You are on page 1of 4

భూతనాథోపాఖ్యానం - 16*_

*మణికంఠుని గురుకుల వాసము*

మణికంఠుడు దినదిన ప్రవర్థమానుడయ్యెను. అక్షరాభ్యాసమైనది. ఉపనయన సంస్కారము చేయవలయునని


రాజదంపతులు తలచిరి. ఒక శుభ ముహూర్తమున మంత్రి సామంత దండనాయక ఇష్టజనులనెల్లరను ఆహ్వానించి
బ్రాహ్మణోత్తములను వినయ విధేయతలతో ఆహ్వానించి విఘ్నేశ్వర పూజగావించి పుణ్యాహ వాదనానంతరము పండ్లు
వచ్చినది మొదలు ఉపనయన శుభ లగ్నము వరకు సంభవించిన పాపములనుండి ఈ కుమారుడు ముక్తు డగుగాక
యని ప్రాయశ్చిత్తము చేసి - *"ఉపనయనాధికార సిద్ధిరస్తు - ఇతి భవన్తో బ్రు వన్తు "*– ఉపనయనమునకు అధికార సిద్ధి
కలుగుగాక యని మీరందరు చెప్పుదురుగాకయని రాజు సభవారిని ప్రార్థింప , వారు *"ఉపనయనాధికార సిద్ధిరస్తు "* నీ
కుమారునకు ఉపనయన అధికార సిద్ధి గలుగుగాక యని ఆశీర్వదించిన పిదప సుముహూర్తమున సశాస్త్రీయముగా
మణికంఠునికి ఉపనయన సంస్కారము జరిగినది.
*ఏతావం కాలం అనాశ్రమిణో అస్యకుమారస్య ఆశ్రమాధికార సిద్ధ్యర్ధం అధ్యయన సంపాదనార్థం ఆయుస్తేజో యశ శ్రీ
పుష్టి కామ్యాభి వృధ్యర్థం సాంగోపాంగం సకల వేదా. ధ్యయన అధ్యాపన తత్తత్ప్ర తిపాదనార్ధం చతుర్వింశత్యక్షర
మంత్రోచ్ఛారణ ద్విజాశ్రమాధికారసిద్ధ్యర్థం ఇమం కుమారం ఉపనేష్యే*
(ఉపనయన సంస్కారం)
ఇంతకాలము ఏ ఆశ్రమమునకు చెందని ఈ కుమారుణ్ణి బ్రహ్మచర్యాశ్రమము స్వీకరించుటకు అధికారము గలుగుటకు
విద్యాభ్యాసమును పొందుటకు , ఆయువు , తేజస్సు , కీర్తి , సంపద , పుష్టి మొదులుగా కావలసినది వృద్ధి పొందుటకు ,
వేదములు , అంగములు , ఉపాంగములతో చదువుటకు చదివించుటకు వేద రహస్యములను యుపదేశించుటకు
గాయత్రీ మంత్రమునుచ్చరించుటకు ద్విజుని ఆశ్రమాధికారమునకు యోగ్యత గలుగుటకు ఈ కుమారుడ్ని నాతో
తీసుకొని వెళ్లు దును అని చెప్పి ఆచార్యుడు మణికంఠుణ్ణి గురుకులమునకు తీసుకొని వెళ్లినాడు. ఆచార్య దేవోభవ
యని మణికంఠుడు గురుకుల వాసియై గురువును సేవించు చుండెను. అచిరకాలములోనే ఏకసంథాగ్రాహియైన
మణికంఠుడు వేదశాస్త్రము లన్నియు క్షుణ్ణముగా ఆభ్యాసము చేసెను. వేదార్థమును గ్రహించెను. రాజోచిత విద్యలగు
విలువిద్య , కత్తిసాము , గుఱ్ఱపుస్వారీ , మల్ల యుద్ధము , శస్త్రా స్త్ర ప్రయోగ ఉపసంహారములు నేర్చెను. మణికంఠుని
రాకతో గురుకులములోని వాతావరణములో మార్పు వచ్చినది. ఈ మార్పునకు కారణము గురువు గ్రహించినాడు. భక్త
పరాధీనుడైన భగవంతుడు శిష్యునిగా తనని సేవించుటకు వచ్చినాడని తలచినాడు. బంగారమునకు తావి అబ్బినది.
ఇదియే సంస్కారము. సరియైన గురువుకు సరియైన శిష్యుడు దొరుకుటకంటే కావలసినదేమున్నది.
తనజన్మసార్థకమైనట్లు గురువు తలచినాడు. మణికంఠుడు దైవాంశ సంభూతుడు కాని సామాన్య రాకుమారుడు కాడని
తోటి బాలురు తలంచిరి.
విద్యరజోగుణము గలవానికి అహంకారము నిచ్చును. ఆ విద్యయే సత్త్వ గుణము గలవానికి వినయమిచ్చును. శిష్యుడు
గురువుతో సమానుడైనట్లు భావించుట అహంకారమునకు , మదమునకు చిహ్నములు. వినయ విధేయతలు
దైవీచిహ్నములు.
*మణికంఠుని విద్యాభ్యాసము పూర్తియైనది. గురువు వేదమ సూచ్యాచార్యోనే వాసిన మనుశాస్త్రి। సత్యంవద ధర్మంచర
స్వాధ్యాయాన్మా ప్రమదః॥ అచార్యాయ ప్రియం ధనమా హృత్య ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సీః సత్యాన్న ప్రమది తవ్యం।
ధర్మాన్న ప్రమదితవ్యం| కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం| స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నప్రమదితవ్యం|*
(కృష్ణ యజుర్వేదం - తైత్తరీయం. శీక్షావల్లి - 11 వ అనువాకము)
వేదాభ్యాసము పూర్తి అయిన తర్వాత గురువు శిష్యునితో యిలా అంటాడు.
సత్యమునే పలుకుము. ధర్మము నాచరింపుము. స్వాధ్యాయము చేయుము. గురుదక్షిణ ఇచ్చితిని కదాయని
గురువును మరచిపోకుము. సత్యమార్గమును విడవకుము. ధర్మచ్యుతుడవుగా బోకుము. స్వస్వరూపమును
పొందుటయే స్వంతలాభం. అట్టి స్వంతలాభమును నీవు విడనాడవద్దు . జీవత్వము నుంచి ఈశ్వరత్వమును
పొందుటయే నీ బాగోగు. అట్టి నీ బాగును అశ్రద్ధ చేయకు. వేదాభ్యాసమును యందలి విషయ ప్రచారమును మరువకు
యని హితోపదేశము చేసినాడు. ఇది ఆనాడు విద్యాభ్యాసము పూర్తి అయిన తదుపరి శిష్యులకు గురువులు చెప్పు
హితవు. ఇదియే స్నాతకోత్సవము.
వినయ విధేయతలతో చేతులు జోడించి మణికంఠుడు నిలువబడి గురుదక్షిణను సెలవియ్యవలసినదిగా ప్రార్థించెను.
శిష్యుడైన మణికంఠుని తారకబ్రహ్మస్థితిని గురువు ప్రత్యక్షముగా చూడ దలచినాడు. కర్మవాసనలను దగ్ధము చేయగల
శక్తిమంతుడు పరమేశ్వరుడొక్కడే. కావున పూర్వభవ కర్మాధీనమై బాధపడుచున్న మూగ - చెవిటి - గ్రు డ్డి తనము గల
తనకుమారుని చూపి వానిని ఆరోగ్యవంతుని చేయవలసినదిగా గురు దక్షిణగా యడిగినాడు. మణికంఠుడు తన
కరస్పర్శతో గురుపుత్రు ని మూగతనము , చెవిటి , గ్రు డ్డి తనములను పోగొట్టి వానిని పూర్ణ ఆరోగ్యవంతునిగా చేసెను. ఈ
విషయమును గుప్తముగా యుంచవలయునని అవతార పరిసమాప్తమగు సమయమున వెల్లడించవలయునని
మణికంఠుడు గురువును ప్రార్థించినాడు.
మణికంఠుడు గురుకులవాసమున విద్యాభ్యాసము పూర్తిచేసి తిరిగి రాజ ప్రాసాదమునకు వచ్చినాడు. రాజు
మణికంఠుని గాఢాలింగనము చేసెను. రాణి కుమారుని శిరస్సును ముద్దా డెను. మణికంఠుని ఎడబాటు సహించలేని
రాజోద్యోగులు ఆనందపడిరి. మరల రాజప్రాసాదము ప్రజల రాకపోకలచే కిక్కిరిసి పోయినది. మణికంఠుని పాండితీ
ప్రకర్షకు ఆస్థా న విద్వాంసులబ్బుర పడిరి. మణికంఠుడు నేడు సకల కళావిశారదుడు. విజ్ఞానఖని. అపర సరస్వతి.
*ఈ కథా బాగమును వేదాంతపరముగా ఆలోచించుదాము.*
అక్షరాభ్యాసము , ఉపనయనము, గురుకుల వాసము ఇవి ఆచారకాండలో నిగూఢమైన అర్థము నిమిడ్చి చెప్పిన
పారిభాషిక పదములు.
ఈ జగత్తంతయు క్షరము , అక్షరములతో గూడి యున్నది. క్షరమనగా నశించునది. అక్షరమనగా నశించనది.
లోకంబులు , లోకేశులు , లోకస్థు లు నశించినను పెంజీకటి కవ్వల ఏకాకృతిగా జ్యోతి స్వరూపుడై అక్షరుడుండును.
చతుర్థశ భువనంబులు , వాటి లోకపాలకులు కూడ కాలమునకు బద్ధు లై నశించెదరు. కావున అమృతత్త్వమును
బడయుటకు అక్షరుడ్ని తెలుసుకొని ఆ స్థా నమునకు చేరాలి. ఇది ఒక రోజుతో పొందదగినది కాదు. దీనికి నిరంతర
సాధన కావలయును. దీనినే అభ్యాసమని అంటారు. అక్షరుడ్ని చేరుటకు చేయు నిరంతర అభ్యాసమే అక్షరాభ్యాసము.
ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ - అని యంటుంది వేదం. ఓం అనేది బ్రహ్మ స్వరూపం. ఇట్టి బ్రహ్మ స్వరూపాన్ని ప్రణవనాదమైన
ఓం తో ఉపాసించాలి. నాదము యొక్క సమిష్టి స్వరూపము ఓం. నాదము తాలువుల , దంతముల , ఓష్ఠా దుల ద్వారా
బహిర్గతమై అఆఇఈ లతో ప్రారంభమై అచ్చులు హల్లు ల తో *"క్ష"* వరకుగల అక్షరము లేర్పడినవి. ఈ అక్షరము
అన్నియు మంత్ర బీజములే. వీటిని మాతృకలంటారు. మాతృకాసిద్ధిని పొందవలయును. *ఓం నమశ్శివాయ సిద్ధం
నమః* యను శివ పంచాక్షరితో అక్షరాభ్యాసమును శిష్యునకు గురువు ఉపదేశించును.
అక్షర అభ్యాసము కొంతకాలము చేసినాడు. పరమాత్మను దర్శింపవలయునని తలచినాడు. అప్పుడు యీ శరీరమందు
గల చదువులు పరమాత్మను చూడ సమర్థవంతమైనవి కావనియు పరమాత్మ దర్శనమునకు ఉపనయనము
కావలయునని విజ్ఞులు చెప్పినారు. అనుభవశాలులైన యా పెద్దల యనుమతిని పొంది ఉపనయనమును పొందినాడు.
యజ్ఞ - ఉప - వీత ధారణ జరిగినది. కర్మానుస్థా నమున కర్ణత కలిగినది. అక్షరుడ్ని చేరుటకు కర్మానుష్ఠా నము ప్రారంభపు
మెట్టు . చిత్తశుద్ధి కలుగునట్లు కర్మానుష్ఠా నము చేయవలయును.
చిత్తశుద్ధి కలిగినవాడు బ్రహ్మవిద్య నేర్చుకొనుటకు కర్ణుడు. దీనికి గురుముఖత బ్రహ్మవిద్య నేర్వవలయును. గురువు
తను ఆచరించుచూ బ్రహ్మ విద్యను శిష్యులకు భోదించును. ఉపన్యాసముగా ఎంత చెప్పినను శిష్యులకు బ్రహ్మవిద్యరాదు.
గురుకులములో గరుసాన్నిధ్యములో నేర్చుకొనిన శిష్యుడు కృతార్థు డగును. శమ , దమాది గుణములు గురువును
చూచి నేర్చుకొనును. అందుకే గురుకుల వాసమవసరము.
జ్ఞాన బోధ చేయువాడు గురువు. అజ్ఞానమనే చీకటిలో తిరుగుచూ గమ్యము చేరుకోలేని శిష్యునకు తను దీపకాంతిలా
యుండి శిష్యుని చీకటిని పారద్రోలి కాంతినిచ్చువాడు గురువు. బ్రహ్మవిద్యనుపదేశించు గురువును ఆచార్య దేవోభవ
యని సేవించాలి.
జ్ఞానమనగా లౌకిక విద్యలు కావు. జ్ఞానమును శ్రీ కృష్ణ భగవానుడిట్లు నిర్వచించెను.
*క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత*
*క్షేత్ర క్షేత్రేజ్ఞయో ర్ణానం యత్తత్ జ్ఞానం మతం మమ*
*( భగవద్గీత - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - 3)*
సమస్త క్షేత్రములందు క్షేత్రజ్ఞునిగా నన్ను తెలియుము. క్షేత్రక్షేత్రజ్ఞుని గురించి తెలియుటయే జ్ఞానమని నా మతము.
కావున క్షేత్ర క్షేత్రజ్ఞులను తెలిసినవాడు గురువు. శాస్త్ర జ్ఞానాన్ని అనుభవముతో మేళవించి గురుపరంపరాన్యాయముగా
శిష్యులకు చెప్పుటయే గురుకులముల ముఖ్యోద్దేశము.
బ్రహ్మవిద్య కొంతవరకు అభ్యాసము చేసిన తర్వాత మిథ్యా జ్ఞానము గలుగుతుంది తనకు సర్వము తెలసుననే
అహంభావమేర్పడుతుంది. సరిగ్గా యీ సమయములోనే సాధకుడు గురువును వదలి వెళ్లు ను. ఇట్టి మిథ్యాజ్ఞానము
వచ్చు సమయములో
*ఏ పగిది వారు సెప్పిన*
*నా పగిదిం జదువు గాని యట్టిట్టని యా*
*క్షేపింపడు తానన్నియు*
*రూపించిన మిథ్యలని నిరూఢ మనీషన్*
*( భాగవతం - సప్తమస్కంధం - 135)*
గురువులు ఎలా చెప్పిన అలా బాహ్యముగా నడచుకుంటూ అంతరంగములో బ్రహ్మనుపాసించుచూ వాదముల జోలికి
వెళ్లరాదు.
విద్యపూర్తి అయినది. తను నేర్చిన విద్యను సార్థక పఱచుటయే గురుదక్షిణ. శాస్త్రమును చిలుకపలుకులవలె కంఠస్థము
చేయుట గాక శాస్త్రసారమును అనుభవములో గమనించవలయును . శాస్త్రమును అనుభవములో ఎంతవరకు
పొందినాడో గురువు పరీక్షించును. ఇదియే గురుదక్షిణ.
ద్రోణుడు ధనుర్విద్య నేర్పి ద్రు పదుడ్ని పట్టి తెమ్మనమని కురు , పాండవులకు చెప్పినాడు. ధనుర్విద్యాపాటవమునకది
పరీక్ష. ఈ పరీక్షలో అర్జు నుడు ద్రు పదు నోడించి బందీగా తెచ్చినాడు. అనగా ద్రోణుడు పెట్టిన పరీక్షలో అర్జు నుడు
ఉత్తీర్ణుడయినాడు. ద్రు పదు నోడించి గురువుకు సమర్పించుటయే అర్జు నుని గురుదక్షిణ.
గురువు క్షేత్ర క్షేత్రజ్ఞములను తెలిసినవాడు
*కర్మమున బుట్టు జంతువు*
*కర్మమునన్ వృద్ధి బొండు గర్మమున జెడున్ గర్మమె జనులకు దేవత*
*కర్మము సుఖదుఃఖములకు గారణ మధిపా*
*(భాగవతం-దశమ స్కంధం - 882)*
కర్మానుసారము జీవి పుట్టు నని , కర్మానుసారము పెరుగునని , కర్మానుసారము నశించునని కర్మ సిద్ధాంతమును
పరిపూర్ణముగ గ్రహించినవాడు గురువు. గురువులో నేను , నాది , నాకుమారుడు అనే రాగ మమకారము లుండవు.
*“సర్వేజనాః సుఖినోభవంతు”* - సర్వజనులు సుఖమును పొందుదురు గాక - ఇది గురువులు చేయు తపస్సునకు
ఫలితము. నిష్కామ కర్మా చరణ చేసినను సర్వజను సుఖమును వారు కాంక్షింతురు. అట్టి గురువులకు లోకములోని
వారందరు బిడ్డలే.
ఉపాధులు వేరయినా నందు ప్రకాశించు యాత్మతత్త్వము ఒక్కటియే గాన కథా భాగములో గురువునకు ఒక్కడే
కొడుకు యున్నట్లు వర్ణించినారు.
ఈ పుత్రు డనే జీవుడు తల్లి గర్భములో యుండగా గర్భ నరకమును అనుభవించునప్పుడు ఇహలోకములో గల
వస్తు వులను చూడక భగవంతుని చూచి మోక్షమును పొందవలయునని తలంచును. కాని ప్రపంచములోనికి
అడుగుపెట్టగానే నేను - నాది యనే అహంకార మమకారములకు లోబడి భగంతుని చూడలేని గ్రు డ్డితనం వస్తుంది.
ఇదియే గురుపుత్రు ని గ్రు డ్డితనం.
శరీరములో హంసగమనము ప్రతిదినము 21,600 సార్లు విపరీత శబ్దముతో నడుస్తూ వుండును. ఈ శబ్దము ఆధార
చక్రమువద్ద కింకిణీ నాదంగానూ , స్వాధిష్ఠా న చక్రమువద్ద వేణునాదంగానూ , మణిపూరక చక్రం వద్ద వీణానాదంగాను ,
అనాహత చక్రంవద్ద శంఖనాదంగానూ , విశుద్ధ చక్రంవద్ద మేఘనాదంగానూ , ఆజ్ఞా చక్రం వద్ద అబ్దినాదంగానూ ,
సహస్రార చక్రంవద్ద ఝంకారనాదం గానూ వుంటుంది. ఈ శబ్దా న్ని అను సంధానము చేస్తూ సహస్రారమును
యోగిచేరుకుంటాడు. ఇంతటి శబ్దము కూడ లౌకిక వాతావరణములో గల జీవునకు వినిపించుటలేదు. భగవద్వాణిని
విన్నవారు శ్రోత్రియులు. ఇట్టి శ్రోత్రియత్వము లేనివారిని చెవిటివాళ్లు యని యంటారు. ఇదియే గురుపుత్రు నికి గల
చెవుడు.
గురుపుత్రు నికి మూగతనం కూడ వుంది. భగవద్విషయములు గాక లౌకికముగా ప్రపంచములోని నలుమూలలా జరిగిన
విషయములు గురించి , ప్రాపంచిక విషయములు గురించి అనర్గళముగా మాటలాడువారు మూగవారు. నోరారా
భగవన్నామస్మరణ చేయలేనివారు మూగవారు. వైఖరీ శక్తి లేనివారు మూగవారు. ఇదియే గురుపుత్రు ని మూగతనం.
భగవంతుని చూడలేకపోవుటయే గ్రు డ్డితనం. శ్రోత్రియత్వము లేకపోవుటయే చెముడు. వైఖరీ లేకపోవటయే
మూగతనం.
గ్రు డ్డి , చెముడు - మూగ యనగా దర్శన - శ్రవణ - వాచిక శక్తు లు లేనివాడని అర్థం. ఇట్టి జీవునికి భగవానుడు
కరుణించి భగవంతుని దివ్యరూపమును చూచుటకు తగిన కన్నులు , భగవద్వాణిని వినుట కర్ణమగు కర్ణేంద్రియములు
, భగవంతుని గూర్చి కీర్తించుటకు తగిన నోరు ఇచ్చి జీవుని గ్రు డ్డి - చెముడు - మూగతనముల నుంచి విముక్తు లను చేసి
అజ్ఞానాంధకారమును బాపి వెలుగు చూపవలసినదిగా గురువు ప్రార్థించును. అందుకే గురువు తన కుమారుని గ్రు డ్డి -
చెవుడు - మూగతనములను పోగొట్టమని ప్రార్థన చేసినట్లు కథాభాగములో వర్ణించిరి. గురువు మాటను భగవంతుడు
నిలబెట్టు ను. భక్తపరాధీనుడైన భగవంతుడు గురువు మాటను మన్నించి జీవునకు గ్రు డ్డి - చెవిటి - మూగతనములను
పోగొట్టినాడు. అనగా దర్శనసిద్ధి , శ్రవణసిద్ధి , వాక్సిద్ధు లు గలుగుటయే గ్రు డ్డి - చెముడు - మూగతనములు పోవుటగా
గమనించవలయును.
విద్యాభ్యాసము పూర్తి అయినదనగా దర్శనసిద్ధి , శ్రోతవ్యసిద్ధి , వాక్ సిద్ధి గలిగి జ్ఞానవంతుడైనాడని యర్థము. దీనినే
గురువును సేవించి గురుకుల వాసములో మణికంఠుడు విద్యాభ్యాసము పూర్తిచేసినాడని కథాపరముగా వర్ణించిరి.
ఇట్టి జ్ఞానమును పొందినవాడు గురుపరంపరాన్యాయముగా మరియొక అజ్ఞానికి జ్ఞానము నొసంగగలడు. దీనినే
విద్యాభ్యాసము పూర్తి అయిన మణికంఠుడు గురుపుత్రు ని గ్రు డ్డి - చెవుడు - మూగబాధలను తొలగించినట్లు
కథాభాగములో వర్ణించిరి.
విద్య సార్థకమగుటయే గురుదక్షిణ ఇచ్చినట్లు గా వర్ణించిరి.
దర్శన సిద్ధి , శ్రోతవ్య సిద్ధి , వాక్ సిద్ధు లను పొందిన పరిపూర్ణుని ఆచరణ విధానమును ముందుముందు
వర్ణించుచున్నాడు.
ఈ భావనతోనే సాందీపునివద్ద శ్రీ కృష్ణుని విద్యాభ్యాసము భాగవతంలో వర్ణింపబడుతుంది.
సాందీపునికి ఒక్కడే కుమారుడు. అతడు సముద్రములో మునిగిపోయినాడు. విద్యాభ్యాసము పూర్తి అయిన తదుపరి
గురుదక్షిణగా తన కుమారుని తిరిగి తీసుకు రావలసినదిగా సాందీపుడు శ్రీకృష్ణుడ్ని యడిగినట్లు వర్ణింపబడినది.
సంసార సాగరంలో మునిగి పోవుటయే సాందీపుని కొడుకు సాగరములో మునిగిపోవుట. సంసార సాగరంలో మునిగిన
వాని నుద్ధరించుటయే శ్రీకృష్ణుడు సాగరములో మునిగి చనిపోయిన గురుపుత్రు ని మరల తీసుకొని రావటము.
గురువు - మణికంఠుల చరిత్రలోని వేదాంత భావనయే , సాందీపుడు శ్రీకృష్ణుల కథయందు వర్ణింపబడినది.
ఇతివృత్తములు వేరయినా యందలి సారాంశము ఒక్కటే. గురు కులము - విద్యాభ్యాసము - విద్యాభ్యాసము పూర్తి
అగుట - గురుదక్షిణ సమర్పించుట యను పదములతో బ్రహ్మవిద్యను అభ్యాసము చేసి శమదమాది సత్త్వ గుణములను
పొంది రజోగుణమును జయించి భగవంతుడ్ని దర్శించి , భగవద్వాణిని విని , భగవంతుని గురించి వర్ణించి కీర్తించి
ద్రష్టవ్యసిద్ధి పొంది , శ్రోతవ్యసిద్ధి పొంది , వక్తవ్యసిద్ధి పొంది బ్రహ్మమునెఱుంగుటయే విద్యాభ్యాసము పూర్తియైనట్లు గా
చెప్పబడుతుంది. ఇది ఆచరణలో సాధించినాడా లేదా యన్నది పరీక్ష. ఆ పరీక్షలో ఉత్తీర్ణతలు గురుదక్షిణగా
చెప్పబడతాయి.
గురుపుత్రు ని కటాక్షించుట ఈశ్వర పరముగా భగవంతుని మహిమ వర్ణింపబడినది. జీవుడు జ్ఞానవంతుడైనాడని
జీవపరముగా వర్ణింపబడినది.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తా వే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*

You might also like