని కోరుకునేవానికి నిజానికి ఏదీ దక్కదు. వద్దనుకునేవాడికే అన్నీ దక్కుతాయి.
వినడానికి ఇదొక వింతలాగా ఉన్నప్పటికీ ఇది సత్యం. దీనినే ఈ సూత్రం చెబుతున్నది.
దీనిలోని ఇంకొక కోణమును వివరిస్తాను.
దేనినీ కోరనివాడు, వివేకవైరాగ్యములతో నిండి, తన ఆత్మలో తానై ఉంటాడు. అంటే,
సర్వోన్నతమైన ఆత్మస్థితి వానికి దక్కుతుంది. అన్ని రత్నములలోనికీ అదే అతి పెద్దదైన మరియు
గొప్పదైన రత్నం. దానితో బాటుగా అన్నివిధములైన జ్ఞానసంపదలు, శక్తిసంపదలు అతడిని
వరిస్తాయి. అవే సర్వరత్నములంటే. ఈ విధంగా చూచినప్పుడు కూడా ‘సర్వరత్నోపస్థానం’ అనే
పదం చక్కగా సరిపోతున్నది.
సూ|| బ్రహ్మచర్యప్రతిష్ఠాయాం వీర్యలాభః || 2.38 ||
బ్రహ్మచర్యంలో ప్రతిష్ఠితుడైన వానికి వీర్యలాభం కలుగుతుంది.
సామాన్యులలో వీర్యశక్తి వృధాగా పోతూ ఉంటుంది. లైంగికసుఖం కోసం దానిని
విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో శక్తిహీనులై పిప్పిగా మారుతుంటారు.
అలాంటివారు యోగసాధనకు పనికిరారు. బ్రహ్మచర్యం లేకుండా యోగసాధన చేస్తే నరాలవ్యవస్థ
అల్లకల్లోలమౌతుంది. ఆ క్రమంలో పిచ్చి కూడా ఎక్కవచ్చు. అలా జరిగిన సాధకులు కొల్లలుగా
ఉన్నారు.
మనసా, వాచా, కర్మణా బ్రహ్మచర్యమును పాటించడం వల్ల అమితమైన శక్తి దేహంలో
పోగుపడుతుంది. నరాలవ్యవస్థ బలంగా ఉంటుంది. మనస్సు ఉత్సాహంగా ఉంటుంది.
యోగసాధన ఫలిస్తుంది. ఈ విషయమునే ఇక్కడ మహర్షి చెబుతున్నారు.
శ్రీరామకృష్ణులు తమ భక్తులలో బ్రహ్మచర్యదీక్షను ప్రోత్సహించేవారు. గృహస్థులు కూడా,
ఒకరిద్దరు పిల్లలు కలిగిన తర్వాత సోదరీసోదరుల లాగా జీవిస్తూ, దైవసాధనలో నిమగ్నులు
కావాలని ఆయననేవారు. పన్నెండేళ్ళపాటు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాధన చేస్తే, అట్టి యోగిలో
‘మేధానాడి’ అనే క్రొత్త నాడి పుడుతుందని దాని ఫలితంగా అతీతజ్ఞానమును,
దైవసాక్షాత్కారమును పొందటం తేలిక అవుతుందని ఆయన తరచూ అనేవారు. వారి
ప్రత్యక్షభక్తులు, శిష్యులు అందరూ అటువంటి సాధన చేసినవారే.
ఒకసారి తన సోదరశిష్యులతో కూర్చుని మాట్లాడుతూ ఉన్న వివేకానందస్వామి వారిని ఇలా
ప్రశ్నించారు.
‘మన గురుదేవులైన శ్రీరామకృష్ణులు బ్రహ్మచర్యమునకు ఎంత ప్రాముఖ్యత నిచ్చారో మీకు
తెలుసు. ఆయన బోధననుసరిస్తున్న మీలో, ఒక్కసారి కూడా కామపు ఆలోచన మనస్సులో
తలెత్తకుండా పన్నెండేళ్ళపాటు నిగ్రహంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా?’
ఎవరూ మాట్లాడలేదు.
మా పరమగురువులైన పరమపూజ్య శివానందస్వామివారు ‘అవును. నేనలా ఉన్నాను’ అని
జవాబిచ్చారు.
సంతోషంతో పొంగిపోయిన వివేకానందస్వామి ‘నీవంతటి వాడవే! నీవు నిజంగా
మహాపురుషుడవు!’ అంటూ మిగతా సోదరశిష్యుల వైపు తిరిగి ‘ఈరోజునుంచి మనమందరం
తారక్ ను ‘మహాపురుష మహరాజ్’ అని పిలుద్దాం’ అన్నారు. ఆ రోజునుంచీ శ్రీరామకృష్ణ
సాంప్రదాయంలో పరమపూజ్య శివానందస్వామికి ఆ పేరు స్థిరపడిపోయింది.
వేదోపనిషత్తులలోను, పురాణములలోను, బ్రహ్మచర్యమునకు చాలా గొప్ప విలువ
ఇవ్వబడింది.
అథర్వణవేదంలోని పదకొండవ కాండం అయిదవ సూక్తం ఏమంటున్నదో చూడండి.
శ్లో|| ఆచార్యో బ్రహ్మచారీ బ్రహ్మచారీ ప్రజాపతిః
ప్రజాపతిర్వి రాజతి విరాడిన్ద్రో ఽభవద్వశీ ||
ఆచార్యుడు, ప్రజాపతి (బ్రహ్మదేవుడు), ఇంద్రుడు, పరమాత్మ వీరందరూ బ్రహ్మచర్యం వల్లనే
వారి స్థానములలో విరాజిల్లుతున్నారు.
శ్లో|| బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం వి రక్షతి
ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచారిణమిచ్ఛతే ||
బ్రహ్మచర్యము, తపస్సుల వల్లనే రాజు రాజ్యమును రక్షిస్తాడు. తన శిష్యులైన బ్రహ్మచారులకు
నే బో
కూడా బ్రహ్మచర్యబలం వల్లనే ఆచార్యుడు బోధిస్తాడు.
శ్లో|| బ్రహ్మచర్యేణ కన్యా యువానమ్ విన్దతే పతిమ్
అనడ్వాన్బ్రహ్మచర్యేణాశ్వో ఘాసం జిగీర్షతి ||
కన్య తనయొక్క బ్రహ్మచర్యబలం వల్లనే యువకుడైన మంచి భర్తను పొందుతుంది.
ఉపవాసము బ్రహ్మచర్యముల వల్లనే అశ్వము తన మేతను అరిగించుకుంటుంది.
శ్లో|| బ్రహ్మచర్యేణ తపసా దేవా మృత్యుమపాఘ్నత
ఇన్ద్రో హ బ్రహ్మచర్యేణ దేవేభ్యః స్వరాభరత్ ||
బ్రహ్మచర్యము తపస్సుల వల్లనే దేవతలు మృత్యువును జయిస్తున్నారు. ఇంద్రుడు కూడా
బ్రహ్మచర్యబలం వల్లనే దేవతలలో శ్రేష్ఠుడుగా ఉంటున్నాడు.
శివమహాపురాణం లో ఈశ్వరుడు పార్వతికి ఇలా బోధించినట్లు గోచరిస్తుంది.
శ్లో|| న తపస్తప ఇత్యాహుః బ్రహ్మచర్యం తపోత్తమమ్
ఊర్ధ్వరేతా భవేద్యస్తు స దేవో నతు మానుషః ||
మామూలుగా అందరూ చేసే తపస్సులు తపస్సులు కావు. బ్రహ్మచర్యమే ఉత్తమమైన తపస్సు.
ఊర్ధ్వరేతుడైనవాడు దేవతయే. వాడు మానవుడు కాడు.
శ్రీమద్భాగవతం ఇలా అంటుంది.
శ్లో|| తపసా బ్రహ్మచర్యేన శమేన చ దమేన చ
త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేన వా || (6.1.13)
శ్లో|| దేహవాగ్ బుద్ధిజం ధీరా ధర్మజ్ఞః శ్రద్ధయాన్వితః
క్షిపంత్యాఘం మహాదపి వేణుగుల్మం ఇవానలా || (6.1.14)
తపస్సు, బ్రహ్మచర్యము, శమము, దమము, త్యాగము, సత్యము, శౌచము,
యమనియమములను మనసా, వాచా, కర్మణా పాటిస్తున్న ధీరుడు, ధర్మమును
తెలుసుకున్నవాడై, శ్రద్ధతో కూడినవాడై, వెదురుపొదను అగ్ని కాల్చివేసినట్లుగా, గొప్పదైన తన
పాపమును భస్మం చేసివేస్తాడు.
ముండకోపనిషత్తు ఇలా బోధిస్తున్నది.
శ్లో|| సత్యేనభ్యస్తపసా హ్యేష ఆత్మా
సమ్యగ్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యమ్
అన్తః శరీరే జ్యోతిర్మయో హి శుభ్రో
యం పశ్యన్తి యతయః క్షీణదోషాః || (3.1.5)
ఆత్మయన్నది దేహంలోపల జ్యోతిర్మయమై శుభ్రమై వెలుగుతున్నది. దోషములను
పోగొట్టుకున్న ఇంద్రియనిగ్రహపరులు సత్యము, తపస్సు, సమ్యక్ జ్ఞానము, బ్రహ్మచర్యములను
నిత్యమూ పాటిస్తూ దానిని దర్శించగలుగుతారు.

వే దోగ్యో బో
సామవేదమునకు చెందిన ఛాందోగ్యోపనిషత్తు ఇలా బోధిస్తున్నది.
|| తద్య ఏవైతం బ్రహ్మలోకం బ్రహ్మచర్యేణానువిన్దంతి తేషామేవైష బ్రహ్మలోకస్తేషాం సర్వేషు లోకేషు
కామచారో భవతి || (8.4.3)
‘బ్రహ్మచర్యముతో బ్రహ్మలోకమును చేరినవారికోసం బ్రహ్మలోకమున్నది. వారు అన్ని
లోకములకూ వారిష్టప్రకారం పోగలుగుతారు’.
|| అథ యద్యజ్ఞ ఇత్యక్షతే బ్రహ్మచర్యమేవ
తద్ బ్రహ్మచర్యేణ హ్యేవయో జ్ఞాతా త్వంవిందతేఽథ
యదిష్టమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ
తద్ బ్రహ్మచర్యేణ హ్యేవేష్ట్వాత్మానమనువిన్దంతే || (8.5.1)
‘యజ్ఞమని దేనినంటున్నారో అది బ్రహ్మచర్యమే. ఆ బ్రహ్మచర్యంతో ఆత్మను తెలుసుకున్నవాడు
బ్రహ్మలోకమును పొందుతున్నాడు. ఇష్టమని దేనినంటున్నారో అది బ్రహ్మచర్యమే. ఆ
బ్రహ్మచర్యంతోనే ఇష్టాత్మను పొందుతున్నాడు’.
అథర్వణవేదమునకు చెందిన, రెండువేల ఏళ్ళ క్రిందటిదైన ప్రశ్నోపనిషత్ ఇలా బోధిస్తున్నది.
ఆరుగురు ముముక్షువులు పిప్పలాదఋషి వద్దకు చేరి బ్రహ్మమును గురించిన జ్ఞానం కొరకు
ఆయనను ప్రార్థించగా ఆయన వారితో ఇలా అంటారు.
|| తన్ హ స ఋషిరువాచ భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్సరం సంవత్స్యత
యధా కామాన్ ప్రశ్నాన్ పృచ్చత యది విజ్ఞాస్యామః సర్వం హ వో వక్ష్యామ ఇతి ||
‘తపస్సు, బ్రహ్మచర్యములను పాటిస్తూ శ్రద్ధతో మీరు ఒక సంవత్సరం పాటు నా ఆశ్రమంలో
ఉండండి. అప్పుడు మీరు అడుగదలచిన ప్రశ్నలను అడగండి. నాకు తెలిస్తే చెబుతాను’.
మహనీయులను కుతూహలంతో ప్రశ్నిస్తే చాలదని, తపస్సు, శ్రద్ధ, బ్రహ్మచర్యము,
గురుశుశ్రూషలు విధిగా ఆ ప్రశ్నల వెనుక ఉండాలని దీనిని బట్టి అర్థమౌతున్నది.
కృష్ణయజుర్వేదమునకు చెందిన కఠోపనిషత్తు ఇలా బోధిస్తున్నది.
శ్లో|| సర్వే వేదా యత్పద మామనన్తి
తపాంసి సర్వాణి చ యద్వదంతి
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్ || (2.15)
‘అన్ని వేదములూ దేనిని శ్లాఘిస్తున్నవో, తపస్సులన్నీ దేనిని గురించి చెబుతున్నవో, దేనిని
కోరి బ్రహ్మచర్యమును పాటిస్తున్నారో దానిని సంగ్రహంగా చెబుతాను విను. అదే ఓంకారము!’
అంటే, ఓంకారసాధనకు బ్రహ్మచర్యం అత్యంత అవసరమని అర్థమౌతున్నది కదా!
భగవద్గీతలో కూడా ఇదే భావం చెప్పబడింది.
శ్లో|| యదక్షరం వేదవిదో వదంతి
విశన్తి యద్యతయో వీతరాగాః
తో
యదిచ్చంతో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే || (8.11)
‘నాశనం లేనిదని వేదవిదులు దేనిని గురించి అయితే చెబుతున్నారో, మోహమును
పోగొట్టుకున్న ఇంద్రియనిగ్రహపరులు దేనిని చేరుకుంటున్నారో, దేనిని కోరి బ్రహ్మచర్యమును
పాటిస్తున్నారో, ఆ స్థితిని క్లుప్తంగా చెబుతాను’.
కనుక బ్రహ్మజ్ఞానప్రాప్తికి బ్రహ్మచర్యం అత్యంత అవసరమని అర్థమౌతున్నది.
యోగసూత్రములు కూడా దీనినే చెప్పినవి.
సూ|| అపరిగ్రహస్థైర్యే జన్మకథంతాసంబోధః || 2.39 ||
ఇతరుల దగ్గర ఏదీ తీసుకోనివానికి జన్మపరంపరలన్నీ అర్థమౌతాయి.
పైపైన చూచినప్పుడు, ఈ సూత్రం కూడా అర్థం కానట్లు తోస్తుంది. ఇతరుల దగ్గర ఏదైనా
తీసుకోవడానికీ, జన్మపరంపరలకూ ఏమిటి సంబంధం? అనిన ప్రశ్న తలెత్తుతుంది.
ఇతరుల దగ్గర దేనినైనా మనం తీసుకున్నపుడు, కనిపించేవి, కనిపించనివి అయిన అనేక
ఫలితములు మనకు చుట్టుకుంటాయి.
కష్టపడకుండా ఒక వస్తువును ఉచితంగా తీసుకోవడం వల్ల, వడ్డీతో సహా దానిని మళ్ళీ
తీర్చుకోవలసిన కర్మ చుట్టుకుంటుంది. అది ఇంకొక జన్మకు గాని ఎన్నో జన్మలకు గాని
కారణమౌతుంది.
ఆ వస్తువు పైన మోహం పెరిగి, మనస్సు దిగజారుతుంది. దానివల్ల ధ్యానస్థితి కుదరదు.
సాధన కూడా దిగజారుతుంది.
ఆ వస్తువును తన దగ్గరనుంచి ఇంకొకరు తీసుకుంటారేమో, లేదా అది తనను
వదలిపోతుందేమో అనిన భయం పట్టుకుంటుంది. ఆ విధంగా లోభం, భయం మనస్సును
ఆక్రమిస్తాయి. తత్ఫలితంగా, ధ్యానసమాధికి కావలసిన అర్హతను మనస్సు కోల్పోతుంది.
ఆశ ఉన్నపుడే ఇతరుల నుంచి దేనినైనా ఆశించడం ఉంటుంది. ఆశ వల్లనే జన్మపరంపరలు
కలుగుతాయి. తనలోని ఆశలకు లోబడకుండా, వాటిని విశ్లేషించుకుంటే జన్మకారణములు
అర్థమౌతాయి. గతంలో తానెలాంటి జన్మలను ఎత్తినది, భవిష్యత్తులో ఎలాంటి జన్మలను
ఎత్తబోతున్నది అర్థమౌతుంది. ఇదే అపరిగ్రహమునకు జన్మపరంపరలకు ఉన్నట్టి సంబంధం.
సూ|| శౌచాత్ స్వాంగజుగుప్సా పరైరసంసర్గః || 2.40 ||
శౌచం వల్ల తన దేహమంటే జుగుప్స కలుగుతుంది. ఇతరుల దేహములతో సంసర్గం
పోతుంది.
శౌచమంటే శుభ్రం. దుమ్మూ ధూళీ పడి, చెమట పట్టి, మురికిగా మారడం శరీరలక్షణం.
శుభ్రం చేసుకోకపోతే దేహం కంపు కొడుతుంది. దీనిని చక్కగా గమనించినప్పుడు, దేహతత్త్వం
అర్థమైనప్పుడు, తన దేహమంటే మోజు పోతుంది. ‘ఇతరుల దేహములు కూడా ఇంతేకదా!’
అనిన విషయం చక్కగా అర్థమైతే, ఇతరుల దేహములంటే కూడా అసహ్యం ఏర్పడుతుంది.
అప్పుడు ఇతరులను తాకుదామని అనిపించదు. తత్ఫలితంగా, కామం తగ్గిపోతుంది.
ఇది మానసికంగా కూడా జరుగుతుంది. మన మనస్సులో ఉన్నట్టి దుర్గుణములను చెడు
సంస్కారములను మనం స్పష్టంగా చూడగలిగినప్పుడు అటువంటి సంస్కారములను
పోగుచేసుకున్నందుకు మనమంటే మనకే అసహ్యం కలుగుతుంది. ఇతరుల మనస్సులు కూడా
అటువంటివే అని గ్రహించినప్పుడు మానవజీవితమంటేనే జుగుప్స కలుగుతుంది. ఎంతటి
అజ్ఞానంలో, అవిద్యలో మనుషులంతా ఉన్నారో అర్థమౌతుంది. తత్ఫలితంగా, ఈ భూమిపైన
ఇంకొక జన్మ ఎత్తాలన్న కోరిక అడుగంటుతుంది.
సూ|| సత్త్వశుద్ధి సౌమనస్యైకాగ్ర్యేంద్రియజయాత్మదర్శన-యోగ్యత్వాని చ || 2.41 ||
దీనివల్ల సత్త్వశుద్ధి, శుద్ధమైన మనసు, ఏకాగ్రత, ఇంద్రియజయము, ఆత్మదర్శనయోగ్యతలు
కలుగుతాయి.
‘శౌచం’ అనే ఒక్క నియమమును చక్కగా అర్థం చేసుకుని, మనసా, వాచా, కర్మణా ఆచరిస్తే
చాలు, పై లక్షణములన్నీ లభిస్తాయి.
సూ|| సంతోషాదనుత్తమ సుఖలాభః || 2.42 ||
సంతోషం వల్ల ఉత్తమమైన సుఖం లభిస్తుంది.
‘సుఖ సంతోషములు’ అనే మాటను తరచుగా మనం వింటూ ఉంటాం. సుఖం వల్ల
సంతోషం కలుగుతుందని సాధారణంగా అందరూ అనుకుంటారు. ఇదొక భ్రమ మాత్రమే.
లోకంలోని ఏ సుఖమూ శాశ్వతం కాదు గనుక, దానినుంచి లభించే సంతోషం కూడా శాశ్వతం
కాదు. నిలకడగా ఎల్లప్పుడూ మనతో ఉండే సంతోషం, కాసేపుండి ఆవిరైపోయే సుఖంతో ఎలా
వస్తుంది? అది జరిగేపని కాదు. కనుక సుఖం నుంచి సంతోషం ఎన్నటికీ రాదు. ఈ రహస్యం
యోగులకు బాగా తెలుసు. మరి ఎలా వస్తుంది? అంటే, సంతోషం నుంచి మాత్రమే ఉత్తమమైన
సుఖం వస్తుందని వారంటారు. ఇదికూడా వినడానికి వింతగా ఉంటుందిగాని, సత్యమే.
‘ఈలోకం నుంచి మనం తీసుకుపోయేది ఏదీ లేదు’, ‘ఇక్కడ మనం కోల్పోయేది కూడా ఏదీ
లేదు’, ‘ఎవరికి ఎంత రావాలో అంత వస్తుంది’ అనిన విషయములు బాగా అర్థములైనప్పుడు,
‘అది నాకు దక్కలేదు’, ‘నాకు రావలసింది వారికి పోయింది’ అనిన ఏడుపు, కుళ్ళు, అసూయలు
ఉండవు. ఎప్పుడైతే మనస్సులోనుంచి ఇవి మాయమైనాయో అప్పుడు వాటిస్థానంలో సంతోషం
కలుగుతుంది. సంతోషమనేది కోటానుకోట్లు సంపాదించడం వల్ల రాదు. దానివల్ల తాత్కాలిక
సుఖములు మాత్రమే కలుగుతాయి. మరి సంతోషం ఎలా వస్తుంది? అంటే, జీవితమును,
కర్మరహస్యములను, ప్రకృతి నియమములను, దైవనియమములను సరిగ్గా అర్థం చేసుకుని,
వాటికి అనుగుణంగా జీవించినప్పుడే సంతోషం అనేది కలుగుతుంది. దానివల్ల అత్యుత్తమమైన
సుఖం లభిస్తుంది.
జ్ఞానంవల్ల కలిగిన సంతోషం ఉన్నట్టి యోగి, ఎల్లప్పుడూ తేలికగా ఉల్లాసంగా ఉంటాడు.
అతనిలో ఏడుపు ఉండదు.

ద్దే శ్రీ చే తో తో మీ
సాధకులనుద్దేశించి శ్రీ రామకృష్ణులు తరచూ ఒక పాటను ఆలపించేవారు ‘సంతోషంతో మీ
సాధనను చెయ్యండి. క్రమంగా మీరు సాధనలో ఎదుగుతారు’ అంటూ ఆ పాట సాగుతుంది.
కనుక, యోగసాధకునకు ఏడుపు, కుళ్ళు పనికిరావు. అతడు ఉల్లాసంగా, సంతోషంగా
ఉంటూ తన సాధనను చేస్తూ ఉండాలి.
సూ|| కాయేంద్రియ సిద్ధి రశుద్ధిక్షయాత్ తపసః || 2.43 ||
తపస్సు వల్ల దేహము, ఇంద్రియములకు సిద్ధి కలుగుతుంది. వాటియొక్క అశుద్ధి నశిస్తుంది.
శరీరము, ఇంద్రియములు సత్త్వగుణంతో నిండి ఉన్నవారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా
ఉంటారు. అందరికీ అవి రజోగుణ తమోగుణములు కలసిన తీరులోనే ఉంటాయి. అయితే,
ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఈ నిష్పత్తి ఉంటుంది. అదే వాటికున్న అశుద్ధి. ఈ అశుద్ధి
తపస్సుతోనే పోతుంది.
‘తపనయే తపస్సని’ పైన వివరించాను. అది మనస్సుకు సంబంధించినది. కానీ దేహంలో,
ఇంద్రియములలో కూడా దోషములుంటాయి, అశుద్ధి ఉంటుంది. మనస్సుతోబాటు, శరీరమును,
ఇంద్రియములను తపింపజేయడం వల్ల వాటిలోని అశుద్ధి మాయమౌతుంది. ఇది ఎలా
జరుగుతుంది?
పుట్టిననాటినుండి పోయేవరకూ మానవుడు తింటూనే ఉంటాడు. కొందరైతే పుట్టినదే
తినడానికన్నట్లు బ్రతుకుతూ ఉంటారు. ఈ విధంగా జీర్ణకోశమునకు విశ్రాంతి అన్నది ఇవ్వకుండా
ప్రతిపూటా పొట్టనిండుగా మెక్కుతూ ఉండటం వల్ల, దేహం తమోగుణంతో నిండిపోతుంది.
అశుద్ధి అంటే ఇదే. అందుకే మితాహారం తినాలి, అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఉండాలి. ఇది
ఆహారనియమం, లేదా శారీరికతపస్సు. అదే విధంగా మిగిలిన అన్ని ఇంద్రియములనూ వాటికి
కావలసినదానికంటే తక్కువగా ఇస్తూ వాటిని తపింపజేయాలి. ఇది ఇంద్రియముల తపస్సు.
ఈ విధమైన తపస్సు చేయడం వల్ల, కాయము (దేహము), ఇంద్రియములు, తపింపబడి,
శుద్ధములౌతాయి. వాటిలోని బరువు, బద్ధకము, చీకటులు మాయములౌతాయి. యోగసాధనకు
కావలసిన అర్హతను సాధకుని శరీరము, ఇంద్రియములు పొందుతాయి.
సూ|| స్వాధ్యాయాద్ ఇష్టదేవతా సంప్రయోగః || 2.44 ||
స్వాధ్యాయం వల్ల ఇష్టదేవతతో అనుసంధానం లభిస్తుంది.
స్వాధ్యాయమంటే తనను తాను పరిశీలించుకోవడమని పైన చెప్పాను. ఇది జ్ఞానమార్గం. ఈ
విధమైన ఆత్మపరిశీలన వల్ల ఆత్మప్రక్షాళన జరుగుతుంది. చివరకు ఆత్మస్థితి లభిస్తుంది. జ్ఞానికి
ఇష్టదేవత తన ఆత్మయే. కాని భక్తునికి, యోగికి అలా కాదు. విష్ణు, శివ, దేవి ఇత్యాది దేవతలు
భక్తునికి ఇష్టదేవతలుగా ఉండవచ్చు. వారి వారి మంత్రోపాసనలను చెయ్యడం వల్ల ఆయా
దేవతల సాక్షాత్కారములు భక్తులకు లభిస్తాయి. ఇది భక్తుల యొక్క స్వాధ్యాయం. యోగి యొక్క
ఇష్టదేవత ఓంకారస్వరూపుడైన ఈశ్వరుడు. కనుక ఓంకారమంత్రోపాసన యోగి యొక్క
స్వాధ్యాయం అవుతుంది.
కనుక, భక్తులకు, జ్ఞానులకు, యోగులకు వారివారి స్వాధ్యాయమును బట్టి వారి వారి
ఇష్టదేవతలతో అనుసంధానం లభిస్తుందని చెప్పబడింది.
సూ|| సమాధిసిద్ధి రీశ్వరప్రణిధానాత్ || 2.45 ||
ఈశ్వరప్రణిధానం వల్ల సమాధి సిద్ధిస్తుంది.
మనసా, వాచా, కర్మణా, ఈశ్వరుని యందు సంపూర్ణశరణాగతిని కలిగియుండటం, సమస్త
కర్మఫలితములను ఆయనకే అర్పించడం, నిరంతర భక్తితో కూడిన ఈశ్వరధ్యానముల వల్ల
యోగియొక్క మనస్సు అత్యంత పరిశుద్ధమై ఈశ్వరునిలో లయమైపోతుంది. దానినే సమాధిస్థితి
అంటారు.
యమనియమముల ప్రాముఖ్యత
యోగసాధకులలో చాలామంది, యమనియమములను పాటించకుండా, సరాసరి
ధ్యానమును అభ్యాసం చేస్తూ ఉంటారు. అందుకే వారికి ధ్యానం అందదు. నేటి గురువులు కూడా
యమనియమములను నొక్కి చెప్పడం లేదు. ఇది చాలా పొరపాటు. క్రిందిమెట్లను ఎక్కకుండా
పైమెట్లు అందవు. కానీ యమనియమములనేవి ఒకరోజులోనో ఒక్క ఏడాదిలోనో సిద్ధించేవి
కావు. ఒక్కొక్కసారి జన్మంతా సాధన చేసినాకూడా ఇవి అంత సులభంగా సిద్ధించవు. కనుక
యమనియమములను నిరంతరం అభ్యాసం చేస్తూ, ధ్యానధారణాది సాధనలను కూడా
వాటితోబాటుగా అభ్యాసం చెయ్యాలిగాని, వాటిని వదలివేసి ఉత్త ధ్యానమును మాత్రమే అభ్యాసం
చెయ్యకూడదు. అలా చేయడంవల్లనే నేటి సాధకులు చాలామంది ఎన్నేళ్ళైనా ఎదుగూ బొదుగూ
లేకుండా ఉంటున్నారు.
యమనియమములలో ప్రతి ఒక్కటీ యోగసాధకునికి ఆత్మప్రాప్తిని ఈశ్వరప్రాప్తిని
కలిగించగలవు. అది ఎలా సాధ్యమో క్లుప్తంగా వివరిస్తాను.

అహింస: హింసకు గురిచేయడానికి, తనుగాక మరొకరు ఉండాలి. తనలోపలా బయటా,


అందరిలోనూ ఆత్మనే దర్శిస్తున్నవాడు ఎవరిని హింసించగలుగుతాడు? కనుక సరిగ్గా
పాటించబడిన అహింస, ఆత్మప్రాప్తిని సులభంగా కలిగిస్తుంది.

సత్యం: ఆత్మ సత్యం, ఈశ్వరుడు సత్యం. తన త్రికరణములలో సత్యమునే అంటిపెట్టుకున్న


యోగి, సత్యస్వరూపుడైన ఈశ్వరుని చేరుకుంటాడు.
అస్తే యం: ఇతరుల సొమ్మును ఆశించనివాని మనస్సు అత్యంత పరిశుద్ధమౌతుంది.
శుద్ధమనస్సులో ఈశ్వరుని వెలుగు దానంతట అదే ప్రతిఫలిస్తుంది.

బ్ర హ్మచర్యం: కామమును వదల్చుకొన్న మనస్సు నిష్కామమౌతుంది. అట్టి మనస్సు


ఈశ్వరానుభూతిని పొందగల శక్తిని అందుకుంటుంది.
అపరిగ్ర హము: దేనిపైనా ఆశ లేనివాని మనస్సు అత్యంతశుద్ధంగా ఉంటుంది. అది
ఆత్మప్రాప్తిని, ఈశ్వరానుభూతిని తేలికగా పొందగలుగుతుంది.

శౌచము: సమస్తదోషములనూ కడిగివేసుకున్న యోగి పరిశుద్ధుడై, శుద్ధాత్మను


అందుకుంటాడు.
సంతోషము: రాగద్వేషములతో కూడిన మాయను, దుఃఖమును దాటిన యోగి,
నిత్యానందస్వరూపుడైన ఈశ్వరుని దర్శిస్తాడు.

తపస్సు: తన దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సులను తపింపజేసిన యోగి,


వాటిని శుద్ధపరచుకొని, ఆ తపశ్శక్తి ప్రభావంతో ఈశ్వరసాక్షాత్కారమును పొందుతాడు.
స్వాధ్యాయము: ఆత్మపరిశీలన, మంత్రజపముల సాధనతో యోగి ఆత్మానుభూతిని,
ఈశ్వరానుభూతిని పొందుతాడు.

ఈశ్వరప్ర ణిధానము: శరణాగతి, కర్మఫలత్యాగము, నిరంతరధ్యానములతో యోగి


ఈశ్వరకృపకు పాత్రుడౌతాడు.
ఈ విధంగా యమనియమములలో ప్రతి ఒక్కటీ, యోగికి సూటిగా ఈశ్వరకృపను అందించే
శక్తిని కలిగి యుంటాయి. కానీ, నేటి గురువులచేత ఇవి నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. సాధకులు
కూడా వీటిని వదలిపెట్టి సూటిగా ధ్యానమును అభ్యసిస్తున్నారు. ఇది పెద్ద పొరపాటు.
యమనియమములను సాధించకుండా ధ్యానం సిద్ధించదు. సమాధి లభించదు. అందుకే తన
యోగశాస్త్రంలో మొదటి మెట్లుగా వీటిని పతంజలిమహర్షి ఉంచారు. ఈ విషయమును స్పష్టంగా
అర్థం చేసుకోవాలి.
సూ|| స్థిరసుఖమాసనం || 2.46 ||
స్థిరము, సుఖము అయినది ఆసనం.
ఆసనమునకు ఈ రెండు లక్షణములను మహర్షి చెప్పారు. హఠయోగములో ఉన్న 84
ఆసనములు యోగసూత్రములలో చెప్పబడలేదు. ఆయా ఆసనములు దేహారోగ్యమునకు,
ప్రాణసంయమమునకు ఉపయోగిస్తాయి. మహర్షి యొక్క ఉద్దేశ్యము అవి కాదు. సంప్రజ్ఞాత,
అసంప్రజ్ఞాత సమాధిస్థితులను పొందటమే యోగసూత్రముల పరమోద్దేశ్యం. అందుకోసం
నానారకములైన ఆసనములను అభ్యాసం చేయవలసిన పని లేదు. స్థిరంగా, కదలకుండా,
సుఖంగా, ఎక్కువసేపు కూర్చుండగలిగే ధ్యానాసనములను ఒకటినో రెంటినో అభ్యాసం చేస్తే
చాలు.
అదేవిధంగా, కుండలిని గురించి కూడా యోగసూత్రములలో ఎక్కడా చెప్పబడలేదు. అది
హఠ, తంత్రయోగములకు చెందినట్టి సాధన. ఈ భేదమును చక్కగా అర్థం చేసుకోవాలి.
సూ|| ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం || 2.47 ||
త్నం శి మైతే నం తమైన మా
ప్రయత్నం శిథిలమైతే అనంతమైన సమాపత్తి లభిస్తుంది.
ఆసనంలో కూర్చోడానికి కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు. వారికి కాళ్ళు చేతులు
తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. నడుము, మెడ, కీళ్ళు, నొప్పులు పుడుతూ ఉంటాయి. ఆసనాభ్యాసంలో
ఇది, మొదట్లో ఉండేటటువంటి ప్రయత్నపూర్వకమైన స్థితి. సాధకుడు దీనిని దాటి ఆసనసిద్ధిని
సంపాదించాలి. ఆసనసిద్ధి యంటే, మూడుగంటలపాటు ఒకే ఆసనంలో సుఖంగా కూర్చోగలిగే
స్థితి. ఈ లోపల చాలా కష్టపడవలసి ఉంటుంది. దానినే ప్రయత్నమని అంటారు. ఈ ప్రయత్నం
శిథిలమైతే, అంటే కష్టపడుతూ ఆసనంలో కూర్చునే స్థితిని దాటితే, ప్రయత్నం లేకుండానే స్థిరంగా
సుఖంగా గంటలపాటు యోగి ఒకే ఆసనంలో కూర్చుండగలుగుతాడు. ఈ స్థితిని అందుకుంటే,
అనంతసమాపత్తి లభిస్తుందని మహర్షి అంటున్నారు. అంటే, ఎంతోసేపు సమాధిలో ఉండటానికి
అవసరమైన పునాది ఆసనసిద్ధిలో ఏర్పడుతుంది.
సూ|| తతో ద్వంద్వానభిఘాతః || 2.48 ||
అప్పుడు ద్వంద్వములు బాధించవు.
ఆసనసిద్ధి కలిగితే దేహం తాను చెప్పినట్లు వింటుంది. యోగి అదుపులోకి అతని శరీరం
వస్తుంది. అప్పుడు చలి, వేడి, ఎండ, నీడ, మొదలైన ద్వంద్వములను అతడు దాటిపోతాడు. ఏ
పరిస్థితిలో నైనా, ఎంతసేపైనా ధ్యానాసనంలో కూర్చుని అలాగే ఉండగలుగుతాడు. ఈ స్థితిని
పొందినప్పుడు ఆసనసిద్ధి కలిగినట్లుగా భావించాలి. అంతేగాని, నాలుగైదు ఆసనములను వేసి
‘యోగా’ చేస్తున్నామని అనుకోవడం హాస్యాస్పదం అవుతుంది.
సూ|| తస్మిన్సతి శ్వాసప్రశ్వాసయోర్గతివిచ్ఛేదః ప్రాణాయామః || 2.49 ||
శ్వాస ప్రశ్వాసల గతిని విచ్ఛేదం చేసేది ప్రాణాయామం అవుతుంది.
హఠయోగ గ్రంథములలో ఎన్నో విధములైన ప్రాణాయామములు చెప్పబడినాయి. మహర్షి
వాటినన్నింటినీ వివరించకుండా, సూత్రముల రూపంలో వాటి సాధారణ లక్షణములను మాత్రమే
వివరిస్తున్నారు.
శ్వాస అంటే ఊపిరిని లోనికి పీల్చుకోవడం. ప్రశ్వాస అంటే, పీల్చిన ఊపిరిని వదలిపెట్టి మళ్ళీ
పీల్చుకోవడం. మనం నిరంతరం ఊపిరిని పీల్చుకుంటూ వదులుతూ మళ్ళీ పీల్చుకుంటూ, ఈ
విధంగా పుట్టినక్షణం నుండీ చనిపోయేవరకూ నిరంతరం చేస్తూనే ఉంటాము. మన అదుపు
లేకుండా సాగే ఈ ప్రక్రియ యొక్క లయను లేదా గతిని (తీరును) ఛేదించి, దానిని మన ఇష్టం
వచ్చినట్లుగా నడిపించడమే ప్రాణాయామం యొక్క ముఖ్యమైన లక్షణం.
సూ|| బాహ్యాభ్యంతర స్తంభ వృత్తిర్దేశకాల సంఖ్యాభిః
పరిదృష్టో దీర్ఘసూక్ష్మః || 2.50 ||
బయట, లోపల, స్తంభించడం, దేశకాల సంఖ్యలను బట్టి దీర్ఘ-సూక్ష్మములుగా ఇది
ఉంటుంది.
‘బాహ్యాభ్యంతర స్తంభవృత్తి’ - పీల్చిన ఊపిరిని లోలోపల బిగబట్టి ఉంచడం అభ్యంతర
నే
(అంతః) కుంభకం. వదిలిన ఊపిరిని బయటనే బిగబట్టి ఉంచడం బాహ్యకుంభకం.
‘దేశకాల సంఖ్యాభిః’ - ‘దేశం’ అంటే శరీరంలోని వివిధభాగములు. తంత్రశాస్త్రం వీటిని
ఆధారములని పిలిచింది. అలాగే, యోగచక్రములు కూడా దేహంలో ఉన్నాయి. ఈ ప్రదేశములలో
కుంభకం చెయ్యడం, దేశమనే పదంతో సూచింపబడింది.
‘కాలం’ అంటే, ఏ ప్రదేశంలో ఎంతసేపు కుంభకం చేయాలి? పూరక కుంభక రేచకములు
ఏయే నిష్పత్తులలో ఉండాలి? అన్నటువంటి నియమములు.
అలాగే, ‘సంఖ్య’ అంటే, పూరక కుంభక రేచకములను, వేటిని ఎన్నిసార్లు చెయ్యాలి? అనిన
ప్రక్రియలు.
‘దీర్ఘసూక్ష్మః’ - ప్రాణాయామంలో ముఖ్యమైన సూత్రం ఇది. దీర్ఘమంటే, పూరక రేచకములను
పైపైన చెయ్యకూడదని, లోతుగా దీర్ఘంగా చేయాలని అర్థం. సూక్ష్మమంటే, పూరక రేచకములను
చేసేటప్పుడు శబ్దం రాకుండా సున్నితంగా చేయాలని అర్థం. స్థూలశ్వాసను వదలిపెట్టి
సూక్ష్మశ్వాసను యోగసాధకుడు అందుకోవాలి. ఈ రెండు అంశములే ‘దీర్ఘ-సూక్ష్మ’ అనే
పదములతో సూచింపబడినాయి.
ప్రాణాయామసాధనలో గల ఈ మెలకువలన్నింటినీ సాధకుడు గురుముఖతా గ్రహించి,
సక్రమంగా వాటిని అభ్యసించాలి.
సూ|| బాహ్యాభ్యంతరవిషయాక్షేపీ చతుర్థః || 2.51 ||
బయట, లోపల, అనేవేవీ లేనిది నాలుగవది.
పూరక, కుంభక, రేచకములనేవి ప్రాణాయామంలోని మూడు భాగములు. ఇవి బాహ్యము,
అంతరికము అని రెండు విధములుగా ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా ఈ స్థాయిలోని సాధన
సాగుతుంది. అంటే, పట్టుదలతో వీటిని అభ్యసించాలి. దీనిని మించిన స్థాయి ఇంకొకటి ఉన్నది.
అది ప్రయత్నరహితంగా ఉంటుంది. ఆసనంలో ఎలాగైతే మొదట్లో గట్టి ప్రయత్నం ఉండి,
తరువాత ప్రయత్నం లేకుండా సునాయాసంగా ఆసనం కుదురుతుందో, అదేవిధంగా
ప్రాణాయామంలో కూడా మొదట్లో కొన్నేళ్ళపాటు ప్రయత్నపూర్వకంగా పూరక రేచక
కుంభకములను చేసిన తర్వాత, అప్రయత్నంగా ఊపిరిని కుంభించే స్థాయి కలుగుతుంది. దీనిని
‘కేవల కుంభకం’ అంటారు. అప్పుడు యోగి యొక్క ప్రమేయం లేకుండా అతని దేహంలో
సునాయాసంగా ప్రాణాయామం జరుగుతూ ఉంటుంది. అప్పుడు బాహ్యము, అంతరికము అనే
భేదం సమసిపోతుంది. దానినే ఈ సూత్రం వివరిస్తున్నది.
మనస్సు ఏదైనా ధ్యేయవస్తువు మీద ఏకాగ్రంగా నిలబడిపోయినప్పుడు ఈ కేవలకుంభకం
దానంతట అది జరుగుతుంది. ఆ స్థితిలో పూరక కుంభక రేచకములపైన ప్రత్యేకించి దృష్టిని
పెట్టవలసిన అవసరం ఉండదు.
సూ|| తతః క్షీయతే ప్రకాశావరణం || 2.52 ||
వెలుగు యొక్క ఆవరణం అప్పుడు క్షీణిస్తుంది.
లో నీ చీ
ఆత్మ యొక్క వెలుగు అందరిలోనూ ప్రకాశిస్తున్నది. కానీ ఆ వెలుగును, చీకటి పొరలు కప్పి
ఉన్నాయి. అవే త్రిగుణముల, గత కర్మల, సంస్కారముల ఛాయలు. ఈ పొరలు పలచబడితేగాని
ఆత్మప్రకాశం బయటకు కనిపించదు. వాటి బలం క్షీణించడమనేది, కేవలకుంభకమును
సాధించినప్పుడు మాత్రమే జరుగుతుంది.
సూ|| ధారణాసు చ యోగ్యతా మనసః || 2.53 ||
ధారణకు కావలసిన యోగ్యతను మనస్సు పొందుతుంది.
ప్రాణాయామంలో సిద్ధిని పొంది, కేవలకుంభకమును సాధించినవాడే ‘ధారణ’ ను అభ్యాసం
చేసే సమర్థతను పొందుతాడు. ధారణ తర్వాతి మెట్టు ధ్యానం, దాని పైది సమాధి.
ధారణ అంటే ఏమిటో ముందు సూత్రములలో వివరింపబడింది.
సూ|| స్వ స్వవిషయాసంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవేంద్రియాణాం ప్రత్యాహారః || 2.54 ||
తమ తమ విషయముల నుండి విడిపోయిన ఇంద్రియములు చిత్తస్వరూపమును పొందటమే
ప్రత్యాహారము.
ప్రాణాయామం తర్వాత మెట్టు ప్రత్యాహారం. దానిని ఈ సూత్రం వివరిస్తున్నది.
లోకమును పంచేంద్రియముల ద్వారా మాత్రమే మనం గ్రహించగలుగుతాము. వాటిలో
ఒక్కొక్కదానికి ఒక్కొక్క విషయం ఉంటుంది. ఈ క్రింది పట్టికను చూడండి.

మూలము ఇంద్రియములు విషయములు


చిత్తము కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము దృశ్యము, ధ్వని, వాసన, రుచి, స్పర్శ

ఈ అయిదు ఇంద్రియములు, వాటివాటి విషయముల ద్వారా ప్రపంచమును గ్రహిస్తాయి.


జ్ఞానహీనులైన లోకులకు ఈ అయిదు ఇంద్రియములు వాటి వాటి విషయములలో
తలమునకలుగా కూరుకుపోయి ఉంటాయి. కనుక, వారికి ప్రపంచం తప్ప వేరే విషయం పట్టదు.
ఆ ఇంద్రియానుభవముల కోసం నానా పనులూ చేస్తూ, చెడుకర్మను పోగుచేసుకుంటూ,
రకరకములైన జన్మలు ఎత్తుతూ, జననమరణచక్రంలో అంతులేకుండా వారు తిరుగుతూ
ఉంటారు.
కానీ, యోగియైనవాడు దీనిని దాటాలని, ఇంద్రియముల యొక్క ఊబిలోనుంచి
బయటపడాలని ప్రయత్నిస్తాడు గనుక, అతడు తన ఇంద్రియములను వాటి విషయముల నుండి
వెనుకకు మరలిస్తాడు. అప్పుడవి చిత్తస్వరూపమును పొందుతాయి.
ఇంద్రియములు ఒక స్ఫటికం వంటివి. వాటిముందు ఏ రంగు వస్తువును ఉంచితే అవి ఆ
రంగులో ఉన్నట్లు గోచరిస్తాయి. ఏ రంగునూ ఉంచకపోతే వాటి స్వస్థితియైన గాజురంగులో అవి
ఉంటాయి. ఇంద్రియములకు విషయముల రంగులను తొలగించినప్పుడు, తమకు ఆధారమైన
చిత్తాకారమును అవి ధరిస్తాయి. ఈ ప్రక్రియకే ప్రత్యాహారమని పేరు.
ఉపనిషత్తులలో కూడా ఈ ప్రక్రియ వివరింపబడింది.
తే గో ఠో
‘ఇన్ద్రియాణి హయాన్యాహుః విషయాన్ తేషు గోచరాన్’ - కఠోపనిషత్తు.
‘ఇంద్రియములు గుర్రములు, విషయములు అవి పరుగెత్తే దారులు’ అని దీనర్థం. కన్ను
అనేది ఒక గుర్రం అనుకుంటే, దృశ్యం అనేది అది పరుగెత్తే దారి. పైన వివరించిన విధముగా,
మిగిలిన నాలుగు ఇంద్రియములకు కూడా వాటివాటి దారులుంటాయి. వాటిలో అవి
పరుగెత్తుతూ ఉంటాయి. ఆ గుర్రములను నిగ్రహించి వాటి పరుగును ఆపాలి. దీనిని యోగి
అభ్యసిస్తాడు.
కఠోపనిషత్తు లోనిదే ఇంకొక ప్రసిద్ధశ్లోకం ఇలా అంటుంది.
శ్లో|| పరాన్చిఖాని వ్యతృణత్స్వయంభూః
తస్మాత్పరాన్పశ్యతి నాన్తరాత్మన్
కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్ష
దావృత్త చక్షురమృతత్వమిచ్ఛన్ || 2.1.1 ||
‘స్వయంభువైన సృష్టికర్త, బయటకు చూచేటట్లుగా ఇంద్రియములను ఏర్పరచాడు. అందుకే
అవి బయటకు (ప్రపంచమును) మాత్రమే చూస్తాయిగాని, (తమ) లోనికి చూడవు. ఎక్కడో ఒక
ధీరుడు మాత్రం, అంతరాత్మను చూచి అమృతత్వమును పొందవలెనన్న ఇచ్ఛతో తన కన్నులను
లోనికి త్రిప్పుతాడు’.
ఇక్కడ చెప్పబడిన ‘ఆవృత్తచక్షు (కన్నులను లోనికి త్రిప్పడం)’ అనే ప్రక్రియనే యోగసూత్రములు
ప్రత్యాహారమని పిలిచాయి. కన్నులతో బాటు, మిగతా నాలుగు ఇంద్రియములను కూడా
లోపలివైపు త్రిప్పడం ఈ మాటతో సూచింపబడింది.
ప్రత్యాహారసాధన భగవద్గీతలో ఇలా చెప్పబడింది.
శ్లో|| స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ || (5.27)
శ్లో|| యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః || (5.28)
‘బయట స్పర్శలను బయటనే ఉంచి, దృష్టిని భ్రూమధ్యపు అంతరమున నిలిపి, ముక్కులలో
నడుస్తున్న ప్రాణాపానములను సమంగా చేసి, మనస్సును బుద్ధిని నిగ్రహించి, మోక్షమును
కోరుకుంటూ, ఇచ్ఛ, భయము, క్రోధములను వదలిపెట్టి మౌనంగా ఉండేవాడు ఎల్లప్పుడూ
ముక్తుడే’.
ఈ శ్లోకంలో చెప్పబడిన ‘స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్’ అనే భావం ప్రత్యాహారమునే
సూచిస్తున్నది. అంటే - ‘ఇంద్రియవిషయములలో ఇంద్రియములు మునుగకుండా ఉంచి’,
‘విషయములను విషయములుగా బయటనే ఉంచి’, ‘వాటిని నీ లోనికి తీసుకోకుండా’ - అని
అర్థములు.
బాబాజీ మరియు లాహిరీ మహాశయులు బోధించినట్టి క్రియాయోగమార్గంలో ఇది
ముఖ్యమైనట్టి సాధన.
ప్రత్యాహారమును వివరిస్తూ భగవద్గీత లోనిదే ఇంకొక శ్లోకం ఇలా అంటుంది.
శ్లో|| యదా సంహరతే చాయం కూర్మోంఽగానీవ సర్వశః
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 2.58 ||
‘తన అవయవములను తనలోనికి లాగుకొనే తాబేలులాగా, ఎవడైతే ఇంద్రియవిషయముల
నుండి తన ఇంద్రియములను వెనుకకు లాగుకొంటాడో వాడు ప్రజ్ఞలో ప్రతిష్ఠితుడౌతున్నాడు’
సూ|| తతః పరమా వశ్యతేంద్రియాణాం || 2.55 ||
అప్పుడు ఇంద్రియములపైన అమితమైన అదుపు లభిస్తుంది.
ఇంద్రియములను అయిదింటినీ ఈ విధంగా లోనికి త్రిప్పడం అలవాటైనప్పుడు వాటిపైన
పూర్తి అదుపు యోగికి వచ్చేస్తుంది. అప్పుడు ‘వశ్యతేంద్రియాణాం’ అన్నట్లుగా, ఇంద్రియములన్నీ
యోగికి వశములౌతాయి. ఆ స్థితిలో అవి చెప్పినట్లుగా అతడు పరుగులెత్తడు. అతడు చెప్పినట్లు
అవి వింటాయి.

|| ఇతి పతంజలి విరచితే యోగసూత్రే ద్వితీయః సాధనపాదః ||


ఇది పతంజలిమహర్షి చేత రచింపబడిన యోగసూత్రములలోని సాధనపాదమనబడే రెండవ
అధ్యాయము.
మూడవ అధ్యాయము
(విభూతి పాదము)
సూ|| దేశబంధశ్చిత్తస్య ధారణా || 3.1 ||
దేశమునకు చిత్తమును బంధించడమే ధారణ.
దేశమంటే ఒక ప్రదేశమని అర్థం. ఆసనసిద్ధి వల్ల శరీరం పైన అదుపు యోగికి వస్తుంది.
ప్రాణాయామసాధన వల్ల ప్రాణశక్తి తన చంచలత్వమును విడచి స్థిరమౌతుంది.
ప్రత్యాహారసాధనతో ఇంద్రియములు అదుపులోకి వస్తాయి. అప్పుడు ధారణను అభ్యాసం
చేయాలి. ధారణాసాధనలో చిత్తమును తన బయటగాని, తన లోపలగాని, ఒక ప్రదేశంలో కొన్ని
గంటలపాటు కదలకుండా నిలపడం జరుగుతుంది.
యోగోపనిషత్తులలోను, తంత్రగ్రంథములలోను, ఈ విధములైన బాహ్య, అంతరిక
ధారణావిధానములు అనేకములు వివరించబడినాయి. వాటిని ఆయా గ్రంథముల నుండి
గ్రహించాలి.
సూ|| తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్ || 3.2 ||
ప్రత్యయంతో ఏకం కావడం ధ్యానం.
ధారణలో సిద్ధి కలిగిన తర్వాత ధ్యానమును అభ్యాసం చేయాలి. ‘ధ్యానం’ అనే మెట్టుకు
ముందు ఆరుమెట్లు యోగసాధనా మార్గంలో ఉన్నాయని గ్రహించాలి. అవేవీ ఎక్కకుండా,
సూటిగా ధ్యానమును అభ్యాసం చేయబోవడమే ఈ కాలపు ధ్యానసాధకులు చేస్తున్నట్టి
పొరపాటు. అందుకనే, వ్యాపారగురువులు ఎందఱో ప్రతిచోటా పుట్టుకొస్తున్నప్పటికీ, ధ్యానులు,
జ్ఞానులు, యోగసిద్ధులు మాత్రం ఎక్కడా కనపడటం లేదు.
ప్రత్యయమంటే ధ్యేయవస్తువు. అంటే, దేనినైతే యోగి ధ్యానిస్తున్నాడో అది. ధ్యానులలో
కొందరు దేవతారూపములను ధ్యానిస్తారు. మరికొందరు నిరాకార దైవం పైన మనస్సును
నిలుపుతారు. మరికొందరు ఓంకారోపాసన చేస్తారు. ఎవరు దేనిని ధ్యానించినప్పటికీ, దానితో
తాను ఏకంగా మారిన అనుభూతిని పొందటమే ధ్యానం. అంటే, ధ్యేయంలో యోగి మనస్సు
పూర్తిగా మునిగిపోవాలి. అప్పుడు ధ్యానస్థితి కలుగుతుంది. అంటే, ఎక్కువసేపు
కొనసాగించబడిన ధారణ, ధ్యానంగా మారుతుంది.
పన్నెండు ప్రాణాయామములు ఒక ప్రత్యాహారమని, పన్నెండు ప్రత్యాహారములు ఒక ధారణ
యని, పన్నెండు ధారణలు ఒక ధ్యానమని, పన్నెండు ధ్యానములు ఒక సమాధి యని
యోగోపనిషత్తులలో చెప్పబడింది.
ఉదాహరణకు, ఒక ప్రాణాయామం చెయ్యడానికి 5 నిముషములు పట్టిందని అనుకుందాం.
అలాంటి ప్రాణాయామములను 5 x 12 = 60 నిముషములు అనగా, ఒక గంటపాటు
చే తే దే
చేయగలిగితే అది ఒక ప్రత్యాహారం అవుతుంది. 12 గంటలపాటు అదే ప్రాణాయామమును
ఏకధాటిగా చేయగలిగితే అది ఒక ధారణ అవుతుంది. ఆరు రోజులపాటు రాత్రింబగళ్ళు అదే
స్థితిలో ఉంటే అది ఒక ధ్యానం అవుతుంది. 72 రోజులపాటు (రెండునెలలా పన్నెండు
రోజులపాటు) అదే స్థితిలో ఏకబిగిన ఉండగలిగితే అది ఒక సమాధిస్థితి అవుతుంది.
కనుక ‘ధ్యానము’, ‘సమాధి’ అనేవి ఆషామాషీపనులు కావని, కాసేపు కళ్ళుమూసుకుని లేచి
‘నేను ధ్యానం చేశాను’ అంటే అది హాస్యాస్పదం అవుతుందని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
చాలామంది యోగసాధకులు ధ్యానసాధకులు, ప్రత్యాహారమును కూడా అందుకోలేరు. కానీ,
అహంకారంతో తమను తాము ‘ధ్యానులు’ గా భావించుకుంటూ మోసపోతూ ఉంటారు.
సరియైన గురువు లభించకపోవడం, లభించినా ఆయనతో వీరు నిలబడలేకపోవడం,
త్రికరణశుద్ధి లేకపోవడం, సాధనలో స్పష్టత లేకపోవడం, క్రింది మెట్లను వదలిపెట్టి పై మెట్లను
త్వరగా అందుకోవాలన్న దురాశలే ఈ అవస్థలకు కారణములు.
ఇక్కడ ఒక సందేహం రావచ్చు. ధ్యేయవస్తువులో లీనం కావడమే ధ్యానమైతే, లోకంలో
ప్రతివారి మనసూ ధ్యానంలో ఉన్నట్లే కదా ! అలాంటప్పుడు, మనం రోజూ చేస్తున్నది ధ్యానం
కాకపోతే మరేమిటి? మనం ప్రతిరోజూ ఎన్నో లౌకిక విషయముల పైన ధ్యానం చేస్తూ ఉంటాం.
లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ఉంటాం. రాత్రింబగళ్ళూ ఎన్నో ఆలోచిస్తూ వాటిల్లో
తలమునకలుగా ఉంటాం. ఇది ధ్యానం కాదా మరి? అలాంటప్పుడు అందరూ యోగులూ
ధ్యానులూ అవుతారా?
పైపైన చూస్తే, ఈ సందేహం నిజమే అనిపిస్తుంది. కానీ దీనిలో సూక్ష్మమైన తేడాలున్నాయి.
సామాన్యమానవుని మనస్సు, ఇంద్రియముల నుంచి, ప్రపంచం నుంచి, తనకు లభించే
సుఖంమీదా లాభంమీదా ధ్యానిస్తూ ఉంటుంది. వాటిపైన అతనికి స్వార్థపూరితమైన ఆశ
ఉంటుంది. ఏ ఉద్దేశ్యమూ లేకుండా అతడు ఒక విషయంమీద మనస్సును పెట్టడు. పైగా అతని
కోరికలు మరియు ద్వేషముల మీద అతనికి అదుపు ఉండదు. ఇంద్రియవిషయముల నుండి
తను అనుకున్నప్పుడు తన మనస్సును వెనుకకు తీసుకోలేడు. అవి తనను వదలిపోయినప్పుడు,
లేదా లభించనప్పుడు, చాలా క్రుంగిపోతాడు.
దీనికి విరుద్ధంగా, ఒక యోగి, తను అనుకున్న విషయం మీద తన మనస్సును
కేంద్రీకరించగలుగుతాడు. దానినుంచి అతను ఏ సుఖమునూ లాభమునూ ఆశించడు. అది
ఉన్నదున్నట్లుగా దానితో మమేకం కావడమే అతని ఉద్దేశ్యం కాని, దానినుంచి పొందే సుఖమూ
లాభమూ కావు. అదీగాక తన మనసుమీదా ఈ మొత్తం ప్రక్రియ మీదా అతనికి పూర్తి అదుపు
ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక వస్తువునుంచి గాని, ఒక మనిషినుంచి గాని తన
మనసును పూర్తిగా వెనుకకు తీసుకోగలుగుతాడు. అవి తనకు లభించకపోయినా, తననుంచి
దూరమైనా అతడు ఏమీ బాధకు లోను కాడు.
మామూలు మనుషుల ధ్యానం, స్వార్థంపైన ఆధారపడి ఉంటుంది. వారు విడిగా ఉంటూ
సుఖాన్ని లాభాన్ని కోరుకుంటారు. ఒక యోగి చేసే ధ్యానం అలా ఉండదు. అతడా వస్తువుతో,

తో తో ఏ నీ ఏమీ దే కీ భే
భావంతో, వ్యక్తితో ఏకమౌతాడు. కానీ దానినుంచి ఏమీ ఆశించడు. అదే ఈ రెంటికీ ఉన్న భేదం.
సూ|| తదేవార్థమాత్రనిర్భాసం స్వరూపశూన్యమివ సమాధిః || 3.3 ||
దాని అర్థము మాత్రమే వెలుగుతూ, స్వరూపం శూన్యమైతే, సమాధి.
ధ్యేయవస్తువు యొక్క స్వరూపం శూన్యమై, దానియొక్క అర్థము మాత్రమే ధ్యానంలో
వెలుగుతూ ఉన్నపుడు అది సమాధి అవుతుందని మహర్షి బోధిస్తున్నారు. ఉదాహరణకు, ఒక
యోగి ఒక దేవతను ధ్యానిస్తున్నాడని అనుకుందాం. అతని మనస్సు ఆ దేవతాస్వరూపం పైన
స్థిరంగా నిలబడి, ఇతర ఆలోచనలు ఏవీ అతని మనస్సును తాకలేని స్థితి కలిగితే అది ధారణ. ఆ
దేవతారూపంలో అతని మనస్సు పూర్తిగా లగ్నమై కొన్ని గంటలపాటు అదే స్థితిలో నిలచి ఉంటే
అది ధ్యానం. ఆ దేవత యొక్క రూపం మాయమైపోయి, దేవతాశక్తి మాత్రమే ధ్యానంలో
నిశ్చలంగా వెలుగుతూ ఉంటే అది సమాధి.
సూ|| త్రయమేకత్ర సంయమః || 3.4 ||
మూడింటినీ కలిపితే సంయమం.
ధారణ, ధ్యానము, సమాధి - ఈ మూడూ కలిస్తే దానిని ‘సంయమం’ అంటారు. ఇది యోగి
చేతిలో ఉన్నట్టి అద్భుతమైన శక్తి. యోగి యొక్క ఆయుధం సంయమమే. ఈ
సంయమప్రభావంతోనే అతడు అనేక ఊహాతీతములైన పనులను చేయగలుగుతాడు. అనేక
దివ్యశక్తులు ఈ సంయమప్రభావంతోనే అతనికి లభిస్తాయి.
యోగసాధనలో మొదటి మెట్టు యమము. చివరి మెట్టు సంయమము. కనుక యోగసాధన
అంటే, యమం నుంచి సంయమమునకు ప్రయాణమని చక్కని నిర్వచనమును ఇవ్వవచ్చు.
సూ|| తజ్జయాత్ప్రజ్ఞాలోకః || 3.5 ||
దానిని సాధిస్తే ప్రజ్ఞయొక్క వెలుగును దర్శిస్తాడు.
సంయమమును సాధించిన యోగికి లోకమంతా కాంతితో నిండియున్నట్లుగా కనిపిస్తుంది.
శ్రీరామకృష్ణుల సాధనాదశలో ఆయనకు ఈ దర్శనం కలిగింది. లోకమంతా తెల్లని కరిగిన
వెండివంటి కాంతితో వెలుగుతున్నట్లుగా ఆయన దర్శించేవారు. సంయమం సిద్ధించినదనడానికి
ఇదొక నిదర్శనం.
సంయమమును సాధించినప్పుడు - స్థూలదృష్టికి లోకం కాంతితో నిండియున్నట్లు
కనిపించడమే కాకుండా, సూక్ష్మములైనట్టి కాంతిలోకములను, భౌతికలోకపు పొరల లోపల
దాగియున్నట్టి సూక్ష్మలోకములను, ఆయాలోకములలో ఉన్న దేవతలను, అప్పుడా యోగి
దర్శించగలుగుతాడు. ప్రజ్ఞాబలం వల్ల ఎంతటి సూక్ష్మమైన విషయమునైనా సునాయాసంగా
అర్థం చేసుకోగలుగుతాడు.
సూ|| తస్య భూమిషు వినియోగః || 3.6 ||
దానిని భూములలో ఉపయోగించాలి.

నే లో లో
‘భూమి’ అనే పదమునకు ఈ సందర్భంలో విస్తృతములైన అర్థములున్నాయి. వాటిలో
‘భూమిక’ యన్నది స్థూలమైన అర్థము. అంటే, ‘స్థాయి’ అన్నమాట.
ఒక విషయమును - అది బాహ్యమైనదైనా, అంతరికమైనదైనా, స్థూలమైనదైనా,
సూక్ష్మమైనదైనా, ఇంద్రియములకు లోబడినదైనా, వాటికి అతీతమైనదైనా - మనం
దర్శించడానికి, గ్రహించడానికి - మూడే దారులుంటాయి. అవి - దృశ్యము, దృక్చేష్ట, ద్రష్ట.
సులభమైన మాటలలో చెప్పాలంటే - చూడబడే వస్తువు, చూచే ప్రక్రియ, చూచేవాడు - అని
మూడుంటాయి. ఈ మూడూ ఉన్నపుడే చూడబడేదాని జ్ఞానం చూచేవాడికి కలుగుతుంది.
‘చూడటం’ అనే మాటలో మిగిలిన నాలుగు ఇంద్రియములు కూడా ఇమిడి యున్నాయి. అంటే,
వినడం, వాసనను తెలుసుకోవడం, రుచిని గ్రహించడం, స్పర్శించడం.
సంయమమును (ధారణ, ధ్యానము, సమాధి ఈ మూడింటినీ) సిద్ధింపజేసుకున్నట్టి యోగి -
దృశ్యము, దృక్చేష్ట, ద్రష్ట - అనబడే ఈ మూడు స్థాయిలలో దేనిపైన తన సంయమశక్తిని
కేంద్రీకరిస్తాడో, అది అతనికి వశమైపోతుంది, పూర్తిగా అర్థమైపోతుంది, తన రహస్యమునంతా
అవగతం చేస్తుంది, సిద్ధిస్తుంది. దీనినే యోగశక్తి అని అంటాము.
సంయమమే యోగి యొక్క శక్తి. అదే అతని చేతిలోనున్న అమోఘమైన ఆయుధం.
సూ|| త్రయమంతరంగం పూర్వేభ్యః || 3.7 ||
ముందటివాటికి ఈ మూడూ అంతరంగములు.
ఏ ముందటి వాటికి? యోగాంగములైన ఎనిమిది మెట్లలో బాహ్యములైన మెట్లు,
అంతరికములైన మెట్లు అని విభాగం ఉన్నది.
యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము - ఈ ఐదూ
బయటిమెట్లు, అంటే, ముందటివి. ధారణ, ధ్యానము, సమాధి - ఈ మూడూ లోపలిమెట్లు, అంటే,
తరువాతవి. ఆత్మస్థితి అనే బిందువుకు చుట్టూ ఎనిమిది ఆవరణలు ఉన్నాయని భావిస్తే, మొదటి
అయిదూ బయటి ఆవరణలు, చివరి మూడూ లోపలి ఆవరణలని, బిందువుగా ఆత్మ ఉన్నదని
అర్థం చేసుకోవాలి.
యోగసూత్రముల కాలమునకు దాదాపుగా వెయ్యి సంవత్సరముల తర్వాత వచ్చిన
తంత్రములలోని, వివిధ దేవతాయంత్రములకు ఈ భావనయే ఆధారం అనుకోవచ్చు.
సూ|| తదపి బహిరంగం నిర్బీజస్య || 3.8 ||
ఇవి కూడా నిర్బీజమునకు బహిరంగములే.
కానీ - ధారణ, ధ్యానము, సమాధి - అనబడే మూడు లోపలి ఆవరణలు కూడా,
నిర్బీజసమాధి అనబడే దానికి బాహ్యములే. అంటే, బయటి ఆవరణలే. నిర్బీజ సమాధి ఈ
మూడింటికి కూడా అతీతమైనది.
బీజములంటే సంస్కారములని ముందు వివరించాను. నిర్బీజసమాధి యంటే, ఏ
సమాధిలోనైతే సంస్కారనాశనం జరుగుతుందో ఆ స్థితి. అది ఆత్మస్థితి మాత్రమే.
న్నీ తో తీ
సంస్కారములన్నీ త్రిగుణములతో నిండి యుంటాయి. ఆత్మ త్రిగుణములకు అతీతమైనది. కనుక,
ఆత్మస్థితిని అందుకున్నవాడికే సంస్కారనాశనం జరుగుతుంది. వాడే గుణాతీతుడని,
జీవన్ముక్తుడని అనబడతాడు. అతడికి ధారణ, ధ్యానము, సమాధులు కూడా
బయటివిషయములుగానే కనిపిస్తాయి.
సంస్కారనిరోధం - విధానం
సూ|| వ్యుత్థాన నిరోధ సంస్కారయో రభిభవ ప్రాదుర్భావౌ నిరోధ క్షణ చిత్తాన్వయో నిరోధ
పరిణామః || 3.9 ||
సంస్కారములు లేవడము, నిరోధింపబడటము, మళ్ళీ లేవడము, అణగిపోవడము - ఒక్క
క్షణంపాటు అన్నీ అణగిపోవడము - ఈ విధంగా నిరోధం సాగుతుంది.
మనస్సు లోతులలో ఉన్న సంస్కారములు (పోకడలు) క్షణంలో నిద్రలేచి మనస్సును
ఆక్రమించి మనచేత ఆయా పనులను చేయిస్తూ ఉంటాయి. వాటిని గమనించిన యోగి
సంయమబలంతో వాటి శక్తిని నిర్వీర్యం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అవి మాటమాటకూ
తలలెత్తడము, వాటిని అణచివెయ్యడము, అతని మనస్సు లోలోపల జరుగుతూ ఉంటుంది. అవి
ఆవిధంగా అణగద్రొక్కబడినప్పుడు యోగికి తన లోలోపల ఒక విధమైనట్టి ప్రశాంతస్థితి
అనుభవమౌతూ ఉంటుంది.
సూ|| తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్ || 3.10 ||
దానినుంచి ప్రశాంతమైన సంస్కారవాహిని కలుగుతుంది.
రాత్రీ పగలూ అనిన భేదం లేకుండా, నిరంతరం ఈ విధమైన సాధనను కొన్ని ఏళ్ళపాటు
కొనసాగిస్తే, అప్పుడు ఆ ప్రశాంతస్థితియే ఒక బలమైన సంస్కారంగా మారుతుంది. అప్పుడది
మనస్సు లోతులలో ఉన్నట్టి జన్మజన్మల సంస్కారములకు ధీటుగా నిలబడగలుగుతుంది. చిత్తము
లోతులలోని సంస్కారములు ఎంత బలంతో ఉన్నాయో, ఈ ప్రశాంతస్థితిని కూడా అంతే బలంతో
తనలో ఏర్పరచుకునే సాధనను యోగి అభ్యసించాలి. చిత్తం లోతులలో ఉన్నట్టి సంస్కారముల
తీవ్రతను, బలమును బట్టి ఈ సాధన కొన్ని ఏళ్ళనుంచి, కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు.
సూ|| సర్వార్థతైకాగ్రతయోః క్షయోదయౌ చిత్తస్య సమాధిపరిణామః || 3.11 ||
అన్ని అర్థముల క్షయోదయములలో ఏకాగ్రత లభించినప్పుడు, చిత్తం సమాధిలో
పరిణమిస్తుంది.
ఈ విధముగా, మనస్సు లోతులలోని సమస్తసంస్కారములు - వాటి తలలనెత్తడము,
అణగిపోవడము - ఈ ప్రక్రియనంతా ఏకాగ్రముగా గమనిస్తున్న మనస్సు చివరకు సమాధిగా
మారుతుంది.
సూ|| శాంతోదితౌ తుల్యప్రత్యయౌ చిత్తస్యైకాగ్రతాపరిణామః || 3.12 ||
సంస్కారములు ఉదయించడం (తలలెత్తడం), శాంతించడం (అణగిపోవడం) - ఈ
క్రి ఎం త లోతు టే త లోతు టి మ చ ను
ప్రక్రియ ఎంత లోతుగా ఉంటే, అంత లోతుగా వాటిని గమనించడం కూడా ఉంటుంది గనుక,
ఈ క్రమంలో యోగి యొక్క మనస్సు ఏకాగ్రతను పొందుతుంది.
సూ|| ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థాపరిణామా వ్యాఖ్యాతాః || 3.13 ||
దానివల్ల, భూతములకు ఇంద్రియములకు అవుతున్న ధర్మలక్షణముల అవస్థాపరిణామం
అవగతమౌతుంది.
ఏకాగ్రతాపూర్వకమైన ఈ అంతరిక పరిశీలన వల్ల - తనయొక్క పంచేంద్రియములకు,
జగత్తులో ఉన్న పంచభూతములకు ఏ విధంగా లావాదేవీలు జరుగుతున్నాయి? ఆ క్రమంలో
తనయొక్క ఇంద్రియముల స్వభావము (ధర్మము) మరియు అవస్థ (స్థితి) ఏ విధంగా ఏయే
మార్పులకు లోనౌతున్నది? అన్న మొత్తం ప్రక్రియ అంతా యోగికి క్షుణ్ణంగా అర్థమౌతుంది.
సూ|| శాంతోదితావ్యపదేశ్యధర్మానుపాతీ ధర్మీ || 3.14 ||
శాంతము, లేచినది, దాగినది - ఈ ధర్మములను బట్టి ధర్మి ఉంటుంది.
ధర్మములంటే, ఇంద్రియములు పంచభూతములతో జరిపే చర్యలవల్ల, వాటికి కలిగే
మార్పులు లేదా స్థితులు. ఇవి మూడు విధములుగా ఉంటాయి.
ఉదిత - లేచిన స్థితి. అంటే, జగత్తులో ఉన్న పంచభూతముల ప్రభావమునకు లోనై, తనలో
నిద్రాణంగా ఉన్నట్టి సంస్కారములు ఎప్పుడు ఏ విధంగా నిద్ర లేస్తున్నాయో యోగికి
అర్థమౌతుంది.
శాంత - ఆ సంస్కారములు ఎప్పుడు ఎలా శాంతిస్తున్నాయో తెలుస్తుంది.
అవ్యపదేశ్య - అణగిపోయి మళ్ళీ మనస్సు లోతులకు చేరిపోవడం. శాంతించిన
సంస్కారములు, ఏ విధంగా మళ్ళీ తమతమ చోట్లకు చేరుకొని నిద్రాస్థితిలోకి ఎలా పోతున్నాయో
అర్థమౌతుంది.
ధర్మి అంటే ధర్మములను ధరించేది, ఈ మార్పులన్నీ దేనిలో జరుగుతున్నాయో, మార్పులను
ఏదైతే అనుభవిస్తూ వాటి ఆకారమును, స్థితిని పొందుతున్నదో అది ఆత్మ. బుద్ధుడు దీనిని
మనస్సన్నాడు. యోగసాంప్రదాయం దీనిని ‘ఆత్మ’ అన్నది. ఈ ధర్మములను బట్టి ధర్మి ఉంటుంది.
ఒక ఉదాహరణతో తేలికగా అర్థమౌతుంది.
ఇంద్రియములలో కలిగే మార్పులన్నీ అనేక రంగుల నీళ్ళని, ఆత్మ అన్నది ఒక గాజు
పాత్రయని అనుకుంటే, ఆ పాత్రలో ఏ రంగు నీటిని పోస్తే ఆ రంగును పాత్ర ధరిస్తుంది. కానీ
నిజమునకు గాజుపాత్రకు రంగు లేదు. అలాగే, ఇంద్రియములకు కలిగే మార్పులు ఆత్మపైన
అద్దబడి ఆత్మకూడా అలా మారినట్లు అగుపిస్తుంది. కానీ నిజమునకు ఆత్మకు ఏ వికారమూ లేదు.
ధర్మములను బట్టి ధర్మి ఉంటుంది అంటే అర్థం ఇదే.
సూ|| క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః || 3.15 ||
క్రమముగా అన్యత్వపరిణామమే అన్యతకు హేతువు.

లో తో తో తో
ఆత్మ యన్నది తనలో తానుండకుండా, త్రిగుణములతో, అహంభావనతో, మనస్సుతో,
ఇంద్రియములతో మమేకమౌతూ పరిణామం చెందుతూ పోవడమే, తన స్వస్థితి నుండి జారి,
తాను మరొకటిగా మారినట్లు అనుకోవడానికి కారణం. అంటే, పురుషుడు ప్రకృతితో ఒక్కటి
కావడం. ఇదే బంధమునకు మూలకారణం.
సంయమములు - సిద్ధులు
యోగసాధనాక్రమంలో అనేక సిద్ధులు, మానవాతీతశక్తులు, యోగికి కలగడం సహజం.
వీటన్నిటికీ వెనుకనున్న రహస్యం సంయమమే. ఏయే విషయముల పైన సంయమం గావిస్తే
ఏయే శక్తులు లభిస్తాయో మహర్షి ఈ సూత్రములలో వివరిస్తున్నారు.
సూ|| పరిణామత్రయ సంయమాద్ అతీతానాగతజ్ఞానం || 3.16 ||
ఈ మూడు పరిణామములపైన సంయమం చేస్తే త్రికాలజ్ఞానం లభిస్తుంది.
శాంత, ఉదిత, అవ్యపదేశ్య - అనే మూడు పరిణామములపైన సంయమమును (ధారణ,
ధ్యాన, సమాధులను) ప్రయోగిస్తే జరిగినది, జరుగుతున్నది, జరుగబోయేది - ఈ మూడు స్థితులూ
గోచరిస్తాయి.
కాలమునకు మూడు విభాగములున్నాయి. అవి - భూత (గడచిపోయినది), వర్తమాన
(జరుగుతున్నది), భవిష్యత్ (జరుగబోయేది). నిజమునకు కాలంలో ఎట్టి విభజనా లేదు. కాలం
ఒక్కటే. మన మనస్సులోని సంస్కారముల స్థితిని బట్టి ఈ విభజన ఏర్పడుతుంది. తన
మనస్సులోని శాంత (గతం), ఉదిత (వర్తమానం), అవ్యపదేశ్య (భవిష్యత్తు) అనే మూడు
సంస్కారముల స్థితులపైన సంయమశక్తిని ఉపయోగించినప్పుడు, ఈ మూడూ యోగికి స్పష్టంగా
అర్థమౌతాయి. అంటే, గతజన్మలు, ఇప్పుడు జరుగుతున్న జన్మతీరు, భవిష్యత్తులో ఏయే జన్మలు
తనకు కలుగుతాయి? అనిన విషయములన్నీ అతనికి తెలుస్తాయి.
సంస్కారముల వల్లనే జన్మలు కలుగుతాయి, కాలంలోని త్రికాలములూ వాటివల్లనే
కలుగుతాయి గనుక, సంస్కారముల పరిశీలనను బట్టి జన్మలన్నీ అర్థమౌతాయి.
సూ|| శబ్దార్థ ప్రత్యయానా మితరేతరాధ్యాసాత్ సంకర స్తత్ప్రవిభాగ సంయమా త్సర్వభూత
రుతజ్ఞానం || 3.17 ||
శబ్దము, అర్థము, ప్రత్యయము ఈ మూడూ ఒకదానితో మరొకటి సంకరమై ఉంటాయి. వీటి
విభాగములపైన సంయమం చేస్తే, అన్నిజీవుల భాషలూ అర్థమౌతాయి.
సృష్టిలో ప్రతిజీవికీ ఒక భాష ఉన్నది. మానవజాతికి మాత్రమే భాష తెలుసు, మిగతా
ప్రాణులకు భాష లేదని అనుకోవడం చాలా తప్పు. ఆయా ప్రాణుల భాషలను అర్థం
చేసుకోలేకపోవడం మానవుల అశక్తత. దానికి కారణం శబ్దార్థప్రత్యయ జ్ఞానం లేకపోవడం.
మనిషి ఒక చెట్టును చూస్తాడు. అది ప్రత్యయం, అంటే ఒక వస్తువు లేదా ఇంద్రియములకు
ఒక ఆధారం. ‘చెట్టు’ అనిన శబ్దం అతని నోటివెంట వస్తుంది. అది శబ్దం. ఆ శబ్దమునకు ఒక

లో చో లో వీ లో
అర్థం ఉంటుంది. కనుక, సృష్టిలో ప్రతిచోటా, ప్రతివిషయంలోనూ ఈ మూడూ ఉంటాయి. వీటిలో
ఏ ఒక్కటి లోపించినా, ఆ వస్తువు యొక్క జ్ఞానం అతనికి కలుగదు.
మామూలు మనుషులలో ఈ మూడూ కలగలసి పోయి ఉంటాయి. అంటే, వీటిని విడివిడిగా
చూడటం వారికి సాధ్యం కాదు. దానికి కారణం, వారికున్న తొందరపాటు. ఆ వస్తువును
అనుభవించాలి, తన సొంతం చేసుకోవాలి అనిన స్వార్థమూ, ఆ క్రమంలో తలలెత్తే కామక్రోధాది
షడ్వర్గములూ వారిని ఊపిపారేస్తూ ఉండటం వల్ల, ఈ మూడింటిని విడివిడిగా చూడటము,
వాటిమధ్యన గల సంబంధమును చక్కగా అర్థం చేసుకోవడం వీరివల్ల కాదు.
యోగికున్నట్టి సంయమశక్తి వల్ల, ఈ మూడింటినీ అతడు విడివిడిగా చూడగలుగుతాడు.
అటువంటి సూక్ష్మదృష్టి వల్ల - శబ్దము, దాని అర్థము, అది ఏ వస్తువును లేదా ఏ స్థితిని
సూచిస్తున్నది? - అనిన మూడు జ్ఞానములూ అతనికి కలుగుతాయి. జగత్తులో ఏ జీవియైనా
శబ్దం చేస్తుంది. దానికొక అర్థముంటుంది. ఆ అర్థమునకొక ప్రత్యయముంటుంది. ఈ మూటినీ
చక్కగా అర్థం చేసుకోవడం వల్ల అన్ని జీవుల అరుపులూ, వాటి అర్థములూ అతనికి
తెలిసిపోతాయి. జంతువులు, పక్షులు, ఇతరజీవుల భాష ఈ విధంగా యోగికి అర్థమౌతుంది.
శ్రీరామకృష్ణుల సాధనాదశలో వారికి ఈ శక్తి లభించింది. పంచవటిలో ఉన్న రకరకములైన
పక్షులు, జంతువులు, క్రిమికీటకముల భాషలన్నీ ఆయనకు అర్థమయ్యేవి. అవి ఏమేమి
మాట్లాడుకుంటున్నాయో ఆయన గ్రహించేవారు.
సూ|| సంస్కారసాక్షాత్కరణా త్పూర్వజాతిజ్ఞానం || 3.18 ||
సంస్కారములను సాక్షాత్కరించుకుంటే గతజన్మలు గుర్తుకు వస్తాయి.
గతజన్మలను గుర్తు చేసుకోవడం చాలా తేలిక. అదేదో పెద్ద కష్టమైన విషయమని అందరూ
అనుకుంటారు. ఈ నమ్మకం నిజం కాదు. యోగసాధనలో ఇది చాలా చిన్నపాటి సిద్ధి.
చిత్తంలో ఉన్న సంస్కారములపైన సంయమం చేస్తే (ధారణా, ధ్యాన, సమాధులను
ప్రయోగిస్తే) వాటి వ్యవహారమంతా స్పష్టంగా కనిపిస్తుంది. సంస్కారములను బట్టి జన్మలుంటాయి
గనుక, అవి అర్థమైతే, ఇవి కూడా అర్థమౌతాయి. దీనిలోని రహస్యం ఇంతే!
సూ|| ప్రత్యయస్య పరచిత్తజ్ఞానం || 3.19 ||
ప్రత్యయములపైన సంయమం చేస్తే, ఇతరుల చిత్తం అర్థమవుతుంది.
ప్రత్యయములంటే ఇంద్రియములకు, మనస్సుకు ఉన్నట్టి ఆధారములు. దేనిపైన
ఇంద్రియములు నిలబడితే ఏ మార్పు వాటిలో కలుగుతున్నది? దేనిపైన ఆలోచన కలిగితే ఏ
మార్పు మనసులో, దేహంలో, కలుగుతున్నది? అంటూ సంయమం చేస్తే, ‘మనస్సు యొక్క
తత్త్వం’ అర్థమైపోతుంది. అది తెలిసినప్పుడు, ఇతరుల మనసులో ఏమి జరుగుతున్నదనిన
విషయం తేలికగా అర్థమౌతుంది. దీనినే ‘పరచిత్తజ్ఞానం’ అంటారు.
సూ|| న చ తత్సాలంబనం తస్యావిషయీభూతత్వాత్ || 3.20 ||
కానీ వాటి ఆలంబనములపైన చెయ్యరాదు. అక్కడ విషయం లేనందువల్ల.
లే
బాహ్యవిషయములు, వస్తువులే, ఇంద్రియములు, మనస్సులకున్నట్టి ఆలంబనములు.
వాటిపైన సంయమం చెయ్యకూడదు. ఎందుకంటే, అవన్నీ జడప్రకృతిలోనివి. వాటికంటూ ఒక
ఆత్మలేదు. వాటికి జీవమూ లేదు. అవి జడపదార్థములు గనుక వాటిపైన సంయమం చేస్తే ఏమీ
ఉపయోగం ఉండదు. వాటివల్ల మనసులో ఎటువంటి ప్రతిచర్య జరుగుతుందో, దానిపైన
సంయమం చెయ్యాలి. అప్పుడు, ‘ఏయే సందర్భములలో మానవమనస్సు ఎలా పనిచేస్తుంది?’
అనిన విషయం అర్థమౌతుంది. మనస్సనేది ఎవరిలోనైనా ఒక్కటే గనుక, ప్రకృతి విషయములు
ఎదురైనప్పుడు మనస్సులు స్పందించే తీరులు యోగికి అర్థములౌతాయి.
సూ|| కాయరూప సంయమాత్తద్గ్రాహ్యశక్తి స్తంభే చక్షుః ప్రకాశాసంప్రయోగేఽన్తర్ధానం || 3.21 ||
కాయరూపం మీద సంయమం చేయడంవల్ల, దాని గ్రాహ్యశక్తి స్తంభిస్తుంది. అప్పుడు
కన్నుకు, వెలుగుకు మధ్యన సంబంధం తెగిపోతుంది. దానివల్ల మాయమయ్యే శక్తి లభిస్తుంది.
ఒక వస్తువుగాని మనిషిగాని మనకు కనిపించాలంటే మూడు విషయములుంటాయి. ఒకటి
- ఆ వస్తువు లేదా మనిషి. రెండు - సరిపోయినంత వెలుగు. మూడు - దానిని చూచే స్థితిలో
ఉన్నట్టి కన్ను. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లోపించినా, అది మన ఎదురుగా ఉన్నప్పటికీ, మనకు
కనిపించదు. ఈ మూడింటినీ కలిపి ‘త్రిపుటి’ అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఈ మూడు విషయములపైనా సంయమం చేయగలిగిన యోగికి వీటిమీద అదుపు వస్తుంది.
అప్పుడు తన దేహంపైన పడుతూ, దానిని ఎదుటివారికి కనిపించేలా చేస్తున్న వెలుగును అతడు
స్తంభింపచేయగలుగుతాడు. త్రిపుటిలోని ఒక సంబంధం తెగిపోయినందువల్ల, అతడు
అకస్మాత్తుగా మాయమైనట్లు ఎదుటివారికి అనిపిస్తుంది. కానీ అతడు ఎక్కడికీ పోడు.
ఎదురుగానే ఉంటాడు, కానీ చూచేవారికి కనిపించడు. దీనినే ‘అంతర్ధానశక్తి’ అంటారు.
సూ|| ఏతేన శబ్దాద్యంతర్ధాన ముక్తమ్ || 3.22 ||
ఇదే విధంగా శబ్దము మొదలైనవి కూడా మాయమవుతాయి.
కన్ను చూడగలిగే దృశ్యము గురించి పై సూత్రం వివరించింది. ఇదే శక్తిని మిగతా
ఇంద్రియములపైన కూడా ప్రయోగించినపుడు - శబ్దము, వాసన, రుచి, స్పర్శ - అనేవి కూడా
మాయమయ్యేటట్లు యోగి చేయగలుగుతాడు.
సూ|| సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమా దపరాంతజ్ఞాన మరిష్టేభ్యో వా || 3.23 ||
కర్మ అనేది వెంటనే ఫలితాన్నివ్వవచ్చు, లేదా ఆలస్యంగా ఇవ్వవచ్చు. ఈ భేదములమీద
సంయమం చేస్తే, మరణజ్ఞానము కలుగుతుంది. లేదా అరిష్టముల పైన సంయమం చేసినా
కలుగుతుంది.
మనిషి ఆయుస్సు అతని కర్మపైన ఆధారపడి ఉంటుంది. ‘సంచితకర్మలో నుంచి ఈ జన్మలో
ఎంత కర్మ పక్వమునకు వస్తుంది?’ అన్నది ముందే నిర్ణయింపబడి ఉంటుంది.
సామాన్యమానవులలో ఇది తిరుగులేని నియమంగా ఉంటుంది. శక్తిపరులైన యోగులు మాత్రం -
సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలను అటూ ఇటూ మార్చడం ద్వారా జీవనపరిమితిని

కో లో
మార్చుకోగలుగుతారు. మామూలు మనుషులలో ఈ శక్తి ఉండదు.
ఈ జన్మలో మనం ఎంత కర్మను అనుభవిస్తాము అనిన దానిని బట్టి మన ఆయుస్సు
ఉంటుంది. కర్మానుభవం అనేది మనకున్న సంస్కారముల మూటను బట్టి, సంస్కారముల
బలాబలములను బట్టి ఉంటుంది. కొన్ని సంస్కారములు (కర్మలు) వెంటనే ఫలిస్తాయి, మరికొన్ని
ఫలించడానికి సమయం తీసుకుంటాయి. సూక్ష్మములైన ఈ భేదములపైన సంయమం
చేయగలిగిన యోగికి - ‘తన ఆయుస్సు ఇంకా ఎంత మిగిలి ఉన్నది? తానెప్పుడు చనిపోతాను?
ఏ ఏ పరిస్థితులలో చనిపోతాను?’ మొదలైన రహస్యములన్నీ తెలిసిపోతాయి.
లేదా, ఈ జ్ఞానం పొందటానికి ఇంకొక మార్గం కూడా ఉన్నది. అదే, అరిష్టములపైన
సంయమం చేయడం. అరిష్టములనే చెడుశకునములని అంటారు. శకునశాస్త్రం మూఢనమ్మకం
కాదు. అది పూర్తిగా శాస్త్రీయమైనదే. ప్రకృతిలోని జీవులు విడివిడిగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ,
అన్నీ కూడా ప్రకృతి మీదనే ఆధారపడి ఉంటున్నాయి. కనుక ఒకజీవిలోని మార్పు మరొక జీవిని
తప్పకుండా ప్రభావితం చేస్తుంది. ప్రకృతిలో జరుగబోయే మార్పులను పశుపక్ష్యాదులు
ముందుగానే పసిగడతాయి. భూకంపం గాని తుఫానులు గాని రాబోయే ముందుగా అవి
విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అడవిలో బ్రతికే ఆటవికులకు, మారుమూల పల్లెలలో ఉండే
వారికి, ఈ జ్ఞానం ఉంటుంది.
శుద్ధమైన మనస్సున్న యోగి చుట్టూ ఉన్న ప్రకృతి అతనికి అనుక్షణం ఎన్నో సూచనలనిస్తూ
ఉంటుంది. జరుగబోయే సంఘటనలను ముందుగానే సూచిస్తూ ఉంటుంది. అతనికి మరణం
దగ్గర పడుతూ ఉన్నపుడు, అరిష్టములు లేదా చెడు శకునముల రూపంలో ప్రకృతి అతనికి ఆ
విషయాన్ని చెబుతూ ఉంటుంది. వాటిని గమనించడం ద్వారా కూడా తన మరణసమయమును
యోగి ముందుగానే తెలుసుకోగలుగుతాడు. ఈ శకునములు కూడా ఆధ్యాత్మికములు,
అధిభౌతికములు, అధిదైవికములని మూడు విధములుగా ఉంటాయి.
ఆధ్యాత్మికములు: ఇవి దేహమునకు సంబంధించినవి. అంటే, చెవులను బొటన
వ్రేళ్ళతో మూసినప్పుడు నాడీస్పందనాశబ్దం వినపడకపోవడము, కన్నులు మూసుకున్నపుడు
కనిపించే లేతవెలుగు కనిపించకపోవడము, తన నీడ తనకు కనిపించకపోవడము,
అసాధ్యరోగములు మొదలై రోజురోజుకూ ఎక్కువ కావడము, శరీరభాగముల యొక్క స్పృహ
క్రమంగా పోతూ ఉండటము, మొదలైన సూచనల వల్ల చావు దగ్గర పడుతున్నదని
తెలుసుకోవచ్చు.
అధిభౌతికములు: భౌతికమునకు అతీతమైన సూచనలు. అంటే, యమభటులు
కనపడటం, లేదా యమధర్మరాజు దర్శనం అవడం, లేదా మహిషఘంటికా నాదం వినపడటం,
లేదా ఇంతకుముందు గతించిన తాతముత్తాతలు, పెద్దలు మొదలైనవారు కలలలో కనిపించి
రమ్మని పిలవడం - మొదలైన అతీత సంఘటనల వల్ల కూడా చావు దగ్గర పడుతున్నదని
తెలుసుకోవచ్చు.
అధిదై వికములు: దేవతాలోకములు, స్వర్గము మొదలైనవి కనపడటం. లేదా దేవతల
దర్శనం కావడం, ‘నీకు ఆయుష్షు అయిపోయింది, ఇక సిద్ధంగా ఉండు’ అని వారు చెప్పడం,
మొదలైన సూచనలవల్ల కూడా చావు మూడబోతున్నదని ముందుగానే తెలుసుకోవచ్చు.
వీటిలో మొదటివి సామాన్యమానవులకు, రెండవవి కొద్దిగా సాధనామార్గంలో ఉన్నవారికి
లేదా సున్నితత్వం ఉన్నవారికి, మూడవవి యోగసిద్ధులకు కలుగుతాయి.
సూ|| మైత్ర్యాదిషు బలాని || 3.24 ||
మైత్రి మొదలైన వాటిమీద సంయమం చేస్తే ఆయా శక్తులు లభిస్తాయి.
మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష - మొదలైన సద్గుణములపైన సంయమం గావిస్తే ఆయా
శక్తులు యోగికి స్వాధీనములౌతాయి. అప్పుడు, తన మనస్సును మట్టిముద్దలాగా చేసి ఆడుకోగల
శక్తి అతనికి వస్తుంది. ఎప్పుడైతే ఈ శక్తి కలిగిందో, ఇతరుల మనస్సులపైన కూడా అతనికి అదే
విధమైన అదుపు లభిస్తుంది.
అట్టి యోగి మైత్రి (స్నేహభావం), కరుణ (దయ), ముదిత (సంతోషము), ఉపేక్ష (ఉదాసీనత)ల
పైన సంయమం చేయడం ద్వారా, తన చుట్టూ బలమైన స్పందనాతరంగములను
సృష్టించగలుగుతాడు. ఆయా స్పందనల పరిధిలోకి వచ్చిన వ్యక్తులు వాటికి లోనైపోయి, తమ
సహజస్వభావములైన రాగద్వేషములను, ఆవేశకావేషములను మరచిపోతూ ఉంటారు. ఆ పరిధి
నుంచి బయటకు వచ్చిన తర్వాతనే మళ్ళీ వారి పాతపోకడలు వారికి గుర్తొస్తూ ఉంటాయి.
మహనీయులను గుర్తించడానికి ఇదొక ఉపాయం. కానీ, వారి చుట్టూ ఉన్న స్పందనలను
గుర్తించగలిగే శుద్ధమైన మనస్సు మనకు ఉండాలి.
సూ|| బలేషు హస్తిబలాదీని || 3.25 ||
ఏనుగు మొదలైన జంతువుల మీద సంయమం చేస్తే వాటి బలం లభిస్తుంది.
ప్రాచీనకాలపు యోగులు, ఋషులు అమానుషములైన శక్తులను ప్రదర్శించినట్లు మనం
చదువుతాము. ఆ శక్తులు వారికి సంయమబలం వల్లనే కలిగాయి. ఏనుగు సింహము మొదలైన
జంతువుల బలములపైన సంయమం చేయగలిగే యోగికి ఆయా జంతువుల బలం వస్తుంది.
ఉన్నతస్థాయిలలోని వీరవిద్యాభ్యాసములలో కూడా ఈ సూత్రం అభ్యసించబడుతుంది. ఈ
అభ్యాసం వల్లనే, ఒక వీరుడు పదిమందిని ఎదుర్కొని తేలికగా వారిని మట్టి
కరిపించగలుగుతాడు. లేదా సామాన్యమానవులు ఊహించలేని పనులను అవలీలగా
చేయగలుగుతాడు.
సూ|| ప్రవృత్త్యాలోకన్యాసా త్సూక్ష్మవ్యవహిత విప్రకృష్ట జ్ఞానం || 3.26 ||
ప్రవృత్తులను చూస్తూ సంయమం చేస్తే సూక్ష్మములు, దాగియున్నవి, దూరంగా ఉన్నవాటి
జ్ఞానం లభిస్తుంది.
ప్రవృత్తులంటే, పోకడలు. సృష్టిలో ప్రతిజీవికీ ఒక పోకడ ఉంటుంది. ప్రతి వస్తువుకూ ఒక

మీ చేసే
ధర్మం, ఒక లక్షణం, ఒక పోకడ ఉంటాయి. ఆయా పోకడల మీద సంయమం చేసే యోగికి వాటి
తత్త్వములు అర్థమైపోతాయి. పోకడలనేవి బయటకు కనిపించేవి కావు. అవి సూక్ష్మంగా
ఉంటాయి. ఆయా సూక్ష్మపు పోకడలను బాగా అర్థం చేసుకున్న యోగికి, సూక్ష్మవిషయములు
స్పష్టంగా అర్థములౌతాయి. దాగి ఉన్న వస్తువులు కనిపిస్తాయి. అంటే, నిధినిక్షేపములు మొదలైన
భూమిలో దాచిపెట్టబడిన వస్తువులు అతని దృష్టికి గోచరిస్తాయి.
లేదా, దూరంగా ఎక్కడో ఉన్న వస్తువులను, మనుషులను, సంఘటనలను అతడు
చూడగలుగుతాడు. ఉదాహరణకు, భారతదేశంలో ఉన్న ఒక సిద్ధయోగి, అమెరికాలో
జరుగుతున్న సంఘటనను తన ప్రక్కనే జరుగుతున్నట్లు చూడగలుగుతాడు. ఇది సాధ్యమే.
కాకుంటే, తగినంత సంయమసాధనాబలం యోగికి ఉండాలి.
సూ|| భువనజ్ఞానం సూర్యే సంయమాత్ || 3.27 ||
సూర్యునిపైన సంయమం చేస్తే విశ్వం యొక్క జ్ఞానం కలుగుతుంది.
భువనమంటే విశ్వం. సూర్యుడు మన సౌరమండలమునకు కేంద్రబిందువు గనుక,
ఆయనపైన సంయమం చేయడంవల్ల, మొత్తం సౌరమండలంలో ఉన్న గ్రహములు, వాటి కక్ష్యలు,
పరిభ్రమణ వేగములు, వాటిమీద ఉన్న వాతావరణ పరిస్థితులు మొదలైన అంతటినీ యోగి
సూటిగా తెలుసుకోగలుగుతాడు.
ఇదే విధంగా, విశ్వకేంద్రమైన మూలానక్షత్రప్రాంతం (విష్ణునాభి) పైన సంయమం చేయడం
వల్ల, విశ్వం యొక్క మొత్తం జ్ఞానం అతనికి కలుగుతుంది. విశ్వరహస్యములన్నీ అతనికి
తెలిసిపోతాయి.
సూ|| చంద్రే తారావ్యూహజ్ఞానం || 3.28 ||
చంద్రుని పైన సంయమం చేస్తే నక్షత్రమండలముల జ్ఞానం కలుగుతుంది.
భూమి చుట్టూ ఉన్నట్టి నక్షత్రమండలములు అనేకములైనప్పటికీ, సూర్యగమన మార్గంలో
ఉన్న 27 నక్షత్రమండలములనే మనం లెక్కిస్తాము. ఎందుకంటే, చంద్రుడు వాటి క్రిందుగా
పయనిస్తూ, వాటి శక్తిని, భూమికి అందిస్తూ ఉంటాడు. చంద్రునిద్వారా, నక్షత్రముల శక్తి భూమికి
చేరుతూ ఉంటుంది. కనుక చంద్రునిపైన సంయమం చేస్తే, నక్షత్రముల శక్తి యొక్క జ్ఞానం
యోగికి కలుగుతుంది. దీనిని శ్రీవిద్యలో ‘చంద్రవిద్య’ అని పిలుస్తారు. ‘మనువిద్యా చంద్రవిద్యా
చంద్రమండల మధ్యగా’ అంటుంది లలితాసహస్రం. శ్రీవిద్యోపాసనలో దీనికి ప్రత్యేకవిధానం
ఉన్నది. కానీ, ఈ సంయమం ద్వారా కూడా చంద్రవిద్యను సాధించవచ్చు.
సూ|| ధృవే తద్గతిజ్ఞానం || 3.29 ||
ధృవనక్షత్రం మీద సంయమం చేస్తే దాని నడక తెలుస్తుంది.
ధృవనక్షత్రం అనేది ఆకాశంలో ఉత్తరదిక్కుగా ఉంటుంది. మిగతా నక్షత్రములలాగా ఇది
తిరుగుతూ ఉండక, స్థిరంగా ఉంటుంది. దీనికి కారణం ఉత్తరధృవం వైపు అది ఉండటమే.
భూమి పడమరనుండి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది గనుక ఉత్తరదక్షిణధృవములు
తే
కదులుతున్నట్లు కనిపించవు. అయితే భూమికున్నట్టి ధృవపరిభ్రమణం వల్ల ధృవనక్షత్రం కూడా
కొన్నివేల ఏళ్ళకు కొద్దిగా తన స్థానమును మార్చుకుంటుంది. ఇదంతా ఖగోళపరిజ్ఞానం
ఉన్నవారికి అర్థమౌతుంది. ధృవనక్షత్రం పైన తాను చేసే సంయమం వల్ల, ఇదే జ్ఞానం యోగికి
కూడా లభిస్తుంది.
సూ|| నాభిచక్రే కాయవ్యూహజ్ఞానం || 3.30 ||
నాభిచక్రం మీద సంయమం చేస్తే శరీరం లోపల ఏముందో అంతా తెలుస్తుంది.
నాభి (బొడ్డు) అనేది జీవశక్తికి మూలం. తల్లిగర్భంలో ఉన్నపుడు బొడ్డుత్రాడు ద్వారానే బిడ్డకు
ఆహారము, జీవములు అందుతూ ఉంటాయి. మనిషిలోని జీర్ణక్రియకు, అతని జీవనానికి
ఆధారభూతమైన మణిపూరకచక్రం ఈ ప్రదేశంలోనే ఉంటుంది. కనుక, దీనిపైన సంయమం
చేసిన యోగికి, తన దేహంలోని అంతర్గతావయవములు ఏ విధంగా పనిచేస్తున్నాయి? ఏయే
శక్తులు తన దేహమును ఎలా నడిపిస్తున్నాయి? అనిన విషయం స్పష్టంగా అర్థమౌతుంది.
యోగశాస్త్రప్రకారం నాభి అనేది సూర్యకేంద్రం. బయట ఆకాశంలో సూర్యుడుండి విశ్వం
అంతటికీ వెలుగును, వేడిమిని ఇస్తున్నట్లుగా, మనిషి నాభిలో అగ్ని ఉంటూ అతని శరీరమునకు
జీవమును, వేడిమిని ఇస్తున్నది. బాహ్యంగా ఉన్న సూర్యునిపైన సంయమం
విశ్వజ్ఞానమునిస్తుంది. అదే విధంగా, నాభిచక్రసంయమం తన దేహమును గురించిన జ్ఞానమును
యోగికి కలిగిస్తుంది.
సూ|| కంఠకూపే క్షుత్పిపాసానివృత్తిః || 3.31 ||
గొంతుగుంటలో సంయమం చేస్తే ఆకలి దప్పికలు అణగిపోతాయి.
గొంతుకు వెనుకగా విశుద్ధచక్రం ఉంటుంది. మనిషి బ్రతకడానికి ఆహారం ముఖ్యం.
ఆహారమనేది గొంతులోనుంచి కడుపులోకి పోతుంది. ఈ ప్రదేశం పైన సంయమం చేయగలిగిన
యోగికి ఆకలి, దప్పికలు మాయమౌతాయి. దీనిని సాధించిన యోగులు
హిమాలయప్రాంతములలో చాలామంది ఉంటారు. ఈ సాధనాబలం వల్లనే, వారాల తరబడి
ఆహారం లేకపోయినా వారు ధ్యానంలో ఉండగలుగుతూ ఉంటారు. రామాయణంలో,
విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బోధించిన బల, అతిబల విద్యలు ఈ సంయమమునకు
మూలికారూపములు. సిద్ధులను మూలికల ద్వారా ఔషధప్రయోగం ద్వారా కూడా సాధించవచ్చు.
దీనిని మహర్షి ముందటి సూత్రములలో చెబుతారు.
సూ|| కూర్మనాడ్యాం స్థైర్యం || 3.32 ||
కూర్మనాడి పైన సంయమం చేస్తే స్థిరత్వం కలుగుతుంది.
కూర్మనాడి అనేది మూలాధారచక్ర ప్రాంతంలో ఉన్నట్టి ఒక యోగనాడి. దీనిపైన సంయమం
వల్ల యోగికి స్థిరత్వం లభిస్తుంది. భూమికి ఆధారంగా మహాకూర్మం ఉంటూ భూమిని
మోస్తున్నదని పురాణములంటాయి. దేవదానవులు పాలసముద్రమును చిలికే సమయంలో
మందరపర్వతము క్రింద ఆధారంగా కూర్మం ఉన్నదని కూడా పురాణములు చెబుతాయి. కూర్మం

నే సే లో టే
అనేది స్థిరత్వమునకు సూచిక. ఎక్కువ గంటలసేపు ధ్యానంలో ఉండాలంటే ఆసనసిద్ధి తప్పనిసరి.
దానికోసం దేహమునకు స్థిరత్వం ఉండాలి. అంటే, చంచలత్వం లేని నిలకడతనం ఉండాలి. ఆ
స్థిరత్వమనేది అనేక విధములుగా వస్తుంది. వాటిలో ఒక మార్గం కూర్మనాడి పైన సంయమం
చేయడం.
సూ|| మూర్ధజ్యోతిషి సిద్ధదర్శనం || 3.33 ||
శిరస్సు పైన ఉన్న వెలుగుపైన సంయమం చేస్తే సిద్ధుల దర్శనం లభిస్తుంది.
సిద్ధపురుషుల లోకం శిరస్సుపైన ఉన్న వెలుగులోకమై ఉంటుంది. ఈ ప్రాంతమును
తంత్రమార్గంలో ద్వాదశాంతస్థానమని అంటారు. ఇక్కడ సంయమం చేయగలిగిన యోగికి
సిద్ధులలోకంతో అనుసంధానం ఏర్పడుతుంది. అప్పుడు వారి దర్శనమును అతడు పొందుతాడు.
మహనీయులు, ఋషులు, సిద్ధులు, యోగులు మొదలైనవారు అతనికి కనిపించి అతనితో
మాట్లాడుతారు. వారిలో కొందరు అతనికి సాధనమార్గంలో కావలసిన సూచనలను ఇస్తారు.
మరికొందరు అతని కర్మరహస్యములను వివరించి, అతనేమి చేయాలో ఉపదేశిస్తారు. ఇదంతా
కూడా భ్రమ కాదు. వాస్తవంగానే జరుగుతుంది. అయితే, తగినంత సంయమశక్తి ఉండాలి.
సూ|| ప్రాతిభాద్వా సర్వం || 3.34 ||
ప్రతిభ మీద చేస్తే ఇవన్నీ ఒకేసారి కలుగుతాయి.
ప్రతిభ అనే పదమునకు - తెలివి, వెలుగు, ఎరుక, దర్శనశక్తి, జ్ఞానము అనే అర్థములున్నాయి.
ఎరుక లేదా స్పృహ అనేది ఒక విధమైన వెలుగు వంటిది. వెలుగు ఎలాగైతే చీకటిని
పోగొడుతుందో, అదేవిధంగా, ఎరుక అనేది అజ్ఞానమును పోగొడుతుంది. ఇప్పటివరకూ
చెప్పబడిన సంయమములన్నీ ఒక్కొక్క ప్రదేశమునకు, ఒక్కొక్క విషయమునకు సంబంధించినవి.
ఇవిగాక ఇక్కడ చెప్పబడని అసంఖ్యాకములైన సంయమములున్నాయి. వాటివల్ల యోగికి
అనేకములైన అతీతశక్తులు కలుగుతాయి. కానీ, ఈ అన్నింటికీ మూలమైనది ఎరుక. తన
దేహమును, అందులోని ఆధారములను ఏకమొత్తంగా ధ్యానిస్తూ అన్నింటిపైనా సంపూర్ణమైన
ఎరుకతో సంయమం గావిస్తే పైన చెప్పబడిన సిద్ధులన్నీ ఒకేసారిగా లభిస్తాయి. అంటే,
ఒక్కొక్కదానికోసం విడివిడిగా ప్రయత్నించవలసిన పని లేదు.
సూ|| హృదయే చిత్తసంవిత్ || 3.35 ||
హృదయం పైన చేస్తే చిత్తజ్ఞానం కలుగుతుంది.
చిత్తమంటే, సుప్తమనస్సు. అంటే, మామూలు మనస్సు యొక్క లోతులలో ఉండే మనస్సని
అర్థం. దీనినే ఆంగ్లంలో ‘సబ్ కాన్షస్ మైండ్’ అంటున్నాము. ఇక్కడే సంస్కారములు (జన్మజన్మల
నుంచీ వస్తున్న పోకడలు) దాగుకొని ఉంటాయి. దీనిని సూచించే స్థానం హృదయం. ఇది
భౌతికంగా రక్తమును దేహమునకు సరఫరా చేసే గుండెకాయ కాదు. ఛాతీమధ్యలో కొంచం
పైగా ఉన్నట్టి యోగకేంద్రమే ఇది. ఇక్కడ సంయమం చేయగలిగిన యోగికి తన మనస్సు యొక్క
లోతుపాతులు అర్థమౌతాయి. అతని సంస్కారములు అతనికి స్పష్టంగా గోచరిస్తాయి.

కీ శే భో
సూ|| సత్త్వపురుషయో రత్యంతాసంకీర్ణయోః ప్రత్యయావిశేషో భోగః పరార్థత్వాత్స్వార్థ
సంయమాత్పురుషజ్ఞానం || 3.36 ||
అసంకీర్ణుడు కాని, ప్రత్యయం కంటే భిన్నుడైన, భోగములకు పరుడైన, తానేయైన,
సత్త్వపురుషుని పైన సంయమం చేస్తే పురుష (ఆత్మ) జ్ఞానం లభిస్తుంది.
సంకీర్ణత అంటే కలసిపోవడం. దేనితో? ఇంద్రియవిషయములతో. ప్రత్యయమంటే
తానుకాని, తనకంటే భిన్నమైన, ఒక ఆధారం. భోగములకు పరుడైన అంటే, ఇంద్రియముల
ద్వారా కలుగుతున్న భోగానుభవములకు విభిన్నుడైన అని అర్థం. స్వార్థమంటే తనయొక్క
స్వరూపం.
కనుక, ఇంద్రియములకు, వాటిద్వారా కలుగుతున్న అనుభవములకు, ఆలోచనలకు విడిగా,
తన స్వరూపంలో తానున్న స్థితిపైన సంయమం గావిస్తే, పురుషజ్ఞానం కలుగుతుందని మహర్షి
ఈ సూత్రంలో చెబుతున్నారు. అంటే, ఆత్మజ్ఞానమని అర్థం. ఇంద్రియములకు, మనస్సుకు,
వాటిద్వారా కలుగుతున్న అనుభవములకు ఆత్మ భిన్నమైనది గనుక, వాటికి అతీతమైన స్థితిని
సంయమం గావిస్తే, ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.
సూ|| తతః ప్రాతిభ శ్రావణ వేదనాదర్శా స్వాదవార్తా జాయంతే || 3.37 ||
ఈ జ్ఞానంవల్ల - అతీతములైన వినికిడి, చూపు, రుచి, వాసన, స్పర్శలు కలుగుతాయి.
సంపూర్ణమైన ఎరుకను సంయమం చేయడం వల్ల ఇంద్రియముల శక్తులు అపరిమితంగా
పెరుగుతాయి. వాటిలో అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న శక్తి అంతా ఉపయోగంలోకి వస్తుంది.
చెవియందు ఈ ఎరుక నిండటం వల్ల అప్పటివరకూ వినని సూక్ష్మమైన ధ్వనులను,
సూక్ష్మలోకముల ధ్వనులను యోగి వినగలుగుతాడు. కన్నులో ఈ ఎరుక నిండటం వల్ల,
అప్పటివరకూ కనిపించని సూక్ష్మలోకములను, దేవతలను అతడు దర్శించగలుగుతాడు.
ముక్కులో ఈ ఎరుక నిండటంవల్ల, దివ్యములైన సుగంధ పరిమళములను అతడు అనుభూతి
చెందుతాడు. నాలుకలో ఈ ఎరుక నిండటం వల్ల, మానవాతీతములైన రుచులను హఠాత్తుగా
అతని నాలుకపైన అనుభూతి చెందుతాడు. చర్మంలో ఈ ఎరుక నిండటం వల్ల, దేవతల
స్పర్శలను, మానవాతీతశక్తుల స్పర్శలను అతడు చవిచూస్తాడు. ఒక్కమాటలో చెప్పవలెనంటే,
అతని ఇంద్రియముల పరిధి అమితంగా పెరిగిపోతుంది. కనుక ఈ అద్భుతములన్నీ అతని
అనుభూతిలోకి వస్తాయి.
సూ|| తే సమాధావుపసర్గా వ్యుత్థానే సిద్ధయః || 3.38 ||
ఈ సిద్ధులు కలగడం సమాధికి ఆటంకమౌతుంది.
నిర్బీజసమాధికి చేరే దారిలో ఈ సిద్ధులన్నీ యోగికి కలుగుతాయి. వాటిని చూచి ఆశపడి,
లోకుల కోరికలు తీర్చడంకోసమో, వారి మెప్పుకోసమో, లేక తానే వాటిలో మునిగిపోవడం
వల్లనో, వాటిని ఉపయోగిస్తూ ఉంటే, అట్టి యోగి మళ్ళీ కర్మబంధములలో చిక్కుకుంటాడు. అతని
సాధన దిగజారుతుంది. అతడు కైవల్యసిద్ధిని అందుకోలేక యోగభ్రష్ఠుడౌతాడు.

శ్రీ లో గీ లో శ్రీ
ఈ శక్తులు, సిద్ధుల విషయమై, శ్రీమద్భాగవతంలోని ఉద్ధవగీతలో శ్రీకృష్ణభగవానుడు
ఉద్ధవునికి ఇలా బోధిస్తాడు.
శ్లో|| అంతరాయాన్వదంత్యేతా యున్జతో యోగముత్తమమ్
మయా సంపద్యమానస్య కాలక్షపణ హేతవః || (10.33)
‘నన్ను చేరుకోవడం కోసం ఉత్తమమైన యోగమును అభ్యసించేవానికి ఈ సిద్ధులన్నీ
అంతరాయములు అవుతాయి. ఇవన్నీ అతని కాలమును వృధా గావిస్తాయి’.
శ్రీ రామకృష్ణులకు అన్ని సిద్ధులూ అరచేతిలో ఉండేవి. కానీ, సిద్ధులకు ఆయన ఏమాత్రమూ
విలువను ఇవ్వలేదు. ఇవి భగవంతుని చేరే సాధనామార్గంలో ఆటంకములని, వాటిని
పట్టించుకోకూడదని ఆయన అనేవారు.
సూ|| బంధకారణ శైథిల్యాత్ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశః || 3.39 ||
తనను తన దేహంతో బంధించే కారణములు శిథిలమై పోవడం వల్ల, బయటకు ప్రసరించే
జ్ఞానం కలగడంవల్ల, తన చిత్తంతో ఇతరులను ఆవహించే సిద్ధి కలుగుతుంది.
దీనిని ‘పరకాయప్రవేశ సిద్ధి’ అంటారు. ఈ శక్తిని పొందిన యోగి ఒక మృతదేహంలో
ప్రవేశించి దానికి జీవమును ఇవ్వగలుగుతాడు. లేదా, తన శరీరంలో తానుంటూ, ఇతరుల
చిత్తమును అదుపు చేసి నడిపించగలుగుతాడు. ఈ శక్తి ఎలా లభిస్తుంది? రెండింటి వల్ల ఇది
లభిస్తుంది.
ఒకటి - బంధకారణ శైథిల్యాత్: ముందుగా తన దేహంతో తన ప్రాణమును, చిత్తమును
బంధించి ఉంచుతున్న ముడులు వదులైపోవాలి. ఏమిటా ముడులు? సంస్కారములే ఆ
ముడులు. ప్రారబ్ధకర్మప్రభావం అంతమైతే, పంచప్రాణములను దేహమునకు కలిపి ఉంచుతున్న
ముడులు విడిపోతాయి. అప్పుడు ప్రాణం దేహమును వదలి తన ఇష్టానుసారం బయటకు
పోగలుగుతుంది.
రెండు - ప్రచార సంవేదనాత్: అంటే, ప్రాణశక్తి బయటకు ప్రసరించే జ్ఞానం కలగడం వల్ల,
ప్రాణమును దేహం నుంచి బయటకు పంపే జ్ఞానం యోగికి కలుగుతుంది. చిత్తమును
అనుసరిస్తూ ప్రాణం ఉంటుంది గనుక, చిత్తమును బయటకు ప్రసారం చేయగలిగితే ప్రాణం
కూడా దేహమును వదలిపెట్టి బయటకు ప్రసారమౌతుంది. ఈ రెంటివల్ల పరకాయప్రవేశమును
యోగి చేయగలుగుతాడు. ఆదిశంకరులు, ఇంకా ఎందఱో ప్రాచీనయోగులు ఈ సిద్ధిని
ప్రదర్శించినట్లు మనకు నిదర్శనములున్నాయి. హిమాలయయోగులలో ఈ సిద్ధిని కలిగినవారు
ఎందఱో ఈనాటికీ ఉన్నారు.
సూ|| ఉదానజయాజ్జల పంక కంటకాది ష్వసంగ ఉత్క్రాంతిశ్చ || 3.40 ||
ఉదానవాయువును జయించడం వల్ల నీరు, బురద, ముండ్లు మొదలైనవాటిని తాకకుండా
వాటిపైన గాలిలో తేలుతూ యోగి పోగలుగుతాడు.
దేహంలో పంచ ప్రాణవాయువులున్నాయి. వాటికి అనుగుణంగా అయిదు
న్నీ గో లో
ఉపవాయువులున్నాయి. ఇవన్నీ యోగోపనిషత్తులలో వివరంగా చెప్పబడినాయి. ప్రాణము,
అపానము, వ్యానము, ఉదానము, సమానములు అయిదు ముఖ్యవాయువులు. నాగ, కూర్మ,
కృకర, దేవదత్త, ధనంజయములు అయిదు ఉపవాయువులు. వీటిలో ఒక్కొక్క వాయువును
జయించడం వల్ల, అంటే దానిపైన అదుపును సాధించడం వల్ల, ఒక్కొక్క విధమైన సిద్ధి యోగికి
లభిస్తుంది.
తన దేహంలో ఉన్న ఉదానమనే వాయువును జయించడంవల్ల, అనుకున్న క్షణంలో యోగి
దేహం దూదిపింజలాగా తేలిక అవుతుంది. దీని ఫలితంగా, నీటిపైన నడవడం సాధ్యమౌతుంది.
ముండ్లు, బురద మొదలైనవి అంటకుండా యోగి వాటిపైన తేలుతూ పోగలుగుతాడు.
ఉదానవాయువు పైన సంయమం చేయడమే దీనికి మార్గం.
సూ|| సమానజయాత్ ప్రజ్జ్వలనమ్ || 3.41 ||
సమానవాయువును జయించడం వల్ల దేహం వెలుగుతుంది.
సమానవాయువును జయించిన యోగి తన దేహం నుండి వెలుగును బయటకు
విరజిమ్మగలుగుతాడు. ఇందులో వింత ఏమీ లేదు. మిణుగురు పురుగు తన దేహం నుండి
కాంతిని బయటకు చిమ్ముతుంది. చీకటిలో ఎగిరే మిణుగురు పురుగులు అందరికీ పరిచితములే.
అదే విధమైన ప్రక్రియ యోగి దేహంలో కూడా జరుగుతుంది.
శ్రీరామకృష్ణుల కాలంలో చంద్రుడు, గిరిజుడు అని ఇద్దరు సాధకులుండేవారు. వారికి
భైరవీబ్రాహ్మణి గురువుగా ఉంటూ వారి సాధనలో సహాయం చేసింది. అలా చెయ్యమని ఆమెకు
కాళీమాత ఆజ్ఞ వినవచ్చింది. వీరిలో గిరిజుడనేవానికి ఈ సిద్ధి ఉండేది. ఆ రోజులలో
విద్యుద్దీపములు లేవు. దక్షిణేశ్వర పరిసరములన్నీ అడవి చెట్లతో నిండి రాత్రిపూట చిమ్మచీకటిలో
ఉండేవి. ఒకనాటి చీకటి రాత్రి, శ్రీ రామకృష్ణులు గిరిజుడు ఉండే ఇంటికి పోయి బాగా పొద్దు
పోయేవరకూ అతనితో మాట్లాడుతూ ఉన్నారు. తిరిగి కాళికాలయమునకు బయలుదేరిన
సమయంలో చిమ్మచీకటిలో దారి కనిపించడం లేదు. అప్పుడు గిరిజుడు తన చేతిని పైకెత్తి
అందులోనుంచి మిరుమిట్లు గొలిపే కాంతిని బయటకు రప్పించాడు. ఆ వెలుగులో దారి
పట్టపగలులాగా కనిపించగా శ్రీ రామకృష్ణులు తన గదికి చేరుకున్నారు. ఇది నూట ఏభై ఏళ్ళ
క్రితం జరిగిన యదార్థ సంఘటన.
సమానవాయుజయం వల్ల ఈ సిద్ధి కలుగుతుంది. అంటే, సమానవాయువు పైన సంయమం
చేయడంవల్ల యని అర్థం.
సూ|| శ్రోత్రాకాశయోః సంబంధసంయమాద్దివ్యం శ్రోత్రం || 3.42 ||
చెవి, ఆకాశముల సంబంధము పైన సంయమం చేయడం వల్ల దివ్యశ్రవణం లభిస్తుంది.
శబ్దమనేది ఆకాశంలో ప్రయాణించి చెవిని చేరుకుంటుంది. ఇక్కడ కూడా - శబ్దము,
ఆకాశము, చెవి - అనే త్రిపుటి ఉంటుంది. చెవి యొక్క రంధ్రములో ఉన్న ఆకాశం మీద
సంయమం చేయడంవల్ల, యోగికి అతీతలోకముల యొక్క నాదములను వినగలిగే శక్తి

లో నే
కలుగుతుంది. ఈ లోకమునకు చెందని అనేక విధములైన దివ్యనాదములను అతడు
వినగలుగుతాడు.
సూ|| కాయాకాశయోః సంబంధసంయమాల్లఘుతూల-సమాపత్తేశ్చాకాశగమనం || 3.43 ||
దేహము, ఆకాశముల సంబంధము పైన సంయమం చేయడం వల్ల తేలికయైన దూదిలాగా
ఆకాశంలో పోగలుగుతాడు.
ఆకాశంలో దేహం ఉంటున్నది. దేహంలో మళ్ళీ ఆకాశం ఉన్నది. దేహంలోపల వివిధ
అవయవముల మధ్యన ఆకాశం ఉంటుంది. అలా లేకుంటే నరాలలో రక్తం ప్రసరించే అవకాశం
లేదు. కనుక దేహం లోపలా బయటా ఆకాశం ఉంటున్నది. ఈ రెంటిమధ్యన ఉన్న సంబంధం
పైన సంయమం చేసే యోగిదేహం ఆకాశగమనం చేయగల శక్తిని పొందుతుంది.
వినడానికి ఇవన్నీ వింతలుగా కనిపించవచ్చు. కానీ యోగుల ప్రపంచంలో ఇవన్నీ సత్యములే.
ఆ ప్రపంచం సామాన్యమానవులకు గోచరించదు. నిజమైన యోగులకు ఈ శక్తులన్నీ ఉంటాయి.
కానీ వారు వీటిని లోకపుప్రదర్శనకు పెట్టరు. అల్పులైన లోకులకు వీటిని చూపడంవల్ల ఎలాంటి
ప్రయోజనమూ లేకపోగా, నానా రకములైన జంఝాటములు చుట్టుకుంటాయని, తత్ఫలితంగా
సాధనాభ్రష్ఠత కలుగుతుందని, వారికి బాగా తెలుసు. కనుక నిజమైన యోగులు, మహనీయులు,
తమ సిద్ధులను రహస్యంగా ఉంచుకుంటారు. నలుగురిలో మెప్పుకోసం, కీర్తికోసం, ధనంకోసం
శక్తులను ప్రదర్శించేవారు అల్పులు. వారిలో దివ్యత్వం ఉండదు.
సూ|| బహిరకల్పితా వృత్తిర్మహావిదేహా తతః ప్రకాశావరణక్షయః || 3.44 ||
బాహ్యంగా ఏ వృత్తి కూడా పోనప్పుడు, మహావిదేహస్థితి కలుగుతుంది. అప్పుడు వెలుగుకున్న
ఆవరణ నశిస్తుంది.
అంటే - మనస్సు ఏ విధమైన బయటివిషయం పైన కూడా ప్రసరించకుండా, సంపూర్ణంగా
అంతరికమై, తనలో తానుగా ఉన్న కేవలస్థితిలో, యోగికి తనయొక్క దేహస్పృహ పూర్తిగా
పోతుంది. ఆ స్థితిలో ఉన్న యోగికి తనకొక శరీరం ఉందన్న స్పృహ ఉండదు. దానిని
‘మహావిదేహస్థితి’ అన్నారు మహర్షి. అది ఆత్మస్థితి గనుక, అట్టి స్థితిలో ఉన్నపుడు అజ్ఞానం
పూర్తిగా నశిస్తుంది.
అజ్ఞానమంటే ఏమిటి? తనకు శరీరమనే ఆవరణ, ఆధారమూ ఉన్నవనిన స్పృహయే
అజ్ఞానం. అవి రెండూ లేనప్పుడు విశ్వమంతా తానే నిండి ఉన్న అనుభూతి కలుగుతుంది. ఆ
స్థితిలో స్థూలదేహమే గాక, సూక్ష్మదేహములు కూడా తనకు లేవన్న కేవలస్పృహలో యోగి
ఉంటాడు. అంటే, వేదాంతములో చెప్పబడిన పంచకోశములకు లోపల వెలుగుతున్న ఆత్మలో
ఆత్మగా తానుంటాడు. అట్టి స్థితిలో అజ్ఞానం పూర్తిగా దగ్ధమైపోతుంది.
ఆత్మ, శుద్ధమైన వెలుగుగా ఉన్నది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ,
ఆనందమయములనే అయిదు శరీరములు దానికి ఆవరణలుగా ఉన్నాయి. జీవియొక్క కర్మను
బట్టి, వాటిలో త్రిగుణములు వివిధములైన పాళ్ళలో నిండి ఉన్నాయి. అవే అజ్ఞాన ఆవరణలు.

కే లో న్నీ మే
కేవలస్థితిలో ఈ ఆవరణలన్నీ నశించి ఆత్మయొక్క శుద్ధమైన వెలుగు మాత్రమే నిరాఘాటంగా
ప్రకాశిస్తూ ఉంటుంది.
ఈ స్థితినే ఈ సూత్రం వివరిస్తున్నది.
సూ|| స్థూలస్వరూప సూక్ష్మాన్వయార్థవత్త్వ సంయమాద్భూతజయః || 3.45 ||
స్థూలస్వరూపములను వాటి సూక్ష్మరూపములతో అన్వయించుకుంటూ సంయమం
చేయడం వల్ల భూతజయం లభిస్తుంది.
పంచభూతములు స్థూలములు. తన్మాత్రలు వాటి సూక్ష్మరూపములు. ఈ రెంటి యొక్క
పరస్పరసంబంధం పైన సమన్వయపూర్వకమైన సంయమమును చేయాలి.
భూతములు తన్మాత్రలు ఇంద్రియములు
భూమి స్పర్శ చర్మము
నీరు రుచి నాలుక
అగ్ని చూపు కన్ను
వాయువు వాసన ముక్కు
ఆకాశము ధ్వని చెవి

స్థూలమైన పంచభూతములకు సూక్ష్మరూపములే తన్మాత్రలు. వీటి మధ్యనున్న సంబంధం


పైన సంయమం చేసే యోగికి పంచభూతములపైన అదుపు లభిస్తుంది. అప్పుడు తన
ఇష్టానుసారం ప్రకృతినియమములను అతడు మార్చగలుగుతాడు. ఉదాహరణకు, ఇనుమును
బంగారంగా మార్చగలిగే శక్తి అతనికి లభిస్తుంది. ఇదే విధంగా పంచభూతములను ఒక
స్థితిలోనుంచి ఇంకొకస్థితికి అతడు తేలికగా మార్చగలుగుతాడు. వీటినే లోకం అద్భుతములని
భావిస్తుంది. ఎంతో ఆశ్చర్యపోతుంది. కానీ ఈ ప్రక్రియ తెలిసిన యోగికి అవి అద్భుతములుగా
తోచవు. సహజములే అనిపిస్తాయి.
సూ|| తతోఽణిమాది ప్రాదుర్భావః కాయసంపత్తద్ధర్మానభిఘాతశ్చ || 3.46 ||
అప్పుడు అణిమాదిసిద్ధులు కలుగుతాయి. కాయసంపత్తి లభిస్తుంది. ప్రకృతి నియమములకు
అతీతుడవుతాడు.
(పంచ) భూతజయం వలన, అణిమ మొదలైన సిద్ధులు అతనికి కలుగుతాయని చెప్పబడింది.
ఇవి ప్రసిద్ధములైన ఎనిమిది యోగసిద్ధులు.
అణిమ - అణువులాగా చిన్న రూపమును ధరించడం.
మహిమ - అతి పెద్దరూపమును (విశ్వరూపమును) ధరించడం.
లఘిమ - శరీరమును దూదిలాగా తేలికగా చెయ్యడం.
గరిమ - శరీరమును అతి బరువుగా చెయ్యడం.

దే టే
ప్రాప్తి - దేనిని కావాలనుకుంటే దానిని పొందటం.
ప్రాకామ్యము - కోరికలను సిద్ధింపజేసుకునే శక్తి.
ఈశిత్వము - అన్నింటిపైనా ఆధిపత్యం చెలాయించడం.
వశిత్వము - అన్నింటినీ వశం చేసుకునే శక్తి.
పంచభూతజయమును పొందిన యోగిని, అవే పంచభూతములతో ఏర్పడిన
ప్రకృతిధర్మములు ఏమీ చేయలేవు. ఉదాహరణకు, అగ్ని యొక్క ధర్మం కాల్చడం. కానీ యోగిని
అగ్ని కాల్చదు. ఇదే విధంగా మిగతా నాలుగు భూతములు కూడా అతడిని ఏమీ చేయవు. ఈ సిద్ధి
పంచభూతధారణ వల్ల లభిస్తుందని యోగోపనిషత్తులలో చెప్పబడింది. సంయమం వల్ల
లభిస్తుందని యోగసూత్రములు చెప్పినాయి.
సూ|| రూప లావణ్య బల వజ్ర సంహననత్వాని కాయసంపత్ || 3.47 ||
అందము, లావణ్యము, బలము, వజ్రం వంటి గట్టిదనము కలగడమే కాయసంపత్తి.
పై సూత్రంలో చెప్పబడిన కాయసంపత్తి అంటే ఏమిటో ఈ సూత్రం వివరిస్తున్నది.
దేహంలోని పంచభూతములు వేటి స్థితిలో అవి సమంగా ఉంటూ, తేజస్సుతో నిండి
ఉండటమే కాయసంపత్తి. వారివారి ఆహారవిహారములలో పొరపాట్ల వల్ల, సామాన్యమానవులలో
ఇవి రకరకములుగా చెదిరిపోయి ఉంటాయి. కనుక వారి దేహధాతువులన్నీ చెడిపోయిన స్థితిలో
ఉంటాయి. భూతజయంతో అవన్నీ మరలా సరిచేయబడినప్పుడు కాయసంపత్తి లభిస్తుంది.
సూ|| గ్రహణ స్వరూపా స్మితాన్వయార్థవత్త్వ సంయమా దింద్రియజయః || 3.48 ||
గ్రహణము, స్వరూపము, అస్మిత, అన్వయము, అర్థము - వీనిపైన సంయమం చేస్తే
ఇంద్రియజయం లభిస్తుంది.
మనకున్న ఐదు ఇంద్రియములనే వాకిళ్ళ ద్వారా ప్రపంచానుభవం మనకు కలుగుతుంది. ఈ
ఇంద్రియములపైన ఏ మనిషికీ అదుపు ఉండదు. ఇంద్రియములకు మానవుడు బానిసగా
ఉంటున్నాడు గాని, వాటిని తన స్వాధీనంలోకి తెచ్చుకోవడం లేదు. వాటిని తన అదుపులోకి
తెచ్చుకునే మార్గమును ఈ సూత్రం బోధిస్తున్నది.
ప్రకృతిలో ఏదైనా సరే, అది పనిచేసే తీరును మనం అర్థం చేసుకోవడంవల్ల మనకు
వశమౌతుంది. సైన్స్ అలా పుట్టినదే. బాహ్యప్రకృతిసూత్రములను అర్థం చేసుకోవడం వల్లనే సైన్స్
వృద్ధి చెందింది. అంతఃప్రకృతిసూత్రములను అర్థం చేసుకోవడం వల్ల మనస్సు, ఇంద్రియములు
మన స్వాధీనంలోకి వస్తాయి. ఈ రహస్యములను యోగశాస్త్రం వివరిస్తుంది.
ఇంద్రియానుభవంలో అయిదు మెట్లున్నాయి. వాటిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
ఒక్కొక్కదానినీ వివరంగా చూద్దాం.

గ్ర హణం: కన్ను చూస్తుంది. చెవి వింటుంది. ముక్కు వాసనను గ్రహిస్తుంది. నాలుక
రుచిని గ్రహిస్తుంది. చర్మం స్పర్శను తెలుసుకుంటుంది. ఈ అయిదు ఇంద్రియములు తమతమ
నే
విషయములను ఈ విధంగా గ్రహిస్తాయి. ఇది ‘గ్రహణం’ అనే ప్రక్రియ.

స్వరూపం: పంచభూతములు, వాటి తన్మాత్రలు - పంచేంద్రియములకు, వాటి


విషయములకు ఆధారములుగా ఉంటాయి. వీటి సంపర్కమును మనస్సు విశ్లేషించుకుంటుంది.
ఇదంతా కలసి ఒక ‘స్వరూపం’ ఏర్పడుతుంది.

అస్మిత: ఇది ‘అహంస్ఫురణ’. పంచభూతములు, ఇంద్రియములు, మనస్సుల వెనుక


అహంస్ఫురణ ఉంటుంది. ఇది లేనిదే మనస్సు, ఇంద్రియములు పనిచెయ్యవు.
ఇంద్రియానుభవములను పొందలేవు. ఈ స్థాయిలో, ఇంద్రియానుభవం యొక్క ‘స్వరూపం’
అస్మితకు నివేదించబడుతుంది.

అన్వయము: దీనికి మూలంగా త్రిగుణములుంటాయి. అంటే, సత్త్వ, రజో, తమో


గుణములు. వీటి స్వరూపమే ప్రకృతి. మనకు కలిగే ఏ ఇంద్రియానుభవమైనా అంతిమంగా
త్రిగుణముల పరంగానే అన్వయించబడుతుంది.

అర్థ ము: ఈ మొత్తం ప్రక్రియ యొక్క అర్థమేమిటి? దేనికోసం ఇదంతా జరుగుతున్నది?


దీనికి సమాధానం ‘ప్రకాశక్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం’ (2.18)
అనే సూత్రంలో చెప్పబడింది. ఇదంతా పురుషుని (ఆత్మ) యొక్క భోగం కోసం లేదా మోక్షం కోసం
జరుగుతున్నది. త్రిగుణాత్మికయైన ప్రకృతితో మమేకమై, అహంభావమునకు లోనై,
ఇంద్రియానుభవంలో మునిగిన ఆత్మ బంధంలో చిక్కుకుంటున్నది. ఈ ఊబినుంచి బయటపడిన
ఆత్మ, కైవల్యమును (కేవలస్థితిని, మోక్షమును) పొందుతున్నది.
ఈ అయిదుమెట్లలో జరుగుతున్న ప్రక్రియ మొత్తమునూ తనలో స్పష్టంగా, దేనికి దానిని
విడివిడిగా చూస్తూ అర్థం చేసుకోగలగడమే దీనిపైన సంయమం చేయడమంటే. ఇదంతా
అర్థమైనప్పుడు, తన ఇంద్రియములపైన అమితమైన అదుపు యోగికి కలుగుతుంది.
సూ|| తతో మనోజవిత్వం వికరణభావః ప్రధానజయశ్చ || 3.49 ||
అప్పుడు మనోజవిత్వం, ఇంద్రియములు లేకుండానే అనుభవమును పొందటం, ప్రధానమును
జయించడం సిద్ధిస్తాయి.
మనోజవిత్వమంటే, మనోవేగంతో ప్రయాణించగల శక్తి. ఇంద్రియముల మీద పూర్తి అదుపు
సిద్ధించిన యోగి, అనుకున్న క్షణంలో ఎక్కడకు కావాలంటే అక్కడకు ప్రయాణించగలుగుతాడు.
వికరణభావమంటే, కరణముల (ఇంద్రియముల) సహాయం లేకుండానే ఆయా
అనుభవములను పొందగలుగుతాడు. ఉదాహరణకు - తన ఎదురుగా ఏమీ లేకపోయినా,
కావలసినదానిని చూడగలుగుతాడు. అక్కడ ఏ పుష్పమూ లేకపోయినా, అనుకున్న సువాసనను
అనుభూతి చెందగలుగుతాడు. అదే విధంగా, రుచిని, ధ్వనులను, స్పర్శలను (అక్కడ లేనివాటిని
కూడా ఉన్నట్లుగా) అనుభూతి చెందగలడు. లేదా, ఒక దుర్వాసన తన ముక్కుపుటములకు
సోకుతున్నపుడు దానిని తనకిష్టమైన సువాసనగా అనుభూతి చెందగలడు. సంకల్పమాత్రంతో,
చే తీ తో నే
చేదురుచిని తీపిగా ఆస్వాదించగలుగుతాడు. ఎంతో దూరంగా ఉన్నవాటిని తన ప్రక్కనే
ఉన్నట్లుగా చూడగలుగుతాడు. అంటే, ఇంద్రియముల సహజలక్షణములను తనకిష్టం వచ్చినట్లు
మార్చుకోగలుగుతాడు.
ప్రధానజయమంటే, ప్రకృతిని జయించడం. త్రిగుణాత్మికయైన ప్రకృతికి ప్రధానమని,
అవ్యక్తమని, మూలకారణమని పేర్లున్నవని మొదట్లో చెప్పాను. అన్ని జీవులూ ఈ ప్రకృతి పట్టులో
ఉన్నట్టివే. ప్రకృతినియమములను మీరి ఎవ్వరూ నడచుకోలేరు. కానీ, ఇంద్రియములను
జయించిన యోగి ప్రకృతినియమములను దాటిపోతాడు. అతడు ప్రకృతినియమములను
తలదాల్చడు. తన ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని శాసించే శక్తి అతనికి లభిస్తుంది.
సూ|| సత్త్వపురుషాన్యతాఖ్యాతిమాత్రస్య సర్వభావాధిష్ఠాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ || 3.50 ||
సత్త్వము, పురుషుల యొక్క భిన్నత్వమును సంయమం చేయడంవల్ల సర్వభావములకు
ఆధిపత్యం, సర్వజ్ఞత్వం లభిస్తాయి.
సత్త్వమంటే ప్రకృతికి లోబడిన అహంస్ఫురణ. అంటే, త్రిగుణములతో నిండి యున్న
అహంభావము. దీనిని స్పష్టంగా తెలుసుకుని, దానికంటే పురుషుడు (ఆత్మ) భిన్నమని
అనుభవపూర్వకమైన సంయమం ద్వారా గ్రహించిన యోగికి, అన్ని విధములైన భావపరంపరలకు
ఆధిపత్యము, అన్నింటినీ తెలుసుకోగలిగే జ్ఞానములు లభిస్తాయి.
సూ|| తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యం || 3.51 ||
వీటిపట్ల కూడా వైరాగ్యం కలిగితే, దోషబీజములు పూర్తిగా నశించి, కైవల్యస్థితి లభిస్తుంది.
సర్వాధిపత్యము, సర్వజ్ఞత్వములంటే కూడా విరక్తి కలిగినప్పుడు అతనిలోని దోషములనే
సంస్కారములు పూర్తిగా కాలిపోతాయి. అప్పుడు కేవలం తాను మాత్రమే ఉన్నట్టి స్థితిని యోగి
అందుకుంటాడు. దీనికే ఆత్మస్థితి యని పేరు.
సృష్టిలో ఏదైనా, లభించనంతవరకే దానిపైన ఆశ ఉంటుంది. అది లభించిన తర్వాత
దానిపైన మోజు ఉండదు. ఇది సృష్టినియమం. అధికారం లభించనంత వరకూ దానిపైన ఆశ
ఉంటుంది. కొన్నాళ్ళు దానిని చెలాయించిన తర్వాత అది విసుగు పుడుతుంది. అలాగే,
తెలియనివాటిని తెలుసుకోవాలన్న కోరిక మానవునిలో ఉంటుంది. అన్నీ తెలిసినప్పుడు అదంటే
కూడా విసుగు పుడుతుంది. దానినే విరక్తి అంటారు. జీవితంలో, ప్రపంచంలో అన్నీ విరక్తి
కలిగినప్పుడు మాత్రమే ఆత్మస్థితిని అందుకునే యోగ్యత లభిస్తుంది. దేనిపైననైనా ఆశ, కోరిక
ఉన్నంతవరకూ, అవే అసలైన దోషములు గనుక, ఆత్మస్థితి అందదు. అవి పూర్తిగా కాలి
బూడిదగా మారినప్పుడు మాత్రమే కైవల్యస్థితి అందుతుంది.
సూ|| స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్టప్రసంగాత్ || 3.52 ||
ఆ స్థానంలోనే ఉండమనిన ప్రలోభములు ఎదురైనప్పుడు, సంగము, గర్వములను
వదలిపెట్టాలి. లేదా మళ్ళీ దుఃఖం పట్టుకుంటుంది.
ఇప్పటివరకూ శక్తులు సిద్ధుల గురించి వివరించారు. ఈ సూత్రంలో, సాధనలో ఎదురయ్యే
తే
ప్రమాదములను వివరిస్తున్నారు. సాధనామార్గం అంత తేలికైనది కాదు. ఒక్కొక్క మెట్టు
ఎక్కుతున్నపుడు అనేక పరీక్షలు ఎదురౌతాయి. ఆయా స్థాయిలలో ఉండే శక్తులు యోగిని
పరీక్షిస్తాయి. ప్రలోభములకు గురి చేస్తాయి. మానవత్వ స్థాయిని దాటి దైవత్వం వైపు
పురోగమిస్తున్న సాధకుని ప్రకృతి, దానిలోని శక్తులు నానా పరీక్షలకు గురిచేస్తాయి. యక్షులు,
దేవతలు, అప్సరసలు, సిద్ధులు మొదలైన మానవాతీతజీవులు ముందుకు పోనివ్వకుండా అతనికి
అడ్డుపడి అనేక ప్రలోభములను ఆశలను చూపిస్తాయి. ‘నువ్వెంతో తపస్సుతో, యోగసాధనతో ఈ
స్థితిని అందుకున్నావు. దీనికోసం ఎన్నింటినో వదలుకున్నావు. ఈ సుఖమును ఆనందమును
అనుభవించు. ఈ లోకం చాలా ఉన్నతమైనది. ఈ భోగములు భూలోకభోగముల కంటే ఎంతో
గొప్పవి. ఇక్కడే ఉండు, ముందుకు పోకు’ అని ఆయా దేవతలు అప్సరసలు అతడిని
ఆహ్వానిస్తారు.
అతడు అందుకునే యోగభూమికలు కూడా చాలా సుఖంగా హాయిగా ఉన్నట్లు అనిపించి
అక్కడే ఉండిపోవాలని ఆ సుఖానుభూతిని నిత్యమూ అనుభవించాలని అతనికి అనిపిస్తుంది.
ఆయా ప్రలోభములకు లోనైతే అతని సాధన అక్కడితో ఆగిపోతుంది. అంతకంటే ముందుకు
అతడు పోలేడు. కనుక అతనికి యోగభ్రష్ఠత్వం కలుగుతుంది.
దేవతలనుంచి గాని, యోగసిద్ధుల నుంచిగాని, ప్రలోభములు ఎదురైనప్పుడు మోహమును,
అహంకారమును దూరం ఉంచాలి. లేకపోతే యోగి పతనం చెందుతాడు.
సూ|| క్షణతత్క్రమయోః సంయమాద్వివేకజం జ్ఞానం || 3.53 ||
క్షణములు, కాలము ఎలా గడుస్తున్నవో అన్న విషయం పైన సంయమం చేస్తే వివేకము,
జ్ఞానములు ఉదయిస్తాయి.
సంగము (మోహము), అహంభావము (ద్వేషము) ఎలా పోతాయి? నిరంతరం వెలుగుతున్న
వివేకపు వెలుగుతోనే అవి పోతాయి. వివేకమంటే ఏది నిత్యము? ఏది అనిత్యమనే స్పృహయని
మొదట్లో చెప్పాను.
కాలగమనమును గుర్తించకుండా మొద్దులాగా బ్రతకడమే వివేకం లేకపోవడానికి గల
ప్రధానమైన కారణం. కాలమంటే ఒకక్షణం మరొకక్షణంగా మారడమే. ఈ మార్పును నిత్యమూ
గమనిస్తూ ఎరుకలో ఉండేవాడికి వివేకోదయమౌతుంది. అంటే, జీవితం యొక్క అనిత్యత్వం
అర్థమౌతుంది. తన జీవితంలో ఏదీ శాశ్వతం కాదన్న స్పృహ మొదలౌతుంది. జీవితంలో ఏది
ముఖ్యం? ఏది కాదు? అన్నది తెలుస్తుంది. దేనికోసం తను పాటుపడాలి? వేటికి దూరంగా
ఉండాలి? అన్న విషయం స్పష్టంగా అర్థమౌతుంది.
కాలగమనమును గమనించకుండా ఎన్నేళ్ళు గడిచిపోతున్నా జంతువులాగా తింటూ,
నిద్రపోతూ, సుఖముల కోసం వెంపర్లాడుతూ, అవే జీవితంగా బ్రతికేవాడికి వివేకం
ఉదయించదు. దానికి విరుద్ధంగా కాలగతిని నిత్యం గమనించేవాడికి వివేకము, జ్ఞానములు
కలుగుతాయి. వీటినుపయోగించి సాధనామార్గంలో ఎదురయ్యే ప్రలోభములకు లొంగకుండా
ఉండాలి.
బో
కాలసంయమమును ఈ సూత్రం బోధిస్తున్నది.
సూ|| జాతి లక్షణ దేశైరన్యతానవచ్ఛేదాత్ తుల్యయోస్తతః ప్రతిపత్తిః || 3.54 ||
దీనివల్ల, జాతి, లక్షణము, దేశము మొదలైనవి వేరైనప్పటికీ వాటి మూలములను గ్రహించే
ప్రజ్ఞ కలుగుతుంది.
లోకంలో ఒక వస్తువుగాని, ఒక ప్రాణిగాని కొన్ని లక్షణములను కలిగి ఉంటుంది. వాటిని బట్టి,
అవి వేరే వస్తువుల కంటే, వేరే ప్రాణుల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ తేడాలను యోగి అర్థం
చేసుకోవాలి. ఒక ఉదాహరణతో స్పష్టంగా అర్థమౌతుంది.

జాతి: ఆవులన్నీ ఒక జాతికి చెందినవి. ఏనుగులన్నీ ఇంకొక జాతికి చెందినవి. కనుక


వీటిమధ్యన ‘జాతిభేదం’ ఉన్నది.
లక్షణము: అంటే, గుణమని అర్థం. ఒకే జాతికి చెందిన ఆవులలో కూడా
తేడాలుంటాయి. కొన్ని తెల్లగా ఉంటే, కొన్ని ఎర్రగా ఉంటాయి. కొన్ని పొట్టిగా ఉంటే, కొన్ని
పొడుగుగా ఉంటాయి. కొన్ని బలిష్టంగా ఉంటే, మరికొన్ని బలహీనంగా ఉంటాయి. కొన్ని
ఎక్కువ పాలిస్తే మరికొన్ని తక్కువ పాలిస్తాయి. కొన్ని శాంతంగా ఉంటే, కొన్ని దురుసుగా
ఉంటాయి. ఈ విధంగా వాటి గుణములలో, లక్షణములలో తేడాలుంటాయి. ఈ తేడాలను బట్టి,
ఒకేజాతికి చెందిన వస్తువుల మధ్య, జీవుల మధ్య తేడాలను గ్రహించాలి. దీనిని ‘లక్షణభేదం’
అంటారు.

దేశము: అంటే, ప్రదేశమని అర్థం. ఒకే శాలలో, ఒకే విధమైన రంగు, ఒకే గుణము ఉన్న
రెండు ఆవులున్నప్పటికీ, అవి ఒకే ప్రదేశంలో ఉండవు. దేని చోటులో అది ఉంటాయి. కనుక
ఇక్కడ ‘దేశభేదం’ ఉన్నది.
ఇదే విధంగా, ఒకక్షణం మరొకక్షణంతో ఎప్పటికీ ఒక్కటి కాలేదు. కాలంలోని క్షణములలో
కూడా ఈ భేదం ఉంటుంది. దేవతాలోకములలో కూడా ఈ భేదములుంటాయి. అంతర్గత
యోగికస్థితులలో కూడా ఈ భేదములుంటాయి. వీటన్నిటినీ విడివిడిగా, స్పష్టంగా, గమనించే
ప్రజ్ఞ, ఈ సంయమం వల్ల యోగికి కలుగుతుంది.
సూ|| తారకం సర్వవిషయం సర్వథావిషయం అక్రమం చేతి వివేకజం జ్ఞానం || 3.55 ||
దీనివల్ల, అన్ని విషయములనూ, అన్ని సమయములలోనూ, క్రమం తప్పకుండా నడిపించే
వివేకజ్ఞానం కలుగుతుంది.
ఈ ప్రజ్ఞ వల్ల - ‘తన జీవితంలో దేని విలువ ఏమిటి? దేనిని ఎక్కడ ఉంచాలి? ఏ పనిని
ఎప్పుడు చేయాలి? ఎవరిని ఎంత దూరంలో ఉంచాలి? తన గమ్యం ఏమిటి? దానికోసం ఏ
సాధనను చెయ్యాలి?’ - మొదలైన విషయములన్నీ స్పష్టంగా యోగికి అర్థములౌతాయి. ఈ
జ్ఞానం వల్ల, అతని జీవితం విఫలం కావడమన్నది జరుగదు. ఏ సమయమునకు ఏది జరగాలో
దానిని క్రమం తప్పకుండా జరిపించడం జరుగుతుంది.
లో లో తో జీ లో తో
లోకంలో ఎంతోమంది తమ జీవితపు చరమాంకంలో ఎంతో నిరాశకు, క్రుంగుబాటుకు
గురౌతూ ఉంటారు. వెనుకకు తిరిగి చూసుకుని - ‘అయ్యో! ఆ పనిని చేయలేకపోయామే? ఈ
పని వాయిదా పడిపోయిందే? ఈ కోరికలు తీరలేదే? ఆ పనిని అలా కాకుండా ఇంకొక విధంగా
చేసి ఉన్నట్లయితే బాగుండేదే?’ - అంటూ బాధపడుతూ ఉంటారు. వివేకజ్ఞానం లేకపోవడమే ఈ
పరిస్థితికి కారణం. సంయమాభ్యాసం వల్ల యోగిలో ఈ వివేకపువెలుగు నిరంతరమూ
వెలుగుతూ ఉంటుంది గనుక, అతనికి ఈ సమస్యలుండవు. అతని జీవితంలో పొరపాట్లు
ఉండవు. పశ్చాత్తాపమూ ఉండదు.
సూ|| సత్త్వపురుషయోః శుద్ధిసామ్యే కైవల్యమితి || 3.56 ||
సత్త్వము, పురుషుల మధ్యన శుద్ధిలో సమానత్వమే కైవల్యమని చెప్పబడింది.
‘శుద్ధమనస్సు, శుద్ధాత్మ ఒక్కటే’ అన్నది శ్రీరామకృష్ణుల అమృతవాక్కు. దీనినే ఈ సూత్రం
వివరిస్తున్నది. సత్త్వమంటే శుద్ధమైన చిత్తము. పురుషుడు ఎప్పుడూ శుద్ధుడే. సంస్కారముల
మురికివల్ల, కర్మల బరువువల్ల, చిత్తమే అశుద్ధమౌతూ ఉంటుంది. దానిని శుభ్రపరచి,
పురుషునివలె నిర్మలముగా, నిశ్చలముగా, వెలుగుతో నిండినదానిగా, దేనికీ అంటనిదానిగా,
దేనికీ చలించనిదానిగా చేసినప్పుడు, అది పురుషునితో సామ్యమును పొందుతుంది. అప్పుడది
పురుషునిలో లీనమౌతుంది. ఆ స్థితికే కైవల్యమని పేరు.
ఇదే భావమును కఠోపనిషత్తు ఈ క్రింది శ్లోకంలో చెప్పింది.
శ్లో|| యథోదకం శుద్ధే శుద్ధమాసిక్తం తాదృగేవ భవతి
ఏవం మునేర్విజానత ఆత్మా భవతి గౌతమ || (2.1.15)
‘ఓ గౌతమా! శుద్ధమైన నీరు శుద్ధమైన నీటిలో ఏ విధంగా ఒక్కటిగా కలసిపోతుందో, అదే
విధంగా మునియైనవాడు (ఆత్మ) జ్ఞానమును పొంది తానే ఆత్మయౌతున్నాడు’.

|| ఇతి పతంజలి విరచితే యోగసూత్రే తృతీయో విభూతిపాదః ||


ఇది పతంజలిమహర్షి చేత రచింపబడిన యోగసూత్రములలోని విభూతిపాదమనబడే
మూడవ అధ్యాయము.
నాలుగవ అధ్యాయము
(కైవల్య పాదము)
సూ|| జన్మౌషధి-మంత్ర-తపః-సమాధిజాః సిద్ధయః || 4.1 ||
జన్మవల్ల, ఔషధులవల్ల, మంత్రములవల్ల, తపస్సువల్ల, సమాధివల్ల - సిద్ధులు కలుగుతాయి.
యోగసాధన ఒక్కటే సిద్ధులను పొందటానికి దారి కాదు. అనేకములైన ఇతర
విధానములవల్ల కూడా ఇవి కలుగుతాయి. అయితే, వాటిలోనే మునిగిపోతే మాత్రం యోగి
భ్రష్ఠుడౌతాడు. ఏ విధంగా చూచినప్పటికీ సిద్ధులు సాధనకు ఆటంకములే. కానీ, అవి ఏయే
మార్గములలో లభిస్తాయో మహర్షి వివరిస్తున్నారు.

జన్మ: కొంతమందికి పుట్టుకతోనే ఈ సిద్ధులుంటాయి. వాటిని ఎంతో సాధనతో వారు


గతజన్మలలో పొంది ఉంటారు. కనుక పుట్టుకతోనే సహజంగా వారికి సంక్రమిస్తాయి.
సాంఖ్యయోగప్రవర్తకుడైన కపిలమహర్షి పుట్టుకతోనే ఈ విధమైన సిద్ధుడని మన గ్రంథములు
చెబుతున్నాయి. శ్రీరామకృష్ణులకు ఆరేళ్ళ వయస్సులో సమాధిస్థితి కలిగింది. వివేకానందస్వామి
చిన్నపిల్లవాడుగా ఉన్నపుడు అప్రయత్నంగా పద్మాసనంలో కూర్చుని ధ్యానంలో
మునిగిపోయేవాడు. రమణమహర్షికి పదమూడేళ్ళ వయసులో గొప్పవెలుగు కనిపించింది.
ఇవన్నీ ఎలా జరుగుతాయి? వారి పుట్టుకతోనే ఆయాస్థితులు వారితో ఉంటాయి. కనుకనే వారు
కారణజన్ములైనారు. వీరిని జన్మసిద్ధులంటారు.

ఔషధములు: అంటే, మూలికలు. మూలికాప్రయోగం వల్ల కూడా సిద్ధులను


పొందవచ్చు. వరూధినీ ప్రవరాఖ్యుల చరిత్రలో, సిద్ధుడిచ్చిన ఆకుపసరును పాదములకు
పూసుకున్న ప్రవరుడు, గాలిలో తేలుతూ హిమాలయములకు పోగలుగుతాడు. చాలామంది
తక్కువతరగతి మంత్రగాళ్ళు చేసే అంజనక్రియ మూలికాసిద్ధియే. కొంతమంది సాధువులు
గంజాయి, భంగు మొదలైన మూలికలనుంచి తయారుచేసిన మత్తుపదార్థములను తీసుకుని,
అక్కడనుంచి ధ్యానస్థితిలోకి పోతారు. తంత్రసాధనలలో మూలికల సహాయమును తీసుకోవడం
జరుగుతుంది. చాలామంది వారి దేహముల మీద ధరించే రుద్రాక్షలు చెట్లకాయలలోని
విత్తనములే. ఈ తరగతిలోని వారిని మూలికాసిద్ధులంటారు.
రసవాదం అనేది కూడా దీనికి సంబంధించినదే. ఇనుము మొదలైన క్షుద్రలోహములను
బంగారంగా మార్చడం సాధ్యమని రసవాదం అంటుంది. వేమనయోగికి ఈ విద్య తెలుసు.
శ్రీరామకృష్ణుల గురువైన పరమహంస తోతాపురికి ఈ విద్య తెలుసు. తెలుగునేలలోని
శ్రీశైలపర్వతం మీద, ప్రాచీనకాలంలో రససిద్ధులుండేవారని చరిత్ర చెబుతున్నది.
పాదరసము, గంధకము, కొన్నిచెట్ల ఆకులు, మొగ్గలు, వేర్ల రసములనుపయోగించి
ఇనుమును బంగారంగా మార్చేవారు. నిలకడలేని పాదరసమును స్థంభింపజేయడం ఈ విద్యకు
నే కీ చేసే చో వీ
మూలం. నేటికీ పాదరసలింగములను చేసేవారు కొన్నిచోట్ల ఉన్నారు. పాదరసము, వీర్యము
ఒకేలాగా ఉంటాయి గనుక, వీర్యస్థంభనప్రక్రియ (బ్రహ్మచర్యం) తో, ఇనుములాంటి స్థితిలో ఉన్న
మానవుడు బంగారంగా (దేవతగా) మారవచ్చన్న భావన పుట్టింది. బాహ్యమైన రసవాదం
ఇనుమును బంగారంగా మారుస్తుంది. అంతరిక రసవాదం (యోగం) మనిషిని సిద్ధునిగా
మారుస్తుంది. రెండూ రసవాదములే. మొదటిదానిలో పాదరసస్థంభనమనేది కీలకం.
రెండవదానిలో వీర్యస్థంభనమనేది కీలకం.
ఇదే తర్కమును ఇంకొంచం పొడిగించినపుడు, దేహమును కూడా ఎంతకాలమైనా జీవంతో
ఉంచవచ్చని తెలుస్తున్నది. సరియైన పోషణ లేనప్పుడు దేహధాతువులు కృంగి దేహం
అనారోగ్యమునకు గురౌతుంది. ధాతువులను కృంగకుండా ఉంచగలిగితే దేహం ఎన్నేళ్ళైనా బ్రతికే
ఉంటుంది, అనారోగ్యం దరిచేరదు, చావు దగ్గరకు రాదు. ప్రాచీన ఆయుర్వేదంలో ఈ
పద్ధతులున్నాయి. కానీ, నేటివారికి ఇవి తెలియవు.

మంత్ర ములు: మంత్రసాధన కూడా సిద్ధులను కలిగిస్తుంది. అయితే, ఇది చాలా


ఆలస్యంగా ఫలితములనిచ్చే దారి. ఎన్నో ఏండ్ల సాధన తర్వాత గాని మంత్రసిద్ధి కలుగదు.
ప్రసిద్ధిగాంచిన మంత్ర, లయ, హఠ, రాజయోగములలో మంత్రయోగం అన్నింటిలోకి అధమమని,
రాజయోగం ఉత్తమమని చెప్పబడింది. ఒక్కొక్క సిద్ధిని పొందడానికి ఒక్కొక్క దేవతాఉపాసనను
సాధకుడు చేయవలసి ఉంటుంది. వాటికి ప్రత్యేకములైన మంత్రములుంటాయి. ఆయా
నియమనిష్ఠలను పాటిస్తూ ఆయా మంత్రసాధనలను ఎన్నో ఏళ్ళపాటు చేయవలసి ఉంటుంది.
చాలాసార్లు, ఒక మంత్రం సిద్ధించడానికి ఒక జన్మకాలం పడుతుంది.
మంత్రశాస్రమొక మహాసముద్రం. వీటిలో పురుష, స్త్రీ, నపుంసక మంత్రములని, అదే విధంగా
క్షుద్రమంత్రములని, మహామంత్రములని, వైదిక, పౌరాణిక, తాంత్రిక మంత్రములని రకరకములైన
భేదములున్నాయి. వీటిని సాధనచేసి సిద్ధిని పొందినవారు మంత్రసిద్ధులు.

తపస్సు: దేహము, ప్రాణము, ఇంద్రియములను ఎండబెట్టి తపింపజేయడమే తపస్సు.


ఉపవాసం ఒక విధమైన తపస్సు. దీనిలో నిర్జలోపవాసము, జలోపవాసము, ఒక్కపూట తినడము,
పిండి తిని ఉండటం, పండ్లు తిని ఉండటం, కృచ్ఛచాంద్రాయణాది వ్రతములు మొదలైన ఎన్నో
విధములున్నాయి. పంచేంద్రియములను వాటివాటి విషయములలోకి పోనివ్వకుండా
నిగ్రహించడం కూడా తపస్సే. పూర్వకాలంలో మునులు చెట్లకొమ్మలకు తలక్రిందులుగా
వ్రేలాడుతూ తపస్సు చేసేవారు. ప్రాణాయామం కూడా తపస్సే. బ్రహ్మచర్యం ఉత్తమమైన తపస్సని
చెప్పబడింది. ‘కలియుగంలో సత్యమును పాటించడమే ఉత్తమమైన తపస్సు’ అని
శ్రీరామకృష్ణులనేవారు. ఈ విధంగా అనేక విధములైన తపస్సులున్నాయి. వీటివల్ల కూడా సిద్ధులు
కలుగుతాయి. తపస్సువల్ల సిద్ధులను పొందినవారు తపోసిద్ధులు.
తపస్సులలో ఎన్నో రకములున్నాయి. వాటిని శారీరక, వాచిక, మానసిక తపస్సులని
స్థూలంగా విభజింపవచ్చు. ఇవి మరలా, సాత్విక, రాజసిక, తామసిక తపస్సులని మూడు
విభాగములుగా ఉంటాయి. ఈ వివరమంతా భగవద్గీత 17 వ అధ్యాయంలో చెప్పబడింది.
శ్లో దే మ్
శ్లో|| దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే || (17.14)
‘దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం, శుచిగా ఉండటం,
కపటంలేని ప్రవర్తన, బ్రహ్మచర్యము, అహింస - ఇవి శారీరిక తపస్సని చెప్పబడతాయి’.
శ్లో|| అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే || (17.15)
ఎదుటివారిలో ఉద్రేకమును కలిగించని మాటలు, సత్యమైన, ప్రియమైన, హితకరమైన
మాటలు, శాస్త్రాధ్యయనమును చేయడం - ఇవి వాక్కు పరమైన తపస్సని చెప్పబడుతున్నది.
శ్లో|| మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే || (17.16)
మానసికంగా ప్రశాంతంగా ఉండటం, ప్రవర్తనలో సౌమ్యత్వం, మౌనం, ఆత్మనిగ్రహం,
శుద్ధమైన ఆలోచనలను కలిగి ఉండటం - ఇది మానసికమైన తపస్సని చెప్పబడుతుంది.
ఇప్పుడు సాత్విక, రాజసిక, తామసిక తపస్సులు ఏవో చెప్పబడుతున్నది.
శ్లో|| శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే || (17.17)
పరము (మోక్షము) నందు శ్రద్ధతో, ఫలితములను కోరకుండా, ఈ మూడు తపస్సులను
మానవులు చేస్తే, దానిని సాత్వికమైన తపస్సని అంటారు.
శ్లో|| సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ || (17.18)
(నలుగురిలో) గౌరవం కోసం, గొప్ప కోసం, (ఇతరులతో) పూజింపబడటం కోసం, కపటంతో
కూడిన అహంకారంతో, ఏదైతే చేయబడుతుందో అది రాజసికతపస్సు. అది చంచలమైనది,
అస్థిరమైనది.
శ్లో|| మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ || (17.19)
మూఢత్వంతో, తనను తాను పీడించుకుంటూ, ఇతరులను బాధపెడుతూ చేసే తపస్సు
తామసతపస్సు అనిపించుకుంటుంది. నేటికాలపు ‘పార్ట్ టైం’ దీక్షలన్నీ ఈ కోవకు
చెందుతాయన్నది గమనార్హం.

సమాధి: అంటే, ఏకాగ్రతాపూర్వకమైన ధ్యానమని అర్థం. మనస్సును ఏకాగ్రం


చేయడంవల్ల కూడా అనేక సిద్ధులను పొందవచ్చు. దీనికే సంయమమని ఇంకొక పేరు.
యోగసూత్రములలో ఈ విధానమే ప్రముఖంగా చెప్పబడింది. దీనిననుసరించేవారు
యోగసిద్ధులనబడతారు.

లో
ఔషధ, మంత్ర, తపోవిధానములు ఇతర యోగ, తంత్రగ్రంథములలో చెప్పబడినాయి.
సూ|| జాత్యంతరపరిణామః ప్రకృత్యాపూరాత్ || 4.2 ||
జాతి (జన్మ) లో మార్పు ప్రకృతితో పూరింపబడటం వల్ల కలుగుతుంది.
దేహంలోని మార్పు ఎలా కలుగుతుంది? వయసుతో బాటు దేహంలోని ప్రకృతి మారుతుంది.
ప్రకృతి అంటే ఏమిటి? పంచభూతములు, త్రిగుణములే ప్రకృతి. మన పూర్వకర్మను బట్టి, పుట్టుకతో
మనకొక నిష్పత్తిలో పంచభూతములు లభిస్తాయి. అంటే, మన దేహంలో ఒక నిష్పత్తిలో అవి
ఉంటాయి. దేహయాత్రలో అవి ఖర్చై పోతూ ఉంటాయి. ఆహారం ద్వారా వాటిని మనం తిరిగి
పూరించుకుంటూ ఉంటాం. కాలంతోబాటు దేహంలోని పంచభూతములు మారుతూ ఉంటాయి
గనుక, దేహం కూడా మారుతూ ఉంటుంది. అయితే, ప్రకృతి దిగజారుతూ, పతనం వైపుగా
మారుతూ ఉంటుంది గనుక, మరణంవైపు ప్రయాణిస్తూ ఉంటుంది గాని దివ్యత్వం వైపుగా
ఎదగదు. దానికి కారణం, ఇంద్రియభోగముల కోసం పంచభూతములు వాడుకోబడటమే.
సామాన్యమానవులలో ప్రకృతిమార్పు ఈ విధంగా అధోమార్గంలో జరుగుతుంది.
అదే, యోగులలో అయితే, పరిణామమనేది ఊర్ధ్వముఖంగా దైవత్వంవైపు సాగిపోతూ
ఉంటుంది గనుక, అవసరమైనప్పుడు పాత దేహకణములను మార్చి క్రొత్త కణములతో నింపుకునే
ప్రక్రియ వారికి తెలిసి ఉంటుంది. మధ్యమస్థాయికి చెందిన యోగులలో ఇది ప్రాణాయామం వల్ల
జరుగుతుంది. ఉన్నతస్థాయికి చెందిన యోగులలో ధ్యానంవల్ల జరుగుతుంది. ఇంకా
ఉన్నతస్థాయికి చెందిన యోగులలో ఉత్త సంకల్పమాత్రంతోనే ఇది జరుగుతుంది. ఈ ప్రక్రియలో
సిద్ధహస్తులైన యోగులు ఎన్ని వేల ఏండ్లైనా అదే దేహంతో ఉండగలుగుతారు. అగస్త్యమహర్షి,
క్రియాయోగ బాబాజీ మొదలైన సిద్ధులు ఈ ప్రక్రియవల్లనే ఎన్నో వేల ఏండ్ల నుంచి అదే దేహంతో
ఈ భూమిపైన ఉన్నారు. అరవిందులు ఈ ప్రక్రియను సాధించడం ద్వారా దివ్యదేహమును
పొందాలని ప్రయత్నించారు.
ఈ క్రింది పట్టికను గమనించండి.
పరిణామ స్థాయి ప్రకృతి పూరణం ప్రక్రియ
సామాన్యులు ఆహారంతో భౌతికం
మధ్యతరగతి సాధకులు ప్రాణాయామంతో ప్రాణికం
ఉత్తమతరగతి సాధకులు ధ్యానంతో మానసికం
సిద్ధులు సంకల్పమాత్రంతో ఆత్మికం

సూ|| నిమిత్తమప్రయోజకం ప్రకృతీనాం వరణభేదస్తు తతః క్షేత్రికవత్ || 4.3 ||


పొలమును సాగుచేసే రైతులాగా, ప్రకృతికి నిమిత్తంతో గుణభేదములతో ప్రయోజనం లేదు.
పొలమును సాగు చేసే రైతు ఏం చేస్తాడు? ఒక పొలంలోని నీటిని ఇంకొక పొలంలోకి
మళ్ళించాలన్నపుడు, ఆ నీటినంతటినీ చేతులతో తోడి ఇంకొక పొలంలో పోయడు. నీటి

ఏ చే నీ
ప్రవాహమునకు అడ్డుగా ఉన్న మట్టిని తొలగించి దారిని ఏర్పాటు చేస్తాడు. నీరు తనంతట
తానుగా ఆ దారిలో పారి, ప్రక్క పొలమును తడుపుతుంది. లేదా, మట్టిలోని పోషకములు పైరుకు
అందాలంటే, రైతు ఏం చేస్తాడు? కలుపుమొక్కలను తొలగించివేస్తాడు. అప్పుడు భూమిలోని
పోషకములు వాటంతట అవే పైరుకు అందుతాయి. యోగసాధనకూడా ఇదే విధంగా
జరుగుతుంది.
ఈ సూత్రమునకు అనేకములైన అర్థములున్నాయి. వివరంగా చూద్దాం.
దేహమునకు రోగం ఎందుకు వస్తుంది? దేహకణములకు, ప్రకృతిలోని పంచభూతములు
సరిగా అందనపుడు రోగం కలుగుతుంది. పైరుకు భూమిలోని పోషకములు సరిగా అందనపుడు
పైరు బలహీనపడుతుంది. అప్పుడు కలుపు మొక్కలను తొలగించాలి. అంటే, దేహంలో ఏ
దోషములైతే ఉంటూ, ప్రకృతి పూరణమునకు (పంచభూతముల సరఫరాకు) అడ్డుపడుతున్నాయో
వాటిని తొలగించాలి. అప్పుడు ప్రకృతిసరఫరా యథావిధిగా జరుగుతుంది. అప్పుడు ఆరోగ్యం
తిరిగి కలుగుతుంది. దీనికోసం ఆహార, విహారములలో మితమును, సమతుల్యతను, ఎరుకను
ఉపయోగిస్తూ సరియైన మందులను వాడాలి. ఇది సామాన్యమానవులు చేసే పని. కొందరు
యోగులు దీనిని ప్రాణాయామంతో చేస్తారు. మరికొందరు ధ్యానశక్తితో చేస్తారు. మరికొందరు
ఆత్మశక్తితో చేస్తారు.
ఆధ్యాత్మికంగా కూడా, త్రిగుణములతో నిండిన సంస్కారములే, పొలంలోని అడ్డుకట్టలలాగా,
దైవశక్తి అనే నీరు సాధకునిలోకి పారకుండా అడ్డుతగులుతూ ఉంటాయి. రైతు అడ్డుకట్టలను
తొలగించి నీటి ప్రవాహమును సాగు చేసినట్లుగా, లేదా, కలుపుమొక్కలను తీసి పారవేసినట్లుగా,
తనలోనుంచి వాటిని తొలగించడమే సాధకుడు చేయవలసిన పని. ఇది యమనియమములను
అభ్యసించడం, ధారణ, ధ్యానము, సమాధులతో కూడిన సంయమమును సాధించడం వల్ల
జరుగుతుంది. అయితే, ఒక్క విషయమును గమనించాలి.
చిత్తం లోలోతులలో దాగిఉన్న సంస్కారములను, దేహధాతువులలోని దోషములను,
తొలగించడం ఒక్కటే యోగి యొక్క కర్తవ్యము. మిగిలిన పనిని ప్రకృతి చూచుకుంటుంది.
తలుపులు తెరిస్తే సూర్యకాంతి లోనికి వచ్చినట్లుగా ఈ ప్రక్రియ జరుగుతుంది. సూర్యకాంతి
ఎప్పుడూ ఉంటుంది. కానీ, మూసిన తలుపుల లోనుంచి అది లోనికి రాదు. మూసిన తలుపులంటే
- సాధకునిలో ఉన్న కామక్రోధాది షడ్వర్గములు, అష్టపాశములు. దైవశక్తి సాధకునిలోకి
అవతరించకుండా అవే అడ్డుపడుతూ ఉంటాయి. వాటిని తొలగించుకోవడమే సాధకుని పని.
ఈ సూత్రంలో పతంజలిమహర్షి చెప్పినదానినే శ్రీరామకృష్ణులు ఈ సులభమైన మాటలలో
చెప్పారు.
‘దైవకృప అనే గాలి ఎప్పుడూ వీస్తూనే ఉన్నది. నీ తెరచాపను విప్పడమే నీవు చేయవలసిన
పని’.
సాధన అంటే, తెరచాపను విప్పడమే. దీనిని ఎలా చేయాలి? త్రిగుణములు ఒక్కొక్కటి తన
క్రిందిదానిని నిర్వీర్యం చేస్తాయి. లేదా, ఆ అడ్డుకట్టను తొలగిస్తాయి. అంటే, తమస్సును రజస్సు
తొలగిస్తుంది. రజస్సును సత్త్వం తొలగిస్తుంది. సత్త్వగుణం పూర్తిగా శుద్ధి అయినప్పుడు శుద్ధాత్మ
దానిలో ప్రతిఫలిస్తుంది. ఒక్కొక్క పొలముకున్న అడ్డుకట్టను రైతు తొలగించినపుడు నీరు ఆ
పొలములోకి పారినట్లుగా ఇది జరుగుతుంది.
సూ|| నిర్మాణచిత్తాన్యస్మితామాత్రాత్ || 4.4 ||
తయారైన చిత్తములన్నీ అస్మితామాత్రములే.
అస్మిత అంటే అహంభావన. మనస్సుకు మూలం అహంస్ఫురణ. ‘అహం’ లేనివానికి మనస్సు
లేదు. అహమే దైవశక్తి అవతరణకు పెద్ద అడ్డు. అది లేనప్పుడు చిత్తంలోకి దైవశక్తి (ఆత్మశక్తి)
సూటిగా దిగి వస్తుంది.
కేవలస్థితిని అందుకొనని యోగి, మరలా జన్మించినపుడు, ఎటువంటి చిత్తం అతనికి
ఉంటుంది? తన అహంభావనకు అనుగుణమైన చిత్తమే ఉంటుంది.
సాత్వికాహంకారం ఉన్నవాడికి సాత్వికమైన చిత్తం ఉంటుంది. సాత్వికాహంకారమంటే,
షడ్వర్గములు బాగా తగ్గిపోయిన స్థితి. రాజసాహంకారం ఉన్నవాడికి రాజసమైన చిత్తమే
ఉంటుంది. అంటే, నిలకడలేకుండా, దురహంకారంతో విర్రవీగే మనస్సు ఉంటుంది.
తామసాహంకారం ఉన్నవాడికి తామసచిత్తం ఉంటుంది. అంటే, బద్ధకం, సోమరితనములతో
కూడిన చిత్తం ఉంటుంది.
సూ|| ప్రవృత్తిభేదే ప్రయోజకం చిత్తమేకమనేకేషాం || 4.5 ||
ప్రయోజనం కోసం ప్రవృత్తిభేదములతో అనేకములుగా కనిపించే చిత్తం నిజమునకు ఒక్కటే.
మానవులలో ఒక్కొక్కరిలో ఒక్కొక్కటిగా కనిపించే మనస్సు, నిజమునకు ఒకే మనస్సు. దానినే
విశ్వమానసం అంటారు. విశ్వమానసంలో మానవుల మనస్సులన్నీ చిన్నచిన్న ముక్కలు.
ఒక్కొక్కరిలో ఉన్న త్రిగుణముల నిష్పత్తిని బట్టి, ఆయా జన్మల ప్రయోజనముల కోసం, వారి వారి
మనస్సులు వేర్వేరుగా కనిపించినప్పటికీ, అవన్నీ విశ్వమానసంలో భాగములే.
సూ|| తత్ర ధ్యానజ మనాశయం || 4.6 ||
ధ్యానంలో పుట్టేదానికి ఆధారం లేదు.
మొదటిసూత్రంలో - జన్మవల్ల, ఔషధులవల్ల, మంత్రములవల్ల, తపస్సువల్ల, సమాధివల్ల -
సిద్ధులు కలుగుతాయని చెప్పబడింది. ఈ సూత్రంలో దానికి వివరణ ఇవ్వబడుతున్నది. వీటివల్ల
కలిగే అనుభవములు, మానసికస్థితులు అన్నీ ఒకదానికంటే ఒకటి విభిన్నములుగా ఉంటాయి.
సమాధివల్ల కలిగే స్థితి ఆధారరహితంగా, గుణరహితంగా, కర్మరహితంగా, సంస్కారరహితంగా
ఉంటుంది. కానీ, జన్మ, ఔషధి, మంత్రము, తపస్సుల వల్ల కలిగే స్థితులు దీనంత శుద్ధంగా
ఉండవు. వాటిలో గుణదోషములు మిళితములై ఉంటాయి.
సూ|| కర్మాశుక్లాకృష్ణం యోగినస్త్రివిధమితరేషాం || 4.7 ||
యోగుల కర్మ నలుపూ కాదు, తెలుపూ కాదు. ఇతరులకు మాత్రం మూడు విధములుగా
ఉంటుంది.
చేసే దో
యోగసిద్ధిని పొందినవాడు చేసే కర్మ ఎలా ఉంటుందో ఈ సూత్రం వివరిస్తున్నది. కర్మ
అనేదానిని రంగులలో వివరించాలంటే, నాలుగు విధములుగా ఉంటుంది.
నలుపు - చెడ్డకర్మ;
తెలుపు - మంచికర్మ;
తెలుపు నలుపుల మిశ్రమం - పుణ్యపాపముల మిశ్రమకర్మ;
ఈ రెండూ కానిది - కర్మాతీత కర్మ.
నలుపంటే దుష్టకర్మ లేదా చెడుకర్మ. తెలుపంటే పుణ్యకర్మ లేదా మంచికర్మ. యోగి చేసే కర్మ
మంచీ కాదు, చెడూ కాదు, వాటి మిశ్రమమూ కాదు. అది అతనికి మంచి ఫలితమునూ ఇవ్వదు,
చెడ్డఫలితమునూ ఇవ్వదు. ఎందుకంటే, అతని కర్మకు వెనుక స్వార్థపూరితమైన ఉద్దేశ్యం ఉండదు.
కర్మకోసం కర్మను అతడు చేస్తాడు. అంతకంటే అతనికి వేరే ఉద్దేశ్యం ఉండదు. కనుక ఆ
కర్మఫలితం అతనిని బంధించలేదు.
దీనికి భిన్నంగా, సామాన్యులు చేసే కర్మ మాత్రం మూడు విధములుగా ఉంటుంది. అంటే,
మంచి, చెడు, వీటి మిశ్రమం - ఈ విధమైన మూడు రకములుగా ఉంటుంది. ఎందుకంటే, వారి
కర్మ వెనుక ఈ విధములైన మూడురకముల ఉద్దేశ్యములు, సంకల్పములు ఉంటాయి గనుక.
సూ|| తతస్త ద్విపాకానుగుణానా మేవాభివ్యక్తి ర్వాసనానాం || 4.8 ||
సంస్కారముల పక్వతను బట్టి వాటి అభివ్యక్తి ఉంటుంది.
సంస్కారములన్నీ పుణ్యపాపముల మిశ్రమములుగాను, సత్త్వ రజో తమో గుణముల
మిశ్రమములుగాను ఉంటాయి. కనుక వాటిద్వారా జరిగే కర్మలు పండి, ఫలితములను ఇచ్చే
సమయం కూడా ఆయా దినుసుల నిష్పత్తిని బట్టి ఉంటుంది. ఏ కర్మ వెనుక ఏ సంస్కారం ఏయే
పాళ్ళలో ఉన్నది? అది ఎప్పుడు పండి ఫలితమునిస్తుంది? అన్నది సామాన్యదృష్టికి అర్థం కాదు.
సంస్కారముల మూలములను, వాటి బలాబలములను, త్రిగుణముల నిష్పత్తులను స్పష్టంగా
చూడగలిగే నిశితమైన యోగదృష్టి ఉన్నపుడు మాత్రమే వాటి పక్వకాలం ఎప్పుడన్నది కూడా
అర్థమౌతుంది.
పుణ్యకర్మవల్ల సత్త్వగుణం పెరుగుతుంది. దానివల్ల సాత్వికమైన జన్మ లభిస్తుంది. లేదా
దేవతాలోకంలో దేవతగా జన్మ లభిస్తుంది. పాపకర్మ వల్ల తామసగుణం పెరుగుతుంది. దానివల్ల
జంతుజన్మ కలుగుతుంది. మిశ్రమకర్మ వల్ల రజోగుణం పెరుగుతుంది. దానివల్ల మానవజన్మ
లభిస్తుంది. కానీ జంతువులన్నీ తమోగుణంతో నిండి ఉండవు. అలాగే మానవులందరిలోనూ
రజోగుణం ఒక్కటే ఉండదు. దేవతలలో కూడా అసూయ, కామక్రోధములు ఉన్నట్లు
పురాణములు చెబుతున్నాయి. అంటే, వారిలో సత్త్వగుణంతో బాటు మిగతా గుణముల ఛాయలు
కూడా ఉన్నాయి. ఈ భేదం ఎందువల్ల కలుగుతుంది?
ఏ జీవిలోనూ పూర్తిగా ఒకే గుణం ఉండదు. త్రిగుణములు మూడూ, రకరకములైన
నిష్పత్తులలో కలసిమెలసి ఉంటాయి. ఆయా కర్మలు చేసుకున్నపుడు ఉన్న తీవ్రతను బట్టి, కర్మ
నే ఏ
అనేది, దృఢకర్మ, దృఢాదృఢకర్మ, అదృఢకర్మ అని మూడు విధములుగా ఏర్పడుతుంది. ఆయా
కర్మల తీవ్రతలను బట్టి దేవతాజన్మ గాని, మానవజన్మగాని, జంతుజన్మగాని, క్రిమికీటకాది జన్మలు
గాని, చెట్టుపుట్టల జన్మలుగాని కలుగుతాయి. కానీ, మిగతా సంస్కారములు, కర్మలు దాగుకొని
ఉంటాయి. వాటికి అనుగుణములైన జన్మలను ఆ జీవి ఎత్తినపుడు, లేదా వాటికి అనుగుణములైన
పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఆయా సంస్కారములు బయటకు వస్తాయి.
ఉదాహరణకు - మానవజన్మ ఎత్తిన ఒకనిలో జంతుసంస్కారములు ఉన్నాయని
అనుకుందాం. కానీ అవి బయటకు రావు. దాగుకొని ఉంటాయి. అవకాశం దొరకినప్పుడు, లేదా,
వాటికి అనుగుణమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ జంతుప్రవృత్తి బయటపడుతూ ఉంటుంది.
అప్పుడా మానవుడు జంతువులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ మానవజన్మలో అటువంటి
అవకాశం దొరుకకపోతే, భవిష్యత్తులో జంతువుగా పుట్టినపుడు ఆ సంస్కారములు బయటకు
వస్తాయి. అంటే, జన్మను బట్టి, అవకాశమును బట్టి, సంస్కారములు బయటపడతాయి. ఈ
సూక్ష్మమైన విషయమునే ఈ సూత్రం వివరిస్తున్నది.
క్లుప్తంగా చెప్పాలంటే - సత్త్వ, రజో, తమో గుణములతో కూడిన సంస్కారములు, ఆయా
కర్మలరూపంలో - వాటికి తగిన జన్మ, వాటికి తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు బయటకు
వస్తాయి.
సూ|| జాతి దేశ కాల వ్యవహితానా మప్యానంతర్యం స్మృతిసంస్కారయో రేకరూపత్వాత్ || 4.9 ||
జ్ఞాపకము, సంస్కారములు ఒకటే కనుక - జన్మ, దేశము, కాలము మొదలైనవాటి వలన,
మధ్యలో అంతరం వచ్చినప్పటికీ - కొనసాగింపనేది ఉంటుంది.
సంస్కారములనేవి జ్ఞాపకములుగా (ముద్రలుగా) చిత్తంలో ఉంటాయి. అప్పటి జన్మను,
దేశమును, కాలమును బట్టి, కొన్ని సంస్కారములు కర్మలుగా బయటపడే అవకాశం
లేకున్నప్పటికీ, అవి చిత్తంలో లేకుండా పోవు. వాటికి తగిన జన్మ, అవకాశం వచ్చినపుడు అవి
బయటకు వస్తాయి. వాటికి అనుగుణములైన కర్మలను జీవులచేత చేయిస్తాయి.
ఉదాహరణకు - ఒక మనిషిని తీసుకుందాం. మామూలుగా ఉన్నపుడు అతడు అందరిలాగా
రాగద్వేషములతో నిండి యున్నట్లుగా కనిపిస్తాడు, ప్రవర్తిస్తాడు. కొన్నిసార్లు మాత్రం దేవతలాగా
ప్రవర్తిస్తాడు. అప్పుడు అతనిలోని దేవతా (సాత్విక) సంస్కారములు బయటకు వస్తాయి.
కొన్నిసార్లు మాత్రం జంతువులాగా విచక్షణను మరచి ప్రవర్తిస్తాడు. ఆ సమయంలో అతనిలోని
తామస, రాజస సంస్కారముల మిశ్రమం బయటకు వస్తూ ఉంటుంది. ఒక విధమైన
సంస్కారములు ఉద్రేకించినపుడు, మిగతా సంస్కారములు అతనిలో లేవని అర్థం కాదు. వాటికి
తగిన పరిస్థితులు ఆ సమయంలో లేవు గనుక, అవి నిద్రాణంగా చిత్తంలో ఉండిపోతాయి. ఈ
భేదం మూడు విధములుగా ఉంటుంది.
జాతి (జన్మ): ఒక్కొక్క వంశంలో, ఒక్కొక్క కుటుంబంలో కొన్ని కొన్ని వారసత్వ
లక్షణములుంటాయి. అవి మానసికంగా, శారీరికంగా, ఆరోగ్యపరంగా, అలవాట్ల పరంగా
ఉంటుంటాయి. జాగ్రత్తగా గమనిస్తే ఈ పోకడలు తరతరాలుగా దిగివస్తూ కనిపిస్తాయి. ఒక
లో మే డే
జన్మలో కొన్నికొన్ని సంస్కారములు మాత్రమే బయటపడే అవకాశం ఉండవచ్చు. కొంత కర్మ
మాత్రమే పండి అనుభవమునకు వచ్చే పరిస్థితి ఉండవచ్చు. అప్పుడు మిగతా సంస్కారములు
చిత్తం లోతులలో ఉండిపోతాయి. వాటికి అనుకూలములైన జన్మలకోసం అవి వేచి చూస్తూ
ఉంటాయి. అవి లభించినపుడు పక్వమునకు వస్తాయి.
దేశము: ఒకే జన్మలో కూడా తానున్న ప్రదేశమును బట్టి, ఒక మనిషియొక్క ఆలోచనలు,
ప్రవర్తనలు ఉంటాయి. దేవాలయంలో ప్రవర్తించినట్లుగా, జూదశాలలో ప్రవర్తించరు. చిన్నపుడు
ప్రవర్తించిన విధంగా, పెద్దవయసులో ప్రవర్తించరు. భారతదేశం నుంచి పాశ్చాత్యదేశములకు
గాని, సింగపూర్ వంటి దేశములకు గాని పోయినవారు అక్కడున్నంతవరకూ ఎంతో పద్ధతిగా
శుభ్రంగా ఉంటారు. కానీ తిరిగి మన దేశమునకు వచ్చిన వెంటనే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ
ఉంటారు. దేశం మారడం వల్ల వచ్చిన మార్పు ఇది. కానీ లోని మనిషిలో మార్పు రాదు. అది
ఊరకే అణగి ఉంటుంది. దేశమును బట్టి తాత్కాలికముగా ఆలోచనలలో, ప్రవర్తనలలో మార్పులు
వచ్చినా, లోనున్న మూలసంస్కారములు మాత్రం పోవు. సరియైన తరుణం వచ్చినపుడు అవి
బయటపడతాయి.
కాలము: దీనిని బట్టి కూడా సంస్కారములు, ప్రవర్తనలు, కర్మలు మారుతూ ఉంటాయి.
అన్ని ఋతువులలోనూ ఒకే విధమైన ఆలోచనలు కలగవు. ఒకే విధములైన ప్రవర్తనలూ ఉండవు.
అదేవిధంగా, ఒకేరోజులో కూడా, ఒక్కొక్క సమయమును బట్టి అవన్నీ మారిపోతూ ఉంటాయి.
అంతమాత్రం చేత మిగతా సంస్కారములు అతనిలో లేవని అనుకోకూడదు.
సూ|| తాసామనాదిత్వం చాశిషో నిత్యత్వాత్ || 4.10 ||
‘కోరిక’ అనేది నిత్యం గనుక అవి (సంస్కారములు) కూడా మొదలు లేనట్టివే.
కోరికకు మొదలనేది ఎక్కడో ఎంత వెదికినా కనిపించదు. అదే విధంగా, సంస్కారములకు
మొదలనేది కూడా ఎక్కడా కనిపించదు. అవి భూమి వంటివి. భూమికి మొదలెక్కడ అంటూ
భూమిపైన ఉండి వెదికితే ఎక్కడా కనిపించదు. ఎందుకంటే అది గుండ్రంగా ఉన్నది గనుక, ఆ
వెదుకుతున్నవాడు అదే భూమిమీద గుండ్రంగా తిరుగుతూనే ఉంటాడు గాని, దాని మొదలును
కనుక్కోలేడు. దానిని దాటి ఆకాశంలోకి పోయినవానికి మాత్రమే, భూమియొక్క మొదలు ఎక్కడో
తెలుస్తుంది. ఎక్కడ? అంటే - ‘ఎక్కడికక్కడే’ అన్న జవాబు వస్తుంది. భూమి ఆకాశమును
తాకుతున్న ప్రతి చోటూ దానికి మొదలే.
జిల్లెళ్ళమూడి అమ్మగారిని ఒకరిలా అడిగారు - ‘అమ్మా! సృష్టికి కేంద్రం ఎక్కడ?’
అమ్మ ఇలా జవాబిచ్చారు - ‘ఎక్కడికక్కడే’.
కనుక కోరికలకు, సంస్కారములకు మొదలెక్కడ? అని వెదుకుతుంటే వాటికి
అంతూపొంతూ కనిపించదు. ఎక్కడికక్కడే అవి పుడుతూ ఉంటాయి, అణగిపోతూ ఉంటాయి.
మళ్ళీ పుడుతూ ఉంటాయి.
‘నేను ఉండాలి’ అనిన తృష్ణయే సమస్తదుఃఖమునకూ మూలమని బుద్ధుడన్నాడు. ఈ కోరిక
జీ లో ఏ జీ లే
అన్ని జీవులలోనూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఏ జీవి కూడా తను లేకుండా పోవాలని
కోరుకోదు. ఈ తర్కమును మరికొంచం పొడిగిస్తే ఈ సూత్రం బాగా అర్థమౌతుంది.
ఒకసారి తీపిని రుచి చూచినవానికి, మరొకసారి తీపిమీదకు మనసు పోతుంది. మళ్ళీ
ఇంకొకసారి తీపిని తిన్నపుడు, మొదటిరుచిని గుర్తు తెచ్చుకుని దానిని గుర్తిస్తాడు. కనుక, ఒక
అనుభవమును కోరుతున్నాడంటే, ఇంతకుముందు అదే అనుభవం అతనికి ఉన్నదని అర్థం.
అనుభవం లేకుండా కోరిక కలగడానికి ఆస్కారం లేదు.
ఉదాహరణకు - అప్పుడే పుట్టిన పిల్లవాడు కూడా సుఖమును (లాలింపును, ఆకలి తీరడాన్ని)
కోరుకుంటాడు, నొప్పికి ఏడుస్తాడు. అంటే, సుఖదుఃఖములు ఆ జీవికి అంతకుముందే
అనుభూతిలో ఉన్నాయని, ఆ సంస్కారములు ఆ బిడ్డలో అప్పటికే ఉన్నాయని, అర్థమౌతున్నది.
అంతేకాదు, మరణమును కూడా ఆ జీవి అంతకు ముందు అనుభవించినదని అర్థమౌతున్నది.
లేకపోతే, అప్పుడే పుట్టిన బిడ్డలో మరణమంటే భయం ఎందుకుంటుంది?
ఈ తర్కమును బట్టి - పునర్జన్మ ఉన్నదని, మనస్సులో సంస్కారములు ఉండటం నిజమే అని
అర్థమౌతున్నది.
ఇదే తర్కమును ఇంకొంచం పొడిగించగా ఇంకొక విషయం గోచరిస్తుంది. ఈ జన్మలో ఉన్న
అనుభూతులకు, గత సంస్కారములు కారణములైనప్పుడు, వాటికి కారణములేవి? ఈ విధంగా
వెనుకకు పోగా పోగా, అసలు మొదటిజన్మలో సంస్కారములు ఎలా ఏర్పడ్డాయి? అక్కడ గత
అనుభవం లేదు కదా? సంస్కారములు ఏర్పడే అవకాశం లేదు కదా? మరి మొదటిజన్మ ఎలా
కలిగింది? అనిన ప్రశ్న ఉదయిస్తుంది. భగవంతుడు లేదా దేవుడు ఆ మొదటిజన్మను ఇచ్చాడని
అనుకుంటే, అతడు కొంతమందికి మంచిజన్మను, మరి కొంతమందికి చెడుజన్మను
ఎందుకిచ్చాడు? కొంతమందిని ఉన్నతమైన ఆలోచనలతో, మరికొంతమందిని నీచమైన
ఆలోచనలతో ఎందుకు సృష్టించాడు? అనే ప్రశ్న ఉదయిస్తుంది.
లేదా, అన్ని జీవులనూ సరిసమానమైన అర్హతలతో, గుణములతో, శక్తులతో ఆయన
సృష్టించినపుడు, సృష్టిలో ఇంత వైవిధ్యమూ, హెచ్చుతగ్గులూ, జీవజాతులూ ఎందుకున్నాయి?
దీనికి కారణమేమిటి? అనిన ప్రశ్న ఉదయిస్తుంది.
ఈ తర్కమంతా, భగవంతుని ఉనికికే సవాలును విసురుతుంది. కనుక ‘మొదటిజన్మను
భగవంతుడిచ్చాడు’ అనేది సరియైన సమాధానం కాబోదు. దీనికి ఒక్కటే సమాధానం.
‘సృష్టి అనాది. దానికి మొదలు లేదు. చివరా లేదు. ‘నేనుండాలి, నేను అనుభవించాలి’ అనిన
కోరికకు కూడా మొదలూ లేదు, తుదీ లేదు. అదే విధంగా సంస్కారములకు కూడా మొదలూ,
తుదీ లేవు’ అనినదే ఈ ప్రశ్నలకన్నింటికీ తార్కికమైన సమాధానం అవుతుంది.
ఈ సందర్భంలో జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కును ఒకదానిని స్మరించడం ఉచితంగా
ఉంటుంది. అమ్మ ఇలా అన్నారు.
‘సృష్టి నాది, అనాది’.

కో టే
కోరికలు, సంస్కారములు ఒక వృత్తం వంటివి. వృత్తమునకు మూలమెక్కడ? అంటే, దాని
అంచులలో ఎంత వెదికినా దాని మూలం కనిపించదు. దాని అంచులో గుండ్రంగా తిరుగుతూనే
ఉంటాము గాని, దాని మూలమును మనం ఎన్నటికీ కనుక్కోలేము. దాని కేంద్రమే దాని మూలం.
అదేవిధంగా, కోరికలు, సంస్కారములు ఒకదానికి ఒకటి ఆధారములుగా ఉంటూ, మనల్ని
వాటిలో పడవేసి, గుండ్రంగా త్రిప్పుతూనే ఉంటాయి. కనుక సృష్టిమూలమును గాని, కోరికల
మూలమును గాని, సంస్కారముల మూలమును గాని చూడాలంటే, వాటిని వదలిపెట్టి, వాటి
కేంద్రంలోకి పోవాలి. అదొక్కటే ఈ సమస్యను పరిష్కరించే మార్గం.
సాంఖ్యం ప్రతిపాదించిన 25 తత్త్వములు ఇవే. యోగం వీటికి ఈశ్వరుడిని కలిపింది.
సూ|| హేతు ఫలా శ్రయా లంబనైః సంగృహీతత్వా దేషామభావే తదభావః || 4.11 ||
హేతువు - ఫలితము - ఆశ్రయము - ఆలంబనలు - ఒకదానిపైన ఒకటి ఆధారపడి
ఉంటాయి గనుక, ఇవి పోయినప్పుడే అవి (జ్ఞాపకములు, సంస్కారములు) పోతాయి.
కార్యకారణ సంబంధమనేది సృష్టిలోని నియమములలో ఒకటి. కారణమునకే హేతువని
పేరు. కారణం (హేతువు) నుంచి కార్యం (ఫలితం) ఏర్పడుతుంది. ఏదైనా జరగడానికి ఒక
కారణమంటూ ముందుగా ఉండాలి. ఆ కారణము యొక్క తత్త్వమే, గుణమే, కార్యంలో
ప్రతిఫలిస్తుంది. కారణమును బట్టి కార్యముంటుంది. కారణం (హేతువు) విత్తనం వంటిది. కార్యం
(ఫలితం) చెట్టు వంటిది. విత్తనమును బట్టి చెట్టు ఉంటుంది. ఇది తార్కికం మరియు ప్రకృతిధర్మం
కూడా.
అదేవిధంగా, సంస్కారమును బట్టి కర్మ ఉంటుంది. సాత్వికసంస్కారం నుంచి సాత్వికకర్మ,
రాజసికసంస్కారం నుంచి రాజసికకర్మ, తామసికసంస్కారం నుంచి తామసికకర్మ,
మిశ్రమసంస్కారం నుంచి మిశ్రమకర్మ ఏర్పడతాయి. వేపచెట్టుకు వేపకాయలు, మామిడిచెట్టుకు
మామిడికాయలు కాస్తాయి.
విత్తనం లేకుండా పోవాలంటే కుదరనిపని. చెట్టు ఉన్నంతకాలం విత్తనం ఉంటుంది. విత్తనం
ఉన్నంతకాలం చెట్టు వస్తుంది. ఈ రెంటిమధ్యన ఉన్న సంబంధం తెగిపోయినప్పుడే ఈ రెండూ
లేకుండా పోతాయి.
అదేవిధంగా, సంస్కారములకు అంతరిక ఆధారంగా చిత్తం ఉంటుంది. వాటికి
బాహ్యప్రపంచంలో ఆలంబనలుగా ఇంద్రియవిషయములుంటాయి.
ఇంద్రియవిషయములు - కర్మలు - సంస్కారములు - చిత్తము: ఇవి ఒకదానిపైన ఒకటి
ఆధారపడి, ఒకదానినుండి మరొకటి సమాచారమును సంగ్రహిస్తూ ఉంటాయి. కనుక ఈ
గొలుసు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో తెంపులేకుండా, మనిషికి
ఇంద్రియానుభవములు కలుగుతూనే ఉంటాయి. ఈ గొలుసు తెగిపోయినప్పుడే సంస్కారములు
పోతాయి.
బుద్ధుడు చెప్పిన ‘పంచస్కంధములు’, ‘ప్రతీత్యసముత్పాదము’ యొక్క ఛాయలు ఇక్కడ

గో
గోచరిస్తున్నాయి.
బుద్ధుని మార్గంలో పంచస్కంధములు: రూపము, వేదన, సంజ్ఞ, సంస్కారము, విజ్ఞానములు.
ఈ గొలుసు తెగిపోవడమే నిర్వాణమని బుద్ధుని ఉపదేశం.
పతంజలిమహర్షి ఉపదేశించినవి: హేతువు - ఫలము - ఆశ్రయము - ఆలంబనలు. వీటి
పరస్పర సంబంధం (సంగృహీతత్వం) లేకుండా పోవడమే (అభావం) కైవల్యమని మహర్షి బోధ.
ఆలంబనలు - ఇంద్రియ విషయములు (పంచభూతములు, తన్మాత్రలు)
హేతువు - కారణము (రాగము, ద్వేషము)
ఫలము - కార్యము లేదా ఫలితము (కర్మ, కర్మఫలితము)
ఆశ్రయము - చిత్తము (లోమనస్సు)
సరళమైన మాటలలో చెప్పాలంటే, పంచభూతాత్మకమైన బాహ్యప్రపంచము యొక్క
అనుభవములను రాగద్వేషముల ద్వారా పొందటంవల్ల, కర్మ ఏర్పడుతుంది. ఆయా
అనుభవములు సంస్కారములుగా చిత్తంలో ముద్రింపబడతాయి. అవి మళ్ళీ కర్మను చేయిస్తాయి.
ఈ గొలుసంతా మాయమైనప్పుడే సంస్కారములు లేకుండా పోవడం జరుగుతుంది. అప్పుడే
కైవల్యసిద్ధి లభిస్తుంది.
సూ|| అతీతానాగతం స్వరూపతోఽస్త్యధ్వభేదాద్ధర్మాణాం || 4.12 ||
ధర్మములలోని భేదములను బట్టి, గతము, భవిష్యత్తులు తమతమ రూపములలో ఉంటాయి.
కారణం లేకుండా కార్యం జరుగదు. గతంలో లేనిది క్రొత్తగా రాదు. లేకపోవడం నుంచి
ఉండటం సంభవించదు. శూన్యం నుంచి సృష్టి జరగడం కుదరదు. కనుక గతము, వర్తమానము,
భవిష్యత్తు అనేవి ఉన్నాయి. కొందరు కుహనాగురువులు ‘గతం, భవిష్యత్తు లేవు. ఉన్నది
వర్తమానమే’ అంటూ ఉంటారు. బౌద్ధంలోని జెన్ మతస్థులు ఈ మాటలు చెబుతూ ఉంటారు. ఇవి
హాస్యాస్పదములైనవి. విత్తనం లేకుండా మొక్క రాదు. అది చెట్టుగా మారదు. విత్తనమనేది గతం.
మొక్క వర్తమానం. చెట్టు భవిష్యత్తు. ‘విత్తనమూ, చెట్టూ లేవు. ఉన్నది మొక్క ఒక్కటే’ - అనడం
ఎంత నవ్వుబాటో - ‘గతమూ, భవిష్యత్తూ, లేవు ఉన్నది వర్తమానమే’ - అనడమూ అంతే.
మొక్క గుణములు విత్తనంలో నిగూఢంగా ఉంటాయి. లేకపోతే, వేపవిత్తనం నుంచి
వేపమొక్క ఎందుకొస్తుంది? మామిడిమొక్క రావాలి కదా? అలాగే, చెట్టు యొక్క గట్టిదనం,
లేతమొక్కలో నిగూఢంగా ఉంటుంది. లేకపోతే, కొన్నాళ్ళు పోయాక ఆ గట్టిదనం ఎక్కడనుంచి
వస్తున్నది?
విత్తనపు ధర్మం (లక్షణం, గుణం) వేరు. ఆ స్థితిలో ఆ ధర్మమే ఉంటుంది. అదే విధంగా
మొక్కకు, చెట్టుకు వాటివాటి ధర్మములు వేర్వేరుగా ఉంటాయి. ఆయా స్థితులలో ఆయా
ధర్మములు ఉండటమే వాటికి సహజం. అంతమాత్రం చేత మొక్కకు గతము, భవిష్యత్తులు లేవని
అనకూడదు. విత్తనం దాని గతం. చెట్టు దాని భవిష్యత్తు.

లో తే రే
బాహ్యప్రపంచంలో అయితే, సూర్యగమనమును బట్టి, రాత్రింబగళ్ళు, ఋతువులు మారే
తీరును బట్టి కాలంయొక్క మూడు విభాగములను - గతం, వర్తమానం, భవిష్యత్తు - అని
లెక్కవేస్తూ ఉంటాము. అంతరికప్రపంచంలో (మనస్సులో) అయితే - జ్ఞాపకమును గతంగాను,
జరుగుతున్న అనుభవమును వర్తమానంగాను, ఆశతో కూడిన ఊహను భవిష్యత్తుగాను లెక్కిస్తూ
ఉంటాము.
సంస్కారములు చిత్తంలోపల నిగూఢంగా ఉంటూ, ఆయా పరిస్థితులు ఎదురుపడినప్పుడు
బయటపడుతూ ఉంటాయన్నది సారాంశం. కాలమనేది జీవపరిణామంలోను, మనస్సులోను
ఉన్నదన్నది సత్యం.
సూ|| తే వ్యక్తసూక్ష్మా గుణాత్మానః || 4.13 ||
అవి వ్యక్తమైనవి, సూక్ష్మమైనవి అవుతూ గుణములతో నిండి ఉంటాయి.
సంస్కారములు గుణాత్మకములు. అంటే, సత్త్వరజస్తమో గుణములతో కూడి వాటి
మిశ్రమరూపములుగా ఉంటాయి. వాటిలో కొన్ని బయటకు వ్యక్తమౌతూ ఉంటాయి. మరికొన్ని
వ్యక్తం కాకుండా చిత్తం లోలోతులలో అణగి ఉంటాయి. వ్యక్తమయ్యే వాటికి అనుకూలమైన
పరిస్థితులు బాహ్యప్రపంచంలో వస్తాయి గనుక అవి వ్యక్తమౌతాయి. అవ్యక్తములుగా ఉండేవాటికి,
తగిన పరిస్థితులు బాహ్యప్రపంచంలో ఉండవు గనుక అవి నిద్రాణంగా ఉంటాయి.
సూ|| పరిణామైకత్వాద్వస్తుతత్త్వం || 4.14 ||
పరిణామం లోని ఏకత్వమే వస్తుతత్త్వం.
త్రిగుణములు ఒక పద్ధతిలో పరిణామం చెందినపుడు ఆవుగా రూపొందుతాయి. అవే
త్రిగుణములు మరియొక విధానంలో పరిణామం చెందినపుడు గుఱ్ఱముగా రూపొందుతాయి. ఈ
విధంగా ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క విధమైన అమరికలో అవి ఉంటాయి గాని మూలతత్త్వములలో
అవి త్రిగుణములే.
కనుక ఒక వస్తువుకు మరొక వస్తువుకు భేదం ఎక్కడుంది? దానిలోని గుణములు పరిణామం
చెందే తీరులో ఆ భేదం ఉన్నది. త్రిగుణములనేవి ఇనుములో ఒక అమరికలో ఉంటాయి.
బంగారంలో ఇంకొక అమరికలో ఉంటాయి. ఈ అమరిక, దానిని మార్చే విధానము
అర్థమైనప్పుడు ఇనుమును బంగారంగా మార్చడం సాధ్యమౌతుంది. చూచేవారికి ఇదొక
అద్భుతంగా కనిపిస్తుంది గాని, ఈ రహస్యములను గ్రహించిన యోగికి ఇదంతా సహజమే
అవుతుంది.
సూ|| వస్తుసామ్యే చిత్తభేదాత్తయోర్విభక్తః పంథాః || 4.15 ||
వస్తువు ఒకటే అయినప్పటికీ, చిత్తభేదమును బట్టి దారులు మారుతాయి.
ప్రపంచమునకు దానికంటూ ప్రత్యేకమైన ఒక ఉనికి ఉన్నదా? లేక ప్రపంచపు ఉనికి కేవలం
మన అనుభవం మీద ఆధారపడి మాత్రమే ఉన్నదా? అనే ప్రశ్నకు ఈ సూత్రం జవాబు
చెబుతున్నది. ఒక వస్తువును ఉదాహరణగా తీసుకుంటే తేలికగా అర్థమౌతుంది.
కీ నే నే
ఒక గుమ్మడికాయ, అందరికీ గుమ్మడికాయగానే కన్పిస్తుంది. కనుకనే, కూరగాయల
బజారులో, గుమ్మడికాయను కొనాలనుకునే వారు, గుమ్మడికాయల అంగడి వద్దకే పోతారు
గాని, వంకాయల అంగడి వద్దకు పోరు. కనుక వస్తువుకు తనదంటూ ఒక ఉనికి ఉన్నది.
కానీ, ఆ ఉనికి అనేది, మనం చూచే చూపుపైన ఆధారపడి మనకు గోచరిస్తుంది.
గుమ్మడికాయను చూచేవారందరూ ఒకే విధంగా దానిని చూడరు. ఒకరు దాని రంగును
చూస్తారు, మరొకరు దాని లావును చూస్తారు, మరొకరు దాని ఎత్తును చూస్తారు, మరొకరు అది
పచ్చిదా? పండినదా? అని చూస్తారు. మరొకరు దానితో కూరను ఎలా చేయాలో ఆలోచిస్తూ
చూస్తారు. మరొకరు దానితో వడియములు ఎలా పెట్టాలో ఆలోచిస్తూ చూస్తారు. మరొకరు
దాంతో హల్వా ఎలా చేయాలో ఆలోచిస్తూ చూస్తారు. వారివారి చూపును బట్టి అది వారికి ఒక్కొక్క
రకంగా కనిపిస్తుంది.
భోజరాజు తన యోగసూత్ర వ్యాఖ్యానంలో దీనిని వివరిస్తూ ఇలా అంటాడు.
‘ఒక అందగత్తెను చూచినప్పుడు కాముకునిలో కామం పుడుతుంది. సాటి స్త్రీలో అసూయ
పుడుతుంది. ఒక యోగిలో అసహ్యం పుడుతుంది. ఈ విధంగా, చూచే మనసును బట్టి చూడబడే
దృశ్యం కనబడుతుంది’.
దీనిని బట్టి ఏం తేలుతున్నది? వస్తువుకు ఒక ఉనికి ఉన్నది గాని, అదేమిటో మనకు అర్థం
కాదు. మన మనస్సును బట్టి మాత్రమే అది మనకు గోచరిస్తుంది. మనకు మనస్సు లేకపోతే
ఏమౌతుంది? మనకు అనుభవం లేనట్లు లెక్క. అంతేగాని, వస్తువే లేనట్లు కాదు. కనుక, మన
అనుభవానికి విడిగా వస్తుప్రపంచం (జగత్తు) ఉన్నది. ఒకే వస్తువును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా
చూస్తూ, ఒకరు కోరుకుంటూ, ఒకరు వద్దనుకుంటూ, మరొకరు తటస్థంగా ఉంటారు గనుక, మన
అనుభవాన్ని బట్టి వస్తువు లేదని, దానికొక ప్రత్యేకమైన ఉనికి ఉన్నదని అర్థమౌతున్నది.
అంటే, ఇంద్రియములు, మనస్సు ఉన్నప్పుడు కూడా ఒక వస్తువును మనం ఉన్నదానిని
ఉన్నట్లుగా తెలుసుకోలేము. అవి లేనప్పుడు కూడా అదేమిటో మనం ఎన్నటికీ తెలుసుకోలేము.
వస్తువు ఎంతో ప్రపంచం అంతే.
కనుక ప్రపంచమును మనం ఎన్నటికీ తెలుసుకోలేము. ప్రపంచంలోని వస్తువులను గాని,
మనుషులను గాని, జీవజాతులను గాని ఎన్నటికీ మనం తెలుసుకోలేము. మన ఇంద్రియములు,
మనస్సు అనే అద్దముల ద్వారా కనిపించేదే మనకు సత్యం గాని, అసలైన సత్యం మనకెన్నటికీ
గోచరం కాదు. కనుక మనమందరమూ కళ్ళున్న గ్రుడ్డివాళ్ళం, చెవులున్న చెవిటివాళ్ళం, నోరున్న
మూగవాళ్ళం, అన్నీ మనకు తెలుసనుకునే అజ్ఞానులం మాత్రమే!
ఈ సూత్రం, బుద్ధుని ప్రతీత్యసముత్పాద సిద్ధాంతమును ముక్కలు చేస్తున్నది. ఎలాగంటే,
పంచ ఉపాదానస్కంధముల వల్లనే ‘నేను’ అనిన భావన తలెత్తుతున్నది గాని, అసలది లేదని
బుద్ధుడు అంటాడు. యోగమేమో - చూచే నేననేది ఉన్నదని, అది ఉన్నది గనుకనే ప్రపంచం
ఉన్నట్లు కనిపిస్తున్నదని చెబుతూ - ‘బుద్ధుడు చెప్పినట్లుగా ‘నేను’ లేకుంటే, ప్రపంచమే లేనట్లు
అవుతుంది కదా?’ - అని ప్రశ్నిస్తుంది.
దే నే లో నే
ఫ్రెంచి దార్శనికుడు ‘దేకార్త్’ - ‘నేను ఆలోచిస్తున్నాను గనుక నేనున్నాను’ అన్న
ప్రసిద్ధవాక్యమును చెప్పాడు. దీనికి - ‘నీవు ఆలోచించనప్పుడు మరి నీవున్నట్లా లేనట్లా?’ అనిన
సవాలు పుట్టుకొస్తుంది. తర్కం ప్రకారం పోతే, ‘ఆలోచించనప్పుడు నేను లేను’ అని చెప్పవలసి
వస్తుంది. దానికి ప్రతి సవాలుగా - ‘అంటే, ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా పోతావా?
ఉన్నది లేకుండా ఎలా పోతుంది? లేనిది ఎక్కడనుంచి పుట్టుకొస్తుంది?’ అనిన ప్రశ్న
ఉద్భవిస్తుంది. దానికి తర్కం జవాబును చెప్పలేదు. కనుక - ‘ఆలోచించడం, మానుకోవడం అనేవి
నీ ఉనికికి ఋజువులు కావు. ఆలోచించినప్పుడూ నీవున్నావు. ఆలోచించకపోయినా నీవున్నావు.
లేదా అప్పుడూ ఇప్పుడూ లేవు’ - అనేదే తార్కికమైన జవాబు అవుతుంది.
వెంటనే - ‘అప్పుడూ ఇప్పుడూ ‘నేను’ లేకపోతే, అనుభవమును పొందుతున్నది ఎవరు?’
అనిన ప్రశ్న ఉదయిస్తుంది. అక్కడ ఎవరూ లేరని, అనుభవం మాత్రమే ఉన్నదని, దానితోబాటు
‘అనుభవి’ ఉదయిస్తున్నదని, అనుభవం మాయమైతే దానితోబాటే ‘అనుభవి’ కూడా
మాయమౌతున్నదని బౌద్ధం అంటుంది. ‘వస్త్రం లేకుండా, దానిపైన చిత్రమును గీయడం ఎలా?’
అని వేదాంతం ప్రశ్నిస్తుంది. చూచేవాడు లేనప్పుడు, చూపు ఎలా సాధ్యమని వేదాంతం
అంటుంది. జన్మలు ఎత్తే ఆత్మ లేనప్పుడు, పునర్జన్మ ఎత్తుతున్నది ఎవరు? అనిన వేదాంతుల
ప్రశ్నకు బౌద్ధం జవాబును చెప్పలేకపోయింది.
ఆత్మ లేదని బుద్ధుడన్నాడు. మరి ఆయనే తిరిగి, తనకు తన 500 గతజన్మలు గుర్తుకు
వచ్చాయని చెప్పాడు. ఆత్మ లేకపోతే, మరి ఈ జన్మలను ఎత్తినది ఎవరు? అనిన ప్రశ్నకు జవాబు
లేదు. వేదాంతుల నిశితమైన తర్కమునకు జవాబులు చెప్పలేక చతికిలబడింది గనుకనే బౌద్ధం,
మనదేశం నుండి మాయమైపోయింది.
‘మనం చూడాలనుకున్నట్లే ఒక వస్తువును చూస్తాము గాని వద్దనుకున్నట్లు చూడము’ అనే
నవీన మానసికశాస్త్ర సూత్రమునకు, మూడువేల సంవత్సరములనాటి ఈ ప్రాచీన సాంఖ్యదర్శనమే
ఆధారము. అంటే, మనలోని రాగద్వేషములను బట్టి ఒక వస్తువుగాని మనిషిగాని మనకు
కనపడుతుంది. ఈ రెండూ లేనప్పుడు ఉండేది అజ్ఞానం. అంటే, ఆ వస్తువుగాని, మనిషిగాని
మనకు తెలియబడదు. కనుక అది అజ్ఞానస్థితి. కనుక ప్రపంచంలో ఉన్నవి మూడే - రాగము,
ద్వేషము, అజ్ఞానము.
కనుక మన అనుభవమునకు, దృక్కోణమునకు ఈ మూడే - రాగము, ద్వేషము, అజ్ఞానములే
- ఆధారములని తేలుతున్నది.
సూ|| న చైకచిత్తతంత్రం వస్తు తదప్రమాణకం తదా కిం స్యాత్ || 4.16 ||
కానీ వస్తువు ఈ చిత్తభేదములపైన ఆధారపడి లేదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే, ఎవరూ
చూడనప్పుడు అది ఏమవుతుంది?
ఇదంతా సాంఖ్యదర్శనమే. ‘ఆలోచించనప్పుడు నీవెక్కడున్నావు?’ అంటూ దేకార్త్
సిద్ధాంతమునకు ఎదురైన ప్రశ్న కూడా దీని మూలముల నుంచే. ఎవరూ చూడనప్పుడు కూడా
వస్తువు ఉన్నది. కానీ ప్రత్యక్షప్రమాణం ద్వారా దాని అనుభవం మనకు లేదు.
మీ లో మీ
మన అనుభవం మన చిత్తం మీదా, దానిలో ఉన్న సంస్కారముల మీదా ఆధారపడి
ఉన్నదిగాని, బయటిప్రపంచం మీదా, దానిలోని వస్తువులు, మనుషులు, ఇతర జీవులమీద
ఆధారపడి లేదు. అవన్నీ మన అనుభవమునకు ప్రేరకములు మాత్రమే గాని, పూరకములు కావు.
భూమిపైన జీవులు ఉద్భవించడానికి ఎన్నో కోట్ల సంవత్సరముల క్రితమే భూమి ఉన్నది. మరి
అప్పుడు, భూమిని చూచి, తమ ఇంద్రియములతో తెలుసుకునే జీవులేవీ భూమిపైన లేవు.
అప్పుడు భూమి ఉన్నదా లేదా? అంటే, ‘ఉన్నది’ అని చెప్పలేము. ఒకవేళ అలా చెప్పాలంటే,
అనుమానప్రమాణం ఆధారంగా చెప్పగలమే గాని, ప్రత్యక్షప్రమాణం ఆధారంగా చెప్పలేము.
ఎందుకని? చూచి చెప్పడానికి మనమే అప్పుడు లేము కాబట్టి.
ఎవరూ చూడనప్పుడు, ఎవరూ భూమిపైన లేనప్పుడు కూడా భూమి ఉన్నది. కానీ మనం
తెలుసుకోలేము. అంటే, మన ఇంద్రియసంవేదనకు సంబంధం లేకుండా కూడా బాహ్యప్రపంచం
(దృశ్యం) ఉన్నది. అదేవిధంగా, ఇంద్రియముల ద్వారా చూడనప్పుడు, మనస్సును
ఉపయోగించనప్పుడు, లోనుంచి చూస్తున్న ‘ద్రష్ట’ కూడా ఉన్నది. కానీ తెలియబడని స్థితిలో
ఉన్నది.
కనుక మనం చూడటం, చూడకపోవడములను బట్టి జగత్తు యొక్క ఉనికి లేదు.
దానికంటూ ప్రత్యేకమైన ఉనికి ఉన్నది. ఆత్మస్థితి కూడా అంతే. జగత్తు యొక్క ఉనికికి ఏ తర్కం
ఉపయోగిస్తుందో, ఆత్మయొక్క ఉనికికీ అదే తర్కం ఉపయోగిస్తుంది.
ఈ భావమునకు, ఉపనిషత్తులలో చెప్పబడిన ‘యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ’
(దేనిని చేరుకోలేక, మనస్సుతో సహా ఇంద్రియములన్నీ వెనుకకు మరలుతున్నవో) అని ఆత్మస్థితిని
గురించి చెప్పబడిన భావమే ఆధారం.
సూ|| తదుపరాగాపేక్షిత్వా-చ్చిత్తస్య-వస్తు జ్ఞాతాజ్ఞాతం || 4.17 ||
వస్తువు తెలియబడటం, తెలియబడకపోవడం అనేవి, అది చిత్తమునకు అలదే రంగును బట్టి
ఉంటుంది.
ఒక వస్తువును మనం చూచినప్పుడు, లేదా మిగతా ఇంద్రియములతో అనుభూతి
చెందినప్పుడు, అది మనస్సును ఆకర్షించి లోబరచుకుని, తన రూపంలోకి మనస్సును
మార్చుకుంటుంది. అప్పుడు మనస్సుకు దాని అనుభవం కలుగుతుంది. అంటే, అనుభవిస్తున్న
వస్తువు రూపమును మనస్సు ధరిస్తుంది.
మనస్సు నీరు వంటిదైతే, జగత్తులోని వస్తువులూ, జీవులూ అన్నీ, రకరములైన పాత్రల
వంటివి. వాటిలో పోయబడిన నీరు వాటి ఆకారమునే ధరిస్తుంది. అప్పుడే ఆ వస్తువు యొక్క
స్ఫురణ మనస్సుకు కలుగుతుంది. దీనివల్ల మరికొన్ని విషయములు మనకు అర్థమౌతున్నాయి.
ఒక సమయంలో మనస్సు ఒకే విషయమును తెలుసుకోగలుగుతుంది. వేరే ఇంకొక
1.
విషయమును తెలుసుకోలేదు.
2. మనస్సుకు ఒక ఆకారమంటూ లేదు. అవసరమును బట్టి ఏ విధంగానైనా అది
మారుతుంది.
3.మనస్సు ఒక వస్తువును గాని, ప్రాణినిగాని, విషయమును గాని, దానిగా మారినప్పుడు
మాత్రమే, తెలుసుకోగలదు. అలా మారనప్పుడు తెలుసుకోలేదు. అంటే, తెలుసుకోవడం,
తెలుసుకోలేకపోవడం అనేవి దానికి ఉన్నాయి.
4. మనస్సు ఆత్మకంటే భిన్నమైనది. ఎందుకంటే, మనస్సుకు జ్ఞానము (తెలుసుకోవడం),
అజ్ఞానము (తెలుసుకోలేకపోవడం) ఉన్నాయి. ఆత్మకు అవి లేవు. దానికి తెలియనిది సృష్టిలో
లేదు. కాబట్టి మనస్సూ ఆత్మా ఒకటి కావు.
ఈ సూత్రం కూడా బౌద్ధమత భావనలను ఖండిస్తున్నది. ఎలాగంటే, బౌద్ధం ప్రకారం మనస్సు
మాత్రమే ఉన్నది. ఆత్మ లేదు. కానీ ఈ సూత్రంలోని తర్కం ప్రకారం, ఆత్మ ఉన్నదని ఒప్పుకోవలసిన
పరిస్థితి ఏర్పడుతున్నది.
సూ|| సదా జ్ఞాతాశ్చిత్తవృత్తయ స్తత్ప్రభోః పురుషస్యా పరిణామిత్వాత్ || 4.18 ||
చిత్తవృత్తులన్నీ వాటి ప్రభువైన పురుషునకు తెలియబడుతూనే ఉంటాయి, దానికి పరిణామం
లేదు కాబట్టి.
వృత్తులు (ఆలోచనలు, భావపరంపరలు), ఎప్పుడూ లేస్తూ పడుతూ ఉంటాయి. కనుక అవి
ఎప్పుడూ చలిస్తూ ఉంటాయి. కనుక, చలనం లేకుండా ఉన్నట్టి ఒకటి వాటికి ఆధారంగా ఉండాలి.
చిత్రమును గీయాలంటే, ఒక వస్త్రం ఆధారంగా ఉండాలి. చక్రం తిరుగుతూ ఉండాలంటే, దాని
మధ్యలో తిరగకుండా ఉన్న ఇరుసు ఒకటి ఉండాలి. దానినే పురుషుడని యోగశాస్త్రం అంటుంది.
దానికి మాత్రం చలనము, మార్పు ఉండవు. అవి ఉంటే, అది అన్నిటినీ తెలుసుకోలేదు.
మనస్సు ఒక వస్తువు రూపమును ధరించినందువల్లనే దాని అనుభవం కలుగుతున్నదని
మనకు అర్థమైంది. ఏ రెండు అనుభవములనూ మనస్సు ఒకేసారి గ్రహించలేదు. కనుక మనస్సు
అనుక్షణం మారిపోతూ ఉంటుంది. అలా మారే మనస్సు పొందుతున్న సమస్త ఆకారములను,
మారకుండా దాని వెనుకగా ఉన్నట్టిది మాత్రమే తెలుసుకోగలదు.
కదిలే బొమ్మలకు ఒక తెర ఆధారంగా ఉండాలి. లేకుంటే బొమ్మలు శూన్యంలో ఉండలేవు.
ఒకవేళ అలా ఉండాలన్నా కూడా, శూన్యం వాటికి ఆధారంగా ఉండాలి. కనుక చలిస్తున్న అన్నిటికీ
అంతిమంగా, చలించనిదొకటి ఆధారంగా ఉండాలని తేలుతున్నది.
ఈ సూత్రం కూడా బౌద్ధమత భావనలను ఖండిస్తున్నది. ఎందుకంటే, బౌద్ధం ప్రకారం, చలనం
ఒక్కటే ఉన్నది గాని, చలించకుండా ఉన్నట్టి ఆధారమొకటి దానికి లేదు. రథం నడుస్తున్నది గాని,
దానిలో నడిపేవాడు లేడని బౌద్ధం అంటుంది. జడమైన రథం దానంతట అది ఎలా నడవగలదని
సాంఖ్యము, వేదాంతము, యోగము అంటాయి.
మనసు పొందుతున్న మార్పులకు ఆధారంగా, వాటికి వెనుకగా ఉంటూ, చలించని
పురుషుడు (ఆత్మ) ఒకటి ఉన్నదనేది సారాంశం.
సూ|| న తత్స్వాభాసం దృశ్యత్వాత్ || 4.19 ||
ట్టి కి మైన వె లే
అది దృశ్యం కాబట్టి, దానికి సహజమైన వెలుగు లేదు.
మనస్సు కూడా దృశ్యమే. జగత్తును, ప్రకృతిని మనస్సు చూస్తున్నది. మనస్సును చూచేది
ఇంకొకటి ఉన్నది. లేకుంటే, మనస్సులోని ఆలోచనలను, భావపరంపరలను, మనం ఎలా
తెలుసుకోగలుగుతున్నాము? ఎల్లప్పుడూ కదులుతున్న దానిని చూచేది ఇంకొకటి ఉండాలి.
నాటకమును నాటకమే చూడలేదు. దానిని చూచే ప్రేక్షకుడు ఒకడు ఉండాలి. నాటకంలోని
పాత్రలు కదులుతూ ఉంటాయి. ప్రేక్షకుడు కదలకుండా కూర్చుని ఊరకే చూస్తూ ఉంటాడు.
కదిలేవి ఇంద్రియములు, మనస్సు. కదలకుండా వాటిని చూస్తూ ఉండేది ఆత్మ.
ముండకోపనిషత్తు లోని రెండుపక్షుల కథలోని భావమే ఈ సూత్రంలో కనిపిస్తున్నది.
శ్లో|| ద్వా సుపర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిశస్వజాతే
తయోరన్యః పిప్పలం స్వాద్వత్త్య
నశ్నన్నన్యో అభిచాకశీతి || (3.1.1)
ఒక చెట్టు మీద రెండు పక్షులున్నాయని ఈ ఉపనిషత్తు అంటుంది. అందులో ఒక పక్షి అన్ని
కొమ్మలపైకీ ఎగురుతూ, తీపి, చేదు, పండ్లను తింటూ, తీపిపండ్లను తిన్నపుడు నవ్వుతూ,
చేదుపండ్లను తిన్నపుడు ఏడుస్తూ ఉన్నది. మరొక పక్షి చిటారుకొమ్మ మీద కూర్చుని, ఎటూ
కదలకుండా, ఏ పండునూ తినకుండా, రెండవపక్షిని ఊరకే చూస్తూ ఉన్నది. మొదటిపక్షి తన
ఎగురుడును ఆపి, రెండవ పక్షిని తదేకదృష్టితో చూచినప్పుడు, ఉన్నది ఒకే పక్షియని, రెండు
పక్షులు లేవని గ్రహిస్తుంది.
ఈ రెండుపక్షులను, జీవుడు, పరమాత్మ యని అర్థములు చెప్పబడినవి. కానీ వాటిని మనస్సు,
ఆత్మ అని కూడా అర్థం చేసుకోవచ్చు.
ఆత్మ అనేది, మనస్సు ద్వారా జగత్తును చూస్తున్నది. అదే విధంగా, మనస్సులోని ఆలోచనలను
కూడా అది చూస్తున్నది. కాబట్టి మనస్సు కూడా దృశ్యమే. అది ద్రష్ట కాదు. కాబట్టి దానికున్న
వెలుగు (ఎరుక, లేదా జ్ఞానము) దానిది కాదు. అది దాని వెనుకనున్న పురుషునిది (ఆత్మకు
చెందినది). ఆత్మ యొక్క వెలుగు మనస్సులో ప్రతిఫలించి ఎరుకగా, జ్ఞానముగా కనిపిస్తున్నది.
కనుక మనస్సు కూడా జడమైనదే అని తేలుతున్నది.
భౌతిక జగత్తు స్థూలమైనది. మనస్సు సూక్ష్మమైనది. కానీ రెండూ జడములే. అంటే,
స్వతస్సిద్ధమైన వెలుగు, జ్ఞానములు వాటిలో లేవు. అవి ఆత్మవి. వాటిలో ఊరకే ప్రతిఫలిస్తున్నాయి.
అంతే.
సూ|| ఏకసమయే చోభయానవధారణం || 4.20 ||
ఒకే సమయంలో రెండూ తెలియబడవు గనుక.
మనస్సుకు స్వంతవైన వెలుగు, జ్ఞానము ఉన్నట్లయితే, అది జగత్తును, తనను ఒకే
సమయంలో తెలుసుకోగలగాలి. కానీ అది అలా చెయ్యలేదు. జగత్తులోని రెండు వస్తువులనే అది

ఏ లో కోలే మే
ఏకకాలంలో తెలుసుకోలేదు. ఒకదాని తర్వాత మరొకదానిని మాత్రమే అది
గ్రహించగలుగుతుంది. జగత్తును, తన ఆలోచనలను ఒకేసారిగా అయితే అసలే తెలుసుకోలేదు.
కనుక అది ప్రభువూ కాదు, స్వయంప్రకాశకమూ కాదు. అది జడమేగాని చైతన్యస్వరూపం కాదు.
ఎందుకని? మనస్సుకు చలనం స్వభావం కనుక అది సర్వాధిష్ఠానం కాదు. దాని తెలివి
పరిమితమే గాని అపరిమితం కాదు.
సూ|| చిత్తాంతరదృశ్యే బుద్ధిబుద్ధే రతిప్రసంగః స్మృతిసంకరశ్చ || 4.21 ||
చిత్తమును చూచే ఇంకొక చిత్తం ఉన్నదని అనుకుంటే, ఈ చిత్తపరంపరలకు
అంతుండకపోగా, స్మృతి సంకరమౌతుంది.
పోనీ, మనస్సు వెనుకగా ఆత్మ అన్నది లేదని కాసేపు అనుకుందాం. మనస్సులోని
ఆలోచనలను, అది పొందుతున్న ఇంద్రియానుభవములను, చూస్తున్న ఇంకొక మనస్సు దాని
వెనుకగా ఉండి, ఇవన్నీ గమనిస్తున్నదని అనుకుందాం. అప్పుడు దాని వెనుక ఇంకొక మనస్సు
ఉండాలి. అప్పుడా గొలుసుకు అంతూ పొంతూ ఉండదు. ఇదొక సమస్య.
ప్రతి మనస్సుకూ ఒక జ్ఞాపకముల పరంపర ఉంటుంది గనుక, ఆ జ్ఞాపకాలన్నీ కలసిపోయి
గందరగోళం అయిపోవాలి. ఇది మరొక సమస్య. అప్పుడు ప్రతి మనిషికీ పిచ్చెక్కాలి. అలాంటి
పరిస్థితి లేదు గనుక, మనస్సు ఒక్కటేననీ, దాని వెనుక ఉండి అంతా గమనిస్తున్నది చలనం లేని
ఆత్మేగాని, చలిస్తున్న ఇంకొక మనస్సు కాదనీ తేలుతున్నది.
సూ|| చితేరప్రతిసంక్రమాయా స్తదాకారాపత్తౌ స్వబుద్ధిసంవేదనం || 4.22 ||
మార్పుకు లోనుకాని చిత్ యొక్క ఆకారమును పొందిన చిత్తం తనను తానే
తెలుసుకుంటుంది.
ఆత్మ జ్ఞానస్వరూపంగా ఉన్నది. కాని అది తనను తాను తెలుసుకోదు. అదే జ్ఞానమైనప్పుడు
అది దేనిని తెలుసుకుంటుంది? జడమైన మనస్సు కూడా దేనినీ తెలుసుకోలేదు. ఎందుకంటే అది
జడం కనుక. అలాంటప్పుడు, మనస్సులో జ్ఞానం ఎలా కలుగుతున్నది? అన్నప్పుడు, ఆత్మకు
దగ్గరైన మనస్సు లేదా చిత్తంలో ఆత్మవెలుగు పడి జ్ఞానంగా రూపొందుతున్నది గాని, స్వతహాగా
మనస్సుకు జ్ఞానం లేదని మహర్షి అంటున్నారు.
అంటే, జగత్తులో మునిగిన మనస్సు దాని రూపమును ధరిస్తున్నది. అదే మనస్సు ఆత్మలో
లయమైతే ఆత్మగా మారుతున్నది. మొదటిది బంధం. రెండవది మోక్షం.
సూ|| ద్రష్టృదృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం || 4.23 ||
అప్పుడు చిత్తము, అప్పటి అవసరమును బట్టి, ద్రష్టయొక్క గాని, దృశ్యము యొక్క గాని
రంగును పొందుతుంది.
కనుక చిత్తం రెండుపనులను చేస్తున్నది. జగత్తులో మునిగితే జగద్రూపమును ధరిస్తున్నది.
ఆత్మలో మునిగితే ఆత్మరూపమును ధరిస్తున్నది. నీటిని సారాయిసీసాలో పోస్తే, దాని
ఆకారమును ధరిస్తున్నది. అమృతపాత్రలో పోస్తే దాని ఆకారమునూ ధరిస్తుంది.
టే టే లో లో
దృశ్యమంటే జగత్తు. ద్రష్ట అంటే ఆత్మ. చిత్తం ఈ రెంటిమధ్యలో ఉంటూ, జగత్తులో,
ఇంద్రియానుభవములలో లీనమైనప్పుడు బంధంలోను, ఆత్మలో లయమైనప్పుడు మోక్షంలోను
ప్రవేశిస్తున్నదని అర్థం.
సూ|| తదసంఖ్యేయ వాసనాభి శ్చిత్రమపి పరార్థం, సంహత్యకారిత్వాత్ || 4.24 ||
లెక్కలేనన్ని చిత్రములైన వాసనలతో నిండినప్పటికీ, సముదాయం కావడం వల్ల, అది ఉన్నది
పరార్థం కోసమే.
మనస్సులో ఎన్నో వాసనలు (సంస్కారములు) ఉంటాయి. అవి పంచభూతముల,
త్రిగుణముల సమ్మిశ్రమములు. ఆయా అనుభవముల కోసం మనస్సు ఇంద్రియములపైన
ఆధారపడుతుంది. ఇంద్రియముల ద్వారా బయటకు ప్రసరిస్తూ విషయములను గ్రహిస్తూ
ఉంటుంది. ఇతరులపైన ఆధారపడేది ఏదీ కూడా స్వతంత్రం కాలేదు. కనుక మనస్సు
స్వతంత్రమైనది కాదు. స్వతంత్రమైనది కాదు గనుక, తన అనుభవములు తనకోసం కాదు. అవి
ఇంకొక దానికోసం మాత్రమే, అంటే పరార్థం కోసం మాత్రమే ఉన్నాయి. ఆ ఇంకొకటే
మనస్సుకాధారమైన ఆత్మ.
ఏమిటా పరార్థం? ఆయా అనుభవములు ఆత్మ యొక భోగం కోసం గాని, మోక్షం కోసం
గాని ఉంటున్నాయి. అదే ఈ సూత్రంలో చెప్పబడిన పరార్థం.
సూ|| విశేషదర్శిన ఆత్మభావ భావనా వినివృత్తిః || 4.25 ||
విశేషమును దర్శించినవానికి ఆత్మభావ భావన నివృత్తి అవుతుంది.
విశేషమంటే ఏమిటి? 2.19 వ సూత్రములో విశేష, అవిశేషములు ఏమిటో చెప్పబడినాయి.
పంచభూతములు అయిదు, మనస్సుతో కలిపి దశేంద్రియములు పదకొండు, వెరసి పదహారు
విశేషములు. ఈ విశేషముల చర్యలను స్పష్టంగా దర్శించిన వానికి ఆత్మభావన లేకుండా
పోతుంది.
ఆత్మభావన అంటే ఏమిటి? విశేషముల ద్వారా కలిగే అనుభవమే తానన్న భావన, లేదా,
మనసే తానన్న భావన. ప్రకృతికి అతీతమైన ఆత్మను, మనస్సుతో భావించడం సాధ్యం కాదు.
మనస్సు తనను గురించి మాత్రమే తాను భావించగలదు. అంటే, తన గతం గురించి, వర్తమానం
గురించి, భవిష్యత్తు గురించిన ఆలోచనలు చేయడమే మనకు తెలిసిన ఆత్మభావన. విశేషముల
చర్యలు బాగా అర్థమైనప్పుడు ఈ విధమైన ఆత్మభావన పోతుందని అర్థం.
అంటే, మనస్సు ఇంద్రియముల ద్వారా బయటకు ప్రసరిస్తూ, పంచభూతములతో కూడిన
విషయములతో మమేకం అవుతూ, వాటి రూపములను ధరిస్తూ, ఏ విధంగా సంస్కారములను
ఏర్పరచుకుంటున్నదో, అవి ఏ రకంగా కర్మలుగా మారుతున్నాయో, దీనివల్ల సంస్కారములు
ఎలా బలమును పుంజుకుంటున్నాయో - ఈ చక్రభ్రమణం అంతా స్పష్టంగా, క్షుణ్ణంగా,
అర్థమైనపుడు వీటిలో ఆత్మ లేదనిన విషయం బాగా అర్థమౌతుంది. అప్పటివరకూ ‘నేను’ అని
యోగి దేనినైతే అనుకుంటున్నాడో అది ‘నేను’ కాదన్న విషయమూ, ఇదంతా మనస్సు,
ఇంద్రియములు, పంచభూతములు ఆడుతున్న ఆట అనిన విషయమూ బాగా అర్థమౌతాయి.
‘ఆత్మభావ భావనా వినివృత్తిః’ - అంటే ఇదే.
వివేక వైరాగ్యములు - అంతర్ముఖత్వం
సూ|| తదా వివేకనిమ్నం కైవల్యప్రాగ్భారం చిత్తం || 4.26 ||
ఈ విధంగా వివేకంతో నిండిన చిత్తం కైవల్యం వైపు మళ్ళుతుంది.
ఈ పరిశీలన వల్ల, ఈ జ్ఞానం వల్ల, తనను బంధిస్తున్న కర్మవలయమంతా యోగికి
అర్థమౌతుంది. ఈ అవగాహననే ‘వివేకం’ అంటారు. ఈ వివేకమనేది చిత్తంలో పూర్తిగా
నిండిపోయినప్పుడు, ‘వైరాగ్యం’ ఉదయిస్తుంది. అంటే, విశేషముల క్రీడ అంటే విసుగు
పుడుతుంది. ‘నేను’ అనేదానికోసం వెదుకులాట మొదలౌతుంది. ఈ విధమైన వివేక,
వైరాగ్యములతో నిండిన చిత్తం, ఇంద్రియముల ద్వారా జగత్తులోకి పోకుండా, కేవలం తనలో
తానుండటానికి ప్రయత్నిస్తుంది. అంటే, అంతర్ముఖమై, కైవల్యస్థితి వైపుగా మళ్ళుతుంది.
సూ|| తచ్ఛిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః || 4.27 ||
దాని పగుళ్ళనుండి, ప్రత్యయముల అంతరముల నుండి, సంస్కారములు ఉదయిస్తాయి.
ఈ విధంగా వివేక, వైరాగ్యములతో కూడిన కేవల ధ్యానస్థితి నుండి, యోగి బయటకు
వచ్చినపుడు, పాత వాసనలు (సంస్కారములు) మరలా గోచరిస్తాయి. అప్పుడు మళ్ళీ ‘నేను’, ‘నాది’,
‘నాకు మంచి జరిగింది’, ‘నాకు చెడు జరిగింది’, ‘నేను తెలుసుకున్నాను’ ‘నేను
తెలుసుకోలేకపోయాను’, ‘అలా చెయ్యకుండా ఉండవలసింది’, ‘ ఇలా చేసి ఉండవలసింది’
మొదలైన ఆలోచనలు రేకెత్తుతాయి. చిత్తం లోలోతులలో దాగి ఉన్న పూర్వపు పోకడలే ఈ
భావపరంపరలకు కారణములు.
అంతరమంటే - ఒక ధ్యానస్థితికీ మరొక ధ్యానస్థితికీ మధ్యనున్న స్థితి. ధ్యానస్థితిలో మనస్సు
అంతర్ముఖమై ఉంటుంది. ధ్యానస్థితి వీడినప్పుడు బహిర్ముఖమౌతుంది. అప్పుడు మళ్ళీ పాత
వాసనలు పొడసూపుతాయి. వీటిని తలలెత్తనీయరాదు.
సూ|| హానమేషాం క్లేశవదుక్తం || 4.28 ||
క్లేశముల వలెనే వీటిని కూడా క్షయం చెయ్యాలని చెప్పబడినది.
2.10, 2.11 వ సూత్రములలో - ‘తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః’, ‘ధ్యానహేయాస్తద్వృత్తయః’
అంటూ, స్థూల, సూక్ష్మ, క్లేశములను ఎలా జయించాలో చెప్పబడింది. అదే పద్ధతిని ఇక్కడ కూడా
ఉపయోగించి, తలెత్తిన వాసనలను క్షయం చెయ్యాలి. అంటే, తలలెత్తిన వాసనలను ధ్యానస్థితి
ద్వారాను, సూక్ష్మవాసనలను అహంస్ఫురణలో లీనం చేయడం ద్వారాను నిర్వీర్యం చేయాలి.
ధర్మమేఘ సమాధి
సూ|| ప్రసంఖ్యానేఽప్యకుసీదస్య సర్వథా వివేకఖ్యాతేర్ధర్మమేఘః సమాధిః || 4.29 ||
నస్థి న ఎ సీనం వివే దీప్తిలో డే కి
జ్ఞానస్థితి కలిగినప్పుడు, దానిపట్ల కూడా ఎల్లప్పుడూ ఉదాసీనంగా, వివేకదీప్తిలో ఉండేవానికి
ధర్మమేఘసమాధి లభిస్తుంది.
పై సూత్రములలో చెప్పబడినట్లు నిత్యమూ ధ్యానసమాధిలో ఉండేవాడికి, జ్ఞానసిద్ధి
లభిస్తుంది. కానీ దానినుంచి ఎట్టి ఫలితమునూ ఆశించరాదు. ఎందుకంటే, అలా ఆశించడం వల్ల
మళ్ళీ రాగద్వేషముల వలలో పడిపోయి, యోగభ్రష్ఠుడౌతాడు. ఆ విధమైన ఉదాసీనతలో
నిత్యమూ ఉన్నవాడికి వివేకపు వెలుగు అమితంగా పెరిగిపోతుంది. తత్ఫలితంగా ‘ధర్మమేఘ’మనే
సమాధిస్థితి అతడికి లభిస్తుంది.
‘నేను జ్ఞానమును పొందియున్నాను, నేను ముక్తుడనైనాను’ అనిన స్పృహపట్ల కూడా
ఉదాసీనతను అతడు వహించాలి. అప్పుడు ‘ధర్మం’ అతని చుట్టూ ఒక మేఘంలాగా ఆవరిస్తుంది.
అతని సమక్షం దివ్యత్వంతో నిండిఉంటుంది. సంకల్పరహితంగా అతని సమక్షంలో అనేకములైన
దివ్యవరములు క్రుమ్మరించబడుతూ ఉంటాయి. అద్భుతములు జరుగుతూ ఉంటాయి. ఎవరూ
అడుగకుండానే మేఘం వర్షించినట్లు ఇది జరుగుతుంది.
‘నేను మేఘమును’, ‘నాలో జలం ఉన్నది’, ‘నేను వర్షిస్తున్నాను’ ‘జనుల దాహమును
తీరుస్తున్నాను’ అనిన స్పృహ మేఘమునకుండదు. సరియైన వాతావరణం వచ్చినపుడు, ఎవరూ
అడుగకుండానే అది వర్షిస్తుంది. అదే విధంగా, ఈ స్థితిని అందుకున్న యోగికి ఎటువంటి
సంకల్పమూ సంస్కారమూ ఉండవు. కానీ అర్హులైనవారికి అతని సమక్షంలో అన్నీ అందుతూ
ఉంటాయి. ఈ స్థితికి యోగశాస్త్రంలో ‘ధర్మమేఘ సమాధి’ యని పేరు.
సూ|| తతః క్లేశకర్మనివృత్తిః || 4.30 ||
అప్పుడు క్లేశములు, కర్మల నివృత్తి అవుతుంది.
క్లేశములంటే - అడ్డంకులు, దోషములు, సంస్కారములని పైన వివరించాను. వీటికి మూలం
రాగద్వేషములు. వాటినుండి ఉద్భవించేవి కర్మలు. ఇవి త్రిగుణాత్మకములై ఉంటాయి.
క్లేశములు మానసికస్థాయికి చెందినట్టివి. కర్మలు భౌతికస్థాయికి చెందినట్టివి.
ధర్మమేఘసమాధిని అందుకున్నట్టి యోగికి సంస్కారములు, కర్మలు అన్నీ నశిస్తాయి. కనుక
అతనికి భూత, వర్తమాన, భవిష్యత్తులు ఉండవు. త్రిగుణములు ఉండవు. ప్రకృతితో ఎట్టి
సంబంధమూ అతనికి ఉండదు.
అప్పుడతడు గుణాతీత, సంస్కారాతీత, జీవన్ముక్తస్థితిని పొందుతాడు.
సూ|| తదా సర్వావరణ మలాపేతస్య జ్ఞానస్యా-నంత్యాజ్జ్ఞేయమల్పం || 4.31 ||
అప్పుడు అన్ని ఆవరణములు, మలములు నశించగా, జ్ఞానం అనంతమౌతుంది. తెలిసినది
అల్పమౌతుంది.
ఆవరణములు - ప్రకృతి నుండి పంచభూతముల వరకూ ఉన్నట్టి తత్త్వములే ఆవరణములు.
ఆత్మ అనేది ఒక సూర్యునిలాగా వెలుగుతున్నది. దానిని ఈ ఆవరణలు మేఘముల లాగా కప్పి
ఉంచుతున్నాయి.
టే దో
మలములు - అంటే దోషములని, మురికియని అర్థం. త్రిగుణములు, వాటి నుండి పుట్టిన
సంస్కారములు, కర్మలు ఇవన్నీ మలములు.
కైవల్యస్థితిలో ఆవరణలు, మలములు పూర్తిగా నశిస్తాయి. ఎందుకంటే, వాటి మూలములైన
గుణములు, సంస్కారములు కూడా నశించిపోయినవి గనుక. అన్ని మేఘములూ చెల్లాచెదరు
అయిపోగా, సూర్యకాంతి అఖండంగా వెలుగుతూ దర్శనమిస్తుంది. అదే విధంగా, ఈ
కైవల్యస్థితిలో అన్ని ముసుగులూ, దోషములూ తొలగి ఆత్మప్రకాశం అఖండమైన వెలుగుగా
చిమ్ముతుంది. అనంతమైన జ్ఞానం అప్పుడు కలుగుతుంది. దానితో పోల్చుకున్నపుడు,
అప్పటివరకూ ‘నాకు తెలుసు’ అనుకుంటున్నది చాలా అల్పంగా తోస్తుంది.
సూ|| తతః కృతార్థానాం పరిణామక్రమసమాప్తి-ర్గుణానాం || 4.32 ||
ఆ విధంగా కృతార్థుడైనవానికి, గుణములయొక్క పరిణామసమాప్తి కలుగుతుంది.
కృతార్థుడంటే గమ్యమును చేరినవాడు. వాటికి గుణముల పరిణామం నశిస్తుంది.
సత్త్వరజస్తమో గుణములు రకరకములైన నిష్పత్తులలో కలుస్తూ పరిణామం చెందుతూ,
రకరకములైన కర్మలను, సంస్కారములను, జన్మలను జీవికి కలిగిస్తూ ఉంటాయి. ఈ
పరిణామప్రక్రియ అంతా యోగిలో అంతమౌతుంది. అతడు గుణాతీతస్థితిని అందుకుంటాడు.
సూ|| క్షణప్రతియోగీ పరిణామాపరాంత-నిర్గ్రాహ్యః క్రమః || 4.33 ||
ప్రతిక్షణమూ మారుతున్న గుణములు ఆ మార్పు చివరలో గ్రహింపబడటమే క్రమము.
గుణముల పరిణామక్రమం అంటే ఏమిటి? అనిన సందేహం గతసూత్రం నుంచి
కలుగుతుంది. దానికి సమాధానం ఈ సూత్రంలో చెప్పబడింది.
ప్రకృతిలోని త్రిగుణములు నిరంతరం మారుతూ ఉంటాయి. ప్రతిక్షణమూ అవి మారుతున్నట్లు
కనిపించినప్పటికీ, కొంతకాలం తర్వాత, తాత్కాలికంగా ఒక స్థిరమైన మార్పును పొందినట్లు
అగుపిస్తాయి. అది ఒక క్రమ పరిణామం. ప్రయాణం మధ్యలో ఆగినట్లుగా ఇది ఉంటుంది.
ఆగడమనేది ఒక తాత్కాలికగమ్యమే గాని, అసలైన గమ్యం కాదు. కొద్దిసేపటి విశ్రాంతి తర్వాత
మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది.
సంస్కారములు, గుణములతో కలసి, ఒక దేహమును జీవికి సమకూరుస్తాయి. ఆ జన్మలోని
జీవనయాత్రలో మరలా త్రిగుణములు అనేకమార్పులకు లోనౌతూ ఉంటాయి. చివరకు అవన్నీ
ఒక స్థిరమైన సంస్కారపుమూటగా మారడంతో ఆ జన్మ ముగుస్తుంది. మరుసటిజన్మకు కావలసిన
రూపమును అప్పటికి అవి సంతరించుకుని ఉంటాయి. దానిప్రకారం మరుసటిజన్మ
కలుగుతుంది. ఇది ఒక క్రమం అనబడుతుంది. ప్రకృతిలోని గుణముల నిరంతరచలనమును
చూస్తున్న యోగికి, జన్మలన్నీ ఏకమొత్తంగా ఒకేరకంగా గోచరిస్తాయి.
ఇదేవిధంగా, ప్రతిక్షణమూ మనస్సు కూడా మారుతూ ఉంటుంది. ఆలోచనలు మారుతూ
ఉంటాయి. గుణములు మారుతూ ఉంటాయి. ప్రకృతి మారుతూ ఉంటుంది. సామాన్యులు వీటిలో
పడి, గతము, వర్తమానము, భవిష్యత్తు అని క్షణములను లెక్కిస్తారు. కానీ ఈ మార్పులకు

తీ లో కే
అతీతస్థితిని అందుకున్న యోగికి కాలంలో ఈ మూడు విభజనలూ ఒకేసారి కనిపిస్తూ
ఉంటాయి. అంటే, కాలమును ఏకమొత్తంగా చూస్తున్న యోగిపైన, క్షణక్షణం మారుతున్న ప్రకృతి
గుణముల ప్రభావం ఉండదు.
సూ|| పురుషార్థశూన్యానాం గుణానాం ప్రతిప్రసవః కైవల్యం స్వరూపప్రతిష్ఠా వా చితిశక్తిరితి ||
4.34 ||
పురుషార్థశూన్యములై గుణములు వెనుకకు మరలిపోగా, స్వరూపంలో స్థితి యనబడే కైవల్యం
లేదా చిత్శక్తి లభిస్తాయి.
త్రిగుణములనేవి, పురుషునికి అనుభవములను కలిగించడం కోసం, అతని భోగమోక్షముల
కోసం, జగత్తులో పనిచేస్తున్నాయి. పురుషునికి జగత్తుమీద ఆశ నశించినప్పుడు, ఆ గుణములకు
జగత్తుతో పని ఉండదు. అప్పుడవి వెనుకకు మరలిపోతాయి. అప్పుడు పురుషుడు తన స్వస్థితిలో
తానుగా ఉంటాడు. అదే కైవల్యస్థితి. దీనినే చిత్శక్తి అని కూడా అనవచ్చు.
ఇంతటితో ప్రకృతిపురుషుల ఆట, ఒక ఆత్మకు సంబంధించిననంత వరకూ, ముగింపుకు
వచ్చింది. ఒక ఆత్మకు జ్ఞానం కలిగితే సరిపోదు. కోటానుకోట్ల ఆత్మలు ఈ భూమిపైన ఉన్నాయి.
అవన్నీ అజ్ఞానంలోనే పడి ఉన్నాయి. ఇలాంటి భూములు మన విశ్వంలో లెక్కలేనన్ని ఉన్నాయి.
ఇలాంటి విశ్వములు సృష్టిలో లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. ప్రతిచోటా ఈ లీల సాగుతూనే ఉన్నది.
ఈ ఆట ఎంతకాలం? ఈ లీల ఎంతవరకు? అజ్ఞానంలో మునిగి జననమరణచక్రంలో
తిరుగుతున్న ఆత్మలు తమ స్వస్థానమునకు చేరుకునేవరకు!
నూరేళ్ళక్రితం విదేశములలో ఇచ్చిన తన యోగసూత్ర ఉపన్యాసములలో వివేకానందస్వామి
ఈ సూత్రమునకు చెప్పిన అర్థమును మననం చేసుకోకపోతే దీనికి పరిపూర్ణత రాదు. అందుకని
ఈ సూత్రమునకు ఆయన చెప్పిన వివరణను యథాతథంగా ఇస్తున్నాను.
‘ఇంతటితో, మన నిస్వార్థపోషకురాలైన ప్రకృతి ఏ ఫలితమునూ ఆశించకుండా తనపైన
మోపుకున్న పని అయిపోయింది. తనను తాను మరచిపోయిన ఆత్మ చేతిని ఆమె సుతారంగా
అందుకుని, విశ్వంలోని అనుభవాలన్నింటినీ దానికి రుచిచూపిస్తూ, ఒక్కొక్క జన్మద్వారా దానిని
ఇంకా ఇంకా ఉన్నతమైన సీమలకు చేరుస్తూ, అది పోగొట్టుకున్న పూర్వవైభవాన్ని మళ్ళీ అది
పొందేవరకూ, తనను తాను గుర్తించేవరకూ నడిపించింది. ఒక ఆత్మను ఆ విధంగా ఉద్ధరించి,
దారీ తెన్నూ లేని జీవితపు ఎడారిలో అలమటిస్తున్న మిగతా ఆత్మలకు దారి చూపడానికి
కరుణామయి యైన ఆ మాతృమూర్తి వచ్చిన దారినే వెనక్కు వెళ్ళింది. ఈ విధంగా ఆమె ఆదీ
అంతమూ లేకుండా, అలుపూ సొలుపూ లేకుండా, ఎప్పటినుంచో పరిశ్రమిస్తూనే ఉన్నది. ఈ
విధంగా సంతోషాలు, బాధల గుండా, మంచీ చెడులనే దారుల గుండా, అసంఖ్యాకములైన
ఆత్మలతో కూడిన ఈ జీవనది ఎప్పటినుంచో ప్రవహిస్తూనే ఉన్నది - పరిపూర్ణత, ఆత్మస్థితి అనే
సముద్రమును చేరుకోవడానికి!’
మానవజీవితానికీ, అనంతమైన కాలగమనంలో అంతులేని ఆత్మల ప్రయాణానికీ, ఇంతకంటే
అద్భుతమైన వివరణను ఇవ్వడం ఇంకెవరివల్ల అవుతుంది?
తే త్రే
|| ఇతి పతంజలి విరచితే యోగసూత్రే చతుర్థః కైవల్యపాదః ||
|| ఇతి శ్రీ పాతంజల యోగసూత్రాణి ||
ఇది పతంజలిమహర్షి చేత రచింపబడిన యోగసూత్రములలోని కైవల్యపాదమనబడే
నాలుగవ అధ్యాయము.
పాతంజల యోగసూత్రములు సమాప్తం.
యోగసూత్ర ముల సారాంశము
మొదటి అధ్యాయము
(సమాధి పాదము)

ఏకాగ్రత, ధ్యానము, వివిధరకములైన సమాధిస్థితులను ఈ అధ్యాయంలో మహర్షి


వివరించారు.
మనస్సులో లేస్తున్న ఆలోచనలను, ఊహలను, భావములను లేవకుండా నిరోధించడమే
యోగం. అప్పుడు ఇంద్రియముల ద్వారా విషయములను అనుభవిస్తున్న ఆత్మ తన స్వస్థితిలో
తానుంటుంది. లేకుంటే ఆయా ఆలోచనల, ఊహల, భావముల రూపమును ధరిస్తుంది.
మనస్సు మారే విధానం, ప్రమాణ, విపర్యయ, వికల్ప, స్మృతి, నిద్రాస్థితులని అయిదు
రకములుగా ఉంటుంది. ఇవిగా మారకుండా మనస్సును నిగ్రహించవలెనంటే
అభ్యాసవైరాగ్యముల చేత సాధ్యమౌతుంది. అభ్యాసమంటే, చిత్తం, ఈ అయిదు రకములైన
వృత్తిరూపములను ధరించకుండా ఆపే ప్రయత్నం. వైరాగ్యమంటే, చూస్తున్నవాటిపట్లా వింటున్న
వాటిపట్లా ఆశ లేకుండా ఉండటం. చిత్తం యొక్క ఈ స్థితులకు, గుణములకు అతీతంగా ఉండేది
పురుషస్థితి.
ధ్యానసాధన
వితర్కము, విచారము, ఆనందము, అస్మితల క్రమంలో అనుసరిస్తూ సాగే ఈ సాధన
సంప్రజ్ఞాతసమాధిని కలిగిస్తుంది. వృత్తుల విరామం బాగా అలవాటైతే, ఆ విరామస్థితిలో ఉండేవి
సంస్కారములే. దేవతలకు, ప్రకృతిలో లయమైన జీవులకు భవం ఆధారమౌతుంది.
సంప్రజ్ఞాతసమాధిని అందుకున్నవారు దేవతలౌతారు, లేదా ప్రకృతిలో లయమౌతారు.
ఇతరులకు, అంటే, అసంప్రజ్ఞాతసమాధి కోసం ప్రయత్నించేవారికి, శ్రద్ధ, వీర్యము, స్మృతి, సమాధి,
ప్రజ్ఞలే సాధనములై వారి గమ్యమును చేరుస్తాయి.
ఈ సాధనలో శ్రద్ధ అనేది ప్రాథమికం, మధ్యస్థం, తీవ్రం అని మూడు రకములుగా ఉంటుంది.
తీవ్రమైన శ్రద్ధ ఉన్నవారికి సిద్ధి త్వరగా కలుగుతుంది.
భక్తిమార్గం
లేదా, ఈశ్వరప్రణిధానంతో (భక్తిమార్గంతో) కూడా సాధ్యమౌతుంది. దుఃఖములకు, కర్మలకు
అతీతుడే ఈశ్వరుడు. ఆయన సర్వజ్ఞుడు, కాలమునకు ఆయన అతీతుడు. కనుక,
అతిప్రాచీనులైన యోగులకు, ఋషులకు, జ్ఞానులకు, సిద్ధులకు, మహనీయులకు, కూడా ఆయనే
గురువు.
ఓంకార జపము - ధ్యానము
ఆయన పేరు ఓంకారం. దానిని జపిస్తూ దాని అర్థమును భావించాలి. అప్పుడు మనస్సు
అంతర్ముఖమై సాధనలోని ఆటంకములు తొలగిపోతాయి.
సాధనలో ఎదురయ్యే ఆటంకములు
రోగము, ఆసక్తి లేకపోవడము, అనుమానము, లెక్కలేనితనము , బద్ధకము, కోరిక, భ్రాంతి,
దర్శనం కలుగకపోవడం, దక్కినస్థితి నిలబడకపోవడం, మనస్సు చెదరిపోతూ ఉండటం – ఈ
పదీ సాధనకు ఆటంకములు. దుఃఖము, మనస్సు క్రుంగిపోవడం, అవయవములలో వణుకు,
ఊపిరి గతి తప్పడము ఇవన్నీ పైవాటితో పాటు కలుగుతాయి. మనస్సును ఒకే విషయం మీద
ధారణ చేయడం ద్వారా వీటిని దాటాలి.
ధారణా విధానములు
1. అన్ని పరిస్థితుల లోనూ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షలను పాటించడం.
2. కుంభక సహితమైన ప్రాణాయామం చేయడం.
3. విషయవృత్తులలో మనస్సును నిమగ్నం చేయడం.
4. దుఃఖం అంటని వెలుగును ధ్యానించడం.
5. మోహం లేని మనస్సును ధ్యానించడం.
6. కలలో కలిగే అనుభవములను ధ్యానించడం.
7. తనకిష్టం వచ్చిన దానిపైన ధ్యానించడముల వల్ల మనస్సు ఏకాగ్రమౌతుంది.
ఈ ధ్యానముల వల్ల అణువు నుంచి మహత్తు వరకూ అన్నీ వశమౌతాయి.
పైన చెప్పబడిన అయిదు విధములైన వృత్తులు తగ్గిపోయి అదుపులోకి వస్తే మనస్సును
దేనిమీదనైనా నిలిపే శక్తి లభిస్తుంది. అప్పుడు సమాధిస్థితులు అనుభూతిలోకి వస్తాయి.

వాటిలో శబ్దం, అర్థం, జ్ఞానం కలసి ఉంటే అది సవితర్కసమాధి.


మనస్సు శుద్ధంగా మారి, నామరూపములను దాటి, అర్థమును మాత్రమే ధ్యానిస్తే అది
నిర్వితర్కసమాధి.
ఇదే విధంగా సూక్ష్మవిషయములను ధ్యానిస్తే అవి సవిచార, నిర్విచార
సమాధులవుతాయి.
సూక్ష్మములు అలింగమైన ప్రకృతిలో లయమౌతాయి.

న్నీ టే తో
ఇవన్నీ సబీజసమాధులు. అంటే, సంస్కారములతో కూడి ఉంటాయి. నిర్విచారసమాధి గట్టిగా
సిద్ధిస్తే దానిలో ఆధ్యాత్మసిద్ధి కలుగుతుంది. అప్పుడు ఋతంభరప్రజ్ఞ లభిస్తుంది. ఇది
ప్రత్యక్షదర్శనం. దాని సంస్కారం, మనస్సులోని మిగతా సంస్కారములను బంధిస్తుంది. ఆ
సంస్కారమును కూడా నిరోధిస్తే నిర్బీజసమాధి సిద్ధిస్తుంది.
రెండవ అధ్యాయము
(సాధన పాదము)

రకరకములైన సాధనలను, అష్టాంగయోగమును ఈ అధ్యాయంలో మహర్షి వివరించారు.


క్రియాయోగము
తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరప్రణిధానములు క్రియాయోగమౌతాయి. క్లేశములను
తగ్గించడం, సమాధిని కలిగించడమే వీటి ఉపయోగం. అవిద్య, అస్మిత (అహం), రాగము (ఇష్టం),
ద్వేషము (అయిష్టం), అభినివేశము (బ్రతుకు మీద తీపి) లే క్లేశములు. అన్ని విధములైన
క్లేశములకూ అవిద్య మూలం.

అవిద్య అనేది, అనిత్యమును నిత్యముగాను, అశుచిని శుచిగాను, దుఃఖమును


సుఖముగాను, అనాత్మను ఆత్మగాను అనిపింపజేస్తుంది.
దృశ్యంతో మమేకం కావడమే అహం.
సుఖమును అనుసరించేది రాగం.
దుఃఖమును అనుసరించేది ద్వేషం.
తను ఉండాలని కోరుకోవడమే అభినివేశం.

ధ్యానంతో వృత్తులను లేవకుండా ఆపాలి. వాటి మూలమైన అహంస్ఫురణ లోనికి


మళ్ళించడం ద్వారా సంస్కారములను తొలగించాలి. ఈ క్లేశములే కర్మలుగా మారి,
పక్వములైనప్పుడు, తమతమ పుణ్యపాపస్వభావములను బట్టి, ఆయా జన్మలను, వాటిలోని
సుఖదుఃఖములను కలిగిస్తూ ఉంటాయి. మార్పు, గుణములు, సంస్కారములు ఇవన్నీ
దుఃఖంలోనే అంతమౌతాయని వివేకి గ్రహిస్తాడు. ముందుముందు రాబోయే దుఃఖమును
రాకుండా ఆపవచ్చు. దృగ్దృశ్య వివేకమే దాని రహస్యం. త్రిగుణములు, పంచభూతములు,
ఇంద్రియములు, ఇవన్నీ కలసి పురుషుని బంధమోక్షముల కోసమై, జగత్తుయొక్క
అనుభవములను అతనికి కలిగిస్తాయి.
విశేషములు, అవిశేషములు, లింగములు, అలింగములుగా గుణములున్నాయి. ఆత్మ
శుద్ధమే అయినా జగత్తును చూస్తున్నది. దానికోసమే జగత్తున్నది. ఆత్మ స్వస్థితిలో ఉన్నపుడు
దానివరకూ జగత్తు లేదు. కానీ ఇతర ఆత్మలకు ఉంటుంది. ప్రకృతిపురుష సంయోగం వల్ల
ఆత్మశక్తిని తనశక్తిగా ప్రకృతి భావిస్తుంది. ప్రకృతి అనుభవములను తనవిగా పురుషుడు
భావిస్తాడు. దానికి కారణం అవిద్య. ఆ అవిద్య లేనప్పుడు, వారిద్దరికీ సంయోగం లేదు. అదే
కైవల్యం. తెంపులేని వివేకమే దానికి ఉపాయం. దానివల్ల ఏడు విధములైన ప్రజ్ఞాభూమికలు
లభిస్తాయి. అవి,
1. బీజరూపంలో తనలో దాగి ఉన్న సంస్కారముల జ్ఞానం.
2. వాటిని ఎలా నిర్వీర్యం చేయాలన్న జ్ఞానం.
3. అవి నిర్వీర్యములు కావడం యొక్క ప్రత్యక్షదర్శనం.
4. నిత్యమూ తనలో వెలుగుతున్న వివేకపు వెలుగు యొక్క అనుభవం.
5. మనోనాశం జరిగిందన్న జ్ఞానం.
6. సంస్కారనాశనం జరిగిందన్న జ్ఞానం.
7. కైవల్యస్థితి యొక్క అనుభవం.
యోగంలోని అష్టాంగములను అభ్యాసం చేయడం వల్ల దోషములు పోతాయి, వివేకం
కలుగుతుంది, జ్ఞానసిద్ధి లభిస్తుంది.
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా, ధ్యాన, సమాధులు యోగంలోని
ఎనిమిది అంగములు. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము - ఇవి
యమములు. ఎల్లప్పుడూ వీటిని పాటించడమే మహావ్రతం. శౌచము, సంతోషము, తపస్సు,
స్వాధ్యాయము, ఈశ్వరప్రణిధానము - ఇవి నియమములు. వితర్కమును ప్రతిపక్షభావనతో
జయించాలి.
వితర్కములు
బలహీనమైన, బలమైన, మరీ బలమైనవిగా, మూడు విధములుగా ఉంటాయి.
లోభ, క్రోధ, మోహములనే మూలముల నుండి పుడుతూ ఉంటాయి.
తనచేత చెడుకర్మలను చేయిస్తూ, ఇతరులను చెడుకర్మలు చెయ్యమని తనచేత
ప్రేరేపింపజేస్తూ, ఇతరులు చేస్తుంటే తనచేత ఆమోదింపజేస్తూ ఉంటాయి.
ఈ క్రమంలో తనకు అంతులేని దుఃఖమును, అజ్ఞానమును కలిగిస్తూ ఉంటాయి.

ఈ వితర్కములను - తన మనస్సులో, మాటలలో, చేతలలో - ఎక్కడికక్కడ ఖండించడం


యోగియైనవాడు అభ్యాసం చేయాలి.
యమనియమముల ఫలితములు
అహింసలో ప్రతిష్ఠుడైనవాని సమక్షంలో వైరం త్యజింపబడుతుంది.
సత్యములో ప్రతిష్ఠుడైతే క్రియ, ఫలమును ఆశ్రయిస్తుంది.
దొంగతనం చేయనివానికి అన్ని రత్నములూ దగ్గరౌతాయి.
బ్రహ్మచర్యంలో ప్రతిష్ఠితుడైన వానికి వీర్యలాభం కలుగుతుంది.
ఏదీ తీ కో న్నీ
ఇతరుల దగ్గర ఏదీ తీసుకోనివానికి జన్మపరంపరలన్నీ అర్థమౌతాయి.
శౌచంవల్ల తన దేహమంటే జుగుప్స కలుగుతుంది. ఇతరుల దేహములతో సంసర్గం
పోతుంది. దీనివల్ల సత్త్వశుద్ధి, శుద్ధమైన మనసు, ఏకాగ్రత, ఇంద్రియజయము,
ఆత్మదర్శనయోగ్యతలు కలుగుతాయి.
సంతోషంవల్ల ఉత్తమమైన సుఖం లభిస్తుంది.
తపస్సువల్ల దేహము, ఇంద్రియములకు సిద్ధి కలుగుతుంది. వాటియొక్క అశుద్ధి
నశిస్తుంది.
స్వాధ్యాయం వల్ల ఇష్టదేవతతో అనుసంధానం లభిస్తుంది.
ఈశ్వరప్రణిధానం వల్ల సమాధి సిద్ధిస్తుంది.
స్థిరము, సుఖము అయినది, ధ్యానములో ఎక్కువసేపు కూర్చుండగలిగినది ఆసనం.
ప్రయత్నం లేకుండా ఎక్కువసేపు కూర్చునే విధంగా ఆసనం సిద్ధిస్తే, ఆపైన ద్వంద్వములు
బాధించవు. మామూలుగా దానితీరులో అది నడుస్తున్న ఊపిరియొక్క నడకను మన ఇష్టం
వచ్చినట్లుగా మార్చడం ప్రాణాయామం అవుతుంది. బయట, లోపల, ఊపిరిని స్తంభించడం,
దేశకాల సంఖ్యలను బట్టి దీర్ఘసూక్ష్మములుగా ఇది ఉంటుంది. కేవలకుంభకం వీటి పైస్థాయి.
దానిలో ప్రయత్నరహితంగానే కుంభకం జరుగుతుంది. ఆత్మవెలుగు యొక్క ఆవరణం అప్పుడు
క్షీణిస్తుంది.
తమతమ విషయముల నుండి విడిపోయిన ఇంద్రియములు చిత్తస్వరూపమును
పొందటమే ప్రత్యాహారము. అప్పుడు యోగికి తన ఇంద్రియములపైన అమితమైన అదుపు
లభిస్తుంది. అనుకున్న క్షణంలో ఏ ఇంద్రియమునైనా వెనుకకు మరలించగలిగే శక్తి కలుగుతుంది.
మూడవ అధ్యాయము
(విభూతి పాదము)

విభూతి అంటే సిద్ధి, మానవాతీతశక్తి అని అర్థములు. యోగశక్తులను ఎలా సాధించాలో ఈ


అధ్యాయములో మహర్షి వివరించారు.
ఒక ప్రదేశంలో కదలకుండా చిత్తమును బంధించడమే ధారణ. ధ్యేయంతో ఏకం కావడం
ధ్యానం. ధ్యేయం యొక్క అర్థము మాత్రమే వెలుగుతూ, దాని స్వరూపం శూన్యమైతే, సమాధి.
ధారణ, ధ్యాన, సమాధులను మూడింటినీ కలిపితే సంయమం. దానిని సాధించిన యోగి
ప్రజ్ఞయొక్క వెలుగును దర్శిస్తాడు. సంయమమును వివిధస్థాయిలలో రకరకములుగా
ఉపయోగించాలి. యోగంలోని ఎనిమిది మెట్లలో ముందటి అయిదుమెట్లకు, ఈ మూడూ
(ధారణ, ధ్యాన, సమాధులు) అంతరంగములు. కానీ, నిర్బీజసమాధికి ఇవి కూడా బహిరంగములే.
యోగసిద్ధులన్నీ సంయమశక్తి వల్లనే లభిస్తాయి. ఒక్కసారి సంయమశక్తి లభించిన తరువాత
- తన ఇంద్రియసంవేదనలపైన గాని, అంతరిక ప్రాణక్రియలపైన గాని, మనస్సు యొక్క
చర్యలపైన గాని, లేదా, ప్రకృతిలోని పంచభూతముల చర్యలపైన గాని - దేనిపైన ఆ
సంయమశక్తిని కేంద్రీకరిస్తే, అది తనకు వశ్యమవుతుంది. అప్పుడు అనేకములైన
మానవాతీతశక్తులు యోగికి లభిస్తాయి. వీటి సహాయంతో, దూరశ్రవణం, దూరదర్శనం,
మనోవేగం, ఆకాశగమనం, అదృశ్యశక్తి, సూక్ష్మలోక సంచారం, సిద్ధదర్శనం, దేవతాదర్శనం,
కాయసిద్ధి, రససిద్ధి మొదలైన అనేక శక్తులు అతనికి కలుగుతాయి. వీటిని చూచి లోకం దిగ్భ్రమకు
లోనై, అట్టి యోగిని దేవునిగా పూజిస్తుంది. ఈ విధమైన గౌరవమునకు, పేరుప్రతిష్ఠలకు లోనైన
యోగి తన సాధననుండి పతనమై, యోగభ్రష్ఠుడవుతాడు. అతని పురోగతి అంతటితో
ఆగిపోతుంది. అతనికి కలిగిన శక్తులన్నీ క్రమేణా అదృశ్యములైపోతాయి. కనుక
యోగియైనవాడు శక్తులపైన దృష్టిని పెట్టకూడదు.
సంస్కారనిరోధం - సమాధి
సంస్కారములు లేవడము, నిరోధింపబడటము, మళ్ళీ లేవడము, అణగిపోవడము - ఒక్క
క్షణంపాటు అన్నీ అణగిపోవడము - ఈ క్రమంలో సంస్కారనిరోధం సాగుతుంది. ఈ అభ్యాసం
నుంచి ప్రశాంతమైన సంస్కారవాహిని కలుగుతుంది. అన్ని సంస్కారముల క్షయము,
ఉదయములలో ఏకాగ్రత లభించినప్పుడు, చిత్తం సమాధిలో లీనమౌతుంది.
అతీతశక్తులు
సంస్కారములు ఉదయించడం (తలలెత్తడం), శాంతించడం (అణగిపోవడం) - ఈ ప్రక్రియ
ఎంత లోతుగా ఉంటే, అంత లోతుగా వాటిని గమనించడం కూడా ఉంటుంది గనుక, ఈ
లో ఏ
క్రమంలో యోగి యొక్క మనస్సు ఏకాగ్రతను పొందుతుంది. దానివల్ల, భూతములకు
ఇంద్రియములకు జరుగుతున్న ధర్మ, లక్షణముల అవస్థాపరిణామం అవగతమౌతుంది.
శాంతము, లేచినవి, దాగినవి - సంస్కారముల ఈ ధర్మములను బట్టి ధర్మి ఉంటుంది. తానుకాని
వాటిగా క్రమముగా తాను మారుతూ పోవడమే సంస్కారముల పరిణామమునకు హేతువు. ఈ
మూడు పరిణామములపైన సంయమం చేస్తే త్రికాలజ్ఞానం లభిస్తుంది.
శబ్దము, అర్థము, ప్రత్యయము ఈ మూడూ ఒకదానితో మరొకటి సంకరమై ఉంటాయి. వీటి
విభాగములపైన సంయమం చేస్తే అన్ని జీవులభాషలు అర్థమౌతాయి. సంస్కారములను
సాక్షాత్కరించుకుంటే గతజన్మలు గుర్తుకు వస్తాయి. ప్రత్యయములపైన సంయమం చేస్తే, ఇతరుల
చిత్తం అర్థమవుతుంది. కానీ, అక్కడ విషయం లేనందువల్ల, వాటి ఆలంబనములపైన సంయమం
చెయ్యరాదు.
కాయరూపం మీద సంయమం చేయడంవల్ల, దాని గ్రాహ్యశక్తి స్తంభిస్తుంది. అప్పుడు
కన్నుకు, వెలుగుకు మధ్యన గల సంబంధం తెగిపోతుంది. దానివల్ల మాయమయ్యే శక్తి యోగికి
లభిస్తుంది. ఇదే విధంగా శబ్దము మొదలైనవి కూడా మాయమవుతాయి. మైత్రి మొదలైన
గుణముల మీద సంయమం చేస్తే ఆయా శక్తులు లభిస్తాయి. ఏనుగు మొదలైన జంతువుల మీద
సంయమం చేస్తే వాటి బలం లభిస్తుంది. ప్రవృత్తులను చూస్తూ సంయమం చేస్తే సూక్ష్మములు,
దాగియున్నవి, దూరంగా ఉన్నవాటి జ్ఞానం లభిస్తుంది.
సూర్యునిపైన సంయమం చేస్తే విశ్వం యొక్క జ్ఞానం కలుగుతుంది. చంద్రుని పైన
సంయమం చేస్తే నక్షత్రమండలముల జ్ఞానం కలుగుతుంది. ధృవనక్షత్రం మీద సంయమం చేస్తే
దాని నడక తెలుస్తుంది.
నాభిచక్రం మీద సంయమం చేస్తే శరీరం లోపల ఏముందో అంతా తెలుస్తుంది.
గొంతుగుంటలో సంయమం చేస్తే ఆకలి దప్పికలు అణగిపోతాయి. కూర్మనాడి పైన సంయమం
చేస్తే స్థిరత్వం కలుగుతుంది. శిరస్సు పైన ఉన్న వెలుగును సంయమం చేస్తే సిద్ధుల దర్శనం
లభిస్తుంది. ప్రతిభ మీద చేస్తే ఇవన్నీ ఒకేసారి కలుగుతాయి. హృదయం పైన చేస్తే చిత్తజ్ఞానం
కలుగుతుంది. అసంకీర్ణుడు కాని, ప్రత్యయం కంటే భిన్నుడైన, భోగములకు పరుడైన, తానేయైన,
సత్త్వపురుషుని పైన సంయమం చేస్తే పురుష (ఆత్మ) జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం వల్ల వినడం,
చూడటం, రుచి, వాసన, స్పర్శలు అపరిమితంగా పెరుగుతాయి. కానీ, ఈ సిద్ధులు కలగడం
సమాధికి ఆటంకమౌతుంది.
తనను తన దేహంతో బంధించే కారణములు శిథిలమై పోవడం వల్ల, తన దేహంలో నుంచి
బయటకు ప్రసరించే జ్ఞానం కలగడంవల్ల, తన చిత్తంతో ఇతరులను ఆవహించే సిద్ధి
కలుగుతుంది.
ఉదానవాయువును జయించడం వల్ల నీరు, బురద, ముండ్లు మొదలైనవాటిని తాకకుండా
వాటిపైన గాలిలో తేలుతూ యోగి పోగలుగుతాడు. సమానవాయువును జయించడం వల్ల దేహం
వెలుగుతుంది. చెవి, ఆకాశముల సంబంధము పైన సంయమం చేయడం వల్ల దివ్యశ్రవణం
లభిస్తుంది.
దేహము, ఆకాశముల సంబంధము పైన సంయమం చేయడం వల్ల తేలికయైన దూదిలాగా
ఆకాశంలో పోగలుగుతాడు. తనను వీడి బయటకు ఏ వృత్తి కూడా పోనప్పుడు, మహావిదేహస్థితి
కలుగుతుంది. అప్పుడు వెలుగుకున్న ఆవరణ నశిస్తుంది. పంచభూతముల స్థూలస్వరూపములను
వాటి సూక్ష్మరూపములతో అన్వయించుకుంటూ సంయమం చేయడం వల్ల భూతజయం
లభిస్తుంది. అప్పుడు అణిమాదిసిద్ధులు కలుగుతాయి. కాయసంపత్తి లభిస్తుంది. ప్రకృతి
నియమములకు అతీతుడవుతాడు. అందము, లావణ్యము, బలము, వజ్రం వంటి గట్టిదనము
కలగడమే కాయసంపత్తి.
గ్రహణము, స్వరూపము, అస్మిత, అన్వయము, అర్థము - వీనిపైన సంయమం చేస్తే
ఇంద్రియజయం లభిస్తుంది. అప్పుడు మనోవేగం, ఇంద్రియములు లేకుండానే అనుభవమును
పొందటం, ప్రకృతిని జయించడం సిద్ధిస్తాయి. సత్త్వము, పురుషుల యొక్క భిన్నత్వమును
సంయమం చేయడంవల్ల సర్వభావములకు ఆధిపత్యం, సర్వజ్ఞత్వం లభిస్తాయి. వీటిపట్ల కూడా
వైరాగ్యం కలిగితే, దోషబీజములు పూర్తిగా నశించి, కైవల్యస్థితి లభిస్తుంది. స్వర్గము మొదలైన
సూక్ష్మస్థితులలోనే ఉండమనిన ప్రలోభములు దేవతలనుంచి, ఇతర సూక్ష్మలోకవాసుల నుంచి,
ఎదురైనప్పుడు, వాటిపైన ఆశలను, ‘నేనింత సాధించాను’ అనిన గర్వమును వదలిపెట్టాలి. లేదా
బంధంలో చిక్కుకుంటాడు. దుఃఖం మళ్ళీ పట్టుకుంటుంది.
క్షణములు, కాలము ఎలా గడుస్తున్నవో అన్న విషయం పైన సంయమం చేస్తే వివేకము,
జ్ఞానములు ఉదయిస్తాయి. దీనివల్ల, జాతి, లక్షణము, దేశము మొదలైనవి వేరైనప్పటికీ వాటి
మూలములను గ్రహించే ప్రజ్ఞ కలుగుతుంది. దీనివల్ల అన్ని విషయములనూ అన్ని
సమయములలోనూ క్రమం తప్పకుండా నడిపించే వివేకజ్ఞానం కలుగుతుంది. సత్త్వము,
పురుషుల శుద్ధిలో సమానత్వమే కైవల్యమని చెప్పబడింది.
నాలుగవ అధ్యాయము
(కైవల్య పాదము)

కైవల్యసిద్ధిని ఈ అధ్యాయంలో మహర్షి వివరించారు.


జన్మవల్ల, ఔషధులవల్ల, మంత్రములవల్ల, తపస్సువల్ల, సమాధివల్ల - సిద్ధులు కలుగుతాయి.
ప్రకృతితో పూరింపబడటం వల్ల జన్మలో మార్పనేది కలుగుతుంది. పొలమును సాగుచేసే రైతుకు
గట్లలాగా, ప్రకృతికి నిమిత్తంతో గుణభేదములతో ఏ ప్రయోజనమూ లేదు. తయారైన చిత్తములన్నీ
అస్మితామాత్రములే. ప్రయోజనం కోసం ప్రవృత్తిభేదములతో అనేకములుగా కనిపించే చిత్తం
నిజమునకు ఒక్కటే. ధ్యానంవల్ల కలిగే సమాధికి మాత్రం ఆధారం లేదు. యోగుల కర్మ నలుపూ
కాదు, తెలుపూ కాదు. ఇతరులకు మాత్రం మూడు విధములుగా ఉంటుంది.
సంస్కారముల పక్వతనుబట్టి వాటి అభివ్యక్తి ఉంటుంది. జ్ఞాపకము, సంస్కారములు ఒకటే
కనుక - జన్మ, దేశము, కాలము మొదలైనవాటి వలన మధ్యలో అంతరం వచ్చినప్పటికీ -
వాటియొక్క కొనసాగింపు ఉంటుంది. ‘కోరిక’ అనేది నిత్యం గనుక సంస్కారములు కూడా
మొదలంటూ లేనట్టివే. హేతువు - ఫలితము - ఆశ్రయము - ఆలంబనలు - ఒకదానిపైన ఒకటి
ఆధారపడి ఉంటాయి గనుక, ఇవి పోయినప్పుడే సంస్కారములు పోతాయి. ధర్మములలోని
భేదములను బట్టి, గతము, భవిష్యత్తులు తమతమ రూపములలో ఉంటాయి. అవి వ్యక్తమైనవి,
సూక్ష్మమైనవి అవుతూ గుణములతో నిండి ఉంటాయి.
మార్పులోని ఏకత్వమే వస్తుతత్త్వం. వస్తువు ఒకటే అయినప్పటికీ, చూచేవారి చిత్తభేదమును
బట్టి దానిని చూచే దారులు మారుతాయి. కానీ వస్తువు యొక్క ఉనికి ఈ చిత్తభేదములపైన
ఆధారపడి లేదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే, ఎవరూ చూడనప్పుడు అది ఏమవుతుంది? వస్తువు
తెలియబడటం, తెలియబడకపోవడం అనేవి, అది చిత్తమునకు అలదే రంగును బట్టి ఉంటుంది.
చిత్తవృత్తులన్నీ వాటి ప్రభువైన పురుషునకు తెలియబడుతూనే ఉంటాయి, అతనికి మార్పు లేదు
కాబట్టి.
ఒకే సమయంలో తన ఆలోచనలనూ జగత్తునూ చూడలేదు గనుక, మనస్సు కూడా
వేరొకదానికి దృశ్యమే. కాబట్టి, దానికి సహజమైన వెలుగు లేదు. చిత్తమును చూచే ఇంకొక చిత్తం
ఉన్నదని అనుకుంటే, ఈ చిత్తపరంపరలకు అంతుండకపోగా, స్మృతి సంకరమౌతుంది. మార్పుకు
లోనుకాని చిత్ యొక్క ఆకారమును పొందిన చిత్తం తనను తానే తెలుసుకుంటుంది. అప్పుడు
చిత్తము, అప్పటి అవసరమును బట్టి, ద్రష్టయొక్క గాని, దృశ్యము యొక్క గాని రంగును
పొందుతుంది. లెక్కలేనన్ని చిత్రములైన వాసనలతో నిండినప్పటికీ, సముదాయం కావడం వల్ల,
చిత్తం ఉన్నది పరార్థం కోసమే. విశేషమును దర్శించినవానికి ఆత్మభావన నివృత్తి అవుతుంది. ఈ
విధంగా వివేకంతో నిండిన చిత్తం కైవల్యం వైపు మళ్ళుతుంది. దాని పగుళ్ళనుండి, ప్రత్యయముల
అంతరముల నుండి, సంస్కారములు ఉదయిస్తాయి. క్లేశముల వలెనే వీటిని కూడా క్షయం
చెయ్యాలని చెప్పబడినది.
జ్ఞానస్థితి కలిగినప్పుడు, దానిపట్ల కూడా ఎల్లప్పుడూ ఉదాసీనంగా, వివేకదీప్తిలో ఉండేవానికి
‘ధర్మమేఘసమాధి’ లభిస్తుంది. అప్పుడు క్లేశములు, కర్మల నివృత్తి అవుతుంది. అప్పుడు అన్ని
ఆవరణములు, మలములు నశించగా, జ్ఞానం అనంతమౌతుంది. అప్పటివరకూ తెలిసినది
అల్పమనిపిస్తుంది.
ఆ విధంగా కృతార్థుడైనవానికి, గుణములయొక్క పరిణామసమాప్తి కలుగుతుంది.
ప్రతిక్షణమూ మారుతున్న గుణములు ఆ మార్పు చివరలో ఒక స్థిరత్వమును
సంతరించుకుంటాయి. పురుషార్థశూన్యములైన గుణములు వెనుకకు మరలిపోగా, స్వరూపంలో
స్థితి యనబడే కైవల్యం లేదా చిత్శక్తి లభిస్తాయి.

You might also like